pasupu kunkuma
-
లేని వారికి బొట్టు పెట్టి..
సాక్షి, అమరావతి : పసుపు–కుంకుమ పథకం పేరుతో గత ప్రభుత్వ పెద్దలు రూ.476 కోట్లను పక్కదారి పట్టించారు. ఎన్నికల సమయంలో పొదుపు సంఘాల మహిళల ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అప్పటి చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా ఈ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. పొదుపు సంఘాల్లో వాస్తవంగా ఉన్న మహిళల సంఖ్య కన్నా అత్యధికంగా మహిళలు సంఘాల్లో సభ్యులుగా ఉన్నట్టు గణాంకాల్లో చూపి.. అలా ఎక్కువగా చూపిన ఒక్కొక్క మహిళ పేరుతో రూ.10 వేల చొప్పున అప్పటి టీడీపీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జిలు మింగేశారు. ఇందులో అప్పటి ప్రభుత్వాధినేతలకు కొంత వాటా వెళ్లిందని సమాచారం. వాస్తవంగా ఈ పథకం అమలుకు నిధులు లేకపోయినా నాటి ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖల నిధులను సైతం మళ్లించి ఆ డబ్బులను మహిళలకు పంపిణీ చేసింది. అయితే ఇలా పంపిణీ చేసిన డబ్బు నకిలీ సంఘాల పేరుతో పార్టీ పెద్దల జేబుల్లోకి వెళ్లినట్లు తాజాగా తేలడం కలకలం రేపుతోంది. లేని వారు ఉన్నట్లు చూపి.. పొదుపు సంఘాల్లో 2019 జనవరి 18 నాటికి సభ్యులుగా ఉండే మహిళలు పసుపు–కుంకుమ పథకం ద్వారా లబ్ధి పొందడానికి అర్హులుగా అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయానికి రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి మొత్తం 93.18 లక్షల మంది మహిళలు పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండేవారు. గ్రామీణ ప్రాంతాల్లో 73,36,437 మంది మహిళలు 7,28,498 పొదుపు సంఘాల్లో.. పట్టణ ప్రాంతాల్లో 20,37,923 మంది మహిళలు 1,99,185 పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండేవారు. మొత్తం 93,74,360 మంది పొదుపు సంఘాల్లో సభ్యులుగా ఉండగా, అందులో ఒకే మహిళ రెండు సంఘాల్లో సభ్యులుగా ఉన్న వారిని ఒక్కరిగా పరిగణనలోకి తీసుకుంటే, 93.18 లక్షల మంది మహిళలను లబ్ధిదారులుగా లెక్క తేల్చారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2, 3 తేదీల్లో పసుపు– కుంకుమ పథకం చెక్కుల పంపిణీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో 93.18 లక్షల మంది మహిళలు లబ్ధిదారులుగా పేర్కొంది. అయితే 97,94,202 మందికి డబ్బులు చెల్లించినట్టు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. అంటే 4.76 లక్షల మంది మహిళలు సంఘాల్లో సభ్యులుగా లేకపోయినా ఉన్నట్టు చూపి, వారి పేరిట రూ. 476 కోట్లను టీడీపీ నేతలు జేబుల్లో వేసుకున్నారనేది స్పష్టమవుతోంది. రెండో విడత చెక్కుల పంపిణీ నాటికి పెరిగిన సంఖ్య ఎన్నికల సమయంలో పసుపు– కుంకుమ పథకం డబ్బులను మూడు విడతల్లో చెల్లించారు. ఫిబ్రవరి 5వ తేదీన చెల్లుబాటు అయ్యేలా 93.18 లక్షల మందికి చెక్కులు పంపిణీ చేశారు. మార్చి 8వ తేదీన జరిగిన రెండో విడత చెక్కుల పంపిణీ నాటికి లబ్ధిదారుల సంఖ్య అమాంతం 97.94 లక్షల మందికి పెరిగిపోయింది. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు కొత్తగా కొన్ని సంఘాల పేరుతో, అప్పటికే ఉన్న సంఘాల్లో అదనపు సభ్యులుగా చేరినట్టు జిల్లా డీఆర్డీఏ పీడీల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారందరికీ డబ్బుమంజూరు చేయించారు. పెరిగిన సభ్యులకు రెండో విడత సమయంలోనే మొదటి విడత డబ్బులు కూడా పంపిణీ చేశారు. రెండో విడత పంపిణీకి, మూడో విడత పంపిణీకి మధ్య మరో రెండున్నర లక్షల మంది పేరిట మరో రూ.250 కోట్లు టీడీపీ నేతలు తమ జేబుల్లో వేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఎన్నికల కోడ్ కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ ప్రభుత్వమే తిరిగి అధికారంలోకి వస్తే ఆ రూ.250 కోట్ల మేర కాజేయాలని రికార్డులు సిద్ధం చేసుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమితో వారు అనుకున్నది జరగలేదు. సంఘాల్లో లేని వారు ఉన్నట్లు చూపి ఒక్క గుంటూరు జిల్లాలోనే రూ.15 కోట్లు కాజేశారని విజిలెన్స్ విభాగం నిగ్గు తేల్చినట్టు సమాచారం. రూ.401 కోట్లివ్వాలని ఇప్పుడు కోరడంతో.. నిధులు లేకపోయినా ఏపీ డ్రింకింగ్ వాటర్ కార్పొరేషన్ మంచి నీటి పథకాల కోసం అంటూ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చిన రూ.928 కోట్లు, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ నిధులు రూ.180 కోట్లతో పాటు జిల్లా, మండల పరిషత్, గ్రామీణాభివృద్ధి నిధులు వందల కోట్ల రూపాయల మేర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారికంగా పసుపు– కుంకుమ పథకానికి మళ్లించిన విషయం తెలిసిందే. రెండో విడత సమయానికి సభ్యుల సంఖ్య పెరిగినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అప్పటి ప్రభుత్వ పెద్దల నోటి మాట అనుమతితోనే డబ్బులిచ్చేయడం గమనార్హం. అప్పట్లో ఉన్న సెర్ప్ సీఈవోతో పాటు కొందరు సిబ్బంది తెలుగుదేశం పార్టీకి పూర్తి అనుకూలంగా సహకరించి, ఆ నిధులను ఖర్చు చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక.. అప్పట్లో పసుపు– కుంకుమ పథకానికి అదనంగా నిధులు చెల్లించామంటూ రూ.401 కోట్ల మేర విడుదల చేయాలంటూ అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ఈ గూడుపుఠాని బయట పడినట్లు తెలిసింది. -
పసుపు–కుంకుమ నిధుల స్వాహా!
సాక్షి, అమరావతి: పసుపు పార్టీ నాయకులు ‘పసుపు–కుంకుమ’లో పెద్ద మాయ చేశారు. ఎన్నికలకు ముందు వారి అధినాయకత్వం మహిళల ఓట్ల కోసం గాలం వేస్తే.. ఆ నిధులను నొక్కేయడంలో స్థానిక నాయకులు చేతివాటం ప్రదర్శించారు. యానిమేటర్లతో కుమ్మక్కై డ్వాక్రా మహిళలకు దక్కాల్సిన సొమ్మును మింగేశారు. ఇందు కోసం భారీ స్కెచ్ వేశారు. నకిలీ ఖాతాలు సృష్టించారు. సంఘాల్లో అదనంగా కొత్తవారి పేర్లను చేర్చారు. అర్హులకు అందాల్సిన మొత్తాన్ని దారి మళ్లించి.. దోపిడీకి పాల్పడ్డారు. తమ ఖాతాల్లో సొమ్ము పడలేదని సంఘ సభ్యులు డీఆర్డీఏకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎందుకంటే డీఆర్డీఏ సిబ్బందికి కూడా ఈ అవినీతి వ్యవహారంలో భాగస్వామ్యం ఉండటమే. ఇప్పుడు దీనిపై విచారణకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన పసుపు–కుంకుమ నిధుల్లో చేతివాటం ప్రదర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యానిమేటర్లు, జన్మభూమి కమిటీ సభ్యులు కుమ్మక్కై డ్వాక్రా సంఘాల నిధులను స్వాహా చేశారు. అప్పటి అధికార పార్టీ నాయకులు, సీసీ (కమ్యూనిటీ కో–ఆర్డినేటర్) అండ తో పలు సంఘాలకు దక్కాల్సిన నిధులను నకిలీ ఖాతాలు సృష్టించి దారి మళ్లించారు. కొత్తగా సభ్యులను చేర్చి.. జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో మొదటి దశలో పసుపు–కుంకుమ పథకం కింద 60,903 గ్రూపులకు రూ.590.09 కోట్ల నిధులు చెల్లించారు. రెండో దశలో 67,628 గ్రూపులకు రూ.646 కోట్ల నిధులను జమ చేశారు. అయితే ఈ నిధులను టీడీపీ నేతల కనుసన్నల్లో యానిమేటర్లు నకిలీ ఖాతాల్లోకి మళ్లించడంతో పాటు కొత్త గ్రూపుల్లో అదనంగా సభ్యుల పేర్లను చేర్చి నిధుల దోపిడీకి పాల్పడ్డారు. ఉదాహరణకు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొత్తగా ఆయా గ్రూపులోకి 20 మంది సభ్యుల పేర్లు చేర్చి నిజమైన అర్హుల సొమ్మును స్వాహా చేశారు. దీనిపైన ఫిర్యాదులు రావడంతో విచారణ జరిగింది. అయితే విషయాన్ని బయటకు రాకుండా స్థానిక యానిమేటర్‌తో పాటు, విచారణ సిబ్బందితో కుమ్మకై డ్వాక్రా మహిళలకు డబ్బు చెల్లించి విషయం బయటకు పొక్కకుండా చేశారు. అయితే ప్రత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు 60 మంది సభ్యులకు రావాల్సిన సొమ్మును మింగేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో సైతం ఇలాంటి ఘటనలు జరిగినట్టు సమాచారం. పట్టించుకోని డీఆర్డీఏ సిబ్బంది.. జిల్లాలో పలు ప్రాంతాల్లో పసుపు–కుంకుమ నిధులు తమ ఖాతాల్లో జమకాలేదని ఫిర్యాదులు వచ్చినా.. డీఆర్డీఏ సిబ్బంది విషయం బయటకు రాకుండా స్థానిక టీడీపీ నాయకుల అండతో మేనేజ్ చేసినట్లు సమాచారం. అయితే గ్రామాల్లో పసుపు–కుంకుమ నిధులు చెల్లించిన మహిళా సంఘాల జాబితాలను పంచాయతీ కార్యాలయల వద్ద ప్రదర్శిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి అవినీతి పాల్పడిన యానిమేటర్, డీఆర్డీఏ సిబ్బంది బాగోతం బయటకు వస్తుందనే చర్చ మహిళా సంఘాల సభ్యుల్లో జోరుగా సాగుతోంది. విచారణ జరిపితే.. గుంటూరు జిల్లా రూరల్ పరిధిలో ఉన్న 67,268 గ్రూపులకు పసుపు–కుంకుమ కింద చెల్లించిన మొత్తంపై దాదాపు 10 శాతం గ్రూపుల నిధుల విషయంలో చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్‌తోపాటు, 12 మున్సిపాల్టీల్లో 24,160 సంఘాలకు జమ అయిన నిధులపైన పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పలువురు డ్వాకా గ్రూపు మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదులతో కదిలిన డొంక గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని రైలు పేటలోని దుర్గాసాయి మహిళ మండలికి గ్రూపునకు పసుపు–కుంకుమ కింద లక్ష రూపాయలు విడుదలయ్యాయి. అయితే సాంకేతిక సమస్యలను సాకుగా చూపి యానిమేటర్ నకిలీ ఖాతాలకు మళ్లించింది. సదరు గ్రూపు సభ్యులకు నిధులు రాలేదని మాయ మాటలు చెప్పింది. అనుమానం వచ్చిన గ్రూపు సభ్యులు గోరంట్లలోని మెప్మా హెడ్ ఆఫీసుకు వెళ్లి అధికారులను నిలదీశారు. రికార్డులను పరిశీలించిన ఉన్నతాధికారులకు నిధులు జమయ్యాయని చెప్పారు. దీంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు అవాక్కయ్యారు. వెంటనే యానిమేటర్‌ను నిలదీయడంతో విషయం బయటకి చెప్పొద్దని, వారి సంఘానికి మంజూరైన లక్ష రూపాయల నిధులను వెనక్కి ఇచ్చింది. అయితే ఆ యానిమేటర్ పరిధిలోనే మూడు సంఘాల సొమ్మును సాంకేతిక కారణాలను సాకుగా చూపి నొక్కేసినట్టు సమాచారం. వాస్తవానికి యానిమేటర్లను జన్మభూమి కమిటీల సిఫారసు మేరకు నియమించడం, డీఆర్డీఏలో పనిచేసే సీఓ అండ ఉండటంతో గోల్మాల్ విషయం వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడ్డారు. గతంలో ఇంతకు ముందు కూడా డ్వాక్రా మహిళల ఖాతాల్లో వేసిన నిధుల్లో సైతం అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
ఎన్నికలకు ముందు ప్రజలకు ప్రలోభాలు
-
చంద్రబాబు పథకాలపై సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చంద్రబాబు పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందని పిటిషనర్ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని విన్నవించారు. అదే విధంగా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచీ నగదు బదిలీ పథకాలు అమలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. -
నారీలోకం.. నీరాజనం
వైఎస్ఆర్ జిల్లా, బద్వేలు : డ్వాక్రా మహిళలు మాకే ఓటేశారు. పసుపు–కుంకుమతో వారిని ఆకట్టుకున్నాం... జనవరి నుంచి ఏప్రిల్ లోపు రూ.20 వేలు ఇచ్చాం... మాకు అడ్డులేదు. ఆడపడచులే మమ్మల్ని గెలిపిస్తారు... ఇది చంద్రబాబే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతల ప్రచారం. ఇది వైఎస్సార్సీపీ నేతల్లో కొంత ఆందోళన కలిగించినా చివరకు వైఎస్ జగన్మోహన్రెడ్డికే నారీలోకం మద్దతు పలికారు. çపసుపు–కుంకుమతో వారిని ఏమార్చాలని చేసిన యత్నాలను తిప్పికొట్టారు. కనీసం డ్వాక్రా సంఘాల మహిళలు 5.66 లక్షల మంది ఓట్లు వేసినా టీడీపీకి ఓట్ల సంఖ్య కచ్చితంగా పెరిగేది. ఇదే జరిగితే లక్షల్లో పెరగాల్సిన ఓట్లు వేల సంఖ్యలో కూడా పెరగలేదు. ఆడపడుచులు చంద్రబాబు ఎత్తులను చిత్తు చేస్తూ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారు. వైఎస్ జగన్ ప్రకటించిన వరాలకు ఆకర్షితులయ్యారు. చంద్రబాబుకు పసుపు పూసి వైఎస్ జగన్‌ను కుంకుమతో ఆశీర్వదించారని రాజకీయ విశ్లేషకులు చమత్కరిస్తున్నారు. వైఎస్సార్ సీపీకి జైకొట్టిన మహిళలు జిల్లాలో వైఎస్సార్సీపీ విజయం వెనుక మహిళమణులదే ప్రధాన భూమిక. ఈ విషయాన్ని అందరూ ఒప్పుకోవాల్సిందే. జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువమంది ఉన్నారు. జిల్లాలోని మొత్తం ఓటర్లు 20,56,660 ఉండగా అందులో పురుష ఓటర్లు 10,15,964, మహిళా ఓటర్లు 10,40,400, ఇతరులు 296 మంది ఉన్నారు. పురుషుల కంటే 24,436 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. గత నెల 11న జరిగిన ఎన్నికల్లో మొత్తం 17,02,981 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 8,29,063, మహిళలు 8,73,843 ఓటేశారు. పురుషుల కంటే మహిళలు 44,780 మంది అధికంగా ఉన్నారు. పోలైన ఓట్లలో వైఎస్సార్సీపీకి 10,18,141 మంది జై కొట్టగా టీడీపీకి 5,75,197 ఓట్లేశారు. పసుపు–కుంకుమతో మాయ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ తరుఫున డ్వాక్రా సంఘాలు 35,856, మెప్మా తరుఫున 12,561 వేల సంఘాలున్నాయి. ఇందులో 4,66,440 మంది సభ్యులున్నారు. వీరిని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల ముందు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో పసుపు–కుంకుమ–2 పథకాన్ని ప్రకటించి ఒక్కోకరికి రూ.10 వేల రూపాయల పోస్ట్ డేటేడ్ చెక్కులిచ్చి హంగామా చేశారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సభలు ఏర్పాటు చేసి గొప్పలు పోయారు. చంద్రబాబుకు అభినందనలంటూ మహిళలను బలవంతంగా విజయవాడ తీసుకెళ్లి నానా హింసలు పెట్టారు. మూడు చెక్కులను ఎన్నికలు సమీపించిన వేళ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో నగదును ఖాతాల్లో వేసేలా ప్రణాళిక వేశారు. మూడో విడత చెక్కులు ఎన్నికలకు ఆరు రోజులముందు బ్యాంకులో జమ చేసినా నగదు ఇచ్చేందుకు బ్యాంకర్లు ఒప్పుకోలేదు. దీంతో అధికారులతో ఒత్తిడి చేయించి నగదు జమ చేయించాలని చూశారు. కొంతమందికి నగదు అందినా అధికశాతం మందికి మాత్రం ఖాతాల్లో జమ కాలేదు. బాబును నమ్మని మహిళలు 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత వారికి మొండిచెయ్యి చూపారు. దీంతో మహిళలు తీవ్ర ఆగ్రహాంతో ఉన్నారు. తిరిగి ఎన్నికలు సమీపించిన వేళ అధికారంలోకి వస్తే ఏటా పసుపు–కుంకుమ కింద రూ.10వేలు చొప్పున ఇస్తామని బూటకపుహామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి సెల్ఫోన్లు ఇస్తామని చెప్పుకొచ్చారు. మహిళలే లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వాగ్ధానాలను వారు నమ్మలేదు. తలకిందులైన అంచనాలు టీడీపీ అంచనాలు తలకిందుల చేస్తూ ప్రలోభాలతో తమను మాయ చేయలేరని ఓటర్లు నిరూపించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ఓట్లు వేసి తగిన బుద్ధి చెప్పారు. గడిచిన ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారు నగలు, పుస్తెలతాడు పువ్వుల్లో పెట్టి ఇస్తామని ప్రచారంతో ఊదరగొట్టి గద్దెనెక్కాక హామీలను ఆటకెకికంచేసి వార్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. కనీసం వడ్డీలేని రుణ బకాయిలు చెల్లించలేదు. ఈ సొమ్ములనే పసుపు–కుంకుమ రూపంలో పంపిణీ చేసి లబ్ధి పొందాలని చూశారు. ఐదేళ్లలో పట్టించుకోకుండా ఎన్నికల ముందు చంద్రబాబు చేసిన గిమ్మిక్కులను మహిళలు ఏ మాత్రం పట్టించుకోలేదు. మహిళల ఓట్లే అధికం పోలైన ఓట్లలో అధికశాతం డ్వాక్రా సభ్యులవే. పసుపు–కుంకుమ మాయలో మహిళల ఓట్లు పడిఉంటే టీడీపీకి అధికంగా ఓట్లు వచ్చేవి. జిల్లావ్యాప్తంగా వైఎస్సార్సీపీ, టీడీపీకి వచ్చిన ఓట్ల మధ్య వ్యత్యాసాన్ని చూస్తే ఇది స్పష్టమవుతోంది. డ్వాక్రా మహిళలే దాదాపు 4.66 లక్షలమంది ఉన్నారు. కానీ జిల్లాలోని టీడీపీ అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లు 5.76లక్షలు మాత్రమే. అదే సమయంలో వైఎస్సార్సీపీకి 10లక్షలకు పైగా ఓట్లు వచ్చాయి. వీటిని చూస్తే పురుషులతో పాటు మహిళలు అధికసంఖ్యలో వైఎస్ జగన్‌ను నమ్మారని అర్థమవుతోంది. పనిచేయని చంద్రబాబు ఎత్తులు మహిళామణుల ముందర పసుపు–కుంకుమ ఎత్తులు చిత్తు అయ్యాయి. ఎవరెన్ని చేసినా తాము అనుకున్నదే చేస్తామని నిరూపించారు. వైఎస్సార్సీపీ అఖండ విజయాన్ని అందించడంతో ముఖ్యపాత్ర పోషించారు. జిల్లా జనాభాలో సగం కంటే ఎక్కువ ఉన్న మహిళలు గెలుపు ఓటమిల్లో తమదైన పాత్ర ప్రదర్శించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్ని కుతంత్రాలు పన్నినా మగువలంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పట్టం కట్టారు. చంద్రబాబును నమ్మలేకపోయారు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో డ్వాక్రా మహిళలు చంద్రబాబును నమ్మలేకపోయారు. ఈ ఎన్నికల్లో హామీలు ఇచ్చినా వాటి పరిస్థితి అంతేనని భావించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ జగన్ పార్టీ అభ్యర్థులకు భారీగా ఓట్లు వేశారు.– శారదమ్మ, జడ్పీటీసీ, పోరుమామిళ్ల -
పసుపు–కుంకుమ తీసుకుని ఉప్పు–కారం ఇచ్చారు
భీమవరం: ఏపీ మహిళలు పసుపు–కుంకుమ తీసుకుని టీడీపీకి ఉప్పు–కారం ఇచ్చారని ప్రముఖ సినీదర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. ఈ నెల 31న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా విడుదలకు సంబంధించి విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటుచేయగా కొంతమంది అడ్డుకున్నారని.. అందువల్లనే ఎన్టీరామారావు ఆగ్రహించి చంద్రబాబును చిత్తుగా ఓడించారని తెలిపారు. ఏపీలో సైకిల్‌కు పంక్చరైనందునే తాను కారులో వచ్చినట్టు చమత్కరించారు. ఎన్టీఆర్ జీవితం చివరి అంకంలో జరిగిన ఘటనలను ప్రజలకు తెలియజేసేందుకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తీశాను తప్ప తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదన్నారు. త్వరలో ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రాన్ని తీయనున్నట్టు ప్రకటించారు. తనకు రాజకీయాల్లోకొచ్చే ఆలోచన లేదని వర్మ స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఏనాడూ తనకున్న పవర్‌ను దుర్వినియోగం చేసి సొంతానికి వాడుకోలేదన్నారు. -
బాబు భ్రమలకు మహిళలు బ్రేక్
ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మహిళలు బ్రహ్మరథం పట్టారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలతో పాటు.. ప్రాంతాలకతీతంగా మహిళలంతా ముక్తకంఠంతో జననేతకు జై కొట్టారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసి.. తీరా ఎన్నికల వేళ పసుపు–కుంకుమ పేరుతో మహిళలను మభ్యపెడదామనుకున్న చంద్రబాబుకు ఓటుతో బుద్ధి చెప్పారు.. సాక్షి, అమరావతి : తమను గెలిపిస్తుందని చంద్రబాబు కోటి ఆశలు పెట్టుకున్న పసుపు – కుంకుమ పథకం టీడీపీని చావు దెబ్బే తీసింది. ఐదేళ్లుగా అనేక రకాలుగా మోసం చేసినా రాష్ట్రంలో 95 లక్షల మంది దాకా ఉన్న డ్వాక్రా మహిళలకు ఎన్నికల ముందు ఏదో ఒక తాయిలం ఇస్తే వాళ్ల ఓట్లన్నీ తనకే పడతాయని భ్రమల్లో ఉన్న టీడీపీ అధినేతకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు మహిళలను విశేషంగా ఆకట్టుకోవడంతో వైఎస్సార్సీపీకి వారంతా బ్రహ్మరథం పట్టారు. రాష్ట్రంలో మొత్తం 3,93,45,717 మంది ఓటర్లుండగా.. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో 3,13,33,631 మంది ఓటు వేశారు. మొత్తం ఓటర్లలో 1,98,79,421 మంది మహిళా ఓటర్లే. కాగా 1,57,87,759 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పోలిస్తే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో మహిళలు అత్యధికంగా ఓట్లు వేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఆ జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలుండగా.. మొత్తం సీట్లను వైఎస్సార్సీపీ గెలుచుకుంది. మాఫీ పేరుతో మాయ మొత్తం 1.98 కోట్ల మంది మహిళా ఓటర్లలో దాదాపు కోటి మంది డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. 2014 ఎన్నికల వాగ్దానంలో భాగంగా తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదు. జీరో వడ్డీ పథకానికి నిధులు మంజూరు చేయలేదు. ఎన్నికలకు నెల రోజుల ముందు పసుపు–కుంకుమ పేరుతో ఎన్నికల తాయిలం ప్రకటించారు. సరిగ్గా పోలింగ్‌కు రెండురోజుల ముందు ప్రభుత్వ ఖజానా నుంచి డ్వాక్రా మహిళలకు డబ్బులిచ్చారు. దీంతో మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకే పడ్డాయని, గెలుపు తమదేనని చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రచారం చేశారు. తీరా టీడీపీకి మహిళలు దిమ్మ తిరిగిపోయే ఫలితాన్నివ్వడంతో డీలాపడిపోయారు. -
చిల్లర వేషాలు!
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: ‘‘బ్యాంకులే రూ.పది నాణేలు ఇచ్చాయి. మరలా వాటిని తిరిగి బ్యాంకులో వేద్దామంటే తీసుకోవడం లేదు. పసుపు కుంకుమ పేరిట ఇచ్చిన సొమ్ముల్లో భాగంగానే అవి బ్యాంకు అధికారులు ఇచ్చారు. వాటిని బయట మారుద్దామంటే ఎవ్వరూ తీసుకోవడం లేదు. పోనీ బ్యాంకులకు వెళితే వారు కూడా వద్దంటున్నారు. ఇదేంటో అర్థం కావట్లేదు’’ ఇదీ ప్రస్తుతం పలు డ్వాక్రా సంఘాల మహిళల ఆవేదన. ఎందుకో ఏమో తెలీదు.. కొన్ని నెలలుగా రూ.10 నాణెం మారడం లేదు. నేడు మార్కెట్లో ఆ నాణేనికి విలువ లేకుండా పోయింది. బ్యాంక్‌లు గానీ, చివరకు ఆర్బీఐ గాని రూ.పది నాణేలు మారవని అధికారికంగా ఎక్కడా ప్రకటించకపోయినా ప్రతి వ్యాపారి రూ.పది నాణేన్ని తిరస్కరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నిలకు కొద్ది రోజుల ముందు పసుపు–కుంకుమ పథకం పేరుతో మూడు విడతలుగా ప్రతి డ్వాక్రా మహిళకు రూ.పది వేలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రూ.పది నాణేలను పెద్ద మొత్తంలో ఈ పథకంలో బ్యాంక్‌లు డ్వాక్రా మహిళలకు అంటగట్టాయి. బ్యాంక్‌లు ఇచ్చిన రూ.పది వేల సొమ్ముల్లో రూ.వెయ్యి పదిరూపాయల నాణేలను అంటగట్టడంతో వాటిని మార్చేందుకు నానాతంటాలు పడుతున్నారు. చివరకు వ్యాపారులు, వివిధ రకాల దుకాణదారులే కాదు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ బస్సుల్లో కూడా కండెక్టర్ రూ.పది నాణేన్ని తీసుకోకపోవడంతో ఈ నాణేలు ఇంక మారవన్న నిర్ణయానికి వచ్చేసి తమ వద్దే వాటిని అలా నిరుపయోగంగా ఉంచుకున్నారు. సఖినేటిపల్లి మండలానికి చెందిన ఓ డ్వాక్రా మహిళ బుధవారం ఉదయం అంబాజీపేటలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. అంబాజీపేటలోని ఓ బేకరి దుకాణంలో కొన్ని పదార్థాలు కొనుగోలు చేసి నోట్లతో పాటు ఓ రూ.పది నాణెం కూడా ఇచ్చింది. దుకాణదారుడు ఆ నాణేన్ని తిరస్కరించి ఇది మారడంలేదు. రూ.పది నోటు ఇవ్వమని చెప్పాడు. ఆ మహిళ చాలా అసహనంగా ‘చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఇచ్చిన డబ్బులండి బాబు... ఆర్టీసీ బస్సులో కండెక్టర్ కూడా తీసుకోలేదు. ఇప్పుడు మీరు తీసుకోవడం లేదు. గత నెల రోజులుగా ఈ నాణేలను మార్కెట్లో ఏమైనా కొన్నప్పుడు ఇవ్వడం, వారు మారదనడం మాకు మామాలైపోయింది’ చెప్పడం గమనార్హం. ఈ పథకం కింద బ్యాంక్‌లు పరోక్షంగా బాబు ప్రభుత్వం అంటగట్టిన రూ.పది నాణేలను మార్చడం డ్వాక్రా మహిళలకు పెద్ద తలనొప్పిగా తయారైంది. ఇదే విషయాన్ని చాలా మంది మహిళలు సంబంధిత బ్యాంక్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లారు. ‘అవి ఎందుకు మారవు’ అని అంటున్నారే తప్ప, ‘తిరిగి మీ బ్యాంక్‌లోనే ఈ నాణేలను జమ వేసుకోండి’ అని మహిళలు అంటుంటే‘ మేము జమ చేసుకోబోమ’ని బదులిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అంతటా పలు మండలాల్లో డ్వాక్రా మహిళలు ఎదుర్కొంటున్న రూ.పది నాణేల సమస్యను ఓట్ల లెక్కింపు హడావుడిలో ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోవడంలేదు. ప్రతి డ్వాక్రా మహిళకు రూ.వెయ్యి అంటే జిల్లాలో లక్షల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు ఈ నాణేల వల్ల నష్టం కూడా ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయవచ్చు. బ్యాంక్‌లు ఇచ్చిన మారని ఈ నాణేలను తిరిగి బ్యాంక్‌ల్లో జమ చేసే అవకాశాన్ని కల్పించాలని డ్వాక్రా మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రైతు ప్రాణం తీసిన ‘పసుపు–కుంకుమ’
సాక్షి, కురబలకోట (చిత్తూరు జిల్లా): ప్రభుత్వ పసుపు– కుంకుమ పథకం కారణంగా ఓ రైతు భార్య తన ‘పసుపు, కుంకుమ’ కోల్పోయింది. డ్వాక్రా గ్రూపుల్లో నగదు పంపిణీ సక్రమంగా జరక్కపోవడంతో చోటుచేసుకున్న గొడవ కారణంగా మనస్తాపం చెందిన రైతు రెండు రోజుల కిందట ఇల్లు వదిలి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం రోడ్డు పక్కన నిర్జన ప్రదేశంలో రేకుల షెడ్డులో ఆయన శవం లభ్యమైంది. ఈ విషాదకర సంఘటనకు సంబంధించి చిత్తూరు జిల్లా ముదివేడు ఎస్ఐ నెట్టి కంఠయ్య కథనం ప్రకారం.. కురబలకోట మండలం పుల్లగూరవారిపల్లెకు చెందిన పి.నరసింహారెడ్డి (66) వ్యవసాయదారుడు. అతనికి భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజమ్మ డ్వాక్రా గ్రూపులో ఉంది. పసుపు–కుంకుమ కింద తొలి విడత రూ. 2,500 వచ్చింది. ఆ తర్వాత రావాల్సిన డబ్బు రూ. 7,500 ఇవ్వలేదు. ఈ విషయమై ఆయన కుమారులు నాలుగు రోజుల కిందట డ్వాక్రా గ్రూపు లీడర్‌ను అడిగారు. కొంత డబ్బు ముట్టచెబితే ఇస్తామని ఆమె చెప్పడంతో వారి మధ్య గొడవ మొదలయ్యింది. అసలే ఘర్షణలు, కొట్లాటలు ఏమాత్రం నచ్చని నరసింహారెడ్డి కుమారులను వారించాడు. కోపంలో ఉన్న కుమారులు తన మాట వినకపోవడంతో నరసింహారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ముదివేడు క్రాస్‌కు పనిమీద వెళుతున్నానని వెళ్లిన ఆయన కన్పించకుండా పోయాడు. బుధవారం ఉదయం ముదివేడు క్రాస్ దగ్గర అటవీ ప్రాంతంలో రోడ్డు పక్కనున్న ఓ రేకుల షెడ్డులో రైతు శవమై కన్పించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శవం కుళ్లిన స్థితికి చేరుకోవడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించి పోలీసులు మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. శవం పక్కన పురుగుమందు డబ్బాలు కన్పించాయని, దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చిన్న వివాదం కారణంగా కుటుంబపెద్ద ప్రాణాలు తీసుకోవడంతో భార్య, కుమారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పసుపు–కుంకుమ డబ్బుల వల్ల దారితీసిన గొడవతో రైతు మృతి చెందడంపై వెలుగు అధికారులను విచారించగా.. డ్వాక్రా సభ్యురాలికి డబ్బులు ఇవ్వని సమస్య తమ దృష్టికి రాలేదన్నారు. -
మున్సిపాలిటీలను ముంచేశారు!
విశాఖ సిటీ: ఎన్నికల్లో తాయిలాలు పంచేందుకు ప్రభుత్వ ఖజానాని దొరికింది దొరికినట్లే ఖాళీ చేసిన చంద్రబాబు సర్కారు నిర్వాకాలు శాఖల వారీగా బయటపడుతూనే ఉన్నాయి. పసుపు కుంకుమ కోసం వివిధ శాఖల ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్ని దారిమళ్లించిన ప్రభుత్వం.. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌నూ ఊడ్చేసిన వ్యవహారం బయటకు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ డిపాజిట్(పీడీ) అకౌంట్ మొత్తాన్ని ఖాళీ చేయడంతోపాటు మున్సిపాలిటీలు, వివిధ కార్పొరేషన్ల ట్యాక్స్ కలెక్షన్, బీపీఎస్ ఫీజులుండే అకౌంట్ అయిన 002ను కూడా ఊడ్చేసింది. దీంతో ఈ ఖాతాలో ప్రస్తుతం బ్యాలెన్స్ జీరో చూపిస్తోంది. మార్చిలోనే మొత్తం ఖాతాలన్నింటిని ప్రభుత్వం ఖాళీ చేసిందని మున్సిపల్ అధికారులు వాపోతున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వ విభాగాలు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ విభాగాల్ని, ఉద్యోగుల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు పంచడానికి అన్ని శాఖల నుంచి అడ్డగోలుగా నిధులు మళ్లించడం ఆందోళనకు గురిచేస్తోంది. ఉద్యోగులకు సంబంధించిన పీఎఫ్ ఖాతాలు ఒక్కొక్కటిగా ఖాళీ కాగా.. ప్రభుత్వం మాత్రం సీఎంఎఫ్ఎస్లో లోపాలు తలెత్తాయంటూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. పింఛన్లు, పసుపు కుంకుమ పేరుతో ఓట్ల కొనుగోలుకు కోట్లాది రూపాయలు నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. పసుపు కుంకుమ కోసం ఉపాధ్యాయులు, ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలకు ఎసరు పెట్టిన ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను నిలువునా ముంచేసింది. వీటికి సంబంధించిన సొమ్ముల్ని పథకాల కోసం దారి మళ్లించేసింది. మార్చిలోనే పీడీ అకౌంట్లు ఖాళీ ప్రతి మున్సిపాలిటీకీ, కార్పొరేషన్‌కు ట్రెజరీలో పర్సనల్ డిపాజిట్ (పీడీ) అకౌంట్ ఉంటుంది. ఇందులో ఆయా సంస్థలకు వచ్చిన నిధులు జమ అవుతుంటాయి. ఈ నిధులన్నింటినీ ప్రభుత్వం మార్చి 31 నాటికే వాడేసుకుంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన అన్ని పీడీ అకౌంట్లు ప్రస్తుతం జీరో బ్యాలెన్స్‌ను చూపిస్తున్నాయి. ఉదాహరణకు.. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ)కి సంబంధించి 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.26 కోట్లు, స్టాంపు డ్యూటీ రూ.12 కోట్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం విడుదల చేసిన రూ.12 కోట్లు, మార్చి మొదటి వారంలో విడుదల చేసిన ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు రూ.27 కోట్లు పీడీ అకౌంట్లో ఉండేవి. మార్చి 31న ఈ నిధులన్నీ.. ఒకేసారి మాయమైపోయాయి. ఇలా.. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సంబంధించిన పీడీ అకౌంట్లలో సుమారు రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లను సర్కారు దారి మళ్లించేసింది. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం కార్పొరేషన్లు మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పన్నుల వసూళ్లు, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)కు సంబంధించిన ఫీజులతోపాటు వివిధ వసూళ్లన్నీ ట్రెజరీలో 002 నంబర్‌తో ఉన్న పీడీ అకౌంట్లో నిక్షిప్తమై ఉంటాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం మార్చి మూడో వారం వరకూ పన్నుల వసూళ్లతో ఈ 002 అకౌంట్ కళకళలాడుతూ ఉండేవి. అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపు రూ.500 కోట్లకుపైనే 002 అకౌంట్లో ఉండేవని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పంపించిన బిల్లులు వెనక్కి.. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ మార్చి 31 అర్ధరాత్రి లోపు పంపించాలంటూ మున్సిపల్ పరిపాలన – పట్టణాభివృద్ధి శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీనికనుగుణంగా అన్ని బిల్లుల్నీ పంపించిన స్థానిక సంస్థలకు సర్కారు మొండిచేయి చూపింది. బిల్లులకు సంబంధించిన డబ్బులు మంజూరయ్యేలోపే ఉన్నదంతా ఊడ్చేసింది. చిన్న చిన్న కొర్రీలు వేస్తూ బిల్లులు తప్పుగా పంపించారంటూ వెనక్కు పంపడంతో అధికారులు, సిబ్బంది ముక్కున వేలేసుకున్నారు. ఇలా ప్రభుత్వం తన ఎన్నికల ప్రలోభాల కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌నూ వాడేసుకుందని వాపోతున్నారు. అంతేకాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించి దాదాపు రూ.45 వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. వీటిని కచ్చితంగా మంజూరు చేయాల్సి వస్తుందని కొర్రీలు వేసి సుమారు రూ.20 వేల కోట్ల బిల్లులను ఆయా విభాగాలకు తిప్పి పంపించేశారు. ఇప్పుడు మాత్రం కేవలం రూ.25 వేల కోట్లు బిల్లులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయనీ సర్కారు దొంగ లెక్కలు చెబుతోంది. ఈ బిల్లుల భారమంతా.. 2019–20 ఆర్థిక సంవత్సరంపై భారం పడనుందనీ.. దీని వల్ల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉద్యోగుల పీఎఫ్ డబ్బులు పసుపు–కుంకుమకు మళ్లింపు!
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న తలంపుతో టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగులను సైతం ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. ఓటర్లకు తాయిలాలు ఎర వేసేందుకు అన్నిశాఖల నుంచి అడ్డగోలుగా నిధుల మళ్లించడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయులు ప్రతి నెలా తమ వేతనం నుంచి ప్రభుత్వం వద్ద దాచుకున్న సొమ్మును (పీఎఫ్) సైతం దారిమళ్లించిన ఉదంతం వెలుగు చూసింది. ఇప్పుడు తాజాగా మరో వ్యవహారం బహిర్గతమైంది. జిల్లా పరిషత్ (జెడ్పీ) ఉద్యోగుల పీఎఫ్ సొమ్మును సైతం పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.350 కోట్లు ఖాతా నుంచి మాయమయ్యాయి. సాక్షి, మచిలీపట్నం: జిల్లా పంచాయతీ (జెడ్పీ) పరిధిలో దాదాపు 10,090 మంది ఉద్యోగులు వివిధ స్థాయిల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరితో పాటు మరో 15,600 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం వారి స్థాయిని బట్టి వేతనాలుమంజూరు చేస్తుంది. వేతనాల్లో ప్రతి మాసం 10 శాతం నగదు పీఎఫ్‌గా కోత విధిస్తుంటారు. ఈ మొత్తాన్ని ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన అనంతరం కోత విధించిన సొమ్ముకు అంతే మొత్తాన్ని ప్రభుత్వం జత చేసి సదరు ఉద్యోగికి అందజేస్తుంది. ఈ సొమ్మును సదరు ఉద్యోగులు వారి అత్యవసర అవసరాలకు రుణంగా పొందుతారు. అంతటి ప్రాధాన్యత కలిగిన సొమ్మును సైతం ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాలెన్స్ నిల్.. జిల్లా పంచాయతీ ఖాతా ఖాళీగా దర్శనమిస్తోంది. జెడ్పీ ఉద్యోగులకు సంబంధించి రూ.350 కోట్లు సొమ్ము ఖాతాలో ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం కేవలం రూ.90,000 మాత్రమే దర్శనమిస్తోంది. ఇవి కాకుండా మరో రూ.3 కోట్ల మేర సాధారణ నిధులు సైతం కైంకర్యం చేశారు. ఎన్నికల సమయానికి కొద్ది రోజుల ముందు వరకు ఖాతాలో ఉన్న నిధులు ఒక్క సారిగా మాయం అయ్యాయి. దీంతో ఉద్యోగుల్లో కలవరం నెలకొంది. దీనికి తోడు ఈ ఏడాది జనవరి నుంచి పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రతి పంచాయతీ ఖాతాలో రూ.30 లక్షల మేర నిధులు ఉండాల్సి ఉండగా నేటికీ నయా పైసా రాని పరిస్థితి. తిరిగి ఎప్పుడిస్తారో? జెడ్పీ ఉద్యోగుల పీఎఫ్‌కు సంబంధించి రూ.350 కోట్లు దారి మళ్లించారు. ఈ నిధులు తిరిగి ఎప్పుడు పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారన్న అంశంలో గందరగోళం నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇక కౌంటింగ్ కూడా పూర్తయితే నూతన ప్రభుత్వం అధికారంలోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారితే ఆ డబ్బును ఎవరు జమ చేస్తారు? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రుణాలు పెండింగ్.. ఉపాధ్యాయులు తమ అవసరాల రీత్యా పీఎఫ్ సొమ్ము నుంచి రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు, అనుమతుల ప్రక్రియ పూర్తయి నెలల గడుస్తున్నా నేటికీ నగదు అందిన దాఖలాలు లేవు. జిల్లా వ్యాప్తంగా 15,600 మంది ఉపాధ్యాయుల్లో దాదాపుగా 466 మంది వరకు రుణం పొందేందుకు నిరీక్షిస్తున్నారు. ఒక్కొక్కరికి సగటున రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం అందాల్సి ఉంది. ఇలా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.7 కోట్లకుపైగానే పెండింగ్ ఉండటం గమనార్హం. ఎన్నికల తాయిలాలకు మళ్లింపు.. సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలని భావించిన టీడీపీ ప్రభుత్వం ఓటర్లకు ఎన్నికలకు ముందే తాయిలాల ఎర వేసింది. ఇందులో భాగంగా పుసుపు–కుంకుమ పేరుతో మహిళలకు రూ.10 వేలు, వృద్ధాప్య పింఛన్లు రూ.2 వేలకు పెంపు, రైతు భరోసా తదితర పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. వీటికి రూ.కోట్లల్లో చెల్లింపులు జరపాల్సి వచ్చింది. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతో ఇతర శాఖల్లో ఉన్న నగదు మొత్తం వీటికే వెచ్చించింది. ఇదే తరుణంలో జెడ్పీ, ఉపాధ్యాయులు తమ వేతనంలో దాచుకున్న నగదును మాత్రం దారి మళ్లించింది. ఈ నిజం బయటపడకుండా రిజర్వు బ్యాంక్ పేరుతో ఇన్నాళ్లూ కాలయాపన చేస్తూ వచ్చింది. ప్రస్తుతం బండారం బయట పడటంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
పసుపు–కుంకుమతో మోసపోవద్దు
డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మహిళలను మోసగించారు. అప్పులు సకాలంలో చెల్లించలేక వడ్డీల భారం పెరిగి ఊబిలోకి నెట్టారు. బ్యాంకుల్లో డిఫాల్టర్లు అయ్యారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు అధికారంలోకి వచ్చి రుణమాఫీ తూచ్ అని.. పసుపు–కుంకుమ పేరుతో మూడు దఫాలు రూ.10 వేలు ఇచ్చి సరిపెట్టారు. అంతకు ముందు వరకు పావలా వడ్డీకే రుణాలు పొందుతున్న మహిళలకు ఆ పథకాన్ని తొలగించారు. పూర్తిగా వడ్డీ చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల రావడంతో ఆఖరిలో మహిళల ఓట్లను కొల్లగొట్టాలని పసుపు–కుంకుమ పేరుతో ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నాడు. ఎప్పుడో పదివేలు ఇచ్చాడని ఐదేళ్ల పాటు టీడీపీ నిర్వహించిన సభలు, సమావేశాలకు కచ్చితంగా రావాలంటూ వేధింపులకు గురి చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలదే విజయం.. ఆలోచించి భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చింది. నెల్లూరు(పొగతోట): 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకయ్యాక రూ.10 వేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఈ నాలుగున్నర ఏళ్ల పాటు స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ, పొదుపు) మహిళలు గుర్తుకురాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు పొదుపు మహిళలు చంద్రబాబుకు గుర్తుకు వచ్చారు. పసుపు–కుంకుమ అంటూ ఇప్పుడు రూ.10 వేలకు చెక్కులు పంపిణీ చేశారు. 2014 నాటికి జిల్లాలో రూ.350 కోట్లు డ్వాక్రా రుణాలు జిల్లాలో 34 వేల స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. సుమారు 4 లక్షల మంది మహిళలు పొదుపు చేసుకుంటన బ్యాంకుల నుంచి బ్యాంకు లింకేజ్ రుణాలు పొందుతున్నారు. 2013, 2014 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.350 కోట్లు డ్వాకా రుణాలు ఉన్నాయి. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలు ఎవరూ బ్యాంకు లింకేజ్ రుణాలు తిరిగి చెల్లించవద్దని పూర్తిగా మాఫీ చేస్తానని, చెల్లించిన వారికి నగదు తిరిగి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిక చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకు లింకేజ్ రుణాలు రూపాయి రుణమాఫీ చేయలేదు. దీంతో బ్యాంకుల నుంచి మహిళలకు నోటీసులు వచ్చాయి. అప్పటికే రుణాల చెల్లింపు కాలాతీతం కావడంతో అప్పులపై వడ్డీ భారం పడింది. చేసేది ఏమిలేదని చంద్రబాబు మాటల విని మోసపోయామని తీసుకున్న రుణాలను తిరిగి అదనపు వడ్డీలతో కలిపి చెల్లించారు. పావలా వడ్డీ అర్హత కోల్పోయిన మహిళలు మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి ప్రతి నెలా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తారు. క్రమం తప్పకుండా రుణాలను చెల్లించిన గ్రూపులకు వడ్డీ చివరిగా తిరిగి చెల్లిస్తారు. అయితే 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో పావలా అర్హత కోల్పోవడంతో పాటు అదనపు వడ్డీ భారం పడింది. ఈ క్రమంలో రుణాలు తీసుకున్న మహిళలు సుమారు రూ.256 కోట్లు బ్యాంకులకు తిరిగి చెల్లించారు. ఇంకా 3208 గ్రూపులు రూ. 115 కోట్ల రుణాలు బకాయిలు మిగిలాయి. వీటిలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను వడ్డీలతో కలిపి రూ.95 కోట్లు రికవరీ చేశారు. ఇప్పటికి 927 గ్రూపులకు సంబంధించి రూ.19.32 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. పావలా వడ్డీ రద్దు చంద్రబాబు అధికారంలోకి వస్తే పూర్తిగా బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. దీంతో పాటు అప్పటి వరకు పావలా వడ్డీకే రుణాలు పొందుతుండగా ఈ పథకాన్ని రద్దు చేశారు. దీంతో పూర్తిగా వడ్డీని మహిళలే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఐదేళ్లలో మహిళలపై వడ్డీ అధికమైంది. డ్వాక్రా మహిళలకు జగన్ భరోసా గతంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చంద్రబాబు తీరును గుర్తు చేసుకుని, ఓటు వేసే సమయంలో ఒక్క క్షణం ఆలోచన చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని నాలుగు దఫాల్లో మహిళల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. పొదుపు మహిళలకు వడ్డీ రహిత బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించడంతో పొదుపు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, వడ్డీ రీయింబర్స్మెంట్ పూర్తిగా అందేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని మహిళలు భరోసాగా వ్యక్తం చేస్తున్నారు. పసుపు–కుంకుమ మోసం పూర్తిగా రుణమాఫీ హామీని విస్మరించిన చంద్రబాబు ఆ తర్వాత పసుపు–కుంకుమ అంటూ రూ.10 వేలు మూడు దఫాలుగా చెల్లించారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ఈ పదివేలు వడ్డీలకే సరిపోయింది. మహిళలకు ఏమీ మిగలేదు. అప్పులు మాత్రం మిగిలాయి. ఇలా మోసం చేసిన చంద్రబాబు ఈ ఐదేళ్లలో పొదుపు మహిళలను టీడీపీ ప్రచార సభలకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసేవారు. ప్రతి మీటింగ్‌కు సొంత డబ్బులు పెట్టుకుని వెళ్లి నానా అగచాట్లు పడ్డారు. తాజాగా ఎన్నికలు దగ్గరకు రావడంతో పాత విషయాలన్నీ మరిచిపోయి మళ్లీ తనకే ఓటేస్తారని.. పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు అదీ మూడు దఫాలుగా ముందస్తు తేదీలో చెక్కులు.. అదీ ఎన్నికలకు ముందు ఇచ్చారు. అయితే వీటిని మార్చుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. ఐదేళ్లుగా మోసం చేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును నిన్ను నమ్మం బాబూ అంటున్నారు. -
రాప్తాడు చరిత్రలో..తొలి తిరుగుబాటు
ఈ ఏడాది ఫిబ్రవరి 3న తోపుదుర్తి గ్రామంలో మంత్రి పరిటాల సునీత చేతుల మీదుగా పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ రెండు రోజులు ముందుగా గ్రామస్తులకు అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. దాదాపు ఎన్నికలకు ఒక నెల ముందు సంక్షేమ ఫలాలు అందజేసే కార్యక్రమాలకు మంత్రి తెరలేపడంపై స్థానికులు భగ్గుమన్నారు. ఇంత కాలం తమ గ్రామంలోని ఏ ఒక్క సమస్యనూ పరిష్కరించని ఆమెకు గ్రామంలో కాలు పెట్టే అర్హత లేదని, కాదూకూడదంటూ గ్రామంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంక్‌ల్లో డీఫాల్టర్లుగా మారాల్సి వచ్చిందని దీనికంతకూ కారణం టీడీపీ ప్రభుత్వమేనంటూ మండిపడ్డారు. పరువు దక్కించుకునేందుకు బంగారు నగలు తాకట్టు పెట్టి బ్యాంక్‌లకు వడ్డీలు కట్టాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. హామీలు నెరవేర్చలేని అసమర్థ మంత్రి తమకు అక్కర లేదంటూ తేల్చి చెప్పారు. పసుపు – కుంకుమ పేరుతో వేసే భిక్షం తమకు అక్కర లేదని, చేయగలిగితే పూర్తి స్థాయిలో డ్వాక్రా రుణాలు మాఫీ చేసి గ్రామంలోకి కాలు పెట్టాలని సవాల్ విసిరారు. దీనిపై మంత్రి కూడా అప్పట్లో స్పందించారు. గ్రామస్తుల్లో ఐక్యతను దెబ్బతీసేందుకు ఇది ప్రతిపక్షాల కుట్ర అని దుమ్మెత్తిపోశారు. తన పర్యటనను అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఘాటుగా స్పందించారు. చివరకు ఫిబ్రవరి 3వ తేదీ రానేవచ్చింది. ఉదయం నుంచి గ్రామంలో వాహనాలు రాకుండా స్థానికులు కాపుకాసారు. మంత్రి ఆదేశాల మేరకు సాక్షాత్తూ ఎస్సీ జీవీజీ అశోక్‌కుమార్ నేరుగా రంగంలోకి దిగారు. భారీగా పోలీసు బలగాలను గ్రామంలో మొహరింపజేసి మంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు చర్యలు చేపట్టారు. మూడు గంటల పాటు కేవలం మహిళలే రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించారు. చివరకు మంత్రి సునీత కాన్వాయ్ రానే వచ్చింది. సభావేదిక వద్దకు నేరుగా వెళ్లేందుకు మంత్రి ప్రయత్నించడంతో మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఇక తమ చేతికి చిక్కిన చీపర్లు, చెప్పులను మంత్రి కాన్వాయ్‌పై విసిరారు. ఇచ్చిన హామీలు నెరవ్చేకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నావ్ అంటూ నినదించారు. మంత్రికి జరిగిన ఈ ఘోర పరాభవం నేటికీ నియోజకవర్గ ప్రజల మది నుంచి చెరిగిపోలేదు. హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఆమె ఇంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. గ్రామ స్వపరిపాలనకు స్వర్ణయుగం వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ స్వపరిపాలన అనేది స్వర్ణయుగంలా సాగింది. గ్రామ పరిధిలో ఏ పని చేయాలన్నా.. స్థానిక ప్రజాప్రతినిధులదే తుదినిర్ణయంగా ఉండేది. దీని వల్ల గ్రామాల్లో చాలా వరకు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమయ్యేవి. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్వపరిపాలనను అపహాస్యం చేశారు. జన్మభూమి కమిటీల పేరుతో స్థానిక ప్రజాప్రతినిధులకు అధికారాలు లేకుండా చేశారు. అక్రమాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. భూదందాలు, భూకబ్జాల పెచ్చరిల్లాయి. పొరబాటున మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే.. ఆ అరాచక పాలనను భరించలేం. గతంలోనూ ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా రెండోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చాలా దుర్మార్గమైన పాలన కొనసాగించారు. ఇంతటి దుర్మార్గమైన పాలన పోవాలంటే మళ్లీ వైఎస్సార్ పాలన రావాలి. ఇది కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సాధ్యమవుతుంది. – మారుతీప్రసాద్ , తాజామాజీ సర్పంచ్, ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం ‘వైఎస్సార్ చేయూత’ చంద్రబాబు పాలనలో కనీస అవసరాలైన కూడు, గూడు, గుడ్డ లేక సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పేద విద్యార్థులు ఉన్నత చదువుల అవకాశాన్ని కోల్పోయారు. ఫీజు రీయింబర్స్మెంట్ వర్తించక చాలా మంది మధ్యలోనే చదువులు మానేశారు. రుణమాఫీ కాక రైతులు నానా అవస్థలు పడ్డారు. బ్యాంక్‌ల్లో డ్వాక్రా మహిళలు డీఫాల్టరయ్యారు. హౌసింగ్ బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడంతో పునాదుల దశలోనే పేదల సొంతింటి కల నిలిచిపోయింది. ఆరోగ్యశ్రీ అమలు కాకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ ప్రజలు అన్ని విధాలుగా దగాపడ్డారు. ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు వచ్చారు. నవరత్న పథకాలను ప్రకటించి ప్రతి ఒక్కరికీ అభయమిచ్చారు. క్రిస్టియన్, ముస్లిం మైనారిటీల ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్లకు రూ. 1 లక్ష వైఎస్సార్ కానుకగా ఇస్తానని పేర్కొనడం చాలా బాగుంది. అన్ని కులాల వారికీ ప్రత్యేక కార్పొరేషన్ల ు ఏర్పాటు చేసి జీవనోపాధుల పెంపునకు కృషి చేస్తాననడం చాలా బాగుంది. అందుకే జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. – రవి, కళ్యాణదుర్గం -
పసుపు కుంకుమకు పైసల్లేవు..!
సాక్షి, అమరావతి/మైదుకూరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత ఊదరగొట్టినా మూడో విడత పసుపు–కుంకుమ డబ్బులు డ్వాక్రా మహిళల చేతికి అందలేదు. అదిగో చెక్కు డబ్బులిస్తున్నారంటూ అధికార పార్టీ నేతలు, వారికి సహకరించే సెర్ప్ ఉన్నతాధికారులు డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చి బ్యాంకుల వద్దకు పరుగులు పెట్టించారు. తీరా అక్కడకు చేరుకున్న మహిళలు చివరకు ఉసూరుమన్నారు. రోజంతా బ్యాంకుల వద్ద పడిగాపులు పడేలా చేసి.. సాయంత్రానికి ఈ రోజు బ్యాంకులు చెక్కులే తీసుకుంటున్నాయి, డబ్బులు నాలుగైదు రోజుల్లో ఇస్తారని వెలుగు సిబ్బంది చావు కబురు చల్లగా చెప్పారు. దీంతో కోప్రోదిక్తులైన మహిళలు బ్యాంకుల ముందు ధర్నాలు, ఆందోళనలు చేశారు. దీని ద్వారా ఎన్నికల్లో ఎంతో లబ్ధిపొందుదామనుకున్న టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కానీ, ఏప్రిల్ ఐదవ తేదీతో ఇచ్చిన పోస్టు డేటెడ్ చెక్కులు మూడు నెలల్లోపు ఎప్పుడైనా బ్యాంకులో చెల్లుబాటు అవుతాయని డ్వాక్రా మహిళలకు నచ్చజెబుతున్నారు. చెక్కులు క్లియర్ అయితే డ్వాక్రా సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించారు. అందుకనుగుణంగా సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ కూడా జిల్లాలో పనిచేసే ఏపీఎంలు, ఏరియా కోఆర్డినేటర్లు, సంఘమిత్ర–యానిమేటర్లకు సెల్ ఫోçను మేసేజ్ ద్వారా మెసేజ్‌లు పంపారు. లేని పక్షంలో ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. చెక్కులు వెనక్కి తీసుకున్న సిబ్బంది ఏకంగా సెర్ప్ సీఈవో పేరుతోనే ఆదేశాలు జారీ కావడంతో ఏప్రిల్ 8, 9 తేదీల్లో రాష్ట్రంలో డ్వాక్రా మహిళలను బ్యాంకుల వద్దకు రప్పించడానికి జిల్లాల్లో కిందిస్థాయి సిబ్బంది వారికి పంపిణీ చేసిన చెక్కులను బలవంతంగా వెనక్కి తీసేసుకున్నారు. ‘మేమే బ్యాంకుల్లో చెక్కులను జమ చేస్తాం.. మీరందరూ బ్యాంకులకు వచ్చి డబ్బులు తీసుకోండి’.. అని చెప్పారు. దీంతో సంఘాల్లో మహిళలు సోమవారం ఉ.10 గంటలకే బ్యాంకులకు క్యూకట్టారు. అక్కడ గంటల తరబడి పడిగాపులు పడ్డాక అధికారులు.. ‘ఇప్పుడు చెక్కులే తీసుకుంటాం.. డబ్బులు నాలుగు రోజులు ఆగాక ఇస్తాం’.. అని చెప్పడంతో మహిళలు తిట్టుకుంటూ వెనుతిరిగారు. ఎన్నికలయ్యాక మళ్లీ డబ్బులు ఇవ్వరేమోనని భయపడి తాము ఇంతమంది ఒకేసారి వచ్చామని విజయవాడ బందరు రోడ్డులోని టైమ్స్ ఆస్పత్రి సమీపంలో ఉన్న ఇండియన్ బ్యాంకు వద్ద కూలైన్లో నిలుచున్న భారతి అనే డ్వాక్రా సంఘం లీడరు ‘సాక్షి’కి వివరించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని యర్రబాలెం, నవులూరు, బేతపూడి గ్రామాల్లో దాదాపు 420 డ్వాక్రా సంఘాల పేరిట ఇచ్చిన చెక్కులను యానిమేటర్లు వెనక్కి తీసుకున్నారు. సోమవారం వివిధ సంఘాలకు చెందిన 3.15 లక్షల చెక్కులను బ్యాంకుల్లో జమ అయ్యాయని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ తెలిపారు. మైదుకూరులో ధర్నా పసుపు–కుంకుమ కింద ఇచ్చిన మూడో విడత చెక్కులు చెల్లకపోవడంతో పొదుపు సంఘాల మహిళలు చంద్రబాబు సర్కారుపై తీవ్రంగా మండిపడ్డారు. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని మైదుకూరులోని భారతీయ స్టేట్ బ్యాంకు సిబ్బంది చెప్పడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ బ్యాంకు ఎదుటే కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా చంద్రబాబు పసుపు–కుంకుమ పేరుతో చెక్కులు ఇవ్వడం శోచనీయమన్నారు. అయినా.. ఆ ఇచ్చేదేదో మూడు విడతల్లో ఇవ్వకుండా ఒకేసారి ఇచ్చి ఖాతాల్లో నేరుగా జమచేసి ఉంటే తమకు ఈ తిప్పలు ఉండేవి కావన్నారు. -
టీడీపీపై డ్వాక్రా మహిళల తిరుగుబాటు
-
మైదుకూరులో డ్వాక్రా మహిళల ధర్నా
-
పసుపు-కుంకుమ బూటకమంటూ ఆగ్రహం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడులో టీడీపీ అభ్యర్థిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. చంద్రబాబు తీసుకువచ్చిన పసుపు-కుంకుమ వట్టి బూటకమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పసుపు-కుంకుమ డబ్బులు తీసుకునేందుకు వందలాది మంది మహిళలు ఇరుగులం బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లిస్తేనే పసుపు-కుంకుమ డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పడంతో మహిళలు నిరసనకు దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నా.. బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేతలను కడిగిపారేసిన మహిళలు.. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీంతో టీడీపీ సత్యవేడు అభ్యర్థి జేడీ రాజశేఖర్ మహిళలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. -
‘పసుపు– కుంకుమ’ పేరుతో టీడీపీ ప్రచారం
గుడిపాల చిత్తూరు జిల్లా: ‘డ్వాక్రా మహిళలకు రూ. 20 వేల పసుపు కుంకుమ ద్వారా డబ్బులు ఇస్తున్నాను. మీరంతా నన్ను ఆదరించాలి.’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డ్వాక్రా మహిళల ఇళ్లకు పోస్టుల ద్వారా లెటర్లు పంపిస్తున్నారు. చిత్తూరు జిల్లా గుడిపాలలో 831 డ్వాక్రా గ్రూపులకు గాను 8,100 మంది సభ్యులు ఉన్నారు. వీరందరికీ కుప్పలుతెప్పలుగా పోస్టుల ద్వారా కార్డులు అందుతున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చీరలు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు గుంటూరు జిల్లా బాపట్లలో చీరలు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను శుక్రవారం రాత్రి ప్రత్యేక ఫోర్స్ బృందం అదుపులోకి తీసుకుంది. బాపట్లలోని కన్యకా పరమేశ్వడరి కాంప్లెక్స్‌లోని ముకుందం ఫ్యాషన్స్‌లో కొంతమంది డ్వాక్రా మహిళలకు స్లిప్పులు ఇచ్చి చీరలు పంపిణీ చేస్తుండగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజిటింగ్ కార్డు వెనక షాపు పేరును స్టాంపుతో ముద్ర వేసి షాపులకు పంపుతున్నారు. ఈ విధంగా పట్టణంలోని ముకుందం షాపుతో పాటు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఓ షాపు, స్టేట్ బ్యాంకు ఎదురు మరో షాపులో పోలీసులు దాడులు నిర్వహించారు. చీరలను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంలో మున్సిపాలిటీలోని ఒకరిద్దరి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రత్యేక ఫోర్స్ అధికారులు తెలిపారు. -
ప.గో జిల్లా దర్భగూడెంలో డ్వాక్రా మహిళల ధర్నా
-
‘పసుపు– కుంకుమ’ పంపిణీలో పచ్చపాతం
సాక్షి, ఓడీ చెరువు : మార్చి మొదటి వారంలో అందాల్సిన రెండో విడత ‘పసుపు–కుంకుమ’ డబ్బులు ఏప్రిల్ నెలలో కూడా అందక మహిళలు అవస్థలు పడుతున్నారు. మహిళా సంఘ సభ్యురాళ్లు రోజూ ఐకేపీ కార్యాలయం, బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రెండు రోజుల నుంచి వందలాది మంది మహిళలు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారులేరు. దీంతో మహిళలు మండుటెండను సైతం లెక్కచేయకుండా బైఠాయించి, అక్కడే ఆందోళన చేశారు. ఓడీసీ, టి.కుంట్లపల్లి, ఇనగలూరు, ఎంబీ క్రాస్, వంచిరెడ్డి పల్లి, మలకవారిపల్లి, పెదగుట్లపల్లి తదితర గ్రామాల మహిళా సంఘాల సభ్యులు హేమావతి, లక్ష్మిదేవి, రేవతి, ప్రమీళ, ఆదిలక్ష్మి, నాగలక్ష్మి, జయమ్మ తదితరులు మాట్లాడుతూ రెండు నెలల క్రితమే చెక్కులు ఇచ్చినా ఇప్పటికీ డబ్బు చేతికందలేదన్నారు. రోజూ కార్యాలయానికి వస్తేనే డబ్బులు ఇప్పిస్తామని ఐకేపీ సిబ్బంది చెప్తున్నారని అన్నారు. రెండు రోజులుగా వస్తున్నా డబ్బులు డ్రా చేసి ఇవ్వలేదని, పగలంతా బ్యాంకు వద్ద పడిగాపులు కాస్తున్నా ఎవరూ పట్టించుకునేవారులేరని వాపోయారు. పండుగ పూట ఇంటి వద్ద పనులు వదలి బ్యాంకు వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ఇప్పటికైనా మహిళలకు చెల్లించాల్సిన రెండో విడత పసుపు కుంకుమ చెక్కులు డ్రా చేసి అందేలా చూడాలని అన్నారు. -
పసుపు కుంకుమ నిలిపివేయాలంటూ పిటీషన్
న్యూఢిల్లీ : ప్రభుత్వ పథకాల పేరిట ఓటర్ల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన పసుపు-కుంకుమ పథకం పేరిట చెక్‌ల రూపంలో ఓటర్లను ప్రలోభపెడ్తుందని, ఎన్నికలు పూర్తయ్యేంతవరకు ఈ నగదు బదిలీని ఆపాలని జనచేతన వేదిక అనే స్వచ్ఛంద సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటీషన్‌పై న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. పసుపు-కుంకమ పథకం అమలు విషయమై పూర్తి వివరాలు అందించాలంటూ హైకోర్టు ధర్మాసనం ఎన్నికల సంఘాన్ని కోరింది. తదుపరి విచారణను ఏప్రిల్ 5కు వాయిదా వేసింది. ఇక ఏపీ ప్రభుత్వం సరిగ్గా ఎన్నికల ముందు ఓటర్లను ప్రలోభపెట్టేవిధంగా పసుపు కుంకుమ, అన్నధాత సుఖీభవ, పెన్షన్ల పెంపు పథకాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. -
టీడీపీ భూస్థాపితం ఖాయం
సాక్షి, తణుకు : కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ ఎన్టీఆర్ చావుకు కారణమై ఆయన నుంచి తెలుగుదేశం పార్టీని లాక్కుని ఇప్పుడు నాదే పార్టీ అంటున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు ధ్వజమెత్తారు. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని ఎన్టీఆర్ శాపం తప్పకుండా ఫలిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తణుకు పట్టణంలో రోడ్‌షో నిర్వహించిన మోహన్‌బాబు స్థానిక నరేంద్రసెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్నికల సమయంలోనే డ్వాక్రా మహిళలు చంద్రబాబుకు గుర్తుకు వస్తారని ఇప్పుడు పసుపు కుంకుమ పేరుతో వాళ్ల సొమ్ములు వాళ్లకే ఇస్తున్నాడని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లూ చంద్రబాబుతో పాటు ఆయన మంత్రులు మట్టి, ఇసుక దోచేసి రూ.లక్షల కోట్లు ఆర్జించి ఇప్పుడు మరోసారి ఓటేయమని ప్రజలను అభ్యర్థిస్తున్నాడని అన్నారు. ఈసారి చంద్రబాబుకు ఓటేస్తే మాత్రం ప్రజల రక్తాన్ని సైతం దోచేస్తాడని విమర్శించారు. కనీసం సరిగా మాట్లాడడం రాని తన కొడుకు లోకేష్‌కు మూడు మంత్రి పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం జగన్ వెంటే ఉందని రాబోయే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమన్నారు. హైదరాబాద్ నుంచి పారిపోయిందెవరు? జగన్మోహన్రెడ్డిపై కేసులు ఉన్నాయంటూ యాగీ చేస్తున్న చంద్రబాబుపై 11 కేసులు లేవా అని మోహన్‌బాబు ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి హైదరాబాద్ నుంచి అర్థరాత్రి పారిపోయి వచ్చింది నువ్వు కాదా అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. గత పదేళ్లుగా జగన్ ఒక్కడే పోరాడుతున్నాడని చంద్రబాబు మాత్రం ఇతర రాష్ట్రాలకు చెందిన దొంగలను వెంట బెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టే చంద్రబాబు అయిదేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్‌ను విమర్శించడం సరికాదన్నారు. ప్రత్యేక హోదాపై ఎన్ని నాలుకలతో మాట్లాడుతున్నాడో ప్రజలు గమనిస్తున్నారన్నారు. పోలవరం నిధులకు సంబంధించి లెక్కలు అడిగితే చెప్పలేని చంద్రబాబు అబ్బ మొగుడు సొమ్ములు అనుకుంటున్నాడా అంటూ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి వ్యక్తిని వేరే దేశంలో అయితే ఉరి తీసేవారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో వైఎస్‌కు రాష్ట్ర ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని మోహన్‌బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్‌బాబు వెంట ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నాయకులు పాతపాటి సర్రాజు, గుబ్బల తమ్మయ్య, ఎస్ఎస్.రెడ్డి, బలగం సీతారామం తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళలకు టార్చర్!
సాక్షి, చీరాల (ప్రకాశం): ప్రజల్లో పట్టులేదు..మాయమాటలు, అమలుకాని హామీలతో ఐదేళ్లు పబ్బం గడుపుకున్న టీడీపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు గుడ్‌బై చెబుతారని భావిస్తున్న తరుణంలో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో టీడీపీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. పొదుపు మహిళలను టార్చర్ పెడుతున్నారు. గ్రామ ఇన్‌చార్జులం...వార్డు ఇన్‌చార్జులమంటూ పొదుపు గ్రూపుల అధ్యక్షులు, యానిమేటర్ల వద్దకు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారు. గ్రూపు సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకోవడంతో పాటుగా టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని, లేకుంటే మూడో విడత చెక్కులు పడవు...అవసరమైతే మీ పదవులను తొలగిస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో కొందరు చేసేదిలేక బ్యాంకు ఖాతాల వివరాలు ఇస్తుండగా మరికొందరు మాత్రం ఈ రాజకీయాలు మాకెందుకంటూ తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకెళితే.. చీరాల నియోజకవర్గంలోని చీరాల మండలంలో 1717 గ్రూపులు, వేటపాలెం మండలంలో1410 గ్రూపులు, మున్సిపాలిటీ పరిధిలోని 33 వార్డుల్లో 1422 గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 మంది సభ్యులు ఉన్నారు. వారిలో ఇద్దరు గ్రూపు లీడర్లు ఉంటారు. అయితే టీడీపీ నేతలు మాత్రం అధికారుల వద్ద పొదుపు గ్రూపుల పూర్తి వివరాలు తీసుకున్న టీడీపీ నేతలు వార్డులు, గ్రామాల వారీగా పొదుపు గ్రూపుల్లోని సభ్యులు, గ్రూపు లీడర్లతో మాట్లాడేందుకు యానిమేటర్లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసుకున్నారు. వారు ప్రతిరోజు ప్రతి గ్రూపు వద్దకు వెళ్లి టీడీపీకి ఓట్లేయండి..మీకు డబ్బులు అందిస్తాం..అయితే మాకు అనుకూలంగా పనిచేయకపోతే పసుపు–కుంకుమ చెక్కులతో పాటు మీకు రావాల్సిన అన్నీ విధాలా లబ్ధిని అడ్డుకట్ట వేస్తామని, గ్రూపు లీడర్లు సభ్యులు సహకరించకుంటే లీడర్లను మార్చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈపూరుపాలెంలోని పొదుపు గ్రూపులకు స్థానిక టీడీపీ నాయకులతో వలస టీడీపీ నేతలు మంతనాలు చేస్తున్నారు. టీడీపీకి అనుకూలంగా ఉన్న యానిమేటర్ల నుంచి గ్రామంలోని పొదుపు గ్రూపుల అన్నీ వివరాలు సేకరించడంతో పాటుగా ఎన్నికల్లో టీడీపీకి ఓట్లేయించే బాధ్యత మీదే అని హుకుం జారీ చేస్తున్నారు. వలస నేతలను కొందరిని గ్రామాలకు, మున్సిపాలిటీలో వార్డులకు ఇన్చార్జులుగా నియమించుకుని పొదుపు మహిళల పూర్తి సమాచారాలు సేకరిస్తున్నారు. ఇన్చార్జుల పేరుతో ఒక్కో యానిమేటర్ ఆధీనంలో ఉన్న 30 గ్రూపుల సభ్యుల వివరాలు, బ్యాంకు ఖాతాలను సేకరించుకుని వారితో టీడీపీకి తమ ఇంట్లో వారందరూ ఓట్లు వేయించే బాధ్యత మీదేనంటూ హెచ్చరికలు చేస్తున్నారు. ‘‘ఒక్కో డ్వాక్రా మహిళకు పసుపు–కుంకుమ కింద సభ్యురాలికి రూ.10 వేలు ఇచ్చింది టీడీపీ, మళ్లీ మీకు ఏ ఇతర పథకాలు అందాల న్నా టీడీపీ అధికారంలోకి వస్తేనే దక్కుతాయి. మీరంతా ఖచ్చితంగా టీడీపీ కోసమే పనిచేయాలి. టీడీపీ గెలుపుకు మీరే ముఖ్యం. టీడీపీకి అనుకూలంగా పనిచేయకపోతే మీ సంగతి చూస్తామంటూ’’ బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీంతో గ్రామాలు, వార్డుల్లోని పొదుపు మహిళలు ఇదేం ఖర్మరా బాబు అంటూ తలలు పట్టుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు మేము ఎందుకు పనిచేయాలి.. ఓటర్లు వారికి ఇష్టం వచ్చిన వారికి ఓట్లు వేసుకుంటారు. ఈ బెదిరింపులు ఏంటని పొదుపు మహిళలు వాపోతున్నారు. -
పసుపు, కుంకుమ పేరిట భారీగా చీరల పంపిణీ!
-
పసుపు, కుంకుమ పేరిట భారీగా చీరల పంపిణీ!
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. పసుపు, కుంకుమ పేరిట చీరలు పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. రామచంద్రాపురం మండలంలో ఆటోలో చీరలు తరలిస్తూ ఓటర్లకు పంచేందుకు సిద్ధపడ్డారు. టీడీపీ నాయకులు ఆటోలలో చీరలు తరలిస్తుండగా కునేపల్లిలో స్థానికులు అడ్డుకున్నారు. చీరలతో వెళుతున్న ఆటోను అడ్డుకోవడంతో టీడీపీ కార్యకర్తలు స్థానికులతో గొడవకు దిగారు. దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. -
చెక్కులతో చేతులు దులుపుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ‘పసుపు కుంకుమ’ పథకం పేరుతో మహిళలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నించారు. నాలుగున్నరేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మహిళలను మభ్యపెట్టేందుకు ఈ పథకాన్ని తెరపైకి తీసుకువచ్చింది. అంతేకాదు దళితులకు దక్కాల్సిన 2137.66 కోట్ల రూపాయల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని పసుపు–కుంకుమ పథకానికి మళ్లించారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. తీరా లబ్ధిదారులు వెళ్లే సరికి ఖాళీ చెక్కులను ఇచ్చి చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకున్నారు. ఈ పథకంపై సొంత పార్టీ నేతలే తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు ఆర్కే రోజా, వాసిరెడ్డి పద్మా, బుట్టా రేణుకా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
డ్వాక్రా మహిళలకు సీఎం పేరుతో లేఖలు
విశాఖ, మాడుగుల రూరల్ : మీ భవిష్యత్తు.. నా బాధ్యత అనే పేరు మీద ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయం సహాయక సంఘాలకు లేఖలు పంపిం చారు. వచ్చే నెల 11న జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఈ లేఖలో అభ్యర్థించారు. పసుపు కుంకుమ పేరుతో రెండు విడతలుగా అందజేసిన సొమ్మును సద్వినియోగం చేసుకుని, తనకు బాసటగా నిలవాలని కోరారు. ఈ లేఖలు అమరావతి నుంచి పోస్టులో వచ్చాయి. -
ప్రచార సభలో చంద్రబాబుకు ఝలక్
సాక్షి, రాయచోటి : వైఎస్సార్ జిల్లా రాయచోటిలో జరిగిన ప్రచార సభలో సీఎం చంద్రబాబునాయుడుకు చేదు అనుభవం ఎదురైంది. పసుపు-కుంకుమ అంతా మోసమని, ఈ పధకం లబ్ధిదారులకు చేరడం లేదని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు షాక్ తిన్నారు. సీఎం వారించినా పాలకొండ్రాయుడు పట్టించుకోకుండా పసుపు కుంకుమ లోపాలను ఎత్తిచూపడంతో స్ధానిక టీడీపీ నేతలు ఆయన ప్రసంగాన్ని ఆపి పక్కకు తీసుకువెళ్లారు. సాక్షాత్తూ సీఎం సభలోనే మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ పధకంపై చేసిన వ్యాఖ్యలు క్షేత్రస్ధాయిలో ఆయా పధకాల తీరుతెన్నుల గురించి ప్రజల్లో చర్చనీయాంశమైంది. ఏకంగా తన ప్రచార సభలో పాలకొండ్రాయుడు చేసిన వ్యాఖ్యలతో చంద్రబాబు కంగుతిన్నారు.మరోవైపు డ్వాక్రా రుణాలను మాఫీ చేయని చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారనే విమర్శలు వెల్లువెత్తాయి. పసుపు కుంకుమ పధకాన్ని పచ్చచొక్కాలకే పరిమితం చేసేలా తెలుగు తమ్ముళ్లు వ్యవహరిస్తున్న ఉదంతాలు కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి. -
పసుపు–కుంకుమలో ‘పచ్చ’ కల్తీ
రుణమాఫీ చేస్తామని చెప్పి మొండి చెయ్యి చూపడమే ఒక మోసం.. తర్వాత పుసుపు–కుంకుమ–1 పేరుతో పెట్టు్టబడి నిధి అంటూ రూ.10వేలు చొప్పున ఇస్తామని ఆశ చూపి.. పదివేల మందికి ఉత్తచెయ్యి చూపారు. నాలుగున్నరేళ్లకుపైగా ఇలా కాలక్షేపం చేసేశారు.. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో పసుపు–కుంకుమ–2 పథకాన్ని తెరపైకి తెచ్చారు. మూడు చెక్కులు.. రూ.పదివేలు.. అంటూ హంగామా చేస్తూ సర్కారీ ఓట్ల కొనుగోలు ప«థకానికి బరితెగించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యని విమర్శలు వెల్లువెత్తుతుంటే.. వాటితో తమకేం పని అన్నట్లు టీడీపీ నేతలు పసుపు–కుంకుమ సొమ్మునూ నొక్కేయడానికి స్కెచ్ వేశారు. ఏకంగా సంఘాలు, సభ్యుల జాబితాలనే అనర్హులతో కల్తీ చేసేశారు. ఏనాడూ పొదుపు చేయని, సంఘాల్లో లేని టీడీపీ సభ్యులను తీసుకొచ్చి సంఘాల్లోని సభ్యుల సంఖ్య పెంచేశారు. అధికారులతో కుమ్మక్కై జిల్లావ్యాప్తంగా సుమారు 30వేల మంది అదనపు సభ్యులతో ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించేశారు. ఆ విధంగా సుమారు రూ.30 కోట్లు టీడీపీ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లిపోయేందుకు రంగం సిద్ధమైంది. సాక్షి, విశాఖపట్నం: పసుపు కుంకుమ పేరిట లూటీ జరుగుతోం ది. అధికారులు, టీడీపీ నేతలు కుమ్మక్కై దొంగ జాబితాలతో కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. ఏనాడు పొదుపు చేయని, సం ఘాలతో సంబంధం లేని వారిని డ్వాక్రా సంఘాల జాబితాల్లో చేర్చేసి జిల్లా నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ అక్రమాన్ని అడ్డుకోవాల్సిన ఉన్నతాధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. డ్వాక్రా మహిళలకు మొదటి నుంచీ మోసమే.. గద్దెనెక్కగానే డ్వాక్రా రుణమాఫీ చేస్తామన్న హామీని అటకెక్కించిన ప్రభుత్వం.. కంటితుడుపుగా పసుపు కుంకుమ రూపంలో ఒక్కొక్కరికి రూ.10 వేల పెట్టుబడి సాయం ప్రకటించింది. తొలివిడతలో జిల్లాలోని 45,724 సంఘాల్లోని 4,88,004 మందికి రూ.362.39 కోట్లు, వడ్డీ రూపంలో 36,239 సంఘాలకు రూ.66.73 కోట్లు జమ చేసింది. అయితే ఆ విడతలో దాదాపు పదివేల మందికి నేటికీ పైసా కూడా అందలేదు. తాజాగా ఎన్నికల కోడ్ కూసే వేళ డ్వాక్రా సంఘాలను ఏమార్చేందుకు పసుపు కుంకుమ–2 అంటూ పోస్టు డేటెడ్ చెక్కులతో హంగామా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోనూ తొలివిడతలో వడపోతల పేరిట అర్హుల జాబితాను కుదించేశారు. ఆ విడతలో ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున రూ.290.33కోట్లు విడుదల చేశారు. ఇందులో సుమారు 80 శాతం మాత్రమే ఆయా సంఘాల ఖాతాలకు జమ చేశారు. ఆధార్ లింక్ కాలేదని, పొదుపు చేయడం లేదన్న సాకుతో మిగతా సంఘాలకు జమ చేయలేదు. కానీ రెండోవిడతకొచ్చేసరికి ఓట్ల రాజకీయం కోసం సంఘాల్లో ఉన్న సభ్యులందరికీ ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు 76,711 సంఘాల్లోని 8,12,938 మందికి రూ. 812.93 కోట్లు ప్రకటించారు. ఇక్కడే స్వాహాపర్వం రెండో విడతలో అందరికీ అవకాశం కల్పించడాన్నే టీడీపీ నేతలు అవకాశంగా తీసుకున్నారు. మరో విడత ప్రతిపాదనలు పంపిస్తున్నారు. అసలు సంఘాలతో సంబంధం లేని, ఏనాడు ఒక్క పైసా కూడా పొదుపు చేయని వారిని సంఘాల్లో ఉన్నట్టుగా రికార్డులు పుట్టించి మరీ పసుపు కుంకుమ పూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యేల ఒత్తిళ్ల మేరకు సంఘాలతో సంబంధం లేని టీడీపీ కార్యకర్తలను సంఘాల్లో సభ్యులుగా చూపించి అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేశారు. గ్రామీణ జిల్లాలో 15,328 సంఘాల్లో కొత్తగా 24,644 మందిని చేర్పించారు. జీవీఎంసీ పరిధిలో దాదాపు 9వేల సంఘాల పరిధిలో 10వేల మందిని, ఏజెన్సీలోని మూడువేల సంఘాల్లో ఐదువేల మందిని చేర్పించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. తీర్మానాలు లేకుండానే.. చనిపోయిన, వలస పోయినావారి స్థానంలో మరొకరు చేరాలంటే సంఘ తీర్మానం అవసరం. ఆ తీర్మానాన్ని బట్టి సంఘం బ్యాంకు ఖాతాలో వారి పేరు చేరుస్తారు. ఇలా కాకుండా నేరుగా కొత్త సభ్యులను చేర్చుకోవాలన్నా సంఘ సభ్యుల ఏకగ్రీవ ఆమోదం అవసరం. అలా ప్రతి సంఘంలో గరిష్టంగా 20 మంది సభ్యులను చేర్చుకోవచ్చు. కానీ ప్రస్తుతం ప్రతి సంఘంలోనూ 10 నుంచి 12 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో కూడా సరిగ్గా పొదుపు చేయక, సకాలంలో అప్పులు చెల్లించని కారణంగా మూడోవంతు సభ్యులను యాక్టివ్ జాబితా నుంచి తొలగించారు. అటువంటి వారికి పసుపు కుంకుమ–2 తొలివిడత సొమ్ము జమ కాలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా సుమారు 10వేల సంఘాల్లో 15వేల మందికి పైగా ఉంటారని అంచనా. ఇప్పుడు వీరితో పాటు సంఘాలతో ఎటువంటి సంబంధం లేని వారిని కూడా సభ్యులుగా చేర్చి డబ్బులు కొట్టేయాలన్నది టీడీపీ నేతల పన్నాగం. ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతి కోసం పంపించారు. సభ్యులు కానీ ఈ అదనపు సభ్యుల పేరిట మరో రూ.30 కోట్ల వరకు మంజూరు కానున్నాయి. -
‘పసుపు–కుంకుమ’ తెచ్చిన తంటా
అనంతపురం, ముదిగుబ్బ : ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘పసుపు – కుంకుమ’ పేరుతో ప్రవేశపెట్టిన పథకం అబాసుపాలవుతోంది. గత ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు..నాలుగున్నరేళ్లుగా హామీలు ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. ఎన్నికల తాయిళంలో భాగంగా డ్వాక్రా సంఘాలకు ఒక్కొక్క సభ్యురాలికి రూ.10వేలు చొప్పున చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన చంద్రబాబు..ఆమొత్తాన్ని మూడు దఫాలుగా ఇచ్చేందుకు పన్నాగం పన్నారు. మొదటి విడతగా రూ.2500 ఫిబ్రవరి నెలలో, మిగతా రెండు నెలలు మార్చి, ఏప్రిల్ నెలలో ఎన్నికల సమయానికి ఇచ్చేలా సిద్ధమయ్యారు. కాగా మొదటి విడత చెక్కు మార్చుకునేందుకు మహిళలు నానాతంటాలు పడాల్సి వచ్చింది. సంఘంలోని సభ్యులందరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. దీంతో రెండు, మూడు రోజులుగా ముదిగుబ్బ మండల కేంద్రంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఆవరణ అంతా కిక్కిరిస్తోంది. సాయంత్రం వరకు మహిళలు పడిగాపులు కాయాల్సి వస్తోంది. మండలంలో ఉన్న సంఘాలు – సభ్యులు మండంలో మొత్తం 1,186 గ్రూపులు ఉండగా 12,120 మంది సభ్యులు ఉన్నారు. వీరికి‘పసుపు –కుంకుమ’ పేరిట రూ.12.11 కోట్లు మంజూరైంది. ఈనగదు మండలంలోని ఏడు బ్యాంకుల పరిధిలో సంఘాల సభ్యులకు పంపిణీ చేయాల్సి ఉంది.గొడవలు తెస్తున్న ‘పుసుపు– కుంకుమ’పసుపు–కుంకుమ చెక్కులతో డ్వాక్రా సంఘాల్లోని సభ్యుల మధ్య గొడవలవుతున్నాయి. కొందరు సభ్యులు సంఘాల్లో అధిక వడ్డీ చెల్లించలేక సంఘాల నుంచి తొలగిపోయారు. మరికొందరు సభ్యుల్లో ఐక్యత లేకపోవడంతో మరో సంఘంలోకి మారిపోయారు. కొందరు ఆన్లైన్లో పాత గ్రూపులో సభ్యులుగా ఉన్నట్లు నమోదై ఉండడంతో ఆపేరుతోనే చెక్కులు వచ్చాయి. దీంతో పాతవారికి ఇవ్వాలని కొందరు.. కొత్త సభ్యులకే దక్కుతుందని మరికొందరు గ్రామాల్లో గొడవ పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ తిరగలేకపోతున్నాం పుసుపు– కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు మార్చుకోవడానికి బ్యాంకుల చుట్టూ రోజూ తిరగాల్సి వస్తోంది. పొద్దున వస్తే సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నాం. బ్యాంకులో నగదు లేదని ఒకసారి, పదిమంది సభ్యులు కలిసి రావాలని మరోసారి తిప్పుకుంటున్నారు. ఇచ్చే రూ.2500 కోసం అవస్థలు పడాల్సి వస్తోంది.– నారాయణమ్మ, ఈదులపల్లిపెద్దమ్మస్వామి మహిళా సంఘం సభ్యురాలు పావలా వడ్డీ ఎగ్గొట్టే ప్రయత్నం మూడేళ్ల పాటు సకాలంలో బ్యాంకుల రుణాలు చెల్లించిన వారికి పావలా వడ్డీ గతంలో వచ్చేది. కానీ టీడీపీ ప్రభుత్వం పావలావడ్డీని ఎగ్గొట్టేందుకే పసుపు–కుంకుమ పేరుతో చెల్లని చెక్కులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వం మహిళలను అష్టకష్టాలు పెడుతోంది. – పద్మావతి, నాగారెడ్డిపల్లి,గణేష్ మహిళా సంఘం సభ్యురాలు -
చిచ్చు రేపిన పసుపు–కుంకుమ
మదనపల్లె : పసుపు–కుంకుమ డబ్బులు తనకు ఇవ్వకపోవడంపై ఆగ్రహించిన మహిళా సంఘ సభ్యురాలు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన గురువారం సాయంత్రం మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..గాంధీపురానికి చెందిన చౌడేశ్వరి శేషసాయి పొదుపు సంఘంలో ఆరు నెలల క్రితం సభ్యురాలిగా చేరింది. సంఘంలో చురుగ్గా ఉండటం, డిగ్రీ అర్హత కలిగి ఉండడంతో ఆమెను టీఎల్ఎఫ్ ఆర్పీగా నియమించేందుకు తీర్మానం చేశారు. ఒకరోజు విధులు నిర్వహించిన తర్వాత అర్థంతరంగా తొలగించారు. ప్రస్తుతం ప్రభుత్వం మహిళా సంఘ సభ్యులకు ‘పసుపు–కుంకుమ’ పేరిట రూ.10,000 ఇస్తున్నట్లు ప్రకటించడం, తాను సభ్యురాలిగా ఉన్న గ్రూపునకు మంజూరు చేస్తారని, తనకూ తనకు ఇస్తారని చౌడేశ్వరి ఆశలు పెట్టుకుంది. ప్రకటించి పది రోజులవుతున్నా తనకు చెక్కులు ఎవరూ ఇవ్వకపోవడంతో కార్యాలయానికి వెళ్లి మెప్మా సిబ్బందితో వాగ్వివాదానికి దిగింది. మెప్మాలో అందరూ కలిసి తనకు అన్యాయం చేశారంటూ అక్కడ విలేకరులకు తన ఆక్రోశం వెళ్లగక్కింది. ఆపై, బయటకు వెళ్లి ఫినాయిల్ బాటిల్ తీసుకువచ్చి తాగి, అస్వస్థతకు గురైంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన మహిళలను తోసేసి స్పృహ తప్పి కార్యాలయంలో నేలపై పడిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లేందుకు మెప్మా కార్యాలయంలోని మహిళలెవరూ సాహసించలేదు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ శివప్రసాద్ కార్యాలయానికి చేరుకుని చౌడేశ్వరిని ఆస్పత్రికి తరలించారు. అనుకోని ఈ సంఘటనతో షాక్‌కు గురైన మెప్మా పీఆర్పీ అబ్బాస్ అస్వస్థతకు గురవడంతో ఆయనను Mకూడా ఆస్పత్రికి తరలించారు. ఈకేవైసీ లేకనే... ఈ విషయమై మెప్మా సీఆర్పీ మాధవిని వివరణ కోరగాగా.. శేషసాయి పొదుపు సంఘంలోని చౌడేశ్వరి, సునీతకు ఈకేవైసీ లేని కారణంగా పసుపు–కుంకుమకు అర్హులు కాలేదన్నారు. పట్టణంలో ఈ విధంగా సుమారు 2,500 మంది మహిళలకు చెక్కులు రాలేదని, పల్స్ సర్వే జరిగితే తప్ప దీనికి అర్హత రాదని, అందరూ చేయించుకోవాలని సూచించామన్నారు. చౌడేశ్వరికి కూడా ఇదే విషయం తెలియజేశామన్నారు. పీఆర్పీపై చెప్పుతో దాడి చేసిన బాధితురాలు సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఉన్న మహిళలను విలేకరులు ప్రశ్నించగా, చౌడేశ్వరి ఆగ్రహంగా వచ్చీ రావడంతోనే పీఆర్పీ అబ్బాస్‌పై చెప్పుతో దాడి చేసిందని పేర్కొన్నారు. అడ్డుకోబోయిన సీఓ మస్తానీని కొట్టి, ఇతర మహిళలను గాయపరిచిందని చెప్పారు. ఇదలా ఉంచితే, ఈ ఘటనపై ఇరువర్గాలను విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్లు వన్‌టౌన్ పోలీసు అధికారులు తెలిపారు. -
చెక్కు.. చిక్కు!
ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళలు ఉరవకొండ మండలం షేక్షానుపల్లి గ్రామానికి చెందిన రామలింగేశ్వర మహిళా సంఘం సభ్యులు. వీరికి ప్రభుత్వం ‘పసుపు–కుంకుమ’ కింద ఇచ్చిన చెక్కును ఉరవకొండ స్టేట్‌బ్యాంకులో గురువారం వేశారు. డబ్బులివ్వాల్సిన బ్యాంకు సిబ్బంది మాత్రం సంఘానికి సంబంధించి రూ.లక్ష వరకు పాత బకాయి ఉందనీ, ఈ చెక్కును అప్పు కింద జమ చేసుకుంటున్నామని చెప్పారు. చెక్కులు తీసుకుపోతే డబ్బులిస్తారని సీఎం చంద్రబాబే చెప్పారని సంఘం లీడర్ చెప్పగా...ఆయన రుణమాఫీ చేయకపోవడం వల్లే ఇప్పుడు జమ చేసుకుంటున్నామని బ్యాంకు మేనేజర్ తెలిపారు. దీంతో కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన మహిళలు ఉత్తి చేతులతో వెనుదిరిగారు. ఉరవకొండ : చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించిన ‘పసుపు–కుంకుమ’.. చెల్లని చెక్కుగా మారింది. ప్రభుత్వం చెక్కులిచ్చినా.. వాటిని తీసుకువెళ్తున్న మహిళలకు బ్యాంకు సిబ్బంది డబ్బులివ్వడం లేదు. పాత బకాయికి జమ చేసుకున్నాం.. వెళ్లిరండి అని చెబుతున్నారు. దీంతో సర్కార్ చేసిన మోసాన్ని గ్రహించిన మహిళలు మండిపడుతున్నారు. రుణమాఫీ మోసంతోనే... ఉరవకొండ నియోజకవర్గంలోని ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు మండలాలల్లో ప్రభుత్వం ఇచ్చిన ‘పుసుపు– కుంకుమ’ చెక్కులను వివిధ బ్యాంకుల్లో మహిళలు జమ చేసుకుంటున్నారు. అయితే డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడం...వడ్డీలతో కలిపి బకాయి రెండింతలు కావడంతో బ్యాంకు సిబ్బంది ఈ చెక్కులను పాత అప్పులకు జమ చేసుకుంటున్నారు. దీంతో మహిళలు తాము మోసపోయామని లబోదిబోమంటున్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో దాదాపు 300 సంఘాలకు సంబంధించిన ‘పసుపు–కుంకుమ’ చెక్కులు అప్పుల కింద జమ చేసినట్లు తెలిసింది. రుణ ఎగవేతదారులుగా ముద్ర ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీలకు మహిళలు బలయ్యారు. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో రుణం మాఫీ అవుతుందన్న దీమాతో మహిళలు బ్యాంకులకు కంతులు కట్టలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోగా...వాటి వసూలుకు ఉరవకొండ పట్టణంలోని వందలాది సంఘాలకు బ్యాంకు అధికారులు కోర్టు నుంచి నోటీసులు పంపారు. దీంతో మహిళలు పుస్తెల తాడు, బంగారు వస్తువులు అమ్మి రుణాలు తీర్చారు. మరికొందరు అప్పు తీర్చే స్థోమత లేక రుణ ఎగవేతదారులుగా అపకీర్తి మూటగట్టుకున్నారు. -
‘పసుపు–కుంకుమ’ కోసం ఆత్మాభిమానం చంపుకోలేం
అనంతపురం , ఓడీ చెరువు: అందరూ కచ్చితంగా బ్యాంకుకు రావాల్సిందేనని, లేకుంటే పసుపు – కుంకుమ డబ్బు ఇచ్చేది లేదని వెలుగు సీసీలు చెబుతుండటంపై మహిళా సంఘాల సభ్యులు మండిపడ్డారు. ఇంటివద్ద పనులతోపాటు చండిబిడ్డలను కూడా వదిలేసి బ్యాంకు వద్దకు వస్తే రోజుల తరబడి తిప్పుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలంతా బ్యాంకు గోడల కింద వేచి ఉండాల్సి వస్తోందని, సిగ్గుతో చచ్చిపోతున్నామని ఆవేదన చెందారు. సీసీల వైఖరిని నిరసిస్తూ బుధవారం వారు మండల కేంద్రమైన ఓడీ చెరువులో ఏపీజీబీ బ్యాంకు వద్ద కదిరి – హిందూపురం రహదారిపై రాస్తారోకోకు దిగారు. సీపీఐ నాయకులు మున్నా, చలపతి, బీసీ జనసభ మండల అధ్యక్షుడు ఎం.ఎస్.షబ్బీర్ వారికి మద్దతు పలికి సీసీల తీరును నిరసించారు. ఈ సందర్భంగా గాజుకుంటపల్లి, ఎం.కొత్తపల్లి, మహమ్మదాబాద్‌క్రాసింగ్, భోగానిపల్లి, ఇనగలూరు, నల్లగుట్లపల్లి, నారప్పగారిపల్లి తదితర గ్రామాల నుంచి వచ్చిన పలువురు మహిళలు మాట్లాడుతూ వెలుగు సిబ్బంది తమను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సాధారణంగా గ్రూపు లీడర్లు బ్యాంకు నుంచి డబ్బులు తీసుకొస్తే సంఘంలో పంచుకుంటున్నామని, కానీ పసుపు – కుంకుమ చెక్కులు మార్చుకోవాలంటే అందరూ రావాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. అన్ని పనులూ వదిలిపెట్టి ఇక్కడికొస్తే బ్యాంకు గోడల కింద ఉండాల్సి వస్తోందని, ఇలా ఎన్నిరోజులని ఆత్మాభిమానం చంపుకోవాలని గాజుకుంటపల్లి, ఎం.కొత్తపల్లి, భోగానిపల్లి మహిళలు మహిత, శివమ్మ, నాగమణి, సరస్వతి, ధనలక్ష్మి తదితరులు వాపోయారు. మహిళలను గౌరవించడమంటే ఇదేనా అని ప్రశ్నించారు. ఇలా తమను వేధిస్తున్న వెలుగు సిబ్బందిని విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా మహిళలు రాస్తారోకో చేయడంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగిపోయాయి. దీంతో ఏఎస్ఐ ఇషాక్ వచ్చి వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ వారి కోపం తగ్గలేదు. చివరికి ఏపీజీబీ మేనేజర్ వెంకట్రావ్ వచ్చి వారితో మాట్లాడారు. తామేమీ మిమ్మల్ని బ్యాంకుల వద్దకు రావాల్సిందేనని చెప్పలేదని, సీసీల అంగీకారంతో తీర్మానం చేసుకుని బ్యాంకుకు వస్తే కచ్చితంగా మీరు చెప్పినట్లే డబ్బులు ఇస్తామని చెప్పారు. దీంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. అందరూ రావాల్సిందే సంఘాల్లోని ప్రతి మహిళా బ్యాంకు విధిగా హాజరు కావాల్సిందే. లేకుంటే డబ్బులు ఇచ్చేందుకు వీలు పడదు. ఇవి మా వెలుగు పీడీ నుంచి వచ్చిన ఆదేశాలు. మేము ఆ మేరకే నడుచుకుంటాం. – శంకర్‌నాయక్, సీసీ, ఓడీసీ -
పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీలో వివాదం
సాక్షి, కర్నూలు: అధికార పార్టీ పక్షపాత బుద్ధి మరోసారి నిరూపితమైంది. తమకు అనుకూలంగా ఉన్న వారికి దోచిపెడుతూ.. సామాన్య ప్రజలను విస్మరించటం పరిపాటిగా మారింది. ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీ విషయంలో బుధవారం గొడవ చోటుచేసుకుంది. ఆత్మకూరులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు మాత్రమే చెక్కులు పంపిణీ చేస్తూ మిగిలిన మహిళలకు చెక్కులు పంచకపోవటంతో వివాదం మొదలైంది. దీంతో పొదుపు సంఘాల మహిళలు పోలీసులను ఆశ్రయించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పాచక్రపాణి రెడ్డి వీరికి మద్దతుగా నిలిచారు. -
‘పసుపు కుంకుమ’ చెక్కులకు రాని సొమ్ము
కాజులూరు (రామచంద్రపురం): తెలుగుదేశం ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన పసుపు కుంకుమ పథకం చెక్కులకు సొమ్ము విడుదల కాకపోవటంతో మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుయ్యేరు భారతీయ స్టేట్‌బ్యాంక్ ఎదుట మంగళవారం పలువురు మహిళలు మాట్లాడుతూ 577 డ్వాక్రా గ్రూపులకు చెక్కులు పంపిణీ చేశారన్నారు. మొదట్లో ఈ పథకం ద్వారా డ్వాక్రా సంఘంలోని ప్రతీ మహిళకు రూ.10 వేలు చొప్పున ఇస్తామని నాయకులు ప్రకటించారన్నారు. తీరా సొమ్ము కోసం వెళితే ఇప్పుడు రూ.2,500, ఎన్నికల తర్వాత మిగిలిన సొమ్ములు ఇస్తామని అధికారులు రూ 2,500 చొప్పున చెక్కులు చేతిలో పెట్టారన్నారు. వాటిని తీసుకుని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా సొమ్మలు విడుదల కావటంలేదన్నారు. ఎప్పుడు వచ్చినా నగదు లేదు రేపు రండి అని బ్యాంకువారు వెనక్కి పంపుతున్నారని, దీంతో రోజు విడిచి రోజు ఇప్పటికి మూడుసార్లు బ్యాంకుకు వచ్చామన్నారు. నగదు లేదని చెక్కులు రద్దు చేసి సొమ్ము మీ ఖాతాలో జమ చేస్తామని బ్యాంక్‌వారు చెబుతున్నారన్నారు. గత ఎన్నికలలో రుణమాఫీ ప్రకటించిన పాలకులు ఎటూ వాటిని అమలు చెయ్యలేదని, కనీసం ఇచ్చిన ఈ పథకమైన సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు. గ్రామానికి చెందిన సాయిరామ్, లలితాదేవి, రామాంజనేయ, అనిత, శ్రీ సత్తెమ్మ, మల్లీశ్వరి, కోదండరామ, మదర్ థెరీసా మహిళా శక్తి సంఘాలకు చెందిన డ్వాక్రా మహిళలు ఆందోళనలు వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు. బ్యాంకులో తగినంత నగదు లేదు ఈ విషయమై కుయ్యేరు బ్యాంక్ మేనేజర్ ఎంఎస్ఎన్ చిత్రను వివరణ కోరగా బ్యాంకులో తగినంత నగదు లేని కారణంగా పసుపు కుంకుమ చెక్కులకు సొమ్ములు చెల్లించలేక పోతున్నామన్నారు. ఈ నెల 22 వ తేదీ నుంచి నగదు బట్వాడా చేస్తామని, డ్వాక్రా సంఘాలు అన్నీ ఒకేమారు కాకుండా దశల వారీగా వచ్చి సొమ్ము తీసుకోవాలన్నారు. -
చంద్రబాబు జిమ్మిక్కులు నమ్మవద్దు
వైఎస్ఆర్ జిల్లా, గాలివీడు : పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆయన జిమ్మిక్కులు నమ్మవద్దని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గాలివీడు మండలంలోని కొర్లకుంట గ్రామంలోని డ్వాక్రా మహిళలతో మాట్లాడారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల్లో చెప్పిన ప్రకారం డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదని వేదన చెందారు. ఇప్పుడు పసుపు కుంకుమలతో తమను మోసగిస్తున్నారని వారు వివరించారు. అప్పుడు ఎన్నికల్లో పూర్తి మాఫీ చేస్తామని చెప్పారని, మూలధనం క్రింద ఇచ్చిన డబ్బులు వడ్డీలకు కూడా సరిపోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు కుంకుమ కింద ఇస్తున్న చెక్కులకు ఇంతవరకు తమకు డబ్బులు అందలేదని తెలిపారు. డ్వాక్రా మహిళలను మోసగిస్తున్న చంద్రబాబును నమ్మే పరిస్థితుల్లో లేమని వారు స్పష్టం చేశారు. గ్రామంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు డ్వాక్రా మహిళల సంక్షేమంపై చిత్తశుద్ధిలేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలలులోగా గాలివీడు మండలంలోని అన్ని పల్లెలకు కూడా వెలిగల్లు ద్వారా తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌లు ప్రసాద్‌రెడ్డి, ఖాసీంసాబ్, ఎంపీటీసీ రమణ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు హనుమాన్‌నాయక్, వైఎస్ఆర్సీపీ నాయకులు శేఖర్, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
‘పచ్చ’పాతంపై మహిళాగ్రహం
కర్నూలు, ఆత్మకూరు: ‘పచ్చ’పాతంపై డ్వాక్రా మహిళల నిరసనాగ్రహం కొనసాగుతోంది. టీడీపీ కండువా వేసుకుంటేనే పసుపు–కుంకుమ చెక్కులు ఇస్తామని టీడీపీ నేతలు, అధికారులు చెప్పడంపై గురువారం నగర పంచాయతీ కార్యాలయాన్ని దిగ్బంధించి ఆందోళన చేపట్టారు. అయితే శుక్రవారం కూడా నిరసనలతో హోరెత్తించారు. చెక్కులు ఇస్తామని హామీ ఇచ్చిన అధికారులు, ప్రజాప్రతినిధులు రోజుల తరబడి నిర్లక్ష్యం చేస్తుండడం, ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం, కార్యాలయాలకు అధికారులు రాకపోవడంతో ఆందోళన ఉధృతం చేశారు. చెక్కులు ఇస్తారన్న ఉద్దేశంతో ఉదయం తొమ్మిది గంటలకు నగర పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలయినా కమిషనర్ రాలేదు. ఆయన చాంబర్‌కు తాళం వేసి ఉండటంతో కమిషనర్ రాకపై అక్కడున్న అధికారులను అడిగారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో కమిషనర్, సీఓ వచ్చి చెక్కులు పంచే వరకు అధికారులెవరూ కార్యాలయంలో కూర్చోవద్దంటూ అందరినీ బయటకు పంపి కార్యాలయానికి తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరారు. ఎమ్మెల్యే బుడ్డా, సీఎం డౌన్..డౌన్... అని నినాదాలు చేస్తూ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవాలయం, కొత్తపేట మసీదు, నంద్యాల టర్నింగ్, పోలీస్ స్టేషన్ మీదుగా గౌడ్ సెంటర్‌కు చేరుకున్నారు. మానవహారంగా ఏర్పడి రహదారిని దిగ్బంధించారు. చెక్కులు ఇచ్చేవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. సీఐ కృష్ణయ్య వచ్చి చెక్కులు ఇచ్చేలా అధికారులతో మాట్లాడతానని చెప్పినా మహిళలు వినలేదు. దీంతో స్టేషన్ వద్దకు అధికారులను పిలిపిస్తానని, చెక్కులను ఇప్పిస్తాననడంతో అందరూ అక్కడికి బయలుదేరారు. డీఎస్పీ హామీతో ఆందోళన విరమణ.. పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకున్న మహిళలు తమ చెక్కులు ఇప్పించాలంటూ పట్టుబట్టారు. దీంతో డీఎస్పీ వెంకటరావు స్పందిస్తూ సోమవారం తాము దగ్గరుండి అధికారులతో చెక్కులు పంపిణీ చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు. నువ్వు అమ్ముడుపోయి మమ్మల్ని వేధిస్తావా? ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఫ్యాన్ గుర్తుపై గెలిచారు. మేమే ఓటు వేశాం. మా ఓట్లతో ఆయన గెలిచి టీడీపీకి అమ్ముడుపోయారు. మాకు రూ.4కోట్లు ఇస్తే ఆ పార్టీ కండువాలు వేసుకుంటాం. పార్టీ ఫిరాయించి ఓటు వేసిన మహిళలను బజారుకు ఈడ్చుతారా.. మా బాధ అర్థం కాదా.. మహిళలను రోడ్ల వెంట తిప్పడం సమంజసమా.. చెక్కులు ఇచ్చే వరకు ఆందోళన చేస్తాం.– విజయలక్ష్మి, పొదుపు మహిళ, ఆత్మకూరు -
టీడీపీ నేతల బరితెగింపు..
సాక్షి, విశాఖపట్నం: ‘మీకు చెక్కు–చీర–గొడుగు కావాలంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని దేవుడి మీద ప్రమాణం చేయాలి. అది కూడా మేము చెప్పినట్లే ప్రమాణం చేయాలి. లేదంటే మీకు రూ.10 వేల చెక్కు, చీర, గొడుగు ఇవ్వం’. ఇదీ టీడీపీ నేతల బరితెగింపు. అసలేం జరిగిందంటే ..గురువారం సాయంత్రం నర్సీపట్నం మున్సిపాలిటీలోని 26వ వార్డులో తెలుగుదేశం ప్రభుత్వం పంచుతున్న ‘పసుపు–కుంకుమ చెక్కుల కోసం ఆ వార్డులో ఉన్న డ్వాక్రా మహిళలు హనుమాన్ ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చిన్న కుమారుడు రాజేష్ చేతుల మీదుగా చెక్కులు, చీరలు, గొడుగులు పంపిణీ చేశారు. అంతకన్నా ముందు హనుమాన్ ఆలయంలో డ్వాక్రా మహిళలతో ‘వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తామని, ఎవరి ఒత్తిడికి .. ఎటువంటి ప్రలోభాలకు లోనవ్వబోమని దైవసాక్షిగా ప్రమాణం చేయించారు. తప్పని పరిస్థితుల్లో ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మలంతా ప్రమాణం చేయక తప్పలేదు. మున్సిపల్ కౌన్సిలర్ పైల గోవింద్, వార్డు మాజీ మెంబర్, రిటైర్డ్ టీచర్ రుత్తల తాతీలు పాల్గొని డ్వాక్రా మహిళలతో ప్రమాణం చేయించారు. కాగా సీఎం చంద్రబాబునాయుడు తరఫున పసుపు–కుంకుమ కింద మహిళలకు రూ.10 వేలు ఇస్తుంటే.. మా కుటుంబం తరఫున మహిళలకు చీరలు ఇస్తున్నామని మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బహిరంగ సభల్లో చెబుతున్నారు. దీనిలో భాగంగా నియోజకవర్గంలో మంత్రి సతీమణి పద్మావతి, తనయులు విజయ్, రాజేష్ తమ అనుచరులతో ముందస్తు ఎరగా ముమ్మరంగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ఏదో చీర ఇస్తామంటే వెళ్లాం కానీ.. భగవంతుడి సన్నిధిలో పిల్లా పాపలతో ఉన్న తమచేత ప్రమాణం చేయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఇదెక్కడి చెక్కుముడి
సాక్షి ప్రతినిధి,పశ్చిమగోదావరి , ఏలూరు: పసుపు – కుంకుమ పేరుతో ఇచ్చిన చెక్కులను పాత బకాయిలకు జమ చేయడంపై మహిళలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలాచోట్ల పొదుపు డబ్బుల్లో చెక్కులు జమ చేసుకోవాలంటూ బ్యాంకర్లు సూచిస్తున్నారు. డబ్బులు సభ్యులకు ఇస్తున్న సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. దీనిపై డ్వాక్రా సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి నిలబెట్టుకోలేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2014 ముందు రుణాలు ఎవ్వరూ చెల్లించవద్దు. మొత్తం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. బాకీ రద్దు అవుతుందన్న నమ్మకంతో మహిళలు బ్యాంకు రుణాలు చెల్లించలేదు. దీంతో బ్యాంకర్లు ఆ అప్పు తీర్చాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మధ్యమధ్యలో కొత్త రుణం ఇచ్చినట్లుగా చూపించి ఆ డబ్బులను పాత బకాయికి జమ చేసుకుంటూ బుక్ అడ్జస్ట్మెంట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పసుపు–కుంకుమ పథకంలో బాగంగా తొలివిడతగా ఒక్కో గ్రూపునకు రూ.25 వేల చెక్కును ఇస్తోంది. దీనినిపాత బకాయికి బ్యాంకర్లు జమ చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. పసుపు కుంకుమ డబ్బులు అప్పులో వేయకపోతే ఊరుకోబోమంటూ సీసీలపై ఒత్తిడి తెస్తున్నారు. కామయ్యపాలెంలో ఆందోళన తాజాగా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఆంధ్రాబ్యాంక్‌లో మహిళలకు ఇస్తున్న పసుపు కుంకుమ సొమ్ములు బాకీలకు జమచేయడంపై వెయ్యడంపై మహిళలు ఆగ్రహించారు. బ్యాంకు వద్ద ఆందోళన చేపట్టారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన రుణ మాఫీ హామీ వల్ల మోసపోయామని మాఫీ సొమ్ములు కాని, పసుపు కుంకుమ సొమ్ములు కానీ ఒక్క రూపాయి కూడా తాము తీసుకోలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క జీలుగుమిల్లి మండలంలో 794 డ్వాక్రా గ్రూపులు ఉండగా, చంద్రబాబునాయుడు ఇచ్చిన డ్వాక్రా రుణమాఫీ హామీ దెబ్బకు జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం ఆంధ్రాబ్యాంక్ పరిధిలోని సుమారు 3 వందల గ్రూపులు మూలనపడ్డాయి. తీసుకున్న రుణాలు తిగి చెల్లించలేక డీఫాల్టర్లుగా మారాయి. ఇదే బ్యాంక్ పరిధిలో గత ఏడాది డ్వాక్రా మహిళల ఇళ్లకు సైతం బ్యాంక్ అధికారులు తాళాలు వేశారు. రుణామాఫీ కింద ఇచ్చిన రూ.పదివేల సొమ్ములు, పసుపు కుంకుమ సొమ్ములు మొత్తం పాత అప్పుకే చాల లేదు. మిగిలిన బాకీని వన్‌టైం సెటిల్మెంట్ æ చేసుకోవాలని బ్యాంక్ అధికారుల చెబుతున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీసుకున్న రుణం ఐదురెట్లు పెరిగింది ఎన్నికల ముందు రుణమాఫీ చేస్తామన్న చంద్రబాబు మాట నమ్మి తీసుకున్న అప్పు తిరిగి కట్టలేదు. ఈ ఐదేళ్లలో తీసుకున్న రుణం వడ్డీతో కలిపి మూడు రెట్లు పెరిగింది. చంద్రబాబు ఇచ్చిన రుణమాఫీ సోమ్ము, పసుపు కుంకుమ సొమ్ము తీసుకున్న అప్పుకి పెరిగిన వడ్డీకి చాలలేదు. చంద్రబాబు మహిళలను రుణమాఫీ పేరు చెప్పి అప్పులపాలు చేశారు.– జి.కోరమ్మ. కనకాపురం. జీలుగుమిల్లి మండలం. ఎన్నికల ముందు మహిళలు గుర్తుకు వచ్చారు ఎన్నికల ముందు చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వచ్చారు. ఐదేళ్లలో మహిళలకు పైసా ఇవ్వని చంద్రబాబు ఎన్నికలకు మూడు నెలల ముందు పసుపు కుంకుమ పేరుతో మహిళలను మభ్య పెడుతున్నారు. ఇచ్చిన చెక్కులను బ్యాంక్ అధికారులు పాత బాకీలకు జమ వేసుకుంటున్నారు.– సున్నం వరలక్ష్మీ.రాచన్నగూడెం.జీలుగుమిల్లి మండలం -
పసుపు కుంకుమ పథకంపై గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
-
పసుపు కుంకుమ లోగుట్టు విప్పిన ఎమ్మెల్యే గిడ్డి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకంపై ఫిరాయింపు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పసుపు కుంకుమ పథకం డబ్బులు నేరుగా మహిళలకు అందడంలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు కేవలం చెక్కులే ఇస్తున్నారని, బ్యాంకులు ఆ డబ్బులను లబ్ధిదారులకు తిరిగి ఇవ్వడంలేదని ఆమె తెలిపారు. గతంలో ఇచ్చిన చెక్కులు కూడా ఇంతవరకు డబ్బులు అందలేదని ఆమె వెల్లడించారు. మహిళలకు బ్యాంకర్లు డబ్బులు ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
నిరాశగా వెనుదిరిగిన డ్వాక్రా మహిళలు..
సాక్షి, ఏలురు/పశ్చిమగోదావరి : డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు ... ఎన్నికల ముందు మరో మోసానికి తెరలేపారు. పసుపు కుంకుమ కార్యక్రమం పేరుతో డ్వాక్రా మహిళలకు టోకరా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. రుణాలను మాఫీ చేయకపోగా తమకు చెల్లని చెక్కులు ఇచ్చారని డ్వాక్రా సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన చెక్కులను బ్యాంకు అధికారులు పాత బాకీల కింద జమ చేసుకుంటున్నారని వాపోతున్నారు. ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా వెలుగులోకి వస్తున్నాయి. (‘డ్వాక్వా’పై దద్దరిల్లిన కౌన్సిల్) తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలోని జీలుగుమల్లి మండలం కామయ్యపాలెంలోనూ టీడీపీ ప్రభుత్వ మోసం బయటపడింది. ‘పసుపు కుంకుమ’ కార్యక్రమంలో చెక్కులు కొందరికి మాత్రమే వచ్చాయని డ్వాక్రా మహిళలు చెప్తున్నారు. ఆ చెక్కులు తీసుకుని బ్యాంక్‌కు వెళితే.. పాత బాకీలో జమ చేసుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్న చేతిలో మరోసారి మోసపోయామని నిరాశతో ఇళ్లకు వెనుదిరిగారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇవ్వడంతో డ్వాక్రా సభ్యులెవరూ ఆ రుణాలు చెల్లించలేదు. దాంతో అసలుతో పాటు వడ్డీ కూడా తడిసి మోపెడు అయింది. రానున్న ఎన్నికల నేపథ్యంలో .... ఓట్లు రాబట్టకునేందుకు డ్వాక్రా రుణాలు మాఫీ చేయాల్సి రావడంతో టీడీపీ సర్కార్ పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకుంటుందని మహిళలుమండిపడుతున్నారు. -
చెక్కులివ్వాలంటే చెల్లించాల్సిందే!
దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఆత్రుతలో టీడీపీ నాయకులు ఉన్నారు. అందులో భాగంగా డ్వాక్రా సంఘాల వద్ద కూడా వసూళ్లు ప్రారంభించారు. మరో నాలుగు నెలల్లో తమ పదవి కాలం ముగుస్తున్నందున ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన పసుపు – కుంకుమ పథకంలో డ్వాక్రా మహిళలకు చెక్కులను పంపిణీ చేసే విషయంలో స్థానిక క్షేత్రస్థాయి సిబ్బందితో సంఘాల నుంచి వసూళ్ల దందా మొదలెట్టారు. ఒక్కో గ్రూపు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు. కృష్ణాజిల్లా, పటమట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని చెబుతున్న పసుపు–కుంకుమ పథకంలో డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ అవినీతిమయంగా మారింది. నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) విభాగం సిబ్బంది కుమ్మకై లబ్ధిదారులైన డ్వాక్రా సంఘాల నుంచి సొమ్ములు దండుకుంటున్నారు. సొమ్ములు చెల్లించకపోతే డిఫాల్టర్ల గ్రూపులుగా చిత్రీకరించి చెక్కులు ప్రభుత్వానికి తిరిగి పంపుతామని హెచ్చరిస్తూ, ఒక్కో గ్రూపు నుంచి రూ.వెయ్యి నుంచి రూ.12 వందల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇటీవల వీఎంసీ కమిషనర్‌కు నేరుగా స్థానిక మహిళలు ఫిర్యాదు చేయటంతో విషయం వెలుగులోకి వచ్చింది. నగరంలోని 52వ డివిజన్లో ఉన్న 350 గ్రూపుల నుంచి స్థానిక సీవో (కమ్యూనిటీ ఆర్గనైజర్), సోషల్ వర్కర్లు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, రిసోర్స్ పర్సన్లతో స్థానిక టీడీపీ మహిళా నేత కుమ్మకై ఒక్కో గ్రూపు నుంచి సొమ్ములు వసూలు చేయాలని, సంఘాల వద్ద వసూలు చేసిన సొమ్ములో పర్సంటేజీలు లెక్క పంపకాలు చేసుకుందామని ఓపెన్ ఆఫర్ ఇవ్వటంతో యూసీడీ విభాగం సిబ్బంది చెలరేగిపోయారు. ప్రతి గ్రూపు నుంచి స్థానిక నేతలకు వాటాలు ఇవ్వాలని బలవంతంగా వసూళ్లు చేయటంతో మహిళలు వీఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. సంబంధిత సిబ్బంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయాలని, సంఘాలకు సంబంధించి డిఫాల్టు లేదని నిర్థారించేందుకు సొమ్ములు వసూలు చేశారని, నగరంలోని 51, 52, 53 డివిజన్లలో వసూళ్లు అధికంగా ఉన్నాయని, నగరంలోని 59 డివిజన్లకు 40 చోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని ఆరోపణలు వస్తున్నాయి. ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు.. పసుపు – కుంకుమ పథకంలో వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై, అందుకు కారణమైన స్థానిక నేత పాత్రలపై వీఎంసీ విచారణ చేపట్టింది. యూసీడీ పీవో ఎంవీవీ సత్యనారాయణ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల బృందం బుధవారం నుంచి విచారణ ప్రారంభించింది. డ్వాక్రా సంఘాలతో సమావేశమై విచారణ నిర్వహించారు. శాఖాపరమైన చర్యలుతీసుకుంటాం.. పసుపు – కుంకుమ పథకంలో లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చే నేపథ్యంలో సిబ్బంది చేతివాటం ప్రదర్శన చేశారని వచ్చిన ఆరోపణలతో విచారణ చేపట్టాం. అజిత్‌సింగ్‌నగర్ ప్రాంతంలోని ఓ సీడీవో వద్ద గ్రూపు సభ్యులకు ఇవ్వాల్సిన 120 చెక్కులను గుర్తించాం. ఆయా గ్రూపు సభ్యులు సిబ్బందికి సొమ్ములు చెల్లించకపోవటంతో వారికి వీటిని అందించలేదు. స్థానిక ప్రజా ప్రతినిధుల ఒత్తిడి కూడా సిబ్బందిపై ఉంది. దీనిపై కమిషనర్‌కు నివేదిస్తాం. కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.– ఎంవీవీ సత్యనారాయణ, పీవో యూసీడీ -
పసుపు-కుంకుమ కింద చెల్లని చెక్కులు
-
రౌడీ షీటర్‌తో కలిసి మంత్రి పరిటాల సునీత చెక్కుల పంపిణీ
-
మరో వివాదంలో పరిటాల సునీత
సాక్షి, అనంతపురం: ఫ్యాక్షనిజం, రౌడీయిజానికి కేరాఫ్ అడ్రస్ టీడీపీ అన్న విషయం తెలిసిందే. తెర వెనుక రౌడీయిజాన్ని పెంచి పోషిస్తూ బయటకి మాత్రం అమాయక ముసుగు వేసుకోవడంలో టీడీపీ నాయకులు సిద్దహస్తులు. తాజాగా మరోసారి రౌడీ షీటర్లకు, టీడీపీ నాయకుల మధ్య ఉన్న సత్సంబంధాలు బయటపడ్డాయి. ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడే ప్రభుత్వ కార్యక్రమానికి అతిథిగా రావడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ సంఘటన అనంతపురంలోని చిన్మయ్ నగర్లో చోటుచేసుకుంది. పసుపు కుంకుమ కార్యక్రమంలో భాగంగా మంత్రి పరిటాల సునీత రౌడీ షీటర్ ఉప్పర శీనాతో కలిసి డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వివాదంలో చిక్కుకున్నారు. రౌడీషీటర్‌తో కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొనడం వివాదస్పదమవుతోంది. రాప్తాడు తహశీల్దారు కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్య కేసులో ఉప్పర శీనా కీలక నిందితుడు. అయితే అధికారిక కార్యక్రమాల్లో మంత్రి సునీత రౌడీ షీటర్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై స్వపక్ష విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా ఉంటూ రౌడీలు, గూండాలను పెంచిపోషించడం పరిటాల సునీతకు తగదని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. పోలీసులు కూడా పరిటాల కుటుంబానికి తొత్తులుగా పనిచేయం బాధాకరమన్నారు. మంత్రి తనయడు పరిటాల శ్రీరామ్ సోదరులు మురళీ, బాలాజీలపై పలు హత్యకేసుల్లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదని ఆరోపించారు. ఎస్పీ అశోక్ కుమార్ మంత్రి వర్గీయులు ఆగడాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని ప్రకాష్ రెడ్డి ధ్వజమెత్తారు. -
తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు
కర్నూలు ,కొలిమిగుండ్ల/సంజామల: పసుపు– కుంకుమ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కార్యక్రమం తాము నిర్వహించాలంటే తాము అంటూ పరస్పరం దాడులు చేసుకున్నారు. కొలిమిగుం డ్ల మండలం యర్రగుడి గ్రామ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సాగునీటి సంఘం చైర్మన్ రామాంజనేయులు, నిమ్మకాయల రంగయ్య, చిన్న దస్తగిరి, గుర్విరెడ్డి వర్గీయుల మధ్య మాటలయుద్ధం ప్రారంభమై..చివరకు రాళ్లు రువ్వుకునేంత వరకు వెళ్లింది. దీంతో సమావేశానికి హాజరైన యర్రగుడికి చెందిన నడిపి ఆశీర్వాదం, చాకలి రాముడు, హనుమంతుగుండంకు చెందిన శివమ్మతో పాటు పలువురు లబ్ధిదారులు గాయపడ్డారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీయాల్సి వచ్చింది. సమాచారం అందుకున్న ఎస్ఐ గిరిబాబు గ్రామానికి చేరుకొని ఘటనపై వివరాలు ఆరాతీశారు. సంజామల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చెక్కుల పంపిణీ అనంతరం భోజన సమయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నాయకులు, కార్యకర్తలకు సరిపడా భోజనం లేకపోవడంతో టీడీపీ కార్యకర్తల మధ్య తన్నులాట జరిగింది. -
చెక్కులు తెచ్చిన చిచ్చు
నెల్లూరు, కావలి: కావలి పట్టణంలోని వైకుంఠపురం ప్రాంతంలో సోమవారం పొదుపు మహిళలకు పసుపు – కుంకుమ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు సిగపట్లు పట్టారు. పొదుపు నగదు సక్రమంగా చెల్లించకుండా, చెక్ తీసుకోవడానికి వచ్చావని ఒక గ్రూపులోని మహిళను అదే గ్రూపునకు చెందిన మరో మహిళ ప్రశ్నించడంతో కోపంతో మొదటి మహిళ రెండో మహిళలను చెంప చెళ్లు మనిపించింది. ఇద్దరూ నడిరోడ్డుపై జుట్లు పట్టుకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇంతలో అక్కడ ఉన్న వారంతా వచ్చి ఇద్దరీని విడదీసి పక్కకు నెట్టడంతో వివాదం సద్దుమణిగింది. -
మొన్న అచ్చన్న.. నిన్న చింతమనేని
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో టీడీపీ నాయకులు సహనం కోల్పోతున్నారు. ఎన్నికల్లో ఓడిపోతామనే అభద్రతా భావంతో జనాలపై నోరుపారేసుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు ప్రభుత్వ పథకాలకు అనర్హులు అంటూ దుర్భాషలాడుతున్నారు. పథకాల కింద ప్రజలకు ఇచ్చే డబ్బును తమ సొంత జేబుల నుంచి ఇస్తున్నట్లు పచ్చనేతలు ఫీలైపోతున్నారు. వారం రోజుల క్రితం మంత్రి అచ్చెన్నాయుడు తమ అనుచరుల వద్ద బూతు పురాణం విప్పగా.. నిన్న ప్రభుత్వ విప్, వివాదాస్పద ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఓ వృద్ధుడైన పింఛన్ దారుడిపై చిందులు తొక్కారు. గతంలో చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్ కూడా టీడీపీకి ఓటు వేయకపోతే.. తామేసిన రోడ్లపై నడవద్దని, తామిచ్చే ఫించన్లు, రేషన్ తీసుకోవద్దని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఏంరా వంద యూనిట్లు ఫ్రీగా తీసుకుంటున్నావ్.. మీ ఆవిడ పదివేలు దొబ్బింది. మీ అమ్మ మూడు వేలు తీసుకుంటుంది. రుణమాఫీ వస్తే అది దొబ్బావ్.. ఇవన్నీ దొబ్బి మళ్లీ ఓటేయ్యవా’ అని ప్రజలను నిలదీయాలంటూ తన అనుచరుల వద్ద అచ్చెన్నాయుడు బూతుపురాణం విప్పారు. ఈ వ్యాఖ్యలతో అవాక్కైన ప్రజలు మంత్రి తన సొంత ఇంట్లోని డబ్బులు ఏమైనా ఇస్తున్నారా.. మమ్మల్ని అవమానించేలా ఎలా మాట్లాడుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక సోమవారం దెందులూరు నియోజకవర్గం విజరాయి గ్రామంలో పింఛన్ తీసుకోవడానికి వచ్చిన 75 ఏళ్ల వృద్ధుడిపై ‘నీ కొడుకులు వైఎస్సార్సీపీలో తిరుగుతుంటే పింఛన్ తీసుకోవడానికి నీకు సిగ్గులేదా’ అంటూ చింతమనేని విరుచుకుపడటం హాట్‌టాపిక్ అయింది. అంటే ప్రభుత్వ పథకాలు కేవలం టీడీపీ వారికేనా.. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులకు వర్తించవా? అంటూ ఆ వృద్ధుడి కొడుకులు నిలదీయడంతో చింతమనేని మరింత దౌర్జన్యానికి దిగారు. ప్రమాణం చేయకపోతే చెక్కు లేదు.. సరిగ్గా ఎన్నికల ముందు డ్వాక్రా మహిళల కోసం పసుపు-కుంకుమ చెక్కులంటూ కొత్త డ్రామాకు సీఎం చంద్రబాబునాయుడు తెరలేపగా.. ఆయన అనుచరవర్గం ఈ చెక్కులను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది. టీడీపీకి ఓటు వేస్తామని ప్రమాణం చేస్తేనే చెక్కులిస్తామని హుకుం జారీ చేస్తోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో పసుపు కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో టీడీపీకి ఓటు వేసేందుకు ప్రమాణం చేయడానికి నిరాకరించిన డ్వాక్రా మహిళలపై పరిటాల వర్గీయులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వేయాలంటూ ప్రమాణం చేయించుకోవడం, ప్రమాణం చేయకపోతే చెక్కులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. -
చేతివాటం!
ఎన్నికల తాయిలాల్లో భాగంగా సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన సామాజిక పింఛన్ల పెంపు, పసుపు–కుంకుమ 2 చెక్కుల పంపిణీలో తెలుగుతమ్ముళ్లు సందట్లో సడేమియాలా చేతివాటం ప్రదర్శిస్తున్నారు. మంజూరుకో రేటు పెట్టి వెలుగు సిబ్బంది, తెలుగు తమ్ముళ్లు వసూలు చేస్తున్నారు. మూడు రోజుల పండగ అంటూ ఆర్భాటంగా నిర్వహిస్తున్న గ్రామసభలు అసౌకర్యాల నడుమ మండుటెండలోనిరీక్షణలతో మహిళలు ఇబ్బందిపడుతున్నారు. సాక్షి, నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రామసభలను టీడీపీ నేతల ప్రచార సభలుగా మార్చేసుకుని ఊకదంపుడు ఉపన్యాసాలతో లబ్ధిదారులకు విసుగుపుట్టించారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టిన పసుపు–కుంకుమ 2, సామాజిక పింఛన్ల పెంపు నగదు పంపిణీ గ్రామసభల నిర్వహణ అస్తవ్యస్తంగా సాగుతోంది. పసుపు–కుంకుమ చెక్కులు, పింఛన్ల నగదు ఇవ్వాలంటే తప్పక గ్రామసభలకు హాజరుకావాలంటూ లబ్ధిదారులను పిలిపించి కూర్చోబెట్టి వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని సైతం టీడీపీ ప్రచారసభలుగా మార్చుకుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పంపిణీ అంటూ ప్రచారం చేసుకోవడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. మండుటెండలో కూర్చొనేందుకు కుర్చీలు లేక తాగేందుకునీరు కూడా లేకపోవడంతో మహిళలు సొమ్మసిల్లి పడిపోతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గ్రామసభలనిర్వహణకు రూ.6 వేలు మాత్రమే సెర్ఫ్ నిధులు ఇచ్చినా అవి చేతికి అందకపోవడంతో గ్రామకార్యదర్శులు అప్పులు చేసి సభల నిర్వహిస్తున్నా రు. స్వీటుపేరుతో లబ్ధిదారునికి రూ.15 వంతు న ఇచ్చినా సక్రమంగా పంపిణీ చేయటం లేదు. చెక్కుల పంపిణీకి నేతల కోసం నిరీక్షిస్తూ సాయంత్రం వరకు ఉంచినా లబ్ధిదారులకు భోజన సౌకర్యం కల్పించపోవడంతో ఆకలితో అలమిటిస్తున్నారు. చిలక్కొట్టుడు జిల్లాలోని పలుచోట్ల తెలుగుతమ్ముళ్లు, వెలుగు అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. బుచ్చి రెడ్డిపాళెం మండలంలోని సామాజిక పింఛన్ల పంపిణీలో లబ్ధిదారుల నుంచి రూ.100 వంతు న వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. కలిగిరి మండంలోని పసుపు–కుంకుమ చెక్కులు పంపిణీకి రూ.వెయ్యి వంతున వెలుగు సిబ్బంది, అ«ధికారపార్టీ నేతలు వసూలు చేసినట్లు ఆరోపణలు న్నాయి. స్త్రీనిధి చెల్లింపులు లేవని చెక్‌ల నిలిపివేత బ్యాంకుల్లో రుణాలు చెల్లించలేదని, స్త్రీనిధిరుణాలు సక్రమంగా కట్టలేదని పసుపు–కుంకుమ చెక్కులు నిలిపివేయడం వివాదాస్పదంగా మారింది. ఆత్మకూరు మండలం నలపరెడ్డిపల్లెలో గౌరీ గ్రూపునకు పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీని నిలిపివేశారు. అలాగే సుమారు 50 గ్రూపుల వరకు ఇలాంటి సాకులు చూపి చెక్కుల పంపిణీని నిలిపివేశారు. ♦ విడవలూరు మండలంలో జరిగిన గ్రామసభల్లో అధికారులు కాకుండా స్థానిక టీడీపీ నేతలే చెక్కులు పంపిణీ చేయడంపై వివాదంగా మారింది. ♦ అల్లూరులో నిర్వహించిన గ్రామసభలో జరిగిన తోపులాటలో మహిళ సొమ్మిసిల్లపడిపోయింది. ♦ వెంకటాచలంలో పాతగ్రూపులకే చెక్కుల పంపిణీ చేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
చెవిరెడ్డిపై మరోసారి దాడికి టీడీపీ యత్నం
సాక్షి, తిరుపతి: తిరుపతి రూరల్‌లో సోమవారం జరిగిన పసుపు-కుంకుమ కార్యక్రమం రసాభాసగా మారింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాకుండా చెవిరెడ్డిపై మరోసారి దాడి చేసేందుకు పచ్చ పార్టీ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే, పోలీసుల సాయంతో చెవిరెడ్డి ఈ దాడి నుంచి తప్పించుకున్నారు. సీఎం సొంత జిల్లా అయిన చిత్తూరులో పచ్చ పార్టీ నేతలు ఆదివారం రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు. -
అసలు చంద్రబాబుకు ఎందుకు ఓటెయ్యాలి?
-
‘పోస్ట్ డేటెడ్ చెక్కులు.. ఔట్ డేటెడ్ సీఎం’
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ పేరుతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలను మోసం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నందున పసుపు-కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని మండిపడ్డారు. మహిళల తాళిబొట్టులు తెంపే విధంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని, మహిళల ద్రోహి చంద్రబాబు అని త్రీవస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే రాష్ట్రంలో అక్కచెల్లెమ్మల ఆత్మహత్యలు ఉండేవికావని అన్నారు. పోస్ట్ డేటెడ్ చెక్కులతో ఔట్ డేటెడ్ సీఎం కొత్త నాటకాలకు తెరలేపారని రోజా ఆరోపించారు. టీడీపీ అరాచకాలను తట్టుకోలేని మహిళలు.. మంత్రి పరిటాల సునీతపై చెప్పులు, చీపుర్లతో తిరుగుబాటు చేశారని గుర్తుచేశారు. మహిళలకు న్యాయం చేయలేని సునీత.. వైఎస్ జగన్‌ను విమర్శించడం తగదని హితవుపలికారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేయగల సత్తా మీకు ఉందా ఉందా సవాలు చేశారు. తనకు మరోసారి ఓటు వెయ్యాలని చంద్రబాబు అడుగుతున్నారనీ, ప్రజలకు ఏం చేశారని ఓటు వెయ్యాలని ఆమె ప్రశ్నించారు. నరకాసుర పాలన చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాలని రోజా పిలుపునిచ్చారు. వైస్సార్సీపీ అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలుచేసి తీరుతామని ఆమె హామీ ఇచ్చారు. చిత్తూరు లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డిపై టీడీపీ నేతల దాడిని రోజా ఖండించారు. -
ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు చేదు అనుభవం
ప్రభుత్వ విప్ కూన రవికుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. లోలుగు గ్రామంలో ఆదివారం నిర్వహించతలపెట్టిన పసుపు–కుంకుమ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆయన్ని తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం కార్యకర్తలే అడ్డుకున్నారు. తమ గ్రామానికి ఏం చేశారంటూ నిలదీశారు. కుర్చీలను, ఫైళ్లను గాల్లోకి విసిరారు. టెంట్లను కూల్చేశారు. రవికుమార్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఓ దశలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకే పార్టీలోని ఇరువర్గాలకు చెందిన కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో ప్రత్యేక పోలీసు బలగాలు గ్రామానికి హుటాహుటీన చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. భారీ బందోబస్తు మధ్య రవికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయారు. పసుపు–కుంకుమ కార్యక్రమాన్ని అధికారులు కూడా రద్దు చేసి వెళ్లిపోయారు. శ్రీకాకుళం, పొందూరు: లోలుగు గ్రామంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికార పార్టీకి చెందిన కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు భగ్గుమనడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. పసుపు–కుంకుమ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ టెంట్‌లోకి వచ్చి అందరికీ నమస్కారం అని చెప్పేసరికే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఓ వర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలు విరుచుకుపడ్డారు. రవికుమార్ గో బ్యాక్, రవికుమార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమాన్ని జరిపితే ఒప్పుకోమని హెచ్చరించారు. టెంట్లు పీకిపడేశారు. కుర్చీలను గాల్లోకి ఎగరేశారు. అధికారుల చేతిలో ఉన్న ఫైళ్లను లాక్కొని విసిరేశారు. రవికుమార్‌ను బండ బూతులు తిట్టారు. తమ నాయకుడు శ్రీరాములనాయుడ్ని, గ్రామాన్ని విస్మరించి ఇప్పుడేమో కార్యక్రమానికి వస్తావా అని నిలదీశారు. గ్రామాన్ని సర్వనాశనం చేశావు, భ్రష్టుపట్టించావని ఆవేశంతో ఊగిపోయారు. తోపులాటకు దిగారు. దీంతో టీడీపీలో ఒక వర్గానికి చెందిన వారి నుంచి రవికుమార్‌కు మరో వర్గం వారు రక్షణ కల్పించాల్సి వచ్చింది. మహిళలు, మగవాళ్లు తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేశారు. మాకొద్దీ కార్యక్రమం అంటూ నిరసన వ్యక్తం చేశారు. లోలుగు గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, పొందూరు జెడ్పీటీసీ సభ్యుడు లోలుగు శ్రీరాములు నాయుడుకు విప్ ప్రాధాన్యత ఇవ్వకుండా అదే గ్రామానికి చెందిన కామరాజు వర్గానికి బాసటగా నిలుస్తున్నారనే ఆరోపణలతో ఒక వర్గాన్ని మరో వర్గం తిట్టుకుంటూ, తోసుకుంటూ గొడవను పెంచారు. ఒకానొక దశలో శ్రీరాములునాయుడు, కామరాజు వర్గాయులు కొట్టుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన అక్కడ ఉన్న మండలాధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే ఎచ్చెర్ల నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు లోలుగు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేసింది. అయితే జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములనాయుడు వర్గీయులు మాత్రం అసహనాన్ని, నిరసనను ఆపలేదు. దీంతో మరో టీడీపీ నాయకుడైన మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నెపు రాము, అధికారులు కలిసి ఇరువర్గీయులను శాంతింపజేశారు. మహిళలకు విప్ రవికుమార్‌తో సమస్యలు చెప్పుకొనేందుకు అవకాశం కల్పించారు. మహిళలంతా కూర్చొంటుండగా కొంతమంది కార్యకర్తలు అడ్డు చెప్పడంతో కొద్ది క్షణాల్లోనే మళ్లీ వివాదం రేగింది. మహిళలంతా తమ గ్రామానికి ఏం చేశావంటూ విప్ రవికుమార్‌ను నిలదీశారు. అధికారులు, పోలీసులు ఎంత చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. రవికుమార్ అక్కడ నుంచి వెళ్లిపోయే వరకూ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు రవికుమార్‌ను తన కాన్వాయ్‌లోని కారులో కూర్చోబెట్టి రోడ్డు దాటించేశారు. అయితే రోడ్డు దాటేంత వరకు రవికుమార్ డౌన్ డౌన్ అంటూ ఆయన వ్యతిరేకులు నినాదాలు చేస్తూనే ఉన్నారు. జేఆర్‌పురం సీఐ విశ్వేశ్వరరావు, లావేరు ఎస్సై చిరంజీవి, ఎచ్చెర్ల ప్రత్యేక బలగాలు శాంతి భద్రతలను కాపాడారు. గ్రామంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో మండల ప్రత్యేకాధికారి మెట్ట వెంకటేశ్వరరావు, ఎంపీడీవో చింతాడ లక్ష్మీభాయ్, ఏపీఎం మంగమ్మ, వెలుగు సీసీ శ్యామలరావు కూడా కార్యక్రమాన్ని నిర్వహించకుండానే వెళ్లిపోయారు. -
నిలకడగా చెవిరెడ్డి ఆరోగ్యం..!
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతల చేతిలో దాడికి గురైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కోలుకుంటున్నారు. తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ సిద్దా నాయక్ తెలిపారు. వేదాంతపురంలో ఆదివారం నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకుని, ఇది టీడీపీ కార్యక్రమం అని టీడీపీ నేతలు మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు. -
చిత్తూరు మేయర్ కంటతడి
చిత్తూరు నగరంలో నిర్వహించిన పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమం టీడీపీ నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను బయటపెట్టింది. ఎమ్మెల్యే స్థానంలో ఉన్న వ్యక్తి సూటిపోటి మాటలు అంటుంటే ఓర్చుకోలేని మేయర్ హేమలత కన్నీటి పర్యంతమయ్యారు. సమావేశం మధ్యలోనే అర్ధంతరంగా వెళ్లిపోయారు. చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని 36, 37వ డివిజన్లకు సంబంధించి పసుపు–కుంకుమ చెక్కులు, పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఆదివారం నిర్వహించారు. ఇందులో నగర మేయర్ హేమలత, ఎమ్మెల్యే సత్యప్రభ, ఎమ్మెల్సీ దొరబాబు, కమిషనర్ ఓబులేశు, మేయర్ భర్త కటారి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడుతుండగా పక్కపక్కనే కూర్చున్న ఎమ్మెల్యే సత్యప్రభ మేయర్ హేమలతను ఉద్దేశించి సూటిపోటి మాటలు అంటున్నట్లు అక్కడే ఉన్నవారు చెబుతున్నారు. ‘సౌండ్ సిస్టమ్ ఎందుకు పనిచేయలేదు..? ఏ పనిచెప్పినా చేయడం మీకు చేతగాదు’ అంటూ సత్యప్రభ మేయర్‌తో అన్నారు. అప్పటికే తన భావోగ్వేదాన్ని అదుపులో పెట్టుకున్న మేయర్ హేమలత కమిషనర్‌ను పిలిచి సౌండ్ సిస్టమ్ గురించి నిలదీశారు. మరోసారి ఇలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకుంటామని కమిషనర్ చెప్పడంతో హేమలత కూర్చుకున్నారు. మళ్లీ ఎమ్మెల్యే సత్యప్రభ మేయర్‌తో గొడవపెట్టుకున్నారు. దీంతో మైక్ తీసుకున్న మేయర్ హేమలత నాలుగు మాటలు మాట్లాడి స్టేజి నుంచి దిగుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఏం జరుగుతోందో తెలియని మేయర్ భర్త కటారి ప్రవీణ్ సైతం మేయర్ వెంట నడుస్తూ కళాక్షేత్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన చూసిన సభావేదికపై ఉన్న అధికార పార్టీ నాయకులు, అధికారులు నిచ్చేష్టులయ్యారు. ఇవేమీ లెక్కచేయని ఎమ్మెల్యే సత్యప్రభ మేయర్ లేకపోయినా మహిళా సంఘాలకు చెక్కులు, వృద్ధులకు పింఛన్ల పంపిణీ చేశారు. ఇకమీదట కార్పొరేషన్లో జరిగే కార్యక్రమాలకు తనను పిలవొద్దని కమిషనర్‌కు చెప్పి ఎమ్మెల్యే సైతం వెళ్లిపోయారు. తారాస్థాయికి విభేదాలు ఈ ఘటనతో మేయర్, ఎమ్మెల్యే మధ్య ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరింది. ఇది ఒక్కసారిగా బయటపడ్డ వివాదం కాదు. మున్సిపల్ కార్పిరేషన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫకాల విషయంలో మేయర్‌పై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో చేసిన పనులకు శిలాఫలకంలో అధికారులు తొలి పేరు మేయర్‌ది వేస్తున్నారు. ఇది ఎమ్మెల్యేకు నచ్చడంలేదు. గత నెల గిరింపేట, కొంగారెడ్డిపల్లె ప్రాంతాల్లో నిర్వహించి న జన్మభూమి సభల్లో అలిగిన ఎమ్మెల్యే శిలాఫలకాలు ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. ఇక కార్పొరేషన్లో జరుగుతున్న రూ.కోట్ల పనులను ఎమ్మెల్యే తన అనుచరులకు కట్టబెడుతున్నా అడ్డుచెప్పడంలేదని మేయర్ వర్గం ఆరోపిస్తోంది. తనకు నచ్చని ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి రూ.కోట్ల విలువైన పనులు ఇవ్వడాన్ని ఎలా ప్రోత్సహిస్తామని ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. ఇక నిఘా వర్గాల నివేదికల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకత, మేయర్‌కు సానుకూలత ఉందనే వివరాలు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారన్నది ఎమ్మెల్యే వర్గం ఆరోపణ. పైగా కళాక్షేత్రంలో సౌండ్ సిస్టమ్‌కు రూ.30 లక్షల బిల్లులు ఇటీవల ఇచ్చినా సరిగా పనిచేయలేదని ఎమ్మెల్యే చెప్పడం, మీరు చెప్పిన వారికే పనులు ఇచ్చామని మేయర్ చెబుతుండడం కొసమెరుపు. -
చెవిరెడ్డిపై విచక్షణా రహితంగా దాడి
-
చెవిరెడ్డిపై టీడీపీ నేతల దాడి
తిరుపతి రూరల్: సీఎం సొంత జిల్లా చిత్తూరులో పచ్చ నేతలు మరోసారి రెచ్చిపోయారు. చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం వేదాంతపురంలో ఆదివారం అధికారికంగా నిర్వహించిన పసుపు–కుంకుమ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిపై దాడికి పాల్పడ్డారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే హోదాలో ప్రసంగిస్తున్న ఆయన్ని అడ్డుకున్నారు. ఇది టీడీపీ కార్యక్రమం అని, ఇందులో మీ ప్రసంగాలు ఏంటని? మైక్ కట్ చేయించారు. అధికారులు వారిస్తున్నా వినకుండా చెవిరెడ్డి పట్ల దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎమ్మెల్యే చెవిరెడ్డికి పోలీసులు, మహిళలు రక్షణగా నిలిచారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులు, మహిళలపై రాళ్లు, కారం పొడి, స్వీట్ ప్యాకెట్లతో దాడి చేశారు. దాడిలో ఎమ్మెల్యేతో పాటు తిరుపతి వెస్ట్ డీఎస్పీ, ఎంఆర్ పల్లి సీఐ, ముగ్గురు మహిళలకు గాయాలు అయ్యాయి. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాటలో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సృహతప్పి కింద పడ్డారు. ఉలిక్కిపడిన పోలీసులు గొడవ చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. సృహ తప్పిన ఎమ్మెల్యేని పోలీసులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చెవిరెడ్డికి శ్వాస తీసుకోవటంలోనూ, బీపీ ఇబ్బందులు రావటంతో రుయా అత్యవసర విభాగంలో వైద్య పరీక్షలు చేశారు. కాగా ప్రభుత్వ ఖర్చులతో నిర్వహిస్తున్న అధికార కార్యక్రమం పసుపు–కుంకుమను టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ పార్టీ కార్యక్రమంగా ప్రచారం చేసుకుంటూ దౌర్జన్యాలకు దిగడం మరోసారి బయటపడింది. ఫోన్లో పరామర్శించిన జగన్: రుయాలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలతోనే ఉండు, నీకు అండగా మేమున్నాం... అంటూ ధైర్యం చెప్పారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు ఆసుపత్రికి వచ్చి ఎమ్మెల్యే చెవిరెడ్డిని పరామర్శించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను తెలుసుకున్న నియోజకవర్గంలోని చెవిరెడ్డి అనుచరులు, అభిమానులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రుయా ఆసుపత్రికి తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
తెనాలి పసుపు కుంకుమ కార్యక్రమంలో అపశృతి
-
పింఛన్ల పరిహాసం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: జిల్లాలో పింఛన్లు, పసుపు–కుంకుమ చెక్కుల పంపిణీ పేరుతో లబ్ధిదారులను టీడీపీ నేతలు పరిహాసం చేశారు. ప్రభుత్వ సొమ్మును తమ జేబులో నుంచి తీసి ఇస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. వృద్ధులను, వికలాంగులను గంటల తరబడి వేచి ఉండేలా చేసి, తమ దయాదాక్షిణ్యం అన్నట్టుగా పంపిణీ చేశా రు. ఈ క్రమంలో చాలామంది లబ్ధిదారులు ఇబ్బంది పడ్డారు. ముడుపులకు కక్కుర్తి పడిన జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు ఇదే అ వకాశంగా చెలరేగి పోయారు. ఎప్పటి మాదిరిగానే పింఛ న్ల లబ్ధిదారుల నుం చి చేతివాటం ప్రదర్శించారు. ఒక్కొక్కరి వద్ద రూ.200 నుంచి రూ.500 వరకూ కమీషన్లు వసూలు చేశారు. కాకినాడ సిటీలోనైతే బాధిత పింఛన్‌దారులు మీడియా ముందుకొచ్చి తమ గోడు బహిరంగంగా చెప్పారు. జన్మభూమి కమిటీ సభ్యురాలు జగదాంబ తమ నుంచి రూ.రెండేసి వందల చొప్పున తీసుకున్నారని లబ్ధిదారులు వరుసగా నిలబడి బాహాటంగానే చెప్పారు. ఇదే తరహాలో జిల్లాలోని మిగతాచోట్ల కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున పింఛన్ ఇస్తున్నామని.. ఇదంతా తమ చలవేనని.. ముడుపులు ముట్టజెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ టీడీపీ నాయకులు వసూళ్లకు దిగారు.కాకినాడ కార్పొరేషన్ పరిధి 24వ డివిజన్ ముగ్గుపేటలో పింఛన్ లబ్ధిదారుల వద్ద స్థానిక టీడీపీ నేత, జన్మభూమి కమిటీ సభ్యురాలు గుత్తుల జగదాంబ ఒక్కొక్కరి నుంచి రూ.200 చొప్పున వసూలు చేశారని లబ్ధిదారులు చెప్పారు. కాకినాడ రూరల్ నేమాం గ్రామంలో పసుపు–కుంకుమ చెక్కులను యానిమేటర్ గంగాభవాని తనతో తీసుకువెళ్లిపోవడంపై డ్వాక్రా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బైఠాయించారు. ఎంతకీ చెక్కులు ఇవ్వకపోవడంతో 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యానిమేటర్ నుంచి చెక్కులు తీసుకుని పంపిణీ చేయాలని ఆదేశించారు. డ్వాక్రా రుణాలు మంజూరు చేసినప్పుడు రూ.లక్షకు రూ.5 వేల చొప్పున తీసుకుంటున్నారని ప్రత్యేకాధికారికి ఫిర్యాదు చేశారన్న అక్కసుతోనే గంగాభవాని చెక్కులు పంపిణీ చేయకుండా తనతో తీసుకువెళ్లిపోయారని మహిళలు ఆరోపించారు. అల్లవరం మండలం ఎంట్రుకోనలో పసుపు– కుంకుమ పథకంపై మాట్లాడమని ఓ మహిళకు మైకు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు రుణమాఫీ చేస్తామన్న జాబితాలో తన పేరు ఉన్నా రుణమాఫీ కాలేదని చెప్పింది. రూ.లక్షన్నర అప్పు ఉంటే బంగారం అమ్మి రూ.2.50 లక్షలు వడ్డీ సహా చెల్లించానని చెప్పడంతో టీడీపీ నాయకులు ఆమెను అడ్డుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని పలుచోట్ల ‘‘ఇదిగో ఈ మూడు వేలు నీకు తీసుకో. చంద్రబాబు ఇస్తున్నారు. ఆయనకే ఓటు వెయ్యి’’ అంటూ టీడీపీ నాయకులు పసుపు–కుంకుమ, పింఛన్ల పంపిణీ గ్రామసభలను ఓట్ల కొనుగోలు సభల్లా మార్చేశారు. ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ వచ్చేలోగా లబ్ధిదారులు వెళ్లిపోకుండా ఉండేందుకు వారి పాస్ పుస్తకాలు లాక్కున్నారు. గండేపల్లి మండలంలోని కొన్ని గ్రామాల్లో దివ్యాంగులకు జనవరిలో పెంచిన రూ.1,500, ఫిబ్రవరిలో రూ.3 వేలు కలిపి రూ.4,500 ఇవ్వాల్సి ఉండగా పుస్తకంలో అంతే మొత్తం నమోదు చేశారు. లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చారు. కొత్త పింఛనుదారులకు రూ.3 వేలకు బదులు రూ.2 వేలు మాత్రమే ఇచ్చారని పలువురు ఆరోపించారు. అధికారులు లేకుండా అధికార పార్టీ కార్యకర్తలే లబ్ధిదారులకు సొమ్ములు ఇచ్చి, సంతకాలు చేయించుకుని, వేలిముద్రలు వేయించుకున్నారు. ఇంకా పలుచోట్ల పదవుల్లో లేని టీడీపీ నేతలు ప్రభుత్వ సొమ్మును తమ సొంత నగదులా పంపిణీ చేశారు. ఇదంతా తమ సొమ్మని, చంద్రబాబుకు ఓటెయ్యకపోతే తీసేస్తామని కొన్నిచోట్ల బెదిరింపులకు దిగారు. రాజమహేంద్రవరం నగరం హరిపురంలో పసుపు–కుంకుమ సొమ్ములు ఇచ్చి, టీడీపీకే ఓట్లు వేయాలని ఒట్లు వేయించుకోవడంతో ప్రజలు విస్తుపోయారు. -
ఇదేంటి బాబు?
చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన రెట్టింపు పింఛన్లు.. పసుపు కుంకుమ నిధుల పంపిణీలో ప్రజలకు స్థానిక టీడీపీ నేతలు ఉచితంగా భోజనాలు పెట్టారు. భోజనంతో పాటు పెట్టిన అప్పడాలపై సీఎం చంద్రబాబు ఫొటోలు ముద్రించి పంచిపెట్టారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం తప్పుకాదు కానీ ఉచితంగా పెట్టే తిండిపై కూడా నేతల ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడ మేంటని పలువురు మండిపడుతున్నారు. – చిత్తూరు అర్బన్ అప్పడాలపై ముద్రించిన చంద్రబాబు చిత్రం -
పింఛన్‌పై వంచన
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఎన్నికల ప్రచారాన్ని తలపించింది. లబ్ధిదారులకు చెక్కులు, పింఛన్లు పంపిణీ చేసే సమయంలో టీడీపీ నేతలు ఈసారి ఓటు ఎవరికి వేస్తావు? అంటూ ప్రశ్నించడం కనిపించింది. టీడీపీకి వేస్తానంటే ఓకే.. తటపటాయిస్తే ఒత్తిడి తేవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లా ఉన్నతాధికారులు కూడా టీడీపీ కార్యకర్తల్లా పనిచేయడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రచార ఆర్భాటాల కోసం ప్రజాధనానికి తూట్లుపొడవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. సాక్షి, తిరుపతి: ఎన్నికలు సమీపిస్తుండడంతో ఓట్ల కోసం టీడీపీ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. పసుపు, కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు పోస్ట్‌డేటెడ్ చెక్కులు, వృద్ధులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను శనివారం పంపిణీ చేసింది. సాధారణంగా పింఛన్లను అధికారులే లబ్ధిదారులకు పంపిణీ చేసేవారు. శనివారం చేపట్టిన కార్యక్రమాన్ని అందుకు భిన్నంగా ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసిన వేదికలను పూర్తిగా పార్టీ జెండాలు, పసుపు బ్యానర్లు, పార్టీ నాయకుల ఫ్లెక్సీలతో నింపేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి బంధువులు, లబ్ధిదారులందర్నీ పసుపురంగు దుస్తులతో కార్యక్రమానికి హాజరు కావాలని హుకుం జారీచేశారు. తప్పని పరిస్థితుల్లో అనేకమంది పసుపు రంగు దస్తులతో రావడం కనిపించింది. పెన్షన్‌దారులు, డ్వాక్రా సభ్యులకు చేతిలో డబ్బు, చెక్కులతో పాటు పార్టీ ప్రచార పత్రాన్ని పెట్టి టీడీపీకి ఓటెయ్యండి అని అడగడం కనిపించింది. చంద్రబాబు గురించి చెప్పిందే చెప్పి లబ్ధిదారులను ఉక్కిరిబిక్కిరి చేశారు. లబ్ధిదారులకు తిప్పలు వృద్ధులు, వితంతువులు, మహిళలపై టీడీపీ నేతలు దౌర్జన్యం, దబాయింపుల తీరు స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. పింఛన్లు, చెక్కుల కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు, వృద్ధులకు టీడీపీ నాయకులు, అధికారులు చుక్కలు చూపించారు. లబ్ధిదారులను ఉదయం 9 గంటలకు రమ్మని చెప్పి టీడీపీ నేతలు ఆలస్యంగా రావడం కనిపించింది. దాదాపు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన కార్యక్రమాలు అన్నీ ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అధికార పార్టీ నేతలు రాకపోవడంతో సభలను సకాలంలో నిర్వహించలేదు. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల తల్లులు గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో వృద్ధులకు కుర్చీలు లేకపోవడంతో నిలబడే కనిపించారు. తిరుపతిలో జరిగిన కార్యక్రమాలు సాయంత్రం వరకు సాగాయి. అనేక చోట్ల లబ్ధిదారులు సాయంత్రం వరకు అక్కడే ఉన్నా పట్టించుకునేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదిలాఉంటే టీడీపీ నేతలు పోటీపడి ఒకరు డబ్బులు, మరొకరు పెన్షన్ బుక్కు, ఇంకొకరు స్వీటు, ప్రచార పత్రాలను పంచారు. కార్పొరేషన్ ఉద్యోగులను పక్కకు నెట్టి టీడీపీ నేతలు పంపిణీ చేపట్టడంతో చేసేదిలేక ఉద్యోగులు మిన్న కుండిపోయారు. జిల్లాలో అనేక ప్రాం తాల్లో లబ్ధిదారులు ఆకలితో అలమటిం చాల్సి వచ్చింది. కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం కావడం, టీడీపీ నేతలు చెప్పిందే చెప్పి సమయాన్ని వృథా చేయడం వచ్చినవారి సహనాన్ని పరీక్షించింది. కార్యక్రమం ఆలస్యం అవుతుందని తెలిసి కూడా లబ్ధిదారులకు కొన్ని ప్రాంతాల్లో భోజనాలు ఏర్పాటు చేయకపోవడంతో వృద్ధులు, వికలాంగులు ఆకలితో అలమటించారు. సాయంత్రం వరకు కడుపు మాడ్చుకుని వేచి ఉన్నా కొందరికి చెక్కులు, పింఛన్లు ఇవ్వకుండా మరుసటి రోజు రండి అని చెప్పి తిప్పి పంపడం గమనార్హం. పింఛన్ పాట్లు ఎన్నో బంగారుపాళ్యం మండలంలో జరిగిన పసుపు, కుంకుమ చెక్కుల పంపిణీలో ఎంపీపీ, ఏపీఎం, సంఘమిత్రలు వివాదాస్పద వాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ సానుభూతి గ్రూప్ సభ్యులకు చెక్కులు, పింఛన్లు నిలిపివేయమని ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన పసుపు, కుంకుమ పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే చెవిరెడ్డిని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమానికి హాజరయ్యేవారందరికీ పింఛన్లు, చెక్కులు ఇస్తామని చెప్పి టీడీపీ నాయకులు పిలి పించుకున్నారు. సమావేశం అయ్యాక కొందరికి మాత్రం ఇచ్చి మిగిలిన వారిని తిప్పి పంపేశారు. పాలసముద్రం మండలంలో పింఛన్‌దారుల వద్ద వేలిముద్రలు తీసుకుని డబ్బులు ఇవ్వకుండా వెనక్కు పంపించారు. పెనుమూరు, కార్వేటినగరం మండలాల్లో పింఛన్ల కోసం వచ్చిన లబ్ధిదారులకు భోజనాలు లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వచ్చింది. చంద్రగిరి, పీలేరు, చిత్తూరు నియోజకవర్గాల్లో కార్యక్రమానికి హాజరైన వారంతా పస్తులతో అలమటించారు. మదనపల్లెలో భోజనాలు వడ్డించేవారు లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలమనేరు నియోకవర్గంలో మాత్రం లబ్ధిదారులకు బిర్యానీ అన్నం, కోడిగుడ్లు పెట్టారు. కుప్పంలో వృద్ధులు, మహిళలు గంటల తరబడి నిరీక్షించి వెనుదిరిగి వెళ్లారు. మరికొందరు చాలీచాలని భోజనాలతో తిప్పలు పడ్డారు. -
ప్రజాప్రతినిధులకు చుక్కెదురు
యల్లనూరు : పసుపు కుంకుమ చెక్కుల పంపిణీలో శింగనమల ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణికి చేదు అనుభవం ఎదురైంది. సీనియారిటీ ఉన్నా తమకెందుకు చెక్కులు ఇవ్వడం లేదంటూ మహిళలు చుట్టుముట్టారు. అంతే కాదు తాగునీరు తదితర సమస్యలపైనా నిలదీశారు. యల్లనూరు మండలం నీర్జాంపల్లి, వాసాపురం, యల్లనూరు గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, డ్వాక్రా మహిళలకు పసుపుకుంకుమ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విప్, ఎమ్మెల్సీ హాజరయ్యారు. నీర్జాంపల్లిలో వెంకటేశ్వర డ్వాక్రా సభ్యులు సీనియారిటీ కలిగిన తమ సంఘానికి పసుపు కుంకుమ డబ్బు ఎందుకు మంజూరు కాలేదో చెప్పాలని పట్టుబట్టారు. అదే గ్రామానికి చెందిన రాముడు అనే వ్యక్తి తన కూతురుకు పెళ్లయ్యి ఆరు నెలలు దాటినా ‘పెళ్లి కానుక’ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణమే పరిష్కరించాలని పలువురు మహిళలు నిలదీశారు. సమస్యలపై ప్రజలు ప్రశ్నల వర్షంతో విప్, ఎమ్మెల్సీకి ముచ్చెమటలు పట్టించారు. చెరువులు నింపకపోవడం వల్లే నీటి ఎద్దడి పుట్లూరు: పుట్లూరు మండలం కోమటికుంటలో పసుపు కుంకుమ కార్యక్రమానికి వస్తున్న విప్ యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణిల కాన్వాయ్‌ను చెరువు కట్టపైనే గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబితే ఏనాడైనా పట్టించుకున్నారా అంటూ మండిపడ్డారు. తమ కష్టాలను స్వయంగా చూడాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో వారు గ్రామస్తులతో కలిసి గ్రామంలో పర్యటించి పరిస్థితిని అంచనా వేశారు. అనంతరం ఎస్సీ కాలనీలోని ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలోనూ ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. చెరువులను నీటితో ఎందుకు నింపలేదని ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యే డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో తాడిపత్రి రూరల్ సీఐ నారాయణరెడ్డి, ఎస్ఐ వంశీకృష్ణ, స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి నిరసనకారులను సభా ప్రాంగణం నుంచి దూరంగా పంపించేశారు. సమస్యలపై ప్రశ్నించినందుకు దాడియత్నం కళ్యాణదుర్గం: సమస్యలపై ప్రశ్నించేందుకు వచ్చిన వారిపై టీడీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన సంఘటన కొత్తూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పసుపు– కుంకుమ కార్యక్రమం కింద మహిళలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి హాజరయ్యారు. స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఎర్రిస్వామి, లక్ష్మన్న తదితరులు సభ వద్దకు వెళ్లి గ్రామంలోని అంగన్వాడీ భవనం దుస్థితిపై ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అంతలోగా టీడీపీ కార్యకర్తలు సారాయి గోవిందప్ప, ఊరబావి నరసింహులు, ఐదుకల్లు పాతలింగతో పాటు మరికొందరు గుంపుగా వచ్చి అడ్డుకున్నారు. వాగ్వాదం చేస్తూ తోపులాటకు దిగారు. చివరకు దాడికి యత్నించారు. ఈ ఘర్షణను చిత్రీకరిస్తున్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌ను లాక్కుని దృశ్యాలను తొలగించారు. ఘర్షణ జరుగుతుండటంతో ఎమ్మెల్యేతో పాటు మరికొంతమంది నాయకులు అక్కడి నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. చిత్రం.. ‘వంద’ గోవింద రొళ్ల: ఎన్టీఆర్ భరోసా పింఛన్లను రెట్టింపు చేసినందున లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటాన్ని తీసుకెళ్లాలని తెలుగుదేశం నాయకులు హుకుం జారీ చేశారు. ఫొటోగ్రాఫర్ల ముసుగులో టీడీపీ నాయకులు కొత్త దందాకు తెరలేపారు. రొళ్ల మండలం హొట్టేబెట్ట, రొళ్ల, హులికుంట పంచాయతీ కేంద్రాల్లో శనివారం పింఛన్ల పంపిణీ చేపట్టారు. చంద్రబాబు ఫొటో కోసం పింఛన్ దారుల నుంచి పొటోగ్రాఫర్లు రూ.100 చొప్పున వసూలు చేశారు. ఫొటో తీసుకుంటేనే పింఛన్ ఇస్తామని.. లేకుంటే లేదని ఖరాకండిగా చెప్పారు. చేసేదిలేక పింఛన్‌దారులు వంద సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇలా రొళ్ల మండలంలో 4,636 మంది పింఛన్‌దారుల నుంచి రూ.4,63,600 వసూలు చేయడానికి శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే తరహాలో చంద్రబాబు ఫొటో పేరిట వంద రూపాయలు బాదుతున్నారు. -
అనంతపురం పసుపు, కుంకుమ కార్యక్రమంలో వాగ్వాదం
-
పసుపు–కుంకుమకు సబ్‌ప్లాన్ నిధులు
సాక్షి, అమరావతి: పసుపు–కుంకుమ పథకానికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధుల్ని మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో అమలు చేస్తున్న ఈ పథకంలో భాగంగా మహిళలకు ఇచ్చేది అప్పు మాత్రమేనని ఒకవైపు చర్చ జరుగుతుండగా.. మూడు విడతల్లో మొత్తం రూ. 2137.66 కోట్ల ఎస్సీ, ఎస్టీ నిధుల్ని మళ్లించేందుకు సిద్ధమయ్యారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులకు ఆర్థిక శాఖ ప్రత్యేక పద్దు నిర్వహిస్తుండగా.. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల నుంచి రూ.1668.60 కోట్లను, ఎస్టీ సబ్‌ప్లాన్ నుంచి రూ. 469.06 కోట్లను పసుపు– కుంకుమ పథకానికి ఖర్చు చేయనున్నారు. మొదటి విడతలో ఫిబ్రవరి 1న మహిళలకు ఇస్తున్న చెక్కులకు డబ్బుల కోసం ఆ రెండు సబ్‌ప్లాన్ పద్దుల నుంచి రూ.534.41 కోట్లు ఇప్పటికే ట్రెజరీల ద్వారా విడుదలకు ప్రభుత్వం అనుమతించింది. బాబును పొగిడేందుకు మరో రూ. 30 కోట్లు పసుపు–కుంకుమ పథకంపై ఊరూరా ప్రచారం కోసం ప్రభుత్వ ఖజానా నుంచే మరో రూ.31.60 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధమయ్యారు. గ్రామాల్ని మండలాల వారీగా మూడుగా విభజించి మూడ్రోజుల పాటు ఊరూరా చంద్రబాబును పొగిడేందుకు సభలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో వార్డుల వారీగా మూడ్రోజులు కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి నెలా 1 నుంచి 5 తేదీల మధ్య జరగాల్సిన పింఛన్ల పంపిణీని నిలిపేసి.. ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో గ్రామాలు, వార్డుల్లో జరిగే సభల్లోనే వాటిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారుల్ని ఆదేశించింది. ఈ సభల్లో సీఎం చంద్రబాబును బాగా పొగిడేవారిని ప్రత్యేకంగా సన్మానించాలని సెర్ప్ సీఈవో కృష్ణమోహన్ జిల్లా అధికారులకు సూచించారు. ఊరూరా సభల నిర్వహణకు ఖర్చుయ్యే రూ. 31.60 కోట్లను డ్వాక్రా సంఘాల బలోపేతానికి ఇచ్చే రివాల్వింగ్ ఫండ్, సంఘాల్లోని మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఎన్ఆర్ఎల్ఎం నిధులను మళ్లించారు. -
పసుపు-కుంకుమకు సబ్ ప్లాన్ నిధులు
-
‘సాక్షి’పై టీడీపీ అక్కసు
సాక్షి నెట్వర్క్ : పసుపు–కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ‘సాక్షి’ ఆధారాలతో సహా బయటపెట్టడంతో టీడీపీ అధిష్టానం ఉలిక్కి పడింది. సాధారణ ఎన్నికలకు మరో మూడు నెలలు ఉందనగా డ్వాక్రా సంఘాలను మభ్యపెట్టేందుకు సర్కారు మొదలెట్టిన గిమ్మిక్కులను ‘పసుపు–కుంకుమ డప్పు.. అక్షరాలా అప్పే!’ శీర్షికతో సాక్షి పత్రిక బుధవారం కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. పత్రికా స్వేచ్ఛను మంటగలిపేలా ‘సాక్షి’ ప్రతులను దహనం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జరిగిన నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ పాల్గొనడం గమనార్హం. మహిళలను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే పసుపుకుంకుమ అందిస్తున్నామని పేర్కొన్నారు. మరోవైపు టీడీపీ నాయకుల తీరును ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. మీడియా కథనాలు తప్పు అని నిరూపించడానికి ఏమీ లేకనే ఇలా అక్కసు వెళ్లగక్కుతున్నారని, దీనినిబట్టి ఇది మోసపూరిత ‘పథక’మని అర్ధమౌతున్నదని విశ్లేషకులంటున్నారు. పత్రికా స్వేచ్ఛను కాపాడి, అధికార తెలుగు దేశం పార్టీ నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలంటూ పలువురు నేతలు కాణిపాకం వరిసిద్ది వినాయక స్వామి వారికి వినతి పత్రం అందజేశారు. కాగా పత్రిక ప్రతులను దహనం చేయడాన్ని పలు జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. -
‘పసుపు– కుంకుమ’ వద్దే వద్దు
కర్నూలు,ఆత్మకూరు: పసుపు– కుంకుమ పథకం తమకు వద్దే వద్దని, తాము టీడీపీ కండువా ఎట్టి పరిస్థితుల్లోనూ కప్పుకునేది లేదని పొదుపు మహిళలు తెగేసి చెప్పారు. డబ్బు కోసం తాము టీడీపీ కండువా ఎట్టి పరిస్థితుల్లో కప్పుకునేది లేదని స్పష్టం చేశారు. ఆత్మకూరు పట్టణం చిట్యాల వీధిలోని గంగమ్మ గుడి వద్ద పొదుపు ఐక్య సంఘాల లీడర్లు బుధవారం సమావేశాన్ని నిర్వహించారు. పసుపు– కుంకుమ కింద రూ.10 వేలు కావాలంటే టీడీపీ కండువా వేసుకోవాలని ఆ పార్టీకి చెందిన పొదుపు ఐక్య సంఘం సభ్యులు సరోజ, లక్ష్మీదేవి, ఈడిగ శేషమ్మ, సుశీలాబాయి చెప్పారు. దీంతో మిగతా సభ్యులు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొదుపు సమావేశామా..ఇది రాజకీయ సమావేశామా చెప్పండి’ అంటూ ప్రశ్నించారు. రాజకీయ సమావేశం అయితే సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చే రూ.10 వేలు సొమ్ము తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. సుభద్రమ్మ అనే ఐక్య సంఘం లీడర్ టీడీపీ కండువా కప్పుకుంటే చాలు.. రూ.10 వేలు ఇస్తామని టీడీపీ పొదుపు మహిళలు చెప్పారు. దీంతో సుభద్రమ్మ స్పందిస్తూ..తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పని చేయబోనని, తనకు ఆ డబ్బులు అవసరం లేదని చెప్పారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వచ్చినా ఇదే విషయం చెబుతామన్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యేతోనే తాడోపేడో తేల్చుకుంటామని సమావేశం నుంచి బయటకు వచ్చారు. కాగా..ఆత్మకూరు పట్టణం చిట్యాల వీధిలో 20 పొదుపు మహిళాసంఘాలు ఉన్నాయి. వీటిలో 220 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. మొత్తం పొదుపు 20 గ్రూపులకు లీడర్‌గా సుభద్రమ్మ ఉన్నారు. రూ.10 వేలు అవసరం లేదు పొదుపులో ఉన్నవారందరికీ పసుపు– కుంకుమ కింద రూ.10 వేలు ఇస్తామన్నారు. టీడీపీ కండువా వేసుకుంటేనే డబ్బు ఇస్తామని ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఆ డబ్బే మాకు వద్దే వద్దు.– సలాంబీ భయపడేది లేదు పార్టీ మారకపోపతే రూ.10వేలు ఇవ్వబోమని ఎమ్మెల్యే బుడ్డా రాజేశేఖర్ రెడ్డి చెప్పమనండి. ఇది పొదుపు సమావేశామా? రాజకీయ సమావేశమా? సరోజ, లక్ష్మీదేవి లాంటి మహిళలకు భయపడేది లేదు. టీడీపీ కండువాలు కప్పుకునేది లేదు. – జయమ్మ -
పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి?
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాపు రిజర్వేషన్లకు చట్టబద్ధత అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాకు తెరలేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చెబుతున్న కాపులకు 5 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత అనేది పచ్చి అబద్ధం అన్నారు. చట్టాలను వక్రీకరించి రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం బూటకమన్నారు. ఎన్నికల నేపథ్యంలో కాపులను మళ్లీ మోసం చేసేందుకే రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి? ‘పసుపు కుంకుమ’ పేరుతో మరోసారి డ్వాక్రా మహిళలను మోసం చేయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని అంబటి ఆరోపించారు. ‘చంద్రబాబు నాయుడు డ్వాక్రామహిళలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామంటున్నారు. అప్పుగా ఇచ్చి డ్వాక్రా మహిళలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాక వాటిని ఇచ్చే పరిస్దితి ఉండదు. అటువంటప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తే లాభమేంటి’ అని అంబటి ప్రశ్నించారు. గత ఎన్నికల్లో రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన చంద్రబాబు.. ఇప్పుడు పసుపు కుంకుమతో మోసం చేయడానికి సిద్ధపడ్డారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు వైఎస్ జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే డ్వాక్రా మహిళలకు ఎంత బాకీ ఉంటే అంత డబ్బును చేతుల్లో పెడతామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు. హోదా కోసం బాబు పోరాటం అంటే ఎవరు నమ్ముతారు ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే అద్భుతం అని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అఖిలపక్షం పేరుతో హడావుడి చేస్తున్నారని అంబటి విమర్శించారు. ప్యాకేజీ ఇచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, అరుణ్ జైట్లీని సన్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. హోదా కోసం బంద్‌లు చేస్తే వైఎస్సార్సీపీ నేతలను జైల్లో పెట్టించిన విషయాన్ని ప్రజలు మర్చిపోరన్నారు. ప్రత్యేక హోదా అంటే జైల్లో పెడతామని బెదిరిచిన చంద్రబాబు.. ఇప్పుడు హోదా కోసం పోరాటం అంటే నమ్మడానికి ప్రజలేం అమాయకులు కాదన్నారు. హోదా కోసం మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్యర్యంలో జరిగే సమావేశానికి వైఎస్సార్సీపీ హాజరుకావడం లేదని చెప్పారు. ఉండవల్లికి తాము వ్యతిరేకం కాదని.. ఆంధ్రులను మోసం చేసిన టీడీపీ, జనసేన నేతల మధ్య కూర్చోవడం ఇష్టం లేకనే అఖిలపక్ష సమావేశానికి హాజరు కావడంలేదని పేర్కొన్నారు. రేపు చంద్రబాబు పెట్టిన అఖిలపక్ష సమావేశానికి కూడా తమ పార్టీ హాజరుకావడం లేదని చెప్పారు. బోగస్ సర్వేల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఎన్నికల వేళ బోగస్ సర్వేల పేరుతో ప్రజలను గందరగోళ పరచడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని అంబటి ఆరోపించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, లగడపాటి రాజగోపాల్‌లు అర్థరాత్రి చంద్రబాబును కలవాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. బోగస్ సర్వేల పేరుతో వైఎస్సార్సీపీని దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. బోగస్ సర్వేలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
డ్వాక్రా మహిళలకు మరో వల!
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): పసుపు–కుంకుమ పేరుతో టీడీపీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ తాడేపల్లిగూడెం పట్టణంలో చురుగ్గా సాగుతోంది. టీడీపీ సభ్యత్వ నమోదు అంటే డ్వాక్రా మహిళలు స్పందించరనే ఉద్దేశంతో పసుపు–కుంకుమ పేరుతో ఎరవేసినట్టు తెలుస్తోంది. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి నుంచి రూ.100 వసూలు చేస్తున్న తంతు పట్టణంలోని అన్ని వార్డుల్లో కనిపిస్తోంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు డ్వాక్రా రుణమాఫీ అంటూ మహిళలను మోసగించి అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో మూడు విడతలుగా రూ.10 వేలు మాత్రమే అందించారు. మరలా సాధారణ ఎన్నికల రానుండటంతో డ్వాక్రా మహిళలను మభ్యపెట్టేందుకు మరో రూ.10 వేలు, సెల్‌ఫోన్ ఇస్తామంటూ మాయోపాయానికి తెరదీశారు. దీంతో డ్వాక్రా మహిళలు ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డులతో వార్డుల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో పేర్ల నమోదు ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఈ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. నమోదు చేస్తున్న నిర్వాహకులు ఆన్లైన్ పద్ధతి కాకుండా స్లిప్ ఇచ్చే పద్ధతిని అవలంబిస్తున్నారు. డ్వాక్రా మహిళలు ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారు. 10 మంది గ్రూపునకు రూ.1,000 వసూలు చేస్తున్నారు. రూ.100 చెల్లించిన వారికి పసుపు రంగు స్లిప్ (సభ్యత్వ నమోదు రసీదు) ఇస్తున్నారు. పసుపు–కుంకుమలో భాగంగా రూ.10 వేలు, సెల్‌ఫోన్ వస్తుందనే ఉద్దేశంతో రూ.100 చెల్లించేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. అయితే ఈ వ్యవహారం జరిగే ప్రాంతాల్లో టీడీపీ వార్డు ప్రతినిధులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
అప్పు ఇస్తూ ఎన్నికల డప్పు!
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మహిళలను మోసగించడానికి ఎత్తులు వేస్తున్నారు. పట్టపగలే చుక్కలు చూపిస్తూ మరోసారి అధికారంలోకి రావడానికి పాచికలు విసురుతున్నారు. రుణాలు ఎవరూ కట్టాల్సిన అవసరం లేదని, అధికారంలోకి రాగానే ‘మాఫీ’ చేస్తామని 2014 ఎన్నికల ముందు చెప్పిన ఆయన అధికారంలోకి వచ్చాక మాఫీ చేసిన తీరు చూసి అటు రైతులు, ఇటు డ్వాక్రా సంఘాల మహిళలు నిర్ఘాంతపోయారు. ఆయన మాటలు నమ్మి అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు నాలుగున్నరేళ్ల తర్వాత.. ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్న సమయంలో మరోమారు మహిళలకు ఎన్ని‘కల’ తాయిలాలు ప్రకటిస్తున్నారు. అధికారంలోకి రావాలని కొత్త ఎత్తుగడ సీఎం చంద్రబాబు తాజాగా ‘పసుపు – కుంకుమ’ కింద ఒక్కో డ్వాక్రా మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం అప్పుగా ఇస్తున్నప్పటికీ, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పడం లేదు. రాష్ట్రంలోని 93.80 లక్షల మందికి రూ.9,380 కోట్లు ఇస్తామని చెప్పారు. ఫిబ్రవరిలో తొలిదఫాలో రూ.2,500, రెండో దఫాలో రూ.3,500, మూడో దఫాలో రూ.4 వేల చొప్పున మహిళల ఖాతాల్లో జమ అయ్యేలా పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెప్పారు. ఈ డబ్బును మూడు దఫాల్లో ఇస్తామని చెబుతున్న చంద్రబాబును నమ్మి మరోసారి మోసపోయేందుకు తాము సిద్ధంగా లేమని డ్వాక్రా సంఘాల మహిళలు చెబుతున్నారు. ఫిబ్రవరి మూడు లేదా నాలుగో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ స్థితిలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని భావిస్తే ఎన్నికల కమిషన్ దీన్ని తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు. ఈ విషయం తెలిసే చంద్రబాబు దీనిని ప్రకటించారని, నెపం ఎన్నికల కమిషన్‌పై వేసి లబ్ధి పొందాలని చూస్తారని ఓ అధికారి అన్నారు. అప్పుల ఊబిలో మహిళలు విలవిల 2014 ఎన్నికల ముందు చెప్పిన విధంగా డ్వాక్రా రుణ మాఫీ సాధ్యం కాదని అధికారం చేజిక్కించుకున్నాక చంద్రబాబు చావుకబురు చల్లగా చెప్పారు. మాఫీకి బదులు పెట్టుబడి నిధిగా సంఘంలోని ఒక్కో మహిళకు రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మొత్తం కూడా రూ.3 వేలు, 3 వేలు, 2 వేలు, 2 వేలు ఇలా నాలుగు దఫాలుగా అందజేశారు. బాబు వాగ్దానాన్ని నమ్మిన మహిళలు రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకర్లు నోటీసులిచ్చారు. నగలు వేలం వేశారు. కోర్టుల చుట్టూ తిప్పారు. ఖాతాల్లో ఉన్న డబ్బులను కూడా వడ్డీ రూపంలో జమ చేసుకున్నారు. దీంతో చాలా మంది మహిళలు తాము తీసుకున్న రుణాలపై వడ్డీలు చెల్లించేందుకే తిరిగి అప్పులు చేయాల్సి వచ్చింది. వైఎస్సార్ చేయూత, ఆసరా వైపే మహిళలు చంద్రబాబు ప్రభుత్వం ఇస్తానంటున్న రూ.10 వేల కంటే ప్రతిపక్షనేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లో ఒకటైన ‘వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా వైపే మహిళలు మొగ్గు చూపుతున్నారు. 45 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు అధికారంలోకి వచ్చిన రెండో ఏడాది నుంచి వరుసగా నాలుగేళ్లలో నాలుగు దఫాలుగా రూ.75 వేలు ఉచితంగా అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల రోజు వరకు డ్వాక్రా మహిళలకు ఉన్న పొదుపు సంఘాల రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తామని కూడా భరోసా ఇచ్చారు. ఈ హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాబు మాటలు నమ్మేది లేదని, నమ్మి మోసపోయింది చాలని అంటున్నారు. మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము డ్వాక్రా రుణాలను బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూ.10 వేలు ఇస్తామని చెబుతున్నారు. ఈ డబ్బులు పూర్తిగా ఇస్తారనే నమ్మకం మాకు లేదు. ఒకసారి మోసపోయాం. మళ్లీ మళ్లీ మోసపోవడానికి సిద్ధంగా లేము. – కంచికచర్ల పద్మావతి, డ్వాక్రా మహిళ, పరిటాల, కృష్ణా జిల్లా నాటి హామీ ఏమైంది? ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనే సీఎం చంద్రబాబుకు మహిళలు గుర్తుకు వస్తారు. నాడు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని వాగ్దానం చేసి తర్వాత మాట మార్చారు. ఇప్పుడు మళ్లీ రూ.10 వేలు అంటూ తాయిలాలు ప్రకటిస్తున్నారు. నిజంగా సీఎంకు చిత్తశుద్ధి ఉంటే రూ.10 వేలను ఒకేసారి ఇవ్వాలి. – కృష్ణా వీరనారాయణమ్మ, డ్వాక్రా మహిళ, గండేపల్లి, కృష్ణా జిల్లా ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఎన్నికల ముందు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అని ఓట్లు వేయించుకున్న చంద్రబాబు ఆ తర్వాత నిండా ముంచారు. నాలుగున్నరేళ్ల పాటు ఏమాత్రం పట్టించుకోకుండా ఇప్పుడు తగుదునమ్మా అంటూ పసుపు–కుంకుమ పేరుతో మా వద్దకు వస్తున్నారు. రూ.10 వేలు ఇవ్వాలనుకుంటే ఒకేసారి నగదుగా ఇవ్వొచ్చుగా? ఎప్పుడో చేతికందేలా చెక్కులేంటి? ఇక చంద్రబాబును నమ్మే స్థితిలో డ్వాక్రా మహిళలు లేరు. – మూడెడ్ల ఉమా, డ్వాక్రా మహిళ, గుడివాడ, కృష్ణా జిల్లా జగన్ రూ.75 వేలు ఇస్తామంటున్నారు డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన మాట తప్పే నాయకుడు కాదు. జగన్ అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు మాటలు నమ్మి ఇప్పటికే మోసపోయాం. ఇకపై మోసపోయే పరిస్థితి లేదు. రుణమాఫీని ఏమార్చి పసుపు–కుంకుమ అని ఎప్పుడో చెల్లేలా బాబు చెక్కులు ఇస్తే వాటిని ఏం చేసుకోవాలి? – మాదాసు వెంకటలక్ష్మి, గుడివాడ, కృష్ణా జిల్లా -
‘రూ.పదివేలు, స్మార్ట్ ఫోన్‌తో పచ్చి మోసం’
సాక్షి, విజయవాడ : గత ఎన్నికల్లో 94 లక్షల మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని మోసం చేసిన చంద్రబాబు.. మరోసారి ‘పసుపు-కుంకుమ’తో భారీ మోసం చేయడానికి సిద్ధమవుతున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాయత్రి విమర్శించారు. ఆదివారం ఆమె మీడియా మాట్లాడుతూ.. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు చెల్లని చెక్కులు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి మహిళలను మోసం చేయడానికే ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు పదివేల రూపాయలు, స్మార్ట్ ఫోన్లు ఇస్తామని చెప్పడం పచ్చి మోసం అన్నారు. ఈ ఐదేళ్లలో రాజధాని నిర్మాణం పేపర్ల మీదే ఎలా జరిగిందో.. అలాగే పది రూపాయలు చెక్కు మీదే ఉంటాయి కానీ ఒక్క రూపాయి చేతికి రావని చెప్పారు. గత ఎన్నికల్లో డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. రుణమాఫీ వాగ్దానాన్నే మాఫీ చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. -
‘పసుపు కుంకుమ’తో మరో మోసం
-
‘పసుపు కుంకుమ’తో మరో మోసం
సాక్షి, కర్నూలు : ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళపై కపట ప్రేమ చూసిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చరితారెడ్డి విమర్శించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మహిళలకు అనేక హామీలు ఇచ్చి మోసం చేశారని, మళ్లీ ఇప్పుడు ‘పసుపు - కుంకుమ’ పథకం పేరుతో మరో సారి మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు విడతలుగా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇంత వరకూ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదన్నారు. తన ఓటు బ్యాంకు కోసం గత నాలుగున్నరేళ్లుగా నెరవేర్చని హామీలను ఇప్పుడు చేస్తామంటూ.. చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు దగ్గర పడడడంతో మళ్లీ చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు మహిళలందరూ గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. -
కూలిపోయిన టెంటు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
సాక్షి కడప : ఎన్నికలు దగ్గర పడేకొద్దీ టీడీపీ సర్కారును అలజడి వెంటాడుతోంది. 2014 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేకపోయిన చంద్రబాబు సర్కార్ మరోసారి ఎన్నికల తాయిలాలకు సిద్ధమైంది. డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని గద్దెనెక్కిన పెద్దలు తర్వాత మాట మార్చి ఆర్థిక కోరల్లో చిక్కుకున్నామని..ఒక్కొక్కరికి .పెట్టుబడి నిధి కింద రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించి అదీ కూడా మూడు విడతల్లో అందించడానికి నాలుగేళ్లు పట్టింది. ఇప్పుడు ఒక్కొక్కరికి రూ.10 వేలు అంటూ.. మూడు విడతల్లో ఇస్తూనే సెల్‌ఫోన్ ఇస్తామని సీఎం బాబు ప్రకటన వెనుక సర్కార్ లోగుట్టు ఓట్లే అస్త్రం..ఎన్నికలే లక్ష్యం...అన్నది చెప్పకనే కళ్ల ముందు కనిపిస్తోంది. అందులోనూ పసుపు కుంకుమ పేరుతో నిర్వహించిన డ్వాక్రా సదస్సులో ఆదరించాలంటూ...ప్రజల్లోకి వెళ్లి చెప్పాలి..పథకాలు వివరించాలి...మళ్లీ మనమే రావాలి అని చెప్పడం వెనుక ఉన్న మర్మమేమిటో ఇట్టే తెలిసిపోయింది. అంతేకాదు ఎన్నికలకు ముందు ఇస్తున్న తాయిలాల రహస్యాలపై కూడా మహిళలు చర్చించు కోవడం కనిపించింది. జిల్లాలోని మున్సిపల్ స్టేడియంలో సీఎం సభ సందర్బంగా టెంటు కూలిపోయింది. అక్కడ కుర్చీల్లో కూర్చొన్న మహిళలపై టెంటు పడడంతో ఒక్కసారిగా భయాందోళనలతో పరుగులు తీశారు. కొంతమంది మహిళలు కుర్చీలు తలపై పెట్టుకుని ప్రక్కకు పరుగులు లంకించుకున్నారు. అయితే టెంటు కూలినా ఎటువంటి ప్రమా దం జరగకపోవడంతో అటు అధికారులతోపాటు ఇటు అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్నికల స్టంట్ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీకి నాలుగున్నరేళ్ల తర్వాత ప్రజలు గుర్తుకు వచ్చారా? అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంతవరకు చెప్పిన పథకాలకే కోతలు పెడుతూ వచ్చిన ప్రభుత్వం.. ఇప్పటికిప్పుడు పెన్షన్ల పెంపు.. ఆటోలు, ట్రాక్టర్లు ట్యాక్సుల మినహాయింపు.. డ్వాక్రా మహిళలకు సెల్ఫోన్లు, నగదు అందించడం వెనుక రహస్యమేమిటన్న చర్చ సాగుతోంది. కేవలం ఎన్నికల స్టంట్‌గానే అందరూ అభివర్ణిస్తున్నారు. ఆదరించడం వెనుక అసలు రహస్యం కడపలోని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పసుపు కుంకుమ సమ్మేళన సదస్సుకు రాయలసీమలోని నాలుగు జిల్లాతోపాటు నెల్లూరుజిల్లా మహిళలను కూడా పెద్ద ఎత్తున తరలించారు. సభ ప్రారంభమైన క్షణం నుంచి సీఎం చంద్రబాబు ముగించే వరకు ప్రసంగించిన ప్రతి ఒక్కరూ ఆదరించండి..అభిమానించండి...ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురండని అధికార సభలో మాట్లాడటం వెనుక ప్రభుత్వ అసలు రహస్యం బయటపడింది. ప్రభుత్వ ధనాన్ని ఖర్చు చేసి ప్రత్యేక సదస్సులు పెడుతున్నా అందులో కూడా టీడీపీ నేతలు బహిరంగంగానే ఓట్ల మాట మాట్లాడుతుండడం మహిళలతోపాటు అందరిలోనూ చర్చకు దారి తీస్తోంది. చెప్పిందే చెబుతూ....చప్పట్లు కోరుతూ..... సీఎం బాబుతోపాటు పలువురు ప్రసంగించారు. అయితే సీఎం మాట్లాడుతున్న సందర్భంలో నేను చెప్పేది మీరు నిజమని విశ్వసిస్తున్నారా.. అయితే చప్పట్లు కొట్టండి.. చేతులు పైకెత్తి మద్దతు తెలుపాలంటూ పదేపదే కోరడం కనిపించింది. అంతేకాకుండా బాబు ఎప్పుడు కడపకు వచ్చినా సాగునీటిని అందించి రాయలసీమను రతనాల సీమగా మారుస్తానంటూ చెప్పిందే చెప్పడంతో కూడా పలువురు అసహనంగా వెళ్లిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానంలో కడపకు వచ్చారు. గుంటూరులో సభ ముగించుకుని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఇక్కడకు వచ్చారు. కడప ఎయిర్‌పోర్టులో కలెక్టర్ హరి కిరణ్, డీఐజీ కాంతిరాణా టాటా, ఎస్పీ అభిషేక్ మహంతి తోపా టు పలువురు టీడీపీనేతలు స్వాగతం పలికారు. సీఎం మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు చేరుకోవాల్సి ఉండగా, మూడు గంటల ప్రాంతంలో వచ్చారు. ఇక్కడ మహిళా సదస్సు ముగియగానే కడప ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ప్రత్యేక విమానంలో విశాఖకు బయలుదేరి వెళ్లారు. సీపీఐ నేతల అరెస్టు జిల్లాలో కరువు సహాయక పనులు వెంటనే చేపట్టాలని, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీ, ప్రొద్దుటూరు పాల కేంద్రం,నందలూరు ఆల్విన్ ఫ్యాక్టరీ, కెమికల్, సాల్వన్, కాటన్ ఆయిల్ మిల్లుల మూసివేతతో బజారున పడిన కార్మికులను ఆదుకోవాలని, ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సీఎం చంద్రబాబును కలవాలని సీపీఐ నేతలు నిర్ణయించారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, ఏపీ రైతు సంఘం నాయకులు చంద్ర, వెంకట శివ, చంద్రశేఖర్ లను లోనికి వెళ్లకుండా అడ్డుకుని పోలీసులు అరెస్టు చేశారు. -
బాబు ప్రసంగం చూపించేందుకే పిలిపించారా?
తనకల్లు: పసుపు–కుంకుమ డబ్బులు ఇస్తామని చెప్పి పిలిపించి తీరా ఇక్కడికొచ్చాక టీవీలో చంద్రబాబు ప్రసంగం చూపిస్తారా? అంటూ మహిళా సంఘాల సభ్యులు వెలుగు అధికారులపై మండిపడ్డారు. పసుపు–కుంకుమ డబ్బులు ఎప్పుడిస్తారో చెప్పాలంటూ వాగ్వాదానికి దిగారు. సీఎం చంద్రబాబునాయుడు పసుపు–కుంకుమ రెండో విడతపై టీవీలో డ్వాక్రా సభ్యులనుద్దేశించి మాట్లాడే కార్యక్రమం ఉండటంతో శుక్రవారం స్థానిక వెలుగు కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం చెబితే డ్వాక్రా సభ్యులు రారని భావించిన వెలుగు అధికారులు పుసుపు–కుంకుమ డబ్బులు ఇస్తారని చెప్పి పిలిపించారు. తీరా ఇక్కడికి వచ్చాక టీవీలో చంద్రబాబు ప్రసంగం చూపించేందుకే పిలిపించారని తెలియడంతో మహిళలు వారిపై మండిపడ్డారు. ప్రభుత్వం పసుపు – కుంకుమ పథకాన్ని కేవలం ప్రచారానికే వాడుకుంటోందని, వాస్తవానికి చాలా గ్రూపులకు డబ్బులు జమ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎంతమందికి డబ్బులు వచ్చాయో చూపాలంటూ కంప్యూటర్ ఆపరేటర్ గదిలోకి దూసుకెళ్లారు. దీంతో అక్కడ గందరగోళం ఏర్పడింది. మీరు కూర్చుంటే అన్ని వివరాలు చెబుతామని అధికారులు పదేపదే కోరినా మహిళలు ఏ మాత్రం పట్టించుకోకుండా సీఎం ప్రసంగం మధ్యలోనే ఇంటిదారి పట్టారు. ఏపీఎంపై మండిపడ్డ సభ్యులు ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు ఏపీఎం సూరిపై మండిపడ్డారు. పసుపు – కుంకుమ డబ్బులడిగితే వెలుగు అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదన్నారు. అకౌంట్లో జమ అయ్యిందని చెబితే బ్యాంకుకు వెళ్లి చూస్తే ఒక్క రుపాయి కూడా జమ కాలేదన్నారు. సమావేశానికి వస్తే పసుపు – కుంకుమ డబ్బులు ఇస్తామని చెబితే ఇక్కడికి వచ్చామని, కానీ చంద్రబాబు ప్రసంగం చూపించి ఇళ్లకు పొమ్మంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సీఎం ప్రసంగం వినాల్సిందే!
చిత్తూరు అర్బన్: మహిళా సంఘాల్లోని ప్రతి మహిళకూ పసుపు కుంకుమ పథకం నగదు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడమే తరువాయి.. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. శుక్రవారం చిత్తూరు మునిసిపల్ కార్పొ రేషన్‌లోని పట్టణ దారిద్య్ర నిర్మూలనా విభాగం (మెప్మా) ఆధ్వర్యంలో వెయ్యిమందికి పైగా మహిళల్ని అంబేడ్కర్ భవన్‌కు పిలిపించారు. ప్రతి మహిళకు సెల్‌ఫోన్, రూ.10 వేలు ఇస్తామని సీఎం చెప్పారు కాబట్టి.. మీటింగ్‌కు వచ్చిన మహిళలకు మాత్రమే వీటినిస్తామని చెప్పారు. తీరా అక్కడకు వెళ్లిన మహిళలకు మెప్మా అధికారులు చుక్కలు చూపించారు. వైఎస్సార్ కడప జిల్లాలో సీఎం బహిరంగ సభను ఇక్కడ లైవ్‌లో చూపెడతాం, చివరి వరకు ఉన్నవారి పేర్లు రాసుకుని వీరికి మాత్రమే పసుపు కుంకుమ వర్తింపచేస్తామని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మహిళల్ని బలవంతంగా కూర్చోపెట్టారు. సాంకేతిక కారణాలతో సీఎం ప్రసంగం టెలికాస్ట్ కాలేదు. ఈ క్రమంలో పలువురు మహిళలు పాఠశాలలకు వెళ్లిన పిల్లలకు భోజనాలు పంపాలని, ఇంటి వద్ద వృద్ధులను వదిలేసి వచ్చామని, అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్లాలని సమావేశం నుంచి అర్ధాతరంగా బయటకు వచ్చారు. దీంతో ఆగ్రహించిన అధికారులు గేట్లు మూయించేశారు. అప్పటికీ కొందరు మహిళలు గేట్లు తీసుకుని బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే జుట్టుపట్టుకుని లాగుతూ గేట్లలోపల తోసేస్తూ దాష్టీకం ప్రదర్శించారు. ఈ దృశ్యాలను బయటి నుంచి చూస్తున్న జనాలకు అర్థంకాక.. పరుగున వచ్చి లోపల ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి మహిళల్ని బయటకు లాగేశారు. తీరా విషయం తెలుసుకున్నాక సిబ్బంది అత్యుత్సాహం చూసి ముక్కున వేలేసుకున్నారు. -
ప్రభుత్వ సేవలో ప్రగతి చక్రం
చిత్తూరు రూరల్: సీఎం సభల పేరుతో ప్రయాణికులకు ఆర్టీసీ చుక్కలు చూపిస్తోంది. ప్రయాణికుల సౌకర్యాలను పక్కకు నెట్టేసి తమ ప్రచారం కోసం ఆర్టీసీ బస్సులను చంద్రబాబు ప్రభుత్వం దుర్వి నియోగం చేస్తోంది. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆర్టీసీ సర్వీసులను తరచుగా మళ్లిస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు వస్తాయో రావో తెలియక బస్టాపుల వద్ద జనం పడిగాపులు కాస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. సీఎం సభలకు తరలిస్తున్న బస్సుల బకాయులు లక్షల్లో పేరుకుపోయాయని కార్మికవర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చిత్తూరు 1,2 డిపోలో 182 సర్వీసులు ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి చిత్తూరు మీదుగా 65 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. రెండు డిపోలకు రోజుకు రూ. 15 నుంచి రూ.17లక్షల ఆదాయం వస్తోంది. గ్రామీణలు ఆర్టీసీ ప్రయాణాన్ని సురక్షిత ప్రయాణంగా భావిస్తున్నారు. చాలా గ్రామాలకు బస్సులే దిక్కుగా ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఎంతకీ బస్సులు రాకపోవడంతో బస్టాపుల వద్ద ప్రజలు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చివరికి బస్సులు రాకపోవడంతో ప్రైవేటు సర్వీసులను ఆశ్రయించాల్సి వస్తోంది. సర్వీసులను రద్దు చేస్తున్నామని కనీస సమాచారం కూడా ఇవ్వడంలేదు. ఈ నెల 27న రాజమహేంద్రవరంలో జరగనున్న బీసీ సభకు పెద్దఎత్తున ఆర్టీసీ బస్సులను రిజర్వు చేస్తున్నారు. శుక్రవారం విశాఖపట్నంలో జరిగే డీఆర్డీఏ స మావేశానికి 240 బస్సులు సిద్ధంగా ఉంచాలని ముందుగానే ఇండెంట్æ కూడా ఇచ్చారు. బస్సులను పబ్లిసిటీ కోసం వాడుకోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడడమే కాకుండా వాటికయ్యే ఖర్చుకు వివిధ శాఖల బకాయిలు పేరుకుపోతున్నాయి. ప్రభుత్వ శాఖల చుట్టూ బకాయిల కోసం ఆర్టీసీ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజమండ్రిలో శనివారం జరిగే సీఎం సభకు ఆర్టీసీ అధికారులు బస్సులు సిద్ధం చేశారు. డిపో–1 నుంచి 7 సర్వీసులు, డిపో–2 నుంచి 10 సర్వీసులు పంపనున్నారు. దీనికి సం బంధించి ప్రణాళికను అధికారులు పూర్తి చేసి బస్సులను గేటు దాటించారు. జిల్లాలోని పెద్దతిప్పసముద్రంలో జరిగిన జలహారతి కార్యక్రమానికి డిపో–1 నుంచి 24, డిపో–2లో 30 సర్వీసులు పంపారు. చిత్తూరు– పరిసర ప్రాంతాల ప్రజలను ఇబ్బందులకు గురి చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగే సభలతో పాటు ఇతర జిల్లాల్లో జరిగే సభలకు కూడా ఆర్టీసీ సేవలు అందిస్తోంది. ఈ నెల12వ తేదీన నెల్లూరుకు డిపో–1లో 20, డిపో–2లో 26 సర్వీసులు మళ్లించారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పోయే ప్రయాణికులకు ప్రైవేటు వాహనాలే దిక్కుగా మారాయి. డిసెంబర్లో అనంతపురం జిల్లాకు కూడా ఇక్కడ నుంచి బస్సులను మళ్లించారు. డిపో–1 నుంచి 35 సర్వీసులు, డిపో–2 నుంచి 37 సర్వీసులు వెళ్లాయి. దీంతో చిత్తూరులోని ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వ నిధుల దుబారా పరిపాలనలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు తమ గొప్పతనమేనని నమ్మించడానికి రాష్ట్రం నలుమూలల నుంచి వివిధ వర్గాలను రాజధానికి తీసుకు వెళ్లి సన్మానాలు చేయించుకుంటున్నారు. కృతజ్ఞతా సభల పేరుతో దాదాపు అన్ని జిల్లాల నుంచి అమరావతికి తరలిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా ధర్మపోరాట దీక్షల పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి సభా వేదికల వద్దకు జనాల్ని రప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు సందర్శన అని, అమరావతి సందర్శన అని పెద్ద ఎత్తున జిల్లాల నుంచి టీడీపీ అనుయాయులను తీసుకు వెళ్లి, అక్కడ అభి వృద్ధి జరిగిందనే భ్రమలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం సభలు సొం త జిల్లాలోనే కాకుండా ఏ ఇతర జిల్లాలో జరిగినా కూడా బస్సుల తిప్పేస్తున్నారు. కొన్ని నెలలుగా జరుగుతున్నతంతు ఇదే. ఎన్ని బస్సులు తరలిస్తున్నారో వాటికయ్యే వ్యయాన్ని సంబంధిత శాఖల నిధుల నుంచి వెచ్చిస్తున్నారు. సత్కారాలు, ప్రచారం కోసం ప్రభుత్వ నిధుల్ని దుబారా చేస్తున్న తీరుపై జనం మండిపడుతున్నారు. -
వీళ్లేం పాలకులండీ!
తూర్పుగోదావరి,మండపేట: చంద్రబాబు ప్రచార ఆర్భాటం ప్రయాణికులకు సంకటంగా మారుతోంది. ‘పసుపు కుంకుమ’ –2 పేరిట విశాఖపట్నంలో నిర్వహించిన చంద్రబాబు బహిరంగ సభకు జిల్లా నుంచి భారీగా బస్సులను తరలించడం జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాల్జేసింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 203, మెప్మా ఆధ్వర్యంలో 20 బస్సులను తరలించారు. ఉసూరుమంటూ కొందరు అర్ధాంతరంగా ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనుతిరగ్గా, తప్పనిసరి పరిస్థితుల్లో మిగిలిన వారు ఆపసోపాలు పడుతూ ప్రయాణాలు సాగించాల్సి వచ్చింది. గద్దెనెక్కాక బేషరతుగా డ్వాక్రా రుణాల మాఫీ హామీని గాలికొదిలేసిన చంద్రబాబు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ మహిళలకు గాలం వేసే పనిలో పడ్డారు. ‘పసుపు కుంకుమ –2’ పేరిట మరో దగాకు శ్రీకారం చుట్టారు. విశాఖపట్నం వేదికగా శుక్రవారం నిర్వహించిన ప్రాంతీయ సదస్సుకు జిల్లాలోని రాజోలు డిపో మినహా మిగిలిన ఎనిమిది డిపోల నుంచి 223 బస్సులను తరలించారు. వీటిలో రాజమహేంద్రవరం డిపో నుంచి 35 బస్సులను, కాకినాడ నుంచి 34 బస్సులు, అమలాపురం నుంచి 23, గోకవరం నుంచి 25, రావులపాలెం నుంచి 17, ఏలేశ్వరం నుంచి 18, రామచంద్రపరం నుంచి 26, తుని నుంచి 25 బస్సులను డీఆర్డీఏ ఏర్పాటు చేయగా మెప్మా ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం, ఏలేశ్వరం డిపోల నుంచి రెండు బస్సులు చొప్పున అమలాపురం, కాకినాడ డిపోల నుంచి నాలుగు చొప్పున, తుని నుంచి ఎనిమిది బస్సులను ఏర్పాటు చేశారు. ఆయా బస్సుల ద్వారా అధికార పార్టీ నేతలు దాదాపు పది వేల మంది వరకూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డ్వాక్రా మహిళలను ప్రాంతీయ సదస్సుకు తరలించినట్టు అంచనా. ప్రయాణికుల అవస్థలు పల్లె వెలుగు, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్, ఇంద్ర, అమరావతి, గరుడ కేటగిరీల్లో జిల్లాలోని తొమ్మిది డిపోల పరిధిలో ఆర్టీసీ, అద్దె ప్రాతిపదిక (హైయిర్) బస్సులు 875 వరకూ ఉన్నాయి. వీటిలో అధికశాతం ‘పల్లె వెలుగు’ బస్సులు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు మినహాయించి స్థానికంగా తిప్పే ‘పల్లె వెలుగు’ బస్సులను విశాఖ సదస్సుకు తరలించారు. కొన్ని రూట్లలో పూర్తిగా ‘పల్లె వెలుగు’ బస్సులను నిలిపివేయగా రద్దీ రూట్లలో ఒకటి రెండు మాత్రమే సర్వీసులు నడిపారు. విద్య, వైద్యం, ఉద్యోగం, వ్యాపారం తదితర పనుల నిమిత్తం బస్టాండ్లకు వచ్చిన వారు బస్సులు లేవని తెలిసి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇదే అదనుగా కొన్నిచోట్ల ఆటో చార్జీలను అమాంతం పెంచేశారు. సాధారణ టిక్కెట్టు ధరకు రెండు నుంచి మూడు రెట్లు వరకు అధికంగా వసూలు చేయడంతో చేతి చమురు వదిలిందని ప్రయాణికులు వాపోయారు. తప్పనిసరి పరిస్థితుల్లో కొందరు ప్రయాణం విరమించుకోగా, మరికొందరు కిక్కిరిసిన బస్సుల్లో అవస్థలతో ప్రయాణం సాగించారు. ప్రచార ఆర్భాటం కోసం ప్రయాణికులను ఇబ్బందులు పాలు చేయడమేమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా
సాక్షి, అమరావతి : ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మహిళల ఓట్ల కోసం పదివేల పథకం పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపారు. డ్వాక్రా మహిళలకు చంద్రబాబు మరో టోకరా ఇచ్చారు. నిన్నటి వరకు డ్వాక్రా మహిళలకు పదివేలు చొప్పున ఇస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం చేశారు. ఈరోజు అమలు దగ్గరికి వచ్చే సరికి పోస్ట్ డేటెడ్ చెక్కులిచ్చి చేతులు దులుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరిలో చెక్కులు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక డబ్బులు ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది. పదివేలను ఒక్కసారిగా ఇవ్వమని చెబుతున్న రాష్ట్రప్రభుత్వం మూడు విడతలుగా, అంటే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు ప్రజలను ప్రభావితం చేసేలాగా ఈ ప్లాన్ రెడీ చేసింది. ఇందులో కూడా ఎక్కడా నగదు చెల్లింపులు లేకుండా ఫిబ్రవరిలో డ్వాక్రామహిళలకు మూడు చెక్కులు ఇవ్వబోతున్నారు. వీటిలో ఒక చెక్కు ఫిబ్రవరికి సంబంధించి రూ. 2500, మార్చినెలకు సంబంధించి రూ.3500, ఏప్రిల్ నెలకు సంబంధించి రూ. 4000 పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇస్తామని చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ పథకాల్లో పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి నిధులు ఇస్తామనే సందర్భాలు ఎక్కడా ఉండవు. ప్రభుత్వ తీరుపై డ్వాక్రామహిళలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి ఏపీలో వడ్డీలేని రుణాల పథకాన్ని అమలు చేయడం లేదు. ఆగిపోయిన వడ్డీలేని రుణాలు రూ.2200 కోట్ల బకాయిలనే ఇవ్వకుండా వాటినే ఫిబ్రవరిలో చెక్కురూపంలో పసుపుకుంకుమ అనే పేరుతో కొత్త పథకంగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. గతంలో కూడా రూ. 14200 కోట్ల రుణమాఫీకి ప్రభుత్వం ఎగనామం పెట్టిన విషయం తెలిసిందే.