property issue
-
కూతురివేనా నువ్వు.. తల్లిని నిర్బంధించి కిరాతకంగా దాడి(వీడియో)
హిసార్: ఆస్తి కోసం కూతురు తన తల్లిని చిత్రహింసలకు గురిచేసిన హృదయవిదారక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రక్తం తాగుతాను అంటూ కన్న తల్లినే కూతురు హింసించింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. దీనిపై ఆమె కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. హర్యానాలోని హిసార్‌కు చెందిన రీటాకు రెండేళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని గ్రామానికి చెందిన సంజయ్ పునియాతో వివాహం జరిగింది. వీరికి వివాహం జరిగిన సమయంలో పునియాకు ఎలాంటి సంపాదన లేదు. దీంతో, రీటా.. తన తల్లి నిర్మలాదేవి ఇంటికి తిరిగి వచ్చేసింది. తల్లి ఇంట్లోనే ఉంటోంది. ఈ క్రమంలోనే ఆస్తి కోసం తన తల్లిని నిర్భందించి వేధించడం ప్రారంభించింది.రీటా.. ఇప్పటికే కురుక్షేత్రలో తమ కుటుంబానికి చెందిన పలు ఆస్తులను అమ్మేసి దాదాపు రూ.65 లక్షలు తన దగ్గర ఉంచుకుంది. ఇప్పుడు తల్లి నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని వేధింపులకు గురిచేస్తోంది. ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయమని తల్లిని ఇంత దారుణంగా హింసించింది. ఈ సందర్భంగా రీటా.. ఆస్తి ఇస్తావా లేదా? నీ రక్తం తాగుతా అంటూ జుట్టు లాగి కొడుతూ, నోటితో కొరుకుతూ నానా విధాలుగా హింసించింది. దీంతో, నిర్మలాదేవి రోదిస్తూ రెండు చేతులూ జోడించి వేడుకుంటోంది. ఈ వీడియోలో ఒక పురుషుడి మాటలు కూడా వినిపిస్తున్నాయి. కాగా, తన తల్లిపై దాడి విషయం తెలియడంతో ఆమె కుమారుడు అమర్దీప్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని తెలిపాడు. రీటాపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.A shocking incident of abuse has surfaced from Hisar, Haryana, where a viral video shows a daughter, Rita, physically assaulting her mother, Nirmala Devi, in a desperate attempt to gain control of family property. Police have now intervened, registering a case under the… pic.twitter.com/gpK7xPHHWv— Mojo Story (@themojostory) March 1, 2025 -
అమెరికా నుంచి వచ్చి.. తాతను చంపిన మనవడు
హైదరాబాద్: చిన్నప్పటి నుంచి తనను అందరిలా పెంచలేదని.. అందరిని చూసినట్లు తనను చూడలేదని తాతను కత్తితో పొడిచి చంపేశాడు ఓ మనవడు. అడ్డుకోబోయిన కన్నతల్లిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ మక్తాలో నివాసం ఉండే వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వ్యాపారవేత్త. ఇతను వెల్జాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్త్రీ చైర్మన్. ఆయనకు సరోజ అనే కూతురు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా.. సరోజ తండ్రి జనార్దన్ రావుతో కలిసి బీఎస్ మక్తాలో ఉంటోంది. సరోజ కొడుకు కిలారు కార్తి తేజ (29) అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తాత ఆస్తి కోసం నిత్యం గొడవ పడేవాడు. అందరినీ చూసినట్లు తనను చూడడంలేదని.. అందరిలా తనను పెంచలేదంటుండేవాడు. ఈ విషయంలో తాతతో విభేదించి కార్తితేజ ల్యాంకోహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి బీఎస్ మక్తాకు వచ్చి ఆర్థిక లావాదేవీల గురించి తల్లి, తాతతో గొడవకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ రావు కడుపులో పొడిచాడు. అడ్డుకున్న తల్లి సరోజను గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోపే కార్తి తేజ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అప్పటికే జనార్దన్ రావు మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపాలైన సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కార్తి తేజ కోసం గాలిస్తున్నారు. -
ఆస్తి కోసం మరిదిని చంపించిన వదిన..
బషీరాబాద్, వికారాబాద్ : మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు వస్తుందని హత్య చేయించింది ఓ వదిన. ఈ ఘటన వికారాబాద్ జిల్లా (Vikarabad District) బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో (Navalga Village) జరిగింది. పోలీసులు, హతుడి కుటుంబ సభ్యులు, తెలిపిన వివరాల ప్రకారం.. నవల్గాకు చెందిన మాల శ్యామప్ప (39) గ్రామ గేటు సమీపంలో హత్యకు గురయ్యాడు. మంగళవారం ఉదయం అటుగా వెళ్లిన వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు బషీరాబాద్ (Basheerabad) పోలీసులకు ఫిర్యాదు చేశారు. అడ్డు తొలగిస్తే.. ఆస్తి దక్కుతుందని.. నవల్గాకు చెందిన మాల మల్లమ్మకు మాల నర్సిములు, శ్యామప్ప (39), శ్యామమ్మ సంతానం. అయితే శ్యామప్ప భార్య నాలుగేళ్ల క్రితం భర్తను వదిలేసి కూతురును తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శ్యామప్ప తన చెల్లితో కలిసి ఉంటున్నాడు. అదే ఇంట్లోని రెండో భాగంలో అన్న నర్సిములు, వదిన సుగుణ నివసిస్తున్నారు. మరిదిని అంతమొందిస్తే ఇల్లు పూర్తిగా తమ సొంతం అవుతుందని భావించింది. ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొత్త విజయ్, విశ్వనాథ్, శివకుమార్‌లతో కలిసి వారం రోజుల క్రితం శ్యామప్ప హత్యకు పథకం వేసింది. అతన్ని చంపితే రూ.50 వేలు ఇస్తానని చెప్పి, శనివారం అడ్వాన్స్‌గా రూ.10 వేలు అందజేసింది. ఈ క్రమంలో సుపారీ తీసుకున్న ముగ్గురు శ్యామప్ప హత్యకు పక్కా ప్లాన్ వేశారు. సోమవారం సాయంత్రం బషీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గ్లౌజ్‌లు తీసుకున్నారు. మద్యం తాగేందుకని రాత్రి శ్యామప్పను తీసుకుని గ్రామ శివారులోని ఓ పొలంలోకి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత శ్యామప్ప తలపై రాళ్లతో కొట్టి హత్య చేశారు. దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పొలానికి ఆనుకుని ఉన్న బషీరాబాద్– తాండూరు ప్రధాన మార్గం వద్దకు ఈడ్చుకెళ్లి పడేశారు. హత్య సమాచారం అందుకున్న ఎస్ఐ శంకర్ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, రూరల్ సీఐ నగేష్ హత్య తీరును పరిశీలించారు.చదవండి: రాజ్ తరుణ్- లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్..హతుడి తల్లి మల్లమ్మ, సోదరి శ్యామమ్మను విచారించి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించాయి. అనుమానం వచ్చిన పోలీసులు వదిన సుగుణను ఠాణాకు తరలించి విచారించారు. హత్యకు సంబంధం ఉన్నట్లు గుర్తించిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించగా, వారు నేరాన్ని అంగీకరించినట్లు తెలిసింది. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు బుధవారం వెల్లడిస్తామని సీఐ మీడియాకు తెలిపారు. -
వాళ్ళను చూసి సంస్కారం నేర్చుకో: షర్మిలకు కౌంటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చంద్రబాబు, ఎల్లో మీడియా కుట్ర చేస్తున్నాయని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ ఆస్తిలో కొడుకు కన్నా కూతురుకి ఎక్కువగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్ ఆస్తిలో కూడా షర్మిల వాటా కోరడం సమంజసమేనా అని ప్రశ్నించారు. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా షర్మిల డైరెక్ట్‌గా ఉన్నారా అని నిలదీశారు.అందరి ఇళ్ళలో అక్క చెల్లెమ్మలు ఉన్నారని, వివాహ సమయంలో ఏదైతే ఆస్తులు ఉంటాయో అవి చెల్లెలికి ఇస్తారని తెలిపారు. వైఎస్సార్ ఆనాడు జగన్ కంటే షర్మిలకు ఎక్కువే ఇచ్చారని గుర్తు చేశారు. ఆన్న సంపాదించుకున్నాడని ఈర్ష పడి ఆమె జనంలోకి రావడం దారుణమన్నారు. బాలకృష్ణ ఇంట్లో గతంలో కాల్పులు జరిగాయని. అప్పుడు వైఎస్సార్ కక్షపూరితంగా వ్యవహరించలేదని పేర్కొన్నారు. ‘ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి. ఎవరి కుటుంబం వారిది. నీ వివాహం జరిగినప్పుడు నీకు ఆస్తులు ఇవ్వలేదా? వైఎస్సార్ సీఎం అయ్యాక కూడా నువ్వే పక్కనున్నావు. జగన్ ఎక్కడో బెంగుళూరులో ఉండేవాడు. ఆ రోజు నువ్వు వ్యాపారాలు చేసుకోవాలి అనుకుంటే ఆయన సాయం చేసేవారు. జగన్ బెంగుళూరులో ఉంటూ సాక్షి, భారతి సిమెంట్స్ పెట్టారు. ఆ తర్వాత ఆయన ఆస్తుల విలువ పెరిగి ఉండొచ్చు. నీకున్న ఆస్తుల్లో ఆయన వాటా అడిగాడా?చెల్లెల్ని పైకి తేవాలని జగన్ తాను కట్టుకున్న ఇంట్లో ఆమెకు భాగం ఇచ్చారు. నాకు సమానంగా రావాలి అంటోంది. జగన్ వ్యాపారాల్లో ఎక్కడైనా నువ్వు డైరెక్ట్‌గా ఉన్నావా? వైఎస్సార్ చనిపోయినా ఏ అవసరం లేకున్నా ప్రేమతో ఆయన దాన విక్రయం చేశారు. వైఎస్సార్ బతికుండగానే ఆస్తులు పంపకం జరిగింది. పులివెందుల, ఇడుపులపాయ భూములు ఆమెకు ఇచ్చారు.జగన్ చేసిన MOUలో క్లియర్‌గా కేసులు తేలిన తర్వాత బదిలీ చేస్తామని చెప్పారు. ఇది తప్పు, మీరు అలా బదిలీ చేసుకోకూడదని జగన్ చెప్పారు. అయినా ఆమె పెడ చెవిన పెట్టారు. విధిలేని పరిస్థితిలో ఆయన నోటీసు ఇచ్చారు. మీ చర్యల వల్ల రేపు ఆయన ఇబ్బందీ పడకూడదని ఆ నోటీసు ఇచ్చారు. వాస్తవాలు ఇలా ఉంటే పచ్చ పత్రికలు వక్రీకరిస్తున్నారు.. కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కై జగన్‌పై కేసులు పెట్టారు. గతంలో చంద్రబాబు కుట్రల వల్లే జగన్ జైలుకు వెళ్లారు. ఆయన్ను18 నెలలు జైలో పెట్టించింది మీరు కాదా..? వారికి అంత మేలు చేసిన వ్యక్తి కుమారుడిపై అవినీతి కేసులు పెట్టింది మీరు కాదా? మీరు 53 రోజులు లోపలికి వెళితే ప్రపంచం అల్లకల్లోలం అయినట్లు మాట్లాడారు. షర్మిల వ్యాపారాలు సరిగ్గా చేసుకోకపోతే జగన్ బాధ్యుడా? తెలంగాణలో పార్టీ పెట్టి డబ్బులు పోగోట్టుకుంటే జగన్ బాధ్యుడా? తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇంతక ముందు నేను చంద్రబాబుతో సన్నిహితంగా ఉన్నా. ఏ రోజూ వారి తల్లి, చెల్లిని నేను వారింట్లో చూడలేదు. ఈ రోజు దాన విక్రయం ఇచ్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసే అర్హత మీకుందా? ఆయన సంపాదించుకున్న ఆస్తిలో ప్రేమతో వాటా ఇచ్చిన వ్యక్తిపై ఎలా ఆరోపణలు చేస్తారు? షర్మిలకు నా విన్నపం. నువ్వు చేసే పనిని మరోసారి ఆలోచించుకో. చంద్రబాబు అక్క చెల్లెలకు ఈ రోజు ఒక్క రూపాయి ఇవ్వకపోయినా వాళ్ళు రోడ్డు మీదకు రాలేదే. వాళ్ళని చూసి సంస్కారం నేర్చుకో?ఏడాది నుంచి చూస్తున్నా. అన్నను ఇబ్బందీ పెట్టాలని చూస్తున్నావు. ఆమెనే నాకు 200 కోట్లు ఇచ్చారని చెప్తుంది. అది మీ నాన్న సంపాదించింది కాదు. ఇబ్బందిలో ఉంటే అడగడంలో తప్పు లేదు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చడం ఏమిటి? చంద్రబాబు ముందు హామీలు అమలు చెయ్. అది వదిలేసి ఇలాంటి నీచ సంస్కృతికి దిగుతున్నావు. జగన్ పాపులారిటీ తట్టుకోలేక, ప్రజలకు ఏమీ చేయలేక ఇలాంటి నీచానికి దిగుతున్నావు.’ అని మండిపడ్డారు. -
కుట్ర, అవకాశవాదం ఒకవైపు.. ఇచ్చిన మాటకోసం నిలబడే నిజం మరోవైపు..
-
పెద్ద కుట్రలో పావుగా షర్మిల..?
-
జగన్ ను రాజకీయంగా దెబ్బతీయడానికే కుట్ర..?
-
జగన్ NCLTని ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది..?
-
Big Question: చెల్లెమ్మ దాచిన నిజం..! షర్మిలమ్మా.. సమాధానం చెప్పు..
-
ఆస్తి కోసం ముగ్గురి దారుణహత్య
గుంటూరు: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో చిన్నమ్మ, ఆమె ఇద్దరు పిల్లలను నరికి చంపిన ఘటన సంచలనం రేకెత్తించింది. సత్తెనపల్లి మండలం ధూళ్లిపాళ్లలో షేక్ రహీమూన్ (65), ఆమె కుమార్తె షేక్ మాలింబి (36), సత్తెనపల్లి పట్టణంలో ఆమె కుమారుడు షేక్రహిమాన్ (33) దారుణహత్యకు గురయ్యారు. పూర్తి వివరాలు.. సత్తెనపల్లి మండలం ధూళ్ళిపాళ్లకు చెందిన షేక్ ఖాశీంకు పెద్దమీరాసాహెబ్, చినమీరాసాహెబ్ కుమారులు. ఆయన మరణానంతరం ఇద్దరు కొడుకులకు చెరో రెండెకరాల పొలం వచ్చింది. ఈ క్రమంలో పెదమీరాసాహెబ్కు ముగ్గురు కుమార్తెలు, ఇరువురు కుమారులున్నారు. పెద్ద కుమారుడు ఖాశిం, ఆయన కుమారుడు జాకీర్ వీరి వాటాగా వచ్చిన పొలం మొత్తం అప్పుల కారణంగా అమ్ముకున్నారు. వీరి కుటుంబం సత్తెనపల్లిలో నివాసం ఉంటుంది. చినమీరాసాహెబ్కు భార్య రహీమూన్ (65)తో పాటు ఒక కుమార్తె, ఇరువురు కుమారులు. చినమీరాసాహెబ్ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో రహీమూన్ తన ముగ్గురు బిడ్డలతో ధూళ్లిపాళ్లలోనే నివశిస్తుంది. వీరిలో పెద్ద కుమారుడు జబ్బార్ 2021లో కరోనా సెకండ్ వేవ్ సమయంలో మృతి చెందాడు. కుమార్తె షేక్ మాలింబీ (36) ఇంటివద్దే ఉంటుండగా, మరో కుమారుడు షేక్ రహిమాన్ (33) సత్తెనపల్లిలోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వీరందరినీ హతమారిస్తే రెండెకరాల ఆస్తి తనకే వస్తుందని ఆలోచించిన పెదమీరాసాహెబ్ పెద్ద కుమారుడు ఖాశీం బుధవారం తన కుమారుడు జాకీర్‌తో కలిసి ధూళ్లిపాళ్ల వెళ్లాడు. అక్కడ చిన్నమ్మ రహీమూన్, సోదరి మాలింబీని ఇంట్లోనే అతి కిరాతకంగా నరికాడు. రహీమూన్ అక్కడికక్కడే మృత్యువాత పడగా, మాలింబీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అనంతరం పిడుగురాళ్ల రోడ్డులోని ఎస్వీఆర్ దాభా హోటల్ వెనుక ప్రాంతంలో రహిమాన్‌ను పట్టుకుని హతమార్చారు. సత్తెనపల్లి డీఎస్పీ బి.ఆదినారాయణ, రూరల్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ ఆవుల బాలకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ఖాశింను పోలీసులు అదుపులోకి తీసుకోగా జాకీర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. -
పెద్ద కొడుకంటే గిట్లుండాలే! తూ..! మీ బతుకు చెడ
దోమకొండ (కామారెడ్డి): ఆస్తి పంపకం విషయంలో తల్లిని బయటకు గెంటేసి ఇంటికి తాళం వేసిన ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంఘమేశ్వర్‌లో మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన బైకరి లచ్చవ్వకు కుమారులు పెద్ద నర్సయ్య, చిన్న నర్సయ్య ఉన్నారు. ఇద్దరు కొడుకులకు వేర్వేరు ఇళ్లు ఉండగా.. మరో పాత ఇంట్లో లచ్చవ్వ ఉంటోంది. తల్లి ఉంటున్న ఇల్లు విషయంలో అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి. దీంతో పెద్ద కుమారుడు పెద్ద నర్సయ్య, అతడి భార్య రేణుక, వారి కుమారులు.. లచ్చవ్వ ఇంటికి వచ్చి దాడి చేశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చిన్న నర్సయ్యనూ కొట్టారు. తల్లి లచ్చవ్వను ఇంటి బయటకు గెంటేసి ఇంటికి తాళం వేశారు. చిన్న నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దోమకొండ ఎస్సై సుధాకర్ తెలిపారు. తల్లిని ఇంట్లో నుంచి బయటకు గెంటేసి తాళం వేయడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూ..! మీ బతుకు చెడ అంటూ తిట్టిపోశారు. (మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం) -
కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు
వెల్గటూర్(ధర్మపురి): కొడుకు వేధింపులకు విసిగి వేసారిన ఓ దంపతులు అతడిని కొట్టి చంపారు. జగి త్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకార.. రాంనూర్‌కు చెందిన కొదురుపాక భూమయ్య–రాజమ్మ దంపతులు. వీరికి మహేశ్ (35)అనే ఒక కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉన్నారు. భూమయ్య సింగరేణి సంస్థలో కార్మికుడిగా పనిచేస్తూ గోదావరిఖనిలో నివాసం ఉండేవాడు. ఉద్యోగ విరమణ చేశాక స్వగ్రామం రాంనూర్ వచ్చి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల విషయంలో తల్లిదండ్రులు, భార్యతో మహేశ్ గొడవపడుతున్నాడు. ఈనెల 20న తనకు రూ.200 కావాలని తండ్రి భూమయ్యను మహేశ్ అడిగాడు. అయితే భూమయ్య ఇవ్వకపోవడంతో గొడవకు దారితీసింది. గొడవ పెద్దది కా వడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కౌలు దారు శేఖర్‌తో కలసి మహేశ్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడి లో అతని కాళ్లు, చేతులు విరిగి తీవ్రరక్తస్రావమైంది. తొ లుత జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. -
ఆస్తి తన పేరుమీద రాయలేదని భర్త చెవికొరికిన భార్య
ముంబై: భర్త పేరు మీద ఉన్న భూమిని తనపేరిట రాయలేదన్న కోపంతో భర్త చెంప కొరికింది ఓ భార్య. కోన్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాలూకాలోని ఠాక్రాచపాడ గ్రామంలోని ఆటస్థలం ప్రక్కనున్న శంకరుని మందిర పరిసర ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మారుతీ ఠాకూర్ (67) తన పూర్వీకుల స్థలాన్ని భార్య సునంద పేరు మీద రాయాల్సిందిగా పట్టుబట్టింది. అయితే ఆ స్థలం తన తల్లి, సోదరుడి పేరుతో ఉందని, పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని భర్త చెప్పడంతో కోపంతో రగిలిపోయిన సునంద తన భర్తను వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలో కుమారుడు స్వప్నిల్, సునంద కలసి భర్త చెంప, వేళ్లను గట్టిగా కొరికేయడంతో ప్రకాశ్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డాడు. సునంద, స్వప్నిల్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా..ఐపీసీ 324, 506, 504,34 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. -
పిల్లల కోసం ఓ తల్లి పోరాటం.. కుటుంబ సభ్యులు ప్లాన్ చేసి..
సాక్షి,టెక్కలి(శ్రీకాకుళం): భర్త సరిగా చూడడం లేదు.. న్యాయం చేయండి.. అంటూ ఏడాదిన్నరగా పోలీసుల చుట్టూ తిరిగిన ఆ తల్లి అలసిపోయింది. తన పిల్లలకు హక్కుగా ఉన్న ఆస్తిని విక్రయించబోతుంటే ఏకంగా కన్నబిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమైపోయింది. టెక్కలిలోని కచేరి వీధికి చెందిన ఉర్లాపు సంగీత అనే వివా హిత తన ఇద్దరు పిల్లలు మృదుల, తేజలతో కలిసి పురుగు మందు డబ్బా చేతబట్టుకుని బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. పూర్తి వివరాల్లోకి వెళితే... స్థానిక కచేరి వీధికి చెందిన ఉర్లాపు సూర్యకుమార్, టెక్కలి మండలం గంగాధరపేట గ్రామానికి చెందిన సంగీతకు 2011లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం పదేళ్ల కుమార్తె, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. కొంతకాలం కిందట భార్యాభర్తలు హైదరాబాద్‌లో పనులు చేసుకుంటూ ఉండేవారు. రెండేళ్ల కిందట ఇద్దరికీ మనస్ఫర్థలు రావడంతో సంగీత తన భర్త సూర్యకుమార్‌పై కోర్టులో కేసు వేశారు. ఉమ్మడి ఆస్తిగా ఉన్న ఇల్లు, స్థలంపై తనకు, తన పిల్లల కు హక్కు కల్పించాలని కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ స్థలం వివాదం కోర్టు పరిధిలో ఉండగా.. తన భర్త సూర్యకుమార్ పాటు అత్త ఉర్లాపు చిన్నమ్మడు, ఆడపడుచు లక్ష్మి, బావ రమేష్‌లు కలిసి రెవెన్యూ అధికారుల ద్వారా తన పేరును హక్కుదారుగా తప్పించారని, 2021 అక్టోబర్ 29వ తేదీన రెవెన్యూ అధికారు ల ద్వారా లీగల్ హైర్ చేయించి ఇంటి స్థలాన్ని పట్టణానికి చెందిన మోణింగి శ్రీనివాసరావు అనే వ్యక్తికి తనకు తెలియకుండా విక్రయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టులో ఉన్న స్థలానికి రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారని, రిజిస్ట్రేషన్ ఎలా చేశారని బాధితురాలు వాపోయారు. తనకు న్యాయం చేయాలని టెక్కలి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా స్పందించలేదని, బుధవారం మధ్యాహ్నం తాను లేని సమయంలో స్థలం కొనుకున్న వ్యక్తి జేసీబీ సాయంతో ఇంటిని కూలదోసి స్థలాన్ని చదును చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. తమను చంపేందుకు తన భర్త గొడ్డలి పట్టుకుని తిరిగా డని ఆమె భయాందోళన వ్యక్తం చేశారు. పిల్లలతో సహా తాను రోడ్డున పడ్డానని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక డీసీసీబీ బ్యాంకు ఎదురుగా ఉన్న స్థలం వద్ద బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ 2 గోపాలరావు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకోగా పోలీసుల తీరును తప్పుపడుతూ బాధితురాలు మరోసారి కన్నీరుమున్నీరయ్యారు. ఆత్మహత్యాయత్నం చేస్తున్న బాధితురాలికి పోలీసులు సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినలేదు. తనకు న్యాయం చేసేవరకు ఇక్కడే తన పిల్లలలో నిరసన కొనసాగిస్తానంటూ ఆమె స్థలంలోనే బైఠాయించారు. -
నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు
ప్రముఖ నటుడు ప్రభు తమని మోసం చేశాడంటూ ఆయన తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండ మోసం చేశారని ఆరోపిస్తూ ప్రభు, ఆయన సోదరుడు రామ్‌కుమార్‌లపై వారిద్దరి సోదరిమణులు శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా నటుడు ప్రభు, నిర్మాత రామ్‌కుమార్‌లు దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుమారులనే సంగతి తెలిసిందే. వీరితో పాటు ఆయనకు శాంతి, రజ్వీ కూమార్తెలు కూడా ఉన్నారు. అయితే శివాజి గణేశన్ చనిపోయిన 20 ఏళ్లకు ఆయన కుటుంబంలో ఆస్తి వివాదం నెలకొంది. దీంతో ఇది కాస్తా కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వకుండా తమ సోదరులైన ప్రభు, రామ్‌కుమార్‌లు మోసం చేశారని ఆరోపిస్తూ శాంతి, రజ్వీలు మద్రాస్ హైకోర్టులో పటిషన్ దాఖలు చేశారు. తండ్రి మరణం తర్వాత 271 కోట్ల రూపాయల ఆస్తిని సరిగ పంచలేదని, తమని మోసం చేసి పూర్తి ఆస్తిని తమ సోదరులిద్దరే కాజేశారని వారు పటిషన్లో పేర్కొన్నారు. అంతేకాదు తమకు తెలియకుండ ఆస్తులను కూడా విక్రయించారని, ఆ ప్రక్రియ చెల్లదని ప్రకటించాలని వారు కోర్టును కోరారు. అదే విధంగా వెయ్యి తులాల బంగారు నగలు, 500 కిలోల వెండి వస్తువులను ప్రభు , రామ్ కుమార్ అపహరించడమే కాకుండా శాంతి థీయేటర్లో ఉన్న రూ. 82 కోట్ల విలువైన వాటాను రహస్యంగా వారిద్దరి పేరిట మార్చుకున్నట్లు వారు ఆరోపించారు. తమ తండ్రి రాసినట్లు చెబుతున్న వీలునామా నకిలీదని.. జనరల్ పవర్ ఆఫ్ ఆటార్నీపై సంతకం తీసుకుని తమని మోసం చేశారని వారు తెలిపారు. ఈ కేసులో నటుడు ప్రభు, నిర్మాత రామ్కుమార్ల పేర్లను మాత్రమ కాకుండా వారి కుమారులైన విక్రమ్ ప్రభు, దష్యంత్‌లను కూడా ప్రతివాదులుగా చేర్చి పిటిషన్లో వారి పేర్లను పేర్కొన్నారు. చదవండి: తంతడి బీచ్‌లో నాగచైతన్య సందడి నటి సాయి పల్లవికి హైకోర్టులో ఎదురుదెబ్బ -
సొంత అక్కను చంపిన తమ్ముడు.. కారణం ఏంటంటే..
సాక్షి, గోల్కొండ(హైదారాబాద్): ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత అక్కను దారుణంగా హత్య చేసిన సంఘటన గురువారం గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టోలిచౌకి ఆడమ్స్ కాలనీలోని నివసించే రైసా ఫాతిమా (41) హైకోర్టు న్యాయవాదిగా పని చేస్తోంది. కొన్నేళ్ల ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అప్పటి నుంచి రైసా బేగం తన ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఇంట్లోనే ఉంటోంది. ఇదిలా ఉండగా తండ్రి కట్టెల వ్యాపారం, ఇతర ఆస్తుల విషయమై కుటుంబసభ్యుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా రైసా బేగంకు ఆమె తమ్ముడు ఆరిఫ్‌తో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన ఆరిఫ్ కత్తితో రైసా బేగంపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్‌ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్‌ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్‌ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్‌పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్‌లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్‌పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్‌కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్‌కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్‌పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
నా ఆస్తిని అక్రమంగా పట్టా చేసుకున్నారు.. దీంతో మహిళ!
దామరగద్ద (మహబూబ్‌నగర్) : తమకు దక్కాల్సిన ఆస్తిని తమకు తెలియకుండా బంధువు పట్టాచేయించుకోవడంతో మనస్తాపం చెందిన ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన మండలంలోని లింగారెడ్డిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈ గ్రామానికి చెందిన ఆశప్పకు నలుగురు కూతుళ్లు.. అందులో పెద్దకూతురు హన్మమ్మ కాగా, మరో కూతురు మాణిక్యమ్మ. అప్పట్లో పెద్దకూతురు హన్మమ్మను హన్మంతుకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం ఆశప్ప మృతి చెందడంతో ఆస్తిని నలుగురు అక్కా చెల్లెళ్లకు తెలియకుండా హన్మంతు పట్టా చేయించుకున్నాడు. విషయం తెలిసిన హన్మంతు భార్య హన్మమ్మ.. రెండు రోజుల క్రితం భర్తతో వాగ్వాదానికి దిగింది. తమ చెల్లెళ్లకు దక్కాల్సిన ఆస్తిని వారికే ఇవ్వాలని అడగడంతో ఆమెపై భర్త దాడి చేశాడు. కాగా, నలుగురు కూతుళ్లలో ఒకరైన మాణిక్యమ్మకు సైతం కూతురు గోవిందమ్మ ఉంది. ప్రస్తుతం ఈమె ఆందోళనకు దిగింది. తన తల్లికి చెందిన భూమిని వరుసకు పెద్దనాన్న అయిన హన్మంతు బెదిరించి పట్టా చేయించుకున్నాడని, ఇటీవల ఆయన సొంత అల్లుడు నర్సింహులు పేరున పట్టా మార్పిడి చేయించాడని వాపోయింది. మనస్థాపం చెందిన గోవిందమ్మ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోవడం లేదని, తమకు న్యాయం చేయడం లేదని బాధితురాలు వాపోయింది. -
మరోసారి రచ్చకెక్కిన దాసరి ఆస్తి వివాదం
-
వాహనంతో ఢీకొట్టి తండ్రిని హతమార్చాడు
తుర్కపల్లి(ఆలేరు) : మానవత్వం మంటగలుస్తోంది. ఆస్తుల కోసం రక్తసంబంధాలు కూడా బలైపోతున్నాయి. ఇటీవల చౌటుప్పల్ సమీపంలో ఆస్తి కోసం కుమారుడిని హత్య చేయించిన మారు తల్లి ఘటనను మరవకముందే యాదాద్రిభువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్ సమీపంలో ఓ ఘోరం జరిగింది. ఆస్తికోసం కన్నతండ్రినే టాటా సుమో వాహనంతో ఢీకొట్టి దారుణంగా చంపేశాడు. నిందితుడు పోలీసుల ఎదుటలొంగిపోయాడు. ఇతను నాలుగేళ్ల క్రితం అన్ననూ చంపాడు. తుర్కపల్లి మండలం గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని మర్రికుంటతండాకు చెందిన ధరావత్ జాలం(68) అనే వ్యక్తికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య సుగుణకు ఇద్దరు కుమారులు, చిన్నభార్య లక్ష్మికి ఓ కొడుకు నరేందర్‌నాయక్ ఉన్నాడు. జాలానికి తండాలో 15 ఎకరాల భూమి ఉండగా అందులో మూడెకరాలు విక్రయించాడు. మిగిలిన భూమిని పెద్ద కొడుకు భిక్షపతి భార్య పేరుమీద కొంత, మరికొంత భూమిని భార్య సుగుణ పేరు మీద రిజిస్టర్ చేశాడు. చిన్న భార్య లక్ష్మి, అతని కుమారుడు నరేందర్‌నాయక్‌కి ఆస్తి ఇవ్వలేదు. దీంతో లక్ష్మి తనకుమారుడితో కలిసి తన తల్లిగారి ఊరైన జనగామ జిల్లా నర్మెట మండలం మలక్‌పేటతండాలో ఉంటూ జీవనం సాగిస్తోంది. ఆస్తిలో వాటా ఇవ్వడం లేదని తండ్రి జాలం, మొదటి భార్య కొడుకుల మీద నరేందర్‌నాయక్ కసిపెంచుకున్నాడు. కాగా, నరేందర్‌నాయక్ తండ్రి జాలం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదని ఆస్తిలో భాగం ఇవ్వలేదని తెలుస్తోంది. నాలుగేళ్ల క్రితం అన్న హత్య పెద్దభార్య కుమారుడు ధారవత్ నర్సింహనాయక్ తనకు ఆస్తి రాకుండా అడ్డు పడుతున్నాడని నరేందర్‌నాయక్, అతని బావమరిదితో కలిసి నాలుగేళ్ల క్రితం గొల్లగూడెం గ్రామశివారులో కత్తులతో దాడి చేసి చంపేశాడు. పక్కాప్లాన్ ప్రకారం.. నాలుగేళ్ల క్రితం అన్నను హత్య చేసిన నేరంలో భువనగిరి కోర్టు పేషీకి నరేందర్‌నాయక్ వచ్చి పోతున్నాడు. మంగళవారం కోర్టుకు వచ్చి తిరిగి వెళ్లిపోయాడు. తన లాయర్‌ను కలవడానికి బుధవారం కూడా కోర్టుకు వచ్చాడు. ఈ క్రమంలో మర్రికుంటతండా నుంచి భువనగిరి ఏరియా ఆస్పత్రికి జాలం పెద్దకొడుకు భిక్షపతితో కలిసి వేర్వేరు బండ్ల మీద భువనగిరికి వచ్చారు. నరేందర్‌నాయక్ తండ్రి జాలంను చూసి వెంబడించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. జాలం ఆస్పత్రినుంచి తిరిగి తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై ఇంటికి వెళ్తుండగా రుస్తాపూర్ సమీపంలోకి రాగానే వెనకనుంచి టాటా సుమో వాహనంతో బలంగా ఢీకొట్టడంతో జాలం రోడ్డుపైన పడిపోయాడు. తిరిగి చనిపోయాడో లేదో అని మళ్లీ టాటా సుమోను వెనక్కి మలిపి ఢీకొట్టినట్లు బంధువులు పేర్కొంటున్నారు. జాలం చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత టాటా సుమోతో సహా తుర్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. సంఘటన స్థలాన్ని ఏసీపీ శ్రీనివాసాచార్యులు, గుట్ట సీఐ ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ ఆశోక్‌కుమార్, ఎస్ఐ వెంకటేశం హెడ్‌కానిస్టేబుల్స్ నర్సింహనాయుడు, వెంకటేశ్వర్లు సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిని చంపిన కొడుకు
-
పుణ్యం కోసం ఆశపడి మోసపోయింది
-
కాపు కాసి మారణాయుధాలతో..
* కోర్టు వాయిదాకు వెళుతుండగా దాడి * వ్యక్తి మృతి * నలుగురికి తీవ్ర గాయాలు * పరారీలో నిందితులు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కారల్‌మార్క్స్ ఏనాడో చెప్పాడు. కొందరు మనుషుల మధ్య మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య సంబంధాలు కేవలం ఆర్థికపరమైన అంశాలతోనే ముడిపడి ఉంటున్నాయి. అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులూ బిడ్డల మధ్య నెలకొన్న ఆర్థిక వివాదాల కేసులు ఇటీవల ఎక్కువగా బహిర్గతమవుతున్నాయి. రక్తసంబంధీకులు సైతం ఆస్తుల కోసం పంతాలకు పోయి అంతం చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం తెనాలిలో జరిగిన హత్య తీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. తెనాలి రూరల్: కోర్టుకు వెళుతున్నవారిపై దుండగులు కాపు కాసి మారణాయుధాలతో దాడిచేసి ఒకరిని హతమార్చిన ఘటన బుధవారం మండలంలోని నేలపాడు సమీపంలో జరిగింది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్తి తగాదాలే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం కొల్లిపర మండలం తూములూరు గ్రామానికి చెందిన ఆళ్ల సీతమ్మకు 16 ఎకరాల పొలం ఉంది. ఇందులో ఆరెకరాలు తన ఏకైక కుమారుడు శ్రీకాంత్‌రెడ్డికి, మిగిలిన తొమ్మిది ఎకరాల్లో మూడెకరాల చొప్పున ముగ్గురు కుమార్తెలకు రాసింది. పెద్ద కుమార్తె శ్రీలక్ష్మిని తన తమ్ముడైన పగడాల బలరామిరెడ్డి(40)కి ఇచ్చి వివాహం చేసింది. నాలుగేళ్ల క్రితం శ్రీకాంత్‌రెడ్డి అనుమానాస్పద స్థితిలో రేపల్లె బ్యాంక్ కెనాల్లో పడి వృతి చెందాడు. అతని పేరిట రాసిన ఆరెకరాల పొలానికి సంబంధించి వివాదం జరుగుతోంది. దీనికి సంబంధించి సీతమ్మ, రెండో అల్లుడు, వల్లభాపురంలో నివసించే వంగా సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో తమ పొలంలోకి అక్రమంగా ప్రవేశించారని, దాడి చేశారంటూ 2013లో పరస్పరం పోలీసు కేసులు పెట్టుకున్నారు. కోర్టు వాయిదాకు వెళ్తుండగా.. ఈ కేసులకు సంబంధించి తెనాలి కోర్టులో బుధవారం వాయిదా ఉంది. దీనికి సీతమ్మ, ఆమె కుమార్తె శ్రీలక్ష్మి, అల్లుడు బలరామిరెడ్డి, కేసులో సాక్షి అయిన దేవయ్యను తీసుకుని తూములూరుకే చెందిన నాని ఆటోలో కోర్టుకు బయలుదేరారు. కొల్లిపర మండలం చివలూరు, తెనాలి మండలం నేలపాడు గ్రామాల మధ్యకు రాగానే అప్పటికే మాటు వేసి ఉన్న దుండగులు వీరి ఆటోను కారుతో అటకాయించారు. దీంతో ఆటో, కారు రోడ్డు పక్కన ఉన్న పంట కాల్వలోకి దూసుకెళ్లాయి. ఆటో బోల్తాపడి అందులోని వారు గాయపడ్డారు. కారులో నుంచి దిగిన ఐదుగురు వీరిని బయటకు లాగి ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి కారును వదిలేసి పరారయ్యారు. ఈ ఘటనలో బలరామిరెడ్డి అక్కడికక్కడే వృతి చెందాడు. సీతమ్మ, దేవయ్య, నాని తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలక్ష్మికి స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఒక వేట కొడవలి, కర్ర, మద్యం సీసా ఉన్నాయి. విషయం తెలుసుకున్న సీఐలు యు.రవిచంద్ర, బి.కళ్యాణ్‌రాజు, బి.శ్రీనివాసరావు, తెనాలి తాలూకా ఎస్ఐ ప్రభాకరరావు, కొల్లిపర ఎస్ఐ అనిల్‌కుమార్‌రెడ్డి, దుగ్గిరాల ఎస్ఐ మన్నెం మురళి తమ సిబ్బందితో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురిని 108లో తెనాలి జిల్లా వైద్యశాలకు తరలించారు. దేవయ్య, నాని పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు సమగ్ర వైద్యశాలకు పంపారు. -
ఆ ఘటనతో నాకెలాంటి సంబంధం లేదు
-
కేసముద్రంలో వృద్ధ దంపతుల హత్య
వరంగల్: వృద్ధ దంపతులు హత్యకు గురైన ఘటన వరంగల్ జిల్లాలోని కేసముద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఆస్తి కోసం మొదటి భార్య కుమారుడే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియరాలేదు.