audio leaked
-
దళిత సంఘం నేత రాంపుల్లయ్యను బెదిరిస్తున్న జేసీ ప్రభాకర్
-
గౌడ కులస్థుడికి టీడీపీ నేత వార్నింగ్
-
వీఆర్ వో నాగేంద్రతో టీడీపీ నేత నరసింహ యాదవ్ ఫోన్ సంభాషణ
-
విశాఖలో సంచలనం రేపిన హనీ ట్రాప్ కేసులో బీజేపీ యువ నేత
-
మోహన్ బాబు సంచలన ఆడియో లీక్..!
-
మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన కోనేటి ఆదిమూలం
-
మరో వివాదంలో ఆదిమూలం.. ఆడియో లీక్
తిరుపతి జిల్లా, సాక్షి: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఆడియో క్లిప్ కలకలం రేపుతోంది. అసభ్య పదజాలంతో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల వరలక్ష్మీ అనే మహిళపై లైంగిక దాడి ఘటన మరువక ముందే ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నారు.‘‘ కలర్ మారిపోయావు. పర్సనాలిటీ పెరిగిపోయింది. అప్పటికి ఇప్పటికి బ్యూటిఫుల్‌గా ఉన్నావు. అప్పటికి ఇప్పటికీ సూపర్ ఉన్నావు. చాలా అందంగా ఉన్నావు’’ అంటూ ఓ మహిళతో మాట్లాడిన ఆడియో క్లిప్ సోషల్ మీడియా లో వైరల్‌గా మారింది. ఇలా అసభ్యకరంగా మహిళతో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయారు. గత నెలలో వరలక్ష్మి అనే మహిళపై లైంగిక దాడి ఘటనలో అడ్డంగా దొరికిపోయినా.. ఆయన మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్నారు. తాజాగా బయటపడిన ఆడియో క్లిప్ విషయంలో.. ఎమ్మెల్యే తీరుపై నియోజవర్గం ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గత నెలలో టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించిన విషయం తెలిసిందే. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ తీవ్ర దుమారం రేపింది.చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
మంత్రి మద్యం టెండర్.. బట్టబయలైన మంత్రి నారాయణ ఆడియో
-
హర్ష సాయి సంచలన ఆడియో లీక్
-
ఫీల్డ్ అసిస్టెంట్ కు బెదిరింపులు
-
టీడీపీ నేత ఆడియో లీక్
-
అనంతపురం జిల్లాలో టీడీపీ నేత బరితెగింపు
-
Audio Call: రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. లావణ్య-శేఖర్ బాషా ఆడియో లీక్!
-
రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. మరో సంచలన ఆడియో లీక్!
హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఆడియో కాల్లో లావణ్య.. ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. -
ఇంటికి వస్తావా..రావా..? టీడీపీ కామాంధుడు
-
షర్మిల ఆడియో లీక్
-
ఆడియోతో అడ్డంగా దొరికిపోయిన షర్మిల
అల్లూరి,సాక్షి: వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకును చీల్చడమే విపక్షాల కుట్రగా కనిపిస్తోంది. చంద్రబాబు డైరెక్షన్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా ఈ చీఫ్ ట్రిక్స్‌లో భాగం అయ్యారు. తాజాగా ఆమె ఆడియో క్లిప్ బయటకు రావడంతో ఆ కుట్ర బయటకు వచ్చింది.అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున బుల్లిబాబు పోటీ చేస్తున్నాడు. అయితే ఈయన అభ్యర్థిత్వం కంటే ముందు ఇక్కడ రేసులో ఉంది వంతల సుబ్బారావు. బుల్లిబాబు వైఎస్సార్సీపీ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. చేరి చేరగానే బుల్లిబాబునే పాడేరు అభ్యర్థిగా షర్మిల ప్రకటించారు. దీంతో తీవ్రంగా నొచ్చుకున్న సుబ్బారావు కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీలకే కాకుండా.. ఓటు బ్యాంకు ఏనాడో కనుమరుగైన కాంగ్రెస్‌లోనూ రెబల్స్ పోటు ఆసక్తికర చర్చకు దారి తీసింది. దీంతో వంతల సుబ్బారావుతో రాయబారానికి దిగారు. మీరు సొంత అన్నమాదిరి అని, అర్థం చేసుకోవాలని, తర్వాతిసారి చూద్దాం అంటూ బతిమాలాడారామె. అయితే.. ఏనాడూ జెండా మోయనోడికి టికెట్ ఇవ్వడం తనను బాధించిందని, పైగా తనతో మాట కూడా చెప్పకుండా వేల మంది ముందు బుల్లిబాబును అభ్యర్థిగా ప్రకటించడం తనను నిరాశ పర్చిందని షర్మిలతో ఆయన అన్నారు.కాంగ్రెస్ ఓటు బ్యాంకుతో పాటు వైఎస్సార్సీపీ ఓటు బ్యాంకు కలిసి వస్తుందనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు షర్మిల వంతల సుబ్బారావుకు స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే కాంగ్రెస్ గురించి మరిచిపోవాలంటూ బెదిరింపు స్వరంతో కోరారామె. చివర్లో.. కాంగ్రెస్‌కు డ్యామేజ్ చేయొద్దంటూ షర్మిల కోరగా.. తన భవిష్యత్తు ఆల్రెడీ డ్యామేజ్ అయ్యిందని ఆయన బదులిచ్చారు. -
వైఎస్ఆర్సీపీ పై షర్మిల కుట్ర.. ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయింది..
-
నారా భువనేశ్వరి సంచలన ఆడియో
-
నారా భువనేశ్వరి సంచలన ఆడియో
-
ఆలూరు సీటు తీసుకునేందుకు సిద్ధమైన బీజేపీ
-
మహిళా ఉద్యోగినిపై నోరుపారేసుకున్న టీడీపీ నేత సోమిరెడ్డి
-
బాబు సీటుపై అచ్చెన్నాయుడు నజర్..
-
దయచేసి రావాలి..!!
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసినా పార్టీ నాయకులు, క్యాడర్ బయటకు రాకపోవడంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షాత్తూ పార్టీ అధినేత ఇబ్బందుల్లో ఉన్నా ఎక్కడా నిరసనలు చేయకపోవడం సరికాదన్నారు. ఎందుకు ఆందోళనలు చేయడం లేదని చాలామంది తనను అడుగుతున్నారని, తనకు చాలా బాధగా ఉందని, ఇప్పటికైనా జనసమీకరణ చేయాలని పార్టీ నాయకులను ప్రాధేయపడ్డారు. ఆదివారం కృష్ణా జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జీలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఎలాగైనా జనాన్ని తరలించాలని అచ్చెన్నాయుడు వేడుకుంటున్న ఆడియో లీక్ అయింది. ‘పార్టీ అధ్యక్షుల వారిని అరెస్టు చేశారు. ఇంతకంటే మనకు, పార్టీకి ప్రాధాన్యత అంశం ఇంకొకటి లేదు.. రాదు కూడా! నేను ఈ కాన్ఫరెన్స్ నిర్వహించటానికి కారణం... ఆ చుట్కుపక్కల ప్రాంతాల్లో చాలా తక్కువ మంది మొబిలైజేషన్ ఉంది. పోలీసులు ఆపుతున్నారని మీరు అనవచ్చు. వాళ్లు చేస్తారు. దయ ఉంచి.. ఎక్కడి కక్కడ అర్బన్ నియోజకవర్గాల్లో బొండా ఉమ, గద్దె రామ్మోహన్, వన్‌టౌన్ నాయకులు, బోడె ప్రసాద్ బయటకు రావాలి. పెద్ద నాయకులను హౌస్ అరెస్టు చేస్తున్నారు గానీ సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్‌కు ఎక్కడా ఇబ్బంది లేదు. వెంటనే అందరూ రంగంలోకి దిగి జనసమీకరణ చేయాలి. అందులో మహిళలు ఎక్కువ మంది ఉండాలి’ అని అందులో అచ్చెన్న పేర్కొన్నారు. రాత్రి నుంచి చెబుతూనే ఉన్నా.. తాను రాత్రి 3 గంటల నుంచి జనసమీకరణ గురించి అందరికీ చెబుతూనే ఉన్నానని విజ యవాడ టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు నెట్టెం రఘురాం కాన్ఫరెన్స్‌లో వివరణ ఇచ్చారు. తమ నియోజకవర్గం వాళ్లను పో లీస్ స్టేషన్లో పెట్టారని, వాళ్లంతా చాలా చికాకుగా ఉందని ఫోన్లు చేస్తున్నారని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వాపోయారు. మహిళల్ని ఇబ్బంది పెట్టకపోయినా... వెళ్లిపోతారా? లేదా వ్యాన్ ఎక్కించమంటారా? అని అడుగుతున్నారని చెప్పారు. సెకండరీ లీడర్లు చాలా భయపడుతున్నారని, ప్రాక్టికల్‌గా చాలా ఇబ్బందిగా ఉందన్నారు. పోలీసులు బయటకు రానివ్వడం లేదని విజయవాడ సెంట్రల్ ఇన్‌ఛార్జి బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. చాలా ఇబ్బందులున్నాయని, 20 మంది కార్యకర్తలను పంపిస్తే రాత్రి 11 గంటలకు వదిలారని మచిలీపట్నం పార్లమెంటు అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ చెప్పారు. చంద్రబాబును అరెస్టు చేసి తిప్పుతున్నా చిన్న చిన్న కారణాలు చెప్పి బయటకు రాకపోవడం బాగోలేదని టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్థన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీ నేతలతో అచ్చెన్నాయుడు మాట్లాడిన టెలికాన్ఫరెన్స్ ఆడియో లీక్
-
పోయి కేసీఆర్ ని అడుక్కో..హోమ్ గార్డ్ ఆడియో లీక్ వైరల్
-
'పల్లా రాజేశ్వర్ రెడ్డికి మద్దతు తెలుపుదాం..' జనగామ జడ్పీ ఛైర్మన్ ఆడియో లీక్..
జనగామ: తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయదలచిన నాయకులు అంతర్గతంగా కార్యాచరణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల్లో బరిలో నిలబడటానికి నాయకులు పెద్ద ఎత్తున పైరవీలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనగామ నియోజక వర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలుపుదామని జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. పార్టీ జిల్లా అధ్యక్షులు జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి.. రెండు రోజుల క్రితం నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్ తో ఫోన్లో మాట్లాడారు. దాని సారాంశం ఏంటంటే.. జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల బరిలో నిలబడితే మద్దతు తెలుపుదామని సంపత్ రెడ్డి.. జడ్పీటీసీ మాలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని స్థానికుడంటూ పేర్కొంటూ.. సపోర్టు చేద్దామని అనుకున్నారు. నియోజక వర్గంలో ఉన్న 8 మండలాల నుంచి జడ్పీటీసీ, ఎంపీపీలతో కలిసి ఓ రిప్రజెంటేషన్‌ని సీఎం కేసీఆర్‌కి పంపించాలని మాట్లాడుకున్నారు. చేర్యాల, మద్దురు, దులిమిట, కొమురవేల్లి నాలుగు మండలాల నుంచి అభ్యర్థులు రాకపోవచ్చని సంపత్ రెడ్డి ఫోన్లో శ్రీనివాస్‌కు చెప్పారు. 'ఒకవేళ జనగామ నియోజక వర్గం నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డికి కాకుండా పోచంపల్లి శ్రీనివాస్‌కు సీటు ఇచ్చినా అభ్యంతరం లేదు. సీటు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి వస్తే అభ్యంతరం లేదు. శ్రీనన్న కనుక నాన్ లోకల్ అంటే మనం రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఇవ్వమని అడుగుదాం. నువు వెంటనే పల్లా రాజేశ్వర్ రెడ్డి సార్ కు ఫోను చెయ్యి, మళ్ళీ నాకు వెంటనే కాల్ చేసి చెప్పు. సారు తోటి మంచిగా మాట్లాడు, మీకు అంతా అనుకూలంగా ఉంటది అందరూ ఒకే అంటారు అని చెప్పు. నేను నర్మెట ZPTC ఫోన్ చేస్తాడు అని చెప్పిన. మన తమ్ముడే, రాజేశ్వర్ రెడ్డి సార్ అంటే పడి చస్తాడు అని చెప్పిన, నువ్వు కూడా అదేవిధంగా మాట్లాడు' అని సంపత్ రెడ్డి నర్మెట్ట జడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్‌తో మాట్లాడారు. ఇదీ చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు -
వైరల్ గా మారిన టీడీపీ నేత కూన రవికుమార్ బూతు పురాణం
-
కేటీఆర్ సార్ మీటింగ్‌కు వస్తారా.. లేకుంటే ఫైన్ కడతారా?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్రంలో తీగల వంతెన ప్రారంభానికి సిద్ధమైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న కేబుల్ బ్రిడ్జిని ఇవాళ (బుధవారం) మున్సిపల్ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. సాయంత్రం నుంచి ఈ బ్రిడ్జిపై రాకపోకలకు అనుమతించనున్నారు. కాగా, ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా అందరూ హాజరుకావాలని మహిళా సంఘాలకు బెదిరింపు కాల్ వెళ్లింది. రానిపక్షంలో ప్రతీ ఒక్కరికి రూ.100 జరిమానా విధిస్తామని హెచ్చరించిన ఆడియో కాల్ చక్కర్లు కొడుతోంది. అయితే, కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జిని కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ మహిళా సంఘాలకు ఫోన్ కాల్ వెళ్లింది. ఈ సందర్భంగా డీఆర్డీఏ సమన్వయ కార్యకర్త మహిళా సంఘాలకు ఫోన్ చేసి..‘కేబుల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవానికి వస్తారా.. లేక, ఫైన్ కడతారా?. దశాబ్ది ఉత్సవాల్లో మీరెవ్వరూ ఏ ప్రోగ్రామ్‌కు అటెండ్ కాకపోయినా మేం పట్టించుకోలేదు. మేమే వెళ్లాం.. కానీ, ఈరోజు కేబుల్ బ్రిడ్జ్ ఓపెనింగ్‌కు మాత్రం మంత్రి కేటీఆర్ వస్తున్నారు. కాబట్టి మీరంతా హాజరు కావాలి. ఒక్కో గ్రూప్ నుంచి కనీసం పది మంది రావాల్సిందే. ఎవరైనా ఒకరో, ఇద్దరో ఆరోగ్యపరంగా బాగా లేకపోతే సరేగానీ.. మిగిలిన వాళ్లంతా హాజరు కావాల్సిందే. లేకపోతే.. హాజరుకాని మహిళా సంఘాల్లో ఒక్కొక్కరి నుంచి వంద రూపాయల జరిమానా వసూల్ చేయమని మేడమే చెప్పారని ఆమె అన్నారు. ఇక, ఈ ఫోన్ కాల్ ఇప్పుడు కరీంనగర్లో వైరల్‌గా మారింది. ఇది కూడా చదవండి: గద్దర్ కొత్త పార్టీ.. కేసీఆర్ మీద పోటీకి రెడీ -
చేసిందే చెడ్డ పని పైగా ఆత్మహత్యాయత్నం
భారత మహిళా క్రికెటర్ స్నేహ్ రానా కోచ్ నరేంద్ర షాపై లైగింక వేధింపుల కేసు నమోదు అయింది. ఒక అమ్మాయిని వేధిస్తున్నట్టు ఆడియో ఆధారం లభించడంతో అతడిపై ఉత్తరాఖండ్ పోలీసులు పోక్సో(POCSO Act) చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆడియో లీక్ విషయం తెలియగానే నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నరేంద్ర షా డెహ్రాడూన్‌లో క్రికెట్ అకాడమీ నిర్వహిస్తున్నాడు. మోలి జిల్లాకు చెందిన మైనర్ యువతి చదువుకుంటూనే నరేంద్ర షా క్రికెట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. కొన్నాళ్లుగా నరేంద్ర సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్‌తో నరేంద్ర షా ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. ఆ ఆడియో వైరల్ కావడంతో అతడిపై పోక్సో చట్టం, ఐపీసీ సెక్షన్ 506తో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు బుక్ చేశామని నెహ్రూ కాలనీ పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ లోకేంద్ర బహుగుణ తెలిపాడు. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును ముమ్మరం చేశామని ఆయన వెల్లడించాడు. ఆడియో లీకేజీతో తన పరువు పోయిందని నరేంద్ర ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం స్నేహ్ రానాకు కోచ్‌గా ఉన్న నరేంద్ర షా ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం మాజీ సభ్యుడు. నరేంద్రపై పోక్సో కేసు నమోదైనట్లు తెలుసుకున్న ఉత్తరాఖండ్ క్రికెట్ అసోసియేషన్ అతడిని పదవి నుంచి తొలగించింది. టీమిండియా మహిళా క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న స్నేహ్ రానా ఇటీవలే వుమెన్స్ ఐపీఎల్ తొలి సీజన్ ఆడింది. గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆమె రెగ్యులర్ కెప్టెన్ బెత్ మూనీ గాయంతో టోర్నీకి దూరమవడంతో జట్టును నడిపించింది. కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించిన గుజరాత్ ప్లే ఆఫ్స్‌కు చేరలేదు. టేబుల్ టాపర్స్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో అడుగుపెట్టాయి. ఉత్కంఠ రేపిన టైటిల్ పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో ఢిల్లీపై గెలుపొందింది. నాట్ స్కీవర్ బ్రంట్ అర్ధ శతకంతో చెలరేగడంతో ఆ జట్టు తొలి సీజన్ చాంపియన్‌గా అవతరించింది. చదవండి: Kedar Jadhav: తండ్రి మిస్సింగ్ కేసులో క్రికెటర్‌కు ఊరట 'నెట్ బౌలర్‌గా ఆఫర్.. బోర్డు పరీక్షలను స్కిప్ చేశా' -
చంపుతమని తిరుగుతున్నరు.. కోమటిరెడ్డి ఆడియో కలకలం!
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు డాక్టర్ చెరుకు సుహాస్‌ను తన అభిమానులు చంపుతారంటూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బెదిరించినట్లుగా ఉన్న ఆడియో లీక్ అయ్యింది. అసభ్యంగా వారిద్దరినీ దూషించినట్లున్న ఆ ఆడియో ఆదివారం కలకలం రేపింది. అసలు ఆడియోలో ఏముందంటే.. ‘చూసినవా స్టేట్మెంట్.. (అంకుల్ అది వాట్సప్‌లో అట్ల ఇచ్చిండు కానీ ఆ వీడియో ఒకసారి మీరు పూర్తిగా చూడండి–ఎదుటి వ్యక్తి వాయిస్) ఏం చూసుడు. వాన్ని చంపుతమని తిరుగుతున్నరు. వంద మంది వెహికిల్ వేసుకొని తిరుగుతున్నరు. ఈ వీడియో కాదు నన్ను వందసార్లు తిట్టిండు. నెలరోజులు ఓపిక పట్టి ఇప్పుడు వంద కార్లలో వాణ్ని చంపుతమని తిరుగుతున్నరు. నిన్ను కూడా చంపుతరు. నీ హాస్పిటల్‌ను కూడా కూలగొడుతరు. లక్షల మందిని బతికించిన నేను. వానికెంత ధైర్యం నిన్న మొన్న పార్టీలకొచ్చి.. వాణ్ని వదిలిపెట్టర్రా.. నేను చెబుతున్న నీకు, వార్నింగ్ ఇస్తున్న. నేను ఆపలేను .. క్షమించమని చెప్పి, నా పేరు తీసుకొని మొన్న స్టేట్మెంట్లు ఇచ్చిండు ఓపిక పట్టిండ్రు. సార్ మాతో ని కాదిగ, నువ్వేమో ఏమనొద్దంటున్నవ్ సార్.. మేము వెళ్లినం బయటికి, యాడ దొరికితే ఆడ చంపేస్తం అంటుండ్రు వాళ్లు. నా తోని కాదు.. వాడు క్షమాపణ చెప్పకపోతే మాత్రం చంపేస్తరు... అసోంటి వంద వీడియోలు, డైరెక్టు పేరు పెట్టి వందసార్లు తిట్టిండు వాడు. ఇప్పుడొక బ్యాచ్ వెళ్లింది. నిన్ను కూడా చంపుతరు చెబుతున్న అరేయ్... నీ హాస్పిటల్ నడువదు. 25 ఏళ్లలో లక్షల మందిని బతికించిన నేను. వారందరిని కంట్రోల్ చేస్తానా నేను. అతనికి ఫోన్ చేసి చెప్పు.. అరేయ్ నీకు పార్టీ ఉన్నదారా.. ఇంటిపార్టీ ఏందిరా.. నువ్వు కౌన్సిలర్‌గా గెల వవు.. ఆయన అంతపెద్ద లీడరు అని చెప్పు. వాడు జైళ్ల పడితే నేను ఒక్కడినే పోయిన. ఎవరూ పోలే అప్పుడు. చెప్పు.. వారంకంటే ఎక్కువుండడాడు’. కోమటిరెడ్డి దిష్టిబొమ్మ దహనం డాక్టర్ చెరుకు సుధాకర్‌ను, ఆయన కుమారుడిని చంపుతామంటూ బెదిరించినట్లుగా ఆడియో లీక్ నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్లగొండ గడియారం సెంటర్లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిష్టి»ొమ్మను దహనం చేశారు. కాగా, ఎంపీ కోమటిరెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టి వెంటనే అరెస్టు చేయాలని బీసీ యువజన సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దరిద్రుడు, చీడపురుగంటూ నన్ను తిట్టుడేంది: కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటినుంచి చెరుకు సుధాకర్ నాపై కామెంట్స్ చేస్తుండు. ఒకసారి దరిద్రుడని, మరోసారి చీడపురుగని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నడు. సోషల్ మీడియాలో పోస్టులు ఎందుకు పెడుతున్నరని ఆయన కొడుకును అడిగితే పెడితేఏంది అంటూ వంకర టింకర మాట్లాడుతుండు. ఇది ఎంతవరకు కరెక్టు. పార్టీకి పని చేయాలి. నన్ను తిట్టుడేంది? నా కొడుకుకు ఫోన్ చేసి నన్ను తిట్టడం ఆశ్చర్యం కలిగించింది: చెరుకు సుధాకర్ వెంకట్‌రెడ్డి అసభ్యంగా నన్ను తిట్టడం అశ్చర్యం కలిగించింది. నేను కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌గా, అతను స్టార్ క్యాంపెయినర్‌గా ఉండి ఒకే పారీ్టలో పని చేస్తున్నా నాపై అత్యంత నేరపూరితమైన, టెర్రరిస్టు భాష మాట్లాడారు. ఆయనకు మతి ఉండి మాట్లాడుతుండో.. మతి లేక మాట్లాడుతుండో అర్థం కావడంలేదు. ఆడియో టేపును తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి పంపించా. కోమటిరెడ్డిని నేను వ్యక్తిగతంగా తిట్టిన సందర్భాలు లేవు. నయీం లాంటి కరుడు గట్టిన తీవ్రవాదే నన్నేమీ చేయలేకయాడు. కోమటిరెడ్డి ఏం చేస్తాడు? ఈ వ్యాఖ్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. -
జనం లేరు.. షాక్‌లో సార్!
సాక్షి, తిరుపతి: నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా జన సమీకరణకు టీడీపీ నేతలు పడుతున్న తిప్పలు, సీనియర్ నాయకుల హెచ్చరికలు సాక్ష్యాధారాలతో బహిర్గతమయ్యాయి. కుప్పంలో మొదలైన లోకేశ్ పాదయాత్ర గురువారం గంగాధర నెల్లూరు నియోజక వర్గానికి చేరుకుంది. జన సమీకరణపై బుధవారం రాత్రి టీడీపీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరికలు చేశారు. ఈ ఆడియో లీక్ కావడంతో కలకలం రేగింది. సంభాషణ సాగిందిలా... చిట్టిబాబు నాయుడు (టీడీపీ గంగాధర నెల్లూరు ఇన్చార్జి): అన్నా డీఎస్పీ ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకుంటున్నా. మీరు చెప్పినట్లుగా ఉదయాన్నే వెయ్యి మంది వచ్చేందుకు వాహనాలు అరేంజ్ చేశా. రోజూ పాదయాత్ర స్టార్ట్ అయ్యేలోపు ఆరు మండలాల్లోనూ 50 వాహనాలు ఏర్పాటు చేశా. 300 వాహనాలకు డబ్బులు కూడా ఇచ్చేశా. నాలుగు రోజులకు బుక్ చేశా. రోజూ 3 వేల మంది పాదయాత్రకు రావాలని చెప్పాం అన్నా. ► అచ్చెన్నాయుడు: మొన్న చూశారు కదా..! చిత్తూరులో చూసి నేను, సార్ (చంద్రబాబు) చాలా బాధపడ్డాం. ►చిట్టిబాబు నాయుడు: అన్నన్నా.. అలా జరగదన్నా. మా నియోజకవర్గంలో అలా జరగదన్నా. నేను చేస్తా. చిత్తూరులో ఏమైందో నాకు తెలియదు. ►అచ్చెన్నాయుడు: ఏంటంటే.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాదయాత్రలో జనం ఉండడం లేదు. పలుచగా ఉంటున్నారు. సాయంత్రం మాత్రం ఓ మోస్తరుగా వస్తున్నారు. జనం పలుచబడడం అనేది ఉండకూడదు. ఒక గ్రామం నుంచి వచ్చిన వారు మరో గ్రామం వరకు వచ్చేలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకో. ►చిట్టిబాబు నాయుడు: అలాగే అన్నా. ప్రతి కిలోమీటర్‌కు వెల్కమ్ పాయింట్లు ఏర్పాటు చేశా. అలా 10 ఏర్పాటు చేశానన్నా. వెల్కమ్ పాయింట్ల వద్ద వెయ్యి మంది ఉండేలా చూస్తున్నాం. డ్రమ్స్, మైక్‌లు ఉంటాయి. వచ్చిన వారికి మజ్జిగ ఇస్తున్నాం. పూలు చల్లడం, టపాకాయలు కాల్చడం, అక్కడే మహిళలు వచ్చి హారతులు ఇవ్వడం, గుమ్మడికాయలు కొట్టడం.. ఇవన్నీ ప్రతి జంక్షన్లో చేస్తున్నాం అన్నా. తమిళనాడు నుంచి జెండాలు కట్టేందుకు 5 వేల పైపులు తీసుకొచ్చాం. 14 కి.మీ జెండాలు కడతాం అన్నా. ►అచ్చెన్నాయుడు: ఓకే ఓకే.. థ్యాంక్యూ థ్యాంక్యూ. ఏదైనా ఉంటే నాకు చెప్పు. మండల, యూనిట్ ఇన్చార్జీలు బాధ్యత తీసుకోవాలి. జనం మొబిలైజేషన్ లేకపోతే మాకు తెలుస్తుంది. వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో మాదిరిగా కాకుండా విజయవంతం చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీ అందరికీ నమస్కారం. -
బోథ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఎమ్మెల్యే బెదిరింపులు
-
పదిమంది చేరేలా పక్కా ప్లానింగ్!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి శుక్రవారం లీకైన రెండు ఆడియోలు కలకలం రేపుతున్నాయి. ఈ కేసులో నిందితులుగా పోలీసులు ఆరోపిస్తున్న నందు, రామచంద్ర భారతి, సింహయాజితో పాటు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిల సంభాషణలతో కూడిన ఈ ఆడియో టేపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇవి ఈ నెల 26న అజీజ్‌నగర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన సమావేశానికి కొన్నిరోజులు ముందు జరిగిన ఫోన్ సంభాషణలుగా ఆడియోలు లీక్ చేసిన టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆడియోల్లో ఢిల్లీకి చెందిన పెద్దలను నంబర్–1, నంబర్–2 అంటూ సం¿ోదించడం, నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మొత్తం పది మంది బీజేపీలో చేరేలా ప్లానింగ్ చేస్తున్నామనడం, అమిత్ షాతో పాటు బీజేపీ సంస్థాగత వ్యవహారాల జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పేరును ప్రస్తావించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ వ్యవహారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలకు తెలియదని, అంతా కేంద్రస్థాయిలో జరుగుతోందని, మునుగోడు కంటే ముందే ఈ ఎపిసోడ్ పూర్తికావాలనే సంభాషణలు కూడా ఈ ఆడియో టేపుల్లో ఉన్నాయి. మొదటి ఆడియో క్లిప్‌లో రామచంద్రభారతి, నందకుమార్, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి నడుమ 7 నిమిషాలకు పైగా సంభాషణ జరగ్గా, రెండో ఆడియో క్లిప్ 27 నిమిషాల నిడివితో ఉంది. రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజిల మధ్య ఈ సంభాషణ జరిగింది. కాగా ఎమ్మెల్యేలకు ఎర అంశంలో బీజేపీ చేస్తున్న విమర్శల నేపథ్యంలో.. ఎర ప్రయత్నాలు నిజంగా జరిగాయనే విషయం నిర్ధారణ చేయడంలో భాగంగానే టీఆర్ఎస్ వర్గాలు ఈ ఆడియో క్లిప్‌లను విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఆడియో సంభాషణల్లో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ముగ్గురు, నలుగురు రాజీనామా చేస్తే ప్రభుత్వం రద్దు ‘రోహిత్‌రెడ్డితో పాటు ఎంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరేందుకు సిద్ధంగా ఉన్నారో తెలిస్తేనే పెద్దల ముందు కూర్చునే అవకాశం ఉంటుంది. పేర్లు ఖరారైతే అమిత్‌షాతో పాటు అందరినీ లైనప్ చేయాల్సి ఉంటుంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎంతైనా ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే నెల రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేస్తారు..’ అని రామచంద్ర భారతి అన్నారు. రోహిత్‌రెడ్డి రూ.100 కోట్లు అడుగుతున్నారు.. ‘బీజేపీలో చేరేందుకు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి వంద రూపాయలు (సంకేత భాషలో రూ.100 కోట్లు) అడుగుతున్నారు. ఆయనతో పాటు మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇండియా నంబర్ వన్‌తోనే డీల్ చేస్తున్నామని రోహిత్‌రెడ్డికి చెప్పాం. తొలి విడతలో నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటు మరో ఐదారుగురు మాజీ ఎమ్మెల్యేలు కలుపుకొని మొత్తంగా పది మంది బీజేపీలో చేరేలా ప్లానింగ్ చేస్తున్నాం..’ అని నందకుమార్, సింహయాజిలు ఢిల్లీ బీజేపీ దూతగా చెబుతున్న రామచంద్ర భారతికి ఫోన్లో వివరించారు. ఎమ్మెల్యేలతో ముఖాముఖికి ఏర్పాట్లు చేయండి.. ‘అమిత్ షాతో పాటు బీఎల్ సంతోష్ తో నేను రెండు గంటల పాటు మాట్లాడా. సిట్టింగ్ ఎమ్మెల్యేలు వస్తే ఎంతకైనా కొనుగోలు చేసేందుకు సిద్ధం. ఈ నెల 26న ఉదయం హైదరాబాద్‌కు వస్తా. రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ముఖాముఖి భేటీకి ఏర్పాట్లు చేయండి. అదే రోజు సాయంత్రానికి తుషార్‌ను కూడా హైదరాబాద్‌కు రమ్మని చెప్తా. డీల్ కుదిరితే 27న బీఎల్ సంతోష్‌తో కలిసి ఢిల్లీకి వెళదాం..’ అని రామచంద్ర భారతి సమాధానం ఇచ్చారు. మరో 15 మంది చేరతారు.. ‘పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ముందే పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు..’ అని రామచంద్ర భారతికి నందకుమార్ చెప్పారు. ‘చేవెళ్ల, పరిగి, కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలను కలుస్తాం. ఇప్పటికే కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలతో చర్చించాం. ఎమ్మెల్యేలకు నచ్చ చెప్పేందుకు ఎంతో కష్టపడుతున్నాం. ఇప్పటివరకు నలుగురు సిద్ధంగా ఉన్నారు. వెంట వెంటనే మరో 15 మంది కూడా చేరతారు. అయితే హైదరాబాద్‌కు వస్తేనే మిగతా ముగ్గురి పేర్లు వెల్లడించగలం..’ అని నందకుమార్, సింహయాజి చెప్పారు. సంజయ్, కిషన్‌రెడ్డి సమక్షంలో భేటీ ఉండదు ‘నలుగురు, ఐదుగురు అంటే కేంద్రం ఆసక్తి చూపదు. లేదంటే ప్రాజెక్టును డ్రాప్ చేద్దాం. డీల్ కుదిరితే బీఎల్ సంతోష్ ద్వారానే ముందుకు వెళతాం. బండి సంజయ్, కిషన్‌రెడ్డి సమక్షంలో ఈ భేటీ ఉండదు. ఢిల్లీలోనూ 43 మంది ఎమ్మెల్యేలు లైన్లో ఉన్నారు..’ అంటూ రామచంద్ర భారతి సుదీర్ఘ వివరణ ఇచ్చారు. దాసోజు శ్రవణ్ ద్వారా కాంగ్రెస్ నుంచి కూడా చేరికలు జరిగేలా చూడాలని ఆయన సూచించగా, ఇప్పటికే దాసోజుతో పాటు స్వామిగౌడ్, భిక్షమయ్య బీజేపీలో చేరారని సమాధానం ఇచ్చారు. స్థానికంగా బీజేపీ నాయకత్వం సరిగా లేదని నందకుమార్ అన్నారు. నందకుమార్‌కు ఏదైనా పదవి ఇచ్చి రక్షణ కూడా ఇవ్వాలని సింహయాజి కోరగా, ఎంపీ రఘురామ రాజు తరహాలో వై ప్లస్ రక్షణ ఇచ్చేలా చూస్తానని రామచంద్రభారతి హామీ ఇచ్చారు. సీఎంకు తెలిస్తే పని పడతారు: రోహిత్‌రెడ్డి ‘నాతో పాటు వచ్చేందుకు మరో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకున్నారు. అయితే పేర్లు కన్ఫర్మ్ చేసుకునేందుకు ఒకసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది. మునుగోడు ఉప ఎన్నిక ఉన్నందున హైదరాబాద్‌లో కలుద్దాం. మా సీఎం చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. ఆయనకు తెలిస్తే మా పని పడతారు. ఎక్కువమంది కోసం ప్రయత్నించకండి. నంబర్–2 ఎదుట చేరేందుకు సిద్ధంగా ఉన్న వారి పేర్లు చెబుతా. నా రక్షణ, భవిష్యత్తుపై నందూ నుంచి హామీ లభించింది..’ అని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫోన్లో వ్యాఖ్యానించారు. 26న భేటీకి అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ‘బెడ్ రెస్ట్‌లో ఉన్నందున 24 వరకు హైదరాబాద్‌కు రాలేను. బల్క్ రెడీగా ఉంటే 24 తర్వాత హైదరాబాద్‌లో కలిసి మాట్లాడుకుని మీరు ఇచ్చే ప్రపోజల్ ప్రకారమే ముందుకు వెళదాం. మునుగోడు ఎన్నిక జరిగే లోపే చేరికలు జరగాలి. 25న గ్రహణం ఉన్నందున 26న కూర్చునేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ భద్రత, మీ భవిష్యత్ అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో బీఎల్ సంతోష్ చాలా కీలకం. నంబర్–1, 2లే సంతోష్ ఇంటికి వస్తుంటారు. వారి ఇళ్లకు సంతోష్ వెళ్లరు. అది ఆర్ఎస్ఎస్ ప్రొటోకాల్. ఇలాంటి విషయాలను హ్యాండిల్ చేయడంలో బెంగాల్ ఎపిసోడ్ మాకు మంచి అనుభవం’ అని రామచంద్ర భారతి అన్నారు. -
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి హైకమాండ్ షోకాజ్ నోటీస్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ కాల్ రికార్డ్ లీక్ వ్యవహారంపై కాంగ్రెస్ హై కమాండ్ సీరియస్ అయ్యింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వెంకట్‌రెడ్డి ఆడియో లీక్‌పై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. మాణిక్యం ఠాగూర్ ఫిర్యాదుతో వెంకట్‌రెడ్డికి ఏఐసీసీ డిసిప్లినరీ కమిటీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల క్రితం మునుగోడు ఓటర్‌తో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరిన వెంకట్‌రెడ్డి ఆడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. చదవండి: మునుగోడులో పోస్టర్ వార్ కాగా, మునుగోడు ఉప ఎన్నిక వేళ.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాయిస్‌కాల్ ఆడియో లీక్
-
Munugode Bypoll: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆడియో లీక్ కలకలం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీక్ వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆడియో ప్రకారం.. ఉప ఎన్నికలో తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని పార్టీ నేతలకు ఫోన్ చేశారు కోమటిరెడ్డి. పార్టీలను చూడొద్దని, రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ఓడితే.. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ అవుతానంటూ వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, తెలంగాణలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని తెలిపారు. అప్పుడు పార్టీకి సాయం చేయాలని కోరారు. కానీ వ్యక్తిగతంగా ఈ ఒక్కసారికి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేయాలని తెలిపారు. పార్టీలు చూడవద్దని, ఏమైనా ఉంటే తాను చూసుకుంటానని వెంకట్ రెడ్డి అన్నారు. మనవాళ్లు వచ్చి కలుస్తారని, 25 ఏళ్ల వీళ్లంతా నుంచి తమ ఫ్యామిలీ మెంబర్స్ అని పార్టీ నేతతో సంభాషించిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దీనిపై స్పందించేందుకు వెంకటరెడ్డి అందుబాటులో లేరు. ఇదిలా ఉంటే కాంగ్రెస్‌కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటి వరకు కోమటిరెడ్డి ప్రచారానికి రాకపోగా.. కుటుంబ సభ్యులతో కలిసి పది రోజుల హాలీడే ట్రిప్ కోసం గురువారం రాత్రి ఆస్ట్రేలియా వెళ్లారు. చదవండి: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. టీఆర్ఎస్లోకి తిరిగి వలసలు -
పాక్ నేతల ఆడియో సంభాషణలు లీక్ కలకలం
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వంలోని కీలక నేతల మధ్య సాగిన సంభాషణల ఆడియో క్లిప్పులు బయటకు రావడం కలకలం రేపుతోంది. అత్యంత భద్రత ఉండే ప్రధానమంత్రి కార్యాలయంలో అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్(నవాజ్) నేతల సంభాషణలు ఆ క్లిప్పుల్లో ఉండటం గమనార్హం. అంతర్గత, రక్షణ, న్యాయ, ఆర్థిక శాఖల మంత్రులు రాణా సనాఉల్లా, ఖ్వాజా ఆసిఫ్, ఆజం తరార్, అయాజ్ సాదిఖ్‌లు గత తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ప్రభుత్వం గద్దె దిగడంపై చేసిన వ్యాఖ్యలు అందులో ఉన్నాయి. మరో ఆడియో క్లిప్పులో, ఆర్థిక మంత్రి ఇస్మాయిల్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎంఎల్–ఎన్ ఉపాధ్యక్షురాలు మరియం నవాజ్, ఆర్థిక మంత్రి షెహబాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన సంభాషణ ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంపై స్పందించలేదు. ప్రతిపక్షాలు మాత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. -
కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్న పాల్వాయి స్రవంతి ఆడియో
సాక్షి, నల్గొండ/హైదరాబాద్: మునుగోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ వార్ మొదలైంది. రేవంత్‌రెడ్డి వైఖరిపై సీనియర్ నేతలు తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారు. బుధవారం.. ఏఐసీసీ సెక్రటరీ బోస్‌రాజు ఆధ్వర్యంలో మనుగోడు అభ్యర్థి ఎంపికపై గాంధీ భవన్లో సమావేశం జరగనుంది. సమావేశానికి ముందే సీనియర్ నేత పాల్వాయి స్రవంతి కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో లీక్ గాంధీభవన్‌లో చర్చాంశనీయంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఈ ఆడియో కలకలం రేపుతోంది. చదవండి: మునుగోడులో టీఆర్ఎస్ దిద్దుబాటు చల్లమల్ల కృష్ణారెడ్డికి టికెట్ ప్రతిపాదనను పాల్వాయి స్రవంతి వ్యతిరేకిస్తున్నారు. ‘‘చండూరు సభ నా వల్లే సక్సెస్ అయ్యింది. కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే హుజురాబాద్ సీన్ రిపీట్ ఖాయం. ముక్కు, మొహం తెలియని కృష్ణారెడ్డికి టికెట్ ఇస్తే ఊరుకోను’’ అని స్రవంతి తేల్చి చెప్పారు. రేవంత్ పరువు నిలబెట్టుకోవాలంటే గెలిచేవారికే టికెట్ ఇవ్వాలంటూ స్రవంతి ఆడియో వైరల్‌గా మారింది. -
సింగర్ శ్రావణి భార్గవి ఆడియో లీక్
-
ఆడియో వైరల్: బండ బూతులు తిట్టుకున్న టీడీపీ నాయకులు
ఓడీ చెరువు/నల్లమాడ(శ్రీసత్యసాయి జిల్లా): పుట్టపర్తి నియోజకవర్గంలోని ఓడీ చెరువు, నల్లమాడ మండలాలకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకులు ఫోన్లో బండబూతులు తిట్టుకున్న ఆడియో శనివారం సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ విషయం నియోజకవర్గ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో టీడీపీలో వర్గవిభేదాలు తార స్థాయిలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ఆ పార్టీలో మరో నాయకుడు సైకం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్ ఈ నేపథ్యంలో ఓడీ చెరువు మండలానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి సైకం శ్రీనివాసరెడ్డికి దగ్గరై అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. శనివారం టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా మహానాడుకు ఇరువర్గాలకు చెందిన నాయకులు తరలివెళ్లారు. ఈ క్రమంలో నల్లమాడకు చెందిన పల్లె అనుచరుడు ఓడీ చెరువుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధితో ఫోన్లో మాట్లాడతూ ‘పల్లె భిక్షతో ప్రజాప్రతినిధి అయ్యావు. ఆనాడు పల్లె రెడ్డి సామాజిక వర్గాన్ని కాదని మైనార్టీ వర్గానికి చెందిన నీకు పదవి ఇచ్చాడు. ఆ పదవిని అడ్డుపెట్టుకుని మండలంలో కార్పొరేషన్ రుణాల్లో భారీగా దండుకున్నావు’ అంటూ రాయలేని భాషలో బండబూతులు తిట్టిన ఆడియో వైరల్ అయ్యింది. పల్లెకు వ్యతిరేకంగా పని చేస్తూ పార్టీని బ్రష్టు పట్టిస్తున్నావంటూ ఆక్రోశం వెళ్లకక్కాడు. తీవ్రస్థాయిలో తిట్లు దండకంతో ఒకరినొకరు ఎత్తుపోసుకున్నారు. ఈ ఆడియో విన్న పలువురు టీడీపీలో వర్గవిభేదాలు తార స్థాయికి చేరాయని చర్చించుకుంటున్నారు. -
త్రివిక్రమ్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఆడియో లీక్‌పై స్పందించిన బండ్లగణేష్
Bandla Ganesh Clarity On Audio Leak : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అన్న సంగతి తెలిసిందే. ఇక ఆయన సినిమా ఫంక్షన్లకి బండ్ల గణేష్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అయితే రీసెంట్గా పవన్ నటించిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి తనను రాకుండా త్రివిక్రమ్ అడ్డకుంటున్నారంటూ బండ్ల గణేష్ మాట్లాడిన ఓ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందులో త్రివిక్రమ్‌ని దూషిస్తూ బండ్ల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనూ చర్చనీయాంశమయ్యాయి. అయితే తాజాగా ఈ ఆడియో క్లిప్‌పై స్పందించిన బండ్ల గణేష్.. అది తన గొంతు కాదని, ఎవరో కావాలనే ఇలా క్రియేట్ చేశారంటూ కొట్టి పారేశారు. అయితే దీనిపై అఫీషియల్‌గా ఓ స్టేట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఆయన ఇష్టపడకపోవడం గమనార్హం. కాగా పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్లుగా నటించిన భీమ్లా నాయక్ చిత్రం ఈనెల 25న రిలీజ్ కానుంది. -
టీడీపీ కుట్ర బట్టబయలు.. చంద్రబాబు ఆడియో లీక్..
సాక్షి, అమరావతి: ప్రజల్లో ఆదరణ కోల్పోయి... తెలుగుదేశం పార్టీ పాతాళానికి కూరుకుపోయిన తరుణంలో ఎటూ పాలుపోని చంద్రబాబు రాద్ధాంతాలనే నమ్ముకున్నారు. అలాగైనా తానున్నానని ప్రజలకు చూపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారనేది ఇటీవలి సంఘటనలను బట్టి స్పష్టమవుతోంది. గుంటూరు జిల్లా వెల్దుర్తిలో వ్యక్తిగత కారణాలతో జరిగిన ఓ హత్యను రాజకీయం చేయడానికి ఆయన పన్నిన కుట్ర ఆడియో లీకవటంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ ఘటనను పెద్ద గొడవగా ఎలా చిత్రీకరించాలో.. రాష్ట్ర వ్యాప్త అంశంగా ఎలా చూపాలో అని చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇతర నేతలు టెలి కాన్ఫరెన్స్‌లో చేసుకున్న వ్యాఖ్యలన్నీ ఈ ఆడియోలో ఉన్నాయి. మాచర్ల టీడీపీ ఇన్చార్జి బ్రహ్మానందరెడ్డి, నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో చంద్రబాబు మాట్లాడుతుండగా ఇంకా పలువురు నేతలు పాల్గొన్న టెలికాన్ఫరెన్స్ అది. ఈ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ‘‘వెంటనే హత్య జరిగిన చోటుకు వెళ్లిపోవాలి!! అందరూ వెళ్లిపోవాలి..!! తిరుగుబాటు చేయాలి!. అక్కడి నుంచి ఇది పెద్ద ఇష్యూ అయిపోవాలి. మొత్తం స్టేట్ ఇష్యూగా మారిపోవాలి’’ అంటూ బ్రహ్మానందరెడ్డికి, ఇతర నేతలకు ఫోన్లో నూరిపోశారు. తాను మామూలుగా కాకుండా వంద కార్లతో బయలు దేరుతున్నానని, తమ వాళ్లందరినీ రమ్మన్నట్లు బ్రహ్మానందరెడ్డి చంద్రబాబుకు చెబుతుండగా.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని ‘‘ఆంజనేయులు గారు.. మీరు కూడా 100–150 కార్లతో వెళ్లండి. నియోజకవర్గ స్థాయి వాళ్లకే కాకుండా సెకండ్ క్యాడర్ వాళ్లనీ రమ్మనండి. కిందవాళ్లు వస్తే ఇంకా బాగా ఉంటుంది.. ఈ దెబ్బతో విషయం అటో ఇటో తేలిపోతుంది’’ అంటూ మధ్యలో ‘తమరు కూడా వెళితే బాగుంటుంది సర్’ అని చంద్రబాబుకు సూచించారు. దీంతో చంద్రబాబు ‘‘అదే ఆలోచిస్తున్నా’’ అంటూ ఆ నిమిషంలో వెల్దుర్తి టూర్‌ను ఖరారు చేసేశారు. తాను బయల్దేరుతున్నానని చెప్పగా బ్రహ్మానందరెడ్డి తాను 100 కార్లతో స్వాగతం పలికి మిమ్మల్ని తీసుకెళతానని ఫోన్లో చెప్పారు. ఇంత రాజకీయమా? మారుమూల గ్రామంలో వ్యక్తిగత కారణాలతో జరిగిన హత్యను రాష్ట్ర వ్యాప్త సమస్యగా, శాంతిభద్రతల అంశంగా మార్చేందుకు చంద్రబాబు పరివారం ఎంత ప్రణాళిక రచించిందో ఫోన్ కాన్ఫరెన్స్ కాల్ బయటపెట్టింది. అన్నట్టుగానే చంద్రబాబు మందీమార్బలంతో అక్కడకు వెళ్లి తొడ గొట్టడం, వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా దుర్భాషలాడడం, చివరికి మృతి చెందిన చంద్రయ్య పాడె మోసి సానుభూతి కోసం పడిన తపనను ఎల్లో మీడియా గొప్పగా చూపడం.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగాయని తెలిశాక ఆశ్చర్య పోవటం సామాన్యుల వంతయింది. నరసరావుపేటలో ఎదురుదాడి.. ఆ తర్వాత రెండురోజులకే నరసరావుపేట మండలం జొన్నలగడ్డలో వైఎస్సార్ విగ్రహం మాయమైన ఘటనలో తప్పు తమ వైపే ఉన్నా ఎదురుదాడికి దిగి తమపై దాడి చేశారని రాద్ధాంతం చేశారు తెలుగుదేశం శ్రేణులు. నిజానికి అక్కడ మాయమైంది వైఎస్సార్ విగ్రహం. సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ఆ సమయంలో అక్కడ తిరిగిన వారిని పోలీసులు అరెస్టు చేస్తే.. దానిపై అక్కడి టీడీపీ నేతలంతా గొడవకు వెళ్లడం గమనార్హం. విగ్రహాన్ని మాయం చేసింది కాకుండా అందుకు బాధ్యుల్ని అరెస్టు చేయడాన్ని అడ్డుకుని, అక్కడి టీడీపీ ఇన్చార్జి అరవింద్‌బాబు నానా యాగీ చేశారు. చివరకు తమపై పోలీసులు దాడి చేశారంటూ అసలు విషయాన్ని పక్కదారి పట్టించేలా గగ్గోలు మొదలెట్టారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ అసలు విషయాన్ని వదిలేసి తమ నాయకుడిపై దాడి చేశారంటూ హడావుడి చేశారు. ఇలా ప్రతి సందర్భాన్ని రాజకీయం చేసి ప్రజల దృష్టి తమపై పడేలా చేసేందుకు చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. చిన్న గొడవను పెద్దది చేయడం, మీడియా సమావేశాలు పెట్టి దాన్ని నేరుగా సీఎం జగన్‌కు లింకు పెట్టడం, తమపై దౌర్జన్యాలు చేస్తున్నారంటూ బురద జల్లడం బాబుకు నిత్యకృత్యమైపోయింది. క్యేడర్ వినడం లేదనే...! స్థానిక ఎన్నికలు, తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం, చివరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో దారుణమైన భంగపాటుతో టీడీపీ పరిస్థితి దయనీయంగా తయారైంది. చంద్రబాబే స్వయంగా ఓడిపోవడంతో పార్టీపై క్యాడర్‌కు నమ్మకం పోయింది. ధర్నాల వంటి కార్యక్రమాలకు పిలుపునిస్తే పార్టీ నాయకులు కూడా పాల్గొనడంలేదు. బాబు ఎంత బతిమాలినా పార్టీ ఇన్చార్జిలు నియోజకవర్గాలకు వెళ్లడంలేదు. మరోవైపు లోకేష్‌కు, సీనియర్ నాయకులకు పొసగకపోవడంతో అనేక సమస్యలొస్తున్నాయి. దీంతో ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సోషల్ మీడియాలో కొంత హడావుడి తప్ప టీడీపీ పరిస్థితి క్షేత్ర స్థాయిలో పూర్తిగా దిగజారిపోయిందని ఆ పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. అందుకే చంద్రబాబు రాద్ధాంతాలపై దృష్టిపెట్టారనేది వారి మాటగా వినిపిస్తోంది. -
మరోసారి బయటపడ్డ టీడీపీ కుట్రలు
-
కోహ్లీ, రవిశాస్త్రి ఆడియో లీక్..
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ రవిశాస్త్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో లీకైంది. న్యూజిలాండ్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిన్ ఫైనల్‌కు ముందు టీమిండియా అనుసరించాల్సిన వ్యూహాలపై కెప్టెన్, కోచ్ డిస్కస్ చేసిన అంశాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఇంగ్లండ్‌కు బయల్దేరే ముందు ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లీ మాట్లాడారు. అయితే, ఈ సమావేశానికి కొన్ని నిమిషాల ముందు రవిశాస్త్రితో కోహ్లీ మాట్లాడిన మాటలు లీకయ్యాయి. లైవ్ ఇంకా స్టార్ట్ కాలేదని భావించిన కోహ్లీ.. డబ్యూటీసీ ఫైనల్లో న్యూజిలాండ్ లెప్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను ఎలా ఔట్ చేయాలనే అనే అంశంపై రవిశాస్త్రితో చర్చించాడు. 🗣️ Happy to have the opportunity to play the World Test Championship Final: #TeamIndia Captain @imVkohli ☺️ pic.twitter.com/jjFEwEisrD — BCCI (@BCCI) June 2, 2021 ఈ క్రమంలో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌లను రౌండ్ ద వికెట్ బౌలింగ్ చేయించడం ద్వారా కట్టడి చేయబోతున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. అందుకు రవిశాస్త్రి కూడా అంగీకారం తెలిపాడు. అయితే, ఈ మాటలు డైరెక్ట్‌గా లైవ్‌లో వచ్చేయడంతో తమ ప్లాన్ బహిర్గతమైందని కోహ్లీ, రవిశాస్త్రి నాలుక కరుచుకున్నారు. కాగా, బుధవారం రాత్రి ముంబై నుంచి ఇంగ్లండ్‌కు బయల్దేరిన భారత జట్టు.. సౌథాంప్టన్ వేదికగా జూన్ 18న న్యూజిలాండ్‌తో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనుంది. అనంతరం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ మేరకు 20 మందితో కూడిన భారత జంబో జట్టు, ముంబైలో 14 రోజుల క్వారంటైన్‌ను ముగించుకుని స్పెషల్ ఛార్టెర్ ప్లైట్‌లో లండన్‌కు బయల్దేరింది. చదవండి: కచ్చితంగా ఐదు వికెట్లు తీస్తావని ధైర్యం నింపాడు.. -
కార్పొరేట్ ఆసుపత్రి ఉద్యోగి ఆడియో లీక్
-
దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్
సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాదానికి బలైపోయిన విజయవాడ ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన నాగేంద్రతో బాధితురాలు మాట్లాడిన ఫోన్ కాల్స్ లీకవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే వారిద్దరికీ వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా లీకైన ఆడియోలో పెళ్లి విషయం దాచిపెట్టలేక తీవ్ర సంఘర్షణకు గురైనట్లు దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందులా అందరితో కలిసి సంతోషంగా ఉండలేకపోతున్నా అని, మానసిక కుంగుబాటుకు గురవుతున్నా అని నాగేంద్రతో తన బాధను పంచుకున్నారు. తాను త్వరగా అప్సెట్ అవుతున్నాఅని, ఇలా ఎందుకు ఉంటున్నానో తనకు అర్థం కావడంలేదని ఫోన్లో విలపించారు. తనకు నాగేంద్రతో పాటు భవిష్యత్ కూడా ముఖ్యమేనని చెప్పారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) తనలో ఎన్నడూ లేని మార్పులు వస్తున్నాయని, ఎవరితో మాట్లాడాలి, ఎవరి సలహాలు తీసుకోవాలో కూడా అర్థంకావడంలేదని దివ్య వాపోయారు. అంతేకాకుండా వివాహం అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఎవరితోనూ చర్చించలేకపోతున్నా అని నాగేంద్రతో ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. తాజాగా తేజస్వినికి చెందిన ఓ ఇన్స్టాగ్రామ్ వీడియో ద్వారా మరికొన్ని విషయాలు వెల్లడవుతున్నాయి. నాగేంద్రతో రెండేళ్ల పాటు రిలేషన్షిప్లో కొనసాగానని, ఆ తరువాత నాగేంద్రలోని సైకో గురించి తెలిసిందని దివ్య తెలిపారు. ఓ మహిళ కారణంగా తను మోసపోయానని వీడియో వెల్లడించారు. తాను చేసిన తప్పిదాల కారణంగా తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతున్నాఅని, తన జీవితం ఏటు పోతుందో కూడా అర్థకావడంలేదని పేర్కొన్నారు. తనకు బెదింపు కాల్స్, మెస్సెజ్‌లు వస్తున్నాయని వీడియో ద్వారా రికార్డు చేసుకున్నారు. (మంగళగిరిలో పెళ్లి చేసుకున్నాం: నాగేంద్ర) మరోవైపు తామిద్దరం వివాహం చేసుకున్నామని, అది వారి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో ఇద్దరం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని నిందితుడు నాగేంద్ర చెబుతున్నాడు. అయితే తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఫోన్‌కాల్స్ రికార్డులు లీకవ్వడంతో కేసు మరో మలుపు తిరిగింది. దీంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. లీకైన ఆడియోలు, ఫోన్ కాల్స్ డేటా ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని(22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. -
ఫేస్బుక్ సీఈవో ఆడియో లీక్ సంచలనం
వాషింగ్టన్: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ ఇబ్బందుల్లో పడింది. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తన ఉద్యోగులతో మాట్లాడిన అంతర్గత ఆడియో బహిర్గతం కావడం దుమారం రేపుతోంది. ప్రధానంగా డెమొక్రాటిక్ అభ్యర్థి ఎలిజబెత్ వారెన్ అధ్యక్షురాలిగే ఎన్నికైతే ప్రమాదమని, చట్టపరమైన సవాళ్లు ఎదురవుతాయనీ జుకర్ బర్గ్ వ్యాఖ్యానించారు. అయితే సంస్థను విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాన్ని తాము గట్టి ఎదుర్కొంటామంటూ సవాల్ చేస్తూ ప్రసంగించిన ఆడియో ఒకటి సంచలనంగా మారింది. ఉద్యోగులతో నిర్వహించిన అంతర్గత ముఖాముఖి సందర్బంగా ఈ వ్యాఖ్యాలు చేశారని 'ది వెర్జ్' నివేదించింది. లీక్ అయిన ఆడియో ప్రకారం జుకర్‌బర్గ్ ప్రధానంగా ఆరు అంశాలపై తన ప్రసంగాన్ని చేశారు. అమెరికా ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను విచ్ఛిన్నం చేయడంతోపాటు, వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌తో పోటీపడాలనే తమ లక్ష్యాన్నిదెబ్బతీయాలని భావిస్తోందన్నారు. ఎలిజబెత్ వారెన్ అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే, ఎదురు దెబ్బలు, చట్టపరమైన సమస్యలు తప్పవని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్లాన్స్‌ను తాము తొప్పికొట్టగలమనే ధీమాను వ్యక్తం చేశారు. అంతేకాదు ఫేస్బుక్, అమెజాన్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలను ఆమె టార్గెట్ చేశారన్నారు. యూత్‌లో భారీ క్రేజ్ సంపాదించుకుని శరవేగంగా దూసుకుపోతున్న చైనా కంపెనీ సొంతమైన టిక్టాక్పైకూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్‌టాక్‌ను ఎదుర్కొనేందుకు కొత్త వీడియో షేరింగ్ యాప్ లాసోను ప్రయోగాత్మకంగా లాంచ్ చేయనున్నట్టుచెప్పారు. దీంతోపాటు ఫేస్బుక్ క్రిప్టో కరెన్సీ లిబ్రా గురించి కూడా ప్రస్తావించారు. అంతేకాదు ట్విటర్ మొత్తం ఆదాయం కంటే సెక్యూరిటీకోసం ఫేస్బుక్ ఎక్కువ పెట్టుబడులు పెడుతోందని జుకర్‌బర్గ్ చెప్పుకొచ్చారు. అటు వారెన్ కూడా వరుస ట్వీట్లతో ఫేస్బుక్లై విమర్శలు గుప్పించారు. ఫేస్బుక్ వంటి దిగ్గజ సంస్థలను చట్టవిరుద్ధమైన యాంటికాంపేటివ్ పద్ధతుల్లో పాల్గొనడానికి, వినియోగదారుల గోప్యతా హక్కులపై విరుచుకుపడటానికి అనుమతించే అవినీతి వ్యవస్థను, తాము అడ్డుకుంటే నిజంగా 'సక్' అవుతుందని వరుస ట్వీట్లలోమండిపడ్డారు. సమర్థవంతమైన పోటీదారులైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లను సొంతం చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఇటీవలి కాలంలోఎక్కువ మార్కెట్ ఆధిపత్యాన్ని సంపాదించిందని, సోషల్ నెట్వర్కింగ్ ట్రాఫిక్‌లో 85శాతం కంటే ఎక్కువ ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థలకు పోతోందన్నారు. We have to fix a corrupt system that lets giant companies like Facebook engage in illegal anticompetitive practices, stomp on consumer privacy rights, and repeatedly fumble their responsibility to protect our democracy. #BreakUpBigTech https://t.co/c0qWuRb9NN — Elizabeth Warren (@ewarren) October 1, 2019 Let's talk a bit about my plan to #BreakUpBigTech and why it's got Mark Zuckerberg so worked up. — Elizabeth Warren (@ewarren) October 1, 2019 మరోవైపు వెర్జ్ కథనాన్ని ఖండిస్తూ జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇది పూర్తిగా అంతర్గతమే అయినప్పటికీ .. ఆసక్తి వున్నవాళ్లు ఫిల్టర్ చేయని వెర్షన్‌ను చెక్ చేసుకోవచ్చని ఒక లింక్‌ను షేర్ చేశారు. కాగా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) ఫేస్‌బుక్‌పై బహిరంగ యాంటీ ట్రస్ట్ దర్యాప్తును ఎదుర్కొంటోంది. న్యూయార్క్‌లోని స్టేట్ అటార్నీ జనరల్ బృందం కూడా ఫేస్‌బుక్‌పై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. -
విజయ్‌ని వెంటాడుతున్న లీకులు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ని కష్టాలు వెంటాడుతున్నాయి. గతంలో విజయ్ నటించిన సినిమాల రిలీజ్ విషయంలో సమస్యలు తలెత్తేవి.. కానీ విజయ్ తాజా చిత్రానికి సెట్స్ మీద ఉండగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబందించిన ప్రతీ విషయం, చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించడానికి ముందే బయటికి వచ్చేస్తుండటంతో యూనిట్ సభ్యులు కంగారు పడుతున్నారు. హీరో విజయ్ 60వ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా భైరవ. ఈ సినిమా టైటిల్ దగ్గరి నుంచే లీకులు మొదలయ్యాయి. చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయడానికి ముందే టైటిల్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఆ తరువాత ఫస్ట్ లుక్ విషయంలోనూ అదే జరిగింది. యూనిట్ సభ్యులు ప్రకటించిన డేట్ కన్నా ముందే విజయ్ స్టిల్స్ బయటకి వచ్చేయటంతో ముందే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అఫీషియల్‌గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. తాజాగా ఆడియో రిలీజ్ విషయంలోనూ అదే రిపీట్ అయ్యింది. ఈ సినిమా ఆడియోను డిసెంబర్ 23న గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే వర్థ తుఫాన్‌తో ఈవెంట్‌ను రద్దు చేసి ఆడియోను నేరుగా మార్కెట్లోకి రిలీజ్ చేయనున్నట్టుగా ప్రకటించారు. కానీ యూనిట్ సభ్యులు రిలీజ్ చేయడానికి నాలుగు రోజుల ముందే భైరవ పాటలు ఐ ట్యూన్స్‌లో దర్శనమిచ్చాయి. ఆడియో కంపెనీ వారు టెక్నికల్ మిస్టేక్ వల్లే ఇలా జరిగిందని.. పూర్తి పాటలను అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇలా వరుసగా అన్నీ రిలీజ్ డేట్‌కు ముందు బయటకి వచ్చేస్తుండటంతో యూనిట్ సభ్యులు, ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో సినిమా విషయంలో ఎలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
కబాలి ఆడియో లీకైందా?
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న కబాలి ఆడియో రిలీజ్ ఉన్నట్టుండి రద్దయింది. తలైవా రజనీకాంత్ ఇంకా అమెరికాలోనే ఉండటంతో ఆదివారం విడుదల చేయాలనుకున్న ఆడియోను మరికొంత కాలం వాయిదా వేశారు. అంతేకాదు.. సినిమా విడుదల కూడా జూలై 1 నుంచి 15వ తేదీకి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అయితే.. ఈలోపు సినిమా వర్గాలకు మరో షాక్ ఇచ్చేలా.. కబాలి ఆడియో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రజనీకాంత్ డైలాగులతో కూడిన 30 సెకండ్ల ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వాట్సప్‌లో ఇది చాలా మందికి ఇప్పటికే చేరిపోయింది. అది నిజమైనదో కాదో తెలియదు కానీ.. చాలామంది మాత్రం అది కబాలి సినిమాలోనిదేనని చెబుతున్నారు. (చదవండి: కబాలి యాప్‌తో సరికొత్త ట్రెండ్) తలైవా రజనీకాంత్ నటించిన 159వ సినిమా కబాలి. అందులో ఆయన వయసు మళ్లిన డాన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో రజనీ సరసన రాధికా ఆప్టే నటిస్తోంది. దినేష్, ధన్సిక, కలైరాసన్ లాంటివాళ్ల ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న ఈ సినిమాకు పా రంజిత్ దర్శకత్వం వహించారు.