చిత్తూరు జిల్లాలో ఘోరం.. బండ రాయి పడి.. | Man Killed By Falling Stone In Chittoor District | Sakshi
Sakshi News home page

బండరాయి పడి కూలీ మృతి

Published Thu, Jun 25 2020 11:59 AM | Last Updated on Thu, Jun 25 2020 12:16 PM

Man Killed By Falling Stone In Chittoor District - Sakshi

సాక్షి, కలకడ: రాతి బండ కింద పడి కూలీ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచెర్ల సమీపంలోని మొటుకు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు చిత్తూరు జిల్లా యాదమరి కి చెందిన రెహమాన్‌ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన అక్బర్, ముబారక్ లను గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బండ రాయి కింద మృతి చెందిన వ్యక్తిని బయటకు తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement