పీఎస్లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు | Ramadevi's husband surrender in saroor nagar police station | Sakshi
Sakshi News home page

పీఎస్లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు

Published Thu, Nov 7 2013 11:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM

పీఎస్లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు

పీఎస్లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు

వారసుడు లేడనే నెపంతో ఇల్లాలు రమాదేవిని వేధించడమే కాకుండా పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటివేసిన కేసులో ఆమె భర్త సంతోష్ కుమార్తోపాటు ఆమె అత్తామామలు గురువారం ఉదయం సరూర్నగర్ మహిళ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుత్రుడిని కనివ్వలేదని రమాదేవిని భర్తతోపాటు, అత్తమామలు తరుచుగా వేధించేవారు. దాంతో ఆమెను పుట్టింటికి పంపేశారు. కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉన్న రమాదేవి బుధవారం దిల్సుఖ్నగర్ పరిధిలోని వికాస్నగర్లోని మెట్టినింటికి వచ్చింది.

 

ఆమె రాకను ముందుగా గమనించిన ఆమె భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రమాదేవికి మెట్టినింటి ముందు బైఠాయించింది. రమాదేవి ఘటనకు సంబంధించిన కథనం సాక్షి టీవీలో ప్రసారం కావడంతో సరూర్నగర్ మహిళ పోలీసులు స్పందించారు.

 

వెంటనే రమాదేవి వద్దకు వచ్చి మహిళా పోలీసులు విషయం తెలుసుకున్నారు. అనంతరం భర్త సంతోష్కుమార్, ఆమె అత్తామామలపై సరూర్ నగర్ మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు.  దాంతో రమాదేవి అత్తామామలు గురువారం సరూర్నగర్ మహిళా పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement