
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడులో టీడీపీ అభ్యర్థిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. చంద్రబాబు తీసుకువచ్చిన పసుపు-కుంకుమ వట్టి బూటకమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పసుపు-కుంకుమ డబ్బులు తీసుకునేందుకు వందలాది మంది మహిళలు ఇరుగులం బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లిస్తేనే పసుపు-కుంకుమ డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పడంతో మహిళలు నిరసనకు దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నా.. బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేతలను కడిగిపారేసిన మహిళలు.. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీంతో టీడీపీ సత్యవేడు అభ్యర్థి జేడీ రాజశేఖర్ మహిళలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment