కోటపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆశావర్కర్లు పొర్లుదండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు.
కోటపల్లి మండల కేంద్రంలో బుధవారం ఆశావర్కర్లు పొర్లుదండాలతో వినూత్నంగా నిరసన తెలిపారు. నెలరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా పట్టించుకోకపోవడంతో రోజుకొక రకంగా సమ్మె చేస్తూ నిరసన తెలుపుతున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని నెలరోజులుగా ఆశావర్కర్లు సమ్మె చేస్తున్న సంగతి తెల్సిందే.