lady
-
సూపర్‌గా డ్యాన్స్ చేస్తున్న యువతి..ఒక్కసారిగా..
భోపాల్:అప్పటిదాకా ఆ యువతి పెళ్లి వేడుకలో ఆనందంతో డ్యాన్స్ చేస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని విదిషలో జరిగింది. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ యువతి కుప్పకూలి కింద పడిపోయింది. కుప్పకూలిన యువతిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. Madhya Pradesh - A young woman collapsed while dancing on stage at her sister's wedding in Vidisha. Relatives who were there rushed her to the hospital, but doctors declared her dead.How normal this has become post c0vid jabs yet no one questions!@shreyastalpade1 @MoHFW_INDIA https://t.co/dxJBVwT9ey pic.twitter.com/JwoWTUvz7B— Dee (@DeeEternalOpt) February 9, 2025 యువతి అప్పటిదాకా ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొవిడ్ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ మరణాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని వారు కోరుతున్నారు. -
వైరల్: కోడిపందాల్లో లేడీ బౌన్సర్లు
సాక్షి, పశ్చిమగోదావరి జిల్లా: ఇటీవల కాలంలో బౌన్సర్ల ఏర్పాటు సాధారణంగా మారింది. అయితే, తాడేపల్లిగూడెం పట్టణంలో నిర్వాహకులు ఓ అడుగు ముందుకేశారు. పందెం బరుల వద్ద లేడీ బౌన్సర్ల(Lady Bouncers)ను ఏర్పాటు చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గూడెంలో కోడిపందాలు(Cockfighting) జోరుగా సాగుతుండగా, రద్దీని కంట్రోల్ చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.కాగా, సంక్రాంతి సంబరాల ముసుగులో కూటమి నేతలు బరితెగించారు. భీమవరంలో పందెం బరి వద్ద మూడు రోజుల నుంచి క్యాసినో నిర్వహిస్తున్నారు. సినిమా సెట్టింగ్‌ల మాదిరిగా షెడ్లు వేసి జూద క్రీడలను నిర్వహిస్తున్నారు. పందెం రాయుళ్లును ఆకర్షించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి మహిళా నిర్వాహకులను కూడా కూటమి నేతలు రప్పించారు. పోలీసులు మాత్రం అటువైపు తొంగిచూడటం లేదు. యథేచ్ఛగా కాసులు వేట సాగిస్తూ సామాన్యులు జేబులు గుల్ల చేస్తున్నారు.మరో వైపు, కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో బరిలోకి దిగిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య కోడి పందెల బరిలో కోటి 25 లక్షల రూపాయలు పందెం కాయడం చర్చనీయాంశంగా మారింది.కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాసిన పందెం రాయుళ్లు. బరిలో హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు)విజేతగా నిలిచింది. దీంతో, గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.ఇదీ చదవండి: అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి -
కోడి పందేల కంట్రోలింగ్‌కు లేడీ బౌన్సర్స్
-
కోడిపందాలో లేడీ బౌన్సర్..!
-
లేడీ కానిస్టేబుల్ హత్యలో ట్విస్ట్.. వెలుగులోకి కొత్త కోణం
సాక్షి,రంగారెడ్డిజిల్లా: ఇబ్రహీంపట్నంలో లేడీ కానిస్టేబుల్ హత్య సంచలనం రేపింది. హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న నాగమణిని సొంత తమ్ముడే హత్య చేశాడు. ఇది పరువు హత్య అని తొలుత భావించినప్పటికీ పోలీసుల ప్రాథమిక విచారణలో ఆస్తి గొడవలే హత్యకు కారణమని తెలుస్తోంది. రాయపోల్‌కు చెందిన శ్రీకాంత్,నాగమణిలు నవంబర్ ఒకటో తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం అనంతరం హయత్‌నగర్‌లో నాగమణి, శ్రీకాంత్ నివాసం ఉంటున్నారు. నిన్న సెలవు కావడంతో నాగమణి తన సొంత గ్రామానికి వెళ్ళింది.నాగమణి స్కూటీపై డ్యూటీకి వెళుతుండగా వెంబడించిన తమ్ముడు పరమేష్ తొలుత ఆమెను కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో మెడ నరికి చంపాడు.హత్య చేసిన పరమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసులో ట్విస్ట్.. వెలుగులోకి అసలు నిజాలుఆస్తి కోసమే అక్క నాగమణిని తమ్ముడు పరమేష్ చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. నాగమణికి తల్లిదండ్రులు లేకపోవడంతో అన్నీ తానే చూసుకున్నాడు పరమేష్. కాగా నాగమణికి ఇదివరకే వివాహమై విడాకులు కూడా అయ్యాయి. తమ వారసత్వ భూమిని మొదటి వివాహం తర్వాత నాగమణి తమ్ముడికి ఇచ్చేసింది.రెండవ భర్త శ్రీకాంత్‌ను ఇటీవలే కులాంతర వివాహం చేసుకున్న నాగమణి భూమిలో తనకు వాటా ఇవ్వాలని తమ్ముడిని మళ్లీ ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో ఆగ్రహించిన పరమేష్ నాగమణి స్కూటీపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి అనంతరం కొడవలితో నరికి చంపాడు. ఇదీ చదవండి: ఎస్సై ఆత్మహత్య.. ప్రేమ వ్యవహారమే కారణం..? -
లీలా సేథ్‌ను ‘మదర్ ఆఫ్ లా’ అని ఎందుకంటారంటే..
భారత ప్రజాస్వామ్యంలో ముఖ్యమైన మూడు ప్రధాన విభాగాలు కనిపిస్తాయి. వాటిలో మొదటిది న్యాయవ్యవస్థ, రెండవది కార్యనిర్వాహక వ్యవస్థ మూడవది శాసనసభ. ఈ మూడు రంగాల్లోనూ మహిళల వాటా గణనీయంగా పెరిగింది. వీటిలో న్యాయవ్యవస్థ విషయానికి వస్తే ఈ రంగంలో మహిళల పాత్ర కీలకంగా మారింది.ప్రస్తుతం దేశంలో పలువురు మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు ఉన్నారు. అయితే దేశంలోని హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన లీలా సేథ్ పేరు ముందు వరుసలో కనిపిస్తుంది. ఈరోజు (అక్టోబర్ 20)న ఆమె జన్మదినం. ఆమెను ‘మదర్ ఆఫ్ లా అని పిలుస్తారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి వరకూ సాగిన ఆమె ప్రయాణం అంత సులభంగా సాగలేదు.1930, అక్టోబర్ 20న ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరంలో లీలా సేథ్ జన్మించారు. తన 11 ఏళ్ల వయసులోనే ఆమె తండ్రిని కోల్పోయారు. తల్లే ఆమెను పెంచి పెద్దచేసి, ఉన్నత చదువులు చదివించారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండే లీలా సేథ్ డార్జిలింగ్‌లో హైస్కూలు విద్య పూర్తి చేశారు. అనంతరం ప్రేమ్ సేథ్‌ను వివాహం చేసుకున్నాక, భర్తతో కలిసి లండన్ వెళ్లారు. అక్కడ గ్రాడ్యుయేషన్, తరువాత న్యాయశాస్త్రం అభ్యసించారు. ఆమె లండన్ బార్ పరీక్షల్లో అగ్రస్థానంలో నిలిచారు.అనంతరం భారత్ తిరిగి వచ్చిన ఆమె తొలుత కోల్‌కతాలో న్యాయవాద వృత్తిని చేపట్టారు. ఆ తర్వాత పట్నాలో, ఢిల్లీలో తన న్యాయవాద వృత్తిని కొనసాగించారు. 1978లో లీలా సేథ్ ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అనంతరం హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. భారతదేశ చరిత్రలో తొలిసారిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన మహిళగా ఆమె రికార్డులలోకి ఎక్కారు. ఈ నేపధ్యంలోనే ఆమెను ‘మదర్ ఆఫ్ లా’ అని అంటారు. నిర్భయ గ్యాంగ్ రేప్ దరిమిలా కేసు విచారణకు ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీలో లీలా సేథ్ సభ్యురాలు. లీలా సేథ్ 2017లో తన 83 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: అదిరిపోయే దీపావళి గిఫ్ట్: ఆనందంలో ఉద్యోగులు -
16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్
భోపాల్: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఎవరి ఊహకూ అందని ఘటన చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను పోలీసులు రక్షించిన దరిమిలా ఈ ఉదంతం వెలుగు చూసింది.జహంగీరాబాద్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను ఆమె అత్తమామలు 16 సంవత్సరాల పాటు ఇంట్లో బంధించారు. బాధితురాలు రాణి సాహుకు 2006లో వివాహం జరిగింది. మొదట్లో సంసారం బాగానే ఉన్నా 2008 నుండి అత్తామామలు ఆమెను ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదు. తాజాగా ఆమె తండ్రి కిషన్ లాల్ సాహూ తన కుమార్తె పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని, మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.2008 నుంచి తన కూతురు రాణి సాహును కలవడానికి తమను అనుమతించడం లేదని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్‌స్టేషన్ బృందం జహంగీరాబాద్‌లోని కోలి ప్రాంతానికి చేరుకుంది. అక్కడ ఇంట్లోని మూడో అంతస్తులో ఒక మంచంపై రాణి సాహు హృదయవిదారక స్థితిలో పడివుండటాన్ని వారు గమనించారు. ఆమె శరీరం ఎముకల గూడుగా మారడాన్ని చూసి వారు కంగుతిన్నారు. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడ్డాక, ఆమె నుంచి వివరాలు సేకరించి ఆమె భర్త, అత్తమామలపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: ‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’ -
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో అటు ఆర్జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్‌క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
లేడీ.. కిలాడీ
-
పురుషుడిగా మారిన లేడీ IRS
-
అమెరికా అధ్యక్షుని భార్యకు కరోనా.. బైడెన్ జీ20 పర్యటనపై సందిగ్ధత..
న్యూయార్క్: అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు కరోనా సోకింది. తేలిపాటి లక్షణాలు ఉన్నందున ఆమెకు సోమవారం కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వైట్ హౌస్ తెలిపింది. దీంతో కొవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. ప్రెసిడెంట్ జో బైడెన్‌కు మాత్రం నెగెటివ్‌గా తేలినట్లు స్పష్టం చేసింది. 72 ఏళ్ల జిల్ బైడెన్‌కు తేలికపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయని, డెలావేర్‌లోని రెహోబోత్ బీచ్‌లో ఉన్న ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంటారని అధికారులు తెలిపారు. జిల్ బైడెన్‌కు చివరిసారిగా ఏడాది క్రితం కరోనా సోకింది. US First Lady Jill Biden tests positive for COVID-19, Joe Biden tested negative Read @ANI Story | https://t.co/hCowKoUNam#US #JillBiden #JoeBiden #COVID19 pic.twitter.com/xyL5TXssUF — ANI Digital (@ani_digital) September 5, 2023 అధ్యక్షుడు బైడెన్(80)కు నిత్యం పరీక్షలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. అమెరికాలో ఇటీవల కరోనా కేసులు పెరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వ్యాపిస్తున్న కోవిడ్-19 BA 2.86 కొత్త వేరియంట్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వేరియంట్ చాలా ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది. భారత్‌లో జీ 20 సమావేశాలుకు సెప్టెంబర్ 9న ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీకి రానున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ఈ సమావేశానికి హాజరుకావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఆయన భార్య జిల్ బైడెన్‌కు కరోనా సోకడంతో పర్యటనపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే.. బైడెన్ పర్యటన సందిగ్ధతపై వైట్ హౌజ్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటనను వెల్లడించలేదు. ఇదీ చదవండి: సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు.. -
ఆలయానికి ఇటలీ యువతి, కాశీ యువకుడు.. వదంతులకు పూజారి చెక్!
ప్రేమ అనేది ఎప్పుడు ఎవరిమధ్య ఎలా చిగురిస్తుందో ఎవరూ చెప్పలేరని అంటారు. దీనికి ఇప్పుడు మరో తాజా ఉదాహరణ మనముందు నిలిచింది. ఆ సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌లోని త్రిలోచన్ ఆలయంలో సందడి నెలకొంది. ఈ ఆలయానికి ఒక జంట వచ్చారు. ఆలయంలో మహాశివుడిని దర్శించుకున్న ఆ జంటను చూసిన అక్కడి భక్తులు ఆశ్చర్యపోయారు. ఆ జంట వేర్వేరు దేశాలకు చెందినవారు కావడమే అందుకు కారణం. వారణాసికి చెందిన యువకుడు, ఇటలీకి చెందిన యువతి జంటగా వచ్చారు. వారు ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని సమాచారం. అయితే వారు త్రిలోచన్ ఆలయంలో వివాహం చేసుకున్నారనే వదంతులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. ఆ దంపతులు త్రిలోచన్ మహాదేవ్ మందిరంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన నేపధ్యంలో వారికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ జంటకు సంబంధించిన వివరాలను త్రిలోచన్ మందిరం ప్రధాన పూజారి సోనూ గిరి మాట్లాడుతూ ఆ జంటకు ఈ ఆలయంలో పెళ్లి జరిగిందనేది అవాస్తవమని, రిజిస్ట్రేషన్ లేకుండా ఇక్కడ పెళ్లిళ్లి చేయమని అన్నారు. వారణాసికి చెందిన అఖిలేష్ విశ్వకర్మ, ఇటలీకి చెందిన తానియా ఇంతకుముందే జార్జియాలో వివాహం చేసుకున్నారని తెలిపారు. ఇక్కడ పూజలు చేసేందుకు మాత్రమే వచ్చారన్నారు. మీడియాకు అందిన సమచారం ప్రకారం వారణాసి జిల్లాలోని కార్ఖియాం గ్రామ నివాసి అఖిలేష్ విశ్వకర్మ 2016లో హోటల్ మేనేజిమెంట్ కోర్సు చేసిన తరువాత కతర్ దేశం వెళ్లాడు. అక్కడ కతర్ ఎయిర్వేస్లో క్యాబిన్ క్రూ సిబ్బందిగా ఉద్యోగం పొందాడు. కొద్దిరోజుల తరువాత అతనికి ఇటలీకి చెందిన తానియాతో ప్రేమ ఏర్పడింది. తరువాత వారిద్దరూ జార్జియాలో వివాహం చేసుకున్నారు. కొద్దిరోజుల క్రితమే అఖిలేష్ తన భార్యతో పాటు ఇంటికి వచ్చాడు. ఈ నేపధ్యంలోనే వారు త్రిలోచన్ మందిరానికి వచ్చారు. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ తానియా ఇటలీలో పుట్టిందని, ఆమె ఫిలిప్పీన్స్‌లో చదువుకున్నదని తెలిపారు. తానియా తల్లిదండ్రులు అమెరికాలో ఉంటారన్నారు. ఇది కూడా చదవండి: ఇందిరను ప్రధానిని చేసిన కే. కామరాజ్ లైఫ్ స్టోరీ! -
అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్!
ఆమెది ఎంత అందమైన ముఖమో.. అంతే పదునైన ఆలోచనలు ఆమె సొంతం. అయితే ఆమె ఈ అందాన్ని, తెలివితేటలను నేర ప్రపంచం కోసం వినియోగించింది. డాన్‌గా మొదలైన ఆమె ప్రయాణం.. ఆ తరువాత నేర ప్రపంచంలోని ఇతర నేరస్తులతో కలివిడిగా తిరిగేవరకూ సాగింది. ఈ కథ రాజస్థాన్‌కు చెందిన అనురాధ చౌదరిది. ఆమెను జనం లేడీ డాన్ అని, రివాల్వర్ రాణి అని కూడా పిలుస్తుంటారు. ఆమె రాజస్థాన్‌లో పెద్ద గ్యాంగ్ స్టార్‌గా పేరొందింది. దేశంలోని అతిపెద్ద గ్యాంగ్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌తో ఆమెకు నేరుగా సంబంధాలున్నాయి. పండితుని ఇంట పుట్టి.. రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో అనురాధ చౌదరి జన్మించింది. తల్లి చనిపోవడంతో తండ్రే ఆమెను పెంచిపెద్ద చేశాడు. ఆమె తండ్రి ఉపాధ్యాయుడు. కుమార్తెను పెద్ద చదువులు చదించాలని కలలుగనేవాడు. అనురాధ కూడా చిన్నతనం నుంచే చదువుపై దృష్టి నిలిపింది. రాజస్థాన్‌లోని ఒక యూనివర్శిటీలో బీటెక్ పూర్తిచేసింది. అయితే కాలేజీ రోజుల్లో ఆమె దీపక్ మింజాతో ప్రేమలో పడింది. దీపక్‌తో ప్రేమ పెళ్లి దీపక్‌తో పెళ్లికి అనురాధ తండ్రి విముఖత వ్యక్తం చేశాడు. అయితే ఆమె తండ్రి మాట కాదని దీపక్‌ను వివాహం చేసుకుంది. కుటుంబంతో అనుబంధం తెంచుకుంది. అనురాధ, దీపక్‌లు కుటుంబ పోషణకు షేర్ ట్రేడింగ్ పని మొదలుపెట్టారు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు చుట్టుపక్కల వారిని ప్రోత్సహించేవారు. కొంతకాలం వారి వ్యాపారం సజావుగానే సాగింది. ఆ తరువాత వ్యాపారంలో సమస్యలు తలెత్తడంతో అనురాధ జీవితమే మారిపోయింది. డబ్బు సంపాదనకు అనురాధ తప్పుడు మార్గాలను ఆశ్రయించడం మొదలు పెట్టింది. అనురాధకు ఆనంద్‌పాల్ ఫిదా ఆ సమయంలో రాజస్థాన్‌లో గ్యాంగ్‌స్టర్ ఆనంద్‌పాల్ ప్రభావం అధికంగా ఉండేది. అనురాధ.. ఆనంద్‌పాల్‌ను కలుసుకుంది. అమె అందమైనది, తెలివైనది కావడంతో ఆనంద్‌పాల్ ఆమెతో అనుబంధం ఏర్పరుచుకున్నాడు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కిడ్నాప్‌లు మొదలైన నేరాలలో ఆనంద్‌పాల్ పేరు ప్రముఖంగా వినిపించేది. అనురాధ కూడా ఆనంద్ పాల్ గ్యాంగ్ సభ్యురాలిగా మారింది. భర్త దీపక్‌కు దూరం అయ్యింది. ఆనంద్‌పాల్‌ను వివాహం చేసుకుందని చెబుతారు. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! ఆనంద్‌పాల్‌కు ఆంగ్లం నేర్పిన అనురాధ ఆనంద్‌పాల్ అనురాధకు రివాల్వర్ వినియోగించడంతో పాటు వివిధ నేరాలలో శిక్షణ అందించాడు. అదేసమయంలో అనురాధ ఆనంద్‌పాల్‌కు ఆంగ్ల భాషలో సంబాషించడాన్ని నేర్పించింది. ఆనంద్‌పాల్ అనురాధ అడుగులకు మడుగులొత్తేవాడని అంటారు. 2017లో ఆనంద్‌పాల్ పోలీసులు జరిపిన ఒక ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఆ సమయంలో అనురాధ రెండేళ్ల జైలు శిక్ష అనుభవిస్తోంది. ఆమె జైలు నుంచి బయటకు వచ్చి, ఆనంద్‌పాల్ గ్యాంగ్‌ను తన చేతుల్లోకి తీసుకుంది. కాలా జఠెడిపై కన్ను వేసి.. అనురాధ తన గ్యాంగ్ ప్రభావాన్ని మరింతగా పెంచుకునేందుకు లారెన్స్ బిష్ణోయితో దోస్తీ మొదలుపెట్టింది. రాజస్థాన్‌లో మారణాయుధాల అక్రమ సరఫరాను అనురాధ గ్యాంగ్ పర్యవేక్షించేది. బిష్టోయి గ్యాంగ్‌తో జతకట్టిన అనురాధ కొంతకాలానికి కాలా జఠెడితో స్నేహం ప్రారంభించింది. కాలా జఠెడి.. బిష్ణోయి గ్యాంగ్ కోసం పనిచేసేవాడు. పాక్ నుంచి ఆయుధాల సరఫరాను జఠెడీ చూసుకునేవాడు. అనురాధ, కాలా జఠెడీ కలసివుండసాగారు. వారు ఒక ఆలయంలో పెళ్లి చేసుకున్నారని కొందరు చెబుతుంటారు. తరువాత వీరిద్దరూ మారు పేర్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉండసాగారు. అయితే 2021లో పోలీసులు వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఇది కూడా చదవండి: ‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య! -
ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్ మాల్లో ఏం జరిగిందంటే..
అది 2023, మే 6.. అమెరికాలోని టెక్సాస్ స్టేట్‌లోని ఎలన్ పట్టణంలోగల ఒక షాపింగ్ మాల్లో ఉన్నట్టుండి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో కాల్పులకు పాల్పడిన వ్యక్తితో పాటు మొత్తం 9 మంది మృతి చెందారు. వీరిలో ఒక బాలుడు కూడా ఉన్నాడు. ఏడుగురు గాయపడ్డారు. హంతకుడిని పోలీసులు మట్టుబెట్టారు. ప్రత్యక్ష సాక్షి చెప్పిందిదే.. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలోను, ఫొటోలలోను రక్తపుమడుగులో నేలపై పడి ఆర్తనాదాలు చేస్తున్న బాధితులు, మృతులు దయనీయ స్థితిలో కనిపించారు. వారి మధ్య హంతకుడు కూడా ఉన్నాడు. అతని మృతదేహం వద్ద ఒక తుపాకీ కూడా ఉంది. ఈ ఘటనను చూసిన ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. అతను షాపింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి తుపాకీ కాల్పుల మోత వినిపించింది. వెంటనే అతను ఒక పక్కకు వెళ్లి దాక్కున్నాడు. ఇంతలో పోలీసులు షాపింగ్ మాల్లోని వారిని బయటకు వెళ్లిపోవాలని చెప్పడంతో తాను కూడా బయటకు వెళ్లిపోయానన్నారు. అక్కడ తనకు చాలా మృతదేహాలు కనిపించాయన్నారు. తెలుగు యువతి దుర్మరణం ఈ ఘటనలో ఒక తెలుగు యువతి దుర్మరణం పాలయ్యింది. హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల ఐశ్వర్య టెక్సాస్ కాల్పులలో మృతి చెందింది. ఆమె రంగారెడ్డి జిల్లా జడ్జి తాతికొండ నర్సరెడ్డి కుమార్తె. ఐశ్వర్య అమెరికాలోని ఒక కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తోంది. అలెర్ట్ అయిన పోలీసులు ఈ కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అలెర్ట్ అయ్యారు. మారణాయుధంతో దాడులకు తెగబడిన నరరూపరాక్షసుడిని మట్టుబెట్టారు. అతనొక్కడే ఈ కాల్పులకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. దుండగుడిని 33 ఏళ్ల మారిసియో గార్సియాగా గుర్తించారు. ఈ ఘటనకు కారణమేమిటన్నదానిపై పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 4 నెలల్లో 198 కాల్పుల ఘటనలు గన్ కల్చర్ ఆర్కైవ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది అమెరికాలో ఇప్పటివరకూ మొత్తం 198 కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 30న జరిగిన మాస్ షూటింగ్లో ఆగంతకుడు ఐదుగురిని తుపాకీ కాల్పులకు బలితీసుకున్నాడు. ఈ ఘటనలో 9 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. 33 కోట్ల జనాభాలో 40 కోట్ల తుపాకులు అమెరికా స్వాతంత్ర్యం సాధించి 231 ఏళ్ల దాటినా గన్ కల్చర్ అంతంకాలేదు. దీని వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. 2019కి సంబంధించిన ఒక రిపోర్టు ప్రకారం అమెరికాలో 63 వేల మంది గన్‌కల్చర్ డీలర్లు ఉన్నారు. వీరు అదే ఏడాది ఆమెరికా పౌరులకు 83 వేల కోట్ల రూపాయల విలువైన తుపాకులను విక్రయించారు. ప్రపంచంలోని మొత్తం 85.7 కోట్ల సివిలియన్ గన్లలో ఒక్క అమెరికాలోనే 39.3 కోట్లు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికా జనాభా 5 శాతం. అయితే ప్రపంచం మొతంలో గల సివిలియన్ గన్లలో 46 శాతం కేవలం అమెరికాలోనే ఉండటం విశేషం. ఇది కూడా చదవండి: ఫ్రాన్స్ అల్లర్లలో కొత్త కోణం.. అల్లరి మూకల చేతుల్లో ఆధునాతన ఆయుధాలు -
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
ఘోర రోడ్డు ప్రమాదంలో లేడీ సింగం కన్నుమూత
-
ఇదేంది రా మామా...ఈ వయ్యారి యాడికెల్లి వచ్చింది? కనిపెట్టగలరా?
న్యూఢిల్లీ: మెజీషియన్లు తమ అద్భుతమైన యామాజాలంతో జనాన్ని మెస్మరైజ్ చేస్తారు. రకరకాల జిమ్ముక్కులతో మంత్రం వేసి మాయచేసి మ్యాజిక్ చేయడం మనందరికి తెలిసిందే. పిట్టల్ని, బట్టల్ని మన ముందే కనికట్టు చేసి మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యంగా అందమైన అమ్మాయిలను క్షణాల్లో మాయం చేసిడం బాగా ఆకట్టుకుంటూ ఉంటారు ప్రముఖ మెజీషియన్లు. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓరి నీ మ్యాజిక్కో! ఇదేం మ్యాజిక్ రా మామా సాధారణ ప్రజలు అబ్బుర పడిపోవడం కూడా సహజమే.అలాంటి మ్యాజిక్కు సంబంధించిన వీడియో ట్విటర్లో వైరల్ అవుతోంది. 1.3 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఈ వీడియోపై పలు ఫన్నీ ఫన్నీ కమెంట్లతో నెటిజన్లు సందడి చేస్తున్నారు. మరి వీకెండ్ మూడ్‌లో ఉన్న మీరు కూడా ఆ అమ్మడు ఎక్కడనుంచి ఎలా వచ్చింది అనే విషయాన్ని బాగా పరిశీలించండి. ఆ కనికట్టు ఏంటో కనిపెట్టండి. (ఒప్పో రెనో 8టీ 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసిందిగా! ధర ఎంత?) Next-level magic ✨ pic.twitter.com/AxrzcAOJKy — Next Fucking Level (@NxtFuckingLvl) February 3, 2023 -
Viral Video: ‘మా..నిన్ను మేము ఓడిపోనివ్వం’.. మహిళకు పెంపుడు కుక్క సాయం!
-
శ్రీకాళహస్తిలో కిలాడి లేడీ ఘరానా మోసం
-
చిందులేసిన 60 ఏళ్లు పైబడిన బామ్మలు..
-
కారు కావాలా బాబు? మా దగ్గర ధర కొంచెం తక్కువే..
వేలూరు: కార్ల విక్రయాల పేరుతో లక్షలు స్వాహా చేస్తున్న నకిలీ ఎస్ఐ దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వివరాల మేరకు.. తిరువళ్లరు జిల్లా సుంగాచత్రంకు చెందిన రోహిణి(32)కి గత ఏడాది రాణిపేట జిల్లా ఆర్కాడుకు చెందిన వ్యాపారి దినేష్ కుమార్ పరిచయం అయ్యాడు. ఆ సమయంలో రోహిణి తాను చెన్నైలో పోలీస్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెండ్‌లో ఉన్నట్లు తెలిపింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న పలు వాహనాలను విక్రయిస్తున్నానని, ఎవరైనా కొనుగోలు చేయాలను కుంటే తనను సంప్రదించాలని నమ్మించింది. అది నమ్మిన దినేష్ కుమార్ రోహిణికి రూ.2 లక్షలు, ఈమె భర్త చంద్రుకు రూ.12 లక్షలు ఇచ్చి రెండు కార్లు కావాలని కోరాడు. కొద్ది రోజులకు తన స్నేహితులకు మరో రెండు కార్లు కావాలని రోహిణి అకౌంట్లోకి రూ.10 లక్షలు జమ చేశాడు. అయితే నెలలు గడుస్తున్నా రోహిణి నుంచి కార్లు అందకపోవడంతో దినేష్‌కుమార్ వేలూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రోహణి నకిలీ ఎస్ఐగా నటిస్తూ పలువురి వద్ద లక్షలు మోసం చేసినట్లు గుర్తించారు. మంగళవారం ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. -
నమ్మించి పెళ్లి చేసుకున్నాడు.. మోజు తీరాక ఇంట్లోనే ఒక్కదాన్నే వదిలేసి..
యశవంతపుర(బెంగళూరు): బీబీఎంపీ దక్షిణ విభాగం జాయింట్ కమిషనర్ వీరభద్రస్వామి పెళ్లి చేసుకొంటానని నమ్మించి మోసం చేశాడని ద్రిష్ట అనే మహిళ బసవనగుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2020లో పరిచయమయ్యాడని, భార్య నుంచి 11 ఏళ్లుగా దూరంగా ఉంటున్నట్లు చెప్పి తనను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడని తెలిపింది. 2022 ఫిబ్రవరి 14న హుళిమావు–బన్నేరఘట్ట మెయిన్ రోడ్డులోని చౌడేశ్వరి ఆలయంలో తామిద్దరం పెళ్లి చేసుకుని సంసారాన్ని ప్రారంభించామని ఫిర్యాదులో తెలిపింది. అకస్మాత్తుగా ఒకరోజు తనని ఇంట్లో వదిలేసి వెళ్లిపోయాడని మళ్లి తిరిగి ఇంటికి రాలేదని తెలిపింది. ఇప్పుడు తానెవరో తెలియదు అని ముఖం చాటేశాడని, న్యాయం చేయాలని కోరింది. తాను ఫోన్ చేస్తే వీరభద్రస్వామి స్పందించడం లేదని పేర్కొంది. మరో ఘటనలో.. బెకును ఢీకొన్న కారు, ఒకరి మృతి మైసూరు: కారు బైక్‌ను ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన పిరియా పట్టణం తాలూకా సిగూరు గ్రామం మెయిన్ రోడ్డులో బుధవారం జరిగింది. మృతుడిని ఇదే తాలూకా వేలూరుకు చెందిన షడక్షరి స్వామి(35)గా పోలీసులు గుర్తించారు. ఈయన బైక్‌పై వెళ్తుండగా కేరళకు చెందిన కారు ఢీకొంది. ప్రమాదంలో షడక్షరి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారులో ఐదు మంది విద్యార్థులు ఉన్నారు. -
సిబ్బంది ప్రవర్తన.. అవమానం తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా
సూర్యాపేట: ఆసుపత్రిలో పనిచేస్తున్న కిందిస్థాయి సిబ్బంది దురుసు ప్రవర్తన ఆ వైద్యురాలికి ఆవేదన కలిగించింది. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కలత చెంది ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని జిల్లా వైద్యాధికారికి అందజేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారిగా పనిచేస్తున్న ఉషారాణి పట్ల అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్(సీవో) ఉపేందర్ దురుసుగా ప్రవర్తించాడు. విధులకు సక్రమంగా రానందుకు సీవోను తాను మందలించానని, అందుకు సీఓ తనపట్ల దురుసుగా ప్రవర్తించాడని వైద్యురాలు ఉషారాణి అధికారులకు ఫిర్యాదు చేశారు. తాను ఫిర్యాదు చేసే సమయంలో డీఎంహెచ్‌వో, డిప్యూటీ డీఎంహెచ్‌వో అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్ విచారణ చేయాల్సిందిగా వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో సీసీ.. అర్బన్ హెల్త్ సెంటర్‌కు వచ్చి కలెక్టర్‌కు ఎందుకు ఫిర్యాదు చేశావు అంటూ ప్రశ్నిస్తూ తనకు సంబంధం లేని విషయాలపై వేధింపులకు గురిచేశాడని సదరు వైద్యురాలు ఆరోపించారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశానని, విచారణ చేస్తామని చెబుతూ దాటవేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. కిందిస్థాయి సిబ్బందికి ఇచ్చే విలువ మెడికల్ ఆఫీసర్‌కు ఇవ్వడం లేదని కలత చెందిన వైద్యురాలు ఉషారాణి తన విధులకు రాజీనామా చేస్తూ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలంకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ విషయమై డీఎంహెచ్ఓ వివరణ కోరగా పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. -
ఆర్టీసీ బస్సు డ్రైవర్ చొక్కా పట్టుకొని మహిళ వీరంగం
-
కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్
రోడ్డు పై వెళ్తున్నపుడు చిన్న చిన్న తప్పులు జరగడం సహజం. అయితే కొందరు మాత్రం చిన్న చిన్న వాటికి కూడా కోపంతో రెచ్చిపోతుంటారు. తాజాగా ఓ మహిళ రోడ్డుపై కోపంతో విచక్షణ లేకుండా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చోటు చేసుకుంది. (చదవండి: వైరల్: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ.. ) వివరాల్లోకి వెళితే.. తోపుడు బండపై పండ్లు అమ్ముకుంటూ జీవనం సాగించే ఓ వ్యక్తి ఎప్పటిలానే తన బండిని రోడ్డు పై తోసుకుంటూ వెళ్తున్నాడు. ఆ దారిలో ఓ కారు పార్క్ చేసి ఉంది. పొరపాటున చిరు వ్యాపారి తోపుడు బండి ఆ కారుకు తగిలింది. ఈ విషయాన్ని గమనించిన ఆ కారు యజమాని అయన మహిళ విచక్షణ కోల్పోయి మరి అతని పట్ల కర్కశంగా ప్రవర్తించింది. కోపంతో ఊగిపోతు బండిపై ఉన్న పండ్లను రోడ్డుపై విసిరేసింది. అతను తప్పు జరిగింది క్షమించండి అంటూ వేడుకున్న ఏ మాత్రం కనికరం చూపలేదు. దారిన పోయే వాహనదారులు ఆమె అనూహ్య ప్రవర్తనను వీడియో తీస్తున్నా కూడా ఆగకుండా అలాగే చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా కూడా మారింది. Bhopal : After a slight touch of a car parked on the road, the woman in anger threw all the fruits of the fruit seller on the road. It is said that a professor of a private university in Bhopal, madam. The cartman kept pleading but madam did not listen.#Bhopal #MadhyaPradesh pic.twitter.com/cAFvPL7LRN — Mario David Antony Alapatt (@davidalapatt) January 11, 2022 -
వివాహేతర సంబంధం: ఆమె ఫోటో, నంబర్ సంపాదించి..
సాక్షి, హైదరాబాద్: తన బావతో ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఆమె పరువు తీయాలని భావించాడో యువకుడు. సామాజిక మాధ్యమాల నుంచి ఆమె ఫొటో, ఫోన్ నంబర్ సంపాదించాడు. ఫొటో ఎడిటింగ్ యాప్స్‌లలో బాధి తురాలి ఫొటోను మార్ఫింగ్ చేసి ఫిమేల్ ఎస్కార్ట్‌గా చిత్రీకరించి, అసభ్య పదజాలంతో కామెంట్లు పెట్టి ఫోన్ నంబర్‌తో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. దీంతో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆమెకు ఫోన్ కాల్స్, సందేశాలు రావటం మొదలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన బాధితురాలు రాచకొండ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్స్ ఏసీపీ ఎస్.హరినాథ్ సాంకేతిక ఆధారాలు సేకరించి నిందితుడు గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన విద్యార్థి మేకల శేషు వెంకట కృష్ణ (20)ను శుక్రవారం అరెస్ట్ చేశారు. ఇతడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జ్యుడీషియల్ కస్టడీ నిమిత్తం కోర్ట్ ముందు హాజరుపరిచారు. -
నిర్జన ప్రదేశం.. నిస్సహాయంగా యువతి
సాక్షి,కాశీబుగ్గ(శ్రీకాకుళం): అంతగా జన సంచారం లేని కొబ్బరి తోట, కొద్ది దూరంలో రైల్వే ట్రాక్.. రైలు కూతలు తప్ప ఇంకేమీ వినిపించని ఆ ప్రదేశంలో ఓ యువతి శరీరం నిండా గాయాలతో కనిపించడం శుక్రవారం వజ్రపుకొత్తూరు మండలంలో కలకలం రేపింది. గరుడబద్ర పంచాయతీ పరిధి మర్రిపాడు వద్ద రైల్వే ట్రాక్ పరిసరాల్లో గల కొబ్బరి తోట వద్ద శుక్రవారం అపస్మారక స్థితిలో ఉన్న ఓ యువతిని స్థానికులు గుర్తించారు. ఆమె ఒరియా లో మాట్లాతుండడం, నీరసంగా ఉన్న ఆమె మా టలు ఎవరికీ అర్థం కాకపోవడం, శరీరంపై గా యాలు కనిపిస్తూ ఉండడంతో ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. యువతిని చూసిన వారు పోలీసులకు, 108కు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ కూన గోవిందరావు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది ఆమెకు ప్రథమ చికిత్స చేసి పలాస సా మాజిక ఆస్పత్రికి తరలించారు. యువతిని ఒడి శా ప్రాంతానికి చెందిన మహిళగా గుర్తించామని, ట్రైన్ నుంచి ప్రమాదవశాత్తు జారి పడినట్లు భా విస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఆమె మాటలు మతిస్థిమితం లేనట్టుగా ఉన్నాయని, కోలుకున్నా క పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: తాగిన మైకంలో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం -
బాడీలో ఆ పార్ట్‌కి రూ.13 కోట్లు బీమా చేయించుకున్న మోడల్
కొన్ని విలువైన వస్తువులకు భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ నష్టాన్ని భర్తి చేయడం కోసం సాధారణంగా మనం ఇల్లు, కారు, వాహనాలకు బీమా చేయడం కొత్తేమీ కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనం ఆ బీమా డబ్బుని క్లైయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ తరహాలోనే కొందరు సెలబ్రిటీలు తమ శరీర భాగాలకు ఇన్సురెన్స్ చేయించుకుంటుంటారు. ఈ జాబితాలో తారలు కూడా ఉన్నారు. తాజాగా బ్రేజిల్‌లో ఓ మోడల్ కూడా తన బాడీలోని ఓ పార్ట్‌ను ఏకంగా 13 కోట్ల రూపాయలకు ఇన్సురెన్స్ చేయించుకుంది. ఇంతకీ ఏంటా పార్ట్ అంటారా? ఆ మోడల్ తన పిరుదులను ఇన్సురెన్స్ చేయించుకుంది. ప్రత్యేకంగా వాటికే ఎందుకంటే.. బ్రెజిల్‌కు చెందిన మోడల్ నాథీ కిహారాకు తన పిరుదులే అందం. వాటి వల్లనే తను మిస్ బుమ్‌బుమ్ 2021 వరల్డ్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆమె తన పిరుదుల కారణంగానే ప్రసిద్ధి చెందానని, అందుకే వాటికి £1.3 మిలియన్లకు (సుమారు రూ. 13 కోట్లు) బీమా చేయించుకుంటున్నట్లు చెప్పింది. నాథీ ఈ విషయమై మాట్లాడుతూ.. నా పిరుదులు పూర్తిగా సహజమైనది. నా శరీరాన్ని కాపాడుకోవడానికి నేను చాలా శిక్షణ పొందుతున్నాను. తల్లిగా మారిన తర్వాత జిమ్‌లో బరువులు ఎత్తడం కంటే ఆహారంపై ఎక్కువ దృష్టి పెట్టడం ప్రారంభించానని చెప్పుకొచ్చింది. చదవండి: Britney Spears: నా జీవితంలో ఇదే అత్త్యుత్తమ రోజు: బ్రిట్నీ స్పియర్స్ భావోద్వేగం -
యువతి గురించి తెలియక పిచ్చి వేషాలు వేసి అడ్డంగా బుక్కయ్యాడు!
ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్న మహిళలు, బాలికలు ఎక్కడో ఒక దగ్గర లైంగిక వేధింపులకు గురవుతూనే ఉన్నారు. కొందరు ఆకతాయిలైతే బరితెగించి చుట్టూ ఎందరు ఉన్నా మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. తాజాగా బస్సులో ఒంటరిగా కుర్చన్న యువతితో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. తీరా చూస్తే ఆమె ఓ లేడీ బ్రూస్లీ కావడంతో అతను దెబ్బలు తినడంతో పాటు అందరి ముందు అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. అక్టోబర్ 20న బ్రెజిల్‌లోని బెలెమ్‌కు చెందిన ఓ మహిళ బస్సులో ఇంటికి వెళుతోంది. ఆ సమయంలో బస్సు ప్యాసింజర్లతో పుల్గా ఉంది. ఆమె ఎదురుగా నిలుచున్న ఓ వ్యక్తి పిచ్చి చేష్టలు మొదలుపెట్టాడు. బస్సులో ప్యాసింజర్లు అంత మంది ఉన్నా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. చుట్టూ ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారని ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో చిర్రెత్తు కొచ్చిన ఆ యువతి అతడి ముక్కుపై గట్టాగా ఒక్క పంచ్ ఇచ్చింది. దెబ్బకు ఆ వ్యక్తికి కళ్లు బైర్లు కమ్మాయి. వెంటనే వెనకాల నుంచి గొంతును చేతుల్తో చుట్టి పడేసింది. దీంతో ఊపిరాడక అల్లాడిపోయాడు. చివరికి డ్రైవర్ బస్సును నేరుగా పోలీస్‌స్టేషన్ దగ్గరకు తీసుకెళ్లడంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా గత ఏడాది కూడా బస్సులో తనకు ఇలాంటి అనుభవమే ఎదురైందని అందుకే ఆత్మరక్షణ కోసం తాను ప్రత్యేకంగా ముయే థాయ్, కాపోయిరాలను కళను నేర్చుకున్నట్లు ఆ యువతి తెలిపింది. బ్రెజిలియన్ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల నేరానికి పాల్పడినట్లు రుజువైతే, నిందితుడికి ఏడాది నుంచి ఐదు సంవత్సరాల మధ్య జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చదవండి: జైలుకెళ్లొచ్చాక కూడా బిడ్డలపై అత్యాచారం చేస్తా: తండ్రి -
ఒంటరిగా వెళ్తున్న యువతిపై లైంగిక దాడికి యత్నించిన బాలుడు.. ప్రతిఘటించడంతో..
కొచ్చి: ఒంటరిగా నడిచివెళుతున్న యువతిని బలవంతంగా పొలంలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి ప్రయత్నించాడు ఓ బాలుడు. తీరా ఆమె ప్రతిఘటించడంతో రాళ్లతో దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటన కేరళలోని కొండొట్టి ప్రాంతంలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. సోమవారం అర్థరాత్రి ఓ యువతి తన ఇంటి నుంచి కొట్టుక్కర జంక్షన్ వైపు కొండొట్టిలోని కంప్యూటర్ సెంటర్‌కు వెళ్తోంది. అంతలో ఓ బాలుడు ఆమెను వెంబడించి వెనుక నుంచి పట్టుకుని సమీప పొలంలోకి బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తనపై రాళ్లతో దాడి చేశాడు. అయితే నిందితుడి వద్ద నుంచి అతి కష్టం మీద తప్పించుకున్న యువతి అక్కడికి సమీపంలోని తన ఇంటికి వెళ్లి జరిగినదంతా కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి తెలిపిన ఆధారాలు మేరకు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 10వ తరగతి విద్యార్థి, రాష్ట్ర స్థాయి జూడో ఛాంపియన్‌గా పోలీసుల విచారణలో తేలింది. మొదట్లో నిందితుడు తానీ నేరం చేయలేదని విచారణలో తెలిపాడు. అయితే పోలీసులు కాస్త గట్టిగా అడగడంతో నిజాన్ని అంగీకరించాడు. దీంతో ఆ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు పరచనున్నారు. చదవండి: Online Dating: మొదట డేటింగ్..ఆపై ఇంటికి రప్పించుకుని నీళ్లలో మత్తుమందు కలిపి.. -
‘వ్యాక్సిన్ వద్దంటే వద్దు.. వెళ్లకపోతే పాముతో కరిపిస్తా’
జైపూర్: కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినే కీలకమనీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి. అయితే కొందరు వ్యాక్సిన్‌పై వస్తున్న అసత్య ప్రచారాలను,అపోహలను నమ్ముతూ టీకా వేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. తాజాగా వాక్సిన్ వేయటానికి వచ్చిన మెడికల్ సిబ్బందిని పాముతో కాటేయిస్తానని ఓ మహిళ బెదిరించింది. ఈ వింత ఘటన రాజస్తాన్‌లోని అజ్మిర్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అజ్మిర్ జిల్లాలోని నాగేలావ్ గ్రామంలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇంటి ఇంటికి తిరిగి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమలా దేవీ అనే మహిళ ఇంటికి వెళ్లి టీకా వేయించుకోవాలని కోరారు. అయితే వ్యాక్సిన్‌పై అపోహ ఉండడంతో ఆమె టీకా వేసుకోవడానికి అంగీకరించలేదు. వ్యాక్సిన్ సిబ్బంది ఆమె నచ్చజెప్పే ప్రయత్నం చేసేసరికి తన ఇంట్లోని బుట్టలో ఉన్న పాముతో వారిని బెదిరించింది. ‘‘ నాకు వ్యాక్సిన్ వద్దు ఏమీ వద్దు.. ముందు ఇక్కడి నుంచి పొండి.. లేదంటే పాముతో కరిపిస్తా’’ అంటూ వారిని భయపెట్టింది. సమాచారం అందుకున్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వైద్య బృందంతో పాటు స్థానికులు కూడా టీకా తీసుకోవడం వల ప్రయోజనాలను వివరించడంతో కమలా దేవి టీకా వేయించుకోవడానికి అంగీకరించింది. దీని తర్వాత, ఆ ప్రాంతంలోని 20 మందికి కోవిడ్ -19 టీకాలు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు మహిళ ప్రవర్తన చూసి నోరెళ్ల బెడుతున్నారు. -
ఒంటరి మహిళలే టార్గెట్.. అలా 100 మందికి పైగా.. చివరికి ఇలా చిక్కాడు
చెన్నై: ఎంతటి వాడైన, ఎన్ని తప్పులు చేసిన ఏదో ఒక రోజు చేసిన నేరాలకు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అలా వంద మందిపైగా మహిళలను వేధించిన సైకోకి చెన్నై పోలీసులు చెక్ పెట్టారు. నార్త్ జగన్నాధన్నగర్కు చెందిన దినేష్ కుమార్ ఇటీవల ఓ రోజు ఆర్మీ అధికారి కూతురును వేధించడంతో దినేష్ బండారం మొత్తం బయటపడింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని క్యాటరింగ్ కళాశాలలో చదువుతున్న దినేష్ కుమార్, కరోనా కారణంగా ఆన్లైన్ క్లాసులలో పాల్గొంటూ, చెన్నై ఎగ్మోర్ పరిసరాల్లోని ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. అయితే అతను రాత్రి లేదా ఉదయాన్నే ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని వేధించేవాడు. ఈ క్రమంలో గత వారం ఓ యువతి తన సోదరి, తండ్రి ఆర్మీ ఆఫీసర్‌తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా, ఆ సమయంలోనే దినేష్ ఉద్యోగానికి పోతున్నాడు. అయితే ఆ యువతి తన ఇద్దరు కుటుంబ సభ్యుల వెనుక నడుస్తోంది. (చదవండి: Drown In Pond:‘లే అమ్మా, లే చెల్లె.. మా అమ్మ కావాలే’.. ) దీంతో తను ఒంటరిగా ఉందని భావించి తనతో ఆసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇది గమనించిన మహిళ తండ్రి దినేష్‌ని పట్టుకోవడానికి ప్రయత్నించిన అప్పటికే అతను బైకు మీద ఉడాయించాడు. ఆర్మీ ఆఫీసర్ అతని బండి నంబర్ని నోట్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతని బైకు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతని బండిని ట్రాక్ చేయడంతో పాటు, సీసీటీవీ ఫుటేజీని పరీశిలించారు. చివరికి అతని ఆచూకి కనిపెట్టిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. తాను ఇప్పటివరకూ 100 మంది మహిళలను వేధించానని పోలీసుల ఎదుట నిందితుడు అంగీకరించాడు. చదవండి: సింఘు సరిహద్దులో వ్యక్తి హత్య: ‘అతను అలాంటివాడు కాదు.. ఆశ చూపి’‘ -
అడల్ట్ కంటెంట్ పిచ్చి.. ఆన్లైన్ ప్రియురాలి మోజు.. వ్యసనాల కోసం ఏకంగా..
అహ్మదాబాద్: చెడు అలవాట్లు వ్యసనంగా మారడంతో ఓ వ్యక్తి జీవితాన్ని నాశనం అయ్యింది. ఇంటర్నెట్లో అశ్లీల కంటెంట్ వ్యసనంతో పాటు ఆన్లైన్లో పరిచయమైన మహిళ కోరికలు తీర్చేందుకు ఓ వ్యక్తి తన యజమానిని మోసగించి కోటి వరకు స్వాహా చేశాడు. ఈ ఘటన గుజరాత్లో వెలుగుచూసింది. ఈ కేసుకు సంబంధించి నిందితుడితో పాటు మరో ఇద్దరిని రాజ్‌కోట్‌లో అరెస్ట్ చేశారు. (చదవండి: ప్రియురాలు పని చేసే చోట దొంగతనం.. పాపం పోవాలని పూజలు.. ) వివరాల ప్రకారం.. తుషార్ సెజ్పాల్ అనే వ్యక్తి, గ్రాఫిక్ డిజైనర్ అయిన ఇర్ఫాన్ షేక్ చెందిన సంస్థలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. పోర్న్‌కు బానిసగా మారిన సెజ్పాల్, ఇంటర్నెట్లో అడల్ట్ మూవీస్ చూడటానికి సంస్థ బ్యాంక్ అకౌంట్ నుంచి రూ.16 లక్షలు వరకు వాడుకున్నాడు. అంతేగాక ఇటీవల ఆన్లైన్లో ఓ మహిళతో పరిచయం ఏర్పడడం అతని జీవితాన్నే మార్చేసింది. ఆమె పరిచయం అయిన కొన్ని రోజులకు ప్రియురాలుగా మారింది. సెజ్పాల్ బలహీనతను పసిగట్టిన ఆ మహిళ అతని నుంచి పలమార్లు డబ్బులు రాబట్టింది. అనేక సందర్భాల్లో ఆమె కోరిక మేరకు ఎంత డబ్బు అడిగితే అంత ట్రాన్స్ఫర్ చేసేవాడు సెజ్పాల్. అలా ఇప్పటి వరకు అతను ఇర్ఫాన్ సంస్థ బ్యాంక్ ఖాతా నుంచి రూ.85 లక్షల మొత్తాన్ని బదిలీ చేశాడు. చివరికి ఇర్ఫాన్ కొనుగోలు చేసిన ఇంటి ఈఎంఐలను కూడా చెల్లించకుండా ఆ మొత్తాన్ని కూడా సెజ్పాల్ తన ప్రియురాలు ఖాతాకు మళ్లించాడు. అలా సెజ్పాల్ రూ.కోటి దాకా సంస్థ డబ్బుని తన సొంతానికి ఉపయోగించాడు. చివరకు ఈ విషయం ఇర్ఫాన్‌కు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా సెజ్పాల్, తన ప్రియురాలు ఆమె తల్లి సహా ఏడుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు -
డబ్బులు లేక ఆ రోజు చేసిన పని.. నేడు ట్రెండ్‌గా మారింది
జూలియా సయూద్ సిరియాకు చెందిన యువతి. ఆమెకు పెయింటింగ్స్ అంటే ప్రాణం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జూలియా తన ఇంటిని వదిలి బయటకు రావల్సివచ్చింది. ఆ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ కిట్‌ను అక్కడే వదిలేసింది. ఆ సమయంలో తన పరిస్థితి ఎలా ఉందంటే.. తనకు నచ్చిన పెయింటింగ్ వేయడం కోసం కలర్స్ కొనడానికి కూడా తన దగ్గర డబ్బులు లేవు. తనకు నచ్చిన పెయింటింగ్స్‌ను ఆపడం ఇష్టం లేని ఆ యువతి.. కలర్స్ లేకపోయనా తన కళను కొనసాగించాలనుకుంది. అందుకోసం ఆమె ఓ కొత్త ఐడియా ఆలోచించింది. అదే.. కలర్స్ బదులుగా మట్టిని ఉపయోగించి పెయింటింగ్స్‌ను వేయాలని నిర్ణయించుకుంది. అలా మొదలు పెట్టిన జూలియా ప్రస్తుతం ఆ మట్టి పెయింటింగ్స్ నెట్టింట సెన్సేషన్‌గా మారాయి. దీనిపై ఆమె మాట్లాడుతూ.. అప్పుడు మట్టితో పెయింటింగ్స్ వేయడం వల్ల డబ్బు ఆదా అవుతుందనుకున్నా. మొదట, నేను నా కలను కొనసాగించాలని ఆలోచనతో అలా మట్టితో మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు అప్పుడు వేరే మార్గం లేదు .. కానీ ఇప్పుడు కలర్స్ ఉన్నా కూడా మట్టితో పెయింటింగ్ వేయడమే నాకు నచ్చుతోందని తెలిపింది. మట్టితో అద్భుతమైన పెయింటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు తన వేసిన సాయిల్ పెయింటింగ్స్ ఆ ప్రాంతంలో ట్రెండ్‌గా మారడంతో పాటు ఆ పరిసరాల్లోని పిల్లలకు కూడా ఈ మట్టితో పెయింటింగ్ ఎలా వేయాలో నేర్చుకుంటున్నారు. WATCH: Syrian artist Julia Saeed started painting with soil after she fled her home in Raqqa and could not afford to buy paint. Now she has made painting with soil her unique style pic.twitter.com/JsE64Imai5 — Reuters (@Reuters) October 10, 2021 -
రేవ్ పార్టీ.. ఎవరికీ అనుమానం రాకుండా అందులో డ్రగ్స్
ముంబై: డ్రగ్స్ దందాను అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ, కేటుగాళ్లు సరికొత్త దారులు ఎంచుకుంటూ సరఫరా చేస్తూనే ఉన్నారు. తాజాగా ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్ పార్టీలో ఓ మహిళ ఏకంగా శానిటరీ న్యాప్కిన్లో డ్రగ్స్ తీసుకువెళ్లినట్లు పోలీసుల విచారణలో తేలడంతో షాక్ గరయ్యారు. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు మొత్తం 19మందిని అరెస్టు చేసినట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్టోబర్ 11న విచారణకు హాజరు కావాలంటూ తాజాగా ప్రొడ్యూసర్ ఇంతియాజ్ ఖత్రీకి ఎన్సీబీ అధికారులు నోటీసులు జారీచేశారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే ప్రయత్నించగా న్యాయస్థానం అందుకు నిరాకరించింది. ముంబై మెజిస్ట్రేట్ కోర్టు గురువారం ఆర్యన్ ఖాన్ సహా ఏడుగురిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టులో.. ఆర్యన్ ఖాన్‌ను క్రూయిజ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే, అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. రెండవది, పోలీసులు అర్యాన్ని అదుపులోకి తీసుకుంది కూడా కేవలం అతని చాట్ ఆధారంగా మాత్రమేనని మరే ఇతర బలమైన అధారాలు లేవని తెలిపారు. చదవండి: భార్యే తెగబడిందా.. ప్రియుడు సహకరించాడా..? -
రన్నింగ్ ట్రైన్లో మహిళపై సామూహిక లైంగికదాడి.. అడ్డొచ్చినవారిని..
ముంబై: రైల్లో ప్రయాణిస్తున్న ఓ మహిళపై దోపిడీ దొంగలు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన లక్నో– ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ రైలులో చోటు చేసుకుంది. తాజాగా ఈ ఘటనతో మహిళలకు బయట ఏ మాత్రం రక్షణ ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి, ఎనిమిది మంది దుండగులు ఆయుధాలతో, మహారాష్ట్రలోని ఇగత్పురి పట్టణంలో లక్నో-ముంబై పుష్పక్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్‌లోకి ప్రవేశించారు. ఆ భోగిలో పోలీసులు లేరని తెలుసుకున్న దుండగులు ప్రయాణికుల వద్ద అందినంత వరకు దోచుకోవడంతో పాటు ఓ మహిళా ప్రయాణికురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. మహిళపై అఘాయిత్యాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన తోటి ప్రయాణికులను కూడా వారు ఆయుధాలతో గాయపరిచారు. ఈ దాడిలో సుమారు ఆరు మంది వరకు గాయపడినట్లు సమాచారం. ప్రయాణికులు ఆందోళనకు గురై గట్టిగా అరవడంతో రైలును ముంబైలోని కాసరా స్టేషన్ వద్ద ఆపేశారు. అప్రమత్తమైన పోలీసులు ఆ కోచ్ వద్దకు చేరుకుని ఇద్దరు దొంగలను అరెస్టు చేయగా, తర్వాత మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రస్తుతం మరో నలుగురి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అదుపులోకి తీసుకున్న దొంగల నుంచి రూ. 34 వేల నగదు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం, దోపిడి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఊహించని ప్రమాదం.. తండ్రితో కలిసి కాలేజీకి వెళ్తుండగా... -
భర్త మృతి.. ముగ్గురు కూతుళ్లతో కలిసి పుట్టింటికి వెళ్తున్నానని..
సాక్షి, బళ్లారి: కోవిడ్ రక్కసి కాటుకు ఎన్నో కుటుంబాలు ఛిన్నాభిన్నమయ్యాయి. కరోనాకు కుటుంబ పెద్ద బలి కావడంతో, నలుగురు ఆడపిల్లల్ని పోషించలేక ఓ తల్లి పిల్లలతో కలిసి నదిలో దూకింది. ఈ సంఘటనలో తల్లీ, చిన్న కూతురు మరణించగా, మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘోరం కర్ణాటకలోని గదగ్ జిల్లా రోణ తాలూకా హుళే ఆలూరు వద్ద బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఉమాదేవి (40) అనే మహిళ భర్త నెల కిందట కోవిడ్‌తో కన్నమూశాడు. ఆమెకు నలుగురు కూతుళ్లు కాగా, పెద్ద కూతురు గదగ్‌లో హాస్టల్లో ఉండి ఇంటర్ చదువుతోంది. భర్త చనిపోయినప్పటి నుంచి తీవ్రంగా కుంగిపోయింది. ఆమెకు రూ. 7 లక్షల వరకూ అప్పులు ఉన్నట్లు తెలిసింది. పుట్టింటికి వెళ్తున్నానని ఇరుగుపొరుగుకు చెప్పి ముగ్గురు కూతుళ్లను తీసుకుని తెల్లవారుజామునే వెళ్లిపోయి సమీపంలోని మలప్రభ నదిలోకి దూకింది. సమీపంలో ఉన్న వ్యక్తులు హుటాహుటిన నదిలోకి దూకి 12, 14 ఏళ్ల ఇద్దరు బాలికల్ని కాపాడారు, కానీ ఉమాదేవి, 8 ఏళ్ల చిన్నకూతురు నదిలో కొట్టుకుపోయి మృతి చెందారు. చదవండి: అంతా బాగానే ఉంది.. ఆరేళ్లుగా సహజీవనం చేసి చెప్పకుండానే.. -
యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్.. వికటించడంతో..
ముంబై: యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లోనే స్వయంగా అబార్షన్ చేయడానికి యత్నించిన ఓ యువతికి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలైంది. మహారాష్ట్ర నాగపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యశోధర నగర్‌కి చెందిన సోహెబ్ ఖాన్(30), బాధితురాలు 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఇటీవల తను గర్భం దాల్చడంతో విషయం తెలుసుకున్న ఖాన్ ఆమెను అబార్షన్ చేసుకోవాలని కోరాడు. ఇందుకు అబార్షన్ ఎలా చేస్తారో, లేదా గర్భస్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయని వాటిని చూసి తెలుసుకోవాలని సోహెబ్ ఆమెకు సూచించాడు. అతని బలవంతం మీద యూట్యూబ్ వీడియోలు చూసి ఆమె సొంతంగా అబార్షన్‌కు యత్నించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సోహెబ్ ఖాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. చదవండి: రూటు మార్చిన మోసగాళ్లు.. జర జాగ్రత్త! -
డాడీ.. ఈ సారి గోవాలో బర్త్‌డే జరుపుకుంటానని వెళ్లి..
సాక్షి, మంచిర్యాల: ఒక్కగానొక్క కూతురు.. పైగా తల్లిదండ్రులిద్దరూ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైద్యులే. కూతుర్ని సైతం డాక్టర్‌ను చేసి వారి ఆస్పత్రిలోనే కూర్చోబెట్టాలని కలలు కన్నారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. పుట్టిన రోజునే బిడ్డ తనువుచాలించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. కూతుళ్ల దినోత్సవం రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది. మృతురాలు జిల్లా కేంద్రంలోని జయ మెటర్నిటీ నర్సింగ్ హోం వైద్యులు డాక్టర్ ఫణికుమార్–జయలలిత దంపతులకు ఒక్కగానొక్క కూతురు నేహ(24). బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. నేహ గతేడాది ఎంబీబీఎస్ పూర్తి చేసి పీజీకి ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో బంధువులతో కలిసి రెండు రోజుల క్రితం గోవా వెళ్లింది. శనివారం అర్ధరాత్రి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకుంది. తల్లిదండ్రులతోనూ ఫోన్లో ఆనందాన్ని పంచుకుంది. ఈ క్రమంలో తెల్లవారేసరికే గుండెపోటుతో మృతి చెందిన వార్త కన్నవారిలో తీరని శోకం మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులను విడిచి ఇప్పటి వరకు నేహ పుట్టినరోజు జరుపుకోలేదు. ఎప్పడూ అడగని బిడ్డ డాడీ.. ఈ సారి గోవాలో బర్త్‌డే జరుపుకుంటానని అడిగితే తండ్రి కాదనలేక పంపించినట్లు బంధువులు తెలిపారు. కూతురు మరణవార్త విన్న తండ్రి డాక్టర్ ఫణికుమార్, కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ బయలు దేరారు. గోవా నుంచి మృతదేహం హైదరాబాద్ రానున్నట్లు తెలిసింది. జిల్లా కేంద్రంలో విషాదఛాయలు డాక్టర్ ఫణికుమార్–జయలలిత జిల్లాలో పేరున్న వైద్యులు. ఈమేరకు వారి కూతురు మరణవార్త తెలియడంతో బంధువులు, మిత్రులు వారింటికి చేరుకున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: నన్ను బాగా చూసుకుంటానని నమ్మించి ఇల్లు అమ్మించాడు.. కానీ -
ఆ యువతితో సహజీవనం.. అప్పటి నుంచే కష్టాలు మొదలయ్యాయి
సాక్షి,బంజారాహిల్స్ (హైదరాబాద్): తనను కులం పేరుతో దూషించడమే కాకుండా వృద్ధురాలిని అని కూడా చూడకుండా వేధిస్తున్నారని కుమారుడు, కోడలుపై ఓ మహిళ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే... బర్కత్‌పురా దివాకర్ గార్డెన్స్‌లో నివసించే బి.హేమలత(65)కు కుమారుడు శ్రీకాంత్ ఉన్నాడు. 2017లో సింధూరారెడ్డి అనే యువతితో శ్రీకాంత్ సహజీవనం చేస్తున్నాడు. అప్పటి నుంచే తనకు కష్టాలు ప్రారంభమయ్యాయని, తనను కొడుతూ ఇంట్లో నుంచి తరిమేశాడని, ఇప్పుడు తాను అనాథగా మారానని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బాగా చూసుకుంటానని గత మార్చి నెలలో బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని తన ఇంటికి తీసుకొచ్చాడని నమ్మించి మీర్పేట్లో ఉన్న ఇల్లును అమ్మించాడని, ఆ తర్వాత తన బాగోగులు చూడటం లేదని ఆరోపించారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటూ తరిమారని, తనను చంపేందుకు కూడా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు పోలీసులు సింధూర రెడ్డి, శ్రీకాంత్‌లపై ఐపీసీ సెక్షన్ 509, ఎస్సీ, ఎస్టీ, సీనియర్ సిటిజన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
న్యాయం చేస్తారా.. ఆత్మహత్య చేసుకోమంటారా?
తాండూరు(వికారాబాద్) : మండలంలోని కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్ ఎదుట అక్కాచెల్లెళ్లు హల్చల్ చేశారు. ఆస్తి తగదాల నేపథ్యంలో సొంత తమ్ముడు వేధిస్తున్నాడని ఆత్మహత్య చేసుకుంటామని పోలీసుల ఎదుట వాపోయారు. కోత్లాపూర్‌కు చెందిన జగ్గమ్మ, రేణుక అక్క, చెల్లెళ్లు. నరేష్‌గౌడ్ వారి సోదరుడు. జగ్గమ్మ, రేణుక వివాహమైనా కోత్లాపూర్లోనే నివాసముంటున్నారు. ఈ నేపథ్యంలో వారి తమ్ముడు నరేష్‌గౌడ్ ఆస్తి విషయమై పలుమార్లు తమను కొట్టాడని అక్కాచెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. శనివారం జగ్గమ్మపై తమ్ముడు నరేష్ చేయిచేసుకోవడంతో ఆదివారం అక్క, చెల్లెలు ఇరువురు కరన్‌కోట్ పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. తమ తమ్ముడు నరేష్ తరుచూ గొడవపెట్టుకొని మమ్మల్ని కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్ ఎదుట వాపోయారు. పోలీసులు న్యాయం చేయకపోతే వెంటతెచ్చుకున్నపెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రూరల్ సీఐ జలంధర్‌రెడ్డి, ఎస్ఐ ఏడుకొండలు కల్పించుకోని నరేష్‌పై గతంలో కేసు నమోదు చేశామని ప్రస్తుతం మళ్లీ కేసు నమోదుచేస్తామని చెప్పడంతో అక్క, చెల్లెలు శాంతించారు. చదవండి: ఏడుగురి స్నేహితుల మధ్య ‘లూడో గేమ్’ వివాదం -
మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్
కాజీపేట అర్బన్(వరంగల్): వరంగల్ ఎల్బీనగర్లో అన్న చాంద్‌పాషా కుటుంబంపై తమ్ముడు షఫీ దాడిచేసి ముగ్గురిని చంపిన విషయం తెలిసిందే. చాంద్‌పాషా కుమార్తెతోపాటు ఖలీల్ పిల్లలు శుక్రవారం సీపీ తరుణ్జోషిని కలిశారు. ( వరంగల్‌లో దారుణం.. అన్న కుటుంబంపై కత్తులతో దాడి ) మా పిన్ని పాత్ర కూడా ఉంది : చాంద్‌పాషా కుమార్తె రుబీనా మా నాన్న చాంద్‌పాషా, తల్లి సాబీరా, మామయ్య ఖలీల్‌లను మా చిన్నాన్న షఫీ కిరాతకంగా చంపడంలో మా పిన్ని పాత్ర కూడా ఉంటుంది. మా పిన్ని ఓ లేడీ టైగర్‌గా వ్యవహరిస్తుంది. మా ఇద్దరు సోదరులు ఇప్పటికీ ప్రాణాపాయ స్ధితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేసి చంపుతారోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం, మాకు రక్షణ కల్పించాలని సీపీని వేడుకున్నా. మాకు దిక్కెవరు: ఖలీల్ పిల్లలు మా నాన్నను అతి కిరాతకంగా కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడిచేసి నరికిన షఫీని అదే విధంగా చంపాలి. ఇప్పుడు మాకు ఎవరు దిక్కు అంటూ వేడుకున్నారు ఖలీల్ పిల్లలు. చదవండి: ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్! -
ఏడాదిన్నర క్రితం వివాహం, మొదట్లో బాగానే ఉన్నా.. తర్వాత ఆమెను..
మెట్పల్లి(కోరుట్ల): అత్తింటి వేధింపులకు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సదాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. మెట్పల్లి సాయిరాంకాలనీకి చెందిన రమ్య(20)కు అదే కాలనీకి చెందిన దొమ్మాటి నరేందర్‌తో ఏడాదిన్నర క్రితం వివాహం జరిగింది. మొదట్లో బాగానే ఉన్నా తర్వాత నరేందర్, అతని తల్లి జమునలు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించడం ప్రారంభించారు. దీంతో జీవితంపై విరక్తి చెంది, గత నెల 31న ఇంట్లో ఎలుకల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గురువారం నిజామాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. చదవండి: వ్యాన్ డ్రైవర్‌తో జూనియర్ లెక్చరర్ ప్రేమ పెళ్లి, చివరకు.. -
మెడికల్ షాపునకు వెళ్లి తిరిగి వచ్చేసరికి..
సాక్షి, అమీర్‌పేట( హైదరాబాద్): ఓ కార్పెంటర్ భార్య ఆత్మహత్య చేసున్న సంఘటన ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.ఎస్సై శంకర్ తెలిపిన వివరాలిలా.. ఖమ్మం జిల్లా డోర్నకల్‌కు చెందిన బాలాజీ కుటుంబం అమీర్‌పేట డివిజన్ బాపూనగర్‌లో నివాసముంటోంది. భార్య అక్క మీరాబాయి (38)ను రెండో వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం.కాగా గురువారం రాత్రి చిన్న కూతురుకు జ్వరం రావడంతో మందులు తెచ్చేందుకు బాలాజీ మెడికల్ షాపునకు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి పిల్లలు ఏడుస్తూ కనిపించారు. బెడ్రూమ్ తలుపులు తట్టగా మీరాబాయి ఎంత సేపటికి తలుపులు తీయకపోవడంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లి చూడగా మీరాబాయి ఉరేసుకుంది. ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. బాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. చదవండి: ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ -
మంత్రాలతో నీ కొడుకు ఆరోగ్యం నయం చేస్తానంటూ..
సాక్షి,నేరేడ్మెట్( హైదరాబాద్): మంత్రాల పేరుతో ఓ మహిళను మోసం చేసిన కేసులో నిందితుడిని నేరేడ్మెట్ పోలీసులు గురువారంఅరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఇన్స్పెక్టర్ నర్సింహ్మస్వామి సమాచారం మేరకు... లోయర్ ట్యాంక్‌బండ్‌కు చెందిన శ్యామల కొడుకు కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయంలో నేరేడ్మెట్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఆర్.కె.పురానికి చెందిన రాకేష్‌ను ఆమె సంప్రదించింది. దీంతో మంత్రాలు, పూజల పేరుతో కొడుకు ఆరోగ్యం నయం చేయడంతోపాటు ఇంట్లోని ఇతర సమస్యలనూ బాగు చేస్తానని నిందితుడు ఆమెను నమ్మించాడు. ఇందుకు బాధితురాలు రూ. 2.60 లక్షలతోపాటు 5 తులాల బంగారు ఆభరణాలను ఇచ్చింది. తరువాత పూజలు ఎప్పుడు చేస్తావని బాధితురాలు నిందితుడిని అడుగగా రేపుమాపు అంటూ కాలాయాపన చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో అనుమానం వచ్చి తన డబ్బు, బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని ఇంటికి వెళ్లి నిందితుడిని గట్టిగా అడిగింది. ఈ నెల 10న నిందితుడు బా ధితురాలని అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో మంత్రాలు, పూజల పేరుతో నిందితుడు తనను మోసం చేశాడని బాధితురాలు గుర్తించింది. పలువురు మహిళలు కూడా బెదిరించారని బాధితురాలు నేరేడ్మెట్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశామని ఇన్స్పెక్టర్ వివరించారు. చదవండి: chicken: భర్త చికెన్ తిన్నాడని క్షణికావేశంలో భార్య ఆత్మహత్య -
ఇప్పుడే వస్తానంటూ వెళ్ళింది.. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్
సాక్షి,పంజగుట్ట(హైదరాబాద్): అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత అదృశ్యమైంది. ఈ ఘటన పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. ఖైరతాబాద్ ప్రేమ్‌నగర్‌లో నివసించే బి. కీర్తన (27) ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంటారు. ఈ నెల 27వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఇప్పుడే వస్తానంటూ భర్త ప్రేమ్ సాయికుమార్‌కు చెప్పి వెళ్ళి అరగంటైనా తిరిగి రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ వచ్చింది. బంధుమిత్రుల ఇళ్ళల్లో గాలించినా ఫలితం కనిపించలేదు. తన భార్య కనిపించడం లేదంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని పోలీసులు గాలింపు చేస్తున్నారు. జైలుకు వెళ్లొచ్చినా మారలేదు హిమాయత్‌నగర్: యువతి వెంటపడుతూ వేధిస్తున్న యువకుడిని నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. కింగ్‌కోఠి షేర్‌గేట్‌లో నివాసం ఉండే యాంకరింగ్ చేస్తున్న యువతి అదే ప్రాంతంలో నివాసం ఉండే సల్మాన్‌ఖాన్‌లు ప్రేమించుకున్నారు. గత ఏడాది ఇద్దరి మధ్య వాగ్వివాదాలు రావడంతో..యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు జైలుకు కూడా వెళ్లొచ్చాడు. తరువాత కొద్దిరోజులుగా యువతి ఇంటి వద్దకు వచ్చి నిలబడటం, యువతిని వెంబడించడం, ఫోన్ మాట్లాడుతూ యువతిని తిట్టడం లాంటివి చేస్తున్నాడు. ఆమెతో మాట్లాడకపోయినా ఫాలో అవుతున్న తీరును చూసిన యువతి తల్లి బుధవారం యువతితో కలసి మరోమారు కేసు పెట్టింది. దీంతో గురువారం సల్మాన్‌ఖాన్‌ను కోర్టులో హాజరుపరచగా 14రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై సంధ్య తెలిపారు. చదవండి: భర్త ఇంట్లో ఉండగా.. తాళం వేసి బయటి వెళ్లి.. -
వివాహేతర సంబంధం వద్దన్నందుకు..
సాక్షి, హైదరాబాద్: వివాహితతో సంబంధం వద్దన్నందుకు స్నేహితుడిపై దాడి చేసిన సంఘటన సంతోష్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రియాసత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఇసా (27), షాహీనగర్ ప్రాంతానికి చెందిన అక్బర్ ఖాన్ స్నేహితులు. కాగా ఈ నెల 24వ తేదీ రాత్రి రియాసత్‌నగర్‌లోని డికాషన్ హోటల్ వద్ద ఇసాను స్నేహితుడు అక్బర్ ఖాన్ కలిశాడు. కాగా అక్బర్ ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో మహ్మద్ ఇసా మందలించాడు. దీంతో కోపోద్రిక్తుడైన అక్బర్ ఖాన్ కత్తితో ఇసా ముఖంపై దాడి చేశాడు. ఈ విషయం గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇసాను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఇసా ముఖంపై ఎనిమిది కుట్లు పడినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అక్బర్ ఖాన్‌ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: ఓటుకు కోట్లు కేసు: రేవంత్, సండ్రలకు సుప్రీంలో ఊరట -
భర్త ఇంట్లో ఉండగా.. తాళం వేసి బయటి వెళ్లి..
సాక్షి,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్): ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట దస్తగిరి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఆదిల్, నజ్మీన్ అన్సారీ (34) దంపతులు. కాగా ఆదిల్ నజ్మీన్‌ను రెండో వివాహం చేసుకోవడంతో మొదటి భార్య వదిలేసింది. ఆదిల్, నజ్మీన్ మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రతి రోజూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఈ నెల 23వ తేదీ 8.30 గంటలకు నజ్మీన్ భర్త ఆదిల్ ఇంట్లో ఉండగా... ఇంటికి తాళం వేసి బయటి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: Bullettu Bandi Bride: ‘బుల్లెట్టు బండి’ వధువుకు బంపర్ ఆఫర్ -
ప్రసూతి కోసం వచ్చి ఆస్పత్రిలో...
దూద్‌బౌలి: పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ప్రసవానికి వచ్చిన ఓ గర్భిణి సోమవారం రాత్రి మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళనకు దిగడంతో ఆస్పత్రి ఆవరణలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులను సముదాయించారు. మృతురాలు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బంధువు కావడంతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు నినాదాలు చేశారు. గోషామహల్ ప్రాంతానికి చెందిన సరిత (40)ను ఈ నెల 11న ప్రసవం కోసం పేట్లబురుజు ఆస్పత్రిలో చేర్పించారు. చేర్పించిన నాటి నుంచి వైద్యులు సరితకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం రాత్రి సరితకు బీపీ అధికం కావడంతో ప్రసవం కాకుండానే మృతి చెందింది. దీంతో కోపోద్రేక్తులైన కుటుంబ సభ్యులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంవల్లే సరిత మృతి చెందిందని ఆరోపించారు. ఆస్పత్రి అధికారులు మాత్రం సరిత అధిక బరువు, బీపీ, అనారోగ్య సమస్యలతో బాధపడుతోందని, ఆమెను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని... ఇందులో తమ పొరపాటు లేదన్నారు. సరిత 20 ఏళ్ల అనంతరం గర్భం దాల్చిందని తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. -
కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): కోర్టు తీర్పును టైప్ చేస్తూ గుండెపోటుతో స్టెనోగ్రాఫర్ మృతిచెందారు. ఈ ఘటన తిరువళ్లూరు ఉమ్మడి కోర్టు ఆవరణలో మంగళవారం జరిగింది. చెన్నై కోడంబాక్కం ఆండవర్‌నగర్‌కు చెందిన బాలాజీ భార్య సరస్వతి (52) జిల్లా ప్రధాన కోర్టులో స్టెనోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం జిల్లా న్యాయమూర్తి ఒక కేసులో ఇచ్చిన తీర్పును టైప్‌చేస్తూ హఠాత్తుగా కిందపడిపోయారు. ఆమెను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తిరువళ్లూరు నగర పోలీసులు కేసు నమోదు చేశారు. -
వ్యాక్సిన్ రెండో డోసు తీసుకుంది.. మంచంపై పడుకుని నిద్రలోనే మృతి
హైదరాబాద్: కోవిషీల్డ్ రెండో తీసుకున్న పెంటమ్మ అనే మహిళ మృతి చెందింది. వ్యాక్సిన్ తీసుకున్న కొద్దిసేపటికే తనకు కళ్లు తిరుగుతున్నాయంటూ మంచంపై పడుకుని నిద్రలోనే మృతి చెందడంతో శనివారం సాయంత్రం పాతబస్తీ ఛత్రినాకలో విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్న తమ అమ్మ వ్యాక్సిన్ తీసుకున్న కారణంగానే మృతి చెందిందని.. అనవసరంగా వ్యాక్సిన్ తీసుకుని అమ్మను దూరం చేసుకున్నామని పిల్లలు గుండె పగిలేలా రోదించడం కంటతడి పెట్టించింది. వివరాల ప్రకారం ఉప్పుగూడ ప్రాంతానికి చెందిన పుష్పాకుల పెంటమ్మ (50) , ముత్తయ్య దంపతులు, వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు సంతానం. ముత్తయ్య జీహెచ్ఎంసీలో కాంట్రాక్ట్ లేబర్. ఇదిలా ఉండగా పెంటమ్మ గత ఏప్రిల్ నెలలో మొదటి డోస్ కోవిషిల్డ్ వ్యాక్సిన్ తీసుకుంది. రెండు డోసు తీసుకునేందుకు శనివారం గోడేకిఖబర్‌లోని వ్యాక్సిన్ సెంటర్‌కు వచ్చి వ్యాక్సిన్ తీసుకుంది. అనంతరం అరగంట వరకు కూడా పెంటమ్మల డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంది. అక్కడి నుంచి బయటకు వచ్చిన కొద్ది సేపటికే కళ్లు తిరుగుతున్నాయంటూ మంచం మీద పడుకుంది. ఎంతసేపటికి నిద్ర లేకపోవడంతో ఆమెను చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. -
కన్నవారింటికి పరామర్శకు వెళ్తూ.. ప్రమాదాన్ని గ్రహించలేక..
సాక్షి, రాజాం సిటీ( శ్రీకాకుళం): కన్నవారింటికి పరామర్శ కోసం వెళ్లిన మహిళ రోడ్డు ప్రమాదానికి గురై ఊపిరి వదిలారు. ఈ ఘటన రాజాం మండలం శ్యాంపురం సమీపంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతకవిటి మండలం బొద్దూరు గ్రామానికి చెందిన వావిలపల్లి అప్పయ్యమ్మ (38) రాజాం మండలం లక్ష్మీపురం గ్రామంలోని తన వదిన ఈశ్వరమ్మను పరామర్శించేందుకు బయల్దేరారు. రాజాం నుంచి శ్యాంపురం మీదుగా లక్ష్మీపురం చేరుకునేందుకు రాజాంలోని చిన్నచెరువు గట్టు వద్ద వాహనం కోసం వేచి చూస్తుండగా.. శ్యాంపురం గ్రామానికి చెందిన ఉంగటి ఆదినారాయణ బైక్‌పై కనిపించారు. ఆయనను లిఫ్టు అడిగి వెళ్లారు. వీరు బండిపై వెళ్తుండగా శ్యాంపురం సమీపంలో సారథి గెడ్డ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను తప్పించబోయి అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు. అప్పయ్యమ్మకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆదినారాయణకు కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా క్షతగాత్రుడిని రాజాం కేర్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం వైజాగ్ రిఫర్ చేశారు. మృతు రాలికి భర్త ఈశ్వరరావుతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యు లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పి.సూర్యకుమారి తెలిపారు. అప్పయ్యమ్మ మృతిచెందడంతో ఇటు లక్షి్మపురంతోపాటు అటు సంతకవిటి మండలం బొద్దూరు గ్రామంలోనూ విషాదం నెలకొంది. -
ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదని .. కొడుకులతో కలిసి
సాక్షి, తొగుట(దుబ్బాక): కుటుంబ కలహాలతో విసిగిపోయిన ఓ మహిళ తన ఇద్దరు కుమారులకు విషం తాగించి, తానూ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం తొగుట మండలం తుక్కాపురంలో జరిగింది. స్థాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ముడికె కొమురయ్య, ఎల్లవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు కిష్టయ్య, దేవరాజు ఉన్నారు. కొమురయ్య వ్యవసాయ భూమి మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో 4 ఎకరాల భూమిని ప్రభుత్వం తీసుకుంది. దీంతో ప్రభుత్వం అందించిన నష్టపరిహారంతో మిరుదొడ్డి మండలంలోని ధర్మారంలో రెండు ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేశారు. ఎకరం తన పేరున, ఎకరం చిన్న కొడుకు దేవరాజు పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే సిద్దిపేట పట్టణంలోని ప్లాటు కూడా చిన్న కుమారునికి అప్పగించాడు. ఇద్దరు కుమారులకు ఆస్తి సమానంగా పంపకాలు చేయకుండా ఒక్కడికే ఇవ్వడం ఏంటని పెద్ద కుమారుడు కిష్టయ్య, అతని భార్య అనిత అత్తమామలను నిలదీశారు. ఈ విషయమై కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. కాగా ఆస్తి విషయాన్ని గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఇద్దరు కుమారులకు సమానంగా పంపిణీ చేయాలంటూ గ్రామ పెద్దలు తీర్మానించారు. అయినా తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రాలేదు. సాగు భూమి కోల్పోవడం తనకు రావాల్సిన వాటా ఇవ్వకపోవడంతో కిష్టయ్య అప్పు చేసి ఆటో కొనుక్కుని కుటుంబాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అత్తాకోడళ్లు మళ్లీ తగాదా పెట్టుకున్నారు. ఎన్నాళ్లైనా ఆస్తిలో వాటా దక్కదన్న మనోవేదనకు గురైన అనిత(28) భర్త ఆటో తీసుకుని ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇద్దరు కుమారులను ఇంట్లోకి తీసుకెళ్లి గడ్డిమందు దీక్షిత్ (06)కు తాగించింది. చిన్న కుమారుడు ఆర్చి(03)కి తాగించే ప్రయత్నం చేయగా బయపడి బయటకు పరుగెత్తగా తాను తాగి అపస్మారక పరిస్థితిలో పడిపోయింది. గమనించిన ఇరుగు పొరుగు వారు చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనిత పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీక్షిత్ సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం బాబుకు ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. కాగా అనిత పరిస్థితి విషమంగానే ఉన్నట్లు బంధవులు తెలిపారు. -
పిసినారి పెళ్లాంతో భర్తకి చుక్కలే.. తిండికి కూడా పైసా వసూల్
‘పీనాసి వాడి పెళ్ళికి పచ్చడి మెతుకులు సంభావన’ అనేది ఓ సామెత. గీసిగీసి బేరమాడే వాళ్లని, పావలాకు పదిరూపాయలు లాభం కోరుకునేవాళ్లని.. పీనాసి సంఘంలో చేర్చి మరీ ఎండగట్టినా మారరు. పైపెచ్చు అదేదో ఘనకార్యమన్నట్లుగా పొంగిపోతుంటారు ‘అహా నా పెళ్లంట’ సినిమాలోని కోట శ్రీనివాసరావు మాదిరి. ఆ కోవలోకి చెందిందే అమెరికా వాసి.. నలభై ఒక్కేళ్ల బికీ గుయిలీస్. ‘అమెరికాలోనే అత్యంత పినాసి మహిళ’గా పేరు తెచ్చుకుంది. వాటర్ బిల్లు చెల్లించడం కూడా ఇష్టం లేని గుయిలీస్.. ఇంటి ముందు కురిసే మంచు సేకరించి దాన్ని నీరుగా మార్చి ఇంటి అవసరాలకు వాడుతుంది. ఈమె పీనాసితనానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఫ్రీ బై లేడీ’ పేరుతో తన పొదుపు సూత్రాలను పంచుకుంటున్న గుయిలీస్.. భర్త జాయ్‌కు తిండి పెట్టడానిక్కూడా డబ్బు తీసుకుంటుందట.‘తిండి విషయంలో కూడా నేను చాలా పొదుపుగా ఉంటాను. నా భర్త నేను తినే ఆహారం కంటే ఎక్కువ తింటే.. అందుకుగాను అతడు నాకు డబ్బు చెల్లించాల్సిందే. ఆ మొత్తాన్ని ఇంటి అవసరాల కోసం దాచిపెడతాను. నేను ఏదైనా వస్తువు కొనాలంటే అది 90 శాతం చవకదైనా అయ్యుండాలి లేదా ఉచితంగానైనా రావాలి. మొదట్లో ఇంత పొదుపుగా ఉండేదాన్ని కాదు. మా పెద్దబ్బాయి పుట్టాక ఏడాదికి 30 వేల డాలర్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇంటి బాధ్యతలు స్వీకరించాను. అకస్మాత్తుగా ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అందుకే అవసరాలన్నింటినీ తగ్గించడం మొదలుపెట్టాను. చివరికి ఇంటి మరమ్మత్తులు కూడా నేనే చేసుకుంటాను’ అని చెప్పుకొస్తుంది గుయిలీస్. అయితే ఈ కథ విన్నవారంతా పొదుపు మంచిదే కానీ పొట్ట కట్టుకుని మరీ ఇంతలా చేయాలా? అని విస్తుపోతున్నారు. భార్య పీనాసి తనాన్ని భరిస్తున్న జాయ్ మీద సానుభూతి చూపిస్తున్నారు. -
మొదట రూ.100తో రూ.238 ప్రాఫిట్, ఇదేదో బాగుందని..
సాక్షి,జగద్గిరిగుట్ట(హైదరాబాద్): ఆన్లైన్ యాప్ ద్వారా నగదు ఇన్వెస్ట్ చేసిన మహిళ మోసపోయిన ఘటన స్థానిక పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గాజులరామారం ఉషోదయకాలనీ ఫేజ్–2కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి ఆంజనేయులు భార్య శ్రీలక్ష్మి జూలై 26న ఫేస్‌బుక్‌లోని కున్డాంగ్ జాబ్ నిమిత్తం ఓపెన్ చేయగా అందులో ఉన్న 8006734868 ఫోన్ నంబరుకు కాల్ చేసింది. సదరు వ్యక్తులు పంపిన లింక్‌ను ఓపెన్ చేసి సీషాప్ అనే యాప్‌ను ఆమె డౌన్లోడ్ చేసింది. మొదట రూ.100 ఇన్వెస్ట్ చేయగా రూ.238 ప్రాఫిట్ వచ్చింది. మరోసారి 3వేలు ఇన్వెస్ట్ చేయగా 4,800 లాభం వచ్చినట్లు చూపించారు. ఇలా డబ్బుపై ఆశ పెరగడంతో రూ.30వేలు ఒకసారి, 35,900 మరోసారి ఇలా మొత్తం 2,56,470 నగదును సదరు యాప్‌లో ఇన్వెస్ట్ చేసింది. అయితే అకౌంట్లో చూపించిన నగదు తీసుకోవడానికి వీలు కాకపోవడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిఫ్ట్ పేరుతో బురిడీ.. జగద్గిరిగుట్ట: ఫేక్ ఫోన్ కాల్‌తో ఆన్లైన్ నగదు బదిలీ చేసిన ఓ యువతి మోసపోయిన ఘటన స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. దీనబంధు కాలనీకి చెందిన ప్రియాంక ప్రైవేట్ ఉద్యోగి. జూలై 29న 9477815658 నెంబర్ నుండి ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను అమెజాన్ సేల్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నానని పరిచయం చేసుకున్నాడు. మీకు గిఫ్ట్ వచ్చిందని, రూ.5వేలు చెల్లిస్తే డెలివరీ చేస్తామని చెప్పాడు. నమ్మిన ప్రియాంక సదరు వ్యక్తి చెప్పిన అకౌంట్‌కు 5వేల పంపింది. సదరు వ్యక్తి మరలా ఫోన్ చేసి జీఎస్టీ ఇష్యూస్ ఉన్నాయని రూ.9,999 పంపితే మరలా మీ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేస్తామని మాయమాటలు చెప్పడంతో మొత్తం 45వేలను ట్రాన్స్ఫర్ చేసింది. గిఫ్ట్ రాకపోగా ట్రాన్స్ఫర్ చేసిన నగదు సైతం వెనక్కి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బా«ధితురాలు బుధవారం పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళతో అసభ్యకర ప్రవర్తన, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్కు దేహశుద్ధి
సాక్షి, సంగారెడ్డి: మున్సిపల్ అధికారి వేధింపులు భరించలేని ఓ మహిళ తన భర్తతో కలిసి దేహశుద్ధి చేసింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జరిగింది. వివరాల ప్రకారం.. సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో పనిమీద వచ్చిన మహిళలను అక్కడి శానిటరీ ఇన్స్పెక్టర్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అధికారి ప్రవర్తనకు విసిగిపోయిన బాధితురాలు తన భర్తకు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త తన భార్యతో కలిసి శానిటరీ ఇన్స్పెక్టర్కు చితకబాది పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
బామ్మ జ్యూస్ స్టాల్: వావ్ అంటున్న నెటిజనులు, వైరల్ వీడియో
సాక్షి, హైదరాబాద్: వృద్ధాప్యంలో హాయిగా కృష్ణా రామా అనుకుంటూ కాలు మీద కాలు వేసుకుని జీవించే అదృష్టం ఎంతమందికి ఉంటుందో తెలియదు గానీ, తమకు ఏజ్ జస్ట్ ఒక నంబరు మాత్రమే. అసలు వయసు ఒక సమస్యేకాదు అని చాలామంది సీనియర్ సిటిజన్స్ నిరూపిస్తున్నారు. ఎనిమిది పదుల వయసు దాటినా మాకు మేమే సాటి అంటూ ఈమధ్య కాలంలో చాలామంది దర్శనమిస్తున్నారు. తమ టాలెంట్‌తో ఇంటర్నెట్లో సంచలనంగా మారుతున్నారు. తాజాగా పంజాబ్‌కు చెందిన జ్యూస్ స్టాల్ బామ్మ వార్తల్లో నిలిచారు. అమృత్‌సర్‌లోని 80 ఏళ్ల బామ్మ నడుపుతున్న జ్యూస్ స్టాల్ విశేషంగా నిలిచింది. చకాచకా బత్తాయి రసం తీసి యిస్తూ కస్టమర్లను భలే ఆకట్టుకుంటున్నారు. ముదిమి వయసులో కూడా చాలా కష్టపడుతూ జ్యూస్ బండి ద్వారా జీవనాన్ని సాగిస్తూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాదు యుక్తవయసులో కూడా పనీ పాటా లేకుండా తిరిగే ఆవారా బ్యాచ్‌కు ఈ బామ్మ పెద్ద సవాలే విసురుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతేనా తన కష్టార్జితాన్ని నమ్ముకుని గౌరవంగా జీవించాలనుకునేవారికి ఆమె ఒక రోల్ మోడల్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ వయసులో ఆమె చాలా కష్టపడుతున్నారు. దయచేసిన ఎవరైనా ఆమెకు సాయం చేయండి అంటూ ఒక ట్విటర్ యూజర్ వీడియోను ట్వీట్ చేశారు. అంతే అది క్షణాల్లో వైరల్ అయింది. ఆమెకు సాయం చేసేందుకు పలువురు ముందుకు వస్తున్నారు. వీలైతే ఆమెకు ఒక ఎలక్ట్రానిక్ జ్యూసర్ ఇవ్వాలనుకుంటున్నానని ఒకరు ట్వీట్ చేయగా మరికొందరు భిన్నంగా స్పందించారు. పాశ్చాత్య దేశాలలో, సీనియర్లు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపేందుకు వీలుగా పెన్షన్లు పొందుతారు. కానీ మన దేశంలో మాత్రం వారికి నరకమే అంటూ ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సులభంగా డబ్బు కావాలనుకునే యువత ఈమెను చూసి సిగ్గుపడాలని మరొకరు ట్వీట్ చేశారు. The bibiji in the video below has her juice stall in Amritsar. She is working hard in her old age. Please show some love and support to her. The address of her stall is Rani da bagh Amritsar, Opp SBI Bank, near Uppal Neuro Hospital. Please share with your contacts 🙏 pic.twitter.com/YTpjk4IIWm — A Sidhu (@asidhu_) July 27, 2021 -
మెట్రో స్టేషన్లో కలకలం, పైనుంచి దూకేస్తానన్న యువతి.. అంతలో
చండిగఢ్: అంతవరకు ప్రశాంతంగా ఉన్న మెట్రో ఆవరణమంతా ఒక్కసారిగా అలజడి నెలకొంది. ఏం జరిగిందో తెలీదు గానీ ఓ యువతి మెట్రో స్టేషన్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు పోలీసుల ఎంట్రీతో కథ సుఖాంతంగా ముగిసింది. ఈ ఘటన హర్యానాలో జూలై 24 న సాయంత్రం 6:30 గంటలకు చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఫరిదాబాద్ మెట్రో స్టేషన్ బాల్కని పైకి అకస్మాత్తుగా ఓ యువతి ఎక్కి అక్కడి నుంచి దూకాలని ప్రయత్నించింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అంచనా వేసిన పోలీసు అధికారి, సిఐఎస్ఎఫ్ సిబ్బంది, మెట్రో సిబ్బందితో కలిసి.. ఆ యువతి దృష్టిని మళ్లించేందుకు ముందుగా ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. అలా మాటల్లో పెట్టిన పోలీసు అధికారి ఆ యువతి వద్దకు మెల్లగా చేరుకున్నాడు. ఇంతలో, మరో వ్యక్తి కూడా ఆమె వద్దకు చేరడంతో తనని కాపాడగలిగారు. విచారణలో.. ఆ యువతి, ఫరీదాబాద్ సెక్టార్ 28 లో ఉన్న ఓ ప్రవేట్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు తెలిపింది. తాను చేస్తున్న పని కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు పేర్కొంది. అనంతరం పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. కాగా ఫరీదాబాద్ పోలీసు శాఖ ఆ యవతిని కాపాడిన వారిని అభినందిస్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది . యువతిని కాపాడటంలో అధికారులు చూపిన సమయస్ఫూర్తికి , ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ऐसा #फ़िल्मों में भी नहीं होता। जान देने पर अमादा #लड़की को जान हथेली पर रख कर बचाया। जाँबाज़ #पुलिस कर्मी को बधाई। #कहो_ना_कहो pic.twitter.com/sPZ5bjkZOm — People’s Police - Faridabad Police (@FBDPolice) July 24, 2021 -
మొదటి పెళ్లిని దాచి వివాహేతర సంబంధం కొనసాగించిన ఎస్ఐ
సాక్షి, సనత్‌నగర్( హైదరాబాద్): టప్పాచబుత్రా ఎస్ఐ మధును నగర పోలీసు కమిషనర్ సస్పెండ్ చేశారు. ఆయనకు ఇంతకుముందే పెళ్లి జరిగిన విషయాన్ని దాచిపెట్టి.. తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మధుపై ఆయన వేటు వేశారు. బాధితురాలు కథనం ప్రకారం వివరాలు.. గతంలో బేగంపేట, చిలకలగూడ పోలీస్స్టేషన్లలో ఎస్ఐగా పనిచేసిన మధు కొన్ని నెలల క్రితం టప్పాచబుత్రా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ అయ్యారు. నమ్మించి మోసం చేశాడు మధు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, మొదటి పెళ్లిని దాచిపెట్టి తనతో వివాహేతర సంబంధం కొనసాగించాడంటూ ఓ యువతి బేగంపేట, టప్పాచబుత్రా పోలీసులకు, వెస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదుకు పోలీసులు స్పందించడం లేదని బాధితురాలు ఈ నెల 19న సికింద్రాబాద్ సమీపంలోని పరేడ్‌గ్రౌండ్ వద్ద చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే బాధితురాలిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ వ్యవహారంలో బేగంపేట పోలీసులు మధుపై కేసు నమోదు చేశారు. గతంలో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐగా పనిచేసే సమయంలోనూ మధు ఒకసారి సస్పెన్షన్ కావడం గమనార్హం. కాగా.. సదరు యువతితో మధుకు ఇప్పటికే వివాహం జరిగిందని, ఆమె ఎస్సీ సామాజిక వర్గానికి చెందడంతో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, కానీ.. నా భర్తపై చర్యలు తీసుకోండి
సాక్షి, సుల్తాన్‌బజార్( హైదరాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకుని మొఖం చాటేసిన తన భర్త, ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు చర్యలు చేపట్టేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని బాధితురాలు స్తానం వెంకట్లక్ష్మీ ప్రభుత్వానికి మొరపెట్టుకుంది. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2012లో ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నప్పుడు సాయినగర్ జిల్లెలగూడకు చెందిన స్తానం అఖిలేష్ ప్రేమించాడని, 2018 మే 11న అన్నవరంలో తమ వివాహం జరిగిందని తెలిపారు. ఏడాదిన్నర కాలంగా ఇద్దరం కలిసే ఉన్నామని, అయితే తన భర్త తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువుల ఒత్తిడితో తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె వాపోయింది. సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌తో పాటు రాచకొండ సీపీని కలిసినా న్యాయం జరగలేదని, పోలీసులు కేసు నమోదు చేసుకున్నా తన భర్త, అతడి బంధువులపై చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. తనకు విడాకులు ఇవ్వకుండా 2018లో తేజస్వీని తన భర్త వివాహం చేసుకున్నాడని, ఇప్పటికైనా డీజీపీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. -
వైరల్: అంగవైకల్యం ఉన్నా.. స్టెప్పులు ఇరగదీసిన యువతి
ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం అడ్డుకాదని నిరూపిస్తూ ఓ యువతి డాన్స్‌ని ఇరగదీసింది. ఆ యువతి తనకున్న ఒక్క కాలుతో అద్భుతంగా డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. వికలాంగ డాన్స్‌ర్ సుభ్రీత్ కౌర్ ఘుమ్మన్ అగ్నిపత్లోని హిట్ సాంగ్ 'చికినీ చమేలీ' డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం నెట్టింట ఆమె చేసిన డాన్స్‌కు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సుభ్రీత్ మొదటి సారి.. ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్నప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో ఆమె ఈ షోలో రెండో రౌండ్‌కు అర్హత కూడా సాధించింది. ఇటీవల సుభ్రీత్ అప్పట్లో తాను డాన్స్ చేసిన పాటకు మళ్లీ అదే ఎనర్జీతో స్టెప్పులేసిన వీడియోను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో... " నా మొదటి టీవీ నృత్య ప్రదర్శనను 7 సంవత్సరాల తరువాత మళ్లీ చేస్తున్నాను ... మీకు ఇది నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను" అనే క్యాప్షన్తోటి ఈ వీడియోను అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఇప్పటికే 28 మిలియన్ల వ్యూస్‌ని రాబట్టింది. నెటిజన్లు ఆమె డాన్స్‌కు , ఆత్మధైర్యానికి ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by subhreet Kaur Ghumman (@subhreet.ghumman) -
వైరల్: ఈ తల్లి బిడ్డకోసం 8 అడుగుల పాము తోక పట్టుకుని..
భువనేశ్వర్: సాధారణంగా చిన్న పామును చూస్తేనే మనం భయపడిపోతుంటాం. అలాంటిది ఓ మహిళ ఏకంగా 8 అడుగుల ఉన్న కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని ఫారెస్ట్ అధికారలకు అప్పగించింది. ఈ ఘటన ఒడిశా మయూరభంజ్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఎలా వచ్చింది గానీ 8 అడుగుల కింగ్‌కోబ్రా ఒకటి ఓ ఇంటిలోకి వచ్చింది. ఆ ఇంట్లో ఆడుకుంటున్న 2 సంవత్సరాల పిల్లాడు పాము వైపు వెళ్తుండడం తల్లిదండ్రులు గమనించారు. వెంటనే పిల్లాడి తండ్రి స్పందించి కొడుకును పట్టుకోగలిగాడు. అదే క్రమంలో పిల్లాడి తల్లి (సస్మిత) పాము తోక పట్టుకుని బయటకు లాక్కొచ్చి విసిరేసింది. అనంతరం వాళ్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ను పిలిపించి ఆ పాముని అడవిలో విడిచిపెట్టారు. అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికీ ఏ అపాయం జరగలేదు. సస్మిత మాట్లాడుతూ.. తన బిడ్డకు ఏమైనా జరుగుతుందేమోనని భయంతో ఇంతటి ధైర్యం చేసినట్లు తెలిపింది. ఈ పరిస్థితిలో మాకు సహాయం చేసిన అటవీ శాఖ అధికారికి కృతజ్ఞతలు తెలిపింది. కాగా ఆమె ధైర్యాన్ని చూసి అందరూ హడలిపోయారు. ప్రస్తుతం సస్మతి చూపిన ధైర్యానికి చుట్టు పక్కల వాళ్లంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. Odisha: A woman rescued a King Cobra who entered a residential area in Mayurbhanj "It was found in front of a house of a local. I rescued it and released it in its habitat with the help of the forest department and Range Officer," said Sasmita Gochhait (05.06) pic.twitter.com/dCfsaAkrSs — ANI (@ANI) June 5, 2021 చదవండి: వైరల్: రైతు దుశ్చర్య.. పాపం ఎలుకల దండుని.. -
కోవిడ్ పేషెంట్ కలకలం.. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ..
సాక్షి, నల్గొండ: దేశంలో కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వ్యాప్తి కారణంగా వేల ప్రాణాలు గాల్లో దీపాల్లా ఆరిపోతున్నాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్డౌన్, కఠిన ఆంక్షలు అని ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి.అదే క్రమంలో వైరస్ సోకిన వారిని హోం ఐసోలేషన్, పౌష్టికాహారాలను తీసుకోవాలని సూచిస్తోంది. ఇంతలా చర్యలు తీసుకుంటూ, అప్రమత్తం చేస్తున్నా.. కొందరు మాత్రం ఏ భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు లేకుండా కొందరు బయట నిర్లక్ష్యంగా తిరుగడం, భౌతిక దూరం పాటించకపోవడం లాంటివి చేస్తూ వైరస్ వ్యాప్తికి దారులు తెరుస్తున్నారు. మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతూ.. ఇంకొందరు అయితే కరోనా సోకి కూడా ఇంట్లో జాగ్రత్తగా ఉండకుండా.. బయట యధేచ్చగా తిరుగుతూ వారే ప్రాణాలే కాక ఇతర ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. తాజాగా కరోనా సోకిన ఓ మహిళ మార్కెట్లో సాఫీగా కూరగాయలు అమ్ముతోంది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.నల్గొండ జిల్లా మిర్యాలగూడ లో కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ క్వారెంటైన్లో ఉండకుండా బయట రోడ్లపై తిరుగుతుంది. ఇటీవల ఆమెకు పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇలా బయటకు వచ్చింది. అవగాహన లేమితో కారణంగా కూరగాయల మార్కెట్లో ఆకుకూరలు అమ్ముతోంది. ఇది గమనించిన అధికారులు ఆ మహిళను మార్కెట్ నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. అయితే అప్పటికే ఆ మహిళ వద్ద చాలామందే ఆకుకూరలు కొన్నట్లు తెలిపింది. దీంతో వారితో పాటు.. మార్కెట్‌కు వచ్చిన వారంతా ఆందోళన చెందుతున్నారు. చదవండి: ‘డాడీ.. లేడాడీ.. నాతో మాట్లాడు... ఏమైంది అంకుల్ నాన్నకు..’ -
చుట్టూ ఉన్నవాళ్లు ఏం చేస్తారో చూద్దామని ‘చనిపోయింది’!
సాధారణంగా కోరికలనేవి ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అందులో కొన్ని వింతవి కూడా ఉంటాయి. ఇలాంటి వింత కోరికే ఓ మహిళకు కలిగింది. మనిషి బతికిఉన్నప్పుడు ఒకలా మరణించన తరువాత మరోలా సన్నిహితులు, ఇతరులు ప్రవర్తిస్తారని అంటారు కదా. అందుకే ఓ మహిళ తాను చనిపోతే ఎవరెవరు వస్తారు, వారు ఏం చేస్తారో చూడాలనుకున్నదంట.. అందుకు తానే మరణించినట్లు అందరినీ నమ్మించడానికి పడరాని పాట్లు పడిందో మహిళ. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఇలాంటి వారు కూడా ఉన్నారంటే నమ్మడం కొంచెం కష్టమైనా నమ్మాలి మరీ. వివరాల్లోకి వెళితే.. చిలీ రాజధాని శాంటియాగోకు చెందిన మైరా అలోంజో అనే మహిళ తాను చనిపోతే తరువాత తన చుట్టు జరిగే పరిణామాలను చూడాలనుకుందంట. అదేంటి చనిపోతే ఎలా చూస్తాం అనే సందేహం వస్తుంది కదా. అదే సందేహం ఆమెకు వచ్చింది. దీంతో ఎలాగైనా తన కోరికను నేరవేర్చుకోవాలనుకుంది. అందుకని ఆమెది డెత్ రిహార్సల్ చేయాలని నిర్ణయానికి వచ్చింది. అదే తడవుగా అద్దెకు లభించే లగ్జరీ శవపేటికను తెప్పించింది. ఫొటోగ్రాఫర్లను కూడా పిలిపించుకుంది. అంతా సిద్ధం చేసుకుని తెల్లటి దుస్తులతో మైరా.. తలపై పువ్వుల కిరీటం, ముక్కులో దూదిని పెట్టుకుని.. సంతాప సభ జరుగుతున్నట్లుగా ఏర్పాట్లు కూడా చేయించింది. అలా ఆమె దాదాపు మూడు గంటలపాటు శవపేటికలో పడుకుని చనిపోయినట్లు నటిస్తూనే ఉందంట. మహాతల్లి ఇదే నటన సనిమాల్లో ఇలా నటిస్తే ఆస్కార్ అయిన దక్కేదేమో అని అంటున్నారు చూసిన వాళ్లంతా. ఇందులో ఇంకో వింత ఏంటంటే.. ఈ డ్రామాలో ఆమె కుటుంబం, స్నేహితులు కూడా పూర్తి మద్దతుగా నిలిచి సహకరించడం. అంత్యక్రియల నాటకం మొదలుకాగానే కుటుంబ సభ్యులు నకిలీ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికంతటికి ఆ మహిళ దాదాపు 710 యూరోలు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇలా ఉండగా, మైరా తీరును కొందరు ప్రశంసిస్తుండగా.. మరికొందరు విమర్శిస్తున్నారు. ఇటీవల ఎక్కడ చూసిన కరోనాతో చనిపోయినవారే ఎక్కువగా ఉన్నారు, ఇలా ప్రవర్తించి వారిని ఎగతాళి చేయడంలా ఉందని అది సరికాదని మైరా స్థానికులు అంటున్నారు. ( చదవండి: మరణం అంచున కన్నీటి వర్షంలో తల్లి.. చిన్నారికి చెప్పేదెలా! ) -
ఫైర్ లేడీ.. నిప్పు రవ్వలను మిఠాయిల్లా మింగేస్తోంది
సాధారణంగా నిప్పుతో ఎవరైనా చలి కాచుకుంటారు కానీ ఈ మహిళ నిప్పురవ్వలను మిఠాయిలు మింగినట్లు మింగేస్తుంది. అసలు ఇది సాహసమో లేక ఆకలేసి ఇలా తింటోందా అని చూసినవారంతా వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. కరోనాను ఎలా తగ్గించుకోవాలి అనే అంశంపై ఇటీవల సోషల్ మీడియాలో చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. ఈ మహిళ అవన్నీ చేసి చివరకు ఇలా వేడి వేడి నిప్పు రవ్వలను నోట్లో వేసుకొని లాగించేస్తోందని క్యాప్షెన్ పెట్టి ఈ వీడియోను ఓ ఐపీఎస్ అధికారి తన ట్విటర్లో పోస్ట్ చేశాడు. వివరాల్లోకి వెళితే.. కుర్చీలో తాపీగా కూర్చున్న ఓ మహిళ.. తన ఎదురుగా ఉన్న టేబుల్‌పైన ప్లేటులోని వెలుగుతున్న నిప్పురవ్వలు ఉంచుకుంది. మొదట చూసిన వారంతా ఆ మహిళ ఏదైనా వంట చేస్తుందేమో అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తు వాటిలోని నిప్పు రవ్వలను ఒక్కొక్కటీ నోట్లో వేసుకోవడం మొదలుపెట్టింది. ఈ వీడియోని ఐపీఎస్ ఆఫీసర్ రూపిన్ శర్మ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆమె ఫైర్ బాల్స్ మింగుతున్నప్పుడు సినిమాల్లో లాగా ఓ మ్యూజిక్‌ను కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. మీరు మాత్రం ఇలాంటివి ట్రై చేయకండి అని నిపుణులు అంటున్నారు. ( చదవండి: ప్లీజ్..!అలా కొరక్కే అందరు మనవైపే చూస్తున్నారు ) After taking Steam..! After doing Gargling with SaltWater..! After drinking Milk with Turmeric..! After Drinking Hot Water Everyday..! This is the Last Option Available..! कोरोना जिंदा भस्म हो जाएगा...#DONT_TRY_THIS AT ALL.#VACCINE LAGAO BAS.@hvgoenka pic.twitter.com/2UFxZLbFAk — Rupin Sharma IPS (@rupin1992) May 8, 2021 -
భర్త ఇంటికి వచ్చేసరికి భార్యతో సహా పిల్లలు..
సాక్షి ,చాంద్రాయణగుట్ట( హైదరాబాద్) : నలుగురు పిల్లలతో కలిసి ఓ గృహిణి అదృశ్యమైన సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... చాంద్రాయణగుట్ట ఘాజిమిల్లత్ కాలనీ ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ, అతియా బేగం (29) దంపతులు. వీరికి తన్వీర్ బేగం (13), మహ్మద్ హైదర్ (12), మహ్మద్ సోహేల్ (10), మెహాక్ బేగం (8) సంతానం. కాగా ఈ నెల 4న భర్త మహ్మద్ రఫీ తన సోదరుణ్ని వదిలేందుకు గుల్బార్గాకు వెళ్లాడు. అనంతరం ఈ నెల 5వ తేదీ రాత్రి 6.30 గంటలకు రఫీ తిరిగి ఇంటికి వచ్చేసరికి భార్యతో పాటు నలుగురు పిల్లలు కనిపించకుండా పోయారు. దీంతో భార్యకు ఫోన్‌ను చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో ఆందోళనకు చెందిన రఫీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు 040–27854763 నంబర్లో సంప్రదించాలన్నారు. ( చదవండి: కొడుకును బావిలో పడేసి...ఆపై తండ్రీ ఆత్మహత్య ) -
కన్న తల్లికే షాక్.. ఒకే కాన్పులో 9 మంది సంతానం
మాలి: సాధారణంగా ఒకే కాన్పులో కవలలో , లేక ముగ్గురికి జన్మనిస్తేనే వింత అనుకుంటాం. అలాంటిది ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు కాదు.. ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చింది. దీంతో ఇది మామూలు వింత కాదు వింతలకే వింత అంటున్నారు చూసిన వారంతా. ఈ ఘటన మాలిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాలికి చెందిన హలీమా సిస్సి (25) మంగళవారం 9 మందికి సంతానానికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఆమెకు డెలివరీ చెయడానికి ఇద్దరు డాక్టర్లకు పైనే శ్రమించాల్సి వచ్చింది. ఇలా ఒకే డెలివరీలో తొమ్మిది మంది పుట్టడంతో ఈ వార్త ఆ దేశ నాయకుల వరకు వెళ్లింది. ’పుట్టిన 9 మంది సంతానంలో ఐదుగురు అమ్మాయిలు, నలుగురు అబ్బాయిలు ఉన్నారు. తల్లి, తొమ్మిది పిల్లలు క్షేమంగానే ఉన్నారిని.. ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి ఫాంటా సీబీ తెలిపారు. స్కానింగ్ సమయంలో ఎక్కువ మందికి సంతానం కలిగి ఉన్నానని డాక్టర్లు చెప్పారు. వారి అంచనా ప్రకారం బహుశా ఉంటే ఏడుగురు సంతానం ఉండొచ్చని ఆ మహిళ భావించిందట. కానీ ఏకంగా తొమ్మిది మందికి జన్మనిచ్చేసరికి ఆమెకే ఆశ్చర్యంగా ఉందని హలీమా తెలిపింది. ఈ డెలివరీ ప్రక్రియ మొత్తం సిజేరియన్ ద్వారానే చేసినట్లు డాక్టర్లు తెలిపారు. ( చదవండి: గర్భవతని తెలియదు.. విమానంలో గాల్లో ఉండగానే డెలివరీ ) -
మహిళకు భరణంగా రూ. 750 కోట్లు.. ట్విస్ట్ ఏంటంటే!
బ్రిటన్: మహిళలు విడాకులు అనంతరం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా భరణాన్ని చెల్లించాలని చట్టం చెబుతుంది. భరణం అంటే బతకడానికి సరిపడేంత సొమ్మును ఇచ్చిన కేసుని చూసి ఉంటాం. కాని యూకే లోని ఓ మహిళకు భరణం కింద ఏకంగా 453 మిలియన్ పౌండ్లు (సుమారు రూ.750 కోట్లు) వచ్చాయి. అయితే, ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉండటం మరో విశేషం. భరణం అంటే మాములుగా తన నుంచి విడిపోయిన భార్యకు భర్త చెల్లిస్తాడు. కానీ ఈ కేసులో ఆ మహిళ కొడుకు ఈ భరణాన్ని చెల్లించాలని లండన్ కోర్టు తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఫర్ఖద్ అఖ్మదోవ్, తాతియానా అఖ్మదోవ్ దంపతులు. వారికి ఇద్దరు కుమారులు సంతానం. దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో కొన్నేళ్ల క్రితమే విడాకులు తీసుకొని దూరంగా బతుకుతున్నారు. అప్పుడు వీరు లండన్‌లో నివసించేవారు. తల్లి వద్ద చిన్న కుమారుడు, తండ్రి వద్ద పెద్ద కుమారుడు ఉన్నారు. ఇక 2016లో వీరు విడాకులు తీసుకున్న సమయంలో తాతియానాకు 453 మిలియన్ పౌండ్లు (రూ.750 కోట్లు) భరణంగా ఇవ్వాలని లండన్ కోర్టు ఫర్ఖద్ను ఆదేశించింది. కానీ అతను 5 మిలియన్ పౌండ్లు మాత్రమే చెల్లించి రష్యాకు వెళ్లిపోయాడు. తాతియానాకు భరణం కింద రావాల్సిన మిగతా సొమ్మును ఇవ్వకుండా ఆమె పెద్ద కుమారుడు తెమూర్ అడ్డుపడుతూ వచ్చాడు. డబ్బుల ఇచ్చే ఆలోచన లేదు కాబట్టే ఇలా చేస్తున్నట్లు ఆమెకు అర్థమైంది. దీంతో తనకు రావాల్సిన మిగిలిన భరణం కోసం తాతియానా మరోసారి లండన్ కోర్టు మెట్లెక్కింది. తన తండ్రికి తెమూర్ తరపున వత్తాసు పలుకుతూ తనకు రావాల్సిన సొమ్ము రాకుండా చేస్తున్నాడని పెద్ద కుమారుడిపై దావా వేసింది. ఇందుకు సమాధానంగా ఆమె కొడుకు .. తాను చాలా నష్టాల్లో ఉన్నానని, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదివేటప్పుడు ట్రేడింగ్‌లో డబ్బు పెట్టి నష్టపోయానని డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం అవుతోందని కోర్టులో తెలిపాడు. కానీ తెమూర్ వ్యాఖ్యలతో లండన్ కోర్టు విభేదించింది. తాతియానాకు తక్షణమే రూ.750 కోట్లు భరణంగా చెల్లించాలని తీర్పునిచ్చింది. ( చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి ) -
వీళ్లు మామూలు లేడీలు కాదు.. పెద్ద కేడీలు
జగిత్యాల: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో కొందరు మహిళలు ప్రముఖులే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్నారు. ఫొన్లలో పరిచయం పెంచుకొని వారితో సన్నిహితంగా మెదులుతూ ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మాయలేడీ ముఠాల బ్లాక్‌మెయిల్స్‌కు బెదిరిన పలువురు ప్రముఖులు, డబ్బున్న యువకులు పెద్ద మొత్తంలో సమర్పించుకుంటున్నారు. ఇలాంటి ముఠాల బాగోతం జిల్లాలో ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్నాయి. వరుసగా ఇదే తరహా ఘటనలు ► జిల్లాలోని ధర్మపురికి చెందిన జమున అనే మహిళ వ్యవహారం గత డిసెంబర్లో వెలుగుచూసింది. జిల్లాలో పలు ప్రాంతాలకు చెందిన పరిచయం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా మెదులుతూ వారిని రహస్య ప్రాంతాలకు రప్పించేది. అక్కడికొచ్చాక ఆ ముఠాలోని మరో ముగ్గురు వ్యక్తులతో బెదిరించి వారి వద్ద గల డబ్బు, బంగారు ఆభరణాలు, సెల్ఫోన్లు దోచుకున్నారు. ► జగిత్యాల హనుమాన్‌వాడకు చెందిన కూకట్ రాజ్‌కుమార్, జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటకు చెందిన నలువాల తిలక్, సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన కోలపాక దినేశ్, ధర్మపురి పట్టణం మామిడివాడకు చెందిన మామిడి జమునతోపాటు రాయికల్ మండలం అల్లీపూర్‌కు చెందిన 20 ఏళ్ల యువతితో కలిసి గత అక్టోబర్ నుంచి జిల్లాలో పరిచయం ఉన్న వారితో పాటు డబ్బు ఉన్న వ్యక్తులను పరిచయం చేసుకుని రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి మహిళతో సన్నిహితంగా ఉంటున్న సమయంలో సదరు ముగ్గురు వీడియోలు చిత్రీకరించే వారు. వీటిని సోషల్‌మీడియా, వాట్సాప్‌లలో పోస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేస్తూ వారి వద్దనున్న బంగారు ఆభరణాలు, నగదు, సెల్ఫోన్లు దోపిడీకి పాల్పడ్డారు. ► డిసెంబర్ 22న జగిత్యాల విద్యానగర్‌కు చెందిన ఒకరిని ఓ మహిళ మేడిపల్లి మండలం వల్లంపల్లికి పిలిపించి బెదిరింపులకు పాల్పడింది. నాలుగు తులాల బంగారం, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లింది. బాధితుడు ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ► సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన ఓ మహిళ ముఠాగా ఏర్పడి జగిత్యాల అర్బన్ మండలం మోతె గ్రామానికి చెందిన ఒకరిని నాలుగు నెలల క్రితం పరిచయం చేసుకున్నారు. తన వద్ద పలువురు యువతులున్నారని, సన్నిహితంగా ఉంచేందుకు వారిని ఒప్పిస్తానని నమ్మబలికి అతని నుంచి దశలవారీగా రూ.26 లక్షలు తమ ఖాతాల్లోకి మళ్లించింది. ఈ డబ్బులను సుమారు రూ.18 లక్షలు బుగ్గారం మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఖాతాలోకి వెళ్లాయి. సదరు వ్యక్తి డబ్బుల కోసం మహిళను నిలదీయడంతో తనను, తన కూతురును వాడుకుని చంపుతానని బెదిరిస్తున్నాడని జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో అసలు నిజయం తెలియడంతో వారే అవాక్కయ్యారు. ► ఇదే మహిళ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటకు చెందిన ఒకరిని, కోరుట్లకు చెందిన వ్యక్తిని, జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన వ్యక్తిని మోసం చేసింది. సదరు మహిళపై బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా అప్పటి జగిత్యాల ఇన్చార్జి ఎస్పీ కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డిపై బుగ్గారం మండలానికి చెందిన రాజకీయ నాయకుడు తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. ► నాలుగు రోజుల క్రితం వేములవాడలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన మహిళ కుంట సుమిత అలియాస్ నందు అక్కడి పోలీసులు ఓ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సదరు మహిళ సైతం పలువురు యువతులు తన వద్ద ఉన్నారని, సెల్ఫోన్లో మాట్లాడిస్తూ వారితో సన్నిహిత్యం ఏర్పాటు చేసుకుని ఒకరి నుంచే రూ.15 లక్షలు నరెండ్ల గంగారెడ్డి అనే వ్యక్తి ఖాతాలో వేయించి మోసానికి పాల్పడింది. వెలుగుచూడని నిజాలెన్నో.. జిల్లాలో ప్రముఖులు, డబ్బున్న వారిని ఈ కిలేడీ ముఠాలు పరిచయాలు పెంచుకుని సన్నిహితంగా ఉంటూ అందినంత డబ్బు వసూలు చేస్తున్నాయి. వీరి బారిన పడిన వారు జిల్లాలో చాలా మంది ఉన్నప్పటికీ పరువు పోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. మరికొంత మంది మాత్రం డబ్బులు తీసుకుని పలువురు యువతులను వారి వద్దకు పంపి వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తెప్పించుకుని వారిని బ్లాక్మెయిల్ చేస్తూ అందినంత దోచుకుంటున్నారు. పరువు పోతుందనే బాధితులు ఫిర్యాదు చేసేందుకు ముందుకురావడం లేదు. ( చదవండి: ఆరోగ్యం బాగు చేస్తామని క్షుద్ర పూజలు, ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ) -
భర్త కళ్ల ముందే అత్యాచారం.. ఆపై వీడియో తీసి..
సాక్షి , ఆగ్రా: మహాత్మడు అర్థరాత్రి మహిళ ఒంటరిగా నడిచిన రోజే నిజమైన స్వాతంత్యం అని అన్నాడు. ఈ మాట పరిస్థితిమో గానీ ప్రస్తుత భారతావనిలో చూస్తే అర్థరాత్రి కాదు కదా పట్టపగలు, తోడుగా సొంత వాళ్లు ఉన్నా ఆమె పైన అఘాయిత్యాలు ఆగడం లేదు. కొందరు తాము మనుషులం అనే మాటను మరిచి మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా భర్త ముందే ఓ మహిళను అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. సాయంత్రం 6 గంటల సమయంలో భర్త స్కూటర్‌పై ఎట్మౌడౌలా ప్రాంతంలోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళుతుండగా, అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిని రోడ్డుపై అడ్డగించారు. అనంతరం వాళ్లను కొట్టి, బలవంతంగా సమీపంలోని అడవిలోనికి లాక్కెళ్లారు. అక్కడ ఆ ముగ్గురు భర్త ముందే ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. అంతే కాకుండా వారు ఈ వికృత చర్యను వీడియో కూడా తీశారు. పారిపోతూ వారి వద్ద ఉన్న 10,000 రూపాయలు, చెవిపోగులు దోచుకున్నట్లు ఎఫ్ఐఆర్లోలో పేర్కొంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాధిత దంపతులు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురు వ్యక్తులపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.( చదవండి: అనుమానం పెనుభూతమై.. భార్య గొంతు కోసి! ) -
దారుణం: మహిళపైకి దూసుకెళ్లిన లారీ
సాక్షి ,శ్రీకాకుళం: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నడిరోడ్డు మీద ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఓ మహిళ జీవితాన్ని చిదిమేసింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం ఎచ్చెర్ల మండలంలో చిలకపాలెం టోల్ ప్లాజా వద్ద వస్తున్న లారీ అదుపు తప్పి, అక్కడే రోడ్డు పైన పండ్లు అమ్ముకునే మహిళపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ కింద పడి తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో మహిళ శరీరం నుజ్జునుజ్జయింది. చదవండి: బావిలో పడ్డ వ్యాన్.. డ్రైవర్, క్లీనర్ మృతి ) -
చందానగర్‌లో దారుణం..
సాక్షి, హైదరాబాద్: చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోకి రానివ్వనందుకు ఓ యువతి వాచ్మన్ని చితకొట్టింది. ఈ సంఘటన చందానగర్‌లోని సిరి అపార్ట్మెంట్లో మంగళవారం చోటు చేసుకుంది. కారులో వచ్చిన ఓ యువతి లోపలికి వెళ్లడానికి ప్రయత్నించింది. అయితే అనుమతి లేకుండా అపార్ట్మెంట్లోకి వెళ్లకూడదంటూ వాచ్‌మ్యాన్ ఆమెను అడ్డుకున్నాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన యువతి కారు దిగి వచ్చి వాచ్‌మన్ మీద విచక్షణారహితంగా దాడి చేసింది. పిడి గుద్దులు కురిపించడమే కాక కాలితో తన్నింది. అక్కడితో ఆగకుండా చెప్పుతో ఇష్టమొచ్చినట్టు కొట్టింది. ఈ దృశ్యాలన్ని అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. బాధితుడు చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. (చదవండి: మద్యం మత్తులో యువతుల హల్చల్) -
నేను గెలిచాను
ముప్పయి నాలుగేళ్ల్ల సుమితీ సింగ్ అహ్మదాబాద్ నగరంలో సెవెన్ వయోలెట్స్ పేరుతో బేకరీ నడుపుతోంది. కరోనాకు ముందు ఆమె గుర్తింపు అదే. ఇప్పుడామె ఐడెంటిటీ అహ్మదాబాద్ నగరంలో రెండవ కోవిడ్ 19 పాజిటివ్. ఈ కండిషన్‌ను పాజిటివ్ దృక్పథంతో అధిగమించింది సుమితి. ‘ఇంతకీ ఆమె కోవిడ్ బారిన ఎలా పడింది’ తెలిసిన వాళ్లలోనూ, తెలియని వాళ్లలోనూ ఇదే ప్రశ్న. ఫిన్లాండ్ ప్రయాణంతో... సుమితికి ఈ ఏడాది మొదట్లో ఫిన్లాండ్కు వెళ్లే అవకాశం వచ్చింది. జనవరి రెండో వారానికంతా చైనా వూహాన్ కరోనా వ్యాధితో వార్తల్లోకి వచ్చేసింది. ఫిన్లాండ్లో తాను బస చేయాల్సిన హోటల్ వాళ్లను, ట్రావెల్ కంపెనీ వాళ్లను, ఇతర అధికారులనూ అడిగింది. మరేమీ ఫర్వాలేదనే భరోసా వచ్చింది అందరి వైపు నుంచి. అయినప్పటికీ ఎన్–99 మాస్క్, గ్లవ్స్, శానిటైజర్లతో పకడ్బందీగా మార్చి మూడవ తేదీన ఫిన్లాండ్కు ప్రయాణమైన సుమితి... 12 తేదీన తిరిగి ఇండియాకి వచ్చింది. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరినీ చెక్ చేస్తున్నారప్పటికి. ఆమెను కూడా పరీక్షించారు. ఏ లక్షణాలూ లేవు. క్లీన్చిట్ ఇచ్చేశారు ఎయిర్‌పోర్టు వాళ్లు. అయినప్పటికీ సుమితి మాత్రం లైట్ తీసుకోలేకపోయింది. ఇంట్లో వాళ్లకు దూరంగా తాను ఒక గదిలో ఉంటూ ఐసోలేషన్ పాటించింది. అది కూడా చాలా గట్టిగా... అయినా దురదృష్టం! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఆమె మార్చి పద్నాలుగో తేదీ ఉదయానికి జ్వరంతో నిద్రలేచింది. సుమితి వెంటనే డాక్టర్‌ను సంప్రదించింది. దగ్గు కానీ, గాలి పీల్చుకోవడంలో ఇబ్బందులు కానీ లేవామెకి. దాంతో దేశాలు మారినప్పుడు వాతావరణంలో మార్పు కారణంగా వచ్చిన జ్వరం కావచ్చనుకున్నారు డాక్టర్లు. జ్వరానికి మందులిచ్చి ఐసోలేషన్ కొనసాగించమని చెప్పారు. 16వ తేదీకి అస్వస్థత పెరిగింది. అప్పుడు కూడా ఇతర కరోనా లక్షణాలు లేవు. మళ్లీ ఇంటికి పంపించేశారు. మార్చి19 నాటికి ఊపిరి పీల్చుకోవడం కష్టమైంది. అప్పుడు పరీక్షించిన డాక్టర్లు కోవిడ్ 19 పాజిటివ్ అని తేల్చారు. వెంటనే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో అడ్మిట్ అయింది సుమితీ సింగ్. ‘కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారించినప్పుడు ఒక్కసారిగా నా గుండెను ఎవరో కోస్తున్నట్లు అనిపించింది. ఏదయితే కాకూడదనుకున్నానో అదే జరిగింది. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది మా ఇంట్లో అందరినీ తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. మా కుటుంబం మొత్తం క్వారంటైన్లోకి వెళ్లిపోయింది. ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడంతో ఇంట్లో అందరికీ నెగెటివ్ వచ్చింది. అయితే నాకు పాజిటివ్ వచ్చిన వెంటనే అది సమాజానికి వార్త అయింది. న్యూస్ చానెల్స్, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. నన్ను తెలిసిన అందరూ నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. పది రోజులు ట్రీట్మెంట్ తీసుకుని 29వ తేదీన డిశ్చార్జ్ అయ్యాను. ఆరోగ్యం కుదుట పడింది. ఇక లాక్డౌన్ పూర్తవగానే వ్యాపారాన్ని గాడిలో పెట్టాలి. అంతా రెండు నెలల్లో దారిలోకి వచ్చేస్తుంది’’ అని చిరునవ్వుతో చెప్తోంది సుమితీ సింగ్. ‘మన వాళ్లందరూ మనకు అండగా ఉన్నారనే భావనే వ్యాధిని జయించే ధైర్యాన్నిస్తుంది. మీకు తెలిసిన వాళ్లెవరైనా వ్యాధి బారిన పడితే వాళ్లకు అండగా ఉండండి. భౌతికంగా దూరం ఉంటూ... మానసికంగా వారికి దగ్గరగా ఉండండి’ అని చెప్తోంది సుమితీ సింగ్. – మంజీర -
షారుక్.. కమల్.. 4 నిమిషాల్లో 51మంది
సాధనమ్మున పనులు సమకూరును ధరణిలోన..ప్రతిభ ఏ ఒక్కరి సొత్తూ కాదు అని కేరళకు చెందిన ఓ యువతి నిరూపిస్తోంది. మిమిక్రీ కళలో అద్భుతమైన ప్రతిభతో పలువురిని అబ్బుర పరుస్తోంది. మిమిక్రీ లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతోంది. ప్రతీ సెకనుకు ఆమె గొంతు అద్భుతంగా వంపులు తిరుగుతుంది. ఆడ, మగ తేడా లేదు. సెలబ్రిటీలనుంచి ప్రముఖ రాజకీయవేత్తల దాకా ప్రముఖుల గొంతులను అనుకరిస్తారు. కేవలం నాలుగు నిమిషాల వ్యవధిలో 51మంది వాయిస్‌లను మిమిక్రీ చేయగల అసాధారణ నైపుణ్యం ఆమె సొంతం. ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఈ అద్భుతం పేరే అఖిల. న్యూస్ మినిట్ కథనం ప్రకారం తిరువనంతపురం జిల్లా నేదుమంగాడ్ కు చెందిన అఖిలా ఎ.ఎస్ ఆయుర్వేద మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతోంది. పాఠశాల స్థాయినుంచే స్వయంగా మిమిక్రీ కళపై ఆసక్తి పెంచుకున్న ఆమె ఇంటర్ స్కూల్ పోటీల్లో తొలిసారి మిమిక్రీ కళను ప్రదర్శించింది. మొదట జంతువులను అనుకరిస్తూ వచ్చింది. ఆ తరువాత స్కూలు వార్షికోత్సవాల్లో టీచర్లను అనుకరించేంది. అలా జానకమ్మ పాట ‘అజకాదల్’ పాడానని అఖిల గుర్తు చేసుకుంటారు. అనేక టీవీ, మిమిక్రీ షోలను చూస్తూ నిరంతర సాధనతోనే పరిణతి సాధించారు. అలా మిమిక్రీ కళలో రాణిస్తున్న తొలి కేరళ యువతిగా అఖిల నిలవడం విశేషం. ప్రముఖ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్, షారూక్ ఖాన్ సహా అచ్యుతానందన్, ఉమెన్ చాందీ వంటి రాజకీయ నాయకులు స్వరాలు ఆమె గొంతులో అలవోకగా పలికిస్తుంది. దీంతోపాటు మైఖేల్ జాక్సన్ పాటల్లోని బీట్ శబ్దాలు కూడా ప్రత్యేకంగా ఆమె గొంతునుంచి జాలువారతాయి. పూక్కలం వరవాయ్ చిత్రంలో బేబీ షాలినికి కూడా ఆమె డబ్బింగ్ చెప్పారట. అంతేకాదు ధూమపాన వ్యతిరేక ప్రకటనల ద్వారా థియేటర్లలో వినిపించే గోపన్ నాయర్ వాయిస్‌ను అఖిల గొంతులో విని తీరాల్సిందే. ఓ టీవీలో ప్రసారమైన రియాలిటీ షో ద్వారా తనకు మంచి గుర్తింపు లభించిందని ఇంకా చేయాల్సి చాలా వుందంటారు అఖిల ఉత్సాహంగా. -
పట్టాల మధ్యలో యువతి..
సాక్షి, జమ్మికుంటరూరల్: తీవ్రగాయాలతో రైలు పట్టాల మధ్య పడి ఉన్న ఓ గుర్తు తెలియని యువతిని గమనించిన రైలు గార్డు సమయస్పూర్తితో వ్యవహరించి రైల్వే అధికారులకు అప్పగించిన సంఘటన ఆదివారం జమ్మికుంట పట్టణంలో జరిగింది. పట్టణ సమీపంలోని మడిపల్లి రైల్వే గేటు వద్ద తీవ్రగాయాలతో ఓ యువతి పట్టాల మధ్య పడి ఉంది. ఈ క్రమంలో కాజీపేట నుంచి బల్లార్ష వైపు వెళ్తున్న గూడ్స్ రైలు గార్డు సదరు యువతిని గమనించి, డ్రైవర్‌కు సమాచారం అందించటంతో యువతిని రైల్వేస్టేషన్ రైల్వే అప్పగించారు. దీంతో అధికారులు 108కు సమాచారం అందించి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. -
102వ ఏట కన్నుమూసిన మాజీ మంత్రి
లక్నో : ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి బేగమ్ హమీదా హబిబుల్లా తన 102 ఏట కన్నుమూశారు. లక్నోలో ఈ తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ నవాబ్ నజీర్ యర్ జంగ్ బహదూర్ కుమార్తె అయిన హమీదా లాండ్ ఆఫ్ అవద్గా పేరుగాంచిన ప్రముఖ సంఘసంస్కర్త. పూణెలోని ఖడక్వాస్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ స్థాపకుడు, మేజర్ జనరల్ ఇనాయత్ హబిబుల్లాను హమీదా పెళ్లాడారు. 1965లో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి హమీదా.. యూపీ సామాజిక, దళిత సంక్షేమ శాఖ మంత్రి పదవితో పాటు మరికొన్ని పదవులతో ప్రజలకు సేవలు అందించారు. హమీదా అంత్యక్రియలు ఆమె స్వగ్రామం బరబంకీలోని సైధాన్పూర్లో జరిగాయి. -
కి‘లేడీ’ రిమాండ్
సిరిసిల్లక్రైం: ప్రయాణికుల నుంచి డబ్బులు, నగదు చోరీచేసిన మహిళను సిరిసిల్ల సీసీఎస్ పోలీసులు మంగళవారం రిమాండ్ చేశారు. ఏఎస్పీ రవీంద ర్ తెలిపిన ప్రకారం.. కృష్ణాజిల్లా ఆత్రేయపురంకు చెందిన తాటపట్టి నర్సమ్మ తన సోదరుడితో కలిసి సిరిసిల్ల, వేములవాడ బస్టాండుకు వచ్చిన ప్రయాణికుల నుంచి వస్తువులు, ఆభరణాలు, నగదు చోరీ చేసింది. ఏడేళ్లకాలంలో వీరు రూ. 1.78 లక్షలు, 15తులాల బంగారం అపహరించారు. డబ్బులను అవసరాలకు ఖర్చు చేశారు. బంగారాన్ని వేములవాడలోని వారుంటున్న ప్రదేశంలో భద్రంగా ఉంచారు. వాటిని అమ్ముకునేందుకు మంగళవారం స్వగ్రామం బయల్దేరారు. పక్కా సమాచారంతో సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. సమావేశంలో సీసీఎస్ సీఐ బన్సీలాల్ ఉన్నారు. -
బెక్‌పై నుంచి జారిపడి వివాహిత మృతి
ధర్మవరం రూరల్: తనకంటువారిపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనం నుంచి జారి పడి యమున (27) అనే వివాహిత మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు.. బుక్కపట్నం మండలం రాంసాగర్‌కు చెందిన రమేష్, యుమున దంపతులు. రమేష్ బెంగళూరులో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంత కాలంగా భార్య యమున తలనొప్పితో బాధపడుతుండేది. పలు ఆసుపత్రులలో చికిత్సలు చేయించినా ఫలితం లేకుండా పోయింది. ధర్మవరంలో నాటు వైద్యుని దగ్గర చికిత్స చేయించుకునేందుకు తెల్లవారుజామునే భర్తతో కలసి ఆమె స్వగ్రామం నుంచి ద్విచక్ర వాహనంలో బయలుదేరారు. మార్గం మధ్యలో తనకంటువారిపల్లి సమీపంలోకి రాగానే ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో వెనుక కూర్చున్న యమున జారి పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆటోలో ధర్మవరం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కేపీహెచ్బీలో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
-
ఉత్తరప్రదేశ్‌లో అమానుషం
-
రియల్టర్‌కు ఫేస్బుక్ మహిళ బురిడీ
సాక్షి, బనశంకరి: ఫేస్బుక్లో పరిచయమైన ఒక కిలాడీ మహిళ తీయని మాటలతో బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని బురిడీ కొట్టించింది. అమెరికా నుంచి లక్షల డాలర్లు పంపుతున్నాను, కొరియర్లో డబ్బు కట్టి తీసుకోవాలంటూ రూ.20 లక్షలు స్వాహా చేసింది. వివరాలు....బెంగళూరుకు చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతడికి ఫేస్బుక్లో ఒక మహిళ పరిచయమైంది. తనది అమెరికా అని ఆమె చెప్పుకుంది. ఇద్దరూ రోజూ చాట్ చేస్తూ ఆన్లైన్లో స్నేహం చేశారు. తాను బెంగళూరులో అపార్టుమెంట్ కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆ మహిళ ఆదినారాయణకు తెలిపింది. ఇందుకోసం 20 లక్షల అమెరికన్ డాలర్ల సూట్‌కేస్‌ను పంపిస్తున్నానని, ముంబాయిలో తన ఖాతాలోకి ప్రాసెసింగ్ ఫీజుల కింద డబ్బు చెల్లించి ఆ సూట్‌కేస్‌ను తీసుకోవాలని ఆ మాయలాడి రియల్టర్‌ను నమ్మించింది. ముంబయి వెళ్ళిన బాధితుడు ఆమె ఖాతాలోకి రూ.20 లక్షల డబ్బు బదిలీ చేయగా, ఒక ఏజెంట్ వచ్చి సూట్‌కేస్ ఇచ్చి వెళ్లాడు. బాధితుడు ఆశగా తెరిచి చూడగా అందులో నకిలీ డాలర్ నోట్లు కనిపించాయి. మహిళ చేతిలో మోసపోయినట్లు గ్రహించిన రియల్టర్ మంగళవారం బెంగళూరు సైబర్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. -
అర్ధరాత్రి మహిళపై దాడి చేసిన దుండగులు
-
ఆమెకు ముగ్గురు భార్యలు
జమ్మలమడుగు: ఒక అమ్మాయి పురుషుడి అవతారమెత్తి ఏకంగా ముగ్గురు అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంది. ఈ వింత ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లా కాశినాయన మండలంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇటుకల పాడు గ్రామానికి చెందిన రమాదేవి తమిళ నాడులోని రోహిణి కాటన్ మిల్లులో పనిచేస్తుండేది. అక్కడినుంచి తిరిగి వచ్చి పులివెందులలోని మరో కాటన్‌మిల్లులో చేరింది. ఇక్కడ పరిచయాలు పెంచుకుని అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలానికి చెందిన 17 ఏళ్ల యువతిని వివాహం చేసుకుంది. అలాగే ప్రొద్దుటూరుకు చెందిన మరో యువతిని వివాహం చేసుకుంది. ఈ విషయం అమ్మాయిల తల్లిదండ్రులకు తెలియ డంతో వారు మందలించి అమ్మాయిలను తమ స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా అదే మిల్లులో పనిచేస్తున్న పెద్దముడియం మండలం భీమగుండం గ్రామానికి చెందిన మౌనిక అనే 18 ఏళ్ల యువతితో ఇటీవల రమాదేవికి పరిచయం ఏర్పడింది. వీరిరువురూ కొద్ది రోజుల క్రితం వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రమాదేవి కాటన్‌మిల్లులో పనిచేయడం మానేయడంతో వీరిరువురి మధ్యా ఫోన్ సంభాషణలు జరుగుతుండేవి. రెండు రోజుల క్రితం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ఓ వివాహానికి వెళ్లిన రమాదేవి అక్కడి నుంచి మౌనికకు ఫోన్ చేసి మాట్లాడింది. నీవులేకుంటే నేను చనిపోతానని మౌనిక చెప్పడంతో రమాదేవి భీమగుండం వెళ్లింది. రమాదేవి ప్రవర్తన పట్ల అనుమానం రావడంతో మౌనిక తల్లిదండ్రులు గ్రామస్తుల సహకారంతో డీఎస్పీ కృష్ణన్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసుల విచారణలో గతంలో తాను ఇద్దరిని వివాహం చేసుకున్నానని.. ఇప్పుడు మౌనికను కూడా వివాహం చేసుకున్నట్లు రమాదేవి వివరించింది. దీంతో పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు గతంలో వివాహం చేసుకున్న అమ్మాయిలను పిలిపించి విచారించారు. అమ్మాయిలను ట్రాప్ చేసి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు రమాదేవి చేస్తోందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
పురుడుపోసి.. బ్లేడు మరచి
సాక్షి, తాడితోట (రాజమహేంద్రవరం): సంచనాలకు మారు పేరు అయిన రాజమహేంద్రవరం ప్రభుత్వ హాస్పటల్ మరో సంచలనానికి వేదికైంది. కొంతకాలం క్రితం పురుడు పోసుకునేందుకు రాజమహేంద్రవరం ప్రభుత్వ ప్రసూతి విభాగంలో చేరిన ఒక గర్భిణికి ఆపరేషన్ చేసి పురుడుపోశారు. అనంతరం కడుపులో బ్లేడ్ మరిచిపోయి కుట్లు వేసేశారు. దీనితో మహిళకు కడుపు నొప్పి తరచూ రావడంతో స్కానింగ్ చేయించుకుంటే కడుపులో వైద్యం చేసేందుకు ఉపయోగించే బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. వెంటనే గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేసినట్లు గుర్తు రావడంతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చేరారు. అయితే ఆ మహిళ వివరాలు గోప్యంగా ఉంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపై హాస్పటల్ సూపరింటెండెంట్ టి.రమేష్ కిషోర్ ను వివరణ కోరగా ఈ విషయం తన దృష్టి రాలేదన్నారు. -
ప్రేమించలేదని పెట్రోలు పోసి హత్యాయత్నం
సాక్షి, ఒంగోలు క్రైం: తన ప్రేమను నిరాకరించిందనే కారణంతో ఓ యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించబోయాడు ఓ మృగాడు. సమయానికి బాధితురాలి తల్లిదండ్రులు వచ్చి అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రులు చెప్పిన వివరాల మేరకు.. ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డు ప్లైఓవర్ సమీపంలో ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తున్న సాధిక్ అనే యువకుడు స్థానిక సుజాతనగర్లో నివసించే ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతున్నాడు. డిగ్రీ చదువుతున్న ఆ యువతి అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో పలుమార్లు సాధిక్ ఆ యువతి ఇంటికి వచ్చి బెదిరించాడు. తల్లిదండ్రులకు ఇది తెలిసినప్పటికీ పరువుపోతుందనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో పెట్రోల్ డబ్బాతో యువతి ఇంటికి వచ్చిన యువకుడు వాకిట్లో ఉన్న ఆ యువతిపై పెట్రోలు పోశాడు. ఆమె తేరుకొని కేకలు వేయడంతో తల్లిదండ్రులు బయటకు వచ్చారు. అడ్డుకోబోయిన వారిపై కూడా ఆ ఉన్మాది పెట్రోలు కుమ్మరించాడు. అతడు వెంట తెచ్చుకున్న లైటర్‌తో నిప్పటించబోయాడు. పెనుగులాటలో లైటర్ కిందపడిపోయింది. ఇంతలో ఇరుగుపొరుగు అక్కడికి చేరుకోవడంతో పెద్దగా కేకలు వేస్తూ సాధిక్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘నా భార్యను దొంగలు చంపారు’
థానూర్ : నిర్మల్‌జిల్లా థానూరు మండలంలో దారుణం జరిగింది. తన భార్యను హత్య చేసిన భర్త దొంగలు చంపారని నాటకమాడాడు. చివరకు పోలీసుల ఎదుట నిజం ఒప్పుకోక తప్పలేదు. ఈ సంఘటన థానూరు మండలంలోని వడ్గాం గ్రామంలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సునీత(32), రాహుల్ భార్యాభర్తలు. గురువారం రాత్రి ఇద్దరూ కలిసి జొన్న చేను కావలికి వెళ్లారు. అక్కడ తన భార్యను రాహుల్ చంపేశాడు. అనంతరం గ్రామంలోకి వెళ్లి సునీతను దొంగలు హతమార్చి పారిపోయారని చెప్పాడు. ఆ విషయం పోలీసులకు చేరడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా సునీతను తానే చంపానని అసలు విషయం బయటపెట్టాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బేగంపేటలో యువతి వీరంగం!
-
బేగంపేటలో యువతి వీరంగం!
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బేగంపేటలో ఓ యువతి హల్చల్ చేసింది. రద్దీగా ఉన్న రోడ్డుపై తన కారుతో ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాహనదారుల పైకి దూసుకెళ్లగా.. క్షణాల్లో అప్రమత్తమైన నలుగురైదు వాహనదారులు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ పై ప్రశ్నించినందుకు ఓ సిగ్నల్ వద్ద ట్రాఫిక్ పోలీసుల ఎదుటే యువతి వీరంగం చేసింది. తనను ప్రశ్నించిన వాహనదారులను బూతులు తిట్టడంతో పాటు వారిపై దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న ఓ వాహనదారుడు యువతి చర్యలను వీడియో తీయడంతో విషయం బయటకు వచ్చింది. హౌ డేర్ యూ అంటూ ఓ వాహనదారుడిపై ట్రాఫిక్ పోలీసు ఎదుటే దాడి చేసిన వీడియో వైరల్‌గా మారింది. ట్రాఫిక్ పోలీసు సర్దిచెబుతున్నా.. ఆగ్రహంగా తనను అడ్డుకుని ప్రశ్నించిన వారిపై ఇష్టారీతిన నోరు పారేసుకుంటూ వెళ్లి తన కారు ఎక్కింది. అక్కడి నుంచి యువతి సైనిక్ పురి వైపుగా వెళ్లినట్లు సమాచారం. ఆ యువతి ఎవరు.. ఆమె మద్యం సేవించి వాహనం నడిపిందా అనే వివరాలు తెలియాల్సి ఉంది. యువతిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసి.. ఆపై పోలీసు ఎదుటే వీరంగం -
వృద్ధురాలి దారుణ హత్య
సిమెంట్ ఇటుకతో తలపై మోదిన వైనం జగ్గంపేట : ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు పప్పుల మంగ (56) జగ్గంపేట శ్రీరామ్‌నగర్‌లో ఆదివారం తెల్లవారు జాము సమయంలో దారుణ హత్యకు గురైంది. నూతనంగా నిర్మించుకున్న ఇంట్లో ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు సిమెంట్ ఇటుకతో తల, ఇతర శరీర భాగాలపై బలంగా గాయపర్చడంతో ఆమె మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రోజు మాదిరిగా ఇంటి బయట కనిపించకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇరుగు పొరుగుకు వారు లోపలకు వెళ్లి చూడగా మంగ చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై అలీఖాన్, సీఐ కాశీ విశ్వనాథం, సిబ్బంది సంఘటన స్థలానికి వెళ్లి హత్య జరిగిన తీరును పరిశీలించి, స్థానికులను విచారించారు. మంగ నిద్రించిన మంచం ఇరిగిపోయి ఉండడం, సిమెంట్ ఇటుకలకు రక్తపు మరకలు, ఆమె శరీరభాగాలపై బలమైన గాయాలు ఉండడంతో పెనుగులాట జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతురాలు శ్రీరామ్‌నగర్‌లో ఉన్న ఇంటిని సుమారు రూ.30 లక్షలకు అమ్ముకుంది. అప్పులు తీర్చివేసి, మిగిలిన సొమ్ములో సుమారు రూ.10 లక్షలతో స్థలం కొనుగోలు చేసుకుని నూతనంగా ఇల్లు నిర్మించుకుంది. ఇంటి పనులు పూర్తికావడంతో ప్రభుత్వం ఇచ్చే హౌసింగ్ రుణం కోసం ఎదురు చూస్తోంది. కుమార్తె ఇంటి వద్ద భోజనం చేసి రాత్రిపూట కొత్త ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తుంది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీరామ్‌నగర్‌లో వేరే చోట అల్లుడు, కుమార్తె కానూరి దేవి ఉంటుండగా వారి వద్ద కొడుకు ఉంటున్నాడు. ఆమె ఉంటున్న ఇంటి వద్ద సొమ్ములు గాని, బంగారు వస్తువులు కాని లేకపోవడంతో హత్యకు గల కారణాలు వేరే ఏదైనా కారణమవ్వచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బలభద్రపురం గ్రామానికి చెందిన మంగ శ్రీరామ్‌నగర్‌లో స్థిరపడింది. హత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తుండగా క్లూస్‌టీమ్ ఆధారాలను సేకరించింది. పోలీసు జాగిలాన్ని రంగంలోకి దించారు. వివాహేతర సంబంధం కోసం వేరే మహిళకు తన ఇంటి వద్ద ఆశ్రయం ఇస్తుండడంతో ఆమె భర్త ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చనే అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి. అన్ని కోణాలలో కేసు విచారిస్తున్నామని, మంగది హత్యేనని నిందితుల గురించి సోమవారానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఐ కాశీవిశ్వనాథం, ఎస్సై అలీఖాన్ తెలిపారు. అనుమానస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
హోర్డింగ్ మీద పడి యువతి మృతి
తూర్పుగోదావరి: కాకినాడలో హోర్డింగ్ కూలి పడి యువతి మరణించడంతో నగరంలోవిషాదం నెలకొంది. ఎస్ఆర్కే సెంటర్ జ్యోతుల మార్కెట్ వద్ద గల షాపింగ్ మాల్ పై ఉన్న హోర్డింగ్ హఠాత్తుగా కూలి అటుగా వస్తున్న యువతిపై పడటంతో తలకు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడ ఉన్న స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగానే చనిపోయింది. మృతురాలు కాకినాడ గ్రామీణం మండలం ఇంద్రపాలెం గ్రామానికి చెందిన వాసంశెట్టి శాంతి (20)గా గుర్తించారు. మూడో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దీనస్థితిలో..
పొట్టకూటి కోసం వెళ్లి.. ఎడారి దేశంలో బందీగా మారిన యానాం మహిళ విజిటింగ్ వీసాతో దుబాయ్‌కు పంపి మోసగించిన ఏజెంట్ రూ.లక్ష చెల్లిస్తేనే దేశానికి పంపుతామంటున్న గల్ఫ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ప్రభుత్వ చేయూతకు ఎదురుచూపులు ఉపాధి కోసం ఎడాది దేశానికి వెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలుద్దామనుకున్న మహిళలు తీవ్ర ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గల్ఫ్ దేశాలకు పంపే ఏజెంట్ వారిద్దరికీ విజిటింగ్ వీసాలు ఇచ్చి మోసగించడంతో దేశంకాని దేశంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. - యానాం గత ఏడాది ఏప్రిల్ 9న దరియాలతిప్పకు చెందిన చెక్కా గౌరి, అదే విధంగా ఏప్రిల్ 28న సంగాడి దీన అనే ఇద్దరు మత్స్యకార మహిళలను అదే ప్రాంతానికి చెందిన ఏజెంట్ వాతాడి సత్యనారాయణ అనే వ్యక్తి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.20వేలు చొప్పున తీసుకుని ఉద్యోగవీసా అని చెప్పి విజిటింగ్ వీసా ద్వారా దుబాయ్‌కు పంపాడు. అయితే వీరు దుబాయ్‌లో దిగిన తరువాత అధికారులు తనిఖీచేయడంతో విజిటింగ్ వీసా అని తేలింది. నెలరోజులు మాత్రమే గడువు ఉంటుందని వారు చెప్పారు. అయితే వీరిని యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని అజ్మాన్ అనే ప్రాంతంలోని అల్వాసెట్ అనే లేబర్ రిక్రూట్మెంట్ కార్యాలయానికి పంపారు. వీరిని ఎవరైనా వచ్చి పనిలో చేర్చుకుంటారనే ఆశతో ఆ కార్యాలయంలోనే కొన్నిరోజులుగా ఉంటున్నారు. అయితే బాధిత మహిళలను సంబంధిత రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధికారులు ఒక గదిలో బంధించారు. వీరిని తిరిగి భారతదేశానికి పంపాలంటే రూ.1.50 లక్షలు కట్టాల్సి ఉంటుందని దుబాయ్‌కు చెందిన లేబర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భాదిత మహిళల కుటుంబసభ్యులు ఏంచేయాలో తెలియక రూ.50వేలను పంపడంతో ఇటీవలి చెక్కా గౌరి 28రోజుల పాటు నరక యాతన అనుభవించి క్షేమంగా ఇంటికి చేరుకుంది. రూ.లక్ష.. 15 రోజుల్లో పంపాలి.. రెండో మహిళ దీనను పంపాలంటే రూ.లక్షను 15 రోజుల్లో పంపాలని, లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందుకు జైలులో పెడతారని అధికారులు చెబుతున్నారని ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సూత్రధారి ఏజెంట్ సత్యనారాయణ మాత్రం తనకు సంబంధం లేనట్టు వ్యవహరిస్తున్నాడని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికంతో ఉంటున్న తాము అంత సొమ్ము ఏవిధంగా సంపాదించాలో అర్థంకావడం లేదనివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దుబాయ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి దీనను స్వదేశానికి తిరిగి తీసుకువచ్చేలా కృషి చేయాలని వారు కోరుతున్నారు. పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు దుబాయ్‌కు విజిటింగ్ వీసాపై పంపిన ఏజెంట్ వాతాడి సత్యనారాయణపై బాధితుల కుటుంబసభ్యులు దరియాలతిప్ప పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కనకారావుకు ఫిర్యాదు చేశారు. ఆ దేశంలో నరకమే తాను వెళ్లిన దుబాయ్‌లోని రిక్రూట్మెంట్ ఏజెన్సీలో వందలాది మంది మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్లిన మహిళలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏదైనా అడగాలంటే భాషరాని పరిస్థితి. తినడానికి తిండిలేదు. ఒక్కోసారి నాపై దాడి చేసేవారు. నా కుటుంబ సభ్యులు డబ్బులు కట్టడమే కాకుండా విమాన టికెట్ కూడా పంపారు. అందుకే నేను రాగలిగాను. పాపం డబ్బులు లేని వారి పరిస్థితి ఏంటి? వారు అక్కడే నరకం చూస్తున్నారు. చెక్కా గౌరి, దరియాలతిప్ప -
వినూత్నం.. విభిన్నం
అర్బన్ జిల్లాలో నేరాల అదుపునకు ఎస్పీ రాజకుమారి చర్యలు షీటీమ్, కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్ ఏర్పాటు బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా ఎస్పీతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో నేరాల అదుపునకు మహిళా ఎస్పీ బి.రాజకుమారి పటిష్ట ప్రణాళికతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈవ్ టీజింగ్ నిరోధకానికి షీటీమ్, నేరాల అదుపునకు ప్రజల సహకారం కోసం విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపడానికి ఇప్పటికే ఉన్న ఏజీఎస్ పార్టీని బలోపేతం చేశారు. పేకాట, హైటెక్ వ్యభిచారం, క్రికెట్ బెట్టింట్ వంటి అసాంఘిక కార్యకాలాపాలు నిర్వహిస్తున్న వారిపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అస్థవ్యస్థ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ సహకారంతో అడుగులు చేస్తున్నారు. బి.రాజకుమారి అర్బన్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టి మంగళవారంతో ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో అర్బన్ జిల్లాలో నేరాల అదుపు, మహిళా రక్షణ తదితర అంశాలపై ఎస్పీతో ‘సాక్షి’ మాట్లాడారు. ఆమె మాటల్లోనే... మహిళా వేధింపులపై ప్రత్యేక చర్యలు + నగరంలో విద్యా సంస్థలు అధికంగా ఉన్నాయి. విద్యా సంస్థలు, బస్‌స్టాప్‌లు ఇతర పబ్లిక్ ప్రాంతాల్లో మహిళలను కొంత మంది వేధిస్తున్నారు. నేను బాధ్యతలు చేపట్టిన కొత్తలో కొంత మంది నాకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అప్పడే హైదరాబాద్‌లోలాగా ఇక్కడ కూడా షీటీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. బాధ్యతలు చేపట్టిన రెండు నెలలకే షీటీమ్ ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు షీటీమ్ 1600 మందికి కౌన్సెలింగ్ ఇచ్చింది. యువకులు, వారి తల్లిదండ్రులను పిలిచి మాట్లాడింది. బాధితుల ఫిర్యాదు మేరకు తీరు మారని వారిపై 30 కేసులు పెట్టింది. + అర్బన్ ఏరియాలో పేకాట, కోడిపందేలు, హైటెక్ వ్యభిచారం ఎక్కువగా జరుగుతున్నట్టు నా దృష్టికి వచ్చింది. సీజన్ వారీగా క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. గంజాయి రవాణా ఉంది. వీటిని అదుపు చేయడానికి ఇప్పటికే ఉన్న యాంటీ గూండా స్క్వాడ్‌ను యాక్టివ్ చేశాం. ప్రత్యేకంగా ఎస్సై, సిబ్బందిని నియమించి దాడులు చేయించాం. మద్యం దుకాణాల వద్ద న్యూసెన్స్, సమయం దాటి అమ్మకాలను పూర్తిగా నియంత్రించాం. అసాంఘిక కార్యక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నాం. కమ్యూనిటీ పోలీస్ ఆఫీషర్స్(సీపీవో) ఏర్పాటు ఉద్దేశం...? + పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీసుల సంఖ్య పెరగడం లేదు. నేరాల అదుపు, సమాచారం అందివ్వడం కోసం పోలీసుల స్థానికులతో సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. పోలీస్ స్టేషన్ పరిధిలో చురుకైన, ఆసక్తి ఉన్న యువకులను కమ్యూనిటీ పోలీస్ ఆఫీసర్స్‌గా నియమిస్తాం. ఇప్పటికే దీనికి రూపకల్పన చేశాం. మరో రెండు మూడు రోజుల్లో సీపీవోను ప్రారంభిస్తాం. + నగరంలో రౌడీయిజాన్ని సహించేది లేదు. 252 మందిపై రౌడీషీట్స్ ఉన్నాయి. వాటినన్నింటినీ డిజిటలైజేషన్ చేశాం. వీరిలో 181 మంది నగరంలో ఉన్నారు. మిగిలిన వారు బయటకు వెళ్లడం, మళ్లీ రావడం చేస్తున్నారు. అందరి కదలికలపై నిఘా పెట్టాం. తరచూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. నలుగురిపై పీడీ కేసులు పెడుతున్నాం. రౌడీ షీటర్లు తీరు మార్చుకోకపోతే నగర బహిష్కరణకు సిఫార్సు చేస్తాం. + నగరంలోని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది తక్కువగా ఉన్నారు. జంక్షన్ల వద్ద సిగ్నల్స్ పూర్తి స్థాయిలో లేవు. ఉన్న వాటిలో కొన్ని సరిగా పనిచేయడం లేదు. సిగ్నల్స్ పెట్టాలని నగరపాలక సంస్థకు లేఖ రాశాం. నగరంలోని కూడళ్లు, రద్దీ ప్రదేశాలను గుర్తించి, అవసరమైన చోట నగరపాలక సంస్థ ద్వారా డివైడర్లు ఏర్పాటు చేయించాం. సీసీ కెమెరాలు ఏర్పాటుకు నగరపాలక సంస్థతో కలసి పనిచేస్తున్నాం. + స్టేషన్ల వద్ద చట్ట విరుద్ధంగా సెటిల్మెంట్లు చేస్తుంటే బాధితులు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాం. కొంత మంది భూతగాదాలలో మమ్మల్ని చంపుతామని బెదిరించారని ఫిర్యాదు చేస్తున్నారు. బెదరించడం క్రిమినల్ కేసు అవుతుంది. అంత వరకే మా బాధ్యత. డాక్యుమెంట్లు ఉండి వేరు వారు ఆస్తిని ఆక్రమిస్తే అది పూర్తిగా క్రిమినల్ కేసు అవుతుంది. మా విభాగం సిబ్బంది ఇబ్బందులు పెడితే బాధితులు నన్ను సంప్రదించాలి. ప్రజలతో మంచి సంబంధాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ మధ్యన పరివర్తన పేరుతో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించాం అని రాజకుమారి వివరించారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణికు అవస్థలు
-
కన్నుమూసిన కలను కడుపున మోస్తూ
ఐదు రోజులుగా మృతశిశువును కడుపులో ఉంచుకుని అవస్థలు కుటుంబీకుల ఆందోళనతో దిగివచ్చిన ఆస్పత్రి సిబ్బంది కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : వైద్యుల నిర్లక్ష్యంతో నిండు గర్భిణి తీవ్ర అవస్థలకు గురైంది. తన కడుపులోని శిశువు చనిపోయాడని ఒకసారి.. తర్వాత బయటకు వస్తుందని మరోసారి చెప్పి ఐదు రోజులు నిర్లక్ష్యంగా వదిలేశారు. బాధితురాలి ప్రాణం మీదకు వచ్చేసరికి› కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా కుటుంబీకులతో సహా పలువురు ఆందోళన చేయడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని హుటాహుటిన స్థానిక జిల్లా ఆస్పత్రిలో బుధవారం చికిత్స ప్రారంభించారు. రాజమహేంద్రవరంలోని క్వారీ ప్రాంతానికి చెందిన కొల్లి వెంకటేశ్వరి రెండోకాన్పు చేసుకునేందుకు తన భర్త సతీష్‌తో కలిసి ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. అక్కడ డ్యూటీలో ఉన్న గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్ధిని ఆమెను మర్నాడు రమ్మని చెప్పి పంపించివేసింది. శనివారం ఉదయం వచ్చిన వెంకటేశ్వరికి వైద్యపరీక్షలు చేసిన డాక్టర్ విష్ణువర్ధిని కడుపులో బిడ్డ చనిపోయిందని సాయంత్రం రమ్మని మళ్లీ పంపేశారు. మళ్లీ సాయంత్రం వచ్చిన వెంకటేశ్వరిని ఆస్పత్రిలో చేర్చుకుని నార్మల్ డెలివరీ అవుతుంది కంగారుపడకు అని చెప్పి వదిలేశారు. తర్వాత ఆది, సోమ, మంగళ వారాలు గడిచి బుధవారం వచ్చిందేకాని కడుపులో మృతశిశువు బయటకు రాలేదు. డాక్టర్ విష్ణువర్ధిని సెలవుపై వెళ్లడంతో విధుల్లో ఉన్న వైద్యాధికారి డాక్టర్ వసుంధర వద్దకు వారు వెళ్లి విష్ణువర్ధిని రాసిచ్చిన మందులను ఆమెకు చూపారు. వాటిని ఆమె విసిరేసి వీటితో డెలివరీ అవ్వదు.. కాకినాడ ప్రభుత్వాస్పత్రికి వెళ్లిపొమ్మని, లేకపోతే తల్లికి ప్రమాదమని చెప్పారు. దీంతో విషయాన్ని కుటింబీకులకు తెలపడంతో స్థానిక నాయకులు దాస్య ప్రసాద్, కందికొండ రమేష్,› వానపల్లి శంకర్, అజ్జరపు వాసు తదితరులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ పద్మశ్రీ వచ్చి జరిగిన విషయం తెలుసుకుని కుటుంబీకులతో మాట్లాడి చికిత్స రాజమహేంద్రవరంలోనే అందిస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. -
ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా.
-
శబరి ఆలయంలో యువతి!
తిరువనంతపురం: మహిళలకు ప్రవేశం లేని శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలో ఒక యువతి ఉండగా తీసిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తోంది. దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ మేరకు సోమవారం కేరళ దేవాదాయశాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ దేవాదాయ అధికారులకు ఆ ఫొటో నిష్పాక్షితను నిర్ధారించాలని ఆదేశించారు. మంత్రి సురేంద్రన్ మాట్లాడుతూ.. ఈ విషయమై కొల్లాంకు చెందిన వ్యాపారవేత్త ఒకరు తమకు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు. ముఖ్యంగా 10 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకు గర్భగుడిలోకి ప్రవేశం నిషేధం. -
గుర్తు తెలియని మహిళ అగ్నికి ఆహుతి
బొమ్మూరు డంపింగ్‌యార్డులో చోటుచేసుకున్న సంఘటన హత్యగా పోలీసులు కేసు నమోదు రాజమహేంద్రవరం రూరల్ : బొమ్మూరు డంపింగ్ యార్డులో గుర్తు తెలియని మహిళ మృతదేహం అగ్నికి ఆహుతైన సంఘటన శుక్రవారం సంచలనం కలిగించింది. సుమారు 40 ఏళ్ల వయస్సు కలిగిన మహిళ పాదాలు మినహా పూర్తిగా సజీవ దహనం కావడంతో గుర్తుపట్టని పరిస్థితి నెలకొంది. ఆ మహిళను ఎవరైనా హత్యచేసి తీసుకువచ్చి కాల్చివేశారా, లేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అన్న విషయం పోలీసులు దర్యాప్తులో తేలాల్సి ఉంది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. బొమ్మూరు సుద్దకొండ వద్ద ఉన్న డంపింగ్ యార్డు వద్దకు మోషే అనే తొమ్మిదో రగతి విద్యార్థి బహిర్భూమికి వెళ్లాడు. అక్కడ కాలుతున్న మృతదేహాన్ని చూసి, స్థానికులకు, మాజీ సర్పంచ్ మత్సేటి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లాడు. విషయం తెలుసుకున్న బొమ్మూరు పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ కనకారావు, ఎస్సై నాగబాబులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పాదాలు మినహా పూర్తిగా మృతదేహం కాలిపోయింది. ఆమె చేతికి ఉన్న గాజులు ఆధారంగా మహిళగా గుర్తించారు.అర్బన్ జిల్లా అడ్మిన్ ఏఎస్పీ రజనీకాంత్‌రెడ్డి, తూర్పు మండల డిఎస్పీ రమేష్‌బాబులు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. మహిళను ఎవరైనా హత్య చేసి నిర్జీవ ప్రదేశం అవడంతో ఇక్కడకు తీసుకువచ్చి కాల్చి పడేశారా అన్న కోణాలలో పోలీసులు భావిస్తున్నారు. సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్‌ను, క్లూస్‌టీమ్‌ను తీసుకువచ్చిన ఆధారాలు సేకరించేందుకు అనువుగా లేకపోవడంతో వెనుదిరగాల్సి వచ్చింది. తూర్పు మండల డీఎస్పీ రమేష్‌బాబు మాట్లాడుతూ మృతురాలు ఎవరనేది గుర్తించి, హత్యకు గల కారణాలపై దృష్టి సారించి కేసు దర్యాప్తు చేపడతామని తెలిపారు. బొమ్మూరు ఇన్స్పెక్టర్ కనకారావు మాట్లాడుతూ వీఆర్వో నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు హత్యకేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బొమ్మూరులో సంచలనం బొమ్మూరు గ్రామంలో తెల్లవారక ముందే మహిళ మృతి చెందిన విషయం వ్యాపించడంతో గ్రామస్తులతో పాటు వాహనచోదకులు అధిక సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. గుర్తు తెలియని మహిళ హత్య పోలీసులకు సవాల్‌గా మారనుంది. గత ఏడాది అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం వెనుక హత్యకు గురైన దుళ్ల గ్రామానికి చెందిన యలమర్తి వెంకటేష్ (24) కేసును ఇప్పటివరకు పోలీసులు చేధించలేకపోయారు. మృతదేహం ఆచూకీ తెలిసిన కేసును ఇప్పటివరకు చేధించలేని పోలీసులు ఈ కేసును ఏవిధంగా చేధిస్తారన్న అనుమానం ప్రజల్లో ఉంది. -
తల్లి కాబోతున్న వేళ తల్లడిల్లిన అమ్మ
-
తల్లి కాబోతున్న వేళ తల్లడిల్లిన అమ్మ
పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రిలో చేరిన గర్భిణి పట్టించుకోని వైద్యులు బెడ్ మీదనే ప్రసవ వేదన పురుడు పోసిన పారిశుద్ధ్య కార్మికురాలు ఇన్చార్జి ఆర్‌ఎంవోను నిలదీసిన వైఎస్సార్ సీపీ నేత జక్కంపూడి సాక్షి, రాజమహేంద్రవరం: తల్లి కాబోతున్న ఆనందంలో పురిటి నొప్పులను పంటి బిగువన అదిమిపట్టిన ఆ గర్భిణి ప్రభుత్వాస్పత్రిలోనే నరకం చవి చూసింది. నొప్పులతో అల్లాడుతూ బెడ్‌పైనే అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు దాదాపు పది గంటలపాటు ప్రసవ వేదనతో అల్లాడిపోయింది. తమ బిడ్డపై దయచూపాలని ఆస్పత్రి స్టాఫ్‌నర్సులను బంధువులు బతిమలాడినా కనికరం చూపించ లేదు. రాత్రంతా పురిటి నొప్పులతో అల్లాడిన ఆ గర్భిణి ఉదయం ఏడు గంట లకు బెడ్ మీదనే ప్రాణాపాయ స్థితిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు పురుడుపోసింది. ప్రభుత్వ వైద్యులు, స్టాఫ్‌నర్స్‌ల నిర్లక్ష్యానికి ప్రతిరూపంగా నిలిచిన ఈ ఘటన రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం చోటుచేసుకుంది. డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌ల నిర్లక్ష్యంపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. బంధువుల కథనం మేరకు.. స్థానిక 49వ డివిజన్ సుబ్బారావుపేటకు చెందిన గాతల ప్రమీలాదేవీ ప్రసవం కోసం 4 రోజుల క్రితం ప్రభుత్వాస్పత్రిలో చేరింది. వైద్యులు పలు పరీక్షలు రాశారు. అయితే మెడ్ ఆల్ సిబ్బంది పేపర్‌పై ఒకవైపు ఉన్న పరీక్షలే చేశారు. డాక్టర్ నాయక్ చూసి మిగిలిన పరీక్షలు చేయలేదంటూ సిబ్బందిపై మండిపడి మిగిలి నవి కూడా చేయించాలని బంధువులకు సూచించారు. గురువారం సిబ్బంది లేరని చెప్పడంతో శుక్రవారం వస్తే 12 గంటలకే పరీక్షలు చేసే సిబ్బంది వెళ్లిపోయారు. రాత్రి 10.30 గంటలకు ప్రమీలాదేవికి నొప్పులు ప్రారంభమయ్యాయి. నర్సులను పిలిచినా వారు పట్టించుకోలేదు. అర్థరాత్రి 2 గంటలకు ప్రసవం కోసం ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు. ఉదయం 7.30 గంటల వర కూ ఆ తల్లి పురిటినొప్పుల అరుపులతో ఆస్పత్రి గది ప్రతిధ్వనించింది. అయినా నర్సులు, వైద్యులు పట్టించుకోలేదు. ఉదయం 7 గంటలకు బెడ్ పైనే ప్రసవం ప్రారంభమైంది. బిడ్డ తల బయటకు రావడంతో బంధువులకు ఏం చేయాలో తెలియలేదు. పరుగున వెళ్లి నర్సులకు చెప్పారు. అయినా వారు పెడచెవిన పెట్టారు. దాదాపు అరగంటపాటు ఆ తల్లి నరకయాతన అనుభవించింది. తన బిడ్డకు ఏమవుతుందోనని ప్రమీలాదేవి భీతిల్లింది. ఆమె బాధ చూసిన ఆస్పత్రి పారిశుద్ధ్య కార్మికురాలు వెంటనే తన పని ఆపి పరుగున వచ్చింది. తలభాగం బయటకు వచ్చిన బిడ్డను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. అరగంటపాటు ఆ తల్లికి పురుడు పోయాలని తపనపడింది. తీవ్ర రక్త స్రావం జరుగుతున్నా ఏం చేయాలో తెలి యలేదు. ఆ బిడ్డకు ప్రాణం పోసి ఓ తల్లికి కడుపుకోత లేకుండా చేయాలన్న ఆ కార్మికురాలి పట్టుదల ఎట్టకేలకు ఫలించింది. తల్లి, బిడ్డ క్షేమంగా బయటపడ్డారు. తీవ్ర రక్త స్రావం జరగడంతో ప్రమీలాదేవి సొమ్మసిల్లి పడిపోయింది. ఆర్‌ఎంవోను నిలదీసినవైఎస్సార్సీపీ నేతలు గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణువర్థిని, స్టాఫ్‌నర్స్‌ల నిర్లక్ష్యంపై వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఇ¯ŒSచార్జి ఆర్ఎంవో లక్ష్మీపతి వద్ద మండిపడ్డారు. డాక్టర్ విష్ణువర్థిని ఎప్పుడూ గర్భిణుల పట్ల హేళనగా మాట్లాడడంతోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అంతకుముందు ఆస్పత్రిలో ప్రమీలాదేవికి జరిగిన అన్యాయాన్ని ఆమె బంధువులు 49వ డివిజ¯ŒS వైఎస్సార్ సీపీ ఇ¯ŒSచార్జి ఆకుల విజయభారతి, కార్పొరేషన్లో పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ గుత్తుల మురళీధరరావుల దృష్టికి తీసుకొచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న వారు పరీక్షల విభాగం సిబ్బందిని నిలదీశారు. ఇన్ చార్జి ఆర్ఎంవో గదికి వచ్చి జక్కంపూడి విజయలక్ష్మి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే కార్పొరేటర్ బొంతా శ్రీహరి, ఇతర అనుచరులతో ఆస్పత్రికి చేరుకున్న జక్కంపూడి విజయలక్ష్మి బాధితులకు జరిగిన అన్యాయంపై మండిపడ్డారు. సిబ్బంది కొరత వల్ల ఇలాంటి ఘటనలు సాధారణమేనని లక్ష్మీపతి సమర్థించుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ విష్ణువర్థిని, స్టాఫ్‌నర్సులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడినుంచే ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ కిశోర్‌తో ఫో¯ŒSలో మాట్లాడారు. వారిపై సోమవారంలోగా చర్యలు తీసుకోకుంటే ఆస్పత్రి వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం తల్లీ, బిడ్డలను పరామర్శించారు. -
నేనసలే పిచ్చోడిని... రెచ్చగొట్టకండి
ఎమ్మెల్యేను నిలదీసిన మహిళపై సహనం కోల్పోయిన వర్మ కొత్తపల్లి : ప్రజా ప్రతినిధిని సమస్యలపై నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. సహనంగా సమాధానం చెప్పాల్సిన ప్రజాప్రతినిధే సహనం కోల్పోతే. అదే జరిగింది కొత్తపల్లి మండలంలో. తన సమస్యలను చెప్పుకుంటున్న ఓ మహిళపై పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘నేను అసలే పిచ్చోడిని...నన్ను రెచ్చగొట్టొ’’ద్దంటూ సభలోనే చిర్రెత్తిపోవడంతో అక్కడున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. కొత్తపల్లి మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం నిర్వహించింన ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ గ్రామాల అభివృద్ధికి కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. దీంతో కొత్తపల్లి ఎస్సీపేటకు చెందిన ఒక మహిళ నిలబడి సమస్యలపై ఎమ్మెల్యే వర్మను నిలదీసింది. రోడ్లు సామాన్య ప్రజల ఇళ్ళ వద్ద కాకుండా తమ పార్టీ నాయకులు ఇళ్ళ వద్దే వేసుకుంటున్నారని, వర్షం వస్తే మా వీధిలో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడుతుందని, తన కుమారుడు చనిపోయి సుమారు రెండు సంవత్సరాలు గడుస్తున్నా తన కోడలకు పింఛను మంజూరు చేయలేదని నిలదీయడంతో సర్దిచప్పాల్సిందిపోయి ‘నేను అసలే పిచ్చోడిని నన్ను రెచ్చగొట్టొ‘ందంటూ పలుమార్లు కూర్చో కూర్చోమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుకపల్లికి చెందిన టి.మంగకు పింఛను మంజూరైందని చెప్పి సభకు రప్పించారు. కొత్త పింఛను వస్తుందని ఆశగా వచ్చిన ఆమెకు పింఛనును మంజూరు కాలేదని చెప్పడంతో ఆమె సభలోనే కన్నీళ్ళపర్యంతమైంది. -
వేడుకకు వెళుతూ మృత్యుఒడిలోకి..
తేతలి (తణుకు) : తణుకు మండలం తేతలి గ్రామ పరిధిలోని 16వ నంబరు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తేతలి గ్రామానికి చెందిన మానూరి ముత్యాలమ్మ (55) ఆటో ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా తాడేపల్లిగూడెం నుంచి అంబాజీపేట వెళుతున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ముత్యాలమ్మ సంఘటనా స్థలం లోనే మృతి చెందింది. దువ్వ గ్రామంలోని తన మనుమరాలు పుష్పవతి కావడంతో వేడుకలో పాల్గొనేందుకు వెళుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న బంధువులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఆ ప్రాంతం రోదనలతో నిండిపోయింది. సర్పంచ్ కోట నాగేశ్వరరావు మృతురాలి బంధువులను పరామర్శించారు. రూరల్ ఎస్సై వి.జగదీశ్వరరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
యనమదుర్రు డ్రెయిన్‌లో ఇద్దరు గల్లంతు
భీమవరం టౌన్ : భీమవరం పట్టణంలోని యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకి యువతి, యువకుడు గల్లంతయ్యారు. స్థానికుల కథనం ప్రకారం శనివారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో ఓ యువతి బైపాస్ రోడ్డులో వంతెనపై నుంచి యనమదుర్రు డ్రెయిన్‌లోకి దూకింది. ఆ సమయంలో అక్కడే ఉన్న యువకుడు ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకాడు. వీరు దూకిన ప్రాంతంలోఊబిలా ఉండటంతో కూరుకుపోయి గల్లంతయ్యారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్క్యూబోట్‌లో గా లింపు చర్యలు చేపట్టారు. కాగా గల్లంతైన యువతి సుంకర పద్దయ్య వీధికి చెందిన పి.సత్యస్వరూప (18)గా అక్కడ ల భించిన ఒక ప్రైవేట్ విద్యా సంస్థ ఐడెంటిటీ కార్డు ద్వారా తెలిసింది. యువకుడు చిన్నఅప్పారావు తోట ప్రాంతానికి చెందిన కనిమిరెడ్డి మహేష్ (25)గా తెలుస్తోంది. యనమదుర్రు డ్రెయిన్‌లో దూకడానికి కొద్ది సమయం ముందు లంకపేట వద్ద వీరిద్దరూ ఘర్షణ పడ్డారని, తర్వాత ఆమె వేగంగా నడుచుకుంటూ వచ్చి వంతెనపై నుంచి దూకిందని తెలుస్తోంది. వెనుకనే మోటార్ సైకిల్‌పై వచ్చిన మహేష్ ఆమెను రక్షించేందుకు డ్రెయిన్‌లో దూకగా ఇద్దరు గల్లంతయ్యా రు. వీరిద్దరూ ప్రేమికులని గతంలో పెద్దలు అభ్యంతరం చెప్పడంతో విడిపోయారని ఈ నేపథ్యంలో ఈ సంఘటన జరిగినట్టు మరికొందరు చెబుతున్నారు. దీనిపై టూటౌ¯ŒS పోలీస్ స్టేషన్లో పోలీసులను వివరణ కోరగా తమకెలాంటి ఫి ర్యాదు అందలేదని చెప్పారు. -
సరైన వైద్యం అందక బాలింత మృతి
బంధువులు ఆందోళన ∙ రూ.2 లక్షల పరిహారానికి ఆస్పత్రి వర్గాల హామీ అంబాజీపేట : అంబాజీపేట స్త్రీల ఆస్పత్రిలో ౖÐð ద్యాధికారి నిర్లక్ష్యం వల్లే బాలింత మృతి చెందిందని ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేశారు. బుధవారం జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయినవిల్లి మండలం తొత్తరమూడికి చెందిన తొత్తరమూడి మధుబాబుతో అంబాజీపేట హడ్కోకాలనీకి చెందిన వసంతకుమారి వివాహం అయ్యింది. వసంత కుమారి ప్రసవం నిమిత్తం గత నెల 30న స్థానిక స్త్రీల ఆస్పత్రిలో చేరింది. 1వ తేదీన శస్త్రచికిత్స చేయగా ఆమెకు పాపపుట్టింది. తదనంతర చికిత్స పొందుతుండగా బాలింతకు కిడ్నీ సమస్య, హైబీపీ రావడంతో మెరుగైన చికిత్స కోసం కాకినాడకు తీసుకువెళ్ళాలని వైద్యా ధికారి డాక్టర్ పుష్ప సూచించారు. దీంతో వసంతకుమారి బంధువులు ఆమెను కాకినాడ తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె బుధవారం ఉదయం మృతి చెందింది. వైద్యం సరిగా అందకే వసంతకుమారి చనిపోయిందని ఆమె బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాలు చర్చించడంతో బాధిత కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహరం చెల్లించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించాయి. దీంతో పరిస్థితి సద్దు మణిగింది. ఇదిలా ఉండగా డాక్టర్ పుష్ప ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేస్తూ దీర్ఘ కాలిక సెలవు పెట్టి ఇక్కడ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం తెలుసుకున్న అల్లవరం, అమలాపురం తాలుక ఎస్సైలు డి.ప్రశాంతకుమార్, ఎం.గజేంద్రకుమార్ జరిగిన సంఘటనపై ఇరువర్గాలను విచారించారు. ఈ చర్చల్లో ఎంపీటీసీ ఉండ్రాజవరపు ప్రకాశరావు, నాగాబత్తుల సుబ్బారావు, ఉందుర్తి నాగబాబు పాల్గొన్నారు. -
మహిళపై హత్యాయత్నం
ఓజిలి : తన వివాహేతర సంబంధం కొనసాగించాలని ఓ మహిళపై ఆమె ప్రియుడు హత్యాయత్నం చేసిన సంఘటన మండలంలోని రావిపాడులో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన గుంజి కళావతి భర్త నాగారాజు నాలుగేళ్ల క్రితం కిడ్నీ వ్యాధితో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన యనమల వెంకటేశ్వర్లుతో కళావతికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. మూడేళ్ల పాటు వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ క్రమంలో కళావతి కుమారుడు అనంతకుమార్ పెద్దవాడు కావడంతో తనతో వివాహేతర సంబంధంను మానుకోవాలని ఆమె వెంకటేశ్వర్లుకు తెలిపింది. ఇందుకు నిరాకరించిన వెంకటే శ్వర్లు పలుమార్లు కళావతితో గొడవ పడ్డాడు. ఈ విషయం గ్రామ పెద్దలకు తెలపడంతో వెంకటేశ్వర్లును మందలించారు. ఆదివారం దీపావళి కావడంతో కళావతి వజ్జవారిపాళెంలో గుడికి వెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరింది. గ్రామ సమీపంలోకి వచ్చే సరికి ఆమెకు ఎదురుగా బైక్‌పై వచ్చిన వెంకటేశ్వర్లు నీతో మాట్లాడాలంటూ చేయి పట్టుకుని లాగడంతో ప్రతిఘటించిన ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకున్నారు. ఆమెను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ సాంబశివరావు చికిత్స పొందుతున్న మహిళను పరామర్శించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారైన నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఇసుక గుంతలో పడి బాలుడు మహిళ మృతి
-
డబ్బు కోసం రోగిని చంపేశాడు
కమలాకర్ ఆస్పత్రి వద్ద మృతురాలి బంధువుల ఆందోళన బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ కంబాలచెరువు (రాజమహేం ద్రవరం) : ఆపరేషన్ చేస్తే చనిపోతుందని తెలిసి కూడా.. డబ్బుకు కక్కుర్తి పడి వివాహిత మృతికి ఆస్పత్రి వైద్యుడు కారకుడయ్యాడంటూ మృతురాలి బంధువులు స్థానిక దానవాయిపేటలోని కమలాకర్ ఆస్పత్రి వద్ద సోమవారం ఆందోళన చేశారు. మృతురాలి కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. జొన్నాడకు చెందిన మార్తమ్మ(28) ఆరోగ్యం బాగోక కడియం మండలం బుర్రిలంకలో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. వారు ఆమెను బొల్లినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి గుండెలో రంధ్రం ఉందని, దానిని ఎంవీఆర్గా నిర్ధారించారు. ఆపరేషన్ చేయకూడదని మందులిచ్చి పంపేశారు. తర్వాత వారు దానవాయిపేటలోని కమలాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యుడు కట్టా కమలాకర్ ఆమెను పరీక్షించి, ఆపరేషన్ చేస్తే నయమవుతుందని, రూ.1.50 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. అదీ ఆరోగ్యశ్రీ ద్వారా వస్తుందనడంతో, ఆమె కుటుంబసభ్యులు సరేనన్నారు. ఈ నెల 6న ఆపరేషన్ చేయగా, రెండు రోజులైనా రోగి వద్దకు ఎవరినీ అనుమతించలేదు. సోమవారం ఆమె మృతిచెందిందని తెలిపారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి వైద్యుడిని నిలదీశారు. ఆపరేషన్ సమయంలో మార్తమ్మ సహకరించలేదని, దీంతో కొన్ని వైర్లు ఊడిపోయాయని, యూరిన్ ఆగిపోవడంతో ఆమె చనిపోయిందని తెలిపారు. ‘ఆపరేషన్ చేసినా బతకలేదు.. మేమేం చేస్తాం’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వారు వాపోయారు. కేవలం ఆరోగ్యశ్రీ డబ్బులకు కక్కుర్తిపడి, రోగి మృతికి కారకులయ్యారంటూ కడియం సర్పంచ్ ఓరా రాము పోలీసులకు వివరించారు. మృతురాలి ముగ్గురు పిల్లలకు న్యాయం చేయాలన్నారు. దీనిపై ఫిర్యాదుచేస్తే విచారణ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. -
వివాహిత ఆత్మహత్య
నెల్లూరు (క్రైమ్) : అవమానంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన పాత చెక్‌పోస్టు వద్ద గురువారం చోటు చేసుకుంది. పాత చెక్‌పోస్టు సమీపంలో వెంకటేశ్వర్లు, లక్ష్మి (24) దంపతులు నివసిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి ఎదురు ఇంట్లో శివ కుటుంబం నివాసముంటుంది. కొంత కాలంగా లక్ష్మిపై శివ మనస్సుపడ్డాడు. ఎలాగైనా ఆమెను లొంగ దీసుకోవాలని ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించింది. ఈ విషయం శివ ఇంట్లో తెలియడంతో శివ అతని భార్య నడుమ విభేదాలు పొడచూపాయి. గురువారం వెంకటేశ్వర్లు పనికి వెళ్లాడు. లక్ష్మి ఒక్కటే ఇంట్లో ఉంది. లక్ష్మి విషయమై శివకు, అతని భార్యకు మరోమారు తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తురాలైన శివ భార్య లక్ష్మి వద్దకు వెళ్లింది. తన భర్తకు ఎం మందుపెట్టావు? ఎం చేశావు తనను పట్టించుకోవడం లేదంటూ ఆమెతో గొడవకు దిగింది. ఉంటే నీవైనా తనతో ఉండు...లేదంటే అతన్ని వదిలివేయాలని.. లేకుంటే అంతుచూస్తానని బెదిరించింది. దీంతో మనస్తాపం చెందిన లక్ష్మి ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లక్ష్మి మృతి విషయాన్ని తెలుసుకున్న భర్త పని నుంచి ఇంటికి వచ్చాడు. భార్య మృతదేహం వద్ద కుప్పకూలిపోయి కన్నీటి పర్యంతమయ్యారు. లక్ష్మి ఆత్మహత్య చేసుకోవవంతో శివ అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. -
వివాహిత ఆత్మహత్య
నిడమనూరు : మండలంలోని కేశావాపురానికి చెందిన కుందూరు సంతోషి (23) శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ నర్సింహరాజు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలం కేసారానికి చెందిన సంతోషికి మండలంలోని కేశవాపురానికి చెందిన కుందూరు శ్రీనివాస్‌రెడ్డితో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే సంతోషి కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుందని తెలిపారు. శుక్రవారం నొప్పి ఎక్కువ కావడంతో పురుగులమందు తాగిందని, బంధువులు చూసి చికిత్స కోసం తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. కాగా, మృతురాలి అన్న సైదిరెడ్డి ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
జ్యోతినగర్ : రామగుండంలోని అన్నపూర్ణకాలనీకి చెందిన దీటి శ్రీవాణి(25) బుధవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రామగుండం మండలం ఆకెనపల్లి గ్రామానికి చెందిన శ్రీవాణిని కార్పొరేషన్ పరిధిలోని మూడో డివిజన్‌కు చెందిన దీటి వెంకటేష్‌కిచ్చి పెళ్లి చేశారు. వీరికి కుమారుడు, కూతురు సంతానం. ఏమైందో తెలియదుగానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే ఉరేసుకుంది. భర్త వెంకటేష్ ఇంటికొచ్చి చుట్టుపక్కలవారి సహాయంతో కిందకు దింపి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందింది. మృతురాలు తండ్రి లగిశెట్టి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సాబీరొద్దిన్ తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ముగ్గురి ఆత్మహత్యాయత్నం
క్షణికావేశాంలో ఆత్మహత్యలకు యత్నిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. చిన్నచిన్న కారణాలకూ చాలామంది బలవంతంగా ఉసురు తీసుకుంటున్నారు. ఇదే కోవలో తాజాగా ముగ్గురు ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తల్లి మందలించిందని.. ఏలూరు (సెంట్రల్) : తల్లి మందలించిందని ఓS బాలుడు బ్లీచింగ్ పౌడరును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఔట్ పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ హనుమాన్ నగర్‌కు చెందిన చింతాడి లక్ష్మి భర్త చనిపోవడంతో తన కుమారుడు రాజేష్‌ను పోషించుకుంటోంది. రాజేష్ సక్రమంగా స్కూల్‌కు వెళ్లకపోవడంతో సోమవారం రాత్రి ఆమె మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన రాజేష్ సోమవారం రాత్రి బ్లీచింగ్ పౌడరును నీటిలో కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన తల్లి చికిత్స నిమిత్తం అతనిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త మందలించాడని భర్త మందలించాడని మనస్థాపానికి గురైన ఓ మహిళ గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. పెండ్యాల వెంకట్రావు, కళావతి దంపతులు ద్వారకాతిరుమల మండలం దేవినేనివారిగూడెంలో నివాసం ఉంటున్నారు. సోమవారం రాత్రి భర్త వెంకట్రావు కళావతిని మందలించాడు. తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య సరిగా కూర వండలేదని.. భార్య కూర సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడిన భర్త గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. పెంట్రాల కోటి, నాంచారమ్మ దంపతులు ద్వారకాతిరుమలలో నివాసం ఉంటున్నారు. వీరిద్దరూ కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. కోటి సోమవారం రాత్రి కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లగా.. భార్య కూర సరిగ్గా వండలేదని ఆమెతో గొడవపడ్డాడు. ఆ తర్వాత మనస్థాపానికి గురై గుళికలు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన కుటుంబ సభ్యులు అతనిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరంతా ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. -
పురుగు మందు తాగి యువతి ఆత్మహత్య
పట్నంబజారు(గుంటూరు): యువతి ఆత్మహత్యకు పాల్పడడంపై కేసు నమోదైంది. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొంగరాలబీడుకు చెందిన కొల్లిపర శాంతి (21) గతంలో వసంతరాయపురానికి చెందిన ప్రభుదేవను ప్రేమించింది. ప్రభుదేవకు వివాహమైందని తెలుసుకున్న శాంతి పురుగుల మందు తాగగా విషయం తెలుసుకున్న ప్రభుదేవ సైతం పురుగుల మందు తాగాడు. ఈ క్రమంలో ప్రభుదేవ మతి చెందగా, శాంతి ప్రాణాలతో బయటపడింది. అప్పటి నుంచి శాంతి తల్లిదండ్రులు ప్రభుదేవ చనిపోయిన విషయం తనకు తెలియకుండా దాచిపెట్టారు. ఇటీవల విషయం తెలుసుకున్న శాంతి శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఎవరూ లేనప్పుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి కుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
నెల్లూరులో పట్టపగలు దోపిడీ
వద్ధురాలిపై దాడిచేసి నగల అపహరణ బాలాజీనగర్ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఘటన నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల్లూరు(క్రైమ్) : ఒంటరిగా ఉన్న వద్ధురాలిపై ఇద్దరు దొంగలు దాడి చేసి బంగారునగలను అపహరించిన సంఘటన మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. బాలాజీనగర్‌లో వెంకటమ్మ నివాసముంటోంది. ఆమె కుమారుడు రఘురామరాజు తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీలో ఏఓగా పనిచేస్తున్నాడు. దీంతో అతని భార్య సునీత వెంకటమ్మతో పాటు ఉంటోంది. సోమవారం సునీత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో వెంకటమ్మ ఒక్కటే ఉంది. మంగళవారం ఉదయం ఆమె పనులు ముగించుకొని పక్కపోర్షన్ గ్రిల్స్‌కు గడియపెట్టుకొని వరండాలో నిద్రించింది. ఈ క్రమంలో ఓ యువకుడు ఇంటికి వచ్చి గ్రిల్స్తట్టాడు. ఆమె ఎవరని ప్రశ్నించగా.. అవ్వా తలుపుతెరువు నీకు రూ.20 ఇవ్వాలంటూ అతను మాటలు కలిపాడు. దీంతో ఆమె గడి తీసింది. ఆ యువకుడు ఇంట్లోకి ప్రవేశించి తన చేతిలో ఉన్న నగదును కిందపడేసి ఆమెపై దాడిచేశాడు. ఇంట్లోనుంచి బయటకు లాక్కొచ్చి గొంతుపై కాలుపెట్టి తొక్కుతుండగా మరో యువకుడు అక్కడికి చేరుకున్నాడు. ఇద్దరు ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను ఇవ్వాలని లేదంటే చంపేస్తామని బెదిరించి ఆమె మెడలోని రెండుసవర్ల బంగారు సరుడును లాక్కొన్నారు. అనంతరం చేతికున్న గాజులు(పిచ్చివి)బంగారువని భావించి వాటిని తీసుకున్నారు. నిందితులు వెళ్లిపోతుండగా బాధితురాలు తేరుకుని పెద్దగా కేకలువేసింది. ఈ ఘటనలో వద్ధురాలి మెడకు, చేతులకు గాయాలయ్యాయి. నిందితులను పట్టుకుందిలా.. వెంకటమ్మపై దాడిచేసి పరారవుతోన్న దుండగులను స్థానికులు గుర్తించారు. అందులో ఓ వ్యక్తి రామ్‌నగర్ మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో నివాసముంటున్న పిండిమిల్లు యజమాని కుమారుడు పి.లక్ష్మయ్యగా గుర్తించి దోపిడి ఘటనపై బాలాజీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ చెంచురామారావు, ఎస్సైలు వెంకటరావు, సుధాకర్‌లు పరిశీలించి బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. లక్ష్మయ్య ఇంటికి వెళ్లి ఆరాతీయగా అతను ఇంట్లో లేకపోవడంతో ఫొటో సేకరించి రెండు బందాలుగా విడిపోయి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో అన్నపూర్ణ అపార్ట్మెంట్ సమీపంలోని గాయత్రిబార్ గోడ వెనుకవైపును లక్ష్మయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని వెంటబెట్టుకొని మరో నిందితుడైన వెంటకేశ్వరపురం భగత్‌సింగ్ కాలనీకి చెందిన లారీ మెకానిక్ వలిని జాతీయరహదారిపై ఆటో ఎక్కుతుండగా పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితుల వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ స్నేహితులు. మంగళవారం ఉదయం ఫూటుగా మద్యంసేవించి, వెంకటమ్మ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఎవరూ లేరని నిర్ధారించుకుని దాడికి తెగబడ్డారు. విడిపోయి సాయంత్రం వాటిని అమ్మిసొమ్ము చేసుకుందామని భావించారు. ఇంతలోనే పోలీసులు వారిని పట్టుకున్నారు. వీరు గతంలోనూ ఇదే తరహాలో దొంగతనాలకు పాల్పడినట్లు తెలిసింది. ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాల వెనక్కి వెళ్లారు. కాగా పట్టపగలు జరిగిన ఈ దొంగతనం కలకలం రేపింది. -
న్యాయం చేయండి..
భూమి కోసం 30 ఏళ్లుగా పోరాటం అనంతపురం సెంట్రల్ : అత్తమామల నుంచి వారసత్వంగా దక్కాల్సిన భూమి ని తమ రక్తసంబంధీకులే కబ్జా చేశారని పెద్దపప్పూరు మండలం గార్లదిన్నె గ్రా మానికి చెందిన తిప్పిరెడ్డిగారి నాగమ్మ(80) ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేసేం దుకు సోమవారం ఎస్పీ క్యాంపు ఆఫీసుకు వచ్చిన ఆమె, తన సమస్యను ఆల కించేందుకు ఎవరూ లేకపోవడంతో నిరాశగా వెనుతిరిగారు. సాక్షి ఆమెను కదిలించిగా తన గోడు ఇలా వెళ్లబోసుకుంది. ‘నా అత్తమామలకు చెందిన 70 ఎకరాల్లో 35 ఎకరాలు నా వాటాగా రా వాల్సి ఉంది. అప్పట్లో నా ప్రమేయం లేకుండా ఇతరులకు అమ్మినట్లుగా రికార్డులు తయారు చేశారు. వీటితో పాటు కర్నూలు నగరంలో రూ.కోట్లు విలువ జేసే ఆస్తులు ఉన్నాయి. ఏవీ నాకు దక్కనీయకుండా మా రక్తసంబంధీకులే ఆక్రమించుకున్నారు. ఇంట్లో నడవలేని కుమారుడు ఉన్నాడు. ఇలాంటి సమయంలో మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. కోట్ల ఆస్తులు ఉన్నా మాకు దక్కనీయకుండా చేస్తున్నారు. 30 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం కాలేదు. మా సమస్య ఎవరితో చెప్పుకుంటే న్యాయం జరుగుతుందో కూడా తెలియడం లేదు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. -
భువనగిరిలో వివాహిత అదృశ్యం
భువనగిరి అర్బన్ వివాహిత ఆదృశ్యమైంది. ఈ ఘటన భువనగిరిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ ంలోని హుస్నాబాద్‌కు చెందిన కొలిపాక మల్లయ్య కుమారుడు పాండుకు బీబీనగర్ మండలానికి చెందిన నాగరాణితో 7 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజులగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో గోడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నాగరాణి మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో తన అమ్మగారి ఇంటికి వెళ్తానని పాండు పెద్దనాన్న కుమార్తె రేణుకతో కలిసి ఇంటి నుంచి బయలు దేరింది. హుస్నాబాద్ నుంచి స్థానిక కిసాన్‌నగర్‌కు వచ్చింది. రేణుకను అక్కడే వదిలి అమ్మగారి ఇంటికి పోతునట్లు భువనగిరి ఆర్టీసీ బస్టాండ్ వైపునకు వెళ్లింది. సాయంత్రం వరకు ఎదురు చూసినా ఇంటికి రాక పోవడంతో వెంటనే చుట్టు పక్కల ప్రాంతాలు, బంధువుల, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం ఆమె భర్త పాండు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ ఎస్. మంజునాథ్‌రెడ్డి తెలిపారు. -
ఉరేసుకుని మహిళ ఆత్మహత్య
కాగజ్‌నగర్ రూరల్ : మండలంలోని న జ్రూల్నగర్ గ్రామ పంచాయతీ పరిధి విలేజ్ నం.5కు చెందిన రమాసహా(24) తన ఇంట్లో ఆదివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతోనే ఆమె ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని ఈజ్గాం ఎస్సై శివకుమార్ తెలిపారు. కానీ ఆమె ఆత్మహత్యకు పలువురి వేధింపులు కారణమని తెలుస్తోంది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అమీర్‌పేటలో యువతి ఆత్మహత్య
-
అనుమానస్పద స్థితిలో యువతి మృతి
హైదరాబాద్: ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న యువతి అనుమానస్పద స్థితిలో ల్యాబ్‌లోనే మృతి చెందింది. ఈ ఘటన బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. వరంగల్ జిల్లా మరిపెడ ఉగ్గంపల్లికి చెందిన ముత్యం సత్యనారాయణ కుమార్తె సమత(24) కూకట్పల్లి వివేక్‌నగర్‌లోని శ్రీసాయిరాం లేడీస్ హాస్టల్లో ఉంటూ బోయిన్పల్లి చిన్నతోకట్ట గోల్ఫి ల్యాబోరేటరీలో ఏడాదిగా పనిచేస్తోంది. కాగా, ల్యాబ్ నిర్వాహకుడు శ్రీనివాస్...సమతను పెళ్లి చేసుకుంటానంటూ వేధిస్తున్నట్లు సమాచారం. వివాహితుడైన శ్రీనివాస్ ప్రతిపాదనను ఆమె వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె గురువారం రాత్రి ల్యాబ్‌లోనే ఫ్యాన్‌ను ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. కాగా, పోలీసులు ఈ ఘటన జరిగిన సమయంలో ల్యాబ్‌లోనే ఉన్న శ్రీనివాస్‌తో పాటు ఇతరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. -
రైలులో మహిళ మృతదేహం..
-
కి‘లేడీ’ల ‘వస్త్ర’లాఘవం!
దుస్తులు చోరీ చేసిన నలుగురు మహిళలు పరారవుతూ దొరికారు రాజాం: ఓ దుకాణంలో చొరబడిన ఆరుగురు మహిళలు తమ హస్తలాఘవంతో వస్త్రాలు కాజేశారు. అంతే చాకచక్యంగా తరలించేందుకు ప్రయత్నిస్తుండగా.. చివరి క్షణంలో దుకాణ సిబ్బంది వచ్చి పట్టుకున్నారు. వివరాలివీ... స్థానిక పాలకొండ రోడ్డులోని వస్త్ర దుకాణంలో మంగళవారం నలుగురు మహిళలు మూడు బృందాలుగా విడిపోయి వెళ్లారు. కొనుగోలు దారుల్లా వ్యవహరిస్తూ చీరలు, రడీమెడ్ దుస్తులు పరిశీలించారు. అందులో ఓ వృద్ధురాలు ఒక్కొక్కటిగా బయటకు చేర్చి మూట కట్టి పరారైంది. ఆమె ఆ మూట పట్టుకొని ఏరియా ఆస్పత్రి వరకూ నడుచుకుంటూ చేరుకుంది. ఇంతలో మిగిలిన సభ్యులు ఆటోలో వచ్చి ఆమె పక్కనే ఆపారు. మూటను ఆటోలో పెట్టి ఆమెనూ ఎక్కమని సైగ చేశారు. దుకాణంలో సుమారు రూ.20 వేల విలువైన వస్త్రాల చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం సిబ్బంది వెంటనే వారిని అనుసరించారు. ఆటోలో పరారైపోతున్న సమయంలో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విచారణ నిమిత్తం నిందితులను స్టేషన్‌కు తరలించామని, దర్యాప్తు చేస్తున్నామని సీఐ శంకరరావు తెలిపారు. -
యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని..
ఆదిలాబాద్: ఓ యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని ఆమె బంధువులు పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా రామక్రిష్ణాపురం పట్ణణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. ఓ బ్యూటీపార్లర్‌లోని వస్తువులు దొంగిలించిందనే నెపంతో లావణ్య (23) అనే యువతిని ఏఎస్సై రామయ్య విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. విచారణ చేస్తున్న సమయంలో ఏఎస్సై తనను కర్రతో కొట్టారని యువతి చెప్పుతుంది. దీంతో ఆమె బంధువులతో కలిసి స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది. -
పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్య
ఆదిలాబాద్: పెళ్లి కావడం లేదని యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. జైనూర్ మండలం గూసిమెట్ట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం గురువ మంజుల (22) అనే యువతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. గత కొంతకాలంగా పెళ్లి కావటం లేదని తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో మంజుల పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనతో ఆమె కుటుంబంలో విషాదం నెలకొంది. -
హైదరాబాద్‌లో యువతి అదృశ్యం!
బహదూర్‌పురా: కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన హైదరాబాద్ లోని హుస్సేనీఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్‌స్వామి తెలిపిన వివరాల ప్రకారం... హుస్సేనీఆలం బైరూపియా గల్లీ ప్రాంతానికి చెందిన బి.రవీందర్ యాదవ్ కూతురు కవిత (18). కాగా ఈ నెల 13వ తేదీన తండ్రి రవీందర్ యాదవ్‌తో పాటు తల్లి మద్యం మత్తులో ఉండటాన్ని గమనించిన కవిత తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో కుటుంబ సభ్యులకు చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్థానికంగా, తెలిసిన వారి వద్ద వాకబు చేయగా ఫలితం లేకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి అదృశ్యం అవడంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
యువతి ఆత్మహత్య
డిండి(నల్లగొండ): పురుగుల మందు తాగి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దిండి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా మాడ్గులకు చెందిన సరిత(20), ఈ రోజు డిండిలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. -
ఆ ముసుగులో కోరికలు తీర్చుకుంటున్నాడు
-
న్యాయం కోసం ఓ వివాహిత ఆందోళన
-
యువతిపై యాసిడ్దాడి
-
మంకీ.. మోడల్..
పరాకుగా చూస్తే కోతి ముఖమే కనిపిస్తుంది. పరిశీలనగా చూడండి.. అందులో ఓ అమ్మాయి కనిపించడం లేదూ. ఇదే బాడీ ఆర్ట్ గొప్పతనం. బ్రిటన్‌కు చెందిన ఎమ్మాఫేది అందులో అందె వేసిన చేయి. ఒక్కో మోడల్‌ను ఇలా తయారు చేయడానికి 6 గంటల సమయం పడుతుందట. -
ఆ అమ్మాయికి గడ్డం అడ్డం కాలేదు!
లండన్:మగవారికి గడ్డం పెరగడం చూస్తూనే ఉంటాం. కానీ ఓ అమ్మాయికి గడ్డం పెరిగితే.. అది ఆమెకు పెద్ద సవాలే. ఇలాంటి సవాలే బ్రిటన్‌లో నివసిస్తున్న 23 ఏళ్ల భారత సంతతి సిక్కు మహిళ హర్నమ్ కౌర్‌కు ఎదురైంది. ఆమెకు 16వ ఏట నుంచీ ముఖంపై వెంట్రుకలు రావడం మొదలయ్యాయి. మగవారికి గడ్డం ఎలా వస్తుందో అలాగే ఆమెకూ గడ్డం వచ్చేసింది. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమే కారణంగా ఆమెకు ఈ పరిస్థితి ఎదురైంది. టీనే జర్గా కౌర్ మొదట్లో ఈ గడ్డంతో చాలా ఇబ్బందులే పడింది. ముఖానికి చేతులు అడ్డుపెట్టుకుని మాట్లాడటం.. క్లాత్ కప్పుకుని తిరగడం చేసేది. ఆమె బయటకెళితే అంతా అదో రకంగా చూసేవారు. భయపెట్టేవారు. అసభ్యంగా పిలిచేవారు. దీంతో ఆమె ఎంతో వేదన అనుభవించిందామె. ఈ సమయంలో సోదరుడు గురుదీప్ ఆమెకు ఆసరాగా నిలిచాడు. ఆమెకు అన్నిట్లోనూ తోడుగా నిలిచాడు. దీంతో ఈరోజు ఆమెలో బెరుకు తగ్గింది. ఓ ప్రై మరీ స్కూల్లో టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సాధించింది. ప్రపంచంలో గడ్డం ఉన్న ఏకైక మహిళగా గుర్తింపు సాధించి ఆమెకు ఇప్పుడో అరుదైన అవకాశం దక్కింది. ప్రపంచంలోని అత్యుత్తమ గడ్డాల ఎగ్జిబిషన్‌కు ఆమె ఫొటో ఎంపికైంది. బార్డ్ సీజన్ అనే స్వచ్చంధ సంస్థ ప్రాజెక్ట్ 60 పేరుతో 60 ఉత్తమ గడ్డాల ఫొటోలను ప్రదర్శనకు పెట్టాలని నిర్ణయించింది. ఈ ప్రదర్శన త్వరలో లండన్‌లో ప్రారంభం కానుంది. ఈ ప్రదర్శనకు హర్నమ్ కౌర్ ఫొటో ఎంపిక కావడంతో ఆమె మరోసారి వార్తల్లోకొచ్చింది. -
19 అడుగుల 9 అంగుళాల గోళ్లు
-
ఆకలి తీర్చడమే ఆనందం!
ఆకలి విలువ తెలిసినవాడికి అన్నం విలువ తెలుస్తుంది. ఆకలి, అన్నం... ఈ రెండిటి విలువ తెలిసినవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాల్సిన అవసరమేంటో తెలుస్తుంది. టోనీ టేకి అవన్నీ తెలుసు కాబట్టే రోజుకి మూడు వేల మందికి అన్నం పెడుతున్నాడు. అన్నార్తుల ఆకలి మంటలను చల్లారుస్తున్నాడు! అది 2003వ సంవత్సరం. ఓ శ్మశాన వాటికలో ఒక మహిళకు అంత్యక్రియలు జరుగు తున్నాయి. అందరూ విషణ్ణ వదనాలతో నిలబడి ఉన్నారు. మరణించిన స్త్రీ ఆత్మ శాంతించాలని అందరూ మనసుల్లోనే ప్రార్థిస్తున్నారు. ఒక వ్యక్తి మాత్రం అలాంటివేమీ చేయడం లేదు. అక్కడ ఉన్నవారందరి వైపూ తదేకంగా చూస్తున్నాడు. ఆ మరణించిన స్త్రీ కొడుకే అతను. అతడి ముఖంలో దిగులు కంటే ఆశ్చర్యం ఎక్కువగా కనిపిస్తోంది. పక్కనే ఉన్న వ్యక్తి అది గమనించాడు. ‘‘ఏంటి అలా చూస్తున్నావ్’’ అన్నాడు. ‘‘వీళ్లెవరినీ నేనెప్పుడూ చూడలేదు. వీళ్లలో మా బంధువులు కానీ, స్నేహితులు కానీ లేరు. కానీ అమ్మ అంత్యక్రియలకు ఎందుకొచ్చారో అర్థం కావడం లేదు. మీతో సహా’’ అన్నాడతను. ‘‘ఓ అదా... మేం మీ బంధువులం, స్నేహితులం కాదు. మీ అమ్మగారి వల్ల సహాయం పొందినవాళ్లం. మాలో చాలామంది ఆమె చేతిముద్ద తిన్నాం. ఆ కృతజ్ఞతతోనే వచ్చాం.’’ అతడి మాట వినగానే మరింత ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి. తన తల్లి ఇంతమందికి సాయం చేసిందా! ఆమె ఎంతో మంచిదని తెలుసు. ఇంటికెవరొచ్చినా కడుపు నిండా భోజనం పెట్టేది. ఏదైనా మిగిలితే పడేయకుండా లేనివాళ్లకి పంచిపెట్టి వచ్చేది. ఏదో అలా చేస్తోంది అనుకున్నాంగానీ ఆమె ఇంత మందికి సాయం చేసిందా అని విస్మయం చెందాడు. ఆ క్షణమే నిర్ణయించుకున్నాడు... తన తల్లి మంచితనానికి తాను ప్రతినిధి కావాలని. ఆ నిర్ణయానికి ఫలితమే... విల్లింగ్ హార్ట్స. దాన్ని స్థాపించిన ఆ వ్యక్తి పేరు... టోనీ టే. ఆలోచన ఉద్యమమయ్యింది... టోనీ కుటుంబం సిరిగలదేమీ కాదు. కడుపు నింపుకోవడం కోసం కష్టపడి పని చేసుకున్నవాళ్లే. అందుకే అతడికి ఆకలి విలువ, అన్నం విలువ తెలుసు. దానికితోడు పోతూ పోతూ తల్లి నేర్పిన పాఠం అతడి ఆలోచనల్ని చాలా ప్రభావితం చేసింది. నాటి నుంచీ తనకున్నదాన్ని మరికొందరికి పంచడమే జీవితలక్ష్యంగా ఏర్పరచు కున్నాడు టోనీ. కానీ ఆ చిన్న చిన్న సాయాలు అతడికి తృప్తినివ్వలేదు. ఇంకా ఏదో చేయాలి. ఏం చేయాలా అని ఆలోచించాడు. అన్నం పెట్టడాన్ని ఓ పనిగా కాకుండా ఉద్యమంగా మలచాలని అనుకున్నాడు. ‘విల్లింగ్ హార్ట్స’ అనే సేవాసంస్థను స్థాపించాడు. ఆకలితో ఉన్నవారికి ఓ ముద్దపెట్టి కడుపు నింపుదాం రమ్మంటూ అందరినీ ఆహ్వానించాడు. మొదట ఎవ్వరూ అంతగా పట్టించు కోలేదు. కానీ టోనీ నిరుత్సాహపడలేదు. తన పని తాను చేసుకుపోయాడు. రోజూ సాయంత్రం మార్కెట్ యార్డులకు వెళ్లి, మిగిలిన కూరగాయలు తెచ్చుకునేవాడు. బేకరీలు, రెస్టారెంట్లకు వెళ్లి, మిగిలిపోయిన పిండి, నెయ్యి, డాల్డా, మాంసం ఏదైనా నాకు ఇచ్చేయండి అని అభ్యర్థించేవాడు. వాటిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని, ఉదయమే లేచి వంట మొదలెట్టేవాడు. పూర్తవగానే వండిన ఆహారాన్ని కొద్ది కొద్దిగా ప్యాక్ చేసుకుని బయలుదేరేవాడు. ఎక్కడ ఎవరు ఆకలితో ఉన్నారని తెలిసినా అక్కడికెళ్లి వాటిని పంచేవాడు. కొన్నాళ్లకు అతడి సేవ గురించి అంద రికీ తెలిసింది. ఒక్కొక్కరుగా వచ్చి అతడితో చేరారు. ప్రస్తుతం విల్లింగ్ హార్ట్సలో 200 మంది వాలంటీర్లు ఉన్నారు. వీళ్లలో రిటైరైనవాళ్లు, గృహిణులు, విద్యార్థులు... ఇలా చాలామంది ఉన్నారు. కూరగాయలు సేకరించడం దగ్గర్నుంచి పాత్రల్ని కడగడం వరకూ అందరూ అన్ని పనుల్నీ పంచుకుంటారు. అందరూ తప్పకుండా రావాలన్న నియమం ఉండదు. ఎవరు ఖాళీగా ఉంటే వాళ్లు వస్తారు. పనుల్లో పాలుపంచుకుంటారు. ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉంటే అందరికీ మెసేజిలిస్తాడు టోనీ. ఎవరికి వీలైతే వాళ్లు వచ్చి పని చేస్తారు. అది కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. అయితే ఇప్పుడు ఆహారాన్ని తీసుకెళ్లి పంచడం లేదు టోనీ. సింగపూర్ మొత్తంలో 23 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేశాడు. ఆకలిగొన్న వారంతా అక్కడికొచ్చి తినవచ్చని అందరికీ తెలిసేలా చేశాడు. ఉదయాన్నే వండిన ఆహారమంతా ఈ సెంటర్లకు తీసుకెళ్లిపోతారు. ఎవరు వచ్చినా ఉచితంగా భోజనం పెట్టి పంపిస్తారు. అలా రోజుకి మూడు వేల మంది కడుపుల్ని నింపు తున్నారు. ‘‘ఆకలి తీరిన తరువాత వారి కళ్లలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. దానికోసం ఎంత కష్టపడినా ఫర్వాలేదనిపిస్తుంది’’ అంటాడు టోనీ. మంచితనానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏముంటుంది! - సమీర నేలపూడి విశ్రమించడు... విసుగు చెందడు! అనుకున్నది సాధించడానికి పెద్ద కసరత్తే చేశాడు టోనీ టే. రెండు వందల మంది వాలంటీర్లను ఒక్కచోట చేర్చడమంటే మాటలు కాదు కదా! అయితే అంతమంది ఈ మహాయజ్ఞంలో పాలు పంచుకుంటున్నా, అందరూ అన్నీ అయ్యి చేస్తున్నా... ఇప్పటికీ తనవంతు పని తాను చేస్తూనే ఉంటాడు టోనీ. ఉదయం నాలుగింటికి లేచి పని మొదలు పెడతాడు. స్వయంగా కొన్ని వంటకాలు వండుతాడు. అన్ని పనులూ దగ్గరుండి పర్యవేక్షించు కుంటాడు. ఎప్పుడో అర్ధరాత్రి పడక మీదికి చేరతాడు. ఎంత కష్ట పడుతున్నా పెదవుల మీద చిరునవ్వు చెరగ నివ్వక పోవడమే అతడి ప్రత్యేకత! -
మహిళలే నిర్ణేతలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మహిళ.. ఆమె ఓ శక్తి. ఆదిపరాశక్తి. ఆమె కన్నెర్ర చేసిందంటే సమాజానికే వణుకు. కానీ ప్రేమ, ఆప్యాయతలను పంచడంలో, కుటుంబ పాలనలో ఆమె చూపించే ఓపిక వర్ణించలేనిది. పితృస్వామ్య సమాజంలో అనేక అవమానాలు, అణచివేతలకు గురవుతున్నా.. సంప్రదాయాలు, విలువలు విస్మరించకుండా నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యమవుతోంది మహిళాలోకం. కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాకుండా కుటుంబ అభివృద్ధిలో, పిల్లల ఆలనాపాలనలో మమేకమై సమాజాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో నిమగ్నమైన జిల్లా మహిళా లోకం రానున్న ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. అందుకే మహిళలు ఎటు మొగ్గు చూపితే జిల్లాలో వారే విజయం సాధించడం ఖాయం. నేతల రాతను మార్చి.. వారి భవిష్యత్తును నిర్దేశించే శక్తి జిల్లా మహిళా లోకానికి ఉంది. వైఎస్సార్ హయాంలో ఎంతో అభివృద్ధి జిల్లాలో మహిళల పరిస్థితి పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో అడపాదడపా దీపం పథకం కింద గ్యాస్కనెక్షన్లు ఇవ్వడం తప్ప పెద్దగా ఒరిగిందేమీలేదనే చెప్పాలి. స్వయంసహాయక సంఘాలను ఏర్పాటు చేశారే కానీ వారు పొదుపు చేసుకున్న మొత్తాన్నే తిరిగి వారికి రుణం కింద ఇచ్చేవారు. మహిళల రుణాలకు సంబంధించి బాబు హయాంలో ఏ ఒక్క ఏడాదిలో రూ.100 కోట్ల కన్నా ఎక్కువ ఖర్చు పెట్టలేదు. వైఎస్సార్ పాలన విషయానికి వస్తే స్వయం ఉపాధి కోసం డ్వాక్రారుణాలు, వృద్ధులు, వితంతు మహిళలకు పింఛన్లు, గ్యాస్‌సబ్సిడీ, పెద్ద చదువుల కలను సాకారం చేసేందుకు విద్యార్థినులకు ఉన్నత చదువులు, ఆర్థిక అభివృద్ధి ఉపకరించే ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు, వృద్ధాప్యంలో అసరాగా నిలిచే అభయ హస్తం లాంటి పథకాలు ఎన్నో అమలు చేశారు. బాలికా సంరక్షణ పథకం (జీసీపీఎస్) ద్వారా ఒక ఆడబిడ్డ జన్మిస్తే రూ.లక్ష, ఇద్దరు ఆడపిల్లలయితే రూ.30 వేల చొప్పున బీమా చేసిన ఘనత కూడా వైఎస్‌కే దక్కింది. ఇక, వైఎస్ చనిపోయిన తర్వాత ఈ పథకం కింద జిల్లాకు నిధులే మంజూరు కాలేదు. కొత్త లబ్ధిదారుల మాట అటుంచితే... పాత లబ్ధిదారుల బీమా ప్రీమియం చెల్లింపునకు కూడా కిరణ్ సర్కారు నిధులివ్వలేదు. ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని చెప్పిన వెఎస్ జిల్లా మహిళల కోసం రూ వేలకోట్లు ఖర్చు చేశారు. తాను అధికారంలోనికి వచ్చిన తర్వాత దాదాపు రూ.1000 కోట్ల రూపాయలు కేవలం మహిళలకు పావలా వడ్డీ రుణాల కిందే అందజేశారు. 2004లో తాను అధికారంలోనికి వచ్చిన ఏడాది జిల్లాకు డ్వాక్రారుణాల బడ్జెట్ 39 కోట్లుంటే దానిని రూ.290 కోట్లకు పెంచారు. వైఎస్ అధికారంలోనికి వచ్చేనాటికి జిల్లాలో ఉన్న స్వయంసహాయక సంఘాల సంఖ్య 12వేలుంటే ఆ సంఘాల సంఖ్యను 32వేలకు పెంచారు. ఇక జిల్లాలోని మహిళలు చైతన్యశీలురనే అభిప్రాయం ఉంది. పోరాటాల పురిటిగ డ్డగా పేరుగాంచిన మెతుకుసీమ జిల్లా వ్యాప్తంగా మహిళలు తమదైన రీతిలో రాణిస్తున్నారు. వంటింటికే పరిమితం కాకుండా కుటుంబ ఆర్థిక, సామాజిక హోదాను పెంచేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. రానున్న ఎన్నికలలో వీరు తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనూ మహిళలు కీలకపాత్ర పోషించారు. ఉద్యోగసంఘాలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో భాగస్వాములవుతూ, ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తెలియజేస్తూ తెలంగాణ కోసం కృషి చేశారు. ఇప్పుడు వీరి దృష్టంతా ‘నవ తెలంగాణ’పైనే ఉంది. ముఖ్యంగా మహిళల స్థితిగతులను సమూలంగా మార్చి వేసే నాయకత్వానికి పట్టం కట్టే ఆలోచనలో జిల్లా మహిళలు ఉన్నారు. ఓ అన్నగా, ఓ తండ్రిగా, ఓ తమ్ముడిగా అక్కున చేర్చుకుని ఆదరించే పాలకులను ఎన్నుకునేందుకు ఉవ్విళ్లూరుతున్న మహిళా లోకం ఎన్నికల్లో ఎవరికి పట్టం కడుతుందో వేచి చూడాల్సిందే. మారాణులూ... మీదే నిర్ణయం... మీదే భవిష్యత్తు. -
‘ఆమె’కు రక్షణేది?
విద్యార్థినులపై వేధింపులు.. యువతిపై యాసిడ్ దాడి.. ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. నాలుగేళ్ల బాలిక, వృద్ధురాలిపై లైంగిక దాడి.. ఇలా జిల్లాలో చోటు చేసుకుంటున్న సంఘటనలు మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. పుడమిపై పడినప్పటి నుంచి కాటికి వెళ్లే వరకూ ఆమె అనుక్షణం చస్తూ బతుకుతోంది. బతుకుతూ చస్తోంది. ఏ వైపు నుంచి ఎలాంటి ఆపద ముంచుకొస్తుందోనని అడుగు ముందుకు వేయలేక ముడుచుకుపోతోంది. అబల కాదు.. సబల అని అప్పుడప్పుడు గొంతెత్తుతున్నా.. ఆ స్వరం నొక్కేసే రక్కసులతో పోరాడలేక ఓడిపోతోంది. మానప్రాణాలను కాపాడుకోవడానికి శతధా ప్రయత్నిస్తోంది. ఆడపిల్లగా బతుకునిచ్చినా.. తనను బతకనివ్వడం లేదంటూ కన్నీళ్లు పెడుతోంది. తన ఇష్టాయిష్టాలకు తావు లేకుండా, తనపై మోజుపడ్డ వారిని ప్రేమించపోవడంతో వారి ఆగ్రహానికి గురై ప్రాణాలు కోల్పోతోంది. తనను ప్రేమించడం లేదంటూ జైపూర్ మండలం కానుకూరు గ్రామానికి చెందిన రవి ఇదే గ్రామానికి చెందిన విద్యార్థిని అనూషపై మంగళవారం రాత్రి కత్తితో దాడి చేసి హతమార్చిన సంఘటన మహిళలకు రక్షణ కరువైందన్న విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. -
అమ్మాయిలకంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు!
మగ ‘నిజాలు’ స్త్రీ కంటే పురుషుడు తక్కువగా మాట్లాడతాడు! స్త్రీ కంటే తక్కువసార్లు దువ్వెన వాడతాడు. ఎక్కువసార్లు కోపం తెచ్చుకుంటాడు కానీ గంటల లెక్కన చూస్తే, ఒక జీవిత కాలంలో స్త్రీ కంటే మగాడు కోపంగా ఉండే కాలం చాలా తక్కువ! స్త్రీ కంటే తక్కువ వస్త్రాలు కొంటాడు. ఒక డ్రెస్సును ఆమెకంటే ఎక్కువసార్లు ధరిస్తాడు! స్త్రీ-పురుషుల మధ్య ఎత్తులో ఉండే తారతమ్యం... మిగతా దేశాల కంటే రష్యాలో కాస్త తక్కువ! అత్యధిక దేశాల్లో సగటున మగాడు స్త్రీల కంటే తక్కువ కాలం బతుకుతాడు! అమ్మాయిల కంటే అబ్బాయిలే త్వరగా ప్రేమలో పడతారు! -
పాతబస్తీలో కొత్త వేకువ
కృషి జమీలానిషత్...పేరు వినే ఉంటారు. ‘హైదరాబాద్ పాతబస్తీ ఎప్పటికీ పాత సంప్రదాయాల్లోనే మగ్గిపోవాలా! ఇక్కడ కొత్తదనం రాకూడదా?’’ అనే ప్రశ్నతో మొదలైన ఆమె పోరాటం వల్ల ఎందరో ముస్లిం మహిళల జీవితాల్లో వెలుగు నిండింది. ‘అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి మీద పెళ్లి చేస్తే చూస్తూ ఊరుకోనం’టూ అడ్డువచ్చినవారిని ఇదెక్కడి న్యాయమంటూ కాలర్‌పట్టుకుని నిలదీసిన జమీలా ఇప్పుడు మరో కొత్తయజ్ఞం మొదలెట్టారు.‘ఓ మూడు సూత్రాలను పాటించి ముందడుగు వేయండంటూ ‘యంగ్ ఉమెన్’ పేరుతో వెయ్యిమంది పాతబస్తీ యువతులకు శిక్షణనిస్తున్నారు. ‘వీళ్లు మొన్నటివరకూ పాతబస్తీ మహిళలు. ఇప్పుడు పాతబస్తీలోని కొత్తమహిళలు’ అంటున్నారు జమీలా. ‘‘పాతబస్తీలో మహిళల పరిస్థితి నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉంది’’ అంటూ పన్నెండేళ్లక్రితం జమీలా బాధపడడం వెనక ఎన్నో కఠినమైన వాస్తవాలు ఉన్నాయి. కన్నబిడ్డలకు కడుపునిండా తిండిపెట్టుకోలేని అమ్మలు, విదేశాలకు అమ్ముడుపోతున్న అమ్మాయిలు...గొంతెత్తి ఇదీ మా దుస్థితి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో జమీలా స్థాపించిన ‘షాయిన్ ఉమెన్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్’ పాతబస్తీ మహిళలకు తోడుగా నిలిచింది. ఫలితంగా పరదాల చాటున కన్నీళ్లతో కలిసి బతుకుతున్న వందలాది పేద మహిళల జీవితాల్లో మార్పు వచ్చింది. ఆ మార్పుకి మెరుగులు దిద్దే క్రమంలో పుట్టిందే ‘యంగ్ ఉమెన్’ కార్యక్రమం. గత ఏడాది సెప్టెంబర్‌లో మొదలైన ఈ ప్రాజెక్ట్ ఆమె విజయాలజాబితాలో కొత్తగా వచ్చి చేరింది. ఈ తాజా విజయం వెనక ‘షాయిన్’ టీం కృషి చాలా ఉందంటారు జమీలా. ‘‘ఇప్పటి వరకూ అన్యాయం జరిగిన మహిళలకు న్యాయం చేయడానికి ప్రయత్నించాం. అసలు అన్యాయమే జరక్కుండా ఉండాలంటే...మార్పు ముందుగా మహిళల్లో రావాలి. అందుకే 15 నుంచి 25 ఏళ్ల వయసులోపున్న యువతులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలనుకున్నాం. వీరిలో చదువుకున్నవారు, చదువులేని వారు కూడా ఉంటారు. ముందుగా వీరిలో మూడు అంశాల్లో మార్పు రావాలి. ఒకటి చక్కటి పని చేయడం, రెండోది ఆర్థికంగా నిలబడడం, మూడోది ఆరోగ్యం. కౌన్సెలింగ్‌ల ద్వారా ఈ మూడింటిపై వారికి అవగాహన పెంచాం. కంప్యూటర్ ట్రైనింగ్, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్, మెహందీ వర్క్‌లకు సంబంధించి మూడు నెలలపాటు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు పెట్టాం. దీనికోసం హైదరాబాద్‌లోని సుల్తాన్షాయ్తో పాటు అమాన్ నగర్, సిద్దిత్నగర్, వాల్మీకినగర్, పటేల్‌నగర్, హసన్నగర్లలో సెంటర్లు స్థాపించాం. అక్కడ శిక్షణ తీసుకున్నవారు చాలామంది ఇంట్లో సొంతంగా పనిచేసుకోవడం మొదలుపెట్టారు. కొందరు బయటికి వెళ్లి పనిచేసుకుంటున్నారు’’ అని వివరించారు జమీలా. దారి దొరికింది... ఏదైనా పని చేసుకుని బతకాలంటే బస్తీ దాటి బయటికి వెళ్లాలి. గుమ్మం దాటడానికే అవకాశంలేని మహిళలు ఎప్పటికీ పేదరికంలోనే మగ్గిపోవాలన్నమాట. అలాంటివారికి ‘యంగ్ ఉమెన్’ వరంలా మారింది. సుమాన్ అనే మహిళ చెప్పే విషయాలు వింటే పాతబస్తీ పేదమహిళల బతుకుచిత్రం మన కళ్లముందుంటుంది. ‘‘నాకు నలుగురు పిల్లలు. నా భర్త ఆటో నడుపుతాడు. ఆయన సంపాదన మా కడుపునింపడానికే సరిపోదు. అదనంగా ఖర్చులు వస్తే నేనే కారణమంటూ కొట్టేవాడు. వెంటనే ఇక్కడికి వచ్చి ఏదైనా పని నేర్పించమని అడిగాను. టైలరింగ్, ఎంబ్రాయిడరీ నేర్చుకున్నాను. ఇప్పుడు నేను కూడా పనిచేసుకోవడం మొదలుపెట్టాక నాకు నా భర్తకు గొడవలు తగ్గాయి. పిల్లలకు కడుపునిండా తిండి పెట్టుకోగలుగుతున్నాం’’ అని చెప్పింది. ఒక సుమాన్ మాత్రమే కాదు...పదిహేనేళ్లకే పెళ్లయి పాతికేళ్లలోపు ఓ ఐదుగురు పిల్లలకు తల్లయిన బాల్యవివాహ బాధితులు కూడా ‘యంగ్ ఉమెన్’లో చేరారు. పాఠశాల రోజులనుంచే ముస్లిం మహిళల కష్టాలపై కవిత్వం రాసిన పుట్టి పెరిగింది సుల్తాన్షాయ్లోనే. ‘ఆడా మగా ఇద్దరూ సమానమే’ అన్న మాటను అంగీకరించేవరకూ తన పోరాటం ఆపనంటున్న జమీలా తలపెట్టిన ‘యంగ్ ఉమెన్’ మరిన్ని మహిళా విజయాలకు వేదిక కావాలని కోరుకుందాం. - భువనేశ్వరి తల్లిదండ్రులను ఒప్పించి: ‘‘వెయ్యిమంది యువతుల్ని ఒకచోటకి తెచ్చి అందరినీ ఓ మార్గంలో నడిపించడం చాలా కష్టమైన పని. పాతబస్తీలో మరీ కష్టం. ‘యంగ్ ఉమెన్’టీమ్ ఆరు నెలలపాటు ఇంటింటికీ తిరిగి అమ్మాయిలతో మాట్లాడి వారి తల్లిదండ్రులను ఒప్పించి వారికి శిక్షణ ఇప్పించింది. వీరికోసం ప్రత్యేకంగా ‘టెక్నికల్ అండ్ ఇండస్ట్రియల్ ఇన్స్టిట్యూట్’ని స్థాపించమని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అప్పుడు మా ఓల్డ్‌సిటీ నిజంగానే న్యూసిటీ అయిపోతుంది’’ - జమీలా నిషత్ -
సెప్టిక్ ట్యాంక్‌లోపడి ......
సెప్టిక్ ట్యాంక్‌లోపడి మహిళకు గాయాలు లబ్బీపేట, : సెప్టింక్ ట్యాంక్‌పై ఉన్న దిమ్మె విరిగి మహిళ ట్యాంక్‌లో పడిన సంఘటన గురువారం లబ్బీపేట ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో జరిగింది. ట్యాంక్ ఖాళీగా ఉండటంతో ప్రమాదం తప్పి స్వల్పగాయాలతో ఆమె బయటపడింది. ట్యాంక్‌పై ఉన్న దిమ్మె శిథిలమైందని ఎన్నిసార్లు అధికారులు చెప్పినా పట్టించుకోలేదని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే జి.బుచ్చయ్య పైడియ్యవీధి చివరలో బందరు కాలువ ఒడ్డున ఉన్న ఆర్ అండ్ బీ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. అతడి తల్లి గంగాభవానీ(54) ఆయన వద్దే ఉంటోంది. ఉదయం క్వార్టర్ వెనుక భాగంలో ఉన్న గులాబీలు కోసేందుకు సెప్టిక్ ట్యాంక్ దిమ్మెపై నుంచి వెళ్తుండగా అది ఒక్కసారిగా విరిగింది. దీంతో ఆమె ట్యాంకులో పడింది. అది ఆరడగుల లోతు ఉండటంతో ఆమెకు గాయాలయ్యాయి. ట్యాంకులో ఎటువంటి వ్యర్థాలు, నీరు లేక పోవడంతో ప్రాణాపాయం నుంచి బయట పడిందని స్థానికులు చెబుతున్నారు. ఆమెను 108లో ఓ కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరుతున్నాయని, మరమ్మతులు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కన్నపేగు కాఠిన్యం
బిడ్డలను వదిలించుకుంటున్న వైనం ఆర్థిక పరిస్థితి, ప్రేమలే కారణం మరోవైపు భార్యాభర్తల వివాదాలు దుర్వినియోగమవుతున్న దత్తత చట్టం అమ్మ.. రెండక్షరాల తియ్యని పదం. బిడ్డకు ఆది గురువు.. ఆమె స్థానం విశిష్టం.. ఆమె ప్రేమ అపూర్వం.. అలాంటి తల్లి ఒడిలో సేదతీరాలని చిన్నారులు కోరుకుంటారు. ఆధునిక పోకడలు పోతున్న ప్రస్తుత సమాజంలో కొందరు తల్లులు కడుపుతీపిని చంపుకొని కన్నపేగును తుంచేస్తున్నారు. చెట్టుకు కాయ భారం కాదన్న నానుడికి సరికొత్త నిర్వచనం చెబుతూ కన్నబిడ్డల్ని ఎలావదిలించుకోవాలా.. అని దారులు వెతుకుతున్నారు.. వారిని అనాథల్లా వదిలేసి చేతులు దులుపుకొంటున్నారు.. చివరికి పిల్లలకు కన్నీరు మిగులుస్తున్నారు. సాక్షి, విజయవాడ : ఆమె పేరు సుజాత (పేరు మార్చాం). 28 ఏళ్లు. ఇద్దరు పిల్లలు. పాప వయస్సు రెండేళ్లు. బాబు పది నెలల పసికందు. ఇటీవల ఆమె స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి వచ్చింది. తనను భర్త వదిలేశాడని.. ఇద్దరు పిల్లలను పోషించలేనని.. బాబును వదిలేస్తానని చెప్పింది. దీంతో సంబంధిత శాఖ అధికారులు విచారణ చేయిస్తున్నారు. ఆమె చెప్పినదాంట్లో ఎంత వాస్తవముందో పరిశీలిస్తున్నారు. హారతి, కిరణ్ భార్యాభర్తలు (పేర్లు మార్చాం). వీరికి రెండేళ్ల పాప ఉంది. వివిధ కారణాల వల్ల ఇద్దరి మధ్య తరచు ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో వారిద్దరూ పాపను వదిలించుకోవాలనుకున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సంప్రదించారు. వారి ప్రతిపాదనను అధికారులు అంగీకరించకుండా కౌన్సెలింగ్ చేసి పంపేశారు. సుహాసిని, రమేష్ (పేర్లు మార్చాం) ఇంజినీరింగ్ చదివారు. ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కాకముందే వారికో మగ శిశువు జన్మించాడు. ఏం చేయాలో అర్థంకాక స్త్రీ, శిశు సంక్షేమ శాఖను సంప్రదించి బాబును వదిలించుకుంటామన్నారు. దానికి సంబంధిత అధికారులు అంగీకరించారు. బాబును తీసుకోకపోతే ఎక్కడో ఒకచోట వదిలేసే ప్రమాదముందని గమనించి బిడ్డను తీసుకున్నట్లు అధికారులు వివరించారు. వసంత (పేరు మార్చాం) సెక్స్‌వర్కర్. ఆమెకో పాప ఉంది. తన వృత్తికి అడ్డంకిగా ఉండడమే కాకుండా పోషించలేని పరిస్థితి ఎదురవుతోందని ఆమె పాపను వదిలించుకుంది. కన్నప్రేమ ముందు ఏ ప్రేమా ఎక్కువ కాదు. కానీ కన్నపేగు కాఠిన్యం ప్రదర్శిస్తోందనడానికి పై ఉదాహరణలే నిదర్శనం. ఎంత కష్టం వచ్చినా బిడ్డకోసం తపనపడేవారిని మనం చూస్తుంటాం. సమస్యలను లోలోనే దిగమింగి పేగుతెంచుకుని పుట్టినవారి కోసం జీవితాలను అర్పిస్తున్న వారెందరో ఉన్నారు. ఒకపూట పస్తులుండి కూడా కొన్ని కుటుంబాలు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వారిని ప్రయోజకుల్ని చేస్తున్న పరిస్థితినీ చూస్తున్నాం. కానీ ఆధునిక జీవన పద్ధతులు మనిషిని కలుషితం చేస్తున్నాయి. కన్న బిడ్డలను వదిలించుకోడానికి సిద్ధమయ్యేవారు రోజురోజుకూ పెరుగుతున్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వద్దకు నెలకు సరాసరి 60 నుంచి 70 మంది వరకు తమ పిల్లలను వదిలించుకునేందుకు వస్తున్నారంటే ఆశ్చర్యం కలుగకమానదు. తాము పోషించలేమని కొందరు, భర్త వదిలేశాడు కాబట్టి బిడ్డనూ వదిలించుకుంటానని ఇంకొందరు, ప్రేమమైకంలో పెళ్లికాకముందే జన్మనిచ్చి బిడ్డను వదిలించుకునేవారు మరికొందరు, తమకు స్వేచ్ఛలేదని భావించి కొందరు.. అనేక కారణాలతో తల్లులు పాపానికి ఒడిగడుతున్నారు. పిల్లలను ఇలా వదిలించుకునే సందర్భంలో.. వారి విన్నపాన్ని అంగీకరించకుంటే బిడ్డలను ఎక్కడ చంపేస్తారోనని భయపడి అధికారులు కొన్ని కేసుల్లో రాజీపడుతున్నారు.శిశు గృహా లకు తరలిస్తున్నారు. దత్తత అడిగేవారికి ఇస్తున్నారు. ఇలా తల్లిదండ్రులు వదిలించుకున్న పిల్లల్లో కొందరు శిశుగృహాల్లోనే అనాథలుగా చనిపోతుండడం అత్యంత బాధాకరం. పిల్లలు లేనివారికి దత్తత... ఎంత కష్టమొచ్చినా, భర్త విడిచిపెట్టినా పిల్లలను వదిలించుకోవడం సమంజసం కాదని ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ కృష్ణకుమారి, శిశు సంరక్షణ అధికారిణి రమ చెబుతున్నారు. తమ వద్దకు వచ్చే వారికి ఇదే చెబుతున్నామంటున్నారు. ఇలాంటి తల్లిదండ్రులు ఆధునిక సమాజంలో పెరిగిపోతుండటం బాధాకరమన్నారు. తల్లిదండ్రులు లేని పిల్లలు, ఎక్కడో పారేసిన బిడ్డలు, అనారోగ్యం, ఇతరత్రా అత్యంత దీనస్థితిలో తల్లిదండ్రులుంటే.. వారి పిల్లలను శిశుగృహాల్లో ఉంచుతామన్నారు. తర్వాత వారిని పిల్లలు లేనివారికి దత్తత ఇస్తామని చెప్పారు. అయితే కొందరి విన్నపాన్ని అంగీకరించకుంటే పిల్లలను ఎక్కడ వదిలేస్తారోనని భయపడి శిశుగృహాల్లో ఉంచుతున్నట్లు ఆమె వెల్లడించారు. 2006లో వచ్చిన సెంట్రల్ ఎడాప్షన్ రిసోర్సెస్ అథారిటీ (సీఏఆర్ఏ-కార్) మార్గదర్శకాల ప్రకారం దత్తతను అత్యంత పకడ్బందీగా అమలుచేస్తున్నామని చెప్పారు. పిల్లలకు పూర్తి రక్షణ కల్పించడంలో ఇది తోడ్పడుతోంది. కొందరు దీన్ని దుర్వినియోగం చేస్తూ పిల్లలను వదిలించుకోవడం ఆధునిక సమాజంలో వింత పోకడేనని అభిప్రాయపడుతున్నారు. -
అమ్మ రాగాలపట్టి
అనంతరం ఆడపిల్లలు తల్లిని అనుకరిస్తారని అంటారు. అది నిజమే అనిపిస్తుంది ఈ అమ్మాయిని చూస్తే. తల్లిలాగే అందంగా ఉంటుంది. తన తల్లి స్టయిల్ని ఫాలో అవుతుంది. తల్లిలాగే నడుస్తుంది. తల్లిలాగే నవ్వుతుంది. అన్నింట్లోనూ తల్లిని ప్రతిబింబిస్తుంది. అమ్మ నోట్లోనుంచి ఊడిపడిందా అన్నట్టుండే ఆ పదిహేడేళ్ల పడుచుపిల్ల... లార్డెస్ మారియా. పాప్ సంచలనం మడొన్నా ముద్దుల కూతురు! డిసెంబర్, 2013, అమెరికా. మన్‌హట్టన్‌లోని ఆర్ట్స్ స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతోంది. సడెన్‌గా స్టేజిమీద ఓ పదిహేడేళ్ల అమ్మాయి ప్రత్యక్షమయ్యింది. ఎర్రటి చుక్కలున్న నల్లటి గౌనులో అప్సరసలా మెరిసిపోతోంది. కొన్ని క్షణాల తరువాత ఆమె గళం విప్పింది. చిన్న అలలా మొదలైన ఆ గాన ప్రవాహం సునామీలా ఆడియెన్స్‌ని చుట్టేసింది. అందరూ ‘లోలా... లోలా’ అంటూ ఒకటే అరుపులు. పాట ఆగింది. ఆమె ఆడియెన్స్‌లో ఉన్న తన తల్లిని చూసి చిన్నగా నవ్వింది. ఆ తల్లి కళ్లలో నుంచి ఆనందబాష్పాలు రాలిపడ్డాయి. వాటిని తుడుచుకుంటూ మనసులోనే అనుకుంది, ‘‘అయామ్ ప్రౌడాఫ్ యూ డియర్’’! మరుసటి రోజు అన్ని పేపర్లనిండా ఆ అమ్మాయి ఫొటోనే. అందరి నోటా ఆమె గురించిన మాటలే. ఆమాత్రం హడావుడి ఉండదా... ఆమె మడొన్నా కూతురైనప్పుడు! కొన్ని దశాబ్దాలుగా తన గానామృతంతో కోట్లాదిమందిని ఓలలా డిస్తోన్న ప్రపంచ ప్రఖ్యాత పాప్ గాయని మడొన్నా... తన కూతుర్ని జూనియర్ మడొన్నా అని అంతా అంటుంటే మురిసిపోయింది. అమె అంటుంది... ‘‘నేను నా పిల్లల కోసమే బతుకుతున్నాను. వాళ్లు నన్ను మించిపోయారు అంటే నా జీవితానికి ఓ అర్థం చేకూరినట్టే’’ అని. ఆ భారమైన మాట వెనుక ఒంటరిగా నలుగురు పిల్లల్ని పెంచిన కష్టం ఉంది. అందరూ మడొన్నాను ఫ్రీగా ఉంటుంది అంటారు. ఆ మాటకు అర్థం, ఆమె బాంధవ్యాలను త్వరగా తెంచేసుకుంటుంది అని. అయినా ఆమె లెక్క చేయదు. తన జీవితంలోకి వచ్చి వెళ్లిపోయిన మగాళ్ల గురించి ఎవరికో సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదని ఆమె అనుకుంటుంది. అదృష్టంకొద్దీ... ఆ సంజాయిషీని ఆమె పిల్లలు కూడా కోరరు. రెండు సార్లు పెళ్లి చేసుకుంది మడొన్నా. ఆ రెండు పెళ్లిళ్లకి మధ్యలో కార్లోస్ లియోన్ అనే ఫిట్నెస్ ట్రెయినర్‌తో ప్రేమలో పడి, లార్డెస్కి జన్మనిచ్చింది. తర్వాత మరొకరిని పెళ్లాడి ‘రాకో’కి తల్లయ్యింది. అయితే, పిల్లలకు ఊహ తెలిసేనాటికి వారి తండ్రులు మడొన్నా జీవితంలో లేదు. ఆ వాస్తవాన్ని వారు గ్రహించేసరికి వారి చుట్టూ తన ప్రేమబంధాన్ని అల్లేసిందామె. ఎంతమంది బిడ్డలున్నా ప్రేమను పంచగల విశాలమైన అమ్మ మనసు ఉంది మడొన్నాకి. అందుకే మెర్సీ జేమ్స్‌ని, డేవిడ్ బాండాని దత్తత చేసుకుంది. తన సొంత పిల్లలతో సమానంగా పెంచింది. ఆమె ఎంత గొప్ప అమ్మ అంటే... ఓ దశలో పిల్లలను జాగ్రత్తగా పెంచడం కోసం తన కెరీర్‌ని పక్కన పెడదామా అని కూడా ఆలోచించింది. తల్లి వ్యక్తిత్వం ఏంటో తెలిసిన ఆ పిల్లలను ఏ లోటు బాధిస్తుంది? ఏ వెలితి వేదనకు గురిచేస్తుంది? అందుకే లోలా (లార్డెస్ ముద్దు పేరు) అంటుంది... ‘‘నాకు అమ్మ వ్యక్తిత్వమంటే ఇష్టం. తన మార్గంలో నడవడం ఇష్టం. నా దృష్టిలో ఆమె ప్రపంచంలోనే బెస్ట్ మదర్’’ అని. తల్లిలా తనూ పాప్ సింగర్ కావాలనుకుంటోంది లార్డెస్. ఇప్పటికే స్వరాలతో చెలిమి చేస్తోంది. రాగాల వెంట పరుగులు తీస్తోంది. బహుశా ఆమె పయనం ఇలాగే కొనసాగితే... త్వరోలోనే మరో మడొన్నా ప్రపంచానికి దొరుకుతుంది! -
మహిళను కిడ్నాప్ చేయబోయిన ఆటోడ్రైవర్
-
టెన్ కమాండ్మెంట్స్
మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. నిన్ను నువ్వు నమ్ము: ఎవరినో నమ్ముతాం. వాళ్లు మనకోసం ఏదో చేస్తారని ఆశపడతాం. చేయకపోతే దిగులుపడతాం. అసలు ముందు నిన్ను నువ్వు నమ్మితే, ఎవరిమీదా ఆధారపడాల్సిన అవసరమే ఉండదు. ఊహల్లో తేలవద్దు: ఊహలు అవకాశాలను చంపేస్తాయని మీకు తెలుసా? అలా చేయాలి, ఇలా చేయాలి అని ఆలోచిస్తూ ఉండగానే సమయం గడిచిపోతుంది. కాబట్టి ఊహల్లో తేలడం మాని, అవకాశాలను వెతకండి. మనసు మాట వినండి: చేసేది తప్పనిపించినప్పుడు తప్పుకోవడం ఎంత అవసరమో, సరైన దారిలో వెళ్తున్నప్పుడు ఎవరో చెప్పారనో, ఏమైనా అంటారేమోననో వెనకడుగు వేయకుండా ఉండటం అంతే అవసరమని గుర్తు పెట్టుకోండి. కొన్నింటిని మరవాలి: మీలో చాలా ప్రతిభ ఉంటుంది. ఏదైనా చేయగలిగే శక్తి ఉంటుంది. కానీ అది గుర్తించరు. నాకు చాలా కష్టాలు ఉన్నాయి అని గుర్తు తెచ్చుకుని పదే పదే బాధపడుతుంటారు. వద్దు. వాటిని మర్చిపోండి. ఆవేదన దేనికీ పరిష్కారం కాదు. అది మనల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు. ఉన్నతంగా ఆలోచించండి: మీ చూపు ఎప్పుడూ పైకే ఉండాలి. ఎలా ఎదగాలి, ఎక్కడి వరకూ వెళ్లాలి, ఏం సాధించాలి అన్నది తప్ప మరో ఆలోచన వద్దు. ఇంతకంటే చేయలేమేమో అన్న ఆలోచనే వద్దసలు. ఇతరులకు చాన్స్ ఇవ్వకండి: మనం చేసే ప్రతి పనిలోనూ తలదూర్చేందుకు, మనకు సలహాలిచ్చేందుకు బోలెడంతమంది సిద్ధంగా ఉంటారు. మనకు వాళ్ల సలహాలు అవసరం లేదనుకున్నప్పుడు మెల్లగా వాళ్లను అవాయిడ్ చేయండి. లేదంటే వాళ్లు మన లక్ష్యాల మీద పెద్ద ప్రభావమే చూపిస్తారు. మనసును తెరవండి: మీ ఆలోచనలను లోపలే అణచేసుకోకండి. ఒక పని మీద కానీ, ఒక వ్యక్తి మీద కానీ, ఒక లక్ష్యం మీద కానీ... మీకేదైనా అభిప్రాయం ఉంటే ఓపెన్‌గా చెప్పండి. అందరికీ అది నచ్చాలని లేదు. కానీ ఎందరికి నచ్చుతోందో తెలిస్తే మీ ఆలోచనా విధానం ఎలా ఉందో మీకు తెలుస్తుంది. లేదంటే మనం మరుగున అయినా పడిపోతాం, మరొకరికి మనల్ని దాటేసే అవకాశమైనా ఇచ్చేస్తాం. బ్రేకులు వేయొద్దు: ఏదో చేసెయ్యాలనుకుంటారు. ఎక్కడో ఏదో అడ్డు తగులుతుంది. వెంటనే అనుకున్నదాన్ని వదిలేసి వేరే వైపు దృష్టి మళ్లించేస్తారు. ఇది కూడదు. ఒక్కసారి ఏదైనా చేయాలనుకుంటే చేశాకే వదిలిపెట్టండి. నో చెప్పి తీరాలి: నచ్చినదానికి ఎస్ చెప్పినట్టు, నచ్చనిదానికి నో చెప్పడం కూడా అవసరం. పని చేసేచోట మనలను ఇబ్బందిపెడుతున్నా, ఎందులోనైనా ఇరికించే ప్రయత్నం చేస్తున్నా, మనది కానిదాన్ని మనమీద రుద్దుతున్నా నో అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే మిమ్మల్ని పిరికివారిగానో, భయస్థులగానో చూస్తారు. రిస్క్ తీసుకోండి: ఎప్పుడూ సేఫ్ జోన్లోనే ఉండలేం. ఉండాలని కోరుకోకూడదు కూడా. ఏదైనా చేయాలని అనిపించినప్పుడు... కష్టనష్టాలను తలచుకుని భయపడకండి. కాస్త కష్టమైనా పర్లేదు ప్రయత్నిద్దామని అనుకోండి. ప్రయత్నం ఎప్పుడూ వృథా కాదు. కష్టం ఎప్పుడూ ఓడిపోనివ్వదు. అది మర్చిపోకండి! -
బాలిక కిడ్నాప్.. లైంగికదాడి
చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: అతివపై అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు బాలికను కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడ్ని శాలిబండ పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. శాలిబండ కాజీపురా ప్రాంతానికి చెందిన సులేమాన్ బిన్ హసన్ మిశ్రీ (28) స్థానికంగా ఉండే బాలిక (16)పై కన్నేశాడు. ఈ నెల 15న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను కిడ్నాప్ చేసి నాంపల్లిలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఆమెపై మూడ్రోజుల పాటు లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ నెల 18న బాలికను ఫలక్‌నుమాలో ఉండే తన సోదరుడి ఇంటికి తీసుకువచ్చాడు. మరోవైపు, తమ కుమార్తె కనిపించడం లేదని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. 19న సాయంత్రం మిశ్రీ బాలికను మరో ప్రాంతానికి తీసుకెళ్తున్నాడని విశ్వసనీయ సమాచారం అందడంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్లు వివరించాడు. అతనిపై కిడ్నాప్, లైంగికదాడి కేసులతో పాటు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం రిమాండ్‌కు తరలించారు. తాత్కాలిక కార్మికులను క్రమబద్ధీకరించాలి: హరీష్‌రావు సాక్షి, సిటీబ్యూరో: జలమండలిలో ఎన్ఎంఆర్, హెచ్.ఆర్ తాత్కాలిక కార్మికులుగా పని చేస్తున్న 470 మంది విధులను క్రమబద్ధీకరించాలని గుర్తింపు కార్మిక సంఘం కామ్‌గార్ యూని యన్ గౌరవ అధ్యక్షుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు జలమండలి ఎండీ శ్యామలరావును కోరారు. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీపావళి పర్వదినానికి ముందే కార్మికుల విధులను క్రమబద్ధీకరించాలని, ఉద్యోగులకు పండగ కానుకగా మంచి బహుమతులు అందజేయాలని కోరారు. -
దారిలో పూసిన జాబిలి
ఆజన్మం సముద్రమంటూ ఉన్నాక తుఫాను రాకుండా ఉండదు; బస్సంటూ ఎక్కాక కుదుపులు లేకుండా ఉండవు. వీటికితోడు బనీను ధరించే అలవాటులేని వెచ్చని చెమట శరీరాల రాపిడి కలిగించే జుగుప్స! అయినా నేను బస్సును ద్వేషించలేను. కారణం: జుట్టునుంచి రబ్బర్ బ్యాండ్ తీసి, ఎడమ మణికట్టుకు వేసుకుని, రెండు చేతుల చూపుడువేళ్లను సుతారంగా చెవుల మీదుగా నడిపించి, వదులైన పొట్టిజుట్టుకు తిరిగి బ్యాండ్ బిగిస్తుంది తెల్ల కమీజ్ అమ్మాయి. కురులు సవరించుకోవడానికి వీలుగా నడుమును ముందుకు వంచినప్పడు వెన్నురేఖ తళుక్కుమంటుంది! బస్సుల్లో ప్రయాణించకపోయివుంటే వీపులో ఉన్న సౌందర్యం నాకు ఎప్పటికీ తెలిసివుండేది కాదు. ఆ పై-కుడివైపు, షోల్డర్ బ్లేడ్పైన పడే నొక్కును చూడగానే నేను అందంగా పోగేసిన వేల అక్షరాలన్నీ సిగ్గుతో బస్సు దూకేస్తాయి. అమ్మాయిగా ఉంటే చాలు కదా! ఆమె ప్రత్యేకంగా ఏమీ చేయనక్కర్లేదు. ‘తాజ్‌మహల్’ నిర్వర్తించాల్సిన కర్తవ్యం అంటూ ఒకటి ఉంటుందా? నేను చార్మినార్‌ను చూళ్లేదే! వైజాగ్ బీచ్‌లో నడవలేదే!! అని బెంగపడాల్సిన పనివుంటుందా? ఎవరో అన్నట్టు ఆమే ఒక కవిత! అయితే, అప్పుడప్పుడూ శుష్కవచనంగా, వ్యాకరణంగా, రాజకీయవ్యాసంగా ఆమె మారిపోవడం ఒక దిగ్భ్రమ. కేవలం అంకెలను కూర్చిన వివరణ పట్టికలా కనబడటం మరీ విషాదం. ఉబ్బు చారల పొత్తికడుపు ఇంకో కఠిన వాస్తవం. అయితే, ‘స్త్రీ’ అనుకోగానే మనకు రకరకాల సందర్భాల్లో తారసపడిన వంద ముఖాలు వేగంగా దొర్లిపోవచ్చు. కానీ ఊహల్లో ఒక విజువల్ బలంగా ఉంటుంది. ఆమె లలితమైంది. అలాగని లాలిత్యం ఒక్కటే కాదు, ఇంకా ఏదో కూడా! సరిగ్గా చెప్పాలంటే ‘ఈమె’లా ఉంటుంది. గడ్డం గీసుకోవాలన్న ఉబలాటమేతప్ప, మొలకల ఆనవాళ్లు కూడా లేని రోజుల్లో నాగార్జునసాగర్ పడవ విహారంలో చూశానామెను. గృహిణి. చక్కటి అనేది నిజంగా చక్కటి మాటే అనుకుంటే, ఆమె చక్కగా ఉంది. చాలా కాలం ఆమె నా ఆదర్శ స్త్రీగా ఉండేది. నేను రాయని నవలల్లో నాయికలాగా ఉండేది. హుందాగా ఉంది; నవ్వుముఖం; ఎత్తూ కాదు పొట్టీ కాదు; అతిగా లేదు మితంగా లేదు; ఒక సమతూకం, ఒక పర్ఫెక్షన్ ఏదో ఉంది. ఆమె ఒక నిర్మాణం! ఇంకా ఈమెకు నేనుగా జతచేసిన గుణాలు ఏమంటే, పద్ధతిగా ఆలోచిస్తుంది, పద్ధతిగా నడుచుకుంటుంది. యండమూరి నవలల్లోని నాయికల తాలూకు సానుకూల లక్షణాలను కూడా ఆపాదించేవాణ్ని. ఇక ఆమెను లేదా ఆమెకు ప్రతిరూపం లాంటి స్త్రీని నా కాబోయే భార్యగా ఊహించుకునేవాణ్ని. అయితే ఈమెతో సమస్య ఏమిటంటే: ఇద్దరమూ ఎన్నో కబుర్లు చెప్పుకునేవాళ్లం. ఎన్నింటిలోనో ఆమె నాకు సలహా ఇస్తుండేది. ఒక ఉత్తేజకరమైన సామీప్యాన్ని ఇవ్వగలిగేది. కానీ ఎంతసేపటికీ మలి అంకపు రొమాన్సులోకి మనసు పోయేది కాదు. పాపభీతి కలిగేది. ఇంతటి ఆదర్శ మహిళ తుచ్చమైన శరీరోద్రేకానికి లొంగిపోవడాన్ని సహించేవాణ్ని కాదు. ఆమె ఎక్స్పోజ్ అవడాన్ని ఇష్టపడేవాణ్ని కాదు. ఆమె చుట్టూ ఏదో ఒక పవిత్రాగ్ని మండినట్టుగా ఉండేది. తెల్లటి వస్త్రం మీద మసి పూస్తున్నానేమో అనిపించేది. ఏదో స్పష్టంగా చెప్పలేనితనం అడ్డు తగిలేది. అందుకే ఆమెకు నా పగటి కలల్లోనే తప్ప, రాత్రి కలల్లో చోటు లేకపోయింది నిజానికి ఇప్పుడామె నాకు శూన్యం. ఆమె చుట్టూ ఉండిన వెన్నెలనే తప్ప, ఆమె ముఖాన్ని సంపూర్ణంగా చిత్రించుకోలేనంతగా మరపులో పడిపోయాను. గతాన్ని తవ్వుతుంటే మనసుకు తగలడం వల్లగానీ లేదంటే ఈమె కొన్నేళ్లు నా జీవితంలో అంత స్థలం ఆక్రమించుకుందని గుర్తేలేదు. చిత్రంగా ఇది ఆమెకు కూడా తెలిసే అవకాశం లేదు. ప్రతిదాన్నీ లెక్కప్రకారం, పద్ధతిగా ఆలోచించేవాళ్లు దాంపత్య కార్యంలో ఎలా పాల్గొంటారు? అది అన్ని తర్కాల్నీ ధ్వంసం చేస్తుందికదా! పరమ పవిత్రతా ఇందులోనే ఉంది; అత్యంత అగౌరవమూ దానితోనే ముడిపడి ఉంది. ఒక పెచ్చు ఎక్కడో ఊడిపోయినట్టుగా ఉంటేనే తప్ప ఒక మిరుమిట్లుగొలిపే నిర్మాణాన్ని సమీపించలేమేమో! ‘తాజ్‌మహల్’ నిర్వర్తించాల్సిన కర్తవ్యం అంటూ ఒకటి ఉంటుందా? నేను చార్మినార్‌ను చూళ్లేదే! వైజాగ్ బీచ్‌లో నడవలేదే!! అని బెంగపడాల్సిన పనివుంటుందా? - పూడూరి రాజిరెడ్డి -
పురుడు పోసిన ఆర్టీసీ
అప్పటివరకు ఆ బస్సులో ప్రయాణికులంతా తమ గమ్యాలకు ఎప్పుడు చేరుతామా.. అనుకుంటూ ప్రయాసపడుతున్నారు. ఒక్కసారిగా బస్సు ఆపాలంటూ ప్రయాణికుల్లో కూర్చున్న ఓ మహిళ ఆర్తనాదం వినిపించింది. అంతే.. డ్రైవర్ బస్సును పక్కకు తీశాడు. ఏం జరిగిందని తెలుసుకునేలోపే ‘కేర్’ మంటూ చంటిపాప ఏడుపు వినిపించింది. కూర్చున్న సీట్లోనే మహిళ పండంటి పాపను ప్రసవించింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చే ఆర్టీసీ బస్సు ప్రసవానికి పాన్పుగా మారింది. ఎల్కతుర్తి, న్యూస్‌లైన్ : వరంగల్ జిల్లా చిట్యాల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన గంధం లత నిండుచూలాలు. పురుడు కోసం తల్లిగారి ఊరైన వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం దుబ్యాల గ్రామానికి వెళ్లింది. అక్కడే రాఖీ పండగను జరుపుకుంది. వైద్యులు ఆదివారం ప్రసవానికి తేదీ ఇచ్చారు. శనివారం ఉదయం నుంచి లతకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. తల్లిని తోడుగా తీసుకుని బస్సులో హన్మకొండలోని మిషన్ ఆసుపత్రికి బయల్దేరింది. దగ్గరిదారిలో మొగుళ్లపల్లి నుంచి జమ్మికుంట, హుజూరాబాద్ మీదుగా వెళ్తుండగా బస్సు ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే లతకు నొప్పులు ఎక్కువయ్యాయి. భరించలేక ఆమె కేకలు వేయడంతో డ్రైవర్ గాండ్ల శ్రీనివాస్ బస్సును ఎల్కతుర్తిలో నిలిపివేశాడు. విషయం తెలుసుకున్న ప్రయాణికులంతా బస్సు దిగారు. ఆ మరుక్షణమే లత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కెవ్వున కేకలు వినిపించడంతో ప్రయాణికుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ సమయంలో బస్సులో ప్రసవాలు చేసిన అనుభవజ్ఞులు లేకపోవడంతో బొడ్డు కొయ్యని పాప, తల్లి పరిస్థితి ఎలా ఉంటుందోనని డ్రైవర్ శ్రీనివాస్ అప్రమత్తమై వారిని బస్సులోనే వేగంగా హన్మకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. అక్కడ తల్లీబిడ్డలను పరీక్షించిన వైద్యులు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, బిడ్డ రెండున్నర కిలోలు ఉందని తెలిపారు. తల్లీబిడ్డలకు ఎలాంటి అపాయం లేదని తెలిసి డ్రైవర్ శ్రీనివాస్ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నాడు. అప్రమత్తంగా వ్యవహరించి తల్లీబిడ్డలను ఆసుపత్రికి చేర్చిన బస్సు డ్రైవర్‌కు లత తండ్రి గంధం శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన డ్రైవర్‌ను ప్రయాణికులు సైతం అభినందించారు.