అమెరికా అధ్యక్ష పదవి.. మాట మార్చిన రాక్‌ | Dwayne Johnson AKA The Rock Drops from US President Race | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 10 2017 12:11 PM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

Dwayne Johnson AKA The Rock Drops from US President Race - Sakshi

వాషింగ్టన్‌ : ప్రముఖ రెజ్లింగ్‌ స్టార్‌, హాలీవుడ్‌ నటుడు డ్వెయిన్ జాన్సన్(ది రాక్‌) మనసు మార్చుకున్నాడు. అధ్యక్ష పదవి రేసులో పాల్గొనే అంశంపై వెనక్కి తగ్గినట్లు ప్రకటించాడు. కొంత కాలం క్రితం తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని.. ప్రెసిడెంట్‌ పోటీలో పాల్గొంటానని కూడా రాక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. 

అయితే ఆ ఆలోచనను ఇప్పుడు విరమించుకున్నట్లు రాక్‌ చెప్పాడు. ది గ్రాహం నార్టోన్‌ షోకి హాజరైన ఆయన ఈ కింది వ్యాఖ్యలు చేశాడు. ఇది ప్రజాభిప్రాయంతో కూడిన విషయం.. పైగా నటుడు కెవిన్‌ హార్ట్‌ 2020, 2024 ఎన్నికల ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశం ఉంది. అందుకే పునరాలోచన చేస్తున్నా. దీనిపై ఇంతకు మించి ఏం చెప్పలేను అని డ్వెయిన్‌ వెల్లడించాడు. 

కాగా, గతేడాది అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ కి వ్యతిరేకంగా ప్రచారం చేయాలంటూ 45 ఏళ్ల రాక్‌ని పలువురు కోరారు. కానీ, దానికి ఆయన స్పందించలేదు. అయితే ఈ మే నెలలో మాత్రం తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని.. ఏదో ఒక రోజు అమెరికా అధ్యక్షుడినై తీరతానని రాక్‌ వ్యాఖ్యలు చేశాడు. డబ్ల్యుడబ్ల్యూఈ సూపర్‌స్టార్‌ అయిన రాక్‌.. తర్వాత హాలీవుడ్‌ చిత్రాలతో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్‌ రాజకీయ ఎంట్రీపై సంబరాలు చేసుకున్న అభిమానులు తాజా ప్రకటనతో నీరుగారిపోయారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement