తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు.
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ15 వేలు చెల్లించాలని ఖమ్మం జిల్లా ఆశ్వారావు పేట మండల కేంద్రంలోని రింగురోడ్డు వద్ద రాస్తారోకో కు దిగారు.
మరో వైపు ఆదిలాబాద్ జిల్లా లక్సిట్‌పేట్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు.