forest
-
భూమ్మీద అడవుల లెక్క ఇదీ..
⇒ 2022లో ప్రపంచవ్యాప్తంగా నరికివేతకు గురైన అడవులు.. 41 లక్షల హెక్టార్లు (సుమారు కోటి ఎకరాలు). ⇒ అంటే ప్రతి ఒక్క నిమిషానికి నరికివేత జరిగిన విస్తీర్ణం.. 11 ఫుట్‌బాల్ గ్రౌండ్లతో సమానం ⇒ ఏడాదిలో తగ్గిపోయిన అడవుల వల్ల భూమి వాతావరణంలోకి అదనంగా చేరిన కార్బన్ డయాక్సైడ్.. 2.7 గిగాటన్నులు ⇒ఇది భారతదేశం మొత్తంలో ఒక ఏడాది పాటు బొగ్గు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాలు వినియోగిస్తే వెలువడే కార్బన్ డయాౖMð్సడ్‌తో సమానం. ⇒ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్ఎఫ్ఆర్) –2021 నివేదిక ప్రకారం మన దేశ విస్తీర్ణంలో అడవుల శాతం.. 21.72% ⇒ దేశంలో 2019తో పోలిస్తే 2021 నాటికి అదనంగా పెరిగిన అడవులు.. 1,540 చదరపు కిలోమీటర్లు.. -
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్‌లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్‌లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్‌కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్‌లైట్‌ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
దామగుండం అడవిలో భారీ అగ్ని ప్రమాదం
పూడూరు: వికారాబాద్ జిల్లాలో నేవీ రాడార్ కేంద్రం ఏర్పాటు చేయనున్న దామగుండం అటవీ ప్రాంతంలో గురువారంరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 నుంచి 30 ఎకరాల మేర అడవి కాలి బూడిదైంది. ఇది ప్రమాదామా? ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తగలబెట్టారా? అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూడూరు మండల పరిధిలో 2,900 ఎకరాల మేర దామగుండం అటవీ ప్రాంతం ఉంది. ఈ స్థలాన్ని ప్రభుత్వం నేవీ రాడార్ ఏర్పాటుకు కేటాయించగా, ఇటీవల భూమి పూజ చేశారు.అడవి చుట్టూ రోడ్డు, ప్రహరీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా రాత్రి అడవిలో భారీగా మంటలు చెలరేగాయి. అడవి సరిహద్దులోని వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చే వందూరుతండా సమీపంలో భారీ ఎత్తున మంటలు ఎగిసి పడటంతో అగి్నమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చేలోపల దాదాపు 20 నుంచి 30 ఎకరాల అడవి కాలిపోయింది. ఈ ప్రాంతంలో చుట్టు పక్కల రైతులు, కాపరులు తమ పశువులను మేపుతుంటారు. ఈ నేపథ్యంలో ఎవరైనా కావాలనే అడవికి నిప్పు పెట్టారా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.రాడార్ స్టేషన్ కోసం భూమి పూజ చేసిన స్థలానికి ఎదురుగా వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన స్థల సమీపంలో ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగిన వీడియోలను స్థానికంగా ఉండే సత్యానందస్వామి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో అధికారులు స్పందించారు. జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్, ఎఫ్ఆర్ఓ శ్యాంమ్కుమార్, నేవీ అధికారి మల్లికార్జునరావు, పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి, చన్గోముల్ ఎస్ఐ ఘటన ప్రాంతాన్ని సందర్శించారు. సత్యానందస్వామి ఉంటున్న ఆశ్రమానికి వెళ్లి ఆయనతో మాట్లాడారు. -
జంగిల్లో జింగిల్స్
మొదట్లో సుధాచంద్రన్‌కు పక్షులతో కాస్తో కూస్తో పరిచయం కూడా లేదు. అదృష్ట పల్లకి ఆమెను కేరళలోని తట్టెక్కాడ్ అభయారణ్యం వరకు తీసుకెళ్లింది. అది పక్షుల విశ్వవిద్యాలయం. ఆ విశ్వవిద్యాలయంలో ఎన్నో పక్షులకు సంబంధించి ఎన్నో విషయాలు తెలుసుకుంది. పక్షి ప్రేమికురాలుగా మారింది. ‘ఫారెస్ట్ గైడ్’గా పర్యావరణ పరిరక్షణకు తనవంతు కృషి చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్య ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చే ‘పీవి థంపీ మెమోరియల్’ అవార్డ్ అందుకుంది...అద్భుతమై సంగీతాన్ని వినడానికి సుధాచంద్రన్ ఏ సంగీత కచేరికి వెళ్లదు. ప్రతిరోజు ఉదయాన పక్షుల కిలకిలారావాలు వింటుంది. అందులో ఆమోఘమైన రాగాలెన్నో వింటుంది. ముఖ్యంగా రాకెట్–బెయిల్డ్ డ్రోంగ్ మేలుకొలుపు జింగిల్స్ వినడం అంటే సుధకు ఎంతో ఇష్టం.మూడు దశాబ్దాలకు పైగా తట్టెక్కాడ్ పక్షుల అభయారణ్యంతో అనుబంధం ఉన్న సుధ 300కి పైగా పక్షి జాతులను గుర్తించగలదు. వాటి పిలుపులు, బ్రీడింగ్ సీజన్, ఫీడింగ్ సీజన్, అలవాట్లు మరియు ఆవాసాలు, వలసలపై ఆమెకు పూర్తి అవగాహన ఉంది. ‘ఈ అడవి నా కుటుంబం లాంటిది’ అంటున్న సుధ నవ వధువుగా 1971 లో తట్టెక్కాడులోకి అడుగు పెట్టింది.‘ఆ కాలంలో ఇది దట్టమైన అడవి. ఇందులోకి అడుగు పెట్టినప్పుడు మొదట భయం వేసింది. అడవి నుంచి వచ్చే శబ్దాలు నన్ను భయపెట్టేవి’ అంటుంది సుధ. ఆమె భర్తకు తట్టెక్కాడ్లో టీ షాప్ ఉండేది. భర్త అకాల మరణం తరువాత సుధ అనేక సవాళ్లను, కష్టాలనూ ఎదుర్కొంటూనే ఇద్దరు పిల్లల్ని చదివించింది, ఒకవైపు టీ దుకాణం నడుపుతూనే డ్రైవింగ్, పడవ నడపడం నేర్చుకుంది. ఫొటోగ్రాఫీలో మెలకువలు తెలుసుకుంది.సుధ టీ షాప్‌కు పక్షుల ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలు వచ్చేవాళ్లు. వారితో సంభాషించడం వల్ల తనకు కూడా పక్షుల ప్రపంచంపై ఆసక్తి మొదలైంది. ప్రఖ్యాత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ శిష్యుడు ఆర్.సుగతన్ నిర్వహించే సమావేశాలకు హాజరయ్యేది. ‘నేను క్లాసు బయట నిల్చోవడం చూసి సుగతన్ సర్ లోపలికి వచ్చి క్లాసు వినాల్సిందిగా కోరేవారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంది సుధ.పక్షి ప్రేమికులు, పక్షి శాస్త్రవేత్తలతో కలిసి అడవిలో పక్షులను చూడడానికి వెళ్లేది. ‘నేను ఎంతోమంది వ్యక్తుల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. నేర్చుకుంటున్నాను. నాకు తెలిసిన విషయాలను ఇతరులకు చెబుతుంటాను’ అంటుంది సుధ.ఇంగ్లీష్ బాగా మాట్లాడడం నేర్చుకున్న సుధ ఎన్నో భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు.ఇష్టమైన పక్షులను చూడడంలో అదృష్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని నమ్ముతుంది సుధ. ‘ఒకసారి ఈ అభయారణ్యానికి వచ్చిన ఒక పక్షి శాస్త్రవేత్త మలబార్ ట్రోగాన్ను చూడాలనుకున్నారు. అయితే ఆయన ఆ పక్షిని గుర్తించలేకపోయాడు. నిరాశతో ఆయన వెనక్కి వెళ్లిపోదామనుకుంటున్నప్పుడు నేను ఆ పక్షిని చూపిస్తాను అని చె΄్పాను. అదృష్టవశాత్తు ఆ పక్షి మాకు కనిపించింది. అప్పుడు మాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు’ అని గతాన్ని గుర్తు చేసుకుంది సుధ.లైసెన్స్ పొందిన మొదటి మహిళా ఫారెస్ట్ గైడ్లలో ఒకరైన సుధాచంద్రన్ శాంక్చరి వైల్డ్‌లైఫ్ సర్వీస్ అవార్డ్(2023)తో సహా ఎన్నో అవార్డులు అందుకుంది. -
ఆదివాసులకు చేయూతనిద్దాం!
ఆంగ్లేయుల దోపిడీని ఎదురించి ఆదివాసులు స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. కానీ కనీస హక్కులు లేకుండా ఇప్పటికీ మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తూఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా తక్కువ. సాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. కానీ తమ అటవీ ఉత్పత్తులతో విధ్వంస కోణానికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందించగలరు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. సుస్థిరాభివృద్ధిలో వారిని భాగస్వాములను చేసినప్పుడే, తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది.వైవిధ్యభరితమైన భారతీయ సంస్కృతిలో ఆదివాసులది కీలకమైన భూమిక. ప్రకృతిని దైవంగా భావించే ఆదివాసులు, ఆంగ్లేయుల దోపిడీని ఆది నుంచీ ఎదురించి స్వాతంత్య్ర పోరాటానికి పునాదులు వేశారు. భారతదేశంలోని అపారమైన సహజ సంపదపై కన్ను వేసిన బ్రిటిష్ పాలకులు 1865లో అటవీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1927లో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ పేరుతో మరో చట్టం చేశారు.అడవుల పరిరక్షణ ముసుగులో సహజ వనరులను దోచుకునేందుకు ఉద్దేశించిన ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఆదివాసులు అనేక పర్యాయాలు తిరుగు బాటు చేసి మరింత అణచివేతకు గురయ్యారు. కానీ, తమ నిరంతర తిరుగుబాటు ద్వారా స్వాతంత్య్ర పోరాటానికి జీవం పోశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వాల చొరవ వల్లనో, ప్రజల పోరాటాల వల్లనో వలస పాలన దుష్పరిణామాల నుంచి బయట పడగలిగాము. అయితే, ప్రధాన స్రవంతికి దూరంగా అడవుల్లో నివసిస్తున్న ఆదివాసులు ఇప్పటికీ వివక్షకు, ఉదాసీనతకు గురవుతూనే ఉన్నారు. తరతరాలుగా తాము కాపాడుకుంటున్న అడవులలో కనీస హక్కులు లేకుండా మనుగడ కోసం పోరాటం చేస్తున్నారు. స్వాతంత్య్రానంతరం దేశంలో అడవుల హద్దులను గుర్తించారు, కానీ అడవి బిడ్డల హక్కులను విస్మరించారు. అభివృద్ధి కూడా ఆదివాసుల పాలిటశాపంగా పరిణమించింది. దేశ జనాభాలో వారు సుమారు 8 శాతం ఉంటారు. అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన వారిలో 55 శాతం దాకా ఆదివాసులేనని గణాంకాలు తెలుపుతున్నాయి. దురదృష్టవ శాత్తూ ఈ అభివృద్ధి ఫలాలలో ఆదివాసుల వాటా అతి తక్కువ. అటవీ చట్టాలు అమలు చేయాలి!స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఐదు దశాబ్దాల దాకా ఆదివాసు లను ప్రధాన స్రవంతిలో కలిపేందుకు పెద్దగా ప్రయత్నాలు జరగ లేదు. 1996లో వచ్చిన పెసా(పీఈఎస్ఏ– షెడ్యూల్డ్ ప్రాంతాలకుపంచాయతీల విస్తరణ) చట్టం, 2006 నాటి అటవీ హక్కుల చట్టం (ఫారెస్ట్ రైట్స్ యాక్ట్) ఆదివాసులకు జరుగుతూ వచ్చిన అన్యాయాల పరిష్కారం దిశగా మైలురాళ్లుగా చెప్పుకోవచ్చు. పెసా చట్టం అడవి బిడ్డల సంప్రదాయిక వనరుల నిర్వహణ విధానాలను ఆమోదిస్తూ, వారి స్వయం పాలనకు వీలు కల్పించేందుకు తీసుకువచ్చారు. ఎఫ్ఆర్ఏ చట్టం ఇంకొక అడుగు ముందుకు వేసి చారిత్రకంగా ఆది వాసులకు అటవీ హక్కుల విషయంలో జరిగిన అన్యాయాలకుముందుమాటలో క్షమాపణ చెప్పింది. ఉద్దేశాలు ఉన్నతంగా ఉన్న ప్పటికీ ఈ చట్టాల అమలు సంతృప్తికరంగా లేదు. పాలనా యంత్రాంగంలోని కొన్ని వర్గాల వ్యతిరేకత, రాష్ట్ర చట్టాలతో సరైన అనుసంధానం లేకపోవడం వల్ల ఈ చట్టాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల అమలు విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్ర కాస్త మెరుగైన స్థానంలో ఉంది. చెన్నమనేని విద్యాసాగర్ రావు ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఉన్నప్పుడు తీసుకున్న చొరవ వల్ల ఇది సాధ్యమయింది. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులలో ఐదు శాతం నేరుగా గ్రామ పంచాయతీలకు, గ్రామసభలకు అందించాలని ఆయన నిర్దేశించడం వల్ల షెడ్యూల్డ్ ప్రాంతాలలోని ఆదివాసీ పల్లెల సాధికా రీకరణకు మార్గం సుగమమైంది. వెదురు, బీడీ ఆకుల వంటి చిన్న చిన్న అటవీ ఉత్పత్తులపై గ్రామ సభలకు హక్కులు పునరుద్ధరించారు. తద్వారా అడవులను నమ్ముకున్న స్థానికులకు ఆదాయం పొందే అవకాశం కల్పించారు. గిరిజన గ్రామసభలు అటవీ ఉత్పత్తుల విక్రయం ద్వారా నెలకు 10 నుంచి 80 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నాయి. ఆదాయం పొందే అవకాశం కల్పించడం వల్ల ఆదివాసులు అడవుల పరిరక్షణతో పాటు పెంపకం కూడా చేపట్టి ప్రకృతితో తమకున్న అవినాభావ సంబంధాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. దీంతో పెసా, ఎఫ్ఆర్ఏ చట్టాల వల్ల అడవులు నాశనమవుతాయని కొన్ని వర్గాలు చేసిన ప్రచారంలోని డొల్లతనం కూడా బయటపడింది. పెసా చట్టం అమలులో గడ్చిరోలి జిల్లా దేశంలోనే ముందంజలో ఉండి మార్గదర్శకంగా నిలిచింది. మహారాష్ట్రలో విద్యాసాగర్ రావు చొరవతో 20 లక్షల ఎకరాల అటవీ భూమి నిర్వహణ బాధ్యతను స్థానిక ఆదివాసీ గ్రామసభలకు అప్పగించారు. ఇతర రాష్ట్రాలు కూడా ఈ అనుభవాలను పాఠాలుగా తీసుకొని సుస్థిరాభివృద్ధిలో ఆదివాసులను భాగస్వాములను చేయాలి.పర్యావరణ హిత ఉపాధి అవకాశాలుసాధారణంగా అభివృద్ధికి మరో పార్శ్వం కూడా ఉంటుంది. పరిశ్రమలు ఉపాధికి, ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నప్పటికీ వాటినుంచి వెలువడే వ్యర్థాల వల్ల గాలీ, నీరూ కలుషితమై రకరకాల రోగాలు ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి విధ్వంస కోణా నికి తావులేని అభివృద్ధిని అడవి బిడ్డలు అందిస్తారు. వారికి కావలసిందల్లా తగిన శిక్షణ, ప్రోత్సాహం, మార్కెటింగ్ సౌకర్యాలు మాత్రమే. అడవిలో లభ్యమయ్యే పలు వనరులను ప్రపంచానికి అవసరమయ్యే ఉత్పత్తులుగా మలిస్తే పర్యావరణానికి ఏ మాత్రం ముప్పు లేకుండా ఆదివాసులకు ఉపాధి లభిస్తుంది, దేశ ఆర్థికాభివృద్ధిలో వారు భాగస్వాములవుతారు.అడవులలో విస్తృతంగా లభించే వెదురు ద్వారా ప్రపంచానికి అవసరమయ్యే అనేక ఉత్పత్తులను తయారు చేయవచ్చు. గృహోపకర ణాల నుంచి దుస్తుల దాకా సంగీత పరికరాల నుంచి ఔషధాల దాకా రకరకాల అవసరాలకు వెదురును ఉపయోగిస్తున్నారు. అటవీ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థలు ముందుకు వచ్చి ఆదివాసులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ప్రోత్స హించాలి. మహారాష్ట్రలో ఒక విశ్వవిద్యాలయం, మరో స్వచ్ఛందసంస్థ కలిసి ఆదివాసులకు వెదురు నుంచి రాఖీలు తయారు చేయడంలో శిక్షణ ఇచ్చాయి. మిగతా రాష్ట్రాలలో కూడా స్వచ్ఛంద సంస్థలు చొరవ తీసుకొని ఆదివాసులకు ఆసరాగా నిలవాలి. సేంద్రీయ ఉత్ప త్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అడవిలో లభించే వనరుల ద్వారా సబ్బులు, షాంపూలు, సుగంధ ద్రవ్యాలు తయారు చేయవచ్చు. వీటికి ఎక్కువ ధర చెల్లించడానికి కూడా వినియోగ దారులు వెనకాడటం లేదు. కాబట్టి స్టార్టప్ కంపెనీలు కూడా అటవీ ఉత్పత్తులపై దృష్టి సారించాలి.ఆదివాసులకు ఆత్మగౌరవం ఎక్కువ. అవసరమైతే ఉపవాసమైనా ఉంటారు కానీ ఇంకొకరి ముందు చేయి చాచడానికి ఇష్టపడరు. అటువంటి వారికి ఆసరాగా నిలబడి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి చేయూతనిస్తే తరతరాలుగా జరుగుతున్న అన్యాయానికి సమాజం తరఫున ప్రాయశ్చిత్తం చేసినట్లవుతుంది. అంతే కాకుండా వేల ఏళ్లుగా ప్రతిఫలాపేక్ష లేకుండా పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ వస్తున్న అడవిబిడ్డల రుణం తీర్చుకున్నట్లవుతుంది.- వ్యాసకర్త ఏకలవ్య ఫౌండేషన్ చైర్మన్మొబైల్ : pvg@ekalavya.net - పి. వేణుగోపాల్ రెడ్డి -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్‌లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్‌లు, ఓవర్ పాస్‌లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్‌నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్‌లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్‌పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్‌లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్‌కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం.... భూమాతకు తీరని శోకం!
భూమండలంపై అత్యంత భారీకాయంతో సంచరించే శాకాహార బాహుబలిగా ఏనుగు మనందరికీ చిరపరిచితం. ఆఫ్రికా ఖండంలోని పీఠభూముల్లో సర్వసాధారణంగా కనిపించే ‘సవన్నా’, ‘అటవీ’జాతి ఏనుగులు అత్యంత వేగంగా అంతర్థానమవుతున్నాయి. అటవీప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిన మానవ కార్యకలాపాలు, విస్తరిస్తున్న వ్యవసాయం, విజృంభిస్తున్న అక్రమ వేటతో ఏనుగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. తాజాగా జరిపిన అధ్యయనం ప్రకారం గత యాభై సంవత్సరాల్లో.. సర్వేచేసిన ప్రాంతాల్లో సవన్నా జాతి ఏనుగుల సంఖ్య 70 శాతం తగ్గిపోయింది. ‘ఫారెస్ట్’జాతి ఏనుగుల సంఖ్య ఏకంగా 90 శాతం క్షీణించడం ఏనుగుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఏనుగుల సంఖ్య పెరగడం ఒకింత ఉపశమనం కల్పిస్తోంది.అత్యంత తెలివి అత్యంత తెలివితేటలతోపాటు మానవునిలా సామూహికంగా జీవించే నైపుణ్యమున్న వన్యప్రాణిగా ఏనుగు పేరొందింది. 1964 నుంచి 2016 సంవత్సరం దాకా ఆఫ్రికా ఖండంలోని 37 దేశాల్లోని 475 భిన్న ప్రదేశాల్లో ఏనుగుల జాడపై విస్తృతస్థాయి గణన, పరిశోధన చేశారు. ఇటీవలి దశాబ్దాల్లో ఇంతటి విస్తృత సర్వే చేపట్టడం ఇదే తొలిసారి. సంబంధిత నివేదిక సోమవారం వెల్లడైంది. దీనిలో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. సవన్నా, ఫారెస్ట్ జాతి ఏనుగుల సంఖ్య సగటున ఏకంగా 77 శాతం తగ్గిపోయింది. విడిగా చూస్తే సవన్నా జాతి 70 శాతం, ఫారెస్ట్ జాతి సంఖ్య 90 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు గుంపులగుంపులుగా కనిపించిన కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అవి ఒక్కటికూడా లేవని సర్వేలో తేలింది. అయితే కొన్ని చోట్ల స్థానిక ప్రభుత్వాల పరిరక్షణ చర్యలతో వాటి సంఖ్య పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘‘తగ్గిపోయిన సంఖ్యను ఎలాగూ పెంచలేము. ఉన్న ఏనుగుల సంఖ్యా వేగంగా క్షీణిస్తోంది. మాలి, చాద్, నైజీరియా వంటి దేశాల్లో మరీ దారుణంగా పడిపోయింది’’ అని కొలరాడో స్టేట్ వర్సిటీలో వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ విభాగ ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ చెప్పారు.కొన్ని చోట్ల మెరుగైన పరిస్థితులు ఆఫ్రికా ఖండం దక్షిణ దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో ఎంతో శ్రమకోర్చి ఏనుగుల సంతతిని కాపాడుతున్నారు. ప్రభుత్వాల చొరవ, స్థానికుల అండతో ఏనుగుల సంఖ్య అక్కడ పెరిగింది. బొట్సావా, జింబాబ్వే, నమీబియాలో ఇప్పటికే వాటి సంఖ్య భారీగానే ఉంది. ‘‘కొన్ని చోట్ల మనం విజయం సాధించాం. ఈ విషయంలో మనకు మనం శెభాష్ చెప్పకోవాల్సిందే. అయితే ఇంకా ఏఏ ప్రాంతాల్లో విజయావకాశాలు ఉన్నాయో కనిపెట్టి కార్యసాధకులం కావాల్సిన తరుణమొచ్చింది’’అని ప్రొఫెసర్ జార్జ్ విటెమర్ అన్నారు.ఏనుగు దంతాలపై మోజుతో.. చాలా పొడవుండే ఆఫ్రికన్ ఏనుగుల దంతాలకు అంతర్జాతీయ మార్కెట్లో చాలా విలువ ఉంది. వీటి కోసమే వేటగాళ్లు ఏనుగులను చంపేస్తున్నారు. వేటగాళ్లను అడ్డుకోగలిగితే ఈ వన్యప్రాణులను కాపాడవచ్చని జంతుప్రేమికులు చెబుతున్నారు. అడవుల్లో పెరుగుతున్న వ్యవసాయం కారణంగా ఏనుగులు తమ ఆవాసాలను, ఆహార వనరులను కోల్పోతున్నాయి. చదవండి: అడవిలో అమ్మప్రేమ.. జంతువులు, పక్షుల్లో అరుదైన మమకారం!‘‘అడవుల విస్తరణకు ఏనుగులు మూలాధారం. ఎన్నో రకాల చెట్ల కాయలు, పండ్లను తింటూ వాటి గింజలను జీర్ణంచేయకుండా వేర్వేరు చోట్ల విసర్జించి కొత్త మొక్కల అంకురార్పణకు ఆజ్యం పోస్తాయి. నిత్యం వనవృద్ధి కార్యం చేసే ఏనుగుల సంఖ్య తగ్గడం భూమాతకు తీరని శోకం’’ అని సౌత్ ఆఫ్రికాలోని నెల్సన్ మండేలా యూనివర్సిటీలోని ఆఫ్రికన్ కన్జర్వేషన్ ఎకాలజీ అధ్యయనకారుడు, నివేదిక సహరచయిత డేవ్ బల్ఫోర్ ఆందోళన వ్యక్తంచేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సఫారీ విహారానికి కేరాఫ్ సుజన్ జవాయీ
సాక్షి, సెంట్రల్ డెస్క్: సుజన్ జవాయీ.. రాజస్థాన్‌లోని జవాయీ అరణ్యంలో కేవలం పది విలాసవంతమైన గుడారాలు, ఒక రాయల్ టెంటెడ్ సూట్లో ఏర్పాటుచేసిన సఫారీ క్యాంప్. కానీ ఇక్కడ అందుబాటులో ఉండే సేవలు, అద్భుతమైన ప్రకృతి అందాల కారణంగా ఇది ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్‌లో ఇది ఒకటిగా స్థానం సంపాదించింది. జైసల్, అంజలీసింగ్ అనేవారు 2014లో పాలీ జిల్లాలో ఈ జంగిల్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. పెద్ద సంఖ్యలో చిరుతపులులు సంచరించే సుందరమైన గడ్డి మైదానాలు, పచ్చదనం పులుముకున్న పర్వత శ్రేణులు, జవాయీ నది మధ్యలో ఇసుక తిన్నెలు కవర్ చేసేలా ఈ క్యాంపును డిజైన్ చేశారు. ఈ ప్రాంతంలో 60 వరకు చిరుతలు సంచరిస్తుంటాయి. వేటగాళ్ల ఊసే లేని ఈ ప్రాంతంలో స్థానికులు చిరుతలతో జీవిస్తుంటారు. ఇక్కడ టెంట్ బయట కూర్చొని అధ్బుతమైన పరిసరాలను ఆస్వాదించవచ్చు. అడవుల్లో చేసే సాహసాలు, చిరు™è ల ట్రాకింగ్, పొదల్లో బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట ఆరుబయట డిన్నర్ పర్యాటకులకు మరపురాని అనుభూతిని మిగుల్చుతుంది. ఈ ఆధునిక కాలంలో మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునేవారికి సుజన్ జవాయీ క్యాంప్ ఒక మంచి అవకాశం. టూర్లో భాగంగా సమీపంలోని గ్రామాలకూ తీసుకువెళ్లి అక్కడి గ్రామీణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను, పరిశీలించే అవకాశం కూడా కలి్పస్తారు. చిరుతలను వాటి సహజ ఆవాసాల్లో చూసేందుకు ఉదయం, సాయంత్రం సఫారీ ఉంటుంది. కొండపైన టెంట్ ముందు కూర్చొని జువాయీ సరస్సు అందాలు, చుట్టుపక్కల పొలాలను సాగుచేసుకునే రైతులను చూస్తూ సూర్యాస్తమయాలను ఆస్వాదించవచ్చు. పెరగనున్న విదేశీ పర్యాటకులు ప్రపంచంలోని అత్యుత్తమ హోటళ్ల జాబితాలో సుజన్ జవాయీకి స్థానం లభించడంతో మరింత పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శించే అవకాశం ఉంది. ఇప్పటికే టూరిస్ట్ డెస్టినీగా ఉన్న రాజస్థాన్‌కు ఇది మరింత ఊపు తీసుకువస్తుంది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరగడం ద్వారా దేశ పర్యాటక రంగానికి ఆదాయం పెరుగుతుంది. ఎలా చేరుకోవచ్చు?⇒ ఈ క్యాంప్ ఉదయ్‌పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 150 కిలోమీటర్లు, జోద్పూర్ ఎయిర్పోర్ట్ నుంచి 172 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ⇒ మోరీ బెరా రైల్వే స్టేషన్ నుంచి 9 కిలోమీటర్ల దూరం ఉంటుంది.అనుకూల సమయం⇒ అక్టోబర్ నుంచి మార్చి నెలల మధ్య సందర్శనకు అత్యంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండి ఉష్ణోగ్రతలు 10 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటాయి.⇒ విడిది చేయాల్సిన సమయం: ఇక్కడి అందాలను పూర్తిగా ఆస్వాదించాలంటే కనీసం రెండు రాత్రులు, 3 పగళ్లు విడిది చేయాల్సి ఉంటుంది. 50 అత్యుత్తమ హోటల్స్‌లో స్థానంప్రపంచ వ్యాప్తంగా ఆరు ఖండాల్లో అత్యుత్తమ వసతులు కలిగిన 50 హోటల్స్‌లో సుజన్ జవాయీ హోటల్ స్థానం సంపాదించింది. 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోని 50 అత్యుత్తమ హోటల్స్ జాబితాను ‘50 బెస్’ అనే సంస్థ ఇటీవల లండన్‌లో ప్రకటించింది. ఈ జాబితాలో సుజన్ జవాయీ 43వ స్థానం సంపాదించింది. ట్రావెల్ జర్నలిస్ట్‌లు, ఆతిథ్యరంగ ప్రముఖులు, ట్రావెల్ స్పెషలిస్ట్‌లతో కూడిన 600 మంది గ్లోబల్ ఓటర్లు ఈ జాబితాను సెలెక్ట్ చేశారు. ఈ జాబితాలో థాయిలాండ్‌లోని చావో ఫ్రయా నదికి ఎదురుగా ఉన్న కాపెల్లా బ్యాంకాక్ అనే విలాసవంతమైన హోటల్ ప్రపంచంలో బెస్ట్ హోటల్‌గా నిలిచింది. ఇటలీలో లేక్ కోమోలోని 18 శతాబ్ధానికి చెందిన విల్లా పసలాక్వా రెండో స్థానంలో నిలిచింది. హాంకాంగ్‌కు చెందిన విలాసవంతమైన హోటల్ రోజ్‌వుడ్ హాంకాంగ్ మూడో స్థానంలో నిలిచింది. -
మన్యంలో మంచుతెరలు
సాక్షి, పాడేరు:మన్యంలో రెండు రోజుల నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందస్తు చలిగాలుల వ్యాప్తితో మన్యం వాసులు ఉదయం, సాయంత్రం చలిబారిన పడుతున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాకముందే మన్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో బుధవారం 16.5 డిగ్రీలు, గురువారం 17 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెండు రోజులుగా పాడేరు మండలం మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో 18 డిగ్రీలు, అరకులోయ కాఫీ బోర్డులో 18.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.దట్టంగా పొగమంచుఏజెన్సీలోని అన్ని ప్రాంతాల్లోనూ పొగమంచు దట్టంగా కురుస్తోంది. వేకువజామున ఉదయం 8 గంటల వరకు మంచు తెరలు వీడటం లేదు. పొగమంచు తీవ్రతతో వాహన చోదకులు పగటిపూట కూడా హెడ్లైట్లు ఆన్ చేసుకుని వాహనాలు నడుపుతున్నారు. తుపాను ప్రభావంతోనే..తుపాను కారణంగా ఏజెన్సీలో చలిగాలులు అధికమయ్యాయి. నవంబర్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా చలితీవ్రత అధికంగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డిసెంబర్ నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలలోపు పడిపోయే అవకాశం ఉంది. – డాక్టర్ అప్పలస్వామి, ఏడీఆర్, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం -
అడవే ఆధారం.. అభివృద్ధికి దూరం
చెట్లు చేమలే వారి నేస్తాలు.. బొడ్డు గుడిసెలే నివాసాలు.. ఆకులు, అలములు,కందమూలాలే ఆహారం.. అడవిలో పుట్టి.. అడవిలో పెరిగి.. అడవే సర్వస్వంగా జీవిస్తున్నా ఎదుగూబొదుగూ లేని బతుకులు.. అభ్యున్నతికి నోచక.. అనాగరిక జీవనం సాగిస్తున్న చెంచుల బతుకులపై విశ్లేషణాత్మక కథనమిది. అచ్చంపేట: చెంచుల అభ్యున్నతి, సంక్షేమానికి ప్రభుత్వం ఏటా బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తున్నా.. అభివృద్ధికి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారు. నేటికీ వందలాది మంది చెంచులకు వ్యవసాయ భూమి లేదు. అటవీ ఉత్ప త్తుల సేకరణతో కాలం వెళ్లదీస్తున్నారు. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ భూ పంపిణీకి నోచుకోవడం లేదు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుల అభివృద్ధి గణాంకాలకే పరిమితమైంది. వారికి ఉపాధి కల్పించేందుకు జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ, గిరిజన సహకార సంస్థతో పాటు ఐకేపీ, టీపీఎంయూ ఐటీడీఏలో అంతర్భాగంగా ఉన్నాయి. విద్య, వైద్యం, గృహ నిర్మాణం, వ్యవసాయం, తాగునీటి వసతి వంటివి అమలు కావడం లేదని చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కా ఇళ్లు లేక రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మండల (నెగడి)తో కాలం వెళ్లదీస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను వైద్య, ఆరోగ్యశాఖ, ఐటీడీఏ పట్టించుకోక పోవడంతో చెంచుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. దీర్ఘకాలిక రోగాలతో పాటు మలేరియా, క్షయ, పక్షపాతం, కడుపులో గడ్డలు, విషజ్వరాలు, రక్తహీనత, శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. అటవీ లోతట్టు ప్రాంతంలో జీవిస్తున్న చెంచుల జీవితాలు మరింత దుర్భరంగా ఉన్నాయి. వైద్యం, పౌష్టికాహారం, తాగునీరు అందక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దుర్భరంగా బతుకులు..మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని చెంచుల సంక్షేమం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సున్నిపెంట (శ్రీశైలం)లో ఏర్పాటైన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రభావితంగానే కొనసాగింది. 2014 రాష్ట్ర విభజన అనంతరం 2015 మార్చి నుంచి అమ్రాబాద్ మండలం మన్ననూర్‌లో సమీకృత గిరి జనాభివృద్ధి సంస్థను (ఐటీడీఏ ) ఏర్పాటు చేశారు. దీని పరిధి లో నాగర్‌కర్నూల్, మహబూబ్ నగర్, నల్లగొండ, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలున్నాయి. ఆయా జిల్లాల్లోని 25 మండలాల్లో 172 గిరిజన గ్రామాలు, పెంటలు.. 4,041 చెంచు కుటుంబాలున్నాయి. 14,194 మంది గిరిజన జనాభా ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో 88 చెంచు పెంటల్లో 2,595 కుటుంబాలుండగా.. 8,784 మంది చెంచులు నివసిస్తున్నారు. వీరిలో 4,341 మంది పురుషులు, 4,449 మంది మహిళలున్నారు. అభయారణ్యం పరిధిలో లింగాల, అమ్రాబాద్, పదర మండలాలుండగా.. 18 చెంచు పెంటలున్నాయి. 12 పెంటల్లో పూర్తిగా చెంచులే నివసిస్తుండగా.. మిగతా పెంటల్లో చెంచులతో పాటు ఎస్పీ, ఎస్టీలున్నారు. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతంలోని పర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు తదితర చెంచు పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా ఉంది. గిరిజనుల అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏతో ఎలాంటి సంక్షేమ ఫలాలు అందకుండా పోతున్నాయి. వీరి జీవన స్థితిగతుల మార్పు, సమస్యల పరిష్కారానికి చెంచు సేవా సంఘం ఆ«ధ్వర్యంలో ఎన్నోసార్లు పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేపట్టారు. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకులు వెళ్లదీస్తున్నారు.ఫలాల సేకరణకు హద్దులు..చెంచులు ప్రధానంగా అటవీ ఉత్పత్తుల సేకరణ, వేటపై ఆధారపడి జీవనం కొనసాగిస్తారు. అటవీ ప్రాంతంలో లభించే ఫలాల సేకరణకు హద్దులు ఏర్పాటు చేసుకుంటారు. వారు ఏర్పాటు చేసుకున్న సరిహద్దు ప్రాంతంలోనే ఉత్పత్తులు సేకరిస్తుంటారు. ఇది వంశపారంపర్యంగా వస్తున్న హక్కుగా చెబుతున్నారు. చెంచుల ఆచారాలు, ఇంటి పేర్లు.. చెట్లు, వన్యప్రాణుల పేర్లతో కూడి ఉంటాయి.చెట్ల పెంపకం అంతంతే..అటవీ ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగించే చెంచుల బతుకులు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. క్రమంగా అటవీ ఉత్పత్తులు అంతరించడం.. చెంచుల జీవన ప్రమాణాలు పెంచాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉండటంతో వారికి ఆహార కొరత ఏర్పడింది. నాగరికత ఎరుగని చెంచులు నేటికీ.. ఆహార సేకరణ దశలోనే ఉన్నారు. వీరి అభివృద్ధికి బాటలు వేయాల్సిన ఐటీడీఏ.. ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నది వాస్తవం. ఫలాలు ఇచ్చే చెట్ల పెంపకంపై అధికారులు దృష్టి సారించడం లేదు. వేసవిలో కనీసం ఉపాధి పనులు కూడా చేపట్టకపోవడంతో చెంచులు అయోమయ పరిస్థితిలో ఉన్నారు.అటవీ ఉత్పత్తులు ఇవే..నల్లమల అటవీ ప్రాంతంలో తేనె, మారెడు గడ్డలు, జిగురు, చింతపండు, కుంకుడుకాయలు, ముష్టి గింజలు, ఎండు ఉసిరి, చిల్లగింజలు, నరమామిడి చెక్క, కరక్కాయలు, ఇప్పపువ్వు, ఇప్పగింజలు, కానుగ గింజలు, తునికాకు, బుడ్డపార్ల వేర్లు, వెదురుతో పాటు మరో పది రకాల ఉత్పత్తులు అడవిలో లభిస్తాయి. వాతావరణ పరిస్థితులు, రేడియేషన్ ప్రభావం వల్ల సహజసిద్ధంగా లభించే అటవీ ఫలాలు క్రమంగా తగ్గిపోతున్నాయి. వీటికోసం చెంచులు పెద్ద పులులు ఇతర క్రూరమృగాలతో పొంచి ఉన్న ముప్పును సైతం లెక్కచేయడం లేదు. అటవీ ఉత్పత్తులు సేకరించి, గిరిజన కార్పొరేషన్ సంస్థ జీసీసీ కేంద్రాల్లో విక్రయిస్తూ.. తమకు కావలసిన సరుకులు తీసుకెళ్తారు. ఇప్పటికే తీగలు, గడ్డలు అంతరించిపోవడంతో చెంచులకు ఉపాధి లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల పెంపకంపై దృష్టి సారించినా.. చెంచులకు ఫలాలు ఇచ్చే మొక్కల పెంపకంపై మాత్రం ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికే అడవిలో లభించే తునికాకు సేకరణను అటవీశాఖ అధికారులు పదేళ్లుగా నిలిపివేశారు. రేడియేషన్ కారణంగా తేనెటీగలు అంతరించిపోవడంతో తేనె తుట్టెలు కనిపించడం లేదు. తేనెటీగల పెంపకంపై ప్రభుత్వం చెంచులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. చెంచులు ఏడాది పొడవునా జిగురు, చింతపండు, తేనెపైనే ఆధారపడి జీవిస్తున్నారు.ఉప్పుకైనా అప్పాపూరే..చెంచులకు జీసీసీ డిపోల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తారు. నల్లమలలోని చెంచులందరూ కాలినడకన అప్పాపూర్ చెంచుపెంటకు వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు. అటవీ వస్తువులను విక్రయించి, వాటి ద్వారా వచ్చిన డబ్బుతో బియ్యం, నూనె, పప్పు వంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సరుకులకు బయటి మార్కెట్ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. చెంచులకు నాసిరకం సరుకులు అంటగడుతున్నారు.బీమా కల్పించాలిప్రభుత్వం తేనెకు మద్దతు ధర కల్పించడంతో పాటు.. తేనె సేకరణకు వెళ్లే ప్రతి ఒక్కరికి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. కొన్నేళ్లుగా స్వచ్ఛంద సంస్థలు మాత్రమే తేనె సేకరణలో మాకు ఉపయోగపడుతున్నాయి. వారు ఇచ్చిన కిట్లు కూడా పాడయ్యాయి. కొత్త వాటిని ఇవ్వలేదు. గతంలో పెంటలకు అందుబాటులో తేనె లభించేది. ఇప్పుడు అడవిలో చాలా దూరం వెళ్లాల్సి వస్తోంది. – బయన్న, మల్లాపూర్ చెంచుపెంటపక్కా ఇళ్లు లేవులోతట్టు చెంచులు నేటికి ఆనాగరిక జీవితం కొనసాగిస్తున్నారు. అటవీ ఉత్పత్తులు తగ్గాయి. జీవనం కొనసాగడం కష్టంగా ఉంది. పక్కా ఇళ్లు లేక బొడ్డు గుడిసెల్లోనే కాపురం వెళ్లదీస్తున్నారు. ప్రత్యేక ఉపాధి తీసివేసిన తర్వాత పనులు లేకుండా పోయాయి. వైద్యం అందక రోగాల బారిన పడుతున్నారు. – నిమ్మల శ్రీనివాసులు, రాష్ట్ర అధ్యక్షుడు, ఆదివాసీ చెంచు ఐక్యవేదిక ఉపాధి కల్పనకు చర్యలుచెంచుల అభ్యున్నతి, సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాం. చెంచుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్«మన్ యోజన) పథకం కింద 88 చెంచుపెంటల్లో 11 రకాల కార్యక్రమాలను విడతల వారీగా చేపడుతున్నాం. చెంచుపెంటల్లో 1,030 ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదించి, పనులు ప్రారంభించాం. కొంతమంది చెంచులకు కిసాన్ క్రెడిట్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఆధార్‌కార్డులు అందజేశాం. ప్రత్యేక వైద్య వాహనం ఏర్పాటు చేశాం. మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.– రోహిత్‌రెడ్డి, ఇన్చార్జి ఐటీడీఏ పీవో -
అడవిలో ఆతిథ్యం
సాక్షి, అమరావతి: దట్టమైన అటవీ ప్రాంతం.. ఆహ్లాదకరమైన వాతావరణం.. చెట్లపై ఆవాసాలు... వాటిలో కూర్చుని పక్షుల కిలకిలా రావాలు వింటూ.... స్వచ్ఛమైన గాలి పీలుస్తూ... ఒక కప్పు కమ్మటి కాఫీ తాగితే ఎలా ఉంటుంది... ఒక్కసారి ఊహించుకుంటేనే మనసు పరవశించిపోతుంది కదా...! కచ్ఛితంగా అటువంటి అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు... ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తూ అడవినే నమ్ముకున్న గిరిజనులకు జీవనోపాధి కల్పించేందుకు రెండేళ్ల కిందట వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘అడవిలో ఆతిథ్యం’ పేరిట ఒక గొప్ప ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో రూ.5.50కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పుడు ‘కూటమి’ గ్రహణం పట్టింది. సాంకేతిక సమస్య సాకుతో గత మూడు నెలలుగా పనులు నిలిపివేసింది. విశాఖ–అరకు రహదారి చెంతనే ‘అడవిలో ఆతిథ్యం’ విశాఖ నుంచి అరకు వెళ్లే దారిలో చెంతనే అనంతగిరి మండలం మర్ధగుడ గ్రామానికి సమీపంలోని అడవిలో ఆతిథ్యం ఇచ్చేలా గత ప్రభుత్వం 2022లో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సింహాద్రి ఎన్టీపీసీ సహకారం అందిస్తోంది. అటవీ శాఖ పర్యవేక్షణలో ఆర్అండ్బీ శాఖకు పనులు అప్పగించారు. కాఫీ తోటల మధ్య కాఫీ తాగేలా రూ.80 లక్షలతో కాఫీ హౌస్, రోడ్డు, మంచినీటి ట్యాంక్ నిర్మాణం పూర్తిచేశారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కూటమి సర్కారు వచ్చాక సాంకేతిక కారణాల పేరుతో మిగిలిన పనులు నిలిపివేశారు. ఇంకా రూ.4.70కోట్లతో పర్యాటకుల కోసం రెస్టారెంట్, కిచెన్, 16 కాటేజీలు, రిసెప్షన్, ఫర్నిచర్, విద్యుత్ కనెక్షన్లు తదితర పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్టేట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ద్వారా మళ్లీ డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు) రూపొందించి పనులు చేపట్టేందుకు కసరత్తు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్ట్ విశేషాలు ఇవీ.. » ప్రకృతితో మమేకమయ్యే పర్యాటకులకు ‘జీవ వైవిధ్యం’ గురించి అవగాహన కల్పించేలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. దీనిలో భాగంగానే ఇక్కడ ప్రత్యేక స్టడీ సెంటర్, సీతాకోక చిలుకల పార్క్, ఔషధ మొక్కల వనం, వాచ్ టవర్ ఏర్పాటు చేయాలని కార్యాచరణ చేపట్టింది. » చెట్లపైనే హట్స్(నివాసాలు) వేసి వాటిలోనే పర్యాటకులు బస చేసేలా ఏర్పాటు చేయడం ద్వారా వారికి గొప్ప అనుభూతిని అందించాలనే లక్ష్యంతో ప్రాజెక్ట్‌ను రూపొందించారు. » ఈ ప్రాజెక్ట్ నిర్వహణ, ఆదాయాన్ని మర్ధగుడ వన సంరక్షణ సమితి(వీఎస్ఎస్)లో 80 మంది సభ్యులకు ఇవ్వాల్సి ఉంది. » ఏజెన్సీలో లభించే పనస, చింతపండు తదితర అటవీ ఫల సాయంతోపాటు సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన వ్యవసాయ ఉత్పత్తులను కూడా ఇక్కడ విక్రయించేలా ప్రతిపాదించారు. కూటమి సర్కారు స్పందించి ఇటువంటి గొప్ప ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు. -
నేపాల్ నుంచి ఏనుగుల గుంపు.. బీహర్ గ్రామాల్లో ఆందోళన
పశ్చిమ చంపారణ్: బీహార్‌లోని వాల్మీకి పులుల అభయారణ్యానికి సమప గ్రామాల్లో మళ్లీ అడవి ఏనుగుల సంచారం మొదలైంది. తాజాగా బిసాహా గ్రామ సమీపంలో ఆరు అడవి ఏనుగుల గుంపు కనిపించింది. దీంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి వస్తున్న అడవి ఏనుగులు పొలాల్లోకి చొరబడి వరి, చెరకు పంటలను ధ్వంసం చేస్తున్నాయి.ఏనుగుల గుంపును చూసిన గ్రామస్తులు వాటిని తరిమికొట్టేందుకు టార్చ్‌లు వెలిగించి సందడి చేసి, వాటిని తరిమికొట్టారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏనుగులు సుమారు 10 ఎకరాల్లోని పంటలను ధ్వంసం చేశాయి. చేతికొచ్చిన చెరకు, వరి పంటలు కళ్ల ముందే పూర్తిగా నాశనం కావడంతో రైతులు ఏనుగుల ఆగడాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకినగర్ రేంజర్ రాజ్‌కుమార్ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ నష్టపోయిన పంటలపై సర్వే చేస్తున్నామని, నిబంధనల ప్రకారం రైతులకు నష్టపరిహారం ఇచ్చే ప్రక్రియను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. నేపాల్‌లోని చిత్వాన్ నుంచి ఏనుగులు ఇటువైపు తరలివస్తున్న మాట వాస్తవమేనని నేచర్ ఎన్విరాన్మెంట్ అండ్ వైల్డ్‌లైఫ్ సొసైటీ ప్రాజెక్ట్ మేనేజర్ అభిషేక్ పేర్కొన్నారు. ఏనుగుల గుంపు గ్రామాల్లోకి చొరబడకుండా తగిన చర్యలు చేపడుతున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: World Students Day: అబ్ధుల్ కలాం స్ఫూర్తిగా.. -
హైదరాబాద్‌కు ఆక్సిజన్ ఆగనున్నదా?
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే! ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు -
ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి
బహ్రాయిచ్: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్ జిల్లాలో నరమాస భక్షక తోడేళ్లనన్నింటినీ పట్టుకున్నామని అటవీశాఖ అధికారులు చేసిన ప్రకటన మరువకముందే మరో తోడేలు ఓ చిన్నారిపై దాడి చేసింది. మహసీ ప్రాంతంలో నరమాంస భక్షక తోడేళ్ల దాడులు ఇంకా ఆగడంలేదు. ఇంటి వరండాలోని గదిలో నిద్రిస్తున్న ఏడేళ్ల చిన్నారి అంజుపై తోడేలు దాడి చేసింది.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తోడేలు దాడికి దిగిన వెంటనే అంజు కేకలు వేయడంతో అది ఆ చిన్నారిని వదిలి పారిపోయింది. బాధితురాలిని ప్రథమ చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అందించాక ఆ చిన్నారిని మెరుగైన వైద్యం కోసం బహ్రాయిచ్ మెడికల్ కాలేజీకి తరలించారు.రాత్రి 11.30 గంటల సమయంలో తోడేలు చిన్నారి అంజు మెడ పట్టుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. అంజు కేకలు వేయడంతో తోడేలు బాలికను వదిలి పారిపోయింది. కాగా ఆ చిన్నారికి అయిన గాయాన్ని పరిశీలించిన బహ్రాయిచ్ డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ చిన్నారిపై తోడేలు దాడి చేసిందన్న కుటుంబ ఆరోపణను ఆయన ఖండించారు. ఇది కుక్క దాడిలా కనిపిస్తున్నదన్నారు.బహ్రాయిచ్ ప్రాంతంలో తోడేళ్లు ఇప్పటివరకూ పదిమందిని పొట్టనపెట్టుకున్నాయి. తోడేళ్ల దాడుల్లో 50 మందికి పైగా జనం గాయపడ్డారు. ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహ్రాయిచ్‌కు వచ్చి బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి ప్రభుత్వ సహాయం అందించారు. నరమాంస భక్షక తోడేళ్లు కనిపించగానే చంపేయాలని ముఖ్యమంత్రి అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. బహ్రాయిచ్ మహసీ ప్రాంతంలో ఆరు తోడేళ్లు ఉన్నాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. అందులో ఐదింటిని తొలుత పట్టుకున్నారు. మిగిలిన ఆరో తోడేలును కూడా పట్టుకున్నామని అటవీ శాఖ ప్రకటించినంతలోనే మరో తోడేలు దాడి చోటుచేసుకుంది. ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా -
గిరిజనుల ఆరోగ్యంపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. ఐటీడీఏల పరిధిలో ఉన్న ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారు లను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ఆదేశించారు. అటవీ ప్రాంతాల్లో నివసి స్తున్న ప్రజలు అరగంట లోపలే చేరుకునేలా ఐటీ డీఏల పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రుల నెట్వర్క్ ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా కొత్తగా సబ్ సెంటర్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు, కమ్యూ నిటీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాద నలు రూపొందించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారు లు, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లకు మంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలోని మన్ననూరు, భద్రాచలం, ఏటూరు నాగారం, ఉట్నూరు ఐటీడీ ఏల పరిధిలో ఉన్న ఆసుపత్రులు, వైద్య సౌకర్యా లు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహ గురువారం సమీక్షించారు. హైదరా బాద్‌లోని ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ శరత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కర్ణన్, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు.ప్రత్యేక వార్డులు.. బర్త్ వెయిటింగ్ రూంలు..ఐటీడీఏ పరిధిలో ఉన్న జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు, సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్‌ను మంత్రి ఆదేశించారు. అటవీ ప్రాంతాలు, రోడ్ కనెక్టివిటీ సరిగా లేని ప్రాంతాల్లో నివసిస్తున్న గర్భిణుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని సూచించారు. ట్రైబల్ ఏరియాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో బర్త్ వెయిటింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గర్భిణి, ఆమెతోపాటు వచ్చిన కుటుంబ సభ్యులకు భోజనం, మంచినీరు ఇతర వసతులు కల్పించాలన్నారు. 108 అంబులెన్స్‌లు వెళ్లలేని ప్రాంతాల్లో బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఐటీడీఏ పరిధిలో నివసిస్తున్న ప్రిమిటివ్ ట్రైబ్స్ కోసం ఆదిలాబాద్ రిమ్స్ వంటి పెద్ద దవాఖానాల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. వారి భాషలో మాట్లాడగలిగే వైద్య సిబ్బందిని ఆ వార్డుల్లో నియమించాలని సూచించారు. -
అడవిని మింగిన సుడిగాలి
పచ్చని అడవులు సుడిగాలి బీభత్సానికి అతలాకుతలం అయ్యాయి. మహావృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి, నేలకొరిగాయి. ఇదివరకు ఎన్నడూ కనివిని ఎరుగని ఈ బీభత్సం ములుగు జిల్లా తాడ్వాయి– మేడారం అభయారణ్యంలో జరిగింది. దాదాపు టోర్నడోను తలపించే ఈ ఉత్పాతం ఎందుకు జరిగిందనే దానిపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) శాస్త్రవేత్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. అటవీశాఖ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు ఈ బీభత్సానికి కారణాలు కనుగొనేందుకు అధ్యయనం చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రమంతటా భారీ వర్షాలు కురుస్తున్న వేళ ఆగస్టు 31న సాయంత్రం సుమారు 4.30 నుంచి 7 గంటల సమయంలో మేడారం అటవీ ప్రాంతం ఈ ఆకస్మిక ఉపద్రవానికి గురైంది. హఠాత్తుగా సుడిగాలులు పెనువేగంతో చుట్టుముట్టాయి. సుడిగాలుల తాకిడికి దాదాపు 78 వేలకు పైగా భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా పెకలించుకుపోయి నేలకూలాయి. తాడ్వాయి–మేడారం అభయారణ్యంలోని 204.30 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ విధ్వంసం జరిగింది. నేలకొరిగిన వృక్షాల్లో మద్ది, పెద్దేగి, జిట్రేగి, నల్లమద్ది, ఎజిత, నారవేప, రావి, గుంపెన, పచ్చగంధం వంటి భారీ వృక్షాలు ఉన్నాయి. మరెన్నో ఔషధ వృక్షాలు ఉన్నాయి. ఇదివరకు ఎన్నోసార్లు భారీ వర్షాలు కురిసినా, ఇలాంటి సుడిగాలి బీభత్సం మాత్రం ఎన్నడూ సంభవించలేదని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇది ఈ అడవి చరిత్రలోనే కనివిని ఎరుగని బీభత్సమని వారంటున్నారు.కారణాలపై అన్వేషణఆకస్మిక సుడిగాలి బీభత్సానికి గల కారణాలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు జాతీయ స్థాయి సంస్థలైన ఐఎండీ, ఎన్ఆర్ఎస్సీ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నారు. మెట్రియలాజికల్ డేటా వచ్చిన తర్వాత మరింత అధ్యయనం చేసేందుకు వారు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి ప్రకృతి విలయం ఈ ప్రాంతానికి పూర్తిగా కొత్త. ఇదివరకు 1996లో మధ్యప్రదేశ్‌లోని నౌరదేవి అభయారణ్యంలో చెలరేగిన గాలిదుమారానికి చెట్లు నేలకూలాయి. అయితే, తాడ్వాయి–మేడారం అభయారణ్యంలో జరిగినంత తీవ్రనష్టం ఇప్పటి వరకు ఇంకెక్కడా చోటు చేసుకోలేదని పర్యావరణవేత్త పురుషోత్తం చెబుతున్నారు. టోర్నడో తరహా బీభత్సంఒకేసారి వేలాది మహావృక్షాలను నేలకూల్చేసిన సుడిగాలిని టోర్నడో తరహా బీభత్సంగా అటవీ శాఖ అధికారులు అభివర్ణిస్తున్నారు. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో సుడిగాలి బీభత్సాలు ఎక్కువగా జరుగుతుంటాయి. వర్షానికి తోడు దట్టమైన మేఘాలు, గాలి దగ్గరగా రావడంతో సుడిగాలి చెలరేగి ఇంతటి విధ్వంసానికి దారితీసి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, భారతదేశంలో టోర్నడోలు చెలరేగే అవకాశమే లేదని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలోని హిమాలయాలు సహా పర్వతాలు, కొండలు సుడిగాలులు చెలరేగకుండా అడ్డుకుంటున్నాయని, అందువల్ల టోర్నడోలు రావని చెబుతున్నారు. పైగా, మన దేశంలోని వేడి, ఉక్కపోత వాతావరణంలో టోర్నడోలకు అవకాశమే ఉండదని అంటున్నారు. విపరీతమైన వాతావరణ మార్పులు చోటుచేసుకునే ప్రదేశాల్లో టోర్నడోలు చెలరేగుతుంటాయి. ఉత్తర అమెరికా, అగ్నేయ–దక్షిణ అమెరికా, యూరోప్‌లోని పలు దేశాలు, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో టోర్నడోలు అప్పుడప్పుడు విధ్వంసాన్ని సృష్టిస్తుంటాయి. గడ్డం రాజిరెడ్డి సాక్షిప్రతినిధి, వరంగల్అడవి పునరుజ్జీవానికి మరో పదేళ్లుభారీ విధ్వంసానికి గురైన ఈ అడవి పునరుజ్జీవనానికి కనీసం మరో పదేళ్లు పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు, అటవీ అధికారులు చెబుతున్నారు. అడవిలో ఎలాంటి మొక్కలు నాటవద్దని, దానంతట అదే పునరుజ్జీవనం పొందుతుందని అంటున్నారు. కూలిన చెట్ల కొమ్మలను నరికివేసేందుకు, నిప్పు పెట్టేందుకు కొందరు ప్రయత్నించవచ్చని, అలాంటి చర్యలను నివారించాలని చెబుతున్నారు. ఏటూరునాగారం లేదా ములుగు ప్రాంతంలో భారత వాతావరణ శాఖ ఒక వాతావరణ పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఇలాంటి కేంద్రమేదీ లేకపోవడం వల్లనే జరిగిన విధ్వంసాన్ని అటవీశాఖ ముందుగా తెలుసుకునేందుకు వీలు లేకపోయిందని అధికారులు చెబుతున్నారు.అధ్యయనం తప్పనిసరిప్రకృతి కన్నెర్రచేస్తే దేవుడు కూడా కాపాడలేడనడానికి నిదర్శనం ఈ బీభత్సమని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ కె.వెంకట్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఆకస్మిక ప్రకృతి బీభత్సాలపై తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెరిపిలేని వర్షం, ఈదురు గాలుల వల్ల టోర్నడో స్థాయి విధ్వంసం ఇక్కడి అడవిలో జరిగిందని, దేశంలో ఎక్కడా ఇదివరకు ఇలాంటి విధ్వంసం జరగలేదని అన్నారు. దాదాపు 78 వేల మహావృక్షాలు నేలకూలిపోయాయంటే, ఆ ప్రభావం పర్యావరణంపై చాలానే ఉంటుందని, ఇలాంటి విపత్తులు పునరావృతం కాకుండా ప్రత్యేక అధ్యయనం చేయాల్సి ఉందని అన్నారు.∙కె.వెంకట్‌రెడ్డి,ప్రొఫెసర్, ఎన్ఐటీ, వరంగల్ఇది టోర్నడో కాదుములుగు జిల్లా అటవీప్రాంతంలో వచ్చినది టోర్నడో కాదని పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడు కె.పురుషోత్తం అంటున్నారు. ఇక్కడ ఒకేసారి దట్టమైన మేఘాలు కమ్ముకుని, ఒకేసారి వర్షించడంతో కొమ్మలు బాగా తడిసిపోయి, విరిగిపోయాయని, గురుత్వాకర్షణ మూలంగా ఒకేచోట గాలి అంతా కేంద్రీకృతం కావడంతో ఈ అటవీ ప్రాంతం భారీ విధ్వంసాన్ని ఎదుర్కొందని ఆయన వివరించారు. దీనిని టోర్నడోగా కాదు, డౌన్బరస్ట్గా భావించాల్సి ఉంటుందని చెప్పారు. ఇదే సుడిగాలి చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించి ఉంటే, భారీ స్థాయిలో ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించి ఉండేదని అన్నారు. ఈ బీభత్సాన్ని వాతావరణ మార్పుల కారణంగా తలెత్తిన ప్రకృతి ప్రకోపంగానే భావించాల్సి ఉంటుందని పురుషోత్తం అన్నారు. దట్టమైన అడవి కారణంగానే ఈ సుడిగాలి బీభత్సం చుట్టుపక్కల గ్రామాలకు విస్తరించకుండా ఉందని, విధ్వంసం తాకిడి మొత్తాన్ని అడవి భరించిందని తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలోనిది ఇసుక నేల కావడంతో భారీవృక్షాల వేళ్లు కూడా ఎక్కువ లోతుకు వెళ్లలేదని, అందుకే అవి కూలిపోయాయని వివరించారు. ∙కె.పురుషోత్తం, అధ్యక్షుడు, పర్యావరణ పరిరక్షణ ఐక్యవేదిక -
National Forest Martyrs Day: అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివి
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రతి ఏటా సెప్టెంబర్ 11న జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. దేశంలోని అడవులు, వన్యప్రాణులను రక్షించడానికి తమ ప్రాణాలను త్యాగం చేసిన వీరుల త్యాగాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ రోజున మానవాళి మనుగడలో అడవుల పాత్ర, అడవులను రక్షించాల్సిన అవసరం గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, విద్యా సంస్థలు ఈరోజు ప్రత్యక కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. 2013 సెప్టెంబరు 11 నుంచి మొదటిసారిగా పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దేశంలో జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని అధికారికంగా జరుపుకోవడం ప్రారంభించింది. ఈ రోజున జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ప్రత్యేక కారణముంది. 1730, సెప్టెంబర్ 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీ గ్రామంలో మారణకాండ జరిగింది. మార్వార్ రాజ్యంలో చెట్లను రక్షించడానికి బిష్ణోయ్ కమ్యూనిటీ సభ్యులు తమ ప్రాణాలను త్యాగం చేసిన రోజు ఇది. అప్పటి జోధ్‌పూర్ మహారాజు అభయ్ సింగ్ కొత్త రాజభవనాన్ని నిర్మిస్తున్నాడు. దాని కోసం అతనికి ఖేజ్రీ కలప అవసరమైంది. దీంతో రాజస్థాన్‌లోని థార్ జిల్లాలోని ఖేజ్రీ గ్రామంలోని ఖేజ్రీ చెట్లను నరికివేయాలని మహారాజు ఆదేశించాడు. రాజు ఆజ్ఞను విష్ణోయ్ వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.ఖేజ్రీ చెట్లు బిష్ణోయిల జీవనోపాధికి ఒక ముఖ్యమైన వనరు. ఈ చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిష్ణోయ్ మహిళ అమృతా దేవి, ఆమె ముగ్గురు కుమార్తెలు ఖేజ్రీ చెట్లను కావలించుకుని వాటిని నరకకుండా అడ్డుకున్నారు.అమృతా దేవితో పాటు ఆమె కుమార్తెల సాహసోపేతమైన చర్య గురించి అందరికీ తెలిసింది. దీంతో గ్రామస్తులంతా చెట్లను నరికేవారిని అడ్డుకున్నారు. ఈ నేపధ్యంలో బిష్ణోయిలు- మహారాజు సైనికుల మధ్య కొట్లాట జరిగింది. సైనికులు భయంకరమైన మారణకాండను కొనసాగించారు. చెట్లను రక్షించే ప్రయత్నంలో 363 మందికి పైగా బిష్ణోయిలు కన్నుమూశారు. -
బహ్రయిచ్‌లో పట్టుబడిన ఐదో తోడేలు
బహ్రయిచ్: యూపీలోని బహ్రయిచ్‌లో తోడేళ్ల భీభత్సం కాస్త అదుపులోకి వచ్చింది. తాజాగా అటవీశాఖ అధికారులు ఐదో తోడేలును కూడా పట్టుకున్నారు. ఆ తోడేలును రెస్క్యూ షెల్టర్‌కు తరలిస్తున్నారు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఇప్పటివరకూ మొత్తం ఐదు నరమాంసభక్షక తోడేళ్లను పట్టుకోగా, ఒక తోడేలు ఇంకా స్వేచ్చగా తిరుగుతోందని అటవీశాఖ అధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇప్పుడు పట్టుకున్న తోడేలు బహ్రయిచ్‌లోని హర్బక్ష్ సింగ్ పూర్వా గ్రామంలో అటవీశాఖ అధికారుల కంటబడింది. అటవీశాఖ అధికారులు గాలిస్తున్న తోడేళ్లలో ఇదొకటని తెలుస్తోంది.గత కొంతకాలంగా బహ్రయిచ్,సీతాపూర్‌లలో తోడేళ్లు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఇటీవల ఐదేళ్ల బాలికపై తోడేలు దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. సీతాపూర్‌లో కూడా తోడేలు దాడులు చోటుచేసుకున్నాయి. ఈ ప్రాంతంలో ఆరుగురిపై తోడేలు దాడి చేసింది. తోడేలు బారిన పడిన ఒక వృద్ధురాలు మృతి చెందింది. బహ్రయిచ్‌లో తోడేళ్ల దాడిలో ఏడుగురు మరణించినట్లు వార్తలు వచ్చాయి. 35కి పైగా గ్రామాల్లో తోడేళ్ల భయంతో ప్రజలు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నారు. గ్రామంలో దాదాపు డజను తోడేళ్లు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే వీటి సంఖ్య చాలా తక్కువేనని అటవీశాఖ అధికారులు అంటున్నారు. #WATCH | Bahraich, Uttar Pradesh: The Forest Department captured the fifth wolf and is now taking it to a rescue shelter of the Forest Department.So far 5 wolves have been caught. One more wolf remains to be caught. pic.twitter.com/euCm2tKaAr— ANI (@ANI) September 10, 2024 -
ఏ చెట్లు.. ఎన్ని కూలాయి?
సాక్షి, హైదరాబాద్/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ములుగు అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడంపై అటవీశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. తాడ్వాయి నుంచి మేడారానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా.. రెండు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం (204కుపైగా హెక్టార్లు)లో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్టుగా ఆ నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇందులో నల్లమద్ది, ఏరుమద్ది, తెల్లమద్ది, గుప్పెన, తునికి, టేకు, ఎగిశా, నేరేడు, మారేడు. గుంపెన, బొజ్జ, బూరుగ తదితర 50, 60 రకాల చెట్లు ఉన్నట్టుగా వెల్లడించినట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో అంచనా నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపనున్నట్టు తెలిసింది. కూలిపోయిన వాటిలో 50 నుంచి 70 ఏళ్లపైబడినవి భారీ వృక్షాల నుంచి ఐదు, పదేళ్ల వయసున్న చిన్న చెట్ల దాకా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తి స్థాయిలో చెట్ల లెక్కలు తీస్తూ.. ములుగు జిల్లా మేడారం అడవుల్లో కూలిన చెట్ల లెక్కింపులో అధికారులు నిమగ్నమయ్యారు. 30 హెక్టార్లకు ఒక బృందం చొప్పున పది బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో 20 మంది సిబ్బంది ఉన్నారు. వారు పూర్తిగా నేలకూలిన, సగానికి విరిగిన, కొమ్మలు విరిగిన చెట్లతోపాటు బాగున్నవాటిని కూడా గుర్తించి.. వాటి కొలతలు నమోదు చేస్తున్నారు. ఏయే రకాల చెట్లు ఎన్ని ఉన్నాయి, కూలినవి ఎన్ని అనేదీ లెక్కతీస్తున్నారు. రెండు రోజుల్లో సవివర నివేదికను సిద్ధం చేసి అటవీశాఖకు అందించనున్నట్టు తెలిసింది. కారణమేమిటనే దానిపై ఆరా.. కేవలం గంట, అరగంటలోనే అంత పెద్ద సంఖ్యలో చెట్లు నేలకూలడానికి కారణాలపై.. వాతావరణశాఖ (ఐఎండీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్ఆర్ఎస్ఏ)లను అటవీశాఖ సంప్రదించింది. మెట్రోలాజికల్, శాటిలైట్ డేటాలను విశ్లేషించి.. అసలు ఆ రోజు ఏం జరిగిందన్నది గుర్తించేందుకు ప్రయత్నించనున్నారు. మరోవైపు గురువారం అరణ్యభవన్ నుంచి జిల్లా అటవీ అధికారులతో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు తరహాలో రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో ఎక్కడైనా చెట్లకు నష్టం జరిగిందా అన్నది పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నష్టాన్ని అంచనా వేస్తున్నాం..సుడిగాలుల కారణంగా అటవీ ప్రాంతానికి, చెట్లకు జరిగిన నష్టం అంచనాకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశాం. దెబ్బతిన్న చోట అటవీ పునరుద్ధరణకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నాం. ములుగులో అంత బీభత్సం జరగడానికి కారణాలు, ఇతర అంశాలపై లోతైన అధ్యయనం నిర్వహిస్తాం. – ఏలూసింగ్ మేరూ, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) -
నేలకొరిగిన లక్ష చెట్లు..
-
ఏటూరునాగారంలో నేలకొరిగిన దట్టమైన అడవి
-
ఒక హంతకుడి బాధితులు!
పదిహేనేళ్ల క్రితం మేము మా ఫార్మ్ హౌస్ లోకి మారే సమయానికి అక్కడే ఉన్న ఒక తాటి చెట్టుని గమనించాము. అది తన పక్కనే ఉన్నపెద్ద మర్రి చెట్టుతో సూర్యరశ్మి కోసం పోటీ పడుతూండటం చూసాము. పగటి పూట ఒక నల్లంచి పక్షి ఆ తాటి ఆకుల మధ్య కట్టుకున్న తన గూటిలోకి వెళ్ళివస్తూ కనిపించేది. సాయంత్రం ఎండిన తాటి ఆకుల మధ్య విశ్రమించిన గబ్బిలాలు ఆహారం కోసం బయటకు వస్తూ కనిపించేవి.తాటి కాయలు బాగా పండి, నలుపు రంగులోకి మారి మంచి వాసన వచ్చే సమయానికి పునుగు పిల్లులు వస్తుండేవి. అవి రాత్రి సమయాల్లో పండిన తాటి కాయలను తినడం కోసం చెట్లు ఎక్కి, ఎండిన తాటి ఆకులపైకి దూకుతూ శబ్దం చేసేవి. ఒకసారి తాటి కాయలను తిన్న తరువాత క్రింద పడేస్తుంటే, ఆ కాయలు నేలపై ఉండే ఎండుటాకులకు తగిలి రాత్రి నిశబ్దానికి భంగం కలిగించేవి. ఒక్కోసారి రెండు మూడు పునుగు పిల్లులు బిగ్గరగా అరుస్తూ పోట్లాడుకుంటుంటే ఆ శబ్దానికి నిద్రాభంగం అయిన నా భర్త రోమ్ నిద్రలేచి “నోర్మూసుకో” అని నా మీద అరిసి అటు తిరిగి చక్కగా గురకపెట్టేవాడు!మంచి ఎండాకాలంలో రాత్రి వేళలో వీచే గాలి, ఆ తాటి చెట్ల ఆకులను కదిలిస్తూ భయపెట్టే శబ్దాన్ని చేసేది. కొంతమంది ఈ శబ్దాలు దెయ్యాలు చేసేవని భ్రమపడుతుండేవారు. ఉదాహరణకు ఎప్పుడైనా అర్ధరాత్రి వేళల్లో మమ్మల్ని ఇంటి వద్ద దించటానికి వచ్చే టాక్సీ డ్రైవర్లు ఆ పరిసరాలను గమనించి "ఇలాంటి చోట్ల ఉండటానికి మీకు భయంగా లేదా!" అని ఎవరికి వినపడనంత మెల్లగా మమ్మల్నిఅడిగేవారు!కొన్నిదశాబ్దాల క్రితం కొన్ని తాటి చెట్లు వరుసగా మొలకెత్తి పెద్ద చెట్లు అయ్యాయి. కొన్నాళ్లకు ఒక మర్రి చెట్టు వాటిల్లోని ఒక తాటి చెట్టుపై మొలకెత్తి పరాన్నజీవిలా బ్రతకటం మొదలుపెట్టింది. తాటి చెట్లు ఎత్తుగా ఏపుగా పెరుగుతుంటే, వాటితో పాటు మర్రి చెట్టుకూడా తన కొమ్మలను వేర్లను విస్తరిస్తూ దారిలో అడ్డు ఉన్నవాటిని తినేసేడట్లు బలంగా ఎదగడం మొదలుపెట్టింది. కొన్నేళ్ళకు ఆ మర్రి చెట్టు ధాటికి దాదాపుగా అన్ని తాటి చెట్లు చనిపోగా ఒకే ఒక్క తాటి చెట్టు మిగిలింది!కొన్నేళ్లకు ఆ మిగిలిన ఒక్క తాటి చెట్టు కూడా తన తల భాగం వంగిపోయేసరికి, పాపం ఈ చెట్టు కూడా మర్రి చెట్టుతో చేసిన పోరాటంలో ఓడిపోయింది అని మాకు అర్ధమయింది! ఆఖరికి దాని తల భాగం రాలిపోయి కేవలం కాండం మాత్రం ఒకప్పటి చెట్టుకి గుర్తుగా మిగిలిపోయింది.ఇది జరిగిన కొద్ది నెలల్లోనే రెండు బంగారు వర్ణపు వడ్రంగి పిట్టలు చనిపోయిన తాటి చెట్టు మిగిలి ఉన్న కాండాన్ని గుర్తించి వాటిపై రంధ్రాలు చెయ్యడం మొదలుపెట్టాయి. చివరికి ఆ కాండం పైభాగాన ఒక రంధ్రం చేసి గూడు కట్టాయి. కొన్ని వారాలకు ఒక రోజు మాకు తొర్ర వద్ద తల్లితండ్రి తెచ్చే ఆహారం కోసం అసహనంతో ఎదురుచూస్తున్న రెండు వడ్రంగి పిట్టల పిల్లలు కనిపించాయి!పిల్లలు పెద్దవై ఎగిరిపోయాక ఆ వడ్రంగి పిట్టల కుటుంబం ఆ తొర్రను ఖాళీ చేసి వెళ్ళిపోయి అప్పుడప్పుడు కనిపిస్తుండేవి. ఒక రెండేళ్లకు మరికొన్ని పక్షులు ఆ తొర్రలో ఆవాసం ఏర్పరుచుకున్నాయి. కొన్ని రామచిలుకలు ఆ గూటి యజమానులైన వండ్రంగి పిట్టలను తరిమేసి ఆ తొర్రను పెద్దది చేసి, దానిని నివాసానికి అనుగుణంగా చేసుకునే సమయానికి రెండు గుడ్లగూబలు వచ్చి చేరాయి. ఆ రామ చిలుకలు కొన్నిరోజులపాటు ఆ తొర్ర వద్ద ఎంత గోల చేసినప్పటికీ ఆ గుడ్లగూబలు తొణకకుండా, బెణకకుండా ఆ తొర్రను ఆక్రమించేశాయి. చిలుకలు ఎంత కష్టపడ్డప్పటికీ ఆ గుడ్లగూబలను ఏమీ చేయలేకపోయాయి. ఆ గుడ్లగూబలు కాస్త సర్దుకునే సమయానికి ఒక నల్లంచి వచ్చి ఆ గుడ్లగూబలను ఎదో చేసి మొత్తానికి ఆ తొర్ర నుంచి తరిమేసింది. “హమ్మయ్య చివరికి ఒక పక్షి ఈ తొర్రను తన ఇల్లుగా చేసుకుంటుంది” అని మేము సంబరపడేలోపలే ఒక జత గోరింకలు వచ్చి ఆ నల్లంచిని తరిమేసి ఆ గూటిలో స్థిరపడిపోయాయి!ఆ గోరింకలు కొన్నేళ్లపాటు ఆ తాటి చెట్టు తొర్రలో నివసించాయి. పక్షులే కాకుండా ఆ చనిపోయిన చెట్టు కాండం మీద కొన్నిరకాల బల్లులు, కాళ్ళ జెర్రెలు నివసించేవి. కానీ ఒక రోజు ఆ చెట్టు కాండం పడిపోవడంతో ఆ జీవులన్నీ గూడు లేనివి అయిపోయాయి! అయినప్పటికీ ఆ క్రింద పడిపోయిన కాండం మట్టిలో కలిసిపోయే లోపల కొన్ని కప్పలకు, నీటి పాములకు, పెంకు పురుగులకు, చెద పురుగులకు, బల్లి గుడ్లకు ఆశ్రయమిచ్చింది. ఇదంతా జరిగేలోపల మన మర్రి చెట్టు మా వంటింటి వ్యర్ధాల నీటి వలన బలపడి ఐదారు రెట్లు పెరిగి మహా వృక్షమైపోయింది!--జానకి లెనిన్కృష్ణమూర్తి(ఫోటోలు)(చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
అలా జైలుకు..ఇలా బెయిల్‌పై
బంజారాహిల్స్: పోలీసు ఆఫీసర్నని..ఫారెస్ట్ బీట్ ఆఫీసర్నని..తనకు డిపార్ట్మెంట్లో చాలా పరిచయాలు ఉన్నాయని, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురిని నమ్మించి రూ లక్షలు వసూలు చేయడమే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రెస్‌లో ఏకంగా సైఫాబాద్‌లోని అరణ్యభవన్ (ఫారెస్ట్ డిపార్ట్మెంట్)లోకి ప్రవేశించి హల్చల్ చేస్తున్న నకిలీ అధికారిని సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే..శ్రీకృష్ణానగర్‌కు చెందిన కొనకంచి కిరణ్‌కుమార్ ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కాడు. శ్రీనగర్‌కాలనీలోని ఓ గ్యాస్ కంపెనీలో పనిచేసే మహిళను పరిచయం చేసుకుని తాను పోలీసు ఇన్స్పెక్టర్నని, డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పడంతో అతడి మాటలు నమ్మిన బాధితురాలు తన తమ్ముడు గణేష్ కు ఉద్యోగం ఇప్పించాలని అతడికి రూ.11.50 లక్షలు ఇచి్చంది. అయితే రోజులు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా అతను అంతకముందే జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలయ్యాడు. అనంతరం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారి అవతారమెత్తిన కిరణ్ గత గురువారం సైఫాబాద్‌లోని అటవీ శాఖ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన అతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీఐగా పని చేస్తున్నానని చెప్పుకుంటూ హల్చల్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ గార్డులు అతడిని నిలదీయగా గుట్టురట్టయ్యింది. డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఏకంగా అరణ్యభవన్లోనే తిష్టవేసిన అతను బాధితులను అక్కడికే రమ్మని చెప్పినట్లు తేలింది.అధికారుల ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం సైఫాబాద్ పోలీసులు కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు పోలీసు, ఫారెస్ట్ శాఖ పేర్లు చెప్పుకుంటూ ఖాకీ డ్రెస్‌లో తిరుగుతూ ఆయా శాకల్లో ఉద్యోగాల పేరుతో రూ.2 కోట్ల వరకు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సైఫాబాద్, చర్లపల్లి, ఖమ్మం పోలీస్స్టేషన్ల పరిధిలోనూ అతడిపై ఎనిమిది కేసులు ఉన్నట్లు గుర్తించారు. ఇంత జరుగుతున్నా అలా జైలుకు వెళ్లడం..ఇలా బెయిల్‌పై రావడం..తిరిగి ఖాకీ డ్రెస్ చేసుకుని అవే డిపార్ట్మెంట్ల పేర్లు చెప్పి అమాయకులను మోసం చేయడం జరుగుతుంది. -
Wayanad landslide: ఆరు ప్రాణాలు నిలబెట్టారు
వయనాడ్: దట్టమైన అడవిలో అదొక కొండ గుహ.. చుట్టూ చిమ్మచీకటి.. ఒకటి నుంచి నాలుగేళ్ల వయసున్న నలుగురు చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఐదు రోజులపాటు అక్కడే తలదాచుకున్నారు. తాగడానికి వర్షపు నీరు తప్ప తినడానికి తిండి లేదు. ఆకలితో అలమటించిపోయారు. అటవీ సిబ్బంది 8 గంటలపాటు శ్రమించి ఆ కుటుంబాన్ని రక్షించారు. ఆరుగురి ప్రాణాలను కాపాడారు. కేరళలో వరద బీభత్సానికి సాక్షిగా నిలిచిన వయనాడ్ జిల్లాలోని అట్టమల అడవిలో జరిగిన ఈ సాహసోపేతమైన ఆపరేషన్ తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అటవీ సిబ్బందే అసలైన హీరోలంటూ జనం ప్రశంసిస్తున్నారు.వయనాడ్‌లో పనియా జాతి గిరిజనులు అధికంగా ఉంటారు. ఇతర సామాజికవర్గాలకు దూరంగా జీవిస్తుంటారు. అటవీ ఉత్పత్తులను విక్రయించి జీవనోపాధి పొందుతుంటారు. అందుకోసం గిరిజన దంపతులు నలుగురు పిల్లలను వెంట తీసుకుని కొండల్లోకి వెళ్లారు. భీకర వర్షం మొదలవడంతో కొండ గుహలో తలదాచుకున్నారు. వర్షం తగ్గకపోవడం, కొండచరియలు విరిగిపడుతుండడంతో కిందికొచ్చే సాహసం చేయలేకపోయారు. ఆహారం కోసం వెతుకుతూ తల్లి ఐదు రోజుల తర్వాత కిందికి రావడంతో అధికారులు గమనించారు. గుహలో నలుగురు పిల్లలు, భర్త ఉన్నారని చెప్పడంతో అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. భారీ వర్షం, అడుగడుగునా రాళ్లు, బురదలో అడుగువేయడమే కష్టమవుతున్నా గుహకు చేరుకున్నారు. ముందుగా ఆకలితో నీరసించిపోయిన చిన్నారుల కడుపు నింపారు. వాళ్లను తాళ్లతో తమ ఒంటికి కట్టుకొని జాగ్రత్తగా తీసుకొచ్చారు. ఆ క్రమంలో కొండపై నుంచి తాళ్ల సాయంతో దిగాల్సి వచి్చంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో జనం విపరీతంగా షేర్ చేశారు.350 మందికిపైగా మృతులు! వయనాడ్ విపత్తు మృతుల సంఖ్య 350 దాటినట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు మాత్రం 218 మంది చనిపోయినట్లు వెల్లడించారు. నిర్వాసితులకు సురక్షిత ప్రాంతంలో టౌన్íÙప్ ఏర్పాటుచేసి ఇళ్లు కట్టిస్తామని సీఎం పినరయి విజయన్ చెప్పారు. ప్రకటించారు. మోహన్ లాల్ రూ.3 కోట్ల విరాళం ప్రముఖ సినీ నటుడు మోహన్‌లాల్ శనివారం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు. భారత ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా ఉన్న ఆయన బాధితులను పరామర్శించారు. సహాయక సిబ్బంది సేవలను కొనియాడారు. వరద విలయానికి నామారూపాల్లేకుండాపోయిన నివాసాలను చూసి చలించిపోయారు. పునరావాస చర్యలకు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. -
కలెక్టర్, పీవో అడవిబాట
దుమ్ముగూడెం: ఇద్దరు ఐఏఎస్‌లు.. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ జితేష్ వి.పాటిల్, మరొకరు భద్రాచలం ఐటీడీఏ పీవో బి.రాహుల్. పోడు సాగు అంశంపై హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు సూచనలతో క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు అడవిబాట పట్టారు. వాహనాలు వెళ్లే మార్గం లేకపోవడంతో రానుపోను 10కి.మీ. నడిచారు. సమస్య ఏంటంటే...భద్రాద్రి జిల్లా దుమ్ముగూడెం మండలం గౌరారం అటవీ రేంజ్ పరిధిలో పలువురు రైతులకు కొన్నాళ్ల క్రితం పోడు పట్టాలు అందాయి. అయితే, ఈ భూమిలో అటవీ అధికారులు తమను సాగు చేసుకోనివ్వడం లేదని, పంటలను ధ్వంసం చేస్తున్నారంటూ 23మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈమేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలన్న కోర్టు సూచనలతో కలెక్టర్ పాటిల్, పీవో రాహుల్ మంగళవారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దుమ్ముగూడెం మండలంలోని ములకనాపల్లి ప్రధానరహదారి వరకు మాత్రమే రహదారి ఉండడంతో వాహనాల్లో వెళ్లారు.అక్కడినుంచి దట్టమైన అడవిలో రెవెన్యూ, అటవీ అధికారులతో కలిసి కాలిబాటన వాగులు, వంకలు దాటుతూ గౌరారం వరకు 5 కి.మీ. వెళ్లి సమస్యపై రైతులు, అటవీ అధికారులతో మాట్లాడారు. అడవిని నరికారని అధికారులు వివరించారు. ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించగా, ఫారెస్ట్ భూమిని కొందరు ఆక్రమించినట్టు తమ దృష్టికి వచ్చిందని కలెక్టర్ పాటిల్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ హక్కు పత్రాల్లో ఉన్నంత మేరకు భూమి సాగు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టుల వారోత్సవాలు జరుగుతున్న సమయాన అటవీ ప్రాంతంలో ఇద్దరు ఐఏఎస్‌లు పర్యటించడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.