
నడిరోడ్డుపై ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న మహిళలు
నెల్లూరు, కావలి: కావలి పట్టణంలోని వైకుంఠపురం ప్రాంతంలో సోమవారం పొదుపు మహిళలకు పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సిగపట్లు పట్టారు. పొదుపు నగదు సక్రమంగా చెల్లించకుండా, చెక్ తీసుకోవడానికి వచ్చావని ఒక గ్రూపులోని మహిళను అదే గ్రూపునకు చెందిన మరో మహిళ ప్రశ్నించడంతో కోపంతో మొదటి మహిళ రెండో మహిళలను చెంప చెళ్లు మనిపించింది. ఇద్దరూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంతలో అక్కడ ఉన్న వారంతా వచ్చి ఇద్దరీని విడదీసి పక్కకు నెట్టడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment