
షేక్ హఫీజ్(ఫైల్)
సాక్షి, హఫీజ్‌పేట్(హైదరాబాద్): అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్ న్యూహఫీజ్‌పేట్ సుభాష్‌చంద్రబోస్ నగర్‌కు చెందిన షేక్ హఫీజ్(45) తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తన కూతురు రెష్మా బేగంకు ఓమర్‌తో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుసుకున్న షేక్ హఫీజ్ తన కూతురు రెష్మా బేగంతో పాటు ఆమె ఇద్దరు కుమారులను తన ఇంటికి తీసుకెళ్లాడు.
ఆమె మరో కుమారుడు తన తండ్రి ఓమర్ వద్ద హఫీజ్‌పేట్‌లోని ఆదిత్యనగర్‌లో ఉన్నాడు. అయితే ఆదివారం ఉదయం తన మనవడిని తీసుకెళ్లేందుకు వచ్చాడు. దీంతో ఓమర్ మామ హఫీజ్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో కత్తితో తలపై నరికాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఓమర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: ఎస్సైని కాల్చి చంపిన ఉగ్రవాది
Comments
Please login to add a commentAdd a comment