rock
-
మూవీ ప్రీమియర్‌లో సందడి చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్ 'ద రాక్' (ఫొటోలు)
-
ఇప్పటికి ఈ స్మారక శిల వయసు 3,500 ఏళ్లు
సాక్షి, హైదరాబాద్: మూడున్నర వేల ఏళ్ల క్రితం నాటి స్మారక శిల (మెన్హిర్) వెలుగు చూసింది. నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం కంసానిపల్లె గ్రామ శివారులో డిండి నదీ తీరంలో దీన్ని గుర్తించారు. వారసత్వ ప్రాంతాలను పరిరక్షించాలంటూ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో, పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గురువారం డిండి నదీ తీరాన్ని సందర్శించారు. కొండారెడ్డి పల్లి– ఉప్పునుంతల మధ్యలో నదీ తీరంలో ఈ నిలువురాయిని గుర్తించారు. భూ ఉపరితలంలో ఎనిమిది అడుగుల ఎత్తు, రెండడుగుల వెడల్పు, ఒకటిన్నర అడుగు మందంతో ఉన్న ఈ స్మారక శిల కొంతమేర పక్కకు ఒరిగి ఉంది. గ్రానైట్ శిలతో చేసిన ఈ స్మారకం 3,500 ఏళ్ల క్రితం ఇనుపయుగం నాటిదిగా ఆయన పేర్కొన్నారు. అప్పట్లో స్థానిక మానవసమూహంలో చనిపోయిన ప్రముఖుడికి గుర్తుగా దీన్ని పాతారని, గతంలో ఈ ప్రాంతంలో ఆదిమానవుల కాలం నాటి బంతిరాళ్ల సమాధులు ఉండేవని, వ్యవసాయ పనుల్లో భాగంగా అవి కనుమరుగయ్యాయని స్థానికులు తిప్పర్తి జగన్మోహన్రెడ్డి, అభిలాశ్రెడ్డి, సాయికిరణ్‌రెడ్డి తదితరులు ఆయన దృష్టికి తెచ్చారు. మన చరిత్రకు సజీవ సాక్ష్యంగా ఉన్న ఈ నిలువు రాయినైనా కాపాడుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు. -
బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కున్న మహిళ..!
పాపం.. రెండు బండరాళ్ల మధ్య ఇరుక్కుని ఓ మహిళ నరకం అనుభవించింది. ఆమెను రక్షించేందుకు స్నేహితులు ప్రయత్నాలు ఫలించలేదు. చేసేది లేక ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. రంగంలోకి దిగిన ఎమర్జెన్సీ సర్వీస్...న్యూ సౌత్ వేల్స్: పర్వత ప్రాంతంలోని బండరాళ్ల మధ్య నడుస్తున్న మహిళ చేతిలోని సెల్‌ఫోన్ జారిపడింది. ఫోన్‌ను అందుకునే క్రమంలో ఆమె రెండు బండరాళ్ల మధ్య సందులో తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు ఏడు గంటల యాతన అనంతరం ఆమెను సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఆ్రస్టేలియాలోని న్యూ సౌత్ వేల్స్లో ఉన్న హంటర్ వ్యాలీలో నెలారంభంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.బాధిత మహిళ పేరు మటిల్డా కాంప్‌బెల్. రాళ్ల మధ్య మూడుమీటర్ల సందులో ఇరుక్కుపోయిన మటిల్డాను కాపాడేందుకు ఆమె స్నేహితులు ఎంతగానో ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో ఎమర్జెన్సీ సర్వీస్‌కు సమాచారమిచ్చారు. వారు వచ్చి అర టన్ను బరువున్న ఒక రాయిని పక్కకు జరపగలిగారు. అయినప్పటికీ, మటిల్డాను రక్షించడం సవాల్‌తో కూడుకున్న వ్యవహారమనే అంచనాకు వచ్చారు.‘పదేళ్లుగా ఎన్నో ఘటనలను దగ్గర్నుంచి చూస్తున్నా. కానీ, ఇటువంటిది ఇదే మొదటిసారి’అని ఎమర్జెన్సీ సరీ్వస్ పారామెడిక్ పీటర్ వాట్స్ పేర్కొన్నారు. ‘మటిల్డా ఇరుక్కుపోయిన ప్రాంతం ఎస్ ఆకారంలో ఉంది. అందుకే, ఆమె కాళ్లు ఇరుక్కున్న బండరాళ్లను కదలకుండా ఉంచుతూనే ఆమె పట్టేంత జాగాను ఏర్పాటు చేయడం ఎంతో క్లిష్టమైన వ్యవహారం. దాదాపు ఏడుగంటల శ్రమ అనంతరం ఆమెను సురక్షితంగా బయటకు తేగలిగాం’అని తెలిపారు.చదవండి: ట్రంప్ గెలిస్తే.. పుతిన్ కీవ్‌లో కూర్చుంటారు.. కమలా హారిస్ వార్నింగ్అయినా కూడా ఆమెకు గీసుకుపోయిన గాయాలే తప్ప, ఎటువంటి హాని కలగకపోవడం ఆశ్చర్యపరిచే విషయమని చెప్పారు. ఇంతా చేసినా మటిల్డా ఫోన్ మాత్రం దొరకలేదని వాట్స్ చెప్పారు. ఇంత జరిగినా, ఫోన్‌ను పోగొట్టుకోవాల్సి వచ్చినందుకు మటిల్డా విచారం వ్యక్తం చేయడం కొసమెరుపు..! -
భూమి రెండో పొర నుంచి... రాళ్ల నమూనా!
బ్రిటన్ భూ భౌతిక శాస్త్రవేత్తలు అత్యంత అరుదైన ఘనత సాధించారు. భూమి రెండో పొర అయిన మ్యాంటల్ (ప్రవారం) నుంచి తొలిసారిగా రాళ్ల నమూనాలను సేకరించగలిగారు. అట్లాంటిక్ మహాసముద్ర గర్భం నుంచి ఏకంగా 1,268 మీటర్ల మేర లోపలికి తవ్వి మరీ వాటిని వెలికితీశారు! భూగర్భంలో ఇప్పటిదాకా అత్యంత లోతైన ప్రాంతం నుంచి సేకరించిన శిల నమూనా ఇదే!! భూ ప్రవారంలో ఇంత లోతు దాకా డ్రిల్లింగ్ చేయగలగడమూ ఇదే మొదటిసారి. మహాసముద్రాల్లో డ్రిల్లింగ్ పనులు చేపట్టడంతో తిరుగులేని రికార్డున్న నౌక జోయిడిస్ రిజల్యూషన్ సాయంతో ఈ ఘనత సాధించారు. భూమి పుట్టుకకు సంబంధించిన ఇప్పటిదాకా మనకందని పలు కీలక రహస్యాల గుట్టు విప్పడంలో ఈ నమూనాలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటిదాకా మనకంతగా తెలియని భూ ప్రవారం తాలూకు కూర్పు, అక్కడ నిత్యం జరిగే కీలక రసాయనిక ప్రక్రియల గురించి విలువైన సమాచారం కూడా తెలుస్తోందట. అతి పెద్ద ముందడుగు భూమి ప్రధానంగా మూడు పొరలుగా ఉంటుంది. బాహ్య పొరను పటలం అంటారు. రెండో పొర రాళ్లమయమైన ప్రవారం కాగా అత్యంత లోపలి భాగమైన కేంద్రమండలం మూడో పొర. భూమి మొత్తం పరిమాణంలో ప్రవారం వాటాయే 80 శాతం దాకా ఉంటుంది. అట్లాంటిక్ మహాసముద్ర గర్భంలో దాగున్న అట్లాంటిస్ పర్వత శ్రేణి నుంచి అత్యంత వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ తాజా నమూనాలను సేకరించగలిగారు. భూ ప్రవార శిలా ఖండాలు సముద్ర జలాలతో ఎలా ప్రతిచర్య చెందుతున్నాయో అర్థం చేసుకోవడానికి తాజా నమూనాల విశ్లేషణ బాగా దోహదపడిందట. వందలాది కోట్ల ఏళ్ల కింద భూమిపై తొలిసారిగా జీవం ఎలా పురుడు పోసుకుందో తెలుసుకునే క్రమంలో ఈ తాజా వివరాలను అతి పెద్ద ముందడుగుగా సైంటిస్టులు అభివర్ణిస్తుండటం విశేషం. సేకరణ అంత ఈజీ కాదు...భూ ప్రవార శిలలు మానవాళికి ఇప్పటిదాకా అందరానివిగానే ఉండిపోయాయి. అందుకు కారణం లేకపోలేదు. భూ పలకలు పరస్పరం కలిసే చోట్ల, అదీ సముద్ర గర్భంలో మాత్రమే వాటిని సేకరించే వీలుంది. దాంతో సైంటిస్టులు అదే మార్గంలో ప్రయత్నించి ఫలితం సాధించారు. మహాసముద్ర గర్భంలో మిడ్ అట్లాంటిక్ రిడ్జ్కు అతి సమీపంలో ఉన్న అట్లాంటిస్ పర్వతశ్రేణి వద్ద ప్రవార శిలలు మనకు గట్టి ప్రయత్నంతో అందేంతటి లోతులోనే ఉంటాయన్న అంచనాతో రంగంలోకి దిగారు. 2024 ఏప్రిల్ నుంచి జోయిడిస్ ఇదే పనిలో గడిపింది. చివరికి జూన్ నాటికి రికార్డు స్థాయి లోతు దాకా డ్రిల్లింగ్ చేసి 886 అడుగుల పొడవున్న శిలా నమూనాను వెతికి తీయగలిగారు. ఈ క్రమంలో సముద్రగర్భం నుంచి 200 మీటర్ల లోతుకు తవ్విన గత రికార్డు తుడిచిపెట్టుకుని పోయింది. పైగా నాటి ప్రయత్నంలో పెద్దగా ప్రవార శిలలేవీ చిక్కలేదు కూడా. కనుక ఎలా చూసినా తాజా నమూనాల వెలికితీత అన్ని రికార్డులనూ బద్దలు కొట్టిందని కార్డిఫ్ వర్సిటీ జియాలజిస్టు, ఈ అధ్యయన సారథి జొహాన్ లీసెన్‌బర్గ్ చెప్పారు. ‘‘ప్రవార శిలను పరిశీలించిన మీదట విలువైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలోని ఖనిజ మూలకాలు వివిధ ఉష్ణోగ్రతల వద్ద సముద్ర జలంతో పలు రకాలుగా ప్రతి చర్య జరుపుతున్నట్టు తేలింది. ఫలితంగా సూక్ష్మజీవజాల ఉనికికి అతి కీలకమైన మీథేన్ వంటి నమ్మేళనాలు ఏర్పడుతున్నాయి. ఇంకా వీలైనన్ని ఉష్ణోగ్రతల వద్ద వాటిని విశ్లేషించిన మీదట భూమిపై జీవావిర్భావం తాలూకు రహస్యాలెన్నో విడిపోయే అవకాశముంది’’ అని ఆయన వివరించారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
11 ఏళ్లకే గిటార్‌తో ప్రదర్శన.. అమెరికా ప్రముఖ షోని మెస్మరైజ్ చేసింది!
జస్ట్ 11 ఏళ్ల చిన్నారి తన గిటార్ కళా నైపుణ్యంతో అమెరికా గాట్ టాలెంట్‌ని మెస్మరైజ్ చేసింది. ఆ చిన్నారి పేరు మాయ నీలకంఠన్. ఇటీవల అమెరికా గాట్ టాలెంట్ కోసం జరిగిన అడిషన్లో మొత్తం షో దృష్టిని ఆకర్షించింది. అమెరికాలో పాపా రోచ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై తన గిటార్ ప్రదర్శనతో ఆ షో జడ్జిలనే ఆశ్చర్యపరిచింది. మాయ తన అద్భుతమైన గిటార్ ప్రదర్శన ఆ వేదికపై ఉన్న దిగ్గజ జడ్జిలు సైమన్ కోవెల్, సోఫియా వెర్గారా, హెడీ క్లమ్, హౌవీ మాండెల్ల మనసులను గెలుచుకుని ప్రశంసలందుకుంది. మాయ ఆడిషన్ వీడియో నెట్టింట పెను సంచలనంగా మారింది. పైగా ఈ కళా ప్రావిణ్యమే ఆమెకు భారతదేశపు అత్యంత పిన్న వర్దమాన రాక్ స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. వేలాది మంది ఆమె గిటార్ మ్యూజిక్ ప్రదర్శనకు అభిమానులుగా మారిపోయారు. నెట్టింట యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం ఆమె గిటార్ మ్యూజిక్‌కి ఫిదా అయ్యారు. ఇంత చిన్న వయసులోనే అంత అపారమైన ప్రతిభను సొంత చేసుకోవడం గ్రేట్ అంటూ ప్రశంసించారు. అంతేగాదు ముంబైలో జరిగే మహీంద్రా బ్లూస్ ఫెస్టివల్లో సంగీత ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు కూడా. దేవతల భువి నుంచి వచ్చిన ప్రతిభాశాలి అంటూ మాయపై ప్రశంసలు కురిపించారు. Oh My GodMaya Neelakantan is only 10 years old. 10! Yes, Simon, she’s a Rock Goddess. From the land of Goddesses. We have to get her back here to do her stuff at the @mahindrablues !@jaytweetshah @vgjairam pic.twitter.com/sRNHPBondg— anand mahindra (@anandmahindra) June 29, 2024మాయ నీలకంఠన్ నేపథ్యం.. 11 ఏళ్ల మాయ తమిళనాడులోని చెన్నైకి చెందింది. ఆమెకు సొంత యూట్యూబ్ ఛానెల్ ఉంది. ఈ చిన్న గిటారిస్ట్కి సంబంధించిన పలు ప్రదర్శన వీడియోలు ఉన్నాయి. ఆమె గిటార్‌పై కర్ణాటక సంగీతాన్ని ఆలపిస్తుంది. ఆమె గురువు ఆర్ ప్రసన్న. ఆమె అమెరికాలోని పాపా రోజ్ లాస్ట్ రిసార్ట్ వేదికపై గిటార్‌తో కర్ణాటక నటభైరవి రాగ ఉపోద్ఘాతాన్ని సోలోగా ప్లే చేసినట్లు తెలిపారు. మెటల్ రాక్ బ్లూస్ పదబంధాల తోపాటు కర్ణాటక గమకాలు చాలా అలవోకగా ప్లే చేసిందని మెచ్చుకున్నారు. ఏళ్ల క్రితమే కర్ణాటక సంగీతాన్ని గిటార్‌పై ప్లే చేయడం ప్రారంభించారు. గానీ ఇలా ఒక 11 ఏళ్ల బాలిక అమెరికాస్ గాట్ టాలెంట్ వంటి ప్రపంచ వేదికపై ప్లే చేయడం అనేది నిజంగా ప్రశంసించదగ్గ విషయం అని అన్నారు. ఇది చాలా గొప్ప ప్రతిభ అని, ఇప్పుడు తానే తన శిష్యురాలికి అభిమానిని అని గర్వంగా చెప్పారు మాయ గురువు ప్రసన్న. (చదవండి: -
పుట్టుకొస్తున్న ప్లాస్టిక్ శిలలు..ఆందోళనలో శాస్త్రవేత్తలు!
సైంటిస్టులను కలవరపెడుతున్న ప్లాస్టిక్ శిలలు. ఇప్పటికే ఐదు ఖండాలలో విస్తరించి ఉన్నాయి. ఇవి గనుకు వేగంగా ఏర్పడటం మొదలైతే ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇవి పర్యావరణం, మానువుని ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తాయని చెబుతున్నారు. ఇంతకీ ఏంటీ ప్లాస్టిక్ శిలలు?. ఎలా ఏర్పడతాయంటే.. ఇప్పటి వరకు ఐదు ఖండాల్లో ఈ ప్లాస్టిక్ శిలలు ఆవిర్భవించి విస్తరిస్తున్నట్లు నివేదికల్లో వెల్లడయ్యింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో కనిపించే ఈ శిలలు విచిత్రమైన రూపాలను కలిగి ఉంటాయి. ఇవి కంప్రెస్డ్ రాక్ మాదిరిగా ప్లాస్టిక్ పాలిమర్లతో కూడి ఉంటాయి. సుమారు 11 దేశాలలోని తీరప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలలో కనిపించాయి. వీటిని ఏమని పిలుస్తారంటే.. ఈ ప్లాస్టిక్ ఇన్ఫ్యూజ్డ్ శిలలను పిలవడంపై శాస్త్రవేత్తల్లో ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది. అయితే ఆయా ప్రదేశాల్లో వీటిని ప్లాస్టిక్స్టోన్, ప్లాస్టిక్రస్ట్, ప్లాస్టిగోమెరేట్, ప్లాస్టిటార్, ఆంత్రోపోక్వినాస్, ప్లాస్టిసాండ్స్టోన్లు అని పిలుస్తారు. ఆ పేర్లన్నీ అలా ఏర్పడటానికి దారితీసిన ప్రక్రియలను వివరిస్తున్నాయి. ఎలా కనుగొన్నారంటే.. జియాలజిస్ట్ ప్యాట్రిసియా కోర్కోరాన్ దాదాపు ఒక దశాబ్దం క్రితం హవాయిలో మొదటిసారిగా ఈ ప్లాస్టిక్ రాక్‌ను కనుగొన్నారు. అప్పుడే దీని గురించి చర్చ మొదలైంది. ఆ టైంలోనే ప్లాస్టిక్ గొమెరైట్ అనే పదం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటీవల సింఘువా విశ్వవిద్యాలయం పర్యావరణ అసోసీయేట్ ప్రొఫెసర్ దేయీహౌ అతని బృందం ప్లాస్టిక్, రాక్ మధ్య రసాయన బంధంపై చేసిన పరిశోధనల్లో లోతట్టు ప్రాంతాల్లో కనుగొన్న తొలి ప్లాస్టిక్ శిలను కనుగొన్నారు. ఆ తర్వాత వారి విస్తృతమైన పరిశోధనల్లో ఐదు ఖండాలు, 11 దేశాల్లో వీటి ఉనికిని గుర్తించారు. ఎలా ఏర్పడ్డాయంటే.. ఇవి ఏర్పడ్డ విభిన్న పద్ధతులపై అధ్యయనం చేయగా మంటలు లేదా వ్యర్థాలను కాల్చడం వంటి కార్యకలాపాలాల్లో ప్లాస్టిక్ శిథిలాలు కరిగిపోవడం, చలబడి ఖనిజ మాతృకలో మిళితం అవ్వడంతో ఏర్పడతున్నట్లు తెలుసుకున్నారు. ఇందుకు సముద్రపుప అలల పాత్ర కూడా ఉన్నట్లు గుర్తించారు. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ కలిగి ఉన్న చమురు సముద్రంలోకి లీక్ అయితే అది అలల కారణం బీచ్‌లకు చేరుకుంటుంది. అక్కడ రాళ్లకు ప్లాస్టిక్ చమురు తట్టు అతుక్కుని పాక్షికంగా బాష్పీభవనం చెంది ఘనీభవించడం జరుగుతుంది. అలాగే సూర్యకాంతి కారణంగా ఈ ప్లాస్టిక్ ఆక్సీకరణ చెంది రసాయన బైండింగ్ జరిగి ఈ ప్లాస్టిక్స్టోన్ ఉత్పత్తికి దారీతీస్తోంది. ఎక్కడెక్కడ ఉన్నాయంటే.. బ్రెజిల్, బంగ్లాదేశ్, హవాయి, చైనా, జపాన్, ఇండియా, ఇటలీ, పోర్చుగల్, పెరూ, యునైటెడ్ కింగ్డమ్, స్పానిష్ ద్వీపాలలో ఈ ప్లాస్టిక్ రాళ్లు కనపడ్డాయి. ఇది ఒకరకంగా ప్లాస్టిక్ కాలుష్యానికి అద్దం పడుతుందనే చెప్పాలి. ఈ విచిత్రమైన రాతి నిర్మాణాల ఏర్పాటుకు దారితీస్తున్న క్లిష్టమైన ప్రక్రియలే అందుకు నిదర్శనం. కలిగే పర్యావరణ ప్రభావాలు.. ఈ ప్లాస్టిక్ శిలలు సమీపంలోని నేలలో సూక్ష్మజీవులు పెరిగేందుకు కారణమవుతుంది. స్థానిక పర్వావరణ వ్యవస్థలన్నీ దీనికి ప్రభావితం అవుతుంది. ఇప్పటికే చాలా వరకు జంతువులు, మనుషులు శరీరాలపై దారుణమైన ప్రభావం చూపిస్తోంది. మానవులు కారణంగా ఈ భూమిపై ప్లాస్టిక్ ద్రవ్యరాశి సుమారు 22 నుంచి 28 మిలియన్ మెట్రిక్ టన్నులు ఉన్నట్లు అంచనా వేశారు. దీనికీ తోడు ఆవిర్భవిస్తున్న ఈ ప్లాస్టిక్ రాక్లు మరింత కాలుష్యానికి, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ వీటికారణంగా సూక్ష్మజీవులు అభివృద్ధి చెందితే మైక్రోప్లాస్టిక్‌లు బెడద ఎక్కువ అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ కాలుష్యాని తగ్గించే తక్షణ చర్యలకు పూనుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన నొక్కి చెబుతోందని శాస్త్రవేత్తలు అన్నారు. (చదవండి: కాన్ఫిడెన్స్‌ని దెబ్బతీసే రౌడీబేబీని ఎదుర్కొండి ఇలా! ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండిలా..!) -
కొండను కొంటారా? అమ్మకానికి సిద్ధంగా ఉంది!
కొండను కొంటారా?! ఖాళీ స్థలాలను కొనుక్కుంటారు. చక్కని స్థలాల్లో నిర్మించిన ఇళ్లు, భవంతులు కొనుక్కుంటారు. అంతేగాని, కొండలు గుట్టలు కొనుక్కుంటారేమిటి? అయినా, వాటిని ఎవరైనా అమ్ముతారా అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి! తాజాగా ఒక కొండ అమ్మకానికి సిద్ధంగా ఉంది. మన దేశంలో కాదులెండి. ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ డేల్స్ నేషనల్ పార్క్‌లో ఉన్న 170 అడుగుల పొడవైన ‘కిల్న్సే క్రేగ్’ అనే కొండను ఇటీవల అమ్మనున్నట్లు ప్రకటించారు. దీని ధర 1.50 లక్షల పౌండ్లు (రూ.1.55 కోట్లు). యార్క్ డేల్స్లోని వార్ఫడేల్ ప్రాంతంలో సున్నపురాతితో ఏర్పడిన ఈ కొండ పర్యాటక ఆకర్షణగా పేరుపొందింది. చాలామంది పర్యాటకులు దీనిపైకెక్కి ఫొటోలు దిగుతుంటారు. దీని మీద నుంచి చుట్టుపక్కల కనిపించే దృశ్యాలను కెమెరాల్లో బంధిస్తుంటారు. ఈ కొండ సహా దీని చుట్టూ ఉన్న 18.76 ఎకరాల స్థలంలో ప్రభుత్వం వ్యవసాయ పర్యావరణ పథకాన్ని అమలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆసక్తిగల ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయనున్నట్లు ప్రకటించింది. (చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు ఏకంగా నాలుగేళ్లు పట్టింది డెలివరీకి!) -
అరుదైన అంతరిక్ష శిల అరుదెంచె..
న్యూజెర్సీ: సువిశాలమైన అంతరిక్షంలో వింతలు విడ్డూరాలకు అంతు లేదు. మనకు తెలియని ఎన్నెన్నో విశేషాలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇతర గ్రహాల నుంచి విడిపోయిన శిలలు సుదీర్ఘంగా ప్రయాణం సాగించి మన భూగోళంపై పడుతుంటాయి. ఇలాంటి శిలల వల్ల భూమిపై భారీ గోతుల్లాంటివి ఏర్పడుతుంటాయి. అత్యంత అరుదైన కాన్‌డ్రైట్ అంతరిక్ష శిల(గ్రహ శకలం) అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ ఇంటి పై అంతస్తులోని పైకప్పును చీల్చుకొని పడక గదిలోకి దూసుకొచ్చింది. న్యూజెర్సీ రాజధాని ట్రెంటాన్‌కు ఉత్తరాన ఉన్న హోప్వెల్ టౌన్షిప్లో ఇటీవలే మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ శిల వేగానికి పడక గదిలోని కలప గచ్చు కొంత ధ్వంసమయ్యింది. ఎవరో ఆకతాయిలు రాయి విసిరారని భావించిన ఆ ఇంటి యజమాని సుజీ కాప్ దాన్ని చేతిలోకి తీసుకొని పరిశీలించగా వేడిగా తగిలి చురుక్కుంది. అదొకలోహాన్ని పోలి ఉండడంతో ప్రభుత్వ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారుల సూచన మేరకు ‘ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ’ సైంటిస్టులు రంగంలోకి దిగి, ఆ శిలను ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్‌తో క్షుణ్నంగా పరిశీలించారు. అది కాన్‌డ్రైట్ అంతరిక్ష శిలగా నిర్ధారించారు. బంగాళదుంప పరిమాణంలో 6/4 అంగుళాలు, 2.2 పౌండ్ల (దాదాపు ఒక కిలో) బరువు ఉన్నట్లు సైంటిస్టులు చెప్పారు. ఇలాంటి గ్రహశకలం గతంలో భూమిపై పడిన దాఖలాలు పెద్దగా లేవని తెలిపారు. అరుదైన గ్రహ శకలాన్ని పరీక్షించడం అద్భుతమైన అవకాశమని ద కాలేజ్ ఆఫ్ న్యూజెర్సీ ఫిజిక్స్ డిపార్టుమెంట్ చైర్మన్ నాథన్ మ్యాగీ చెప్పారు. ఈ శిలపై అధ్యయనం ద్వారా ఫిజిక్స్ ప్రొఫెసర్లు, విద్యార్థులు ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చని వెల్లడించారు. -
సింగరేణి గనిలో కూలిన బండ
సింగరేణి (కొత్తగూడెం): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ఏరియా పరిధిలోని పీకేకే 5 షాప్ట్ గనిలో శనివారం బండ కూలింది. మొదటి షిప్ట్‌లో 36 డిప్, 121 లెవల్లో సీఎమ్మార్తో బొగ్గు ఉత్పత్తి జరుగుతున్న సమయంలో మూడు మీటర్ల బండ కంటిన్యూస్ మైనర్(సీఎమ్మార్) యంత్రంపై పడింది. ఈ ఘటనలో యంత్రం కొంతమేర దెబ్బతింది. యంత్రంపై మాత్రమే బండ పడటంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. సీఎమ్మార్ మరమ్మతు పనులు పూర్తయ్యేందుకు నాలుగు రోజుల సమయం పట్టనుండటంతో అప్పటివరకు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. కాగా, తరచుగా బండ కూలే ఘటనలు పునరావృతం అవుతుండటంతో కార్మి కుల్లో ఆందోళన నెలకొంది. -
భారత్-పాక్ మ్యాచ్‌పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గతేడాది టి20 ప్రపంచకప్‌లో పాక్ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టి20 ప్రపంచకప్ ఆరంభమైనప్పటికి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరుతోనే వరల్డ్‌కప్ పీక్‌స్టేజీకి చేరుకోనుందడంలో సందేహం లేదు. తాజాగా హాలీవుడ్ సూపర్‌స్టార్(డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ 'ది రాక్') డ్వేన్ జాన్సన్ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ డీసీ సూపర్ హీరో ప్రస్తుతం తన సినిమా బ్లాక్ ఆడమ్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్‌పై డ్వేన్ జాసన్ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం రాక్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. ''ఇద్దరు గొప్ప ప్రత్యర్థులు తలపడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరినే చూస్తుంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగేది ఒక మ్యాచ్ కాదు.. అంతకుమించి. ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. డోంట్ మిస్'' అంటూ డ్వేన్ జాసన్(ది రాక్) పేర్కొన్నాడు). ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్‌కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్‌పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్‌లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్‌లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్‌లో మాత్రం టీమిండియా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. .@TheRock is #ReadyForT20WC and will kickstart the #GreatestRivalry in style on 23rd Oct, 7 AM onwards on #CricketLive#IndvPak | #BelieveInBlue | ICC Men’s #T20WorldCup | #Blackadam pic.twitter.com/KawbyLbNGM — Star Sports (@StarSportsIndia) October 18, 2022 చదవండి: 'భారత్‌లో జరిగే వరల్డ్‌కప్‌ను బాయ్‌కాట్ చేస్తాం' 'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మాజీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏనుగు... పరుగులు తీసిన మంత్రి
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ కాన్వాయ్‌ని ఒక ఏనుగు అడ్డుకుంది. ఆయన కారులో వస్తుండగా అకస్మాత్తుగా అడవి నుంచి ఒక ఏనుగు రోడ్డుపైకి వచ్చి మాజీ సీఎం వాహనాన్ని అడ్డుకుంది. ఈ హఠాత్పరిణామానికి మంత్రి కారు దిగి ప్రాణాల కోసం పరుగెత్తవలసి వచ్చింది. ఈ ఘటన ఉత్తరాఖండ్‌లోని కోట్ద్వార్-దుగడ్డ హైవే మీదుగా కోత్ద్వార్కి వస్తుండగా చోటుచేసుకుంది. తొలుత మాజీ సీఎం ఏనుగు వెళ్లిపోతుందనుకుని కారులోనే కూర్చుని ఉన్నారు. కానీ ఆ ఏనుగు అనుహ్యంగా మంత్రి కారువైపు వస్తుండటంతో మంత్రితో సహా ఆయన తోపాటు ఉన్న జనాలు కూడా భయంతో కారుదిగి పక్కనే ఉన్న కొండల వద్దకు పరుగులు తీశారు. పాపం సీఎం చివరకు కొండ ఎక్కి ప్రాణాలను ఎలాగోలా రక్షంచుకున్నారు. దాదాపు అరగంటపాటు మాజీ సీఎం కాన్వాయ్ అక్కడే ఉండాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది గాలిలో కాల్పులు జరిపి ఏనుగును ఎలాగోలా తరిమికొట్టారు. శివాలిక్ ఎలిఫెంట్ కారిడార్ ప్రాంతం కొట్ద్వార్-దుగడ్డ మధ్య ఉండడంతో హైవేపై ఏనుగులు తరచూ వస్తుంటాయని దుగడ్డ రేంజ్ ఆఫీసర్ ప్రదీప్ డోబ్రియాల్ తెలిపారు. ఇలాంటి ఘటనలు అక్కడ సర్వసాధరణమేనని చెప్పారు. (చదవండి: బిహార్‌లో మద్యం నిషేధం విఫలం: ప్రశాంత్) -
అమృత మరణం.. ఉప్పుపాతరతో ఊపిరి తిరిగొస్తుందా?
చిక్కబళ్లాపురం: ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మరణించినవారిని ఉప్పు పాతరేస్తే ప్రాణాలు తిరిగొస్తాయనే మూఢ నమ్మకం కన్నడనాట నేటికీ కొనసాగుతోంది. ఇటీవల బళ్లారిలో ఓ బాలుడి మృతదేహాన్ని ఉప్పు పాతరేయడం మరచిపోకముందే... చిక్కబళ్లాపుర జిల్లాలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకుంది. శిడ్లఘట్ట తాలూకాలోని గాజులవారిపల్లెకు చెందిన ఎంఏ విద్యార్థిని అమృత (22) గంగానహళ్లిలోని బంధువుల ఇంటికి వచ్చింది. ఆమె ఆదివారం ఉదయం గ్రామంలోని చెరువు వద్ద సరదాగా రీల్స్ చేస్తున్న సమయంలో తీసుకుంటూ జారిపడి నీటిలో మునిగిపోయింది. సమీపంలోని పొలాల్లో పనిచేస్తున్నవారు వచ్చి అమృతను ఒడ్డుకు తీసుకురాగా, అప్పటికే ఆమె చనిపోయింది. అయితే.. అయినప్పటికీ బంధువులు ఉప్పు పాతర వేస్తే బతుకుతుందనే నమ్మకంతో అమృత మృతదేహాన్ని ఉప్పులో పెట్టారు. గుడిబండ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. (చదవండి: బతికి వస్తాడని బాలుడి మృతదేహానికి ఉప్పుపాతర) -
బండరాయిపై భోజనం
-
137 టన్నుల బండ రాయి.. పిల్లలు కూడా సింపుల్‌గా జరపగలరు.. కారణం తెలుసా?
తన చిటికెన వేలితో కృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తినట్లు.. మీరు కూడా వంద టన్నుల బరువైన ఓ బండరాయిని కదిలించగలరు. ఆశ్చర్యపోనక్కర్లేదు.. ఫ్యాక్టే ఇది. ఫ్రాన్స్‌లోని హుయెల్గోట్ అడవిలో ‘షేకింగ్ రాక్’ పేరుతో ఓ బండరాయి ఉంది. ఏడు మీటర్ల పొడవు, 137 టన్నుల బరువైన ఈ రాయిని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు గుర్తించి, ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని కనుగొన్నారు.. ఈ రాయిని కదిలించడానికి కండలు తిరిగిన శరీరం ఉండాల్సిన పనిలేదు.. పిల్లలు కూడా కదలించవచ్చు అని. (చదవండి: Russian Ukraine War: 19 ఏళ్ల బంధం.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ముచ్చటైన కుటుంబం! ఆయన భార్య ఎవరంటే! ) కేవలం రాయి ఉండే కోణం, ప్రదేశం కారణంగానే ఇది సాధ్యమవుతోందని, అడవి నుంచి బయటకు తీసుకొస్తే ఆ ప్రత్యేకత పోతుందని బండరాయిని అక్కడే ఉంచారు. అప్పటి నుంచి రోజూ ఈ రాయిని చూడ్డానికి ఎంతోమంది వస్తున్నారు. మ్యాజిక్ చేసేవారు చిన్న చిన్న లాజిక్స్ ఉపయోగించి అసాధ్యాన్ని సుసాధ్యంగా భ్రమింప చేస్తున్నట్లు... మీరెప్పుడైనా ఫ్రాన్స్‌కు ప్రయాణమైతే అ అడవికి వెళ్లి చిన్న లాజిక్‌ను వాడి ఆ బండరాయిని కదిలించి ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేసుకోండి. -
కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న గిరిని ‘ఎత్తేయొచ్చు’!
ఒకప్పుడు శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని ఎత్తాడట..మరిప్పుడు.. కృష్ణుడు రాకున్నా.. ఏకంగా 1,37,000 కిలోల బరువున్న ఓ గిరిని మనమే ‘ఎత్తేయొచ్చు’!!అదెలా తెలుసుకోవాలంటే.. చలో మరి.. ఫ్రాన్స్ లోని హ్యూల్‌గోట్ అటవీ ప్రాంతానికి.. ఎందు కంటే.. ఇక్కడ ఎలాంటి మ్యాన్ అయినా.. సూపర్ మ్యాన్ అయిపోతాడు.. ఇంతకీ విషయమేమిటంటే.. ఈ ప్రాంతంలో బాగా ఫేమస్ అయిన ఓ భారీ బండ ఒకటి ఉంది..7 మీటర్ల పొడవుండే.. దాని బరువు 1.37 లక్షల కిలోలు.. వినగానే.. దీన్ని కదపడం కూడా అసాధ్యమనే అనిపిస్తోంది కదూ.. అయితే.. ప్రపంచంలోని అత్యంత బలహీనమైన వ్యక్తి కూడా దీన్ని సూపర్‌మ్యాన్ స్థాయిలో ఎత్తే యొచ్చు లేదా సులువుగా కదిలించొచ్చు.. ఎలా మ్యాజిక్కా అంటే.. కాదు అచ్చంగా లాజిక్కే! ఈ బండ ఉన్న ప్రదేశమే దీనికి కారణం.. సమతలంగా ఉన్న ఓ భారీ రాతి భాగంపై ఈ బండ బాలెన్సింగ్ చేస్తున్నట్లు ఉంటుంది. దాని వల్ల కొన్ని నిర్దేశిత ప్రదేశాల్లో ట్రైచేస్తే.. దీన్ని లైట్‌గా ఎత్తొచ్చు లేదా కదపొచ్చు. ఇంత విశేషం ఉంది కాబట్టే.. దేశ విదేశాల నుంచి వేలాదిగా పర్యాటకులు ఈ బండను ఎత్తడానికి ఇక్కడికి వస్తుంటారు.. భీముడంతటి తమ భుజశక్తిని ప్రదర్శించుకుని మురిసిపోతుంటారు. చదవండి: దరిద్రపుగొట్టు ఇల్లు.. ఏకంగా రూ. 14 కోట్లకు అమ్ముడుపోయింది -
వంగే రాయి.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారోయి..!
ఎలాంటి రాయినైనా సరే ముక్కలు చేయొచ్చు, ఉలితో చెక్కి శిల్పంగా మలచవచ్చు. కానీ, ఫొటోలో కనిపిస్తున్నట్లు ఎలా వంచగలుగుతున్నారో తెలియాలంటే ఈ రాయి గురించి తెలియాల్సిందే. పేరు.. ఇటాకోలమైట్. పోరస్ ఇసుకరాయి జాతికి చెందింది. సాధారణ రాళ్ల మాదిరే ఇది కూడా వివిధ రంగులు, రూపాలు, పరిమాణాల్లో ఉంటుంది. అయితే, ఎప్పుడైతే ఈ రాయి.. ఒక సెంటీమీటర్ మందం, 20 సెంటీమీటర్ల పొడవుగల సమాంతర పరిమాణంలోకి మారుతుందో.. అప్పుడు దీనికి వంగే స్వభావం వస్తుంది. ఈ విషయాన్ని ఈ మధ్యనే ఇటలీకి చెందిన భూ విజ్ఞాన శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతకంటే ఒక్క మిల్లీమీటర్ సైజ్‌లో తేడా వచ్చినా, ఆ రాయి అంగుళం కూడా వంగదు. ఈ రాయికి, ఆ పరిమాణానికి, ఆ స్వభావానికి ముడిపడి ఉన్న సంబంధం ఏమిటో ఇంకా అంతుచిక్కాల్సి ఉంది. కానీ, భూకంపాలు, బలమైన గాలులు, తుఫానుల వంటి ప్రకృతి వైపరిత్యాలను తట్టుకుని నిలబడగలిగే భవన నిర్మాణాల రూపకల్పనలో ఈ రాళ్లు ఎంతోగానో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రాళ్లల్లో కొన్నిరకాలు నీటిలో తేలే స్వభావం కలిగి ఉంటాయి. అలాగే ఈ రాళ్లు వంగే స్వభావం కలిగినవిగా చెబుతున్నారు. ఏది ఏమైనా అసలు నిజం తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడక తప్పదు. చదవండి: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!! -
ఆ రాయి అలా ఎందుకుందో అర్థంకాక తలలుపట్టుకుంటున్న నెటిజన్లు
ప్రస్తుతం టెక్నాలజీ పరంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతున్న ఇంకా కొన్ని ప్రశ్నలకు సమాధానాలు లేవనే చెప్పాలి. ఇటువంటి తరహాలో ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీన్ని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అది ఓ పెద్ద బండరాయికి సంబంధించిన ఫోటో అది. ఆ బండరాయి సరిగ్గా మధ్యలో చీలిపోయి ఉంటుంది. ఇందులో వింత ఏమిటంటే.. మధ్యలో చీలిన ఆ రాయి అలా కట్ చేయడం మనుషుల వల్ల కూడా ఖచ్చితంగా అవుతుందని చెప్పలేం. అందుకే ఆ ఫోటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వివరాల్లోకి వెళితే.. 30 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పు కలిగిన ఈ బాహుబలి బండరాయిని సౌదీ అరేబియాలోని తైమా ఒయాసిస్‌లో మనం చూడవచ్చు. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు మాత్రం ఆ రాయి అలా ఉండడానికి కారణంగా పలు సిద్ధాంతాల పేర్లను కామెంట్ చేస్తున్నారు. ఆ బండరాయిని గ్రహాంతరవాసులే అలా చీల్చి ఉంటారని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. వేరే గ్రహం నుంచి లేజర్ పాయింటర్ ద్వారా దాన్ని చీల్చి ఉంటారు అని మరికొందరు కామెంట్ చేశారు. ఇదేనా ఆ రహస్యం బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలో గౌరవ పరిశోధనా సహచరుడు అయిన లూయిస్ ఈ రాయి వెనుక రహస్యాన్ని చేధించినట్లు తెలిపారు. 'ఆ బండరాయి అలా సమానంగా చీలిపోవడానికి కారణం.. ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అని స్పష్టం చేశారు. నీళ్లు ఆ బండరాయి మీదకు చేరి.. దానికి పగుళ్లు ఏర్పడటంతో అలా సమానంగా చీలిపోయే అవకాశం ఉంటుందని.. దాన్నే ఫ్రీజ్ థా వెథరింగ్ ఎఫెక్ట్ అంటారని ఆయన స్పష్టం చేశారు. అయితే బండరాయి ఆ రకంగా సగానికి చీలే ప్రక్రియకు కొన్ని వేల సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలిపారు. లెవిస్ చెప్పిన విషయాన్ని కొందరు నమ్మినా.. మరికొందరు మాత్రం… ఏదో హైయ్యర్ టెక్నాలజీని ఉపయోగించి.. ఆ బండరాయిని అలా సమానంగా చీల్చారని కొందరు చెబుతున్నారు. చదవండి: Old Couple Love story: డేటింగ్ యాప్‌లో పరిచయం.. 70 ప్లస్‌లో ప్రేమ.. ఆపై పెళ్లి -
ఈ గీత.. డోలరైట్ చెక్కిన వింత
సాక్షి, హైదరాబాద్: గుట్టలోని రాతిభాగంపై నల్లటి పట్టీలా రంగుతో గీసినట్టు కనిపిస్తున్నది ఈ ప్రకృతి ఆవిష్కృత ‘చిత్రం’. సాధారణ గ్రానైట్ మధ్యలో ఓ చారలా ఏర్పడింది ఈ డోలరైట్. దాన్ని మనం బ్లాక్ గ్రానైట్‌గా పేర్కొంటాం. కోట్ల సంవత్సరాల కాలక్రమంలో రాతి మధ్యలోంచి డోలరైట్ భాగం ఇలా చొచ్చుకొచ్చి ఓ గీతలా ఏర్పడింది. దీని జియోలాజికల్ శాస్త్రీయ నామం ‘డైక్’. ఈ డైక్ జనగామకు 20 కిలోమీటర్ల దూరంలో నర్మెట మండలం వెల్దండ గ్రామశివారులో వెలుగుచూసింది. దీన్ని ఔత్సాహిక పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి ఇటీవల గుర్తించారు. స్థానిక గుళ్ల చెరువు సమీపంలోని రాజన్నగుడిగా పేర్కొనే శిథిల త్రికూటాలయం వెనక వైపు ఈ డైక్ కనిపిస్తోంది. ఆలయంలోని రాజరాజేశ్వరస్వామి వేములవాడకు తరలివెళ్తున్న సమయంలో రథం వల్ల ఈ గుర్తు ఏర్పడిందని ఓ కథనం ప్రచారంలో ఉంది. కానీ, దీనిని జియోలాజికల్ వండర్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. శిలాద్రవం (మాగ్మా) ఉబికి వచ్చి ఇలా గట్టిపడటంతో డైక్ ఏర్పడిందని జీఎస్ఐ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ చకిలం వేణుగోపాలరావు, కాకతీయ విశ్వవిద్యాల యం జియోలజీ విభాగానికి చెందిన మల్లికార్జునరెడ్డి, ద్రవిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు హర్షవర్ధన్ పేర్కొన్నట్టు రత్నాకర్‌రెడ్డి వివరించారు. కిలోమీటర్ల పొడవు మేర.. ఈ డైక్ భూమి అంతర్భాగంలో కొంతభాగం, మళ్లీ ఉపరితలంలో కొన్ని కిలోమీటర్ల మేర విస్తరించి ఉందని రత్నాకర్‌రెడ్డి తెలిపారు. గుట్టభాగంలో బలహీనంగా ఉన్న చోటును ఈ మాగ్మాలు ఆక్రమిస్తుంటాయి. బలహీన భాగాన్ని ఒత్తిడితో ఛేదిస్తూ ఏళ్ల కాలక్రమంలో మాగ్మా పైకి ఉబికి వస్తుంది. అలా దాదాపు 250 నుంచి 280 కోట్ల సంవత్సరాల క్రితం వెల్దండలో ఈ డైక్ ఏర్పడి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ నల్లరాతి డోలరైట్నే ఇక్కడ కృష్ణశిలలుగా పేర్కొంటూ వాటిని శిల్పాలు చెక్కేందుకు ఎక్కువగా వినియోగిస్తూ వచ్చారు. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ నిర్మాణంగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయంలోని నాగిని శిల్పాలను ఈ రాతితోనే చెక్కారు. -
ఈ రాయి పేరు లవ్రాక్ ఎందుకంటే...
రాజస్థాన్‌లోని హిల్‌స్టేషన్ మౌంట్ అబూ. ఈ కొండ మీద పెద్ద సరస్సు, పేరు నక్కీ లేక్. ఈ సరస్సును చుట్టినట్లున్న రోడ్డు వెంట ముందుకు వెళ్తే... హనీమూన్ స్పాట్‌కు చేరుతాం. అక్కడ కొండ రాయి పేరు లవ్రాక్. ఈ పేరు ఎందుకంటే... దూరం నుంచి చూస్తే ఒక అబ్బాయి, అమ్మాయిని ఆలింగనం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ప్రేమికులకు ప్రకృతి కల్పించిన ఏకాంత సౌధం ఇది. ఆ రాయి దగ్గర జంట ఏకాంతంగా కూర్చుని మౌంట్ అబూ ప్రకృతి సౌందర్యాన్ని తిలకించవచ్చు. సూర్యాస్తమయాన్ని వీక్షించడానికి కూడా ఇది చక్కటి పాయింట్. సూర్యుడు త్రీడీ ఎఫెక్ట్‌లో ముందుకు జరుగుతూ మనకు దగ్గరగా వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే మౌంట్ అబూ టూర్ ప్యాకేజ్‌లో చూపించే సన్‌సెట్ పాయింట్ ఇది కాదు. మౌంట్ అబూలో మరో సన్‌సెట్ పాయింట్ కూడా ఉంది. ఈ రాయి ఏ ఆధారమూ లేకుండా గాల్లో నిలిచి ఉండడంతో అనాధార శిఖరం అంటారు. మౌంట్ అబూ ఉన్నది రాజస్థాన్ రాష్ట్రంలోనే అయినా, విమానంలో వెళ్లే వాళ్లు అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో దిగడమే సౌకర్యం. అక్కడి నుంచి మౌంట్ అబూ 225 కిమీల దూరం. ( చదవండి: ఐదేళ్ల చిన్నారి.. రీడింగ్ రికార్డు ) -
చిత్తూరు జిల్లాలో ఘోరం.. బండ రాయి పడి..
సాక్షి, కలకడ: రాతి బండ కింద పడి కూలీ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో ఇరువురు తీవ్రంగా గాయపడగా, మరో నలుగురు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచెర్ల సమీపంలోని మొటుకు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు చిత్తూరు జిల్లా యాదమరి కి చెందిన రెహమాన్ గా పోలీసులు గుర్తించారు. గాయపడిన అక్బర్, ముబారక్ లను గుర్రంకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బండ రాయి కింద మృతి చెందిన వ్యక్తిని బయటకు తీసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.కలకడ ఎస్ ఐ రవి ప్రకాష్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఫస్ట్ చాయిస్ నేనే!
ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్స్ వేడుక యాంకర్ లేకుండానే సాగనుంది. అయితే ఈ ఏడాది ఆస్కార్స్‌లో యాంకర్‌గా మొదటి ఎంపిక నేనే అంటున్నారు హాలీవుడ్ యాక్టర్ డ్వేన్ జాన్సన్. కెవిన్ హార్ట్ తప్పుకోవడంతో కొత్త యాంకర్‌ను ఎంపిక చేయడం కుదరకపోవడంతో యాంకర్ లేకుండానే ఆవార్డ్స్ జరగనున్నాయి. ఈ విషయం గురించి డ్వేన్ జాన్సన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్‌ను హోస్ట్ చేయడానికి అకాడమీ అవార్డ్ మొదట నన్నే సంప్రదించింది. చాలా సరదాగా సాయంత్రాన్ని హోస్ట్ చేద్దాం అని అనుకున్నాను కూడా. కానీ ‘జుమాంజీ’ సినిమా షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా హోస్ట్ చేయడం కుదర్లేదు. చూద్దాం. భవిష్యత్తులో హోస్ట్‌గా చేసే అవకాశం రాకపోదా?’’ అని పేర్కొన్నారు. -
ఇంతుండీ పని చెయ్యాలా!
అమెరికా పారిశ్రామికవేత్త రాక్ ఫెల్లర్ వయస్సు మీదపడినప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండేవారు. ఆయన ఓమారు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓ యువకుడు గుర్తు పట్టి, ‘‘మీరు ధనవంతులు. ఏ లోటూ లేదు. అటువంటప్పుడు ఇంకా మీరెందుకు ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు?’’ అని అడిగాడు. అప్పుడు రాక్ ఫెల్లర్.. ‘‘మీకో ప్రశ్న వేస్తాను. దానికి సమాధానం చెప్పండి’’ అని అన్నారు. ‘‘అడగండి సార్’’ అన్నాడు యువకుడు. అప్పుడు రాక్ ఫెల్లర్ ‘‘ఇప్పుడీ విమానం ఆకాశంలో పోతోంది కదా.. ఎక్కడా ఏ మాత్రం ప్రమాదం లేకుండా నిలకడగా ఈ విమానం పోతోంది కదా.. అంతమాత్రాన ఈ విమానంలోని ఇంజన్‌ను ఆపేస్తామా? ఒకవేళ ఇంజన్‌ను ఆపేస్తే ఏం జరుగుతుందో తెలుసా’’ అని అడిగారు. దానికి ఆ యువకుడు ‘‘అమ్మో భలే చెప్పారే, పెనుప్రమాదం సంభవిస్తుంది’’ అని జవాబిచ్చాడు. ఆ మాటలు విన్న రాక్ ఫెల్లర్ ‘‘జీవిత ప్రయాణమూ అంతే. అహర్నిశలూ ఒళ్లు వంచి కష్టపడాలి. ఓ స్థాయికి చేరిన తర్వాత ఇక మనకేమీ అనుకుని కృషిని ఆపేస్తే జరగరానిది ఏదైనా జరగొచ్చు. అనుకోని అవసరమే వచ్చి పడొచ్చు. ఆ ప్రమాదం ఎదుర్కోకుండా ఉండాలంటే ఒంట్లో ఓపిక ఉన్నంత వరకూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అప్పుడు మానసిక ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఒత్తిడీ ఉండదు. ఏమంటారు’’ అని చిరునవ్వుతో ఎదురు ప్రశ్నించారు. అంగీకార సూచకంగా తలపంకించాడా యువకుడు. – రేణుదీశ్ -
తమన్నా.. పూజ... ఓ సారీ
మిల్కీ బ్యూటీ తమన్నా, గ్లామర్ గర్ల్ పూజా హెగ్డే సారీ చెప్పారు. సారీ చెప్పేటంత తప్పు వీరేం చేశారు? ఎవరికి క్షమాపణ చెప్పారు? అనేగా మీ డౌట్. అసలు సంగతి ఏంటంటే.. జాన్ అబ్రహాం, మనోజ్ బాజ్‌పేయి ముఖ్య పాత్రల్లో ‘రాక్’ అనే సినిమా తెరకెక్కనుంది. మిలాప్ ఝవేరి దర్శకత్వంలో నిఖిల్ అద్వానీ అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కించనున్నారట. ఇందులో కథానాయిక చాన్స్‌కి అటు తమన్నా ఇటు పూజా హెగ్డే ‘సారీ.. కుదరదు’ అన్నారని బాలీవుడ్ టాక్. ‘రాక్’ చిత్రంలో జాన్ అబ్రహాంతో జోడీ కోసం తొలుత తమన్నాను సంప్రదించారట చిత్రబృందం. మొదట సరే అన్న మిల్కీబ్యూటీ తర్వాత ‘సారీ నేను చేయలేను’ అంటూ తప్పుకున్నారట. ఆ పాత్రకు ఎవరైతే బాగుంటారా? అని సెర్చ్ చేసిన చిత్రబృందం ‘మొహెంజొదారో’తో బాలీవుడ్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే కరెక్ట్ అనుకున్నారట. ఆమెను సంప్రదించగా సింపుల్‌గా ‘సారీ’ అన్నారట. తమన్నా ఎందుకు తప్పుకున్నారు? ఇటువంటి మంచి అవకాశాన్ని పూజా హెగ్డే వదులుకోవడానికి కారణం ఏంటి? అన్నది తాజా బాలీవుడ్ టాక్. అబ్రహాంకి మంచి హిట్లు లేకపోవడం వల్లే అని కొందరు అంటుంటే.. కాదు.. కాదు.. ‘రాక్’లో కొన్ని బోల్డ్ సన్నివేశాలు ఉండటం వల్లే తప్పుకున్నారంటున్నారు మరికొందరు గాసిప్‌రాయుళ్లు. మరి.. జాన్‌కి జోడీగా ఎవరు ‘యస్’ అంటారో? -
అమెరికా అధ్యక్ష పదవి.. మాట మార్చిన రాక్
వాషింగ్టన్ : ప్రముఖ రెజ్లింగ్ స్టార్, హాలీవుడ్ నటుడు డ్వెయిన్ జాన్సన్(ది రాక్) మనసు మార్చుకున్నాడు. అధ్యక్ష పదవి రేసులో పాల్గొనే అంశంపై వెనక్కి తగ్గినట్లు ప్రకటించాడు. కొంత కాలం క్రితం తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని.. ప్రెసిడెంట్ పోటీలో పాల్గొంటానని కూడా రాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఆలోచనను ఇప్పుడు విరమించుకున్నట్లు రాక్ చెప్పాడు. ది గ్రాహం నార్టోన్ షోకి హాజరైన ఆయన ఈ కింది వ్యాఖ్యలు చేశాడు. ఇది ప్రజాభిప్రాయంతో కూడిన విషయం.. పైగా నటుడు కెవిన్ హార్ట్ 2020, 2024 ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే పునరాలోచన చేస్తున్నా. దీనిపై ఇంతకు మించి ఏం చెప్పలేను అని డ్వెయిన్ వెల్లడించాడు. కాగా, గతేడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటూ 45 ఏళ్ల రాక్‌ని పలువురు కోరారు. కానీ, దానికి ఆయన స్పందించలేదు. అయితే ఈ మే నెలలో మాత్రం తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని.. ఏదో ఒక రోజు అమెరికా అధ్యక్షుడినై తీరతానని రాక్ వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యుడబ్ల్యూఈ సూపర్‌స్టార్ అయిన రాక్.. తర్వాత హాలీవుడ్ చిత్రాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్ రాజకీయ ఎంట్రీపై సంబరాలు చేసుకున్న అభిమానులు తాజా ప్రకటనతో నీరుగారిపోయారు. -
‘రాక్’ ఈజ్ రాకింగ్!
రయ్.... మంటూ ఓ బిల్డింగ్ నుంచి మరో బిల్డింగ్‌లోకి దూసుకెళ్లిపోయే స్పోర్ట్స్ కార్లు... రోమాలు నిక్కబొడుచుకునే పోరాట సన్నివేశాలు... ఇవన్నీ హాలీవుడ్ సూపర్‌హిట్ సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’లో ఉండే హైలైట్ సీన్స్. గత ఏడాది ఈ సిరీస్‌లోని ఏడో భాగం కలెక్షన్ల సునామీ సృష్టించడంతో తదుపరి సీక్వెల్ ‘ఫాస్ట్ 8’పై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న డ్వేన్ జాన్సన్, విన్ డీజిల్ గెటప్స్ ఎలా ఉంటాయా? అని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు బ్రేక్ వేస్తూ.. ఈ చిత్రంలోని ఏజెంట్ హాబ్స్ పాత్రధారి డ్వేన్ జాన్సన్ లుక్ ఒకటి బయటికొచ్చింది. ‘‘ఏజెంట్ హాబ్స్ పాత్రకు కొత్త వెర్షన్ ఇది. ఫ్యాన్స్‌కు ఈ లుక్ నచ్చేయడం గ్యారెంటీ’’ అని సోషల్ మీడియాలో డ్వేన్ జాన్సన్ పేర్కొన్నారు. ఆయన అనుకున్నట్లుగానే ఈ లుక్ చూసినవాళ్లు ‘రాక్ (డ్వేన్ జాన్సన్‌కు మరో పేరు) ఈజ్ రాకింగ్’ అంటున్నారు. ఎఫ్. గ్యారీ గ్రే దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రముఖ హాలీవుడ్ నటి చార్లెస్ థెరాన్ కూడా ఎంటరయ్యారు. భారీ స్టార్ కాస్టింగ్.... హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం చూడాలంటే వచ్చే సమ్మర్ వరకూ ఆగాల్సిందే.