రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్‌.. మరో సంచలన ఆడియో లీక్! | Audio Call Viral In Tollywood Hero Raj Tarun and Lavanya Issue | Sakshi
Sakshi News home page

Raj Tarun and Lavanya: రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్‌.. సంచలన ఆడియో వైరల్!

Published Mon, Jul 22 2024 6:05 PM | Last Updated on Tue, Jul 23 2024 10:33 AM

Audio Call Viral In Tollywood Hero Raj Tarun and Lavanya Issue

హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్‌ టాలీవుడ్‌ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఆడియో కాల్‌లో లావణ్య.. ఆర్జే శేఖర్‌ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement