ఓ యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని ఆమె బంధువులు పోలీస్స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆదిలాబాద్: ఓ యువతిపై ఏఎస్సై చేయి చేసుకున్నారని ఆమె బంధువులు పోలీస్స్టేషన్ ముందు ధర్నాకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా రామక్రిష్ణాపురం పట్ణణ పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది.
ఓ బ్యూటీపార్లర్‌లోని వస్తువులు దొంగిలించిందనే నెపంతో లావణ్య (23) అనే యువతిని ఏఎస్సై రామయ్య విచారణ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు. విచారణ చేస్తున్న సమయంలో ఏఎస్సై తనను కర్రతో కొట్టారని యువతి చెప్పుతుంది. దీంతో ఆమె బంధువులతో కలిసి స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగింది.