పాముకాటుతో రైతు మృతి | Farmer bites snake to death in kurnool | Sakshi
Sakshi News home page

పాముకాటుతో రైతు మృతి

Published Sat, Aug 8 2015 12:06 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

పాముకాటుతో రైతు మృతి - Sakshi

పాముకాటుతో రైతు మృతి

కర్నూలు : వ్యవసాయం చేసుకుంటున్న వ్యక్తిని పాము కాటేసింది. దీంతో ఆయన అక్కడికక్కడే నురుగులు కక్కుతూ మృతి చెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా కోస్గిలోని రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న నర్సన్న (34)  తనకున్న మూడెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

అందులో భాగంగా ఈ రోజు ఉదయం బావి వద్ద పని చేసుకుంటుండగా అటుగా వచ్చిన పాము అతడిని కాటేసింది. ఇది గమనించిన రైతులు వెంటనే నర్సన్నను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే అతడు అప్పటికే మృతిచెందాడు. మృతుడు నర్సన్నకు భార్య, ఇద్దరు కుమారులతోపాటు ఓ కుమార్తె కూడా ఉందని స్థానికులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement