biting
-
ఎంతపనైపాయే! పొరపాటున నాలుక కరుచుకుంది..అంతే ఊపిరాడక..
మాట్లాడుతూ లేదా భోజనం చేస్తూ నాలుక కరుచుకోవడం అనేది సర్వసాధారణం. కరచుకున్న వెంటనే బాధగా ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి లేదా మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంత సీరియస్ అయిన ఘటనలు ఇంతవరకు జరగలేదు కూడా. కానీ ఇక్కడొక మహిళకు ఎదురైన విపత్కర స్థితిని చూస్తే మాత్రం వామ్మో!నాలిక కరచుకుంటే ఇంతలా జరుగుతుందా? అని ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ మహిళ భోజనం చేస్తూనే అనుకోకుండా నాలిక కరుచుకుంది. అదే ఏకంగా ఆమె ప్రాణాలను కోల్పోయే స్థితికి దారితీసింది. ఈ అనుహ్య ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..27 ఏళ్ల ఆస్ట్రేలియన్ మహిళ కైట్లిన్ అల్సోప్ తన స్నేహితులతో కలిసి భోజనం చేస్తుండగా నాలుక కరుచుకుంది. ఆ టైంలో ఆమెకు కాస్త నొప్పిగా అసౌకర్యంగా అనిపించింది. సర్వసాధారణంగా జరిగేదే కదా అని తేలిగ్గా తీసుకుంది. అంతే కొన్ని గంటలకే ఊపిరి ఆడటం, శ్వాస తీసుకోవటం కష్టమై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా స్నేహితులంతా ఆమె పరిస్థితిని చూసి కంగుతిన్నారు. వెంటనే ఆమెను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ కేసు అంటూ టెస్ట్‌లు చేయడం ప్రారంభించారు వైద్యులు. ఆమె ఒక విధమైన అనాఫిలాక్సిస్ అనే ఎలర్జీకి గురయ్యిందని చెప్పారు. తక్షణమే కొన్ని మందులు ఇచ్చి పరిస్థితి నార్మల్‌కి వచ్చేలా యత్నించారు వైద్యులు. ఐతే అనూహ్యంగా ఆమె పరిస్థితి విషమంగా మారడం ప్రారంభమైంది. చూస్తుండగానే చర్మం ఎరుపు నుంచి నీలం రంగులోకి వచ్చేసింది. ఆమె నాలుకు నల్లగా అయిపోవడం జరిగింది. ఇక ఆమె నాలుకను తీసేయాల్సి వస్తుందని భావించి వెంటనే అప్రమత్తమయ్యి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. చివరికి ఆమె అరుదైన లుడ్విగ్స్ ఆంజినా అనే ప్రాణాంతక ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది నోరు, మెడ వరుకు ఉన్న మృదుకణజాలంపై ప్రభావం చూపే ప్రాణాంతక సెల్యూటైటిస్గా పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఆమె నోటిలో ఉండే జ్ఞాన దంతాల కారణంగా వచ్చిందని, ఇది ఆమె నోటిలోకి వేగంగా వ్యాపించడం ప్రారంభించిందని అన్నారు. ఇదికాస్త సెప్సిస్‌కి గురయ్యి అవయవాన్ని తీసేయాల్సిన ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు వైద్యలు. తక్షణమే చికిత్స అందించేందుకు ఆమెకు మత్తు ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం ప్రారంభించారు. ఆక్సిజన్ సరఫరా తక్కువగా ఉన్నందున్న ఇతర అవయవాలు మూసుకుపోకుండా చూసుకోవాల్సి ఉందని ఇది చాలా క్రిటికల్ ఆపరేషన్ అని చెప్పారు. సూమారు గంటపాటు వైద్యలు శ్రమించి కొద్దిపాటి శస్త్ర చికిత్స చేశారు. ఇప్పుడిప్పుడే క్లైటిన్ కోలుకుంటోంది. లుడ్విగ్ ఆంజినా అంటే.. ఇటీవల జరిగిన గాయం ఇన్ఫెక్షన్కి గురయ్యినా లేదా మధుమేహం, మద్యపానం, పోషకాహారలోపం తదితరాల కారణంగా గాయలైతే అది లుడ్విగ్ ఆంజినా అనే ఎలర్జీకి గురయ్యి రోగి పరిస్థితిని దిగజారస్తుంది. ఇది సాధారణంగా దంతాల ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందట. దాదాపు 10 నుంచి 9 కేసుల్లో దవడలోని రెండవ లేదా మూడవ దంతాల నుంచి మొదలవుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని లక్షణాలు మాట్లాడటం కష్టం అధిక జ్వరం, చలి దవడలో నొప్పి మెడ నొప్పి వాపు వాచిపోయిన నాలుక నోరు సున్నితత్వం మారడం తీవ్రమైన పంటి నొప్పి నివారణ: లుడ్విగ్ ఆంజినాను నివారించాలంటే నోటి పరిశుభ్రత పాటించాలని చెబుతున్నారు వైద్యులు. దంతాలు పుచ్చిపోకుండా చూసుకోవాలని చెప్పారు. దంతాల ఇన్ఫెక్షన్ కారణంగానే వస్తుందని అన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది దంతాలు ఇన్ఫెక్ట్ కాకుండా ఉండేలా చేస్తుందని కూడా చెప్పొచ్చు అంటున్నారు వైద్యులు. (చదవండి: ఆ వ్యాధి క్యాన్సర్ కంటే ప్రాణాంతకం! చికిత్స కూడా లేదు!) -
సహోద్యోగి చెవి కొరికిన ప్రవాస భారతీయునికి జైలు శిక్ష
సహోద్యోగి చెవి కొరికినందుకు సింగపూర్‌లో ప్రవాస భారతీయునికి ఐదు నెలల జైలు శిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మోహన్ శంకర్, తమిళనాడు నుంచి వెళ్లి సహచరులతో కలిసి సింగపూర్‌లో నిర్మాణ రంగంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2020లో మద్యం మత్తులో ఈ ఘటనకు పాల్పడగా.. ప్రస్తుతం కోర్టు తీర్పునిచ్చింది. మద్యం మత్తులో సహోద్యోగిపై వాగ్వాదానికి దిగిన మోహన్.. అనంతరం అతనిపై దాడికి దిగాడు. ఈ క్రమంలో సహోద్యోగి చెవిని కొరికేశాడని పోలీసులు తెలిపారు. బాధితున్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స తీసుకుని కోలుకున్నాడు. కాగా.. మోహన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. విచారణ తర్వాత ఈ మేరకు ఐదు నెలల జైలు శిక్షను విధించింది. అంతేకాకుండా 1000 సింగపూర్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జాలరిని నీళ్లలోకి లాగేసిన సొరచేప.. వీడియో వైరల్.. -
ఆస్తి తన పేరుమీద రాయలేదని భర్త చెవికొరికిన భార్య
ముంబై: భర్త పేరు మీద ఉన్న భూమిని తనపేరిట రాయలేదన్న కోపంతో భర్త చెంప కొరికింది ఓ భార్య. కోన్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. తాలూకాలోని ఠాక్రాచపాడ గ్రామంలోని ఆటస్థలం ప్రక్కనున్న శంకరుని మందిర పరిసర ప్రాంతానికి చెందిన ప్రకాశ్ మారుతీ ఠాకూర్ (67) తన పూర్వీకుల స్థలాన్ని భార్య సునంద పేరు మీద రాయాల్సిందిగా పట్టుబట్టింది. అయితే ఆ స్థలం తన తల్లి, సోదరుడి పేరుతో ఉందని, పెద్దల సమక్షంలో నిర్ణయం తీసుకోవాలని భర్త చెప్పడంతో కోపంతో రగిలిపోయిన సునంద తన భర్తను వేధింపులకు గురిచేసింది. ఈ క్రమంలో కుమారుడు స్వప్నిల్, సునంద కలసి భర్త చెంప, వేళ్లను గట్టిగా కొరికేయడంతో ప్రకాశ్ ఠాకూర్ తీవ్రంగా గాయపడ్డాడు. సునంద, స్వప్నిల్‌పై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా..ఐపీసీ 324, 506, 504,34 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: విషాదం.. 75 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సు బోల్తా.. -
ఓడిపోతున్నానని రవి దహియా చేయి కొరికేసిన కజకిస్తాన్ రెజ్లర్
ఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భాగంగా రెజ్లింగ్ 57 కేజీల విభాగంలో రవికుమార్ దహియా ఫైనల్ చేరి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వర్ణం సాధించేందుకు రవికుమార్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. గురువారం సాయంత్రం రష్యా రెజ్లర్ జవుర్ ఉగేవ్‌తో రవికుమార్ తలపడనున్నాడు. ఈ విషయం పక్కనపెడితే.. బుధవారం కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్ నూరిస్లామ్ సనయేవ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ చివరి దశలో సనయేవ్ ఓడిపోతున్నా అనే బాధలో రవికుమార్ చేతిని కొరకడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. '' ఇదేం పద్దతి.. ఎంత ఓడిపోతున్నాననే బాధలో ఉంటే ప్రత్యర్థి చేయి కొరకడం సమంజసం కాదు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఒక ఆటగాడిని గౌరవించే పద్దతి ఇదేనా అంటూ కామెంట్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి భాగం ముగిశాక రవికుమార్ 2–1తో ముందంలో ఉన్నాడు. అయితే రెండో భాగం ఆరంభంలో సనయేవ్ ఒక్కసారిగా 9–2తో ఏడు పాయింట్ల ఆధిక్యంలోకి వెళ్లాడు. అప్పటికి బౌట్ ముగిసేందుకు 90 సెకన్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. భారీ తేడాతో వెనుకబడినా రవి ఒత్తిడికి లోనుకాలేదు. తన బలాన్నంతా కూడదీసుకొని ‘డబుల్ లెగ్ అటాక్’తో రెండు పాయింట్లు సంపాదించాడు. సనయేవ్‌ను మ్యాట్‌పైకి రవి ఎత్తి పడేయంతో కజకిస్తాన్ రెజ్లర్ మోకాలికి దెబ్బ తగిలింది. మోకాలికి పట్టీ కట్టుకొని సనయేవ్ బౌట్‌ను కొనసాగించగా... వెంటనే రవి మరోసారి అతని రెండు కాళ్లను ఒడిసిపట్టుకొని మళ్లీ ఎత్తి పడేశాడు. ఈసారి రవి తన ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు తగిలించి కొన్ని సెకన్లపాటు అలాగే పెట్టి ఉంచాడు. దాంతో నిబంధనల ప్రకారం రవిని ‘విక్టరీ బై ఫాల్’ పద్ధతిలో రిఫరీ విజేతగా ప్రకటించారు. అప్పటికి బౌట్ ముగియడానికి మరో 39 సెకన్లు మిగిలి ఉన్నాయి. ఒకదశలో 2–9తో వెనుకబడిన రవి చివరకు పాయింట్లతో సంబంధం లేకుండా విజయాన్ని అందుకోవడం విశేషం. How unfair is this , couldn’t hit our #RaviDahiya ‘s spirit, so bit his hand. Disgraceful Kazakh looser Nurislam Sanayev. Ghazab Ravi , bahut seena chaunda kiya aapne #Wrestling pic.twitter.com/KAVn1Akj7F — Virender Sehwag (@virendersehwag) August 4, 2021 -
భర్తను, పిల్లలను ఆమె కొరుకుతోంది..!
నార్కట్‌పల్లి: పొద్దంతా ప్రశాంతంగానే ఉంటుంది. రాత్రి కాగానే ఇంట్లో ఉన్నవాళ్లందరినీ పళ్లతో కొరుకుతుంది. భర్తనేకాదు సొంత పిల్లల్ని సైతం వదలడం లేదు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలో శనివారం వెలుగులోకి వచ్చిన ఓ మహిళ వింత ప్రవర్తన ఇది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అలేరు మండలానికి చెందిన శ్రీలత-సుధాకర్ దంపతులు ఎనిమిదేళ్లుగా మండల కేంద్రంలోని హైస్కూల్ సమీపంలో అద్దెకు నివాసముంటున్నారు. వీరికి ఎనిమిది, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సుధాకర్ స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అయితే, శ్రీలత కొద్ది రోజులుగా కుమార్తెలతో పాటు భర్తను కూడా సాయంత్రం వేళ విచక్షణారహితంగా కొరుకుతూ గాయపరుస్తోంది. శనివారం ఇరుగుపొరుగు వారు చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ మోతీరాం శ్రీలతను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆమె తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. మానసిక స్థితి సక్రమంగా లేకనే శ్రీలత ఇలా వ్యవహరిస్తోందని పోలీసులు భావిస్తున్నారు. -
నాగుపాముపై పగ...
రాయ్‌పూర్ : పాము పగపడుతుందనేది నానుడి. కానీ తనను కాటేసిన పాము పగబట్టాడో రైతు. ఆ విష సర్పాన్ని వెంటాడి మరీ పట్టుకుని దానికి శిక్ష వేసిన వైనం ఆశ్చర్యకరంగా మారింది. పాము కనిపించగానే బెంబేలెత్తిపోవడం.. పారిపోవడం కామన్. లేదంటే దాన్ని చంపడమో లేక పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడమో కూడా తెలిసిందే. అయితే చత్తీస్ ఘడ్ లోని ఓ రైతు వీటికి భిన్నంగా ప్రవర్తించాడు. ఛత్తీస్‌గఢ్ కోబ్రా జిల్లాలోని లహంగ్ బహారా గ్రామంలో నాగుపాముకు శిక్ష వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. లహరి లాల్ అనే రైతు తన పంట పొలంలో పని చేసుకుంటుండగా ఓ నాగుపాము అతడిని కాటేసింది. అంతే..లహర్ కు ఎక్కడి లేని కోపం ముంచుకువచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కాటేసిన బాధ మరిచి పాముపై కోపం పెంచుకున్నాడు . దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలనే పట్టుదలతో దాన్ని వెంబడించాడు. ఎట్టకేలకు సర్పాన్ని పట్టుకున్నాడు లాల్. తన ఇంటికి తీసుకువచ్చి తాడుతో స్తంభానికి కట్టేశాడు. దీంతో విస్తుపోయిన పాము కూడా యథావిధిగా పడగెత్తి బుసకొట్టింది. -
ఆ ప్రధాని వద్దకు వెళితే ఇక అంతే!
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వద్దకు రాజకీయ సందర్శకులు వెళ్లాలంటేనే హడలెత్తిపోతున్నారంట. ఏ ఒక్కరు కూడా ఆయన దగ్గరకు వెళ్లే సాహసం చేయడం లేదట. అదేంటి ఆయన దగ్గరకు వెళితే ఏం చేస్తారు.. కొడతారా తిడతారా లేక ప్రధాని అనే భయమా లేక అతి వినయమా అని ఆలోచిస్తున్నారా? మరేం లేదు ఈ మధ్యనే ఆయన కైయా అనే ఓ కుక్కను తెచ్చుకున్నారు. అది కాస్త హద్దులు మీరి ప్రవర్తిస్తూ ఆయన పక్కన ఉండగానే వచ్చిన సందర్శకులపై విరుచుపడుతుందట. తొలుత ఒకరిని కరిచిన ఆ కుక్క రక్తం రుచి పంటికి తగిలిందికాబోలు ఇక ఎవ్వరినీ వదిలిపెట్టకుండా ఒక్క నెతన్యాహును తప్ప అందరిని కరిచేందుకు లగెత్తుకు వెళుతోందట. డిప్యూటీ విదేశాంగమంత్రి భర్తను కూడా ఆ కుక్క కరిచిందంటే ప్రధాని నెతన్యాహు కోసం ఎంతటి అతి వినయంగా ప్రవర్తిస్తుందో మీరే ఊహించుకోండి. బుధవారం ఏం చక్కా ఆయన క్యాండిల్ లైట్ లో డిన్నర్ ఏర్పాటు చేయగా అందులో కూడా ఇద్దరిపై దాడి చేసి కరిచేసిందట. దీంతో ప్రధాని కుక్కపై పలువురు, మీడియా ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. దాని సపర్యలు చూసేవారు మాత్రం అదంతా ఉత్తదేనని, కావాలనే మీడియా దుష్పచారం చేస్తుందని అంటున్నారు. కైయా ఎంతోమంది ప్రముఖులను కూడా కలుసుకుంది. వారిలో యూఎస్ స్టేట్ సెక్రటరీ జాన్ కెర్రీ కూడా ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు అప్పుడు కెర్రీని కైయా ఏమీ అనలేదు.