house wife
-
ఇలా చేస్తే ఒత్తిడి మీ దరిదాపుల్లోకి కూడా రాదు, ఇల్లాలి ఆరోగ్యం కోసం..
ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలుకొని పిల్లలకు చక్కని భవిష్యత్ నిర్మాణం వరకు ఇంటి ఇల్లాలు పడే తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడికి గురై, మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుతుంటారు మహిళలు. ఇల్లాలి బాధ్యతలను చక్కగా నెరవేరుస్తూనే కొన్ని అలవాట్లను దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే శరీరం ఆరోగ్యంగా... మనసుకు ఉల్లాసంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక ఆందోళనలను దూరం చేసి మనసుకు సాంత్వన నిచ్చేది మన అభిరుచులే. రోజులో కొంతసమయాన్ని ఎంతో ఇష్టమైన పనిమీద కేంద్రీకరించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. భావోద్వేగాలు, ఒత్తిళ్లు, నిరాశలు తగ్గుముఖం పడతాయి. యోగా... ప్రపంచంలోనే పాపులర్ వ్యాయామం యోగా. మహిళలు అలవర్చుకోవాల్సిన అభిరుచిలో ఇది ప్రధానమైనది. యోగా చేయడం వల్ల ఫిట్‌గా, బలంగా తయారవడంతో పాటు ఒత్తిడి తగ్గి, సంతోషంగా ఉంటారు. శరీరంతో పాటు మానసిక పరిస్థితి మెరుగుపడి ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడేందుకు అనువుగా మనసు మారుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. సిరామిక్స్ తయారీ... ఒత్తిడిని తగ్గించడంలో సిరామిక్స్ తయారీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రకరకాల పాత్రల తయారీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్వయంగా అందమైన పాత్రలు రూపొందించి బహుమతిగా ఇవ్వడానికి లేదా ఇంట్లో వాడుకోవచ్చు. క్రోకరీ తయారీ సమయంలో దృష్టిమొత్తం పాత్రపై ఉండడం వల్ల మెడిటేషన్ చేసినట్లవుతుంది. ఫొటోగ్రఫీ... మంచి అలవాట్లలో ఫొటోగ్రఫీ కూడ ఒకటి. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఫోటోలు తీయవచ్చు. ఇప్పుడు ఖరీదైన కెమేరాలు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉంటున్నాయి. మీ అభిరుచికి తగ్గట్టుగా క్లిక్‌మనిపించాలి. తీసిన ఫోటోలను క్రియేటివ్‌గా తయారు చేసి వివిధ రకాల ప్లాట్‌ఫామ్‌లపై పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ ఫోటోగ్రఫీ వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ఉత్సాహంతో నిండుతుంది. స్విమ్మింగ్ ఈత కొట్టడం వల్ల చాలారకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ కోసం బయటకు వెళ్లడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు కొత్త పరిచయాలతో ఉత్సాహం కలుగుతుంది. డ్యాన్సింగ్... నాలుగు స్టెప్పులు వేసారంటే హుషారు దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. మ్యూజిక్కు తగ్గట్టుగా శరీరాన్ని కదిలిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. డ్యాన్స్‌తో అధిక బరువు తగ్గి, కండరాలు బలంగా మారతాయి. మానసిక ఆరోగ్యం మెరుగు పడుతుంది. ఆభరణాల తయారీ జ్యూవెలరీ తయారీ అలవాటు చాలా మంచిది. దృష్టిమొత్తం డిజైన్ మీద ఉంటుంది. మనలోని సృజనాత్మకతను వెలికి తీసి సరికొత్త అభరణాలు తయారు చేసి ఎవరికైనా గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. దీనిలో మంచి నైపుణ్యం సాధిస్తే ఆదాయం కూడా వస్తుంది. ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. కుట్లు... అల్లికలు ప్రస్తుత కాలంలో మహిళలు ధరించే డ్రెస్సులు దాదాపు అన్నీ ఎంబ్రాయిడరీతోనే ఉంటున్నాయి. వీటి రేటు కూడా ఎక్కువే. స్వయంగా మీ డ్రెస్ మీద మీరే ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చూ ఉండదు. స్వయంగా డిజైన్ చేశామన్న సంతృప్తి కలుగుతుంది. సులభంగా వేయగలిగే ప్యాట్రన్ లేదా ఫ్లోరల్ డిజైన్‌తో మొదలు పెట్టి మెల్లగా ఎంబ్రాయిడరీలోని మెలకువలు నేర్చుకోవాలి. ఇందుకు ఏకాగ్రతతో΄ాటు ఓపిక కూడా కావాలి. మీరు ఎంబ్రాయిడరీ చేసిన డిజైన్ లేదా అల్లిన వస్తువు ఇతరులకు నచ్చినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషంతో పాటు, ఆదాయమూ వస్తుంది. కుకింగ్, బేకింగ్... సరికొత్త కలెక్షన్.. దాదాపు మహిళలంతా వంటచేస్తుంటారు. అయితే రోజూ చేసే వంట కాకుండా... కొంచం కొత్తగా చేసి ఇంట్లోవాళ్లకు రుచులను వడ్డించండి. తిన్నవారు ‘ఎంత బావుందో’ అని చెప్పేమాట మీ కడుపుని నింపేస్తుంది. ఇంట్లో చేసినవి ఏవైనా ఆరోగ్యమే! అందుకే రకరకాల వంటకాలను తయారు చేయడానికి ప్రయత్నించాలి. గార్డెనింగ్... బొకేల తయారీ గార్డెనింగ్‌ను అలవాటు చేసుకుంటే.. ఒత్తిడి మీ దరిదాపుల్లోకి రాదు. సేంద్రియ కూరగాయలు, పండ్లు పండించడంతో΄ాటు, సువాసనలు వెదజల్లే పూలపరిమళాలు ఇంటి ఆవరణలో మీతో పాటు మీ కుటుంబానికీ ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇక పూలను బొకేలుగా మార్చితే మీ నైపుణ్యాలు మెరుగుపడినట్టే. పూలను ఒకదానికి ఒకటి జత చేసే క్రమంలో మనలోని సృజనాత్మకత వెలికి వస్తుంది. మనసు ఆహ్లాదంగా మారుతుంది. అందంగా... ఆరోగ్యంగా ఒత్తిడి వల్ల ముఖసౌందర్యాన్ని గాలికి వదిలేస్తుంటారు. అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు మరింత నిస్సత్తువగా అనిపిస్తుంది. అందువల్ల మీ ముఖాన్ని మరింత కాంతిమంతంగా మార్చుకునేందుకు ఇంట్లోనే ఫేషియల్ తయారు చేసుకోవాలి. చర్మ సంరక్షణకు ఎటువంటి క్రీమ్‌లు, ఫేషియల్స్లు చేసుకోవాలో నేర్చుకుని చర్మసౌందర్యాన్ని పెంచుకోవాలి. వీటికి ఫేషియల్ యోగాను జతచేస్తే ఆందమూ ఆరోగ్యం మీ సొంతమైనట్టే. వీటిలో కనీసం కొన్నింటిని అలవరచుకున్నా మీలో పేరుకుపోయిన ఒత్తిడి, నిస్సత్తువలు నియంత్రణలోకి వచ్చి ఆనందంగా జీవించ గలుగుతారు. -
భర్తకు అనారోగ్యం.. డ్యూటీకని వెళ్లిన భార్య.. సూపర్వైజర్తో బైక్‌పై..
సాక్షి, పహాడీషరీఫ్ (హైదరాబాద్): డ్యూటీకి వెళ్లిన గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్నాద్ బెహెరా తన భార్య సుబ్రదాస్ మహాపత్ర (25), కూతురుతో కలిసి జల్పల్లి శ్రీరాంకాలనీకి వలస వచ్చి... స్థానిక ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నారు. గత నెల 31వ తేదీన అనారోగ్యంగా ఉండటంతో జగన్నాద్ ఇంటి వద్దే ఉండగా...అతని భార్య మాత్రం డ్యూటీకి వెళ్లింది. ఎంతకి ఇంటికీ రాకపోవడంతో కంపెనీ వద్ద వాకబు చేయగా.... కంపెనీలో పనిచేసే సూపర్వైజర్ హరి వెంట బైక్‌పై వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై జగన్నాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గాని 94906 17241 నంబర్లో గాని సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు. చదవండి: (ఏమైందో? ఏమో?.. చింతచెట్టుకు వేలాడుతూ..) -
ఆమెను కొత్త స్వెటర్ కొనుక్కోనిద్దాం..
చలికాలం పిల్లలు నిద్ర లేవరు. వారికి ఆ హక్కు ఉందట. భర్త గారు ‘కాసేపు నిద్రపోనీ’ అంటుంటారు. ఆయనగారిని ఏం అనగలం. కాని స్త్రీలు లేవాల్సిందే. వంట చేయాల్సిందే. అన్నీ సిద్ధం చేయాల్సిందే. వారెప్పుడు రుతువులను ఎంజాయ్ చేయాలి? భార్యకు కొత్త స్వెటర్ కొనివ్వాలంటే టైమ్ ఉండదు. పోనీ ఆమెను కొనుక్కోనివ్వము. అమ్మకు చెవులకు స్కార్ఫ్ ఎప్పుడూ పాతదే. చలికి ఆడవాళ్ల పాదాలకు సాక్సులు అవసరం అని కూడా అనుకోము. ఈ కాలంలో స్త్రీలకు ఏం కావాలో వారిని తెచ్చుకోనివ్వండి. పని ఒత్తిడి తగ్గించండి. టీ తాగుతూ చలిని వారినీ ఆస్వాదించనివ్వండి. చలికాలం బద్దకం కాలం. వెచ్చగా ముసుగుతన్నమని చెప్పేకాలం. కాని ఆ లగ్జరీ ఇంటి మగవారికి, పిల్లలకి ఉన్నట్టుగా ఆడవారికి ఉండదు. బయట ఎంత చలి ఉన్నా తెల్లారే ఆరుకు వాళ్లు లేవాల్సిందే. బయట ఎంత మంచు కురుస్తున్నా తొంగి చూడక వంట గదిలో దూరాల్సిందే. వరండాలోనో, బాల్కనీలోనో, ముంగిలి లోనో కుర్చీ వేసుకుని కాఫీ తాగుతూ మంచుతో తడిసిన బంతిపూల మొక్కను చూడాలని వారికీ ఉంటుంది. కాని వారికి కాఫీ తెచ్చిచ్చేవారు ఎవరూ ఉండరు. వారి కాఫీ వాళ్లే పెట్టుకోవాలి. చలికాలమైనా హిమ ఉదయమైనా. ఇంకా ద్వితీయశ్రేణి పౌరులేనా? చలికాలం వస్తే భర్త బజారు నుంచి వస్తూ వస్తూ రోడ్డు మీద అమ్మే ఒక జర్కిన్నో, స్వెటర్నో కొనుక్కుంటాడు. బండి నడుపుతాడు కదా మంకీ క్యాప్ కొనుక్కుంటాడు. పిల్లలు చలికి ఎక్స్పోజ్ అయితే ఎలా? వారి కోసం తప్పక స్వెటర్లు కొంటాడు. కాని భార్యకు ఎందుకనో వెంటనే కొనడు. కొనాలన్నా ఉంది కదా అనిపిస్తుంది. ఆమే కొనుక్కుంటుందిలే మన సెలక్షన్ నచ్చదు అనుకుంటాడు. ఆమె కొనుక్కునేది లేదు. ఆమెకు ఆ వీలూ చిక్కదు. చాలా ఇళ్లల్లో స్త్రీలు పాతబడిన స్వెటర్లతోనే తిరుగుతూ ఉంటారు ఈ సీజన్లలో. స్త్రీలకు రకరకాల స్వెటర్లు అమ్ముతారు. హాఫ్ స్వెటర్లు ఇంట్లో వేసుకోవచ్చు. ఫుల్స్వెటర్లు బయటకు వెళ్లేప్పుడు. కొనే స్తోమత ఉన్నా ‘ఇన్ని ఎందుకు’ అనే ప్రశ్న ఆమెకు ఎదురవుతుంది. స్త్రీలు సౌందర్య ప్రియులు అని తెలుసు. ఈ శీతాకాలం రెండు మూడు నెలలు ఒకే ఒక్క స్వెటర్‌తో వాళ్లు ఎందుకు గడిపేయాలి. అక్కర్లేదు అని వారూ అనుకోరు. ఇంటి మగవారూ చెప్పరు. అమ్మ సంగతి ఏమిటి? ఇంట్లో అమ్మ ఉంటే శీతాకాలం ఆమెకై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆమెకు బడ్జెట్ కేటాయించాలి. ఒక మంచి షాల్ కప్పుకుని ఆమె కూచుంటే ఎంత బాగుంటుంది. ఆమెకు నచ్చిన రంగుల్లో రెండు మూడు స్కార్ఫులు ఉంటే ఎంత బాగుంటుంది. నేలకు పాదాలు తాకి జిల్లు మనకుండా ఇంట్లో తిరగడానికి మంచి స్లిప్పర్లు, సాక్సులు ఆమెకు తప్పనిసరి. ఒక కొత్త రగ్గు కొని ఇస్తే ఆ ఉత్సాహమే వేరు. అమ్మ ఆ ఇంట్లో కొడుకు, కోడలు మీద ఆధారితమైతే ఆమెను చిన్నబుచ్చకుండా ఇవన్నీ లేదా వీటిలో కొన్నయినా ఈ శీతాకాలపు ప్రారంభంలోనే ఆమెకు కొనిస్తే నోరు తెరిచి అడగాల్సిన అవస్థ తప్పుతుంది. ఇవాళ వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి. ఆ డబ్బును చాలా ఇళ్లల్లో ఆ అమ్మలు, అత్తలు కొడుకు చేతుల్లోనో కోడలు చేతుల్లోనో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ‘ఈ నెల డబ్బు మీ కోసం మీ చలికాలపు అవసరాల కోసం ఉంచుకోండి’ అని చెప్పలేమా? వంట బాధ రోజూ ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నా ఒక్కపూట బజారు నుంచి తెచ్చుకోండి అంటే ‘బజారు టిఫినా’ అని విసుక్కుని రోజు మూడ్‌ని పాడు చేసే భర్తలు ఉంటారు. రోజూ టిఫిన్ చేసే బాధ వేరే ఏ కాలంలో అయినా ఓకే కాని చలికాలం చాలా కష్టం. చలికి పని చేయబుద్ధి కాదు. ఎవరైనా చేసిపెడితే బాగుండు అని భర్తలకు సదా అనిపించినట్టే భార్యలకు అప్పుడప్పుడైనా అనిపిస్తుంది. భోజనం తిప్పలు ఎలాగూ తప్పవు కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ సమస్యను ఎలా పరిష్కరించవచ్చో ఎలా ఆ శ్రమ కాస్తంత తగ్గించవచ్చో ప్రతి ఇంటి పురుషులు, పిల్లలు ఆలోచించాలి. ప్రత్యామ్నాయ టిఫిన్లు, ఇన్స్టంట్ టిఫిన్లు, ఆమె చేయకపోయినా మనం చేసుకు తినగలిగే అల్పాహారాలు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. యూట్యూబ్‌లో కొడితే వందలాది వీడియోలు ఉన్నాయి. మనం ఇల్లు కదలకపోయినా తెచ్చిపెట్టే స్విగ్గి, జొమాటోలు ఉన్నాయి. వారంలో ఒకటి రెండు రోజులైనా ఈ శీతాకాలంలో ఉదయపు వంట చెర నుంచి ఆమెను విముక్తి చేస్తే ఆమెకు కలిగే సంతోషం ఆలోచించారా ఎవరైనా? ఆమె సౌందర్యం అవును. చక్కగా ఉండే హక్కు, సౌందర్యాన్ని కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మగవాళ్లు దీనిని లెక్క చేయొచ్చు చేయకపోవచ్చు. కాని శీతాకాలంలో స్త్రీలు తమ శరీరం గురించి ఆలోచన చేస్తారు. చర్మాన్ని, శిరోజాల్ని కాపాడుకోవడానికి వారికి కొన్ని వస్తువులు అవసరం. క్రీములు, నూనెలు, సబ్బులు... అదనపు ఖర్చే. ఆ ఖర్చు వారు సంపాదించే దాని నుంచైనా భర్త సంపాదన నుంచైనా చేసే వాతావరణం ఇంట్లో ఉండాలి. చర్మ సమస్యలు కొందరిలో రావచ్చు. వాటిని చిట్కాలతో సరిపుచ్చుతూ బాధపడాల్సిన పని లేదు. వైద్యుల దగ్గరకు వెళ్లాలి. ఇక ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే వారికి చలికాలం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వారిని రోజువారీ చాకిరీ నుంచి దాదాపుగా తప్పించాలి. ఈ కాలంలో జలుబు, త్రోట్ ఇన్ఫెక్షన్లు సహజం. వాటి నుంచి కాపాడేలా ఆమెను వెచ్చని వాతావరణంలో విశ్రాంతంగా ఉంచడం కోసం ఏం చేయొచ్చో ఆలోచించాలి. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. చలికాలాన్ని ఎంజాయ్ చేసేలా చూద్దాం. హ్యాపీ వింటర్. నిజానికి ఇవన్నీ రాసి చెప్పాలా అనిపించవచ్చు. రాసి చెప్తే కాని స్త్రీలకు ఎంత పని ఉందో దాని నుంచి ఎలా తప్పించవచ్చో తెలియనంతగా ఆ పని స్త్రీల నెత్తి మీద ఉంది. చలికాలం వారికి పని తేలిక చేద్దాం. -
అనుమానంతో ఇల్లాలిని కడతేర్చిన భర్త
-
ప్లీజ్ డాడీ.. అమ్మను ఏం చేయొద్దు
అనంతపురం: జిల్లా కేంద్రంలో గురువారం వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వివాహితలు దారుణ హత్యకు గురయ్యారు. ఘటనలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అనంతపురం ఒకటి, రెండో పట్టణ సీఐలు ప్రతాప్‌రెడ్డి, జాకీర్ హుస్సేన్ తెలిపిన మేరకు... 13 ఏళ్ల అనుబంధాన్ని మరచి.. కనగానపల్లికి చెందిన చిక్కన్నయ్య, కర్నూలు జిల్లా నంచెర్లకు చెందిన కవితకు 2008లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి పదకొండేళ్ల సంతోష్, తొమ్మిదేళ్ల జాహ్నవి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న చిక్కన్నయ్య... భార్యాపిల్లలతో కలిసి అనంతపురంలోని జీసస్ నగర్లో అద్దె ఇంటిలో నివాసముంటున్నాడు. పెళ్లైన పదకొండేళ్ల వరకూ వీరి దాంపత్యం ఎంతో అనోన్యంగా సాగింది. రెండేళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటూ వచ్చాయి. దంపతులు తరచూ ఘర్షణ పడుతూ వచ్చేవారు. 13 ఏళ్లుగా వారి మధ్య ఉన్న అనుబంధాలు బలహీనపడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే ఘర్షణ∙పడిన ప్రతిసారీ కవిత తన పుట్టింటికి వెళ్లేపోయేది. పెద్దలు జోక్యం చేసుకున్న తర్వాత తిరిగి కాపురానికి వచ్చేది. గొడవకు కారణమైన ఫోన్ కాల్స్ రెండేళ్లుగా కవితలో చోటు చేసుకున్న మార్పులు ఆమె పట్ల భర్త చిక్కన్నయ్యలో అనుమానాలను రేకెత్తించాయి. విధి నిర్వహణలో ఇంటి నుంచి బయటకు వచ్చిన అతను ఆమెకు ఫోన్ చేసిన ప్రతిసారీ బీజీబీజీ అంటూ సమాధానం రావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాను ఇంటిలో లేని సమయంలో తన భార్య ఎవరితోనో గంటల తరబడి ఫోన్లో సంభాషిస్తోందని చిక్కన్నయ్య బలంగా నమ్మాడు. ఇదే విషయమై తరచూ భార్యతో ఘర్షణ పడేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 24న (బుధవారం) సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన చిక్కన్నయ్య మరోసారి తన భార్యతో ఘర్షణ పడ్డాడు. భార్య నచ్చచెప్పినా అతను వినలేదు. రాత్రంతా అనుమానాలు అతన్ని స్థిరంగా ఉండనివ్వలేదు. గురువారం వేకువజామున 3 గంటలకు కవిత నిద్రలేచింది. ఆ సమయంలో మరోసారి దంపతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నిద్రపోతున్న పిల్లలిద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచారు. అప్పటికే సహనం కోల్పోయిన చిక్కన్నయ్య తన పంచను కవిత మెడకు బిగించి ఊపిరి ఆడకుండా చేస్తుండడం పిల్లలు గమనించారు. ‘డాడీ.. అమ్మను ఏం చేయొద్దు... ప్లీజ్ డాడీ అమ్మను వదిలేయ్ డాడీ’ అంటూ కన్నీళ్లతో ప్రాధేయపడ్డారు. అయినా చిక్కన్నయ్యలో ఆవేశం తగ్గలేదు. కాసేపయ్యాక విగతజీవిగా పడున్న కవిత(30)ను చూసి, అమ్మ పడుకుందని పిల్లలను నమ్మబలికి, వారిని తీసుకుని వెళ్లిపోయాడు. ఉదయం 8 గంటల సమయంలో ఇంటి యజమానికి ఫోన్ చేసి దాన్ని చంపేశానని, తన బిడ్డలను తీసుకుని వెళ్తున్నట్లు చెప్పాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి, రెండో పట్టణ సీఐ జాకీర్ హుస్సేన్ సంఘటనాస్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. తేలిపోయిన నమ్మకం తనకల్లుకు చెందిన రమేష్‌కు 13 సంవత్సరాల క్రితం చిత్తూరు జిల్లా మొలకలచెరువు సమీపంలోని దండువారిపల్లికి చెందిన రేణుకతో వివాహమైంది. వీరికి తొమ్మిదేళ్ల మనోజ్, ఎనిమిదేళ్ల లక్కీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో కొన్నేళ్ల క్రితం వీరు అనంతపురంలోని రాణి నగర్‌కు మకాం మార్చి పాతూరు మార్కెట్ ప్రాంతంలో పండ్ల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలోనే రమేష్ తాగుడుకు బానిసయ్యాడు. భర్త తాగుడు మాన్పించేందుకు ఆమె చేయని ప్రయత్నమంటూ లేదు. అయినా అతని మార్పు రాలేదు. ఈ క్రమంలోనే నెలన్నరగా ఆమెకు రమేష్ దూరంగా ఉంటూ వచ్చాడు. దీనిని నగరంలోని ఖాజానగర్‌కు చెందిన కుమారస్వామి అనే యువకుడు అవకాశంగా మలుచుకున్నాడు. రేణుకతో చనువు పెంచుకుని ఆమెతో సన్నిహితంగా ఉంటూ వచ్చాడు. ఏం జరిగిందో ఏమో.. బుధవారం అర్ధరాత్రి రేణుక(28) తన ఇంటిలో అపస్మారక స్థితిలో పడి ఉండడంతో గుర్తించిన ఆమె అన్న రెడ్డప్ప వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో... కుమారస్వామి∙తన సోదరి గొంతు నులిమి హతమార్చాడంటూ ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై సీఐ ప్రతాప్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఆస్తి ఇవ్వలేదని టెన్త్ విద్యార్థి ఆత్మహత్య మనవడిపై ప్రేమ.. తాతకు జైలు -
అదృష్టమంటే ఆమెదే: వంద పెట్టింది.. కోటి గెలిచింది
అమృత్సర్: అదృష్టమంటే ఆమెదే. రూ.వంద ఖర్చు చేసింది.. ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకుంది. వస్త్ర వ్యాపారం చేసుకునే ఆమె ఒక్కసారిగా కోటీశ్వరాలుగా మారింది. దీంతో ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు. అయితే ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో ఆ అదృష్టం వరించింది. ఈ ఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్ గర్భిణి. భార్యాభర్తలు ఇద్దరూ వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రేణు ఇటీవల రూ.100 పెట్టి లాటరీలో డీ-12228 టికెట్ కొనింది. ఈ లాటరీకి సంబంధించిన డ్రా ఫిబ్రవరి 11వ తేదీన తీశారు. ఆ డ్రాలో రేణు కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ తగిలింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అధికారులు ఆమెకు సమాచారం అందించడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. అవసరమైన పత్రాలు సమర్పించాలని లాటరీస్ శాఖ అధికారులు సమాచారం అందించారు. దీంతో ఆమె గురువారం కార్యాలయానికి చేరుకుని అవసరమైన పత్రాలు అందించింది. త్వరలోనే ఆమె బ్యాంక్ ఖాతాలో నగదు జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ నగదుతో తమ కష్టాలు తీరుతాయని రేణు చౌహాన్ తెలిపింది. లాటరీ నగదుతో తాము హాయిగా జీవిస్తామని హర్షం వ్యక్తం చేస్తూ రేణు చెప్పింది. -
గృహిణికి జీతం
ఉద్యోగానికి జీతం ఉంటుంది. జీవితమే ఉద్యోగం.. గృహిణికి! ఇంటి పనే ఆమె జీతం, భత్యం. సెలవుల్లేని... వేళల్లేని...ప్రశంస లేని.. ప్రమోషన్ లేని..ఆమె పనికి జీతం ఇవ్వవలసి వస్తే?!ఎవరివ్వగలరు? ఎంతివ్వగలరు?పసిడి పర్వతమైనా..ఆమె శ్రమకు తూగుతుందా? ‘‘ఏ వృత్తిలో ఉన్నవారికి ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జీతం ఇవ్వొచ్చు?’’ అని 2017 ‘మిస్ వరల్డ్’ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగిన ప్రశ్నకు.. ‘హోమ్‌మేకర్’ (గృహిణి) అని ఇరవై ఏళ్ల మానుషీ చిల్లర్ చెప్పిన సమాధానం ఆ ఏడాది ఇండియాకు అందాల కిరీటాన్ని తెచ్చిపెట్టింది. ‘‘వై?’’ అని మళ్లీ ఒక ప్రశ్న.‘‘ఎందుకంటే నాకు తెలుసు. ఇంట్లో అమ్మ ఎంత కష్టపడుతుందో. అమ్మ పనికి జీతం ఇవ్వాలి అనడాన్ని కేవలంగా జీతంగా చూడటం లేదు నేను. ప్రేమ, గౌరవం చూపించడం అది. నా జీవితానికి అమ్మే స్ఫూర్తి. మా అమ్మే కాదు. ప్రపంచంలోని ప్రతి అమ్మా ఇంటి కోసం తన జీవితాన్నే త్యాగం చేస్తుంది. అందుకే ప్రపంచంలో అందరికన్నా అమ్మకే జీతం ఎక్కువ ఉండాలని అంటాను’’ అని చెప్పారు మానుషీ. అమ్మకు ఇంకో పేరు.. గృహిణి. ‘‘మేం కనుక అధికారంలోకి వస్తే, గృహిణులందరికీ నెలవారీ జీతం ఇస్తాం’’ అని నటుడు కమల్‌హాసన్ సోమవారం చెన్నైలో ప్రకటించారు! తమిళనాడులో వచ్చే ఏడాది మేలో ఎన్నికలు ఉన్నాయి. ‘మక్కల్ నీది మయం’ (ప్రజాతీర్పు) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కమల్. మొత్తం ఏడు హామీలు ఇస్తున్నారు ఆయన. అందులో ఒకటి గృహిణులకు జీతం. ఎంత జీతం ఇస్తారో ఆయన చెప్పలేదు. ఆయనే కాదు, గృహిణి అందించే సేవలకు దేవుడు కూడా ‘ఇంత’ అని లెక్కకట్టి ఇవ్వలేడు. పెద్ద పెద్ద కంపెనీల సీఈవోలకు, ఎండీలకు, డైరెక్టర్లకు ఇచ్చే జీతానికి లెక్క ఉంటుంది. వాళ్ల బాధ్యతను మించినది గృహిణి బాధ్యత! పైగా గృహిణికి సెలవులు ఉండవు. ప్రశంసలు ఉండవు. ప్రమోషన్లు ఉండవు. ఇవన్నీ కాదు.. అసలు డ్యూటీ టైమింగ్సే ఉండవు. ఇరవై నాలుగు గంటల పని! ఇంటి పని, వంట పని, పిల్లల పని, పెద్దల పని. తీరికే ఇవ్వని ఈ పనులన్నీటికీ కలిపి ఎంత జీతం ఇవ్వాలి?! విదేశాల్లో కొన్ని సంస్థలు తరచు సర్వేలు చేస్తుంటాయి. ‘ఒకవేళ గృహిణికి జీతం ఇవ్వవలసి వస్తే నెలకు ఎంత ఇవ్వాల్సి ఉంటుంది?’ అని. ఆ సర్వేల ప్రకారం అక్కడి గృహిణులకు నెలకు కనీసం 6 లక్షల రూపాయలు ఇవ్వాలి! ఇక ఉద్యోగం చేసే మహిళకైతే రెండు బాధ్యతల ఒత్తిళ్లను బ్యాలెన్స్ చేసుకుంటూ నెట్టుకొస్తున్నందుకు అదనంగా రెండు మూడు లక్షలైనా చెల్లించాలని సర్వేల నివేదిక. నచ్చకపోతే, చేయలేకపోతే బయటి ఉద్యోగాన్ని మానేయడానికి ఉంటుంది. గృహిణిగా ఇంట్లో ఉద్యోగం మాత్రం తప్పనిది, తప్పించుకోలేనిది. ఎంతటి ఉన్నతస్థాయి ఉద్యోగి అయినా ఇంటికి చేరుకున్నాక గృహిణిగా రెండో షిఫ్ట్‌లోకి ‘మల్టీ టాస్క్’ అవతారం ఎత్తవలసిందే. చివరికి వీధి చివరి దుకాణం నుంచి పాల ప్యాకెట్‌ను తెచ్చుకోవడం కూడా ఆమె డ్యూటీనే. ఏమైనా గృహిణికి జీతం అన్నది ఒక అందమైన ఊహ. మానుషీ వంటి అందమైన మనసున్న వారికి వచ్చే ఊహ. గృహిణులు వారికై వారు కోరుకోని ప్రతిఫలం. నిజంగా వాళ్లకు ప్రభుత్వం నెల నెలా జీతం ఇస్తామంటే.. ‘జీతం వద్దు. బదులుగా రోజూ కాస్త విరామం, పనికి కాస్త గౌరవం ఇప్పించండి’ అని విజ్ఞప్తి చేస్తారేమో! వెనిజులాలో తప్ప ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ దేశంలోనూ గృహిణులకు ప్రభుత్వ జీతం లేదు. ఇస్తే బాగానే ఉంటుంది. కోరితేనే ఇవ్వాలా? భార్యగా, తల్లిగా, కోడలిగా, ఇంకా అనేక బాంధవ్యాలలో ఎన్ని కోరని వరాల జీతాలకైనా గృహిణి అర్హురాలే. పసిడి పర్వతాలను తవ్వి తెచ్చి పోసినా ఆమె శ్రమను తూచలేం. అమ్మ కోప్పడింది గృహిణి మీద ఇల్లెంత ఆధారపడి ఉంటుందో చూడండి. ఈ సంగతి ఇంద్రా నూయి స్వయంగా చెప్పుకున్నదే. 2006లో ఆమె పెప్సీకో సీఈవో అయ్యారు. చెన్నైలో నివాసం. భర్త, ఇద్దరు పిల్లలు. ఓ రోజు నూయీ ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆమె తల్లి ఎదురు వెళ్లి, ‘ఇంట్లో పాల్లేవు. తీసుకురా’ అని చెప్పారు. ‘‘అమ్మా నేను అలసిపోయాను. పెప్సీకో సీఈవో అంటే చిన్న పని ఉండదు. ఇంత లేట్ అయ్యేవరకు ఎందుకు ఆగావ్, ఎవర్నైనా పంపి తెప్పించుకోవచ్చు కదా!’’ అన్నారు నూయి. శాంతమ్మ గారికి (నూయీ తల్లి) కోపం వచ్చింది. ‘‘ఇంటికి వచ్చేటప్పుడు నీ కిరీటం తీసి మీ ఆఫీస్ చెత్తబుట్టలో వేసిరా. అక్కడ నీ పని ఎవరైనా చేస్తారు. ఇక్కడ నీ పని నువ్వే చేయాలి’’ అని ప్రేమగా మందలించారు. అంతగా గృహిణిని బాధ్యతలతో బంధించి వేస్తుంది ఇల్లు. ‘అమ్మా..’ అని చంటి పిల్లలు బయటి నుంచి వచ్చిన తల్లి కాళ్లను చుట్టుకుపోయినట్లే.. ఆఫీస్ నుంచి వచ్చిన మహిళను ఇల్లు చుట్టుకుపోతుంది. ఉద్యోగం చేయని గృహిణినైతే అడుగైనా బయటికి పెట్టనివ్వదు. ఆగి నిముషమైనా ఊపిరి తీసుకోనివ్వదు. ఇప్పుడు చెప్పండి. గృహిణికి ఎంత జీతం ఇవ్వొచ్చు? అసలా త్యాగం, రుణం రూపాయలిస్తే తీరిపోయేవా?! అయినప్పటికీ మూడేళ్ల క్రితం ఒక జాతీయ వార్తా పత్రిక ఆ లెక్కా ఈ లెక్కా వేసి భారతీయ గృహిణి నెలకు కనీసం 45 వేల రూపాయల జీతం పొందడానికి అర్హురాలని అంచనా వేసింది. గృహిణి చేసే ఇంటి పనులన్నిటినీ ఏడు ప్రధానమైన పనులుగా వర్గీకరించి ఒక్కో పనికి ఒక్కో మొత్తం కేటాయించింది. ఆ మొత్తాలన్నీ కలిపితే ఆమెకు ఇవ్వవలసిన జీతం నలభై ఐదు వేలు అయింది. (పట్టిక చూడండి). ఆ నలభై ఐదు వేలు ఇప్పటి విలువలో చూస్తే 54 వేల రూపాయలు. -
గొంతుకోసి మహిళ హత్య
మునిపల్లి (అందోల్): అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి హత్యకు గురైంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ల్యాగల శ్రీనివాస్‌కు కల్లపల్లి బెల్లూర్కు చెందిన నాగొల్ల రాణెమ్మ(32)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాస్ కూలి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తాగి ఇంటికి చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాస్ నిద్రకు ఉపక్రమించాడు. రాణెమ్మ పిల్లలను పడుకోబెట్టి తానూ పడుకుంది. కాగా, ఉదయం లేచి తన భార్యను కొడవలితో ఎవరో గొంతుకోసి హత్య చేశారని శ్రీనివాస్ రోదించడం మొదలుపెట్టాడు. అక్కడికి చేరుకున్న గ్రామస్తులు శ్రీనివాస్‌పై అనుమానంతో అతడిని తాళ్లతో బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని రాణెమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌కు మద్యం అలవాటు ఉందని, గతంలో మద్యం మత్తులో తన కాలు కోసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీనివాస్‌ను విచారిస్తున్నారు. -
‘నల్లగా ఉన్నావు...వంట రాదన్నందుకు’
ముంబై : ‘నల్లగా ఉన్నావు...వంట చేయడం రాద’ని విమర్శించినందుకు ఆహారంలో విషం కలిపి 5గురి మృతికి కారణమైంది ఓ వివాహిత. వివరాల ప్రకారం మహారాష్ట్రకు చెందిన ప్రంద్యా అలియాస్ జ్యోతి సురేష్ సర్వసేకు రెండేళ్ల క్రితం వివాహమయ్యింది. కానీ వివాహమయిన నాటినుంచి ఆమె అత్తింటి వారు, బంధువులు ఆమెను నల్లగా ఉన్నావని, వంట చేయడం రాదని విమర్శిస్తుండేవారు. వీటన్నిటిని మనసులో పెట్టుకున్న జ్యోతి తన అత్తింటివారి మీద ద్వేషం పెంచుకుంది. వారికి బుద్ధి చెప్పడం కోసం ఎదురుచూస్తుంది. కాగా ఈ నెల 18న మహడ్ గ్రామానికి చెందిన సుభాష్ మణే అనే ఓ బంధువు తన గ్రామంలో ఒక వేడుక నిర్వహించాడు. జ్యోతి తన అత్తింటి వారితో కలిసి ఈ వేడుకకు హాజరయ్యింది. అత్తగారి కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఈ వేడుకే మంచి అవకాశంగా భావించింది జ్యోతి. అతిథుల కోసం సిద్ధం చేసిన భోజనంలో విషం కలిపింది. ఈ విషాహారం తినడంతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరణించిన వారిలో 7 - 13 ఏళ్ల వయసు పిల్లలు నలుగురితో పాటు ఓ 53 ఏళ్ల వృద్ధుడు కూడా ఉన్నారు. విషయం తెలిసుకున్న ఖాలాపూర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని జ్యోతిని అదుపులోకి తీసుకున్నారు. ఆహార పదర్ధాలను పరీక్షించడం కోసం ఫోరెన్సీక్ లాబ్‌కు పంపించినట్లు తెలిపారు. -
రన్నింగ్ చేసే గృహిణుల కథ
జపాన్ నవలా రచయిత హరుకి మురకమి తనకున్న పరుగుల మోహం గురించి ఓ చోట ఇలా రాస్తాడు. ‘రన్నింగ్ అంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. ఆ సమయంలో నేను ఎవ్వరితో మాట్లాడనవసరం లేదు. ఎవరినీ విననవసరం లేదు. రన్నింగ్ నా నిత్య జీవితంలోని ఒక ముఖ్యమైన భాగం’ అంటాడు. భారతీయ గృహిణలు కూడా చాలామంది హరుకి మురకమిలా రన్నింగ్‌ని ఇష్టపడతారు. ఇదే థీమ్‌తో బెంగళూరుకు చెందిన బృందా సమర్నాథ్ అనే ఫిల్మ్‌మేకర్ ‘టైమ్‌లెస్’ అనే డాక్యుమెంటరీ తీశారు. అందుకోసం దేశంలోని నాలుగు మెట్రో నగరాలలో రన్నింగ్‌ని తమకు ప్రియమైన వ్యాపకంగా ఏళ్లుగా కొనసాగిస్తున్న కొందరు గృహిణుల జీవితంలోని ఘటనలను కథగా మలుచుకున్నారు. ఒక గంట నిడివిగల ఈ డాక్యుమెంటరీ ఈ నెలలో జరిగిన న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు వెళ్లొచ్చింది. వచ్చే నెల జరుగుతున్న అట్టావా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా స్క్రీన్ అవబోతోంది. ఇందులో.. పనమ్మాయిగా ఉండి, ప్రొఫెషనల్ రన్నర్‌గా మారిన సీమా వర్మ ఎపిసోడ్ (ముంబై) ఎంతో ఉద్వేగభరితంగా ఉంటుంది. రన్నింగ్.. మహిళను కదలించే ధ్యానం అని చెబుతూ.. ప్రతి మహిళకూ రన్నింగ్ అవసరం అని, అది వాళ్లకు ఆరోగ్యాన్నీ, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని చెప్పే ఉద్దేశంతో బృందా ఈ డాక్యుమెంటరీని తీశారు. -
నగ్న ఫోటోలతో గృహిణికి బెదిరింపులు.. ఆత్మహత్య
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లోని తూరు మిడ్నాపూర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ గృహిణి మొబైల్ నుంచి ఆమె వ్యక్తిగత ఫోటోలను స్వాధీనం చేసుకున్న కొందరు విద్యార్థులు.. వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బ్లాక్ మెయిల్‌కు దిగారు. ఆ వేధింపులను తట్టుకోలేక చివరకు గృహిణి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త ఉద్యోగరిత్యా ఒడిషాలో పని చేస్తుండగా.. సదరు మహిళ(35) తన కూతురితో చండీపూర్‌లో నివసిస్తోంది. కొద్దిరోజుల క్రితం తన కూతురిని డాన్స్ స్కూల్‌కు తీసుకెళ్తున్న క్రమంలో ఆమె తన మొబైల్ ఫోన్‌ను పోగొట్టుకుంది. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివే ఓ విద్యార్థి(17)కి అది దొరికింది. అయితే అందులో ఉన్న ఆమె ఫోటోలన్నీంటిని తన మొబైల్‌కు పంపించుకున్నాడు. తిరిగి మొబైల్‌ను ఆ మహిళకు ఇచ్చేశాడు. వాటిలో కొన్ని అభ్యంతరకరంగా ఉండగా.. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానంటూ ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆ విద్యార్థికి మరో ఇద్దరు స్నేహితులు కూడా సహకరించారు. వేధింపులు ఎక్కువ కావటంతో ఆమె శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. లైంగికంగా వేధించారు... విద్యార్థులు తన సోదరిని లైంగికంగా వేధించారని బాధితురాలి సోదరుడు చెబుతున్నాడు. చనిపోయే ముందు ఆమె విషయాన్ని తనకు చెప్పుకుని రోదించిందని.. సోదరిని ఓదార్చి తాను తిరిగి ఇంటికెళ్లే సరికి అఘాయిత్యానికి పాల్పడిందని అతను అంటున్నాడు. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి. కాగా, ఈ కేసులో ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. -
కాటేసిన కరెంట్
కట్టంగూర్(నకిరకల్) : కరెంట్ కాటుకు ఇద్దరు బలయ్యారు. నల్లగొండ జిల్లాలోని కట్టంగూర్, నిడమనూర్ మండలాల పరిధిలో సోమవారం ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. కట్టంగూర్ మండలం పామనగుండ్ల గ్రామానికి చెందిన కాడెబోయిన పద్మ(28) నూతనంగా నిర్మిస్నున్న ఇంటికి నీళ్లు చల్లుతుండగా కరెంట్ షాక్‌కు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు. గుంటుకగూడెంలో రైతు.. నిడమనూరు: మండలంలోని గుంటుకగూడెం గ్రామానికి చెందిన మేరెడ్డి నర్సింహారెడ్డి(55) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం వ్యవసాయ బావి వద్ద పొలం పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో మోటారు నుంచి స్తంభానికి ఉన్న సర్వీస్ వైరును ఎత్తుగా ఉన్న కర్రలపై పెట్టే ప్రయత్నంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడికి భార్య, వికలాంగురాలైన కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టమ్ అనంతరం సాయంత్రం మృతదేహాన్ని గుంటుకగూడెం తీసుకువచ్చారు. మృతదేహాన్ని చూడగానే కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నం టాయి. మృతుడి భార్యమేరెడ్డి రాధ ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ తెలిపారు. అంతకుముందు ఆస్పత్రిలో నర్సింహారెడ్డి మృతదేహాన్ని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు సందర్శించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. -
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఏలూరు అర్బన్ ః స్వల్ప విషయానికే భర్త తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగ ఝాన్సీ (30), తంబిలకు దాదాపు 12 ఏళ్ళ కిందట వివాహం జరిగింది. నాటి నుంచి దంపతులు లింగపాలెం మండలం అన్నపనేనివారిగూడెంలోఇద్దరు పిల్లలతో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఝాన్సీ తన ఇద్దరు పిల్లలను తీసుకుని సమీపగ్రామంలో జరుగుతున్న ఉత్సవాలకు వెళ్లింది. ఈ ఉత్సవాలలో పిల్లలు మారాం చేయడంతో రూ. 200లతో ఆట వస్తువులు కొనిచ్చింది. అనంతరం తిరిగి ఇంటికి రాగా అదే రోజు రాత్రి పిల్లలకు ఆటవస్తువులు కొనివ్వడానికి రెండు వందలు ఎందుకు ఖర్చు చేశావంటూ భర్త తంబి భార్యను తీవ్రంగా మందలించాడు. దాంతో జీవితంపై విరక్తి చెందిన ఝాన్సీ రాత్రి వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు తీవ్రగాయాలపాలైన బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేక పోవడంతో బాధితురాలు ఝాన్సీ ఆసుపత్రిలోనే మృతి చెందింది. -
హత్యా.. ఆత్మహత్యా..?
►అనుమానాస్పదంగా వివాహిత మృతి ►నేలను తాకేలా నైలాడ్ తాడుకు వేలాడుతున్న మృతదేహం ► అల్లుడే హతమార్చాడని ఆమె తల్లిదండ్రుల ఆరోపణ రాజమహేంద్రవరం క్రైం : వివాహిత అనుమానాస్పదంగా మరణించిన సంఘటన స్థానిక మదన్‌సింగ్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కెల్లా సత్య వెంకట ప్రభాకరరావు స్థానిక మదన్‌సింగ్‌పేటలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన మొదటి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో, 11 ఏళ్ల క్రితం రాచపల్లి గ్రామానికి చెందిన సింహాచలం అలియస్ రాణి అలియాస్ సుధ(36)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదో తరగతి చదువుతున్న కుమారుడు ఆది ప్రణిత్ ఉన్నాడు. రాజమహేంద్రవరంలోనే ప్రభాకరరావు న్యాయవాద వృత్తి చేస్తున్నారు. ఇలాఉండగా ఆదివారం తెల్లవారుజామున సుధ మెడకు నైలాన్ తాడు కట్టి, గుమ్మానికి వేలాడుతూ కనిపించింది. రాత్రివేళ ఎవరో తనను తాడుతో గట్టిగా నొక్కుతుండగా అమ్మా అని కేకలు పెట్టడంతో వారు పారిపోయారని, పక్కగదిలో పడుకున్న తండ్రి వద్దకు వెళ్లి, నిద్రలేపగా.. ఆయన వచ్చి చూసేసరికి తల్లి మృతదేహం తలుపు వద్ద వేళాడుతూ కనిపించినట్టు ప్రణిత్ పేర్కొన్నాడు. అతడి మెడకు తాడుతో నొక్కినట్టు గుర్తులు కనిపించాయి. అల్లుడే హతమార్చాడని ఆరోపణ తమ కుమార్తెను అల్లుడు ప్రభాకరరావు హతమార్చాడని సుధ తల్లిదండ్రులు యాళ్ల నాగేశ్వరరావు, అన్నపూర్ణ ఆరోపించారు. మొదటి భార్యనూ అతడు పొట్టనబెట్టుకున్నాడని, ఇది తెలియక తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేశామని పేర్కొన్నారు. తన కుమార్తె సమక్షంలోనే మరో మహిళతో చనువుగా ఉంటూ, భార్యను కించపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ వేధిస్తున్నాడంటూ కుమార్తె చెప్పినా, సర్దుకుపోవాలంటూ కాపురానికి పంపించేవారమని, చివరకు కడుపుకోత మిగిలిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమlమనవడు ప్రణిత్ను కూడా అతడే హతమార్చేందుకు యత్నించి ఉంటాడని ఆరోపించారు. మృతిపై అనుమానాలు కాగా, సుధ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తలుపుపై భాగంలో నైలాన్ తాడుతో వేలాడదీసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కాళ్లు నేలను తాకుతుండడం దీనికి బలం చేకూరుస్తోంది. గదిలో ఫ్యాన్ ఉండగా, తలుపు పైన కిటికీకి ఎందుకు ఉరి వేసుకుంది, రోజూ పడుకునే గదిలో కాకుండా ముందుగదిలో భర్త ఎందుకు పడుకున్నాడనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాఉండగా సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నగలు, నగదుతో గృహిణి అదృశ్యం
చిలకలగూడ : ఇంట్లో ఉన్న నగలు, నగదుతో గృహిణి అదృశ్యమైన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మౌలాలీకి చెందిన రాజు, మల్లిక (32)లు భార్యభర్తలు, వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా సికింద్రాబాద్ వారాసిగూడలో ఉంటు పాలవ్యాపారం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం రాజు తన పిల్లలను స్కూలుకు దిగబెట్టేందుకు వెల్లగా, మల్లిక రెండు ఏటీఎం కార్డుల నుంచి రూ.80వేలు విత్‌డ్రా చేసి, ఆ సొమ్ముతోపాటు ఇంట్లోఉన్న 10 తులాల బంగారు ఆభరణాలు,రూ.3 లక్షల నగదు తీసుకుని అదృశ్యమైంది. పిల్లలను స్కూలుకు దిగబెట్టి ఇంటికి వచ్చిన రాజుకు భార్య మల్లిక కనిపించలేదు. సన్నిహితులు, బంధుమిత్రులను వాకబు చేసినా ఫలితంలేకపోయింది. ఇంట్లోని నగదు, నగలుతోపాటు తన భార్య కనిపించకపోవడంతో భర్త రాజు పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
వివాహితపై స్నాచర్స్ దాడి
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఆగంతకులు ఓ మహిళ మెడలో పుస్తెల తాడును తెంపుకుపోయారు. శుక్రవారం రాత్రి జంగంమెట్ యాదగిరి కాలనీలో అనసూయ (50) అనే మహిళ ఇంటి ముందు నడుస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆగారు. ఒకడు కిందకు దిగి ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని వచ్చిన బైక్‌పై పరారయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, ఆగంతుకుల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. -
సూటిపోటి మాటలకు కలత చెంది..
మీర్పేట్: అత్త, మామ, భర్త తరుచూ సూటిపోటి మాటలతో మానసిక వేదనకు గురిచేస్తున్నారన్న కలతతో ఓవివాహిత బలవన్మరణానికి పాల్పడింది. మీర్పేట్ ఎస్సై భాస్కర్ తెలిపిన వివరాల మేరకు నగరంలోని ఎన్టీఆర్నగర్లో నివాసం ఉంటున్న రుక్మిణి(21)కు మీర్‌పేట్‌కు చెందిన సంతోష్(27)తో 2013లో వివాహం జరిగింది. వీరికి 8నెలల పాప కూడా ఉంది. ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న సంతోష్ తల్లి జ్యోతి, తండ్రి శ్యాంతో కలిసి మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మీర్పేట్ నందిహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరులేని సమయంలో బెడ్రూంలో ఉన్న సీలింగ్ ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రతి చిన్న పనికి కూడా భర్త, అత్త, మామలు సూటిపోటీ మాటలతో వేధిస్తుండేవారని దీంతో విసుగు చెంది రుక్మిణి ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై తెలిపారు. మృతురాలి సోదరుడి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. -
గృహిణి అదృశ్యం
హైదరాబాద్: నగరంలో ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎన్.చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... వినాయక్‌నగర్‌లో నివాసముండే భవాని (19), నరేష్ భార్యాభర్తలు. భవాని ఇళ్లలో పనులు చేస్తూ ఉంటోంది. కాగా శనివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన భవాని తిరిగి ఇంటికి రాలేదు. భర్త నరేష్ వెతికినా ఆచూకి లభించకపోవడంతో ఆదివారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ వేధింపులకు వివాహిత బలి
నల్లగొండ: ప్రేమ వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా... చికిత్స పొందుతూ బాధితురాలు ఆదివారం మృతి చెందింది. నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన వల్లపుదాసు శైలజ(25)ను అదే గ్రామానికి చెందిన చెనగాని గోపి కొంత కాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. శైలజ భర్త లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతడు విధులకు వెళ్లడంతో... గోపి ఆదివారం కూడా శైలజను వేధింపులకు గురి చేశాడు. దీంతో ఆమె కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితురాలిని తొలుత సూర్యాపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా... పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శైలజ మృతి చెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
వి.కోట: ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జౌనిపల్లె గ్రామానికి చెందిన సరస్వతి(26)కు తీవ్ర అస్వస్థతకుగురి కాగా భర్త, అత్త కలసి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సరస్వతి ఆదివారం సాయంత్రం మృతి చెందింది. మృతురాలికి విష ప్రయోగంతోనే ఆమె మృతి చెందిందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
గృహిణి ఆత్మహత్య
హైదరాబాద్ క్రైం: అత్తింటి వేధింపులు తాళలేక ఓ గృహిణి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలోని లాలగూడ పరిధిలోని విజయపురికాలనిలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన ఎం. గాయత్రి గురువారం ఉదయం వెంట్రుకలు నల్లగా మారడానికి ఉపయోగపడే నూనె తాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఇంట్లో సూసైడ్ లెటర్ దొరికింది. పెళ్లయినప్పటినుంచే అత్తింటి వాళ్లు వేధిస్తున్నారని, తాజాగా తనకూతురికి తనమీద లేనిపోనివి చెబుతున్నారని, భర్తతో పాటు అత్తమామలు ఆడబిడ్డ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లెటర్లో పేర్కొంది. గాయత్రి (38) కి లీలాప్రసాద్‌తో18 ఏళ్ల క్రితం ప్రేమ వివాహమైంది. వారికి పదోతరగతి చదువుతున్న కూతురు ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యప్తు చేస్తున్నారు. -
కుటుంబ కలహాలతో గృహిణి ఆత్మహత్య
వలిగొండ: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్గొండ జిల్లాలోని వలిగొండ మండలం గోకారం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. గోకారం గ్రామానికి చెందిన కడగంటి మంజుల(30)కి కుటుంబ సభ్యులకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కిరోసిన్ పోసుకుని నిప్పుంటించుకుంది. కాలిన గాయాలతో అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అతివలకు అందుబాటులో కోర్సులెన్నో..
అనుస్మిత... నగరంలో సాధారణ గృహిణి. అత్తమామ, భర్త, ఇద్దరు పిల్లలతో కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే ఇంటీరియర్ డిజైనింగ్‌లో రెండేళ్ల కోర్సు పూర్తిచేశారు. ప్రస్తుతం ఇంటర్న్‌షిప్ చేస్తున్నారు. కామర్స్‌లో పీజీ పూర్తిచేసిన ఆమె అమెరికాలో ఐదేళ్లపాటు ఓ బ్యాంక్‌లో అడ్వైజర్‌గా సేవలందించారు. తర్వాత మాతృదేశానికి తిరిగి వచ్చి, తన అభిరుచికి తగినట్లు ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సును కెరీర్‌గా ఎంచుకున్నారు. భార్గవి... బీటెక్ పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్‌తో సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్‌లో చేరారు. అక్కడ కొంతకాలం పనిచేశాక తనకు ఇష్టమైన రంగాన్నే కెరీర్‌గా ఎంచుకోవాలని భావించారు. ఉద్యోగం మానేసి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరారు. ప్రస్తుతం బోటిక్‌ను ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. - వీరిద్దరే కాదు.. నగరంలో చాలామంది మహిళలు, గృహిణులు, చదువు మధ్యలో ఆపేసిన యువతులు.. కొంతకాలం ఉద్యోగం చేసి ఆర్థికంగా నిలదొక్కుకున్నాక తమ ఆసక్తికి తగిన కోర్సులో చేరిపోతున్నారు. ఇష్టమైన వ్యాపకాన్నే కెరీర్‌గా ఎంచుకొని విజయాలు సాధిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది సొంతంగా వ్యాపార నిర్వహణ వైపు మొగ్గుచూపుతుండడం విశేషం. తద్వారా భవిష్యత్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తూ ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. మహిళల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రత్యేకంగా పలు షార్ట్‌టర్మ్, లాంగ్‌టర్మ్, డిస్టెన్స్ కోర్సులను అందిస్తున్నాయి. ఆ వివరాలు.. క్రేజ్.. సోషల్ ఇమేజ్ నగరంలో కార్పొరేట్ కల్చర్‌తోపాటు మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అందం, ఆహారం, ఆరోగ్యం, అలంకరణ, ఫ్యాషన్, జువెలరీ డిజైనింగ్ వంటి అంశాలకు ఆదరణ పెరిగింది. దానికి తగినట్లుగానే ఆయా రంగాల్లో నిపుణులకు డిమాండ్ అధికమైంది. దాంతో వీటిని కెరీర్‌గా ఎంచుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని నిఫ్ట్-హైదరాబాద్ డిప్యూటీ డెరైక్టర్ గోపాలకృష్ణ చెప్పారు. ముఖ్యంగా ఫ్యాషన్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైన్, జెమ్, జువెలరీ అంశాల్లో అర్హత, నెపుణ్యాలను పెంచుకునేందుకు సిటీ మహిళలు,యువతులు మొగ్గు చూపుతున్నారని విశ్లేషించారు. వీటితో కెరీర్ ప్రారంభించి ఆర్థికంగా నిలదొక్కుకోవడంతోపాటు కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్నారని వెల్లడిం చారు. అంతేకాకుండా పలువురికి ఉపాధి కల్పించడం ద్వారా సమాజంలో మంచి పేరు కూడా సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. స్వతహాగా ఆర్ట్, డిజైనింగ్ వంటి కళాత్మక అంశాలకు వనితలు ఎక్కువ ప్రాధాన్యతనిస్తార ని అన్నారు. నానాటికీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా గృహిణులు సైతం కుటుంబానికి తమ వంతు తోడ్పాటునివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. వీరితోపాటు గ్రాడ్యుయేషన్, పీజీలు చేసిన యువతులు కూడా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఆసక్తి చూపుతున్నారు. తమకిష్టమైన కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లలో చేరి నైపుణ్యాల్ని పెంచుకుంటున్నారు. తద్వారా ఆర్థిక స్వాతంత్య్రంతోపాటు ఆత్మవిశ్వాసాన్నీ సొంతం చేసుకుంటున్నారు. అందం నుంచి అలంకరణ వరకు... నగర పరిస్థితులు, ఇక్కడి మార్కెటింగ్ అవకాశాలకు అనుగుణంగా ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు మహిళాలకు ఎన్నోకోర్సులను అందిస్తున్నాయి. బ్యూటీషియన్ నుంచి ఎయిర్‌హోస్టెస్ వరకు ప్రత్యేకంగా మహిళల కోసం కొన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి. నెలల వ్యవధి ఉన్న కోర్సుల నుంచి మూడేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సుల వరకు అభ్యసించే అవకాశం ఉంది. సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, అడ్వాన్స్డ్ డిప్లొమా, పాలిటెక్నిక్ డిప్లొమా, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఈ కోర్సులను చదవొచ్చు. బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్, అప్పెరల్ డిజైనింగ్, గార్మెంట్ టెక్నాలజీ, ఇంటీరియర్ డిజైనింగ్, క్యాండిల్ మేకింగ్, యోగా, చాక్లెట్ మేకింగ్, సలాడ్ మేకింగ్, జెమాలజీ, జువెలరీ డిజైన్, జువెలరీ మేకింగ్, డైమండ్ గ్రేడింగ్, డైమండ్ సర్టిఫికేషన్, డైటీషియన్, హోమ్‌సైన్స్, లెదర్ టెక్నాలజీ, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్, స్కూల్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌టాయ్స్ మేకింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కటింగ్ అండ్ టైలరింగ్, బంజారా అండ్ మిర్రర్ వర్క్.. ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. నిఫ్ట్‌లో 3 నెలలు, 6 నెలలు, ఏడాది వ్యవధిలో ఫ్యాషన్ బ్రాండ్ మేనే జ్మెంట్, ఫ్యాషన్ క్లాతింగ్ టెక్నాలజీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్, ఫ్యాషన్ ఇంటిగ్రేషన్, మార్కెటింగ్ అప్లికేషన్ ఫర్ టెక్స్టైల్స్, కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, క్లాతింగ్ ప్రొడక్షన్ టెక్నాలజీ కోర్సులున్నాయి. వీటిలో చేరేందుకు ఆయా కోర్సులను బట్టి ఎనిమిదో తరగతి నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులు అర్హులు. కళలకు డిమాండ్ భారతావని ప్రాచీన కాలం నుంచి కళలకు పెట్టింది పేరు. సంగీతం, నాట్యం వంటివాటిపె ఆసక్తి ఉన్నవారికి నగరంలో పలు విద్యా సంస్థలు కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. కర్ణాటక సంగీతం, వయోలిన్, వీణ, మృదంగం, నాదస్వరం, కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం, సితార్, తబలా, వేణువు, డోలు, లలిత సంగీతం, పేరిణి నృత్యం, జానపద సంగీతం.. వంటివాటిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. భాగ్యనగరిలో ఆంధ్ర మహిళా సభ ఫైన్ఆర్ట్స్ కళాశాల, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రాష్ట్ర ప్రభు త్వ సంగీత, నృత్య కళాశాలలు వంటివి ఆయా విభాగాల్లో సర్టిఫికెట్ కోర్సుల నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు వివిధ కోర్సులను అందిస్తున్నాయి. సంస్థలు, కోర్సులు.. నగరంలో ఆయా కోర్సులను అందించే విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (జేఎన్ఏఎఫ్ఏయూ) ఇంటీరియర్ డిజైన్ కోర్సులను అందిస్తోంది. వెబ్సైట్: www.jnafau.ac.in మాదాపూర్‌లోని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ కేంద్రం.. సర్టిఫికెట్ ఇన్ న్యూట్రిషన్ అండ్ చైల్డ్‌కేర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్; డిప్లొమా ఇన్ ఎర్లీచైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: http://rchyderabad.ignou.ac.in/ రాజేంద్రనగర్‌లోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం హోమ్‌సైన్స్‌లో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీని అందిస్తోంది. వెబ్సైట్: www.angrau.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్).. ఫ్యాషన్ డిజైనింగ్, టెక్నాలజీలో అనేక కోర్సులను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.nift.ac.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్(ఎంఎస్ఎంఈ), అప్పెరల్ ట్రైనింగ్ అండ్ డిజైన్ సెంటర్- మాదాపూర్, గవర్నమెంట్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజ్ - వెస్ట్ మారేడుపల్లి, సెట్విన్ వంటివి అనేక కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో కూడా ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆత్మవిశ్వాసం.. ఆర్థిక ఆలంబన ‘‘గతంతో పోల్చితే ప్రస్తుతం కుటుంబ ఖర్చులు పెరిగాయి. పిల్లల చదువుకు అధిక భాగం వెచ్చించాల్సి వస్తోంది. దీంతో ఫురుషులతోపాటు మహిళలు కూడా పనిచేయాల్సి వస్తోంది. ఉద్యోగం చేసే మహిళలకు సొంతంగా ఉపాధి పొందాలనే ఆలోచన పెరుగుతోంది. దీంతో హోమ్‌సైన్స్, ప్లేస్కూల్ టీచర్ ట్రైనింగ్, అప్పెరల్, ఫ్యాషన్ డిజైనింగ్, ఫుడ్ మేకింగ్, యోగా, డ్యాన్స్, ఫిట్నెస్ వంటి అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. దీనివల్ల తమకిష్టమైన పని చేస్తున్నామనే ఆనందం, ఆత్మసంతప్తి లభిస్తాయి. హోమ్‌సైన్స్ కోర్సుల్లో ఫుడ్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, అప్పెరల్ అండ్ టెక్స్టైల్స్, ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, ఇంటీరియర్ డిజైన్ వంటి అంశాల్లో మూడేళ్లపాటు శిక్షణ ఉంటుంది. తమకు ఆసక్తి ఉన్న రంగా న్ని కెరీర్‌గా ఎంచుకోవచ్చు. లేదంటే.. తామే పదిమందికి ఉపాధి కల్పిం చేందుకు ప్లేస్కూల్స్, చిన్నతరహా పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చు’’ -ఎస్.నిర్మలాదేవి, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ డొమెస్టిక్ సైన్స్ ట్రైనింగ్ కాలేజీ, సికింద్రాబాద్ -
సమయాన్ని, జీవితాన్ని వృథా కానీయకండి!
వాయనం: గృహిణి అనగానే... ఇంట్లో ఉండి వంట చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉండే మహిళ అని ఠక్కున నిర్వచించేస్తారంతా. గృహిణులు ఇవి మాత్రమే చేయాలా? చేయడానికి వారికింకేమీ ఉండదా? అసలు వారు ఇవి తప్ప ఏమీ చేయలేరా? చేయగలరు. ఇంట్లో ఉంటూనే చాలా చేయగలరు. ఆ నిజాన్ని గ్రహించక చాలామంది మహిళలు తమ సమయాన్ని వృథా చేసుకుంటున్నారు. తమను తాము నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. పెళ్లి, కొత్త కాపురం, పిల్లలు, వారి పెంపకం అంటూ కొన్ని సంవత్సరాలు వేగంగా పరుగులు తీస్తాయి. అప్పుడు వేరేదాని గురించి ఆలోచించే తీరిక దొరకదు. కానీ పిల్లలు కాస్త ఎదిగి, బడికి వెళ్లిపోవడం మొదలుపెట్టాక జీవితంలో కాస్త మార్పు వస్తుంది. అందరూ బయటకు వెళ్లిపోయిన తరువాత ఇంటితో పాటు మనసు కూడా ఖాళీ అయిపోతుంది. బోర్ కొడుతుంది. ఏదైనా చేస్తే బాగుణ్ను అనిపిస్తుంది. ఏం చేయాలో అర్థం కాక కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఒక్కోసారి ఇంతేనా జీవితం అనిపిస్తుంది. నిజమే. జీవితమంటే అంతే కాదు. ఇంకా ఎంతో ఉంది. చదువు లేదని, తమకు ఉద్యోగం చేసే అర్హత లేకపోవడం వల్ల ఇంటికే పరిమి తమైపోయామని కుమిలిపోయే మహిళల సంఖ్య తక్కువేమీ కాదు. అయితే జీవితంలో ఏదో ఒకటి సాధించాలంటే ఏ అర్హతలు కావాలి? డిగ్రీలు పుచ్చుకుని ఉద్యోగాలు చేయాలా? రోజూ ఆఫీసుకెళ్లి టార్గెట్లు అందుకోవడానికి పరుగులు తీయాలా? అవసరం లేదు. లేని దాని కోసం బెంగ పడాల్సిన పనిలేదు. మనకున్న అర్హత ఏంటో తెలుసుకుంటే చాలు... ఏదో ఒకటి సాధించడానికి. వంట బాగా చేస్తారా... ఇంట్లోనే కర్రీ పాయింట్ ఎందుకు పెట్టకూడదు? పచ్చళ్లు బాగా పెడతారా... పెట్టి ఎందుకు అమ్మకూడదు? కుట్లు వచ్చా... ఇంట్లోనే పదిమందికీ ఎందుకు నేర్పకూడదు? మీరే టైలరింగ్ పని చేసి ఎందుకు సంపాదించ కూడదు? అల్లికలు, బొమ్మల తయారీ వంటివి తెలుసా... తయారుచేసి చుట్టు పక్కలవాళ్లకు ఎందుకు అమ్మకూడదు? గోరింటాకు బాగా పెడతారా... ఫంక్షన్లకు మెహందీ పెడతానంటూ ఇంటిముందు ఓ బోర్డు ఎందుకు పెట్టకూడదు? కాస్తో కూస్తో చదువుకున్నారా... చిన్నపిల్లలకైనా ట్యూషన్లు ఎందుకు చెప్పకూడదు? చేసే ఓపిక, చేయాలనే మనసు ఉండాలే గానీ... చేసేందుకు ఎన్నో పనులు కనిపిస్తాయి. వాటిని చేసేందుకు మీలో మీకు ఎన్నో అర్హతలు కనిపిస్తాయి. అయితే ఇదేదో డబ్బులు సంపాదించడానికే కాదు. మీరు మధ్య తరగతి వారైతే మీ సంపాదన మీవారి సంపాదనకు తోడవుతుంది. ఇంటి అవసరాలను తీరుస్తుంది. ఆ అవసరం లేదు అనుకుంటే... మీరు చేసే పనితో మీ సమయం సద్వినియోగం అవుతుంది. మీరు చేసే పని పదిమందికీ తెలిసి ప్రశంసలు లభిస్తే కలిగే ఆనందమే వేరు. మీ పేరు మీ చుట్టుపక్కల మారుమోగితే ఆ తృప్తే వేరు. మీరు సంపాదించిన ఆ కాసింత సొమ్ముతో మీ ఇంటిలో ఓ చిన్న వస్తువును సమకూర్చగలిగినా లభించే సంతోషమే వేరు. కాబట్టి ఇక సమయాన్ని వృథా చేయకండి. సమయం వృథా అయితే... జీవితం వృథా అయినట్టే! గుడ్డు తినమంటే పిల్లలు గంతులేస్తారిక! రోజూ పొద్దున్నే పిల్లలకు ఓ గుడ్డు తినిపిస్తే మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ పిల్లలతో ఏదైనా చేయించాలంటే అంత తేలిక కాదు కదా! ఒకట్రెండు రోజులు తింటారు, మూడో రోజు పేచీ పెడతారు. అలాంటి తుంటరి పిల్లలతో రోజూ గుడ్డు తినిపించడానికి ఓ మంచి మార్గం దొరికిందిప్పుడు. ఈ ఫొటోలో కనిపిస్తున్నవి ‘ఎగ్ మోల్డ్స్’. వీటికి ఉన్న గుంతలు రకరకాల ఆకారాల్లో ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్డును మోల్డ్‌లో ఉంచి, మూత పెట్టి గట్టిగా నొక్కి, తర్వాత బయటకు తీసి చూస్తే... మోల్డ్‌లో ఉన్న బొమ్మ ఆకారంలోకి గుడ్డు మారిపోతుంది. వాటిని చూస్తే పిల్లలు సరదా పడి చకచకా తినేస్తారు. కావాలంటే ట్రై చేసి చూడండి. రెండు మోల్డ్స్ ధర రూ. 720. ఆన్లైన్లో అయితే కాస్త తక్కువకు వస్తాయి. -
గృహిణిని నిర్బంధించి సామూహిక అత్యాచారం
ఠాణే: మహిళలపై మృగాళ్ల ఆగడాలు రోజు రోజుకూ శృతిమించుతూనే ఉన్నాయి. అత్యాచార ఘటనలకు సంబంధించి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా వారి ఆకృత్యాలకు హద్దూ అదుపు లేకుండా పోతుంది. జిల్లాలోని దివాలో ఓ గృహిణిపై ముగ్గురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ మధ్యలో ఆమెను తన ఇంట్లోనే బంధించి పలుమార్లు ఈ ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతామని బాధితురాలిని బెదిరించారు. ఈ నేరం చేసేలా నిందితులను ప్రేరేపించిన ఓ మహిళపై కూడా పోలీసులు కేసు నమోదుచేశారు. నిందితులు బట్టూ, బలియా, వారి స్నేహితుడు గుర్తించారు. బాధితురాలి భవనంలోనే ఉంటున్న సోనియా అనే మహిళ ఆ ముగ్గురు దుండగులకు సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.