Pending issues
-
ప్రజలందరికీ సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
న్యూఢిల్లీ: సమాజంలో అన్ని వర్గాలకు ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు అంకితభావంతో కృషి చేస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రైల్వేలకు సంబంధించి సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతున్నాయని తెలిపారు. ప్రజలందరికీ మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి వచ్చేదాకా ఈ పరుగు ఆగదని స్పష్టంచేశారు. మూడు నూతన వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఇవి మీరట్–లక్నో, మధురై–బెంగళూరు, చెన్నై–నాగర్కోయిల మధ్య రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ రైళ్ల ఆధునీకరణ, విస్తరణ ద్వారా ‘వికసిత్ భారత్’ అనే లక్ష్య సాధన దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతి ఒక్కరికీ సౌకర్యవంతమైన ప్రయాణానికి ఇండియన్ రైల్వే ఒక గ్యారంటీగా మారాలన్నదే తమ ధ్యేయమని, అది నేరవేరేదాకా తమ కృషి ఆగదని స్పష్టంచేశారు. భారత రైల్వే శాఖ సాగిస్తున్న అభివృద్ధి ప్రయాణం తమ ప్రభుత్వ అంకితభావానికి ఒక ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. వికసిత్ భారత్ దార్శనికతకు ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలు ఒక బలమైన మూలస్తంభమని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రైల్వేశాఖకు రూ.2.5 లక్షల కోట్లకుపైగా కేటాయించినట్లు గుర్తుచేశారు. మన రైల్వే వ్యవస్థ రూపురేఖలు మార్చేస్తున్నామని, హై–టెక్ సేవలతో అనుసంధానిస్తున్నామని వివరించారు. దక్షిణాది అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ‘అభివృద్ధి చెందిన భారత్’ అనే మన ఆశయ సాధనకు దక్షిణాది రాష్ట్రాల వేగవంతమైన ప్రగతి చాలా కీలకమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దక్షిణాదిన నిపుణులకు, వనరులకు, అవకాశాలకు కొదవ లేదని చెప్పారు. సౌత్ ఇండియా అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక సహా దక్షిణాది రాష్ట్రాల్లో రైళ్ల సంఖ్యను పెంచడానికి బడ్జెట్ కేటాయింపులు ఎన్నో రెట్లు పెంచామని వివరించారు. రైల్వే ట్రాకులు మెరుగుపరుస్తున్నామని, విద్యుదీకరణ వేగం పుంజుకుందని, రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని పేర్కొన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోతుందని, ప్రయాణికులకు మేలు జరుగుతుందని ప్రధానమంత్రి వెల్లడించారు. -
వాదనలు అనవసరం!
సాక్షి, హైదరాబాద్: ‘విభజన’ సమస్యలకు సంబంధించి వాదనలు అనవసరమని.. వివాదాల పరి ష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నా మని ఆంధ్రప్రదేశ్ సీఎస్, అధికారులకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేసినట్టు తెలిసింది. వాదనలతో కాకుండా చర్చలతోనే పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుందామని పేర్కొన్నట్టు సమాచారం. విభజన సమస్యల పరిష్కారం ఎజెండాగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఇరు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబు, మంత్రులు, అధికారులు శనివారం సాయంత్రం సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబు తొలుత మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం తాను లేఖ రాసిన వెంటనే సానుకూలంగా స్పందించి సమావేశం ఏర్పాటు చేయడం పట్ల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు ముందుకు రావడం పట్ల రేవంత్‌రెడ్డి కూడా కృతజ్ఞతలు తెలిపారు.కూర్చుని పరిష్కరించుకుందాం..ఎజెండాలో భాగంగా తొలుత ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పెండింగ్‌లో ఉన్న విభజన సమస్యలను వివరించారు. 9, 10వ షెడ్యూళ్లలోని అంశాలు, తెలంగాణ పరిధిలో ఉన్న వివిధ ప్రభుత్వ సంస్థల ఆస్తుల పంపకాలు, విద్యుత్ బకాయిలపై మాట్లాడారు. ఈ సందర్భంగా ఏపీ సీఎస్ నీరబ్‌కుమార్ ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన అంశాన్ని ప్రస్తావించగా.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. వివాదాల పరిష్కారం కోసమే సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు వాదనలు అనవసరమని స్పష్టం చేశారు. ఏదైనా కూర్చొని పరిష్కరించుకోవాలని రేవంత్‌తోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు.మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి.. ఉద్యోగుల విభజన, ఏడు విలీన మండలాలు, భద్రాచలం పరిధిలోని 5 గ్రామాల అంశం, టీటీడీలో, కోస్తా తీర ప్రాంతంలో వాటాలు, ఏపీలోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపకాలు మొదలైన అంశాలను ప్రస్తావించారు. చివరగా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సీఎస్ల ఆధ్వర్యంలో ఒక అధికారుల కమిటీ, మంత్రుల ఆధ్వర్యంలో మరో కమిటీ ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఇక ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు పరస్పరం గౌరవించుకునే విధంగా ప్రొటోకాల్ నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.సాదర స్వాగతంతో.. మనసారా నవ్వుకుంటూ..ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజాభవన్‌కు చేరుకోగా.. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు సాదరంగా స్వాగతం పలికారు. సమావేశ మందిరంలోకి వెళ్లిన తరువాత ఏపీ సీఎం చంద్రబాబును సీఎం రేవంత్ శాలువాతో సత్కరించి.. కాళోజీ రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహూకరించారు. నంది జ్ఞాపికను అందజేశారు. తర్వాత చంద్రబాబు సీఎం రేవంత్‌కు శాలువా కప్పి సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన విందులో హైదరాబాదీ దమ్ బిర్యానీతోపాటు ఆమ్లెట్లు, చేపల కూర వంటి వంటకాలను వడ్డించారు. తిరిగి వెళ్లే సమయంలో రేవంత్, చంద్రబాబు ముచ్చట్లాడుకుంటూ కనిపించారు. ఏదో అంశం ప్రస్తావనకు రాగా నవ్వుకుంటూ బయటికి వచ్చారు. -
రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ ఫోకస్
-
గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో గురువారం ఆసక్తికరమైన పరిణామం ఒకటి చోటుచేసుకుంది. రాజ్‌భవన్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. అటుపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం ఆసక్తిని రేకెత్తించింది. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండడంతో సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ సీఎస్‌తో పాటు రాజ్‌భవన్ అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆపై ఆయన గవర్నర్‌తో భేటీ అయ్యారు. అయితే భేటీ సారాంశం అధికారకంగా బయటకు రాకపోయినా.. గవర్నర్‌తో ప్రత్యేక భేటీలో.. పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై చర్చ జరిగినట్లు సమాచారం. అంతేకాదు.. పెండింగ్‌లో ఉన్న బిల్లులపైనా సీఎం కేసీఆర్ గవర్నర్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. దాదాపు 20 నిమిషాల భేటీ తర్వాత.. పట్నం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆపై సీఎం కేసీఆర్, కేబినెట్‌తో కలిసి గవర్నర్ గ్రూప్ ఫొటో దిగారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసైకి మధ్య నెలకొన్న గ్యాప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారిక కార్యక్రమాలకు సైతం గవర్నర్‌ను ఆహ్వానించకపోవడం, ఆ చర్యపై ఆమె బహిరంగంగానే అసంతృప్తి వెల్లగక్కుతుండడం చూస్తున్నాం. అదే సమయంలో ఆమె ముఖ్యమైన బిల్లులనూ పెండింగ్‌లో పెడుతూ వస్తున్నారు. -
సత్వరమే ఉద్యోగ నియామకాలు: సీఎస్ శాంతికుమారి
సాక్షి, హైదరాబాద్: వివిధ శాఖల ఉద్యోగ నియామకాల పురోగతిని తెలిపేందుకు ప్రత్యేకంగా డ్యాష్ బోర్డును ఏర్పాటు చేసి నిరంతరం సమీక్షించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. సరీ్వసు అంశాలు, రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు సంబంధించిన పలు శాఖలలో పెండింగ్ అంశాలను తక్షణమే పరిష్కరించి ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని ఆదేశించారు. ఉద్యోగ నియామకాలపై బీఆర్కేఆర్ భవన్లో మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 17,516 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, ఇప్పటికే ప్రాథమిక పరీక్షలు పూర్తి చేశామని, ఏప్రిల్‌లో రాత పరీక్షలు పూర్తి చేసి సెపె్టంబర్‌లోగా నియామకాలు జరుపుతామని సీఎస్ పేర్కొన్నారు. రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 10 వేల పోస్టులకు సెపె్టంబర్‌లోగా నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ భేటీలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్థిక శాఖ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్ రోస్, టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావు, వర్సిటీ కామన్ బోర్డు చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి పాల్గొన్నారు. చదవండి: నిఘా లేదు.. సర్వర్ లేదు! కీలకమైన టీఎస్పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు -
పరిష్కారం దిశగా పెండింగ్ సమస్యలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నాటినుంచి పేరుకు పోయిన రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రతి నిధుల బృందాలు సమావేశమై ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాయి. త్వరలోనే వీటికి పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బృందం వెల్లడించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భేటీ అయిన సమయంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ వీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ కార్య దర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీతో వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం సోమవారం సమావేశమైంది. ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూ లోటు, కడప స్టీల్ ప్లాంటు, భోగాపురం విమానాశ్రయం తదితర పది ప్రధాన అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఆ వివరాలను విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడిం చారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన పలు పెండింగ్ అంశాలు, సమస్యల పరి ష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు చెరో 15 మందిమి సమావేశమయ్యాం. పోలవరం నుంచి ప్రతి అంశంపై రెండున్నర గంటలపాటు కూలంక షంగా చర్చించాం. రాష్ట్రానికి ప్రయోజనకరంగా చర్చలు సాగాయి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన వినతులు అన్నింటికీ సామరస్యంగా పరిష్కారం లభించింది. పలు అంశాలపై భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం జరిగింది. త్వరలోనే మంచి సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంబం ధిత విభాగాల కేంద్ర కార్యదర్శులతో టచ్‌లో ఉంటారు. పోలవరం సవరించిన అంచనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఒక అవగాహనకు వచ్చాం. రెవెన్యూ లోటు పైనా చర్చించాం. సాను కూల నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమయంలో పలు శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ కార్య దర్శులతో ఇంతసేపు సమావేశం అంటే రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి పలు శాఖల కార్యదర్శులు, అధికా రులు, బ్యాంకింగ్, పీఎంవో కార్యాలయ అధికారు లు 15 మంది పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి విజయ సాయిరెడ్డితో పాటు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నా«ధ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్, కార్యదర్శి గుల్జార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పౌర సరఫరాల కార్యదర్శి గిరిజాశంకర్, ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేమచంద్రారెడ్డి, రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా పాల్గొన్నారు. సమావేశంలో చర్చించిన ప్రధానాంశాలు ► ప్రత్యేక హోదా–విభజన చట్టంలోని అంశాలు ► పోలవరం సవరించిన అంచనాలు ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదం ► కాగ్ సిఫార్సు చేసిన 2014–15 రెవెన్యూలోటు ► ఏపీ జెన్కో తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తు నిమిత్తం రావాల్సిన రూ.6,284 కోట్లు ► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత ► రాష్ట్రానికి రావాల్సిన పన్నుల ఆదాయం ► ఎఫ్ఆర్బీఎం గరిష్ట రుణపరిమితి పెంపు ► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతులు ► వైఎస్సార్ కడప జిల్లాలోని స్టీల్ ప్లాంటు కోసం ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గనుల కేటాయింపు ► బీచ్ శాండ్ మైనింగ్‌కు అణు ఇంధన శాఖ అనుమతులు -
ఏపీ విభజన చట్టం: ఆ అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత గడువులోగా ఆస్తుల వివరాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలో ఏపీ భవన్‌కు ఉన్న 19 ఎకరాల ఆస్తుల విభజనపై కేంద్రం మూడు ప్రతిపాదనలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తిలో ఏపీ భవన్ ఆస్తుల పంపిణి జరగాలని ఉంది. అయితే.. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, సోమేశ్ కుమార్‌లు పాల్గొన్నారు. చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు) -
నేడు ప్రధానితో సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జోన్లకు ఆమోద ముద్ర, రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రధాన ఎజెండాగా శుక్రవారం మధ్యాహ్నం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బంధు, రైతులకు ఉచిత జీవిత బీమా, తెలంగాణ కంటివెలుగు తదితర పథకాల వివరాలను ప్రధానికి వివరించనున్నారు. మొత్తంగా 68 అంశాలపై విజ్ఞప్తులు చేయనున్నట్టు తెలిసింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, ఎంపీ సంతోష్‌కుమార్ ఉన్నారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 12.30కు ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రానికి సంబంధిం చిన పలు అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. రిజర్వేషన్లు, జోన్లే ప్రధానం.. రాష్ట్రంలో విద్య, ఉపాధి అంశాల్లో ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతూ రాష్ట్రం ఆమోదించి పంపించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. రిజర్వేషన్ల కోటా పెంపునకు వెసులుబాటు కల్పించాలని, దీనిని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతోంది. మరోవైపు కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్ర మంత్రివర్గం గత నెలలోనే ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏడు జోన్ల ఏర్పాటుకు వీలుగా రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాలని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. గత నెలలో ఢిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి ఈ విషయాన్ని నివేదించారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్లు, కొత్త జోన్లపై సహకరించాలని ప్రధానిని కేసీఆర్ కోరనున్నారు. 68 అంశాలతో వినతిపత్రం పంటలకు కనీస మద్దతు ధరల పెంపు, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు, రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు తదితర 68 అంశాలకు సంబంధించి ప్రధానికి సీఎం కేసీఆర్ వినతి పత్రం సమర్పించే అవకాశముంది. ఇక రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సాయంగా పంపిణీ చేసే ‘రైతు బంధు’పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే అమల్లోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా రైతులందరినీ ఆకట్టుకున్న ఈ పథకం ప్రధాని దృష్టిని కూడా ఆకర్షించింది. ఈ నేపథ్యంలో రైతు బంధు పథకం విజయవంతంగా అమలు చేసిన విధానాన్ని ప్రధానికి సీఎం వివరించనున్నారు. జాతీయ స్థాయిలో ఆసక్తి.. దేశంలో గుణాత్మక మార్పు, రాష్ట్రాలకు మరిన్ని అధికారాలే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జాతీయ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఆయన.. పలు ప్రాంతీయ పార్టీల నేతలతోనూ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్డీయే ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లనుందన్న ప్రచారం కూడా ఈ సమావేశానికి ప్రాధాన్యతను పెంచింది. -
పెండింగ్ సమస్యలు పరిష్కరించండి
రైల్వే జీఎంను కలిసిన ఎంపీ సీతారాంనాయక్ హన్మకొండ : దక్షిణ మధ్య రైల్వే జీఎం రవిగుప్త ను మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ కలిశారు. ఈ మేరకు శనివారం ఆయన సికింద్రాబాద్‌లో జీఎంను కలిసి రైల్వే పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న డోర్నకల్ రైల్వే స్కూల్‌ను తిరి గి ప్రారంభించాలని కోరారు. డోర్నకల్‌కు మం జూరు చేసిన సరుకుల రైలు ఎగ్జామినేషన్ ఫెసిలి టీ కేంద్రం పనులను వెంటనే ప్రారంభించాల న్నారు. అలాగే అండర్ బ్రిడ్జిని మంజూరు చేయాలన్నారు. నూతన జిల్లా కేంద్రంగా ప్రకటించిన మహబూబాబాద్‌లో రఫ్తిసాగర్(125/2), నర్సాపూర్–నాగర్సోల్ (17213/14), డోర్నకల్ వద్ద పద్మావతి (12763/64), ఈస్ట్ కోస్ట్ (13645/46) ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరారు. ఏపీ ఎక్స్‌ప్రెస్, వైజాగ్ నుంచి న్యూఢిల్లీకి వెళ్లే రైళ్లలో ఒక రైలును నెక్కొండ వద్ద ఆపాలన్నారు. గోరఖ్‌పూర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు (12511/12), శాతవాహన, ఇంటర్సిటీ, జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌లో ఏదైనా ఒక రైలు నెక్కొండలో హాల్ట్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో డోర్నకల్–ఇల్లందు వరకు నడిచిన ప్యాసింజర్‌రైలును పునరుద్ధరించాలని కోరారు. కాగా, వీటిపై జీఎం రవిగుప్తా సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. -
పెండింగ్ అంశాలు 2 వారాల్లో పరిష్కరిస్తాం
• కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ హామీ • వివరాలు వెల్లడించిన వెంకయ్య, సుజనా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని పెండింగ్ అంశాలను రెండు వారాల్లోపు పరిష్కరిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలి పారు. మంగళవారం రాజ్‌నాథ్‌తో కేంద్ర మంత్రి సుజనాచౌదరి, వెంకయ్య సమావేశమయ్యారు. విభజన చట్టం హామీల అమలుపై చర్చించారు. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు వెంకయ్య వెల్లడించారు. విభజన చట్టంలోని కొన్ని అంశాల అమలు పెండింగ్‌లో ఉందని, దీనిని సత్వరం పరిష్కరించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు. ఈ సందర్భంగా హోం శాఖ ముఖ్యకార్యదర్శిని రాజ్‌నాథ్ పిలిపించి పెండింగ్ అంశాలపై కూలంకషంగా చ ర్చించి నట్లు చెప్పారు. ఏ వివాదాలూ లేని అంశాలు, రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాల్సిన వాటి విషయంలో చొరవ తీసుకొని, పరిష్కారానికి నిర్ణయం తీసుకోవాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ ఆదేశించారన్నారు. రెండు వారాల్లోపు ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన ప్రాజెక్టులు, ఏపీకి ఇవ్వాల్సిన సంస్థల కేటాయింపునకు హోం మంత్రిత్వ శాఖ నోడల్ ఏజెన్సీగా ఉండి సంబంధిత శాఖల్లో అపరిష్కృతంగా ఉన్న అంశాల పరిష్కారానికి ఆదేశించాలని కోరామన్నారు. ప్రత్యేక హోదాతో కలిగే ప్రయోజనాలపై కేంద్ర ఆర్థిక మంత్రితో చర్చిస్తున్నట్లు చెప్పారు. సీట్ల పెంపుపై ఏజీ అభిప్రాయాన్ని అధ్యయనం చేస్తామన్నారు అసెంబ్లీ సీట్లు పెంపుపైనా సమావేశంలో రాజ్‌నాథ్‌తో చర్చించినట్లు వెంకయ్య తెలిపారు. ఈ విషయంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అధ్యయనం చేసి తదుపరి చర్యలు తీసుకుందామని హోం మంత్రి చెప్పారన్నారు. రాజ్‌నాథ్‌తో భేటీ అనంతరం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో సమావేశమై నెలలోపు ఏపీలో పెట్రోలియం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే, ఈ నెల 19న మెడిటెక్ పార్క్ ప్రారంభించాలని కోరగా, సూత్రపాయంగా అంగీకరించారని తెలిపారు. -
ఆశ వర్కర్ల ఆందోళన
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాలు, మండల కేంద్రాల్లో ఆశ కార్యకర్తలు మంగళవారం ఆందోళనకు దిగారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం రూ15 వేలు చెల్లించాలని ఖమ్మం జిల్లా ఆశ్వారావు పేట మండల కేంద్రంలోని రింగురోడ్డు వద్ద రాస్తారోకో కు దిగారు. మరో వైపు ఆదిలాబాద్ జిల్లా లక్సిట్పేట్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆశ వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేశారు. -
ఎవరికి వారే..!
వెనుకబడిన, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరులో సమస్యలు సవాలక్ష.. వాటిని పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు.. కలెక్టర్, ఇతర విభాగాల మధ్య సమన్వయం లోపించింది. తక్షణ వాటిపైనే ఉరుకులు పరుగులు తీస్తూ.. పెండింగ్ సమస్యలు పట్టించుకోవడం లేదు. జిల్లా సమగ్రాభివృద్ధిపై సమీక్షలు కనిపించడం లేదు. క్షేత్రస్థాయి పర్యటనలు ముందుకు సాగడం లేదు.. వెరసి జిల్లా పాలనాయంత్రాంగం పనితీరు ఎవరికివారే.. యమునా తీరే..! అనే చందంగా మారింది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలనా యంత్రాంగం పనితీరు దిశా నిర్దేశం లేకుండా సాగుతుండటంతో జిల్లాలో చిన్నాచితక సమస్యలు దీర్ఘకాలంగా అలాగే ఉండిపోతున్నాయి. సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందే ఆదేశాలకు అనుగుణంగా అధికారులు ఉరుకులు, పరుగులు తీస్తున్నారు. ఇతర సమస్యలపై దృష్టి సారించకపోవడంతో సామాన్యులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వశాఖల వారీగా సమీక్షలు కొరవడడంతో కొన్ని ప్రభుత్వ విభాగాల ఉనికి నామమాత్రంగా తయారైంది. కొన్ని విభాగాల సమీక్షలు అధికారులు సమర్పించే మొక్కుబడి నివేదికలతో ముగుస్తున్నాయి. పర్యవేక్షణ, సమీక్షల ద్వారా పనితీరుపై మదింపు జరగకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పాలనా యంత్రాంగానికి సారథ్యం వహించే కలెక్టర్, ఇతర అధికారులు, సిబ్బందికి నడుమ సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మధ్య పొంతన కుదరక పాలనపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న జాయింట్ కలెక్టర్‌ను కలెక్టర్ విశ్వాసంలోకి తీసుకోవడం లేదని కలెక్టరేట్ సిబ్బంది బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. జాయింట్ కలెక్టర్ పరిధిలోని ఇసుక అనుమతులు అంశాన్ని తప్పించి డీఆర్వో నేతృత్వంలోని ‘సాండ్ సెల్’కు అప్పగించడం ఇద్దరి మధ్య నెలకొన్న అగాథాన్ని సూచిస్తోంది. రుణమాఫీ లబ్ధిదారుల జాబితా, సామాజిక పింఛన్లు, ఆహార భద్రత కార్డుల లబ్ధిదారుల గుర్తింపు వంటి విషయాల్లో రెవెన్యూ యంత్రాంగం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. ఆగిన క్షేత్రపర్యటనలు బాధ్యతలు స్వీకరించిన కొత్తలో క్షేత్రస్థాయి పర్యటనలతో తీరిక లేకుండా గడిపిన కలె క్టర్ ప్రస్తుతం కార్యాలయానికి ఎక్కువగా పరిమితమవుతున్నారు. సమగ్ర కుటుంబ సర్వే, రుణమాఫీ, సామాజిక పింఛన్ల లబ్ధిదారుల గుర్తింపు వంటి పనుల్లో కలెక్టర్ ఒత్తిడి చేయడంపై ఓ దశలో ఉద్యోగులు ‘వర్క్ టు రూల్’ పేరిట నిరసనకు దిగారు. జాబితాల పరిశీలన, కంప్యూటరీకరణ, వీడియో కాన్ఫరెన్స్‌లతో కుటుంబంతో గడిపే పరిస్థితి లేకుండా పోయిందని ఉద్యోగులు ఆక్షేపించారు. నవంబర్ 8న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉద్యోగులతో కలెక్టర్ రాజీకుదుర్చుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ‘తమకూ యూనియన్లు ఉన్నాయని’ ఆవేదన వ్యక్తంచేసిన కలెక్టర్ ఆ తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలను పూర్తిగా తగ్గించారు. ‘అనేక అంశాలపై దిశా నిర్దేశం కోరేందుకు కలెక్టర్ వద్దకు వెళ్తున్నాం. కానీ పూర్తిస్థాయిలో చర్చించే పరిస్థితి లేక వెనుదిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి అందే తక్షణ ఆదేశాలపైనే అధికార యంత్రాంగాన్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తున్నారు. దీంతో ఇతర శాఖల అంశాలపై పూర్తి స్థాయి సమీక్ష జరగడం లేదు’ అంటూ కొందరు అధికారులు లోలోన వ్యాఖ్యలు చేస్తున్నారు.