Assasinate
-
బొబ్బిలి పేట సర్పంచ్ గా పోటీచేసిన YSRCP నేత చంద్రయ్య మర్డర్
-
నాలుగు రోజుల్లో కూతురి పెళ్లి : అంతలోనే కన్నతండ్రి కర్కశం
అణచివేతకు వ్యతిరేకంగా మహిళలు శతాబ్దాలుగా పోరాడుతూనే ఉన్నారు. అనేక రకాల హింసలకు వ్యతిరేకంగా గొంతెత్తున్నారు. సమానత్వం కోసం అలుపెరుగని పోరు చేస్తూనే ఉన్నారు. అయినా చాలా విషయాల్లోనూ వివక్ష కొనసాగుతూనే ఉంది. ఆధిపత్య కత్తి మహిళలపై వేటు వేస్తూనే ఉంది. చెప్పిన మాట వినలేదన్న ఆగ్రహంతో పంచాయతీ పెద్దలు, పోలీసుల ఎదుటే కర్కశంగా కన్నబిడ్డనే కడతేర్చిన ఘటన కంట తడి పెట్టిస్తుంది.20 ఏళ్ల కుమార్తె ‘తను’ ను పోలీసు అధికారులు, కుల పెద్దల ముందే నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడో తండ్రి. తాను కుదిర్చిన వివాహం నచ్చలేదని సోషల్ మీడియా ద్వారా చెప్పినందుకే ఈ అఘాయిత్యానికి పూనుకున్నాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దిగ్భ్రాంతికరమైన హత్య జరిగింది. మంగళవారం సాయంత్రం 9 గంటల ప్రాంతంలో నగరంలోని గోలా కా మందిర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పెళ్లికి నాలుగు రోజుల ముందు కూతుర్ని నాటు తుపాకీతో కాల్చి చంపాడుతండ్రి మహేష్ గుర్జార్. బంధువు రాహుల్ మహేష్‌కు తోడుగా నిలిచి, బాధితురాలపై కాల్పులు జరిపాడు.పెద్దలు కుదర్చిన సంబంధాన్ని కాదని తనకు నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనే కోరికను వ్యక్తం చేయడమే ఆమె చేసిన నేరం. జనవరి 18న పెద్దలు కుదిర్చిన వివాహానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఈ హత్య జరిగింది. ఇది ఇలా ఉంటే.. హత్యకు కొన్ని గంటల ముందు, తను ఒక వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసిందిబాధితురాలు తను. తన ఇష్టానికి విరుద్ధంగా వివాహం చేసుకోవాలని బలవంతం చేసిందని ఆమె ఆరోపించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేసింది. తనకేదైనా అయితే తన తండ్రి మహేష్, ఇతర కుటుంబ సభ్యులతే బాధ్యత అని కూడా పేర్కొంది. (డార్క్ గ్రీన్ గౌనులో స్టైలిష్‌గా,ఫ్యాషన్ క్వీన్‌లా శోభిత ధూళిపాళ)52 సెకన్ల వీడియోలో ఇంకా ఇలా చెప్పింది. "నేను నా ఫ్రెండ్ విక్కీని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా కుటుంబం మొదట్లో అంగీకరించింది కానీ తరువాత నిరాకరించింది. వారు నన్ను రోజూ కొట్టి చంపేస్తామని బెదిరిస్తున్నారు. నాకు ఏదైనా జరిగితే, నా కుటుంబమే బాధ్యత వహిస్తుంది". అని తెలిపింది. దీంతో వీడియో వైరల్ అయింది. సూపరింటెండెంట్ ధర్మవీర్ సింగ్ నేతృత్వంలోని పోలీసు అధికారులు ఇద్దిర మధ్యా రాజీ కుదిర్చేందుకు మాట్లాడుతున్నారు. కమ్యూనిటీ పంచాయితీ పెద్దలు కూడా అక్కడే ఉన్నారు.ఈ సమయంలో తను ఇంట్లో ఉండటానికి తను నిరాకరించింది, తనను వన్-స్టాప్ సెంటర్ ( హింసకు గురైన మహిళలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్)కు తీసుకెళ్లమని కోరింది. ఇంతలో ఆమె తండ్రి ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలని పట్టుబట్టి, ఆమెను ఒప్పిస్తానని నమ్మబలికాడు. నాటు తుపాకీతో ఉన్న మహేష్, తన కుమార్తె ఛాతీపై కాల్చాడు. అదే సమయంలో, అక్కడే ఉన్న రాహుల్ కూడా విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. (‘భార్యను తదేకంగాఎంతసేపు చూస్తారు? : అమూల్ స్పందన, ఈ కార్టూన్లు చూస్తే!)కేసు నమోదు చేసిన పోలీసులు మహేష్‌ను అరెస్టు చేశారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ రాహుల్ పిస్టల్‌తో తప్పించుకున్నాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా తను ప్రేమిస్తున్న వ్యక్తి "విక్కీ" ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నివాసి, గత ఆరేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు తెలుస్తోంది. -
హయత్ నగర్ పీఎస్ కానిస్టేబుల్ నాగమణి హత్య
-
కర్నూలు: TDP నేత శ్రీనివాసులు హత్య కేసులో వెలుగులోకి నిజాలు
-
హంతకుడు ఎక్కడ..?
-
తిరుపతిలో వృద్ధురాలిని హత్య చేసిన నిందితుడి కోసం గాలింపు
-
TDP రాక్షసానందానికి ఇంకెంతమంది బలి కావాలి..?
-
పల్నాడులో రాజకీయ కక్షతో YSRCP కార్యకర్త దారుణ హత్య
-
అంతా అధికార పార్టీ నేత అనుచరుడి పనే!
సాక్షి ప్రతినిధి కర్నూలు: ముచ్చుమర్రికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. హత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు బాలురులో ఓ బాలుడి తాత.. ఆ నియోజకవర్గంలో అధికార పారీ్టకి చెందిన ఓ నాయకుడి కుటుంబం వద్ద నాలుగు దశాబ్దాలుగా పనిచేసేవాడని తెలుస్తోంది. 1994 ప్రాంతంలో ఆ నాయకుడికి ఫ్యాక్షన్‌లో అడ్డొచ్చిన కొందరిని ముక్కలు ముక్కలుగా చేసి అక్కడి చేపలకు, నీటి కుక్కలకు ఆహారంగా వేసేవాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పట్లో మిస్సయిన వ్యక్తుల ఆచూకీ నేటికీ తెలియలేదని, అదే తరహాలోనే ఇప్పుడు బాలిక శవాన్ని కూడా ముక్కలు చేశారని స్థానికుల్లో ప్రచారం జరుగుతోంది.అయితే పోలీసు వర్గాలు మాత్రం శవాన్ని సంచిలో పడేసి రాయి కట్టడంతోనే దొరకలేదని చెబుతున్నారు. నిజానికి బాలిక పొట్ట కోయకుండా రాయి కట్టి పడేసినా శవం బయటకొస్తుందని కొందరంటున్నారు. బ్యాక్ వాటర్‌లో పడేయడంతో మొసళ్లు ఆహారంగా తీసుకుని ఉంటాయని కొందరు పోలీసులు భావిస్తున్నారు. అయితే అక్కడ మొసళ్లే లేవని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే మృతదేహం ఇక దొరకదు! ఈనెల 7న పాత ముచ్చుమర్రిలో ఐదో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై ఆరో తరగతి బాలుడు, పదో తరగతి చదివే ఇద్దరు బాలురు అత్యాచారం చేశారు. ఆపై పాప ఎవరికైనా చెబుతుందేమోనని భయపడి వెంటనే పాప గొంతు నులిమి చంపేశారు. వీరిలో ఒకడు విషయాన్ని తండ్రికి చెప్పాడు. ఆయన మిగిలిన తల్లిదండ్రులతో కలిసి.. ఆ చిట్టితల్లిని గోనె సంచిలో వేసి, దానికి రాయి కట్టి కృష్ణానది బ్యాక్ వాటర్‌లో పడేశారు. పోలీసుల విచారణలో ఆ ముగ్గురి పిల్లల తండ్రులు చెప్పిన విషయం ఇది. అయితే చిన్నారిపై అత్యాచారం చేసింది నిజం.. చంపింది నిజమేగానీ, శవాన్ని మాయం చేసిన విధానంపై చెబుతోంది మాత్రం అబద్ధం. ఈ రెండు ఊర్లే కాదు. ఈ 12 రోజుల్లో ఆ నోటా, ఈ నోటా చర్చ జరిగి ఇప్పుడు కర్నూలు, నంద్యాల రెండు జిల్లాల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. పాపను చంపి ముచ్చుమర్రి–హంద్రీ నది అప్రోచ్ చానల్లో పడేశారని మొదట చెప్పారు. ఆ తర్వాత ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ వద్ద వేశామన్నారు. శవాన్ని తీసుకెళ్లి సంగమేశ్వరంలో వేశామని మరోసారి చెప్పారు. లేదు.. కొణి§ð ల శ్మశాన వాటికలో పూడ్చామన్నారు.. అయితే వీటిలో ఏదీ వాస్తవం కాదని కొత్త విషయం వెలుగు చూస్తోంది. ముగ్గురి బాలురలో ఒక బాలుడి తాత ఆధ్వర్యంలో బిడ్డను ముక్కలుగా నరికినట్లు తెలుస్తోంది. ముక్కలను బ్యాక్ వాటర్‌లో అక్కడక్కడా పడేసి ఉంటారని, నీటి కుక్కలు, చేపలు ఈ ముక్కలను తినేసి ఉంటాయని, అందుకే శవం దొరకడం లేదని.. మరో నెలైనా దొరకదని గ్రామస్తులు చెబుతున్నారు.ఎక్స్‌గ్రేషియా ఏది? సాక్షి, నంద్యాల: ముచ్చుమర్రిలో బాలిక హత్యాచారానికి సంబంధించి ఘటనలో బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల సాయం అందజేస్తామని హోం మంత్రి అనిత ప్రకటించారు. గురువారంతో మూడు రోజులవుతున్నా ఇంత వరకూ బాధిత కుటుంబానికి సాయం అందలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బాధితులకు పరిహారం ప్రకటిస్తే గంటల వ్యవధిలోనే జిల్లా అధికారులు ఆ సాయాన్ని అందించేవారు. సంబంధిత మంత్రులు లేదా జిల్లా కలెక్టర్ బాధితులను కలిసి భరోసా కల్పించేవారు. కానీ కూటమి ప్రభుత్వం స్పందిస్తున్న తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.పవన్, చంద్రబాబునోరు మెదపరేం? కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతిపై తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కొందరు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ ఘటనపై మొన్నటి ఎన్నికల ప్రచారం వరకూ పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయేవారు. ఇప్పుడు టీడీపీతో పాటు తమ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వంలో పదేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసి.. 12 రోజులుగా శవాన్ని కనపడకుండా చేస్తే ఆ ఘటనపై నోరెత్తలేదు. ముఖ్యమంత్రీ స్పందించలేదు. హోంమంత్రి ఇక్కడ పర్యటించనే లేదు. దీనికి కారణం బాలిక హత్యతో ముడిపడి ఉన్న కుటుంబానికి చెందిన వారు అధికార పార్టీకి చెందిన నేతల అనుచరులు కావడమేనని చెప్పుకొంటున్నారు. ఈ కేసులో చాలా సెక్షన్ల కింద బాలురు, వారి తండ్రులపై కేసులు నమోదు కావాల్సి ఉంటుందని.. అందువల్లే ఘటనను తేలిగ్గా తీసిపారేస్తున్నారని తెలుస్తోంది. -
ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర..! సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..?
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నిన విషయం అమెరికా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందే తెలుసా..? సీక్రెట్ సర్వీసెస్ ఈ విషయాన్ని ట్రంప్ టీమ్‌కు చెప్పిందా..? ట్రంప్ టీమ్‌కు కూడా ఈ విషయం ముందే తెలుసా..? అంటే అవుననే అంటోంది ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తాసంస్థ. ఈ మేరకు ఒక కథనం కూడా ప్రచురించింది.ట్రంప్‌ను చంపడానికి ఇరాన్ దేశం కుట్రపన్నినట్లుగా సీక్రెట్ సర్వీసెస్‌కు ముందుగానే సమాచారమందిందని, ఈ విషయాన్ని వారు ట్రంప్ టీమ్‌కు కూడా చెప్పారని కథనంలో తెలిపింది. అయితే ఇటీవల పెన్సిల్వేనియా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నానికి ఇరాన్ కుట్రకు సంబంధముందనడానికి ఆధారాల్లేవని పేర్కొంది. ఇరాన్ కుట్రపై ఇంటెలిజెన్స్ సమాచారం అందగానే ట్రంప్ సెక్యూరిటీని సీక్రెట్ సర్వీసెస్ భారీగా పెంచినట్లు తెలిపింది. మరోవైపు ఇటీవలి పెన్సిల్వేనియా కాల్పుల్లో దుండగుడు ట్రంప్‌కు అత్యంత దగ్గరగా రావడంలో సీక్రెట్ సర్వీసెస్ వైఫల్యం ఉందని విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డెమొక్రాట్ల తరపున అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ తరపున డొనాల్డ్ ట్రంప్ తలపడుతున్నారు. -
లైంగిక దాడి కేసులో యువకుడికి 20 ఏళ్ల జైలు
విశాఖ లీగల్: చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది బుధవారం తీర్పు చెప్పారు. జైలు శిక్షతో పాటు రూ.40,000 జరిమానా చెల్లించాలని, ఆ మొత్తాన్ని బాలికకు ఇవ్వాలని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. ప్రభుత్వం పరిహారం కింద రూ.3.5 లక్షలు ఇవ్వాలని ఆదేశించారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ కృష్ణ అందించిన వివరాలు.. ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధి తోటగురువు దగ్గర బీఎన్ఆర్ నగర్లో నివాసముంటున్న గుండెల సాయికుమార్.. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. ఆరిలోవ సెక్టార్–2 శివాజీనగర్‌లో తన ఇద్దరు మైనర్ కుమార్తెలతో తండ్రి నివాసముంటున్నాడు. గతేడాది ఏప్రిల్ 9న తన కుమార్తెలను టిఫిన్ తీసుకురమ్మని హోటల్‌కు తండ్రి పంపాడు. అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న సాయికుమార్.. ఓ బాలికను ఎత్తుకుని తన బండిపై నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్థానిక ఆరిలోవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ జి.సోమశేఖర్.. సాయికుమార్‌పై కేసు నమోదు చేసి నేరాభియోగపత్రాన్ని దాఖలు చేశారు. కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి శిక్ష విధించారు. -
వాటే స్కెచ్.. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..
-
దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య
ప్రపంచవ్యాప్తంగా మదర్స్ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందులు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్‌లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్ (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్ సెంటర్‌కి పంపాలని కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా మారి పోయాడు. తొలుత 65 ఏళ్ల తల్లి సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత భార్య ప్రియాంక (40)ని సుత్తితో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్ తనను తాను కాల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారుఈ వార్త దావానలంలా వ్యాపించడంతో సంఘటనా స్థలం వద్ద జనం పెద్ద ఎత్తున గుమి గూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు. -
‘ఓడితే.. చంపేస్తారు’
శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్ ఎలాన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. అయితే మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్ తేల్చేశారు. అదే సమయంలో రష్యాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్‌కు ఇప్పటికే స్పేస్ఎక్స్ స్టార్‌లింక్ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. -
సింగోటం రాము హత్య కేసులో సంచలన నిజాలు
-
నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!
అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’ సినిమాతో పాపులర్ తమిళ నటి కాసమ్మాళ్ హత్యకు గురైంది. అదీ కని పెంచిన సొంత కొడుకు నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి. గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్లోని కాసమ్మాళ్ స్వగృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు. కాగా కాసమ్మాళ్ 2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. -
హత్య చేసిన నిందితుడిని గుర్తించాం: సీపీ రవిశంకర్
-
ఎమ్మార్వో రమణయ్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు
-
విశాఖ ఎమ్మార్వో హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్ రామాంతాపూర్ లో దారుణం
-
పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం
చెన్నై: తమిళనాడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోటి కలలతో ఏడు అడుగులు వేసిన జంటను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక పరువు హత్యలను గుర్తుకు తెచ్చింది. తమకంటే పేదవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నవదంపతులను సొంత తండ్రే హత్య చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం..కోవిల్పట్టికి చెందిన మరిసెల్వం (24), ఎం కార్తీక (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. రక్షణ కోరుతూ కోవిల్పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని బుధవారం వరకు కోవిల్పట్టిలో ఉన్నారు. సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా, వీరి పెళ్లి ముందు ఇరు కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ పెళ్లి తరువాత, సెల్వం కుటుంబం కొత్త జంటను ఆదరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సెల్వం తన భార్య కార్తీకతో కలిసి జిల్లాలోని మురుగేషన్ నగర్ ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న దుండగులు పథకాన్ని పక్కాగా అమలు చేశారు. మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని ముఠా మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి నవ దంపతులపై దాడి చేసి హత్య గావించింది ఆ తరువాత అక్కడినుంచి అక్కడి నుండి పారిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని తూత్తుకుడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ తెలిపారు. అలాగే అమ్మాయి తండ్రి ముత్తు రామలింగం కిరాయి హంతకులతో వారిద్దరినీ హత్య చేయించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మూడు ప్రత్యేక బలగాలతో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
అమెరికాలో దాడి.. విషమంగానే ఖమ్మం యువకుడి పరిస్థితి
చికాగో: అమెరికా చికాగోలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గత మూడు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ మీదనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి దృష్యా వరుణ్ని ఫోర్ట్ వేన్‌లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ చికాగోలో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 29న జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్‌పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్ప త్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ రాజ్‌పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందామని వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా అన్నారు. అటు వరుణ్ చికిత్స ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) గో ఫండ్ మీ(GoFundme)లో నిధుల సమీకరణను ప్రారంభించింది. బుధవారం రాత్రికి 38,000 డాలర్లకు పైగా సమీకరించింది. అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివర్ధన్ ఫోన్ చేసి వరుణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్‌మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
చంపాపేట్ లో స్వప్న హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!
Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు దోషిలుగా నిర్ధారించింది. రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్‌ను కూడా దోషిగా ప్రకటించింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి ఆవేదన కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) #WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd — ANI (@ANI) October 18, 2023 జిగిషాను హత్యచేసిన వాళ్లే సౌమ్యాను కూడా ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010) దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్‌కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది. -
వీడిన శంషాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీ
-
వివేకా లేఖను పట్టించుకోరా? కీలక అంశాన్ని సీబీఐ ఎందుకు విస్మరించింది!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వివేకా లేఖపై CBI నిశితంగా దృష్టి సారించక పోవడం విస్మయపరుస్తోందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ The Wire పేర్కొంది. CBI ఛార్జ్ షీట్లో ఏముంది? ‘డ్రైవర్ ప్రసాద్ తనపై తీవ్రంగా దాడి చేసినట్టు వివేకా పేర్కొన్నట్టుగా ఆ లేఖలో ఉంది. ఆ లేఖను వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ చూసి పీఏ కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఆయన వెంటనే అంటే ఉదయం 6.29 గంటలకు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఆ లేఖలో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు. తాము వచ్చే వరకు ఆ లేఖను గోప్యంగా ఉంచమని, ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పారు. దాంతో కాసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న సీఐ శంకరయ్యకు కూడా కృష్ణా రెడ్డి ఆ లేఖ విషయం చెప్పలేదు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి తదితరులు పులివెందులకు చేరుకున్నాక ఆ రోజు సాయంత్రం ఆ లేఖను వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు అప్పగించారు’ అనే విషయాన్ని చార్జ్‌షీట్‌లో పేర్కొంది సిబిఐ. ఈ విషయాన్ని ప్రస్తావించడం మినహా ఇంత కీలకమైన విషయంపై సీబీఐ ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన కథనంలో ఎన్నో కీలక ప్రశ్నలను సంధించారు. తీవ్ర గాయాలతో లేఖ రాయగలిగారా? వివేకా లేఖపై ఇప్పటికీ సందిగ్ధత తొలగిపోలేదు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్‌గా మార్చి వాంగ్మూలం ఇప్పించేంత వరకు ఆ లేఖ ఎప్పుడు రాశారన్న దానిపై స్పష్టత రాలేదు. వివేకాపై దాడి తర్వాత ఆయనతో బలవంతంగా ఆ లేఖను తాము ఎలా రాయించామని దస్తగిరి వెల్లడించాకే సందేహాలు మరింతగా పెరిగాయి. అప్రూవర్‌గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించిన ప్రకారం.. "మొదట సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో వివేకా కింద పడిపోయారు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో వివేకా నుదుటి మీద నరికాడు. వివేకా నుదుటి మీద 3.5 ఇంచ్‌ల వెడల్పు, 6 ఇంచ్‌ల లోతుగా పక్క పక్కనే రెండు గాయాలున్నాయని పోస్టువర్టం నివేదిక వెల్లడించింది." భూమి పత్రాల కోసం గాలింపు "సునీల్‌యాదవ్ వివేకా గుండెపై 15–16 సార్లు గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. ఉవశంకర్ రెడ్డి తన చేతిలో ఉన్న గొడ్డలిని దస్తగిరికి ఇచ్చి వివేకా లేవకుండా చూడమని చెప్పారు. తాము భూమి పత్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతామని చెప్పాడు. వివేకా అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించాడు. నా ఇంట్లో ఏం వెతుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో దస్తగిరి గొడ్డలితో వివేకా కుడి చేతి మీద దాడి చేశాడు. వివేకా కుడి అరచేతిలో 2 ఇంచ్‌ల వెడల్పు, ఒక ఇంచి లోతున గాయం ఉందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుడి చేతి మీద గొడ్డలితో గాయపరిచిన తర్వాత వివేకాతో నిందితులు లేఖ రాయించారు. కుడి చేతివాటం వ్యక్తి అయిన వివేకా ఆ లేఖ రాశారని" సీబీఐ పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ తర్వాత లేఖ రాయగలిగారా? గాయం వల్ల వివేకా మెదడు బయటకు వచ్చిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం. అంత తీవ్ర గాయమైన తర్వాత లేఖ రాసే స్థితిలో వివేకా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకం. ఆ లేఖ వివేకానే రాసినట్టు హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (CFSL) నిర్ధారించింది. కాగా తీవ్రమైన ఒత్తిడి, అత్యంత సంక్లిష్ట ప్రక్రియ నడుమ ఆ లేఖ రాసినట్టుగా ఉందని ఢిల్లీలోని CFSL నివేదిక వెల్లడింంది. కానీ అంతటి తీవ్ర గాయాలు అయ్యాక.. మెదడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ వ్యక్తి అలా లేఖ రాయడం సాధ్యమా? అని సీబీఐ వైద్య నిపుణులను సంప్రదించకపోవడం విడ్డూరం. ఆ వేలి ముద్రలు ఎవరివో? హత్య కేసు దర్యాప్తులో వేలి ముద్రలు అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వివేకా హత్యకు గురైన స్థలంలో గుర్తించిన మూడు గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివనే విషయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం విస్మయపరుస్తోంది. వివేకా నివాసంలోని బాత్రూం గోడల టైల్స్ మీద రెండు వేలి ముద్రలు, తలుపు వెనుక ఒక వేలి ముద్రను క్లూస్ టీమ్ గుర్తించింది. గోడల టైల్స్ మీద ఉన్న వేలి ముద్రలు రక్తంతో ఉండటం గమనార్హం. కాగా ఆ మూడు వేలి ముద్రలు నిందితులు నలుగురితోపాటు వివేకా నివాసానికి వచ్చిన బంధువులు, ఇతరుల వేలి ముద్రలతో సరిపోలలేదు. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి వివేకా నివాసంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోంది. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఆ వేలి ముద్రలు ఎవరివనే దిశగా దర్యాప్తు చేయనే లేదు. IPDR డేటా అహేతుకం ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్‌రెడ్డి మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ‘ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్స్(IPDR) నివేదిక ఆధారంగా గుర్తించినట్టు సీబీఐ పేర్కొంది. కానీ ఐపీడీఆర్ డేటా అన్నది శాస్త్రీయంగా కచ్చితమైన ఆధారం కాదు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు ఆన్‌లో ఉన్నాయని మాత్రమే ఐపీడీఆర్ చెబుతుంది. సాధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మొబైల్ నెట్‌వర్క్‌లు తమ డేటా బ్యాకప్ తీసుకుంటూ ఉంటాయి. దాంతో మొబైల్ డేటా ఆన్‌లో ఉన్నట్టు చూపిస్తుంది. అంత మాత్రాన ఆ మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నట్టుగానీ, మెసేజ్‌లు పంపిస్తున్నట్టుగానీ నిర్ధారింనట్టు కాదు. ఇక ఆ ఫోన్ల నుం ఇతర ఫోన్లకు మెసేజ్‌లు వెళ్లాయా.. లేదా అన్నది కూడా ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. కాబట్టి ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్ రెడ్డి మధ్య ఆ రోజు రాత్రి వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించలేం. ఈ విషయంలో సీబీఐ వాదన పూర్తిగా అహేతుకమని స్పష్టమవుతోంది. గంగిరెడ్డి మొబైల్ ఫోన్ నుంచి వెళ్లిన మెసేజ్‌లను గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని సీబీఐ తెలిపింది. కాగా 2019 వర్చి 15నే ఎర్ర గంగిరెడ్డి మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలించినప్పటికీ అందులో అనుమానాస్పదమైన సమాచారం ఏమీ లభించలేదని పోలీసులు ప్రకటించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. గూగుల్ టేక్ ఔట్‌పై మాట మారింది! నిందితులు 2019 మార్చి 14, 15 తేదీల్లో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారించామన్న సీబీఐ వాదన తప్పని తేలిపోయింది. ఎర్ర గంగిరెడ్డి, ఉవశంకర్ రెడ్డి ఫోన్లు వారి ఇళ్లలోనే ఉన్నట్టుగా సెల్ టవర్ల లోకేషన్ స్పష్టం చేస్తోంది. కాగా సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. 2019 మార్చి 14 అర్ధరాత్రి 2.42 గంటలకు సునీల్‌యాదవ్ వివేకా నివాసంలో ఉన్నట్టు.. 2.34 గంటలకు వివేకా నివాసానికి 15 మీటర్ల దూరంలో, 2.35 గంటలకు వివేకా నివాసానికి 10 మీటర్ల దూరంలో ఉన్నట్టు.. 2.42 గంటలకు వివేకా నివాసంలో ఉన్నట్టుగా పేర్కొంది. కాగా సునీల్ యాదవ్ నివాసం వివేకా నివాసానికి 160 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గూగుల్ టేక్ ఔట్ డేటాకు, వాస్తవ లొకేషన్‌కు 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల వరకు వ్యత్యాసం ఉంటుందని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కేసు విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని ప్రశ్నించారు. గూగుల్ టేక్ ఔట్ డేటాను బట్టి ఎలా నిర్ధారించగలుగుతారని అడిగారు. దాంతో CBI తన మూడో అనుబంధ చార్జ్‌షీట్‌లో మాట మార్చింది. యూనివర్సల్ కాలమానానికి (UTC), భారత కాలమానానికి (IST) మధ్య వ్యత్యాసాన్ని తాము గమనించక పొరపాటు చేశామని వెల్లడించడం గమనార్హం. గూగుల్ టేక్ ఔట్ డేటాను విశ్లేషిస్తే ఢిల్లీలోని CFSL పేర్కొన్న సమయం UTC కాలమానం ప్రకారం అని వెల్లడించింది. వాస్తవానికి యూటీసీ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందుంటుంది. అంటే సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 2.42 గంటలకు ఉన్నట్టు తాము మొదటి చార్జ్‌షీట్‌లో పేర్కొంది వాస్తవం కాదని సీబీఐ అంగీకరింంది. సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 15న ఉదయం 8.12 గంటలకు ఉన్నారని తెలిపింది. అంటే వివేకా హత్యకు గురయ్యారని అందరికీ తెలిసిన తర్వాత కొన్ని వందల మంది అక్కడ గుమిగూడిన తర్వాత సునీల్ యాదవ్ చేరుకున్నారని చెప్పింది. ఆస్తి వివాదాన్ని ఎందుకు పట్టించుకోలేదు? రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారని సీబీఐ చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కానీ దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలను పరిశీలిస్తే ఆస్తి కోసం ఈ హత్య చేసి ఉండొచ్చన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే వివేకాను హత్య చేసిన తర్వాత నిందితులు ఆస్తి పత్రాల కోసం ఆయన నివాసంలో వెతికారన్నది స్పష్టమవుతోంది. ఆ నివాసంలో అల్మారా (బీరువా) తలుపు బద్దలు గొట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు కూడా. అంటే హత్యకు ఆస్తి వివాదం ప్రధాన కారణం కావచ్చు. నిందితులు ఏ పత్రాల కోసం వెతికారన్నది సీబీఐ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దొంగతనం, ఆస్తి వివాదం అనే కోణంలో సీబీఐ ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటం సాధ్యమా? సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నారనే దానిపై సీబీఐ వాదనలు మరింత అసంబద్ధంగా ఉన్నాయి. దస్తగిరిని అప్రూవర్‌గా వర్చి ఇప్పింన వాంగ్మూలం, రంగన్న వాంగ్మూలం ప్రకారం ఆ రోజు రాత్రి 1.30 గంటల నుంచి 3 గంటల వరకు సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి నివాసం లోపల ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి 1.58 గంటలకు సునీల్ యాదవ్.. వైఎస్ భాస్కర్‌రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా గూగుల్ టేక్ అవుట్ డేటా చూపిస్తోందని కూడా సీబీఐ పేర్కొంది. ఒకే సమయంలో ఒక వ్యక్తి వేర్వేరు చోట్ల ఎలా ఉండగలరు? సునీల్ యాదవ్ ఆ సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉంటే.. అదే సమయంలో అక్కడికి కిలోమీటర్ దరంలో ఉన్న వివేకా నివాసంలో కూడా ఉండి ఆయన్ను ఎలా హత్య చేయగలడు? మరి సీబీఐ ఇంత చిన్న అంశాన్ని విస్మరిస్తూ కేసు దర్యాప్తు చేస్తుండటం ఏమిటి? రూ.40 కోట్ల డీల్ కథ తేల్చలేదెందుకు? అసలు వివేకానందరెడ్డిని నిందితులు ఎందుకు హత్య చేశారనే అంశంపై సీబీఐ వాదన అసంబద్ధంగా ఉంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం.. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి అడ్వాన్స్‌గా కోటి రూపాయలు పంపించారు. అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో పులివెందులలో విల్లా కొనుగోలు చేయాలని భావించినట్టు దస్తగిరి చెప్పాడన్నది సిబిఐ పేర్కొన్న విషయం. కాగా ఇక్కడ ప్రశ్నార్థకం ఏమిటంటే.. వివేకా హత్య కోసం కుదిరినట్టు చెబుతున్న డీల్ డబ్బును సీబీఐ ఇప్పటికీ రికవరీ చేయలేకపోయింది. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా సీబీఐని ఇదే విషయంపై ప్రశ్నించారు. నిందితుల మధ్య చేతులు మారినట్టు చెబుతున్న డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారంటే సీబీఐ సరైన సవధానం చెప్పలేకపోయింది. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న మున్నా బ్యాంక్ లాకర్ నుంచి రికవరీ చేసిన 46.70 లక్షల రూపాయలకు సంబంధించి సీబీఐ చెబుతున్న వాదన నమ్మదగ్గదిగా లేదని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. 2020 సెప్టెంబర్ 9న మున్నా బ్యాంకు లాకర్లో ఉన్న 46.70 లక్షల రూపాయలను సీబీఐ జప్తు చేసింది. ఈ జప్తు వ్యవహారం భారత సాక్ష్యాధారాల చట్టం సెక్షన్ 27 ప్రకారం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం. -
విశాఖలోని కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో పురోగతి
-
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ట్రిపుల్ మర్డర్
-
అప్సర కేసులో సంచలనం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
-
అప్సరకు గతంలోనే వివాహం ?
-
సరూర్ నగర్ అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్
-
అప్సర తలకు బలమైన గాయం: పోస్ట్ మార్టం రిపోర్ట్
-
మా కూతురుకు ఏ చెడు అలవాటు లేదు: అప్సర తల్లిదండ్రులు
-
గర్భవతిగా ఉన్న అప్సరను హత్య చేసిన సాయికృష్ణ
-
అప్సర హత్య కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్
-
శంషాబాద్ పరిధిలో మహిళ దారుణ హత్య
-
ముంబైలో మహిళ దారుణ హత్య
-
బెంగళూరులో గోదావరిఖని యువతి హత్య
-
రాజేష్ హత్య కేసులో మరో కొత్త ట్విస్ట్
-
చైతన్యపురి నర్స్ అనురాధ హత్య కేసులో సంచలన విషయాలు
-
జిల్లెలపాడు సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య కేసులో కొత్త కోణం
-
శ్రావణిని హత్య చేసిన ప్రియుడు
-
వీడియో: వైఎస్సార్ సీపీ నేత భవానీశంకర్ హత్య
-
టిల్లుపై కత్తులతో దాడి చేసిన ఖైదీలు
-
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో పెను సంచలనం.. పుతిన్‌పై హత్యాయత్నం..!
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర ఆరోపణలు చేసింది. తమ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌ను హత్య చేసేందుకు జెలెన్స్కీ కుట్ర చేశారని తెలిపింది. మాస్కోలోని పుతిన్ అధికారిక నివాసంపై ఉక్రెయిన్‌కు చెందిన రెండు డ్రోన్లు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ డ్రోన్లను తమ సైన్యం కూల్చివేసినట్లు వెల్లడించింది. దీన్ని ఉగ్ర చర్యగా అభివర్ణించింది. 'రెండు మానవ రహిత డ్రోన్లు పుతిన్ నివాసంపై దాడికి ప్రయత్నించాయి. రాడార్ వ్యవస్థను ఉపయోగించి రష్యా సైన్యం వాటిని కూల్చివేసింది. దీన్ని ఉగ్ర కుట్రగా మేం భావిస్తున్నాం. విక్టరీ డే సందర్భంగా విదేశీ ప్రతినిధులతో మే 9న మేము నిర్వహించే పరేడ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి ఉక్రెయిన్ కుట్ర చేసింది. రష్యా బలగాలు పూర్తి సామర్థ్యంతో ఉన్నాయి. శత్రువులు ఏ రూపంలో వచ్చినా దీటుగా బదులిస్తాయి.' అని రష్యా ప్రకటనలో తెలిపింది. #BREAKING Footage of Ukrainian drone attack on Russia’s Kremlin overnight. pic.twitter.com/8S5MGQWdbK — Clash Report (@clashreport) May 3, 2023 ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో పుతిన్‌కు ఎలాంటి హాని జరగలేదని, భవనాలు కూడా దెబ్బతినలేదని రష్యా తెలిపింది. డ్రోన్ దాడికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. మాస్కోలో డ్రోన్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. చదవండి: చేపల వేటకు వెళ్లి అదృశ్యం.. మొసలి కడుపులో మృతదేహం.. -
ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమజంట హత్య
-
చిత్తూరు జిల్లా బ్యూటీషియన్ దుర్గా ప్రశాంతి హత్య కేసు నిందితుడు అరెస్ట్
-
హైదరాబాద్: ఆర్థిక తగాదాలతోనే బాలుడు వహీద్ హత్య
-
యూపీలో పేరు మోసిన గ్యాంగ్ స్టార్ అతీక్ అహ్మద్ హత్య
-
నవీన్ హత్య కేసులో కీలక అంశాలు
-
హైదరాబాద్ : దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్య
-
గుంటూరులో వేర్వేరుచోట్ల ఇద్దరు సెక్యూరిటీ గార్డుల హత్య
-
నవీన్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన హసన్
-
కాకినాడ : ప్రేమోన్మాదికి జీవిత ఖైదు
-
3 నెలల క్రితమే నవీన్ హత్యకు హరిహరకృష్ణ ప్లాన్
-
నవీన్ ను హరిహర కృష్ణ ఒక్కడే హత్య చేయలేదు - హరిహర కృష్ణ తండ్రి ప్రభాకర్
-
నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర ఫోన్ కాల్ వైరల్
-
నల్లగొండ ఎంజీ వర్సిటీ విద్యార్థి నవీన్ హత్య కేసు
-
నెల్లూరు నగరంలో దారుణ హత్య
-
ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ ఆత్మహత్య
సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. అమెరికన్ హిప్హాప్ డ్యాన్స్, కొరియోగ్రాఫర్, నటుడు డీజే స్టీఫెన్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాస్ ఏంజిల్స్‌లోని ఓ హాటల్లో ఆయన గన్‌తో షూట్ చేసుకున్ని ఆత్మహత్య పాల్పడినట్లు అక్కడి మీడియా పేర్కొంది. దీంతో హాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియా వేదికగా స్టీఫెన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు. చదవండి: అనన్య ఫ్యాన్‌గర్ల్ మూమెంట్.. ‘ఆయన నాకు చేయి ఊపారు’ కాగా ది ఎలెన్ డిజనరేస్ షో, సో యూ థింక్ యూ కెన్ డాన్స్’ వంటి రియాలిటీ షోలతో స్టీఫెన్ పాపులర్ అయ్యాడు. స్టెప్ అప్, మ్యాజిక్ మైక్ డబుల్ ఎక్స్ సినిమాల్లో కూడా ఆయన నటించాడు. అలాగే టెలివిజన్ ప్రొడ్యూర్గా కూడా స్టీఫెన్ గుర్తింపు పొందాడు. కాగా స్టీఫెన్‌కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Ellen DeGeneres (@theellenshow) -
‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకే వచ్చా’.. షూటర్ సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఆయనతో పాటు మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులకు పాల్పడిన దుండగుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇమ్రాన్‌ను హత్య చేసేందుకే తాను వచ్చానని, ఆయన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే ఇలా చేశానని పేర్కొన్నాడు. ‘ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసేందుకు మాత్రమే వచ్చా.’ అని కెమెరా ముందు చెప్పాడు దుండగుడు. గుజ్రాన్‌వాలాకు బైక్‌పై వచ్చానని, తన బంధవు ఇంట్లో బండిని పార్క్ చేసి ర్యాలీకి వచ్చినట్లు వెల్లడించాడు. మరోవైపు.. ఇమ్రాన్ ర్యాలీలో ఇద్దరు షూటర్లు పాల్గొన్నట్లు సమాచారం. ఒకరు పిస్టల్‌తో రాగా.. మరొకరు ఆటోమెటిక్ రైఫిల్‌తో ఉన్నారని పలు మీడియాలు వెల్లడించాయి. మరోవైపు.. కాల్పుల్లో కాలికి తీవ్రంగా గాయమైన ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు గాయపడ్డారు. ఈ క్రమంలో ఇమ్రాన్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని నిలువరించిన పార్టీ కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఆయనను హత్య చేసేందుకు జరిగిన దాడిగా పార్టీ సీనియర్ నేత రవూఫ్ హసన్ ఆరోపంచారు. ఇదీ చదవండి: Imran Khan Rally: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో ఫైరింగ్.. నలుగురికి గాయాలు -
సత్యసాయి జిల్లా : హిందూపురంలో వైఎస్ఆర్ సీపీ నేత హత్య
-
నెల్లూరులో డబల్ మర్డర్ కలకలం
-
తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
-
దుండగుడు చంపాలనుకుంది అబేను కాదట.. కానీ!
టోక్యో: జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబే గురువారం దారుణ హత్యకు గురవటం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నారా ప్రాంతంలోని రైల్వే స్టేషన్ ముందు ప్రసంగిస్తున్న సమయంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు అబే. ఈ ఘాతుకానికి పాల్పడింది కొన్నేళ్ల క్రితం నౌకాదళంలో పని చేసిన తెత్సుయ యమగామి(41)గా గుర్తించారు పోలీసులు. అయితే.. తాను మొదట చంపాలనుకుంది అబేను కాదని పోలీసులకు తెలిపినట్లు జపాన్ మీడియాల్లో కథనాలు వెలువడ్డాయి. ఓ మత సంస్థకు చెందిన గురువును హత్య చేయాలని అనుకున్నట్లు పేర్కొన్నాయి. మత సంస్థపై తనకు కోపం ఉందని, దానితో షింజో అబేకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతోనే హత్యకు పాల్పడ్డానని పోలీసులతో చెప్పినట్లు క్యోడో న్యూస్ తెలిపింది. అబే రాజకీయ విశ్వాసలను వ్యతిరేకిస్తున్న క్రమంలో తాను నేరం చేశానని భావించటం లేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. అయితే.. ఆ మత గురువు ఎవరనే విషయం తెలియరాలేదు. నౌకాదళంలో మూడేళ్లు విధులు: మీడియా కథనాల ప్రకారం.. దుండగుడు యమగామి తన హైస్కూల్ విద్య తర్వాత భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంపై స్పష్టత లేదని తేలింది. తన గ్రాడ్యూయేషన్ ఇయర్ బుక్‌లో సైతం అదే రాశాడు. ప్రభుత్వ వర్గాల ప్రకారం అతడు 2005లో హిరోసిమా, క్యూర్ బేస్‌లోని నౌకాదళంలో చేరి మూడేళ్లు పని చేశాడు. 2020లో కన్సాయి ప్రాంతంలోని ఓ తయారీ సంస్థలో ఉద్యోగంలో చేరిన యమగామి.. దానిని సైతం రెండు నెలల క్రితమే మానేశాడు. అలసిపోయాననే కారణం చెప్తూ.. ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు. దుండగుడి ఇంట్లో పేలుడు పదార్థాలు, తుపాకులు: నారా ప్రాంతంలోని అతని అపార్ట్మెంట్లో పోలీసులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. అతని ఇంటి నుంచి పేలుడు పదార్థాలు, నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియాలు వెల్లడించాయి. షింజో అబే భౌతికకాయాన్ని శుక్రవారం టోక్యోకు తరలించారు. మంగళవారం అంతిమసంస్కారాలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: షింజో అబే మృతి.. అమెరికా అధ్యక్షుడి ప్రగాఢ సంతాపం, భావోద్వేగ నోట్ -
బొమ్మ తుపాకీ అనుకుంటే.. గుండెను చీల్చేసింది
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యతో యావత్ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆయనతో అనుబంధం ఉన్న ప్రపంచ నేతలు షాక్‌కు గురయ్యారు. జపాన్ పశ్చిమ ప్రాంతంలోని నరా నగరంలో శుక్రవారం ఈ ఘాతుకం జరిగింది. ఆదివారం జపాన్ పార్లమెంటు ఎగువ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో షింజో అబే మాట్లాడుతుండగా, వెనుకగా వచ్చిన దుండగుడు దేశవాళీ తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. కాగా, షింజే అబేపై కాల్పులు జరగడం తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రక్తపు మడుగులో కుప్పకూలిన అబేను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. ఆయన్ని కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దుండగుడు తొలిసారి కాల్చినప్పుడు అందరూ బొమ్మ తుపాకీ కాల్పులు అనుకున్నారట ప్రత్యక్ష సాక్షులు. అప్పటికి షింజో అబే కిందపడిపోలేదని, కానీ రెండో రౌండ్ కాల్చాక ఆయన నేలకొరిగారని ఓ యువతి ఘటన గురించి వివరించింది. రెండో రౌండ్ కాల్చడం స్పష్టంగా కనిపించిందని, తుపాకీ నుంచి నిప్పులు రావడంతోపాటు, పొగ కూడా వెలువడిందని, దాంతో అవి నిజం కాల్పులేనని అర్థమయ్యాయని ఆమె వెల్లడించింది. కిందపడిపోయిన షింజే అబే అచేతనంగా కనిపించడంతో, పలువురు ఆయన ఛాతీపై మర్దన చేశారు. కాగా, ఓ బుల్లెట్ షింజో అబే గుండెను నేరుగా తాకిందని, దాంతో ఆయన గుండె ఛిద్రమైందని చికిత్స అందించిన డాక్టర్లు వెల్లడించారు. గుండె భాగంలో పెద్ద రంధ్రం పడిందని వివరించారు. ఆయన మరణానికి ఇదే ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఓ బుల్లెట్ గుండెను తాకగా, మరో బుల్లెట్ ఆ గాయాన్ని మరింత క్లిష్టతరం చేసిందని వివరించారు. షింజో అబేను అసుపత్రికి తీసుకువచ్చేసరికి ఆయన కార్డియాక్ అరెస్ట్ కు గురైన స్థితిలో ఉన్నారని డాక్టర్లు వెల్లడించారు. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఐదు గంటల పాటు తీవ్రంగా శ్రమించామని వివరించారు. రక్తం కూడా ఎక్కించామని తెలిపారు. ఏదీ ఫలితాన్నివ్వలేకపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలంలోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు. టెత్సుయా యమగామి(41).. జపాన్ సైన్యంలో పని చేసిన వ్యక్తి. తనకు నచ్చని సంస్థతో షింజో అబే సంబంధాలు కలిగి ఉన్నాడని, ఆయన తీరుపై అసంతృప్తితోనే కాల్చేశానని, రాజకీయ సిద్ధాంతాల పరంగా ఆయనతో ఎలాంటి విబేధాలు లేవని టెత్సుయా యమగామి పోలీసుల ఎదుట స్టేట్మెంట్ ఇచ్చాడు. #ShinzoAbe Closest vid for now pic.twitter.com/RZGAFjqDMY — DanJuan (@DanJuan18) July 8, 2022 -
అందుకే షింజో అబేను కాల్చేశా!
టోక్యో: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యోదంతం ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసింది. సమర్థవంతమైన నేతగా, అజాత శత్రువుగా పేరున్న షింజోపై దాడి జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ తరుణంలో జపాన్ పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు కీలక విషయాలని వెల్లడించినట్లు స్థానిక మీడియా కథనాలు ప్రచురిస్తోంది. గతంలో జపాన్ సైన్యంలో మూడేళ్లపాటు (2002-2005) పని చేసిన టెత్సుయా యమగామి(41).. షింజో అబే మీద కాల్పులకు తెగబడ్డాడు. జపాన్ పశ్చిమ నగరం నారాలో ఓ ట్రైన్ స్టేషన్ ఎదుట శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో(అక్కడి కాలమానం ప్రకారం) పార్లమెంటరీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు షింజో అబే. ఆ సమయంలో వెనుక నుంచి షింజోపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు టెత్సుయ యమగామి. మొదటి బుల్లెట్‌కు వెనక్కి వంగిపోయిన షింజో.. రెండో బుల్లెట్ తగలగానే కుప్పకూలిపోయారు ఆ వెంటనే దుండగుడు టెత్సుయాను చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు భద్రతా సిబ్బంది. ఇక పోలీసుల ఎదుట యమగామి నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది. #ShinzoAbe #安倍さん Sad news Offender, 41-year-old Japanese national Tetsue Yamagami, served in the Navy. With a homemade double-barreled gun, 2 shots, hit the lung and die. pic.twitter.com/dm4ElkceCg — manj.eth (@ManjTrader) July 8, 2022 ‘‘షింజో అబే రాజకీయ విశ్వాసాలపై ఎలాంటి పగ లేదు. కానీ, అసంతృప్తితో రగిలిపోతున్నానని,అందుకే ఆయన్ని చంపాలని నిర్ణయించుకున్నానని, అయితే ఆయనకు చికిత్స అందుతుండడంతో తాను నిరుత్సాహానికి లోనయ్యాను’’ అంటూ విచారణలో పోలీసుల ఎదుట సమాధానం ఇచ్చాడు. అయితే అతని అసంతృప్తికి కారణాలు ఏంటి? నిందితుడి బ్యాక్‌గ్రౌండ్ తదితర వివరాలను మాత్రం అధికారులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన తుపాకీని అతనే స్వయంగా తయారు చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. టెత్సుయాన్ ఇంట్లో పేలుడు పదార్థాలు లభించినట్లు సమాచారం. అయితే అతని సమాధానాల్లో నిజానిజాలు ఎంతున్నాయో తేల్చే పనిలో ఉన్నారు పోలీసులు. షింజో అబేపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని ఫుమియో కిషిదా.. ఆయన్ని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ఆయన అచేతనావస్థలోకి వెళ్లిపోయారని సిబ్బంది ప్రకటించారు. ఈలోపు ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ఫలించకపోగా.. కాసేపటికే ఆయన కన్నుమూసినట్లు జపాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గుండెలోకి తూటా దూసుకెళ్లినందుకే ఆయన చనిపోయినట్లు నారా మెడికల్ యూనివర్సిటీ వైద్యులు నిర్ధారించారు. Abe Shooting and Arrest of Shooter pic.twitter.com/iFV6V67YXx — SubX.News (@NewsSubstance) July 8, 2022 -
అమెరికాలో భారత సంతతికి చెందిన మరో వ్యక్తి హత్య
న్యూయార్క్: తెలంగాణాకు చెందిన యువకుడి హత్య సంఘటన మరువక ముందే భారత సంతతికి చెందిన మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. మేరీ ల్యాండ్‌లో సత్నామ్ సింగ్ హత్యకు గురయ్యాడు. తన ఇంటికి సమీపంలో సౌత్ ఓజోన్ పార్క్‌లో పార్క్ చేసిన బ్లాక్ జీప్ రాంగ్లర్ సహారా కారులో ఉండగానే అతణ్ని కాల్చి చంపిన ఘటన ఆందోళన రేపింది. సమీపంనుంచి సాయధ దుండగుడు అతనిపై కాల్పులు జరపాడని న్యూయార్క్ డైలీ న్యూస్ రిపోర్ట్ చేసింది. ఛాతీ, మెడపై కాల్పులు జరపడంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక జమైకా హాస్పిటల్‌కి తరలించారు. కానీ అప్పటికే సింగ్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు కాల్పులకు కొద్ది సమయానికి ముందు సత్నామ్ సింగ్ అతని స్నేహితుడి వద్ద నుంచి ఎస్‌యూవీని అరుపు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎస్యూవీ యజమాని అనుకొని, సత్నామ్ సింగ్‌పై కాల్పులు జరిపారా? లేక అసలు హంతకుల టార్గెట్ ఎవరు? అనే దానిపై డిటెక్టివ్లు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. స్థానికుడు జోన్ కాపెల్లని కథనం ప్రకారం సింగ్ కారువైపు నడుస్తుండగానే మరో కారులో వచ్చిన దుండగుడు సింగ్‌పై అతిసమీపంనుంచి కాల్పులు జరిపి పారి పోయాడు. కాగా తెలంగాణ యువకుడు సాయి చరణ్ మేరీ ల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో కారులో హత్యకు గురైన కొన్ని రోజుల తర్వాత మరో సంఘటన నమోదు కావడం చర్చకు దారి తీసింది. -
ఉరి సమయంలో గాడ్సే గొంతు జీరబోయింది!
స్వతంత్ర భారతి 1949/2022 ఘట్టంలో.. పాయింట్ బ్లాంక్‌లో తుపాకీ గురిపెట్టి గాంధీజీపై నాథూరామ్ గాడ్సే మూడుసార్లు కాల్పులు జరిపాక అక్కడున్న ప్రజలంతా ఒక్కసారిగా గాడ్సేపై దాడి చేశారు. అయితే పోలీసులు రావడంతో వారి నుంచి గాడ్సే తప్పించుకున్నాడు. గాడ్సేను అదుపులోకి తీసుకున్న అనంతరం ఈ హత్యలో అతడికి సహకరించిన నిందితుల కోసం పోలీసులు వేట మొదలుపెట్టారు. గాంధీ హత్య ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత జడ్జి ఆత్మ చరణ్ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది. ఏడాది తర్వాత 1949, ఫిబ్రవరి 10న కోర్టు తన తీర్పు వెలువరించింది. హిందూ మహాసభ నాయకుడు వీర్ సావర్కర్‌కు కూడా ఈ కుట్రలో భాగం ఉందని తేల్చింది. అయితే సరైన సాక్ష్యాధారాలు లభించని కారణంగా ఆయన బయటపడ్డారు. అనంతరం నాథూరామ్ గాడ్సే, అతడి స్నేహితుడు నారాయణ ఆప్టేలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. మిగిలిన ఐదుగురు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో నిందితులు పంజాబ్ హైకోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ముగ్గురు న్యాయవాదులతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది. ఇక్కడ కూడా గాడ్సే, ఆప్టేలకు ఉరిశిక్ష విధించాలనే కోర్టు తీర్పునిచ్చింది. ఆ ప్రకారం 1949, నవంబరు 15న వారిద్దరిని అంబాలా జైలులో ఉరితీశారు. ‘‘శిక్ష అమలు కావడానికి ముందు బతికేందుకు తనకు అవకాశం ఇవ్వాల్సిందిగా గాడ్సే కోరాడు. శాంతి గురించి ప్రచారం చేసుకుంటూ దేశ సేవలో తన శేష జీవితాన్ని గడుపుతానని పేర్కొన్నాడు. కానీ గాడ్సేకు ఆ అవకాశం లభించలేదు. ఉరిశిక్ష అమలయ్యే రోజున ఆ ఇద్దరు ఖైదీల చేతులు వెనక్కి మడిచి అధికారులు ఉరికంబం దగ్గరికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో తడబడుతూనే గాడ్సే ముందుకు నడిచాడు. విషణ్ణ వదనంతో, భయంతో ఆయన ముఖకవళికల్లో పూర్తి మార్పు కనిపించింది. ఉరికంబం ముందు నిల్చుని గాడ్సే మానసిక యుద్ధం చేశాడు. ధైర్యంగా ఉండేందుకు ప్రయత్నించాడు. ఉరి తీయడానికి కొన్ని క్షణాల ముందు అఖండ భారత్ అంటూ నినదించిన గాడ్సే గొంతు జీరబోయింది. ట్రయల్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ వాదించినప్పుడు ఉన్నంత ధైర్యం అప్పుడు ఆ గొంతులో ప్రతిధ్వనించలేదు’’ అని చరిత్రకారులు కొందరు రాశారు. -
భర్త శంకర్ చేతిలో భార్య శిరీష దారుణ హత్య
-
అతని రిలీజ్ సంగతి మమ్మల్నే తేల్చమంటారా?: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసు దోషి పేరరివాలన్ విడుదల విషయంలో కేంద్రం, తమిళనాడు గవర్నర్ అనుసరిస్తున్న వైఖరిపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పేరరివాలన్ విడుదల విషయంలో ఈ నెల పదో తేదీ లోగా తేల్చాలని, లేదంటే అవసరమైన ఆదేశాలను తామే జారీ చేస్తామని తేల్చి చెప్పింది. ఇక ఈ విషయంలో తదుపరి వాదనలేవీ లేవని కనుక కేంద్రం భావిస్తే పేరరివాలన్‌ను విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తాము తేలిగ్గా తీసుకోవడం లేదని, రాజ్యాంగ ధర్మాసనం, ఫెడరల్ రాజ్యాంగ విధానానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశంగానే దీనిని భావిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం.. ఈ నెల 10లోగా ఏదో ఒక విషయం చెప్పాలని కేంద్రానికి అల్టిమేటం జారీ చేసింది. రాజీవ్‌గాంధీ హత్యకేసులో ముద్దాయిలుగా ఉన్న పేరరివాలన్ సహా ఏడుగురిని విడుదల చేయాలని తమిళనాడు శాసనసభ ఆమోదించింది. అయితే, ఈ బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ తీవ్ర జాప్యం చేశారు. దీంతో పేరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తమిళనాడు శాసనసభ ఆమోదించిన బిల్లును రాష్ట్రపతికి పంపడంలో గవర్నర్ ఆలస్యం చేస్తున్నారని, కాబట్టి ఆయన నిర్ణయంతో సంబంధం లేకుండా తమను విడుదల చేయాలని సుప్రీంకోర్టును కోరాడు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ పీఆర్ గవాయ్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. తదుపరి వాదనలేవీ లేవని కేంద్రం కనుక స్పష్టంగా చెప్పేస్తే పేరరివాలన్ విడుదలపై ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. మెరిట్ల ఆధారంగా కేసును వాదించడానికి మీరు సిద్ధంగా లేనందున మేము అతనిని జైలు నుండి విడుదల చేయమని ఉత్తర్వు జారీ చేస్తామ. కేంద్రం ఆదేశానుసారం తమిళనాడు గవర్నర్ వ్యవహరిస్తే గనుక అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి మేము కళ్ళు మూసుకోలేము. అధికారానికి పరిమితులు ఉండొచ్చు. కానీ, రాజ్యాంగం మాత్రం ఆగిపోకూడదు అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ హత్యకు కుట్ర!
దారులన్నీ మూసుకుపోయాయి. అయినా రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకునేందుకు ఇమ్రాన్ ఖాన్ అన్నివిధాల ప్రయత్నిస్తున్నాడు. ఏది ఏమైనా రాజీనామాకు ససేమీరా అంటున్నాడు. మిత్ర పక్షాలన్నీ తనని గద్దె దించడం ఖాయమని ఫిక్స్ అయిపోయాడు పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈ నేపథ్యంలోనే.. జాతిని ఉద్దేశించి ప్రసంగించాల్సిన కార్యక్రమాన్ని సైతం ఆర్మీ సలహా మేరకు వాయిదా వేసుకున్నాడు కూడా. ఈ తరుణంలో.. పాకిస్థాన్ తెహ్రీక్-యి-ఇన్సాఫ్ పార్టీ (PTI) సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన హత్యకు కుట్ర జరుగుతోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పీటీఐ సీనియర్ నేత ఫైజల్ వవ్దా. పాక్ రాజకీయాలను ప్రభావితం చేయాలని కొన్ని బయటి శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాజకీయ సంక్షోభానికి తెర లేపాయి. ఆయన మొండిగా ముందుకెళ్తున్నాడు. అందుకే చంపాలని ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ ఫైజల్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశాడు. ఇక ఇమ్రాన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న సమాచారం ఇంటెలిజెన్సీ వర్గాలు తమ ప్రభుత్వానికి అందించాయని పీటీఐ నేతలు పలువురు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బుల్లెట్‌ప్రూఫ్ షీల్డ్‌తో పాటు కార్లను సైతం ఉపయోగించాలని నిఘా వర్గాలు ఇమ్రాన్ ఖాన్‌కు సూచించాయట. అయితే తాను చావుకు భయపడనని ఇమ్రాన్ ఖాన్.. తోటి నాయకులతో చెప్పినట్లు ఏఆర్వై న్యూస్ కథనం ప్రచురించింది. అయితే ప్రతిపక్షాలు ఇదంతా ఉత్త డ్రామాగా కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు తన ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు విదేశీ శక్తులు కుట్ర పన్నాయని, ఇందుకోసం ప్రతిపక్షాలకు డబ్బు ఆశ ఎర చూపుతున్నాయని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నాడు. ఇమ్రాన్ సర్కార్‌కు 172 మంది ప్రజాప్రతినిధుల మద్దతు అవసరం కాగా, ప్రస్తుతం 164 మంది ఉన్నారు. వీళ్లలోనూ మరికొందరు బయటకు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చదవండి: ఖాన్‌కు అదనంగా విషమ పరీక్ష విశేషం ఏంటంటే.. 75 ఏళ్ల పాక్ రాజకీయ చరిత్రలో ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలం(ఐదేళ్లు) పూర్తి చేసుకోలేదు. మిలిటరీ జోక్యంతో దాదాపుగా గద్దె దిగిపోవడం లేదంటే శరణార్థులుగా బయటి దేశాలకు పారిపోవడం జరిగింది. అలాగే ఏ ఒక్కరూ అవిశ్వాసంలో ఓడిపోలేదు కూడా. ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే నాలుగేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్నాడు. ఈ తరుణంలో.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలోనూ ఉన్నాడు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ నుంచి రాజీనామాను ఆశించని ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్ షహబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు పాక్ రాజకీయ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి. సంబంధిత వార్త: లాస్ట్ ఓవర్.. ఐదు బంతులు.. 36 పరుగులు.. -
మాదాపూర్: ప్రేయసిపైనే అత్యాచారం.. ఆపై దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపైనే అత్యాచారం చేసి.. ఆమె ప్రాణం తీశాడో ప్రియుడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాలుప్రసాద్ అనే యువకుడు హైటెక్‌సిటీ ఔట్‌పోస్ట్ వద్ద తన ప్రేయసిపై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితున్ని సీసీటీవీ కెమెరాల ఆధారం పట్టుకొని అరెస్ట్ చేశారు. తనతో కాకుండా నరేష్ అనే యువకునితో సన్నిహితంగా ఉంటుందనే అక్కసుతోనే తను ఆమెను అత్యాచారం చేసి.. హత్య చేసినట్లు పోలీసులు ముందు లాలుప్రసాద్ ఒప్పుకున్నాడు. -
పాతకక్షలతో టీడీపీ గ్రామ నేత హత్య
వెల్దుర్తి/మాచర్ల: గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తోట చంద్రయ్య (35) గురువారం హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో ప్రత్యర్థులు ఆయన్ని కత్తులతో గొంతు కోసి హత్య చేశారు. హతుడు తెలుగుదేశం పార్టీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రధాన అనుచరుడు. బ్రహ్మారెడ్డి ఒకేరోజు జరిగిన 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో చంద్రయ్య గుడికి వెళ్ళి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ముగ్గురు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఆయన గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పాత కక్షల కారణంగానే చంద్రయ్య హత్య జరిగిందని స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. తోట చంద్రయ్య, చింతా శివరామయ్యలకు గతంలో సిమెంట్ రోడ్డు నిర్మాణం విషయంలో ఘర్షణలు జరిగాయి. ఆ తరువాత చంద్రయ్య టీడీపీలో చురుగ్గా తిరుగుతుండటం, బ్రహ్మారెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉండటంతో అతడి వల్ల ప్రాణహాని ఉందనే అనుమానంతో ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న మాచర్ల రూరల్ సీఐ సురేంద్రబాబు, వెల్దుర్తి ఇన్చార్జి ఎస్ఐ పాల్ రవీందర్‌లు సంఘటన ప్రాంతానికి చేరుకొని వివరాలు సేకరించారు. జూలకంటి బ్రహ్మారెడ్డి వచ్చే వరకూ మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించకూడదంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి, పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని గుండ్లపాడు తరలించారు. చంద్రబాబు పరామర్శ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం గుండ్లపాడు చేరుకుని చంద్రయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చంద్రయ్య పాడె మోశారు. ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. చంద్రయ్య కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నాననిచెప్పారు. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జి బ్రహ్మారెడ్డికి వచ్చిన స్పందనను చూసి ఆయనకు ఒక మెస్సేజ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చంద్రాన్ని హత్య చేయించారని ఆరోపించారు. రౌడీ రాజకీయాలు చేసేవారిని జగన్ కంట్రోల్ చేయాలని, లేకపోతే జరిగే పరిణామాలకు జగనే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. మా ప్రాణాలు తీయడం ఎంత సులువో, మీ ప్రాణాలు తీయడం అంత సులువేనని చెప్పారు. నేరస్థులు పరిపాలిస్తున్నారు కాబట్టే పోలీసులను అడ్డం పెట్టుకుని హత్యలు చేయిస్తున్నారని విమర్శించారు. పల్నాడులో ఇప్పటికే పదుల సంఖ్యలో రాజకీయ హత్యలు జరిగాయన్నారు. స్థానిక ఎన్నికల సమయంలో బోండా ఉమా, బుద్ధాపై దాడి చేశారని చెప్పారు. ఆ సమయంలోనే చర్యలు తీసుకొని ఉంటే ఇటువంటి ఘటనలకు అడ్డుకట్ట పడేదని తెలిపారు. దాడులు చేస్తే పదవులు కట్టబెట్టే విష సంస్కృతిని జగన్ చాటుకున్నారని విమర్శించారు. -
భార్య స్నేహితురాలితో వివాహేతర బంధం.. 6 నెలల కిందట కనిపించకుండాపోయి..
సాక్షి,పరవాడ (విశాఖపట్నం): వివాహితతో అదృశ్యమైన ఓ యువకుడు హతమయ్యాడు. సుమారు 6 నెలల కిందట కనిపించకుండా వెళ్లిపోయిన పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (23) గత ఏడాది జూలై 13న హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు. నడుపూరు సమీప రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన పుచ్చా వంశీ(20), కొవురు సందీప్‌రెడ్డి(20) హత్య చేశారని తేలడంతో అనకాపల్లి కోర్టులో గురువారం హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను పరవాడ సీఐ పెదిరెడ్ల ఈశ్వరరావు మీడియాకు వెల్లడించారు. (చదవండి: ఫోన్లో పరిచయం.. తరచూ మాట్లాడుతూ మరింత దగ్గరయ్యి.. ) భార్య స్నేహితురాలితో వివాహేతర బంధం వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన అఖిలేష్ ఆటో డ్రైవర్‌గా పనిచేసేవాడు. రెండేళ్ల కిందట స్వాతి అనే వివాహితను తీసుకొచ్చేసి గాజువాక పరిధి నడుపూరు సమీప రామచంద్రానగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నివసించేవాడు. అదే గ్రామంలో ఇద్దరు పిల్లలు, భర్తతో నివసిస్తున్న సంతోషి లక్ష్మి, స్వాతి డ్వాక్రా గ్రూపులో సభ్యులు కావడంతో వారి మధ్య స్నేహం పెరిగింది. ఈ క్రమంలో భార్య స్వాతి స్నేహితురాలు సంతోషి లక్ష్మిని అఖిలేష్ పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు. అనంతరం గత ఏడాది మార్చిలో ఆమెను తీసుకుని అనకాపల్లి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి పద్మనాభం వెళ్లిపోయి అక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఆమెతో కాపురం పెట్టాడు. ఈ నేపథ్యంలో సంతోషి లక్ష్మి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని మల్కాపురంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో సంతోషి బావ రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు(28), అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు పుచ్చా వంశీ (20), కొవురు సందీప్‌రెడ్డి (20) కలిసి అఖిలేష్‌ను పద్ధతి మార్చుకోమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన స్వాతి తన పుట్టింటికి వెళ్లిపోయింది. తండ్రి ఫిర్యాదుతో వెలుగులోకి వివాహితను తీసుకుని వెళ్లిపోయిన కుమారుడి ఆచూకీ నెలలు గడుస్తున్నా తెలియకపోవడంతో అనుమానించిన అఖిలేష్ తండ్రి వియ్యపు ముత్యాలునాయుడు గత ఏడాది నవంబరు 19న పరవాడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు గతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సంతోషి లక్ష్మి బంధువులపై నిఘా ఉంచి కాల్ డేటా పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సనా వాసు, పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించారు. వారిని హత్యా స్థలికి తీసుకెళ్లగా... అక్కడ మృతుని ప్యాంటు, పుర్రె, ఎముకలు లభించాయి. వాటి ఆధారంగా మృతుని గుర్తించడంతో నిందితులను రిమాండ్‌కు తరలించారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసును సీఐ ఈశ్వరరావు, ఎస్ఐ పి.రమేష్ ఛేదించారు. తీరు మారకపోవడంతో హత్య పోలీసులు కౌన్సెలింగ్ చేసినా, బంధువులు హెచ్చరించినా అఖిలేష్ తీరులో మార్పు రాలేదు. మళ్లీ గత ఏడాది జూన్‌లో సంతోషి లక్ష్మిని తీసుకొని ఎక్కడికో వెళ్లిపోయాడు. కొద్ది రోజుల తర్వాత 2021 జూలై 13న తాను గతంలో కాపురం పెట్టిన పద్మనాభం వచ్చాడు. అక్కడి అద్దె ఇంటిలోని సామగ్రి తీసుకెళ్లేందుకు యత్నిస్తుండగా... విషయం తెలుసుకున్న సంతోషి లక్ష్మి బావ సనా వాసు, అతని స్నేహితులు పుచ్చా వంశీ, సందీప్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సంతోషి లక్ష్మి ఎక్కడ ఉందని వాకబు చేశారు. తనకు తెలియదని అఖిలేష్ చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించగా... బయట మాట్లాడుకుందామని చెప్పి అదే రోజు సాయంత్రం 5.30 గంటల సమయంలో అఖిలేష్‌ను వాసు తన ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరాడు. మరో ద్విచక్ర వాహనంపై వంశీ, సందీప్‌రెడ్డి బయలుదేరి... ముందుగా వేసుకొన్న ప్రణాళిక ప్రకారం ఆనందపురం మండలంలోని నీళ్ల కుండీలు కూడలి సమీప నిర్మాణుష్య ప్రదేశానికి అఖిలేష్‌ను తీసుకెళ్లి హతమార్చారు. బండరాయితో ముఖం గుర్తు పట్టలేని విధంగా మోదారు. అనంతరం రక్తం వాసనను పోలీసులు, పరిసర ప్రాంతీయులు గుర్తించకుండా ఉండేందుకు వీలుగా కారం, అల్లం వెల్లుల్లి పేస్టును హతుడి శరీరంపై పూసి తుప్పల్లో పడేసి వెళ్లిపోయారు. -
పోలీస్‌స్టేషన్ దగ్గర్లో జంట హత్యలు.. రోడ్డుపై ఒకరిని, ఇంటికెళ్లి మరొకరిని..
సాక్షి, చెన్నై : చెంగల్పట్టులో గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో జంట హత్యలు జరిగాయి. చెంగల్పట్టు పోలీసుస్టేషన్, పాత బస్టాండ్ పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. అయితే సాయంత్రం 6.30 గంటల సమయంలో అటువైపు వచ్చిన మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు జనం చూస్తుండగానే నరికి చంపేశారు. ( చదవండి: వివాహితతో యువకుడి చాటింగ్.. చివరికి ఇద్దరూ కూడా.. ) అక్కడి నుంచి పరుగులు తీసిన ఆ వ్యక్తులు సమీపంలోని ఓ ఇంట్లోకి చొరబడి, అక్కడ ఉన్న ఓ వ్యక్తిని హతమార్చి పరారయ్యారు. జనం కళ్ల ముందే ఈ హత్యలు జరగడం కలకలం రేగింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. హత్యకు గురైన వారు అప్పు అలియాస్ కార్తికేయన్, అలగేశన్‌గా గుర్తించారు. వీరిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నట్లు తెలిసింది. పాతకక్షల నేపథ్యంలోనే హత్యలు జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. -
అనుమానాస్పద మృతి.. మర్మాంగాలపై తీవ్రంగా కొట్టి..
సిరిసిల్లక్రైం/సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రంలోని రెండో బైపాస్‌రోడ్డులో సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు గ్రామానికి చెందిన వంగ వీరయ్య(52) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 19 గుంటల భూమి పంచాయితీ తమ కుటుంబ పెద్ద దిక్కును బలి తీసుకుందని మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తుండగా, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా కేసు దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. వివాదానికి కారణాలు వివాదానికి గల కారణాలను కుటుంబ సభ్యులు వివరించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధి రగుడు ఎల్లమ్మ ఆలయం ఎదురుగా తెట్టకుంట శివారులోని సర్వేనంబర్ 51/2లో 19 గుంటల స్థలాన్ని ఆరేళ్ల క్రితం వంగ వీరయ్య, వంగ హన్మండ్లు కొనుగోలు చేశారు. దీన్ని ఓర్వలేని వారి బంధువులు ఆ భూమి గౌడ కులస్తులకు చెందితే బాగుంటుందని ఇద్దరిపై పంచాయితీకి ఉసిగొల్పారు. ఈ విషయమై సిరిసిల్లటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్‌కుమార్ ఇరువర్గాలను పిలిచి అడుగగా, పంచాయితీ నిర్వహించుకుని సర్దుబాటు చేసుకుంటామని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు పంచాయితీ నిర్వహించాల్సి ఉంది. ఇందుకోసం ఆదివారం రాత్రి పంచాయితీ పెద్దలను పిలవడానికి వీరయ్య ఒకవైపు, హన్మండ్లు మరోవైపు వెళ్లారు. పెద్దలను కలిసిన వీరయ్య ఇంటికి వస్తున్నానని కుటుంబీకుల్లో ఒకరికి రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫోన్ చేశాడు. తర్వాత ఎలాంటి సమాచారం రాలేదు. ఉదయం సిరిసిల్ల రెండో బైపాస్‌లో వీరయ్య మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్య చేశారని ఆరోపణలు భూమి విషయంలో తగాదాలను మనసులో పెట్టుకుని వీరయ్యను హత్య చేసినట్లు కుటుంబీకులు ఆరోపించారు. బైక్ నుంచి పడితే కేవలం తల మాత్రమే ఎలా పగులుతుందన్న అనుమానాలున్నాయి. అంతేకాకుండా మృతుడి మర్మాంగాలపై తీవ్రంగా కొట్టారని మృతదేహాన్ని చూసిన స్థానికుల్లో కొందరు ఆరోపించారు. పంచాయితీ రోజుకు ముందు కొన్ని గంటల వ్యవధిలో ఎవరో కావాలని హత్యచేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం వీరయ్యకు భార్య రేణుక, ముగ్గురు కూతుళ్లు శ్రావణి, ప్రవళిక, మానస, కుమారుడు ప్రణయ్ ఉన్నారు. పెద్దమ్మాయికి వివాహం జరిగింది. మిగతావారు చదువుకుంటున్నారు. కల్లుగీత కార్మికుడిగా కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈక్రమంలో ఇంటి పెద్ద మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. న్యాయం చేయాలని వేడుకోలు తమ కుటుంబ పెద్దను చంపిన వ్యక్తులను పట్టుకుని న్యాయం చేయాలని వీరయ్య భార్య అతడి పిల్లలు టౌన్ సీఐ అనిల్‌కుమార్‌ను వేడుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, కేసును అనుమానాస్పదంగా భావించి 174 సెక్షన్లో నమోదు చేశామని, పోస్టుమార్టం రిపోర్టులో వైద్యులు హత్యగా 30 శాతం తెలిపినా మర్డర్ కేసుగా అల్టర్ చేస్తానని హామీ ఇచ్చారు. హత్య అని తేలితే ఎంత పెద్ద మనుషులున్నా వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. చదవండి: Balanagar: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు -
ఇద్దరు రాజకీయ నేతల దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో ఇద్దరు రాజకీయ నేతలు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా సెక్రటరీ రంజిత్ శ్రీనివాసన్, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎస్డీపీఐ)నేత కేఎస్ షాన్‌ను గుర్తుతెలియని దుండగులు ఆదివారం ఉదయం చేశారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఎ.అలెగ్జాండర్ అలప్పుజ జిల్లాలో 144 సెక్షన్‌ను విధించారు. బీజేపీ నేత శ్రీనివాసన్(40)ను తన ఇంటిలోనే గుర్తుతెలియని దుండగులు దాడిచేసి చంపారు. ఆయన 2016 ఎన్నికల్లో అలప్పుజ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కె.ఎస్ షాన్‌ను కూడా గుర్తుతెలియని ముఠా చేతిలో హత్య గురయ్యారు. ఈ ఘటనపై ఎస్డీపీఐ స్పందిస్తూ.. తమ నాయకుడి హత్య వెనుక రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రమేయం ఉందని ఆరోపించింది. చదవండి: కోతి వర్సెస్ కుక్క! సోషల్ మీడియాలో రచ్చ రచ్చ! ఇద్దరు రాజకీయ నేతల హత్యలపై కేరళ సీఎం పినరయ్ విజయన్ స్పందిస్తూ.. హత్యలపై వేగంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. సమాజంలో గందరగోళం సృష్టించే ఈ చర్యలను ఖండిస్తున్నానని తెలిపారు. శ్రీనివాసన్ మృతిపై కేంద్ర మంత్రి వి.మురళీధరన్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేతను ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టుల గ్రూప్ హత్య చేసిందని ఆరోపించారు. శ్రీనివాసన్ హత్యకు ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దర్యాప్తు చేసి నేరస్తులను శిక్షించాలని తెలిపారు. రెండు పార్టీల సంబంధించిన నేతలు హత్యకు గురికావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. Kerala: I've been told that State Secy of BJP OBC Morcha was stabbed to death, this morning. This is the handy work of Islamic terrorist group is the info coming from Alleppey (Alappuzha). I demand the State govt to take strict action against perpetrators:Union Min V Muralidharan https://t.co/VRuiureFOH pic.twitter.com/BW8Z9riTjR — ANI (@ANI) December 19, 2021 -
దొంగతనం కోసం వచ్చి.. తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి..
సాక్షి,భీమడోలు(పశ్చిమగోదావరి): దొంగతనం కోసం వచ్చి నిద్రిస్తున్న మహిళను హత్య చేసిన దారుణ ఘటన గుండుగొలనులో శుక్రవారం పట్టపగలు జరిగింది. గుండుగొలనులోని వినాయకుని గుడి ఎదురు రోడ్డులో ఉద్దరాజు నాగమణి(54), సూర్యనారాయణరాజు దంపతులు అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. సూర్యనారాయణరాజు ఆక్వా రైతు వద్ద గుమాస్తాగా ఉంటున్నాడు. దీంతో రోజూ మాదిరిగానే ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతూ బయట తలుపుకు గెడ పెట్టి వెళ్లిపోయాడు. దుండగుడు(లు) గెడ తీసుకుని లోపలకు ప్రవేశించి బీరువాను పగులగొట్టాడు. ఈ అలికిడికి నిద్రలేచిన నాగమణి కేకలు వేస్తూ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో అతను ఆమె నిద్రిస్తున్నమంచంపైగల తలగడతో ముఖాన్ని గట్టిగా నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. దీనితో ఆమె ముఖంపై గాయాలయ్యాయి. ఆమె మెడలోనినానుతాడు, గొలుసు, చెవిదిద్దులు 4 కాసుల బంగారు ఆభరణాలతోపాటు రూ.4 వేల నగదు దొంగిలించి పరారయ్యాడు. ఆ తర్వాత ఆ ఇంటి పనిమనిషి రాగా నాగమణి విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి స్థానికులు, కుటుంబ సభ్యులకు తెలిపింది. సమాచారం అందుకున్న సీఐ ఎం.సుబ్బారావు, భీమడోలు, దెందులూరు ఎస్సైలు వీఎస్వీ భద్రరావు, ఐ.వీర్రాజు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్ వివరాలను కుటుంబ సభ్యులు, స్థానికుల నుంచి అడిగి తెలుసుకున్నారు. సీసీఎస్ డీఎస్పీ పైడేశ్వరరావు పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు సేకరించింది. డాగ్ స్క్యాడ్ టీమ్ హత్య అనంతరం పరారైన నిందితుడి మార్గాన్ని గుర్తించారు. ఏలూరు డీఎస్పీ మాట్లాడుతూ హత్య కేసు ఛేదించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎస్సై భద్రరావు మాట్లాడుతూ హత్యకు పాల్పడిన నిందితులు ఒకరా, ఇద్దరా అనేది తెలియాల్సి ఉందన్నారు. -
భార్యతో గొడవ.. కోపంతో కొడుకుని బయటకు తీసుకెళ్లి..
సాక్షి,మహబూబ్‌నగర్: మండలంలోని కుచినెర్లలో సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఓ చిన్నారి మృతి కేసును పోలీసులు ఛేదించారు. బాలుడికి కన్న తండ్రే పురుగుమందు తాగించి కాటికి పంపినట్లు నిర్ధారించారు. ఎస్ఐ కుర్మయ్య కథనం మేరకు.. నందిన్నెకు చెందిన కర్రెప్పతో కుచినెర్లకు చెందిన నర్సమ్మకు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి భరత్ (1) జన్మించాడు. భార్యాభర్తలు గొడవపడి ఏడాది కాలంగా నర్సమ్మ పుట్టింట్లో ఉంటోంది. సోమవారం కర్రెప్ప బాలుడు భరత్‌ను బలవంతంగా బయటకు తీసుకొచ్చి కాసేపటి తర్వాత తిరిగి వదిలిపెట్టి వెళ్లాడు. బాలుడి నోటి నుంచి నురుగ, వాసన రావడంతో గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే కర్ణాటకలోని రాయచూర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు గుర్తించారు. నర్సమ్మ ఫిర్యాదు మేరకు కర్రెప్పపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: వివాహేతర సంబంధం అంటూ కోడలిపై అసత్య ప్రచారం.. తట్టుకోలేక రాత్రి..