సోషల్ మీడియా, ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతూ..
డిఫరెంట్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ఆర్‌జే స్వాతి..
లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకుంటూ గుర్తింపు..
రీక్రియేషన్ రీల్స్, ఇంటర్వ్యూలే కంటెంట్
లేడీ కమెడియన్ అవ్వాలనేదే కోరిక : స్వాతి
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్‌జేలలో ఆర్‌జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో అటు ఆర్‌జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్‌జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు.
నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్‌వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్‌జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్‌జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు..
టిపికల్ మిడిల్‌క్లాస్ ప్యామిలీ..
టిపికల్ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్‌జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్‌టైజ్‌మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్‌జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్‌జేగా తీసుకున్నారు.
ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు..
అందరిలా ఆర్‌జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్‌జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఇన్‌స్టాగ్రామ్ వీడియోలకు స్పందన..
సోషల్ మీడియా వచ్చాక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్‌ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.
లేడీ కమెడియన్ అవ్వాలి..
నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్‌జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్‌జే స్వాతి.
Comments
Please login to add a commentAdd a comment