రాయ్‌పూర్ : పాము పగపడుతుందనేది నానుడి. కానీ తనను కాటేసిన పాము పగబట్టాడో రైతు. ఆ విష సర్పాన్ని వెంటాడి మరీ పట్టుకుని దానికి శిక్ష వేసిన వైనం ఆశ్చర్యకరంగా మారింది. పాము కనిపించగానే బెంబేలెత్తిపోవడం.. పారిపోవడం కామన్. లేదంటే దాన్ని చంపడమో లేక పాములు పట్టేవారికి సమాచారం ఇవ్వడమో కూడా తెలిసిందే. అయితే చత్తీస్ ఘడ్ లోని ఓ రైతు వీటికి భిన్నంగా ప్రవర్తించాడు.
ఛత్తీస్‌గఢ్ కోబ్రా జిల్లాలోని లహంగ్ బహారా గ్రామంలో నాగుపాముకు శిక్ష వేసిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. లహరి లాల్ అనే రైతు తన పంట పొలంలో పని చేసుకుంటుండగా ఓ నాగుపాము అతడిని కాటేసింది. అంతే..లహర్ కు ఎక్కడి లేని కోపం ముంచుకువచ్చింది. కోపంతో ఊగిపోయాడు. కాటేసిన బాధ మరిచి పాముపై కోపం పెంచుకున్నాడు . దాన్ని ఎలాగైనా పట్టుకొని తీరాలనే పట్టుదలతో దాన్ని వెంబడించాడు. ఎట్టకేలకు సర్పాన్ని పట్టుకున్నాడు లాల్. తన ఇంటికి తీసుకువచ్చి తాడుతో స్తంభానికి కట్టేశాడు. దీంతో విస్తుపోయిన పాము కూడా యథావిధిగా పడగెత్తి బుసకొట్టింది.