కట్టంగూర్(నకిరకల్) : కరెంట్ కాటుకు ఇద్దరు బలయ్యారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్, నిడమనూర్ మండలాల పరిధిలో సోమవారం ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన కాడెబోయిన పద్మ(28) నూతనంగా నిర్మిస్నున్న ఇంటికి నీళ్లు చల్లుతుండగా కరెంట్ షాక్‌కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ రంజిత్ పేర్కొన్నారు.
గుంటుకగూడెంలో రైతు..
నిడమనూరు: మండలంలోని గుంటుకగూడెం గ్రామానికి చెందిన మేరెడ్డి నర్సింహారెడ్డి(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు నుంచి స్తంభానికి ఉన్న సర్వీస్ వైరును ఎత్తుగా ఉన్న కర్రలపై పెట్టే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య, వికలాంగురాలైన కుమార్తె ఉన్నారు.
పోస్టుమార్టమ్ అనంతరం సాయంత్రం మృతదేహాన్ని గుంటుకగూడెం తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నం టాయి. మృతుడి భార్యమేరెడ్డి రాధ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలో నర్సింహారెడ్డి మృతదేహాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment