stone
-
మంచు సున్నితం.. వడగళ్లు కఠినం.. ఆకాశంలో ఏం జరుగుతుంది?
శీతాకాలంలో కొన్ని ప్రాంతాల్లో మంచు కురుస్తుంటుంది. ఈ మంచును ముట్టుకున్నప్పుడు ఎంతో సున్నితంగా ఉంటుంది. తాకగానే మంచి మెత్తని పూలను తాకిన అనుభూతినిస్తుంది. ఇదేవిధంగా వర్షాకాలంలో చాలా ప్రాంతాల్లో వడగళ్లు పడుతుంటాయి. అవి ఎంతో గట్టిగా రాళ్లలా ఉంటాయి. వెంటనే కరిగిపోవు. ఒకే ఆకాశం నుంచి పడే మంచు మృదువుగా, వడగళ్లు గట్టిగా ఎందుకు ఉంటాయి. దీనికి విజ్ఞానశాస్త్రం ఏమి సమాధానం చెబుతుంది?మంచు ఎందుకు కురుస్తుంది?చలికాలంలో రాత్రి వేళ భూమి అధికంగా ఉష్ణశక్తిని విడుదల చేస్తుంది. అలా వెలువడిన వేడి క్రమంగా వాతావరణపు పైపొరల్లోకి చేరుకోవడంతో భూమికి దగ్గరగా ఉండే పొరల్లో ఉష్ణోగ్రత తగ్గుతూ వస్తుంది. అప్పుడు భూమిపై ఉన్న గాలిలోని నీటి ఆవిరి మరింత చల్లబడి ఘనీభవించి చిన్న నీటి బిందువులు ఏర్పడతాయి. వాటికి దుమ్ము, ధూళి లాంటి అతి చిన్న కణాలు ఆవరించి గాలిలో మంచు ఏర్పడుతుంది. దీనినే పొగమంచు అంటారు. భూమికి దగ్గరగా ఒక తెరలాగా ఏర్పడడంతో పొగమంచు కురుస్తున్నట్లుగా కనిపిస్తుంది. చలికాలంలో భూమి అధికంగా చల్లబడడం వలన నీటి ఆవిరితో కూడిన గాలి నేలపై ఉండే చెట్ల ఆకులను, పూలను, పచ్చని గడ్డిపరకలను తాకి వాటిపై ఘనీభవిస్తుంది. అవే మెరిసే మంచు బిందువులుగా కనిపిస్తాయి.వడగళ్లు ఎలా ఏర్పడతాయంటే..మేఘాల్లో ఉండే నీరు వాతావరణ మార్పులకు కరిగి భూమిపై పడడాన్నే వర్షం అని అంటారు. సాధారణంగా మేఘాల్లోని నీరు సున్నా డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద సూపర్ కూల్డ్ స్టేట్‌లో ఉంటుంది. ఇది చిన్న చిన్న మంచు ముక్కలుగా మారి వర్షంగా కురుస్తుంది. అయితే ఆ మంచు ముక్కలు నేలను చేరుకునే సరికి గాలి తాకిడికి నీరుగా మారుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఆ మంచు ముక్కలు గట్టిగా తయారై వడగళ్లుగా వర్షంతో పాటు కిందకు పడతాయి.ఎక్కువ ఎత్తులో ఉంటూ బలమైన ఉరుములతో కూడిన మేఘాలు వర్షించినప్పుడు మేఘంలోని సూపర్‌కూల్డ్ నీటితో ముందుగా చిన్న మంచు ముక్కలు తయారవుతాయి. వాతావరణంలోని మార్పుల కారణంగా కింది నుంచి గాలి పైకి ఒత్తిడి తెచ్చినప్పుడు కొన్నిసార్లు ఆ ముక్కలు కింద పడకుండా తిరిగి మేఘాలపైకి వెళ్తాయి. ఈ క్రమంలో ఆ మంచు ముక్కలకు మరింత సూపర్ కూల్డ్ వాటర్ తోడవడంతో మరికొన్ని మంచు ముక్కలు దగ్గరగా అతుక్కుంటాయి. దాంతో అవి మరింత బలంగా, దృఢంగా మారతాయి. ఈ చర్య జరుగుతున్న కొద్దీ మంచు ముక్కలు ఇంకా పెద్దవిగా రూపాంతరం చెందుతుంటాయి. వీటినే మనం వడగళ్లు అని అంటాం. మేఘం నుంచి వర్షం కురిసేటప్పుడు కొన్ని వడగళ్లు మధ్యలోనే కరుగుతాయి. పెద్ద మంచు ముక్కలు మాత్రం కరగకముందే నేలను చేరుతుంటాయి. వాతావరణ పరిస్థితుల్లో నిలకడ లేనప్పుడు ఇలాంటి వడగళ్ల వానలకు అవకాశం ఉంటుంది.ఇది కూడా చదవండి: Year Ender 2024: హృదయాలను దోచిన ఐదు పర్యాటక ప్రాంతాలు -
కాళీ నిమజ్జనంలో రాళ్లదాడి
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని కోల్‌కతాలో కాళీమాత విగ్రహం నిమజ్జనంలో అల్లర్లు చోటుచేసుకున్నాయి. రాజాబజార్ పరిధిలోని నార్కెల్‌దంగ ప్రాంతంలో కాళీమాత విగ్రహాన్ని నిమజ్జనానికి తరలిస్తుండగా రాళ్ల దాడి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలంలో ఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు.కాళీమాత విగ్రహం నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రువ్విన ఘటన స్థానికంగా కలకలంరేపింది. అప్రమత్తమైన పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు నిమజ్జనం సందర్భంగా ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని కోల్‌కతా పోలీసులు సోషల్ మీడియా సైట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. పార్కింగ్ విషయంలోవివాదం జరిగిందని, దీనిని బీజేపీ నేతలు రాళ్లదాడి ఘటనగా చెబుతున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు.హిందువులు చేపట్టిన ఊరేగింపుపై మమతా బెనర్జీవర్గానికి చెందినవారు రాళ్లు రువ్వారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఆరోపించారు. మమతా బెనర్జీ వెంటనే నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తక్షణమే పదవి నుండి వైదొలగాలని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత సువేందు అధికారి మాట్లాడుతూ రాజాబజార్‌లో కాళి నిమజ్జనం ఊరేగింపుపై దాడి జరిగిందని, పోలీసులు భక్తులకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు.ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
మరో రైలు ప్రమాదానికి కుట్ర.. తప్పిన ముప్పు
మహోబా: ఉత్తరప్రదేశ్‌లో మరో రైలు ప్రమాదానికి కుట్ర జరిగింది. రైల్వే ట్రాక్‌పై కాంక్రీట్ పిల్లర్‌ను ఉంచిన ఉదంతం మహోబా జిల్లాలోని కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ ట్రాక్‌పై వస్తున్న ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఆ పిల్లర్‌ను చూసి, ఎమర్జెన్సీ బ్రేకులు వేసి రైలును ఆపాడు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు మహోబా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. అలాగే ఈ ఉదంతంలో ప్రమేయం ఉన్న 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన గురించి స్థానిక పోలీసు అధికారి దీపక్ దూబే మాట్లాడుతూ.. కబ్రాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందా-మహోబా రైల్వే ట్రాకపై ఫెన్సింగ్ పిల్లర్ ఉంచినందుకు 16 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నామని, అతనిని విచారిస్తున్నామన్నారు. ప్యాసింజర్ రైలు డ్రైవర్ ఈ ఘటనపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చిందని తెలిపారు. ట్రాక్‌పై ఉంచిన పోల్‌ను తొలగించిన అనంతరం ఆ మార్గంలో రైలు రాకపోకలకు సంబంధిత అధికారులు అనుమతిచ్చారని అన్నారు.ఇదేవిధంగా బల్లియా జిల్లాలోని బైరియా ప్రాంతంలో రైలు ఇంజన్.. ట్రాక్‌పై ఉంచిన రాయిని ఢీకొంది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వారణాసి-బల్లియా-ఛప్రా రైల్వే సెక్షన్లో పట్టాలపై రాయి కనిపించిందని నార్త్ ఈస్టర్న్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అశోక్ కుమార్ తెలిపారు. ట్రాక్‌పై రాళ్లను చూసిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినట్లు కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్లు, పిల్లర్లు మొదలైనవి పెడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటున్నాయి.ఇది కూడా చదవండి: World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు -
Rajasthan: ధార్మిక ఊరేగింపులో ఉద్రిక్తత
భిల్వారా: రాజస్థాన్‌లోని షాపురా జిల్లాలో గల జహజ్‌పూర్‌లో జల్ఝులానీ ఏకాదశి ఊరేగింపులో రాళ్ల దాడి చోటుచేసుకుంది. కోట నుండి వస్తున్న పీతాంబర్ రాయ్ మహారాజ్ ఊరేగింపుపై ఒక మతపరమైన స్థలం వెలుపల రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మహిళలు, కొందరు యువకులు, బీజేపీ ఎమ్మెల్యే గాయపడ్డారు. రాళ్లదాడి అనంతరం ఘటనా స్థలంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.ఘటన గురించి సమాచారం అందిన వెంటనే జహజ్‌పూర్ బీజేపీ ఎమ్మెల్యే గోపీచంద్ మీనా సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఈ ఘటన నేపధ్యంలో పలు దుకాణాలు మూతపడ్డాయి. పట్టణంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. ఈ ఘటనకు సంబంధించి షాపురా పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ కుమార్ కన్వత్ మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. పట్టణంలో మత సామరస్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.జిల్లా కలెక్టర్ రాజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, ఏదైనా పండుగ నిర్వహించే ముందుగా ఇరు వర్గాల సమావేశం నిర్వహించాలని ఎస్‌డిఎం, పరిపాలనాధికారులకు సూచించారు. ఘటన ఎలా జరిగిందనే విషయమై విచారణ జరుపుతున్నామన్నారు. సామరస్యానికి విఘాతం కలిగించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. ఇది కూడా చదవండి: నిమజ్జనానికి 2,500 వాహనాలు -
వందేభారత్‌పై రాళ్ల దాడి.. ఐదుగురు నిందితుల అరెస్ట్
బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో మూడు కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. సెప్టెంబరు 16న ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. రాళ్ల దాడి జరిగిన సమయంలో మహాసముంద్లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. రాళ్ల దాడిలో సీ2-10, సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు పగిలిపోయాయి. బాగ్బహ్రా రైల్వే స్టేషన్లో ఈ రాళ్ల దాడి జరిగింది.ఈ దాడికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా బాగ్బహ్రాకు చెందినవారు. వీరిపై పోలీసులు రైల్వే చట్టం 1989 కింద కేసు నమోదు చేశారు. 16 నుంచి నడవనున్న వందేభారత్ రైలుకు ట్రయల్ రన్ జరుగుతుండగా, రాళ్ల దాడి చోటుచేసుకున్నదని ఆర్పీఎఫ్ అధికారి పర్వీన్ సింగ్ తెలిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఐదుగురు నిందితులను అరెస్టు చేశారన్నారు. ఇది కూడా చదవండి: పాలలో విషమిచ్చి.. 13 మంది హత్య -
Bihar: ట్రయల్ రన్లోని ‘వందేభారత్’పై రాళ్ల దాడి
గయ: బీహార్‌లోని గయలో ట్రయల్ రన్లో ఉన్న వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ రైలును సెప్టెంబర్ 15న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇంతలోనే ఈ రైలుపై కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వి, రైలు అద్దాలు పగలగొట్టారు. ధన్‌బాద్ రైల్వే డివిజన్ పరిధిలోని గయలోని బంధువా-టంకుప్ప స్టేషన్ మధ్య ఈ రాళ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. ఈ రైలు జంషెడ్పూర్ నుండి పట్నా వరకు నడవనుంది.ఈ ఘటనలో వందేభారత్ రైలు ఇంజన్‌కు ఆనుకుని ఉన్న రెండో కోచ్‌లోని సీటు నంబర్ నాలుగు దగ్గరున్న కిటికీ అద్దం పగిలిందని రైల్వే అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ కావడంతో ఈ వందే భారత్ రైలులో ప్రయాణికులెవరూ లేరు. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ మొదలు పెట్టారు. ఇదిలావుండగా సోమవారం న్యూఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఇటావా జిల్లాలోని భర్తానా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ రైలు కొన్ని గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. -
ఈ 'తియా శిలాఫలకాలు'.. ఏ కాలంనాటివో తెలుసా!?
ఇథియోపియా, అడిస్ అబాబాకు దక్షిణంగా ఉన్న సోడో ప్రాంతంలోని తియా పురావస్తు ప్రదేశం.. ప్రపంచాన్నే ఆకట్టుకుంటుంది. ఇక్కడ పదుల సంఖ్యలో మెగాలిథిక్ స్తంభాలు.. 12 లేదా 14వ శతాబ్దాల నాటి ఎన్నో కథలను.. ఊహించి చెబుతుంటాయి. అందుకే అవన్నీ మార్మిక సంకేతాలతో మానవ చరిత్రకు వారసత్వ సంపదగా చరిత్రలో నిలిచాయి.సంక్లిష్టమైన సామాజిక–మతపరమైన పద్ధతుల్లో కొన్ని రకాల చిహ్నాలు.. ఆ శిలాఫలకాలపై చెక్కి ఉన్నాయి. కత్తులు, బొమ్మలు ఇలా ఎన్నో భావనలతో చెక్కిన ఆ స్తంభాలు.. యునెస్కో గుర్తింపును కూడా పొందాయి. అందుకే ఇవన్నీ.. శాస్త్రవేత్తలను, పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి. పురాతన ఇథియోపియన్ సంస్కృతికి చెందిన ఆచారాలకు, నమ్మకాలకు ఇవి నిశ్శబ్ద సాక్ష్యాలుగా నిలిచి ఉన్నాయి. ఈ అమూల్యమైన ప్రదేశాన్ని సంరక్షించడానికి అక్కడి ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంది. ఈ శిలాఫలకాలు, వాటిపైనున్న మార్మిక చిహ్నాలు పురాతన రాతియుగం నాటి పరిస్థితుల్ని సూచిస్తాయి. కానీ ఆ సూచనలు నేటి తరాలకు ఏ మాత్రం అర్థం కాకుండా ఉన్నాయి.ఇక్కడ మొత్తంగా 36 మెగాలిథిక్ స్తంబాలు ఉన్నాయి. వాటి మీదున్న కత్తుల బొమ్మలు ఏదైనా దైవ శక్తిని లేదా సైనిక శక్తిని సూచిస్తూ ఉండవచ్చని నిపుణుల అంచనా. కానీ దానిపై స్పష్టత లేదు. ఇక ఇతర బొమ్మల విషయానికి వస్తే ఆనాటి జ్యోతిష వివరాలను, ఆనాటి నాగరికత వివరాలను తెలుపుతున్నట్లుగా అనిపిస్తున్నాయని కొందరు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. 1930ల వరకు ఈ పురావస్తు ప్రదేశం వెలుగులోకి రాలేదు. ఇథియోపియా ప్రాంతీయ సర్వేల సమయంలో ఫ్రెంచ్ పరిశోధకులు వీటి ప్రాముఖ్యతను గుర్తించి, వీటి వివరాలను ప్రపంచానికి వెల్లడించారు.ఆ రాతిస్తంభాలన్నీ పురాతన యుగంలో.. అంటే 12 లేదా 14 శతాబ్దంలోని చనిపోయిన పూర్వీకుల జ్ఞాపకార్థం కావచ్చని కొందరు లేదంటే అప్పటి సమూహానికి నాయకుడిగా ఉన్న నాయకుడి గౌరవార్థం కావచ్చని మరికొందరు అంచనా వేశారు. ఆ లెక్కన చూస్తే.. ఇది పురాతన శ్మశానవాటిక కావచ్చని కూడా కొందరి అభిప్రాయం. అయితే ఈ స్తంభాలు వెనుకున్న అసలు కథ ఏమిటి? అన్నది మాత్రం నేటికీ మిస్టరీనే! – సంహిత నిమ్మన -
ల్యాప్‌టాప్ అనుకుంటే బండరాయి వచ్చింది!
అనంతపురం ఎడ్యుకేషన్: కొరియర్లో ల్యాప్‌టాప్ వచ్చిందనుకుంటే బండరాయి కనిపించిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి అన్ని జిల్లాల సమగ్ర శిక్ష డీపీసీ, ఏపీసీలకు హెచ్‌పీ కంపెనీ 12 జనరేషన్, 16 జీబీ ర్యామ్, 1టీబీ ఎస్ఎస్డీ, స్క్రీన్ విండోస్ 11 ప్రో, ఎంఎస్ ఆఫీస్ అడాప్టర్ క్యారీ కేస్ సామర్థ్యం కల్గిన ల్యాప్టాప్స్ కొనుగోలు చేశారు. హైదరాబాద్‌కు చెందిన కంప్యూటర్ ఇండియా అనే సంస్థ ఈ ల్యాప్‌టాప్స్‌ను సరఫరా చేసింది. మే 31న జిల్లాకు వచ్చాయి. డీపీసీగా ఉన్న డీఈఓ తనకు అందిన ప్యాకింగ్ ఓపెన్ చేయగా, ల్యాప్‌టాప్ ఉంది. ఈ క్రమంలోనే జిల్లాకు పంపిన రెండు ల్యాప్‌టాప్‌ల్లో ఒకదానిని అందుకున్నట్లు సమాచారం పంపారని, రెండో దాని వివరాలు పంపాలంటూ బుధవారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో సమగ్ర శిక్ష ఏపీసీకి వచ్చిన పార్శిల్‌ను ఓపెన్ చేయగా.. అందులో బండరాయి దర్శనం ఇచ్చింది. ఆ రాయికే కవర్లు కప్పి ఉంది. అందులోనూ దాదాపు ల్యాప్‌టాప్ బరువు ఏ మేర ఉంటుందో అంతేస్థాయి బరువున్న రాయి ఉంచారు. అయితే, ఈ విషయాన్ని వెంటనే రాష్ట్ర కార్యాలయ అధికారుల దృష్టికి స్థానిక సిబ్బంది తీసుకెళ్లారు. ల్యాప్‌టాప్ పార్శిల్ కవరుపై ఉన్న కంప్యూటర్ ఇండియా సంస్థ ఫోన్ నంబరుకు కాల్ చేసి ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
బొండా బ్యాచ్ స్కెచ్.. సీఎం జగన్‌ను హత్య చేసేందుకే..
సాక్షి, అమరావతి: ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని హత్య చేయాలన్న పక్కా కుట్రతోనే ఆయనపై పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయితో దాడికి పాల్పడ్డారు. కుట్రదారులు పక్కా పన్నాగంతో నిందితుడు వేముల సతీశ్ కుమార్‌ను ప్రేరేపించి ముఖ్యమంత్రి జగన్‌పై దాడికి పాల్పడేలా పురిగొల్పారు. విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ యాత్ర సందర్భంగా వివేకానంద పాఠశాల వద్ద దాడికి పాల్పడి సీఎంను హతమార్చాలన్నది కుట్రదారుల పన్నాగం. ముఖ్యమంత్రి జగన్ తలపై సున్నిత భాగంలో పదునైన రాయితో బలంగా దాడి చేయడం ద్వారా హతమార్చాలన్నది ప్రణాళిక’ అని పోలీసులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విజయవాడలో జరిగిన హత్యాయత్నం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ కుమార్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టు ఆధారాలతో సహా గుర్తించారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం కేసు లో ప్రధాన నిందితుడైన వేముల సతీశ్ మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేత బొండా ఉమాతో సన్నిహితంగా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో ఏ 2గా ఉన్న నిందితుడు కూడా బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. ముఖ్యమంత్రిని హత్య చేసేందుకు కుట్రదారుల పన్నిన పన్నాగాన్ని పోలీసులు ఆధారాలతో వెలికితీశారు. హత్యాయత్నానికి పాల్పడిన వేముల సతీష్‌ను ప్రధాన నిందితుడు (ఏ1)గా పేర్కొంటూ గురువారం విజయవాడ న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. సీఎం జగన్‌పై హత్యాయత్నానికి సతీష్‌ను ప్రేరేపించిన మరో కీలక నిందితుడిని ఏ 2గా పేర్కొంటూ, ఈ కుట్ర కోణాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించిన రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు. కాగా, ఏ2 గా ఉన్న నిందితుడు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమాకు ప్రధాన అనుచరుడు. సెంట్రల్ నియోజవర్గ టీడీపీ బీసీ సెల్లో కీలక నేత. అంతేగాక సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగంలోనూ కీలక నేత కావడం గమనార్హం. రిమాండ్ నివేదికలోని ప్రధానాంశాలు ఇవీ.... గతంలోనూ నేర చరిత్ర.. ముఖ్యమంత్రి జగన్‌ను హత్య చేయాలని కుట్రదారులు పన్నాగం పన్నారు. ‘మేమంతా సిద్ధం’ యాత్రలో ఆయనపై దాడికి పాల్పడి హతమార్చాలన్నది వారి కుట్ర. ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో పదునైన రాయితో దాడి చేసి అంతం చేయాలని పథకం రూపొందించారు. అందుకు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నారు. ముఖ్యమంత్రిపై దాడి చేసేందుకు వేముల సతీష్ కుమార్‌ను ఎంపిక చేశారు. గతంలో నేర చరిత్ర కూడా ఉన్న అతడు ఏ2కి కీలక అనుచరుడు. ముఖ్యమంత్రిపై దాడి చేసి హత్య చేయాలని సతీష్‌ను ఏ2 ప్రేరేపించాడు. ముందే చేరుకుని మాటు వేసి.. కుట్రదారుల పన్నాగాన్ని వేముల సతీష్ అమలు చేశాడు. ముఖ్యమంత్రి జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్ర ఈ నెల 13న విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌లోకి ప్రవేశించక ముందే అక్కడికి చేరుకున్నాడు. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న బ్రిడ్జి వద్ద పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని సేకరించి జేబులో వేసుకుని వివేకానంద స్కూల్ వద్దకు చేరుకుని మరి కొంతమందితో కలసి మాటు వేశాడు. ఆ రోజు రాత్రి 8.04 గంటలకు సీఎం జగన్ తన వాహనంపై నిలబడి యాత్ర నిర్వహిస్తూ అక్కడికి చేరుకున్న సమయంలో వేముల సతీష్ తన ఫ్యాంట్ జేబులోని పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయిని తీసి సీఎం వైఎస్ జగన్‌పై బలంగా విసిరి దాడికి పాల్పడ్డాడు. అదృష్టవశాత్తూ ఆ సిమెంట్ కాంక్రీట్ రాయి ముఖ్యమంత్రి తలపై సున్నిత భాగంలో కాకుండా ఎడమ కన్ను పైభాగంలో తగలడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. తెరవెనుక కుట్రదారులపై దృష్టి ఈ కుట్ర కోణంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. మరి కొందరు సాక్షులను విచారించడంతోపాటు సాంకేతికపరమైన డేటాను మరింత విశ్లేíÙంచాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే గుర్తించిన ఏ 2తోపాటు తెరవెనుక ఉన్న ప్రధాన కుట్రదారులపై పోలీసులు దృష్టి సారించారు. కుట్రదారులు ప్రేరేపించడంతోనే వేముల సతీశ్ ముఖ్యమంత్రిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిర్ధారించారు. అతడిని ప్రేరేపించిన ఏ2ని కూడా గుర్తించారు. ఏ2 పాత్రకి సంబంధించి మరింత సమాచారంతోపాటు అతడి వెనుక ఉన్న కీలక కుట్రదారుల హస్తాన్ని పూర్తి ఆధారాలతో నిగ్గు తేల్చేందుకు పోలీసులు దర్యాప్తులో దూకుడు పెంచారు. ఈ కేసులో త్వరలోనే మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి రానున్నట్లు స్పష్టమవుతోంది. కీలక వ్యక్తుల సహకారం లేకుండా ఈ కుట్రను ఇంత పకడ్బందీగా అమలు చేయడం సాధ్యం కాదని పోలీసులు పేర్కొంటున్నారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం కేసు దర్యాప్తులో పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ ఫుటేజీలు, సీఎం బస్సు చుట్టూ ఏర్పాటు చేసిన కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు, స్థానికులు తమ సెల్ఫోన్లో తీసిన వీడియోలు, కాల్ డేటా తదితర ఆధారాలను విశ్లేషించారు. ఆ ఆధారాలన్నీ హత్యాయత్నం కుట్రలో ఏ1 వేముల సతీష్, ఏ 2 పాత్రను నిర్ధారించాయి. మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ దర్యాప్తు బృందాలు ఈ నెల 17 సాయంత్రం 5 గంటల సమయంలో ప్రధాన నిందితుడు వేముల సతీష్‌ను విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని కేజీఎఫ్ అపార్ట్మెంట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాయి. ఈ కేసులో ఇద్దరు ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అతడి కదలికలపై నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అనంతరం మధ్యవర్తుల సమక్షంలో అరెస్ట్ చేశారు. నిందితుడి సెల్‌ఫోన్‌ను స్వా«దీనం చేసుకున్నారు. సతీష్ ఇంట్లో సోదాలు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన రోజు అతడు ధరించిన దుస్తులను స్వా«దీనం చేసుకున్నారు. అనంతరం భద్రతా కారణాల దృష్ట్యా సతీష్‌ను అజిత్‌సింగ్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించి లాకప్‌లో ఉంచారు. నిందితుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతోపాటు సీఆర్పీసీ 50 కింద నోటీసులు కూడా జారీ చేశారు. -
సీఎం జగన్‌పై రాయితో దాడి: కంటికి గాయం
విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సుయాత్రలో భాగంగా సింగ్‌నగర్‌కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్‌పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు తాకింది. సీఎం జగన్‌పై క్యాట్ బాల్‌తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమ కంటికి కనుబొమ్మపై గాయమైంది. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమ కంటికి సైతం గాయమైంది. వెంటనే సీఎం జగన్‌కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు వైద్యులు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సుయాత్ర కొనసాగించారు సీఎం జగన్. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో మూడున్నర గంటలుగా సీఎం జగన్ బస్సుయాత్ర అప్రతిహతంగా భారీ రోడ్ షో కొనసాగుతోంది. సీఎం జగన్‌కు వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డారని విజయవాడ వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. వైద్యుల సలహామేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి కేసరపల్లి క్యాంప్‌నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి రెండు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లి నైట్ హాల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్‌తో పాటుగా వైఎస్ భారతీ ఉన్నారు. గాయం కారణంగా సీఎం వైయస్ జగన్‌ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. సీఎం జగన్ పై దాడి ఘటనపై పోలీసు శాఖ సీరియస్ ప్రత్యేక బృందాల ఏర్పాటు, క్యాట్ బాల్ వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాధరణను చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడే ఈ దాడి చేయించి ఉంటాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై దాడిని ఖండించిన తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట చంద్రబాబు నాయుడు,పవన్ కళ్యాణ్,నారా లోకేష్ లకు చెప్పులతో కొట్టి ఫ్లెక్సీని కాల్చి వేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి,పవన్ కళ్యాణ్ కి రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.నీచమైన చర్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. -
చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి.. ఒకరు మృతి!
రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్‌లో జరిగిన చార్భుజనాథ్ ఊరేగింపుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనతో ఇక్కడి వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఒక వర్గానికి చెందినవారు ఈ రాళ్లదాడికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిత్తోర్‌గఢ్ జిల్లాలోని రష్మీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పహూనా గ్రామంలో దశమి సందర్భంగా చార్భుజనాథ్ ఊరేగింపు జరిగింది. ఈ ఊరేగింపు పట్టణంలోని ప్రధాన మార్కెట్ సమీపంలోకి రాగానే ఏదో ఒక విషయమై వాగ్వాదం జరిగి రాళ్లదాడి చోటచేసుకుంది. ఈ ఘటనలో శ్యామ్ చిపా అనే వ్యక్తి మృతి చెందాడు. నవీన్ జైన్ అనే మరో వ్యక్తి గాయపడినట్లు సమాచారం. -
ఇదేం అడవి? రాళ్లు మొలవడం ఏంటీ..?
ఎక్కడైన పచ్చదనం పరుచుకున్న అందమైన అడవులే ఉంటాయి. అక్కడ ఉండే చెట్ల రకాల్లో తేడాలు ఉంటాయోమో గానీ పచ్చదనం అనేది కామన్. మహా అయితే కొన్ని చోట్ల నదులతో కూడిన అడవులు ఉంటాయి. అలా ఇలా కాకుండా రాళ్లు ఉండే అడవి గురించి విన్నారా?. పైగా అక్కడ చెట్లకు బదులు రాళ్లు మొలుస్తాయట. దగ్గరకెళ్తే చెట్లలా ఉండే శిలాజాల్లా కనిపిస్తాయట. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే చైనాలోని కున్మింగ్ నగరానికి వచ్చేయండి. ఆ వింత అడవిని చూసేయండి. ఎక్కడుందంటే..సాధారణంగా అడవుల్లో చెట్లు మొలుస్తాయి. అక్కడ మాత్రం రాళ్లు మొలిచాయి. అందుకే ‘స్టోన్ ఫారెస్ట్’గా పేరు పొందింది. ఈ శిలారణ్యం చైనా దక్షిణ ప్రాంతంలోని యునాన్ ప్రావిన్స్ రాజధాని కున్మింగ్ నగరానికి తొంబై కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ దాదాపు నాలుగువందల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎటుచూసినా, కొండల్లా బారులు తీరిన శిలలే కనిపిస్తాయి. ఇవన్నీ సున్నపురాతి శిలలు. ఇవి నేల నుంచి మొలుచుకొచ్చినట్లు ఉంటాయి. దగ్గరగా చూస్తే, ఇవి శిలాజాల్లా మారిన చెట్లలా కనిపిస్తాయి. చైనాలోని ఈ శిలారణ్యాన్ని చూడటానికి విదేశీ పర్యాటకులు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈ శిలారణ్యాన్ని యునెస్కో 2007లో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. (చదవండి: అనకొండకి చెందిన మరో జాతి! వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
ఇచట చెట్లకు డబ్బులు కాయబడును!
ఈ వైరల్ వీడియోను చూసిన వాళ్లు ‘చెట్లకు డబ్బులు కాస్తాయా!’ అనే సామెతకు ‘భేషుగ్గా’ అని జవాబు చెప్పవచ్చు. 2.8 లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకున్న ఈ వీడియోలో రాయితో కొట్టి చెట్టు నుంచి ప్రజలు కాయిన్స్ తీసుకోవడం కనిపిస్తుంది. ‘సీయింగ్ ఈజ్ బిలీవింగ్’ అనే మాట నిజమేగానీ ‘ఇదెలా సాధ్యం?’ అనే ఒక ప్రశ్న మన ముందు నిటారుగా నిలబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే బిహార్‌లోని రాజ్‌గిర్ ప్రాంతంలో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్టు ఇది. ఈ చెట్టు బెరడు తీసి అందులో నాణెం పెడితే శుభం జరుగుతుందనే సెంటిమెంట్ ఉంది. ఈ సెంటిమెంట్ పుణ్యమా అని చెట్టులో ఎటు చూసినా డబ్బులే డబ్బులు! అదృష్టం కోసం ఇంట్లో ‘మనీ ప్లాంట్’ పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఈ వీడియోను చూసిన తరువాత మాత్రం ‘ఇదే అసలు సిసలు మనీప్లాంట్’ అంటున్నారు నెటిజనులు. -
పారిశ్రామిక రంగంపై స్పెషల్ ఫోకస్: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్‌గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 21,079 మందికి ఉపాధి కలగనుంది. ఫుడ్ ప్రాసెసింగ్ విభాగంలో రూ.402 కోట్లతో నెల్లూరు జిల్లాలో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్లాంట్, విజయనగరంలో నువ్వుల ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభించారు. కాకినాడ ప్రింటింగ్ క్లస్టర్, కర్నూలులోని ఓర్వకల్ మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో సిగాచి ఇండస్ట్రీస్ గ్రీన్‌ఫీల్డ్ ఫార్మాస్యూటికల్స్, ధాన్యం ఆధారిత బయో-ఇథనాల్ తయారీ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే.. పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోంది. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలి, ఆ దిశగా అడుగులు వేయాలి. 386 ఎంఓయూలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో చేసుకున్నాం. 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేసుకున్నాం. 6 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ నెలకొల్పేలా ప్రతినెలా సమీక్ష చేస్తూ పురోగతికోసం చర్యలు తీసుకున్నాం. 33 యూనిట్లు ఇప్పటికే ఏర్పాటై ఉత్పత్తులు ప్రారంభించాయి. 94 ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రారంభదశలో ఉన్నాయి. సీఎస్ గారి ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలకు చేయూతనిస్తున్నాం. నెలకు కనీసంగా రెండు సమీక్షా సమావేశాలు వీటిపై జరుగుతున్నాయి. వేగంగా కార్యరూపం దాలుస్తున్నాయి. ప్రతి అడుగులోనూ కలెక్టర్లు చేయిపట్టి నడిపించాలి. ఈనాలుగున్నర సంవత్సరాల్లో 130 భారీ, అతిభారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయగలిగాం. 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 86 వేలమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎప్పుడూ చూడని అడుగులు వేశాం. కోవిడ్ సమయంలోకూడా కుప్పకూలిపోకుండా వారికి చేయూత నిచ్చాం. 1.88 లక్షల ఎంఎస్ఎంఈలు కొత్తగా వచ్చాయి. 12.62 లక్షల ఉద్యోగాలు వీటిద్వారా వచ్చాయి. మనం అందరం కలిసికట్టుగా ఈ బాధ్యతను తీసుకున్నాం కాబట్టే ఇది సాకారం అయ్యింది. పరిశ్రమలు ఏర్పాటు చేసేవారికి కేవలం మనం ఫోన్‌కాల్‌దూరంలో ఉన్నాం. వారిపట్ల సానుకూలతతో ఇదే పద్ధతిలో ఉండాలి. దేవుడి దయతో మనం ఇవాళ మంచి కార్యక్రమాన్ని చేశాం. 9 ప్రాజెక్టుల్లో 3 ప్రారంభిస్తున్నాం, మిగతా ఆరు పనులు ప్రారంభిస్తున్నాం. దాదాపు 1100 కోట్ల పెట్టుబడి, 21 వేలమందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి. పత్తికొండకు నేను వెళ్లినప్పుడు అక్కడ పరిశ్రమ ఏర్పాటుచేస్తామని చెప్పాం. ఈ మేరకు ఇవాళ ఫుడ్ ప్రాససింగ్ యూనిట్‌కు శంకుస్థాపనచేస్తున్నాం. అధికారులు మంచి కృషిచేశారు. అంతే వేగంగా అడుగులు ముందుకేయాలి. పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నవారందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఎంఎస్ఎంఈలకు ఫిబ్రవరిలో ప్రభుత్వం తరఫున ఇన్సెంటివ్‌లు అందించనున్నాం. చదవండి: క్లీనింగ్ యంత్రాలను ప్రారంభించిన సీఎం జగన్ -
దుర్గగుడి అభివృద్ధి పనులకు 7న సీఎం జగన్ శంకుస్థాపన
పెంటపాడు: విజయవాడలోని శ్రీ కనకదుర్గ, మల్లేశ్వరస్వామివార్ల ఆలయ అభివృద్ధి పనులకు డిసెంబర్ 7న సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపనలు చేయనున్నట్టు ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. గురువారం రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులో మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ దుర్గమ్మ గుడిని రూ.225 కోట్లతో సమగ్ర ప్రణాళికతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. డిసెంబర్ 8న రూ.125 కోట్లతో శ్రీశైలం క్షేత్రంలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతాయని వెల్లడించారు. రూ.60 కోట్లతో సింహాచల క్షేత్రం, రూ.80 కోట్లతో అన్నవరం క్షేత్రం, రూ.70 కోట్లతో ద్వారకాతిరుమల క్షేత్రంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. చదవండి: విశాఖ నుంచి పాలనకు కీలక అడుగు -
‘రోబో గోడ’: బండరాళ్లను ఎత్తి, క్రమపద్ధతిలో పేరుస్తూ..
‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని అంటుంటారు. పూర్వకాలంలో ఈ రెండు పనులూ ఎంతో శ్రమ, ఖర్చుతో కూడినవి కావడంతో అలా అనేవారు. అయితే ఇప్పుడు ఈ రెండు పనులు రోబోలు అత్యంత సులభంగా చేసేస్తున్నాయి. పాశ్చాత్య దేశాల్లో కొందరు.. రోబోలను వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వింటున్నాం. కొత్తగా ఇప్పుడు ఇళ్లను రోబోలే స్వయంగా కట్టేస్తున్నాయి. అది కూడా అత్యంత ధృఢంగా.. పురాతన పద్ధతిలో.. ఆధునికత మేళవిస్తూ.. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా ఇంటి నిర్మాణంలో బండరాళ్లను ఒక పద్ధతిలో పేర్చడం అనేది ఎంతో శ్రమతో కూడిన పని. ఇందుకోసం శారీరకంగానే కాదు..మానసికంగానూ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ రోబో ఈ పనిని చిటికెలో చేసేస్తోంది. ఇంటికి అవసరమయ్యే గోడ నిర్మాణాలను చేపట్టే ఈ రోబోట్ పేరు ‘హీప్’(హెచీఈఏపీ) ఇదొక హైడ్రాలిక్ ఎక్స్కవేటర్. ఇది వాకింగ్ ఎక్స్కవేటర్ కూడా. దీనిని ఈటీహెచ్ జ్యూరిచ్ పరిశోధనా సంస్థ బృందం తయారుచేసింది. ఈ రోబోలో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇనర్షియల్ మెజర్మెంట్ యూనిట్, కంట్రోల్ మాడ్యూల్, తవ్వకాల ఆర్మ్‌పై లిడార్ సెన్సార్లు ఉన్నాయి. ఈ రోబో తాను చేపడుతున్న తాజా ప్రాజెక్ట్ కోసం నిర్మాణ స్థలాన్ని స్కాన్ చేసి, దాని త్రీడీ మ్యాప్‌ను రూపొందించడం ద్వారా పనిని ప్రారంభించింది. తరువాత ఆ సైట్లో డంప్ చేసిన బండరాళ్లను గోడలో ఎక్కడ ఉంచాలనేది రికార్డ్ చేసింది. అనంతరం ‘హీప్’ ప్రతి బండరాయిని భూమి నుండి పైకి లేపింది. ఇందుకోసం దాని బరువు, గురుత్వాకర్షణ కేంద్రాన్ని అంచనా వేయడానికి, దాని ప్రత్యేక ఆకారాన్ని రికార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగించింది. ఒక అల్గారిథమ్ రూపకల్పన అనంతరం 20 అడుగుల ఎత్తు, 65 మీటర్ల పొడవైన రాతి గోడను నిర్మించడానికి ప్రతి బండరాయిని అది చక్కగా ఇమిడిపోయే ప్లేస్‌లో అమర్చింది. ఒక్కో బిల్డింగ్ సెషన్‌కు దాదాపు 20 నుండి 30 బండరాళ్లను వాటి స్థానాల్లో ఉంచింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ నూతన రోబో వ్యవస్థ.. నిర్మాణ రంగాన్ని మరింత సులభతరం చేస్తుంది. బండరాళ్లను తీసుకురావడం మొదలుకొని, వాటితో సరైన గోడను నిర్మించేవరకూ ‘హీప్’ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ రోబో అధ్యయనానికి సంబంధించిన పత్రం ఇటీవల సైన్స్ రోబోటిక్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. ఈటీహెచ్ జ్యూరిచ్ అందించిన ఈ వీడియోలో ‘హీప్’ గోడ నిర్మాణాన్ని చూడవచ్చు. ఇది కూడా చదవండి: కోపాన్ని పెంచేస్తున్న కాలుష్యం.. -
వింత కేసు: ముప్పైలో గర్భం దాల్చగా.. 92 ఏళ్ల వయసులో ..
వైద్యులనే అవాకయ్యేలా చేసిన అత్యంత వింత కేసు ఇది. సాధరణంగా మనుషులు గర్భం దాల్చితే తొమ్మిది లేది పదో నెలలో డెలిరీ అవుతుంది. ఇది సహజం. కానీ ఏకంగా 60 ఏళ్లు గర్భాన్ని మోయడం, తొమ్మిది పదుల వయసులో ప్రసవించటమా!. ఇదేం విచిత్రం అనిపిస్తుంది కదూ. అన్నేళ్లు గర్భంలో ఎలా మోసింది. ఆ తల్లి బిడ్డలు బతికే ఉన్నారా? ఇది సాధ్యమేనా? ఎన్నో సందేహాలు వైద్యులను సైతం ఒకింత గందరగోళానికి గురిచేశాయి. ఆమె అన్నేళ్లు ఆ గర్భాన్ని మోస్తూ ఎలా బతికిందా అని డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఈ వింత ఘటన చైనాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. చైనాకు చెందిన మహిళ హువాంగ్ యిజున్(92) 1948లో 31 ఏళ్ల వయసులో ఉండగా గర్భం దాల్చింది. అయితే ఆ పిండం ఆమె గర్భాశయానికి వెలుపల పెరుగుతోందని, ఇది ఇరువురికి ప్రమాదమని చెప్పారు. వెంటనే ఆమెను వైద్యులు అబార్షన్ చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఆ పిండ ఎదగదని అబార్షన్ అవుతుందని చెప్పారు కూడా. ఐతే ఆర్థిక ఇబ్బందులు రీత్యా హువాంగ్ యిజున్ ఆ పిండాన్ని తీయించేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఏదైతే అది అవుతుందని భావించి అలానే ఉండిపోవాలనుకుంది. విచిత్రంగా ఆమెకు ఎలాంటి నొప్పి గానీ గర్భ విచ్ఛతి అయినట్లుగా బ్లీడింగ్ అవ్వలేదు. ఇక ఆమె ఆ గర్భంతో అలానే మోస్తూ వచ్చింది. బతికే ఉంటుందన్న ఆశ, లేక బిడ్డ కడుపలోనే బతుకుతుందో అనుకుందో గానీ అలానే 61 ఏళ్లు గడిపింది. చివరికి తొమ్మిది పదుల వయసులో వైద్యులను ఆశ్రయించింది. వారు ఆమెను చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. ఆమె చెప్పింది నిజేనా అని అన్ని రకాలు పరీక్షలు నిర్వహించగా..వైద్యులంతా ఒక్కసారిగి ఆశ్చర్యపోయారు. ఇదసలు ఊహకే అందని వింత కేసు అన్నారు. ఆమె కడుపులోపల ఆ బిడ్డ చనిపోయి స్లోన్లా మారి అలా ఉండిపోయిందని చెప్పారు. ఇలా జరగడం అత్యంత అరుదని. ఎలాంటి ఇన్ఫెక్షన్ తలెత్తకుండా ఆమె చనిపోయిన పిండతో అలానే ఉండిపోవడం మాత్రం నిజంగా షాకింగ్‌గా ఉందన్నారు. చివరికి వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ స్టోన్ బేబిని బయటకు తీశారు. వైద్య చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వింత కేసు ఇది అని అన్నారు. అందుకు సంబంధించన ఫోటోలు, హువాంగ్ యిజున్ కథ నెట్టింట తెగ వైరల్ అవ్వుతోంది. దీంతో నెటిజన్లు 61 ఏళ్లు ప్రెగ్నెన్సీనా! అని ఆశ్చర్యపోతున్నారు. చైనాలో చాలామంది ప్రజలు వైద్య సదుపాయాన్ని పొందలేకపోతున్నురాని చెప్పడానికి ఈ కథే నిదర్శనం. In 1948, Huang Yijun, a 31-year-old Chinese woman, discovered that she was pregnant. She went to the doctor, who informed her that the fetus was growing outside her uterus, specifically in her abdomen, a condition known as ectopic pregnancy. Huang needed to undergo surgery to… pic.twitter.com/ttu8ARl0jj — Historic Vids (@historyinmemes) August 17, 2023 (చదవండి: ఓ మహిళ సజీవ సమాధి అయ్యింది!..సరిగ్గా 11 రోజుల తర్వాత..) -
‘హజ్’లో సైతాన్ను రాళ్లతో ఎందుకు కొడతారు? దీని వెనుక చరిత్ర ఇదే..
హజ్ యాత్ర జూన్ 26న ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో భాగంగా ప్రపంచంలోని నలుమూలల నుంచి లక్షలాది ముస్లింలు సౌదీ అరబ్‌లోని మక్కా చేరుకుంటారు. ఈ యాత్రలో ఒక అంశం ఎంతో ప్రధానమైనది. అదే సైతాన్ను రాళ్లతో కొట్టడం. ఈ ప్రక్రయ వెనుకనున్న చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైతాన్ను రాళ్లతో కొట్టడం వెనుక.. ‘హజ్’లో సైతాన్ను రాళ్లతో కొట్టే ప్రక్రియ ‘హజ్’లోని మూడవ రోజు జరుగుతుంది. ఆ రోజునే బక్రీద్ జరుపుకుంటారు. బక్రీద్ నాడు హజ్ యాత్రికులు ముందుగా మీనా పట్టణం చేరుకుంటారు. అక్కడ వారు సైతాన్ను మూడు సార్లు రాళ్లతో కొడతారు. మీనా పట్టణంలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో నిర్మితమైన వివిధ స్థంభాలను రాళ్లతో కొడతారు. దీనిలోని మొదటి స్థంభం జమ్రాహె ఉక్వా, రెండవది జమ్రాహె వుస్తా, మూడవ స్థంభం జమ్రాహె ఉలా. ఎందుకు ఇలా చేస్తారంటే.. ఇస్లాంలో పేర్కొన్న వివరాల ప్రకారం ‘హజ్’లో పాల్గొన్నవారు రాళ్లతో మూడు స్థంబాలను కొడతారు. ఒకానొకప్పుడు హజ్రత్ ఇబ్రహీం సైతాన్ను పారదోలేందుకు ఈ స్థంభాలను రాళ్లతో కొట్టారని చెబుతారు. ఆ సమయంలో హజ్రత్ ఇబ్రహీం తన కుమారునికి కుర్బానీ ఇచ్చేందుకు వెళుతుండగా సైతాన్ అతనిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. హాజీ ఈ స్థంభాలను సైతాన్‌కు ప్రతీకలుగా భావించి రాళ్లతో కొట్టారట. మొదటి రోజు హాజీ కేవలం మొదటి స్థంభాన్ని మాత్రమే కొట్టారు. తదుపరి రెండు రోజుల్లో మిగిలిన రెండు స్థంభాలను కొట్టారని చెబుతారు. హజ్ యాత్ర నియమనిబంధనలివే.. హజ్ యాత్ర చేసే ముస్లింలు పలునిబంధనలు పాటిస్తారు. ఈ యాత్ర చేసేవారు తప్పనిసరిగా ముస్లింలు అయివుండాలి. ఈ యాత్రలో పాల్గొనేవారు ఎర్హమా ధరించాల్సి ఉంటుంది. ఈ యాత్రలో మహిళలు పాల్గొన్నట్టయితే వారు తల నుంచి పాదాలవరకూ కప్పివుండే దుస్తులు ధరించడం తప్పనిసరి. ఇది కూడా చదవండి: స్టార్‌షిప్ మరో ప్రయోగంపై ఎలన్ మస్క్ అప్డేట్ -
ఆ రాయిని మండిస్తే చాలు.. ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ వస్తాయ్!
మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్స్ బాగా వచ్చేందుకు ఇంటి మేడపైకి, ఎత్తుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్తాం. మాగ్జిమమ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ రాకపోతే నానా తిప్పలు పడి మరీ యాక్సెస్ అయ్యేలా చేసుకుంటాం. కానీ అవేమి అవరసం లేకుండా ఓ అరుదైన రాయి దగ్గరికి వెళ్తే చాలు మనకు ఇంటర్నెట్, వైఫై సిగ్నల్ పనిచేస్తాయ్. ఇది నిజంగా నమ్మలేని నిజం. జర్మనీలో ఈ అద్భుత ఆవిష్కరణ చేశాడో ఓ వ్యక్తి. శాస్త్రవేత్తలు సైతం ఈ మ్యాజిక్ రాయిని చూసి ఆశ్చర్యపోయారు. వివరాల్లోకెళ్తే..జర్మనీలో ఉంది ఈ రాయి. సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు దీన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. దానిలో థర్మల్ ఎలక్ట్రిక్ జనరేటర్ అమర్చబడి ఉంది. దాన్ని మంటల వద్ద పెడితే వేడిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది. ఆ తర్వాత వైఫై రూటర్ ఆన్ అవుతుంది. ఇంటర్నెట్ సిగ్నల్స్ ప్రారంభమవుతాయి. వాస్తవానికి అది కృత్రిమ రాయి. ఈ అరుదైన రాయి బరువు 1.5 టన్నులు. ఈ కళాకృతిని కీప్ అలైవ్ అని పిలుస్తారు. ఎరామ్ బర్తోల్ అనే వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఆ ఆవిష్కరణ కారణంగా ఆయన పేరు వార్తల్లో నిలిచింది. (చదవండి: కొత్త పార్లమెంట్ భవనం కోసం షారూఖ్, అక్షయ్ కూమార్‌ల వాయిస్ ఓవర్) -
Viral Video: చిన్న రాయి విసిరి పెద్ద కొండను పడేసిన బుడ్డోడు
-
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై రాళ్లు రువ్విన ఆకతాయిలు అరెస్ట్
-
ఎయిర్ ఇండియా విమానం భోజనంలో రాయి.. ఫొటో వైరల్..
తోటి ప్రయాణికురాలిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేసిన ఘటనతో ఎయిర్ ఇండియా సంస్థపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ మరో వివాదంలో చిక్కుకుంది. ఈ విమానంలో ప్రయణించిన ఓ మహిళ చేసిన భోజనంలో రాయి వచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. విమానంలో రాళ్లు లేని భోజనాన్ని కూడా ప్రయాణికులకు అందించలేరా? ఇంత నిర్లక్ష్యమేంటి? ఈ విషయాన్ని సిబ్బంది దృష్టికి తీసుకెళ్లా అని సర్వప్రియ సంగ్వాన్ ట్వీట్ చేశారు. You don’t need resources and money to ensure stone-free food Air India (@airindiain). This is what I received in my food served in the flight AI 215 today. Crew member Ms. Jadon was informed. This kind of negligence is unacceptable. #airIndia pic.twitter.com/L3lGxgrVbz — Sarvapriya Sangwan (@DrSarvapriya) January 8, 2023 ఈ ట్వీట్ చూసిన చాలా మంది నెటిజన్లు ఎయిర్ ఇండియాపై విమర్శలు గుప్పించారు. విమానయాన పరిశ్రమలో ఒకప్పుడు ప్రమాణాలకు మారుపేరు అయిన టాటా జేఆర్డీ సంస్థ.. అంతర్జాతీయ గౌరవం పొందింది. ఇప్పుడు మళ్లీ ఈ పరిశ్రమలోకి వచ్చి ప్రమాణాల విషయంలో ఈ స్థాయికి పడిపోయింది. ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరా? నిర్వహణ లోపమా? అని ఓ యూజర్ ప్రశ్నించాడు. ఆ రాయి ఉన్న ఆహారం తని మీ పన్ను విరిగిపోయి ఉంటుంది అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మహిళ ట్వీట్‌పై ఎయిర్ ఇండియా స్పందించింది. ఈ విషయంపై తాము ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణమే క్యాటరింగ్ టీం దృష్టికి దీన్ని తీసుకెళ్తామంది. తమ దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు అభినందించింది. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్..!
బెంగళూరు: కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దివాళీ సేల్ సందర్భంగా అక్టోబర్ 15న ఫ్లిప్‌కార్ట్‌లో 'ఏసస్ టఫ్' గేమింగ్ ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 20న ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అది ఓపెన్ చేసిన అతనికి షాక్ తగిలింది. పార్సిల్ బాక్స్‌లో ల్యాప్‌టాప్‌కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ వచ్చింది. దీంతో అతడు ఫ్లిప్‌కార్డ్ కస్టమర్ కేర్‌ను సంప్రదించాడు. దాన్ని రిటర్న్ తీసుకునేందుకు వారు నిరాకరించారు. ల్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తి చిన్మయ రమణ ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. తనకు వచ్చిన పార్సిల్లో ల్యాప్‌టాప్ బాక్స్‌పై ప్రోడక్ట్ డీటేయిల్స్‌ను చింపేశారని, అది ఓపెన్ చేసి చూస్తే రాయి, కంప్యూటర్ వేస్టేజ్ ఉందని వాపోయాడు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్‌ను సంప్రదించినా సరైన స్పందన లేదని, ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేశాడు. తాను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. మూడు రోజుల తర్వాత వారు స్పందించారని రమణ వాపోయాడు. రీఫండ్ ఇచ్చేందుకు సెల్లర్ నిరాకరించాడని, పార్సిల్ డెలీవరీ సమయంలో ఎలాంటి డ్యామేజీ కూడా జరగలేదని చెప్పారని తెలిపాడు. ఫ్లిప్‌కార్ట్ సర్వీసు అస్సలు బాగాలేదని రమణ ఆరోపించాడు. తన ఫిర్యాదు అనంతరం మళ్లీ అప్డేట్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఈమెయిల్ పంపినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు. తాను చెప్పేది అబద్దమని ఎవరికైనా అన్పిస్తే, తన ఖాతా పాత ఆర్డర్లు చెక్‌చేసుకోవచ్చని చెప్పాడు. 2015 నుంచి తాను ఫ్లిప్‌కార్ట్ కస్టమర్‌గా ఉన్నానని, చాలా ఆర్డర్లు పెట్టానని వివరించాడు. Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK — Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022 చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్ -
తాలిబన్ల చేతితో దారుణమైన చావు తప్పదని తెలిసి..!
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక మహిళల హక్కులను కాలరాస్తూ అరాచక పాలన సాగిస్తున్నారు. వాళ్లను విద్య, ఉద్యాగోలకు దూరం చేస్తున్నారు. అంతేకాదు అమ్మాయిలు ఏదైనా తప్పు చేస్తే అత్యంత పాశవికంగా బహిరంగంగా రాళ్లతో కొట్టిచంపుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ తాలిబన్ల అరాచకాలకు భయపడి బలవన్మరణానికి పాల్పడింది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏం జరిగిందంటే? అఫ్గాన్ ఘోర్ ప్రావిన్సులో ఓ మహిళ ప్రేమించిన వ్యక్తితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. దీంతో తాలిబన్లు ఆ వ్యక్తిని అక్టోబర్ 13న ఊరి తీశారు. మహిళను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు. తాలిబన్ల చేతిలో భయానకంగా చావడం కంటే ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోవాలని ఆ మహిళ భావించింది. ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాలిబన్లు గతేడాది అగస్టులో అఫ్గాన్‌ను తమ హస్తగతం చేసుకుని అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి మహిళలపై కఠిన ఆంక్షలు విధించి వాళ్ల హక్కులను కాలరాస్తున్నారు. అమ్మాయిలు ఆరో తరగతి వరకే చదువుకోవాలని నిబంధన పెట్టారు. మీడియాలో పనిచేసే దాదాపు 80 శాతం మంది మహిళలను ఉగ్యోగాల నుంచి తొలిగించారు. అంతేకాదు ప్రేమించిన వ్యక్తితో ఇల్లు వదిలి పారిపోతే దారుణంగా రాళ్లతో కొట్టి చంపుతున్నారు. చదవండి: జిన్‌పింగ్‌కి వ్యతిరేకంగా నిరసనలు...ఈడ్చుకెళ్లి చితకబాది...: వీడియో వైరల్ -
హైదరాబాద్ : మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ పరిశ్రమకు శంకుస్థాపన
-
అరుదైన మానవాకృతి స్మారకశిల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: చేతులు చాచిన మానవరూపం మాదిరిగా కనిపిస్తున్న రాయి ఇది. పంటపొలాల్లో ఏర్పాటు చేసే దిష్టిబొమ్మలాంటిది కాదు, ఏ దేవతా శిల్పమో కూడా కాదు. ఇది పాతరాతి యుగం నాటి మానవ స్మారకశిల. ఆదిమానవులు తమ సమాధుల వద్ద నిలువురాళ్లు పాతే పద్ధతి పాటించేవారు. స్థానిక సమూహంలో ముఖ్యులుగా భావించేవారి సమాధుల వద్ద పాతే అలాంటి రాళ్లను మెన్హిర్లు అంటారు. తెలంగాణలో అలాంటి నిలువురాళ్లు చాలాప్రాంతాల్లో ఇప్పటికీ ‘సజీవం’గా ఉన్నాయి. కానీ, వాటికి మానవాకృతి అద్దిన మెన్హిర్లు మాత్రం చాలా అరుదు. ఆంత్రోపో మార్ఫిక్ ఫిగర్స్‌గా పేర్కొనే ఈ రాళ్లు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పరిమితంగా కనిపిస్తాయి. అలాంటి అరుదైన స్మారక శిల ఇది. ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పు.. భువనగిరి పట్టణానికి 9 కి.మీ. దూరంలో ఉన్న కేసారం గ్రామ శివారులో దీన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కుండె గణేశ్ గుర్తించినట్టు ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. భూమిలోకి లోతుగా పాతి ఉన్న ఈ శిల భూమి ఉపరితలంలో ఆరడుగుల ఎత్తు నాలుగున్నర అడుగుల వెడల్పుతో ఉందని, గుండ్రని తల, దీర్ఘచతురస్రాకారపు ఛాతీభాగం, భుజాలు, కిందికి నడుముభాగం పోల్చుకునేలా చెక్కి ఉందన్నారు. గతంలో ఈ తరహా స్మారక శిలను జనగామ జిల్లా కొడకండ్లలో ఔత్సాహిక పరిశోధకులు గుర్తించారు. క్రీ.పూ.1,800 నుంచి క్రీ.శ.300 వరకు ఉన్న ఇనుపయుగంలో మానవ వికాసదశ అత్యున్నతస్థితికి చేరుకుందన్నది చరిత్రకారుల మాట. వ్యవసాయం బాగా నేర్చుకుని స్థిరనివాసానికి అలవాటుపడ్డ మానవుడు ఇలాంటి స్మారక శిలల ఏర్పాటుకు కూడా శ్రీకారం చుట్టారన్నది వారి అంచనా. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి మానవరూప స్మారకశిలలు లభించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆ శిలకు పురుష, మహిళ రూపాన్ని కూడా చెక్కిన దాఖలాలున్నాయి. కొడకండ్లలో లభించిన ఇలాంటి శిలను బయ్యన్న దేవుడుగా స్థానికులు పూజిస్తుండటాన్ని కూడా పరిశోధకులు గుర్తించారు. -
తేలియాడే రామసేతు రాయి! భక్తుల పూజలు... వైరల్ వీడియో
ఉత్తరప్రదేశ్‌లోని మొయిన్‌పురిలో ఇషాన్ నదిలో తేలియాడే రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఆ రాయిపై ‘రామా’ అనే అక్షరాలు ఉండటం విశేషం. ఈ రాయి రామాయణ కాలంలో భారతదేశం నుంచి లంకకు సముద్రంపై శ్రీరాముడు నిర్మించిన ‘రామసేతు’ వారధిలోనిదే అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి రాయిని చూసివెళ్తున్నారు. ఈ రాయి దాదాపు ఆరు కేజీల బరువుంది. మెయిన్‌పురీ జిల్లాలోని థానాబేవార్ పరిధిలోని అహిమాల్‌పూర్‌లో తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. -
భార్య మీదకు విసిరిన రాయి తగిలి బిడ్డ మృతి
సాక్షి, చెన్నై: భార్యాభర్తల మధ్య ఏర్పడిన గొడవలో భార్యపై విసిరిన రాయి ఆమె చేతిలో ఉన్న బిడ్డకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు.. తేని జిల్లా దేవదాన పట్టికి చెందిన నాగరాజు (23). ఇతను తన బంధువైన నవీన (20)ను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నవీన గర్భం దాల్చిన సమయంలో కట్నం తెమ్మని ఆమెను వేధించేవాడు. దీంతో ఆమె రాయప్పన్‌పట్టిలో ఉన్న తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో నెల రోజులకు క్రితం నవీనకు మగబిడ్డ పుట్టాడు. కోపంతో ఉన్న నాగరాజు భార్య బిడ్డను చూడడానికి అత్త ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో భార్యతో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో ఊగిపోతూ.. అక్కడ ఉన్న రాయిని తీసుకుని నవీనపై విసిరాడు. ఆ రాయి ఆమె చేతిలో ఉన్న బిడ్డకు బలంగా తగిలింది. దీంతో తీవ్రంగా గాయపడిన బిడ్డ అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
అయ్యో మౌనిక.. ప్రమాదం అని తెలియక మృత్యువు పక్కనే కూర్చున్నావా!
సాక్షి,పహాడీషరీఫ్(హైదరాబాద్): నీడ కోసం రాతి గుండు పక్కన కూర్చుంటే ప్రాణం పోయింది.. మహిళపై గుండు పడటంతో చనిపోయింది. పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. రంగనాయకుల కాలనీకి చెందిన ఇరుగదిండ్ల మౌనిక(25), నిరంజన్ దంపతులు. రోజూ మాదిరిగానే శుక్రవారం నిరంజన్ మామిడిపల్లి దానం గుట్టపై రాళ్లు కొట్టేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో భర్తకు భోజనం తీసుకుని మౌనిక అక్కడకు వెళ్లింది. టిఫిన్ ఇచ్చిన తర్వాత సమీపంలోనే ఉన్న ఓ రాతి గుండు నీడన కూర్చుంది. అంతలోనే గుండు ఒక్కసారిగా ఆమెపై పడింది. భర్తతో పాటు తోటి కార్మికులు వెంటనే బండను పక్కకు తీసి చికిత్స నిమిత్తం ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తేల్చారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు. లారీ ఢీకొట్టడంతోనే...? గ్రానైట్ లోడ్ తీసుకెళ్లేందుకు వచ్చిన లారీని రివర్స్ తీసుకునే క్రమంలో డ్రైవర్ వెనుకనుంచి గుండును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగినట్లు విశ్వసనీయ సమాచారం. లారీ ఢీకొనడంతో గుండు దొర్లి మౌనికపై పడినట్టు తెలిసింది. ఈ విషయాన్ని మృతురాలి బంధు,మిత్రులు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో కానీ.. వర్షం కారణంగా కింద ఉన్న మట్టి జరగడంతో గుండు దొర్లినట్లు మౌనిక భర్త ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం. చదవండి: రేషన్‌లో మినీ సిలిండర్లు -
రాతి గనులు.. మేటి ఘనత
కొలిమిగుండ్ల: బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె మండలాల్లో విస్తరించి ఉన్న నాపరాతి ఖనిజ సంపద వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ఈ ప్రాంత ప్రజలు కొన్ని దశాబ్దాల నుంచి ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వందల కుటుంబాలకు గనులు జీవనోపాధి కల్పిస్తున్నాయి. గనుల్లో పని చేయడం కార్మికులకు ప్రతి రోజు సవాల్‌గా మారుతుంటుంది. పని చేసే సమయంలో చాలా మంది కార్మికులు మృత్యువాత పడటం లేదా తీవ్రగాయాల పాలైన సంఘటనలు చాలా ఉన్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 950 హెక్టార్లలో నాపరాతి గనులు విస్తరించి ఉన్నాయి. రోజుకు 400 టన్నులకు పైగానే ఉత్పత్తి జరుగుతుంటుంది. రాయల్టీ, మైనింగ్ లీజు, తదితర వాటి ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.30 కోట్ల మేర ఆదాయం వస్తోంది. కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె క్రాస్ రోడ్డు సమీపంలో భూగర్బ గనుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్‌పోస్ట్ ద్వారా ఏడాదికి రూ.6 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. నాపరాతి గనులపై ఆధారపడి నియోజకవర్గంలో 500కు పైగా, అనంతపురం జిల్లా తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా పాలీష్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. గనుల్లో వెలికితీసిన నాపరాళ్లు ప్రతి రోజు ట్రాక్టర్ల ద్వారా ఫ్యాక్టరీలకు చేరవేస్తుంటారు. గనులు, ఫ్యాక్టరీలు. లోడిండ్, అన్లోడింగ్ కార్మికులతో పాటు ట్రాక్టర్ డ్రైవర్లు 40 వేల మంది పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. నాపరాయి ఖరీదు తక్కువ వివిధ రకాల ఖనిజాల కంటే నాపరాతి రేటు చాలా తక్కువ. అడుగు ఆరు రూపాయలు మాత్రమే. బేతంచెర్లలోని వైట్‌షీల్, వైట్‌క్లే తదితర రంగురాయి అడుగు రూ.14 నుంచి 25 ధర పలుకుతుంది. గ్రానైట్ తీసుకుంటే సాధారణంగా అడుగు రూ.45 వరకు ఉంటుంది. వాటితో పోలిస్తే నాపరాయి చాలా తక్కువ ధరకు వస్తుంది. ఇటీవల మైనింగ్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 31 రకాల ఖనిజాలను దృష్టిలో పెట్టుకొని నాపరాళ్లపై సెక్యూరిటీ డిపాజిట్, డెడ్‌రెంట్ పెంచడంతో యజమానులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి బనగానపల్లె నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వెలికి తీసిన నాపరాళ్లు ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రకు పదుల సంఖ్యలో లారీల్లో ఎగుమతి జరుగుతుంటుంది. ఆ ప్రాంతాల్లో నాపరాళ్లను ఇళ్ల నిర్మాణాలు, కాల్వలు తదితర వాటికి ఉపయోగించే వాళ్లు. ప్రధానంగా ఫ్లోరింగ్ సమయంలో నాపరాయి ఉపయోగించి వాటిపై గ్రానైట్ రాళ్లు వాడుతుంటారు. కాలక్రమేణా నాపరాతి ఎగుమతి సన్నగిల్లుతోంది. ఛత్తీస్‌గడ్‌లో ఇదే తరహాలో బ్లాక్ స్టోన్ మైనింగ్ వెలికి తీయడంతో పాటు ఎక్కువ భాగం గ్రానైట్, టైల్స్, రాజస్థాన్ మార్బుల్స్ వాడకం పెరగడంతో నాపరాయికి డిమాండ్ తగ్గింది. గతంలో కూలీలతో పనులు చేయించేవాళ్లు, కాలక్రమేణా యంత్రాలు రావడంతో పెట్టుబడి పెరిగింది. ఉత్పత్తికి తగ్గట్టుగా ధర, డిమాండ్ లేక పోవడంతో యజమానులకు ఆశించిన లాభాలు రావడం లేదు. నాపరాయిపై అదనపు చార్జీలు తగ్గించాలి ఇతర ఖనిజాలతో పాటు నాపరాళ్లపై విధించిన అదనపు ఛార్జీలు తగ్గించాలి. చాలా తక్కువ ధరతో లభించేది నాపరాయి. అన్ని రకాల మినరల్స్‌తో సమానంగా బ్లాక్ స్టోన్పై అడ్వాన్స్ సెక్యూరిటీ డిపాజిట్, డెడ్‌రెంట్ పెంచడంతో పరిశ్రమ మరింత ఇబ్బందుల్లో పడుతుంది. నాపరాయి పరిశ్రమకి వాటి నుంచి మినహాయింపు ఇవ్వాలి. – చంద్రశేఖరరెడ్డి, మైనింగ్ యజమాని, అంకిరెడ్డిపల్లె 30 ఏళ్లుగా గనులపైనే ఆధారం 30 ఏళ్ల నుంచి నాపరాళ్ల గనులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాం. కాలక్రమేణా నాపరాయికి మార్కెట్లో డిమాండ్ తగ్గింది. పైగా పెట్టుబడులతో పాటు ఖర్చులు భారీగా పెరిగాయి. నష్టాలు చవి చూస్తే యజమానులు కోలుకోలేని పరిస్థితి ఉంటుంది. – శివరామిరెడ్డి, గని యజమాని, అంకిరెడ్డిపల్లె వందల కుటుంబాలకు ఇదే జీవనం నాపరాతి గనులపై వందల కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ప్రధాన వనరులు గనులే కావడంతో ఏరోజు పనికి వెళితే ఆరోజు కుటుంబం గడిచే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. గనుల్లో కూలీలు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లంతా ఈ పరిశ్రమపై ఆధారపడ్డారు. ప్రమాదకరమైన పనులు చేసే కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. – సుబ్బరాయుడు, గని కార్మిక సంఘం నాయకుడు, బెలుం -
చి‘రాయి’వు
సాక్షి, హైదరాబాద్: మూడున్నర వేల ఏళ్లకిందటి ఓ భారీ మెన్హిర్ వెలుగు చూసింది. ఆదిమ మానవులు చనిపోయిన తర్వాత సమాధి చేసే కార్యక్రమానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. ప్రముఖులెవరైనా చనిపోతే... వారి సమాధి వద్ద స్మృతిచిహ్నంగా భారీ నిలువు రాళ్లను పాతేవారు. ఆ నిలువు రాళ్లనే మెన్హిర్‌గా పేర్కొంటారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో అలాంటి మెన్హిర్లు గతంలో వెలుగుచూశాయి. స్థానికులకు వాటిమీద అవగాహన లేకపోవడంతో ఇవి అదృశ్యమయ్యాయి. కానీ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బీచురాజుపల్లి గ్రామ శివారులో మూడున్నర వేల ఏళ్ల క్రితం పాతిన ఓ మెన్హిర్ మానవ సామాజిక చరిత్రకు సాక్ష్యంగా భాసిల్లుతోంది. మరిపెడ–కురవి రహదారిపై ఉన్న ఈ నిలువురాయిని చరిత్ర పరిశోధకులు, విశ్రాంత పురావస్తు అధికారి, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి, బుద్ధవనం అధికారి శ్యాంసుందర్‌రావుతో కలిసి గుర్తించారు. మూడడుగుల మందంతో తొమ్మిది అడుగుల ఎత్తుందీ రాయి. అధికారులకు అవగాహన లేకపోవటంతో రోడ్డు నిర్మాణ సమయంలో పక్కనుంచి తీసిన మట్టిని ఈ నిలువురాయి మొదట్లో నింపారు. దీంతో మూడడుగులు భూమిలోకి కూరుకుపోయి, ఆరడుగుల రాయి మాత్రమే కనిపిస్తోంది. ఇప్పుడు దాని వయసు దాదాపు మూడున్నర వేల సంవత్సరాలు. క్రీ.పూ.1500 సంవత్సరాల క్రితం ఇనుపయుగంలో ఏర్పాటు చేసిన ఈ అరుదైన మెన్హిర్ను కాపాడుకోవాలని, చరిత్ర పరిశోధనలో ఇవి కీలకమని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. మానవుల మనుగడకు చిహ్నంగా మిగిలిన ఆ స్మారకశిల చుట్టూ కంచె ఏర్పాటు చేసి, దాని ప్రాధాన్యాన్ని తెలిపే బోర్డు పాతాలని ఆయన కోరారు. -
కిల్లింగ్ స్టోన్: ఆ రాయిని తాకిన అందరూ చనిపోయారు.. ఈ మధ్యే..
అది జపాన్‌లోని టోక్యోకు ఉత్తరం వైపున్న టొచిగి పర్వత ప్రాంతం.. అక్కడి కొండల మధ్యలో ఓ రాయి.. ఏముందీ కొండల్లో ఉండేవి రాళ్లే కదా అంటారా.. కానీ ఇది చాలా స్పెషల్. ఇప్పుడు అప్పుడు అని కాదు.. దాదాపు వెయ్యేళ్లనాటి చరిత్ర ముడిపడి ఉన్న ఈ రాయి మాత్రం జపాన్‌లో జనాలను వణికించేస్తోంది. రాయి ఏమిటి, వణికించడం ఏమిటో తెలుసా? జపాన్ పురాణాల్లోని ఓ గాథ ఈ రాయి ఏమిటో చెప్తుంది. 1107–1123 సంవత్సరాల మధ్య జపాన్ను పాలించిన టోబా చక్రవర్తిని కొందరు కుట్ర చేసి చంపేశారు. అందులో ముఖ్యమైనది టమామో నోమీ అనే ఓ మహిళా మంత్రగత్తె. అయితే చక్రవర్తి మరణించాక ఓ యుద్ధవీరుడు టమామోను చంపేయగా.. వెంటనే ఆమె మృతదేహం ఓ పెద్ద రాయిగా మారిపోయిందట. ఆ రాయిని ఎవరు తాకినా చనిపోయేవారట. అప్పటి నుంచీ ఆ రాయిని ‘సెషో సెకి (కిల్లింగ్ స్టోన్) అని పిలవడం మొదలుపెట్టారు. మంత్రగత్తె ఆత్మ అందులోనే బందీ అయి ఉందని భావించేవారు. ఈ రాయి ఈ మధ్యే రెండుగా విరిగిపోయింది దీంతో ఆ దెయ్యపు మంత్రగత్తె బయటికి వచ్చేసిందంటూ.. అక్కడి జనాలు బెంబేలెత్తుతున్నారు. ఇది అక్కడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. The Sessho-seki, a famous rock in Nasu, Japan that was said to have imprisoned the evil nine-tailed fox demoness Tamamo-no-Mae, was found broken in half. After nearly 1,000 years, the demon vixen is presumably once again on the loose. https://t.co/Fz3yRLy4qQ — Nick Kapur (@nick_kapur) March 6, 2022 వెయ్యేళ్ల తర్వాత దెయ్యం బయటికి వచ్చేసిందని కొందరు అంటుంటే.. రాయి మధ్యలోంచి ఏదో బయటికి వచ్చినట్టుగా పగిలిందంటూ మరికొందరు సాక్ష్యం చూపుతున్నారు. ఏదో కీడు జరుగుతుందేమో అంటూ ఇంకొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ రాయికి కొన్నేళ్ల కిందే పగుళ్లు వచ్చాయని, ఇటీవలి భారీ వర్షాలతో నీటి ప్రవాహం దెబ్బకు రాయి విరిగి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. చిత్రమేమిటంటే.. ఈ రాయి ఉన్న చోటు ఓ పర్యాటక ప్రాంతం. ఇన్నాళ్లూ జనం బాగానే పోటెత్తేవారు. రాయి విరిగిందని తెలిసినప్పటి నుంచి అటువైపు చూడటమే మానేశారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ రాయిలో తొమ్మిది తోకల గల నక్క... అందర్నీ చంపేస్తుందట!
ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన నమ్మకాలు ఉంటాయి. కొన్ని సైన్సు పరంగా చూస్తే ఒక రకంగా మంచిగానే ఉంటాయి. మరికొన్ని నమ్మకాలు మాత్రం మనల్ని భయబ్రాంతులకు గురిచేస్తాయి. ఏం జరుగుతుందో ఏమో అని ఉన్న ధైర్యాన్ని కాస్త నీరు కార్చేస్తుంది. అచ్చం అలాంటి ఘటన ప్రస్తుతం జపాన్‌లో చోటు చేసుకుంది. వారికి ఎంతో సెంట్మెంట్ గల రాయి ఇప్పుడూ వారిని భయాందోళనలకు గురి చేస్తోంది. వివరాల్లోకెళ్తే...జపనీస్ పురాణాలలో, సెస్షో-సెకి అనేది ఒక శిలా రాయి. ఈ రాయిలో తొమ్మిది తోకల గల నక్క ఆత్మ ఉందని నమ్ముతారు జపాన్ వాసులు. అయితే ఆ నక్క టామామో-నో-మే అనే అందమైన స్త్రీ రూపాన్ని ధరించి, టోబా చక్రవర్తిని చంపడానికి పథకం వేసిందని చెబుతుంటారు. కానీ తమమో-నో-మే ఓడిపోయిన తర్వాత ఆమె ఆత్మ రాయి(సెస్షో-సెకిలో)లో చిక్కుకుందని నమ్ముతారు. నాసులోని అగ్నిపర్వత పర్వతాల సమీపంలో ఉన్న ఈ రాయి 1957లో చారిత్రక ప్రదేశంగా నమోదు చేశారు. ప్రసిద్ధ సందర్శనా ప్రదేశానికి వచ్చిన సందర్శకులు రాక్ సగానికి చీలిపోయి ఉండటాన్ని చూసి భయపడ్డారు. అయితే ఈ రాయి చుట్టు ఒక తాడుతో చుట్టబడి అత్యంత జాగ్రత్తగా భద్రపరిచి ఉండేది. కానీ సందర్శకులు వచ్చి చూసేటప్పటికి తాడు విప్పబడి రాయి రెండుగా చీలుకుపోయి ఉంది. దీని అర్థం ఆ నక్క దుష్టాత్మ పారిపోవడానికి సూచన. దీంతో ఇప్పుడూ ఆ రాయి ఎవర్ని చంపుతుందో ఏంటో అని జపాన్ వాసుల్లే ఒకటే టెన్షన్ మొదలైంది. అయితే స్థానిక అధికారులు ఈ రాయికి పగుళ్లు ఉన్నాయని, అదీగాక చల్లని వాతావరణం కారణంగా విడిపోయి ఉండవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు చూడకూడని దాన్ని చూశాం అంటూ రకరకాలుగా ట్వీట్ చేశారు. (చదవండి: ఆ ఊరిలో మగవాళ్లకు ఇల్లే లేదు! ప్రతి ఇల్లు మహిళలదే) -
సిద్ధాపూర్ రిజర్వాయర్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన
-
కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న గిరిని ‘ఎత్తేయొచ్చు’!
ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తాడట..మరిప్పుడు.. కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న ఓ గిరిని మనమే ‘ఎత్తేయొచ్చు’!!అదెలా తెలుసుకోవాలంటే.. చలో మరి.. ఫ్రాన్స్ లోని హ్యూల్‌గోట్ అటవీ ప్రాంతానికి.. ఎందు కంటే.. ఇక్కడ ఎలాంటి మ్యాన్ అయినా.. సూపర్ మ్యాన్ అయిపోతాడు.. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఓ భారీ బండ ఒకటి ఉంది..7 మీటర్ల పొడవుండే.. దాని బరువు 1.37 లక్షల కిలోలు.. వినగానే.. దీన్ని కదపడం కూడా అసాధ్యమనే అనిపిస్తోంది కదూ.. అయితే.. ప్రపంచంలోని అత్యంత బలహీనమైన వ్యక్తి కూడా దీన్ని సూపర్‌మ్యాన్ స్థాయిలో ఎత్తే యొచ్చు లేదా సులువుగా కదిలించొచ్చు.. ఎలా మ్యాజిక్కా అంటే.. కాదు అచ్చంగా లాజిక్కే! ఈ బండ ఉన్న ప్రదేశమే దీనికి కారణం.. సమతలంగా ఉన్న ఓ భారీ రాతి భాగంపై ఈ బండ బాలెన్సింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. దాని వల్ల కొన్ని నిర్దేశిత ప్రదేశాల్లో ట్రైచేస్తే.. దీన్ని లైట్‌గా ఎత్తొచ్చు లేదా కదపొచ్చు. ఇంత విశేషం ఉంది కాబట్టే.. దేశ విదేశాల నుంచి వేలాదిగా పర్యాటకులు ఈ బండను ఎత్తడానికి ఇక్కడికి వస్తుంటారు.. భీముడంతటి తమ భుజశక్తిని ప్రదర్శించుకుని మురిసిపోతుంటారు. చదవండి: దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది -
సాండ్స్టోన్ ఐస్ క్లైంబింగ్ ఫెస్టివల్..
-
అరుదైన రాయి.. కాపాడుకోవాలోయి
సాక్షి, హైదరాబాద్: అరుదుగా ఉండే పెట్రోగ్లిఫ్స్‌తో కూడిన మెన్హిర్ ఒకటి సూర్యాపేట–కోదాడ దారిలో కనిపించింది. మునగాల మండలంలోని మాదాల గ్రామ శివారులో పొలాల్లో ఉన్న ఈ 15 అడుగుల ఎత్తైన నిలువు రాయిని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు శ్రీ రామోజు హరగోపాల్, అహోబిలం కరుణాకర్, వేముగంటి మురళి, సామ లేటి మహేశ్ గుర్తించారు. అది ఒకటి నుం చి మూడు శతాబ్దాల మధ్య కాలంనాటిది కావచ్చని భావిస్తున్నారు. ఇక్కడ గతంలో ఆదిమానవుల సమాధులు ఎన్నో ఉం డేవి. కానీ కాలక్రమంలో వ్యవసాయ పొలాలు విస్తరించి ధ్వంసమయ్యాయి. మెన్హిర్ మాత్రం చెదరకుండా నిలిచి ఉంది. దీనిపై ఓవైపు చతురస్రం, అలల లాంటి ఆకా రా లు చెక్కి ఉన్నాయి. ఇవి లిపి గుర్తులా, వేరే బొమ్మలా అనేది గుర్తిం చాల్సి ఉందని హరగోపాల్ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ముడుమాల, సిద్దిపేట సమీపంలోని పుల్లూరులలో లభించిన మెన్హిర్‌లపై ఇలాంటి పెట్రో గ్లిఫ్స్ కనిపించాయని చెప్పారు. గతంలో ఇక్కడ రాతియుగం ఆయుధాలు, పరుపు బండపై ఆయుధాలు నూరడంతో ఏర్ప డిన గంతలను గుర్తించారు. అరుదైన ఈ భారీ మెన్హిర్ను కాపాడుకోవాలని గ్రామ ప్రజలకు పరిశోధకులు సూచించారు. ఏంటీ ఈ మెన్హిర్లు? ప్రాచీనకాలంలో ప్రముఖులు, ఏదై నా సమూహం, పెద్ద వ్యక్తి సమాధి ముందు నిలువురాళ్లను పాతేవారు. మెన్హిర్‌గా పేర్కొనే ఇలాంటివి అక్కడ క్కడా దర్శనమిస్తున్నాయి. ఆరాళ్లపై గుర్తులు చెక్కడం (పెట్రో గ్లిఫ్స్) కొన్ని చోట్ల కనిపిస్తుంది. అలా కొన్ని చిహ్నాలు చెక్కిన అరుదైన నిలువు రాయి తాజాగా వెలుగులోకి వచ్చింది. కానీ ఇలాంటి రాళ్లపై అవగాహన లేని స్థానికులు వీటిని కూల్చి ఇతర అవసరాలకు వాడేసుకుంటున్నారు. -
స్మార్ట్‌వాచ్ బదులు రాయి.. నటుడికి చేదు అనుభవం
ఈ-కామర్స్ పోర్టల్స్, సంబంధిత వెబ్‌సైట్స్ అలసత్వం అయితేనేం.. డెలివరీ సిబ్బంది నిర్లక్క్ష్యం అయితేనేం కొన్నిసార్లు కస్టమర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవం. ఒక్కోసారి ప్రొడక్టు ఒకటి అయితే.. డెలివరీ మరొకటి వస్తుండడం చూస్తుంటాం కూడా. సరిగ్గా ఇక్కడ అలాంటి ఘటనే జరిగింది. కాకపోతే అది ఒక ఫేమస్ నటుడి విషయంలో.. బ్రెజిల్ టాప్ యాక్టర్ మురిలో బెనిసియో(50).. ఈ మధ్య యాపిల్ సిరీస్ 6 స్మార్ట్‌వాచ్‌ను ఆర్డర్ చేశాడు. అందుకోసం 530 డాలర్లు(40 వేల రూపాయలపైనే) చెల్లించాడు. అదికాస్త 12 రోజుల లేట్ డెలివరీతో ఆయన దగ్గరికి చేరింది. తీరా ఓపెన్ చేసి చూస్తే.. అందులో వాచ్‌కు బదులు బండరాయి ఉంది. దీంతో రిటైల్ కంపెనీ కర్రెఫోర్ను ఆశ్రయించాడు ఆ నటుడు. అయితే కంపెనీ వాళ్లు స్పందించేందుకు నిరాకరించారట!. దీంతో కస్టమర్ల సేవలకు అభ్యంతరం తెలిపిందంటూ కర్రెఫోర్ మీద నటుడు బెనిసియో కోర్టులో దావా వేశాడు. ఒక స్టార్ హీరో, పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఉన్న సెలబ్రిటీని ఇలా ఇబ్బందిపెట్టడం సరికాదని ఆయన తరపున న్యాయవాది వాదించాడు. అంతేకాదు తాను చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలంటూ దావాలో కోరాడు. అయితే ఆయన చెల్లించిన డబ్బుతో పాటు పరిహారం కింద మరో 1,500 డాలర్లు చెల్లించేందుకు కర్రెఫోర్ అంగీకరించింది. దీంతో వివాదం ముగిసింది. సెలబ్రిటీల విషయంలోనే కాదు.. సామాన్యుల విషయంలోనూ ఇంకోసారి ఇలా జరగకుండా చూడాలంటూ కోర్టు సదరు రిటైల్ కంపెనీని మందలించింది. ఇదిలా ఉంటే యాపిల్ 6ను కిందటి ఏడాది లాంఛ్ చేసిన యాపిల్.. ఆ తర్వాత యాపిల్ 7 రాకతో ఉత్పత్తిని ఆపేసింది. ప్రస్తుతం 7s సిరీస్‌తో పాటు, యాపిల్ వాచ్ ఎస్ఈ, యాపిల్ వాచ్ సిరీస్ 3లతో అలరించేందుకు యాపిల్ సిద్ధమైంది. చదవండి: వావ్.. క్లోజప్ షాట్లో సూర్యుడు -
అచ్చం భేతాళ కథల్లో మాదిరి.. ఈ నీటిలో పడితే వెంటనే రాయిలా అయిపోతారు..!
Mother Shipton’s Cave This Spring Water Turning Things To Stone Really Does sound like something straight out of a children’s book: జై బజరంగభళి సినిమాలో రాజేంద్రప్రసాద్ ఓ బావిలో పడగానే ఐరన్ మ్యాన్ అయిపోతాడు గుర్తుందా! అది కల్పితమైనప్పటికీ ఈ భూమిపై అటువంటి ఓ జలపాతం ఉందండి.. ఈ నదిలో ఏ వస్తువును వేసినా.. అది ఇనుములా గట్టిగా అయిపోతుంది. ప్రకృతిలో ఇలాంటి వింతలు కూడా ఉన్నాయిమరి. అసలిది ఎలా సాధ్యమని బుర్ర గోక్కోకండి. దీని వెనుక ఓ సైన్స్ సీక్రేట్ దాగి ఉంది. అదేంటో తెలుసుకుందామా.. ఇంగ్లాండ్‌లోని మదర్ షిప్టాన్స్ కేవ్ గురించే మనం చర్చిస్తోంది. దీనిని డ్రాపింగ్ వెల్ అని కూడా పిలుస్తారు. దీనిని 1630లో మొదటిసారిగా ప్రజల సదర్శన కోసం తెరిచారు. ఈ భూప్రపంచంలో ప్రజలను అత్యంత అధికంగా ఆకట్టుకునే ప్రదేశాల్లో ఇదీ కూడా ఒకటి . వందల సంవత్సరాలుగా ఈ ప్రదేశానికి తరగని క్రేజ్ ఉంది. ఇక్కడి నీటి బుగ్గ నుండి బయటికి ఉబికి వచ్చే నీళ్లు జలపాతంలా కిందికి జారుతూఉంటాయి. ఐతే ఈ నీళ్లలో ఏవస్తువునైనా ఉంచితే అది వెంటనే రాయిలా గట్టిపడిపోతుంది. దీనిని చూడటానికి వచ్చే సందర్శకులకు.. పొరపాటున జారి ఈ నీళ్లలో పడితే మేముకూడా రాయిలా అయిపోతామేమోననే భయం కూడా లేకపోలేదు. చదవండి: నదిలో తేలుతున్న వందల అస్థిపంజరాలు.. మిస్టరీ డెత్ వెనుక అసలు కారణం ఏమిటీ? ఈ నీటిబుగ్గ గురించి స్థానికంగా ఓ పురాణ కథ కూడా ప్రచారంలో ఉంది. మదర్ షిప్టాన్ (ఉర్సులా సౌతెయిల్ అని కూడా పిలుస్తారు)అనే బాలిక ఓ వేశ్యకు ఈ గుహలో జన్మించిందట. ఐతే ఆమె వికృత రూపాన్ని చూసిన ఆ ప్రాంత ప్రజలు దెయ్యమని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. ఐతే ఆమె వేశ్య కుమార్తె రూపంలో వచ్చిన పురాతన చెడుకు నిలయంగా అక్కడి ప్రజలు చెబుతారు. ఏదిఏమైనప్పటికీ దీని వెనుక దాగి ఉన్న సైన్స్ రహస్యమేమంటే.. ఇక్కడి నీటి బుగ్గ నుంచి వెలువడే నీటి లక్షణాల వల్లనే వస్తువులు రాయిలా మారిపోతున్నాయి. ఈ స్ప్రింగ్ నుండి వచ్చే నీటిలో పెద్ద మొత్తంలో కరిగే సున్నపురాయి ఉంటుంది. ఫలితంగా ఈ నీరు దేనినైనా తాకినప్పుడు, సున్నపురాయి నిక్షేపాలు వాటిపై ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇక ఎక్కువకాలం ఈ నీటిలో ఉంచితే సున్నపురాయి నిక్షేపాలు పొరలా ఏర్పడి ప్రతి వస్తువును రాయిగా మారుస్తుంది. ప్రజలు దశాబ్దాలుగా సున్నపురాయి అధికంగా ఉన్న ఈ నీటిలో వస్తువులను వేలాడదీస్తున్నారు. 1850లో వేలాడదీసిన టోపీలు ఈ నాటికీ ఉన్నాయక్కడ. ఓ వ్యక్తి ఈ నీటిలో సైకిల్ కూడా పెట్టాడు. అది ఏవిధంగా రాయిగా మారుతుందో చూడాలనుకున్నాడేమో. ఇది దాదాపుగా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన కళాఖండంలా కనిపిస్తుంది. చదవండి: చనిపోయే ముందు వ్యకుల ప్రవర్తన ఇలానే ఉంటుందట..! నీడలను చూడటం.. లైమ్ స్టోన్లో చాలామంది టెడ్డీబేర్లను కూడా వేలాడదీస్తారు. వేల సంవత్సరాలుగా నీటి తాకిడికి గురైన ఈ కొండ ఇలా గోడలా రూపొందింది. మినరల్స్ అధికంగా ఉండే ఈ సహజ నీటి బుగ్గ పైభాగమిది. ఈ విధమైన నీటి వనరుల గురించి ఇది వరకెప్పుడూ మీరు తెలుసుకుని ఉండరు. భూమిపై ఇలాంటివి ఉండటం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. నీరు వస్తువులను రాయిగా మార్చడం అనేది నిజంగా ఏ భేతాల కథల పుస్తకం నుండి బయటికి వచ్చిన దృశ్యంలా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడైనా ఇంగ్లండ్‌కు వెళ్లితే ఆ మ్యాజికల్ వాటర్ ఫాల్ చూడటం మాత్రం మర్చిపోకండే! చదవండి: Job Alert: 14 రోజులు వర్క్ చేస్తే ఏకంగా 9 లక్షల రూపాయల జీతం..! చివరితేదీ ఇదే.. -
కుక్క యవ్వారం.. రాళ్లతో కొట్టుకొని..
బనశంకరి(కర్ణాటక): కారుపై కుక్క మూత్రం పోయడంతో కారు యజమాని కుక్క యజమానిని రాయితో కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాణసవాడి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గాయపడ్డ బాధితుడు, హెచ్ఏఎల్ విశ్రాంత ఉద్యోగి గేరి రోజారియా. ఇతని పెంపుడు కుక్క ఎదురింటి వద్దనున్న చాల్స్ అనే వ్యక్తి కారుపై ఆదివారం రాత్రి 11 గంటలప్పుడు మూత్రం పోసింది. దీంతో చాల్స్– గేరి కుటుంబాల మధ్య గలాటా మొదలైంది. చాల్స్ పెద్ద రాయి తీసుకుని గేరి ముఖంపై కొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఫిర్యాదు మేరకు చాల్స్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరో ఘటనలో.. పాలికె నోటీసులతో దడ బనశంకరి: బెంగళూరులో నిబంధనలను ఉల్లంఘించి కట్టడాలు నిర్మించిన యజమానులకు ఇటీవల బీబీఎంపీ నోటీసులు జారీచేసింది. తమ ఇళ్లు, భవంతుల ప్లానింగ్ అనుమతి పత్రాలను అందజేయాలని నోటీసులు అందుతున్నట్లు కొందరు తెలిపారు. బీ– ఖాతా స్థలాల్లో నిర్మించిన కట్టడాలను బీబీఎంపీ అక్రమ కట్టడాలుగా పరిగణిస్తుంది. ట్రినిటీ ఎస్కేప్ నివాసుల ఒక్కోట అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ గత వారం హŸరమావులో 100 కు పైగా ఇళ్లకు నోటీసులు అందాయన్నారు. మూడురోజుల్లోగా రికార్డులను చూపాలని ఉందన్నారు. మేము స్థలం కొనుగోలు చేసినప్పుడు బీ –ఖాతా స్థలాలను మార్చలేదన్నారు. రిటైరైన డబ్బులతో స్థలాలు కొని ఇళ్లు కట్టుకున్నామని, పాలికె ఆదేశాలతో నిద్ర రావడం లేదని వాపోయారు. చదవండి: Viral: అసలేం జరిగింది.. నెల రోజులుగా జీడి చెట్టుకు వేలాడుతున్న మృతదేహం ? -
అది రాయి కాదు 20 కోట్లు ఖరీదు చేసే డైమండ్!
బ్రిటన్: మనం వీధుల్లో ఫ్లాట్ ఫాం పై అమ్మే వస్తువులు చౌకగా లభించడంతో సరదాగా కొంటుంటాం. ఒక్కొసారి ఆ వస్తువల్లో కొన్ని అనూహ్యంగా బ్రాండెడ్ వస్తువులాంటివి దొరకుతాయి. పైగా చాల చౌక ధరలో మనకు లభించిందని సంతోషంగా ఫీలవుతాం. అదే కోట్ల ఖరీదు చేసే వస్తువు దొరకితే మనకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. అచ్చం అలానే ఒక బామ్మకి రూ. 20 కోట్లు విలువ చేసే డైమండ్ లభించింది. అసలు ఏం జరిగిందంటే? (చదవండి: జెఫ్ బెజోస్ ఈవెంట్లో పునీత్ రాజ్‌కుమార్ ఆ నటుడ్ని కలవాలనుకున్నారట!) వివరాల్లోకెళ్లితే....యూకేకి చెందిన 70 ఏళ్ల బామ్మ కార్లలలో రకరకాల వస్తువులను తీసుకువచ్చి అమ్మే వాళ్ల నుంచి చాలా ఏళ్ల క్రితం ఒక స్టోన్ రింగ్‌ని కొనుగోలు చేసినట్లు గుర్తు. అంతే తప్ప ఆమెకు ఏ ప్రాంతంలో ఎప్పుడు కొన్నాను అన్నది కచ్చితంగా తెలియదు. ఒకరోజు ఇంట్లో అనవసరమైన వస్తువులను డస్ట్ బిన్లో పడేస్తు అనుహ్యంగా ఈ స్టోన్ రింగ్‌ని కూడా వేసేయబోతుంది. కానీ ఆమె పక్కింటి వాళ్ల సూచన మేరకు పరీక్షించి తెలుసుకుందాం అనుకుంటుంది. ఈ మేరకు నార్త్ టైన్‌సైడ్‌లో నార్త్ షీల్డ్స్‌లోని ఫీటన్‌బై వేలం పాటదారులకు చెందిన మార్క్ లేన్ మాట్లాడుతూ....ఆ మహిళ తన ఆభరణాల బ్యాగ్‌లో ఆ స్టోన్ రింగ్‌ని మా వద్దకు తీసుకువచ్చింది. అది ఒక పౌండ్ నాణెం కంటే పెద్ద రాయి వలే ఉంది. డైమండ్ టెస్టర్‌తో టెస్ట్ చేసేంత వరకు మేము గుర్తిచంలేకపోయాం. అంతేకాదు బెల్జియంలో ఆంట్వెర్ప్లోని నిపుణులచే ధృవీకరించక ముందే మేము దానిని లండన్‌లోని మా భాగస్వాములకు పంపాము. అయితే వారు దీనిని రూ.24 కోట్లు విలువ చేసే 34 క్యారెట్ల డైమండ్గా నిర్ధారించారు. పైగా ఈ డైమండ్ రింగ్‌ని నవంబర్ 30న వేలం వేస్తామని అప్పటి వరకు లండన్‌లోని డైమండ్ క్వార్టర్ హాటన్ గార్డెన్స్‌లోని ఒక ప్రదేశంలో సురక్షితంగా ఉంటుంది" అని చెప్పాడు. (చదవండి: భారత్‌కు అద్భుత కళాఖండాలు అప్పగింత) -
6 నెలల వ్యవధిలో 13 హత్యలు.. ఇప్పటికీ అతని పేరు కూడా మిస్టరీనే !
Stone Man: విచక్షణ కోల్పోయిన మనుషులకు ఇతరుల జీవితాలు ఎప్పటికీ ఓ ఆటే. అవసరం ఉన్నా లేకపోయినా అవకాశం ఉన్న ప్రతిసారీ.. ఉన్మాదపు కోరలతో బుసకొట్టడం, తాము చేసిన వికృతానికి జడిసిపోయే సమాజాన్ని అజ్ఞాతంగా గమనిస్తూ గర్వపడటం సైకోలకు అలవాటే. చరిత్ర మోసిన ఈ తరహా రక్తపు మరకల్లో మనదేశానికి చెందిన స్టోన్‌మేన్ కథ ఒకటి. ముంబై, కోల్‌కతా వంటి మహా నగరాలను గజగజలాడించిన ఈ రాక్షసుడి జీవితం నేటికీ ఓ మిస్టరీనే. 1985లో మొదలైన అతని హత్యాకాండ.. 2009 వరకూ కొనసాగింది. అతని టార్గెట్.. నిరాశ్రయులు, అనాథలే. కటిక దారిద్య్రంతో అల్లాడిపోతూ.. బంధాలు, బంధువులు లేక.. ఒంటరిగా ఆరుబయట, ఒళ్లు మరచి పడుకునే అభాగ్యులను నిర్దాక్షిణ్యంగా బండరాయితో మోది చంపేసేవాడు. గుర్తుపట్టలేని విధంగా ముఖాలను ఛిద్రం చేసి.. పోలీసులకే సవాలుగా మారాడు. 1989లో కోల్‌కతా పోలీసులకు.. అక్కడి మొదటి కేసుతోనే.. వెన్నులో వణుకు పుట్టించిన ఈ సీరియల్ కిల్లర్.. 6 నెలల వ్యవధిలో ఒకే విధంగా 13 హత్యలు చేశాడు. హత్యకు గురైనది ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. చీకటిపడితే చాలు బయట అంతా భయం.. భయం చీకటిపడితే ఇళ్ల నుంచి బయటికి రావద్దని.. ఒంటరిగా తిరగొద్దని నగరవాసులకు హెచ్చరికలు జారీ చేసే వారు పోలీసులు. రాత్రయితే చాలు అన్ని ఇళ్లకు తాళాలు పడేవి. ఆ జనసముద్రం కాస్త అలజడి లేని నిర్మానుష్య ఎడారి అయిపోయేది. అలా అతగాడ్ని పట్టుకోవడానికి పెద్దఎత్తునే ప్రయత్నాలు చేశారు. కానీ ఆచూకీ దొరకలేదు. రాయితో చంపుతున్నాడు కాబట్టి మీడియా అతడికి స్టోన్‌మేన్ అని పేరుపెట్టింది. హత్యకు సుమారు 30 కిలోల బండరాయిని ఉపయోగించేవాడని తేలింది. చంపిన తీరును బట్టి.. అతడు బలిష్టమైన కండలు కలిగిన వాడని, పొడగరని అంచనా వేశారు. ఎందరో అనుమానితుల్ని విచారించారు.పైగా హత్యకు గురైన బాధితులంతా అనాథలు, నిరాశ్రయులే కావడంతో వారిని ఎవరూ గుర్తించలేకపోయారు. మృతదేహానికి దరిదాపుల్లో ఎలాంటి బండరాయి కానీ, బలమైన రాడ్డు కానీ ఎప్పుడూ దొరకలేదు.కోల్‌కతా కంటే ముందే 1985–88 మధ్యకాలంలో ముంబైని వణికించాడు ఈ స్టోన్‌మేన్. అక్కడా ఇదే తరహాలో నిరాశ్రయులైన 26 మంది అనాథలను హత్య చేసి కోల్‌కతాకు చేరాడు. సినిమా కూడా తెరకెక్కింది 2009లో అస్సాంలోని గువాహటిలో కూడా ఇలాంటి హత్యలే జరగడంతో వాటిని కూడా స్టోన్‌మేన్ ఖాతాలోనే వేశారు పోలీసులు. ఈ వాస్తవ ఘటనల ఆధారంగా 2009లో ‘ది స్టోన్‌మేన్ మర్డర్స్’ అనే సినిమా తెరకెక్కింది హిందీలో. ఎన్ని విచారణలు జరిపినా.. ఎన్ని రాష్ట్రాలు మారినా.. నేటికీ స్టోన్‌మేన్ జాడ కాదుకదా కనీసం అతని అసలు పేరు కూడా ఈ ప్రపంచానికి తెలియలేదు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. -
ఈ గీత.. డోలరైట్ చెక్కిన వింత
సాక్షి, హైదరాబాద్: గుట్టలోని రాతిభాగంపై నల్లటి పట్టీలా రంగుతో గీసినట్టు కనిపిస్తున్నది ఈ ప్రకృతి ఆవిష్కృత ‘చిత్రం’. సాధారణ గ్రానైట్ మధ్యలో ఓ చారలా ఏర్పడింది ఈ డోలరైట్. దాన్ని మనం బ్లాక్ గ్రానైట్‌గా పేర్కొంటాం. కోట్ల సంవత్సరాల కాలక్రమంలో రాతి మధ్యలోంచి డోలరైట్ భాగం ఇలా చొచ్చుకొచ్చి ఓ గీతలా ఏర్పడింది. దీని జియోలాజికల్ శాస్త్రీయ నామం ‘డైక్’. ఈ డైక్ జనగామకు 20 కిలోమీటర్ల దూరంలో నర్మెట మండలం వెల్దండ గ్రామశివారులో వెలుగుచూసింది. దీన్ని ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఇటీవల గుర్తించారు. స్థానిక గుళ్ల చెరువు సమీపంలోని రాజన్నగుడిగా పేర్కొనే శిథిల త్రికూటాలయం వెనక వైపు ఈ డైక్ కనిపిస్తోంది. ఆలయంలోని రాజరాజేశ్వరస్వామి వేములవాడకు తరలివెళ్తున్న సమయంలో రథం వల్ల ఈ గుర్తు ఏర్పడిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. కానీ, దీనిని జియోలాజికల్ వండర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. శిలాద్రవం (మాగ్మా) ఉబికి వచ్చి ఇలా గట్టిపడటంతో డైక్ ఏర్పడిందని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాలరావు, కాకతీయ విశ్వవిద్యాల యం జియోలజీ విభాగానికి చెందిన మల్లికార్జునరెడ్డి, ద్రవిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు హర్షవర్ధన్ పేర్కొన్నట్టు రత్నాకర్‌రెడ్డి వివరించారు. కిలోమీటర్ల పొడవు మేర.. ఈ డైక్ భూమి అంతర్భాగంలో కొంతభాగం, మళ్లీ ఉపరితలంలో కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. గుట్టభాగంలో బలహీనంగా ఉన్న చోటును ఈ మాగ్మాలు ఆక్రమిస్తుంటాయి. బలహీన భాగాన్ని ఒత్తిడితో ఛేదిస్తూ ఏళ్ల కాలక్రమంలో మాగ్మా పైకి ఉబికి వస్తుంది. అలా దాదాపు 250 నుంచి 280 కోట్ల సంవత్సరాల క్రితం వెల్దండలో ఈ డైక్ ఏర్పడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నల్లరాతి డోలరైట్నే ఇక్కడ కృష్ణశిలలుగా పేర్కొంటూ వాటిని శిల్పాలు చెక్కేందుకు ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలోని నాగిని శిల్పాలను ఈ రాతితోనే చెక్కారు. -
Menhir: 3000 ఏళ్ల నాటి.. సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి
సాక్షి, హైదరాబాద్: ఇది దాదాపు మూడు వేల ఏళ్లనాటి మెన్హిర్. అంటే ఆదిమ మానవుల సమూహంలో కాస్త ముఖ్యమైన వ్యక్తులుగా భావించే వారి సమాధి ముందు గుర్తుగా పాతే నిలువు రాయి. అలాంటి రెండు అరుదైన మెన్హిర్లు యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురం గ్రామ శివారులో వెలుగు చూశాయి. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, మహ్మద్ నజీర్, గోపాల్ వీటిని గుర్తించారు. అందులో ఒకటి కొంత విరిగి నేలపైకి ఒరిగిపోగా, 4–5 అడుగుల వెడల్పు, 15–16 అడుగుల ఎత్తు ఉన్న మరో మెన్హిర్ నిలిచే ఉందని పరిశోధకులు చెప్పారు. గతంలో ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో సమాధులు ఉండేవని, వాటికి చెందిన పెద్దపెద్ద రాతి గుండ్లను స్థానికులు ఇళ్ల నిర్మాణం కోసం తరలించారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటిని ధ్వంసం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని కాపాడి చరిత్రను భావితరాలకు అందించాలని కోరారు. -
ఆ రాయిని కదిపి ఎంత పెద్ద పొరపాటు చేశాడంటే...
బ్రుసెల్స్ : ట్రాక్టర్‌తో పొలం పనులు చేసుకోవటానికి అడ్డుగా ఉందని ఏకంగా రెండు దేశాల మధ్య సరిహద్దు రాయిని జరిపాడో రైతు. తనకు తెలియకుండా చేసినా పెద్ద పొరపాటే చేశాడు. వివరాలు. బ్రెజిల్‌కు చెందిన ఓ రైతు కొద్ది రోజుల క్రితం తన పొలంలో పని చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో పొలం పనులు చేసుకోవటానికి తరచుగా ట్రాక్టర్‌కు అడ్డు వస్తున్న రాయిపై అతడి కోపం వచ్చింది. ఆ రాయి ఏంటి? అదెందుకు అక్కడ ఉంది? అన్నదేమీ ఆలోచించకుండా 2.25 మీటర్లు వెనక్కు జరిపి, తన పని చేసుకుని వెళ్లిపోయాడు. రెండు రోజుల తర్వాత కొందరు చరిత్రకారులు అటు వైపు వచ్చారు. 1819లో పాతిన ఫ్రాన్స్-బెల్జియం దేశాలకు సంబంధించిన ఆ సరిహద్దు రాయి ఉండాల్సిన ప్రదేశంలో కాకుండా వెనక్కు ఫ్రాన్స్ భూభాగంలోకి జరిగి ఉండటాన్ని గుర్తించారు. దీనిపై చరిత్రకారుడు డేవిడ్ లావాక్స్ మాట్లాడుతూ.. ‘‘ ఆ రైతు రాయిని జరపటం ద్వారా బెల్జియం పెద్దదైంది.. ఫ్రాన్స్ చిన్నదైంది. నాకు సంతోషం వేసింది. ఎందుకంటే మా టౌన్ పెద్దదైంది కాబట్టి. అయినప్పటికి అది మంచి ఐడియా కాదు. ఫ్రాన్స్‌లోని భౌసిగ్నీస్ మేయర్ సర్ రాక్ దీనికి ఒప్పుకోలేదు. అందుకే దాన్ని యధా స్థానంలో పెట్టడానికి నిర్ణయించాము’’ అని చెప్పాడు. మామూలుగా అయితే ఈ సంఘటన రెండు దేశాల మధ్య గొడవకు దారి తీసేదే. కానీ, ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉండటంతో.. స్థానిక అధికారులు దీన్ని పెద్దగా పట్టించుకోలేదు. చిరు నవ్వులతో ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నారు. -
రామాలయానికి లంక నుంచి శిల
అయోధ్య: లంకాధీశుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి బంధించిన చోటుగా రామాయణం పేర్కొంటున్న ప్రాంతం నుంచి ఒక రాయిని సేకరించి అయోధ్య రామాలయ నిర్మాణానికి అందజేస్తామని కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. రెండు దేశాల మధ్య మైత్రీబంధానికి ఒక తార్కాణంగా ఇది నిలువనుందని పేర్కొంది. సీతాఎలియాగా పేర్కొంటున్న ప్రాంతం నుంచి సేకరించిన ఈ శిలను త్వరలోనే శ్రీలంక హై కమిషనర్ మిళింద మొరగొడ భారత్‌కు తీసుకువస్తారని తెలిపింది. మరో 1.15 లక్షల చ.అడుగుల భూమి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ రామ జన్మభూమి పరిసరాలకు 2, 3 కిలోమీటర్ల దూరంలో 1.15లక్షల చదరపు అడుగుల భూమిని కొనుగోలు చేసింది. ట్రస్ట్ కార్యకలాపాలు, భద్రతా సిబ్బంది, భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు దీనిని వినియోగిస్తామని ట్రస్ట్ అధికారి ఒకరు తెలిపారు. రామ్‌కోట్, తెహ్రి బజార్ ప్రాంతంలోని భూమిని చదరపు అడుగు రూ.690 చొప్పున, రూ.8 కోట్లకు గత వారమే కొన్నట్లు తెలిపారు. -
రామప్ప ఆలయానికి వెల్దుర్తపల్లి రాయి..!
సాక్షి, హైదరాబాద్ : నీటిలో తేలియాడే ఇటుకలా..? అదీ ఎనిమిది శతాబ్దాల క్రితమా..? యునెస్కో ప్రతినిధులు నోరెళ్లబెట్టి ఆశ్చర్యపోతూ అడిగిన ప్రశ్నలు. ప్రపంచ వారసత్వ హోదాకు ఈ నిర్మాణం అర్హమైందా కాదా అని తేల్చే కసరత్తులో భాగంగా యునెస్కో ప్రతినిధులు రామప్ప నిర్మాణం గురించి తెలుసుకునే క్రమంలో ఆశ్చర్యచకితులయ్యారు. అలాంటి ఇటుకలను తామెక్కడా చూడలేదని పారిస్‌లో జరిగిన సమావేశంలో ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తేలియాడే ఇటుకలను శిఖర నిర్మాణంలో పుణికిపుచ్చుకున్న రామప్ప మందిరం.. మెరిసే నల్లరాతితో కొంత, అబ్బురపరిచే ఎర్ర ఇసుకరాతితో సింహభాగం నిర్మితమైంది. సూదిమొన దూరేంతటి సందులు, విస్తుగొలిపే నగిషీలతో ఆ రాళ్లు అద్భుత కళాకృతులుగా ఆ మందిరంలో ఒదిగిపోయాయి. యునెస్కో గుర్తింపు వస్తే ప్రపంచ పర్యాటకులనూ మంత్రముగ్ధులను చేయగల సత్తా ఉన్న రామప్ప ఆలయానికి మనోహర రూపును తెచ్చి ఆశ్చర్యపరిచే ఆకృతి అద్దుకున్న ఆ రాళ్లు ఎక్కడివి? ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ఆ వివరాలు నమోదు కాలేదు. తొలిసారి ఆ రాతి జాడ తెలిసింది. మూడు కిలోమీటర్ల దూరం.. 10 వేల టన్నుల రాళ్లు.. రామప్పతోపాటు అక్కడికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణపురం కోటగుళ్లు, రామానుజాపురం పంచకూటాలయాలు కూడా ఎరుపు ఇసుకరాతితో రూపుదిద్దుకున్నాయి. క్రీస్తు శకం 1213లో రేచర్ల రుద్రుడు నిర్మించిన రామప్ప దేవాలయం ద్వారాలు, స్తంభాలు, దూలాలకు డోలరైట్ నల్లరాతిని వినియోగించారు. మిగతా నిర్మాణమంతా ఎరుపు ఇసుకరాతితో సాగింది. నల్లరాతిని ఓరుగల్లు సమీప ప్రాంతాల నుంచి తేగా.. ఎర్ర రాతిని మాత్రం అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రామానుజపురం–వెల్దుర్తపల్లి గ్రామాల మధ్యలో ఉన్న చెంచు కాలనీ(గుంటూరుపల్లి ) సమీపంలో ఉన్న గుట్టల నుంచి తొలిచినట్టు తాజాగా గుర్తించారు. అప్పుడు రాళ్లను తొలిచేందుకు వినియోగించిన పనిముట్ల గుర్తులు, వాటిని తయారు చేసిన కొలిమిలు, తయారైన పనిముట్లు నిల్వ చేసే ఏర్పాటు ఇప్పటికీ ఆ గుట్టలపై కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర పురావస్తుశాఖ విశ్రాంత అధికారి, విజయవాడ, అమరావతి కల్చరల్ సెంటర్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, ఔత్సాహిక చరిత్ర అన్వేషకుడు అరవింద్ శనివారం ఆయా గుట్టల వద్ద జరిపిన పరిశీలనలో వీటిని గుర్తించారు. ఇక్కడ రెండు గుట్టల నుంచి ఈ రాళ్లను సేకరించారు. ఈ రెండు గుట్టల నుంచి దాదాపు పది వేల టన్నుల రాతిని తొలిచినట్టు భావిస్తున్నామని శివనాగిరెడ్డి పేర్కొన్నారు. తొలుత అవసరమైన ముడిరాతిని గుట్టపై భాగాన తొలిచి దిగువన దానికి కావాల్సిన ఆకృతి ఇచ్చి దేవాలయం వద్దకు తరలించి అక్కడ పూర్తి రూపు ఇచ్చేలా ప్రణాళికను అనుసరించారన్నారు. గుట్టపై భాగంలో కావాల్సిన రాతిని విడదీయటానికి వాడిన గూటం (సమ్మెటతో కొట్టే పరికరం)తో చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దిగువన ఆ రాతి చిన్నచిన్న ముక్కలున్నాయి. పది ఎకరాల్లో రామప్ప ఆలయం, కల్యాణమండపం, త్రికూటాలయాలు రెండు, రామప్ప చెరువు కట్ట వద్ద ఎనిమిది అనుబంధ దేవాలయాలు, రామానుజాపురం పంచకూటాలయం, రెండంతస్తుల కల్యాణ మండపం, గణపురంలో 26 దేవాలయాల సమూహం, కల్యాణమండపాలకు ఈ రాతినే వాడారు. ఒక్క రామప్ప దేవాలయానికే దాదాపు 3,500 టన్నుల ఎర్ర ఇసుకరాయి, 1,500 టన్నుల నల్లరాయి వాడినట్టు అంచనా. ఇక గణపురం దేవాలయాలకు మరో 3,000 టన్నులు వాడారు. ఇలా అన్నీ కలిపి దాదాపు 10 వేల టన్నులు వాడి ఉంటారని అంచనా. వందల మంది శిల్పులు.. ఈ అద్భుత నిర్మాణాలకు వందల మంది శిల్పులు పనిచేసేవారని, వారికి సహాయంగా మరికొంతమంది సిబ్బంది ఉండేవారని నాగిరెడ్డి తెలిపారు. ఆ రోజు పని పూర్తికాగానే ఉలులు, గూటాలను అక్కడే పడేస్తే ఇతర సిబ్బంది వాటిని సేకరించి మళ్లీ కొలిమి వద్దకు తీసుకెళ్లి, సరిచేసి అక్కడ పేర్చేవారని వివరించారు. మళ్లీ వాటిని మరుసటి రోజు శిల్పులు వినియోగించేవారని, ఈ ఆనవాళ్లన్నీ గుట్టలపై ఉన్నాయని వెల్లడించారు. వీటిని కాపాడి భావితరాలకు చూపించాల్సిన అవసరం ఉం దని నాగిరెడ్డి, అరవింద్ అభిప్రాయపడ్డారు. -
రాత్రికి రాత్రే కోటీశ్వరుడు: మళ్లీ రత్నం దొరికింది
టాంజానియా: రెండు అరుదైన రాళ్లతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోయిన టాంజానియా వ్యక్తి సనెన్యూ లైజర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. గనులు తవ్వే పని చేసుకుంటూ పొట్ట పోషించుకునే అతనికి ఓ రోజు రెండు పెద్ద రత్నాలు దొరికడంతో కోటీశ్వరుడిగా మారిపోయాడు. తాజాగా ఆయనకు మరోసారి రత్నం దొరికింది. మన్యారాలోని టాంజానియా గనుల్లో లభ్యమైన ఈ రత్నం 6.3 కిలోల బరువు తూగింది. దీని విలువ 4.7 బిలియన్ టాంజానియా షిల్లాంగ్స్(రెండు మిలియన్ డాలర్లు)గా ఉంది. (రెండు రత్నాలతో కోటీశ్వరుడయ్యాడు) లైజర్‌కు తొలిసారిగా జూన్‌లో ఈ అరుదైన రత్నాలు రెండు దొరకగా వాటిని ప్రభుత్వానికి విక్రయించాడు. దీంతో సుమారు 25 కోట్ల వరకు సంపాదించి ఒక్కరోజులో ధనవంతుడయ్యాడు. వీటినే ఆ దేశంలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద టాంజానిట్ రత్నాలని స్వయంగా ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే డబ్బులు సంపాదించిన తర్వాత తన జీవితంలో ఎలాంటి ఆర్భాటాలకు పోలేదని లైజర్ వెల్లడించాడు. ఎప్పటిలాగే తన 2 వేల ఆవులను పెంచుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ డబ్బుతో ఓ పాఠశాలను కట్టిస్తానంటున్నాడు. ఇతనికి నలుగురు భార్యలు, ముప్పై మంది పిల్లలు ఉన్నారు. కాగా ఈ భూమి మీదే అరుదైనవిగా టాంజానైట్ రత్నాలు గుర్తింపు పొందాయి. ఇవి ఆకుపచ్చ, ఎరుపు, నీలం, పర్పుల్ రంగుల్లో లభ్యమవుతాయి. అయితే రానున్న 20 ఏళ్లలో ఇవి అంతరించిపోనున్నాయని అక్కడి స్థానిక భూగోళవేత్త అంచనా వేస్తున్నారు. (ముగ్గురు డాన్స్.. కానీ ఒక్కరే!) -
ఐదు నిమిషాలైతే ప్రాణాలు పోయేవి..
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 44లోని నివాసంపై బండరాళ్లు పడిన ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు సంబంధిత కాంట్రాక్టర్‌పై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధితుడు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు తాము జూబ్లీహిల్స్ పోలీసులకు ఏడుసార్లు ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోలేదని ఆరోపించారు. 30 అడుగుల బండరాయి ఒక్కసారిగా భవనంపై పడటంతో ఆ శబ్ధానికి ప్రాణం పోయినంత పనైంద న్నారు. ఆ సమయంలో భవనం వెనుక వైపు ఉన్న బెడ్రూమ్లో ఉండి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. బెడ్రూమ్లో ఉన్న బండరాళ్లును చూస్తే ఒళ్ళు జలదరిస్తుందని అన్నారు. తవ్వకాలపై జూబ్లీహిల్స్ సొసైటీ కి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కొండ తమ ఇంటిపైకి వాలుగా ఉన్న విషయాన్ని కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్లామని అయినా సద రు కాంట్రాక్టర్ దీనిని పట్టించుకోకుండా, కనీస అనుమతులు తీసుకోకుండా రాక్ కటి ంగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించాడు. ఇంత పెద్ద బండరాయిని పగులగొట్టేటప్పుడు మైనింగ్ అనుమతులు తీసుకోవాల్సి ఉందని వారు ఇవేవి తీసుకోకుండా అడిగిన ప్రతిసారి తమకు జీహెచ్ఎంసీ అనుమతులు ఉన్నా యని బుకాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలోరూ. 40 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని దీనిని ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
అదృష్టం అంటే అతనిదే, రాత్రికి రాత్రే...
టాంజానియా: అదృష్టం ఎప్పుడు ఎవరి తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. టాంజానియాకి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. ఏదో లాటరీ తగిలి కాదు, రెండు పెద్ద రత్నాలను విక్రయించి ధనవంతుయ్యాడు. గనులు తవ్వే పని చేసుకుంటూ బతికే లైజర్ అనే వ్యక్తికి ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి. వీటిలో మొదటి రత్నం బరువు 9.27 కిలోలు (20.4 పౌండ్లు) కాగా, రెండవ దాని బరువు 5.103 కిలోలు (11.25 పౌండ్లు) ఉన్నాయి. ముదురు వైలెట్-నీలం రంగులో ఉండే ఈ రత్నాలను అతని వద్ద నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్‌కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వీటిని దేశంలోని ఉత్తరాన ఉన్న టాంజానిట్ గనులలో లైజర్ కనుగొన్నారు. (తెరుచుకున్న ఈఫిల్ టవర్.. కానీ) ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆ దేశ గనుల మంత్రిత్వ శాఖ శాశ్వత కార్యదర్శి సైమన్ మ్సంజిలా మాట్లాడుతూ.. మిరేరానీలో మైనింగ్ కార్యకలాపాలు ప్రారంభించినప్పటి నుంచి రెండు అతిపెద్ద టాంజానిట్ రత్నాలను గుర్తించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. ప్రభుత్వం అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసే కార్యక్రమాన్ని టాంజానియాలోని ఒక టీవీ ఛానెల్లో ప్రసారం చేశారు. టాంజానియా సెంట్రల్ బ్యాంక్ అతని దగ్గర నుంచి రత్నాలను కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన చెక్కు అందించిన సమయంలో దేశ అధ్యక్షుడు జాన్ మాగుఫులీ స్వయంగా ఫోన్ చేసి లైవ్‌లో అభినందించారు. మైనింగ్ చేసే వారు తమ రత్నాలను, బంగారాన్ని ప్రభుత్వానికి విక్రయించడానికి టాంజానియా ప్రభుత్వం గత ఏడాది దేశవ్యాప్తంగా వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. (అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం) -
చిత్తూరు జిల్లాలో ఘోరం.. బండ రాయి పడి..
సాక్షి, కలకడ: రాతి బండ కింద పడి కూలీ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచెర్ల సమీపంలోని మొటుకు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు చిత్తూరు జిల్లా యాదమరి కి చెందిన రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన అక్బర్, ముబారక్ లను గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బండ రాయి కింద మృతి చెందిన వ్యక్తిని బయటకు తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కెమెరా బుక్ చేస్తే.. రాళ్లొచ్చాయ్!
వనపర్తి: ఆన్లైన్ షాపింగ్ ఎప్పటికైనా ప్రమాదమని మరోసారి రుజువైంది. జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్ ఈ నెల 11వ తేదీన జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్ కంపెనీ డిజిటల్ కెమెరాను ఫ్లిప్‌కార్డు ఆన్లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేశాడు. అయితే సోమవారం ప్లిప్‌కార్డు నుం చి ఇన్‌స్టాకార్డు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా యాదిసాగర్‌కు ఓ పార్సిల్ వచ్చింది. డబ్బు చెల్లించి పార్సిల్‌ను ఇంటికి తెచ్చి తెరిచి చూస్తే.. అందులో రెండు నల్లని రాళ్లు కనిపించాయి. ఒక్కసారిగా నివ్వెరపోయిన బాధితుడు కొరియర్‌ను ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని చెప్పేశాడు. దీంతో బాధితుడు రాళ్లతో వచ్చిన ఫ్లిప్‌కార్డు బాక్స్‌తో జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేస్తాం కాని.. íఫ్లిప్‌కార్డు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి విషయం చెప్పాలని సూచించారని బాధితుడు పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్‌లో ఎక్కువ విలువగల వస్తువులు వచ్చిప్పుడే.. పార్సిల్లో రాళ్లు, మట్టిపెల్లలు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్డు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే.. మరో వారం రోజుల్లో పొరపాటు ఎక్కడ జరిగిందో విచారణ చేస్తామన్నట్లు బాధితుడు వివరించారు. -
చరిత్రను చెరిపే పచ్చనేతల ప్రయత్నం
సాక్షి, కావలిః నియోజకవర్గ టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ఉత్తుత్తి శిలాఫలకాలను ఆవిష్కరించే జాతరను కొనసాగించే క్రమంలో కావలి పట్టణంలో చరిత్రగా మిగిలి ఉన్న ఆనవాళ్లను ధ్వంసం చేయడానికి సిద్ధమయ్యారు. అయితే పట్టణ ప్రజల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడంతో, ప్రజాగ్రహానికి భీతిల్లి శిలాఫలకాన్ని వారే ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎన్నికల్లో ఉచిత ప్రచారం కల్పింస్తుందనే ఆశతో టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావు ప్రజలు రాకపోకలు సాగించే ప్రదేశాల్లో ఇబ్బడిముబ్బడిగా శిలాఫలకాల్ని హడావుడిగా ఆవిష్కరిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో 120 సంవత్సరాల చరిత్ర ఉన్న వాయునందన ప్రెస్‌వీధి పేరును చెరిపేసే ప్రయత్నం చేశారు. 1875–1900 కాలంలో పట్టణంలోని 33, 34, 37, 40వార్డుల పరిధిలో వాయునందన ప్రెస్‌ను ప్రారంభించారు. స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటీష్ సామ్రాజ్య పాలకుల నిరంకుశ విధానాలపై పోరాటానికి, ప్రజలను సంఘటితం చేయడానికి అవసరమైన కరపత్రాలు ఈ వాయునందన ప్రెస్లోనే ప్రచురించేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలోని ప్రధాన వీధికి వాయునందన ప్రెస్ వీధిగా స్థిరపడిపోయింది. అయితే టీడీపీ నాయకులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా 1,000 శిలాఫలకాలను ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకొన్నారు. అందులో భాగంగానే వాయునందన ప్రెస్‌వీధి అనే పేరును తొలిగించి కొత్త పేరు పెట్టాలని, అందుకు ఆ ప్రాంతంలో శిలాఫలకాన్ని కూడా హడావుడిగా నిర్మించారు. ఇక బీద మస్తాన్‌రావు వచ్చి ఆ శిలాఫలకాన్ని ఆవిష్కరించాల్సి ఉందనగా, ఈ విషయం పట్టణ ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చరిత్రకు ఆనవాళ్లును ధ్వంసం చేసే హక్కు టీడీపీ నాయకుడు బీద మస్తాన్‌రావుకు ఎవరిచ్చారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పరిస్థితిని గమనించిన టీడీపీ నాయకులు వాయునందన ప్రెస్ వీధి పేరును మార్పు చేసే శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తే, అక్కడ స్థానికులతో వివాదం జరిగే ప్రమాదం ఉందని నిర్ధారించుకొన్నారు. ఈ వ్యవహరంలో పార్టీకి జరగాల్సిన నష్టం ఇప్పటికే జరిగిపోయిందని, ఇంకా శిలాపలకాన్ని ఆవిష్కరిస్తే పట్టణ ప్రజలు సెంట్‌మెంట్‌గా భావించి పార్టీని బజారుకీడ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నాయకుడు తన శిలాఫలకాల ఆవిష్కరణ సంఖ్యలో ఒక్కటి కోల్పోయాననే భాదతోనే, వాయునందన ప్రెస్ వీధి పేరు మార్పు శిలాఫలకాన్ని ఆవిష్కరణను విరమించుకొన్నారు. వెంటనే ఆ శిలాఫలకాన్ని ధ్వసం చేశారు. దీంతో బీద మస్తాన్‌రావు వ్యవహారశైలి పట్ల పట్టణ ప్రజల్లో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. -
విసిరేసిన రాళ్లు
చేపలు పట్టే ఒక వ్యక్తి తెల్లవారుజామునే ఒక నదీ తీరానికి చేరుకున్నాడు. దారిలో అతని కాలికి ఏదో సంచీలాంటిది తగిలితే దాన్ని తీసుకుని తడిమి చూస్తే అందులో ఏవో కొన్ని రాళ్లలాంటివి తగిలాయి. వెలుగు వచ్చాక చేపలు పట్టుకోవచ్చనుకుని వలను పక్కనపెట్టి నది ఒడ్డునే కూర్చుని బద్ధకంగా ఆ సంచీలోంచి ఒక రాయిని తీసి నదిలోకి విసిరాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో నదిలోకి విసిరిన రాయి నీట మునిగే శబ్దం అతనికి తమాషాగా అనిపించింది. వెలుగు వచ్చేదాకా ఏ పనీలేదు కాబట్టి అలా రాళ్లు విసురుతూ కాలక్షేపం చేస్తూనే ఉన్నాడతను. మెల్లిగా సూర్యోదయమైంది. కాంతికిరణాలు పరుచుకున్నాయి. అప్పటికే ఆ సంచీలోని రాళ్లన్నిటినీ అతను విసిరేసి ఉన్నాడు. ఇక విసిరేందుకు చేతిలో చిట్టచివరి రాయి ఒక్కటే మిగిలి ఉంది. వెలుతురులో దాన్ని గమనించిన అతని గుండె ఆగినంతపనైంది. అది ఒక వజ్రం. అనుకోకుండా అతనికి అంతులేని సంపద లభించినా, చీకటిలో తెలియక దాన్ని చేజార్చుకున్నాడు. ఒక విధంగా అతను అదృష్టవంతుడు. వెలుగు రావడం కొంచెం ఆలస్యమైతే అతను ఆ రాయిని కూడా నీటిలోకి విసిరేవాడే. చాలామంది ఆపాటి అదృష్టానికి కూడా నోచుకోరు. జీవితంలో లభించిన వజ్రాలను గులకరాళ్లుగా భావించి, వాటిని విసిరిపారేస్తారు. కొద్దిమంది మాత్రం కనీసం ఆఖరునిమిషంలో అయినా మేలుకొంటారు. నిజానికి జీవితమే విలువైన వజ్రం లాంటిది. చివరి వరకూ దాన్ని వ్యర్థంగా గడిపి, చరమాంకంలో దాని విలువ తెలుసుకుని, మంచి పనులు చేయడం మొదలు పెడతారు చాలామంది. -
సప్తస్వరాలు పలికే బండరాయి లభ్యం
అన్నానగర్: అంజెట్టి సమీపంలో గురువారం 2,500 ఏళ్లనాటి సప్తస్వరాలు పలికే బండరాయి లభించింది. కృష్ణగిరి జిల్లా చరిత్ర పరిశోధన కేంద్రానికి చెందిన పురావస్తుశాఖ పరిశీలనదారుడు పరంధామన్, అన్భరసన్, సుగవనమురుగన్ అంజెట్టి సమీపం, మిలిదికిలో పరిశోధనలు చేశారు. దాదాపు 2,500 సంవత్సరాల క్రితం రాతియుగానికి చెందిన సప్తస్వరాలను పలికే బండరాయిని కనుగొన్నారు. ఇది 4 అడుగుల వెడల్పు, 3 అడుగుల ఎత్తు, సుమారు రెండు టన్నుల బరువు ఉంది. ఈ బండరాయి సుమారు 30 టన్నుల బరువున్న మరో బండరాయిపై లభించిందని సుగవణమురుగన్ తెలిపారు. -
ఆన్లైన్ మోసం: ఫోన్‌కు బదులు నాపరాయి
-
బండరాయితో మోది వృద్ధుడి హత్య
పుల్కల్(అందోల్) : గుర్తు తెలియని వ్యక్తులు 70సంవత్సరాల వృద్ధుడిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని చౌటకూర్ శివారులో శనివారం తెల్లావారుజామున చోటుచేసుకుంది. మృతుడిని సెల్‌ఫోన్ ఆధారంగా గుర్తించారు. ఇందుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన ఒగ్గు భాగయ్య(70) ఇంట్లో నుంచి గత బుధవారం ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాని శుక్రవారం వరకు ఎక్కడికి వెళ్లింది.. ఎవరి వద్ద ఉన్నది తెలియలేదన్నారు. శుక్రవారం రాత్రి పుల్కల్ ఎస్ఐ ప్రసాద్‌రావు చౌటకూర్ శివారులో భాగయ్య మృతిచెంది ఉన్నాడని సమాచారం ఇవ్వగా తాము వెళ్లి చేశామన్నారు. ఇదిలా ఉంటే గుర్తుతెలియని వ్యక్తులు జోగిపేట నుంచి నమ్మించి చౌటకూర్ శివారులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కోన్నాల–చౌటకూర్ శివారు మధ్య గల డప్పు మొగులయ్య వ్యవసాయ పోలం వద్ద భాగయ్యను బండరాయితో మోది హత్య చేసినట్లుగా ఎస్ఐ ప్రసాద్‌రావు తెలిపారు. సంఘటన స్థలంలో రెండు బిర్యాని ప్యాకేట్లు, ఒక బాండ్ పెపర్, సెల్‌ఫోన్ లభించింది. దీన్నిబట్టి భాగయ్యను తెలిసిన వారే అక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి వెలుగు చూసిన ఈ సంఘటనను సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, జోగిపేట సీఐ తిరుపతిరాజులు సందిర్శించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించిన ఎలాంటి ఆచూకి లభించలేదు. ఈ మేరకు మృతదేహాన్ని జోగిపేట ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రాయి ఇనుముని తినేస్తుంది
-
ఇనుమును తినేస్తున్న రాయి.. వైరల్ వీడియో
మయన్మార్ : ప్రపంచంలో కొన్ని ఘటనలు వినడానికి వింతగా ఉంటాయి. కొన్ని సార్లు వాటిని కళ్లారా చూస్తే తప్ప నమ్మడం కష్టం. అవి ఎలాంటివి అంటే దేవుడి విగ్రహం ముందు పాలు పెడితే తగ్గడం, చెట్ల మొదళ్ల నుంచి పాలు కారడం, విగ్రహాల చుట్టూ జంతువులు చేరి పూజ చేయడం, మరికొన్ని చోట్ల వాటి కళ్ల నుండి నీరు, ఏదైనా ద్రవం రావడం వంటివి. అవి చిత్రంగా ఉంటూ అందరినీ ఆకర్శిస్తాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి మయన్మార్‌లో జరిగింది. సాధారణంగా ఇనుమును కరగ తీయడం కోసం నిప్పుల్లో ఉంచుతారు. కానీ మయన్మార్‌లో మాత్రం ఓ రాయి చిత్రంగా ఇనుముని తినేస్తోంది. రాయి ఇనుమును తినడం ఏంటి అనుకోకండి.. కానీ ఇది నిజం. గోడకు కొట్టే మేకుని దానిపై ఉంచితే నిమిశాల్లో కరిగిపోతోంది. ఈ విషయాన్ని ఆదేశ సైనికుడు కనిపెట్టాడు. ఇనుమును రాయి తినేస్తుందంటే ఎవరూ నమ్మలేదు. పైగా పిచ్చివాడిగా చూశారు. దీంతో మేకును రాయిపై ఉంచి వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పటి వరకూ ఈ వీడియోని 9 మిలియన్ల మంది చూశారు. ఈ రాయిని పరిశీలించిన శాష్త్రవేత్తలు, ఈ రాయి ఓ విలక్షణమైన లక్షణాన్ని కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఇనుమును కరిగించడానికి గల కారణాలపై పరిశోధనలు చేస్తున్నారు. -
‘ఉపాధి’ ఉసురు తీసింది
మల్లాపూర్ (కోరుట్ల): మూడు గంటల పని పూర్తయింది. మరో గంట గడిస్తే చాలు.. ఇంటికి చేరేవారు. 35 మంది కూలీలు ఎవరి పనిలో వాళ్లున్నారు.. అంతలోనే పై నుంచి మట్టి పెళ్లలు కూలిన శబ్దం.. చుట్టూ దుమ్ము. ఐదు నిమిషాలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. తేరుకుని చూసేసరికి మట్టి పెళ్లల కింద ఆరుగురు మహిళలు. వీరిలో ముగ్గురు ప్రాణాలు విడవగా.. మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుందీ ఘటన. సొరంగంలా తవ్వడం వల్లే..: కుస్తాపూర్ శివారులోని జానకీకుంట వద్ద మట్టిరోడ్డు పనులను చేపట్టేందుకు 3 గ్రూపులకు చెందిన 36 మంది ఉపాధి కూలీలు వెళ్లారు. మూడు రోజులుగా సమీపంలోని దిబ్బ నుంచి మట్టిని తీసి రోడ్డుకు వేస్తున్నారు. మంగళవారం ఉదయం ఉదయం 7 గంటల నుంచి మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తూ రోడ్డు పనులు చేపట్టారు. సుమారు 8 ట్రాక్టర్ల మట్టిని తరలించారు. మరో రెండు ట్రాక్టర్ల మట్టిని తరలిస్తే.. పని పూర్తి అవుతుంది. కూలీలు దిబ్బ కింది భాగంలో మరింత లోతుగా మట్టిని తవ్వడం ప్రారంభించారు. అది కాస్త సొరంగంలా మారడంతో మట్టిగడ్డలు ఉన్నట్టుండి కూలిపోయాయి. దీంతో దిబ్బ కింది భాగంలో పని చేస్తున్న 35 మంది కూలీలు ఒక్కసారిగా చెల్లాచెదురయ్యారు. దూరంగా పరుగులు తీశారు. కూలిపడ్డ మట్టిగడ్డల వద్దకు చేరుకుని వాటిలో ఇరుకున్న ఆరుగురిని బయటకు తీశారు. వీరిలో కుస్తాపూర్‌కు చెందిన సరికెల ముత్తమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందింది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సరికెల రాజు (55), జెల్ల పోశాని (55)లకు తీవ్రగాయాలయ్యాయి. వీరిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రమాదంలో గాయపడ్డ జెల్ల సుజాత (38), గుండ రాజు (40)లకు కాళ్లు విరిగిపోయాయి. మరో మహిళ గంగు(42)కు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు కూలీల మృతిపై ఆగ్రహం వ్యక్తం చేసిన జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కుస్తాపూర్ ఫీల్డ్ అసిస్టెంట్ దండు పెద్ద రాజం, టెక్నికల్ అసిస్టెంట్ ప్రణయలను సస్పెండ్ చేశారు. తక్షణ సాయంగా రూ.20 వేలు కూలీల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, జేసీ రాజేశం, సబ్ కలెక్టర్ గౌతమ్ పోట్రు.. మెట్పల్లి ఆసుపత్రికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.20 వేలను అందించనున్నట్లు తెలిపారు. బాధితుల్లో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇల్లు, ఎకరం వ్యవసాయ భూమి, పిల్లలకు గురుకుల పాఠశాలల్లో ఉచిత విద్య, అపద్బంధ పథకం క్రింద పరిహారం అందించేందుకు కృషి చేస్తామని విద్యాసాగర్‌రావు హమీ ఇచ్చారు. రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా:జూపల్లి సాక్షి, హైదరాబాద్: మృతి చెందిన ఉపాధి కూలీల కుటుంబాలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. కూలీల మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంట గడిస్తే.. ఇంటికి పోయెటోళ్లం: గడ్డం పోశాని మూడు రోజుల నుంచి మట్టి దిబ్బను తవ్వి ట్రాక్టర్లలో పంపుతున్నం. తవ్వుడు.. మోసుడు.. ఎవరి పనిలో వాళ్లం ఉన్నం.. మరో గంట పని చేస్తే చాలు. ఇంటికి పోయెటోళ్లం. ఇగో అప్పుడే.. మట్టి దిబ్బ కింది భాగంలో సొరంగం లెక్క తయారై మట్టిపెల్లలు మా మీదకి వచ్చి పడ్డయ్. అందరం ఉరికినం.. మన్ను కింద పడ్డవాళ్లు సరిగా కానరాలె. ఏం చేయాలో ఎవరికి తోయలే.. ఏడుసుకుంటనే మట్టి పెల్లలు పక్కకు జరిపి కొంత మందిని తీసినం. ఊరోళ్లకు.. ఉపాధి సార్లకు చెప్పినం. అందరు వచ్చిండ్రు.. మట్టి కింద ఇరుక్కున్న వారిని దవాఖానాకు పంపించిండ్రు. ముగ్గురి ప్రాణాలు పోతయని అనుకోలె. -
గ్రానైట్ రాయిపడి కూలీ దుర్మరణం
దామరగిద్ద (నారాయణపేట): పొట్ట కూటికోసం వలస వెళ్లి గ్రానైట్ కంపెనీలో పనిచేస్తూ జీవిస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు గ్రానైట్ రాయి మీదపడి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండలంలోని లోకుర్తిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన అశోక్(30) గత మూడేళ్లుగా ఉపాధి కోసం షాద్‌నగర్‌లోని మహి గ్రానైట్ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కాగా మంగళవారం ప్రమాదవశాత్తు యంత్రంలో నుంచి గ్రానైట్ రాయి మీద పడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామ సర్పంచ్, సుదర్శన్, ఎంపీటీసీ సభ్యుడు రాచప్ప, రాష్ట్ర సీపీఎం నాయకులు భూపాల్‌తోపాటు 40 మంది గ్రామస్తులు కంపెనీ ఎదుట బైటాయించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ఆందోళన చేపట్టారు. ఎండీ అందుబాటులో లేకపోవడంతో అక్కడి అదనపు సిబ్బందితో మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.13 లక్షలు ఆర్థికసాయం చేయాలని కోరగా అంగీకరించడంతో ఆందోళన విరమించినట్లు చెప్పారు. అశోక్‌కు భార్య లక్ష్మి, కూతురు, కుమారుడు ఉన్నారు. -
ఖజానాకు గండి
దేశంలోనే ప్రసిద్ధి చెందిన తాండూరు నాపరాతి అక్రమంగా తరలిపోతోంది. నిత్యం వందకు పైగా లారీలు రాయల్టీ లేకుండా.. రాయల్‌గా సరిహద్దులు దాటుతున్నాయి. చెక్‌పోస్టుల వద్ద నిఘా కరువైంది. దీంతో సర్కారీ ఆదాయానికిగండి పడుతోంది. ఈ తంతు చానాళ్లుగా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. తాండూరు : తాండూరు నియోజకవర్గంలోని తాండూరు, బషీరాబాద్ మండలాల్లో వేలాది ఎకరాలలో నాపరాతి నిక్షేపాలున్నాయి. తాండూరు మండలంలోని ఓగిపూర్, మల్కాపూర్, కొటబాసుపల్లి, కరన్‌కోట్, సిరిగిరిపేట్లో, బషీరాబాద్ మండలంలోని ఎక్మాయి, కొర్విచెడ్, నవల్గ, క్యాద్గిరా, జీవన్గిలో ఈ సహజ సంపద విరివిగా లభిస్తోంది. ఆయా గ్రామాల్లోని గనుల నుంచి వెలికితీçస్తున్న నాపరాతిని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. తాండూరు నుంచి నిత్యం సూమారు 400 లారీల వరకు నాపరాయి రవాణా అవుతోంది. తెలంగాణలోని జిల్లాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఒడిశా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. అయితే ప్రతీరోజు వందలాది లారీల్లో నాపరాయి రవాణా జరుగుతున్నా కొన్నింటి నుంచి మాత్రమే రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి ఫీజు అందుతోంది. మిగతా వాహనాలు ఎలాంటి ఫీజులు లేకుండానే యథేచ్ఛగా తరలివెళ్తున్నాయి. రాయల్టీ లేకుండా రవాణా సాగిస్తున్న వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతిరోజు 50 నుంచి 70 లారీల వరకు రాయల్టీ లేకుండా రవాణా.. నాపరాతి తరలింపు పర్యవేక్షణ కోసం భూగర్భ వనరుల శాఖ ఆధ్వర్యంలో తాండూరు మండలం గౌతాపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్ సర్కిల్‌ళ్ల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అయితే సంబంధిత సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించడం లేదు. చెక్‌పోస్టుల నిర్వహణ బాధ్యతలను హోంగార్డులే చూసుకుంటున్నారు. మైనింగ్ మాఫియా పెద్దల హస్తంలో ఉండటంతో అందినకాడికి దండుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వ ఖజనాకు గండి.. తాండూరు ప్రాంతంలో ఖనిజ సంపద తరలింపులో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. నాపరాతి రవాణాతో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాల్సిన అధికారులు మామూళ్లకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. వ్యాపారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. -
రాతిగుండు రహస్యం చెప్పేనా?
చెన్నంపల్లి కోటలో గుప్త నిధుల వేట రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్న విషయం విదితమే. ఆదివారం.. ఎనిమిది రాతి గుండ్లు, గదుల ఆకారంలో రెండు గుంతలు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. పట్టువదలకుండా ఇక్కడ తవ్వకాలు జరపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కర్నూలు జిల్లా, చెన్నంపల్లి (తుగ్గలి): కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లి కోటలో 36 రోజుల విరామం అనంతరం చేపట్టిన తవ్వకాల్లో ఆదివారం రాతి గుండ్లు బయటపడ్డాయి. గుప్త నిధులు, నిక్షేపాలంటూ ప్రభుత్వం గతేడాది డిసెంబర్ 13న కోటలో తవ్వకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఇటుకలు, ఎముకలు, ఇనుప ముక్కలు బయటపడ్డాయి. తరువాత జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారుల సూచన మేరకు.. ఈనెల 3న తవ్వకాలు పునఃప్రారంభించారు. ఆదివారం ఎనిమిది గుండ్రటి రాతి గుండ్లు బయట పడ్డాయి. వీటిని ఫిరంగి గుండ్లుగా భావిస్తున్నారు. గదుల ఆకారంలో రెండు గుంతలు ఉండడం, రాతి గుండ్లు బయటపడడంతో ఇక్కడ ఆయుధ భాండాగారం ఉండవచ్చని అధికా రులు భావిస్తున్నారు. జీఎస్ఐ అధికారులు మూడు చోట్ల తవ్వకాలు జరపాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు అధికారులు తవ్వకాలు జరుపనున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బారెడ్డి, ఆదోని ఆర్డీ ఓబులేసు, తహసీల్దార్ గోపాలరావు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. -
ప్రకాశం జిల్లాలో గుండు రాయి పోటీలు
-
ఫ్లిప్‌కార్ట్‌లో కెమెరా ఆర్డర్ చేస్తే...
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? బిజీ లైఫ్ లో షాపింగ్ చేసే ఓపిక లేకో...లేక బిజీబిజీ షెడ్యూల్ ..సమయం లేదనో ఆన్లైన్ షాపింగ్‌ను ఎంచుకుంటున్నారా? అయితే మీకో హెచ్చరిక. ఎందుకంటే ఆన్లైన్ లో విలువైన వస్తువులను ఆర్డర్ చేస్తే .. రాళ్లు, రప్పలు మనల్ని వెక్కిరించడం ఈ మధ్య కాలంలో తరచూ జరుగుతోంది. ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్న వినియోగదారులకు వస్తువులకు బదులు రాళ్లు, ఇటుకలు రావడం ఆందోళన రేపుతోంది. తాజాగా ఇలాంటి ఆన్లైన్ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్ లో కెమెరాను ఆర్డర్ చేసిన వ్యక్తికి పార్సిల్లో రాయి, పిల్లలు ఆడుకునే రెండు బొమ్మ కెమెరాలు రావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాగోల్ మమతా నగర్‌కాలనీకి చెందిన వినయ్(24) డీఎస్ఎల్ ఆర్ కెమెరా కోసం ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ చేశారు. రూ.41 వేల విలువైన కెనాన్ ఈవోఎస్ 700డి కెమెరాను ఆన్లైన్లో ఆర్డర్ చేశారు. తీరా సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం డెలివరీ బాయ్ ఇచ్చిన పార్శిల్ విప్పి చూస్తే అందులో రాయి, డమ్మి కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్ ఎక్కడి నుంచి వచ్చింది, డెలివరీ బాయ్ ఎవరు, ఫోన్ నంబర్ తదితర వివరాలను ఆరా తీస్తున్నారు. అలాగే సీసీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని ఎల్బీ నగర్ ఎస్ఐ తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఫ్లిప్‌కార్ట్ తిరస్కరించింది. కస్టమర్ కేర్ ద్వారా సంప్రదించినపుడు అత్యంత భద్రత మధ్య తమ ప్యాకింగ్ ఉంటుందనీ, డెలివరీకంపెనీ మోసం చేసి ఉంటుందని, దీనికి తమ బాధ్యత ఏమీ లేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఆన్లైన్ మోసాలు ఎంతలా జరుగుతున్నాయనేదానికి నిలువెత్తు నిదర్శనం ఈ ఉదంతం.. సో..ఇకపై ఆన్లైన్ షాపింగ్ చేసేటపుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. -
వ్యక్తి దారుణహత్య
బనగానపల్లె రూరల్: రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆపతి నారాయణస్వామి(42) మంగళవారం హత్యకు గురయ్యాడు. పలుకూరు దేవనగర్ కాలనీ సమీపలో ఆయనను బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం మేరకు.. నాపరాయి డిపోలో గుమాస్తాగా పనిచేసే ఆపతి నారాయణస్వామికి పేకాట, మద్యం ఇతర దురలవాట్లున్నాయి. నారాయణ స్వామి అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురితో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం పలుకూరులో నలుగురూ మద్యం సేవించి మత్తులో గొడవ పడ్డారు. అనంతరం రామక్రిష్ణాపురం గ్రామానికి బైక్‌లపై బయల్దేరారు. దేవనగర్ సమీపంలో అందరూ ఆగి మళ్లీ ఘర్షణ పడ్డారు. ఆపతి నారాయణస్వామిని మిగతా ముగ్గురు బండరాయితో బాది దారుణంగా హత్య చేశారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
తెల్లారిన బతుకులు
- నాప బండల ట్రాక్టర్ బోల్తా - ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు - రాళ్లదొడ్డి- ఎర్రకోట గ్రామాల మధ్య ప్రమాదం - మృతుల నేత్రాలు దానం చేసిన బాధిత కుటుంబీకులు రాత్రిగా ఎత్తిన బండలలోడు.. మహా అంటే తెల్లవారుజాముకంతా దింపేస్తాం.. ఆ వెంటనే బయలుదేరి తెల్లారే సరికి ఇంటికి వస్తాం.. అనుకుంటూ నాప బండలలోడు ట్రాక్టర్‌తో బేతంచెర్ల నుంచి ఎమ్మిగనూరు బయలుదేరిన ఓ ముగ్గురిలో ఇద్దరి జీవితాలు మార్గంమధ్యలోనే తెల్లారిపోయాయి. వారు దింపేందుకు వెళ్తున్న బండలలోడే వారిపై పడి ప్రాణాలు బలితీసుకుంది. బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం మిగిల్చింది. ఎమ్మిగనూరురూరల్ : హమాలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఓ ఇద్దరి ప్రాణాలను ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బేతంచెర్లలో ట్రాక్టరుకు నాప బండలను లోడు చేసుకుని ఎమ్మిగనూరు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడగా ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఎమ్మిగనూరు మండలం రాళ్లదొడ్డి- ఎర్రకోట గ్రామాల మధ్య రహదారిపై తెల్లవారుజామున 2ః30 గంటల సమయంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. శనివారం రాత్రి బేతంచర్ల నుంచి ఎమ్మిగనూరుకు నాపబండలలోడుతో బయలుదేరిన ట్రాక్టర్(ఏపీ 21టీఎక్స్ 8461) తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. మలుపు దగ్గర అదుపు తప్పి ట్రాలీ, ఇంజిన్ బోల్తా పడింది. డ్రైవర్ మద్దిలేటిస్వామి(39)తోపాటు తలారి సురేష్(21), పెద్దమద్దిలేటిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. రహదారిపై వెళ్తున్న వాహనదారులు గుర్తించి ఫోన్ చేయడంతో ఎమ్మిగనూరు రూరల్, పట్టణం, నందవరం ఎస్ఐలు వేణుగోపాల్, హరిప్రసాద్, జగన్మోహన్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. బండలను తొలగించి అందులో ఇరుక్కుపోయిన ముగ్గురిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్‌లో కర్నూలుకు తీసుకెళ్తుండగా డ్రైవర్ మద్దిలేటిస్వామి మరణించాడు. చికిత్స పొందుతూ తలారి సురేష్ మృతి చెందాడు. పెద్ద మద్దిలేటి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. బాధిత కుటుంబాల్లో విషాదం.. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మద్దిలేటిస్వామి(39) బేతంచర్ల మండలం గోర్లగుట్టకు చెందిన వారు. ఈయనకు భార్య మద్దమ్మ, ముగ్గురు సంతానం. ఇదే ప్రమాదంలో మరణించిన తలారి సరేష్(21) బనగానపల్లె మండలం గోవిందిన్నెకు చెందినవారు. పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తుండగానే ఇలా తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడంటూ తండ్రి సుంకన్న బోరున విలపించాడు. గాయపడిన పెద్దమద్దిలేటిది కూడా బేతంచర్ల మండలం గోర్లగుట్టనే. విషయం తెలిసిన వెంటనే బాధిత కుటుంబాల వారు, బంధువులు పెద్ద ఎత్తున కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో విషాదం అలుముకుంది. మృతుల నేత్రాలు దానం.. మృతులు మద్దిలేటి స్వామి, తలారి సురేష్ నేత్రాలను వారి కుటుంబ సభ్యులు దానం చేసినట్లు సీఐ జీ.ప్రసాద్, రూరల్ ఎస్ఐ వేణుగోపాల్ తెలిపారు. తీవ్ర విషాదం మధ్య డ్రైవర్ నేత్రాలను భార్య మద్దమ్మ, సురేష్ నేత్రాలను తండ్రి సుంకన్న వైద్యులకు అందించారు. -
రైలు ఢీకొని వ్యక్తి దుర్మరణం
వెల్దుర్తి రూరల్ : గుంటుపల్లె గ్రామానికి చెందిన కృష్ణయ్య(28) అనే వ్యక్తి శుక్రవారం రైలు ఢీకొని మృతి చెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడికి చెవుడు ఉంది. ఇతను రోజు రాయి కొట్టే పనులకెళ్తాడు. ఎండలు ఎక్కువగా ఉన్నందున శుక్రవారం తెల్లవారుఝామునే పనికి వెళ్లాడు. ఈ క్రమంలో సమీపంలోని రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొన్నట్లు అనుమానం. మృతుడికి భార్య కళావతి, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బాలుడిని బలిగొన్న బండరాయి
కొలిమిగుండ్ల: ఉదయం అంతా ఆట పాటలతో పాఠశాలలో సరదాగ గడిపి.. బడి గంట మోగగానే పరుగున ఇంటికి చేరుకొని తోటి స్నేహితులతో ఆటలు ఆడుకునే క్రమంలో బండరాయి ఓ బాలుడిని బలిగొంది. ఈ విషాదకర ఘటన బుధవారం అంకిరెడ్డిపల్లెలోని చింతలాయిపల్లె రోడ్డు సమీపంలోని కాలనీలో చోటు చేసుకుంది. మంజుల వెంకటస్వామి, రమణమ్మ దంపతుల కుమారుడు శివమణి(8).. స్థానిక మెయిన్ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం బడి వదిలిన తర్వాత ఇంటికి చేరుకొని అదే కాలనీలోని స్నేహితులతో ఆటలు అడుకుంటున్నారు. మరొక బాలుడు సైకిల్ తొక్కుతున్న క్రమంలో ఓ ఇంటి ముందు అడ్డుగా పాతుకున్న ఏడు అడుగుల బండరాయిని తగిలించాడు. దీంతో రాయి విరిగి పడి సమీపంలోనే ఉన్న శివమణి తలపై పడింది. రక్తపుమడుగులో తీవ్రగాయాల పాలైన బాలుడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా తాడిపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లితండ్రులు నాపరాతి గనిలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారు. కుమారుడు మృతి చెందడంతో బోరున విలపించారు. -
నాపరాతి గనిలో కార్మికుడి దుర్మరణం
కొలిమిగుండ్ల: రాఘవరాజుపల్లె–అంకిరెడ్డిపల్లె గ్రామాల మధ్యనున్న నాపరాతి గనిలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు దుర్మరణం చెందాడు. కనకాద్రిపల్లెకు చెందిన మేకల లింగారెడ్డి (55) రోజు మాదిరిగానే అంకిరెడ్డిపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి నాపరాతి గనిలో కూలీ పనికి వెళ్లాడు. కోత కోసిన రాయిన నడిపిస్తున్న తరుణంలో వంద అడుగుల పైనుంచి బండ రాయి నేరుగా తలపై పడింది. తోటి కార్మికులు చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. క్షణాల్లోనే రక్తపు మడుగులో తుదిశ్వాస విడిచాడు. లింగారెడ్డి గనిలో పని చేస్తుండగా... భార్య పార్వతి పాలీష్ ఫ్యాక్టరీలో పని చేస్తుండేది. ఒక్కగానొక్క కుమార్తెకు వివాహం జరిపించారు. మరి కొద్ది సేపట్లో పని ముగించుకొని ఇంటికి చేరాల్సిన కార్మికుడు రెప్పపాటులో అనంత లోకాలకు చేరాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ బీటీ వెంకటసుబ్బయ్య అక్కడికి చేరుకొని వివరాలు సేకరించారు. కొద్ది రోజుల నుంచి నాపరాతి గనుల్లో కోతులు సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే గని పైభాగంలో సంచరించే సమయంలో రాయి కిందకు పడటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని సహ కార్మికులు పేర్కొన్నారు. కోతుల బెడద ఎక్కువగా ఉంటే తరచూ టపాసులు పేల్చాలని ఎస్ఐ యజమానులకు సూచించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. -
రాతిలో దాగి..
రాజేంద్రనగర్: మిర్యాలడూడ ఓడపల్లి కాలువలో దొరికిన రాతి గణపతి ప్రతిమను సోమవారం రాజేంద్రనగర్‌లో ప్రతిష్టించారు. గణనాథుడి రూపంలో ఈ రాయిని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఫొటోగ్రాఫర్ శ్రీనివాస్ గుర్తించారు. ఈ ప్రతిమను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. -
బండపై నీటి ఊట
ఖాజిపల్లిలోని కాళభైరవుడి ఆలయం సమీపంలో వింత మెదక్: ఓ ఆలయం పక్కన గల రాతిబండలోంచి నీరు ఉబికి వస్తోంది. ఈ వింత మెదక్ మండలం ఖాజిపల్లిలోని శ్రీ కాళభైరవ ఆలయం పక్కన మంగళవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజశేఖర్ (హైకోర్టు న్యాయవాది)కు గ్రామశివారులో కొంత వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో 2010లో సుమారు రూ.20లక్షలు వెచ్చించి శ్రీ కాళభైరవ ఆలయాన్ని నిర్మించారు. యేటా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ప్రాంతంలో అష్టభైరవ ఆలయం నిర్మించేందుకు కొన్ని రోజులుగా భూమిని చదును చేస్తున్నారు. అక్కడక్కడ పెద్ద పెద్ద బండరాళ్లు ఉండటంతో వాటిని పగుల గొడుతున్నారు. ఈనెల 5న ఓ పెద్ద బండరాయిని పగులగొట్టేందుకు దాని చుట్టూ 4అడుగుల గొయ్యి తవ్వి పగులగొట్టారు. దీంతో ఆ రాయి నుంచి నీరు ఉబికి వస్తోంది. దీంతో సింగిల్‌ఫేస్ మోటర్ ద్వారా నీటిని తొలగించినా నిరంతరంగా నీరు వస్తూనే ఉంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులతోపాటు ఇరుగు పొరుగు గ్రామాల ప్రజలు తరలివచ్చి ఈ వింతను తిలకిస్తున్నారు. ఇది సాక్షాత్తు కాళభైరవుడి మహిమేనంటూ భక్తితో కొలుస్తున్నారు. -
గోదాంల నిర్మాణానికి శంకుస్థాపన
వాయిలసింగారం(నడిగూడెం): మండల పరిధిలోని వాయిలసింగారంలో నిర్మించనున్న వ్యవసాయ గోదాం నిర్మాణపు పనులకు టాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంపటి రూప వెంకటేశ్వరరావు, జిల్లా సహకార సంఘం చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు, తెల్లబెల్లి సింగిల్‌విండో చైర్మన్ చుండూరు వెంకటేశ్వరరావు, సీఈఓ దేవబత్తిని శ్రీనివాసరావు, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
వివాహేతర సంబంధమే కారణమా?
నర్మెట: వరంగల్ జిల్లా నర్మెట మండలం అంకుశాపూర్ గ్రామ మజరా బీల్వతాండాకు చెందిన గగులోత్ భాస్కర్(22) అనే యువకుణ్ణి గుర్తితెలియని వ్యక్తులు బండరాయితో మోది హతమార్చారు. బుధవారం ఉదయం గ్రామ శివారులోని పంటపొలాల్లో యువకుని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. నర్మెట పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిఉంటుందని భావిస్తున్నారు. -
యువకుడి కిడ్నీలో భారీ రాయి
మెదక్ టౌన్: ఓ యువకుడి కిడ్నీలో నుంచి 300 గ్రాముల రాయిని వైద్యులు బయటకు తీశారు. ఇంతపెద్ద రాయిని చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. ఈ ఘటన మెదక్‌లో గురువారం వెలుగులోకి వచ్చింది. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన మోహన్(25) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూడు రోజులుగా మూత్రం ఆగిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయన మెదక్‌లోని సాయిచంద్ర నర్సింగ్‌హోంకు వచ్చాడు. పరీక్షలు చేసిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ నిర్వహించగా కిడ్నీలో 300 గ్రాముల బరువుగల రాయి బయట పడింది. ఓ వ్యక్తి కిడ్నీలో ఇంత పెద్ద రాయి రావడం ఇదే మొదటిసారి అని వైద్యులు సురేశ్ పేర్కొన్నారు. -
పోలీసును కొట్టి చంపారు
మాల్దా: రైలు ప్రవేశ ద్వారం వద్ద ఎలాంటి పదార్థాలు అమ్మకూడదని అడ్డుకున్న ఎస్ సమంత అనే ఆర్పీఎఫ్ పోలీసు అధికారిని రాళ్లతో కొట్టి చంపారు. ఈ పశ్చిమ బెంగాల్ జిల్లాలోని మాల్దా జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మాల్దా రైల్వే స్టేషన్ ముఖ ద్వారం వద్ద ఓ వ్యక్తి ఏవో పదార్థాలు అమ్ముతున్నాడు. అదే సమయంలో అతడి వద్దకు వెళ్లిన ఆర్పీఎఫ్ అధికారి వాటిని అమ్మకూడదని, వెళ్లిపోవాలని చెప్పాడు. కానీ అందుకు నిరాకరించిన అతడిపై పోలీసు చేయి చేసుకున్నాడు. దీంతో అక్కడే చుట్టుపక్కల పలు తినుబండారాలు అమ్ముతున్న వారంతా పోగై రాళ్లతో ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అనంతరం ఆ పోలీసును బయటకు లాగి పిడిగుద్దులు కురిపించి రాళ్లతో కొట్టారు. దీంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. -
వ్యక్తి దారుణ హత్య
కరీంనగర్: హైదరాబాద్ వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌లో జరిగింది. కాలనీకి చెందిన పడమటింటి భాస్కర్ (32) గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. పెళ్లి సంబంధం కోసం వివరాలు తీసుకురమ్మని స్నేహితుడు ఫోన్ చేయడంతో ఇంటి నుంచి బయలుదేరిన బాస్కర్ శుక్రవారం ఉదయం శవమై కనిపించాడు. అలకాపురి వద్ద గుర్తుతెలియని దుండగులు అతన్ని కత్తులతో పొడిచి ఆపై బండరాయితో మోది అతి కిరాతకంగా చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్: ఓవ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన జవహర్ నగర్ లోని అంబేద్కర్ కాలనీలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. దుండగులు బండరాయితో తలపై బలంగా మోది హత్య చేశారు. వివరాలు...స్థానికంగా ఉండే నల్ల రామచందర్ (45) అనే వ్యక్తి పెయింటర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ఆయనను బండరాయితో మోదడంతో మృతి చెందాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు తెలియ రాలేదు. (జవహర్‌నగర్) -
వ్యక్తి దారుణ హత్య
ఓ వ్యక్తి దారుణహత్యకు గురైన సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల పట్టణంలోని విద్యుత్తు ఉపకేంద్రం సమీపంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఓ వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ముఖాన్ని గుర్తుపట్టడానికి వీలులేకుండా చిద్రం చేశారు. అయితే స్థానికులు మృతుడిని గద్వాల మండలంలోని నదీ అగ్రహారం గ్రామానికి చెందిన దాదావలి(45) గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాదావలి హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు ఇంకా తెలియరాలేదు. -
వివాహేతర సంబంధానికి.. రాళ్లతో కొట్టి మరణశిక్ష
బీరుట్: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళకు ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సన్నీ రాడికల్ గ్రూపు ఉగ్రవాదులు మరణశిక్ష విధించారు. రాళ్లతో కొట్టి చంపాల్సిందిగా హుకుం జారీ చేశారు. కన్న తండ్రి అంగీకారంతో అతని కళ్లేదుటే ఆమెను చంపేశారు. ఈ దుశ్చర్యను చిత్రీకరించి వీడియోను విడుదల చేశారు. ఈ ఆటవిక చర్యను సిరియాలో అమలు చేశారు. బాధితురాలు క్షమించాల్సిందిగా తన తండ్రిని వేడుకొనగా, ఆయన నిరాకరించాడు. సెంట్రల్ సిరియా ప్రావిన్స్‌లో వివాహేతర సంబంధం కారణంగా తొలిసారి ఓ మహిళకు మరణశిక్ష విధిస్తున్నట్టు ఐఎస్ ఉగ్రవాద నాయకుడు ప్రకటించాడు. ఆమె చనిపోయేవరకు రాళ్లతో కొట్టాల్సిందిగా ఆదేశించాడు. అక్కడ గుమికూడిన జనం అందరూ చూస్తుండగా ఆమెను రాళ్లతో కొట్టారు. కాగా ఈ సంఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగింది అన్న విషయం నిర్ధారణ కాలేదు.