హైదరాబాద్: "పుడమి పచ్చగుండాలె- మన బతుకులు చల్లగుండాలె" అనే నినాదంతో ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన "గ్రీన్ ఇండియా ఛాలెంజ్" మూడో దశకు చేరుకుంది. ఈసారి డార్లింగ్ ప్రభాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఎంపీ సంతోష్ కుమార్‌తో కలిసి తన నివాసంలో మూడు మొక్కలు నాటి ఛాలెంజ్‌ను స్వీకరించాడు. ఈ సందర్భంగా అభిమానులు కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చాడు. అనంతరం ఎంపీతో కలిసి సెల్ఫీ కూడా దిగాడు. ప్రకృతిపై ఉన్న ప్రేమతో ఎంపీ సంతోష్ కుమార్ అడవిని దత్తత తీసుకుని అభివృద్ధి చేపట్టిన విషయంపై ప్రభాస్ ఆసక్తి కనబర్చాడు. (మళ్లీ ట్రెండింగ్‌లోకి ‘మున్నా’.. 13 ఏళ్లైంది కదా!)
తాను కూడా రాష్ట్రంలో వెయ్యి ఎకరాలు ఉన్న రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రభాస్ వెల్లడించారు. అనంతరం ఈ చాలెంజ్ స్వీకరించేందుకు దగ్గుబాటి రానా, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌ను నామినేట్ చేస్తున్నట్లు తెలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ మాస్కు ధరించే పాల్గొన్నాడు. కాగా ఈసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఎంతగా విస్తరిస్తుందో, ఎవరెవరు ఛాలెంజ్‌లు విసురుకుంటారో చూడాల్సిందే.(రష్యాలోనూ ఇరగదీస్తున్న బాహుబలి-2)
Comments
Please login to add a commentAdd a comment