కర్షకున్ని కాటేసిన కరెంట్‌ | Farmer killed with electric shock | Sakshi
Sakshi News home page

కర్షకున్ని కాటేసిన కరెంట్‌

Published Sat, Dec 24 2016 12:51 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

కర్షకున్ని కాటేసిన కరెంట్‌ - Sakshi

కర్షకున్ని కాటేసిన కరెంట్‌

గాండ్లపెంట:

గాండ్లపెంట మండలం వద్దిరెడ్డిపల్లికి చెందిన ముక్తాపురం శ్రీనివాసులురెడ్డి(45) అనే రైతు శుక్రవారం విద్యుతాఘాతానికి గురై మరణించారని ఎస్‌ఐ రాజశేఖర్‌ తెలిపారు. గాండ్లపెంట సమీపంలోని 15 ఎకరాల్లో సాగు చేసిన వంకాయ పంటకు నీటిని వదిలేందుకు వెళ్లిన ఆయన అక్కడ మోటరు ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మరణించినట్లు వివరించారు. అక్కడే పొలంలో పని చేస్తున్న కూలీలు గమనించి వెంటనే శ్రీనివాసులరెడ్డి సోదరుడు అమరనాథరెడ్డికి  సమాచారం అందించారు. అతనితో పాటు తల్లిదండ్రులతో పాటు మృతుని భార్య అనూరాధ ప్రమాదస్థలానికి వచ్చి శ్రీనివాసులరెడ్డి మృతదేహంపై పడి విలపించారు. నాన్న ఎక్కడని పిల్లలు అడిగితే ఏమని చెప్పాలని, ఇక తమకు దిక్కెవరంటూ  అతని గుండెలపై పడి రోదించడం అందరి హృదయాలను బరువెక్కించింది.

ప్రమాదస్థలికి చేరుకున్న అధికారులు

సమాచారం అందిన వెంటనే ఎస్‌ఐ రాజశేఖర్‌, తహశీల్దార్‌ శ్రీనివాసులు, ట్రాన్స్‌కో ఏఈ గౌరీశంకర్‌ తమ సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. మృతదేహఆన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement