ఎక్కడైన పచ్చదనం పరుచుకున్న అందమైన అడవులే ఉంటాయి. అక్కడ ఉండే చెట్ల రకాల్లో తేడాలు ఉంటాయోమో గానీ పచ్చదనం అనేది కామన్. మహా అయితే కొన్ని చోట్ల నదులతో కూడిన అడవులు ఉంటాయి. అలా ఇలా కాకుండా రాళ్లు ఉండే అడవి గురించి విన్నారా?. పైగా అక్కడ చెట్లకు బదులు రాళ్లు మొలుస్తాయట. దగ్గరకెళ్తే చెట్లలా ఉండే శిలాజాల్లా కనిపిస్తాయట. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే చైనాలోని కున్‌మింగ్ నగరానికి వచ్చేయండి. ఆ వింత అడవిని చూసేయండి.
ఎక్కడుందంటే..సాధారణంగా అడవుల్లో చెట్లు మొలుస్తాయి. అక్కడ మాత్రం రాళ్లు మొలిచాయి. అందుకే ‘స్టోన్ ఫారెస్ట్’గా పేరు పొందింది. ఈ శిలారణ్యం చైనా దక్షిణ ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్‌మింగ్ నగరానికి తొంబై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దాదాపు నాలుగువందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎటుచూసినా, కొండల్లా బారులు తీరిన శిలలే కనిపిస్తాయి.
ఇవన్నీ సున్నపురాతి శిలలు. ఇవి నేల నుంచి మొలుచుకొచ్చినట్లు ఉంటాయి. దగ్గరగా చూస్తే, ఇవి శిలాజాల్లా మారిన చెట్లలా కనిపిస్తాయి. చైనాలోని ఈ శిలారణ్యాన్ని చూడటానికి విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ శిలారణ్యాన్ని యునెస్కో 2007లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
(చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు)
Comments
Please login to add a commentAdd a comment