
డ్వేన్ జాన్సన్, మలిన్ అక్రెమెన్
డ్వేన్ జాన్సన్ అంటే టక్కున గుర్తురాకపోవచ్చు. కానీ రెజ్లింగ్‌లో ‘ది రాక్’ అనగానే మనందరికీ వెంటనే గుర్తొస్తారు. ‘ది రాక్’.. పేరుకు తగ్గట్టుగానే ఆరడుగుల పొడవు, బలిష్టమైన శరీరంతో గంభీరంగా కనిపిస్తారు. కానీ, డ్వేన్ ‘రాక్ కాదు.. పెద్ద టెడ్డీ బేర్’ అంటున్నారు ‘ర్యాంపేజ్’ సినిమాలో డ్వేన్ జాన్సన్ కో–స్టార్ మలిన్ అక్రెమెన్.
‘‘డ్వేన్ కనిపిస్తున్నట్టు రాక్ కాదు, ఆయనో పెద్ద టెడ్డీ బేర్. డ్వేన్ చిరునవ్వు చాలు చుట్టూ ఉన్న వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా మార్చడానికి. అతని ఛార్మ్ అంతా తన చేతి వేళ్లలోనే ఉంది. మనం ఎంత ఊహించుకున్నా దాన్ని మించి ఉంటాడు. డ్వేన్ గురించి ఒక్క చెడు మాట కూడా అనలేం. అతని ఫ్రెండ్‌షిప్ అలాంటిది. అంత లవ్లీ పర్సన్’’ అంటూ తన కో–స్టార్‌ను పొగడ్తలతో ముంచెత్తింది మలిన్ అక్రెమెన్. ఆఫ్ స్క్రీన్ ఇంత మంచి కెమిస్ట్రీ ఉన్న ఈ ‘ర్యాంపేజ్’ జోడీ ఆన్‌స్క్రీన్ కూడా అదరగొడుతున్నారు. గత శుక్రవారం రిలీజైన ‘ర్యాంపేజ్’ సినిమా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment