
ప్రతీకాత్మక చిత్రం
ముంబై: భర్త పేరు మీద ఉన్న భూమిని తనపేరిట రాయలేదన్న కోపంతో భర్త చెంప కొరికింది ఓ భార్య. కోన్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాలూకాలోని ఠాక్రాచపాడ గ్రామంలోని ఆటస్థలం ప్రక్కనున్న శంకరుని మందిర పరిసర ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మారుతీ ఠాకూర్ (67) తన పూర్వీకుల స్థలాన్ని భార్య సునంద పేరు మీద రాయాల్సిందిగా పట్టుబట్టింది.
అయితే ఆ స్థలం తన తల్లి, సోదరుడి పేరుతో ఉందని, పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని భర్త చెప్పడంతో కోపంతో రగిలిపోయిన సునంద తన భర్తను వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలో కుమారుడు స్వప్నిల్, సునంద కలసి భర్త చెంప, వేళ్లను గట్టిగా కొరికేయడంతో ప్రకాశ్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డాడు. సునంద, స్వప్నిల్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా..ఐపీసీ 324, 506, 504,34 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
చదవండి: విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా..
Comments
Please login to add a commentAdd a comment