ఏపీ విభజన చట్టం: ఆ అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం | Union Home Ministry to held Meeting With AP, TS Chief Secretaries | Sakshi
Sakshi News home page

ఏపీ విభజన చట్టం: ఆ అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం

Published Wed, Jan 12 2022 8:44 PM | Last Updated on Wed, Jan 12 2022 8:59 PM

Union Home Ministry to held Meeting With AP, TS Chief Secretaries - Sakshi

న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పెండింగ్‌ అంశాలపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌ విభజనపై త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత గడువులోగా ఆస్తుల వివరాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలో ఏపీ భవన్‌కు ఉన్న 19 ఎకరాల ఆస్తుల విభజనపై కేంద్రం మూడు ప్రతిపాదనలు చేసింది.

ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తిలో ఏపీ భవన్‌ ఆస్తుల పంపిణి జరగాలని ఉంది. అయితే.. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, సోమేశ్ కుమార్‌లు పాల్గొన్నారు.

చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ సంక్రాంతి శుభాకాంక్షలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement