santhosh kumar
-
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్
-
ఎగుమతులు మూడో నెలా డౌన్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు కూడా వరుసగా అయిదో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 14 శాతం క్షీణించి 49.9 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఏప్రిల్‌లో ఇవి 58.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరప్‌లో డిమాండ్ అంతగా లేకపోవడం .. ఎగుమతులు మందగించడానికి కారణమైంది. పరిస్థితి మెరుగుపడటానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ‘యూరప్, అమెరికాలో డిమాండ్ క్షీణించింది. వచ్చే 2–3 నెలలు కూడా అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయితే, చైనా ఎకానమీ కోలుకుని.. యూరప్, అమెరికా మార్కెట్లలో కూడా కాస్త డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ఆగస్టు–సెప్టెంబర్ తర్వాత నుంచి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. 20 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు .. ఎగుమతులు, దిగుమతుల మందగమనంతో ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 20 నెలల కనిష్టమైన 15.24 బిలియన్ డాలర్లకు తగ్గింది. చివరిసారిగా 2021 ఆగస్టులో వాణిజ్య లోటు ఇంతకన్నా తక్కువగా 13.81 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో ఇది 18.36 బిలియన్ డాలర్లుగా ఉంది. కమోడిటీల ధరలు, రత్నాభరణాల్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో దిగుమతులు తగ్గినట్లు సారంగి వివరించారు. ఎగుమతులపరంగా రాబోయే రోజుల్లోనూ రత్నాభరణాలు, కొన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, దుస్తులపై ప్రభావం ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారమున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నూనె గింజల్లాంటి వాటిపై వ్యాపారవర్గాలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. 2022–23 గణాంకాల సవరణ.. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను వాణిజ్య శాఖ ఎగువముఖంగా సవరించింది. దీని ప్రకారం.. ► 2022–23లో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులు 14.68 శాతం వృద్ధి చెంది 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 17.65 శాతం పెరిగి 894.19 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 118.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► ఉత్పత్తుల ఎగుమతులు 6.74% వృద్ధితో 450.43 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 16.47% పెరిగి 714 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► సేవల ఎగుమతులు 27.86 శాతం ఎగిసి 325.44 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 22.54 శాతం పెరిగి 180 బిలియన్ డాలర్లకు చేరాయి. -
పేట్ల బురుజు ఆస్పత్రికి ప్రత్యేక స్థానం
సాక్షి, హైదరాబాద్: తాను జన్మించిన పేట్ల బురుజు ఆస్పత్రి అభివృద్ధికి కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ ఆస్పత్రి అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.కోటి వెచ్చిస్తానని గతంలో తానిచ్చిన హామీ మేరకు మొదటి విడతగా రూ.50 లక్షలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు రూ.50 లక్షలు మంజూరు ఉత్తర్వులను మంగళవారం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.మాలతికి అందజేశారు. -
30 ఏళ్ల క్రితం కొండగట్టుకు సీఎం కేసీఆర్.. ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్లిన నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్.. తమ చిన్ననాటి మధురస్మృతులను గుర్తు చేసుకున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం పెద్దనాన్న కేసీఆర్, సోదరి కల్వకుంట్ల కవిత, పెద్దమ్మ శోభ, తల్లిదండ్రులు రవీందర్రావు, శశికళతో కలిసి కొండగట్టుపై దిగిన ఫొటోలను ఆయన ట్విటర్లో పోస్టు చేశారు. ‘ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధిలో ఇప్పుడు కొండగట్టు వంతు వచ్చింది. సీఎం కేసీఆర్, కుటుంబ సభ్యులతో కలిసి అనేకసార్లు కొండగట్టు అంజనేయస్వామిని దర్శనం చేసుకున్నాం. కొండగట్టు వ్యూ పాయింట్ నుంచి అప్పటి అపురూప చిత్రాలు..’ అంటూ కుటుంబంతో కలిసి దిగిన పాత ఫొటోలు పోస్టు చేశారు. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. Now it’s #Kondagattu’s turn for its overal facelift by developing another landmark mythological structure. #Throwback pics from the view point place, when we had numerous Darshans of Kondagattu Anajanna along with our Hon’ble CM Sri KCR garu and family. pic.twitter.com/Rz31qoggA1 — Santosh Kumar J (@MPsantoshtrs) February 15, 2023 కాగా సీఎం కేసీఆర్ బుధవారం కొండగట్టు అంజన్న ఆలయ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కొండగట్టును ప్రపంచాన్నే ఆకర్షించే అతిపెద్ద హనుమాన్ క్షేత్రంగా తీర్చిదిద్దాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆగమశాస్త్ర ప్రకారం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని, అందుకోసం రూ.1,000 కోట్లు ఖర్చయినా ఫర్వాలేదని చెప్పారు. -
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలి: సల్మాన్ ఖాన్
Salman Khan Participate In Green India Challenge 5.0: ఒక్కో మొక్క ఒక్కో మనిషికి సరిపడా ఆక్సిజన్ ను అందిస్తుందన్నారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. 'కభీ ఈద్ కభీ దివాలీ' సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలి. అని కోరారు. ఇంకా సల్మాన్ మాట్లాడుతూ అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ఈ పనికి జోగినిపల్లి సంతోష్ కుమార్ “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా బాటలు వేసారని.. దాన్ని మనం కొనసాగిస్తే మన నేలను, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చని సల్మాన్ తెలిపారు. నా అభిమానులంతా విధిగా “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో పాల్గొని విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. (చదవండి: కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..) అనంతరం రాజ్యసభ సభ్యుడు, జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ 'పెద్ద మనసుతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటుదామని చెప్పగానే వచ్చి మొక్కలు నాటిన సల్మాన్ ఖాన్‌కు కృతజ్ఞతలు. మీరు మొక్కలు నాటడం వల్ల కోట్ల మంది అభిమానులకు స్పూర్తిగా నిలుస్తుంది' అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సినిమా బృందంతో పాటు “గ్రీన్ ఇండియా చాలెంజ్” కో ఫౌండర్ రాఘవ, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: లారెన్స్ బిష్ణోయ్ ముఠా హిట్ లిస్ట్‌లో కరణ్ జోహార్..) #GreenIndiaChallenge is delighted to have the Bollywood Sultan in Hyderabad. Euphoric to have the company of @BeingSalmanKhan to plant saplings. He not only accept our invitation but felt proud to be part of #GIC. This would definitely inspire millions of his fanbase to replicate pic.twitter.com/yylnOdqO2P — Santosh Kumar J (@MPsantoshtrs) June 22, 2022 -
బొర్రా అందాలు అమోఘం
అనంతగిరి/అరకులోయ రూరల్: ప్రముఖ పర్యాటక కేంద్రమైన బొర్రాగుహల అందాలు అమోఘంగా ఉన్నాయని కమిటీ ఆఫ్ స్టడీ ఆన్ పబ్లిక్ సెక్టార్‌పై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ సంతోష్‌కుమార్ గన్వర్ చెప్పారు. ఆదివారం ఆయన, కమిటీ సభ్యులు జనార్దన్‌మిశ్రా, ఓంప్రకాష్ మాతుర్, పార్లమెంట్ సెషన్స్ సెక్రటరీ త్రిపాఠి బొర్రా గుహలు, అరకులోయను సందర్శించారు. సహజసిద్ధంగా ఏర్పడిన గుహలు అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. గైడ్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అరకులో గిరిజన సంప్రదాయ థింసా నృత్యాల నడుమ కమిటీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం వారు గిరిజన మ్యూజియం, కాఫీ మ్యూజియం తిలకించారు. పర్యాటకశాఖ నుంచి బొర్రా పంచాయతీకి రావాల్సిన బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కమిటీకి బొర్రా సర్పంచ్ అప్పారావు వినతిపత్రం అందజేశారు. బొర్రా నుంచి పెద్దూరు గ్రామానికి వెళ్లే మార్గంలో రైల్వేట్రాక్ వల్ల ఇబ్బందిగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ పర్యటన సందర్భంగా అరకులోయ సీఐ దేముడుబాబు నేతృత్వంలో అనంతగిరి, అరకులోయ ఎస్ఐలు రాము, నజీర్ బందోబస్తు నిర్వహించారు. తహసీల్దారులు వెంకటవరప్రసాద్, వేణుగోపాల్, ఎంపీడీవోలు నగేష్, రాంబాబు, ఏరియా సూపరింటెండెంట్ హరి, అనంతగిరి పీహెచ్సీ వైద్యాధికారి అనూషారావు తదితరులు పాల్గొన్నారు. -
మొక్కకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టిన విశాల్
మాదాపూర్: తాను నాటిన మొక్కకు పునీత్ రాజ్‌కుమార్ పేరు పెట్టారు నటుడు విశాల్. ఎనిమీ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన సినీ నటులు విశాల్, ఆర్య, మృణాళిని రవి.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ తన స్నేహితుడు పునీత్ రాజ్‌కుమార్ గుర్తుగా మొక్కని నాటినట్టు తెలిపారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో ఆయన ప్రారంభించిన ఈ చాలెంజ్ గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టడానికి దోహదపడుతుందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని సూచించారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ వృక్షవేదం పుస్తకాన్ని ఎనిమీ చిత్రబృందానికి అందజేశారు. -
చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్
శంషాబాద్ రూరల్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో ఉన్న ఆశ్రమంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్‌స్వామి శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత యాద్రాది ప్రారంభోత్సవంపై జీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు ఆశ్రమ ఆవరణలో జీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్ ఐదు జమ్మి మొక్కలను నాటారు. ‘ఊరు ఊరుకు జమ్మి–గుడి గుడికి జమ్మి’పేరిట ఎంపీ సంతోశ్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చినజీయర్ స్వామి కొనియాడారు. హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెట్టును జాతీయ స్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న ఆయనకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని జీయర్‌స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్రావు, కావేరి సీడ్స్ అధిపతి భాస్కర్‌రావు, కలెక్టర్ అమెయ్ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. యాద్రాది పర్యటన రద్దు.. ముచ్చింతల్ నుంచి చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ యాద్రాది వెళ్లాలని నిర్ణయించుకోగా.. జీయర్‌స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నందును సాధ్యపడలేదు. నవంబర్ 19 నాటికి స్వామి దీక్ష పూర్తికానుంది. ఆ తర్వాతనే జీయర్ స్వామి యాద్రాదిని సందర్శించే అవకాశాలున్నాయి. కార్యక్రమం వాయిదా పడటంతో సీఎం తిరిగి గజ్వేల్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. జమ్మి మొక్క నాటుతున్న చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్‌కుమార్ -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో నీతిఆయోగ్ సీఈవో
సాక్షి, న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఢిల్లీ మోతీబాగ్‌లోని తన నివాస ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు. టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అమితాబ్‌కాంత్ ఆదివారం మొక్కలు నాటారు. అనంతరం నీతిఆయోగ్ సీఈవోకు వృక్ష వేదం పుస్తకాన్ని సంతోష్ బహూకరించారు. పుస్తక వివరాలతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే మరో ముగ్గురిని ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కి నామినేట్ చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత పాల్గొన్నారు. వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో.. సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ‘ఊరిఊరికో జమ్మిచెట్టు.. గుడిగుడికో జమ్మిచెట్టు’ నినాదంతో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా ఆదివారమిక్కడ జమ్మి మొక్కలను పంపిణీ చేశారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న అమితాబ్, నాగార్జున ఫొటోలు
-
ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ మనవడు బర్త్ డే
సాక్షి, హైదరాబాద్: ’గ్రీన్ ఇండియా చాలెంజ్’లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీ రామారావు కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో మొక్క నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితహారంలో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని హిమాన్షు కోరారు. -
రికార్డు: గంటలో 3.5 లక్షల మొక్కలు నాటారు!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో మొక్కలు నాటే కార్యక్రమం రికార్డులకెక్కింది. పట్టణ శివారు దుర్గానగర్‌లోని 250 ఎకరాల అటవీ ప్రాంతంలో ఆదివారం 35 వేల మంది గంటలో మూడున్నర లక్షల మొక్కలు నాటారు. ఇది టర్కీలో గతంలో 3.2 లక్షల మొక్కలు నాటిన రికార్డును అధిగమించి వండర్బుక్ ఆఫ్ రికార్డ్స్‌కెక్కిందని ఆ సంస్థ ఇండియా ప్రతినిధి బి.నరేందర్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం, మెడల్‌ను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు అందించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పుట్టినరోజు సందర్భంగా జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొత్తంగా జిల్లావ్యాప్తంగా పది లక్షల మొక్కలు నాటినట్టు జోగు రామన్న తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 24 శాతం నుంచి 27 శాతానికి చేరిందన్నారు. ఏడేళ్లుగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు రూ.6 వేల కోట్లు కేటాయించామన్నారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ ప్రకృతి సహజంగా ఆక్సిజన్ అందించేందుకు తన పుట్టినరోజు సందర్భంగా మిలియన్ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. -
పచ్చదనం ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రకృతిలో పచ్చదనం ప్రాముఖ్యత, ఆవశ్యకత తెలిసిన వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని, ఆరేళ్ల క్రితమే ఆయన రాష్ట్రంలో హరిత హారానికి నాంది పలికారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ పేర్కొన్నారు. హరిత తెలంగాణగా మార్చాలనుకుంటున్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా ఆయన పుట్టినరోజున కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం శంషాబాద్ విమానాశ్రయంలో ఎంపీ సంతోష్‌కుమార్ ప్రయాణికులకు ఔషధ మొక్కలు పంపిణీ చేశారు. కొచ్చి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చిన శ్రీనివాస్, సుమలత దంపతులకు ఆయన మొదటి మొక్కను అందజేయగా.. పంజాబ్, ముంబై తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మొక్కలను అందజేసి వాటిని బుధవారం నాటాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ సంతోష్ మాట్లాడు తూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హరితహారం కూడా మంచి సత్ఫలితాలు ఇస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మూడేళ్లుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎన్నో మొక్కలు నాటినట్లు గెయిల్ (జీహెచ్ఐఏఎల్) సీఈఓ ప్రదీప్‌ఫణికర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎంకే సింగ్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్‌రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణకు దేవుడిచ్చిన వరం కేసీఆర్: హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అభివృద్ధి, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని ప్రతీ కుటుంబంలో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ను దేవుడు బహు మతిగా ఇచ్చారని హోం మంత్రి మహమూద్ అలీ కొనియాడారు. అన్ని వర్గాల వారికి లబ్ధి కలిగేలా పథకాలు అమలు చేయడంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. మంగళవారం కేసీఆర్ సేవామండలి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో జరిగిన సీఎం జన్మదిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో నేరాల తగ్గుదలకు హైదరాబాద్‌లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ త్వరలో అందుబాటులోకి రానుందని తెలిపారు. కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని చేపట్టనున్న కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మహోన్నత మేధావి కేసీఆర్: నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి మాటను ఆయుధంగా చేసి సమాజాన్ని మలుపు తిప్పి అహింసతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహోన్నత మేధావి సీఎం కేసీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను సాధించి, రాష్ట్రాన్ని అగ్ర భాగాన నిలిపే ప్రయత్నంలో కేసీఆర్ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులతో కేసీఆర్ మరింత విజయవంతం కావాలని కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. -
ఒక గంటలో కోటి మొక్కలు
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశమంతటా హరిత భావజాల స్ఫూర్తిని వ్యాపింపజేస్తామని ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. తెలంగాణను పర్యావరణపరంగా, అత్యంత నివాసయోగ్యంగా మార్చుకునేందుకు ఈ చాలెంజ్‌లో భాగంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు (ఫిబ్రవరి 17)న కోటి వృక్షార్చన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆ ఒక్కరోజు ఒక్క గంటలో కోటి మొక్కలు నాటి రికార్డు సృష్టించి, హరిత ప్రేమికుడైన కేసీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా ఇవ్వాలనేది గ్రీన్ ఇండియా చాలెంజ్ సంకల్పమన్నారు. ఇటు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఇచ్చిన పిలుపుతో పార్టీ శ్రేణులన్నీ సిద్ధమవుతున్నాయని తెలిపారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు, గ్రామ స్థాయి వరకు పార్టీ పదవుల్లో ఉన్న అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని సంతోష్ పిలుపునిచ్చారు. ఇక కేసీఆర్‌ను అభిమానించే వారితో పాటు వ్యాపార, వాణిజ్య, సినిమా, పారిశ్రామిక, క్రీడా రంగ ప్రముఖులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేం దుకు సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. ఈ నెల 16, 17 రోజుల్లో రెండ్రోజుల పాటు శంషాబాద్ విమానాశ్రమంలో హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులందరికీ ఔషధ మొక్కలను గ్రీన్ ఇండియా చాలెంజ్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. మొక్కలు నాటడం ద్వారా ప్రతీ గ్రామం.. తద్వారా రాష్ట్రం ఆకుపచ్చగా తయారు కావాలని, అందుకోసం అందరి కృషి అవసరమని సంతోష్ ఆకాంక్షించారు. ఎండలు సమీపిస్తున్నందున మొక్కలు నాటడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు, నీటి సౌకర్యం, తగిన రక్షణ కల్పించేలా ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. -
సీఎం పుట్టినరోజున ‘కోటి వృక్షార్చన’: ఎంపీ సంతోష్
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ‘కోటి వృక్షార్చన’పేరిట కోటి మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎంపీ జె.సంతోష్‌కుమార్ వెల్లడించారు. ఒకే రోజు ఒకే గంటలో కోటి మొక్కలు నాటడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మేరకు ‘కోటి వృక్షార్చన’కు సంబంధించిన పోస్టర్‌ను మంత్రులు కేటీ రామారావు, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, ఎంపీ మాలోత్ కవితతో కలిసి శనివారం సంతోష్ ఆవిష్కరించారు. దేశం, రాష్ట్రం హరితమయం కావాలనే సంకల్పంతో గ్రీన్ ఇండి యా చాలెంజ్‌లో పాల్గొంటున్న వారికి వృక్షార్చనకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు. ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటి ఫొటోలను మొబైల్ యాప్‌లో పంపితే సీఎం నుంచి ‘వనమాలి’అనే బిరుదును ఈ–మెయిల్/మొబైల్‌కు పంపిస్తామని వివరించారు. చదవండి: (నీతి ఆయోగ్ సూచన మేరకే పెట్టుబడుల ఉపసంహరణ) చదవండి: (పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం మండలానికో స్టడీ సెంటర్!) -
లోన్ యాప్ వేధింపులు.. యువకుడి ఆత్మహత్య
సాక్షి, ఫెర్టిలైజర్ సిటీ (రామగుండం): ఆన్లైన్ లోన్ యాప్‌ల కారణంగా ఇటీవల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. తాజాగా లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంతోష్‌కుమార్ ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారంలో సైట్ ఇన్చార్జ్గా పనిచేస్తున్నాడు. ఎన్టీపీసీ మల్కాపూర్ గ్రామంలో అద్దెకు ఉంటున్న సంతోష్ ఇంట్లోనే చిన్న కిరాణా దుకాణం కూడా నడుపుతున్నాడు. దీని నిర్వహణకు ఐదు ఆన్లైన్ యాప్‌ల ద్వారా రూ.60 వేల వరకు అప్పు తీసుకున్నాడు. తీసుకున్న అప్పుకు వడ్డీ, అసలు మొత్తం చెల్లించాలని యాప్‌ల నిర్వాహకులు రోజూ బెదిరిస్తుండటంతో భయాందోళనకు గురైన సంతోష్ ఈ నెల 18న ఇంట్లో గడ్డిమందు తాగాడు. చదవండి: (ప్రాణాంతక యాప్‌లు!) ఆన్లైన్ వడ్డీ వ్యాపారులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని మొబైల్ ద్వారా స్నేహితులకు వీడియో పంపించాడు. గమనించిన ఇరుగుపొరుగు వారు గోదావరిఖనిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించారు. ఈ విషయం బాధితుడి కుటుం బసభ్యులకు మిత్రులు సమాచారమందించగా ఈనెల 21న సంతోష్‌ను తూర్పుగోదావరి జిల్లాకు తీసుకెళ్లారు. మెరుగైన చికిత్స కోసం వైజాగ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందా డు. తన మిత్రుడు ఆన్లైన్ వేధింపుల వల్లే మృతిచెందాడని, దీనికి కారణమైన లోన్ యాప్ యజమానులపై చర్యలు తీసుకోవాలని గురువారం సంతోష్‌కుమార్ మిత్రుడు బ్రహ్మచారి ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై స్వరూప్‌రాజ్ తెలిపారు. -
దివ్యాంగులకు కావాల్సింది మద్దతు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగులు సమాజం నుంచి సానుభూతిని కాకుండా మద్దతును కోరుకుంటారని, వారికి సమాజం అండగా నిలవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన అసిస్టివ్ టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం జరిగిన ‘అసిస్టివ్ టెక్నాలజీ సదస్సు 2020’లో ఆయన మాట్లాడుతూ ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లు సాంకేతికతను ఉపయోగించుకుని దివ్యాంగులకు అవసరమైన పరికరాలను తయారు చేయాలని సూచించారు. స్టార్టప్‌లు తయారు చేసే పరికరాలకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా తోడ్పాటును అందిస్తుందని పేర్కొన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం నిలబెట్టే దిశగా అడుగు పడాలని, బధిరులు, అంధులతో పాటు అంగవైకల్యం కలిగిన వారికి అవసరమైన పరికరాలు తయారు కావాలని కేటీఆర్ అన్నారు. వ్యవసాయం, మహిళల రక్షణతో పాటు సమాజంలో అవసరమైన రంగాలన్నింటిలో శాస్త్రీయ ఆవిష్కరణలు పెరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎగ్జిబిషన్ పరిశీలన దివ్యాంగులు నిత్యం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం కోసం స్టార్టప్‌లు రూపొందించిన ఆవిష్కరణలతో ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రొటోటైప్ ఇంక్యుబేటర్ టీ వర్క్స్‌లో తమ ఆలోచనలకు రూపం ఇవ్వాలని స్టార్టప్‌లకు సూచించారు. ఆవిష్కర్తలు, విద్యార్థులు, స్టార్టప్‌లు రూపొం దించిన 30కి పైగా ఆవిష్కరణలను కేటీఆర్ పరిశీలించారు. ఐఐటీ హైదరాబాద్, టీ వర్క్స్, సోషల్ ఆల్ఫా, ఆర్ట్లాబ్ ఫౌండేషన్, అసిస్టెక్ ఫౌండేషన్, ఎల్వీ ప్రసాద్ నేత్రవిజ్ఞాన సంస్థలు ఎగ్జిబిషన్లో పాల్గొన్నాయి. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.వాసుదేవరెడ్డి, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, దివ్యాంగుల సం క్షేమశాఖ కార్యదర్శి దివ్య, కమిషనర్ శైలజ, టీఎస్ఐసీ సీఈఓ రవి నారాయణ్ పాల్గొన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులు: ఎంపీ సంతోష్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: సమాజంలో ఎంతోకాలం అవమానాలు, అసమానతలకు గురైన దివ్యాంగులు ఇటీవల అవకాశాలను అందిపుచ్చుకుని అనేక రం గాల్లో ప్రతిభ చూపుతున్నారని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్లో జరిగిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో సంతోష్‌కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాం గుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, వారు ఆత్మగౌరవంతో బతికేలా ఆసరా పథకం ద్వారా ఆదుకుంటోందని పేర్కొన్నారు. దివ్యాంగులతో ముచ్చటించిన ఎంపీ సంతోష్ వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. త్వరలో దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, అంధులకు లాప్టాప్స్, బధిరులకు 4జి స్మార్ట్ఫోన్లు, బ్యాటరీ వీల్చైర్లు తదితర ఉపకరణాలు ఇస్తామని వాసుదేవరెడ్డి వెల్లడించారు. దివ్యాంగులకు అండగా ప్రభుత్వం: ఎమ్మెల్సీ కవిత సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా రూ.3,016 పెన్షన్ అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వివిధ జిల్లాలకు చెందిన దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు గురువారం కవితను ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు రూ.500 పెన్షన్ ఇవ్వగా, టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పెన్షన్ మొత్తాన్ని రూ.3,016కు పెంచిందన్నారు. గత ఆరేళ్లుగా వికలాంగుల కార్పొరేషన్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. దివ్యాంగులకు ఉపయోగపడే వాహనాలు, అనేక ఇతర పరికరాలను తమ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ కృషికి గత ఏడాది డిసెంబర్ 3న రాష్ట్రపతి అవార్డు దక్కిందని కవిత గుర్తు చేశారు. కవితను కలసిన వారిలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, 21 దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు. -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ స్టార్ హీరో
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి నటుడు విజయ్ సేతుపతి మెక్కలు నాటారు. ఉప్పెన సినిమా దర్శకుడు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో తానూ భాగం అవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి , ఛాలెంజ్‌కి తనని నామినేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. (భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి) అలాగే ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ‘ఉప్పెన’ సినిమాలో తమిళ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. విజయ్ సేతుపతి ఇప్పటివరకు పిజ్జా, నేను రౌడినే వంటి తెలుగు రీమేక్‌లలో నటించారు. 2009 సైరా నర్సింహారెడ్డిలో మొదటిసారిగా తెలుగులో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో రెండవ సినిమా ఉప్పెనలో నటించారు. వైష్షవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. దీంతో ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) Makkal selvan @VijaySethuOffl accepted the #GreenIndiaChallenge 🌱 given by #Uppena director @BuchiBabuSana and planted saplings at his home. He expressed appreciation towards this great initiative & requested all those waiting for #Uppena should also take part.💚@MPsantoshtrs pic.twitter.com/p8sKuhv5BN — Vamsi Shekar (@UrsVamsiShekar) July 27, 2020 -
భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి
‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అంటూ మొక్కలు నాటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దూసుకెళుతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. ఈ కరోనా సమయంలో అందరికీ ప్రాణవాయువు విలువ తెలిసింది. ఈ భూమి తల్లికి కూడా వృక్షాలు, అడవులు ప్రాణవాయువు అందిస్తాయి’’ అని నటుడు చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు మనం అందించే గొప్ప సంపద. మనం ఇచ్చే కాలుష్యాన్ని మొక్కలు పీల్చుకుని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని సంతోష్‌గారు గుర్తించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ మొక్కలు నాటాలి’’ అన్నారు. -
మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షల వెల్లువ
-
ఉదయభాను ఛాలెంజ్ స్వీకరించిన బ్రహ్మీ
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన నివాసంలో మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ 3వ విడతలో భాగం యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆయన స్వీకరించారు. ఇందులో భాగంగా మణికొండలోని తన నివాసంలో శనివారం ఉదయం మొక్కలు నాటి, అందుకు సంబంధించిన ఫోటోలను బ్రహ్మానందం షేర్ చేశారు. కాగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. (చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్) ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్, ప్రభాస్, వీవీ వినాయక్, యాంకర్ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్ స్వీకరించి మరి కొందరికి సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన అనేక మంది ప్రముఖులు, సామాన్యులు సైతం మొక్కలు నాటుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగమవుతున్నారు. (ఎన్టీఆర్‌కు సుమ గ్రీన్ చాలెంజ్) -
రిజర్వ్ ఫారెస్ట్ దత్తత తీసుకుంటా..
సాక్షి, హైదరాబాద్: రెబల్ స్టార్ కృష్ణంరాజు విసిరిన చాలెంజ్‌ను స్వీకరించిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన నివాసంలో మూడు మొక్కలు నాటి మూడో దశ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు శ్రీకారం చుట్టారు. దీంతో ‘పుడమి పచ్చగుండాలే–మన బతుకులు చల్లగుండాలే’అనే నినాదంతో ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ చాలెంజ్ మూడో దశ మొదలైంది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. ‘సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం ఉన్నత విలువలతో కూడుకున్నది. ఇందులో భాగంగా వారు దత్తత తీసుకున్న కీసర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్యక్రమం ఎంతో స్ఫూర్తినిచ్చింది. సంతోష్ ఎక్కడ సూచిస్తే అక్కడ.. వెయ్యి ఎకరాలకు తక్కువ కాకుండా ఒక రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకొని, ఆ ఫారెస్ట్ అభివృద్ధికి పాటుపడతాను. ఈ కార్యక్రమంలో నా అభిమానులందరూ పాల్గొని కోట్లాది మొక్కలు నాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని చెప్పారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, భల్లాలదేవ దగ్గుబాటి రానా, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్‌ను ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు నామినేట్ చేస్తున్నట్లు ప్రభాస్ తెలిపారు. ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘ప్రభాస్ది మంచి మనసు. ఆయన సమాజం పట్ల బాధ్యత కలిగిన గొప్ప కథానాయకుడు. ‘గ్రీన్ చాలెంజ్’ఆశయం తెలుసుకున్న వెంటనే మూడు మొక్కలు నాటడం, సహృదయంతో ఒక రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధికి పూనుకోవడం స్ఫూర్తిదాయకం. ప్రభాస్ చేతులమీదుగా ఈ గ్రీన్ ఇండియా చాలెంజ్ మూడో దశ కార్యక్రమం జరగడం సంతోషం. కోట్లాదిగా ఉన్న వారి అభిమానులంతా ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటి నేలతల్లికి పచ్చని పందిరి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’అని అన్నారు. కార్యక్రమంలో ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’సమన్వయకర్త సంజీవ్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీతో కలిసి మొక్కలు నాటిన ప్రభాస్
-
ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటా: ప్రభాస్
హైదరాబాద్: "పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె" అనే నినాదంతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" మూడో దశకు చేరుకుంది. ఈసారి డార్లింగ్ ప్రభాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి తన నివాసంలో మూడు మొక్కలు నాటి ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఈ సందర్భంగా అభిమానులు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు. అనంతరం ఎంపీతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఎంపీ సంతోష్ కుమార్ అడవిని దత్తత తీసుకుని అభివృద్ధి చేపట్టిన విషయంపై ప్రభాస్ ఆసక్తి కనబర్చాడు. (మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!) తాను కూడా రాష్ట్రంలో వెయ్యి ఎకరాలు ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రభాస్ వెల్లడించారు. అనంతరం ఈ చాలెంజ్ స్వీకరించేందుకు దగ్గుబాటి రానా, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాస్కు ధరించే పాల్గొన్నాడు. కాగా ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగా విస్తరిస్తుందో, ఎవరెవరు ఛాలెంజ్‌లు విసురుకుంటారో చూడాల్సిందే.(రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2) -
చాలెంజ్ స్వీకరించిన వివి వినాయక్
టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఆదివారం ఉదయం మొక్కలు నాటారు. వినాయక్‌తో పాటు నటుడు కాదంబరి కిరణ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. పర్యావరణాన్ని రక్షించడం కోసం ప్రతీ ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించాలని వినాయక్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ దర్శకుడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొనడంపై ప్రకృతి ప్రేమికులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ముఖ్యంగా తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు పూనుకున్న విషయం తెలిసిందే. ఈ ఛాలెంజ్‌లో భాగంగా ప్రతీ ఒక్కరు మొక్కలు నాటడంతో పాటు ఇతరులతో నాటించాలి. ఇప్పటికే ఈ ఛాలెంజ్‌ను సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు స్వీకరించి మరికొంత మందికి సవాల్ విసురుతున్నారు. కేటీఆర్, కవిత, చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, సచిన్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు, సైనా నెహ్వాల్, గోపీచంద్ వంటి ప్రముఖులు గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మరికొంతమందికి సవాల్ విసిరిన సంగత తెలిసిందే. -
సాయి పల్లవి, తమన్నాకు వరుణ్ ఛాలెంజ్!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను సినీ నటుడు వరుణ్ తేజ్ కొణిదెల స్వీకరించాడు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వరుణ్ తేజ్ తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటాడు. దీనికి సంబంధించిన ఆయన శనివారం ట్వీటర్లో పోస్ట్ చేశారు. గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన ఎంపీ సంతోష్ కుమార్ గారికి, అక్కినేని అఖిల్‌కు ధన్యవాదాలు తెలిపాడు. కొంచెం బిజీగా ఉన్నా..కానీ మంచి పనికోసం కొంచెం ఆలస్యంగానైనా స్పందించాల్సిందేనని ట్వీట్ చేశారు. అంతేకాదు హరా హైతో భరా హై హ్యాష్ ట్యాగ్ తో గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా హీరోయిన్లు సాయి పల్లవి, తమన్నాలను నామినేట్ చేశాడు. మరి ఈ మెగా ప్రిన్స్ చాలెంజ్‌ను ఈ సాయి పల్లవి, తమన్నా ఎపుడు స్వీకరిస్తారో వేచి చూడాలి. రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటిన వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వనమిత్ర అవార్డ్‌ను ఆవిష్కరించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటిన వారందరికీ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం వనమిత్ర బ్యాడ్జ్ ఆఫ్ హానర్ అవార్డ్స్ ఇవ్వాలని ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ నిర్ణయించింది. ఇందులో భాగంగా రూపొందించిన అవార్డ్స్‌ను రాజ్యసభ ఎంపీ, సంస్థ ప్యాట్రన్ సంతోష్ కుమార్ గతనెలలో (గురువారం, సెప్టెంబర్ 5) ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. Thanks for nominating me @MPsantoshtrs garu & @AkhilAkkineni8 for the #GreenIndiaChallenge Been a bit busy. But it’s never too late to do a good deed! Taking this initiative forward by nominating @Sai_Pallavi92 & @tamannaahspeaks to take this up#HaraHaitohBharaHai pic.twitter.com/Epoer8QERf — Varun Tej Konidela (@IAmVarunTej) October 5, 2019 -
కీసరలో ఎకో టూరిజం, అర్బన్ ఫారెస్టు పార్కుకు శంకుస్థాపన
-
గ్రీన్ ఛాలెంజ్: స్వీకరించిన మిథున్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ట్విటర్లో మళ్లీ గ్రీన్ ఛాలెంజ్ ట్రెండ్ అవుతోంది. తాజాగా టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి స్వీకరించారు. ప్రస్తుతం తాను అమెరికా పర్యటనలో ఉన్నానని, తిరిగి రాగానే మొక్కలు నాటి ఫోటోలు పోస్ట్ చేస్తానని ఆయన ట్వీట్ చేశారు. అంతేకాకుండా మిథున్ రెడ్డి కూడా ఎంపీలు సుప్రియ సులే, శ్రీకృష్ణదేవరాయ, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. కాగా ‘హరా హైతో భరా హై’ (పచ్చగా ఉంటే ఇంపుగా ఉంటుంది) అంటూ గత ఏడాది మొదలైన గ్రీన్ ఛాలెంజ్ రెండు కోట్ల మొక్కలు నాటే దాకా చేరుకుంది. ఒకరు మొక్కనాటి మరో ముగ్గురు మొక్కలు నాటి, సంరక్షించేలా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. గతంలో తాను స్వయంగా మొక్క నాటి, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ నరసింహన్, నటుడు నాగార్జునను నామినేట్ చేశారు. వారందరూ కూడా మొక్కలు నాటారు. చదవండి: అడవి నవ్వింది! ఇలా ఏడాది పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రముఖులతో పాటు సామాన్యులూ భాగస్వామ్యం అయ్యారు. మొక్కలు నాటి, సెల్ఫీ దిగి పోస్ట్ చేయడం సోషల్ మీడియాలో భారీగా కొనసాగింది. మధ్యలో ఈ లక్ష్యం ఒక కోటికి చేరినప్పుడు మొక్కను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాటారు. ప్రస్తుతం ఈ లక్ష్యం నేటికి రెండు కోట్ల మొక్కలకు చేరటంతో మరో సారి ఎంపీ సంతోష్ మొక్క(రెండు కోట్ల) నాటారు. గత ఏడాది తాను నాటిన మొక్క ఏపుగా పెరగటంతో మరోసారి సెల్ఫీ దిగి ట్విటర్లో ఆదివారం పోస్ట్ చేసారు. మరో నలుగరికి గ్రీన్ చాలెంజ్.. మరో నలుగురికి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. వైస్సార్ సీపీ ఎంపీలు విజయ సాయి రెడ్డి, మిథున్ రెడ్డి, సినీనటుడు అఖిల్ అక్కినేని, జిఎమ్మార్ అధినేత మల్లికార్జున్ రావును మొక్కలు నాటాల్సిందిగా సంతోష్ కోరారు. తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో ‘ఇగ్నిటింగ్ మైండ్స్’ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ ఛాలెంజ్‌ను చేపట్టింది. I've accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge from @ignitingmindsin & Planted 3 saplings Further I am appealing to @VSReddy_MP @AkhilAkkineni8 @GMR_Group,#GMRao@MithunReddyYSRC to plant 3 trees & continue the chain to make India Green by2022 pic.twitter.com/whGzbDAJdP — Santosh Kumar J (@MPsantoshtrs) August 18, 2019 -
అడవి నవ్వింది!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హైదరాబాద్ శివార్లలోని కీసరగుట్ట అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకున్నారు. తన పుట్టినరోజు (జూలై 24) సందర్భంగా దుబారా ఖర్చులు చేయకుండా సమాజహితం కోసం సాయం చేయాలంటూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ చాలెంజ్‌కు స్పందనగా ఎంపీ సంతోష్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 2,042 ఎకరాల అడవిలోని కొంత భాగాన్ని ఎంపీ నిధులతో ఎకో టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి, మిగతా ప్రాంతాన్ని అటవీ పునరుజ్జీవనం కింద రక్షిత అటవీ ప్రాంతంగా మారుస్తామని ఆయన తన ట్విట్టర్లో పేర్కొన్నారు. త్వరలోనే కీసరగుట్ట అటవీ ప్రాంతంలో పర్యటించి అభివృద్ధి ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న అర్బన్ ఫారెస్ట్ పార్కులు అద్భుతంగా ఉన్నాయని, పట్టణ ప్రాంత వాసులు సేదతీరేందుకు, ఆరోగ్యకర జీవనవిధానం అలవర్చుకునేందుకు ఇవి తోడ్పాటునిస్తాయని ఆయన పేర్కొన్నారు. అటవీ ప్రాంతాలు, అర్బన్ లంగ్ స్పేస్‌ల అభివృద్ధిలో పాలుపంచుకోవాల్సిందిగా ‘గిఫ్ట్ ఏ స్మైల్’ఛాలెంజ్ విసిరారు. తన ట్విట్టర్ ద్వారా మాజీ ఎంపీ కవిత, హీరోలు విజయ్ దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామికవేత్త ముత్తా గౌతమ్‌లను ట్యాగ్ చేశారు. మంచి నిర్ణయంలో తనను కూడా భాగస్వామ్యం చేసినందుకు సంతోష్ కుమా ర్కు వంశీ పైడిపల్లి కృతజ్ఞతలు తెలిపారు. -
'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'
సాక్షి, కీసరగుట్ట(మేడ్చల్) : తెలంగాణకు హరితహారంలో భాగంగా రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మరో వినూత్న కార్యక్రమానికి తెరలేపారు. కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా 'గిఫ్ట్ ఏ స్మైల్' చాలెంజ్‌లో భాగంగా కీసరగుట్టలోని రిజర్వ్ ఫారెస్ట్ అటవీ ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా 2,042 ఎకరాల అటవీ ప్రాంతంలో తన వంతుగా ఎకో టూరిజం పార్కు, అటవీ పునరుజ్జీవన అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతాల అభివృద్ధికి తమవంతు సహకారాన్ని అందించాలని కోరుతూ సంతోష్ కుమార్ పలువురు ప్రముఖులను 'గిఫ్ట్ ఏ స్మైల్'కు హ్యాష్ ట్యాగ్ చేశారు. ట్యాగ్ చేసిన వారిలో మాజీ ఎంపీ కవిత, సినీ హీరోలు విజయ్‌దేవరకొండ, నితిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, పారిశ్రామిక వేత్త ముత్తా గౌతమ్‌లు ఉన్నారు. -
బోయినపల్లి అల్లుళ్లు
బోయినపల్లి (చొప్పదండి): రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని బోయినపల్లి మండలం ప్రత్యేక గుర్తింపు సంత రించుకుంది. కేవలం 28 వేల పైచిలుకు ఓటర్లు ఉన్న ఈ చిన్న మండలం ఎన్నికల వేళ ఆసక్తికరమైన చర్చకు దారి తీస్తోంది. బోయినపల్లి మండలానికి ప్రముఖ నేతలతో ఉన్న బంధుత్వం, అనుబంధాలే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ ఈ మండలం అల్లుళ్లు కావడం.. అనేక మంది ప్రముఖుల చుట్టరికం ఉండటంతో ఈ మండలవాసులు తెగ ఫీలవుతుంటారు. ‘ఫలానోడు మా మండలం అల్లుడోయి’అని గర్వంగా చెప్పుకుంటారు. బోయినపల్లి మం డలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, లక్ష్మి దంపతుల కూతురు శోభను పరిణయమాడిన సీఎం కేసీఆర్ కొదురుపాకకు అల్లుడయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్‌రావు మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి సత్యనారాయణరావు, లచ్చమ్మ దంపతుల కూతురు వినోదను వివాహమాడారు. కార్యకర్తలు, విద్యాసాగర్‌రావు ఎంపీగా, ఎమ్మెల్యేగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. కరీంనగర్ ఎంపీగా పార్లమెంట్లో తన గళం వినిపిస్తున్న బోయినపల్లి వినోద్‌కుమార్ సైతం ఇక్కడి అల్లుడే. మండలంలోని కోరెం గ్రామానికి చెందిన చెన్నాడి మార్తాండరావు–రాజ్యలక్ష్మి కూతురు మాధవిని ఆయన వివాహమాడారు. రాజ్యసభ సభ్యుడూ ఈ మండలవాసే కేసీఆర్ తోడల్లుడు మండలంలోని కొదురుపాకకు చెందిన జోగినిపల్లి రవీందర్రావు కుమారుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు మండలంలోని మాన్వాడలో జన్మించి ఇక్కడే బాల్యం గడిపారు. ఆయన కూతురును మండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన జోగినిపల్లి రాజేశ్వరరావుకు ఇచ్చి వివాహం చేశారు. కరీంనగర్ చల్మెడ ఆసుపత్రి అధినేత లక్ష్మీనరసింహరావుకు కోరెం గ్రామంతో చుట్టరికం ఉంది. రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకులతో బోయినపల్లి మండలానికి అనుబంధం ఉండటం ఎన్నికలప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటారు. -
నలుగురు యువకుల కథ
మాదక ద్రవ్యాలు, మద్యపానం బారిన పడి నలుగురు యువకులు తమ జీవితాన్ని ఎలా నాశనం చేసుకున్నారనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘భాగ్యనగరం’. యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. కన్నడలో విజయం సాధించిన ఈ చిత్రాన్ని సంతోష్ కుమార్ ‘భాగ్యనగరం’ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందించిన చిత్రమిది. ఓ డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలనే ఆలోచనతో ఈ సినిమా విడుదల చేస్తున్నా’’ అన్నారు. ‘‘చెడు పరిణామాలను ఎత్తి చూపుతూ ఆలోచన రేకెత్తించేదే ఈ చిత్రం. మంచి సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్ రావు. -
నకిలీ వేలిముద్రల స్కాంలో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్: నకిలీ వేలిముద్రల స్కాంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. స్కాం నిందితులు రేషన్ డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ వేలముద్రలతో బియ్యం అక్రమ రవాణా చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల ఎన్ఫోర్స్మెంట్ బృందం రంగంలోకి దిగి నలుగురు రేషన్ డీలర్లను అదుపులోకి తీసుకుంది. కాగా, నకిలీ వేలిముద్రల స్కాంలో నిందితుడు పాత సంతోష్ కుమార్‌ను పోలీసులు రెండవరోజు విచారణ జరుపుతున్నారు. సంతోష్‌ను గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా ధర్మారం తరలించిన ఎస్సార్ నగర్ పోలీసులు ధనలక్ష్మీ కమ్యునికేషన్లో సోదాలు నిర్వహించి కీలక ఆధారాలను సేకరించారు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న వేలుముద్రలతో పాటు కొన్ని కీలక పత్రాలు, ఆధార్ కార్డులు, సిమ్ కార్డులు స్వాదీనం చేసుకున్నారు. ఓ కంప్యూటర్, నకిలీ వేలిముద్రల తయారీ యంత్రాన్ని కూడా గుర్తించారు. కాగా ఈరోజుతో సంతోష్ పోలీస్ కస్టడీ ముగియనుంది. -
నకిలీ వేలిముద్రల స్కాం ; నిందితుడి విచారణ
సాక్షి, హైదరాబాద్: సిమ్‌కార్డుల అమ్మకాల్లో టార్గెట్‌ను చేరుకోవడానికి నకిలీ వేలిముద్రలు తయారు చేసిన నిందితుడిని విచారణ నిమిత్తం పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం గ్రామానికి చెందిన సంతోష్‌కుమార్ వొడాఫోన్ ప్రీ–పెయిడ్ కనెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్ నుంచి సేకరించిన వేలిముద్రలకు నకిలీ వేలిముద్రలు తయారు చేసి సంతోష్‌కుమార్ దాదాపు ఆరువేల సిమ్‌కార్డులు ఆక్టివేషన్ చేశాడు. అయితే, ప్రాథమిక విచారణలో సిమ్‌కార్డుల విక్రయానికి సంబంధించిన టార్గెట్‌ను పూర్తిచేయడానికే నకిలీ వేలిముద్రలు తయారు చేసినట్టు బయడపడినా, ఎవరైనా సంఘవిద్రోహ శక్తులకు అతను సిమ్‌కార్డులు అందించాడా? ఈ నకిలీ వేలిముద్రల తయారీ వెనుక ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు. వేల సంఖ్యలో నకిలీ వేలిముద్రల స్కాం బయటపడడం ఆధార్ బయోమెట్రిక్ భద్రతకు సవాల్‌గా నిలిచింది. కాగా, ఆధార్ బయోమెట్రిక్ వ్యవస్థలో వెలుగుచూసిన లోపాలను సరిదిద్దేందుకు యూఐడీఏఐ అధికారులు రంగంలోకి దిగారు. -
ఎంపీ ల్యాడ్స్ కమిటీలో సంతోష్ కుమార్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి (ఎంపీల్యాడ్) పథకం అమలును పర్యవేక్షించే రాజ్యసభ ఎంపీ ల్యాడ్స్ కమిటీలో టీఆర్ఎస్ ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌కు చోటు దక్కింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ఎంపీ ల్యాడ్స్ కమిటీని పునర్ వ్యవస్థీకరిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. 12 మంది సభ్యులు ఉన్న ఈ కమిటీలో ఏపీ నుంచి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కూడా ఉన్నారు. ఎంపీ ల్యాడ్ పథకం కింద అభివృద్ధి పనులు వేగంగా సాగేం దుకు ఈ కమిటీ చర్యలు తీసుకుంటుంది. -
ఘనంగా టీఆర్ఎస్ ఎంపీల ప్రమాణ స్వీకారం
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు టీఆర్ఎస్ నేతల ప్రమాణ స్వీకారం బుధవారం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, నల్లగొండ జిల్లా నేత బడుగుల లింగయ్యయాదవ్, వరంగల్లు జిల్లాకు చెందిన డాక్టర్ బండ ప్రకాశ్‌ముదిరాజ్ రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ముగ్గురు సభ్యులు మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత ఎంపీ సంతోష్‌కుమార్ ముందు వరుసలో ఉన్న అధికార, ప్రతిపక్ష నేతలందరికీ నమస్కరించారు. పలువురు సీనియర్ ఎంపీలు సంతోష్‌కుమార్ వద్దకు వచ్చి అభినందనలు తెలిపారు. సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సతీమణి కల్వకుంట్ల శోభ, ఎంపీ కె.కవిత ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. లోక్‌సభ సభ్యులంతా నూతన ఎంపీలను అభినందించారు. స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల రాజేందర్, జి.జగదీశ్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామన్న, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వచ్చి నూతన ఎంపీలను అభినందించారు. వీరితోపాటు రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఢిల్లీకి వెళ్లారు. బలహీన వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ సభ్యులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన టీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. అనంతరం సంతోష్‌కుమార్, లింగయ్యయాదవ్, బండ ప్రకాశ్‌లు ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌లతో కలసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షెడ్యూల్ 9, 10లోని ఆస్తులు, ఉద్యోగుల విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని ఇచ్చారు. -
ఓసీకి ఒకటి.. బీసీకి రెండు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాశ్ ముదిరాజ్ ఆ పార్టీ తరఫున రాజ్యసభకు పోటీ చేయనున్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో అధినేత కేసీఆర్ ఈ ముగ్గురి పేర్లను అధికారికంగా ప్రకటించారు. మొదటి నుంచీ అనుకున్న విధంగా కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన సంతోష్‌కు అవకాశం దక్కగా, మిగిలిన ఇద్దరు అభ్యర్థుల విషయంలో మాత్రం అనూహ్య నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. యాదవుల కోటాలో చాలా మంది పోటీ పడినప్పటికీ నల్లగొండ జిల్లాకు చెందిన బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశమిచ్చిన కేసీఆర్ అదే రీతిలో వరంగల్ జిల్లాకు చెందిన బండ ప్రకాశ్ ముదిరాజ్‌ను కూడా పెద్దల సభ రేసులో నిలబెట్టి పార్టీ నేతలను సైతం ఆశ్చర్యపరిచారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన బడుగుల లింగయ్య 2015లో టీఆర్ఎస్లో చేరారు. బండ ప్రకాశ్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చారు. వీరిద్దరి ఎంపికతో ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస నేతలకు అవకాశం ఇచ్చారనే చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే, సామాజిక సమీకరణల్లో భాగంగానే బండ ప్రకాశ్‌ను ఎంపిక చేశారని తెలంగాణ భవన్ వర్గాలంటున్నాయి. ముదిరాజ్ మహాసభ ద్వారా బీసీ నాయకుడిగా గుర్తింపు పొందిన ప్రకాశ్‌ను రాజ్యసభకు పంపడం బీసీలకు పెద్దపీట వేయడమేనని, అందులో భాగంగానే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నాయి. ముఖ్యంగా బీసీలకు పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నామనే సంకేతాలను పంపడం ద్వారా ఆయా వర్గాలను ఆకర్షించాలనే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మూడింటిలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించారని గులాబీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టీఆర్ఎస్ తరఫున గతంలో ఒక ఓసీ నేతను రాజ్యసభకు పంపగా, ఇప్పుడు మరో ఓసీ అభ్యర్థిని పెద్దల సభ రేసులో నిలబెట్టారు. గతంలో ఈ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపికైన ముగ్గురిలో కూడా ఇద్దరు బీసీలుండగా, ఇప్పుడు మళ్లీ ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వడం గమనార్హం. కాగా, ఈ ముగ్గురు అభ్యర్థులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయనున్నట్టు టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బడుగుల లింగయ్య యాదవ్ తల్లిదండ్రులు: అంతయ్య, యలమంచమ్మ ఊరు: భీమారం, కేతేపల్లి మండలం, నల్లగొండ జిల్లా వయసు: 58 ఏళ్లు చదువు: బీఏ, బీఈడీ భార్య: నాగమణి, పిల్లలు: డాక్టర్ యస్వంత్, దీప్తి రాజకీయ అనుభవం: 1982లో టీడీపీలో చేరారు. 1985–87 వరకు కేతేపల్లి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా, 1987–97లో కేతేపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా, 1995లో భీమారం ఎంపీటీసీగా, 1998 –2012 వరకు టీడీపీ నల్లగొండ జిల్లా అధ్యక్షునిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. 2009లో మహాకూటమి తరఫున స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా పోటీ చేసి 26 ఓట్లతో నేతి విద్యాసాగర్ చేతిలో ఓడిపోయారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ 2015, మార్చి 16న టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. జోగినపల్లి సంతోష్‌కుమార్ తల్లిదండ్రులు: రవీందర్రావు, శశికళ ఊరు: కొదురుపాక, బోయినపల్లి మండలం, కరీంనగర్ జిల్లా వయసు: 42 ఏళ్లు చదువు: ఎంబీఏ, ఎంపీఎం భార్య: రోహిణి పిల్లలు: ఇషాన్, శ్రేయాన్ అనుభవం: సంతోష్ చదువు పూర్తయి ఉద్యోగానికి వెళ్లాల్సిన సమయంలోనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధన జెండా చేపట్టిన కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. 2004లో హరీశ్ మంత్రి అయిన తర్వాత ఈ బాధ్యతలను తీసుకున్న సంతోష్ అప్పటి నుంచి కేసీఆర్‌కు తోడు నీడగా ఉన్నారు. గత 13 ఏళ్లుగా కేసీఆర్ కన్నా ముందే ప్రారంభమయ్యే సంతోష్ దినచర్య కేసీఆర్ నిద్రకు విశ్రమించిన తర్వాతే ముగుస్తుంది. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నా, గల్లీలో ఉన్నా సంతోష్ ఆయన వెన్నంటి ఉండాల్సిందే. అటు పార్టీలో, ఇటు కేసీఆర్ కుటుంబంలో అందరికీ తలలో నాలుకగా ఉండే సంతోష్ వ్యక్తిగతంగా కూడా మంచిపేరు సాధించుకున్నారు. ప్రస్తుతం టీన్యూస్ ఎండీగా కూడా ఉన్నారు. బండ ప్రకాశ్ ముదిరాజ్ వయసు: 63 ఏళ్లు చదువు: ఎంఏ, పీహెచ్డీ అనుభవం: కుడా సభ్యుడిగా, వరంగల్ మున్సిపల్ కౌన్సిలర్‌గా, వైస్‌చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు కూడా. -
డ్రగ్స్ నేపథ్యంలో 'భాగ్యనగరం'
కన్నడలో సూపర్ హిట్‌గా నిలిచిన 'రాజధాని' చిత్రాన్ని సంతోష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సంతోష్ కుమార్ 'భాగ్యనగరం' పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్‌కి రెడీ అవుతోంది. కన్నడ స్టార్ హీరో అయిన యష్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. షీలా హీరోయిన్గా నటించింది. వెర్సటైల్ యాక్టర్ ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ పోలీస్ పాత్రని పోషించారు. ముమైత్‌ఖాన్ మరో ముఖ్య పాత్రలో నటించింది. నిర్మాత సంతోష్ కుమార్ మాట్లాడుతూ - 'డ్రగ్స్ వలన పెడదారి పట్టిన నలుగురు యువకుల కథే 'భాగ్యనగరం'. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ప్రాణాలు కోల్పోతున్న యువతీ, యువకులందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. మాస్, యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో మంచి సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రకాష్‌రాజ్, హీరో యష్‌ల మధ్య సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అలాగే కథ, కథనం చాలా కొత్తగా వుంటుంది. దర్శకుడు కె.వి.రాజు చాలా అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందించాడు. అర్జున్ జన్య మ్యూజిక్ సినిమాకి ఒన్ ఆఫ్ ది ఎస్సెట్‌గా నిలిచింది. సినిమా చూశాక ఒక గొప్ప చిత్రం చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. భాగ్యనగరంలాంటి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను. అకున్ సబర్వాల్‌గారు ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా అద్భుతంగా వుంది. ఇలాంటి చిత్రాలు ఎన్నో రావాలి అని అప్రిషియేట్ చేశారు. త్వరలో ఆయన ట్రైలర్ లాంచ్ చేయనున్నారు' అన్నారు. -
ఎరువుల అమ్మకంలో ‘డీబీటీ’ తప్పనిసరి
అనంతపురం అగ్రికల్చర్: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) విధానంలో ఎరువుల అమ్మకాలు తప్పనిసరి చేయాలని స్టేట్ కన్సల్టెంట్ సంతోష్‌కుమార్ తెలిపారు. కమిషనర్ ఆదేశాల మేరకు ఇందులో ఎలాంటి అలసత్వానికి తావులేదన్నారు. శుక్రవారం స్థానిక వ్యవసాయశాఖ జేడీ చాంబర్లో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎ.బాలభాస్కర్, డీసీఎంఎస్ జిల్లా మేనేజర్ విజయభాస్కర్, టెక్నికల్ ఏవో చెన్నవీరస్వామి తదితరులతో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నుంచి పూర్తి స్థాయిలో అమలు చేయడానికి వీలుగా లైసెన్సు కలిగిన ఎరువుల అంగళ్లకు బయోమెట్రిక్, స్వైప్ మిషన్లు అందజేయాలన్నారు. అయితే అక్కడక్కడ సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నందున ఆధార్‌బేస్డ్ బయోమెట్రిక్ పద్ధతికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడంతో పాటు దీనిపై పూర్తిగా అవగాహన పెంచుకుంటే సమస్యలు తగ్గుతాయని తెలిపారు. -
లేడీస్ హాస్టళ్లలో ఫోన్లు చోరీ చేసి...
హైదరాబాద్: లేడీస్ హాస్టళ్లలో సెల్ఫోన్లు కొట్టేస్తూ యువతులను వేధిస్తున్న ఓ యువకుడిని కేపీహెచ్‌బీ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వివరాలివీ.. సంతోష్‌కుమార్ అనే యువకుడు గత కొంత కాలంగా లేడీస్ హాస్టళ్లనే టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంతేకాదు, చోరీ చేసిన సెల్ఫోన్లతో యువతులను బెదిరిస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంతోష్‌కుమార్‌ను గురువారం ఉదయం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని నుంచి 8 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
యంగ్ లేడీ ఘాటు మోసం
కోయంబత్తూర్: తనను పెళ్లి చేసుకుంటుంది కదా అని ఎదురు చూసిన అతడికి అలుపొచ్చింది. అదే ఊహలో ఉంటూ ఆమెకు అడిగిందల్లా అందించిఅందించి చిరాకు వచ్చేసింది. అది కాస్త దాదాపు రూ.40 లక్షల వరకు చేరేసరికి ఎదురుచూపు అనుమానానికి దారి తీసింది. రోజులు గడిచినా డబ్బులు అయిపోతున్నా ఆమె పెళ్లి విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంతోష్ కుమార్ అనే ఇంజినీర్‌కు 40 ఏళ్లు. అతడు పెళ్లి చేసుకునేందుకు ఆన్ లైన్లో వివాహ వేదిక (మ్యాట్రిమోనీ)లో తన ప్రొఫైల్ పెట్టాడు. అది చూసిన ఓ 20 ఏళ్ల అమ్మాయి అతడితో సంబంధం కలుపుకునేందుకు ప్రయత్నించింది. అనుకుందే తడువుగా అతడితో మాట్లాడటం ప్రారంభించింది. పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని ఓ దేవాలయం వద్దకు పిలిచి పరిచయం ఏర్పరుచుకుంది. తల్లిదండ్రులు ఇప్పుడే పెళ్లికి తగిన డబ్బును సమకూర్చే స్తోమతలో లేరని చెబుతూ పెళ్లి వాయిదా వేస్తూ వచ్చింది. అతడిని అప్పుడప్పుడు కలిసి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. అలా మొత్తం 40 లక్షల వరకు తీసుకుంది. పెళ్లి గురించి అతడు ఆమె తల్లిదండ్రులను ప్రశ్నించగా ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగాలేదని చెప్పడంతో అనుమానం వచ్చిన సంతోష్ కుమార్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
ఐపీఎస్ అధికారిపై భార్య ఫిర్యాదు
చెన్నై : భర్త తనను వరకట్నపు వేధింపులకు గురిచేస్తున్నట్లు ఐపీఎస్ అధికారిపై భార్య డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. చెన్నై పోలీసు డిప్యూటీ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సంతోష్‌కుమార్ పనిచేస్తున్నారు. ఇతని భార్య మేఘనాకుమార్. ఈమె చెన్నై మెరీనాబీచ్‌లోని డీజీపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ టికె రాజేంద్రన్ అందుకున్నారు. ఫిర్యాదు అందజేసిన తర్వాత మేఘనాకుమార్ విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల క్రితం తనకు భర్త ఐపీఎస్ అధికారి సంతోష్‌కుమార్‌కు వివాహం జరిగిందని, ప్రస్తుతం తొమ్మిదేళ్ల కుమారుడు ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తమ మధ్య అభిప్రాయభేదాలు ఏర్పడ్డాయన్నారు. ప్రస్తుతం తన భర్త విలువైన ఫ్లాట్, స్థలం, నగదు, నగలు ఇవ్వాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు చెప్పారు. అతనిపై ఫిర్యాదు చేస్తే బిడ్డను అపహరించి తీసుకువెళతానని హెచ్చరించారని, అందుచేత తన భర్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు కోవాలని రోదిస్తూ తెలిపారు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
టీనగర్: ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. అరియలూరు జిల్లా, ఇళయపెరుమాల్‌నల్లూరు కాళియమ్మన్ కోవిల్ వీధికి చెందిన రామానుజం కుమార్తె ప్రియాంక (21). బీఏ పూర్తిచేసింది. గంగైకొండ చోళపురానికి చెందిన సంతోష్‌కుమార్ (25) లారీ డ్రైవర్. ఇరువురూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇలావుండగా ప్రియాంక తల్లిదండ్రులు వారి ప్రేమకు వ్యతిరేకత తెలిపారు. అంతేగాకుండా వేరొక చోట వరుని చూసి గత 20వ తేదీని నిశ్చయం చేశారు. ఆవణి నెలలో వివాహం జరగాల్సి ఉంది. ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ప్రియాంక గత 11వ తేదీ ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడు సంతోష్‌కుమార్‌తో అరియలూరు ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ప్రేమజంట బుధవారం అరియలూరు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఎస్పీకి ప్రియాంక ఇచ్చిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. తాను, సంతోష్‌కుమార్ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తమ ప్రేమకు తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ఆలయంలో వివాహమాడినట్లు తెలిపారు. సంతోష్‌కుమార్ తనను కిడ్నాప్ చేసినట్లు మీన్సురుట్టి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపింది. తన అత్త, బంధువులను విచారణ పేరుతో తీసుకువెళ్లి హింసిస్తున్నారని పేర్కొంది. అంతేగాకుండా తాము మీన్‌సురుట్టికి వెళితే హత్య చేస్తామని బెదిరిస్తున్నట్లు తెలిపింది. తమకు ప్రాణహాని ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రక్షణ కల్పించాలని ప్రాధేయపడింది. -
పీఎస్‌లో రమాదేవి భర్త, అత్తామామ లొంగుబాటు
వారసుడు లేడనే నెపంతో ఇల్లాలు రమాదేవిని వేధించడమే కాకుండా పిల్లలతో సహా ఇంటి నుంచి గెంటివేసిన కేసులో ఆమె భర్త సంతోష్ కుమార్‌తోపాటు ఆమె అత్తామామలు గురువారం ఉదయం సరూర్‌నగర్ మహిళ పోలీసు స్టేషన్లో లొంగిపోయారు. దాంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. పుత్రుడిని కనివ్వలేదని రమాదేవిని భర్తతోపాటు, అత్తమామలు తరుచుగా వేధించేవారు. దాంతో ఆమెను పుట్టింటికి పంపేశారు. కొన్నాళ్లుగా పుట్టింట్లో ఉన్న రమాదేవి బుధవారం దిల్సుఖ్నగర్ పరిధిలోని వికాస్‌నగర్‌లోని మెట్టినింటికి వచ్చింది. ఆమె రాకను ముందుగా గమనించిన ఆమె భర్త, అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ రమాదేవికి మెట్టినింటి ముందు బైఠాయించింది. రమాదేవి ఘటనకు సంబంధించిన కథనం సాక్షి టీవీలో ప్రసారం కావడంతో సరూర్‌నగర్ మహిళ పోలీసులు స్పందించారు. వెంటనే రమాదేవి వద్దకు వచ్చి మహిళా పోలీసులు విషయం తెలుసుకున్నారు. అనంతరం భర్త సంతోష్‌కుమార్, ఆమె అత్తామామలపై సరూర్ నగర్ మహిళ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాంతో రమాదేవి అత్తామామలు గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.