
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, గోల్కొండ(హైదారాబాద్): ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టోలిచౌకి ఆడమ్స్ కాలనీలోని నివసించే రైసా ఫాతిమా (41) హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తోంది. కొన్నేళ్ల ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి రైసా బేగం తన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఇంట్లోనే ఉంటోంది.
ఇదిలా ఉండగా తండ్రి కట్టెల వ్యాపారం, ఇతర ఆస్తుల విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా రైసా బేగంకు ఆమె తమ్ముడు ఆరిఫ్‌తో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన ఆరిఫ్ కత్తితో రైసా బేగంపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment