dwcra groups
-
ఏమాత్రం సంపాదించారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పడింది. వారుంటున్న ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకూ అన్ని వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపింది. ఎస్‌హెచ్‌జీలోని సభ్యుల రుణాలు, మొత్తం గ్రూపు ఎంతమేర రుణం తీసుకుంది? నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే వివరాలతో పాటు ఆయా సంఘాల్లో ఉంటున్న సభ్యుల కుటుంబాల్లోని ఇతరుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.ఈ మేరకు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలతో పాటు పట్టణాల్లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలను సేకరించి మెప్మా, డీఆర్డీఏ పీడీల సంతకాలతో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కేవలం గ్రూపులకు సంబంధించిన సమాచారం, ఆయా గ్రూపుల్లో ఉన్న మహిళల సమాచారం మాత్రమే కాకుండా మొత్తం వారి కుటుంబ ఆదాయ వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో ప్రభుత్వం మంజూరుచేసే సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లు నుంచి సెల్లు వరకూ..రాష్ట్రవ్యాప్తంగా 11.46 లక్షల పొదుపు సంఘాలున్నాయి. ఇందులో కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ అన్ని గ్రూపులకు సంబంధించిన సమాచారంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. వారుంటున్న ఇంటి నుంచి.. వాడే సెల్‌ఫోన్ వరకూ అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉంటున్న ఇల్లు సొంతానిదా? అద్దెకు ఉంటున్నారా? ఇల్లు ఏ రకానికి చెందినది.. అంటే, గుడిసె, పెంకుటిల్లు, భవంతి, అపార్టుమెంట్ అనే వివరాలను సేకరిస్తోంది. ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్రా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా? అని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.అలాగే, వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధిపొందారా? ఎంత మొత్తం పొందారు? ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? కారు ఉందా? తదతర వివరాలను కూడా నింపాలని పేర్కొంది. ఇక సభ్యురాలి మొబైల్ నెంబరుతో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు? డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఎస్‌హెచ్‌జీ ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే.. తద్వారా వచ్చే ఆదాయం ఎంత? జీఎస్టీ నెంబరు వివరాలను కూడా సేకరిస్తున్నారు.సంక్షేమ పథకాల కోతకేనా!?కేవలం ఎస్‌హెచ్‌జీలో ఉంటున్న మహిళల ఆదాయ వివరాలతో ఆగకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే, పొదుపు మహిళలు స్వయం ఉపాధి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటు కుటుంబంలోని సభ్యుల ఆదాయాన్ని కూడా తెలుసుకోనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల కోసం సేకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సేకరిస్తున్న వివరాలన్నీ ప్రభుత్వానికి చేరితే ఇస్తున్న కొద్దిపాటి సంక్షేమానికి కూడా కోతలు పెడతారనే భయాందోళనలను ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక.. ఇంట్లో వాడుతున్న గ్యాస్ నెంబరును కూడా ఆర్పీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుండటంతో వారు కలవరపడుతున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని జిల్లాల మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో వారు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. -
డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు
భద్రాచలం అర్బన్: డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలు అందించి సంఘాలు బలోపేతం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క భరోసా ఇచ్చారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు ఎంతోకాలంగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని త్వరలోనే విడుదల చేస్తామని ఆయన హామీనిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో పలు సమస్యలతో సహజీవనం సాగిస్తున్న గిరిజనులకు అన్ని విధాలా లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. 19 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆదివారం జరిగిన భద్రాచలం ఐటీడీఏ పాలకమండలి సమావేశంలో భట్టివిక్రమార్క మాట్లాడారు. రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో ఐటీడీఏ పూర్తిగా నిర్వీర్యం అయిందని, దీనికి పూర్వ వైభవం తెచ్చేలా తమ ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. 2004 – 2014 సంవత్సరాల మధ్య ఐటీడీఏకు కేటాయించిన బడ్జెట్, చేసిన ఖర్చు వివరాల నివేదికను వచ్చే సమావేశం నాటికి అందజేయాలన్నారు. ఐటీడీఏ పరిధిలోని పలువురు విద్యార్థులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఇందుకు గల కారణాలను విశ్లేషించి, వారు పాఠశాలలకు వెళ్లేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. యువతకు స్వయం ఉపాధి ద్వారా సాయం అందించే అంశాన్ని పరిశీలించాలన్నారు. పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు 2005లోనే నాటి వైఎస్సార్ ప్రభుత్వం మూడున్నర లక్షల ఎకరాలకు పట్టాలు పంపిణీ చేసిందని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. పక్క రాష్ట్రంలో గత సర్కారు ఇదే శాఖలో స్కామ్ చేసింది విద్యార్థులకు అందిస్తున్న సహకారంపై స్కిల్ డెవలప్మెంట్ అధికారులతో మాట్లాడిన భట్టి.. పక్క రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇదే శాఖలో స్కామ్ చేసిందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని భట్టి విక్రమార్క ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. 32 మండలాల పరిధిలో విస్తరించి ఉన్న ఐటీడీఏను విభజిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. భద్రాద్రి ఏజెన్సీ బాధ్యత తనదేనన్నారు. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. -
AP: మేలు చేసిన సర్కారుపై.. మహిళాభిమానం
మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి? ఈ ప్రశ్న వేయగానే చంద్రబాబు సమాధానంగా కనిపిస్తారు. మరి అదే మహిళలను ఆదుకున్న ముఖ్యమంత్రిగా... వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి కళ్లెదుట నిలబడతారు. ఇదే.. ఈ ఇద్దరికీ ఉన్న తేడా. అందుకే ఈ సర్కారును ‘మహిళా పక్షపాత ప్రభుత్వం’గా అంతా గుర్తిస్తున్నారు. మరి అలాంటి ముఖ్యమంత్రో... ప్రభుత్వమో ఏవైనా సభలు నిర్వహిస్తే ఆ మహిళలు పెద్ద ఎత్తున హాజరు కావటంలో ఆశ్చర్యమేముంది? దానిక్కూడా బెదిరింపులు... జరిమానాలు.. అంటూ కథలు అల్లాలా రామోజీరావు గారూ? వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఉండకూడదన్న కక్షతో రాస్తున్న మీ రాతలు... అబద్దాల్లో ఆస్కార్ స్థాయిని కూడా దాటిపోయాయని ఈ రాష్ట్రంలో తెలియనిదెవ్వరికి? అసలు పొదుపు సంఘాల మహిళల్ని మోసం చేసిందెవరు? సాక్షి, అమరావతి: అధికారంలోకి రాగానే బ్యాంకు రుణాలన్నీ భేషరతుగా మాఫీ చేస్తానని, వాయిదాలు చెల్లించొద్దని 2014 అసెంబ్లీ ఎన్నికల ముందు పొదుపు సంఘాల మహిళలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ గెలిచాక ఐదేళ్లలో ఒక్క పైసా కూడా మాఫీ చెయ్యలేదు. పైపెచ్చు ఎప్పటికప్పుడు ‘డ్వాక్రా రుణ మాఫీ’పై కథనాలను తన ఎల్లో పత్రికల్లో రాయిస్తూ ఆ మహిళలను ఆశపెట్టి ఉపయోగించుకున్న తీరు దారుణాతి దారుణం. ఆ మహిళలను నిరంతరం టీడీపీ సభలకు తరలించడానికి ఏకంగా టీడీపీ తరుఫున ఎంపీగా పోటీ చేసిన వ్యక్తిని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అడ్వయిజర్‌గా నియమించేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి ఓడిపోయిన బత్తుల విజయభారతిని చంద్రబాబు 2014లో తాను సీఎం అయ్యాక సెర్ప్ అడ్వయిజర్‌గా నియమించారు. నిజానికి సెర్ప్ సీఈఓగా ఐఏఎస్ అధికారులే ఉంటలారు. కానీ బాబు తన సామాజికి వర్గానికి చెందిన రిటైర్డ్ అధికారిని (ఐఏఎస్ కాదు) ముఖ్యమంత్రి ఓఎస్డీ పేరిట నియమించుకుని... ఆయన్నే సెర్ప్ సీఈఓగానూ కొనసాగించారు. పొదుపు సంఘాల మహిళల్ని టీడీపీ సభలకు తరలించటమే ఈ సీఈఓ, అడ్వయిజర్ పని. అధికారికంగా మాత్రం... పొదుపు మహిళలకు ట్రైనింగ్ అని బిల్లులు పెడుతూ... ఆ డబ్బుల్ని మాత్రం వాళ్లను సభలకు తరలించడానికి బస్సులకు, ఇతర వాహనాలకు పెట్టేవారు. అదీ కథ. ఉదాహరణకు బాబు సీఎంగా ఉన్నపుడు నంద్యాలకు ఉప ఎన్నికలు జరిగాయి. టీడీపీ తరఫున డబ్బులు పంచడానికి నియోజకవర్గంలో ప్రతి 50 ఏళ్లకు ఒక పొదుపు సంఘ మహిళను ‘సంఘమిత్ర’గా నియమించారు. ఆ ఎన్నికల ముందు చంద్రబాబే నేరుగా పొదుపు సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించారంటే ఈ వ్యవస్థను ఎంత దుర్వినియోగం చేశారో తెలియకమానదు. బాబు పాపాల ఫలితమేంటి? పొదుపు సంఘాలను ఇంతలా వాడేసుకున్న బాబు... వాటికి చేసింది మాత్రం ఏమీ లేదు. హామీ ఇచ్చి కూడా... ఒక్క రూపాయిని సైతం మాఫీ చేయలేదు. అప్పటిదాకా ఉమ్మడి ఏపీలో పొదుపు సంఘాలకు ‘సున్నా వడ్డీ’ పథకం అమలయ్యేది. బాబు సీఎం అయ్యాక ఆ పథకానికి నిధులు నిలిపేశారు. దీంతో వడ్డీ డబ్బులు కూడా మహిళలే చెల్లించాల్సి వచ్చింది. ► ఇక బాబు మాటలు నమ్మి మహిళలు వాయిదాలు కట్టలేదు. దీంతో వడ్డీ, చక్రవడ్డీల భారం పెరిగిపోయింది. 2014 నాటికి రూ.14205 కోట్లు ఉన్న పొదుపు సంఘాల అప్పు, 2019 ఏప్రిల్ నాటికి రెట్టింపు స్థాయిలో రూ. 25,517 కోట్లకు చేరింది. 2019 మార్చి నాటికి పొదుపు మహిళలు తీసుకున్న రుణాలు 20వేల కోట్లకు పైగా ఉన్నాయని ఘనంగా చెప్పిన ‘ఈనాడు’... అందులో సగానికి సగం రుణమాఫీ చెయ్యకపోవటం వల్ల మీదపడిన వడ్డీయేనని ఎందుకు చెప్పదు? ఇంతటి కఠిన వాస్తవాన్ని దాచిపెట్టడానికి కాస్తయినా సిగ్గుండాలి కదా రామోజీరావు గారూ? ► పైపెచ్చు 98.4 శాతం రికవరీ అనేది రామోజీరావు రాతల సారాంశం. అదే నిజమైతే 18.36 శాతం సంఘాలు ఎన్పీఏలుగా (నిరర్థక ఆస్తులు) ఎందుకు మారతాయి? బాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు కొన్ని నెలల పాటు కేవలం కేవలం 4.4 శాతం సంఘాలే నెలనెలా సమావేశాలు నిర్వహించుకున్నాయి. గ్రామాల్లో ప్రతి నెలా రూ.70 కోట్ల దాకా ఉండే పొదుపు... జస్ట్ రూ.2 కోట్లకు పడిపోయింది. ► ఉమ్మడి ఏపీలో 2014లో మూడున్నర లక్షల పొదుపు సంఘాలు ఏ గ్రేడ్‌లో ఉంటే... బాబు సీఎం అయ్యాక 2015 ఏప్రిల్‌కు ఏ, బీ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కలిపి 2.54 లక్షలకు పడిపోయాయి. ఇక 2015 నవంబరు నాటికి అవి 38 వేలకు (అంటే కేవలం ఐదు శాతం) పడిపోయాయి. ఈ వాస్తవాలు చాలవా... పొదుపు సంఘాల వ్యవస్థను కూకటివేళ్లతో సహా ఈ చంద్రబాబు... రామోజీరావులు ఎంతలా ధ్వంసం చేశారో తెలియటానికి!!?. ఇప్పుడు.. 91 శాతం సంఘాలది ఏ గ్రేడే... బాబు చేసిన మోసంతో పూర్తిగా అప్పల ఊబిలో మునిగిపోయిన పొదుపు సంఘాలను ఆదుకుంటానని తన పాదయాత్రలో హామీ ఇచ్చారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. తాను గెలిచాక నాలుగు విడతల్లో నేరుగా బకాయి మొత్తాన్ని వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం... 2019 ఏప్రిల్ ఉన్న రూ.25,517 కోట్లు అప్పును నాలుగు విడతలుగా చెల్లించేందుకు వైఎస్సార్ ఆసరా పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే వరుసగా రెండేళ్లు రెండు విడతల్లో రూ.12,758.28 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. ► వై.ఎస్.జగన్ ప్రభుత్వం మళ్లీ 2020 ఏప్రిల్ 24న వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. సకాలంలో రుణాలు చెల్లించే సంఘాల వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తోంది. గడిచిన మూడేళ్లగా ఏకంగా రూ.3615.29 కోట్లను వడ్డీ రూపంలో చెల్లించింది. ఫలితం... ఇపుడు 91 శాతం సంఘాలు ఏకంగా ‘ఏ’ గ్రేడ్‌కు చేరాయి. 99.5 శాతం మహిళలు సకాలంలో వాయిదాలు చెల్లిస్తున్నారు. ► ఇవేకాక వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, పేదలకు సొంతిళ్లు వంటి పథకాలన్నిటినీ ప్రభుత్వం మహిళల పేరుతోనే అమలు చేస్తోంది. అందుకే మహిళలు ఈ ప్రభుత్వంపై అభిమానం చూపిస్తున్నారు. సభలకు స్వచ్ఛందంగా తరలి వచ్చి జేజేలు పలుకుతున్నారు. దీన్ని భరించలేని కడుపుమంటకు ప్రత్యక్ష రూపమే... ‘ఈనాడు’ కథనం. కాదంటారా రామోజీ? -
Andhra Pradesh: ‘సంఘ’టితంగా.. కేంద్ర నిపుణుల కమిటీ ప్రశంసలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పొదుపు సంఘాలు ఆర్థిక ప్రగతితో కాంతులీనుతున్నాయని, మహిళల ఆధ్వర్యంలో పలు వ్యాపారాల నిర్వహణ అద్భుతంగా ఉందని కేంద్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ ప్రశంసించింది. రాష్ట్ర ప్రభుత్వం అందించిన తోడ్పాటుతో పొదుపు సంఘాల మహిళలు నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల దాకా వివిధ వ్యాపారాలు నిర్వహించే స్థాయికి ఎదిగారని కమిటీ నివేదికలో ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది ప్రాధాన్యత రంగాలను గుర్తించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్ధంగా అమలు చేస్తోందని అభినందించింది. ఆరోగ్యం (ఆరోగ్యశ్రీ), విద్య (అమ్మ ఒడి), విద్య (ఫీజు రీయింబర్స్మెంట్), గృహ నిర్మాణం (పేదలందరికీ ఇళ్లు), జీవనోపాధి (వైఎస్సార్ చేయూత – వైఎస్సార్ ఆసరా), సంక్షేమం (పెన్షన్ల పెంపు), వ్యవసాయం (వైఎస్సార్ రైతు భరోసా), సాగునీరు (జలయజ్ఞం), మద్య నియంత్రణను ప్రాధాన్యత అంశాలుగా గుర్తించి అమలు చేస్తూ కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకుంటోందని తెలిపింది. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తోందని కమిటీ పేర్కొంది. కాగా గత సర్కారు హయాంలో డ్వాక్రా రుణమాఫీ అందక డిఫాల్టర్లుగా మారి అప్పుల ఊబిలో కూరుకుపోయిన పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఆదుకున్న విషయం తెలిసిందే. ఎన్పీఏలుగా మారిన డ్వాక్రా సంఘాలు దీంతో పునరుజ్జీవమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న 14 పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు కేంద్ర రిటైర్డ్ కార్యదర్శితో పాటు తమిళనాడు రిటైర్డ్ సీఎస్ల నేతృత్వంలో వివిధ రంగాలకు చెందిన 32 మంది నిపుణులతో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ 6వ కామన్ మిషన్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, నాగాలాండ్ రాష్ట్రాల్లో కమిటీ పర్యటించింది. ఫిబ్రవరి 17 – 27 తేదీల మధ్య నలుగురు ప్రతినిధులతో కూడిన బృందం శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాలోని 23 గ్రామ పంచాయతీలను సందర్శించింది. క్షేత్ర స్థాయి పర్యటనలో స్వయంగా పరిశీలించిన అంశాలను విశ్లేషిస్తూ కమిటీ నివేదికను రూపొందించింది. అందులో ముఖ్యాంశాలు ఇవీ. శ్రీకాకుళం జిల్లాలో కంప్యూటర్ శిక్షణ ల్యాబ్‌ను పరిశీలిస్తున్న కేంద్ర నిపుణుల కమిటీ సభ్యులు ఆత్మవిశ్వాసం.. టెక్నాలజీ వినియోగం రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల నిర్మాణం దాదాపు సంతృప్త స్థాయిలో ఉంది. అపార సామాజిక మూలధన రూపంలో సభ్యులు ఆత్మ విశ్వాసంతో, శక్తివంతంగా ఉన్నారు. రుణాలను సక్రమంగా తిరిగి చెల్లించడంతో పాటు సంక్షోభంలో పరస్పరం సాయం చేసుకుంటున్నారు. సంఘాల కార్యకలాపాల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు. హాజరు నమోదుతో పాటు రుణ వివరాల లాంటి రికార్డుల కోసం మొబైల్ అప్లికేషన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ► రాష్ట్రంలో పొదుపు సంఘాలు కిరాణా, బ్యూటీ పార్లర్, కలంకారీ, చెక్క క్రాఫ్టింగ్, చీపుర్ల తయారీ, వివాహ వస్తువుల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, పూల పెంపకం, వ్యవసాయం, పశువులు, మిల్లెట్స్ ఉత్పత్తి, చిన్న వ్యాపారాలు, ఉద్యానవనాలు లాంటి వివిధ రకాల జీవనోపాధి కార్యకలాపాలలో నిమగ్నమయ్యాయి. సేంద్రీయ వ్యవసాయంలోనూ.. పొదుపు సంఘాలు సభ్యులు రూ.రెండు లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు రుణాలు తీసుకుని వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. టైలరింగ్, కొవ్వొత్తుల తయారీ, స్వీట్ షాప్ లాంటి వ్యాపారాలను చేస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల రికవరీ రేటు నూటికి నూరు శాతంగా ఉంది. సాధికారత, ఆర్థిక నిర్వహణలో బాగా ప్రావీణ్యం ఉంది. పొదుపు సంఘాలు సేంద్రీయ వ్యవసాయంతో పాటు న్యూట్రి గార్డెన్స్‌లో కూడా పాల్గొంటున్నాయి. మెరుగైన ఆదాయం.. పొదుపు సంఘాల సభ్యులు మెరుగైన ఆదాయ స్థాయి కలిగి ఉన్నారు. ఉదాహరణకు పొదుపు సంఘంలోని ఓ సభ్యురాలు రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ పొంది రుణం తీసుకుని టైలరింగ్ దుకాణాన్ని ప్రారంభించింది. నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు వ్యాపారం జరుగుతోంది. అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ పొదుపు సంఘాల ఉద్యమంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా సెర్ప్ ద్వారా సంఘాలకు తగిన మద్దతు ఇస్తుండటంతో గ్రామ, మండల, జిల్లా సమాఖ్యలు శక్తివంతంగా ఉన్నాయి. సంఘాల సభ్యులకు గ్రామీణాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల పట్ల పూర్తి అవగాహన ఉంది. ► పొదుపు సంఘాలు సామాజిక చైతన్య కార్యక్రమాల్లో విస్తృతంగా పాలు పంచుకుంటున్నాయి. పల్స్ పోలియో, కోవిడ్ వ్యాక్సినేషన్, కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తూ చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఉపాధి, మౌలికం.. భేష్ రాష్ట్రంలో గ్రామీణ ఉపాధి, మౌలిక సదుపాయాల కల్పన బాగుందని నిపుణుల కమిటీ నివేదికలో పేర్కొంది. వైవిధ్యమైన సామాజిక సంపదను సృష్టించినట్లు క్షేత్రస్థాయి సందర్శనలో గుర్తించామని తెలిపింది. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుందని ప్రశంసించింది. వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనాలు, గ్రామ సచివాలయాల భవనాలు, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్లు లాంటి వాటిపై దృష్టి పెట్టి సామాజిక సంపద సృష్టించటాన్ని ప్రస్తావించింది. ‘నేషనల్ రూర్బన్ మిషన్’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభావవంతంగా నిర్వహిస్తోందని తెలిపింది. 70 శాతం డిపార్ట్మెంట్ నిధులతో పాటు 30 శాతం క్రిటికల్ గ్యాప్ నిధులను ఏకీకృతం చేసి వాటర్ ట్యాంక్‌లు, అంగన్వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, కాలేజీ భవనాల నిర్మాణం తదితరాలను నిర్దేశిత ప్రణాళికతో అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ► సాధారణంగా ఉపాధి హామీ కింద జాబ్ కార్డులను డిమాండ్ ఆధారంగా ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్లను నియమించిన తరువాత గ్రామ పంచాయతీ స్థాయిలోనే జాబ్ కార్డులను ఇస్తున్నారు. గతంలో బ్లాక్ స్థాయిలో ఇచ్చేవారు. ఇప్పుడు జాబ్ కార్డుల మంజూరు గణనీయంగా మెరుగుపడింది. ► కోవిడ్, లాక్డౌన్ సమయంలో ముందుగానే జాబ్ కార్డులను జారీ చేశారు. ముఖ్యంగా వలస కూలీలు తిరిగి రాగానే జాబ్ కార్డులిచ్చారు. లబ్ధిదారుల ఫొటోలతో సహా జాబ్ కార్డులను జారీ చేశారు. ► రాష్ట్రంలో ఉపాధి హామీకి సంబంధించి ప్రతి పని వివరాలు ఫైల్ రూపంలో ఉన్నాయి. మెజర్మెంట్ బుక్‌తో సహా రికార్డులన్నీ సక్రమంగా నిర్వహిస్తున్నారు. ► కూలీలకు వేతనాలు నూటికి నూరు శాతం డీబీటీ చెల్లింపులు చేస్తున్నారు. పనులను నూరు శాతం జియో ట్యాగింగ్ చేస్తున్నారు. కూలీలకు వేతనాలను సమయానికి ఇస్తున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ బాగుంది యువతకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు రాష్ట్రంలో బాగా అమలవుతున్నాయని నిపుణుల కమిటీ తెలిపింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన కింద గ్రామీణ యువతకు మంచి మౌలిక సదుపాయాలున్న సంస్ధ ద్వారా రెసిడెన్షియల్ శిక్షణను రాష్ట్ర ప్రభుత్వం అందచేస్తోంది. శిక్షణ భవనాలు, తరగతి గదులు, ప్రాక్టికల్ ల్యాబ్‌లు, ఐటీ శిక్షణ ల్యాబ్స్ చాలా బాగున్నాయని, 40 గంటల కాలం పాటు శిక్షణ అందుతోందని కమిటీ పేర్కొంది. అర్హత కలిగిన శిక్షకులు, రిసోర్స్పర్సన్లు అందుబాటులో ఉంటున్నారు. ప్లేస్‌మెంట్స్ 70 – 80 శాతం వరకు ఉన్నాయని తెలిపింది. కొందరు లబ్ధిదారులు రెండు మూడేళ్ల పని అనుభవం తరువాత నెలకు రూ.లక్ష వేతనం ఆర్జిస్తున్నారని, కోవిడ్ సమయంలోనూ శిక్షణ కేంద్రాలను కొనసాగించారని పేర్కొంది. రూ.వేల కోట్లతో పేదలకు ఇళ్లు పేదలందరికీ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ద్వారా దశాబ్దాలుగా సొంత గూడు లేని నిరుపేద కుటుంబాలకు గృహాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని కమిటీ తెలిపింది. పేదల ఇళ్ల కోసం అందుబాటులో ఉన్న చోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఉచితంగా కేటాయించింది. ఇది కాకుండా ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రిజిస్టర్డ్ భూములను సేకరించేందుకు ఏకంగా రూ.23 వేల కోట్లను వ్యయం చేసి పేదలకు ఇళ్ల పట్టాలిస్తోందని కమిటీ పేర్కొంది. వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఉత్తమ విధానాలు ► ఘన వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ఏపీ ఉత్తమ పద్ధతులను అనుసరిస్తోంది. ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించి వివిధ వస్తువులను వేరు చేసి వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నారు. కిలో రూ.10 చొప్పున విక్రయించే ఈ ఎరువులను తోటల సాగుదారులతోపాటు స్థానిక రైతులు కొనుగోలు చేస్తున్నారు. -
అక్కా చెల్లెమ్మలకు అండగా.. పథకాలు మెండుగా..
రాయచోటి: సంక్షేమమే ఊపిరిగా.. అభివృద్ధి అజెండాగా సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది. ప్రతి మహిళ స్వయం సమృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అతివలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టింది. డ్వాక్రా అక్కా చెల్లెమ్మల ఇబ్బందులు నాడు పాదయాత్రలో స్వయంగా పరిశీలించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారికి ఆర్థిక చేయూత నిచ్చేందుకు అనేక పథకాలకు శ్రీకారం చుట్టారు. ఫలితంగా లబ్ధి పొందిన మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను వేనోళ్లా కొనియాడుతున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం: వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద (డీఆర్డీఏ) జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 18,450 డ్వాక్రా సంఘాలకు రూ. 44.09 కోట్లు, రెండో విడత 20,730 డ్వాక్రా సంఘాలకు రూ. 59.69 కోట్లు, మూడో విడత 21,641 డ్వాక్రా సంఘాలకు రూ. 62.622 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. ఈ పథకం కింద మొత్తం మూడు విడతలలో రూ. 166.402 కోట్లు రాష్ట్రప్రభుత్వం జమ చేసింది. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద (మెప్మా) జిల్లా వ్యాప్తంగా మొదటి విడత 3053 డ్వాక్వా సంఘాలకు రూ. 5.34 కోట్లు, రెండో విడత 3144 డ్వాక్వా సంఘాలకు రూ. 4.97 కోట్లు, మూడో విడత 3442 డ్వాక్వా సంఘాలకు రూ. 5.21 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. సున్నా వడ్డీ పథకం కింద మొత్తం విడతలలో రూ. 15.52 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బ్యాంకు లింకేజీ: బ్యాంకు లింకేజీ ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి (డీఆర్డీఏ) ద్వారా జిల్లా వ్యాప్తంగా 17,335 డ్వాక్రా సంఘాలకు రూ. 73.352 లక్షలు లక్ష్యంగా పెట్టుకోగా అందులో 7381 డ్వాక్రా సంఘాలకు రూ. 53,416 లక్షలు రుణం రూపంలో అందజేశారు. స్త్రీనిధి: స్త్రీనిధి ద్వారా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డీఆర్డీఏ ద్వారా జిల్లా వ్యాప్తంగా 27,260 డ్వాక్రా సభ్యులకు రూ. 136.3 కోట్లు టార్గెట్ పెట్టుకోగా 24341 డ్వాక్రా సంఘాలకు రూ. 91.47 కోట్లు రుణం రూపంలో అందజేశారు. మహిళా సాధికారతతోనే సమాజ అభివద్ధి మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని నమ్మిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. అన్ని సంక్షేమ పథకాలకు మహిళలనే ప్రధాన లబ్ధిదారులుగా ఎంపిక చేసి మహిళామణులుగా నిలుపుతున్నారు. స్వయం సహాయక సంఘ మహిళల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంచడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. దిగువ, మధ్య తరగతి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బ్యాంకులతోపాటు బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని వ్యాపారం, స్వయం ఉపాధి రంగాలలో స్థిరపడేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. –గిరీషా పీఎస్, అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు ప్రస్తుతం బ్యాంకుల నుంచి స్త్రీనిధి, ఉన్నతి లాంటి అనేక పథకాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడం వలన పెట్టుబడికి నిధుల కొరత ఉండటం లేదు. మహిళల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సంఘానికి రూ. 20 లక్షల వరకు రుణాలు ఇస్తున్నాం. అలాగే మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణ వలన పరపతి సౌకర్యం బాగా పెరిగింది. –బి.సత్యనారాయణ, డీఆర్డీఏ పీడీ, అన్నమయ్య జిల్లా మహిళల సంక్షేమానికి పెద్దపీట నాపేరు ఎస్ శ్రీదేవి.నేను టి సుండుపల్లి మండలం జి.రెడ్డివారిపల్లిలో నివసిస్తున్నాను. లక్ష్మీ వెంకటేశ్వర పొదుపు సంఘంలో సభ్యురాలిగా ఉన్నాను. బ్యాంకు లింకేజీ ద్వారా రూ. 1,25,000లు శ్రీనిధి ద్వారా రూ. 50,000లు రుణం తీసుకున్నాను. నేను మా ఊరిలోనే కిరాణా దుకాణం, ఫ్యాన్సీ స్టోర్, ఎలక్ట్రికల్, స్లిప్పర్స్ షాపు పెట్టుకున్నాను. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం నాకు వర్తించింది. సీజన్‌ను బట్టి నెలకూ రూ. 8వేలు నుంచి రూ. 15వేలు ఆదాయం వస్తుంది. మహిళల సంక్షేమానికి, ఆర్థిక పురోగతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు నాపేరు ఎస్ కరీమున్.టి సుండుపల్లె మండల కేంద్రంలో నివసిస్తున్నాను. అల్లాహ్ పొదుపు సంఘంలో సభ్యురాలిని. కెనరా బ్యాంకులో పొదుపు సంఘం తరపున రూ. 1.30లక్షలు రుణం తీసుకున్నాం. మా సంఘానికి ఆసరా పథకం, సున్నా వడ్డీ పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో నేను, నా భర్త కలిసి ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకొని వ్యాపారం చేస్తున్నాము. ప్రతి నెల రూ. 15వేలు ఆదాయం వస్తుంది. జగనన్న చేతల ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఇచ్చిన మాట నెరవేరుస్తున్నారు నాపేరు పసుపులేటి పద్మావతి. కురబలకోట మండలం పూజారివారిపల్లిలో నివసిస్తున్నా. వెన్నెల పొదుపు సంఘంలో బ్యాంకు నుంచి రూ. 2 లక్షలు తీసుకున్నా. వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ. 2.30 లక్షలు, సున్నా వడ్డీ పథకం కింద రూ. 27 వేలు డబ్బులు జమ అయ్యాయి. మిల్లెట్ ఫుడ్స్ తయారీ వ్యాపారం చేస్తున్నాను. ఇచ్చిన మాట నెరవేరుస్తున్న సీఎం మహిళల పాలిట దేవుడు. -
పొదుపుసొమ్ము స్వాహా కేసులో టీడీపీ నేత అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం/ప్రొద్దుటూరు: పొదుపు సంఘం డబ్బు స్వాహా కేసులో టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారాయణమ్మ, ఆమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్తె లలితలను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. బంగారులక్ష్మి సమాఖ్య పరిధిలోని 30 డ్వాక్రా గ్రూపులకు సం బంధించి రూ.31,83,097కు పైగా అవినీతి జరి గినట్లు మున్సిపల్ అధికారులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ఖాతాల్లో అవకతవకలు జరిగాయని, రూ.30 లక్షలకు పైగా డబ్బు స్వాహాచేశారని మహిళలు గతనెలలో లక్ష్మీనారాయణమ్మ ఇంటిముందు ధర్నా చేశారు. ధర్నా చేస్తున్న తమపై లక్ష్మీనారాయణమ్మ కుటుంబసభ్యులు దాడిచేశారని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. తమను మోసం చేసిన లక్ష్మీనారాయణ మ్మకు మద్దతుగా మాట్లాడుతున్నారంటూ మహిళలు టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఇంటిముందు ధర్నా చేశారు. వారిపై టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారులు లక్ష్మీనారాయణమ్మ వద్ద ఉన్న రికార్డులను స్వా« దీనం చేసుకుని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం రూ.31,83,097కు పైగా అవినీతి జరిగినట్లు తేలిందని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. మహిళల ఆత్మగౌరవ దీక్ష విరమణ డ్వాక్రా మహిళలకు కుచ్చుటోపీ పెట్టిన టీడీపీ ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షురాలు భోగాల లక్ష్మీనారా>యణమ్మ, ఆమె భర్త చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్తె లలితలను అరెస్ట్ చేయాలంటూ వారం రోజులుగా కొనసాగుతున్న ‘ప్రొద్దుటూరు మహిళల ఆత్మగౌరవ దీక్ష’ను గురువారం విరమించారు. దీక్ష చేస్తున్న మహిళలకు కడప దిశ డీఎస్పీ వాసుదేవన్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. చివరిరోజు దీక్షలో సోములవారిపల్లె సర్పంచ్ మోపూరి ప్రశాంతి, ఎంపీటీసీ సభ్యురాలు బాలగుర్రమ్మ, మాజీ కౌన్సిలర్లు వుట్టి రమణమ్మ, రమాదేవి, మాజీ సర్పంచ్ రాజేశ్వరి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి కూర్చున్నారు. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రాసెసింగ్ చార్జీలొద్దు
సాక్షి, అమరావతి: పొదుపు సంఘాల పేరిట మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై బ్యాంకులు ఎలాంటి ప్రాసెసింగ్ చార్జీలు వసూలు చేయకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వం బుధవారం రిజర్వు బ్యాంకు అప్ ఇండియా (ఆర్బీఐ)ను కోరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఇందుకు సంబంధించి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో మహ్మద్ ఇంతియాజ్ బుధవారం ముంబయిలోని రిజర్వు బ్యాంక్ ప్రధాన కార్యాలయంలోని ఛీప్ జనరల్ మేనేజర్, హైదరాబాద్‌లోని రిజర్వు బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయ జనరల్ మేనేజర్‌తో పాటు రాష్ట్ర బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) కన్వీనర్లకు వేర్వేరుగా లేఖ రాశారు. రుణం ఇచ్చే బ్యాంకును బట్టి ప్రస్తుతం పొదుపు సంఘాల రుణ మొత్తంపై 0.5 శాతం నుంచి 1.2 శాతం దాకా ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. ప్రస్తుతం పొదుపు సంఘాల మహిళలకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు బ్యాంకు రుణాలు ఇచ్చే వెసులు బాటు ఉంది. అంటే, మహిళలు రూ.20 లక్షల రుణం తీసుకుంటే సుమారు రూ.20 వేలు ప్రాసెసింగ్ ఫీజు పేరిట బ్యాంకులు మినహాయించుకుంటున్నాయి. పొదుపు సంఘాలు తీసుకునే రుణాల్లో అత్యధికులు పేద కుటుంబాలకు చెందిన వారే కావడంతో ఈ తరహా ప్రాసెసింగ్ చార్జీలు వారికి భారంగా తయారవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వం ఈ లేఖ ద్వారా ఆర్బీఐ దృష్టికి తీసుకొచ్చింది. ఈ తరహా రుణాలపై ప్రాసెసింగ్ చార్జీలతో పాటు డాక్యుమెంటేషన్ చార్జీలు, ఇతర అడహాక్ చార్జీలు సైతం బ్యాంకులు వసూలు చేయకుండా అన్ని బ్యాంకులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్బీఐని ప్రభుత్వం కోరింది. రుణాల చెల్లింపులో దేశంలోనే ప్రథమ స్థానం పొదుపు సంఘాల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ ఆసరాతో పాటు సకాలంలో రుణాలు చెల్లించే వారికి సున్నా వడ్డీ పథకం అమలు వంటి చర్యలు చేపట్టడంతో రాష్ట్రంలో ప్రస్తుతం మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలలో 99.5 శాతం సకాలంలో చెల్లిస్తున్నారు. పొదుపు సంఘాల రుణాల చెల్లింపుల్లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. దీంతో బ్యాంకులు కూడా మహిళా పొదుపు సంఘాల గరిష్ట పరిమితి మేరకు రుణాలు ఇస్తున్నాయి. మరో పక్క.. రాష్ట్రంలో పొదుపు సంఘాల పేరిట ప్రస్తుతం రూ.30 వేల కోట్ల పైబడి మహిళలు బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని ఉన్నారు. అందులో ఎప్పటికప్పుడు కిస్తీ ప్రకారం పాత రుణాల చెల్లింపులు పూర్తి కాగానే, తిరిగి కొత్తగా ఏటా రూ.15 వేల కోట్లు రుణాలు పొందుతున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకుల స్పందన ► పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై రూ.2.5 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ ఆర్బీఐ గతంలోనే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. మూడేళ్ల కిత్రం వరకు మన రాష్ట్రంలోనూ అత్యధిక సంఘాలు ఈ పరిమితి మేరకే బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితి ఉండింది. ► అయితే, రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అత్యధిక పొదుపు సంఘాలు బ్యాంకుల నుంచి రూ.10 లక్షలకు పైబడే రుణాలు పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ చార్జీ భారంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టి రాగానే.. గత రెండేళ్లగా జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశాలన్నింటిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ విషయాన్ని బ్యాంకర్ల దృష్టికి తీసుకొచ్చింది. ► ఫలితంగా రూ.10 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీలను మినహాయిస్తూ యూనియన్ బ్యాంకు (గతంలో ఆంధ్రా బ్యాంకు) 2021 సెప్టెంబర్ 1వ తేదీన అన్ని బ్రాంచ్‌లకు ఆదేశాలు జారీ చేంది. పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా 2021 ఆగస్ట్ 23వ తేదీన అదే తరహా ఉత్తర్వులిచ్చింది. ► సకాలంలో చెల్లింపులు జరుగుతుండడంతో ఇప్పుడు బ్యాంకులు రూ.20 లక్షల దాకా సంఘాల పేరిట రుణాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బ్యాంకర్ల సమావేశంలో సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా రూ.20 లక్షల వరకు ప్రాసెసింగ్ చార్జీల మినహాయింపు విషయాన్ని ప్రస్తావించారు. ఆ అంశాన్ని సమావేశ మినిట్స్‌లో ఉదహరించి, అన్ని బ్యాంకులకు ఆదేశాలివ్వాలంటూ సూచన చేశారు. ► రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంకు (అప్కాబ్) ఇప్పటికే రూ.20 లక్షల వరకు పొదుపు సంఘాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజు వసూలును పూర్తిగా మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేసిందని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
జగనన్న సర్కార్ అండతో పెరిగిన పరపతి
ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, ఎవ్వరూ బ్యాంకులకు కంతులు చెల్లించాల్సిన అవసరం లేదని చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మహిళలు మోసపోయారు. అప్పటి వరకు సక్రమంగా కంతులు చెల్లించిన వారు ఒక్కసారిగా డీఫాల్టర్లుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించి, ఉన్నత స్థితికి తీసుకెళ్లేందుకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎన్నికలకు ముందు వరకు బ్యాంకుల్లో ఉన్న డ్వాక్రా రుణాలకు సంబంధించిన మొత్తాన్ని ‘వైఎస్సార్ ఆసరా’ కింద విడతల వారీగా సంఘాలకు చెల్లించింది. ప్రభుత్వ చేయూత ద్వారా మహిళలు అప్పులు తీర్చేశారు. బ్యాంకులతో కొత్తగా రుణాలు ఇప్పించడంతో పాటు వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ద్వారా వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. సంఘాల సభ్యులు సక్రమంగా కంతులు చెల్లించడం ద్వారా అగ్రపథంలో నిలిచి పరపతి పెంచుకున్నారు. అనంతపురం అర్బన్: స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)పై బ్యాంకులకు అపార నమ్మకం. బ్యాంకు లింకేజీ రుణాలు సకాలంలో తీరుస్తుండటమే ఇందుకు కారణం. సంఘాలు అడిగిన వెంటనే బ్యాంకులు రూ.కోట్లలో రుణం మంజూరు చేస్తున్నాయి. అక్కచెల్లెమ్మల ఆర్థిక స్వావలంబనకు జగనన్న సర్కార్ వైఎస్సార్ సున్నావడ్డీ పథకం ద్వారా ప్రోత్సహిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన మూడేళ్లలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా బ్యాంకులు రూ.5,423 కోట్ల రుణం మంజూరు చేశాయి. 99.62 శాతం రుణ చెల్లింపు స్వయం సహాయక సంఘాలకు గడిచిన మూడేళ్లలో బ్యాంకులు రూ.5,423 కోట్లు రుణం మంజూరు చేస్తే అందులో సగటున 99.62 శాతం చెల్లింపులు జరిగాయి. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 47,358 సంఘాలకు బ్యాంకులు రూ.1,587 కోట్ల రుణం మంజూరు చేస్తే 99.61 శాతం చెల్లించారు. 2020–21లో 59,849 సంఘాలకు రూ.1,726 కోట్ల రుణం ఇవ్వగా చెల్లింపులు 99.60 శాతం ఉన్నాయి. 2021–22లో 55,221 సంఘాలకు రూ.2,110 కోట్లు రుణం మంజూరు చేస్తే చెల్లింపులు 99.65 శాతం జరిగాయి. రూ.387.01 కోట్ల సున్నా వడ్డీ స్వయం సహాయక సంఘాలు నిర్వహించుకుంటూ ఆర్థికాభివృద్ధి కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటున్న అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా ప్రభుత్వమే భరిస్తోంది. వైఎస్సార్ సున్నావడ్డీ పథకం కింద 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.137.72 కోట్లు, 2020–21లో రూ.118.35 కోట్లు, 2021–22లో రూ.130.25 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. సీఎంకు రుణపడి ఉంటాం మహిళల అర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి రుణపడి ఉంటాము. మా సంఘం ద్వారా ప్రతిసారి రూ.5 లక్షల రుణం తీసుకుంటున్నాం. సకాలంలో కంతులు కడుతున్నాం. మేము తీసుకున్న రుణానికి వడ్డీని ప్రభుత్వం సున్నావడ్డీ పథకం ద్వారా చెల్లిస్తోంది. ఇదే కాకుండా మహిళల అభ్యున్నతికి ముఖ్యమంత్రి ఎంతో చేస్తున్నారు. – సునీత, సత్యసాయి మహిళా సంఘం, అనంతపురం సక్రమంగా చెల్లిస్తున్నాం మా సంఘంలో పది మంది సభ్యులం ఉన్నాము. ఇటీవలనే బ్యాంకు నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాం. తొలి నుంచి కంతులు సక్రమంగా చెల్లిస్తుండడంతో అడిగిన వెంటనే బ్యాంకు అధికారులు రుణం ఇస్తున్నారు. ఈ అప్పు తీరిన వెంటనే రూ.20 లక్షలు మంజూరు చేస్తామని అధికారులు చెప్పారు. సున్నావడ్డీ పథకం ద్వారా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మహిళలను ప్రోత్సహిస్తుండడం చాలా సంతోషంగా ఉంది. – సుమంగళమ్మ, నైథిలి మహిళా సంఘం, బ్రహ్మసముద్రం రికవరీ సంతృప్తికరం మహిళలు తీసుకున్న రుణం సకాలంలో చెల్లిస్తున్నారు. దీంతో వారు అడిగిన వెంటనే బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. రుణాల రికవరీ 95 నుంచి 99 శాతంతో సంతృప్తికరంగా ఉంది. సంఘాలకు రుణం మంజూరు, చెల్లింపు విషయంలో సెర్ప్, మెప్మా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారు. దీంతో చెల్లింపులు బాగుంటున్నాయి. – బి.నాగరాజరెడ్డి, ఎల్డీఎం బాధ్యతగా రుణ చెల్లింపులు బ్యాంక్ లింకేజీ ద్వారా తీసుకున్న రుణాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు బాధ్యతగా చెల్లిస్తున్నారు. ఏటా లక్ష్యానికి మించి బ్యాంకులు రుణం ఇస్తున్నాయి. ఏదేని సంఘం రుణం సకాలంలో చెల్లించకపోతే అది సున్నావడ్డీ పథకానికి అర్హత కోల్పోతుంది. ఈ నేపథ్యంలో రుణం మంజూరు చేయించడంతో పాటు వారు సక్రమంగా చెల్లించే విషయంలో సెర్ప్ సిబ్బంది ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ బ్యాంకుల సంపూర్ణ సహకారం పట్టణ స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ ద్వారా రుణం మంజూరు చేయడంలో బ్యాంకులు సంపూర్ణంగా సహకరిస్తున్నాయి. రుణం తీసుకున్న సంఘ సభ్యులూ బాధ్యతగా సకాలంలో చెల్లిస్తున్నారు. ఇక నారీశక్తి కింద మహిళలకు యూనియన్ బ్యాంక్ రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. – విజయలక్ష్మి, పీడీ, మెప్మా -
AP: వ్యాపారవేత్తలుగా ‘పొదుపు’ మహిళలు
సాక్షి, అమరావతి: మహిళల పొదుపు సంఘాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేస్తోంది. పది నుంచి పన్నెండు మంది చొప్పున ఉండే ప్రతి పొదుపు సంఘంలో కనీసం ఇద్దరిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణను సిద్ధంచేసింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 8.42 లక్షల పొదుపు సంఘాలు ఉండగా, ఒక్కో సంఘంలో ఆసక్తి, ఉత్సాహం ఉన్న ఇద్దరేసి చొప్పున మొత్తం 16,84,026 మంది మహిళలను గుర్తించి, వారిని పూర్తిస్థాయిలో వ్యాపారవేత్తలుగా తయారుచేసేలా ప్రణాళికను రూపొందించింది. ఇలా గుర్తించిన వారికి ‘రూరల్ డెవలప్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ (ఆర్యూడీఎస్ఈటీ)లో శిక్షణ పొందిన నిపుణుల ద్వారా ఆరు ప్రధాన అంశాలపై తర్ఫీదు ఇస్తారు. మహిళల్లో పూర్తిస్థాయి ఆర్థిక చైతన్యం కల్పించడం ద్వారా ఆయా కుటుంబాలకు సుస్థిర ఆదాయం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా.. వైఎస్సార్ ఆసరా, చేయూత తదితర పథకాల ద్వారా ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు నేరుగా ఆర్థిక లబ్ధిని చేకూర్చి, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు పలు బహుళజాతి కంపెనీలతో ఒప్పందం కూడా చేసుకుంది. రూ.30 వేల కోట్ల రుణ లక్ష్యం ఇక సకాలంలో రుణాలు చెల్లించిన 5.34 లక్షల పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరోసారి రూ.30 వేల కోట్ల రుణం అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) లక్ష్యంగా నిర్ధేశించుకుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలపై బ్యాంకర్ల సంఘం ఆమోదం తెలిపింది. మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా రూ.9,800 కోట్లు దాకా పొదుపు చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న తమ డబ్బును మహిళలు నామమత్రం వడ్డీ వచ్చే పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ఉంచుకుని.. అదే బ్యాంకుల నుంచి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంటున్నాయి. కానీ, అలాకాకుండా మహిళలు తాము పొదుపు చేసుకున్న సొమ్మును అవసరాల మేరకు తీసుకుని ఆ తర్వాత అదనంగా అవసరమయ్యే మొత్తాన్ని బ్యాంకు రుణం పొందడం ద్వారా పెద్దగా అప్పుచేయాల్సిన అవసరం ఉండదని.. బ్యాంకులు ఇందుకు అనుమతివ్వాలని సీఎం జగన్ బ్యాంకర్ల సమావేశంలో ప్రతిపాదించారు. ఇందుకు బ్యాంకులు సానుకూలంగా స్పందించాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
పెరటి కోళ్లతో జీవనోపాధి.. 10 వేల యూనిట్లు టార్గెట్
ఒకప్పుడు పల్లెల్లోనే నాటు కోళ్లు సందడి చేసేవి. కోడి కూతతోనే గ్రామాల్లో ప్రజలు మేల్కొనేవారు. ప్రతీ ఇంట్లో 10 నుంచి 15 కోళ్లు ఉండేవి. నాటు కోడి గుడ్లు, మాంసంతో వారి జీవనోపాధికి చేదోడుగా నిలిచేవి. ప్రజలకు ఆరోగ్యపరంగా.. ఆర్థికంగా దన్నుగా నిలిచిన వీటి పెంపకం క్రమంగా తగ్గుతూ వచ్చింది. పల్లెలో పట్టణ వాతావరణం వ్యాపించడంతో వీటి స్థానంలో బ్రాయిలర్ కోళ్లు మార్కెట్లోకి వచ్చేశాయి. ఒకవైపు నాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ.. మరోవైపు డ్వాక్రా మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు పెరటి కోళ్ల పంపిణీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్ క్రాంతి పథం ద్వారా జిల్లాలో పదివేల యూనిట్లు అందజేసే లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. చీమకుర్తి(ప్రకాశం జిల్లా): డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెరటి కోళ్ల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లో ఆసక్తి చూపే మహిళలకు రూ.4800 విలువ చేసే పెరటి కోళ్ల యూనిట్‌ను వడ్డీ లేని రుణం కింద అందించనుంది. ఒక్కో యూనిట్ కింద 9 కోడి పెట్టలు, 3 కోడిపుంజులు, వాటి పెంపకానికి అవసరమైన 30 కేజీల దాణాను మొత్తం కలిపి కూడా రూ.4800కే అందిస్తోంది. 9 కోడిపెట్టలు వరుసగా 100 గుడ్లు వరకు పెడుతుంది. రెండేళ్ల తర్వాత ఒక్కో కోడి కనీసం 2 కేజీల మాంసం అందిస్తుంది. ఈ విధంగా 12 కోళ్ల ద్వారా 24 కేజీల మాంసం వస్తుంది. నాటుకోడి కేజీ మాంసం ధర రూ.400 పలుకుతుందని అధికారుల అంచనా. ఇలా 24 కేజీల నుంచి రూ.9,600 ఆదాయం వస్తుంది. అలాగే కోడిగుడ్లు, మాంసంతో కలిపి రెండేళ్లలో కనీసం రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. వచ్చిన ఆదాయంలో వైఎస్సార్ క్రాంతి పథం గ్రూపులకు 24 లేక 36 వాయిదాలలో వడ్డీ లేకుండా రుణం కింద ఇచ్చిన రూ.4800ను నెల నెలా చెల్లించగా, ఇంకా దాదాపు రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు లాభసాటిగా ఉంటుంది. అనంతపురం నుంచి దిగుమతి డ్వాక్రా మహిళలకు పెరటి కోళ్ల పెంపకం ద్వారా అందించే నాటుకోళ్లను అనంతపురంలోనున్న ఎస్సెల్ బ్రీడ్ కంపెనీ వారి ద్వారా దిగుమతి చేస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి కనీసం 10 వేల యూనిట్లను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో పెరటి కోళ్ల పెంపకంతో పాటు పొట్టేళ్లు, మేకలను కూడా ఒక్కో కుటుంబానికి ఒక యూనిట్‌ను అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని పీడీ తెలిపారు. జీవనోపాధికి ఇప్పటికే పలు పథకాలు జిల్లాలో డీఆర్డీఏ సంస్థ ద్వారా వైఎస్సార్ క్రాంతి పథకం నుంచి గ్రామాల్లోని స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళల జీవనోపాధి కోసం ఇప్పటికే పలు పథకాల ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తూ వారి జీవనోపాధిని పెంచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దానికోసం డీఆర్డీఏలో ఉన్న సుమారు రూ.200 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ద్వారా వడ్డీ లేని రుణాలను అందిస్తోంది. దానిలో భాగంగా స్త్రీనిధి, ఉన్నతి (ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్), సీఐఎప్ (కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్), హెచ్‌డీఐఎఫ్ (హ్యూమన్ డెవలప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్) పథకాలను అందిస్తోంది. స్త్రీనిధితో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయల వరకు జీవనోపాధి పెంపునకు అందిస్తుంది. వాటి ద్వారా గొర్రెలు, గేదెలను పెంచుకోవచ్చు. ఉన్నతి పథకం కేవలం ఎస్సీ, ఎస్టీ మహిళలకు మాత్రమే సబ్‌ప్లాన్ పథకం నుంచి అందిస్తారు. ఈ పథకం ద్వారా గరిష్టంగా ఒక్కో వ్యక్తికి రూ.50 వేల వరకు రుణ సదుపాయం వడ్డీలేకుండానే అందిస్తారు. సీఐఎఫ్ పథకం ద్వారా గరిష్టంగా రూ.50 వేలను ఇస్తారు. అయితే ఆరోగ్య సమస్యల పరిష్కారానికి కేటాయించాల్సి ఉంటుంది. హెచ్‌డీఐఎఫ్ ద్వారా గరిష్టంగా రూ.50 వేలను హెల్త్ యాక్టివిటీ కింద ముందుగానే ఎంపిక చేసిన 15 మండలాల్లో మాత్రమే అందిస్తున్నారు. వాటితో పాటు వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ తోడు వంటి పథకాలు మహిళలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 10 వేల యూనిట్ల వరకు పంపిణీకి సిద్ధం జిల్లాలోని 38 మండలాల్లో రానున్న ఏడాది లోపు 10 వేల యూనిట్లను పంపిణీ చేసేందుకు వైఎస్సార్ క్రాంతిపథం సిద్ధమవుతోంది. మొదటి విడతగా 4 వేల యూనిట్లను ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు పూర్తి చేయాలని కంకణం కట్టుకుంది. దానిలో భాగంగా ఇప్పటికే చీమకుర్తి, సంతనూతలపాడు, మద్దిపాడు, వెలిగండ్ల, హనుమంతునిపాడు, కనిగిరి మండలాల్లో దాదాపు 600 యూనిట్లకు పైగా పంపిణీ చేశారు. 10 వేల యూనిట్ల పెరటి కోళ్లు అందించేందుకు చర్యలు జిల్లాలో పెరటి కోళ్ల పెంపకానికి సంబంధించిన 10 వేల యూనిట్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో యూనిట్ ద్వారా 9 కోడిపెట్టలు, 3 కోడిపుంజులు, 30 కేజీల దాణాలను అందిస్తున్నాం. ఈ సంవత్సరం 4 వేల యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే 6 మండలాల్లో అందించాం. త్వరలో పొట్టేళ్లు, మేకలను కూడా అందించేందుకు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నాం. – బీ.బాబూరావు, పీడీ, డీఆర్డీఏ, ఒంగోలు మా కుటుంబంలోనే 4 యూనిట్లను తీసుకున్నాం జగనన్న పేద మహిళల ఆదాయాన్ని పెంచుకునేందుకు తీసుకొచ్చిన పెరటి కోళ్ల పెంపకం మాకెంతో ఉపయోగకరంగా ఉంది. మా కుటుంబంలోనే నాతో పాటు నా కుమార్తె, కోడలు వేరువేరుగా 4 యూనిట్లను తీసుకున్నాం. మా ఎస్సీ కాలనీలో మొత్తం 30 యూనిట్లను ఇచ్చారు. పెరటి కోళ్ల వలన గుడ్లు, మాంసం ద్వారా ఆదాయం వస్తుంది. కుటుంబంలో జీవనోపాధి పెరగటమే కాకుండా ఖర్చులకు ఉపయోగపడుతుంది. – జంగాల లలిత కుమారి, ఆశాజ్యోతి గ్రూపు, మద్దులూరు, సంతనూతలపాడు -
సాధికారతకు సరికొత్త మార్కు
రాష్ట్రంలో మహిళల ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా ప్రభుత్వం సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతోంది. స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)ను మరింత బలోపేతం చేసేందుకు వాటి పనితీరును బట్టి గ్రేడింగ్‌లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 12 అంశాల్లో 100 మార్కులు కేటాయించి, దాని ఆధారంగా గ్రేడింగ్ ఇస్తారు. రుణాల మంజూరులో గ్రేడ్‌ను ప్రామాణికంగా తీసుకుంటారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 77,479 గ్రూపులకు గ్రేడింగ్ ఇస్తున్నారు. ఏలూరు (టూటౌన్): స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని తీసుకువచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి సంఘాల పనితీరును పరిగణనలోనికి తీసుకొనే కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. సంఘాల పనితీరును బట్టి గ్రేడ్లు కేటాయిస్తారు. మొత్తం 12 అంశాల ప్రాతిపదికగా వంద మార్కులతో ఏ,బీ,సీ,డీ గ్రేడ్లుగా విభజించి వాటి ఆధారంగా రుణాలు మంజూరు చేయనున్నారు. మంచి గ్రేడ్లు ఉంటేనే అనుకున్న రుణాలు అందుతాయి. ఈ విధానంతో పొదుపు సంఘాల సమావేశాలు నిర్వహణ, అప్పుల వసూలు, రుణాల చెల్లింపులు తదితర పనులన్నీ పారదర్శకంగా జరుగనున్నాయి. బ్యాంకు రుణాలతో ఊతం గ్రామీణ ప్రాంతాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), పట్టణ ప్రాంతాల్లో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు అందిస్తున్నారు. వీటితో పాటు అదనంగా వ్యాపారాలు చేసుకునే మహిళలకు స్త్రీ నిధి ద్వారా ప్రత్యేకంగా రుణాలు అందజేస్తున్నారు. సంఘాలను బలోపేతం చేసేలా డీఆర్డీఏ, వైఎస్సార్ క్రాంతి పథం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఇకనుంచి అన్ని సంఘాలకు గ్రేడింగ్ విధానం అమలు చేయనున్నారు. 8.05 లక్షల మంది.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 79,624 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 8,05,458 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడాది మార్చి 22న 76,846 గ్రూపులకు గ్రేడింగ్‌లు ఇచ్చారు. మరో 2,145 గ్రూపుల సమావేశాల చిత్రాలు అప్లోడ్ చేయలేదని గుర్తించారు. ఆయా సంఘాలకు సెర్ప్, స్త్రీనిధి ద్వారా బ్యాంకు రుణాలు అందజేస్తున్నారు. మార్కుల ఆధారంగా గ్రేడింగ్ డ్వాక్రా సంఘాల నిర్వహణ తీరు, సమావేశాలు చిత్రాలను ప్రత్యేక పోర్టల్‌లో అప్లోడ్ చేయాలి. దీంతో సంఘంలో ఏం జరుగుతుందో ప్రతి సభ్యు రాలు తెలుసుకునేందుకు వీలుంటుంది. సంఘాల పనితీరును బట్టి గ్రేడింగ్ ఇస్తున్నారు. తద్వారా వెనుకంజలో ఉన్న సంఘాలను బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. మార్కులు ఆధారంగా 80 శాతం దాటితే ఏ, 55 నుంచి 80 శాతం ఉంటే బీ, 55 నుంచి 30 శాతం ఉంటే సీ, 30 శాతంలోపు ఉంటే డీ గ్రేడ్ ఇచ్చారు. మార్కుల కేటాయింపు ఇలా.. పొదుపు సంఘాల కార్యక్రమాల నిర్వహణ ఆధారంగా మార్కులు కేటాయించనున్నారు. క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణకు 5, సభ్యుల హాజరుకు 10, క్రమం తప్పని పొదుపునకు 10, పొదుపు పుస్తకాల నిర్వహణకు 7, అప్పుల వసూలుకు 8, సీఐఎఫ్ వసూలుకు 10, స్త్రీనిధి వసూలుకు 10, ఇతర వసూళ్లకు 5, బ్యాంకు రుణాల వాయిదాల చెల్లింపునకు 10, గ్రామ సంఘం రుణ వసూలుకు 10, సంఘం నుంచి బ్యాంకు చెల్లింపులకు 10, మండల సమైక్య చెల్లింపులకు 5 చొప్పున మార్కులు ఇస్తారు. పొదుపు సంఘాలపై ప్రత్యేక దృష్టి డ్వాక్రా సంఘాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. క్రమం తప్పకుండా సమావేశాలు, పొదుపు పుస్తకాల నిర్వహణ, సభ్యుల హాజరు వంటివి ప్రామాణికంగా తీసుకుంటారు. సంఘాల పనితీరును బట్టి 12 అంశాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయిస్తాం. – వై.రామకృష్ణ, పీడీ, డీఆర్డీఏ, ఏలూరు -
ఆదాయం.. ఆరోగ్యం
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: గ్రామీణ మహిళల్లో పౌష్టికాహార లోపం కారణంగా రక్తహీనత, అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. మహిళలకు ఆరోగ్యం, వారి ఆర్థిక స్థితిని పెంచేందుకు ‘పెరటి కోళ్ల పెంపకం’ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలకు పెరటికోళ్ల పెంపకం యూనిట్లను అందజేశారు. నాటు కోళ్ల పెంపకంపై మహిళలకు శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లాలో 2,566 యూనిట్లు జిల్లాలో పెరటి కోళ్ల పథకాన్ని సెర్ప్ ఈ ఏడాది జనవరిలో ప్రారంభించింది. ఇప్పటి వరకు 2,566 యూనిట్లను అందజేసింది. ఒక్కొక్కటి కిలో నుంచి 1,200 గ్రాములు ఉండే 8 పెట్టలు, 3 పుంజులు (జిల్లా వాతావరణానికి తట్టుకునే హసిల్ క్రాస్), 30 కిలోల దాణా, మెడికల్ కిట్ (డీవార్మింగ్, ఇమ్యునోబూస్టర్, మల్టీ విటమిన్స్, మినరల్స్, యాంటీబయాటిక్స్)ను ఒక యూనిట్‌గా నిర్ణయించింది. యూనిట్ ధర విషయానికి వస్తే కోళ్ల విలువ రూ.2,640, దాణా విలువ రూ.1,100, మెడికల్ కిట్ రూ.155, రవాణా ఖర్చు రూ.75గా మొత్తం కలిపి రూ.3,970. నాటు కోళ్లకు మంచి గిరాకీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ ఉంది. వీటి మాంసం కిలో రూ.500 వరకు పలుకుతోంది. ఒక్కో కోడి పెట్ట ఏ డాదికి 180 గుడ్లు పెడుతుంది. సెర్ప్ ఇస్తున్న 8 పె ట్టల ద్వారా ఏడాదికి 1,440 గుడ్లు లభిస్తాయి. మార్కెట్లో నాటు కోడి గుడ్డు ధర రూ.8 పలుకుతోంది. ఈ గుడ్లు వెయ్యి విక్రయించినా ఏడాదికి రూ.8 వేల ఆదాయం వస్తుంది. గుడ్లను పొదిగించడం ద్వారా కోళ్ల ఉత్పత్తి పెంచుకోవచ్చు. సగటున ఏడాదికి 500 కోళ్లు అమ్మినా రూ.2.50 లక్షలు ఆదాయం పొందవచ్చు. ప్రయోజనం చేకూర్చే పథకం మహిళ ఆరోగ్యం, ఆర్థిక స్థితి పెంపునకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెరటి కోళ్ల పెంపకం చాలా మంచి పథకం. జిల్లాలో ఇప్పటి వరకు 2,566 యూనిట్లను ఏర్పాటు చేశాము. ఈ పథకం ద్వారా మహిళలు ఆదాయం పొందడమే కాకుండా పౌష్టిక విలువ అధికంగా ఉన్న నాటుకోడి గుడ్డును తినడం ద్వారా రక్తహీనత వంటి సమస్యలు తొలగి ఆరోగ్యంగానూ ఉంటారు. – ఐ.నరసింహారెడ్డి, పీడీ, సెర్ప్ -
పండుగలా ‘వైఎస్సార్ ఆసరా’ వారోత్సవాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైఎస్సార్ ఆసరా వారోత్సవాలు పండుగ వాతావరణంలో సాగుతున్నాయి. మహిళలు ఊరూరా సభలు పెట్టి సీఎం వైఎస్ జగన్ ఫొటోలకు పాలాభిషేకం చేస్తూ తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల్లోని మహిళల పేరుతో ఉన్న బ్యాంకు అప్పును ప్రభుత్వమే భరిస్తూ, ఆ మొత్తాన్ని వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా నాలుగు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న విషయం తెలిసిందే. రెండో విడతకు సంబంధించి ఈ నెల ఏడో తేదీ నుంచి పది రోజులపాటు సంబంధిత సంఘాల ఖాతాలకు ప్రభుత్వం డబ్బులు జమచేస్తుంది. 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439 కోట్లు రాష్ట్రవ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రెండో విడత కింద రూ.6,439.52 కోట్లు అందజేయడానికి సర్కారు ఏర్పాట్లుచేయగా.. బద్వేలు ఉప ఎన్నికల కారణంగా వైఎస్సార్ కడప జిల్లాలో పంపిణీ వాయిదా పడింది. మిగిలిన 12 జిల్లాల పరిధిలో 7.55 లక్షల సంఘాలకు సంబంధించి 74.81 లక్షల మంది మహిళలకు రూ.6,099 కోట్లు అందిస్తున్నారు. ఇది ఈ నెల 18 వరకు కొనసాగుతుంది. గత నాలుగు రోజులుగా 12 జిల్లాల పరిధిలోని పొదుపు మహిళలకు రూ.3,249.19 కోట్లు పంపిణీ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడిలో జరిగిన వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ సందర్భంగా డ్వాక్రా మహిళలతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ ప్రజాప్రతినిధులతో మహిళల ముఖాముఖి ఇక పంపిణీ పూర్తయిన మండలాల్లో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్, ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో లబ్ధిదారుల ముఖాముఖీ జరిగాయి. 7న 63 మండలాల్లో, 8న 83 మండలాలు, 9న 77 మండలాలు, 10న 63 మండలాల్లో.. 11న 64 మండలాల్లో ఈ కార్యక్రమాలు జరిగాయి. డ్వాక్రా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తానని నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఆయన మోసం చేసిన తీరు.. ఇప్పుడు సీఎం జగన్ క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న వైనంపై ఈ ముఖాముఖిలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. మహిళల వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ పొదుపు సంఘాల పేరిట ప్రభుత్వం జమ చేస్తున్న డబ్బులు వెంటనే ఆ సంఘంలోని సభ్యులందరి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో విడివిడిగా జమ చేసేందుకు క్షేత్రస్థాయిలో సెర్ప్, మెప్మా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ నెల 17 నుంచి మరో వారం పది రోజులపాటు లబ్ధిదారులందరినీ కలిసి వారికి డబ్బులు ముట్టాయా లేదా అన్న వివరాలను కూడా ఈ–కేవైసీ విధానంలో ధృవీకరించుకునేందుకు కూడా ఏర్పాట్లు చేశాం. – ఇంతియాజ్, సెర్ప్ సీఈఓ -
పొదుపులో ఏపీ మహిళలే టాప్
సాక్షి, అమరావతి: రెండేళ్ల క్రితం తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీలు) ఇపుడు దేశంలో నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల పనితీరుపై నాబార్డు రూపొందించిన నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. 2019–20లో ఏపీ స్వయం సహాయక సంఘాలు పొదుపులో దక్షిణాది రాష్ట్రాల్లో నంబర్ వన్ స్థానంలో నిలవగా... 2020–21లో ఏకంగా దేశంలో కెల్లా అగ్రస్థానం సాధించడం గమనార్హం. స్వయం సహాయక సంఘాల మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లనే ఇది సాధ్యమైందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పొదుపు పెరగడమే కాదు అప్పులూ తగ్గాయి స్వయం సహాయక సంఘాల పొదుపు పెరగడమే కాదు వారి అప్పులు కూడా తగ్గాయని నాబార్డు నివేదిక పేర్కొంది. 2019–20తో పోల్చితే 2020–21లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘాల పొదుపు ఏకంగా రూ.4,153.37 కోట్లు పెరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పొదుపులో మన రాష్ట్ర సంఘాల పొదుపు 29.17 శాతం ఉండటం గమనార్హం. ఇక ఇదే సమయంలో అప్పులు రూ.5,940.97 కోట్ల మేర తగ్గాయి. ఈ రెండేళ్లలో ‘వైఎస్సార్ ఆసరా’ పథకాన్ని అమలు చేయడంతో పాటు సకాలంలో రుణాల కిస్తీలను చెల్లించిన సంఘాలకు సున్నా వడ్డీ రాయితీలను అక్కచెల్లెమ్మల ఖాతాలకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దీంతో మహిళా సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి. పొదుపు పెరగడం, అప్పులు తగ్గడంతో పురోగతి సాధించాయి. 2019 – 20లో రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల క్రెడిట్ లింకేజీ 61.9 శాతం ఉండగా.. 2020–21లో 69.12 శాతానికి పెరిగినట్లు నాబార్డు నివేదిక స్పష్టం చేసింది. పొదుపు సంఘాలు జీవం పోసుకున్నాయిలా.. స్వయం సహాయక సంఘాల రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారం చేపట్టిన అనంతరం చంద్రబాబు పైసా మాఫీ చేయకపోగా చివరికి సున్నా వడ్డీకి కూడా ఎగనామం పెట్టారు. ఫలితంగా స్వయం సహాయక సంఘాలు అప్పుల ఊబిలో కూరుకుపోవడమే కాకుండా ఆ సంఘాల రుణాలు భారీ ఎత్తున నిరర్ధక ఆస్తులుగా మారిపోయాయి. గత సర్కారు తీరుతో స్వయం సహాయక సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని రెండేళ్లలోనే అమలు చేయడంతో స్వయం సహాయక సంఘాలు జీవం పోసుకున్నాయి. గత ఎన్నికల సమయానికి వారికున్న రుణాలను 4విడతల్లో చెల్లిస్తామని చెప్పిన మాట ప్రకారం సీఎం జగన్ ఇప్పటికే ఒక విడతలో 87.74 లక్షల మంది మహిళలకు రూ.6,792.21 కోట్లు అందచేశారు. అంతేకాకుండా సకాలంలో రుణాలు చెల్లించిన సంఘాల్లోని 87 లక్షల మందికి పైగా మహిళలకు సున్నా వడ్డీ కింద 2019–20లో రూ.1,400.8 కోట్లను చెల్లించారు. 2020–21లో సున్నా వడ్డీ కింద 1.02 కోట్ల మంది మహిళలకు రూ.1,109 కోట్లను చెల్లించారు. దీంతో స్వయం సహాయక సంఘాల కార్యకలాపాలు ఊపందుకున్నాయి.ఆసరా, సున్నావడ్డీతోపాటు చేయూత పథకం కూడా మహిళలు నిలదొక్కుకోవడానికి దోహదపడుతోంది. అలాగే రిసోర్స్ పర్సన్స్‌కి జీతాలు పెంచి మోటివేట్ చేయడమే కాక.. స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారాల్లో రాణించి ఆర్థికంగా ఎదిగేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వారికి చేదోడువాదోడుగా నిలుస్తోంది. -
డ్వాక్రా మహిళల బ్యాంక్ లింకేజీ రుణాలు.. రూ. 22 లక్షల నిధులు స్వాహా
సాక్షి, మరిపెడ ( జయశంకర్ భూపాలపల్లి): డ్వాక్రా మహిళలకు చెందాల్సిన బ్యాంక్ లింకేజీ రుణాలు రూ.లక్షల్లో స్వాహా గురయ్యాయి. పోగు చేసుకున్న పొదుపు డబ్బులో ఏకంగా రూ.22లక్షలను ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్(వీఓఏ) భర్త కాజేశాడు. ఈ విషయం బయటపడడంతో మహిళలు ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనకు దిగిన ఘటన మరిపెడ మండలం ఉల్లెపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఉమ్మడి ఉల్లెపల్లిలో 38 పొదుపు సంఘాలు ఉండగా, ఇదే గ్రామానికి చెందిన వీఓఏ గోరెంట్ల రాణి బదులు ఆమె భర్త విష్ణు విధులు నిర్వర్తిస్తున్నారు. తొలుత అందరితో నమ్మకంగా మెదిలిన ఆయన బ్యాంకు లింకేజీ రుణాల్లోని కొంత మొత్తాన్ని తన ఖాతాల్లో వేసుకున్నాడు. ఈ విషయంపై అనుమానంతో సర్పంచ్ చిర్రబోయిన ప్రభాకర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా 17 సంఘాలకు చెందిన రూ.22 లక్షలు వీఓఏ భర్త మాయం చేసినట్లు తేలడంతో గురువారం ఆయనను గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించి ఆందోళనక చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు చేరుకుని మహిళలను సముదాయించి విష్ణును పోలీస్ స్టేషన్ తరలించారు. చదవండి: దేశంలో పెరిగిన కరోనా కేసుల రికవరీలు.. తగ్గిన మరణాలు -
పొదుపు.. కొత్త మలుపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే డ్వాక్రా మహిళల పొదుపు బిలియన్ డాలర్లను దాటేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బిలియన్ డాలర్లకు ప్రత్యేక స్థానం ఉంది. బిలియన్ డాలర్ల మూల ధన నిధి.. అంటే ప్రస్తుత ధరల ప్రకారం రూ.7,324 కోట్లు. ఈ మేరకు మూల ధన నిధి ఉండే కంపెనీలకు వ్యాపార రంగంలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని పొదుపు సంఘాల మహిళలు పొదుపు చేసుకున్న మొత్తం ప్రస్తుతం రూ.8,706 కోట్లకు చేరింది. సంఘాలలో సభ్యులుగా ఉండే మహిళలు ప్రతి నెలా వంద రూపాయల చొప్పున తప్పనిసరిగా పొదుపు చేసుకోవాలన్న నిబంధన ఉంది. రాష్ట్రంలో పొదుపు సంఘాల వ్యవస్థ మొదలైన కొత్తలో రోజుకు ఒక రూపాయి చొప్పున నెలకు రూ.30 పొదుపు చేసుకునేవారు. క్రమంగా ఆ మొత్తం రూ.వందకు పెరిగింది. సంఘంలో ఎంత మంది సభ్యులు ఉంటే అంతమంది ప్రతి నెలా సమావేశమై, తమ స్థితిగతులను చర్చించుకుంటారు. అందరి సభ్యుల పొదుపును పోగు చేసి, సంఘం పేరిట బ్యాంకులో పొదుపు ఖాతాల్లో జమ చేసుకుంటారు. ఈ మొత్తానికి తోడు సంఘ సభ్యుల రుణ చెల్లింపుల రికార్డు ఆధారంగా బ్యాంకులు ఆయా సంఘాలకు తిరిగి కొత్త రుణాలు మంజూరు చేస్తుంటాయి. గత ప్రభుత్వ తీరుతో డీలా ఒక్క ఏప్రిల్ నెలలోనే మహిళలు రూ.81.76 కోట్ల మొత్తాన్ని పొదుపు చేసుకున్నారు. గత రెండేళ్లుగా ప్రతి నెలా రూ.70 కోట్లకు తగ్గకుండా పొదుపు చేసుకుంటున్నారు. అయితే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014 జూన్ తర్వాత నుంచి 2016 మార్చి మధ్య చాలా నెలల పాటు గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా రూ.7 లక్షల చొప్పున మాత్రమే పొదుపు చేసుకునే పరిస్థితి ఉండేది. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలొకి వచ్చాక హామీని గాలికి వదిలేశారు. దీంతో అప్పట్లో పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. దీంతో మహిళలు పొదుపు పట్ల ఆసక్తి చూపలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక, పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాలను అమలు చేయడంతో వారు కార్యకలాపాల్లో తిరిగి చురుగ్గా పాల్గొంటున్నారు. పొదుపు డబ్బును వినియోగించుకోవచ్చు.. పొదుపు సంఘాల మహిళలు ప్రతి నెలా దాచుకున్న డబ్బు ఇప్పటి వరకు బ్యాంకులో పొదుపు ఖాతాల్లో నిరుపయోగంగా ఉంటున్నట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. వారు దాచుకున్న డబ్బు రూ.8,706 కోట్లు ఉన్నా, వారు ఆ డబ్బును అలానే తక్కువ వడ్డీ వచ్చే పొదుపు ఖాతాలో ఉంచి, అధిక వడ్డీకి ఆవే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. వారి పొదుపు డబ్బుకు 4 శాతం వడ్డీ వస్తుండగా, వారు బ్యాంకుల నుంచి 10 శాతం వడ్డీకి రుణాలు తీసుకుంటున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ఇక నుంచి మహిళలు తమ పొదుపు సంఘంలో దాచుకున్న మొత్తాన్ని మొదట సంఘంలో డబ్బు అవసరం ఉన్న మహిళలకు అప్పుగా ఇచ్చిన తర్వాతే ఇతరులకు అవసరం మేరకు బ్యాంకుల నుంచి రుణం తీసుకునేలా సెర్ప్ అధికారులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. బ్యాంకులు కూడా పొదుపు సంఘాలలో డబ్బులను ష్యూరిటీగా ఉంచుకొని ఆయా సంఘాలకు కావాల్సిన మొత్తం రుణం ఇవ్వడం పరిపాటిగా కొనసాగుతోంది. కాగా, రుణ పంపిణీకి ఇబ్బంది లేకుండా పొదుపు సంఘాల మహిళలు తమ పొదుపు ఖాతాలో ఉన్న మొత్తాలను తొలత తమ అవసరాలకు ఉపయోగించుకోవడానికి వీలుగా ఎస్బీఐ, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, డీసీసీబీ బ్యాంకులు ఇప్పటికే అంగీకారం తెలిపినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంత పొదుపు సంఘాలు ప్రస్తుతం వివిధ బ్యాంకుల నుంచి దాదాపు రూ.28 వేల కోట్ల రుణాలు తీసుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పొదుపు సంఘాలు దాచుకున్న రూ.8,706 కోట్లను వారి అవసరాలకు ఉపయోగించుకునేందుకు వీలు కల్పించడం ద్వారా మహిళలు బ్యాంకు రుణాలపై ఆధార పడే పరిస్థితి తగ్గుతుంది. ఆయా సంఘాల మూల ధన నిధి మరింత పెరిగే అవకాశం ఉంది. -
‘పరపతి’ పెంచుకున్న అక్కచెల్లెమ్మలు
సాక్షి, అమరావతి: స్వయం సహాయక సంఘాల్లోని మహిళల పరపతి పెరుగుతోంది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న పొదుపు సంఘాల మహిళలు ఇప్పుడు క్రమం తప్పకుండా రుణ వాయిదాలు చెల్లిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినా సకాలంలో వాయిదాలు చెల్లించే మహిళల సంఖ్య అంతకు ముందు సంవత్సరం కంటే దాదాపు 6 లక్షలు పెరిగినట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు నిర్ధారించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో 8,78,874 సంఘాల పేరిట తీసుకున్న రుణాలకు సంబంధించి ఆయా సంఘాల్లో సభ్యులుగా ఉండే మహిళలు సక్రమంగా వాయిదాలు చెల్లించగా.. 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9,34,852 సంఘాలకు చెందిన మహిళలు సకాలంలో రుణ కిస్తీ చెల్లించినట్టు సెర్ప్ అధికారులు వెల్లడించారు. తెలుగుదేశం ప్రభుత్వం నాటి పరిస్థితులతో పోలిస్తే 20 లక్షల మందికి పైగా మహిళలు సక్రమంగా రుణ కిస్తీలు చెల్లిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. సున్నా వడ్డీ, వైఎస్సార్ ఆసరా పథకాలతో... గత టీడీపీ ప్రభుత్వ నిర్ణయాల కారణంగా సంఘాల్లో ప్రతి నెలా చేసుకోవాల్సిన పొదుపును కూడా మహిళలు పూర్తిగా పక్కన పెట్టేయాల్సిన పరిస్థితి దాపురించింది. దీంతో కొంత కాలంపాటు రాష్ట్రంలో డ్వాక్రా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా చేపట్టిన చర్యలతో మహిళలు మళ్లీ పొదుపు సంఘాల కార్యకలాపాలలో క్రియాశీలకంగా పాల్గొనడం పెరిగిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పొదుపు సంఘాల మహిళలు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలపై వడ్డీని ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా చెల్లించడంతో పాటు పొదుపు రుణ వ్యవహారాలు యథావిధిగా కొనసాగేలా చర్యలు చేపట్టారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట బ్యాంకుల్లో ఉన్న రుణ మొత్తాలను నాలుగు విడతల్లో మహిళలకు నేరుగా చెల్లించే వైఎస్సార్ ఆసరా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇప్పటివరకు వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ పథకాల ద్వారానే పొదుపు సంఘాల మహిళలకు దాదాపు రూ.10 వేల కోట్ల మేర ఆర్థిక లబ్ధి చేకూరింది. ఈ చర్యలన్నీ సత్ఫలితాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. లక్ష సంఘాలకు రూ.10 లక్షలపైగా రుణాలు ముందెన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో పొదుపు సంఘాల మహిళలు సకాలంలో రుణ కిస్తీలు చెల్లిస్తుండటంతో బ్యాంకులు ఇప్పుడు ఒక్కొక్క పొదుపు సంఘానికి రూ.10 లక్షలకు పైబడి కూడా రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పుడు దాదాపు లక్ష సంఘాలకు రూ.10 లక్షలు, అంతకంటే ఎక్కువ మొత్తం రుణంగా ఇవ్వడానికి బ్యాంకులు ముందుకొచ్చాయని సెర్ప్ అధికారులు వెల్లడించారు. -
కరోనా నియంత్రణకు మేము సైతం
తణుకు : మహిళలు ఆకాశంలో సగభాగం అన్నారు పెద్దలు.. ఇప్పుడు కరోనా మహమ్మారి నియంత్రణకు సగం బాధ్యతను మహిళలు తీసుకుంటున్నారు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలనే నానుడి నిజం చేస్తూ ముందు ఇంట్లో మహిళలు అవగాహన పెంచుకుని తద్వారా కుటుంబ సభ్యులను హెచ్చరించేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశంలోనే అత్యధికంగా కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో మహమ్మారిని జిల్లాలోని స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇస్తున్న ఆన్లైన్ శిక్షణ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో సెల్ఫోన్లలో డిజిటల్ తరగతులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో మొత్తం 12,208 స్వయం సహాయక సంఘాల్లో 1.19 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 58,650 మంది ఈ ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకున్నారు. నిపుణులతో శిక్షణ జిల్లాలో ఈనెల 1 నుంచి మెప్మా మిషన్ డైరక్టరేట్ ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ ప్రారంభించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నియంత్రణ లక్ష్యంతో ‘కోవిడ్–19 నివారణ – నియంత్రణలో సంఘ సభ్యులు’ అనే కార్యక్రమం రూపొందించారు. దీనిలో భాగంగా కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్వాక్రా మహిళలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో అధికారులు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు ఆన్లైన్ శిక్షణ కొనసాగించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు వారి ఇంటి నుంచే వారి కుటుంబ సభ్యులు సైతం ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ప్రతి రోజు నాలుగు దశల్లో సుమారు అయిదు వేల మందికి ఆన్లైన్ శిక్షణ అందజేస్తున్నారు. ఈ శిక్షణలో ప్రధానంగా కోవిడ్ –19 సమయంలో ప్రతి ఒక్కరూ పాటించాల్సిన జాగ్రత్తలు, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడం, ఆరోగ్యకర అలవాట్లు, యోగా, ధ్యానం వంటి వాటిపై శిక్షణ ఇస్తున్నారు. మొత్తం 30 మంది నిపుణుల బృందంతో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. మహిళకు అవగాహన కల్పించడం ద్వారా.. కరోనా మహమ్మారిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన వినూత్న కార్యక్రమానికి స్పందన లభిస్తోంది. ఒక కుటుంబంలో ముందుగా మహిళకు అవగాహన కల్పిస్తే తద్వారా కుటుంబ సభ్యులంతా క్షేమంగా ఉంటారనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. జిల్లాలో డ్వాక్రా మహిళలకు ఆన్లైన్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నాం. సీఎం జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.–టి.ప్రవీణ, మెప్మా పీడీ, ఏలూరు రోగనిరోధక శక్తి ప్రధానం కోవిడ్–19 సమయంలో పాటించాల్సిన నియమాలపై జిల్లాలోని మహిళలకు అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతో పాటు ప్రధానంగా రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం ద్వారా కరోనా నివారణ సాధ్యమవుతుంది. ఆహార నియమాలు పాటించి పౌష్టికాహారం తీసుకుంటూ మానసిక ప్రశాంతత కోసం శ్వాస ప్రక్రియలు, యోగా, ధ్యానం వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.–కె.మహాలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్, హెల్త్ అండ్ న్యూట్రిషన్ -
తమ్ముడూ.. ఇది తగునా
తాడిపత్రి: మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. మహిళా సంఘాలకు విరివిగా రుణాలు ఇచ్చి, తద్వారా వారి పురోభివృద్ధికి కృషి చేస్తుంటే.. ఇదే అదునుగా చూసి ఓ తెలుగు తమ్ముడు అడ్డదారిని ఎంచుకున్నాడు. బినామీల పేరిట డ్వాక్రా గ్రూపు ఏర్పాటు చేసి, బ్యాంకు ద్వారా వచ్చే రుణాలను స్వాహా చేస్తున్నట్లు ఆలస్యంగా వెలుగుచూసింది. గత టీడీపీ హయాంలోనూ పసుపు– కుంకుమ పేరిట వచ్చిన రూ.2లక్షలు స్వాహా చేశాడు. ఇదేమని ప్రశ్నించినవారిని బెదిరిస్తున్నాడు. మొత్తం వ్యవహారంపై మహిళలు నిలదీయడంతో విషయం కాస్త బట్టబయలైంది. పట్టణానికి చెందిన టీడీపీ నాయకుడు ఆయూబ్‌బాషా ఏటిగడ్డపాలెంలో నివాసం ఉంటున్నాడు. తన భార్య కలైగర్ షమీనాతోపాటు మరో తొమ్మిది మంది మహిళలతో అఫ్రిన్ గ్రూప్ (ఎంపీఎస్ 12001401500) పేరుతో 2015 డిసెంబర్ 27న ఏర్పాటు చేశారు. ఆస్పత్రి పాలెంలోని బీమామిత్ర పర్వీన్ అడ్రస్‌తో గ్రూప్‌ను ఏర్పాటు చేయించాడు.ఏ ఒక్కరూ స్థానికులు గ్రూపులో లేరు. వాస్తవంగా పర్వీన్ అనే మహిళ కూతురు తస్లీం రీసోర్స్‌పర్సన్(ఆర్పీ)గా పనిచేస్తోంది. రీసోర్స్‌పర్సన్‌గా ఉన్న మహిళ భర్త రైల్వేశాఖలో ఉద్యోగి. ఆర్పీ తస్లీం పేరున ఆమె తల్లి పర్వీన్ గ్రూపు వ్యవహారాలను చూస్తోంది. ఏటిగడ్డ పాలెంకు చెందిన అచ్చుకట్ల షేకున్బీ, కలైగర్ షమీనా, ఫాబినా షమీమ్, కిష్టిపాడు షేకున్బీ, పామిడి హజీరా, షేక్ గౌసియా, షేక్ మహాబుబ్‌బీ, తసబ్ హసీనా, తేరన్నపల్లి హాబీదా గ్రూపుగా ఏర్పడ్డారు. రూ.3 లక్షలు స్వాహాకు యత్నం: 2015లో స్థానిక కెనరా బ్యాంకులో 3341101012850 నంబర్‌తో ఖాతాను ప్రారంభించారు. మొదట గ్రూపు సభ్యులకు రూ.లక్ష రుణాలు మంజూరు కాగా ఒక్కొక్కరికి టీడీపీ నాయకుడు రూ.10 వేలు పంపిణీ చేశాడు. రెండో సారి 2018 ఆగస్టు 20న గ్రూపులోని మహిళా సభ్యులకు రూ.2లక్షలు రుణాలు మంజూరైంది. ఒక్కొక్కరికి రూ.20 వేలు పంపిణీ చేయాల్సి ఉంది. కేవలం ఒక్కొక్కరికి రూ.10 వేలు మాత్రమే పంపిణీ చేసి రూ.లక్ష స్వాహా చేశాడు. టీడీపీ హయాంలో మహిళలకు ఇచ్చిన పసుపు–కుంకుమ కానుక కింద రూ.2 లక్షలు స్వాహా చేసినట్లు మహిళలు ఆరోపిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే బెదిరింపులు: ఇటీవల గ్రూపు మహిళలు 10 మందికి కెనరా బ్యాంకు రూ.3లక్షలు రుణం మంజూరు చేసింది. గ్రూపులోని ఒక్కో మహిళకు రూ.30వేలు చొప్పున ఆ గ్రూప్ లీడరైన ఆయూబ్ సతీమణి కలైగర్ షమీనా పంపిణీ చేయాల్సి ఉంది. కాగా ఆయూబ్‌బాషా మహిళలను మభ్యపెట్టి రూ.5వేల చొప్పున తీసుకోవాలని సూచించాడు. దీంతో మహిళలందరూ నిరాకరించారు. మూకుమ్మడిగా బ్యాంకర్లు, మున్సిపాలిటీలోని మెప్మా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో గ్రూప్ అకౌంట్‌ను హోల్డ్‌లో పెట్టారు. తనను ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా సంతకాలు తీసుకున్నట్లు మహిళలు వాపోతున్నారు. రెండు విడతలుగా స్వాహా రెండు విడతలుగా రూ.15వేలు స్వాహా చేశాడు. తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వాలని ప్రశ్నిస్తే గ్రూపు నుండి తొలగిస్తానని బెదిరిస్తున్నాడు. ఈ విషయమై బ్యాంకర్ల దృష్టికి తీసుకెళ్తే మున్సిపల్ కార్యాలయంలో డ్వాక్రా గ్రూపుల సీఓకు ఫిర్యాదు చేయాలని బ్యాంకర్లు సూచించారు. – షేక్ మహబూబ్‌బీ పాసు పుస్తకాలు ఇవ్వలేదు టీడీపీ నాయకుడు ఆయూబ్ బాషా గ్రూపుకు సంబంధించిన పొదుపు సంఘానికి చెందిన పాసుపుస్తకాలు కూడా ఇవ్వకుండా తన వద్దే ఉంచుకున్నాడు. పాసుపుస్తకాలు ఇవ్వాలని అడిగితే మొహం చాటేస్తున్నాడు. నాకు రావాల్సిన రూ.20 వేలు రెండు విడతలుగా స్వాహా చేశాడు. – షేక్ గౌసియా సున్నా వడ్డీ వసూలు నేను గ్రూపులో రెండో లీడర్. ఇంత వరకు పొదుపు సంఘం పాసుపుస్తకాలు ఇవ్వలేదు. రుణాల డబ్బు నేను చూడలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక సున్నా వడ్డీ వర్తిస్తుందని ప్రకటించినా మాతో వడ్డీ వసూలు చేశాడు. మెప్మా నుంచిì గ్రూపునకు అందాల్సిన రాయితీలు ఏవీ అందలేదు. పసుపు–కుంకుమ కానుక కింద వచ్చిన రూ.2 లక్షలను స్వాహా చేశాడు. – తసబ్ హసీనా -
సీఎం జగన్ ప్రజలకు అండగా ఉన్నారు
-
జగన్ పాలనలో మహిళలకు మేలు జరుగుతోంది
-
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం
-
సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం: డ్వాక్రా మహిళలు
సాక్షి, అమరావతి : సున్నా వడ్డీ పధకం తమ కుటుంబాల్లో వెలుగులు నింపిందని డ్వాక్రా సంఘాల మహిళలు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో వివిధ జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా కష్టకఆలంలో కూడా తమకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. తామంతా ముఖ్యమంత్రి వెంటే నడుస్తామని, రాష్ట్రానికి సీఎం మార్గనిర్దేశం కావాలని పేర్కొన్నారు. (వైఎస్సార్ సున్నా వడ్డీని ప్రారంభించిన సీఎం) విశాఖపట్నం : సంక్షోభంలో బియ్యం, కందులు, శనగలు ఇచ్చారని, ఇళ్లపట్టాలు కూడా ఇస్తున్నారని మహిళలు వైఎస్ జగన్‌ను ప్రశంసించారు. తమపట్ల సొంత అన్నదమ్ముల్లా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చేయలేదని, రుణాలు, వాటి వడ్డీలు తడిచి మోపిడయ్యాయని వాపోయారు. పాదయాత్రలో నేను విన్నాను.. ఉన్నాను.. అని మాట ఇచ్చారని, ఆ మాట ప్రకారం మమ్మల్ని ఆదుకుంటున్నారని ఆనందరం వ్యక్తం చేశారు. ఎప్పుడూ ముఖ్యమంత్రి వెంటే ఉంటామని, వైఎస్ జగనేముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాస్క్‌ల తయారీ ఎలా ఉందని విశాఖ కలెక్టర్‌ను ఆరా తీశారు. యుద్ధ ప్రాతిపదికన తయారు అవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. మాస్క్‌లను ముందు రెడ్జోన్లలో పంపిణీ ప్రారంభించాలని కలెక్టర్‌కు వైఎస్ జగన్ సూచించారు. (గర్ల్ ఫ్రెండ్‌తో గొడవ.. 22 మంది ప్రాణాలు తీసింది.. !) కర్నూలు: దివంగత వైఎస్సరా్ వడ్డీ భారం తగ్గించడానికి పావలా వడ్డీ ప్రారంభించారని మహిళలు తెలిపారు. తమ దురదృష్టం కొద్దీ ఆయన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జీరో వడ్డీ, రుణమాఫీ లేదని వాపోయారు. పాదయాత్రలో తమ కష్ట సుఖాలను తెలుసుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా సున్నా వడ్డీ పథకం తీసుకు వచ్చారని హర్షం వ్యక్తంచేశారు. ( నెల్లూరు : గత ప్రభుత్వ సమయంలో మమ్మల్ని మీటింగుల కోసం తిప్పుకున్నారని డ్రాక్రా సంఘాల మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట నిలబెట్టుకున్నారని, కరోనా సమయంలో ప్రజలను ఆదుకుంటున్న తీరు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్ మార్గనిర్దేశం కొనసాగాలని, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. (కరోనా కొత్త లక్షణం: పాదాలు, బొటనవేలు వాపు..! ) కడప జిల్లా : కరోనా వచ్చి, నానా కష్టాలు తెచ్చిందని, ఈ సమయంలో సున్నా వడ్డీ వస్తుందా? లేదా? అని సందేహించామని తెలిపారు. అయినా ఆర్థిక భారాన్ని భరిస్తూ తమకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం లేని సమయంలో కూడా తమకు సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వల్ల వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయం తమను ఆర్థికంగా చాలా ఆదుకుందని అన్నారు. ప్రకాశం జిల్లా : అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన మాటను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. వాలంటీర్లు చాలా సేవ చేస్తున్నారు. వేయి రూపాయలు, మూడుసార్లు రేషన్ ఇవ్వడం చాలా మంది నిర్ణయాలు. మాస్క్‌ల తయారీ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం హర్షణీయం. అలాగే అరటిలాంటి ఉత్పత్తులను మహిళా సంఘాల ద్వారా చేయిస్తున్నారు. దీనివల్ల ఉపాధి పొందుతున్నాం అని ప్రకాశం జిల్లా డ్రాక్రా మహిళలు తమ సంతోషాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పంచుకున్నారు. (రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ దారుణ హత్య) తూర్పుగోదావరి : వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన డ్వాక్రా సంఘాల మహిళలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు. సుదీర్ఘ పాదయాత్రలో అక్కచెల్లెమ్మలకు భరోసా ఇస్తామన్నారు. అనుకున్నట్టే మాకు అండగా నిలుస్తున్నారు. వైఎస్సార్ పావలా వడ్డీ కింద రుణాలు ఇస్తున్నారు. మమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి చేస్తున్న యత్నాలు హర్షణీయం. కష్టకాలంలో కూడా మాకు అండగా ఉంటున్నారు. కరోనా సమయంలో కూడా ఆదుకుంటున్నారు. మా కుటుంబాల్లో మాకు గౌరవం పెరిగింది. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా సేవ చేయిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా గొప్ప ఆలోచనను అమల్లోకి తీసుకు వస్తున్నారు. వాళ్లు దేవుళ్లులా సహాయం చేస్తున్నారు. గతంలో పెన్షన్‌కోసం అవ్వాతాతలు ఎంతో ఎదురుచూపులు చూసేవారు. ఉదయం 8గంటల్లోపే మీరు పెన్షన్ అందించేలా చూస్తున్నారు. ప్రతి విషయంలో మాకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.(ఆ సీరియల్ మళ్లీ వచ్చేస్తోంది) ‘దిశ చట్టాన్ని తీసుకు వచ్చిమహిళలకు పూర్తి రక్షణ ఇస్తున్నారు. యావత్ మహిళా లోకం మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. నవరత్నాలతో అందరికీ మంచి జరుగుతోంది. పిల్లలను చదివించుకోవడానికి ఇబ్బందులు లేకుండా చేశారు. అందరం రుణపడి ఉంటున్నాం. కుటుంబంలో పెద్ద దిక్కై కరోనా సమయంలో మూడు సార్లు రేషన్ ఇస్తున్నారు. వేయి రూపాయలు కూడా ప్రతి కుటుంబానికీ ఇచ్చారు. గర్వపడేలా చేస్తున్నారు. అని తమ మనసులోని కృతజ్ఞతను తెలిపారు. రూ.100 కే పండ్లు కార్యక్రమాన్ని ప్రారంభించామని జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు. పూలరైతులను ఆదుకునేందుకు కార్యక్రమం చేపట్టామని, పండ్లతోపాటు పూలు కూడా ఉచితంగా ఇస్తున్నామని వెల్లడించారు. సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. (కరోనాపై ఆనాడే స్పందించి ఉంటే..) -
‘చంద్రబాబుకు మహిళలు తగిన గుణపాఠం చెప్పారు’
సాక్షి, కృష్ణా : పసుపు-కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. జిల్లాలోని పామర్రులో వైఎస్సార్ క్రాంతి పథకం కింద మెగా డ్వాక్రా రుణమేళాను సమాచారశాఖ మంత్రి పేర్ని నాని, స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్‌తో కలిసి పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 2304 గ్రూపుల్లోని 24,843 మంది డ్వాక్రా మహిళలకు రూ.105 కోట్ల 48 లక్షల చెక్కులను అందజేశారు. మహిళలకు తోడుంటాం.. గత ప్రభుత్వంలో రుణాలు రాక డ్వాక్రా మహిళలు ఎన్నో అవస్థలు పడ్డారని పేర్ని నాని విమర్శించారు. ఇప్పుడు వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అండగా ఉంటారని పేర్కొన్నారు. అలాగే ఉచితంగా ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తున్నామని.. ఉగాది వరకు అర్హులందరికీ పట్టాలు అందజేస్తామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని. ఆయన అడుగుజాడల్లో తాము కూడా నడుస్తామని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ అన్నారు. డ్వాక్రా మహిళలకు తాము ఎప్పుడూ తోడుంటామని పేర్కొన్నారు. జనవరిలో రాబోతున్న అమ్మఒడి పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు 15వేలు అందచేస్తున్నామని తెలిపారు. మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. మహిళలను మోసం చేస్తే ఏ గతి పడతుందో 2019 ఎన్నికల్లో తెలిందని గుర్తు చేశారు. ఎన్నికల వేళ పసుపు కుంకుమ అని చెప్పి మహిళలకు డబ్బులు ఎర చూపిన అంతర్జాతీయ మోసగాడు,అంతర్జాతీయ వెన్నుపోటు దారుడు చంద్రబాబుకు మహిళలంతా తగిన గుణపాఠం చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్వాక్రా మహిళలకు త్వరలో సీఎం జగన్ లేఖలు
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ ఆసరా’ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు నాలుగు విడతల్లో ఎవరెవరికి ఎంత మొత్తం వారి చేతికే నేరుగా అందజేస్తారనే వివరాలను తెలియజేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరలో వారికే నేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. ఎన్నికల నాటికి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందజేస్తామని ఎన్నికల ముందు వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని కూడా ఎన్నికలకు ముందే ఆయన స్పష్టంగా ప్రకటించారు. రాష్ట్ర బ్యాంకర్ల సంఘం గణాంకాల ప్రకారం.. ఎన్నికల నాటికి రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళల పేరిట రూ.27,147 కోట్ల అప్పులు ఉన్నట్టు తేల్చారు. వైఎస్ జగన్ ఎన్నికలకు ముందే హామీ ఇచ్చిన మేరకు రెండో ఏడాది నుంచి ఈ పథకం అమలు చేసేలోగా.. వడ్డీ భారం మహిళలపై ఏమాత్రం పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో మొత్తం రుణంపై పథకం అమలు చేసే నాటికి రూ.2,472 కోట్లు వడ్డీ అవుతుందని అంచనా వేసి, ఆ డబ్బులను ప్రభుత్వం మొదటి ఏడాదే బ్యాంకులకు చెల్లించాలని కూడా నిర్ణయించారు. రెండో ఏడాది నుంచి రూ.27,147 కోట్ల మొత్తాన్ని సంఘాల వారీగా అప్పును బట్టి నాలుగు విడతల్లో చెల్లిస్తారు. అప్పుల వివరాలన్నీ పారదర్శకం డ్వాక్రా పొదుపు సంఘాలకు జీరో వడ్డీ, వైఎస్సార్ ఆసరా పథకాల అమలు కార్యాచరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సెర్ప్, మెప్మా అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు, సెర్ప్ సీఈవో రాజాబాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. ఈ పథకం అమలులో ఎవరికీ ఏ అనుమానాలు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా ఉండడానికి సంఘాల వారీగా అప్పుల వివరాలు ప్రజలందరికీ తెలిసేలా వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15 నాటికి గ్రామ, వార్డు వలంటీర్ల నియామకాలు పూర్తి కాగానే.. వారి ద్వారా డ్వాక్రా సంఘాలకు సీఎం రాసిన లేఖతో పాటు ఆ సంఘం పేరిట ఉన్న అప్పు ధృవీకరణ పత్రాన్ని అందజేస్తారు. మొత్తం రుణంపై మొదటి ఏడాదికయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి, రశీదులను సైతం వలంటీర్ల ద్వారా అందజేయాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రస్తుతం సంఘాల వారీగా ఏ సంఘం పేరిట ఏ బ్యాంకులో ఎంత రుణం ఉందన్న వివరాలను సెర్ప్, మెప్మా అధికారులు సేకరిస్తున్నారు. సంఘం పేరిట ఉండే అప్పు మొత్తాన్ని నిర్ధారిస్తూ మొదట సంబంధిత బ్యాంకు అధికారి నుంచి ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుంటున్నారు. అప్పు మొత్తంలో ఎటువంటి తప్పు ఒప్పులకు తావు లేకుండా ఉండేందుకు సెర్ప్, మెప్మా అధికారులు సంబంధిత సంఘాన్ని సమావేశ పరిచి బ్యాంకు నుంచి తీసుకున్న ధృవీకరణ పత్రంలో పేర్కొన్న మొత్తాన్ని నిర్ధారించుకుని, ఆ సంఘం సభ్యుల నుంచి సంతకాలు కూడా తీసుకుంటున్నారు. ఇక క్రమం తప్పకుండా జీరో వడ్డీ డబ్బులు మహిళలు పొదుపు సంఘాల పేరిట తీసుకునే రుణాలపై ఇక నుంచి అపరాధ వడ్డీ భారమన్న ప్రసక్తే లేకుండా కార్యాచరణ సిద్ధం చేయాలని కూడా సీఎం సమీక్ష సమావేశంలో అధికారులను ఆదేశించారు. డ్వాక్రా సంఘాలు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులకయ్యే వడ్డీ డబ్బులను జీరో వడ్డీ పథకం ద్వారా గత టీడీపీ ప్రభుత్వం సకాలంలో బ్యాంకులకు చెల్లించని కారణంగానే మహిళలకు మోయలేనంత భారంగా మారాయని సమీక్షలో సీఎం వ్యాఖ్యానించారు. ఇక నుంచి జీరో వడ్డీ డబ్బులను క్రమం తప్పుకుండా బ్యాంకులకు చెల్లించే ప్రక్రియ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్థిక శాఖ అధికారులతోనూ సమన్వయం చేసుకోవాలని సూచించారు. జీరో వడ్డీ పథకంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం వడ్డీ డబ్బులను బ్యాంకులకు చెల్లిస్తుందన్న వివరాలు సంబంధిత సంఘంలోని మహిళలకు తెలిసేలా బ్యాంకు రశీదులను వలంటీర్ల ద్వారా అందజేయాలని చెప్పారు. -
బ్యాంకర్ తీరుపై మహిళల ఆగ్రహం
పెదగొట్టిపాడు (ప్రత్తిపాడు): బ్యాంకర్ల తీరును నిరసిస్తూ మండుటెండలో డ్వాక్రా మహిళలు ఆందోళనకు దిగిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడు గ్రామంలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ బ్యాంకు పరిధిలోని ఆరు గ్రామైక్య సంఘాల్లో 191 డ్వాక్రా గ్రూపులున్నాయి. ఆయా గ్రూపుల సభ్యులు గడిచిన ఐదేళ్లుగా నెలనెలా క్రమం తప్పకుండా పొదుపులు జమ చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని గ్రూపుల సభ్యులు రుణం పొందేందుకు బ్యాంకు మేనేజర్ వద్దకు పలు మార్లు వెళ్లారు. ఆయన రుణాలు ఇవ్వకుండా రకరకాల కొర్రీలు పెడుతూ మహిళలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వస్తున్నాడు. దీంతో మహిళలు విషయాన్ని వెలుగు అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. వారు బ్యాంకుకు వెళ్లి మాట్లాడినప్పటికీ ఫలితం లేకపోయింది. షట్టర్లు మూసివేసి నిరసన ఈ నేపథ్యంలో శనివారం డ్వాక్రా మహిళలు, వీవోఏలు బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. బ్యాంకు ప్రధాన ద్వారాలు మూసివేసి బ్యాంకు ఎదుట బైఠాయించారు. రుణాలివ్వాలని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. గడిచిన ఐదేళ్లుగా రుణాలు సక్రమంగా ఇవ్వకుండా నానా రకాలుగా వేధిస్తున్నారని మహిళలు ఆరోపించారు. తాము పొదుపు చేసుకున్న డబ్బులు తీసుకున్నా కూడా వాటిని అప్పుగా చూపించి, మా నుంచి వడ్డీలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రుణం పొందేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. షూరీటీ ఇస్తేనే రుణాలు.... డ్వాక్రా మహిళలమైన తమకు మూడు లక్షల రూపాయలకు పైగా రుణం ఇవ్వాలంటే షూరిటీలు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. మూడు లక్షలకు పైగా కావాలంటే పొలం పట్టాదారు పాస్‌పుస్తకాలు కావాలని వేధిస్తున్నారని, అవి ఎక్కడి నుంచి తీసుకుని రావాలంటూ ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు దాదాపుగా నాలుగు గంటలపాటు మహిళలు బ్యాంకు ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ మూడు లక్షలకు పైగా ఎలాంటి షూరిటీలు లేకుండా డ్వాక్రా మహిళలకు రుణాలు ఇస్తే ఆడిట్ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని తెలిపారు. పొదుపు డబ్బులకు వడ్డీలు వసూలు చేస్తుండటంపై ఆయన సరైన సమాధానం చెప్పలేదు. దీంతో మహిళలు బ్యాంకు మేనేజర్ తీరుపై మరింత ఆగ్రహానికి గురయ్యారు. సీసీలు, గ్రామస్తులు, డ్వాక్రా లీడర్లు మేనేజర్‌తో చర్చలు జరిపిన అనంతరం సోమవారం నుంచి రోజుకు మూడు గ్రూపుల చొప్పున మహిళలకు లింకేజీ రుణాలిస్తామని మేనేజర్ రమేష్ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. -
బాబు భ్రమలకు మహిళలు బ్రేక్
ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మహిళలు బ్రహ్మరథం పట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో పాటు.. ప్రాంతాలకతీతంగా మహిళలంతా ముక్తకంఠంతో జననేతకు జై కొట్టారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి.. తీరా ఎన్నికల వేళ పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడదామనుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు.. సాక్షి, అమరావతి : తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తనకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మాఫీ పేరుతో మాయ మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు. -
దారి మళ్లిన డ్వాక్రా మహిళల నిధులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో ఉండే మరుగుదొడ్లను శుభ్రం చేసే పనులు చేసిన డ్వాక్రా మహిళలకు వేతన బాకీలను చెల్లించడానికి రూ. 65 కోట్లు ఈ ఏడాది జనవరి నెలలోనే విడుదల అయ్యాయి.. కానీ ఆ డబ్బులు మాత్రం ఆ పనులు చేసిన మహిళలకు ఇప్పటి వరకు చేరలేదు. ఈ నిధులను ఎన్నికల ముందు చంద్రబాబు ప్రకటించిన కొన్ని హామీలకు విడుదల చేసిన నిధులను కూడా ప్రభుత్వ పెద్దలు మళ్లించేశారట. రాష్ట్రంలో 42 వేల దాకా ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, అందులో 27 వేల పాఠశాలలో మరుగుదొడ్లను రోజు వారీ శుభ్రం చేసే పనులను ఆయా గ్రామాల్లో డ్వాక్రా మహిళలకు అప్పగించారు. ప్రాధమిక పాఠశాలలో ఉన్న మరుగుదొడ్లు కడిగే వారికి నెలకు రూ. 2 వేల చొప్పున, ప్రాధమికోన్నత పాఠశాలలో పనిచేసిన వారికి నెలకు రూ. 2,500, హైస్కూల్లో పనిచేసే వారికి రూ. 4,000 చెల్లించే ఒప్పందంతో డ్వాక్రా మహిళలను ఆ బాధ్యతల్లో నియమించారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలనే ఆ బాధ్యతల్లో ఎక్కువగా నియమించారు. ప్రభుత్వ పాఠశాల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సర్వశిక్షా అభియాన్ పథకం ద్వారా దేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేకంగా నిధులు అందుతుంటాయి. మరుగుదొడ్లను శుభ్రం చేసినందుకు ఆ పనిచేసిన డ్వాక్రా మహిళలకు పాఠశాల విద్యా శాఖ కేంద్రం నుంచి అందే సర్వ‡శిక్షాఅభియాన్ నిధుల నుంచి డబ్బులు చెల్లిస్తూ ఉంటుంది. గత రెండు ఏళ్ల పాటు ఆ పనులు చేసినందుకు 27 వేల మంది డ్వాక్రా మహిళలకు దాదాపు రూ. 180 కోట్లు చెల్లించాల్సి ఉంది. మొత్తం బకాయిల్లో రూ. 65 కోట్లను సర్వశిక్షాఅభియాన్ పథకం ద్వారా అందిన నిధుల నుంచి చెల్లించడానికి రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ ఈ ఏడాది జనవరిలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)కు విడుదల చేసింది. అయితే, ఆ నిధులను సెర్ప్ చేరకుండానే ఆ నిధులను చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల పథకాలకు ఆర్థికశాఖ మళ్లించిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మరోపక్క చేసిన పనికి రెండేళ్లుగా డబ్బులు అందక డ్వాక్రా మహిళలు మండల కమ్యూనిటీ కోఆర్డినేట్ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అక్కడ ఉన్న అధికారులు రేపూ మాపూ అంటూ తిప్పుకుంటున్నారు గానీ, ఎప్పుడు ఆ డబ్బులు చెల్లిస్తారన్న విషయం ఆ అధికారులూ స్పష్టంగా చెప్పలేకపోతున్నారని సంబంధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ప.గో జిల్లా దర్భగూడెంలో డ్వాక్రా మహిళల ధర్నా
-
అక్కచెల్లెమ్మలకు మంచి రోజులు ఖాయం
డ్వాక్రా మహిళలను ఐదేళ్లుగా నమ్మించి ముంచారు పాలకులు. బేషరతుగారుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి.. వడ్డీ గుంజుతున్నారు. ఎన్నికలు రాగానే ‘పసుపు కుంకుమ’ అంటూ.. ఆడపడుచులను మళ్లీ వంచించేందుకు సిద్ధమయ్యారు. తన సుదీర్ఘ పాదయాత్ర సందర్భంగా పల్లె పల్లెలో మహిళలతో స్వయంగా మాట్లాడి.. వారి సాదకబాధకాలు తెలుసుకున్న జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... అక్కచెల్లెమ్మలను లక్షాధికారులను చేస్తానని ప్రకటించారు. వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా.. ప్రతి డ్వాక్రా మహిళకు 2019 ఎన్నికల నాటికి ఎంత అప్పు ఉంటే అంత మొత్తం ఆమె చేతికే ఇస్తానని హామీ ఇచ్చారు. తద్వారా ప్రతి డ్వాక్రా మహిళకు కనీసం రూ.50వేల నుంచి రూ.70 వేల వరకూ ప్రయోజనం చేకూరనుంది. అంతేకాకుండా సున్నా వడ్డీల విప్లవం తెస్తానని వాగ్దానం చేసారు. జగన్ మాటంటే మాటేనని.. తమ జీవితాల్లో వెలుగులు ఖాయమని సంబరపడుతున్నారు రాష్ట్రంలోని లక్షలాది మంది అక్కచెల్లెమ్మలు!! వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా మహిళల అప్పు మొత్తాన్ని నాలుగు దఫాల్లో.. అక్కచెల్లె్లమ్మల చేతికే ఇస్తానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తానని జననేత హామీ ఇవ్వడంపై మహిళల్లో సంతోషం కనిపిస్తోంది. రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా.. నవరత్నాల్లో భాగంగా వైఎస్సార్ ఆసరా పథకం ప్రకటించడాన్ని మహిళలు స్వాగతిస్తున్నారు. నేరుగా మహిళల చేతికే డబ్బు 2019 ఎన్నికల నాటికి డ్వాక్రా సంఘాల పేరిట ఉన్న అప్పుల మొత్తాన్ని తాను అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరం నుంచి నాలుగు దఫాల్లో చెల్లిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ డబ్బులను కూడా బ్యాంకుల్లో జమ చేయడం కాకుండా.. నేరుగా మహిళల చేతికే ఇస్తామని 2017 జూలైలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలోనే ప్రకటించారు. జగన్ హామీతో బెంబేలెత్తిన చంద్రబాబు ఎన్నికల ముందు మహిళలను మభ్యపెట్టడానికి హడావుడిగా పసుపు–కుంకుమ పథకం తెచ్చారు. 90 లక్షల మందికిరూ.27 వేల కోట్ల పైనే ప్రయోజనం 2019 జనవరిలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో వివరాల ప్రకారం–రాష్ట్రంలో 9,67,620 రుణ ఖాతాల ద్వారా డ్వాక్రా సంఘాల పేరిట రూ.25,424కోట్లు అప్పు ఉంది. 2018 సెప్టెంబరు నెలాఖరుతో ముగిసిన త్రైమాసికం గణాంకాలు మాత్రమే ఆ బ్యాంకర్ల సమావేశంలో చర్చకు వచ్చాయి. వైఎస్ జగన్ 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును 4 దఫాలుగా వారి చేతికే ఇస్తామని చెప్పారు. ఆ మేరకు ఉన్న అప్పు, వడ్డీలు అన్నీ కలుపుకొని మొత్తం రూ.27వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అధికార వర్గాల అంచనా. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 95 లక్షల మంది మహిళలు డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నప్పటికీ.. బ్యాంకు రుణాలు పొందిన డ్వాక్రా సంఘాల్లో 90లక్షల మంది సభ్యులు ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఈమేరకు వైఎస్సార్ ఆసరా పథకంతో.. 90లక్షల మంది డ్వాక్రా మహిళలకు రూ.27 వేల కోట్లకు పైగానే ప్రయోజనం చేకూరుతుంది. అక్కచెల్లెమ్మలకు జగన్ హామీ.. ♦ 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తారు. ♦ సున్నా వడ్డీకే రుణాలవిప్లవం తెస్తారు. ♦ ఆ వడ్డీ డబ్బులను మహిళల తరఫున ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేఏర్పాటు చేస్తారు. ♦ 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ అక్కలకు వైఎస్సార్ చేయూత పథకం ద్వారా రూ.75వేలు ఉచితంగా అందిస్తారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు విడతలుగా ఈ మొత్తాన్ని ఆయా కార్పొరేషన్ల ద్వారా అందజేస్తారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధిలోని కనుగుపూడి గ్రామ సమాఖ్య–4 పరిధిలో.. అగ్ని మారెమ్మ మహిళా సమాఖ్య పొదుపు సంఘం పేరిట కుప్పం కెనరా బ్యాంకులో 2714225001113 ఖాతా నెంబరులో అప్పు ఉంది. 2018 డిసెంబరు 4వ తేదీ నాటికి ఆ అప్పు రూ.6.50 లక్షలు ఉంది. సంఘంలో మొత్తం 9 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వైఎస్ జగన్ ప్రకటించిన వైఎస్సార్ ఆసరా ద్వారా ఆ సంఘానికి రూ.6.50 లక్షల లబ్ధి చేకూరుతుంది. సంఘంలోని మహిళలకు ఒక్కొక్కరికి రూ.72 వేల చొప్పున నేరుగా చేతికి అందుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ‘ఉండి క్రాంతి’ గ్రామ సమాఖ్య పరిధిలోని కనకదుర్గ డ్వాక్రా సంఘం.. అక్కడి ఆంధ్రా బ్యాంకులో 058013100026458 ఖాతా నెంబరులో రుణం తీసుకుంది. 2018 నవంబరు 28వ తేదీ నాటికి ఆ సంఘం పేరిట రూ.5 లక్షల అప్పు ఉంది. ఆ సంఘంలో మొత్తం పది మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాల్లో భాగంగా ప్రకటించిన ‘వైఎస్సార్ ఆసరా’ అమలు ద్వారా.. కనకదుర్గ డ్వాక్రా సంఘానికి రూ.5లక్షల లబ్ధి చేకూరుతుంది. అంటే.. సంఘంలోని ఒక్కొక్క సభ్యురాలికి రూ.50వేల మేర ప్రయోజనం అందుతుంది. మొన్న..1995 –2004 బాబు చీకటి పాలన గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం 1982–83లో డ్వాక్రా(డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్) పథకాన్ని దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో ప్రారంభించి.. 1994–95 నాటి కల్లా అన్ని జిల్లాలకు విస్తరించింది. వాస్తవం ఇలా ఉంటే.. డ్వాక్రా సంఘాలకు ఆద్యుడిని తానేనని పదే పదే చెప్పుకునే చంద్రబాబు పాలనలో.. డ్వాక్రా మహిళలకు ఎదురైన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. బ్యాంకులు సవాలక్ష కొర్రీలు పెట్టేవి. బ్యాంకులో ఖాతా తెరవడం దగ్గరన్నుంచి రుణం మంజూరు వరకూ.. అడుగడుగునా అవాంతరాలే. ఏదో రకంగా రుణం మంజూరైతే.. అది తిరిగి చెల్లించే వరకూ వెంటపడే పరిస్థితి. ఆ విధంగా డ్వాక్రా సంఘాలు ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్న చందంగా చంద్రబాబు చీకటి పాలన నాడు. నిన్న.. 2004–2009 వైఎస్ స్వర్ణయుగం 2004లో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలన్న లక్ష్యంతో.. డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీ పథకానికి రూపకల్పన చేశారు. అప్పట్లో అది పెద్ద సంచలనమై.. పెద్ద సంఖ్యలో మహిళలు పొదుపు సంఘాల్లో చేరారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు పిలిచి రుణాలు ఇచ్చేలా అధికారులను ఆదేశించారు. ఫలితంగా లక్షలాది మంది మహిళలు పొదుపు సంఘాల్లో చేరి ప్రభుత్వ తోడ్పాటుతో.. ఆర్థికంగా పరిపుష్టి సాధించారు. అవి వైఎస్ స్వర్ణయుగం రోజులు. నేడు..2014–2019 బాబు నమ్మించి మోసం 2014 ఎన్నికలప్పుడు చంద్రబాబు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకులకు వాయిదాలు కట్టొద్దు, నిశ్చింతగా ఉండండి అంటూ నమ్మబలికారు. నిజమని నమ్మిన డ్వాక్రా మహిళలు అప్పులు చెల్లించడం ఆపేశారు. తీరా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. రుణమాఫీ ఊసే ఎత్తలేదు. మరోవైపు అప్పులు కట్టాల్సిందేనంటూ బ్యాంకులు ఒత్తిడిచేయడంతోపాటు అవమానాలకు గురిచేస్తుండటంతో.. బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి కట్టాల్సిన దుస్థితి. అప్పులు పెరిగిపోయి.. అధిక వడ్డీల భారంతో మహిళలు కన్నీటిపర్యంతం.. నమ్మించి మోసం చేశారని ఆవేదన.. రేపు.. అక్కచెల్లెమ్మలకు జగన్ అండ 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా వారి చేతికే ఇస్తానని హామీ ఇచ్చారు. మహిళలకు సున్నా వడ్డీకే రుణాల విప్లవం తెస్తానన్నారు. ఆ వడ్డీ ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించే ఏర్పాటు చేస్తారు. వైఎస్సార్ ఆసరా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని జగన్ హామీ ఇవ్వడంపై లక్షల మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మాఫీ.. పచ్చి మోసం నా పేరు ఈ.జ్యోతి. మాది చిత్తూరు జిల్లా బి.కొత్తకోట. నేను భరత్ మహిళా సంఘంలో సభ్యురాల్ని. 2013 సెప్టెంబర్‌లో సంఘానికి మంజూరైన రూ.5లక్షల రుణంలో నేను రూ.50వేల రుణం తీసుకున్నా. నెలవారీ రుణ కంతు రూ.1,600 చెల్లిస్తున్నా. 2014 ఎన్నికల్లో చంద్రబాబు మేం తీసుకొన్న రుణాలను మాఫీ చేస్తానని వాగ్దానం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలిచిన 2014 జూన్ వరకు 14,400 కంతుల రుణం, రూ.3,687 వడ్డీని బ్యాంకుకు చెల్లించాను. ఇక మిగిలింది రూ.35,600 రుణం, దానికయ్యే వడ్డీని చంద్రబాబు మాఫీ చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలప్పుడు పసుపుకుంకుమ పేరుతో రూ.10వేలు ఇచ్చినా.. మిగిలిన రూ.30వేలు మాఫీ చేయకుండా మోసమే చేశారు. ఇందులోనూ రూ.6వేలే చేతికందింది. పసుపుకుంకుమ సొమ్ముకూడా అప్పేనని చెప్పుకొంటున్నారు. వడ్డీలేని రుణాలు కూడా మోసమే. 2016 అక్టోబర్‌లో సంఘానికి రూ.7.50లక్షల రుణం మంజూరైంది. ఇందులో నేను రూ.75వేల రుణం తీసుకున్నా. ప్రతినెలా రూ.3వేలు కంతు కట్టి రుణం మొత్తం చెల్లించి, దానికి రూ.11,160 వడ్డీ చెల్లించాను. ఈ వడ్డీని ప్రభుత్వం ఇప్పటిదాక చెల్లించలేదు. ప్రభుత్వం మహిళలు తీసుకొన్న రుణాలు మాఫీ చేయకుండా నిలువునా మోసం చేసింది. రుణమాఫీ లేదు, వడ్డీలేకుండా రుణం ఇస్తున్నది లేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల రుణాలను మాఫీ చేసి నాలుగు విడతల్లో చేతికే ఇస్తామని మాటిచ్చారు. ఈ మాటమీద మాకు నమ్మకముంది. అధికారం కోసం చంద్రబాబులా నమ్మించి మోసం చేయరన్నది మా విశ్వాసం. అందుకే నమ్ముతున్నాం – ఈ.జ్యోతి, చిత్తూరు జిల్లా బి.కొత్తకోట. మాఫీ చేస్తానని చంద్రబాబు మోసం 2014 ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణాలన్ని బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన చంద్రబాబు.. ఏ ఒక్క డ్వాక్రా సంఘం అప్పులో కనీసం ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. మళ్లీ ఇప్పుడు ఎన్నికల సమయంలో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి పసుపు–కుంకుమ పథకం అంటూ హడావుడి చేస్తున్నారని మహిళలు పేర్కొంటున్నారు. మరోవైపు పసుపు కుంకుమ పేరిట డ్వాక్రా మహిళలను అప్పులపాలు చేస్తున్నారని వాపోతున్నారు. అంతర్గత సర్క్యులర్ ప్రకారం–ప్రభుత్వం పసుపు–కుంకుమ చెక్కులను మహిళలకు అప్పుగా ఇస్తూ.. ఎన్నికలు వచ్చాయని టీడీపీ నేతలు దానిని ఉచితమని ప్రచారం చేసుకుంటున్నారని మహిళా సంఘాలు చెబుతున్నాయి. ప్రభుత్వం మహిళలకు ఇచ్చేది ఉచితమైతే నేరుగా మహిళల చేతికి డబ్బులు ఇవ్వకుండా.. పొదుపు సంఘంలోని సభ్యులందరికి కలిపి ఉన్న ఖాతాలో ఎందుకు జమ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు వేర్వేరుగా ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నారు. ఆర్థికాభివృద్ధికి తొలిమెట్టు డ్వాక్రా రుణాల మొత్తాలను చెల్లించడం, వడ్డీ లేని రుణాలు అందించడం మహిళల ఆర్థికాభివృద్ధికి తొలిమెట్టు అవుతుంది. నాలుగు విడతల్లో రుణాల మొత్తాలను తిరిగి అందించి, వడ్డీలను కూడా చెల్లిస్తామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన భరోసా.. ప్రతి డ్వాక్రా మహిళలో ఆత్మస్థైర్యం నింపినట్లయింది. మాటతప్పకుండా హామీని నెరవేర్చుతారనే నమ్మకం మాలో ఉంది. తండ్రి బాటలోనే తనయుడు పయనిస్తున్నాడని మహిళలు భావిస్తున్నారు. – హైమావతి, చిత్తూరు -
పసుపు కుంకుమలిచ్చాం.. ప్రచారం చెయ్యండి
విశాఖసిటీ : ఏమమ్మా.. మీ అకౌంట్లోకి డబ్బులు వేశాం. పసుపు కుంకుమల పేరుతోనూ నగదు బదిలీ చేశాం. మరి ఎన్నికల టైంలో ఇంట్లో కూర్చుంటే ఎలా.? మా పేరున ప్రచారం చెయ్యండి. లేదంటే... పద్ధతిగా ఉండదంటూ టీడీపీ ఎమ్మెల్యేలు డ్వాక్రా సంఘాలపై బెదిరింపు ధోరణులకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా దక్షిణ, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు డ్వాక్రా సంఘాల్ని ప్రచారానికి వినియోగించుకునే ప్రయత్నంలో బిజీబిజీగా ఉన్నారు. డ్వాక్రా సంఘాలతో ప్రచారం.. ఇప్పుడిదే టీడీపీ ఎత్తుగడ. జిల్లాలోని అన్ని పొదుపు సంఘాల లీడర్లకు ఆయా నియోజకవర్గంలోని టీడీపీ నేతలు, వారి అనుచరుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవరైతే పొదుపు సంఘాల్లో ఉన్నారో..ఎవరైతే పసుపు కుంకుమల పేరుతో డబ్బులు పొందారో వారందర్నీ ప్రచారానికి తీసుకురావాల్సిందిగా డ్వాక్రా లీడర్లను ఆదేశించారు. దీంతో లీడర్లు తమ గ్రూపు సభ్యుల ఇళ్ల చుట్టూ రోజూ తిరగాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే చాలా మంది మహిళలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చెయ్యడం తమ వల్ల కాదంటూ నిరాకరిస్తుండటం.. ఆ విషయాన్ని సదరు నాయకులుకు లీడర్ చెప్పడం వారు గ్రూప్ లీడర్‌పై ఆగ్రహం వ్యక్తం చెయ్యడం ప్రతి నియోజకవర్గంలోనూ జరుగుతున్న తంతుగా మారిపోయింది. కనీసం విడతల వారీగానైనా ప్రచారం చెయ్యాలనీ, లేదంటే ఫలితం తీవ్రంగా ఉందంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నట్లు పలువురు మహిళలు వాపోతున్నారు. -
డ్వాక్రా రుణమాఫీపై టీడీపీ మోసం
-
హలో.. అమరావతి నుంచి మాట్లాడుతున్నాం..
అమరావతి నుంచి కాలర్ : హలో అమరావతి నుంచి మాట్లాడుతున్నాం.. మీకు పసుపు–కుంకుమ పథకం రూ.10 వేల చెక్కులు అందాయా...? మరో రూ.10 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి... ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదు కదా.. దీనిపై మీ అభిప్రాయమేమిటి...? డ్వాక్రా మహిళ : రూ.10 వేలు ఎక్కడ అందాయి. రూ.2,500 ఓ సారి, రూ.3,500 మరోసారి రెండు చెక్కులు మారాయి అంతేగా.. మిగిలిన రూ.నాలుగు వేలు ఎప్పుడు వేస్తారు? అమరావతి నుంచి కాలర్ : ఏప్రిల్ మొదటి వారంలోనే అదీ పోలింగ్‌కు ముందే మీ డబ్బులు పడిపోతాయి. మరో రూ.10 వేలు ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.’’ ఇదండీ ఎన్నికల వేళ టీడీపీ డ్వాక్రామహిళలకు చేస్తున్న తాయిలాల ఫోన్ కాల్స్ సంభాషణ.. సాక్షి, అమలాపురం టౌన్: అమలాపురం పట్టణంలోని ఎర్రవంతెన ప్రాంతానికి చెందిన కొందరు డ్వాక్రా మహిళలకు బుధవారం ఈ తరహాలోనే అమరావతి నుంచి అంటూ ఫోన్లు వచ్చినప్పుడు ‘ఇప్పటి వరకూ ఏ ముఖ్యమంత్రీ ఇలా చేయలేదు కదా.... అని అవతలి గొంతు ఒకటికి రెండు సార్లు అడిగినప్పుడు కొంతమంది డ్వాక్రా మహిళలు కాస్త అసహనానికి గురై అవునండి అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పినట్టు తెలిసింది. పట్టణంలోనే ఎర్రవంతెన ప్రాంతానికి చెందిన ఓ డ్వాక్రా మహిళ ఇచ్చిన ఫోన్ నెంబర్‌కు చేయగా ఆ ఫోన్ ఆమె భర్త వద్ద ఉండడంతో ఆయనే బదులిచ్చాడు. ఇంత వరకూ ఏ ముఖ్యమంత్రీ చేయలేదు కదా.. మీ అభిప్రాయమేమిటి? అని అడిగినప్పుడు ఆ భర్త ‘‘అవునండి ఏ ముఖ్యమంత్రీ చేయలేదు నిజమే.. ప్రభుత్వ డబ్బులతోనే మాకే ఓట్లు వేయండని ముందే ఇవ్వడం ఇప్పటి వరకూ ఎవరు చేయలేదు కదా? అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్పడం గమనార్హం. టీడీపీకి ఓటు వేయండని ఆ ఒక్క మాట చెప్పకుండానే చంద్రబాబు ఇచ్చారు కాబట్టి తిరిగి ఆయనకే ఓటు వేయండన్న సూచన మాత్రం ఫోన్లలో మాట్లాడుతున్న వ్యక్తుల ఆత్రుతలను చాలా మంది మహిళలు పరోక్షంగా గమనించారు. ఓ పక్క ఎన్నికల తేదీ ప్రకటితమైంది. నామినేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తవుతోంది. అభ్యర్థులు ప్రచారాల్లో ముమ్మరంగా ఉన్న వేళ అమరావతి నుంచి అంటూ అదేదో రాజధాని ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడుతున్నంత బిల్డప్ ఇస్తున్నారు. అయితే అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం నుంచి ఆ ఫోన్లు వస్తున్నాయని డ్వాక్రా మహిళల్లో కొందరు నాయకత్వ లక్షణాలు ఉన్న మహిళలు అభిప్రాయపడుతున్నారు. ఇవి కచ్చితంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలోకి వస్తాయని టీడీపీయేతర రాజకీయ పక్షాల నాయకులు అధికార యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ సొమ్ములతోనే పరోక్షంగా ఓటర్లను ప్రలోభపెట్టడమని వ్యాఖ్యానిస్తున్నారు. -
ఇంటి దీపానికి ఇం‘ధనం’
సాక్షి, గుంటూరు : ఇంటి బాధ్యత భర్తదైనా భారం మోసేది మాత్రం ఇల్లాలే.. కుటుంబ అవసరాలకు ప్రణాళిక వేసుకుంటూ .. వచ్చే ఆదాయానికి లెక్కలు కట్టుకుంటూ బతుకు నావ నడిపిస్తుంది. పిల్లల చదువులు, వారి ఫీజులు.. ఇవిగాక అనుకోకుండా వచ్చే అనారోగ్య సమస్యలు..ఇలా అనేక రకాల ఖర్చులను ఎదుర్కొంటూ.. అందరి బాధలను తన కన్నీటి పొర మాటున దాచేదే ఇల్లాలు. ఇలాంటి ఆడపడుచుల చేతిలో కాస్తంత ఆర్థిక ఆసరా ఉంటే ఆ కుటుంబానికి ఇంధనం దొరికినట్టే. ఆ ఇల్లాలి మోములో చిరునవ్వు పూసినట్టే.. తెలుగుదేశం ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారు. వితంతు, వృద్ధాప్య పింఛన్లను పచ్చ చొక్కాల బాట పట్టించారు. అర్హులకు మాత్రం ఒట్టి చేతులు చూపారు. ఇవన్నీ తన పాదయాత్రలో కళ్లారా చూసిన వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. అక్కాచెల్లెమ్మలకు చేయూతనిచ్చేందుకు నిశ్చయించుకున్నారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు నాలుగేళ్లలో 75 వేల రూపాయలు అందిస్తానని ప్రకటించారు. జగన్ నిర్ణయం పట్ల మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ చేతిలో ఆర్థిక వెసులుబాటు ఉంటే కుటుంబం లోగిళ్లలో సంతోషాలు నిండుతాయని చెబుతున్నారు. ఆత్మస్థైర్యం పెరిగింది పొదుపు గ్రూపు మహిళలను చంద్రబాబు నిలువునా మోసం చేశారు. రుణాలను మాఫీ చేస్తామని చెప్పి వడ్డీలను కూడా మాఫీ చేయలేదు. దీంతో బ్యాంకుల్లో వడ్డీలు పెరిగి తిరిగి రుణాలివ్వడం లేదు. బయట అధిక వడ్డీలకు తెచ్చి అప్పుల్లో కూరుకుపోతున్నాం. ఈ క్రమంలో 45 ఏళ్లు నిండిన వెనుకబడిన వర్గాల మహిళలకు రూ.75 వేలు సాయం అందిస్తామనడం సంతోషంగా ఉంది. –మేకల అమరకుమారి, త్యాళ్లూరు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి గడిచిన ఐదేళ్లుగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించడంతో మాఫీ అవుతాయని ఆశపడ్డాం. ఆ తర్వాత తెలిసింది.. మోసపోయామని. ప్రస్తుత తరుణంలో మహిళలకు ఆర్థిక భరోసా అవసరం. వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించినట్లు రూ.75 వేలు అందితే మాకెంతో ఉపయోగపడతాయి. – వేల్పుల మీరాభి, బాపట్లటౌన్ -
డ్వాక్రా మహిళలకు సీఎం పేరుతో లేఖలు
విశాఖ, మాడుగుల రూరల్ : మీ భవిష్యత్తు.. నా బాధ్యత అనే పేరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం సహాయక సంఘాలకు లేఖలు పంపిం చారు. వచ్చే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఈ లేఖలో అభ్యర్థించారు. పసుపు కుంకుమ పేరుతో రెండు విడతలుగా అందజేసిన సొమ్మును సద్వినియోగం చేసుకుని, తనకు బాసటగా నిలవాలని కోరారు. ఈ లేఖలు అమరావతి నుంచి పోస్టులో వచ్చాయి. -
ఇంత మోసమా..!
నాగులుప్పలపాడు: మహిళల స్వావలంబన కోసం 2013వ సంవత్సరంలో స్త్రీ నిధి పేరుతో వడ్డీలేని రుణాలు అందజేశారు. నేడు అవే స్త్రీ నిధి రుణాలు డ్వాక్రా సంఘాలకు పెద్ద భారంగా మారాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014వ సంవత్సరంలో అధికారం ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2013లో ఇచ్చిన వడ్డీ లేని స్త్రీ నిధి రుణాలకు కూడా పూర్తి స్థాయిలో వడ్డీలు వసూలు చేయాలని అధికారులు, బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు, బ్యాంకర్లు స్త్రీ నిధి రుణాలకు వడ్డీలు చెల్లించాలంటూ ఒత్తిడి పెంచారు. నాగులుప్పలపాడు మండలంలోనేరూ. 3 కోట్లకు పైగా స్త్రీ నిధి రుణాలు నాగులుప్పలపాడు మండలంలో మొత్తం 45 గ్రామ సంఘాలకు 1701 మందిని ఎంపిక చేసి రూ. 3,12,14,463 వడ్డీలేని రుణాలు అందజేశారు. అప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీలేని రుణాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ఆ రుణాలు మొత్తానికి వడ్డీలతో సహా చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారు. స్త్రీ నిధి ద్వారా నాగులుప్పలపాడు మండలంలోని 45 గ్రామ సంఘాలు మొత్తం ఇప్పటి వరకు రూ. 3,06,291 వడ్డీ చెల్లించాలని అధికారులు చూపిస్తున్నారు. అరకొర రుణమాఫీలోనూ మోసం అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలు పూర్తిగా రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళలను నిలువునా ముంచాడు. అధికారం చేపట్టి ఐదేళ్లు పూర్తి కావస్తున్నా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా స్వయం సహాయక సంఘానికి ఇచ్చే మూలనిధి పేరుతో బాండ్లు అందజేశారు. వీటిలో గ్రూపులో పది మంది సభ్యులుంటే అందులో నలుగురో, ఐదు మందికి వచ్చాయని మహిళలు చెప్పారు. స్వయం సహాయక సంఘానికి ఇచ్చే మూలనిధికి సంబంధించి 2900 మంది మహిళలను అనర్హులుగా చూపించారు. మండలంలోని 1400 డ్వాక్రా గ్రూపులుంటే 90 గ్రూపుల పేర్లు లేకుండానే వచ్చాయి. చంద్రబాబు నాయుడు ఇంత మోసం చేస్తాడని ఊహించలేని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా మహిళల తంటాలు కందుకూరు రూరల్: పసుపు–కుంకుమ రెండో చెక్కు నగదు కోసం డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో క్యూలు కడుతున్నారు. రెండో విడతగా మహిళకు రూ. 3500 చొప్పున గ్రూపులోని పది మందికి కలిపి ఒకే చెక్కు రూ. 35 వేలు ఇచ్చారు. ఆ చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లి నగదు ఇవ్వాలని డ్వాక్రా మహిళలు కోరారు. అయితే ఇది మార్చి నెలా ఆర్థిక సంవత్సరం ముగింపు నెల కావడంతో బ్యాంకుల్లో నగదు పూర్తి స్థాయిలో నగదు లేదని కొందరు బ్యాంక్ అధికారులు చెబున్నారు. మరికొన్ని బ్యాంకులు ముందు చెక్కులు వేయండి ఆ తర్వాత రెండు, మూడు రోజుల తర్వాత నగదు డ్రా చేసుకోండని చెప్తున్నారని డ్వాక్రా మహిళలు తెలిపారు. కొన్ని గ్రూపులకు సంబంధించిన చెక్కులు ఆన్లైన్లో జనరేటర్ కాలేదని చెప్తున్నారని మహిళలు అంటున్నారు. దీంతో డ్వాక్రా మహిళలు బ్యాంకులు, వెలుగు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నికల కోడ్ రావడంతో నగదు వస్తాయా.. లేదా అనే అనుమానంతో మహిళలు ఒకే సారి అధిక మొత్తంలో బ్యాంకులకు వస్తున్నారు. మండలంలో మొత్తం 938 డ్వాక్రా గ్రూపులు ఉండగా గ్రూపుకి రూ. 35 వేలు చొప్పున రూ. 3,28,30000 ఇవ్వాల్సి ఉంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే సరికి చెక్కులు చెల్లుతాయా... చెల్లినా నగదు ఇస్తారా ఇవ్వరా అనే అయోమయంలో ఉన్నారు. బ్యాంకుల వద్ద పడిగాపులు త్రిపురాంతకం: త్రిపురాంతకంలోని బ్యాంకుల వద్ద సోమవారం మహిళలు పడిగాపులు కాస్తున్నారు. వెలుగు ద్వారా పసుపు కుంకుమ పథకం పేరుతో ప్రభుత్వం నగదును అందిస్తున్నట్లు ప్రకటించింది. గత నెలరోజులుగా మహిళలందరికీ ఈ నగదు అందకపోవడంపై విమర్శలు ఉన్నాయి. వెలుగు సిబ్బంది మాత్రం మీకు త్వరలో వస్తాయని పొదుపు గ్రూపులకు మాటలు చెబుతున్నారు. దాంతో మహిళలో ఆందోళన వ్యక్తమవుతుంది. కొంత మందికి చెక్కులు వచ్చిన నగదు చేతికి రాలేదు. కొంతమంది పేర్లు వారి జాబితాలలో లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఎన్నికల షెడ్యూల్ రావడం, కోడ్ అమలులోకి రావడంతో ఇక ఈ మాటలన్ని కేవలం ఎన్నికల నిమిత్తం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలేనన్న అభిప్రాయం మహిళలు వ్యక్తం చేస్తున్నారు. -
డ్వాక్రా సభ్యులకు కిలాడి లేడీ టోకరా
అనంతపురం, గుత్తి రూరల్: సభ్యులకు తెలియకుండా డ్వాక్రా సంఘం పేరుపై రూ.5లక్షలు బ్యాంకు రుణం పొంది ఉడాయించిన కిలాడి లేడీ వ్యవహారం సోమవారం వెలుగు చూసింది. పట్టణంలోని లెవెన్ స్టార్ మహిళా సంఘం సభ్యులు 2015లో లోన్ కోసం సిండికేట్ బ్యాంకును సంప్రదించారు. అయితే మేనేజర్ లోన్ దరఖాస్తును తిరస్కరించారు. సభ్యుల సంతకాలతో కూడిన డ్వాక్రా సంఘం డాక్యుమెంట్లను ఇమాంబీ అనే మహిళ తీసుకుని తాను లోను ఇప్పిస్తానని నమ్మబలికింది. కొన్ని రోజుల తర్వాత లోను గురించి డ్వాక్రా లీడర్ సరస్వతి అడిగితే ఆమె సమాధానం ఇవ్వలేదు. లోను మంజూరు కాలేదేమోనని భావించి మిన్నకుండిపోయారు. అయితే ఇమాంబీ బ్యాంకు సిబ్బంది, అప్పటి మెప్మా సిబ్బందితో కుమ్మక్కై రూ.5లక్షల లోను మంజూరు చేయించుకుంది. 16 నెలలపాటు కంతులు చెల్లించాక ఇమాంబీ పత్తాలేకుండా పోయింది. కంతుల చెల్లింపులు ఆగిపోవడంతో రూ.3.95 లక్షల మేర బకాయి పేరుకుపోయింది. రికవరీ కోసం బ్యాంకు మేనేజర్ ప్రమోద్‌కుమార్ సోమవారం లెవెన్ స్టార్ మహిళా సంఘం లీడర్ సరస్వతిని పిలిపించాడు. గ్రూపు పేరిట అప్పు ఉందని, చెల్లించాలని చెప్పడంతో లీడర్ నిర్ఘాంతపోయింది. తమకు తెలియకుండా, తాము లేకుండా అంతపెద్ద మొత్తం ఎప్పుడు, ఎవరికి ఇచ్చారంటూ మేనేజర్‌ను నిలదీసింది. అవన్నీ తమకు తెలియదని ఏదైనా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని మేనేజర్ సూచించారు. ఈ మేరకు లీడర్ సరస్వతి తమకు న్యాయం చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇమాంబీ గతంలో కూడా గుత్తి స్టేట్‌బ్యాంకులో ఐదు డ్వాక్రా సంఘాలకు సంబంధించిన నగదు డ్రా చేసి పారిపోయిందని తెలిసింది. -
8న ‘డ్వాక్రా ఢమరుకం’
అనంతపురం: డ్వాక్రా మహిళలను రాష్ట్ర ప్రభుత్వం వంచించిన వైనాన్ని ఎండగడుతూ ఈ నెల 8న అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో ‘డ్వాక్రా ఢమరుకం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలని సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అడుగులేశారన్నారు. ఆయన మరణంతోనే సంక్పలం ఆగిపోయిందన్నారు. రాజన్న సంకల్పం నెరవేరాలంటే వైఎస్ జగనన్న ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణాలన్నీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఆయా మహిళలకు నేరుగా నాలుగు విడతలుగా వారి చేతికే ఇస్తామన్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ మహిళలకు పింఛన్ మంజూరు చేస్తామన్నారు. ఆయా వర్గాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే లక్ష రూపాయలు కానుకగా వైఎస్ జగన్ అందజేస్తారన్నారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళా సంఘాలను నిర్వీర్యం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని మండిపడ్డారు. ఐదేళ్లుగా మహిళలపై వేధింపులు, దాడులు అధికమయ్యాయన్నారు. మహిళా అధికారిణులు, విద్యార్థినులు, గ్రామీణ మహిళలు వివక్షకు గురయ్యారన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద రాష్ట్రంలోని మహిళలందరికీ మరుగుదొడ్లు నిర్మించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని రాష్ట్రం నిర్వీర్యం చేసిందన్నారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్కే రోజా హాజరుకానున్న ఈ కార్యక్రమాన్ని అరుణక్క, అనంతపురం, హిందూపురం పార్లమెంట్ల మహిళా విభాగం అధ్యక్షురాళ్లు బోయ గిరజమ్మ, పార్వతమ్మ, రాప్తాడు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అపర్ణ, అనంతపురం రూరల్ మండలం మహిళా అధ్యక్షురాలు మీనాక్షమ్మ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. వేలాదిగా మహిళలు తరలివచ్చి సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మహిళా విభాగం అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు బోయగిరిజమ్మ, రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షురాలు అపర్ణ, మండల కమిటీ అధ్యక్షురాలు మీనాక్షి, ఎంపీటీసీ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
‘పసుపు–కుంకుమ’ తెచ్చిన తంటా
అనంతపురం, ముదిగుబ్బ : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘పసుపు – కుంకుమ’ పేరుతో ప్రవేశపెట్టిన పథకం అబాసుపాలవుతోంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు..నాలుగున్నరేళ్లుగా హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికల తాయిళంలో భాగంగా డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన చంద్రబాబు..ఆమొత్తాన్ని మూడు దఫాలుగా ఇచ్చేందుకు పన్నాగం పన్నారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. కాగా మొదటి విడత చెక్కు మార్చుకునేందుకు మహిళలు నానాతంటాలు పడాల్సి వచ్చింది. సంఘంలోని సభ్యులందరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రెండు, మూడు రోజులుగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆవరణ అంతా కిక్కిరిస్తోంది. సాయంత్రం వరకు మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మండలంలో ఉన్న సంఘాలు – సభ్యులు మండంలో మొత్తం 1,186 గ్రూపులు ఉండగా 12,120 మంది సభ్యులు ఉన్నారు. వీరికి‘పసుపు –కుంకుమ’ పేరిట రూ.12.11 కోట్లు మంజూరైంది. ఈనగదు మండలంలోని ఏడు బ్యాంకుల పరిధిలో సంఘాల సభ్యులకు పంపిణీ చేయాల్సి ఉంది.గొడవలు తెస్తున్న ‘పుసుపు– కుంకుమ’పసుపు–కుంకుమ చెక్కులతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల మధ్య గొడవలవుతున్నాయి. కొందరు సభ్యులు సంఘాల్లో అధిక వడ్డీ చెల్లించలేక సంఘాల నుంచి తొలగిపోయారు. మరికొందరు సభ్యుల్లో ఐక్యత లేకపోవడంతో మరో సంఘంలోకి మారిపోయారు. కొందరు ఆన్లైన్లో పాత గ్రూపులో సభ్యులుగా ఉన్నట్లు నమోదై ఉండడంతో ఆపేరుతోనే చెక్కులు వచ్చాయి. దీంతో పాతవారికి ఇవ్వాలని కొందరు.. కొత్త సభ్యులకే దక్కుతుందని మరికొందరు గ్రామాల్లో గొడవ పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాం పుసుపు– కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ రోజూ తిరగాల్సి వస్తోంది. పొద్దున వస్తే సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నాం. బ్యాంకులో నగదు లేదని ఒకసారి, పదిమంది సభ్యులు కలిసి రావాలని మరోసారి తిప్పుకుంటున్నారు. ఇచ్చే రూ.2500 కోసం అవస్థలు పడాల్సి వస్తోంది.– నారాయణమ్మ, ఈదులపల్లిపెద్దమ్మస్వామి మహిళా సంఘం సభ్యురాలు పావలా వడ్డీ ఎగ్గొట్టే ప్రయత్నం మూడేళ్ల పాటు సకాలంలో బ్యాంకుల రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ గతంలో వచ్చేది. కానీ టీడీపీ ప్రభుత్వం పావలావడ్డీని ఎగ్గొట్టేందుకే పసుపు–కుంకుమ పేరుతో చెల్లని చెక్కులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం మహిళలను అష్టకష్టాలు పెడుతోంది. – పద్మావతి, నాగారెడ్డిపల్లి,గణేష్ మహిళా సంఘం సభ్యురాలు -
పసుపు,కుంకుమ నగదు కోసం వచ్చి పరలోకానికి..
విశాఖపట్నం, పాడేరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన పసుపు,కుంకుమ చెక్కులు మార్చుకునేందుకు మహిళలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఈ చెక్కును మార్చుకునేందుకు వెళ్లిన ఓ మహిళ సోమవారం దుర్మరణం చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. పసుపు,కుంకుమ చెక్కులను పాడేరు యూనియన్ బ్యాంకులో తమ ఖాతాలో జమ చేసుకొని, నగదు తీసుకునేందుకు హుకుంపేట మండలం బాకూరు పంచాయతీ గొప్పులపాలెం గ్రామానికి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం వచ్చారు. కానీ బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలు స్తంభించడం, బ్యాంకులో లింక్ ఫెయిల్ కావడంతో నగదు తీసుకునేందుకు వీలుపడలేదు. దీంతో మహిళలు ఓ ఆటోలో గ్రామానికి తిరుగుముఖం పట్టారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హుకుంపేట సమీపంలోని రాళ్ళగెడ్డ వంతెన వద్ద ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ సంఘటనలో గొప్పులపాలెం గ్రామానికి చెందిన సూకురు నీలవేణి(45) అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న అదే గ్రామానికి చెందిన చెదల చిలకమ్మ, చెదల బుల్లమ్మలతో పాటు మొత్తం మంది మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. వీరంతా పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. పోస్టుమార్టం కోసం నీలవేణి మృతదేహాన్ని పాడేరు ప్రాంతీయ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆస్పత్రి మార్చురీ వద్ద నీలవేణి కుమార్తె, కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. మృతి చెందిన డ్వాక్రా మహిళ నీలవేణి భర్త ఏడాది క్రితమే అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె కూలిపనులు చేస్తూ కుమార్తె, కుమారుడిని చదివిస్తోంది. ఆటో ప్రమాదంలో ఇప్పుడు తల్లి కూడా మృతి చెందడంతో వారు అనాథలయ్యారు. -
‘పసుపు–కుంకుమ’ కోసం ఆత్మాభిమానం చంపుకోలేం
అనంతపురం , ఓడీ చెరువు: అందరూ కచ్చితంగా బ్యాంకుకు రావాల్సిందేనని, లేకుంటే పసుపు – కుంకుమ డబ్బు ఇచ్చేది లేదని వెలుగు సీసీలు చెబుతుండటంపై మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు. ఇంటివద్ద పనులతోపాటు చండిబిడ్డలను కూడా వదిలేసి బ్యాంకు వద్దకు వస్తే రోజుల తరబడి తిప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలంతా బ్యాంకు గోడల కింద వేచి ఉండాల్సి వస్తోందని, సిగ్గుతో చచ్చిపోతున్నామని ఆవేదన చెందారు. సీసీల వైఖరిని నిరసిస్తూ బుధవారం వారు మండల కేంద్రమైన ఓడీ చెరువులో ఏపీజీబీ బ్యాంకు వద్ద కదిరి – హిందూపురం రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీపీఐ నాయకులు మున్నా, చలపతి, బీసీ జనసభ మండల అధ్యక్షుడు ఎం.ఎస్.షబ్బీర్ వారికి మద్దతు పలికి సీసీల తీరును నిరసించారు. ఈ సందర్భంగా గాజుకుంటపల్లి, ఎం.కొత్తపల్లి, మహమ్మదాబాద్‌క్రాసింగ్, భోగానిపల్లి, ఇనగలూరు, నల్లగుట్లపల్లి, నారప్పగారిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన పలువురు మహిళలు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సాధారణంగా గ్రూపు లీడర్లు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తే సంఘంలో పంచుకుంటున్నామని, కానీ పసుపు – కుంకుమ చెక్కులు మార్చుకోవాలంటే అందరూ రావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. అన్ని పనులూ వదిలిపెట్టి ఇక్కడికొస్తే బ్యాంకు గోడల కింద ఉండాల్సి వస్తోందని, ఇలా ఎన్నిరోజులని ఆత్మాభిమానం చంపుకోవాలని గాజుకుంటపల్లి, ఎం.కొత్తపల్లి, భోగానిపల్లి మహిళలు మహిత, శివమ్మ, నాగమణి, సరస్వతి, ధనలక్ష్మి తదితరులు వాపోయారు. మహిళలను గౌరవించడమంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇలా తమను వేధిస్తున్న వెలుగు సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. దీంతో ఏఎస్ఐ ఇషాక్ వచ్చి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారి కోపం తగ్గలేదు. చివరికి ఏపీజీబీ మేనేజర్ వెంకట్రావ్ వచ్చి వారితో మాట్లాడారు. తామేమీ మిమ్మల్ని బ్యాంకుల వద్దకు రావాల్సిందేనని చెప్పలేదని, సీసీల అంగీకారంతో తీర్మానం చేసుకుని బ్యాంకుకు వస్తే కచ్చితంగా మీరు చెప్పినట్లే డబ్బులు ఇస్తామని చెప్పారు. దీంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. అందరూ రావాల్సిందే సంఘాల్లోని ప్రతి మహిళా బ్యాంకు విధిగా హాజరు కావాల్సిందే. లేకుంటే డబ్బులు ఇచ్చేందుకు వీలు పడదు. ఇవి మా వెలుగు పీడీ నుంచి వచ్చిన ఆదేశాలు. మేము ఆ మేరకే నడుచుకుంటాం. – శంకర్‌నాయక్, సీసీ, ఓడీసీ -
రుణాల పేరుతో మోసగిస్తారా?
దూదేకుల ఫెడరేషన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకుని రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమైన కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకున్నారు. రుణాల ఆశచూపి సభలకు, సమావేశాలకు మూడేళ్లుగా తిప్పుకున్నారు. ఓపిక నశించిన బాధిత మహిళలు ఆదివారం నగరంలో జరిగిన దూదేకుల జాబ్‌మేళాను వేదికగా నూర్‌బాషా కో ఆపరేటివ్ సొసైటీ నాయకులను నిలదీశారు. దీంతో నేతలంతా మాటమార్చగా...ఓట్లు అడిగేందుకు వస్తారుగా... అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. అనంతపురం సప్తగిరి సర్కిల్: సొసైటీల పేరుతో రుణాలందచేస్తామని సమావేశాలకు పిలిపించుకుని ఇప్పుడు రుణాల ఊసే ఎత్తడం లేదని పలువురు మహిళలు నూర్‌బాషా కో ఆపరేటివ్ సొసైటీ నేతలను నిలదీశారు. వివరాల్లో కెళ్తే.. అనంతపురం నగర సమీపంలోని దూదేకుల కమ్యూనిటీ హాలులో ఆదివారం దూదేకుల యువతీయువకులకు జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు సంఘం నాయకులు ప్రతికా ప్రకటనలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి అనంతపురంతో పాటు కర్నూలు, కడప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో యువతీయువకులు హాజరయ్యారు. సమావేశంలో దూదేకుల సొసైటీ రాష్ట్ర చైర్మన్ సి.బాబన్, జిల్లా అధ్యక్షుడు దాదాఖలందర్, జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఈడీ బాబా తాజుద్దీన్ తదితరులు మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన పథకాలతోపాటు, సంఘం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. నాయకుల ప్రసంగాలు పూర్తయినా రుణాల ఊసేత్తలేదు. దీంతో గార్లదిన్నె మండలం కల్లూరుకు చెందిన మహిళలు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ రాష్ట్ర చైర్మన్ బాబన్, జిల్లా అధ్యక్షుడు దాదాఖలందర్, ఇతర నాయకులను రుణాల విషయమై నిలదీశారు. దూదేకుల ఫెడరేషన్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసిన సంఘం నాయకులు రూ.3 వేలు చెల్లిస్తే రూ.30 వేలు సబ్సిడీ రుణాలు ఇప్పిస్తామని తెలిపారన్నారు. దీంతో 15 మంది గ్రూపుగా ఏర్పడి రుణాలకు అవసరమై కుల, ఆదాయ, తదితర ధ్రువీకరణ పత్రాలను సిద్ధం చేసుకున్నామన్నారు. రుణాల ఆశచూపి సభలకు, సమావేశాలకు మూడేళ్లుగా తిప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిక నశించిన బాధిత మహిళలు జాబ్‌మేళాను వేదికగా చేసుకుని నూర్‌బాషా కో ఆపరేటివ్ సొసైటీ నాయకులపై ప్రశ్నల వర్షం కురిపించారు. నాయకులు సమాధానమిస్తూ రుణాలను అందించేందుకు ఈ సమావేశం నిర్వహించలేదన్నారు. రుణాల మంజూరు చేయడమంటే తమ జేబులోంచి డబ్బు తీసివ్వడం కాదన్నారు. మీకు రుణాలు కావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును అడగండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో మహిళలు విరుచుకుపడ్డారు. ఓట్లు అడిగేందుకు వస్తే అప్పుడు తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. ఎన్నికలు వస్తున్నాయని సంఘం పేరుతో గిమ్మిక్కులు చేయాలని చూస్తే మోసపోవడానికి సిద్ధంగా లేమన్నారు. రుణాల పేరుతో మహిళలను సభలకు రప్పించుకోవడం, తిప్పుకోవడమే వీరి పని అంటూ శాపనార్థాలు పెట్టారు. -
చెక్కులివ్వాలంటే చెల్లించాల్సిందే!
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆత్రుతలో టీడీపీ నాయకులు ఉన్నారు. అందులో భాగంగా డ్వాక్రా సంఘాల వద్ద కూడా వసూళ్లు ప్రారంభించారు. మరో నాలుగు నెలల్లో తమ పదవి కాలం ముగుస్తున్నందున ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పసుపు – కుంకుమ పథకంలో డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేసే విషయంలో స్థానిక క్షేత్రస్థాయి సిబ్బందితో సంఘాల నుంచి వసూళ్ల దందా మొదలెట్టారు. ఒక్కో గ్రూపు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు. కృష్ణాజిల్లా, పటమట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతున్న పసుపు–కుంకుమ పథకంలో డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ అవినీతిమయంగా మారింది. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగం సిబ్బంది కుమ్మకై లబ్ధిదారులైన డ్వాక్రా సంఘాల నుంచి సొమ్ములు దండుకుంటున్నారు. సొమ్ములు చెల్లించకపోతే డిఫాల్టర్ల గ్రూపులుగా చిత్రీకరించి చెక్కులు ప్రభుత్వానికి తిరిగి పంపుతామని హెచ్చరిస్తూ, ఒక్కో గ్రూపు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.12 వందల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల వీఎంసీ కమిషనర్‌కు నేరుగా స్థానిక మహిళలు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలోని 52వ డివిజన్లో ఉన్న 350 గ్రూపుల నుంచి స్థానిక సీవో (కమ్యూనిటీ ఆర్గనైజర్), సోషల్ వర్కర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, రిసోర్స్ పర్సన్లతో స్థానిక టీడీపీ మహిళా నేత కుమ్మకై ఒక్కో గ్రూపు నుంచి సొమ్ములు వసూలు చేయాలని, సంఘాల వద్ద వసూలు చేసిన సొమ్ములో పర్సంటేజీలు లెక్క పంపకాలు చేసుకుందామని ఓపెన్ ఆఫర్ ఇవ్వటంతో యూసీడీ విభాగం సిబ్బంది చెలరేగిపోయారు. ప్రతి గ్రూపు నుంచి స్థానిక నేతలకు వాటాలు ఇవ్వాలని బలవంతంగా వసూళ్లు చేయటంతో మహిళలు వీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత సిబ్బంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని, సంఘాలకు సంబంధించి డిఫాల్టు లేదని నిర్థారించేందుకు సొమ్ములు వసూలు చేశారని, నగరంలోని 51, 52, 53 డివిజన్లలో వసూళ్లు అధికంగా ఉన్నాయని, నగరంలోని 59 డివిజన్లకు 40 చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు.. పసుపు – కుంకుమ పథకంలో వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై, అందుకు కారణమైన స్థానిక నేత పాత్రలపై వీఎంసీ విచారణ చేపట్టింది. యూసీడీ పీవో ఎంవీవీ సత్యనారాయణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. డ్వాక్రా సంఘాలతో సమావేశమై విచారణ నిర్వహించారు. శాఖాపరమైన చర్యలుతీసుకుంటాం.. పసుపు – కుంకుమ పథకంలో లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చే నేపథ్యంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శన చేశారని వచ్చిన ఆరోపణలతో విచారణ చేపట్టాం. అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలోని ఓ సీడీవో వద్ద గ్రూపు సభ్యులకు ఇవ్వాల్సిన 120 చెక్కులను గుర్తించాం. ఆయా గ్రూపు సభ్యులు సిబ్బందికి సొమ్ములు చెల్లించకపోవటంతో వారికి వీటిని అందించలేదు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడి కూడా సిబ్బందిపై ఉంది. దీనిపై కమిషనర్‌కు నివేదిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.– ఎంవీవీ సత్యనారాయణ, పీవో యూసీడీ -
చింతపల్లిలో టీడీపీ నేతల దౌర్జన్యం
గుంటూరు, కారంపూడి(మాచర్ల): మండలంలోని చింతపల్లి గ్రామంలో టీడీపీ నేతలు రజకులపై దౌర్జన్యానికి తెగబడ్డారు. టీడీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తగులబెట్టిన నేపథ్యంలో రజకుల బజారుపై దండెత్తి అక్కడి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. గ్రామంలో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను ఎవరో తగులబెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు రజకుల ఇళ్లపైకి వచ్చి పరుషపదజాలంతో దూషిస్తూ, అడ్డువచ్చిన శివ అనే యువకుడిని గాయపర్చారని వైఎస్సార్సీపీ నేత అలుగునూరి అమరయ్య, మహిళలు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఇంటికి సమీపంలో బావిపై వేసుకున్న మోటారును ధ్వంసం చేసి పైపులను కోశారని వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి పంగులూరి రామకృష్ణయ్య ఫిర్యాదు చేశారు. తమ ఫ్లెక్సీలను వైఎస్సార్సీపీ నేతలు తగులబెట్టారని ఆరోపిస్తూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదులను స్వీకరించి ఎస్ఐ మురళి గ్రామంలో విచారణ చేస్తున్నారు.ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో గ్రామంలో ఇలాంటి కవ్వింపు చర్యలకు ఎవరూ పాల్పడవద్దని ఇరుపార్టీల వారికి ఎస్ఐ విజ్ఞప్తిచేశారు. -
చంద్రన్న ఎన్నికల గారడీ
బత్తలపల్లి : ఎన్నికలు సమీపిస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారడీ మొదలైంది..2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏఒక్కటీ నెరవేర్చకపోగా ఇప్పుడు ఎన్నికల తాయిలాలు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డ్వాక్రా, రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బాబు..అధికారం చేపట్టాక ఆవిషయాన్ని తుంగలో తొక్కి డ్వాక్రా మహిళలను పూర్తిగా నట్టేట ముంచాడని మహిళలు ఒక వైపు వాపోతున్నారు. మహిళలను మభ్యపెట్టేందుకు చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టారంటున్నారు. విడతలవారీగా మోసం ♦ ముదిగుబ్బకు చెందిన సుజాతమ్మ ఓ పొదుపు సంఘంలో సభ్యురాలు. పసుపు –కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇస్తున్న రూ.10 వేలు ఇస్తోందని ప్రకటించడంతో కరువు కాలంలో కొంతైనా ఆసరాగా ఉంటుందనుకుంది. కుటుంబ అవసరాలు తీరుతాయని సంబరపడింది. ప్రభుత్వం చెక్కుల రూపంలో మొదటి విడతగా రూ.2500 మాత్రమే ఇస్తోందని, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి మళ్లీ మోసం చేస్తున్నారేమోనని నిట్టూరుస్తోంది. నాలుగున్నరేళ్లలో ఏ ఒక్క హామీనీ పూర్తిగా నెరవేర్చని ప్రభుత్వం..ఇప్పటికప్పుడు ఎన్నికలకోసమే మభ్యపెడుతోందని అంటోంది. గందరగోళంగా ఉంది.. ♦ తాడిమర్రికి చెందిన నాగరత్నమ్మ పొదుపు సంఘం సభ్యురాలు. గతంలో పసుపు–కుంకుమ పేరుతో ప్రభుత్వం రూ.10 వేలు పొదుపు సంఘాల సభ్యులకు పెట్టుబడి నిధి కింద నాలుగు విడతలుగా ఇస్తామని ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఇద్దరు సభ్యులకు అప్పుగా ఇచ్చి, తద్వారా వచ్చే వడ్డీని వాడుకోవాలని సూచించింది. కుటుంబ అవసరానికి వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో అయోమయానికి గురవుతోంది. మరోమారు మోసానికి తెర చంద్రబాబు అధికారం చేపట్టగానే రుణమాఫీ చేస్తామని చెప్పి ఇంత వరకూ చేయలేదు. రుణమాఫీ హామీతో మహిళా సంఘాలు బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ వాయిదా చెల్లించకపోవడంతో అసలు వడ్డీ తడిసి మోపెడైంది. ఆర్థికంగా మహిళా సంఘాలు చితికిపోయాయి. ధర్మవరం నియోజకవర్గంలో కొన్ని బ్యాంకర్లు డ్వాక్రా సంఘం మహిళల ఖాతాల్లో జమ అయిన గ్యాస్ డబ్బులు, ఉపాధి హామీ కూలీల ఖాతాల్లో ఉన్న డబ్బును అప్పు కింద జమచేసుకున్న సంఘటనలు ఉన్నాయి. అందుకే ఈ సారి డ్వాక్రా మహిళలు చంద్రబాబు హామీలను నమ్మేందుకు సిద్ధంగా లేమని బహిరంగంగా విమర్శిస్తున్నారు. కొత్త డ్రామాకు శ్రీకారం.. మరో రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారు. డ్వాక్రా సంఘాల్లోని ప్రతి సభ్యురాలికీ ఒక్కొక్కరికి రూ.10వేలు దఫాలుగా ఇస్తామని పోస్ట్ డేటేడ్ చెక్కులను మహిళలకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏమిటంటే చెక్కులు ఇచ్చిన వెంటనే మార్చుకునేందుకు వీలుకాదు. ప్రస్తుతం ఇచ్చిన చెక్కులపైన ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అనినుంది. గత ఎన్నికల ముందు చంద్రబాబు మోసపూరిత హామీలను నమ్మి పూర్తిగా మోసపోయాం..ఇక ఎప్పుడూ బాబూ మాటలను నమ్మమని మహిళలు అంటున్నారు. రుణాలు మాఫీకాలేదు చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నమ్మి రుణాలు తీసుకుంటే ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. ఈ సారి బాబు మాటలు నమ్మి మోసపోయేందుకు సిద్ధంగా లేం. నాలుగున్నరేళ్లుగా ఏమీ చేయకుండా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో మహిళలు గుర్తుకు వచ్చారా? – సుగుణ, పొదుపు సంçఘం సభ్యురాలు, ధర్మవరం. -
కార్యాలయాలకు తాళాలు
శ్రీకాకుళం ,పొందూరు: మండలంలో తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గోకర్నపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చింతాడ ప్రసాదరావు, కిల్లి నాగేశ్వరరావులు ఆధ్వర్యంలో మంగళవారం మండల పరిషత్ కార్యాలయం, వెలుగు కార్యాలయాలను సుమారు 200 మంది ముట్టడించారు. టీడీపీ జెండాలతో ఎంపీడీఓ కార్యాలయంలోకి ప్రవేశించి రసాభాస చేశారు. కుర్చీలను విరగ్గొట్టారు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఒక వర్గానికే పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్‌లు ఇమ్మని చెప్పారా అని ఈఓపీఆర్డీ మధుసూదనరావును నిలదీశారు. రచ్చబండ వద్ద పింఛన్లు ఇవ్వాలని ఎంపీడీఓ ఆదేశాలిస్తే వీఆర్ఓ జనక చక్రవర్తి సర్పంచ్ ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. వీఆర్ఓ రాజీకీయం చేస్తున్నారని, వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం బయటకు ఉద్యోగులను పంపించేశారు. పోలీసులు సముదాయిస్తున్నప్పటికీ లెక్కచేయలేదు. ఆందోళనను కొనసాగిస్తూ ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ కార్యాలయానికి తాళాలు వేశారు. పక్కనే ఉన్న వెలుగు కార్యాలయానికి చేరుకొని ఏపీఎం మంగమ్మను బయటకు పిలిచి తాళాలు వేశారు. తమ గ్రామంలో పసుపు–కుంకుమ చెక్‌లను సర్పంచ్ ఇంటికి అందించారని నిలదీశారు. రచ్చబండ దగ్గర ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారా అంటూ ఏపీఎంపై మండిపడ్డారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు మంగమ్మను వెలుగు కార్యాలయంలోకి పంపిచేశారు. పసుపు–కుంకుమ చెక్కులను అందించే వరకు ఇక్కడే కూర్చుంటామని బైఠాయించారు. ఇంతలో సీఐ విశ్శేశ్వరరావు, ఎంపీడీఓ చింతాడ లక్ష్మీబాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెపు రాము అక్కడకు చేరుకోవడంతో ఆందోళన కొనసాగించారు. పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్‌లు తక్షణమే ఇవ్వాలని, లేదంటే రచ్చబండ వద్ద అందించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోబతికున్న ఇద్దరు చనిపోయారని డెత్ సర్టిఫికెట్లను సృష్టించి వారి భార్యలకు పింఛన్లు ఎలా ఇస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై ఎంపీడీఓ స్పందించి విచారణ జరిపిస్తామని హామీఇచ్చారు. అనంతరం ఎంపీడీఓ చాంబర్లో కాసేపు చర్చించుకున్న అధికారులు బయటకు వచ్చి బుధవారం పింఛన్లు, చెక్‌లు రచ్చబండ వద్దే అందిస్తామని హామీనిచ్చారు. దీంతో గ్రామస్తులు వెనుదిరిగారు. -
మహిళలపై స్వయంగా మంత్రి సోదరుడి దాడి
సాక్షి, అనంతపురం: జిల్లాలో డ్వాక్రా మహిళలపై అధికార పార్టీ నేతల దాడులు కొనసాగుతున్నాయి. స్వయంగా మంత్రి పరిటాల సునీత సోదరుడు మురళీ మహిళలపై రాళ్లు రువ్వాడు. పోలీసుల సమక్షంలోనే మంత్రి సోదరుడు మురళీ రెచ్చిపోయాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటేస్తామని ప్రమాణం చేయాల్సిందిగా పరిటాల వర్గీయులు అడుగగా.. అందుకు డ్వాక్రా మహిళలు నిరాకరించారు. దీంతో రెచ్చిపోయిన మంత్రి పరిటాల సునీత వర్గీయులు దాడులకు దిగారు. పోలీసుల సమక్షంలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మంత్రి సోదరుడు మురళీ, పరిటాల అనుచరుల దాడి దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. -
చెక్కులు తెచ్చిన చిచ్చు
నెల్లూరు, కావలి: కావలి పట్టణంలోని వైకుంఠపురం ప్రాంతంలో సోమవారం పొదుపు మహిళలకు పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సిగపట్లు పట్టారు. పొదుపు నగదు సక్రమంగా చెల్లించకుండా, చెక్ తీసుకోవడానికి వచ్చావని ఒక గ్రూపులోని మహిళను అదే గ్రూపునకు చెందిన మరో మహిళ ప్రశ్నించడంతో కోపంతో మొదటి మహిళ రెండో మహిళలను చెంప చెళ్లు మనిపించింది. ఇద్దరూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంతలో అక్కడ ఉన్న వారంతా వచ్చి ఇద్దరీని విడదీసి పక్కకు నెట్టడంతో వివాదం సద్దుమణిగింది. -
మా డబ్బులు ఎక్కడ?
ప్రకాశం, కురిచేడు: ఆవులమంద బ్యాంకులో తాము తీసుకున్న రుణాల కిస్తీలు, పొదుపు డబ్బుల కిస్తీలు జమ కాలేదని మండలంలోని పడమరనాయుడుపాలెం, వీవై కాలనీకి చెందిన పలువురు డ్వాక్రా మహిళలు సోమవారం ఆందోళనకు దిగారు. సుమారు 45 గ్రూపులకు చెందిన 400 మంది సభ్యులు బ్యాంకు ఎదుట బైఠాయించారు. తమకు న్యాయం జరిగే వరకూ బ్యాంకు నుంచి కదిలేది లేదని హెచ్చరించారు. వివరాలు.. బ్యాంకు పరిధిలోని పడమర నాయుడుపాలెం గ్రామానికి చెందిన పల్లె రవీంద్ర ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో బుజినెస్ కరస్పాండెంట్‌గా పనిచేస్తున్నాడు. రవీంద్ర గత నెల 30వ తేదీ మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. 31వ తేదీ ఐనవోలు మేజర్‌లో శవమై తేలాడు. రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మృతి చెందాడా? లేక ఎవరైనా చంపేసి కాలువలో పేడాశారా? అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రవీంద్ర బ్యాంకులో బిజినెస్ కరస్పాండెంటుగా పనిచేస్తుండటంతో నాయుడుపాలెం, వల్లేల యానాదికాలనీకి చెందిన మహిళలు డ్వాక్రా రుణాలతో పాటు పొదుపు నగదు తమ ఖాతాల్లో జమ చేయమని నగదు అతనికి ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో రవీంద్ర అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో పలువురు డ్వాక్రా మహిళలు తమ ఖాతాల్లో నగదు జమైంది.. లేంది చెక్ చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు. అక్కడ మేనేజర్ డ్వాక్రా మహిళల సూచన మేరకు ఖాతాలు చెక్ చేయడంతో నగదు జమకానట్లు తేలింది. దీంతో నాయుడుపాలెం, వీవై కాలనీ గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపుల సభ్యులు బాంకు ఎదుట క్యూ కట్టారు. మేనేజర్ నగదు కోసం మార్కాపురం వెళ్లగా గ్రూపుల సభ్యులు మాత్రం బ్యాంకు ఎదుట బైఠాయించారు. ఎవరికి వారు తాము చెల్లించిన మొత్తాలు నీటిపాలైనట్లేనా? అని ఆందోళనకు దిగారు. బ్యాంకులో తీసుకున్న పొదుపు రుణాలు చెల్లించినట్లు రవీంద్ర తమ తీర్మానాల పుస్తకంలో ఒక వైపు రాసి ఉన్నాడు. కానీ ఆ నగదు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. దీంతో ఏయే ఖాతాల్లో ఎంతమేరకు నిధులు జమ కాలేదోనని మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేయడం బ్యాంకు సిబ్బందికి సాధ్యం కాలేదు. సుమారు రూ.50 లక్షలకుపైగా నిధులు గోల్‌మాల్‌లై ఉండోచ్చని మహిళలు చెబుతున్నారు. సమగ్ర విచారణ జరిగితేనే వాస్తవాలు బయటపడతాయి. గతంలో కూడా బ్యాంకులో భారీ స్థాయిలో కుంభకోణం జరిగి ఉండటం, ఆ విషయాన్ని ఖాతాదారులు మరువక ముందే అదే తరహాలో మరో అవినీతి విషయం బయట పడటంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. నగదు వసూలుకు ఎవరినీనియమించలేదు: డ్వాక్రా మహిళల వద్ద రుణాలు, పొదుపు డబ్బులు వసూలు చేసేందుకు ఎవరినీ నియమించలేదు. బిజినెస్ కరస్పాండెంట్‌కు పొదుపు డబ్బులు వసూలు చేసే అధికారం లేదు. ఆ ట్యాబ్‌లో ఆప్షన్ కూడా లేదు. ఓడీ ఖాతాలు కావడంతో ఎన్పీ అయితేనే వాటిని పరిశీలిస్తాం. గేదెల రుణాలు ఎక్కువగా ఎన్పీ అవుతున్నాయి. వాటి వసూలుకే మాకు సమయం సరిపోతోంది.శేషారావు, బ్యాంకు మేనేజర్ -
పరిటాల దౌర్జన్యకాండ
-
డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయుల దాడి
సాక్షి, అనంతపురం : జిల్లాలోని రాప్తాడు మండలం గొందిరెడ్డిపల్లిలో నిర్వహించిన పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయాలని జారీ చేసిన హుకుంను నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఐదుగురు మహిళలకు గాయాలయ్యాయి. వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం, సోదరుడు మురళీ సమక్షంలోనే ఈ దాడులు జరిగాయని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయాలంటూ ప్రమాణం చేయించుకోవడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు పాలభిషేకం, టీడీపీకి ఓటు వేయాలని ప్రమాణం చేస్తేనే చెక్కులు ఇస్తున్నారు మహిళలు ఆరోపిస్తున్నారు. -
బాబు మాటలను నమ్మవద్దు
వైఎస్ఆర్ జిల్లా, సుండుపల్లె: డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు మళ్లీ చెక్కులపేరుతో కుట్రపన్నారని రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆరోపించారు. సుండుపల్లె మండలంలో జీకే రాచపల్లెలో వివాహ వేడుకలకు ఆయన హాజరయ్యారు. అదేవిధంగా బెస్తపల్లి, పింఛా, పొలిమేరపల్లె పలుప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోస్ట్‌డేటెడ్ చెక్కులను మూడు విడతలుగా ఇస్తామనడంలో వారి బండారం బయటపడుతోందని ఎద్దేవా చేశారు. ఇది మహిళలను బురిడీకొట్టించడానికే తప్పా దేనికీ పనికిరాదు. అబద్ధపు మాటలు, మోసాలు చేయడం బాబుకు అలవాటని విమర్శించారు. నిత్యం ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తున్న టీడీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలన్నారు. అందరితో కలసిమెలసి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఆర్థికసాయం: పొలిమేరపల్లి గ్రామపంచాయతీ చిన్నరెడ్డిగారిపల్లెకు చెందిన రవి అనే యువకుడు పెరాలసిస్‌తో భాధపడుతుండటంతో మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి ఆస్పత్రి ఖర్చులకుగానూ రూ.5వేలు ఆర్థికసాయం చేశారు. -
మంత్రి కాన్వాయ్‌పై చెప్పుల వర్షం
-
‘పసుపు–కుంకుమ’లో రికార్డింగ్ డ్యాన్స్
సాక్షి, అమరావతి/పొందూరు: రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం పసుపు– కుంకుమ కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల అపహాస్యం పాలయ్యాయి. డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పసుపు– కుంకుమ కింద పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది. మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం (ఎన్ఆర్ఎల్ఎం) అమలుకు రాష్ట్రానికి కేంద్రమిచ్చిన రూ. 31.60 కోట్లు ఈ కార్యక్రమానికి మళ్లించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, ఈ డబ్బులతో గ్రామాల్లో ఏర్పాటుచేసిన వేదికలను కొన్నిచోట్ల స్థానిక టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు రికార్డింగ్ డాన్స్‌లకు వేదికలుగా మార్చారు. పట్టపగలే మహిళల రికార్డింగ్ డాన్స్‌లు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వ డబ్బులతో ఏర్పాటు చేసిన అధికారిక వేదికలపై టీడీపీ నేతలు రికార్డింగ్ డాన్స్‌లు వేయిస్తుంటే ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అనుమతి తెలుపుతోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విప్ ‘కూన’కు చేదు అనుభవం ప్రభుత్వం విప్ కూన రవికుమార్‌కు సొంత పార్టీ కార్యకర్తల నుంచే చేదు అనుభవం ఎదురైంది. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని లోలుగు గ్రామంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమం జరగకుండా అడ్డుకొన్నారు. రవికుమార్ టెంట్‌లోకి అడుగుపెడుతుండగానే తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో పాటు, టీడీపీ స్థానిక నేత లోలుగు శ్రీరాములనాయుడుకు ప్రాధాన్యత నివ్వకపోవడంపై ప్రశ్నించారు. అయితే రవికుమార్ ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కొంతమంది కార్యకర్తలు టెంట్లు పీకేశారు. కుర్చీలు లాగేశారు. ఫైళ్లు విసిరేసారు. డౌన్ డౌన్ రవికుమార్ అంటూ నినాదాలు చేశారు. రవికుమార్ గోబ్యాక్ అంటూ నిరసన తెలియజేశారు. దీంతో పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం పూర్తికాలేదు. దీంతో చేసేదిలేక పోలీసు బందోబస్తు మధ్య విప్ రవికుమార్ వెళ్లిపోయారు. -
మహిళామంత్రి సమక్షంలో ఆడపడుచులపై దౌర్జన్యం
ఆత్మకూరు: రాష్ట్ర మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గంలో మహిళలపై దౌర్జన్యం జరిగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మంత్రిని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన మహిళలను పోలీసులు ఈడ్చిపారేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. దీంతో ఆగ్రహించిన మహిళలు మంత్రి సునీత కాన్వాయ్‌పై చెప్పులు, పొరకలు, చేటలు విసిరి నిరసన తెలిపారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చేయకుండా మోసం చేసి, తిరిగి ఎన్నికల సమయంలో మోసపు మాటలు చెప్పడం, ప్రశ్నించిన మహిళలను పోలీసులతో అరెస్టు చేయించి విచక్షణారహితంగా వ్యవహరించడంతో మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని తోపుదుర్తిలో ఆదివారం ‘పసుపు–కుంకుమ’ కార్యక్రమం ద్వారా డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేయడానికి మంత్రి పరిటాల సునీత వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. తమకిచ్చిన హామీలు నెరవేరిస్తేనే గ్రామంలోకి మంత్రిని అడుగుపెట్టనిస్తామని మహిళలు తెగేసి చెప్పారు. దీంతో 400 మంది పోలీసుల భద్రతతో మంత్రి వెళ్లారు. మంత్రి వస్తున్న సమయంలో వందలాది మంది మహిళలు నల్లజెండాలు చేతపట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. మహిళలపై పోలీసుల జులుం మహిళలను పోలీసులు అరెస్టు చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలో మహిళలు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. రుణమాఫీ చేస్తామని చేయకుండా కేవలం రూ.10వేలు పెట్టుబడి నిధి కింద ఇచ్చారని, ఇది బ్యాంకర్లు రుణం కింద జమ చేసుకున్నారని.. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు ఇస్తాం, స్మార్ట్ ఫోన్లిస్తామని మోసపూరిత మాటలు చెబుతున్నారని.. మండిపడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించడంతో కొందరికి గాయాలయ్యాయి. రోడ్డుపై కిందపడిపోతే ఈడ్చుకుంటూ వెళ్లి వాహనంలోకి ఎక్కించారు. సమావేశానికి మహిళలను తెచ్చుకున్న మంత్రి అనంతరం తన కార్యక్రమంలో పాల్గొనేందుకు మహిళలను సొంతంగా ఏర్పాటు చేసిన 60 వాహనాల్లో ఇతర గ్రామాలనుంచి రప్పించారు. మంత్రి కారుపై గ్రామస్తులు పెద్ద ఎత్తున చెప్పులు విసిరారు. అదే సమయంలో మంత్రి తనయుడు పరిటాల శ్రీరాం తన అనుచరులతో గ్రామానికి వచ్చారు. ఇతర గ్రామాల నుంచి వచ్చిన వారితో సమావేశం తూతూమంత్రంగా నిర్వహించి వెనుదిరిగారు. తాళిబొట్టు తెంపేశారు డ్వాక్రా రుణం మాఫీ కాలేదని మంత్రిని ప్రశ్నించాలనుకున్నాం. పోలీసులు అడ్డుకోవడంతో దాదాపు మూడు గంటల పాటు రోడ్డు పైనే కూర్చున్నాం. మంత్రి వస్తున్నారని పోలీసులు రోడ్డుపై ఉన్న మమ్మల్ని ఈడ్చిపడేశారు. ఆ సమయంలో నా తాళిబొట్టు తెగిపోయింది. ఇంత అరాచకం చేస్తారా? ఒక మహిళగా మంత్రి సునీత వ్యవహరించిన తీరు ఏం బాగోలేదు. మా ఉసురు తప్పక తగులుతుంది. – మమత, తోపుదుర్తి -
అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత
-
పల్లె మాట..నీటి మూట!
మహిళా సంఘాలు ఏర్పడినప్పటి నుంచి ఆ గ్రామంలో ప్రతినెలా సక్రమంగా పొదుపును జమ చేసుకుంటూ, బ్యాంకు నుంచి రుణాలను తీసుకుని అవసరాలకు వాడుకుంటూ కంతు మొత్తాన్ని చెల్లించుకుంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపేవారు. అలాంటి వారి జీవితాల్లో ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి రుణమాఫీ పేరుతో ఆశలు రేపారు. ఆ తర్వాత రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీ మీద వడ్డీ కట్టి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. తాజాగా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు రావడంతో కసముద్రం మహిళలు ఆందోళన చెందుతున్నారు. అనంతపురం, అమడగూరు: గత ఎన్నికల్లో పల్లె రఘునాథరెడ్డి రుణాల మాఫీ పేరుతో తమను వంచించాడని డ్వాక్రా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో లేనిపోని హామీలను గుప్పించి తర్వాత అమలు చేయడంతో పూర్తిగా విఫలమయ్యాడని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా డ్వాక్రా సంఘాల కింద రుణాలను తీసుకున్న అక్క, చెల్లెమ్మలంతా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదంటూ కసముద్రం సభల్లో చెప్పడమే కాకుండా గోడమీద రాతలు వాయించాడు. ఆ సమయంలో గ్రామంలో 28 మహిళా సంఘాలు జరుగుతుండగా, ప్రతి సభ్యురాలు రూ.10 వేలు రుణాన్ని తీసుకుని మూడు నెలలు కంతులు కూడా బ్యాంకుకు చెల్లించారు. పల్లె హామీతో రుణాలు కట్టని మహిళలు.. అప్పట్లో ఎమ్మెల్యే పల్లె డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో మహిళలంతా ముక్కుమ్మడిగా కంతులు కట్టకుండా ఆపేశారు. తర్వాత ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీని మర్చిపోయాడు. మహిళా సంఘాలన్నీ రుణాలను చెల్లించక, బ్యాంకు అధికారుల నుంచి ఒత్తిడి ఎక్కువ కాగా మహిళలంతా ఆందోళలో ఉన్నారు. పైసా రుణం కూడా మాఫీ కాకపోవడంతో పాటుగా ఆనాటి నుంచి ఆయా కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే పసుపు–కుంకుమ డబ్బు, గ్యాస్ సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, బీమా, ఇంటి బిల్లులన్నీ బ్యాంకు అధికారులు జమ చేసుకుంటూ వచ్చారు. మరికొంత మంది ఇంట్లో తమ భర్తలను ఒప్పించుకుని రుణాలను చేతి నుంచి కట్టేశారు. నోటీసులతో ఆందోళన తాజాగా డిసెంబర్, జనవరి నెలల్లో మళ్లీ ప్రతి గ్రూపునకు డబ్బు చెల్లించాలంటూ గ్రూపులకు సంబంధించిన జామీనుదారులకు లక్షల రూపాయలు అప్పుందంటూ నోటీసులు పంపించారు. దీంతో ఖంగుతిన్న మహిళలంతా ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ఎంత పనిచేశాడమ్మా? మా జీవితాల్లో చిచ్చు పెట్టి మమ్మల్ని బ్యాంకుల వైపు కన్నెత్తి చూడకుండా చేసి, బజారున పడేశాడని గగ్గోలు పెడుతున్నారు. ఎమ్మెల్యే మాటలు విని కసముద్రం, కంచరోళ్లపల్లి, చెర్లోపల్లి గ్రామాల్లో 28 మహిళా సంఘాల నిలిచిపోయి ఆయా కుటుంబాలకు ఎలాంటి ఆసరా లేకుండా వీధిన పడిపోయాయి. అంతేకాక భవిష్యత్తులో బ్యాంకు అధికారులు ఇంకెన్ని ఇబ్బందులు కల్గజేస్తారోనని, ఎమ్మెల్యే ఇప్పటికైనా స్పందించి మా రుణాలకు క్లీన్చిట్ ఇప్పిస్తే తిరిగి కొత్తగా గ్రూపులు నిర్వహించుకుంటామని పేర్కొంటున్నారు. రూ.10 వేలకు రూ.67 వేలు కట్టా నేను గ్రూపులో రూ.10 వే లు తీసుకుని అధికారుల ఒత్తిడి తట్టుకోలేక వడ్డీతో కలిపి రూ.67 వేలు మొత్తా న్ని ఒకేసారి కట్టేశాను. అయితే ఇప్పుడు మళ్లీ గ్యాస్ సబ్సిడీ డబ్బు పడుతుంటే అది కూడా పట్టేస్తున్నారు. మళ్లీ ఎందుకు పట్టేస్తున్నారో, ఇంకెంత అప్పు ఉంది అంటారోనని భయపడిపోతున్నాను. పసుపు–కుంకుమ డబ్బు, పావలా వడ్డీ ఇస్తామన్నా.. ఏదీ ఇవ్వలేదు. – తిప్పమ్మ,లక్ష్మీనరసింహస్వామి గ్రూపు, కసముద్రం -
ఓట్ల కోసం బాబు పాట్లు
ప్రొద్దుటూరు : డ్వాక్రా మహిళలను మరో మారు మోసగించి వారి ఓట్లను దండుకునేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహం పన్నారని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2014 ఎన్నికల సందర్భంగా డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని ప్రకటించారు. మహిళలు నమ్మి ఓట్లు వేశారని, అయితే నేటి వరకు వారి రుణాలు మాఫీ కాలేదన్నారు. మాటతప్పి, మడమ తప్పి పారిపోయిన పిరికిపంద కేవలం రుణమాఫీ కాకుండా రుణసాయాన్ని రూ.10వేలు చొప్పున అందజేస్తున్నారన్నారు. డ్వాక్రా గ్రూపునకు రూ.లక్ష చొప్పున మూల నిధిగా ఈ డబ్బు మహిళలకు ఇస్తున్నారని తెలిపారు. టీడీపీకి ఓట్లు వేస్తే మాఫీ చేస్తామని ప్రకటించి కనీసం వారి డబ్బుకు వడ్డీలు కూడా చెల్లించలేదన్నారు. 2016 నుంచి 2019 వరకు డ్వాక్రా రుణాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రూ.2,579 కోట్లు, వైఎస్సార్ జిల్లాలో రూ.170 కోట్లు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రూ.9.54 కోట్లు వడ్డీ బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ఇవన్నీ పక్కనపెట్టి చంద్రబాబు కేవలం డ్వాక్రా మహిళలకు రూ.10వేలు ఇచ్చి చేతులు దులుపేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు డ్వాక్రా అక్కాచెల్లెమ్మలు గుర్తుకొస్తున్నారా అని ప్రశ్నించారు. డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి తమ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, పుష్పశ్రీవాణి, గౌరు చరితారెడ్డి గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నించగా 2014 నుంచి 2018 వరకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయలదేని, అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్వయంగా ప్రభుత్వం సమాధానం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అందని రుణాలు..తప్పని ఇబ్బందులు చంద్రబాబు రూ.10వేలతోపాటు స్మార్ట్‌ఫోన్ ఇస్తానని ప్రస్తుతం ప్రకటించారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. డ్వాక్రా రుణాలు అందక ఎంతో మంది మహిళలు ఇబ్బంది పడ్డారని, రుణాలు చెల్లించకపోవడంతో కోర్టు నుంచి చాలా మంది నోటీసులు అందుకున్నారన్నారు. ఇవన్నీ మరచిపోయిన చంద్రబాబు ప్రస్తుతం కేవలం రూ.10వేలు ఇచ్చి, అది కూడా మూడు విడుతలుగా తీసుకోవాలని, స్మార్ట్ ఫోన్ ఇస్తున్నట్లు గొప్పగా చెప్పుకొంటున్నారని తెలిపారు. ఓటును స్మార్ట్ ఫోన్ కోసం , పసుపు కుంకుమ పేరుతో మీరు ఇస్తున్న డబ్బుకు అమ్ముకునేందుకు మహిళలు సిద్ధంగా లేరన్నారు. పసుపు–కుంకుమ గురించి మంత్రి పరిటాల సునీత మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం షాపుల రద్దుతోనే మహిళల పసుపు, కుంకుమలు నిలుస్తాయి టీడీపీ అధికారంలోకి వచ్చాక విచ్చల విడిగా మద్యం షాపులు, బెల్టుషాపులు ఏర్పాటయ్యాయని, వీటి అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్ అధికారులకు చంద్రబాబు టార్గెట్ విధించారని ఎమ్మెల్యే రాచమల్లు అన్నారు. ప్రతి నెల రెట్టింపు అమ్మకాలు చేపట్టాలని వారిపై ఒత్తిడి తెచ్చారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతోనే మహిళల పసుపు, కుంకుమలు నిలుస్తాయని తెలిపారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దశల వారిగా మద్య నిషేధం అమలు చేస్తామని ప్రకటించారని, దీని వల్ల ఎన్నో కుటుంబాల్లో వెలుగులు వస్తాయన్నారు. ఎన్టీ రామారావు హయాంలో మద్యం నిషేధించడం వల్ల ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయన్నారు. సమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్లు రాగుల శాంతి, పోసా వరలక్ష్మి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, నియోజకవర్గ అధ్యక్షురాలు గజ్జల కళావతి, న్యాయవాది జింకా విజయలక్ష్మి పాల్గొన్నారు. నిజాలు రాసిన సాక్షిని కాల్చేస్తారా..? ప్రొద్దుటూరు : నిజాలు రాసిన సాక్షి పత్రికను మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కాల్చడం పట్ల ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ఇవ్వబోతోన్న పసుపు, కుంకుమ డబ్బును రుణంగా ఇస్తున్నారని సాక్షి పత్రికలో రాసినందుకు ఓర్వలేని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి పత్రికలను కాల్చడాన్ని తప్పుపట్టారు. నిత్యం అబద్ధాలు రాయడంతోపాటు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఆంధ్రజ్యోతి పత్రికను తాము ఏమి చేయాలని ప్రశ్నించారు. నిజాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వాస్తవానికి తనకు జర్నలిజం పట్ల ఎంతో గౌరవం ఉందన్నారు. ఈ కారణంగానే తన పెద్ద కుమార్తెను ఇంజినీరింగ్, డాక్టర్ చేయకుండా జర్నలిజంలో పీజీ చేయించానన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలిమిడి చిన్నరాజు, మద్దూరి దేవి, ధనలక్ష్మి, షమీమ్‌బాను, మాజీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మిదేవి, మల్లికార్జున ప్రసాద్, లక్ష్మీనారయణమ్మ, నిర్మలాదేవి పాల్గొన్నారు. -
‘పసుపు– కుంకుమ’ వద్దే వద్దు
కర్నూలు,ఆత్మకూరు: పసుపు– కుంకుమ పథకం తమకు వద్దే వద్దని, తాము టీడీపీ కండువా ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పుకునేది లేదని పొదుపు మహిళలు తెగేసి చెప్పారు. డబ్బు కోసం తాము టీడీపీ కండువా ఎట్టి పరిస్థితుల్లో కప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఆత్మకూరు పట్టణం చిట్యాల వీధిలోని గంగమ్మ గుడి వద్ద పొదుపు ఐక్య సంఘాల లీడర్లు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. పసుపు– కుంకుమ కింద రూ.10 వేలు కావాలంటే టీడీపీ కండువా వేసుకోవాలని ఆ పార్టీకి చెందిన పొదుపు ఐక్య సంఘం సభ్యులు సరోజ, లక్ష్మీదేవి, ఈడిగ శేషమ్మ, సుశీలాబాయి చెప్పారు. దీంతో మిగతా సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొదుపు సమావేశామా..ఇది రాజకీయ సమావేశామా చెప్పండి’ అంటూ ప్రశ్నించారు. రాజకీయ సమావేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే రూ.10 వేలు సొమ్ము తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. సుభద్రమ్మ అనే ఐక్య సంఘం లీడర్ టీడీపీ కండువా కప్పుకుంటే చాలు.. రూ.10 వేలు ఇస్తామని టీడీపీ పొదుపు మహిళలు చెప్పారు. దీంతో సుభద్రమ్మ స్పందిస్తూ..తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయబోనని, తనకు ఆ డబ్బులు అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వచ్చినా ఇదే విషయం చెబుతామన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేతోనే తాడోపేడో తేల్చుకుంటామని సమావేశం నుంచి బయటకు వచ్చారు. కాగా..ఆత్మకూరు పట్టణం చిట్యాల వీధిలో 20 పొదుపు మహిళాసంఘాలు ఉన్నాయి. వీటిలో 220 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం పొదుపు 20 గ్రూపులకు లీడర్‌గా సుభద్రమ్మ ఉన్నారు. రూ.10 వేలు అవసరం లేదు పొదుపులో ఉన్నవారందరికీ పసుపు– కుంకుమ కింద రూ.10 వేలు ఇస్తామన్నారు. టీడీపీ కండువా వేసుకుంటేనే డబ్బు ఇస్తామని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఆ డబ్బే మాకు వద్దే వద్దు.– సలాంబీ భయపడేది లేదు పార్టీ మారకపోపతే రూ.10వేలు ఇవ్వబోమని ఎమ్మెల్యే బుడ్డా రాజేశేఖర్ రెడ్డి చెప్పమనండి. ఇది పొదుపు సమావేశామా? రాజకీయ సమావేశమా? సరోజ, లక్ష్మీదేవి లాంటి మహిళలకు భయపడేది లేదు. టీడీపీ కండువాలు కప్పుకునేది లేదు. – జయమ్మ -
చీరల ఎర.. గొడుగుల గాలం!
ఆవు చేలో మేస్తుంటే.. దూడ గట్టునమేస్తుందా?.. అనేది అందరికీ తెలిసిన సామెతే.. నర్సీపట్నంలో ఇప్పుడు ఈ సామెత తరహాలోనే తతంగం సాగుతోంది. రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబు ఎడాపెడా ఎన్నికల తాయిలాలు ప్రకటించేస్తుంటే.. తానేం తక్కువ తిన్నాననుకున్నారో లేక అధినేతను అనుసరించాలని నిర్ణయించుకున్నారో గానీ.. ఎన్నికలకు ఇంకా మూడు నెలలు ఉండగానే సాక్షాత్తు మంత్రి అయ్యన్నపాత్రుడు కుటుంబం ఎన్నికల ప్రలోభాలకు తెర తీసింది. నాలుగున్నరేళ్లపాటు ఇచ్చిన హామీలను డీప్ ప్రీజ్‌లో పెట్టేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలు సమీపించడంతో పోపుల డబ్బా నుంచి ఒక్కో దినుసు తీసి తాలింపు వేసినట్లు.. ఎన్నికల తాయిలలు విసిరేస్తుంటే.. ఇక్కడ నర్సీపట్నం నియోజకవర్గంలో అయ్యన్న పనుపున రంగంలోకి దిగిన ఆయన సతీమణి మహిళలపై చీరల ఎర వేస్తుంటే.. పుత్రరత్నం గొడుగులతో గాలం వేస్తున్నారు.ప్రభుత్వం ఇస్తున్న ‘పసుపు–కుంకుమ’కు తోడు ఇది మా సాయం అని వారు బాహటంగా ప్రకటిస్తూ ఎన్నికల్లో అయ్యన్నను మరోసారి గెలిపించాలని కోరుతున్నారు. ఇలా నియోజకవర్గం మొత్తం మీద చీరలు, గొడుగులకు వారు చేస్తున్న వ్యయం రూ.2 కోట్లుగా లెక్క తేలుతోంది. ఎన్నికల కోడ్ అమల్లో లేనందున ఇప్పుడు వారు ఎంత ఖర్చు చేస్తే మనకేంటి అనుకుందామనుకున్నా.. నాలుగున్నరేళ్లలో ప్రజలపై కనిపించని ప్రేమ.. ఉన్న పళంగా ఎందుకు పుట్టుకొచ్చిందన్నది ఆలోచించాల్సిన అంశం. మరోవైపు ఎన్నికలకు మూడు నెలల ముందే కోట్లకు కోట్లు విసిరేస్తుంటే.. ఇక ఎన్నికల సమయంలో ఎన్ని కోట్లు నీళ్లలా ఖర్చు చేస్తారోనన్నది చర్చనీయాంశం.సొంత నిధులే ఈ బహుమతులకు వెచ్చిస్తున్నారనుకుంటే.. ఇన్ని కోట్ల రూపాయలుఎక్కడినుంచివచ్చాయన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.. సాక్షి, విశాఖపట్నం : చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఒకే నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా.. ఐదుసార్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. అలాంటి నాయకుడు సైతం రానున్న ఎన్నికల్లో మరోసారి గెలుపు కోసం ఇప్పటి నుంచే ఫీట్లు చేయడం మొదలుపెట్టారు. పైకి ఈసారి తాను పోటీ చేయనంటూనే పోటీకి సై అంటున్నారు. అధినేత మాదిరిగానే ప్రలోభాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే ఎన్నికల గిమ్మిక్కులు చేస్తున్నారు. ఓవైపు కుమారుడు ఇంటింట తెలుగుదేశం అంటూ తన తండ్రి కోసం ప్రచారం చేస్తుంటే.. మరోవైపు ఈసారి కూడా తన భర్తకే ఓట్లు వేయాలంటూ అయ్యన్న సతీమణి చీరల పంపిణీలో బిజీబిజీగా ఉన్నారు. ముందుగానే చక్కబెట్టేస్తున్నారు.. సార్వత్రిక ఎన్నికలకు ఎంత లేదనుకున్నా రెండు నెలలకు పైగానే సమయం పడుతుంది. ఇంకా నోటిఫికేషన్ రాలేదు.. కనీసం షెడ్యూల్ కూడా ఇంకా విడుదల కాలేదు.. కానీ అప్పుడే అధికార పార్టీ నేతలు ఓటర్లకు ఎర వేయడం మొదలు పెట్టారు. గడిచిన నాలుగున్నరేళ్లలో సంపాదించిన అవినీతి సంపాదనతో ఇప్పటికే ఒక్కో నియోజకవర్గంలో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సిద్ధం చేశారన్న ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గంలో లేటరైట్ ముసుగులో సాగుతున్న బాక్సైట్ దోపిడీ ద్వారా వచ్చే అవినీతి సంపాదనతో ఈసారి ఓట్ల కొనుగోలుకు స్కెచ్‌లు వేస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. మాకవరపాలెం మండలంలో డ్వాక్రా సంఘ అధ్యక్షులకు చీరలు పంపిణీ చేస్తున్నమంత్రి అయ్యన్న సతీమణి పద్మావతి సీఎం బాటలో.. ఓపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముంగిట డ్వాక్రా సంఘాలకు సెల్ఫోన్లు, పసుకు కుంకుమ–2 పేరిట రూ.10 వేల విలువైన చెల్లని చెక్కులు పంపిణీ చేస్తున్నారు. అలాగే బీసీలకు.. కులానీకో కార్పొరేషన్లు, రైతులకు రూ.10 వేల పెట్టుబడి సాయం అంటూ ఎన్నికల గిమ్మిక్కులు చేస్తున్న విషయం తెలిసిందే. తామేమీ తీసిపోలేదన్నట్టుగా ఆయన కేబినెట్లోని సీనియర్ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ఎన్నికలకు రెండు నెలలు ఉండగానే ఓటర్లకు ముందస్తు తాయిలాల పంపిణీకి తెరతీశారు. ఇప్పటికే ఆరుసార్లు పోటీ చేశా.. ఐదుసార్లు మంత్రిగా పనిచేశా.. నాకంటే సీనియర్ ఇంకెవరూ లేరంటూ గొప్పలు చెప్పుకునే అయ్యన్న ఈసారి తన రాజకీయ వారసుడ్ని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం మరోసారి అయ్యన్న వైపే మొగ్గు చూపుతోంది. దీంతో మరోసారి ఎన్నికల గోదాలోకి దిగేందుకు ఉవ్విళ్లూరుతున్న అయ్యన్న తరపున ఆయన భార్య, కుమారుడు అప్పుడే రంగంలోకి దిగారు. ఇంటింట తెలుగుదేశం అంటూ తిరుగుతున్న విజయ్ తన తండ్రి గెలుపు కోసం గొడుగులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే నర్సీపట్నం అర్బన్, రూరల్ మండల పరిధిలోని గ్రామాల్లో గొడుగుల పంపిణీ పూర్తి చేశారు. మరోవైపు తాజాగా భర్త విజయం కోసం అయ్యన్న భార్య పద్మావతి డ్వాక్రా సంఘాలను టార్గెట్ చేసి చీరల పంపిణీకి శ్రీకారం చుట్టారు. మెప్మా సిబ్బంది సహకారంతో ప్రతి గ్రామంలో సంఘాల వారీగా వివరాలు తీసుకుని మరీ పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి చీర అందేలా లెక్కగట్టి మరీ ఇస్తున్నారు. పసుపు కుంకుమ కింద తమ ప్రభుత్వం రెండో విడత రూ.10 వేలు ఇస్తోంది కదా.. తమ వంతుగా చీరలు పంపిణీ చేస్తున్నామంటూ పదావతి బాహాటంగానే చెబుతున్నారు. ఈసారి కూడా తన భర్తనే గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఒక్కొక్క చీర రూ.300ల విలువ ఉంటుందని చెబుతున్నారు. ఈ లెక్కన నియోజకవర్గంలోని 5,782 సంఘాల పరిధిలో 63 వేల 779మంది డ్వాక్రా సభ్యులకు రూ.1.92 కోట్ల విలువైన చీరలను పంపిణీ చేస్తున్నారు. డ్వాక్రా సంఘాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కూడా చీరలు అందిస్తున్నారు. చీరలు, గొడుగులు కలిపి తాయిలాల విలువ సుమారు రూ.2.25 కోట్ల వరకు ఉంటుంది. ఈసారి ఎన్ని గిమ్మిక్కులు చేసినా ఓటమి తప్పదన్న ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది. ఈ కారణంగానే ఓటర్లను లోబర్చుకునేందుకు ముందస్తు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడకుండానే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక వెలువడిన తర్వాత పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కనీసం ఎంత లేదనుకున్నా ఓటర్లకు గేలం వేసేందుకు ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలోనే అధికార పార్టీ నేతలు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. ఈసారి ఎన్ని గిమ్మిక్కులు చేసినా మంత్రి అయ్యన్నకు ఓటమి తప్పదంటున్నారు. మహిళలను ప్రలోభపెట్టేందుకే... మహిళలకు వల విసిరి రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంత్రి సతీమణి పద్మావతి చీరలు పంపిణీ చేస్తున్నారు. ఐదేళ్లుగా మంత్రి కుటుంబానికి మహిళలు గుర్తుకు రాలేదు. రెండు ఎన్నికల్లో జరగనుండడంతో మహిళలను ప్రలోభపెడుతున్నారు. ఎన్ని వేషాలు వేసినా వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు.–పెట్ల ఉమాశంకర్ గణేష్, వైఎస్సార్సీపీ నర్సీపట్నం కన్వీనర్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే... వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మంత్రి అయ్యన్నపాత్రుడు సతీమణి చీరలు పంపిణీతో ప్రలోభపెడుతున్నారు. సీఎం చంద్రబాబు పసుపు–కుంకంతో మహిళలను బుట్టలో వేసే యత్నం చేస్తుంటే...స్థానికంగా మంత్రి సతీమణి పద్మావతి చీరలు పంచి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. మహిళలు అంత అమాయకులు కాదు.. తగిన గుణపాఠం చెబుతారు–బాలేపల్లి వెంకటరమణ, సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి -
పసుపు కుంకుమ డప్పు అక్షరాలా అప్పే!
సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు పసుపు – కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు ఇస్తామని చెబుతున్న రూ.10 వేలు అప్పుగానేనని మరోసారి తేటతెల్లమైంది. పసుపు – కుంకుమ 2 పథకం కింద డ్వాక్రా సంఘాలకు అందచేయనున్న ఆర్థిక సాయంపై విధివిధానాలను ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో ఎంఎస్ నెంబరు 17 జారీ చేసింది. డ్వాక్రా మహిళలకు అప్పు వ్యక్తిగతంగా ఇవ్వబోమని, సంఘంలోని సభ్యులను బట్టి మూలధన నిధి రూపంలో మూడు విడతల్లో ఇస్తామని అందులో స్పష్టం చేసింది. పొదుపు సంఘాల మహిళలకు ఇస్తామన్న రూ.పది వేలు అప్పుగానే పరిగణించాలని ఈ జీవో ద్వారా పరోక్షంగా పేర్కొనడం గమనార్హం. వ్యక్తిగతంగా కాకుండా గ్రూపునకు మూడు విడతల్లో చెక్కులు జారీ చేస్తామని పేర్కొన్న జీవోలో భాగం అప్పేనని గతంలోనే సర్క్యులర్ జారీ.. పసుపు– కుంకుమ డబ్బులను డ్వాక్రా మహిళలకు వ్యక్తిగతంగా కాకుండా సంఘంలోని సభ్యుల సంఖ్య ఆధారంగా ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున లెక్కగట్టి ఆ మొత్తాన్ని క్యాపిటల్ గ్రాంట్ (మూలధన నిధి) రూపంలో మూడు విడతల్లో సంబంధిత సంఘం బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్లు తాజా విధివిధానాల జీవోలో ప్రభుత్వం తెలిపింది. అయితే క్యాపిటల్ గ్రాంట్ రూపంలో పొదుపు సంఘాల ఖాతాలో డబ్బులు జమ చేస్తే వాటిని వినియోగించుకోవాల్సిన తీరుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్– వెలుగు) కొన్ని విధివిధానాలను నిర్దేశిస్తూ 2015 మే 16వ తేదీన ఓ సర్కులర్‌ను జారీ చేసింది. ఆ సర్కులర్ ప్రకారం క్యాపిటల్ గ్రాంట్ (మూలధన నిధి) రూపంలో సంఘ ఖాతాల్లో జమ అయ్యే నిధులను డ్వాక్రా మహిళలు ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోకూడదు. ఆ డబ్బులను మూలధన నిధిగా భావించి దాని ద్వారా బ్యాంకుల్లో అప్పు తెచ్చుకుని మహిళలు ఉపాధి అవకాశాలు పెంచుకునేందుకు వినియోగించుకోవాలని సూచించారు. సంఘం ఖాతాలో జమ అయిన ఆ డబ్బులను మహిళలు కావాలనుకుంటే సంఘం నుంచి అప్పుగా తీసుకోవచ్చని ఆ సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇచ్చేది అప్పు.. ఎన్నికల కోసం డప్పు మొత్తంగా చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జారీ చేసిన పసుపు – కుంకుమ –2 పథకం విధివిధానాల జీవో, అంతకు ముందు 2015లో సెర్ప్ – వెలుగు సంస్థ జారీ సర్కులర్ ద్వారా డ్వాక్రా సంఘాలకు ఇస్తామంటున్న డబ్బులు ప్రభుత్వ రికార్డుల ప్రకారం అప్పేనని స్పష్టమవుతుంది. అయితే ఎన్నికలు సమీపించడంతో చంద్రబాబు తన మోసం బయటపడకుండా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తూ ఇచ్చేది క్యాపిటల్ గ్రాంట్ అని ఒక జీవో, ఆ క్యాపిటల్ గ్రాంట్‌ను మహిళలు పంచుకుంటే అది అప్పుగా పరిగణించబడుతుందని మరో సర్కులర్ ద్వారా పేర్కొనడం గమనార్హం. రూపాయి కూడా మాఫీ చేయలేదని మంత్రే ఒప్పుకున్నారు.. 2014 ఎన్నికల ముందు తాను అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలన్నింటినీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చినా ఇప్పటిదాకా ఆయన ఏ ఒక్కరికీ రూపాయి రుణాన్ని కూడా మాఫీ చేయలేదు. సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పరిటాల సునీత 2018 సెప్టెంబరులో శాసనసభకు ఈమేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం గమనార్హం. ‘ఉచిత’ ప్రచారం ఓట్ల కోసమే.. చంద్రబాబు 2014లో ఆధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో డ్వాక్రా సంఘాల పేరిట రూ.14,204 కోట్ల దాకా రుణాలున్నాయి. రుణమాఫీ ఆశతో మహిళలు ఏళ్ల తరబడి కిస్తీలు కట్టకపోవడంతో మహిళలు తిరిగి చెల్లించలేనంతగా వడ్డీల భారం పెరిగిపోయింది. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోగా దీనికి తోడు గత ప్రభుత్వాలు అమలు చేసిన జీరో వడ్డీ పథకానికి కూడా టీడీపీ సర్కారు ఎగనామం పెట్టడంతో ఆ భారం కూడా మహిళలపైనే పడింది. మొత్తంగా ఈ ఐదేళ్లలో దాదాపు రూ. 30 వేల కోట్ల వరకు చంద్రబాబు డ్వాక్రా మహిళలను మోసగించినట్లు అధికార వర్గాల్లో అంచనాలున్నాయి. మళ్లీ ఎన్నికలు రావడంతో రాష్ట్రంలోని 94 లక్షల మంది డ్వాక్రా మహిళల ఓట్ల కోసం పసుపు–కుంకుమ 2 కింద ఒక్కొక్కరికీ పది వేల చొప్పున ఇస్తామంటూ మరో మోసానికి చంద్రబాబు తెర తీశారు. ఇదంతా ఉచితమనే తరహాలో బహిరంగ వేదికల మీద చెబుతూ అందుకు భిన్నంగా అది అప్పేనని పరోక్షంగా అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. పసుపు– కుంకుమ –2 విధి విధానాలు ఇవీ... –జనవరి 18వ తేదీ నాటికి సెర్ప్, మెప్మా రికార్డులో నమోదు చేసుకున్న పొదుపు సంఘాలు అదనపు మూలధన నిధి (క్యాపిటల్ గ్రాంట్) పొందడానికి అర్హులు. –క్యాపిటల్ గ్రాంట్‌గా ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని మహిళలకు వ్యక్తిగతంగా అందజేయరు. సంఘంలోని సభ్యుల సంఖ్యను బట్టి ఆ మొత్తాన్ని రూ.2500 ఒకసారి, రూ.3500 రెండోసారి, మూడోసారి రూ.4000 చొప్పున ఆయా సంఘాల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఉదాహరణకు ఒక సంఘంలో పది మంది సభ్యులుంటే మొదటి విడతలో బ్యాంకు ఖాతాల్లో రూ. 25 వేలు జమ చేస్తారు. – క్యాపిటల్ గ్రాంట్‌ను మూడు పోస్టు డేటెడ్ చెక్కులుగా సంఘం పేరిట అందజేస్తారు. సంఘం సభ్యులందరికీ కలిపి ఒక్కో విడతకు ఒక్కొక్క చెక్కునే అందజేస్తారు. – మొదటి విడత చెక్కు ఫిబ్రవరి 1వ తేదీన లేదంటే ఆ తర్వాత చెల్లుబాటు అయ్యేలా, రెండో విడత చెక్కు ఈ ఏడాది మార్చి 8వ తేదీతో, మూడో విడత చెక్కు ఏప్రిల్ 5వతేదీతో చెల్లుబాటు అయ్యేలా ముందుగానే మూడు చెక్కులను పంపిణీ చేస్తారు. – ఫ్రిబవరి మొదటి వారంలో డీఆర్డీఏ సిబ్బంది ద్వారా సంఘాల పేరిట మూడు చెక్కులను మహిళలకు అందజేస్తారు. – ప్రభుత్వం జారీ చేసే చెక్కులకు బ్యాంకుల్లో నేరుగా డబ్బులు చెల్లించకుండా అకౌంట్ పేయీ చెక్కులను జారీ చేస్తారు. మహిళలు ఆ చెక్కులను తమ సంఘం ఖాతాలో తొలుత జమ చేసుకొని ఆ తర్వాత డ్రా చేసుకోవాల్సి ఉంటుంది. – గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థకు చెందిన పీడీ బ్యాంకు ఖాతాల ద్వారా డబ్బులను డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమ చేస్తారు. – అర్హుల జాబితాను గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ వార్డు కార్యాలయాల్లో అందరికీ తెలిసేలా అందుబాటులో ఉంచుతారు. – పసుపు–కుంకుమ పథకం గురించి సెర్ప్, మెప్మా విస్తృతంగా ప్రచారం చేయాలి. –చెక్కులు అందని పొదుపు సంఘాలు గ్రామ సమాఖ్య, మండల ఏపీఎంలకు వినతిపత్రాలు సమర్పించాలి. సమగ్ర విచారణ అనంతరం ఆయా సంఘాల అర్హతపై నిర్ణయం తీసుకుంటారు. -
నాడు మాఫీ మాయ... నేడు మరో దగా...
రుణమాఫీ పేరుతో మహిళా సంఘాల ఓట్లతో గద్దెనెక్కి తానలా అనలేదని నాలుక మడతేశారు. వారి ఆగ్రహం పెల్లుబకడంతో మసిబూసి మారేడుకాయ చేసేందుకు యత్నిస్తున్నారు. పెట్టుబడి నిధికింద రూ. పదివేల వంతున ఇస్తామని చెప్పి రకరకాల నిబంధనలు పెట్టారు. తీరా వారు ససేమిరా అనడంతో వాడుకునేందుకు అవకాశం కల్పించి కొందరికే పరిమితం చేశారు. విపక్షనేత డ్వాక్రా రుణమాఫీ చేస్తామని ప్రకటించగానే... ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోవిడత పసుపుకుంకుమ పేరుతో మళ్లీ ఎర వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలినుంచీ బాబు తత్వం తెలిసిన మహిళలు ఈ మాయమాటలు నమ్మలేమని తెగేసి చెబుతున్నారు. విజయనగరం అర్బన్/నెట్వర్క్: అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళ రుణాలు మాఫీ చేస్తామంటూ తెగ ప్రచారం చేసిన తెలుగుదేశం నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే మరచిపోయారు. వారి మాటలు నమ్మి బ్యాంకుకు బకాయిలు చెల్లించని చెల్లెమ్మలు అధికారుల దృష్టిలో డిఫాల్టర్లుగా మిగిలారు. కొందరైతు వడ్డీ తడిసిమోపెడవడంతో బంగారం తాకట్టుపెట్టి అప్పు తీర్చుకుని ఉసూరు మన్నారు. ఆ తరువాత రోజుకో మాటతో... పూటకో కథతో వారిని మాయచేశారు.మొత్తం కాదు.. కేవలం గ్రూపునకు రూ. లక్ష మాత్రమే మాఫీ చేస్తామని ఒకసారి, ఒక్కో సభ్యునికి రూ.10 వేల వంతున హామీ లేని రుణంగా ఇస్తామని మరోసారి... చివరకు పసుపుకుంకుమ కింద దానిని ఉచితంగా ఇస్తున్నానని ఇంకోసారి నమ్మబలికారు. తీరా అదీ కొందరికే ఇచ్చి సరిపెట్టారు. మాఫీ చేయాల్సిన రుణం రూ.450 కోట్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు అధికా రం చేపట్టేనాటికి రూ. 450 కోట్ల మేర డ్వాక్రా రుణాలున్నాయి. వాటిని మాఫీ చేయాల్సి ఉంది. కానీ దానిని పట్టించుకోని ప్రభుత్వం వడ్డీ మాఫీ అంటూ ఓ కథ చెప్పారు. దానికోసం నిరీక్షించేసరికి తొలి 16 నెలలకు రూ.30 కోట్ల వరకు వడ్డీ భారం మహిళలపై పడింది. అప్పటికే గ్రేడ్–ఏలో ఉన్న 20 వేల మహిళా పొదుపు సంఘాలు అప్పట్లో ఆర్థికభారంతో కొట్టుమిట్టాడాయి. అప్పులు తీర్చుకోవడానికి వారంతా ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. కొన్ని సంఘాలైతే తేరుకోలేకపోయాయి. తొలివిడత పసుపు కుంకుమపైనా ఆంక్షలు పసుపుకుంకుమ పేరుతో ఇస్తున్న సొమ్మును కూడా పొదుపు మొత్తంలాగే వాడుకోవాలని ఆదేశాలు ఇవ్వడం డ్వాక్రా మహిళల్లో ఆగ్రహావేశానికి కారణమైంది. ప్రస్తుతానికి మాఫీ చేయలేనవి, ఒకే సారి రూ.10 వేలు పసుపు కుంకుమగా ఇస్తానంటూ బహిరంగ సభల్లో ప్రకటించిన చంద్రబాబు.. లోటు బడ్జెట్ పేరుతో తొలి విడత రూ. 3 వేలు మాత్రమే ఇచ్చి... తర్వాత విడతల వారీగా మిగతా సొమ్మును చెల్లిస్తామని పేర్కొనడంతో వారంతా ఆందోళన చెందారు. అంతేకాకుండా జమ చేసే రూ.3 వేలు కూడా వాడుకోకుండా గ్రూపు మొత్తం మీద వచ్చే సొమ్మునంతా పొదుపులాగే అకౌంట్లలో ఉంచుకొని వడ్డీని మాత్రమే తీసుకోవాలని మెలిక పెట్టడంపై తీవ్రస్థాయిలో మహిళలు మండిపడ్డారు. ఎలాగైతేనేం వారి ఆగ్రహానికి భయపడి విత్‌డ్రా చేసుకునేందుకు అంగీకరించారు. కొందరికే తొలివిడత పసుపుకుంకుమ తొలిత విడతగా 2014 మార్చిలోగా నమోదైన సంఘ సభ్యులకు రూ.పదివేలు చెప్పున ప్రభుత్వం అందించింది. అప్పట్లో నమోదైన సంఘాలు 37,450 సంఘాలుంటే వాటిలో 4,09,616 సభ్యులున్నారు. వీరికి మొత్తం రూ.413 కోట్లు అందజేసినట్లు జిల్లా అధికారులు ప్రకటించారు. అందులోనూ కొందరికి మొండిచెయ్యే మిగిలింది. కొందరికి తొలివిడత ఇస్తే మిగిలిన రెండు విడతలకు ఎసరుపెట్టారు. మరికొందరికి తొలివిడత కాదని, రెండో విడతగా ఇచ్చారు. అంతేగాకుండా 2014 ఏప్రిల్ తరువాత 3 వేల సంఘాల సభ్యులు 35,945 మందికి పసుపు కుంకుమ ఇవ్వనే లేదు. రెండో విడతపైనా అనుమానాలే... జిల్లాలో ప్రస్తుతం 4.45.571 మంది డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ పథకం రెండో విడతలో రూ.422.57 కోట్లు కేటాయిస్తారని అధికారులు భావిస్తున్నారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌కు సంబంధించి వరుసగా రూ.2,500, రూ.3,500, రూ.4,000 విలువ చేసే చెక్కులను ముందుగానే అందిజేస్తారని ప్రచారం చేస్తున్నారు. అయితే తొలివిడత అందుకోలేనివారి పరిస్థితేమిటన్నదానిపై అధికారులవద్దా సమాధానం లేకపోవడం విశేషం. అర్హులైనవారి వివరాలు సేకరిస్తున్నాం రెండో విడత పసుపుకుంకుమ పథకానికి సంబంధించిన విధి విధానాలను అనుసరించిన సభ్యులకు వర్తింప చేస్తాం. వాటి ఆధారంగా కార్యాచరణ తయారు చేస్తాం. ముందుగా అర్హులైన పొదుపు సంఘాల మహిళలను గుర్తిస్తాం. సంఘం పేరు, బ్యాంకుఖాతా, ఆధార్ వంటివి సేకరిస్తున్నాం.– కె.సుబ్బారావు, పీడీ, డీఆర్డీఏ ఇది ఎన్నికల గిమ్మిక్కే గతంలో ఇచ్చిన హామీలకే దిక్కు లేదు మరో మూడు నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ మహిళలను ఆకట్టుకొనేందుకు పదివేలు, సెల్ ఫోన్ అంటూ మో సం చేసేందుకు యత్నిస్తున్నారు. ఇది ఎన్నిక ల గిమ్మిక్కేనని మహిళలు ఎప్పుడో గ్రహించా రు. రాబోయే ఎన్నికల్లో మహిళలంతా తమ ఓటుతో బుద్ధి చెప్పేందుక సిద్ధంగా ఉన్నారు.– ఆనిమి ఇందిరాకుమారి, ఎంపీపీ, కురుపాం -
పెలమనూరులో రోడ్దెక్కిన డ్వాక్రా మహిళలు
-
మళ్లీ మభ్య పెట్టేందుకు చంద్రబాబు హమీలు ఇస్తున్నారు
-
పసుపు– కుంకుమ సాక్షిగా డ్వాక్రాకు దగా!
-
పసుపు– కుంకుమ సాక్షిగా డ్వాక్రాకు దగా!
ఎన్నికల ముంగిట ‘పసుపు–కుంకుమ’ పేరుతో మరోసారి మోసగించేందుకు సిద్ధమైన సీఎం చంద్రబాబును డ్వాక్రా మహిళలు ‘నిన్ను నమ్మం బాబూ..’ అంటున్నారు. పదే పదే మోసం చేసే ఆయన్ను నమ్మం గాక నమ్మం అని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాలు అప్పుల్లో కూరుకుపోయే దుస్థితికి కారణమైన చంద్రబాబు మోసాలపై పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక ఒక పైసా కూడా డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ఒక్క డ్వాక్రా సంఘానికీ రుణాలను మాఫీ చేయలేదని 2018 సెప్టెంబరు 7వతేదీన మంత్రి పరిటాల సునీత లిఖిత పూర్వకంగా శాసనసభకు తెలిపారు. ఇది డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసినట్టు కాదా? 2014కి ముందు డ్వాక్రా సంఘాలు బ్యాంకులోతీసుకున్న రుణాలపై జీరో వడ్డీ పథకం అమలయ్యేది. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక జీరో వడ్డీ పథకానికి బ్యాంకులకు డబ్బులు కట్టకపోవడంతో 2016 అక్టోబర్ నుంచి వడ్డీ డబ్బులు డ్వాక్రా మహిళలే చెల్లించుకుంటున్నారు. రూ.2,350 కోట్ల వడ్డీ డబ్బులను పొదుపు సంఘాల మహిళలు బ్యాంకులకు అదనంగా కట్టాల్సిన దుస్థితి దాపురించింది. ఇది మమ్మల్ని మీరు వంచించడం కాదా? డ్వాక్రా మహిళలకు రూ.పది వేల చొప్పున ఇచ్చే డబ్బులను అప్పుగానే పరిగణించాలని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం 2015 మే 16వతేదీన సర్క్యులర్ నెంబరు 21న జారీ చేయడం నిజం కాదా? ఆ సర్క్యులర్‌ను జారీ చేసి మూడున్నర ఏళ్లు దాటినా ఇచ్చేది అప్పు కాదు ఉచితమంటూ మరో ఉత్తర్వులు కానీ, సర్కులర్ కానీ ఇంతవరకు జారీ చేశారా? ఇప్పుడు ఎన్నికలు రావడంతో మళ్లీ మమ్మల్ని మోసం చేయడాదనికి పసుపు– కుంకుమ పేరుతో డబ్బులిస్తానంటూ అది ఉచితమని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా మమ్మల్ని మరోసారి మోసం చేయడానికి మీరు ఆడుతున్న నాటకం కాదా? సాక్షి, అమరావతి: రుణమాఫీ హామీని నెరవేర్చకుండా డ్వాక్రా మహిళా సంఘాలను వంచించడం పట్ల అధికార టీడీపీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండగా.. ఇదే సమయంలో వైఎస్సార్ సీపీ నవరత్నాల్లో భాగమైన వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామన్న వైఎస్ జగన్ భరోసాపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండడంతో టీడీపీ సర్కారు మరోసారి మభ్యపెట్టే కార్యక్రమాలను ఆరంభించినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి రాగానే పొదుపు సంఘాలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని వైఎస్ జగన్ నవరత్నాల హామీల్లో స్పష్టంగా చెప్పారు. సున్నా వడ్డీ డబ్బులను డ్వాక్రా అక్కచెల్లెమ్మల తరపున తామే బ్యాంకులకు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. దీనికితోడు 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ మహిళలకు ఆయా కార్పొరేషన్ల ద్వారా నాలుగేళ్లలో ఒక్కొక్కరికీ రూ.75 వేల దాకా వైఎస్సార్ చేయూత పథకం కింద ఉచితంగా ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఐదేళ్లుగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకుండా, జీరో వడ్డీకి రుణాలు ఇవ్వకుండా మోసం చేస్తూ వచ్చిన చంద్రబాబు సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయానికి ఓట్ల కోసమే పసుపు– కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు డబ్బులిస్తామంటూ మభ్యపెట్టే ప్రకటనలు చేసినట్లు పొదుపు సంఘాల మహిళలతో పాటు అధికారులు కూడా పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఇచ్చే ఆర్థిక సహాయం వినియోగానికి షరతులు విధిస్తూ 2015లో జారీచేసిన సర్క్యులర్ పసుపు–కుంకుమ పేరుతో వంచనే..! పసుపు– కుంకుమ పేరుతో ప్రభుత్వం నేరుగా డబ్బులు ఇవ్వకుండా ఎన్నికలు జరిగే తేదీలకు ముందుగా చెక్కులిచ్చి అప్పుడు బ్యాంకుల్లో జమ చేయాలని పేర్కొంటోంది. మరోపక్క రైతు రుణమాఫీ లాంటి పథకాలకే నాలుగు, ఐదో విడతలో చెల్లించాల్సిన డబ్బులను ఇంతవరకు రైతుల ఖాతాల్లో జమ చేయలేదు. ఇంకోవైపు ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన పసుపు– కుంకుమ పథకానికి రూ.9,400 కోట్లు దాకా అవసరం కాగా ఈ నిధులను ఎక్కడి నుంచి ఇస్తారనే విషయంపై ఏమాత్రం స్పష్టత లేకపోవడం గమనార్హం. -
సమ్మేళనమా.. సట్టు బండలా.!
కడప కార్పొరేషన్/కడప రూరల్ : డ్వాక్రా మహిళల సమ్మేళనమా...సట్టు బండలా...నడిచి నడిచి కాళ్లు పాయే, చూసి చూసి కళ్లు కాయలు కాచే...పొద్దుగూకుతాంది ఇంటికి ఎప్పుడు చేరుకోవాలో ఏమో...ఇదీ కడప నగరంలోని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సభకు హాజరైన మహిళల ఆవేదన. రాయలసీమ జిల్లాల నుంచి పొద్దుననగా తీసుకొచ్చిన వారికి దప్పిక తీర్చుకోవడానికి తాగునీరు, సేద తీరడానికి నీడ లేక అవస్థలు పడ్డారు. ముఖ్యంగా బాత్రూములు లేక వారు పడిన ఇబ్బందులు వర్ణణాతీతమని చెప్పవచ్చు. తీసుకొచ్చేటప్పుడేమో సభా ప్రాంగణానికి దగ్గరగా దించారు, సభ అయిపోయాక సీఎస్ఐ మైదానంలో బస్సులు ఉంచి వారిని నడిచేలా చేశారు. వేల సంఖ్యలో సీఎస్ఐ మైదానానికి వచ్చిన మహిళలు వారు వచ్చిన బస్సులు కనుక్కోలేక కొందరు సీఐఎస్ షాపింగ్ కాంప్లెక్స్ ముందు కూర్చుండిపోయారు. సభా ప్రాంగణంలోకి వెళ్లే గేట్లను మూసివేయడంతో మహిళలు లోపలికి వెళ్లలేక..బైట నిలిబడలేక ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పోలీసులతో గొడవపడ్డారు. స్మార్టు ఫోన్లు ఇస్తాం, రూ.10వేలు డబ్బులిస్తామని అందరినీ పిలుచుకొచ్చిన కో ఆర్డినేటర్లు పత్తా లేకుండా పోయారు. దీంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాన్ని మహిళలు బహిరంగంగానే తిట్టిపోశారు. 680 బస్సులు కేటాయింపు సాక్షి కడప : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పసుపు–కుంకుమ డ్వాక్రా మహిళల మహా సమ్మేళన కార్యక్రమానికి ఆర్టీసీ పెద్ద ఎత్తున బస్సులను కేటాయించింది. రాయలసీమలోని కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలతోపాటు నెల్లూరు జిల్లాలోని డ్వాక్రా మహిళలను తీసుకొచ్చేందుకు బస్సులను ప్రభుత్వం తీసుకుంది. అందులో భాగంగా జిల్లాలోని అన్ని డిపోల నుంచి దాదాపు 300 బస్సులు సీఎం పర్యటనకు వినియోగించగా, కర్నూలు 100, చిత్తూరు 80, అనంతపురం 100, నెల్లూరు 100 బస్సులు కేటాయించారు. -
పసుపు కుంకుమ నిధులు తూచ్..!
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే సమయం సమీపిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సవాలక్ష జిమ్మిక్కులు చేస్తోంది. ఇందులో భాగంగానే మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రూ.10 వేల నగదును పసుపు కుంకుమ కింద ఇస్తామంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ప్రకటించారు. జిల్లాలోని 67వేల సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలందరికీ ఒక్కసారిగా రూ.10 వేలు ఇవ్వాలంటే రూ.659 కోట్లు కావాలి. అదికూడా ఫిబ్రవరిలోనే ఇచ్చేస్తామన్నారు. ఇందులో ఓ మర్మముంది. ఓ తిరకాసుంది. మహిళల్ని ఏమార్చడమే ఇందులోని మర్మం. సంఘాల్లో తీవ్ర అసంతృప్తిగా ఉన్న మహిళల్ని మోసగించడమే ఈ పథకంలోని తిరకాసు. అదెలాగంటే.. చిత్తూరు అర్బన్: గత ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో మహిళలకు హామీలిచ్చి తర్వాత విస్మరించింది. అప్పటి వరకు తీసుకున్న బ్యాంకు రుణాలు చెల్లించొద్దని మహిళా సంఘాలకు టీడీపీ చెప్పింది. మహిళలు ఈ మాటలు నమ్మి బ్యాంకుల్లో తీసుకున్న రుణాలుచెల్లించలేదు. ఒకటి, రెండు, మూడు ఇలా ఆరు నెలలయ్యాయి. ప్రభుత్వం నుంచి రుణమాఫీపై ఎలాంటి ప్రకటనా రాలేదు. తీసుకున్న రుణాలు చెల్లించకుంటే ఇళ్లవద్దకు వచ్చి పరువుతీస్తామంటూ బ్యాంకర్లు హెచ్చరికలు జారీ చేశారు. తీరా ప్రభుత్వం నుంచి ఓ ప్రకటన వెలువడింది. రుణమాఫీ చేయడం సాధ్యంకాదని, రూ.10 వేలను ప్రతి మహిళకూ ఇస్తానని చంద్రబాబు నాయుడు చల్లగా చెప్పారు. అది కూడా నాలుగు విడతలుగా విడుదల చేయడంతో ఆర్నెల్ల పాటు రుణం చెల్లించకుండా ఆపేసిన ప్రతి మహిళా సంఘానికి ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలు ఏ మూలకూ చాల్లేదు. ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మహిళా సంఘాలను బుజ్జ గించి మరోమారు మోసం చేయడానికి తాజాగా రెండో విడత పసుపు కుంకుమ పేరిట రూ.10 వేలు ఇస్తామంటూ ప్రభుత్వం ఊదరగొడుతోంది. అసలు విషయం ఇదీ.. ముఖ్యమంత్రి ఇప్పుడిస్తామంటున్న రూ.10 వేలను పోస్టుడేట్ చెక్కుల ద్వారా మహిళలకు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అంటే ఫిబ్రవరి 20వ తేదీన మహిళలకు చెక్కు ఇస్తే అందులో తేదీ మాత్రం ఏప్రిల్, మే నెలవి ఉంటాయి. అప్పటికప్పుడు ఈ చెక్కులను మార్చుకోవడం సాధ్యంకాదు. ఫిబ్రవరి నెలలో రూ.2,500, మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4 వేలు చెల్లిస్తారట. ఇచ్చే ప్రతి చెక్యూ పోస్ట్డేట్లవే. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మహిళలకు డబ్బులు ఇవ్వడాన్ని ఎన్నికల సంఘం అంగీకరించదని భావించిన ముఖ్యమంత్రి ఈ కొత్త తరహా వ్యూహాన్ని రచించారు. ఎన్నికలు పూర్తయ్యి అధికారం చేజారిపోతే చెక్కులు చెల్లుబాటు అవుతాయో, లేదో కూడా తెలియని పరిస్థితి. కొత్త సంఘాలకు లేనట్లే.. పసుపు కుంకుమ నిధులు తీసుకోవడానికి సోమవారం నుంచి మహిళా సంఘాలు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంది. దీనికి కొన్ని షరతులు వర్తింపచేయనున్నారు. ఈ పథకం అందుకునే మహిళ ఎన్నేళ్లుగా సంఘాల్లో ఉన్నారో వివరాలు ఇవ్వాలి. కొత్తగా ఏర్పాటయిన మహిళా సంఘాలకు దీన్ని అమలుచేయడం సాధ్యం కాదని అధికా రులు చెబుతున్నారు. చేస్తున్నదే మోసం, అందులోనూ అందరికీ వర్తించదనే ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు అగ్గిమీద గుగ్గిలమవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇచ్చేంత వరకు నమ్మకంలేదు.. ఐదేళ్ల ముందు బ్యాంకులో తీసుకున్న రుణం కట్టొద్దన్నారు. వీళ్ల మాటవిని నాలుగు నెలల రుణం కట్టలేదు. మళ్లీ సొమ్ములు (ఆభరణాలు) కుదువపెట్టి అప్పు తీర్చినాం. ఇప్పుడేమో పదివేలు ఇస్తామంటా ఉండారు. డబ్బు చేతికి వచ్చేదాకా మాకు నమ్మకంలేదు. – శాంతమ్మ, మండికృష్ణాపురం, గుడిపాల -
డ్వాక్రా మహిళల పడిగాపులు
పశ్చిమగోదావరి, ఆకివీడు: గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ పూర్తి చేయకుండానే చేసినట్టుగా నమ్మించి మోసం చేసిన చంద్రబాబు తాజాగా స్మార్ట్ ఫోన్లు, రూ.10 వేలు ఎకౌంట్లో వేస్తామంటూ భారీ స్కెచ్‌కి తెర తీశారు. డ్వాక్రా మహిళలు పేర్లు నమోదు చేయించుకున్నవారికి ఫోన్లు, రూ.10 వేలు ఇస్తామని యానిమేటర్లు చెప్పడంతో శుక్రవారం గ్రామ పంచాయతీల వద్దకు మహిళలు పోటెత్తారు. తీరా అక్కడకు వెళ్లాక ముఖ్యమంత్రి ప్రసంగం వినాలంటూ చెప్పడంతో డ్వాక్రా మహిళలు అవాక్కయ్యారు. డ్వాక్రా గ్రూపులకు సెల్ఫోన్లు ఇస్తామని, రూ.10 వేలు ఎకౌంట్లో వేస్తామని ప్రకటించి యాని మేటర్లతో పేర్లు నమోదు చేయించుకునే ప్రక్రియ శుక్రవారం ఆకివీడు పంచాయతీ వద్ద రసాభాసగా మారింది. పంచాయతీ కార్యాలయం వద్ద డ్వాక్రా మహిళల పేర్లు నమోదు చేస్తామని, ఆధార్ కార్డుతో మహిళలు హాజరుకావాలని యానిమేటర్లు పిలుపునివ్వడంతో 2 వేల మందికి పైగా మహిళలు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయం వద్ద టెంట్, కుర్చీలు, ఎల్సీడీ టీవీని అమర్చారు. అవి చూసి మహిళలు అవాక్కయ్యారు. పేర్లు నమోదు చేసుకుంటామని చెప్పి మీటింగ్ పెట్టారేమిటని యానిమేటర్లను ప్రశ్నించగా కొద్దిసేపు ఉండాలని, ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని, అది వినాలని చెప్పడంతో మహిళలు తిట్ల పురాణం అందుకున్నారు. సీఎం ప్రసంగం వినడానికి ఈ విధంగా మోసపూరితంగా పిలవడమేమిటని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మరోవైపు టీవీలో సీఎం ప్రసంగం రాకపోవడం, మహిళలు వెళ్లిపోతుండడంతో యానిమేటర్లు పేర్లు నమోదు చేసుకుంటాం ఉండాలని చెప్పారు. దీంతో మహిళలు క్యూకట్టి పేర్లు నమోదు కోసం నిల్చున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పడిగాపులు పడిన అనంతరం డ్వాక్రా మహిళల పేర్లు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత టీవీలో సీఎం ప్రసంగం మొదలైంది. లైనులో నిల్చోలేక అప్పటికే ఎక్కువ మంది డ్వాక్రా మహిళలు వెనుదిరిగారు. సీఎం ప్రసంగం వినేందుకు పేర్లు నమోదు అంటూ పిలవడంపై డ్వాక్రా మహిళలు, నాయకులు అక్కడున్న సిబ్బందిపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రతిసారి ఇదే విధంగా మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి మోసగిస్తున్నారు డ్వాక్రా మహిళల్ని మరోసారి మోసగిస్తున్నారు. పేర్లు నమోదు అంటూ పిలిచి సీఎం ప్రసంగం వినమన్నారు. సెల్ఫోన్లు, రూ.10 వేలంటూ ఉసిగొలుపుతున్నారు. ఎన్ని చేసినా మీకు ఓటు వేయం. వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఓటు వేస్తాం. మహిళల్ని గొర్రెలుగా చూస్తున్నారు. ఈ సారి చంద్రబాబు మోసాలను నమ్మే ప్రసక్తి లేదు.– పెద్దింట్లు, మాదివాడ, ఆకివీడు రుణమాఫీ అంటూ అధిక వడ్డీ వసూలు డ్వాక్రా రుణమాఫీ అంటూ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాన్ని నమ్మి ఓటు వేశాం. రుణమాఫీ చేయలేదు సరికదా రూ.10 వేలు ఎకౌంట్లో వేసి తలో వెయ్యి తీసుకోమన్నారు. పావలా వడ్డీని తొలగించి, రూ.1.50 పైసలు వడ్డీ వసూలు చేశారు. సెల్‌ఫోన్, మళ్లీ పదివేలని అధికారంలోకి వస్తే ఎంత వడ్డీ వసూలు చేస్తారో? – జహీరున్నీసా, ముస్లిం వీధి, ఆకివీడు -
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు టోకరా
-
మిమ్మల్ని నమ్మొచ్చా?! : చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వేదికగా శుక్రవారం పసుపు–కుంకుమ–2 పేరిట హంగామా చేశారు. సభకు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ చేశారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేయకపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పైగా సాయంత్రం 4.30 గంటలకు రావాల్సిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు రెండు గంటల ఆలస్యంగా 6.30 గంటలకు చేరుకున్నారు. దీంతో సభకు వచ్చిన మహిళలంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తొలుత నాలుగు జిల్లాలకు చెందిన డ్వాక్రా సంఘాల జిల్లా అధ్యక్షులతో మాట్లాడించారు. వారంతా తనను పొగుడుతుంటే వేదికపై కూర్చున్న చంద్రబాబు తెగ మురిసిపోయారు. సరిగ్గా 6.45 గంటల నుంచి దాదాపు 7.40 గంటల వరకు సీఎం ప్రసంగించారు. ప్రసంగం ఆద్యంతం డ్వాక్రా మహిళలను ప్రాధేయపడడంతోనే సరిపోయింది. నన్ను నమ్మండి అంటూనే.. మిమ్మలను నమ్మొచ్చా అంటూ మాట్లాడారు. ఎప్పటిలాగే డ్వాక్రా ఉద్యమానికి తానే మూల పురుషుడినని, డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రికలని, 94 లక్షల సైన్యం నాకు ఉందంటూ గొప్పలు చెప్పుకున్నారు. రేపటి నుంచి గ్రామాల్లోకి వెళ్లి టీడీపీ కార్యకర్తల్లా పనిచేయాలని సీఎం పిలుపు ఇవ్వగా.. మహిళల నుంచి కనీస స్పందన కరువైంది. ‘పోస్ట్ డేటెడ్ చెక్కులిస్తున్నా.. నమ్మండి ఈ చెక్కులన్నీ క్యాష్ అవుతాయి’ అంటూ మహిళలను నమ్మించేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కిమిడి కళా వెంకటరావు, సీహెచ్ అయ్యన్నపాత్రుడు ‘సాక్షి’పై తమ అక్కసు వెళ్లగక్కారు. ఇక చివరగా రూ.10 వేల కోట్ల నమూనా చెక్కును నాలుగు జిల్లాల డ్వాక్రా సంఘాల అధ్యక్షులకు అందజేశారు. కాగా సభ నిర్వహణ ఆలస్యం కావడంతో తిరుగు ప్రయాణంలో మహిళలు తాము వచ్చిన బస్సులు ఎక్కడున్నాయో తెలియక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అంతే కాకుండా పలువురు మహిళలు తప్పిపోవడం.. వారి కోసం పదేపదే మైకుల్లో చెప్పడం కనిపించింది. పొరుగు జిల్లాలకు 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు వెళ్తూనే కన్పించాయి. రాత్రి భోజనంగా పులిహోర పొట్లాలు ఇవ్వడంపై మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అండగా ఉండండి!
సాక్షి నెట్వర్క్: డ్వాక్రా మహిళలకు నాలుగున్నర ఏళ్లలో రూ.21,116 కోట్లు అందజేశామని, ఇంత చేశాం కాబట్టి తనకు అండగా నిలవాలని.. ఎన్నికలయ్యే వరకూ తన కోసం పనిచేయాలని సీఎం చంద్రబాబు వారిని వేడుకున్నారు. ఇంటికి పెద్ద కొడుకులా ఉంటానన్నారు. గ్రామాల్లో తన గురించి చర్చించాలని.. మళ్లీ టీడీపీ ప్రభుత్వం రావాలన్నారు. ‘నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత, నన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే..’ అంటూ ఆయన మహిళలను అభ్యర్ధించారు. పసుపు–కుంకుమ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నేలపాడు, కడప, విశాఖపట్నంలలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. డ్వాక్రా మహిళలకు మూడు దఫాల్లో రూ.10 వేలను అందజేయడమే కాకుండా, రాష్ట్రంలోని కోటి నలభై లక్షల మందికి స్మార్ట్ఫోన్లు అందజేస్తానని సీఎం ప్రకటించారు. ఫిబ్రవరిలో రూ.2,500.. మార్చిలో రూ.3,500, ఏప్రిల్‌లో రూ.4వేల చొప్పున చెక్కులను నేరుగా మహిళల ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే టెక్నాలజీని అనేక రకాలుగా వినియోగించుకోవచ్చని చెప్పారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంపొందించేందుకు తాను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టానన్నారు. రాష్ట్రంలో 93 లక్షల 80 వేల మంది డ్వాక్రా మహిళలు ఉన్నారని వీరందరికీ అప్పుచేసి మరీ రూ.10 వేలు చొప్పున ఇస్తున్నానని చెప్పారు. ‘సాక్షి’ పేపరోళ్లు చెబుతున్నట్లుగానే తన దగ్గర డబ్బుల్లేవని.. అందుకే రూ.10 వేలకు పోస్ట్ డేటెడ్ చెక్కులే ఇస్తున్నానని సీఎం చెప్పారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి తానిచ్చే రూ.10 వేలతో డ్వాక్రా మహిళలు అంచలంచెలుగా రూ.లక్షలు సంపాదించి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. నియోజకవర్గానికి 200 ఎకరాలు భూమి కేటాయించి అక్కడ మౌలిక సదుపాయాలు సమకూరుస్తానని.. వారు తయారుచేసిన వస్తువులు విక్రయించుకునేందుకు అక్కడ షెడ్లు నిర్మిస్తామని చెప్పారు. గతంలో కుటుంబ నియంత్రణకు తాను పిలుపునిస్తే మంచి స్పందన వచ్చిందని.. అలాగే, ఇప్పుడు ఒకరికి మించి పిల్లలను కనాలని కోరారు. కాగా, ఇప్పటివరకు 30 శాతం మేర వెలుగు సిబ్బందికి జీతాలు పెంచామని తెలిపారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదాపై చేస్తానని చంద్రబాబు అన్నారు. కాగా, ‘కేసీఆర్ నాకేదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు. ఏ గిఫ్ట్ ఇస్తాడు.. ఆయన ఒక గిఫ్ట్ ఇస్తే ఆయనకు ఐదు రిటర్న్ గిప్ట్‌లు ఇవ్వడానికి మా అక్కాచెల్లమ్మలు సిద్ధంగా ఉన్నార’ని చెప్పారు. వైఎస్సార్సీపీ తామే గెలవబోతున్నట్టుగా డబ్బులిచ్చి సర్వేలు చేయించుకుందని, వాటిని నమ్మొద్దని చెప్పారు. డ్వాక్రా మహిళలపై దాష్టీకం ఇదిలా ఉంటే.. చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్‌లోని పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం (మెప్మా) ఆధ్వర్యంలో శుక్రవారం వెయ్యి మందికి పైగా మహిళల్ని సెల్‌ఫోన్, రూ.10వేలను ఇస్తామంటూ అంబేడ్కర్ భవన్‌కు బలవంతంగా రప్పించారు. అక్కడకు వెళ్లిన మహిళలకు అధికారులు చుక్కలు చూపించారు. కడపలో జరుగుతున్న సీఎం బహిరంగ సభను ఇక్కడ లైవ్‌లో చివరివరకు చూసిన వారికే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేస్తామంటూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బలవంతంగా కూర్చోపెట్టారు. కానీ, అది ప్రసారం కాలేదు. దీంతో మహిళలు తిట్టుకుంటూ బయటకు వచ్చారు. ఆగ్రహించిన అధికారులు గేట్లు మూయించేశారు. కొందరిని జుట్టుపట్టుకుని లాగుతూ లోపలికి తోసేశారు. ఇదే విధంగా రాజధాని ప్రాంతంలోని నేలపాడులోనూ అధికారులు, టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలను తీవ్ర ఇక్కట్లకు గురిచేశారు. ఇక్కడకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి మహిళలను తరలించారు. వీరిని గురువారం రాత్రే వారివారి మండల కేంద్రాల్లో ఉన్న వెలుగు కార్యాలయాలకు తీసుకువచ్చి అక్కడ నుంచి శుక్రవారం సభకు తీసుకువచ్చారు. రాత్రివేళ వీరికి భద్రత లేకపోవడంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సభకు హాజరుకాకుంటే రూ.10 వేలు డబ్బు, స్మార్ట్ఫోన్లు అందవనే హెచ్చరికతో మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చారు. వీరందరికీ భోజన ఏర్పాట్లు సక్రమంగా చేయలేదు. బలవంతంగా తీర్మానాలు..మహిళల మండిపాటు ‘మీతోనే మేముంటాం..’ అంటూ ఓ తీర్మాన పత్రాన్ని పంపాలంటూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు మెప్మా శాఖ అధికారుల ద్వారా సమాచారం పంపడంపై డ్వాక్రా మహిళలు మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి.. మాట తప్పి సంఘాలను నిర్వీర్యం చేసిన ఆయనకు తాము అండగా ఉన్నామని ఎలా తీర్మానాలు చేయాలంటూ వైఎస్సార్‌జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన సమావేశంలో రీసోర్స్ పర్సన్లను (ఆర్పీలు) నిలదీశారు. ఈ సమావేశానికి డ్వాక్రా మహిళలను తీసుకురావాలంటూ సర్కారు ఆర్పీలను ఆదేశించడంతో వారు మహిళలను బెదిరించి బస్సులెక్కించారు. బస్సుల్లో ఉన్న ఆర్పీ సంఘ సభ్యులతో కలిసి తీసుకున్న ఫొటోను, బస్సు ముందు సీఓ, ఆర్పీ నిలబడి సమాఖ్య ఫ్లెక్సీతో తీసుకున్న ఫొటోలను పంపించాలని నిబంధన పెట్టడంతో వారంతా సీఎం సభకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి వందలాది బస్సుల్లో తరలించారు. కడపలో సీఎం సభ ప్రత్యక్ష ప్రసారానికి టీవీలను ఆర్పీలే ఏర్పాటుచేసుకోవాలనడంతో వారు లబోదిబోమంటూ పరుగులు పెట్టారు. మరోవైపు.. అమరావతి, విశాఖపట్నం, కడపలో జరిగిన సభల్లో మహిళలతో బలవంతంగా ఏకగ్రీవ తీర్మానం చేయించినట్లు సమాచారం. -
మాట తప్పిన సీఎం!
డ్వాక్రా రుణాలు పూర్తీగా మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు టీడీపీ అధ్యక్షుని హోదాలో చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. అధికారిక గద్దెనెక్కిన తర్వాత రుణమాఫీ కాదు.. పెట్టుబడి నిధి ఒక్కొక్క సభ్యురాలికి మూడు విడతల్లో రూ.10వేలు చెల్లిస్తానని మాట మార్చారు. సీఎం మాట తప్పడంతో స్వయం సహాయక సంఘాల సభ్యులు అప్పుల పాలయ్యారు. ఐదేళ్ల పాలన పూర్తి కావస్తున్నా ఒక్కో సభ్యురాలికి పెట్టుబడి నిధి కింద జమ చేస్తానన్న రూ.10 వేలు కూడా జమ కాకపోగా కోర్టులో కేసులు వేసి మహిళలను కోర్టు బోను ఎక్కేలా చేశారు. సాక్షి ప్రతినిధి కడప/ప్రొద్దుటూరు టౌన్ : జిల్లాలో చంద్రబాబు హామీ ఇచ్చేనాటికి (2014 మార్చి నాటికి) 33,254 డ్వాక్రా సంఘాలున్నాయి. అందులో 3.21లక్షల మంది సభ్యులు ఉన్నారు. వీరంతా డ్వాక్రా రుణమాఫీ చేస్తారని ఆశించారు. కాగా 2015 జూలై ఒక్కో సభ్యురాలికి రూ.3వేలు తొలివిడతగా కేటాయించారు. 2016 అక్టోబర్‌లో రెండో విడతగా మరో రూ.3వేలు కేటాయించారు. ఈ మొత్తాన్ని కూడా సభ్యులు డ్రా చేసుకునే వెసులుబాటు లేకుండా బ్యాంకర్లు అనేక చోట్ల అడ్డగించారు. ఈక్రమంలో 2018 మార్చిలో రూ.2వేలు, అక్టోబర్‌లో రూ.2వేలు పసువు కుంకుమ కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగు విడతల్లో ఒక్కో సభ్యురాలికి రూ.10వేలు కేటాయించి మమ అన్పించారు. కుదేలైన డ్వాక్రా వ్యవస్థ... డ్వాక్రా సంఘాలు వ్యవస్థ బ్యాంకర్లుతో సత్సంబంధాలు కొనసాగుతూ లావాదేవీలు సక్రమంగా ఉండేవి. ఈక్రమంలో అక్కచెల్లెమ్మలు ఎవ్వరూ బ్యాంకర్లకు డ్వాక్రా రుణాలు చెల్లించవద్దంటూ చంద్రబాబు ప్రకటించారు. ఆమేరకు అత్యధిక సంఘాలు రుణాలు రికవరీ చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించాయి. దాంతో డీఫాల్టర్లుగా అనేక సంఘాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పావలా వడ్డీతో డ్వాక్రా సంఘాలకు రుణాలు అందిస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు డ్వాక్రా గ్రూపులకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. బ్యాంకర్లు గ్రూపులకు కేటాయించిన రుణాలు వడ్డీతో సహా రికవరీ చేసుకున్న తర్వాత ప్రభుత్వం గ్రూపులకు వడ్డీ కేటాయిస్తే ఆ మొత్తం తిరిగి ఆయా గ్రూపుల్లో జమచేసే వారు. ఇలా వడ్డీ రాయితీ రాష్ట్ర ప్రభుత్వం 2016 ఆగస్టు నుంచి పెండింగ్‌లో ఉంది. దాదాపు రూ.176 కోట్లు డ్వాక్రా గ్రూపులకు వడ్డీ రాయితీ జమ చేయాల్సి ఉంది. మరోమారు డ్వాక్రా సంఘాలకు అగ్రస్థానం కల్పించనున్నట్లు శుక్రవారం కడప గడపలో సీఎం నేతృత్వంలో ప్రకటించే అవకాశం లేకపోలేదు. డబ్బు కట్టినా కోర్టునుంచి నోటీసులా..! ప్రొద్దుటూరు పట్టణంలోని 32వ వార్డులో నివాసం ఉంటున్నారు. వాసవి స్వయం సహాయక సంఘం సభ్యులు 2012 డిసెంబర్లో రూ.4లక్షలు కార్పొరేషన్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు. 2013 జనవరి 1వ తేదీ నుంచి క్రమం తప్పకుండా బ్యాంకుకు రుణం చెల్లిస్తున్నారు. పుస్తకాల్లో ఉన్న రికార్డు ప్రకారం షరిఫున్నీసా రూ.40వేలు రుణం తీసుకుని రూ.28,000 అసలు చెల్లించింది. రూ.4,700 పొదుపు ఉంది. మొత్తం రూ.12 వేలు కట్టాలని ఉంది. సరితాదేవి రూ.30 వేలు రుణం తీసుకున్నారు. రూ.25,500 అసలు, రూ.5000 పొదుపు పోను రూ.500 అదనంగా చెల్లించింది. షకీలాబేగం రూ.30 వేలు రుణం తీసుకోగా రూ.23,500 అసలు, రూ.3,700 పొదుపు పోను రూ.2,750 చెల్లించాలి. ప్రభావతి రూ.40 వేలు రుణం తీసుకోని పూర్తిగా చెల్లించింది. 5,300 పొదుపు కూడా ఎస్ఎల్ ఎఫ్‌లో ఉంది. రామలక్ష్మి రూ.40 వేలు రుణం తీసుకుంది. ఇందులో రూ.22,700 అసలు, 3000 పొదుపు పోను రూ.14,300 చెల్లించాలి. మాబూచాన్ రూ.30 వేలు రుణం తీసుకొని అంతా చెల్లించింది మరో రూ.5,350 పొదుపు ఖాతాలో ఉంది. షమీమ్‌బాను రూ.40 వేలు రుణం తీసుకొని పూర్తిగా చెల్లించింది. రూ.5,320 పొదుపు ఉంది. హయాతూన్బీ రూ.30 వేలు రుణం తీసుకొని చెల్లించింది. రూ.4,700 పొదుపు ఉంది. ఎస్.ఫరీనా, పి.ఫాతిమా కూడా కొంత డబ్బు చెల్లించాలి. ఈ విధంగా రూ.4 లక్షలకు గాను దాదాపు రూ.80 వేల లోపు బాకీ పడ్డారు. ఐదేళ్ల కాలంలో ఇప్పటి వరకు ఈ గ్రూప్‌నకు కేవలం రూ.60 వేలు పెట్టుబడి నిధిగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. కార్పొరేషన్ బ్యాంకు అధికారులు ఈ గ్రూప్ రూ.1,02,977 బాకీ ఉందని కోర్టులో దావా వేసి నోటీసులు పంపారు. వీరితోపాటు ఇదే వార్డులోని శ్రీకృష్ణా స్వయం సహాయక సంఘలోని సుబ్బరత్నమ్మ, శ్రీలతతో పాటు సంఘ సభ్యులకు రూ.1,47,552 డబ్బు కట్టాలంటూ నోటీసులు పంపారు. ఈ సమస్య ఆ రెండు డ్వాక్రా గ్రూపులదే కాదు. డ్వాక్రా రుణాలు మాఫీ అవుతాయని భావించిన సభ్యులందరీ పరిస్థితి అదే. చాలా దారుణం వాసవీ స్వయం సహాయక సంఘం గ్రూప్‌లో తన భార్య çషమీమ్‌భాను, కుమార్తె మాబుచాన్ ఉన్నారు. తన భార్య రూ.40 వేలు, తన కుమార్తె రూ.30 వేలు రుణం తీసుకుంది. ఈ డబ్బును 2016 జనవరి 31 నాటికి పూర్తిగా కట్టేశాం. ఇక వీరి పొదుపు డబ్బు, చంద్రబాబు రుణమాఫీ పేరుతో ఇచ్చిన మూలధనం డబ్బు బ్యాంకు అధికారులు వడ్డీ కింద ఎలా జమ వేసుకుంటారు. పావలా వడ్డీలు, స్త్రీనిధి తదితర డబ్బులు ఎవరి ఖాతాలో జమ చేశారు. డబ్బు కట్టిన మా కుటుంబ సభ్యులకు కార్పొరేషన్ బ్యాంకు అధికారులు నోటీసులు ఎలా ఇస్తారు. మాకు న్యాయం చేయాలి. మహిళలను కోర్టు బోను ఎక్కించడానికేనా డ్వాక్రా రుణమాణఫీ చేసింది. ఇది చాలా దారుణం– నూర్ అహమద్ -
చంద్రబాబు హామీలను విశ్వసించని మహిళలు
-
చంద్రబాబు సమర్పించు... ఎలక్షన్ సినిమా!
-
నవరత్నాలను ఒక్కొక్కటిగా కాపీ కొడుతున్న చంద్రబాబు!
సాక్షి, అమరావతి: గత ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు 600కిపైగా వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని అటకెక్కించిన సీఎం చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన అనంతరం సరిగ్గా ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు సరికొత్త హామీలతో మరోసారి మోసగించేందుకు ఎల్లో మీడియా సహకారంతో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రుణమాఫీని అటకెక్కించిన చంద్రబాబు డ్వాక్రా మహిళలకు సైతం వెన్నుపోటు పొడిచారని గుర్తు చేస్తున్నారు. రుణాలు మాఫీ కాకపోగా వడ్డీల భారం అన్నదాతల నడ్డి విరిచిందని, బ్యాంకుల్లో అప్పులు కూడా పుట్టని దుస్థితికి చేరుకోవడానికి బాబు పాలన కారణం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ 2017 జూలైలో ప్రకటించిన నవరత్నాల హామీలపై ఏడాదిన్నరగా స్పందించకుండా ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు మోసపు సినిమాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు ఒక్కొక్కటిగా నవరత్నాల హామీలను కాపీ కొడుతున్నారని పేర్కొంటున్నారు. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామని గత ఎన్నికల సమయంలో పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీని తుంగలోకి తొక్కిన చంద్రబాబు ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేలు అప్పు రూపంలో ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం మోసం కాదా?మరో నెలలో ఎన్నికల షెడ్యూల్ వెలువడనుండడంతోనే పెన్షన్ పెంచుతున్నట్లు హడావుడిగా ప్రకటన చేయడం వంచన కాదా? ఇన్నాళ్లూ అధికారంలో ఉండి ఏమీ చేయకుండా ఇప్పుడు ఇలాంటి ప్రకటనలు చేయడం మోసం కాదా? వారిని నిజంగానే ఆదుకోవాలనే ఉద్దేశం ఉంటే గతంలోనే పించన్ మొత్తాన్ని ఎందుకు పెంచలేదు? అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అదేకోవలో మొన్న 9 గంటల వ్యవసాయ విద్యుత్తు, నిన్న పించన్ల పెంపును చంద్రబాబు ప్రకటించారని స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్ రైతు భరోసా పేరుతో ఏడాదిన్నర క్రితమే వైఎస్ జగన్ ప్రకటించిన పథకాన్ని తాజాగా చంద్రబాబు ఇప్పుడు రైతు రక్ష పేరుతో ప్రవేశపెట్టనున్నట్లు లీకులిస్తున్నారు. సీఎం చంద్రబాబుకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రైతులకు మేలు చేసే కార్యక్రమాలను ఐదేళ్లుగా ఎందుకు చేపట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి కాలం అధికారంలో కొనసాగుతూ ఇలాంటి పలు పథకాలను అమలు చేసే అవకాశం ఉన్నా ఆయన ఏనాడూ పట్టించుకున్న పాపానపోలేదని వ్యాఖ్యానిస్తున్నారు. నిన్ను నమ్మం బాబూ నమ్మం.. చంద్రబాబు గత ఎన్నికల సమయంలో కుటుంబానికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఇచ్చిన హామీని గాలికి వదిలేశారు. ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోకుండా ఎన్నికల ముందు హడావుడికి తెర తీశారు. రాష్ట్రంలో 1.72 కోట్ల కుటుంబాలు ఉండగా కేవలం కొద్ది మందిని మాత్రమే నిరుద్యోగ భృతికి ఎంపిక చేసుకుని నెలకు రూ.వెయ్యి మాత్రమే ఇస్తామనడం మోసం కాదా?..అందుకే నిన్ము నమ్మం బాబూ.. నమ్మం అంటూ మండిపడుతున్నారు. అవకాశం ఉన్నా చేయకుండా ఇప్పుడు ప్రకటనలా? గతంలో ఎన్టీఆర్ రూ.2కే కిలో బియ్యం ఇస్తామని ప్రకటించినప్పుడు నాడు అధికారంలో ఉన్న కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం అందుకు పోటీగా తాము రూ.1.90కే కిలో బియ్యం ఇస్తామని ప్రకటించినా ప్రజలు కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించారని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికారంలో ఉండి, అవకాశం ఉన్నా ఏమీ చేయకుండా మరోసారి గెలిపిస్తే ఏదో చేస్తామంటూ నవరత్నాల హామీలను కాపీ కొడుతూ చంద్రబాబు ప్రకటనలు చేసినా ఏమాత్రం ప్రయోజనం ఉండదని విశ్లేషిస్తున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఏడాదిన్నర క్రితమే నవరత్నాల కింద పలు పథకాలను ప్రకటించగా చంద్రబాబు అప్పటి నుంచి ఇప్పటిదాకా మౌనంగా ఉంటూ ఎన్నికల ముందు అవే అంశాలను అమలు చేస్తామని చెప్పడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
తొలి సంతకాలకే దిక్కు లేదు
రైతు రుణాల మాఫీ చంద్రబాబు గద్దెనెక్కే నాటికి రాష్ట్రంలో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయి. ఈ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆ తరువాత వివిధ రకాల కోతలు, షరతులతో రుణాలను రూ.24,500 కోట్లకు కుదించేశారు. ఇప్పటివరకు మూడు విడతల్లో మాఫీ చేసిన రుణాలు రూ. 14,497 కోట్లు మాత్రమే. ఇది వడ్డీలో మూడో వంతుకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి 1,26,000 కోట్లకు చేరుకుని 35 లక్షల మంది డిఫాల్టర్లుగా మారారు. వారికి కొత్త రుణాలు ఇచ్చేదే లేదని బ్యాంకులు తేల్చిచెబుతున్నాయి. డ్వాక్రా రుణ మాఫీ చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. వీటన్నింటినీ మాఫీ చేస్తానంటూ చంద్రబాబు తొలి సంతకం చేశారు. కానీ, నాలుగున్నరేళ్లలో డ్వాక్రా సంఘాల రుణాల మాఫీకి పైసా కూడా ఇవ్వకుండా దగా చేశారు. రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త అప్పులు పుట్టక డ్వాక్రా మహిళలు లబోదిబోమంటున్నారు. బెల్టు దుకాణాల రద్దు మద్యం బెల్టు షాపులను తక్షణమే రద్దు చేస్తున్నామని నమ్మబలుకుతూ ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు సంతకం చేశారు. తర్వాత ఆ సంగతే మర్చిపోయారు. ప్రభుత్వం మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంది. పట్టణం, పల్లె అనే తేడా లేకుండా బెల్టు దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం షాపులుంటే, వీటికి అనుబంధంగా 40 వేలకు పైగా బెల్టు షాపులు నడుస్తున్నాయి. రాష్ట్రానికి మద్యం అమ్మకాల ద్వారా ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు షాపుల వాటా రూ.9 వేల కోట్లకు పైమాటే. ఎన్టీఆర్ సుజల ఇంటింటికీ రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆయన చేసిన తొలి సంతకాల్లో ఎన్టీఆర్ సుజల పథకం అమలు కూడా ఒకటి. నాలుగున్నరేళ్లుగా ఈ పథకం పక్కాగా ఆమలైన దాఖలాలే లేవు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచినీటి కోసం ప్రజలు పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. మరో గత్యంతరం లేక ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాక్షి, అమరావతి: 2014 జూన్ 8వ తేదీన ప్రజల సమక్షంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తక్షణమే అమల్లోకి తీసుకొస్తున్నానంటూ సీఎం హోదాలో తొలిసారిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. నాలుగున్నరేళ్లు దాటినా ఆ తొలి సంతకాలకు దిక్కులేకుండా పోయింది. తొలి సంతకాలంటే శిలాక్షరాలే. కానీ, అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేసిన పాపాన పోలేదు. తీరా ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలపై ముఖ్యమంత్రి మళ్లీ కొత్త హామీల వల విసురుతుండడం గమనార్హం. తొలి సంతకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో పరిశీలిస్తే చంద్రబాబు చేసిన మోసం తేటతెల్లమవుతుంది. రైతన్నలను నట్టేట ముంచేశారు రాష్ట్రంలో వ్యవసాయ రుణమాఫీ అటకెక్కింది. చంద్రబాబు చేసిన మొదటి సంతకమే పూర్తిగా అమలులోకి రాలేదు. 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో రూ.87,612 కోట్ల రైతు రుణాలు బేషరతుగా మాఫీ కావాలి. అయితే ఇప్పటి వరకు మూడు విడతల్లో రూ. 14,497 కోట్లు మాత్రమే చెల్లించారు. ఈ సొమ్ము అసలు రుణాలపై వడ్డీలకు కూడా సరిపోలేదు. దీంతో రైతుల రుణాలు, వడ్డీలు కలిపి రూ. 1,26,000 కోట్లకు చేరుకున్నాయి. రుణమాఫీ సక్రమంగా జరగకపోవడంతో 35 లక్షల మంది రైతుల ఖాతాలు డిఫాల్టర్లుగా మారాయి. వారికి కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించడం లేదు. రుణాలు చెల్లించని రైతుల బంగారాన్ని బ్యాంకులు వేలం వేస్తున్నాయి. లక్షలాది మందికి బ్యాంకుల నుంచి తాఖీదులు వచ్చాయి. అప్పులు కడతారా? లేక అరెస్టులు చేయించి కోర్టులకు ఈడ్చమంటారా? అంటూ బెదిరింపులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో సన్న, చిన్నకారు, కౌలు రైతులు సాగు పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారు. వడ్డీలు అమాంతం పెరిగిపోతున్నాయి. వాటిని తీర్చే దారి కనిపించక అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పల్లెపల్లెనా బెల్టు షాపుల జాతర మద్యం బెల్టు దుకాణాలను వెంటనే రద్దు చేస్తున్నామంటూ చంద్రబాబు చేసిన సంతకం అపహాస్యం పాలైంది. బెల్టు దుకాణాల రద్దుపై చంద్రబాబు మొక్కుబడిగా ఓ జీవో జారీ చేసి చేతులు దులిపేసుకున్నారు. రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో బెల్టు షాపుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. వీటి కోసం గ్రామాల్లో ఏకంగా వేలంపాటలు జరుగుతున్నాయి. వీధివీధినా బెల్టు దుకాణాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో బెల్టు షాపులు ఎక్కడా లేకుండా కత్తిరించామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా చెబుతున్నప్పటికీ.. బెల్టు షాపుల రద్దు అనేది పెద్ద బూటకమని తేటతెల్లమైంది. నిన్న మొన్నటి దాకా ఫ్యాన్సీ దుకాణాలు, కూల్‌డ్రింక్ షాపులు, మెడికల్ షాపుల్లో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహించిన వారు ఇప్పుడు తోపుడు బండ్లపైనా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో బాటిల్‌పై రూ.10 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులు, 800 వరకు బార్లు ఉన్నాయి. ఒక్కో మద్యం షాపునకు అనుబంధంగా 10కిపైగా బెల్టు షాపులు కొనసాగుతున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.17,291 కోట్ల ఆదాయం వస్తుండగా, ఇందులో బెల్టు దుకాణాల వాటా రూ.9 వేల కోట్ల పైమాటే కావడం గమనార్హం. జాడ లేని ఎన్టీఆర్ సుజల చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన ఎన్టీఆర్ సుజల పథకం ఏమైందో తెలియదు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ సురక్షిత మంచినీరు సరఫరా అందిస్తామని, 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. సీఎంగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆ మేరకు సంతకం కూడా చేశారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 48,363 నివాసిత ప్రాంతాలుగా ప్రభుత్వం గుర్తించింది. అందులో కేవలం 906 నివాసిత ప్రాంతాల్లోనే తొలుత కొన్నాళ్లు ప్రభుత్వం ఎన్టీఆర్ సుజల పథకాన్ని అమలు చేసింది. అనంతరం సర్కారు పట్టించుకోకపోవడంతో ఆ 906 నివాసిత ప్రాంతాల్లో మంచినీటి ప్లాంట్లు నిర్వహణ లేక మూతపడ్డాయి. పట్టణ ప్రాంతాల్లోనూ కేవలం 354 నివాసిత ప్రాంతాల్లో మాత్రమే ఈ పథకం అమలు జరిగినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పట్టించుకోక, బోర్లు, బావుల్లోని నీటిని తాగడానికి వీలులేక ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక ధరకు నీటిని కొనుగోలు చేసి తాగుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు అమ్ముతున్న నీటిలో నాణ్యత గురించి పట్టించుకునే వారే లేకుండాపోయారు. డ్వాక్రా మహిళలకు కన్నీరే మిగిలింది డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ తాము అధికారంలోకి రాగానే మాఫీ చేస్తామని 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా తిరుగుతూ హామీ ఇచ్చారు. ఆయన అధికారం చేపట్టే నాటికి రాష్ట్రంలో 7.72 లక్షల డ్వాక్రా సంఘాల పేరిట బ్యాంకుల్లో రూ.14,204 కోట్ల అప్పులు ఉన్నాయి. కానీ, నాలుగున్నరేళ్లుగా పైసాకూడా మాఫీ చేయకుండా డ్వాక్రా మహిళలను కన్నీరు పెట్టించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క డ్వాక్రా సంఘాల రుణం మాఫీ చేయలేదని 2018 సెప్టెంబరు 7న మంత్రి పరిటాల సునీత శాసనసభకు లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. డ్వాక్రా మహిళలు సంఘాల పేరిట పొదుపు రూపంలో దాచుకున్న డబ్బులను అప్పుల కింద బ్యాంకులు జమచేసుకున్నాయి. గతంలో సున్నా వడ్డీ పథకం అమలయ్యేది. చంద్రబాబు పదవీ బాధ్యతలు చేపట్టాక ఆ పథకానికి నిధులు ఇవ్వడం మానేశారు. దాదాపు రెండేళ్లుగా సున్నా వడ్డీ డబ్బులను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రూ.2,300 కోట్ల వడ్డీని డ్వాక్రా సంఘాల సభ్యులు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. -
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ ఎగనామం
-
వైఎస్ జగన్‌ను కలిసిన వెంకటాపురం డ్వాక్రా మహిళలు
-
కరేబీయన్ లీగ్‌లో కింగ్ ఖాన్ చిందులు!
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : కరేబీయన్ ప్రీమియర్ లీగ్‌లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సందడి చేశారు. శుక్రవారం జమైకా తలవాస్‌తో జరగిన మ్యాచ్‌కు షారుఖ్ హాజరై తన జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్(టీకేఆర్)కు మద్దతు తెలిపాడు. ఇక మ్యాచ్‌కు ముందు చీర్ గర్ల్స్‌తో కలిసి మైదానంలో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సీపీఎల్ తమ అధికారిక ట్విటర్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఇక షారుఖ్ ఉత్సాహాన్ని జమైకా తలవాస్ సారథి ఆండ్రూ రస్సెల్ ఆవిరి చేశాడు. భారీ లక్ష్యం నిర్దేశించిన తమ జట్టు గెలుస్తుందని భావించిన షారుఖ్‌కు నిరాశే ఎదురైంది. రస్సెల్ ఆల్‌రౌండ్ షోతో షారుఖ్ టీమ్ 4 వికెట్ల తేడాతో ఓడింది. ఇక ఐపీఎల్లో రస్సెల్ షారుఖ్ జట్టు కోల్‌కతా నైటరైడర్స్ అన్న విషయం తెలిసిందే. ❤❤😘😘😘😍 #cpl18 #biggestpartyinsport @iamsrk pic.twitter.com/eA7VPFbKuq — CPL T20 (@CPL) August 11, 2018 టీకేఆర్ ప్రమోషనల్ సాంగ్.. ఇక తమ జట్టు ప్రచార సాంగ్‌ను బ్రావో తన ట్విటర్ వేదికగా విడుదల చేశారు. టీకేఆర్ ప్రమోషన్ సాంగ్‌ను విడుదల చేస్తున్నానని, ఫ్రాంచైజీ యజమాని షారుఖ్ ఖాన్‌కు ధన్యవాదాలంటూ బ్రావో ట్విట్ చేశాడు. ఇక ఈ ప్రమోషన్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. (చదవండి: ఆండ్రూ రస్సెల్ అద్భుత రికార్డు!)