Reorganization of Andhra Pradesh
-
అస్సాం సరే.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు? విభజన చట్టంలో ఏం చెప్పారు?
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం అసెంబ్లీ, పార్లమెంటరీ స్థానాల పునర్విభజన షురూ అయ్యింది. కేంద్ర న్యాయశాఖ వినతి మేరకు ఎన్నికల సంఘం పునర్విభజన కసరత్తు ప్రారంభించింది. 2001 జనాభా లెక్కల ప్రకారం చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పునర్విభజన పూర్తి అయ్యేంతవరకు నూతన అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లపై నిషేధం విధించింది. తన సొంత విధానాల ప్రకారం పునర్విభజన ప్రక్రియను ఈసీ చేపట్టనుంది. ఆర్టికల్ 170 కింద నియోజకవర్గాల పునర్విభజన చేయనుంది. అస్సాంలో 1976లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పుడు 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నారు. అస్సాంలో 14 లోక్సభ, ఏడు రాజ్యసభ, 126 అసెంబ్లీ సీట్లున్నాయి. అస్సాం సరే.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడు? విభజన చట్టంలో ఏం చెప్పారు?. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పుర్విభజనను కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పక్కనపెట్టింది? వంటి అంశాలపై ఈ క్రమంలో చర్చ నడుస్తోంది. 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 26లో ఏపీలోని అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కి, తెలంగాణ సీట్లను 119 నుంచి 153కి పెంచాలని ఉంది. ఈ ప్రక్రియను రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 కింద పొందుపరిచిన నిబంధనలను లోబడి చేపట్టాలని స్పష్టం చేశారు. సెక్షన్ 26: నియోజకవర్గాల పునర్విభజన రాజ్యాంగంలోని ఆర్టికల్ 170కు లోబడి నూతనంగా ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల పెంపు ఈ విధంగా ఉంటుంది ♦ఆంధ్రప్రదేశ్: 175 నుంచి 225కు ♦తెలంగాణ: 119 నుంచి 153కు ♦నోట్: 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజన (సీట్ల పెంపు) ఉండదని ఇటీవలే కేంద్రం స్పష్టం చేసింది. ♦సెక్షన్ 27: నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వులను ఎప్పటికప్పుడు నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి గల అధికారాలు ♦సెక్షన్ 28: షెడ్యూల్డ్ కులాల ఉత్తర్వు - 1950కు సవరణ (చట్టంలోని 5వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా) ♦సెక్షన్ 29: షెడ్యూల్డ్ తెగల ఉత్తర్వు - 1950కు సవరణ(చట్టంలోని 6వ షెడ్యూల్ పేర్కొన్న విధంగా) ఇదిలా ఉండగా, రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు అయినా పలు సమస్యలు అపరిష్కృతంగా ఉండటంపై ఇటీవల జరిగిన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా తన వాణిని వినిపించిన సంగతి తెలసిందే. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించి, విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై త్వరగా ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఏపీ ప్రభుత్వం కోరింది. చదవండి: కథ.. స్క్రీన్ప్లే.. దర్శకత్వం యనమల.. ఆ లీకుల వెనుక అసలు వ్యూహం ఇదే.. -
ఏపీ విభజన చట్టం: ఆ అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత గడువులోగా ఆస్తుల వివరాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలో ఏపీ భవన్కు ఉన్న 19 ఎకరాల ఆస్తుల విభజనపై కేంద్రం మూడు ప్రతిపాదనలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తిలో ఏపీ భవన్ ఆస్తుల పంపిణి జరగాలని ఉంది. అయితే.. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన వర్చువల్గా జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, సోమేశ్ కుమార్లు పాల్గొన్నారు. చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు) -
పాత పర్మిట్లతోనే..
ఓ రాష్ట్రంలో అనుమతులతోనే ఇరు రాష్ట్రాల్లో తిరగవచ్చు సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాలు ఏర్పాటయ్యే నాటికి వాహనాలు తీసుకున్న పర్మిట్లతోనే ఇరు రాష్ట్రాల్లోనూ తిరగవచ్చని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ముసాయిదా బిల్లులో కేంద్రం స్పష్టం చేసింది. ఒక రాష్ట్రంలోని రవాణా శాఖ కార్యాలయాల్లో అనుమతి పొందినందున మరో రాష్ట్రంలో తిరుగనీయబోమని అనడానికి వీల్లేదని పేర్కొంది. ఇతర రాష్ట్ర వాహనం అయినందున ప్రత్యేక అనుమతులు తీసుకోవాలని చెప్పడానికి వీల్లేదని కేంద్రం స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన జరిగే ముందురోజు వరకు ప్రస్తుత రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో అనుమతులు తీసుకున్నా.. వాటి వ్యాలిడిటీ ఉన్నంతకాలం రెండు రాష్ట్రాల్లోనూ తిరిగే హక్కు ఉంటుందని పేర్కొంది. ట్రాన్స్పోర్టు వాహనాల నుంచి ఎలాంటి టోల్, ప్రవేశ రుసుములు వసూలు చేయడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో టోల్ టాక్స్, ప్రవేశ రుసుములు, ఇతర చార్జీలు వసూలు చేయాల ంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని, కేంద్రం రెండు రాష్ట్రాలతో చర్చించి నిర్ణయిస్తుందని పేర్కొంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో లేదా ప్రభుత్వం వాణిజ్య అవసరాల కోసం రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించినా, అభివృద్ధి చేసినా వాటి వద్ద టోల్, ప్రవేశ రుసుములు వసూలు చేయవద్దన్న నిబంధన వర్తించదని పేర్కొంది.