telangana chief secretary
-
శాంతికుమారి.. అసిస్టెంట్ కలెక్టర్ నుంచి స్పెషల్ సీఎస్ దాకా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎ.శాంతికుమారి నియమితులయ్యారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆమెను సీఎస్‌గా నియమిస్తూ సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి వి.శేషాద్రి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆమె తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా చరిత్రకెక్కారు. గత సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని ఆదేశిస్తూ మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యంగా మారిన విషయం తెలిసిందే. సీఎస్ రేసులో ఆర్థిక, పురపాలక, అటవీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, శాంతికుమారిల పేర్లు ప్రముఖంగా వినిపించగా, శాంతికుమారి వైపు సీఎం కేసీఆర్ మొగ్గు చూపారు. సీఎస్‌గా నియామకం జరిగిన వెంటనే ఆమె ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం తర్వాత శాంతికుమారి బీఆర్కేఆర్ భవన్‌లోని రాష్ట్ర సచివాలయం చేరుకుని సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసిన శాంతికుమారి శాంతికుమారి 1999 నవంబర్ నుంచి 2001 జూన్ వరకు మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేయగా, అప్పట్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించారు. 2015–2018 వరకు శాంతికుమారి సీఎంఓ ముఖ్యకార్యదర్శి కార్యదర్శిగా ఉన్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కొన్నేళ్ల పాటు కలిసి పనిచేసిన అనుభవం ఉండడంతో పాటు నమ్మకస్తురాలు కావడం.. ఎన్నికల సంవత్సరంలో ఆమెను సీఎస్‌గా నియమించడానికి దోహదపడినట్టు చర్చ జరుగుతోంది. రెండేళ్ల మూడు నెలలకు పైగా సరీ్వసు మిగిలి ఉన్న శాంతికుమారి 2025 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేస్తారు. ఉమ్మడి ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా మిన్ని మాథ్యూస్ 2012లో నియమితులయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాష్ట్ర తొలి మహిళా సీఎస్‌గా నీలం సహాని వ్యవహరించారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో మూడో మహిళా సీఎస్ శాంతికుమారి కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శాంతికుమారి మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ, అమెరికాలో ఎంబీఏ చదివారు. వివిధ హోదాల్లో విశేష సేవలు. ఐఏఎస్‌గా ఎంపికైన తర్వాత శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్‌గా శాంతికుమారి తొలి పోస్టింగ్ అందుకున్నారు. మూడు దశాబ్దాల కెరీర్లో ఆమె పేదరిక నిర్మూలన, సమ్మిళిత అభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, నైపుణ్యాభివృద్ధి, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్ల పాటు పనిచేశారు. తెలంగాణ వచ్చాక నాలుగేళ్ల పాటు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీగా, టీఎస్ ఐపాస్‌లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా సేవలందించారు. అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ సీఎస్‌గా నియమితులయ్యారు. కొత్త సీఎస్‌కు అభినందనల వెల్లువ కొత్త సీఎస్‌గా నియమితులైన శాంతికుమారికి అభినందనలు వెల్లువెత్తాయి. ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్, టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్దన్‌రెడ్డి, ఆర్థిక, పురపాలక శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.రామకృష్ణారావు, అరవింద్‌కుమార్, అదర్ సిన్హా, సీనియర్ ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, వాకాటి కరుణ, టీకే.శ్రీదేవి, అనితా రామచంద్రన్, శైలజారామయ్యర్ తదితరులు అభిందనలు తెలియజేశారు. మున్నురు కాపు సంఘం హర్షం సీఎస్‌గా శాంతికుమారిని నియమించిన సీఎం కేసీఆర్‌కు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కనీ్వనర్ సర్దార్ పుటం పురుషోత్తం పటేల్ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. వెనుకబాటుకు గురైన కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి, తగు విధంగా ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి భారతదేశ భవితకు దిక్సూచి అని పేర్కొన్నారు. చదవండి: (సుదీప్ చూపు ఆ పార్టీ వైపు.. సంప్రదింపులు జరుపుతున్న మాజీ ఎంపీ) -
Telangana: సీఎం కేసీఆర్‌తో శాంతికుమారి భేటీ
సాక్షి, హైదరాబాద్: సోమేశ్ కుమార్ కొనసాగింపును హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. తెలంగాణకు కొత్త చీఫ్ సెక్రటరీ ఎంపిక అనివార్యమైంది. అయితే.. ఈ కేసులో ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. ఆసక్తికరంగా.. సీనియర్ అధికారిణి శాంతికుమారి బుధవారం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో భేటీ అయ్యారు. సీఎస్ రేసులో ఈమె పేరు కూడా ప్రముఖంగా వినిపించడం విశేషం. దీంతో సీఎస్‌గా శాంతకుమారి పేరును ఫైనలైజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 1989 బ్యాచ్‌కు చెందిన శాంతికుమారి పేరు.. సీఎస్ రేసు లిస్ట్‌లో ప్రముఖంగా ఉంది. ఇదిలా ఉంటే.. విభజన సమయంలో కేంద్రం సోమేశ్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు కేటాయించినందున అక్కడికే వెళ్లి విధులు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. తెలంగాణలో కొనసాగింపును రద్దు చేసింది. దీంతో ఆయన గురువారం ఏపీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉండగా.. రాజీనామా చేస్తారనే ఊహాగానాలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వెంటనే ఆయన్ని తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీఎం కేసీఆర్ నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎస్ రేసులో.. ఆ ముగ్గురు! -
ఏపీ విభజన చట్టం: ఆ అంశాలపై కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఏపీ విభజన చట్టం పెండింగ్ అంశాలపై కేంద్ర హోం శాఖ నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. నిర్ణీత గడువులోగా ఆస్తుల వివరాలపై అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వనుంది. ఢిల్లీలో ఏపీ భవన్‌కు ఉన్న 19 ఎకరాల ఆస్తుల విభజనపై కేంద్రం మూడు ప్రతిపాదనలు చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో ఏపీకి 58, తెలంగాణకు 42 నిష్పత్తిలో ఏపీ భవన్ ఆస్తుల పంపిణి జరగాలని ఉంది. అయితే.. తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర హోం శాఖ నిర్ణయించింది. కాగా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన వర్చువల్‌గా జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డా.సమీర్ శర్మ, సోమేశ్ కుమార్‌లు పాల్గొన్నారు. చదవండి: (తెలుగు ప్రజలకు సీఎం వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు) -
‘సరస్వతీ’ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: సరస్వతి పంప్‌హౌస్‌లో నాణ్యత లేని పనులపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ లేఖ రాశారు. అన్నారం సరస్వతి పంప్ హౌస్ నిర్మాణ వ్యయం ఎంత? ఎన్ని మోటార్లు అమర్చారు? అని లేఖలో ప్రశ్నించారు. పైపుల డ్యామేజీకి కారణాలేంటి? అని అడిగారు. నిబంధనలు పాటించని ఏజెన్సీపై.. పర్యవేక్షించాల్సిన ఇంజనీర్‌పై ఎలాంటి చర్యలు చేపట్టారు? అని నిలదీశారు. అన్నారం సరస్వతి పంప్ హౌస్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలని రాజనర్సింహ డిమాండ్ చేశారు. -
ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు: సీఎస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకునేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి (సీఎస్) సోమేష్‌కుమార్ కోరారు. బీఆర్ కేఆర్ భవన్లో శనివారం బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. వినియోగదారుల కొనుగోళ్లు పెరిగేలా వడ్డీ రిబేట్లతో పాటు మరిన్ని రుణాలు అందించాలన్నారు. రుణాల దరఖాస్తు ప్రక్రియను సరళీకరించి, సత్వర నిర్ణయాలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. లోన్‌మేళాల నిర్వహణ, ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుతో పాటు రుణాల కోసం కొత్త పథకాలు ప్రవేశపెట్టాలన్నారు. సమావేశానికి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి అర్విం ద్‌కుమార్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి రిజ్వీ, ఎస్సీడీడీ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్, సీసీటీ నీతూ కుమారి ప్రసాద్, హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు. -
తెలంగాణలో కరోనా కంట్రోల్లో ఉంది: సీఎస్
-
ఆక్సిజన్ కొరత లేదు.. కరోనా కంట్రోల్లోనే: సీఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్లోనే ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితి బాగానే ఉందని పేర్కొన్నారు. కరోనా కట్టడికి వైద్య సిబ్బంది చాలా కష్టపడి పని చేస్తున్నారని చెప్పారు. కరోనా కట్టడి చర్యలపై సీఎం కేసీఆర్ తమకు దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై బుధవారం సీఎస్ అధికారులతో సమీక్ష చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్ మెడికల్ ట్రీట్మెంట్ క్యాపిటల్. ఇక్కడ ఇతర రాష్ట్రాల వారే ఎక్కువమంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఆక్సిజన్, మందుల కొరత లేదు. ఆక్సిజన్ బెడ్స్ పెంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కోవిడ్ ఆస్పత్రుల్లో 62వేల బెడ్స్ ఉన్నాయి. తెలంగాణలో 135 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఒడిశా నుంచి ఆక్సిజన్ ట్యాంకర్ నింపుకొని రావడానికి 6 రోజులు పడుతుంది. ఎయిర్‌లిఫ్ట్ చేయడం వల్ల మూడు రోజుల సమయం ఆదా అవుతోంది. కరోనా కట్టడికి ఎంత డబ్బు అయినా ఖర్చు చేయమని సీఎం చెప్పారు. తెలంగాణలో 90వేల రెమిడెసివిర్ వయల్స్ అందుబాటులో ఉన్నాయి. టోసిలిజుమాబ్ 63 వయల్స్ స్టాక్ ఉంది. అనవసరంగా ఆక్సిజన్, రెమిడెసివిర్ మందుల్ని వృథా చేస్తున్నారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది.. ఎవరూ భయపడొద్దు. కరోనా ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్‌గా ఉంది. సాధారణ మందులతోనే కరోనా తగ్గిపోతుంది. త్వరలోనే తెలంగాణలో సాధారణ పరిస్థితులు వస్తాయి’ అని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. -
సీఎస్‌గా అజయ్‌మిశ్రా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి మంగళవారం పదవీ విర మణ చేయనున్నారు. సీనియారిటీ, సమర్థతలను పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై నేడు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు. కొత్త సీఎస్ రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ముందంజ లో ఉన్నారు. 1985 బ్యాచ్‌కు చెందిన మిశ్రాకు సీనియారిటీ కలిసి వస్తుండటంతో ఆయననే సీఎస్‌గా నియమించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, 1989 బ్యాచ్‌కు చెందిన సోమేశ్‌కుమార్ పనితీరు పట్ల సీఎం కేసీఆర్‌కు ఉన్న సానుకూల దృక్పథం కూడా కొత్త సీఎస్ ఎంపికలో కీలకంగా మారే అవకాశముంది. మిశ్రాను సీఎస్‌గా నియమిస్తే 2020 జూన్ వరకు పదవి లో కొనసాగుతారు. ఆ తర్వాత సోమేశ్‌కుమార్‌కు సీఎస్‌గా అవకాశం కల్పించాలనే యోచనలో సీఎం ఉన్నట్టు సమాచారం. సోమేశ్ కుమార్ పదవీ విరమణ సమయం 2023 డిసెంబర్ నెలాఖరుకు ఉంది. అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే మాత్రం, జోషి వారసుడిగా సోమేశ్‌కుమార్‌ను సీఎస్‌గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున సన్మానం ఎస్కే జోషి పదవీ విరమణ సందర్భంగా మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాత్కాలిక సచివాలయం బీఆర్కేఆర్ భవన్ 9వ అంతస్తులోని సమావేశ మందిరంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐఏఎస్ అధికారులు పాల్గొననున్నారు. -
కొత్త సీఎస్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్ర కుమార్ జోషి ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన పదవీకాలం మరో వారం రోజులే మిగిలి ఉండటంతో కొత్త సీఎస్ ఎంపికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సీనియారిటీ, సమర్థత, స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త సీఎస్ ఎంపికపై సీఎం కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకోనున్నారు. సీఎస్ పదవి రేసులో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనతో పాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ పేరు సైతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీరిద్దరిలో ఒకరిని సీఎస్‌గా నియమించే అవకాశాలున్నాయని సచివాలయ అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. సీనియర్లు చాలా మందే.. సీనియారిటీపరంగా సీఎస్ రేసులో తెలంగాణ కేడర్‌కు చెందిన 1983 బ్యాచ్ అధికారులు బీపీ ఆచార్య, బినయ్‌కుమార్, 1984 బ్యాచ్ అధికారి అజయ్ మిశ్రా, 1985 బ్యాచ్ అధికారిణి పుష్పా సుబ్రమణ్యం, 1986 బ్యాచ్ అధికారులు సురేశ్ చందా, చిత్రా రామచంద్రన్, హీరాలాల్ సమారియా, రాజేశ్వర్ తివారి, 1987 బ్యాచ్ అధికారులు రాజీవ్ రంజన్ మిశ్రా, వసుధా మిశ్రా, 1988 బ్యాచ్ అధికారులు శాలిని మిశ్రా, ఆధర్ సిన్హా, 1989 బ్యాచ్ అధికారులు సోమేశ్‌కుమార్, శాంతి కుమారి ఉన్నారు. వీరిలో బీపీ ఆచార్య, సురేశ్ చందా, రాజేశ్వర్ తివారి సమర్థులైన అధికారులుగా పేరున్నా, ప్రభుత్వంతో ఉన్న సంబంధాల రీత్య సీఎస్ రేసులో వీరి పేర్లు వినిపించడం లేదు. బినయ్‌కుమార్, పుష్పాసుబ్రమణ్యం, హీరాలాల్ సమారియా, రాజీవ్ రంజన్, వసుధ మిశ్రాలు కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఇక మిగిలిన వారిలో అజయ్‌మిశ్రా, సోమేశ్‌కుమార్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలున్నట్టు చర్చ జరుగుతోంది. అయితే అజయ్ మిశ్రా 2020 జూన్‌లో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు సీఎస్‌గా అవకాశం కల్పిస్తే ఆరు నెలలు ఆ పదవిలో కొనసాగుతారు. సోమేశ్‌కుమార్ 2023 డిసెంబర్ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయనకు అవకాశం కల్పిస్తే నాలుగేళ్ల పాటు సీఎస్ పదవిలో కొనసాగనున్నారు. మళ్లీ అసెంబ్లీ ఎన్నికల వరకు సీఎస్‌గా ఒకే అధికారిని కొనసాగించాలని ముఖ్యమంత్రి భావిస్తే సోమేశ్‌కుమార్‌కు సీఎస్ పదవి వరించే అవకాశాలున్నాయి. అజయ్ మిశ్రా రిటైరైన తర్వాత సోమేశ్కు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
తెలంగాణ కొత్త సీఎస్ గా ఎస్పీ సింగ్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎస్పీ సింగ్ నియమితులయ్యారు. ఇప్పటివరకు ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగిసింది. ఆయన పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. శనివారం రాత్రి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రదీప్ చంద్ర స్థానంలో ఎస్పీ సింగ్ ను ఎంపిక చేసింది. బిహార్ కు చెందిన ఎస్పీ సింగ్ పూర్తి పేరు శేఖర్ ప్రతాప్ సింగ్. కాగా, అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డైరెక్టర్ జనరల్ గా శనివారం పదవీ విరమణ చేసిన ఏకే ఖాన్ ను మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారుగా నియమించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా అరవింద్ కుమార్ ను ఎంపిక చేసింది. -
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
హైదరాబాద్: ప్రణాళిక ప్రకారం పాలన కొనసాగిస్తామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్నారు. ఉద్యోగులు, ప్రజల నుంచి సహకారం ఆశిస్తున్నట్టు ‘సాక్షి’తో చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తమేనని, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయక తప్పదని అన్నారు. ప్రజల రోజువారి ఇబ్బందులను ఎప్పటికప్పుడు కేంద్రం, ఆర్బీఐ నివేదిస్తున్నామని తెలిపారు. చిన్న నోట్లు కావాలని ఈరోజు కూడా ఆర్బీఐని కోరినట్టు వెల్లడించారు. నోట్లు రాగానే గ్రామీణ ప్రాంతాలకు పంపిస్తామన్నారు. రోజువారీ కూలీలు, చేతి వృత్తుల వారు డబ్బుల్లేకుండా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. వ్యవసాయ మార్కెట్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని ప్రదీప్ చంద్ర హామీయిచ్చారు. -
‘చిన్న నోట్లు కావాలని ఆర్బీఐని అడిగాం’
-
లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేయండి!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే.. మాత్రం 17 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎస్
హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి పి ఆచార్యలు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధులుగా వీరిద్దరూ హాజరవుతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ ఆఖరి సమావేశం కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ రెండో వారంలోనే జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేశారు. -
ఉమ్మడి సంస్థలన్నీ మావే!
-
సుప్రీంకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్
* డీఎస్సీ-1998 కేసు ఫిబ్రవరికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ / హైదరాబాద్: డీఎస్సీ -1998 ఉత్తీర్ణులు దాఖలు చేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులకు ఉద్యోగాలివ్వాలని కింది కోర్టు చెప్పినప్పటికీ అమలుచేయక పోవడంతో కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించినా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో స్వయంగా సీఎస్ హాజరుకావాలని గత నవంబర్‌లో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజీవ్‌శర్మ కోర్టుకు వచ్చారు. సదరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని,వారి కంటే తక్కువగా మార్కులు వచ్చిన వారెవరికీ ఉద్యోగాలివ్వలేదని తెలిపారు. పైగా ఆ అభ్యర్థుల వయస్సు యాబై ఏళ్లకు వచ్చిందన్నారు. తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించగా, పొరపాటైందని, ఇకపై పునరావృతం కాదని సీఎస్ వివరణ ఇచ్చారు. దీంతో కేసును ఫిబ్రవరి మొదటివారానికి వాయిదా వేశారు. -
తెలంగాణ సీఎస్ తో పలు జిల్లా కలెక్టర్లు భేటీ
రోజురోజుకు విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో చెత్త వేసేందుకు కొత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ అంశంపై చర్చించేందుకు మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగర శివారులలో నూతన డంపింగ్ యార్డ్ ఏర్పాటుపై ఈ సందర్బంగా చర్చిస్తున్నారు. -
ఇరాక్‌లో చిక్కుకున్న తెలంగాణవారిని ఆదుకోండి
విదేశాంగ శాఖ కార్యదర్శికి సీఎస్ రాజీవ్‌శర్మ లేఖ సాక్షి, హైదరాబాద్: ఇరాక్‌లో జరుగుతున్న అతర్యుద్ధంలో చిక్కుకుపోయిన 1,038 మంది తెలంగాణ ప్రజలను క్షేమంగా వెనక్కి తీసుకురావాలని కోరుతూ కేంద్ర విదేశాంగ కార్యదర్శికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారు 850 మంది కాగా దేశంలోని మిగతా ప్రాంతాల నుంచి వెళ్లిన తెలంగాణ వారిని కూడా కలుపుకొంటే ఆ సంఖ్య 1,038కి చేరిందని లేఖలో పేర్కొన్నారు. వీరందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకురావాలని, అందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని రాజీవ్‌శర్మ కోరారు. -
'ఇరాక్ లో తెలంగాణవాసుల క్షేమ సమాచారం తెలపండి'
ఇరాక్‌లో అంతరుద్ధ్యం నేపథ్యంలో స్వదేశం వచ్చేందుకు సుముఖంగా ఉన్న రాష్ట్ర వాసులను తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించి తెలంగాణ వాసుల యోగక్షేమాలను తమకు తెలపాల్సిందిగా కేంద్రానికి రాసిన లేఖలో ఆయన కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి ఇరాక్ వెళ్లిన వారి వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 1038 మంది ఇరాక్‌లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వారిలో 858 మంది ముంబై ట్రావెల్స్ ఏజెన్సీ, మరో 180 మంది జైపూర్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా ప్రొటెక్టర్ అధికారికంగా వెళ్లారని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కేంద్రానికి రాసిన లేఖలో వివరించారు. -
తెలంగాణా సీఎస్‌గా రాజీవ్‌శర్మ
-
తెలంగాణ సీఎస్ గా రాజీవ్ శర్మ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ రాజీవ్ శర్మ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కేంద్రహోం శాఖలో అడిషనల్ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్నారు. 1982 బ్యాచ్‌కు చెందిన రాజీ వ్‌శర్మ సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అసిస్టెంట్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి స్పెషల్ కమిషనర్‌గానూ రాజీవ్ శర్మ సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఐవైఆర్ కృష్ణారావు నియమితులయ్యారు. ఈ రాత్రి వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎస్‌గా ఆయన కొనసాగుతారు.