మీడియాతో మాట్లాడుతున్న విజయసాయిరెడ్డి. చిత్రంలో మంత్రి బుగ్గన, సీఎస్ సమీర్‌శర్మ, కరికాల వలవన్, ఆదిత్యనాథ్‌దాస్, జవహర్‌రెడ్డి, ప్రవీణ్‌ప్రకాశ్, ద్వివేది తదితరులు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నాటినుంచి పేరుకు పోయిన రాష్ట్ర సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన చర్యలు సత్ఫలితాన్నిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రతి నిధుల బృందాలు సమావేశమై ఈ సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించాయి. త్వరలోనే వీటికి పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర బృందం వెల్లడించింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయిన సమయంలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధాని మోదీ వీటి పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ కార్య దర్శులతో కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ కమిటీతో వైఎస్సార్‌సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ బృందం సోమవారం సమావేశమైంది. ప్రత్యేక హోదా, పోలవరం, రెవెన్యూ లోటు, కడప స్టీల్ ప్లాంటు, భోగాపురం విమానాశ్రయం తదితర పది ప్రధాన అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం ఆ వివరాలను విజయసాయిరెడ్డి మీడియాకు వెల్లడిం చారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన పలు పెండింగ్ అంశాలు, సమస్యల పరి ష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు చెరో 15 మందిమి సమావేశమయ్యాం. పోలవరం నుంచి ప్రతి అంశంపై రెండున్నర గంటలపాటు కూలంక షంగా చర్చించాం.
రాష్ట్రానికి ప్రయోజనకరంగా చర్చలు సాగాయి. ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వినతులు అన్నింటికీ సామరస్యంగా పరిష్కారం లభించింది. పలు అంశాలపై భవిష్యత్తులో ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం జరిగింది. త్వరలోనే మంచి సమాచారం అందుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంబం ధిత విభాగాల కేంద్ర కార్యదర్శులతో టచ్‌లో ఉంటారు. పోలవరం సవరించిన అంచనాల్లో ఎలాంటి మార్పులు లేకుండా ఒక అవగాహనకు వచ్చాం. రెవెన్యూ లోటు పైనా చర్చించాం. సాను కూల నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమయంలో పలు శాఖలకు చెందిన కేంద్ర ప్రభుత్వ కార్య దర్శులతో ఇంతసేపు సమావేశం అంటే రాష్ట్రానికి ప్రధాని మోదీ ఇచ్చిన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు’’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.
కేంద్రం నుంచి పలు శాఖల కార్యదర్శులు, అధికా రులు, బ్యాంకింగ్, పీఎంవో కార్యాలయ అధికారు లు 15 మంది పాల్గొన్నారు. రాష్ట్రం నుంచి విజయ సాయిరెడ్డితో పాటు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నా«ధ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, నీటి పారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్‌సింగ్ రావత్, కార్యదర్శి గుల్జార్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్, పౌర సరఫరాల కార్యదర్శి గిరిజాశంకర్, ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల స్పెషల్ సెక్రటరీ దువ్వూరి కృష్ణ, జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రేమచంద్రారెడ్డి, రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా పాల్గొన్నారు.
సమావేశంలో చర్చించిన ప్రధానాంశాలు
► ప్రత్యేక హోదా–విభజన చట్టంలోని అంశాలు
► పోలవరం సవరించిన అంచనాలు ఎలాంటి మార్పులు లేకుండా ఆమోదం
► కాగ్ సిఫార్సు చేసిన 2014–15 రెవెన్యూలోటు
► ఏపీ జెన్‌కో తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తు నిమిత్తం రావాల్సిన రూ.6,284 కోట్లు
► జాతీయ ఆహార భద్రత చట్టం లబ్ధిదారుల గుర్తింపులో హేతుబద్ధత
► రాష్ట్రానికి రావాల్సిన పన్నుల ఆదాయం
► ఎఫ్‌ఆర్‌బీఎం గరిష్ట రుణపరిమితి పెంపు
► భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుమతులు
► వైఎస్సార్ కడప జిల్లాలోని స్టీల్ ప్లాంటు కోసం ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు గనుల కేటాయింపు
► బీచ్ శాండ్ మైనింగ్‌కు అణు ఇంధన శాఖ అనుమతులు
Comments
Please login to add a commentAdd a comment