* డీఎస్సీ-1998 కేసు ఫిబ్రవరికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ / హైదరాబాద్: డీఎస్సీ -1998 ఉత్తీర్ణులు దాఖలు చేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం సుప్రీంకోర్టుకు హాజరయ్యారు. ఆ పరీక్షలో ఉత్తీర్ణులకు ఉద్యోగాలివ్వాలని కింది కోర్టు చెప్పినప్పటికీ అమలుచేయక పోవడంతో కేసు సుప్రీంకోర్టుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం గతంలో ప్రభుత్వాన్ని ఆదేశించినా ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో స్వయంగా సీఎస్ హాజరుకావాలని గత నవంబర్‌లో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సోమవారం రాజీవ్‌శర్మ కోర్టుకు వచ్చారు. సదరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని,వారి కంటే తక్కువగా మార్కులు వచ్చిన వారెవరికీ ఉద్యోగాలివ్వలేదని తెలిపారు. పైగా ఆ అభ్యర్థుల వయస్సు యాబై ఏళ్లకు వచ్చిందన్నారు. తమ ఆదేశాలు ఎందుకు పాటించలేదని కోర్టు ప్రశ్నించగా, పొరపాటైందని, ఇకపై పునరావృతం కాదని సీఎస్ వివరణ ఇచ్చారు. దీంతో కేసును ఫిబ్రవరి మొదటివారానికి వాయిదా వేశారు.
సుప్రీంకోర్టుకు హాజరైన తెలంగాణ సీఎస్
Published Tue, Dec 9 2014 3:10 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement