
తిరుపతి జిల్లా, సాక్షి: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల వరలక్ష్మీ అనే మహిళపై లైంగిక దాడి ఘటన మరువక ముందే ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు.
‘‘ కలర్ మారిపోయావు. పర్సనాలిటీ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి బ్యూటిఫుల్‌గా ఉన్నావు. అప్పటికి ఇప్పటికీ సూపర్ ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు’’ అంటూ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది.
ఇలా అసభ్యకరంగా మహిళతో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయారు. గత నెలలో వరలక్ష్మి అనే మహిళపై లైంగిక దాడి ఘటనలో అడ్డంగా దొరికిపోయినా.. ఆయన మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్ విషయంలో.. ఎమ్మెల్యే తీరుపై నియోజవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించిన విషయం తెలిసిందే. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.
Comments
Please login to add a commentAdd a comment