satyavedu
-
మరో వివాదంలో ఆదిమూలం.. ఆడియో లీక్
తిరుపతి జిల్లా, సాక్షి: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల వరలక్ష్మీ అనే మహిళపై లైంగిక దాడి ఘటన మరువక ముందే ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు.‘‘ కలర్ మారిపోయావు. పర్సనాలిటీ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి బ్యూటిఫుల్‌గా ఉన్నావు. అప్పటికి ఇప్పటికీ సూపర్ ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు’’ అంటూ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఇలా అసభ్యకరంగా మహిళతో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయారు. గత నెలలో వరలక్ష్మి అనే మహిళపై లైంగిక దాడి ఘటనలో అడ్డంగా దొరికిపోయినా.. ఆయన మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్ విషయంలో.. ఎమ్మెల్యే తీరుపై నియోజవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించిన విషయం తెలిసిందే. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు
-
టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి, అమరావతి : చిత్తూరు జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అదే పార్టీకి చెందిన నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని.. ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే తాను ఆయన లీలలను పెన్ కెమెరాలో రికార్డు చేశానని చెప్పారు.తనవద్ద బలమైన సాక్ష్యాలున్నాయనే ఆయన తనకు అనేకమార్లు ఫోన్లుచేశారని.. రాత్రిపూట మెసేజ్‌లు పెట్టి బెదిరిస్తున్నారని.. గురువారం హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆమె మీడియా సమక్షంలో వెల్లడించారు. ఇదే విషయమై పార్టీ అధినేత సీఎం చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు, మంత్రి లోకేశ్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ విషయాలన్నీ విధిలేని పరిస్థితుల్లో వెల్లడించాల్సి వస్తోందన్నారు.వరలక్ష్మి ఇంకా ఏమన్నారంటే..ఇద్దరం ఒకే పార్టీకి చెందిన వారం కావడంతో పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరం పాల్గొనే వారం. కొద్దిరోజులకు నా ఫోన్ నెంబర్ తీసుకుని పదేపదే ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఎన్నికలు ముగిసే వరకూ నన్ను సోదరిగా సంభోదించారు. ఆ తర్వాత ఆయన తన నిజస్వరూపం బయటపెట్టారు. ఆయనతో సన్నిహితంగా ఉండాలంటూ బెదిరింపులకు దిగారు. తమ మాట వినకపోతే భర్త, ఇద్దరు పిల్లల్ని చంపేస్తానని, పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరకుండా చేస్తాననే వారు.చివరకు.. మాట్లాడుకుని విషయం సెటిల్ చేసుకుందామంటూ నమ్మబలికిన ఆదిమూలం.. ఈ ఏడాది జూలై 6న తిరుపతి భీమాస్ ప్యారడైజ్ హోటల్‌కు పిలిపించాడు. అక్కడి రూమ్ నెం.109లో నాపై లైంగిక దాడికి పాల్పడ్డారు. విషయం ఎవరికైనా చెబితే కుటుంబంలో అందరినీ చంపేస్తానంటూ బెదిరించడంతో మిన్నకుండిపోయా. ఆయన అంతటితో ఆగకుండా వేళగాని వేళల్లో ఫోన్లు, సందేశాలతో వేధించేవారు. దీంతో.. అర్థరాత్రి సమయంలో ఎమ్మెల్యే నుంచి పదేపదే ఫోన్లు రావడాన్ని గమనించిన నా భర్త నన్ను ప్రశ్నించడంతో జరిగిందంతా ఆయనకు చెప్పేశాను. కామాంధుడైన ఎమ్మెల్యే ఆదిమూలానికి బుద్ధిచెప్పాలని నిర్ణయించుకున్నాం. అదే నెల పదో తేదీన అదే హోటల్లో రూం నెం.105కి ఆయన మళ్లీ రమ్మనడంతో రహస్య కెమెరాలతో వెళ్లాను.ఆ రోజు ఎమ్మెల్యే నాపై మరోసారి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ తతంగం మొత్తం రహస్య కెమెరాల్లో రికార్డు అయింది. మరోసారి అదే నెల 17న అదే హోటల్లో రూమ్ నెం.105కి రమ్మని మళ్లీ అత్యాచారం చేశాడు. నా వద్ద ఆయన ఆడియోలు, వీడియోలు ఉన్నాయని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదిమూలం నాపై నిఘా ఉంచి, నా చుట్టూ ఆయన మనుషులను మోహరించాడు. మరోవైపు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం టీడీపీ మహిళా నేతను లైంగికంగా వేధించిన దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో ఆయనను పార్టీ నుంచి టీడీపీ సస్పెండ్ చేసింది. -
ఎంత కామాందుడు అంటే. .. నా భార్యని చిత్రహింసలు పెట్టి..
-
‘టీడీపీ ఎమ్మెల్యే వేధింపులు.. పెన్ కెమెరాలో రికార్డ్ చేశా’
సాక్షి, చిత్తూరు: సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. కోనేటి ఆదిమూలం లైంగికంగా వేధించాడని.. ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడంటూ బాధితురాలు పేర్కొంది. ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే పెన్ కెమెరాలో రికార్డ్ చేశా. సాక్ష్యాలున్నాయనే ఎమ్మెల్యే వందసార్లు కాల్ చేశాడు. మెసేజ్‌లు చేసి బెదిరిస్తున్నాడు. ఎమ్మెల్యే నీచ పనులకు తిరుపతి బీమా ప్యారడైజ్ హోటల్ అడ్డా. ఇలాంటి వాళ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’ బాధితురాలు డిమాండ్ చేసింది...ఒకే పార్టీకి చెందిన వాళ్లం కావడంతో పలు కార్యక్రమాల్లో ఆదిమూలం కలిసేవారు. అలా పరిచయమైన తర్వాత నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. నామొబైల్‌కు పదేపదే కాల్స్ చేసేవాడు. తిరుపతిలోని భీమాస్ హోటల్లో నుంచి రూమ్ నెంబర్ 109లోకి రమ్మని చెప్పాడు. అక్కడ నన్ను బెదిరించి నా పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే నాతో పాటు కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. అలా నాపై మూడుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. చివరకు ఎమ్మెల్యే ఆదిమూలం నిజరూపాన్ని బట్టబయలు చేయడానికి పెన్ కెమెరా పెట్టుకున్నాను. లైంగికంగా తన కోరిక తీర్చకుంటే కుటుంబం మొత్తాన్ని అంతం చేస్తానని ఎమ్మెల్యే బెదిరించాడు..ఆదిమూలం గురించి అందరికీ తెలియాలి అనే పెన్ కెమెరా లో రికార్డు చేశాను. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయని ఎమ్మెల్యే 100 సార్లు కాల్ చేశాడు. రాత్రులు మెసేజ్‌లు పంపించి వేధించేవాడు. ఎంతోమంది అమ్మాయిలను టార్చర్ చేసేవాడు. ఆదిమూలం కామాంధుడు, రాక్షసుడు. అతని నుంచి సత్యవేడులోని పార్టీ మహిళా కార్యకర్తలను కాపాడాలి’’ అని బాధితురాలు విజ్ఞప్తి చేసింది. -
కోనేటి ఆదిమూలం ను ఓడిస్తాం అతను ఒక ద్రోహి
-
చంద్రబాబు నేను చేసిన పాపం ఏంటి..? కన్నీరు పెట్టుకున్నటీడీపీ నేత
-
ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం దిష్టి బొమ్మ దగ్ధం చేసిన వైఎస్సార్సీపీ నాయకులు
-
స్నేహానికి సిసలైన చిరునామా.. సలాం చేయాల్సిందే మనమంతా!
కల్మషం లేనిది.. కష్టసుఖాల్లో తోడుగా నిలిచేది.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెన్నంటే ఉండేది.. ఆనందంలోనూ ఆత్మీయత పంచేది.. జీవిత చరమాంకందాకా తోడుగా నిలిచేది.. స్నేహం ఒక్కటే..! ఒక్కసారి చిగురిస్తే ఆజన్మాంతం గుర్తుండిపోతుంది. పరిస్థితులు ఏవైనా నేనున్నాననే ధైర్యం ఇస్తుంది. తప్పుచేస్తే దండిస్తుంది.. కష్టమొస్తే కుంగిపోతుంది.. ఇలాంటిదే సత్యవేడు నియోజకవర్గం, కేవీబీపురం మండలంలో వెలుగుచూసింది. విధి ఆడిన వింతనాటకంలో రెండుకాళ్లు చచ్చుబడి లేవలేని స్థితిలో ఉన్న తోటి విద్యార్థినికి స్నేహితులే అండగా ఉంటూ అక్షరాల వైపు నడిపిస్తున్నారు. రెండు కిలోమీటర్ల దూరంలోని బడికి నిత్యం వీల్ చైర్‌పై తీసుకెళ్తూ.. పాఠశాలలో సపర్యలు చేస్తూ.. వైకల్యాన్ని జయించేలా చేస్తున్నారు. చదువుల తల్లికి తోడుగా నిలుస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. వారి ఆదర్శానికి అధికారులు సైతం సలాం చేస్తున్నారు. అసలు ఆ కథేంటో.. ఆ స్నేహితుల విలువేంటో మీరే చదవండి.. కేవీబీపురం(తిరుపతి జిల్లా): విధి విసిరిన బాణానికి రెండుకాళ్లు చచ్చుబడినా కుంగిపోలేదు. మనోధైర్యంతో గుండె నిబ్బరం చేసుకుంది. ఒంట్లో సత్తువ లేకపోయినా తోటి స్నేహితుల సాయంతో బడిబాట పట్టింది. చదువుల్లో రాణిస్తూ లక్ష్యం వైపు దూసుకుపోతోంది.. కేవీబీపురం మండలానికి చెందిన జూయిస్. నాలుగేళ్ల పాటు బడికి దూరమైనా స్నేహితురాళ్ల సాయంతో మళ్లీ పెన్ను, పుస్తకం పట్టింది. ప్రభుత్వ సాయంతోపాటు స్నేహితుల సహకారంతో ఉన్నత చదువులు చదువుతానని చెబుతోంది. వివరాల్లోకి వెళ్లితే.. మండలంలోని పెరిందేశం గ్రామానికి చెందిన వెట్టి. ఇజ్రాయిల్, కన్నెమ్మ దంపతులకు దావిద్, జూయిస్ సంతానం. ఇజ్రాయిల్ నగిరి పోస్ట్ ఆఫీస్‌లో చిరు ఉద్యోగి. కన్నెమ్మ రోజువారి కూలీ. కుమార్తె జాయిస్ (14) 2012లో బంధువుల ఇంట్లో ఆడుకుంటూ టైల్స్‌పై జారిపడింది. అప్పట్లో కాలు విరిగినట్లు ధ్రువీకరించి వైద్యులు కట్టుకట్టి పంపించేశారు. క్రమేణా చిన్నారి కాళ్లు చచ్చు బడుతూ రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఉన్న రెండెకరాల పొలంతో పాటు సొంత్త ఇంటినీ తెగనమ్మి బిడ్డకు మూడు ఆపరేషన్లు చేయించారు. కానీ ఫలితం లేదు. చిన్నారి రెండు కాళ్ల చచ్చుబడ్డాయి. నడవలేని స్థితికి చేరింది. 3వ తరగతి నుంచి ఇంటి వద్దే ఉండిపోయింది. పాఠశాలకు వెళ్లివచ్చే స్నేహితులకు టాటా చెబుతూ సంబరపడేది. రెండేళ్ల క్రితం వారితోపాటు బడికి వెళ్లాలని నిశ్చయించుకుంది. వీల్‌చైర్ కొనిస్తే అన్నతో కలిసి బడికి పోతానని చెప్పడంతో తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. వీల్ చైర్ కొనిచ్చారు. దీనికితోడు అమ్మఒడి, పింఛన్ పథకాలు మంజూరు కావడంతో రెండు కిలోమీటర్ల దూరంలోని రాగిగుంట ఉన్నత పాఠశాలకు తోటి స్నేహితులతో పంపడానికి సమ్మతించారు. ఉపాధ్యాయుల ఉదారత జాయిస్ మూడో తరగతిలోనే బడికి దూరమైంది. కాళ్లు రెండూ చచ్చుబడడంతో ఇక బడికి వెళ్లలేనని భావించింది. కానీ చదువుపై ఆ విద్యార్థినికి ఉన్న మక్కువను చూసి ఉపాధ్యాయులే హాజరు వేసి.. హోంవర్క్‌లు ఇచ్చి పై తరగతులకు ప్రమోట్ చేశారు. అలా మూడేళ్లు అంటే ఆరో తరగతి వరకు నెట్టుకొచ్చారు. ఆ తర్వాత బాలికే స్వయంగా బడికిరావడంతో సంబరపడ్డారు. చిట్టి నేస్తాలు.. పెద్ద సాయం జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకున్న తన స్నేహితురాళ్లు శ్రుతి, మానస, మౌనిక, లావణ్య, భూమిక ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు, పక్క గ్రామంలో ఉన్న ట్యూషన్‌కు నిత్యం తీసుకెళ్లడం.. తీసుకొచ్చి ఇంటి వద్ద వదిలిపెట్టడం బాధ్యతగా తీసుకున్నారు. గ్రామస్తులు, తోటి విద్యార్థినీ, విద్యార్థులు కూడా పాఠశాలలో సపర్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఎలాంటి బిడియం లేకుండా కాలకృత్యాలకు తీసుకెళ్లడం.. మళ్లీ తీసుకొచ్చి క్లాసురూమ్‌లో కూర్చోబెట్టడం లాంటివి చేస్తుండడంతో అధికారులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు. డాక్టర్ అవుతా మా అమ్మానాన్నా, అన్నయ్య ఎంతో కష్టపడి నన్ను కాపాడారు. కంటికిరెప్పలా పెంచారు. ఇప్పటికే మా పరిస్థితి దారుణంగా ఉంది. చేతిలో చిల్లిగవ్వలేక.. సరైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. నాకు కృత్రిమ కాళ్లతో పాటు, ప్రభుత్వం, దాతలు మరింత సాయం అందిస్తే బాగా చదువుకుంటా. డాక్టర్ని అయ్యి ప్రతి ఒక్కరికీ నా వంతు సహకారం అందిస్తా. – జాయిస్ , విద్యార్థిని తనకోసం తరగతి గదినే కిందకు మార్చాం జాయిస్ పరిస్థితిని అర్థం చేసుకుని తొమ్మిదో తరగతి గదిని మిద్దెమీద లేకుండా కిందకు మార్చాం. చదువులో చురుగ్గా ఉంటోంది. కేవీబీపురం దివ్యాంగుల పాఠశాల నుంచి ప్రభుత్వం తరఫున సహకారం అందించాలని కోరాం. జాయిస్ పరిస్థితి తెలుసుకుని తోటి విద్యార్థులే బాధ్యత తీసుకుని అన్నీ చేస్తుండడం గొప్ప విషయం. – నారాయణమ్మ, రాగిగుంఠ ఉన్నత పాఠశాల, హెచ్ఎం స్నేహితులే అక్కున చేర్చుకున్నారు జాయిస్ మూడో తరగతి చదువుతున్నపుడు ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి మూడేళ్లు బడికి దూరమైంది. తిరిగి రెండేళ్లుగా తన స్నేహితుల సాయంతో బడికి వెళ్తోంది. స్నేహితురాళ్లే బడికి తీసుకెళ్లి, మళ్లీ ఇంటికి తీసుకొస్తున్నారు. తన అవసరాలు కూడా వాళ్లే తీరుస్తున్నారు. వారి పెద్ద మనసుకు దండం పెట్టాలనిపిస్తుంది. – కన్నెమ్మ, (జాయిస్) తల్లి ఏమాత్రం కష్టం అనిపించదు జాయిస్ పరిస్థితి మాకు తెలుసు. అందుకే తనని మా కాళ్లతో నడిపిస్తున్నాం. బడికి, ట్యూషన్‌కి మేమే తీసుకెళ్తాం. అందరం కలిసే భోంచేస్తాం. మా స్నేహితురాలిని మేమే చూసుకుంటాం. తనకి సేవ చేస్తుంటే ఏమాత్రం కష్టం అనిపించదు. జాయిస్ బాగా చదువుతుంది. చదువుల్లో రాణిస్తుంది. మాకు మంచి సలహాలు ఇస్తుంది. – చందు, (జాయిస్) స్నేహితురాలు మనోధైర్యానికి సలాం ఆ వయసు చిన్నారులు పరిస్థితులను అంత సులువుగా అర్థం చేసుకోలేరు. అయితే జాయిస్ మాత్రం తనంతటతానే మనోధైర్యాన్ని నింపుకుని మళ్లీ అక్షరాలకు చేరువైంది. చదువుపై ఎంతో మమకారం ఉన్న జాయిస్‌ను మరింత ప్రోత్సహిస్తాం. విద్యార్థినికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా చర్యలు చేపడుతాం. – లక్ష్మీపతి, ఎంఈఓ కేవీబీపురం -
పరిషత్ ఎన్నికలను చంద్రబాబు బహిష్కరించడం సిగ్గుచేటు
-
ఎమ్మెల్యే ఆదిమూలంకి కరోనా
సాక్షి, చిత్తూరు: కరోనా వైరస్ సామాన్యులనే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం ప్రస్తుతం తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో కోవిడ్ చికిత్స తీసుకుంటున్నారు. చదవండి: (95 వేలు దాటిన కోవిడ్ మరణాలు) -
మనస్తాపంతో బాలిక ఆత్మహత్య
సాక్షి, వరదయ్యపాళెం(చిత్తూరు) : తల్లిదండ్రులు మందలించారనే కోపంతో మనస్తాపానికి గురైన బాలిక బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సత్యవేడు పట్టణంలో మంగళవారం జరిగింది. సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు కథనం మేరకు సత్యవేడులోని బలిజ వీధికి చెందిన చెంచురాముడు, కవిత దంపతుల రెండో కుమార్తె స్వప్న స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం సీఈసీ చదువుతుంది. ఆదివారం రాత్రి తల్లిదండ్రులు మందలించారని ఆమె మనస్తాపానికి గురైంది. సోమవారం వేకువజామున ఇంటి నుంచి వెళ్లిపోయింది. తల్లిదండ్రులు ఆమె అదృశ్యమైందని పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం సత్యవేడు కాళమనాయుడుపేట సమీపంలోని వ్యవసాయ బావిలో స్వప్న శవమై తేలింది. స్థానికులు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగార్జునరెడ్డి తెలిపారు. ఉరేసుకుని మరో యువకుడు చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంకు చెందిన సి.జ్ఞానేష్నాయుడు(26) సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. సాంబయ్యకండ్రిగ ఇందిరమ్మ కాలనీలో కాపురముంటున్న జ్ఞానేష్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని మంగళవారం పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతికిగల కారణాలపై విచారణ నిర్వహిస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్ఐ నరేష్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
ఆక్రమణల పై ఉక్కుపాదం
-
సత్యవేడులో బాంబు కలకలం
సాక్షి, సత్యవేడు, చత్తూరు: స్వాతంత్య్ర దినోత్సవం తెల్లవారు జామున సత్యవేడులో బాంబు కలకలం సమాచారం స్థానిక పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. పోలీసుల కథనం.. తమిళనాడుకు చెందిన ఓ యువకుడు గురువారం తెల్లవారు జామున 3 గంటలకు రాష్ట్ర పోలీస్ అత్యవసర సేవ అయిన 100కు ఫోన్ చేసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపంలో బాంబు బ్లాస్ట్ చేయనున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీనిపై స్పందించిన తమిళనాడు రాష్ట్ర డీజీపీ, ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన చిత్తూరు జిల్లా ఎస్పీ వెంటనే పుత్తూరు డీఎస్పీ మురళీకృష్ణ, సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. హుటాహుటిన వీరందరూ కలసి సత్యవేడులోని వీఎంకే కల్యాణ మండపాన్ని తెల్లవారుజామున పరిశీలించారు. అక్కడ ఆ సమయానికి వివాహం జరుగుతుండగా వారిని వెలుపలికి పంపి మండపం పరిసరాలను అణువణువునా తనిఖీ చేశారు. అనంతరం అక్కడ వివాహ కార్య క్రమానికి వచ్చిన వారిని విచారణ చేశారు. అక్కడ ఎలాంటి బాంబులు అమర్చినట్లు ఆధారాలు లభ్యం కాకపోవడం, ఎలాంటి దుస్సంఘటనలు జరగకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై సత్యవేడు సీఐ బీవీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. ఉద్దేశపూర్వకంగా అలజడి సృష్టించేందుకు తమిళనాడు 100కు ఎవరో ఆగంతకుడు ఫోన్ చేసినట్లు వెల్లడించారు. ఫోన్ చేసిన నెంబరు ఆధారంగా కొందరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. తనిఖీలలో సత్యవేడు ఎస్ఐ నాగార్జునరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
టీడీపీపై డ్వాక్రా మహిళల తిరుగుబాటు
-
మైదుకూరులో డ్వాక్రా మహిళల ధర్నా
-
పసుపు-కుంకుమ బూటకమంటూ ఆగ్రహం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా సత్యవేడులో టీడీపీ అభ్యర్థిని డ్వాక్రా మహిళలు నిలదీశారు. చంద్రబాబు తీసుకువచ్చిన పసుపు-కుంకుమ వట్టి బూటకమని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పసుపు-కుంకుమ డబ్బులు తీసుకునేందుకు వందలాది మంది మహిళలు ఇరుగులం బ్యాంక్ వద్దకు వచ్చారు. అయితే పాత బకాయిలు చెల్లిస్తేనే పసుపు-కుంకుమ డబ్బులు ఇస్తామని బ్యాంక్ అధికారులు తేల్చిచెప్పడంతో మహిళలు నిరసనకు దిగారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడికి చేరుకున్నా.. బ్యాంక్ అధికారులు పట్టించుకోలేదు. దీంతో టీడీపీ నేతలను కడిగిపారేసిన మహిళలు.. ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. దీంతో టీడీపీ సత్యవేడు అభ్యర్థి జేడీ రాజశేఖర్ మహిళలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. -
అప్పుడే జగన్ భయపడలేదు : వైఎస్ విజయమ్మ
సత్యవేడు: కాంగ్రెస్ పార్టీని ఎదిరించినందుకు కేసులు పెట్టి జైలులో పెట్టినా, ఆస్తులు అటాచ్ చేసినా తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భయపడలేదని, అలాంటిది కేసీఆర్, మోదీలకు జగన్ భయపడుతున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు.. తన కుమారుడు భయపడతాడా అని వైఎస్ విజయమ్మ సూటిగా ప్రజల్నే అడిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ విజయమ్మ చిత్తూరు జిల్లా సత్యవేడులో ప్రసంగించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం, విలువలు గురించి మాట్లాడితే నవ్వు వస్తోందన్నారు. ఆయన ఎక్కడ ప్రజాస్వామ్య విలువలు కాపాడారో చెప్పాలని ప్రశ్నించారు. అసెంబ్లీలు దేవాలయాలవంటివని ఆనాడు జవహర్ లాల్ నెహ్రూ చెప్పారు.. అట్లాంటి దేవాలయాల గౌరవాన్ని మంటగలిపింది చంద్రబాబేనని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అసెంబ్లీలో వైఎస్ జగన్‌ను, రాజశేఖర్ రెడ్డిని తిట్టడానికే ప్రాధాన్యమిచ్చేవారని అన్నారు. వైఎస్సార్సీపీకి మైక్ ఇచ్చినట్లే ఇచ్చి చంద్రబాబు, స్పీకర్‌కు సైగ చేసి మైక్ కట్ చేయించే వారని చెప్పారు. అసెంబ్లీలో మైక్ లేకుండా ప్రజాసమస్యలపై ఎలా పోరాడతారో చెప్పాలన్నారు. ఏరోజూ కూడా ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా టీడీపీ నాయకులు అడ్డుకునే వారని ఆరోపించారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్లు కొన్నారని వ్యాఖ్యానించారు. పైపెచ్చు వారితో రాజీనామా చేయించకుండా నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారని దుయ్యబట్టారు. టీడీపీకి దమ్మూ దైర్యం ఉంటే వారితో రాజీనామా చేయించి టీడీపీ గుర్తుపైన గెలిచిపించుకుని ఉండాల్సిందన్నారు. ఎన్నిసార్లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయం జరగదని భావించి ప్రజాసంకల్పయాత్రకు వైఎస్ జగన్ పూనుకున్నాడని తెలిపారు. వైఎస్సార్సీపీలోకి ఏ పార్టీ నాయకుడు వచ్చినా ముందు రాజీనామా చేసి వచ్చిన తర్వాతే పార్టీలోకి చేర్చుకున్నాడని, దీనికి శిల్పా చక్రపాణి రెడ్డే ఉదాహరణ అని చెప్పారు. సేవా మిత్ర యాప్ ద్వారా చంద్రబాబు నాయుడు ఆంధ్రుల డాటా చోరీ చేశారని, దానిని ఐటీ గ్రిడ్ కంపెనీకి ఇచ్చి పెద్ద మోసానికి తెరలేపారని ఆరోపించారు. ఆ డాటాతోనే వైఎస్సార్సీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఈనాటికీ సజీవంగా ఉందంటే దానికి వైఎస్ జగనే కారణమన్నారు. ఆంధ్రా, ఢిల్లీలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలతో వైఎస్ జగన్ ప్రత్యేక హోదా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీ పదవులకు కూడా రాజీనామా చేయించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. బీజేపీతో ఉన్నపుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నాడు..మరి ఇప్పుడో చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి ఉన్నపుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అన్నాడు.. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వైఎస్ జగన్ బీజేపీతో కలిశాడని ఆరోపిస్తున్నారు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతోనూ పెట్టుకోలేదని స్పష్టంగా చెబుతున్నామని, తాము సింగిల్‌గానే పోటీ చేస్తున్నామని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా రావాలని, 25 మంది వైఎస్సార్సీపీ ఎంపీలు గెలిపిస్తే ప్రత్యేక హోదా తెచ్చుకోవడం తేలికవుతుందని చెప్పారు. పెద్దన్నయ్య అంటూ ముందుకు వస్తున్న చంద్రబాబు ఈ ఐదేళ్లు ఏమయ్యాడని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మాత్రమే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వస్తారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాగానే ఖాళీల భర్తీ అధికారంలో ఉండి ఖాళీగా ఉన్న 2.42 లక్షల ప్రభుత్వ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదని వైఎస్ విజయమ్మ సూటిగా అడిగారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే భర్తీ చేస్తారని హామీ ఇచ్చారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేవిధంగా చట్టచేస్తామని చెప్పారు. 17 కేసుల్లో స్టే తెచ్చుకుని తిరుగుతున్నది ఎవరని పరోక్షంగా చంద్రబాబు నుద్దేశించి ప్రశ్నించారు. కేసుల్ని ఎదుర్కొనే దమ్మూ ధైర్యం నీకు లేదు.. స్టే తెచ్చుకుని బతుకుతున్నారు.. బ్రీఫ్డ్మీ అనే స్వరం మీది కాదా.. ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు హైదరాబాద్ నుంచి అమరావతికి ఆఘమేఘాల మీద పారిపోయిన చరిత్ర చంద్రబాబుదన్నారు. కేసుల కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే నీచపు చరిత్ర చంద్రబాబుదేనని మండిపడ్డారు. -
చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామన్న యువతి
-
వైరల్ : చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామన్న యువతి
సాక్షి, చిత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సొంత జిల్లాలోనే ఎదురుగాలి వీస్తోంది. ప్రజల సంక్షేమం పట్టించుకోని బాబుకు ఈ సారి ఓట్లేసే ప్రసక్తే లేదని అక్కడి ప్రజలు తేల్చిచెప్తున్నారు. టీడీపీ పెట్టిన పథకాలు ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఉన్నాయా..? అని ప్రశ్నిస్తున్నారు. చంద్రన్న భీమా కింద రావాల్సిన డబ్బులను ఇవ్వకుండా మోసం చేస్తున్నారని సత్యవేడు నియోజకవర్గం బీఎం కండ్రిక మండలం కొత్తూరుకు చెందిన చాందిని అనే యువతి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెక్కులు ఇచ్చినట్టు ఫొటోలు తీసుకుని మొండి చేయిచూపించారని ఆమె మండిపడ్డారు. చెక్కు ఇవ్వాలని నిలదీసి అడిగితే.. మీకు బీమా వర్తించదని చెప్తున్నారని ఆమె వాపోయారు. వర్షాలు పడినప్పుడు మాత్రమే తాగునీరు ఉంటుందని, మిగతా రోజుల్లో ప్రజలు చావాలా అని ఆమె ప్రశ్నించారు. ప్రజలంటే అంత అలుసా అని మండిపడ్డారు. మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబుకు ఈ సారి ఒక్క ఓటు కూడా ఎవరూ వేయరని అన్నారు. కాగా, బాబుపై చాందిని ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లో ఉద్రిక్తత
తిరుపతి : చిత్తూరు జిల్లాలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సత్యవేడు శ్రీసిటీ సెజ్‌లోని ఓ పరిశ్రమలో కార్మికులు ఆందోళనకు దిగడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక ఓ పరిశ్రమలో 40 మంది కాంట్రాక్టు కార్మికులను యాజమాన్యం తొలిగించింది. దీంతో కార్మికులు పరిశ్రమ ముందు ఆందోళనకు దిగారు. ముందస్తుగా భారీగా పోలీసులను మెహరించారు. తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
వడదెబ్బకు వృద్ధుడి మృతి
సత్యవేడు : రోజురోజుకు మండుతున్న ఎండలు ప్రాణాలను హరిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వరదయ్యపాళెం మండలంలో వడదెబ్బ తగిలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. వరదయ్యపాళెం మండలం వడ్డిపాళెంకు చెందిన కె.సుందరయ్య (72) రెండు రోజుల క్రితం పొలం నుంచి తిరిగి వచ్చి సొమ్మసిల్లి పడిపోయాడు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. -
సత్యవేడులో రెండిళ్లలో చోరీ
చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు పట్టణం కాపువీధిలో దొంగలు తెగబడ్డారు. వివరాలు..కాపువీధికి చెందిన వచ్చల అనే మహిళ వారం రోజుల క్రితం బెంగుళూరులో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లింది. దొంగలు సదరు మహిళ ఇంటి కిటీకీలు తొలగించి బీరువాలో ఉన్న 20 సవర్ల బంగారం ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా పగలగొట్టి ఉండటంతో దొంగలు పడ్డారన్న విషయం అర్ధమైంది. ఆదివారం రాత్రి అదే వీధిలో ఉంటున్న ప్రసాద్ అనే వ్యక్తి తన ఇంట్లో నిద్రిస్తుండగా, ఇంట్లో చొరబడిన దొంగలు రూ.4 వేల నగదు, ఓ సెల్‌ఫోన్ అపహరించుకుపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సత్యవేడులో 2 కేజీల బంగారం చోరీ
చిత్తూరు: చిత్తూరు జిల్లా సత్యవేడు మండలంలోని ఓ షాప్ లో దొంగతనం జరిగింది. స్థానికంగా ఉండే మహాలక్ష్మీ పాన్‌బ్రోకర్(వడ్డీవ్యాపారి) షాపులో మంగళవారం రాత్రి 2 కేజీల బంగారాన్నిఎత్తుకెళ్లారు. దుకాణానికి వెనక వైపు రంధ్రం చేసి లోపలకి వెళ్లిన దుండగుల 2 కేజీల బంగారాన్ని అపహరించారు. దుకాణ యజమాని రాజేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం ఆధారాలను సేకరిస్తోంది. -
'దోచుకున్న భూముల కోసమే సెక్షన్ 8 డిమాండ్'
సత్యవేడు: హైదరాబాద్‌లో రూ. లక్ష కోట్ల విలువజేసే 1,000 ఎకరాల భూమిని దోచుకున్న భూ రాబందుల బాగోతం టీఆర్ఎస్ పార్టీ బయట పెట్టుతుందన్న భయంతోనే సెక్షన్ 8 అమలును టీడీపీ కోరుతోందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సత్యవేడులో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పనులను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఆ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే నీరు -చెట్టు పేరుతో వెచ్చిస్తోందన్నారు. ఉపాధి పథకం టీడీపీ నాయకుల ఆర్ధికాభివృద్ధి పథకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాజకీయ సంక్షోభం తప్పదని ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని, చంద్రబాబు స్థానంలో నారా లోకేష్‌బాబు సీఎంగా రావవచ్చని జోస్యం చెప్పారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఈ హాస్పిటల్‌ను విజయవాడకు తరలించేందుకు సదరు మంత్రి ప్రయత్నిస్తుంటే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే.. కాంగ్రెస్ ఊరుకోబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఓ అధికారి రూ. 15 లక్షలు ఓ పెద్ద నేతకు సమర్పించి సత్యవేడుకు వచ్చారన్నారు.