పసుపు–కుంకుమతో మోసపోవద్దు | Women People Do Not Cheated By Chandrababu | Sakshi
Sakshi News home page

పసుపు–కుంకుమతో మోసపోవద్దు

Published Tue, Apr 9 2019 2:35 PM | Last Updated on Tue, Apr 9 2019 2:36 PM

Women People Do Not Cheated By Chandrababu - Sakshi

డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు మహిళలను మోసగించారు. అప్పులు సకాలంలో చెల్లించలేక వడ్డీల భారం పెరిగి ఊబిలోకి నెట్టారు. బ్యాంకుల్లో డిఫాల్టర్లు అయ్యారు. ఎన్నికలయ్యాక చంద్రబాబు అధికారంలోకి వచ్చి రుణమాఫీ తూచ్‌ అని.. పసుపు–కుంకుమ పేరుతో మూడు దఫాలు రూ.10 వేలు ఇచ్చి సరిపెట్టారు. అంతకు ముందు వరకు పావలా వడ్డీకే రుణాలు పొందుతున్న మహిళలకు ఆ పథకాన్ని తొలగించారు. పూర్తిగా వడ్డీ చెల్లించుకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల రావడంతో ఆఖరిలో మహిళల ఓట్లను కొల్లగొట్టాలని పసుపు–కుంకుమ పేరుతో ఇప్పుడు రూ.10 వేలు ఇస్తున్నాడు. ఎప్పుడో పదివేలు ఇచ్చాడని ఐదేళ్ల పాటు టీడీపీ నిర్వహించిన సభలు, సమావేశాలకు కచ్చితంగా రావాలంటూ వేధింపులకు గురి చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలదే విజయం.. ఆలోచించి భవిష్యత్‌ను నిర్ణయించుకోవాల్సిన తరుణం వచ్చింది. 

నెల్లూరు(పొగతోట): 2014 ఎన్నికలకు ముందు డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఎన్నికలకయ్యాక రూ.10 వేలు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత ఈ నాలుగున్నర ఏళ్ల పాటు స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ, పొదుపు) మహిళలు గుర్తుకురాలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు 3 నెలల ముందు పొదుపు మహిళలు చంద్రబాబుకు గుర్తుకు వచ్చారు. పసుపు–కుంకుమ అంటూ ఇప్పుడు రూ.10 వేలకు చెక్కులు పంపిణీ చేశారు.

2014 నాటికి జిల్లాలో రూ.350 కోట్లు డ్వాక్రా రుణాలు
జిల్లాలో 34 వేల స్వయం సహాయక గ్రూపులు ఉన్నాయి. సుమారు 4 లక్షల మంది మహిళలు పొదుపు చేసుకుంటన బ్యాంకుల నుంచి బ్యాంకు లింకేజ్‌ రుణాలు పొందుతున్నారు. 2013, 2014 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రూ.350 కోట్లు డ్వాకా రుణాలు ఉన్నాయి. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళలు ఎవరూ బ్యాంకు లింకేజ్‌ రుణాలు తిరిగి చెల్లించవద్దని పూర్తిగా మాఫీ చేస్తానని, చెల్లించిన వారికి నగదు తిరిగి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో ప్రకటించాడు. అధికారంలోకి వచ్చిక చంద్రబాబు ప్రభుత్వం బ్యాంకు లింకేజ్‌ రుణాలు రూపాయి రుణమాఫీ చేయలేదు. దీంతో బ్యాంకుల నుంచి మహిళలకు నోటీసులు వచ్చాయి. అప్పటికే రుణాల చెల్లింపు కాలాతీతం కావడంతో అప్పులపై వడ్డీ భారం పడింది. చేసేది ఏమిలేదని చంద్రబాబు మాటల విని మోసపోయామని తీసుకున్న రుణాలను తిరిగి అదనపు వడ్డీలతో కలిపి చెల్లించారు.

పావలా వడ్డీ అర్హత కోల్పోయిన మహిళలు
మహిళలు తీసుకున్న రుణాలను వడ్డీతో కలిపి ప్రతి నెలా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తారు. క్రమం తప్పకుండా రుణాలను  చెల్లించిన గ్రూపులకు వడ్డీ చివరిగా తిరిగి చెల్లిస్తారు. అయితే 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు చెల్లించకపోవడంతో పావలా అర్హత కోల్పోవడంతో పాటు అదనపు వడ్డీ భారం పడింది. ఈ క్రమంలో రుణాలు తీసుకున్న మహిళలు సుమారు రూ.256 కోట్లు బ్యాంకులకు తిరిగి చెల్లించారు. ఇంకా 3208 గ్రూపులు రూ. 115 కోట్ల రుణాలు బకాయిలు మిగిలాయి. వీటిలో ఇప్పటి వరకు తీసుకున్న రుణాలను వడ్డీలతో కలిపి రూ.95 కోట్లు రికవరీ చేశారు. ఇప్పటికి 927 గ్రూపులకు సంబంధించి రూ.19.32 కోట్లు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.

 పావలా వడ్డీ రద్దు
చంద్రబాబు అధికారంలోకి వస్తే పూర్తిగా బేషరతుగా రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు. దీంతో పాటు అప్పటి వరకు పావలా వడ్డీకే రుణాలు పొందుతుండగా ఈ పథకాన్ని రద్దు చేశారు. దీంతో పూర్తిగా వడ్డీని మహిళలే భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఐదేళ్లలో మహిళలపై వడ్డీ అధికమైంది.

 డ్వాక్రా మహిళలకు జగన్‌ భరోసా
గతంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలను మోసం చేసిన చంద్రబాబు తీరును గుర్తు చేసుకుని, ఓటు వేసే సమయంలో ఒక్క క్షణం ఆలోచన చేయాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మొత్తాన్ని నాలుగు దఫాల్లో మహిళల ఖాతాల్లోనే నేరుగా జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. పొదుపు మహిళలకు వడ్డీ రహిత బ్యాంక్‌ లింకేజీ రుణాలు మంజూరు చేస్తామని ప్రకటించడంతో పొదుపు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మహిళలకు పావలా వడ్డీకే రుణాలు, వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ పూర్తిగా అందేవి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వస్తే తమ జీవితాలు బాగుపడతాయని మహిళలు భరోసాగా వ్యక్తం చేస్తున్నారు. 

పసుపు–కుంకుమ మోసం

పూర్తిగా రుణమాఫీ హామీని విస్మరించిన చంద్రబాబు ఆ తర్వాత పసుపు–కుంకుమ అంటూ రూ.10 వేలు మూడు దఫాలుగా చెల్లించారు. అయితే చంద్రబాబు ఇచ్చిన ఈ పదివేలు వడ్డీలకే సరిపోయింది. మహిళలకు ఏమీ మిగలేదు. అప్పులు మాత్రం మిగిలాయి. ఇలా మోసం చేసిన చంద్రబాబు ఈ ఐదేళ్లలో పొదుపు మహిళలను టీడీపీ ప్రచార సభలకు రావాలంటూ ఆదేశాలు జారీ చేసేవారు. ప్రతి మీటింగ్‌కు సొంత డబ్బులు పెట్టుకుని వెళ్లి నానా అగచాట్లు పడ్డారు. తాజాగా ఎన్నికలు దగ్గరకు రావడంతో పాత విషయాలన్నీ మరిచిపోయి మళ్లీ తనకే ఓటేస్తారని.. పసుపు–కుంకుమ పేరుతో రూ.10 వేలు అదీ మూడు దఫాలుగా ముందస్తు తేదీలో చెక్కులు.. అదీ ఎన్నికలకు ముందు ఇచ్చారు. అయితే వీటిని మార్చుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. ఐదేళ్లుగా మోసం చేసి అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన చంద్రబాబును నిన్ను నమ్మం బాబూ అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement