RJ
-
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో అటు ఆర్జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్‌క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం.. దోమకు అర్థమేంటో తెలుసా?
బిగ్‌బాస్ సీజన్ -8 బుల్లితెర ప్రియులను సరికొత్తగా అలరిస్తోంది. ఒకటి, రెండు తెలిసిన మొహాలు మినహాయిస్తే.. అంతా కొత్త వారే ఈ సీజన్లో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే ఓ వారం ముగిసింది. ఎప్పటిలాగే ఆనవాయితీని కొనసాగిస్తూ లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. బెజవాడ బేబక్క వారం రోజుల్లోనే ఇంటిదారి పట్టింది. అప్పుడే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ కూడా మొదలైపోయింది. అయితే ఈ సారి అంతా కొత్త ముఖాలే కావడంతో హౌస్‌లో కాస్తా ఎంటర్టైన్మెంట్ తగ్గినట్లు కనిపిస్తోంది. లిమిట్లెస్ అంటూ ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్‌బాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో వెనుకబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ సీజన్లో హౌస్‌లో అంతో, ఇంతో మెప్పిస్తోన్న కంటెస్టెంట్ మాత్రం ఒకరు ఉన్నారు. అతని వల్లే హౌస్‌లో నవ్వులు పూస్తున్నాయి. అతను మరెవరో కాదు.. రాజ్ తరుణ్ ఫ్రెండ్ ఆర్జే శేఖర్ భాషా.(ఇది చదవండి: విష్ణుప్రియపై నీచమైన కామెంట్స్.. సోనియాను తిట్టిపోస్తున్న నెటిజన్లు)రేడియో జాకీగా తెలుగు ప్రేక్షకులను అలరించిన శేఖర్ భాషా హౌస్‌లోనూ తనదైన కామెడీతో ఆకట్టుకుంటున్నారు. తన ఫన్నీ పంచ్‌లతో హౌస్‌ను ఫుల్ కామెడీని ఎంటర్టైనర్గా మార్చేశాడు. ఏకంగా జబర్దస్త్ కామెడీ షోను మించిన పంచ్‌లతో అదరగొడుతున్నాడు. దీంతో ఆర్జే శేఖర్ భాషా బిగ్‌బాస్‌కు దొరికిన ఆణిముత్యం అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. అంతేకాకుండా శేఖర్ భాషా కామెడీ క్లిప్స్‌ను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. మీరు కూడా ఆ ఆణిముత్యాల్లాంటి జోకులను చూసి ఎంజాయ్ చేయండి. Arey ha #ShekharBasha ni ala vadileyakandra evarikaina chupettandraOka onion,oka I love you,Oka spirit,oka Chapathi Oka pindakudu,Oka shardham#BiggBossTelugu8 pic.twitter.com/eUuYjcygyy— Vamc Krishna (@lyf_a_zindagii) September 2, 2024 #ShekharBasha animutyalu part - 90Omlette = Ame + Late #BiggBossTelugu8 pic.twitter.com/7V2GC7MNQi— Vamc Krishna (@lyf_a_zindagii) September 7, 2024 #ShekharBasha is such a sport 😂❤️Shekhar Basha Animutyam part-100😂😭Doma = Dho (Two) + Maa (Amma) anta 😭#BiggBossTelugu8 pic.twitter.com/RS4kbwXBvQ— Hungry Cheetah (@Aniljsp1) September 8, 2024#Shekharbasha and his diamonds 🤣😂#BiggBossTelugu8 pic.twitter.com/1g7lyHjnoN— ALTDHFM (@altSsmb5) September 8, 2024#ShekharBasha animutyalu part -3Magajathi animuthyam nundi inkonni animutyalu 😂😭 meekosam meekosam meekosam Oka Bangaram,oka Puttakamundu 😭#BiggBossTelugu8 pic.twitter.com/2z6ewd1suu— Vamc Krishna (@lyf_a_zindagii) September 5, 2024 Chiraku = Chee Raku 😂😂😭😭Ayya ayya 😂😂😭😭#ShekharBasha animutyalu part-100 #BiggBossTelugu8 pic.twitter.com/luztkgZq9O— stylish Star Lakshmi (@Stylisstarlaxmi) September 9, 2024 -
Audio Call: రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. లావణ్య-శేఖర్ బాషా ఆడియో లీక్!
-
రాజ్ తరుణ్-లావణ్య ఎపిసోడ్.. మరో సంచలన ఆడియో లీక్!
హీరో రాజ్ తరుణ్- లావణ్య ఎపిసోడ్ టాలీవుడ్ సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కేసులు పెట్టుకోవడంతో ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరి కేసులపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇటీవలే రాజ్ తరుణ్‌కు సైతం పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే తాను అందుబాటులో లేనని రిప్లై కూడా ఇచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా మరో ఆడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ ఆడియో కాల్లో లావణ్య.. ఆర్జే శేఖర్ భాష అనే వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంచలనంగా మారింది. ఇందులో లావణ్యకు, శేఖర్ భాషకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మా గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారంటూ శేఖర్ భాషను లావణ్య నిలదీసింది. మీరే రాజ్ తరుణ్ ఇల్లు కొట్టేయాలని ఇదంతా చేస్తున్నారని లావణ్యపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాజ్ తరుణ్ స్నేహితుడుగా చెప్పుకునే శేఖర్ బాషా అనే ఆర్జే పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. మస్తాన్ రావ్ అనే వ్యక్తి నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేదని.. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటయ్యారని కూడా శేఖర్ భాషా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నాడు. -
త్వరలో సినిమాల్లోనూ నటిస్తా: ఆకాంక్షా వర్మ
ఆకాంక్షా వర్మ.. అందం, అభినయం, మధురమైన స్వరానికి పర్యాయంగా అనిపిస్తుంది.. కనిపిస్తుంది! ఆ ప్రతిభతోనే మోడల్‌గా, ఆర్జేగా, టీవీ, వెబ్ స్క్రీన్ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని సృష్టించుకుంది. ► పుట్టింది, పెరిగింది భోపాల్‌లో. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ముందు మోడలింగ్ అవకాశాలు వచ్చాయి. ► మోడలింగ్ చేస్తూనే థియేటర్ ఆర్టిస్ట్‌గా చేరింది. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గానూ పని చేసింది. ► ఆర్జేగా ఆమె చేసిన ‘బాలీవుడ్ టైమ్స్’ షోతో పాపులర్ అయ్యింది. ఆ సమయంలోనే అంటే 2016లో దూరదర్శన్‌లో ప్రసారమయ్యే ‘నమస్కార్ ఎమ్.పి’ షోకు యాంకరింగ్ చేయడంతో మొదటిసారి ఆకాంక్షాను ప్రేక్షకులు గుర్తించారు. అవకాశాలూ దరి చేరాయి. ► తీయని గొంతుతోనే కాదు చక్కని అభినయంతోనూ మెప్పిచంగలనని నిరూపించుకుంది. ► స్టార్ ఇండియా ప్రొడక్షన్లోని ‘మంగళ’ అనే సీరియల్లో ప్రధాన పాత్ర ‘జీజీ మా’గా జీవించి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. తర్వాత మరికొన్ని సీరియల్స్, షార్ట్ మూవీస్‌లోనూ నటించింది.వెబ్ దునియా కూడా ఆమె టాలెంట్‌ను క్యాప్చర్ చేసింది ‘గందీ బాత్ 4’ సిరీస్‌లో. అవకాశాలేవి లేని, రాని టైమ్‌లో నా భర్త సుదర్శన్ ప్రోత్సాహంతో ఆర్జేగా ట్రై చేశాను. అదే నన్ను ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టింది. త్వరలో సినిమాల్లోనూ నటిస్తా. – ఆకాంక్షా వర్మ -
స్వరమే ఇం‘ధనం’
వాయిస్ అరువిచ్చే వారు.. వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు. డాక్యుమెంటరీలు, ప్రకటనలు, రైల్వే స్టేషన్లలో, బస్ స్టాపుల్లో వినిపించే ఆడియోలు, వీడియోలు, రేడియోల్లో.. తెర వెనకాల నుంచి వచ్చే వినసొంపైన గాత్రం ప్రేక్షకుల మదిని గెలుస్తోంది. ఈ తియ్యటి గొంతుకలు పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంటున్నాయి. ఇదే ఇప్పుడు ఎంతోమందికి కెరీర్ మార్గంగా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో డిజిటల్ కంటెంట్ వినియోగం విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా అంతే స్థాయిలో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తున్నాయి. వినసొంపైన స్వరం, మాటల్లో స్పష్టత, భాషపై పట్టు, గొంతుకలో వైవిధ్యం ప్రదర్శించగలిగితే చాలు..‘వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్’గా రాణించొచ్చు. స్వరాల సవరింపు ముఖ్యంగా వినసొంపైన, విలక్షణమైన స్వరం ఉన్నవారికి ఈ కెరీర్ నప్పుతుందని చెప్పొచ్చు. ప్రధానంగా ఎంచుకున్న భాషపై ప్రావీణ్యత తప్పనిసరి. ఉచ్ఛారణ కచ్చితంగా, స్పష్టంగా ఉండాలి. ఎలాంటి తప్పులు దొర్లకుండా డైలాగ్ డెలివరీ చెప్పగలగాలి. అన్నిటికంటే ముఖ్యంగా స్వరాలను క్యారెక్టర్‌కు తగిన విధంగా సవరించుకోవాలి. ఉదాహరణకు డాక్యుమెంటరీకి చెప్పే వాయిస్ ఓవర్‌కు, కార్టూన్లకు చెప్పే వాయిస్ ఓవర్‌కు చాలా వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి పాత్రకు తగ్గట్టు వాయిస్‌ను మాడ్యులేట్ చేసుకునే నైపుణ్యం ఉండాలి. చేసే ప్రాజెక్టుకు తగ్గట్లు యాసను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. యానిమేషన్లో బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా భావోద్వేగాలను పండించడానికి లిప్ సింక్రనైజేషన్ చాలా అవసరం. చుట్టు పక్కల వారిని గమనిస్తూ విభిన్నమైన మాట తీరును అర్థం చేసుకోగలగాలి. సాధనకు మించిందిలేదు వాయిస్ ఒవర్ ఆర్టిస్ట్‌గా ఎదిగేందుకు ప్రాక్టీస్‌కు మించిన సాధనం మరొకటి లేదు. డెమో టేపులలో వాయిస్ రికార్డింగ్ చేసుకొని వినడం ద్వారా.. వాయిస్ క్లారిటీ, డిక్షన్, డైలాగ్ డెలివరీ, టోన్, ఎమోషన్లలో దొర్లిన తప్పులను గుర్తించవచ్చు. విద్యార్హతలు వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు మన దేశంలో ప్రత్యేకమైన కోర్సులంటూ ఏమీ లేవు. అయితే కొన్ని ఫిలిం ఇన్స్టిట్యూట్లు మాత్రం వాయిస్ సంబంధిత సర్టిఫికేషన్లు నిర్వహిస్తున్నాయి. వాస్తవానికి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా మారేందుకు ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. కానీ, ఫొనెటిక్స్ కోర్సులు చేసినవారు గొంతును అరువిచ్చే కళాకారులుగా కెరీర్లో రాణించొచ్చు. సాధారణంగా ఆర్టిస్టులకు అడిషన్స్ నిర్వహిస్తారు. అందులో నెగ్గితే అవకాశం లభిస్తుంది. అవకాశాలు టీవీ ప్రకటనల్లో కనిపించే కళాకారులకు గొంతును అరువిచ్చేందుకు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. కాబట్టి ప్రకటనల రూపకల్పనలో వీరి భాగస్వామ్యం తప్పనిసరి. కార్పొరేట్ వీడియోలు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు, రేడియో ప్రకటనల తయారీలో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకు అవకాశం లభిస్తుంది. టీవీ సీరియళ్లు, వార్తా ఛానళ్లు, ఎఫ్ఎం రేడియోలలో కూడా డిమాండ్ ఉంది. ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటంతో.. పోడ్కాస్ట్స్, ఈ–లెర్నింగ్ యాప్స్‌లో వివరించే వారు, ఆడియో బుక్స్, ఐవీఆర్‌కు వాయిస్ ఓవర్, వాయిస్ మెయిల్ మొదలైన వాటిల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువ. ముఖ్యంగా వాయిస్ ఓవర్ డబ్బింగ్‌కు కూడా ప్రాధాన్యం కనిపిస్తోంది. టీవీ, వెబ్, రేడియో, అడ్వర్టయిజ్మెంట్, కార్పొరేట్ ఫిలిమ్స్, డాక్యుమెంటరీస్ వంటి వాటిల్లో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఆర్టిస్టులకు అవకాశాలు లభిస్తాయి. వేతనాలు మన దేశంలో ఎంటర్టైన్మెంట్ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ కెరీర్‌ను ఎంచుకునే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. వీరు ఫుల్‌టైం, పార్ట్‌టైం ఉద్యోగులుగా రాణించవచ్చు. వీరికి వేతనాలు సైతం ఆకర్షణీయంగానే ఉంటున్నాయి. ప్రాజెక్ట్‌ను బట్టి రెమ్యూనరేషన్ అందుతుంది. ఎపిసోడ్స్ ఆధారంగా జీతాలు చెల్లిస్తున్నారు. పని చేస్తున్న ప్రాజెక్టును బట్టి రోజుకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు సంపాదించుకోవచ్చు. డాక్యుమెంటరీలకు రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు అందుకోవచ్చు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా చక్కటి వేతనాలు దక్కించుకోవచ్చు. టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్‌కు సంక్లిష్టత, క్యారెక్టర్‌ను బట్టి రూ.5వేల నుంచి రూ.10వేల వరకు అందుతుంది. సినిమాల్లో మంచి బడ్జెట్ ఫిలింలో క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెబితే రూ.1 లక్ష నుంచి రూ.1.5లక్షల వరకు తీసుకోవచ్చు. ఒకసారి సక్సెస్ అయిన గొంతుకు మళ్లీమళ్లీ అవకాశం లభిస్తుంది. స్వరం.. జాగ్రత్త ఈ రంగంలో రాణించాలంటే.. గొంతును (స్వరం) జాగ్రత్తగా కాపాడుకోవడం ముఖ్యం. అందుకోసం ఆరోగ్యంగా ఉండేందుకు యోగాసనాలు, ధ్యానంతోపాటు సరైన ఆహారాన్ని తీసుకోవాలి. చల్లని పదార్థాలు, పానీయాలు, చాక్లెట్లు, పికిల్స్, చిల్లీస్‌కు దూరంగా ఉండాలి. మాడ్యులేషన్ ముఖ్యం వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా రాణించాలనుకునే వారు వాయిస్ మాడ్యులేషన్స్పై అవగాహన పెంచుకోవాలి. నైపుణ్యాలుంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించే అవకాశం లభిస్తుంది. రేడియో, టీవీ, మీడియా హౌసెస్ తమ అవసరాల మేరకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లో తీసుకుంటున్నాయి. పదాలపై పట్టు ఉన్నవారు వాయిస్ ఓవర్ ఆర్టిస్టులుగా రాణించవచ్చు. వీరికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటోంది.–సునిత ఆర్జే, 91.1 -
రెడ్ ఎఫ్ఎం మాజీ ఆర్జే హత్య
త్రివేండ్రం : గత రెండు రోజులుగా జర్నలిస్టుల వరుస హత్యలతో కలకలం రేగుతున్న నేపథ్యంలో... కేరళకు చెందిన ఆర్జే, మిమిక్రీ కళాకారుడు రాజేశ్(36)ను గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. మదావూర్లోని తన స్టూడియో నుంచి స్నేహితునితో కలిసి బయల్దేరిన రాజేశ్ వాహనాన్ని రెడ్ కలర్ స్విప్ట్ కారులో కొందరు వ్యక్తులు వెంబండించారు. తమ వద్దనున్న పదునైన ఆయుధాలతో రాజేశ్, అతని స్నేహితునిపై దాడి చేశారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాజేశ్, అతన్ని స్నేహితున్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా తీవ్రంగా గాయపడిన రాజేశ్ మరణించాడు. అతని స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. హంతకులను పట్టుకునేందుకు విచారణ ప్రారంభించామని పోలీసులు తెలిపారు. కాగా రాజేశ్ గతంలో చాలా ఏళ్ల పాటు ప్రముఖ రేడియో చానెల్ రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా పని చేశాడు. తర్వాత దోహాలోని వాయిస్ ఆఫ్ కేరళ ఎఫ్ఎం స్టేషన్లో పని చేశాడు. ప్రస్తుతం మిమిక్రి ట్రూప్‌ను ఏర్పాటు చేసుకుని ప్రదర్శనలు ఇస్తున్న నేపథ్యంలో హత్యకు గురయ్యాడు. -
ఆర్జే చెంపచెళ్లు మనిపించిన హీరో!
ముంబై: బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ సంయమనాన్ని కోల్పోయి రేడియో జాకీ(ఆర్జే) చెంప చెళ్లు మనిపించారు. 'కీ అండ్ కా' చిత్ర ప్రమోషన్ లో భాగంగా అర్జున్ ముంబైలోని రేడియో మిర్చీ ఆఫీసుకు వెళ్లారు. సినిమాల్లో నటించడానికి పాత్రలు దొరకకపోవడంతోనే అమ్మాయిలకు సంబంధించి పాత్రలు వేస్తున్నారా అని ఆర్జే, అర్జున్ను ప్రశ్నించాడు. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై.. ఆ ఆర్జే చెంప చెల్లు మని పించాడు అర్జున్. ఇదంతా రికార్డవుతుందని ఆర్జే చెబుతుండగానే అతన్ని బయటకు నెట్టేశాడు. అక్కడున్న కెమెరాలను కిందకు విసిరాడు. అయితే ఇప్పటికే ఎన్నో ప్రమోషన్లలో ఇంతకన్నా ఘాటైన ప్రశ్నలకు చాలా సున్నితంగా అర్జున్ బదులిచ్చాడు. కానీ, ఇంత చిన్నదానికే మరీ అంతలా రియాక్ట్ అవ్వాలా అనుకుంటున్నారా. సినిమా ప్రమోషన్ల కోసం హీరోలు చేసే ఎన్నో ప్రయత్నాలను మనం ఇప్పటి వరకు చూశాము. అయితే ఏప్రిల్ 1న(ఫూల్స్ డే రోజు) 'కి అండ్ కా' విడుదల అవుతుండటంతో మరో కొత్త పద్దతికి అర్జున్ శ్రీకారం చుట్టాడు. అభిమానులకు ఫూల్స్ డే స్పేషల్‌గా వీడియోను విడుదల చేసి ఆటపట్టించడమే కాకుండా సినిమాను కూడా ప్రమోట్ చేయాలనుకున్నాడు. రెడియో టీం, అర్జున్ కపూర్ కలిసి ఈ ప్రాంక్ వీడియోను తీశారు. కానీ ఏప్రిల్ 1కి కొంచెం ముందుగానే వీడియో బయకు రావడంతో అడ్వాన్స్గానే అభిమానులు ఫూల్స్ అయ్యారు. 'కి అండ్ కా' చిత్రంలో భార్యకు అన్నివిధాలా సహకరించే ప్రోగ్రెస్సివ్ భర్త పాత్రలో అర్జున్ కపూర్, జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించే లక్ష్యంతో కెరియర్ ఓరియెంటెట్ లేడీ పాత్రలో కరీనా కపూర్ నటించారు.