బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో ఆశ వర్కర్ల అరెస్టు | Asha workers arrest | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి రైల్వేస్టేషన్‌లో ఆశ వర్కర్ల అరెస్టు

Published Thu, Oct 8 2015 5:17 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Asha workers arrest

ఆదిలాబాద్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆశా వర్కర్లపై పోలీసులు దాడి చేశారు. తమ సమస్యల సాధనకోసం ఇచ్చిన చలో హైదరాబాద్ పిలుపు లో భాగంగా గురువారం సాయంత్రం బెల్లంపల్లి రైల్వే ష్టేషన్ నుండి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించిన 300  మంది ఆశా కార్యకర్తలపై పోలీసులు దాడి చేశారు.

పోలీసులను చూసి బెదిరిపోయిన వర్కర్లను వెంటాడి.. పిడిగుద్దులు గుద్దుతూ.. రైలు ఎక్కకుండా అడ్డుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణ ఎక్స్ ప్రెస్ ఫ్లాట్ ఫారమ్ పైకి రావడంతో.. కొంత మంది బోగీల్లోకి ఎక్కారు. ఈ గందర గోళంలో రైలు 20 నిమిషాల పాటు ఆగిపోయింది. బోగీల్లోకి ఎక్కిన వారిని సైతం బలవంతంగా రైలు దించేశారు. పోలీసుల దాడికి నిరసనగా.. ఆశ వర్కర్లు స్టేషన్ లోని ఆర్ పీ ఎఫ్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement