సాక్షి, ఢిల్లీ: నేటి(గురువారం) నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం అంటూ కామెంట్స్ చేశారు.
విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో.. ‘ఈరోజు నుంచి ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్పాదకతతో సాగుతాయని ఆశిస్తున్నాను. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరగాలి. ప్రభుత్వ బిల్లులపై నిర్మాణాత్మక చర్చ అవసరం. ప్రత్యేకించి రైతులు, మహిళల సమస్యలపై ప్రత్యేక చర్చ జరగాలి’ అని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
I am hoping that the Monsoon Session of Parliament commencing today will be highly productive. It would be good if constructive discussion is held on all the bills to be tabled by the Government. There shall also be discussions on the issues concerning the people of the country…
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2023
ఇదే సమయంలో బుధవారం ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంపై ట్విట్టర్ వేదికగా కామెంట్స చేశారు. ఈ సందర్భంగా..‘ఢిల్లీలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది’ అని తెలిపారు.
ఢిల్లీలో నిన్న జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్గొని రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను లేవనెత్తి వాటి పరిష్కారం కోసం కృషి చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. pic.twitter.com/554M6h5sB5
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 20, 2023
ఇది కూడా చదవండి: ముగిసిన అఖిలపక్ష భేటీ.. సహకరించాలని విపక్షాలకు ప్రభుత్వం వినతి..
Comments
Please login to add a commentAdd a comment