Rajiv Sharma
-
20 వేల బస్సులైనా తీసుకురండి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె వ్యవహారం ఎంతకీ తెగట్లేదని, ఎంతకాలం ప్రజలకు ఈ ఇబ్బందులని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పదిహేను, 20 వేల ప్రైవేటు బస్సులను రాష్ట్రంలో సాధ్యమైనంత త్వరగా ప్రవేశపెట్టాలని, వాటికి రూట్ పర్మిట్లు జారీ చేసేందుకు కసరత్తు చేయాలని రవాణ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆర్టీసీ సమ్మెపై బుధవారం ప్రగతి భవన్లో రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఆ శాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సునీల్ శర్మ, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతో సమీక్షించారు. గురువారం హైకోర్టులో ప్రభుత్వం తరఫున దాఖలు చేయనున్న అఫిడవిట్‌ను సీఎం పరిశీలించారు. హైకోర్టు నుంచి ప్రభుత్వానికి ప్రతికూల ఆదేశాలందితే తక్షణమే సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం సూచించినట్లు తెలిసింది. సకల జన భేరీ నిర్వహించడం, విపక్ష నేతలను ఈ సభకు ఆహ్వానిచడంపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారని అధికారవర్గాలు తెలిపాయి. -
మున్సి‘పోల్స్’కు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సంఘం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు మునిసిపల్ ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచి్చన నేపథ్యంలో సీఎం బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ సంసిద్ధతను ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని వెల్లడించారు. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష లో మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు, ముఖ్యకార్యదర్శులు అరవింద్ కుమార్, ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే నగారా త్వరలోనే పురపోరుకు నగారా మోగనుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ అధికారులను ఆదేశించిన నేపథ్యంలో .. వచ్చేవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యాన్ని కొట్టివేయడంతో ప్రధాన అడ్డంకి తొలిగిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మున్సి‘పోల్స్’పై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం సీఎం కేసీఆర్‌తో పురపాలకశాఖ అధికారులు భేటీ అయి తాజా పరిస్థితులను వివరించారు. పిల్ కొట్టివేసినప్పటికీ, సింగిల్ జడ్జి దగ్గర ఇంకా పిటిషన్లు పెండింగ్‌లో ఉన్న తరుణంలో ఎన్నికలకు ముందడుగు వేయాలా? లేదా అనే అంశంపై స్పష్ట త కోసం మున్సిపల్ అధికారులు సీఎంను కలిశారు. ప్రధాన కేసు తేలినందున.. త్వరగా మిగతా కేసులు కూడా వీగిపోతాయని అభిప్రాయపడ్డ ముఖ్యమంత్రి.. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. ఎన్నికల నిర్వహణపై సీఎం కేసీఆర్ స్పష్టమైన సంకేతాలిచిచన నేపథ్యంలో రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తును మొదలుపెట్టాలని పురపాలకశాఖ భావిస్తోంది. ఇప్పటికే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళలకు రిజర్వేషన్ల నిష్పత్తిని నిర్దేశించినందున దానికి అనుగుణంగా సీట్ల కేటాయింపు జరగనుంది. ఇదిలావుండగా, రాష్ట్రంలోని 128 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్ల పరిధిలో 61 లక్షల మంది బీసీ ఓటర్లున్నట్లు లెక్క తేలి్చన మున్సిపల్ అధికారులు ఈ వివరాలను ప్రభుత్వానికి అందించారు. బీసీ రిజర్వేషన్లు ఓటరు జాబితా ప్రకారం, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన చేయనున్నారు. -
తహసీల్దార్ల అధికారాలకు కత్తెర!
సాక్షి, హైదరాబాద్: తహసీల్దార్ల అధికారాలకు కత్తెర పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ రికార్డుల మార్పులు, చేర్పుల్లో వారి భాగస్వామ్యాన్ని తగ్గించే దిశగా ఆలోచిస్తోంది. రెవెన్యూ శాఖలో భారీ సంస్కరణలు తీసుకురావాలని యోచిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త రెవెన్యూ చట్టంలో తహసీల్దార్ల అధికారాల కుదింపుపై స్పష్టతనిచ్చే అవకాశముంది. సెప్టెంబర్‌లో జరిగే శాసనసభ సమావేశాల్లో ముసాయిదా రెవెన్యూ కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గత కొన్నాళ్లుగా నూతన రెవెన్యూ చట్టంలో పొందుపరచాల్సిన అంశాలపై ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ చర్చోపచర్చలు సాగిస్తోంది. అయితే, పురపాలక సంఘాల పదవీకాలం ముగియడం.. కొత్త చట్టంతోనే మున్సి‘పోల్స్’కు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించడంతో రెవెన్యూ చటాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఈ చట్టం మనుగడలోకి రావడంతో ఇక కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు ముసాయిదా చట్టం తయారీలో తలమునకలైంది. తేలనున్న వీఆర్ఓల భవితవ్యం... రెవెన్యూ వ్యవస్థను సంస్కరించనున్నట్లు పలు సందర్భాల్లో ప్రకటించిన సీఎం.. ఇటీవల పంద్రాగస్టు ప్రసంగంలోనూ బూజుపట్టిన చట్టాలకు పాతర వేయనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అమలులో ఉన్న 124 రెవెన్యూ చట్టాల్లో కాలం చెల్లినవాటికి మంగళం పాడనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కొన్ని చట్టాలను ఒకే గొడుగు కిందకు తేవాలని యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. భూ యాజమాన్య హక్కు (మ్యుటేషన్) జారీని సరళతరం చేయడమే గాకుండా.. పారదర్శకంగా చేసే విధానాన్ని ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ క్రమంలోనే మ్యుటేషన్ చేసే అధికారాలను తహసీల్దార్లకు కాకుండా ఆర్డీఓ లేదా జాయింట్ కలెక్టర్లకు కట్టబెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. రెవెన్యూ శాఖ భ్రష్టు పట్టడానికి కిందిస్థాయి ఉద్యోగుల అవినీతే కారణమని బలంగా విశ్వసిస్తున్న సీఎం.. వీఆర్ఓ, వీఆర్ఏ వ్యవస్థ రద్దు లేదా పంచాయతీరాజ్, వ్యవసాయశాఖలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పరిశీలనలో ‘టైటిల్ గ్యారంటీ’చట్టం... భూమి హక్కులకు సంపూర్ణ భద్రత, పూర్తి భరోసా ఇచ్చే ‘టైటిల్ గ్యారంటీ’చట్టాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో.. మన రాష్ట్రంలో కూడా దీని అమలుకు సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేస్తోంది. మూడేళ్ల క్రితమే రాజస్తాన్.. పట్టణ ప్రాంత భూముల కోసం ‘టైటిల్ సర్టిఫికేషన్’చట్టాన్ని తీసుకొచ్చింది. గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ముసాయిదాలను రూపొందించుకున్నాయి. భూ హక్కుకు పూర్తి హామీ ఇచ్చే ఈ చట్టం అమలులోకి వస్తే పదుల సంఖ్యలో ఉన్న భూరికార్డుల స్థానంలో భూ యాజమాన్య హక్కులకు అంతిమ సాక్ష్యంగా టైటిల్ రిజిస్టర్ ఉండనుంది. తద్వారా భవిష్యత్‌లో భూ వివాదాలకు ఆస్కారం ఉండదని సర్కార్ భావిస్తోంది. అయితే, ఈ చట్టం మనుగడలోకి తేవాలంటే భూ సమగ్ర సర్వే తప్పనిసరి. ఈ సాధకబాధకాలను అంచనా వేసిన తర్వాతే దీనిపై ముందడుగు వేసే అవకాశముంది. నీతి ఆయోగ్ సిఫార్సులు, పక్క రాష్ట్రం అమలు చేస్తున్న తరుణంలో ఇక్కడ కూడా ఈ చట్టాన్ని తీసుకొస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని నిపుణుల కమిటీ సూక్ష్మంగా పరిశీలిస్తోంది. -
చకచకా రెవెన్యూ ముసాయిదా చట్టం
సాక్షి, హైదరాబాద్: కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనలో ప్రభుత్వం చకచకా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ సలహాదారు, మాజీ సీఎస్ రాజీవ్‌శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ రూపొందిస్తోన్న నూతన చట్టానికి ఈ నెలాఖరులో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేసే దిశగా అడుగులు పడుతున్నా యి. కేవలం కొత్త చట్టానికి పరిమితంకాకుండా రెవెన్యూ శాఖనూ సంస్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో రెవెన్యూశాఖను రద్దు చేయ డమా? లేక ఉద్యోగులను ఇతర శాఖల్లో విలీనం చేయడమా? అనే అంశంపైనా ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న వేర్వేరు చట్టాలను ఒక్కగొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచనతో ముసాయిదా చట్టాన్నిరూపొందిస్తోంది. భూ వివాదాలకు తావు లేకుండా, రెవెన్యూ వ్యవస్థను అవినీతిరహితంగా మలిచేలా కొత్త చట్టానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో దానికి అనుగుణంగా చట్టం రూపకల్పన చేస్తామని అధికారులు చెబుతున్నారు. టైటిల్ గ్యారంటీకే మొగ్గు.. కొత్త రెవెన్యూ చట్టంపై లోతుగా అధ్యయనం చేస్తున్న సర్కారు.. టైటిల్ గ్యారంటీ చట్టంతోనే భూవివాదాలకు అంతిమ పరిష్కారం లభిస్తుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలు, రాష్ట్రాల్లో అమలు చేస్తున్న చట్టాలను మదింపు చేస్తున్న కమిటీ.. టైటిల్ గ్యారంటీయే కాకుండా ప్రత్యామ్నాయాలనూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టైటిల్ గ్యారంటీ చట్టం తేవడం సులువే అయినా.. ఆచరణలోకి వచ్చేసరికి సవాలక్ష సమస్యలున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. రికార్డుల ఉన్నతీకరణ, భూ సరిహద్దులపై స్పష్టత లేకపోతే టైటిల్ గ్యారంటీ సాధ్యపడదని స్పష్టం చేస్తున్నాయి. దీంతో సమగ్ర భూసర్వే అనంతరమే టైటిల్ గ్యారంటీ అమలు చేసే వీలుంది. ఇదిలావుండగా త్వరలో జరిగే శాసనసభ సమావేశాల్లో టైటిల్ గ్యారంటీకి ఆమోద ముద్ర వేసి.. దశలవారీగా అమలు చేయనున్నట్లు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు చెప్పాయి. అంశాలపై జాగ్రత్త.. కొత్త చట్టంలో ఏయే అంశాలను పొందుపరుస్తున్నారు? ఇతర శాఖల్లో ఉద్యోగుల విలీనం? రెవెన్యూ వ్యవస్థలో చేపట్టే సంస్కరణలపై సమాచారం బయటకు పొక్కకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. రెవెన్యూ శాఖ రద్దు, ఉద్యోగుల విలీనంపై ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ఆందోళనలు చేస్తుండటంతో అనవసర రాద్ధాంతానికి ఆస్కారం ఇవ్వకూడదని అనుకుంటోంది. అయితే, మంత్రుల సంఖ్యకు అనుగుణంగా శాఖల కూర్పు జరపాలనిచూస్తున్న సీఎం కేసీఆర్.. రెవెన్యూ శాఖతోనే ఇతర శాఖల కుదింపుపైనా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది. వీఆర్వో, వీఆర్ఏల లెక్క తీయండి.. గ్రామస్థాయిలో సేవలందించే గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుల(వీఆర్ఏ) సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తానని ప్రకటించిన సీఎం.. జూన్‌లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శరత్ అనే రైతుతో ఫోన్లో మాట్లాడుతూ ప్రకటించారు. ఇందులో భాగంగానే వీఆర్వో, వీఆర్ఏల వివరాలను రాబడుతున్నట్లు తెలుస్తోంది. అవినీతి సిబ్బందితో రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందని భావిస్తున్న సీఎం.. శాఖలో సంస్కరణలు తీసుకురావాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే కిందిస్థాయి ఉద్యోగులను పంచాయతీరాజ్ శాఖలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వీఆర్వో, వీఆర్ఏల వివరాలను పంపాలని జిల్లా కలెక్టర్లకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వీఆర్వోల కేడర్ స్ట్రెంత్ 7,039 కాగా, 5,088 పనిచేస్తున్నారని, అలాగే వీఆర్ఏల కేడర్ స్ట్రెంత్ 24,035 కాగా, 22,174 మంది పనిచేస్తున్నట్లు ఆర్థిక శాఖ గణాంకాలు చెబుతున్నాయని, ఈ లెక్కన జిల్లాలవారీగా ఉద్యోగుల వివరాలను నిర్దేశిత నమూనాలో పంపాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖలో జరుగుతున్న సంస్కరణల కారణంగానే ఇప్పుడు ఈ వివరాలను ప్రభుత్వం సేకరిస్తోందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. -
యాచకుల పునరావాస కల్పనపై కమిటీ
సాక్షి, హైదరాబాద్: పట్టణ ప్రాంతాల్లోని యాచకుల పునరావాస కల్పనపై రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ వెల్లడించారు. మంగళవారం సచివాలయంలో యాచకుల పునరావాసంపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..త్వరలో ఎన్జీవో, ప్రభుత్వేతర సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి యాచకుల పునరావాసానికి మార్గదర్శకాలు రూపొందిస్తామన్నారు. యాచకులకు ఉచిత వైద్య సేవలతో పాటు, స్వయం ఉపాధిని కల్పిస్తామనిమున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు. -
స్వేచ్ఛ, అధికారమే ఎజెండా
సాక్షి, హైదరాబాద్ రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం కావాలని.. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థల్లో మార్పులు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలు, విభిన్న వర్గాలున్న భారతదేశానికి అవసరమైన అభివృద్ధి ఎజెండాను రూపొందించాల్సిన అవసరముందని చెప్పారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు.. ఇలా అన్ని విషయాల్లో స్పష్టమైన ఎజెండా రూపొందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న విధానాలు, పద్ధతులు, చట్టాలను సంపూర్ణంగా అధ్యయనం చేసి.. అవసరమైన మార్పులు తెచ్చే విషయంపై వివిధ రంగాల నిపుణులు, సీనియర్ అధికారులు మార్గనిర్దేశనం చేయాలని కోరారు. దేశంలోని అన్ని ప్రాంతాలు, అన్నివర్గాలకు చెందిన వారు ఈ ప్రయత్నంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించడంతోపాటు, ప్రస్తుత విధానాల్లో మంచి చెడులపై చర్చించారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, క్రియ స్వచ్ఛంద సంస్థ సీఈవో బాలాజీ ఊట్ల, పలువురు రిటైర్డ్ అధికారులు, సీఎంవో అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇన్నేళ్లయినా సమస్యలే.. అనుకున్న పురోగతి రావడం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ప్రగతి పథంలో దూసుకెళుతున్నా.. మన దేశంలో ప్రజలు ఇంకా ప్రాథమిక అవసరాలు తీరకుండా ఉన్నారు. చాలా సమస్యలు పరిష్కారం కావడం లేదు. దేశ ప్రజలందరికీ మంచినీరు అందడం లేదు. విద్యుత్ అందడం లేదు. సాగునీటి సౌకర్యం లేదు. ఇంకా చాలా అవసరాలు తీరడం లేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల మధ్య జల వివాదాలు పరిష్కారం కావడం లేదు. కేంద్ర–రాష్ట్ర సంబంధాల విషయంలోనూ అనేక కమిషన్లు, నిపుణులు సూచించిన సంస్కరణలు అమలు కావడం లేదు. ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తి పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదు. ఈ పరిస్థితుల్లో దేశాభివృద్ధికి కావాల్సిన ఎజెండాను రూపొందించాల్సిన అవసరముంది..’’అని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాల్లో తెలంగాణ రాష్ట్రం అనేక మైలురాళ్లను అధిగమించిందని.. ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆదర్శంగా నిలిచాయని పేర్కొన్నారు. ఈ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడంతో పాటు, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి జాబితాతో సమస్యలు.. దేశంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య.. ఏయే శాఖలు ఎవరి వద్ద ఉండాలనేది నిర్ణయం జరగాలని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి జాబితా అమల్లో ఉండడం వల్ల ఒకేశాఖకు సంబంధించి వేర్వేరు పథకాలు, కార్యక్రమాలు అమలవుతున్నాయని.. దానివల్ల క్షేత్రస్థాయిలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపారు. దానిని పరిష్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు సామాజిక పరిస్థితులు ఉన్నాయని, వాటికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకోవాల్సి ఉందని... ఈ విషయంలో రాష్ట్రాలకు స్వేచ్ఛ, అధికారం కావాలని స్పష్టం చేశారు. న్యాయ, పరిపాలన, శాసన వ్యవస్థలలో మార్పులు రావాలన్నారు. దేశంలో తీసుకురావాల్సిన మార్పులు, సంస్కరణలు, చట్ట సవరణలు, రాజ్యాంగ సవరణలు తదితర అంశాల్లో స్పష్టమైన ఎజెండా రూపొందాలని చెప్పారు. దేశంలోని అధికారులు, రాజకీయ నాయకులు, రిటైర్డ్ అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ సూచనలు ఇవ్వాలని.. తమ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. -
నీటి ప్రాజెక్టులకు నిధులిస్తాం: పీఎఫ్సీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థలు చేపడుతున్న పవర్ ప్లాంట్లు, ఇతర నిర్మాణాలకు ఆర్థిక చేయూత అందించిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా (పీఎఫ్సీ).. నీటి పారుదల ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్ సదుపాయాలు కల్పించేందుకు సైతం నిధులు సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. పీఎఫ్సీ చైర్మన్ రాజీవ్ శర్మ బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి తమ సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం విద్యుత్ సౌధలో జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీ డి.ప్రభాకర్ రావుతో సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంపై చర్చించారు. 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న మణుగూరు ప్లాంటు నిర్మాణం పూర్తయిందని, వచ్చే నెల చివరి నాటికి విద్యుదుత్పత్తి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభాకర్ రావు చెప్పారు. 1,080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి ప్లాంటులోని రెండు యూనిట్లను ఈ ఏడాది డిసెంబర్ చివరికి, మిగతా రెండు యూనిట్లను వచ్చే ఏడాది జూన్‌కు ప్రారంభిస్తామని వెల్లడించారు. 4,000 మెగావాట్ల యాదా ద్రి పవర్ ప్లాంటు నిర్మాణం వేగంగా జరగుతున్నదని చెప్పారు. 3,000కు పైగా మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తిని తెలంగాణ సాధించిందని వెల్లడించారు. 10వేల మైలురాయిని దాటిన విద్యుత్ డిమాండ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 10వేల మైలురాయిని దాటింది. బుధవారం ఉద యం 10,100 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని పీఎఫ్సీ చైర్మన్, ఇతర అధికారులు గుర్తించారు. ఇంత డిమాండ్ ఏర్పడినా ఎక్కడా కోత లేకుండా విద్యుత్ సరఫరా చేయడం అభినందనీయమని ప్రభాకర్ రావు అన్నారు. -
దిగ్గజాల రూటే వేరు!
న్యూఢిల్లీ: దేశీయ ఈ కామర్స్ మార్కెట్లో దిగ్గజాలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తమ వాటాను పెంచుకునేందుకు 2018 సంవత్సరంలో భిన్న విధానాలను ఆచరణలో పెట్టనున్నాయి. ఇప్పటి వరకు ఈ రెండు సంస్థలు ఈ కామర్స్ మార్కెట్లో పై చేయి సాధించేందుకు గాను తీవ్ర స్థాయిలో పోటీ పడ్డాయి. అగ్ర స్థానం కోసం మార్కెటింగ్ వ్యూహాల పరంగా ఒకదాన్ని ఇంకొకటి అనుకరించేవని విశ్లేషకులు పేర్కొంటున్నారు. కానీ, కొత్త ఏడాదిలో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భిన్నంగా అడుగులు వేయనున్నట్టు అంచనా వేస్తున్నారు. చైనా అలీబాబా వెన్నుదన్నుతో పేటీఎం మాల్ సైతం మూడో పక్షంగా అవతరించనుందని భావిస్తున్నారు. చిన్న పట్టణాలపై ఫ్లిప్‌కార్ట్ గురి ఈ కామర్స్ మార్కెట్లో అతిపెద్ద ప్లేయర్‌గా ఉన్న ఫ్లిప్‌కార్ట్ చిన్న పట్టణాల్లో మరింత మంది కస్టమర్లను ఆకట్టుకోవడంపై దృష్టి సారించనుంది. తన సొంత బ్రాండ్ ఉత్పత్తులతో వినియోగదారులను చేరువ కావాలన్న వ్యూహంతో ఉంది. అమెజాన్ ప్రీమియం కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించనుంది. మొత్తం మీద ఇరు కంపెనీలు ప్రస్తుత తమ స్థానాలను పటిష్టంగా కాపాడుకుంటూనే కొత్త మార్కెట్లలోకి ప్రవేశించే విధానాలను అమలు చేయబోతున్నాయి. ‘‘మొదటి సారి ఈ కామర్స్ మార్కెట్ లీడర్లయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ రెండు భిన్న మార్గాలను అనుసరించడాన్ని చూడబోతున్నాం’’అని హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ అండ్ క్యాపిటల్ మార్కెట్స్ (ఇండియా) అనలిస్ట్ రాజీవ్ శర్మ పేర్కొన్నారు. కేవలం సరుకుల అమ్మకాల విలువ (జీఎంవీ)పైనే ఈ మార్కెట్ ఎంతో కాలం కొనసాగకపోవచ్చని, ఆన్లైన్ కొనుగోలుదారులు, మళ్లీ మళ్లీ కొనుగోళ్లు, కొత్త విభాగాలలో వృద్ధి ఉండొచ్చని ‘ఇండియా ఇంటర్నెట్: ఆన్ ద వే టు ఇండియా ఈ కామర్స్ 2.0’ పేరుతో విడుదల చేసిన నివేదికలో రాజీవ్ శర్మ వివరించారు. స్టోర్‌లో అన్ని ఉత్పత్తులు లభించేలా, కస్టమర్లు ఆశించేవన్నీ అందుబాటులో ఉండేలా చూడడమే తమ లక్ష్యమని అమెజాన్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు. మెట్రోలకు వెలుపల విస్తరించి ఉన్న పట్టణాల్లోని కస్టమర్లకు చేరువ కావాలన్నది ఫ్లిప్‌కార్ట్ యోచన. ప్రైవేటు లేబుల్స్ ఉత్పత్తుల ద్వారా వారిని చేరువ కావాలనుకుంటోంది. ఫ్లిప్‌కార్ట్ మొత్తం విక్రయాల్లో దాని సొంత లేబుల్స్ ఉన్న ఉత్పత్తుల విలువ 15 నుంచి 20 శాతం వరకు ఉంది. వాస్తవానికి ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత అమ్మకాల్లో 45 శాతం చిన్న పట్టణాల నుంచే వస్తోంది. అమెజాన్ కూడా చిన్న పట్టణాల మార్కెట్‌ను సొంతం చేసుకునే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం అమెజాన్ విక్రయాల్లో 65 శాతం వాటా మెట్రో నగరాల నుంచే ఉంది. ఇందులోనూ ‘అమెజాన్ ప్రైమ్’ పాత్ర కీలకం. అమెజాన్ ఇండియా ఫ్యాషన్, కిరాణా ఉత్పత్తులపైనా ప్రత్యేకమైన దృష్టి సారించనుంది. -
ఆ పనుల వేగం పెంచండి
ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు నిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ప్రభుత్వ ప్రధాన సలహాదారు డాక్టర్ రాజీవ్ శర్మ ఆదేశించారు. ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు నిర్మాణాలపై గురువారం సచివాలయంలో రాజీవ్ శర్మ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. టెక్స్టైల్ పార్కుకు సంబంధించి రోడ్డు నిర్మాణంతో పాటు మాస్టర్ ప్లాన్, ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నిధుల సమీకరణ, వివిధ కంపెనీలతో ఎంవోయూ, యాంకర్ యూనిట్, డీపీఆర్, సీఈటీపీ నిర్మాణం తదితర అంశాలను ప్రస్తావించారు. ఫార్మాసిటీకి సంబంధించి, రోడ్డు నిర్మాణ పనులు, భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. -
జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
-
జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు
కలెక్టర్లకు అన్ని అంశాలపై అవగాహన అవసరం 14న జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రగతిభవన్‌లో ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్ వ్యవస్థీకరణ ఫలితాలు ప్రజలకు అందేలా అవసరమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ శాఖల పనితీరులో గణనీయమైన మార్పు రావాలని ఆకాంక్షించారు. జిల్లాల ప్రాధాన్యతలను బట్టి ప్రభుత్వ కార్యక్రమాలుండాలని, ప్రతి జిల్లాకు ఒకేరకమైన పద్ధతి అవలంబించాల్సిన అవసరం లేదన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత కలెక్టర్లు విధుల్లో చేరి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో జిల్లాలపై వారికి కొంత అవగాహన వచ్చి ఉంటుందని, మరికొన్ని అంశాల్లో అధ్యయనం చేసేలా వారికి మార్గదర్శకం చేయాలన్నారు. నెల 14న హైదరాబాద్‌లో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సలహాదారులు బి.పాపారావు, ఏకే గోయల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర, సీనియర్ అధికారులు ఎన్.నర్సింగరావు, సోమేష్‌కుమార్, శాంతికుమారి, నవీన్‌మిట్టల్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్ తదితరులు హాజరయ్యారు. నో యువర్ డిస్ట్రిక్ట్- ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్... జిల్లాల వారీగా ప్రత్యేక ప్రణాళికల రూపకల్పన, అమలుకు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ’’నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్’’ కార్యక్రమాలను కలెక్టర్లకు అప్పగించనున్నట్లు వివరించారు. దీంతో జిల్లా గురించి సమగ్ర సమాచారం తెలుసుకోవడంతో పాటు ఆ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు తయారుచేసేలా జిల్లా అధికార యంత్రాంగాన్ని తీర్చిదిద్దాలన్నారు. జిల్లాలో ఎన్ని కుటుంబాలున్నాయి? వాటి ఆర్థిక, సామాజిక స్థితిగతులేమిటి? రహదారుల పరిస్థితి ఎలా ఉంది? రైల్వే లైన్ల వ్యవస్థ తీరు..? నీటి పారుదల ప్రాజెక్టుల స్థితి..? ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ.. మిషన్ భగీరథ పనులు ఎలా నడుస్తున్నాయి..? బ్యాంకింగ్ వ్యవస్థ విస్తరణ ఎలా ఉంది..? నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించడానికి తీసుకుంటున్న చర్యలు...లాంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యవసాయ రంగం, ఉద్యానసాగు, పరిశ్రమల ఏర్పాటు, అస్పత్రుల నిర్వహణ, వైద్య, ఆరోగ్య శాఖలో లోపాలు, విద్యారంగం పరిస్థితి, పాఠశాలల్లో పిల్లల చేరిక, డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు, అసైన్డ భూముల వినియోగం, అటవీ భూముల పరిస్థితి, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వినియోగం, భవన నిర్మాణాలకు అనుమతులు, గురుకుల విద్యాసంస్థల పనితీరు, విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ల నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్లు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. సీనియర్ అధికారులు కూడా ఈ అంశాలపై కలెక్టర్లు నివేదికలు సమర్పించేలా చూడాలన్నారు. ప్రతి జిల్లాకు ప్రత్యేక పరిస్థితులు, వనరులు, బలాలు, బలహీనతలు ఉంటాయని, వీటిని బేరీజు వేసుకుని జిల్లాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. జనాభా వారీగా రాష్ట్రంలోని 31జిల్లాలను నాలుగు భాగాలుగా విభజించి వేర్వేరు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని, పండ్లు, కూరగాయలు, తోటల సాగును ప్రోత్సహించాలని, ఇందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ప్రభుత్వం క్రియాశీలంగా వ్యవహరించాలని, ఇందుకు జిల్లా పరిపాలనా విభాగాలు సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. చిత్తశుద్ధితో పనిచేస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయని, సంక్షోభంలో ఉన్న విద్యుత్‌రంగాన్ని మెరుగుపర్చడమే ఇందుకు ఉదాహరణ అని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయాల్సిన సంస్థలు, కేంద్రంనుంచి రావాల్సిన నిధులకు సంబంధించి నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. -
రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్ : కేసీఆర్
-
నాన్నే నాకు ఆదర్శం
⇒ కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర ⇒ సబ్బులమ్ముకొని బతుకుతవా.. పది మందికి సేవ చేస్తావా అన్నారు ⇒ అప్పుడే రూట్ మార్చుకున్నా.. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యా ⇒ ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా సాక్షి, హైదరాబాద్: ‘‘సబ్బులమ్ముకొని బతుకుతవా.. పది మందికి సేవ చేస్తావా..! నువ్వే ఆలోచించుకో.. ప్రజలకు సాయం చేయటంలో ఉన్నంత సంతృప్తి ఎందులో లేదు. ఉన్నత చదువు చదివితే సరిపోదు. అది ప్రజలకు ఉపయోగపడాలి.. అని మా నాన్న చంద్రయ్య అన్న మాటలే ఇప్పటికీ నాకు స్ఫూర్తి. అప్పుడు నేను ముంబైలో హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తయ్యాక ఆ ఉద్యోగంలో చేరాను. నాన్నకు అది నచ్చలేదు. అంతకంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగం చేయాలని వెన్నుతట్టాడు. అప్పుడే రూట్ మార్చుకున్నాను. సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లాను. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యాను’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్ర చెప్పారు. ‘‘గతంలో మా నాన్న చంద్రయ్య ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. చిన్నతనంలో తన వెంట తీసుకెళ్లేవాడు. మార్కాపురం చుట్టు పక్కల ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలు అప్పుడే పరిచయం. గ్రామీణ ప్రజల కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూశాను’’అని ఆయన తన మనోగతాన్ని గుర్తు చేసుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రదీప్ చంద్ర మీడియాతో మాట్లాడారు. నాన్న స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగానని, ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజా సంక్షేమం లక్ష్యంగా చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు పని చేస్తా. ఆయన ఆశయాలు సాధించటమే బాధ్యత గల అధికారులుగా మా అందరి ముందున్న లక్ష్యం. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు పరిపాలనా ఫలాలు అందించే లక్ష్యానికి చేరువయ్యాం. జిల్లాల పరిధి తగ్గినందున జనాభా తగ్గింది. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత ఆస్కారం ఏర్పడింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇంటింటికీ చేరేలా కార్యాచరణ చేసుకుంటాం’’అని వివరించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తాం రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి అపరిష్కృత సమస్యలు ఇంకా ఉన్నాయని ప్రదీప్ చంద్ర చెప్పారు. తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, ఉద్యోగుల విభజన ఇప్పటికీ సంపూర్ణం కాలేదని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధానానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అది అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. జటిలమైన సమస్య. ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకుంటాం. చిన్న నోట్లు అందుబాటులో లేకపోవటంతో పట్టణాల్లో కంటే పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నఫళంగా క్యాష్‌లెస్ విధానం అక్కడ అమల్లోకి తీసుకురావటం కూడా కష్టమే. అక్కడ నగదు నోట్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటా నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తాం. మార్కెట్ కమిటీలు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో ఈ వాలెట్ పద్ధతి ప్రవేశపెడతాం’’ అని సీఎస్ చెప్పారు. -
రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిబద్ధతతో పనిచేశారు: సీఎం కేసీఆర్ అధికారులను ధైర్యంగా ముందుకు నడిపించారు ఆయన కృషి వల్లే ఒక్కరోజులోనే ‘సమగ్ర సర్వే’ చేయగలిగాం సచివాలయంలో రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియామకం సీఎంకు రుణపడి ఉంటా: రాజీవ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌శర్మ నిబద్ధతతో పనిచేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాష్ట్ర విభజన సమయంలో తలెత్తిన విపత్కర పరిస్థి తుల్లోనూ రాజీవ్ శర్మ ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఓపికగా తన బాధ్యతలు నిర్వహించారని, ప్రభుత్వ కార్యక్రమాలన్నిం టా అధికారులను అదే తీరుగా ముందుకు నడిపించారని అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు పది పన్నెండు అవార్డులు అందుకుందన్నారు. రాజీవ్‌శర్మ వీడ్కోలు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో పూర్తి చేయ గలిగామంటే అది రాజీవ్‌శర్మ కృషి ఫలితమేన న్నారు. ఇటీవల హరియాణాలో అదే తరహా సర్వే చేయించేందుకు అక్కడి ముఖ్యమంత్రి తెలంగాణకు వెళ్లి అధ్యయనం చేసి రావాలంటూ అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించారని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రమై నప్పటికీ మన అనుభవాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, రాజీవ్శర్మలాంటి అధికారులు ఉండటం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించటంలో ఆయన పాత్ర మరవలేనిదని గుర్తు చేశారు. కొత్త కలెక్టర్లు, ఎస్పీలు, 16,500 మంది ఉద్యోగుల నియామకాలన్నీ ఒడిదుడు కులు లేకుండా సాఫీగా పూర్తి చేయగలిగారని అభినందించారు. విభజన చట్టంలో ప్రతి పేజీ, ప్రతి అంశంపై రాజీవ్‌శర్మకు పట్టు ఉందని, అందుకే ఏపీ నుంచి, కేంద్రం నుంచి ఎదురైన సవాళ్లను సునాయాసంగా అధిగమించారని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా.. తెలంగాణ ప్రథమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అందించిన సేవలను ప్రభుత్వం చిరకాలం గుర్తుంచుకుంటుందని సీఎం అన్నా రు. పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన సేవ లను విస్తృతంగా వినియోగిం చుకుంటామని చెప్పారు. అందుకే ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు ఆయనను చీఫ్ సెక్రటరీగానే భావించి సమీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి నపుడు తొలి సీఎస్‌గా పని చేసిన శివరాజ్‌సింగ్ సేవలను పదవీ విరమణ తర్వాత కూడా అక్కడి ప్రభు త్వం వినియోగిం చుకుంటోందన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేబినెట్ హోదా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారని, పద మూడేళ్ల తర్వాత కూడా శివరాజ్‌సింగ్ అదే హోదాలో ఉన్నారని గుర్తు చేశారు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన రాజీవ్ శర్మ సెంచరీ చేశారన్న కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర మాటలతో సీఎం ఏకీభవించారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెనే కాదని.. రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్ అని కితాబిచ్చారు. అధికారిగా ఉండే పరిమితులు ఇప్పుడు లేకపోవటంతో ఆయన సేవలు రాజకీయంగానూ వాడుకునే అవకాశముందని అన్నారు. మరింత ఉత్సాహంతో పని చేయాలని కోరారు. ప్రదీప్‌చంద్ర సమర్థుడు: సీఎం కొత్త సీఎస్‌గా నియమితులైన ప్రదీప్ చంద్ర నైపుణ్యమున్న అధికారి అని, ఎంతో ఓపికతో పని చేసే గుణముందని సీఎం ప్రశంసించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) రూపకల్పన సమయంలో ఆయనతో ఇరవై ముప్పై సార్లు చర్చోపచర్చలు చేశామన్నారు. చెప్పిన మార్పుచేర్పులన్నీ సమకూర్చి ప్రపంచ దృష్టినీ ఆకర్షించే విధానాన్ని తయారు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాతో రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. జీవితంలో దక్కిన గొప్ప గౌరవం: రాజీవ్‌శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ఎంతగానో రుణపడి ఉంటానని రాజీవ్ శర్మ అన్నారు. ఈ అవకాశం జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవ మని పేర్కొన్నారు. తెలంగాణకు తన సేవలు కొనసాగిస్తానని, కొత్తగా అప్పగిం చిన బాధ్యతలు మరింత చక్కగా నిర్వహి స్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతన సీఎస్ ప్రదీప్ చంద్ర, మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, చందూలాల్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలు వురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌శర్మను సీఎం, మంత్రు లు, అధికారులు ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. వివిధ ఉద్యోగ సంఘాలు, అధికారులు కూడా ఆయనను ఘనంగా సన్మానించి ఆత్మీ యంగా వీడ్కోలు పలికారు. -
తెలంగాణ కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర
-
తెలంగాణ కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించడంతో సాయంత్రం ప్రదీప్ చంద్ర బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఈ రోజు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కొత్త రాష్ట్రానికి రెండో సీఎస్‌గా ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరిస్తున్నారు. తొలుత ఈ బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది కాస్తంత ఉత్కంఠగా మారినా ప్రదీప్ చంద్రనే ఖరారు చేశారు. సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రనే రేసులో ముందున్నారు. మంగళవారం రాత్రి వరకు కూడా సీఎస్ నియామకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలోనే ఉంది. దీంతో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు తాజాగా వెలువడ్డాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది అధికారులు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వారిలో కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమించేందుకు సీఎం మొగ్గు చూపారు. రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులలో రాజీవ్‌శర్మ తర్వాత సీనియర్ ప్రదీప్ చంద్ర. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలక విభాగాల్లో.. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావడంతోపాటు వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రదీప్ చంద్రనే సీఎస్‌గా నియమించారు. మరోపక్క, మాజీ ఎంపీ వివేక్‌ను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా వివేక్ కొనసాగుతారు. -
రాజీవ్ శర్మ వారసుడు ఈయనేనా?
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన పదవీ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కాగా, రాష్ట్రానికి కొత్త సీఎస్ గా ఎవరిని నియమిస్తారనే విషయం మీద మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, కొత్త సీఎస్ గా ప్రదీప్ చంద్ర ఈ సాయంత్రం బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. సీఎస్ పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక సలహాదారుగా రాజీవ్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నారు. -
తెలంగాణకు కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర!
-
ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి
నల్లగొండ : భారత ప్రభుత్వం ఇటీవల రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినందున ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సలో నోట్ల రద్దు వల్ల ఆయా జిల్లాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ప్రజలు నోట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు తగ్గించి ఆన్లైన్, స్మార్ట్‌ఫోన్, స్వైప్ మిషన్‌స ద్వారా జరిపే విధంగా అవగాహన కల్పించాలని కోరారు. డిజిటల్ అక్షరాస్యతను ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, సహకార సంఘాలు, మార్కెట్‌యార్డులు, ఎరువులు, విత్తనాల విక్రయ కేంద్రాలు, మెడికల్‌షాపులు, పెట్రోల్‌బంకులు, గ్యాస్ డీలర్లు వంటి ప్రజా వినియోగ ఆర్థిక లావాదేవీలను నగదు రూపంలో కాకుండా డెబిట్‌కార్డుల ద్వారా నిర్వహించాలని సూచించారు. కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ నల్లగొండ జిల్లాలో 204 ఏటీఎంల ద్వారా ప్రజలకు సేవలు అందించడానికి సుమారు వంద కోట్లు అవసరముంటుందన్నారు. ప్రస్తుతం 128 ఏటీఎంలలో రూ.100 నోట్లను ప్రజలకు అందుబాటులో ఉంచామని తెలిపారు. జిల్లాలో నగదు రహిత (క్యాష్‌లెస్) లావాదేవీలను జరిపేందుకు పెద్ద వ్యాపార సంఘాలు, పెట్రోల్ బంకు యజమానుల నుంచి స్వైప్మిషన్ల కోసం 179 దరఖాస్తులు వచ్చాయన్నారు. అదే విధంగా నూతన ఖాతాలు తెరిచేందుకు 861 అప్లికేషన్లను వివిధ బ్యాంకుల ద్వారా పంపిణీ చేసినట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వి.రామకృష్ణారావు, లీడ్‌బ్యాంకు మేనేజర్ సూర్యం, డీఆర్వో అంజయ్య, అటవీశాఖాధికారి శాంతారామ్, బ్యాం కు అధికారులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో అగ్రగామి: రాజీవ్‌శర్మ
- సీఎం మార్గదర్శనంతో రాష్ట్రం దూసుకుపోతోంది - విద్య, వైద్య, సాగు రంగాలపై దృష్టి సారిస్తే మనమే నంబర్ వన్ - కేంద్రం సహకారం బాగానే ఉంది.. - విభజన సమస్యల్ని త్వరగా పరిష్కరించాలి - నేడు పదవీ విరమణ చేయనున్న సీఎస్ సాక్షి, హైదరాబాద్: సవాళ్లను అధిగమిస్తూ నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీర్చిదిద్దామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందని, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై పూర్తి స్థారుులో దృష్టి సారిస్తే అగ్రగామి రాష్ట్రంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్త రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం బాగానే ఉందని.. ఏపీతో ఉన్న విభజన సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. బంగారు తెలంగాణ స్వప్నం సాకారమవుతుందని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ శర్మ మీడియాతో తన మనోగతాన్ని పంచుకున్నారు. తెలంగాణ తొలి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్ శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పదవిలో ఉన్న ఆయన.. ఆర్నెళ్ల పదవీ కాల పొడిగింపుతో ఇప్పటిదాకా సీఎస్‌గా కొనసాగారు. ఈ నేపథ్యంలో విభజన అంశాలు మొదలుకొని రాష్ట్ర అభివృద్ధి వరకు పలు అంశాలపై తన మనోగతాన్ని పంచుకున్నారు. అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లా.. కేంద్ర హోంశాఖలో నోడల్ అధికారిగా.. శ్రీకృష్ణ కమిటీకి, విభజన బిల్లు తయారీ సమయంలో మంత్రుల బృందానికి తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను వివరించానని సీఎస్ చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల విషయంలో జరిగిన అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని పరిధి అంశంపై విసృ్తత చర్చ జరిగిందని, హెచ్ఎండీఏ పరిధిని ఖరారు చేస్తే 42 శాతం రాష్ట్రం రాజధాని అవుతుందని వివరించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే తనకు అత్యంత సంతృప్తి ఇచ్చిన అంశమని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం విద్యుత్ సంక్షోభం, ఉద్యోగులు, అధికారుల విభజన, విభజన చట్టానికి సంబంధించిన సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ ముందుకెళ్లామని వివరించారు. సమగ్ర కుటుంబ సర్వేను అతి పెద్ద సవాల్‌గా తీసుకొని విజయవంతం చేశామన్నారు. జిల్లాల ఏర్పాట్లు గొప్ప పాలనా సంస్కరణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు గొప్ప పరిపాలనా సంస్కరణ అని, ఇది అధికార వికేంద్రీకరణకు పూర్తి స్థారుులో దోహదపడుతుందని రాజీవ్ శర్మ వ్యాఖ్యానించారు. సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చి ఆసరా ఫించన్ల మొత్తాన్ని పెంచామన్నారు. రైతు రుణమాఫీ వచ్చే ఏడాదితో పూర్తవుతుందని తెలిపారు. సులభతర వాణిజ్య విధానంలో 13వ స్థానం నుంచి రాష్ట్రం మొదటి స్థానానికి రావడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. సాగునీరు, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారిస్తే నాలుగైదేళ్లలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్‌లో మరింత ముందుకు.. భవిష్యత్‌లో రాష్ట్రం మరింతగా ముందుకెళ్తుందని సీఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని, కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయని చెప్పారు. సుపరిపాలన, మౌలిక వసతులు, పారదర్శక పాలన వల్ల అత్యుత్తమ రాష్ట్రంగా నిలబడుతుందని అన్నారు. రాష్ట్రంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఉందని, అందుకే నగదు రహిత లావాదేవీల కోసం పెద్ద ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. -
కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర!
సీఎం తుది నిర్ణయం కోసం నిరీక్షణ - రేసులో ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ,ఎంజీ గోపాల్, ఆర్ఆర్ ఆచార్య కూడా.. - నేడు పదవీ విరమణ చేయనున్న రాజీవ్‌శర్మ - ఘనంగా వీడ్కోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఎవరిని నియమి స్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఇంత కీలకమైన బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర రేసులో ముందున్నారు. అరుుతే మంగళవారం రాత్రి వరకు కూడా సీఎస్ నియామకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలోనే ఉంది. దీంతో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశముంది. సీఎం నిర్ణయం మేరకే.. సాధారణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న ఐఏఎస్‌లు సీఎస్ పోస్టింగ్‌కు అర్హులవుతారు. కానీ పూర్తిగా ముఖ్యమంత్రి విచక్షణాధికారంపై ఆధారపడి ఈ నియామ కాలు జరుగుతుంటారుు. ప్రస్తుతం రాష్ట్రంలో 8 మంది అధికారులు స్పెషల్ సీఎస్ హోదాలో ఉన్నారు. వారిలో కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం సైతం ఇందుకు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కీలక శాఖలు నిర్వహించిన ప్రదీప్ చంద్ర రాష్ట్రంలోని ఐఏఎస్ అధికారులలో రాజీవ్‌శర్మ తర్వాత సీనియర్ ప్రదీప్ చంద్ర. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్య, ఆర్థిక శాఖలతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనూ కీలక విభాగాల్లో.. విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావడంతోపాటు వివిధ శాఖల్లో పనిచేసిన అనుభవం ఉండడంతో ప్రదీప్ చంద్రనే సీఎస్‌గా నియమించే అవకాశాలున్నారుు. అరుుతే ఆయన పదవీకాలం డిసెంబర్ నెలాఖరునే ముగియనుంది. అంటే నెల రోజుల్లోనే పదవీ కాలం ముగియనుండటంతో ప్రదీప్ చంద్రకు అవకాశమిస్తారా..? తదుపరి జాబితాలో ఉన్న సీనియర్లను ఎంచుకుంటారా.. అన్నది ముఖ్యమంత్రి నిర్ణయంపై ఆధారపడి ఉంది. ప్రదీప్‌చంద్ర తర్వాత సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్‌లు ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ, ఎంజీ గోపాల్, ఆర్ఆర్ ఆచార్యల పేర్లు వినిపిస్తున్నారుు. కీలక బాధ్యతలు నిర్వర్తించిన రాజీవ్‌శర్మ ఉత్తరప్రదేశ్‌కు చెందిన రాజీవ్‌శర్మ 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందినవారు. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల కలెక్టర్‌గా పనిచేయటంతో పాటు వివిధ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర హోంశాఖలో అదనపు కార్యదర్శిగానూ పనిచేశారు. ఏపీ పునర్విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీకి నోడల్ ఆఫీసర్‌గా కీలక భూమిక పోషించారు. పాలనలో మంచి అనుభవం ఉన్న నేపథ్యంలో పదవీ విరమణ అనంతరం కూడా రాజీవ్‌శర్మ సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణరుుంచారు. సీఎం సలహాదారుగా నియమించి, పరిపాలనా సంస్కరణల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోం ది. ఒకట్రెండు రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడనున్నారుు. రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు సీఎస్‌గా పదవీ విరమణ చేస్తున్న రాజీవ్ శర్మకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అధికారులతో పాటు మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సీఎస్‌కు వీడ్కోలు పలకాలని స్వయంగా సీఎం కేసీఆర్ రెండ్రోజుల కిందటి కేబినెట్ భేటీలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచీ సీఎస్‌గా ఉన్న రాజీవ్‌శర్మ పనితీరును ప్రశంసించారు. మంత్రులతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు కూడా ఈ సందర్భంగా సీఎస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. వాస్తవానికి ఈ ఏడాది మే నెలాఖరుతోనే రాజీవ్‌శర్మ పదవీకాలం ముగిసింది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు కేంద్రం.. రెండు సార్లు మూడు నెలల చొప్పున ఆయన పదవీకాలాన్ని పొడిగించింది. -
సీఎస్‌కు మంత్రివర్గం అభినందన
- రేపు వీడ్కోలు కార్యక్రమం - సీఎం సలహాదారుగా నియామకానికి ఆమోదం - కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర! - ఎవరవుతారో తనకే తెలియదన్న సీఎం!! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను రాష్ట్ర మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది. బుధవారం ఆయన పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో, సోమవారం జరిగిన కేబినేట్ భేటీలో మంత్రులంతా చప్పట్లు కొట్టి ఆయనను అభినందించారు. బుధవారం సచివాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎస్‌గా రిటైరవుతున్న రాజీవ్ శర్మను సీఎం ప్రత్యేక సలహాదారుగా నియమించేందుకు కేబినేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు సమాచారం. పాలనా సంస్కరణల బాధ్యతలను ఆయనకు అప్పగిస్తారని తెలిసింది. సచివాలయంలోని ఆరో అంతస్తులో ఆయనకు ప్రత్యేక ఛాంబర్‌ను ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కొత్త సీఎస్‌గా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్రను నియమించే అవకాశాలున్నట్లు సీఎంవో వర్గాలు వెల్లడించారుు. అరుుతే, తదుపరి ఎవరు సీఎస్ అవుతారో తనకే తెలియదని మీడియా సమావేశం అనంతరం ఒక ప్రశ్నకు బదులుగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు! -
సీఎం సలహాదారు గా రాజీవ్‌శర్మ
ఈ నెలాఖరున సీఎస్‌గా రిటైరయ్యాక కొత్త బాధ్యతలు? ► పరిపాలనా సంస్కరణల సలహాదారుగా నియామకానికి సర్కారు యోచన ► నూతన సీఎస్‌గా ప్రదీప్ చంద్రవైపు సర్కారు మొగ్గు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ ఈ నెల 30న పదవీ విరమణ అనంతరం ముఖ్యమంత్రి సలహాదారుగా కొత్త పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. వివిధ విభాగాల పరిధిలో ఇప్ప టికే ఉన్న సలహాదారుల తరహాలో పరిపా లనా సంస్కరణల సలహాదారుగా ప్రభుత్వం ఆయన్ను నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుభవజ్ఞుడు కావటం, తెలం గాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ సీఎస్‌గా ఉండటంతో రాజీవ్ శర్మ సేవలను మరికొంత కాలం వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. కొత్త జిల్లాల నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణా మాలు, క్షేత్రస్థాయిలో పరిపాలనా విభాగాల కుదింపు, సిబ్బంది సర్దుబాటు ప్రభావంతో పాటు కేంద్రంతో ముడిపడిన అంశా లను అధ్యయనం చేసే బాధ్యతలను సర్కారు రాజీవ్‌శర్మకు అప్పగించాల నుకుంటోంది. అందుకు సంబంధిం చిన ఫైలు ముఖ్యమంత్రి పరిశీల నలో ఉంది. మరోవైపు కొత్త సలహాదారుకు సీ బ్లాక్‌లో ప్రత్యేక చాంబర్ రూపుదిద్దుకుంటోంది. సీ బ్లాక్‌లోని ఆరో అంతస్తులో ఉత్తరం వైపున ఆర్ అండ్ బీ అధికారులు కొత్త చాంబర్‌ను సిద్ధం చేస్తున్నారు. అందుకు వీలుగా ప్రస్తుతం సీఎం వ్యక్తిగత కార్యదర్శి అరుణ్ కుమార్ చాంబర్‌ను కుడి పక్కనున్న సీఎం చాంబర్ వైపు మార్చారు. అక్కడే ఉన్న ప్రొటోకాల్ క్యాంటీన్‌ను అక్కణ్ణుంచి తరలించారు. దీంతో రాజీవ్‌శర్మ కొత్త పాత్రలో కొలువు దీరేందుకు మార్గం సుగమమైనట్లు స్పష్టమవుతోంది. ప్రదీప్ చంద్రకే సీఎస్ చాన్స! కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్రను నియమిం చేందుకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ముఖ్యమంత్రి సైతం అందుకు సూచనప్రా యంగా ఆమోదం తెలిపినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ప్రదీప్ చంద్ర...సీఎస్ రాజీవ్‌శర్మ తర్వాత ఐఏఎస్ అధికారుల్లో సీనియర్. ప్రస్తుతం ఆయన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక శాఖలతోపాటు ఉమ్మడి రాష్ట్రంలో కీలకమైన విభాగాల్లో, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల కలెక్టర్‌గా సైతం పని చేశారు. తెలు గు రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ కావటం తోపాటు వివిధ శాఖల్లో పని చేసిన అను భవం ఉండటంతో ఆయన్ను సీఎస్‌గా నియ మించే అవకాశాలున్నాయి. సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్‌లు ఎస్పీ సింగ్, ఎస్కే జోషీ, ఎంజీ గోపాల్, ఆర్.ఆర్. ఆచార్య పేర్లు ఉన్నప్పటికీ సీఎం మాత్రం ఈ కీలక బాధ్యతలను ప్రదీప్ చంద్రకు అప్పగించను న్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఐఏఎస్‌ల బదిలీలు వివిధ విభాగాల్లో ఉన్న అవసరాల దృష్ట్యా వచ్చే వారంలో భారీగా ఐఏఎస్ అధికారు లను బదిలీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యోచిస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రాధమిక కసరత్తు పూర్తి చేశారు. మరోవైపు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సచివాలయం తరలింపునకు బ్రేక్ పడింది. పెద్ద నోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గే ప్రమాదముండటంతో ఈ తరుణంలో సచివాలయం నిర్మాణం చేపట్టడం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది. 24న సీఎం గృహప్రవేశం ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న కొత్త క్యాంపు ఆఫీసులోకి గృహ ప్రవేశం చేయ నున్నారు. తెల్లవారుజామున నిర్ణీత సుముహూర్తంలో కొత్త నివాసంలో అడుగుపెట్టనున్నారు. బేగంపేటలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయం వెనుక ఆధు నిక హంగులతో కొత్త క్యాంపు కార్యాల యం నిర్మించటం తెలిసిందే. -
రూ.2,740 కోట్లు ఇవ్వండి
కేంద్ర బృందాన్ని కోరిన రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం నుంచి తెలంగాణను ఆదుకునేందుకు రూ.2,740 కోట్ల సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బృందాన్ని కోరింది. అకాల వర్షాలతో ఊహించని విధంగా నష్టం జరిగిం దని, పునరుద్ధరణ చర్యలు చేపట్టేందుకు ఇతోధిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బృందాన్ని కోరారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిం చి వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్లు, పంట నష్టాన్ని పరిశీలించారు. ఆదివారం హైదరా బాద్‌కు వచ్చిన బృందం వివిధ శాఖల ఉన్న తాధికారులతో భేటీ అయింది. ఈ సందర్భం గా అకాల వర్షాలతో వాటిల్లిన నష్టాన్ని సీఎస్ రాజీవ్‌శర్మ శాఖలవారీగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. భారీ వర్షాలతో రాష్ట్రంలో జరిగిన నష్టానికి తాత్కాలిక ఉపశమనంగా వీలైనంత ఎక్కువ మొత్తాన్ని మంజూరు చేయాలని కేంద్రానికి సిఫారసు చేస్తామని బృందానికి సారథ్యం వహించిన హోంశాఖ సంయుక్త కార్యదర్శి దిలీప్‌కుమార్ వెల్లడించారు. అనంతరం కేంద్రం బృందం కామారెడ్డి, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల్లో పర్యటించింది. కేంద్ర బృందం సంగారెడ్డి జిల్లా అధికారులతో సమా వేశమైంది. పంట నష్టం జరిగిన తీరుపై కలెక్టరేట్ ఆవరణలో ఫొటో ప్రదర్శనను వారు తిలకించారు. అక్కడి నుంచి నేరుగా బృందం సభ్యులు క్షేత్ర పర్యటనకు వెళ్లారు. ఝరాసంగం మండలం జీర్లపల్లిలో వర్షాలకు కొట్టుకుపోయిన పంచాయతీరాజ్ రోడ్డు బ్రిడ్జిని పరిశీలించారు. రాయికోడ్ మండలం జంబ్గి (కె)లో పత్తి, సోయా పంటలను పరిశీలించి.. నష్టం జరిగిన తీరుపై రైతుల నుంచి వివరాలు సేకరించారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 31,618 హెక్టార్లలో వరి, మొక్కజొన్న, జొన్న తదితర పంటలకు రూ.22.18 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు నివేదిక సమర్పించారు. కామారెడ్డి జిల్లాలోని పిట్లం, బిచ్కుంద మండలాల్లో కేంద్ర బృందం పర్యటించింది. పిట్లంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి, పంట నష్టాన్ని చూసి చలించిపోయింది. రెండో రోజైన సోమవారం హైదరాబాద్‌లో ముంపునకు గురైన వివిధ ప్రాంతాలు, దెబ్బతిన్న రోడ్లను కేంద్ర బృందం పరిశీలించనుంది. -
డిసెంబర్ 15 నుంచి ఇండియన్ రోడ్ కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ సంబంధిత విభాగాల అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఆయా శాఖల అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 15 నుంచి 18 వరకు సదస్సు జరగనున్న నేపథ్యంలో నగరంలో రోడ్లను సుందరంగా మార్చాలని జీహెచ్ఎంసీ అధికా రులను ఆదేశించారు. రోడ్లపై చెత్త లేకుండా పారిశుధ్యంపై దృష్టి సారించాలని ఆదేశించారు. సదస్సుకు హాజరయ్యే దాదాపు 3 వేల మంది ప్రతినిధుల పర్యటనల కోసం పర్యాటక శాఖ ఏర్పాట్లు చేయాలన్నారు. హైటెక్స్‌లో సదస్సు.. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ 1934లో ఏర్పడ్డ తర్వాత దేశంలోని వివిధ నగరాల్లో నాలుగు రోజుల చొప్పున సదస్సులు నిర్వహించటం ఆనవారుుతీ. 1998లో నగరంలోని పబ్లిక్ గార్డెన్సలో నిర్వహించిన తర్వాత మళ్లీ ఇప్పుడు అవకాశం లభించింది. రోడ్ల నాణ్యతను పెంచటంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చిస్తారు. ఇటీవల తెలంగాణకు కొత్తగా 2,500 కి.మీ. కొత్త జాతీయరహదారులు మంజూరైన నేపథ్యంలో వాటి నిర్మాణంలో అనుసరించాల్సిన ఆధునిక పరిజ్ఞానం, దేశంలోనే గొప్ప రోడ్లుగా వాటిని తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలై ఇందులో సూచనలు అందే అవకాశం ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
ధాన్యం కొనుగోళ్లకు రూ.3 వేల కోట్ల అప్పు
- బ్యాంకు రుణాలతో రైతులకు చెల్లింపులు - డబ్బుల్లేక సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ తిప్పలు - బకాయిలు ఇవ్వలేమంటూ చేతులెత్తేసిన ఆర్థిక శాఖ సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు సరిపడే నిధులు లేకపోవటంతో పౌర సరఫరాల సంస్థ తల్లడిల్లుతోంది. రెండేళ్లుగా తమకు రావాల్సిన బకాయిల విడుదల చేయాలని ప్రభుత్వానికి పౌర సరఫరాల శాఖ మొర పెట్టుకుంటున్నా డబ్బులిచ్చే పరిస్థితి లేదని ఆర్థిక శాఖ చేతులెత్తేసింది. ఈ విభాగాలకు తానే ప్రాతినిథ్యం వహిస్తుండటంతో తాజా పరిణామాలన్నీ మంత్రి ఈటల రాజేందర్‌కు విషమ పరీక్షగా ఉన్నాయి. ఒకవైపు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల వంటి చెల్లింపులకు ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. ధాన్యం కొనుగోళ్లకు అత్యవసరంగా రూ.3000 కోట్లు ఇవ్వాలనే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. రెండు శాఖల అధికారులతో ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ సమక్షంలో సమీక్ష నిర్వహించినా బకాయిలు, చెల్లింపుల వివాదం సమసిపోలేదు. ఈలోగా రాష్ట్రవ్యాప్తంగా 2136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే ప్రక్రియ మొదలైంది. దీంతో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించటం ప్రభుత్వానికి సవాలుగా మారింది. గత్యంతరం లేకపోవటంతో ధాన్యం కొనుగోళ్లకు సరిపడేన్ని నిధులను అప్పుగా తెచ్చుకోవాలనే నిర్ణయం జరి గింది. బ్యాంకుల నుంచి రూ.3000 కోట్లు అప్పు తీసుకునేందుకు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్‌కు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చింది. దీంతో తక్షణ సంక్షోభానికి పరిష్కారం లభిం చినట్లయింది. ధాన్యం కొనుగోళ్లు, బియ్యం సబ్సిడీలకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన రూ.7500 కోట్ల మూలధనం రెండున్నరేళ్లలోనే హరించుకుపోయింది. రూ పాయికి కిలో బియ్యం, బియ్యం పంపిణీ సీలింగ్ ఎత్తివేయటం, కుటుంబాలకు మించి న కార్డులుండటం ఈ పరిస్థితికి దారి తీసింది. బియ్యం సబ్సిడీ చెల్లింపులకు 2015-16 బడ్జెట్లో రూ. 2500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం గత ఏడాది కేవలం రూ.వెయ్యి కోట్లు విడుదల చేసింది. మిగతా సొమ్ము మంజూరు చేయకుండా దాటవేసింది. అంతకుముందు ఏడాది 2014-15కు సంబంధించి దాదాపు రూ.700 కోట్లు బకాయి పడింది. రెండేళ్లకు సంబంధించి మొత్తం రూ.2200 కోట్లు పేరుకుపోయాయి. దీంతో సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చిక్కుల్లో పడింది. వీటికి తోడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు, అకౌంట్ల వివరణలు కేంద్రానికి పంపించకపోవటం, పలు సాంకేతిక సమస్యలతో రూ.2500 కోట్ల లోటు తలెత్తింది. అందుకే ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు చేతిలో చిల్లిగవ్వ లేదని, కొనుగోలు కేంద్రాలకు డబ్బులిచ్చే పరిస్థితి లేదంటూ కార్పొరేషన్ అసలు విషయాన్ని మంత్రి ఎదుట వెళ్లబోసుకుంది. సబ్సిడీ బియ్యంతోనే గండి సబ్సిడీ బియ్యమే కార్పొరేషన్ కొంపకు ముప్పు తెచ్చింది. కేంద్రం ఇచ్చే సబ్సిడీ సరిపోకపోవటం, అదనంగా సర్దుబాటు చేయాల్సిన సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం పెం డింగ్‌లో పెట్టడంతో ఖజానా ఖాళీ అయిం ది. కేంద్రం రాష్ట్రంలోని లబ్ధిదారుల్లో 1.91 కోట్ల మందికి మాత్రమే ఆహార సబ్సిడీ చెల్లిస్తుంది. ఒక్కో లబ్ధిదారుడికి 4కిలోల బియ్యం లెక్కగట్టి నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 2 కిలోలు ఇస్తుండటంతో ప్రతి నెలా 1.8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతోంది. కేంద్రం కేవలం 1.12 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందిస్తోంది. మిగిలిం ది మిల్లర్ల ద్వారా రాష్ట్ర సేకరణ విభాగం నుంచి కొనుగోలు చేస్తోంది. కిలోకు రూ.24 చొప్పున కొనుగోలు చేస్తున్న ఈ బియ్యాన్ని రూపాయికే పంపిణీ చేయటంతో భారం నెలనెలా తడిసిమోపెడవుతోంది. ఎప్పటికప్పుడు సబ్సిడీని విడుదల చేయాల్సిన సర్కారు పెండింగ్‌లో పెట్టడంతో కార్పొరేషన్ అప్పుల బాట పట్టింది. -
రేపు జాతీయ సమైక్య దినోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు ఎదురవుతున్న సవాళ్ల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా సమైక్యత పరుగు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరితో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు. -
పాత జిల్లా పరిధిలోనే ప్రమోషన్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలకు ఉద్యోగుల సర్దుబాటు నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్ల విషయంలో తలెత్తిన గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. ఈ సర్దుబాటు కేవలం తాత్కాలిక కేటాయింపుగా, తాత్కాలిక అవసరాల నిమిత్తం విధి నిర్వహణ (ఆర్డర్ టు సర్వ్)గానే పరిగణించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ (జీవో నెం.381) గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల సీనియారిటీ, ప్రమోషన్లు, లీవ్, సర్వీసు వ్యవహారాలకు సంబంధించి ఈ ఉత్తర్వుల్లో స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో పని చేసిన వారికి సంబంధిత జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పరిధిలోనే సీనియారిటీ లెక్కిస్తారని స్పష్టం చేశారు. అదే తీరుగా ప్రమోషన్లు కల్పిస్తారు. మాతృ సంస్థలకు బదులు ఫారిన్ సర్వీస్ డిప్యూటేషన్‌పై ఇతర విభాగాల్లో పని చేస్తున్న వారికి పోస్టింగ్ ఇచ్చే విషయంలో ఇదే నిబంధన వర్తిస్తుంది. రాష్ట్రంలో గతంలో ఉన్న పది జిల్లాల్లో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులను పునర్వ్యవస్థీకరణ సందర్భంగా 31 జిల్లాలకు ప్రభుత్వం సర్దుబాటు చేసింది. కొందరిని నేరుగా పదోన్నతులు కల్పించి నియామక ఉత్తర్వులివ్వగా, ఎక్కువ మంది ఉద్యోగులను ఆర్డర్ టు సర్వ్ ఉత్తర్వులపై కొత్త జిల్లాలకు పంపింది. దీంతో తమ సీనియారిటీని ఎలా లెక్కిస్తారు.. ప్రమోషన్లు ఎలా ఇస్తారు.. బదిలీలెలా ఉంటాయి.. కొత్త జిల్లా పరిధిలోనా లేక పాత జిల్లా పరిధిని పరిగణనలోకి తీసుకుంటారా అనే సందేహాలు వెల్లువెత్తాయి. సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లకు సమీపంలో ఉన్న ఉద్యోగులు మరింత ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాలకు ఉద్యోగుల పంపిణీకి నిర్దేశించిన కేబినెట్ సబ్ కమిటీ పలుమార్లు వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. -
ఆఫీసులు, ఉద్యోగుల వివరాలివ్వండి
కొత్త కలెక్టర్లతో సీఎస్ తొలి వీడియో కాన్ఫరెన్స్ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల్లో ప్రభుత్వ విభాగాలు, ఉద్యోగుల వివరాలను కలెక్టర్లు వెంటనే ప్రభుత్వానికి సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఎన్ని శాఖల కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ఎంతమంది ఉద్యోగులు రిపోర్టు చేశారు. కార్యాలయాలకు ఎన్ని భవనాలు స్వాధీనం చేసుకున్నారు.. అనే వివరాలను వెంటనే పంపించాలని సూచించారు. కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత తొలిసారిగా సీఎస్ రాజీవ్‌శర్మ 31 జిల్లాల కలెక్టర్లతో మంగళవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించి ఎంతమంది సిబ్బంది విధుల్లో చేరారనే వివరాలను ఆరా తీశారు. కొత్త కార్యాలయాల నుంచి పరిపాలనాపరమైన స్థితిగతులు, పీడీ ఖాతాలు, భవనాల స్వాధీనం తదితర అంశాలను కొత్త కలెక్టర్లను సీఎస్ అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా కలెక్టరేట్ల నిర్మాణానికి అవసరమైన భూములను గుర్తించడంపై దృష్టి సారించాలని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు, సూచనలను నిర్దేశిత నమూనాలో ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. పీడీ ఖాతాలు తెరిచే విషయంలో మరింత వివరణ కావాలని, కొన్ని జిల్లాల కలెక్టర్లు కోరడంతో రెండు, మూడు రోజుల్లో సవివరమైన మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎస్ తెలిపారు. రాష్ట్రంలో చేపట్టే రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు అవసరమైన భూసేకరణ నోటిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోందని కలెక్టర్లు తెలిపారు. దీని మార్గదర్శకాలకు సంబంధించి స్పష్టమైన ఆదేశాలు త్వరలోనే జారీ చేస్తామని ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తెలిపారు. అన్ని జిల్లాల్లో హరితహారం అమలును సీఎస్ సమీక్షించారు. వర్షాకాలం ముగుస్తున్నందున ఇప్పటికే నాటిన మొక్కల సంరక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. వచ్చే ఏడాదికి సంబంధించి హరితహారం ప్రణాళికను తయారు చేయాలని ఆదేశించారు. కొత్త జిల్లాల్లో కూడా మైక్రోప్లానింగ్ తయారు చేసుకోవాలని, జాతీయ ఉపాధి హామీ పథకంతో సమన్వయం చేసుకొని జియో ట్యాగింగ్, వెబ్సైట్లో అప్లోడింగ్ చేయాలని అన్నారు. -
‘కొత్త’ పాత్రలో సీఎస్ రాజీవ్‌శర్మ!
♦ వచ్చే నెలాఖరున ముగియనున్న పదవీకాలం ♦ సేవలు వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సేవలను మరి కొంతకాలం వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెలాఖరున సీఎస్ పదవీకాలం ముగియనుంది. సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు ఇప్పటికే కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల విభాగం (డీవోపీటీ) రెండుసార్లు సీఎస్ పదవీకాలాన్ని పొడిగించింది. ఐఏఎస్ సర్వీసు నిబంధనల ప్రకారం ఈ ఏడాది మే 31న ఆయన పదవీ కాలం ముగిసింది. కానీ మూడు నెలల కాల పరిమితిని పొడిగిస్తూ వరుసగా రెండుసార్లు డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు ఆయననే సీఎస్‌గా కొనసాగించే అవకాశాలను పరిశీలించాలని సీఎం ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. కానీ ఆరు నెలలకు మించి ఐఏఎస్ అధికారుల సర్వీసును పొడిగించిన సందర్భాలు దేశంలో అరుదుగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో మరో సీనియర్ అధికారికి సీఎస్ బాధ్యతలు కట్టబెట్టి.. రాజీవ్‌శర్మ సేవలను మరో తీరుగా వినియోగించుకోవాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనల్లో అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని కొత్త జిల్లాల ఏర్పాటుతో తలెత్తిన సమస్యలను అధిగమించటంతోపాటు వాటి అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించేందుకు రాజీవ్‌శర్మ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర పునర్విభజన సమయంలో కమల్‌నాథన్ కమిటీని నియమించిన తరహాలోనే ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటికీ మార్గదర్శకంగా ఉండేలా ఈ కమిటీని వేసే అవకాశాలున్నాయి. కొత్త సచివాలయ నిర్మాణం, జయశంకర్ స్మృతివనం, అంబేడ్కర్ విగ్రహం.. అన్నింటా ఈ కమిటీ క్రియాశీల పాత్ర పోషించనుంది. -
కూల్చివేతలతో పాటు అభివృద్ధి పనులు
సమాంతరంగా జరగాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమ కట్టడాలు కూల్చివేయడంతో పాటు రోడ్లు, ఇతర మౌళిక సదుపాయాల పనులను సమాంతరంగా చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. బ్యాంకుల నుంచి ఆర్థిక వనరులను సమీకరించి నగరంలో మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టుల అమలుకు ప్రణాళికలు రూపొందించాలని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు, ఆ శాఖ మంత్రులను ఆదేశించారు. నగరంలో నాలాలపై నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేతలతో పాటు ఇతర అభివృద్ధి పనులపై బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న మిషన్ భగీరథ లాంటి కార్యక్రమాలతో బ్యాంకర్లలో విశ్వాసం పెరిగిందని, రుణాలిచ్చేందుకు ముందుకు వస్తున్నారని సీఎం అన్నారు. బ్యాంకులిచ్చే రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీగా ఉంటుందన్నారు. నగరంలో అత్యవసరంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. రైతుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్‌లు: రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ శాశ్వత ప్రాతిపదికన చేపట్టడంతో పాటు నగరం చుట్టూ రైతుల భాగస్వామ్యంతో టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. వరదలతో నగరంలోని రహదారులకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి వెంటనే కేంద్రానికి నివేదిక పంపించాలన్నారు. బుధవారం సాయంత్రం వరకు 400 కట్టడాలను కూల్చివేశామని సీఎంకు అధికారులు నివేదించగా, అక్రమ కట్టడాల కూల్చివేతల విషయంలో ఇదే వేగం కొనసాగించాలని చెప్పారు. వచ్చే బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధికి ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డి, సీఎస్ రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు మంగళవారం రాత్రి ఢిల్లీ వెళ్లనున్నారు. బుధవారం జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేసంలో ఆయన పాల్గొనున్నారు. ముఖ్యమంత్రితో పాటు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కూడా ముఖ్యమంత్రి బృందంతో పర్యటించనున్నారు. -
నల్లగొండ జిల్లాలో సీఎస్ రాజీవ్‌శర్మ పర్యటన
భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం నల్లగొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న యాదాద్రి జిల్లాకు సంబంధించిన కలక్టరేట్, ఎస్పీ కార్యాలయాల కోసం భువనగిరిలో భవనాలను పరిశీలించారు. హైదరాబాద్ రోడ్డు సమీపంలోని పగిడిపల్లి వద్ద ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌ను కలక్టరేట్ భవనంగా, జగదేవ్‌పూర్ రోడ్డులో ఉన్న పాత బీఈడీ కళాశాలను ఎస్పీ కార్యాలయంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటు కాబోయే జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావులేదని.. ప్రజల అభిప్రాయం మేరకే ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. అనంతరం సీఎస్ సూర్యాపేటకు బయల్దేరారు. అక్కడ కూడా నూతన జిల్లా కార్యాలయాలను సీఎస్ పరిశీలించనున్నారు. -
13న బక్రీద్ సెలవు
సాక్షి, హైదరాబాద్: బక్రీద్ (ఈద్-ఉల్-అదా) పర్వదినం సందర్భంగా ఈ నెల 13వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో సెప్టెంబర్ 12న బక్రీద్ సెలవు ప్రకటించగా... నెలవంక ఆధారంగా 13వ తేదీన పండుగను జరుపుకోనున్నట్లు ప్రభుత్వానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి చేసింది. -
వాటిని మహబూబ్‌నగర్‌లోనే ఉంచాలి
సీఎస్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినతి సాక్షి, హైదరాబాద్: జిల్లాల పునర్విభజన విషయంలో అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను కలసి తమ అభ్యంతరాలను తెలిపారు. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మక్తల్ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిలు సచివాలయంలో సీఎస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. మక్తల్ నియోజకవర్గంలోని అమరచింత మండలం, దేవరకద్ర నియోజకవర్గంలోని సీసీ కుంట మండలాలను కొత్తగా ఏర్పాటుచేయబోయే వనపర్తి జిల్లాలో కలపనున్నట్లు ప్రభుత్వం డ్రాప్టు నోటిఫికేషన్లో పేర్కొంది. అయితే ఆ రెండు మండలాలను మహబూబ్‌నగర్ జిల్లాలోనే కొనసాగించాలని ఈ ఎమ్మెల్యేలు సీఎస్‌కు విన్నవించారు. -
ఉద్యోగుల పంపిణీకి తుది ప్రణాళిక
- శాఖల వారీగా టాస్క్‌ఫోర్స్ కమిటీ భేటీ - నేటి నుంచి రెండ్రోజులు వరుస సమావేశాలు -15 మంది అధికారులతో టాస్క్‌ఫోర్స్ ఉత్తర్వులు - కొత్త జిల్లాల పరిపాలనకు వర్కింగ్ కమిటీలు - జీఏడీలో జిల్లాల పునర్విభజనకు ప్రత్యేక విభాగం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాలు కొలువు దీరేందుకు అవసరమైన ఉద్యోగుల సర్దుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. అందులో భాగంగా శాఖల వారీగా ఉద్యోగుల కేటాయింపు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ మేరకు ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలతో తుది ప్రణాళికలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో బుధవారం ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇటీవల కేబినేట్ భేటీలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచించిన మేరకు ఉద్యోగుల కేటాయింపు జరగాలని సూచించారు. నిర్దేశించిన నమూనాలో సిబ్బంది ప్రణాళికను అందజేయాలని ఆదేశించారు. ఇక కొత్త జిల్లాలకు ఏయే కేడర్ల ఉద్యోగులు, ఎంత మంది అవసరం, ఎవరిని ఎప్పుడు కొత్త జిల్లాలకు పంపాలనే దానిపై చర్చించారు. 15 మందితో టాస్క్‌ఫోర్స్.. జిల్లాల పునర్విభజనపై సీఎస్ రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీకి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. సీఎస్ చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో మొత్తం 15 మంది సీనియర్ అధికారులు ఉన్నారు. సీసీఎల్ఏను మెంబర్ కన్వీనర్‌గా నియమించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ప్రణాళిక శాఖ, సాధారణ పరిపాలన విభాగం, హోం, ఆర్థిక, ఆర్ అండ్ బీ శాఖల ముఖ్య కార్యదర్శులు, సర్వీసెస్, ఆర్థిక శాఖ, ఐటీ శాఖ కార్యదర్శులను సభ్యులుగా నియమించారు. సీఎంవో ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, మెదక్, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా డీజీపీ, అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ సెక్రెటరీ, సింగరేణి సీఎండీ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను ప్రత్యేక ఆహ్వానితులుగా పేర్కొన్నారు. జీఏడీలో పునర్విభజన విభాగం రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశాలను పరిశీలించడానికి సచివాలయంలోని సాధారణ పరిపాలనా విభాగంలో అదనంగా రెండు సెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు. జీఏడీ (డీఆర్) సాధారణ పరిపాలన జిల్లాల పునర్విభజన విభాగం పేరుతో ఇది మనుగడలోకి రానుంది. డిప్యూటీ సెక్రెటరీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ సెక్షన్లు పనిచేస్తాయి. ఈ మేరకు రెండు అసిస్టెంట్ సెక్రెటరీ, నాలుగు సెక్షన్ ఆఫీసర్, నాలుగు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల పోస్టులను కొత్తగా మంజూరు చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు అందాయి. విభాగాల వారీగా వర్కింగ్ గ్రూప్‌లు కొన్ని శాఖలను కుదించడంతో పాటు ఉద్యోగుల సర్దుబాటుకు వీలుగా కొత్త జిల్లాల్లో పరిపాలన స్వరూపాన్ని మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఏయే శాఖలను కొనసాగించాలి, వేటిని విలీనం చేయాలి, ఇప్పుడు జిల్లా పరిధిలో ఉన్న అధికారుల హోదాలను ఎలా మార్చాలనే అంశంపై అధ్యయనానికి శాఖల వారీగా వర్కింగ్ గ్రూప్‌లను ఏర్పాటు చేసింది. పంచాయతీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కోడ్‌ను సమీక్షించే వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పుడున్న ఎస్ఈలను అన్ని జిల్లాలకు సర్దుబాటు చేయడంతోపాటు ఆ పోస్టును సాగునీటి అభివృద్ధి అధికారి (ఇరిగేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్)గా మార్చాలనే ప్రతిపాదన ఉంది. ఇలాంటి అంశాలపై వర్కింగ్ గ్రూప్‌లు తమ నివేదికలు ఇస్తాయి. రెండు రోజుల పాటు సమావేశాలు సీఎస్ ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ కమిటీ గురువారం నుంచి రెండ్రోజుల పాటు శాఖల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. ఉద్యోగుల పునఃపంపిణీ ప్రణాళికలు, కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు, మౌలిక వసతులను ఆ సమావేశాల్లో సమీక్షిస్తారు. అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, విభాగాధిపతులంతా సంబంధిత ఉద్యోగుల పంపిణీ ప్రణాళికతో హాజరుకావాలని ఆర్థిక శాఖ కార్యదర్శి శివశంకర్ అన్ని విభాగాలకు నోట్ జారీ చేశారు. అన్ని శాఖలు తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలను నిర్ణీత నమూనా జాబితాగా తీసుకురావాలని సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న కేడర్ సంఖ్య, పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలతోపాటు.. విభజన జరిగితే 27 జిల్లాల వారీగా పోస్టులు, ఉండే ఉద్యోగుల సంఖ్య తదితర అంశాలు ఆ నిర్ణీత నమూనాలో ఉన్నాయి. -
మార్చి నాటికి ‘హరితహారం’ లక్ష్యాన్ని పూర్తి చేయాలి
నల్లగొండ: హరితహారంలో భాగంగా ఈ ఏడాది నల్లగొండ జిల్లాకు నిర్దేశించిన 4.80 కోట్ల మెుక్కల లక్ష్యాన్ని వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. మంగళవారం జిల్లా అధికారులతో నిర్వహించిన వీడి యో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. మొక్కలను పర్యవేక్షించే బాధ్యత ఇప్పటి వరకు ఉపాధి హామీ, అటవీ శాఖల ఆధ్వర్యంలో జరిగిందని, ఇక నుంచి ఏ శాఖ పరిధిలో నాటిన మొక్కలకు ఆ శాఖాధికారులే బాధ్యత వహించాలన్నారు. ప్రతి బుధవారం మండల ప్రత్యేక అధికారులు మొక్కలు నాటిన ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలన్నారు. తనిఖీ నివేదికను ప్రభుత్వం రూపొందించిన ఫార్మాట్ ప్రకారం శనివారంలోగా కలెక్టర్‌కు సమర్పించాలని, దానిని కలెక్టర్ పరిశీలించిన అనంతరం అదే రోజు సాయంత్రం వరకు ప్రభుత్వానికి పంపాలన్నారు. ప్రతి పదిహేను రోజులకోసారి మొక్కల ఎదుగుదలకు సంబంధించిన ఫోటోలను తీసి పం పించాలన్నారు. మెుక్కల రక్షణకు ‘కాటిల్ గ్రాప్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ, డ్వామా పీడీ దామోదర్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. -
ప్రధాని సభ ఏర్పాట్ల పరిశీలన
మెదక్: మెదక్ జిల్లా గజ్వేల్‌లో ఆగస్టు 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని సభ ఏర్పాట్లను ఉన్నతాధికారులు మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ గజ్వేల్ విచ్చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు పోలీసు ఉన్నతాధికారులను వారు ఏర్పాట్లపై చర్చించారు. ఈ చర్చల్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు కూడా పాల్గొన్నారు. -
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి కేటీఆర్ భేటీ
హైదరాబాద్ నగరంలో 30వేల మంది నిరుపేదల గృహ నిర్మాణానికి సంబంధించిన నిధుల విడుదలపై పరిశ్రమలు, పురపాలన శాఖ మంత్రి కె.తారక రామారావు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో చేపట్టనున్న డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంతో పాటు.. పెండింగులో వున్న వాంబే, జెఎన్ఎన్యూఆర్ఎం పథకాల నిధులపై చర్చించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసినా.. భవనాల ఎత్తు, యూనిట్ ధరకు సంబంధించిన ప్రత్యేక మినహాయింపులపై స్పష్టత ఇవ్వాల్సి వుందని కేటీఆర్ ప్రస్తావించారు. మినహాయింపులపై త్వరలో సీఎంతో చర్చించి మార్గదర్శకాలు జారీ చేస్తామని సీఎస్ వెల్లడించారు. మెట్రో రైలు పనుల పురోగతిపై చర్చిస్తూ.. మెట్రోకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్లో కొంత మొత్తాన్ని వారంలోగా విడుదల చేయాలని ఆర్దిక శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. మున్సిపల్ విభాగంలోని పలు పథకాలకు హడ్కో తదితర ఆర్దిక సంస్థల నుంచి ఆర్దిక సహాయం కోరడంపై మంత్రి కేటీఆర్‌తో చర్చించారు. -
తెలంగాణ సీఎస్ పదవీకాలం పోడగింపు
-
సీఎస్‌కు ఏడాది పొడిగింపు!
- సీఎం విజ్ఞప్తికి ప్రధాని సానుకూలం - ఇప్పటికే ఆగస్టు వరకు పెంపు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించే అవకాశాలున్నాయి. పొడిగింపు విషయమై ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తికి ప్రధాని నరేంద్ర మోదీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. అయితే, ఐఏఎస్‌ల సర్వీసు నిబంధనల ప్రకారం పదవీకాలాన్ని ఏడాదిపాటు ఒకేసారి పెంచే వెసులుబాటు లేదు. దీంతో పదవీకాలాన్ని మూడు నెలలకోసారి పొడిగించే అవకాశం ఉన్నట్లుగా అఖిల భారత సర్వీసు అధికారుల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగుతున్నారు. ఈ ఏడాది మే నెలాఖరున ఆయన పదవీ కాలం ముగిసింది. మూడు నెలలపాటు సీఎస్ పదవీకాలం పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆగస్టు 31న సీఎస్ పదవీకాలం ముగుస్తుంది. కొత్త రాష్ట్రం కావటంతో అనుభవజ్ఞుడైన అధికారి సేవలు మరికొంత కాలం అవసరమని, ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మే 31 వరకు రాజీవ్‌శర్మ సీఎస్‌గా కొనసాగించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆయన తర్వాత సీఎస్ రేసులో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రకు ఈ అవకాశం లేకుండా పోయింది. ప్రదీప్ చంద్ర డిసెంబర్లో రిటైరవనున్నారు. రాజీవ్‌శర్మ తరువాత సీఎస్ పదవి ఎవరిని వరిస్తుందనే ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. రాష్ట్ర కేడర్‌లో ఉన్న ఐఏఎస్‌ల్లో సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ, ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కు చెందినవారు. ఎస్పీ సింగ్, బీపీ ఆచార్య, ఆర్ఆర్ ఆచార్య, ఎంజీ గోపాల్, బినయ్‌కుమార్, వీకే అగర్వాల్, టి.రాధా 1983 బ్యాచ్‌కు చెందినవారు. వీరిలో టి.రాధా ఇప్పటికే రిటైరయ్యారు. హైకోర్టులో కేసు ఉందనే కారణంతో బీపీ ఆచార్యకు స్పెషల్ సీఎస్ పదోన్నతి పెండింగ్‌లో ఉంది. సీనియర్ అధికారి ఎంజీ గోపాల్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిటైర్ కానున్నారు. దీంతో రాజీవ్‌శర్మ తర్వాత బినయ్‌కుమార్, ఆర్ ఆర్ ఆచార్య, ఎస్పీ సింగ్ సీఎస్ రేసులో ఉంటారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
ప్రజాప్రతినిధులంటే పట్టింపులేదా?
- క్వార్టర్లలో సమస్యలనూ పట్టించుకోవడం లేదు - అధికారులపై స్పీకర్,మండలి చైర్మన్ ఆగ్రహం - సీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్లతో సమీక్ష సాక్షి, హైదరాబాద్ : ప్రజాప్రతినిధుల విషయంలో ప్రొటోకాల్ పాటించడంతోపాటు ఇతరత్రా అనేక సమస్యలపై ప్రభుత్వ అధికారులు పట్టింపు లేని విధంగా వ్యవహరిస్తున్నారని శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, శాసన సభ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులతో బుధవారం స్పీకర్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ప్రజాప్రతినిధుల విషయంలో అధికారుల తీరుపై సమీక్ష నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్.. తొలుత తమ సమస్యలను, తమకు ఎదురైన అనుభవాలను ఉన్నతాధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది. తమకు కేటాయించిన భద్రతా సిబ్బందిలో ఎవరెప్పుడు వస్తున్నారో, ఎపుడు పోతున్నారో, అసలు వారెవరో కూడా తెలియడం లేదని, తమ వద్ద మొత్తంగా ఎంత మంది పనిచేస్తున్నారో తెలియడం లేదని అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఇక స్పీకర్, చైర్మన్లకు కేటాయించిన అధికారిక నివాసాలతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల క్వార్టర్లలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులు దృష్టి పెట్టడడం లేదని ఆగ్రహించినట్లు తెలిసింది. క్వార్టర్లకు నీటి సరఫరా లేదని ఫోన్ చేస్తే పట్టించుకునే నాథుడే లేడని, తమ విషయంలోనే పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని అధికారులను నిలదీసినట్లు సమాచారం. సమావేశంలో పాల్గొన్న వాటర్ బోర్డు అధికారుల నుంచి సమాధానం లేకుండా అయ్యిందని, ఇటీవల క్వార్టర్లలో నీళ్లు లేవని ఒక వీఐపీ ఫోన్ చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని, చివరకు డబ్బులు ఇస్తామని చెప్పాల్సి వచ్చిందని.. అయినా స్పందన లేదన్న అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారుల తీరు మారకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం. తమ వద్ద ఉండే భద్రతా సిబ్బంది సహా ఇతర సిబ్బంది వివరాలను వెంటనే తమకు అందజేయాలని అధికారులను ఆదేశించారని తెలిసింది. -
నివేదికలు లేకుండానే ప్రాజెక్టుల నిర్మాణాలా?
సీఎస్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ లేఖ సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రీఇంజనీరింగ్ పేరిట మార్పులు చేస్తు న్న ప్రాజెక్టుల సమగ్ర నివేదికలు లేకుండానే టెండర్లు పిలిచి, నిర్మాణ పనులు చేపట్టడంపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుది నివేదికలు రాకుండానే, ఇష్టారీతిన వ్యయ అం చనాలు ఖరారు చేసి టెండర్లు పిలవడమేం టని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు శుక్రవారం రాసిన లేఖలో ప్రశ్నించారు. ప్రాజెక్టు నివేదికలను ప్రజల ముందుంచాలన్నారు. కొన్ని ప్రాజెక్టుల పరిధిలో రీఇంజనీరింగ్‌తో డిజైన్‌లో మార్పులు చేసి వ్యయాలను పెంచినప్పటికీ, పనులను పాత కాంట్రాక్టర్లకు కట్టబెట్టేలా నిర్ణయాలు చేస్తున్నారన్నారు. కొన్ని ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు సైతం మొదలు పెట్టకుండానే వ్యయాన్ని రూ.35,200 కోట్ల నుంచి రూ.47,500 కోట్లకు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. -
హరితహారానికి సహకరించండి
ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థలకు సీఎస్ విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమానికి సంపూర్ణ సహకారం అందించడంతోపాటు ఇందులో పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని ప్రభుత్వరంగ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ కోరారు. కార్యాలయాల ఆవరణలో భారీగా మొక్కలు నాటడ మే కాక గ్రామాలను దత్తత తీసుకొని మొక్కలు పెంచాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్ఆర్) కింద కేటాయించాలని కోరారు. సోమవారం సీఎం క్యాంపు కార్యాలయంలో అటవీశాఖ అధికారులతో కలసి ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధులతో రాజీవ్‌శర్మ సమావేశమయ్యారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈసీఐఎల్, బీహెచ్ఈఎల్, సీసీఎం బీ, ఎన్ఐఎన్, బీడీఎల్, మిథాని, నిఫ్ట్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యునాని మెడిసిన్, టీఐఎస్ఎస్, సీడీఎఫ్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులు ఈ భేటీకి హాజరయ్యారు. హరితహారంలో పూర్తిస్థాయిలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయా సంస్థల ప్రతినిధులు తెలిపారు. -
జీఎస్టీ అమలుకు మేం రెడీనే!
తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం పార్లమెంటు ఆమోదం పొందిన పక్షంలో సత్వరం అమలు చేసే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ చెప్పారు. కొద్ది నెలలుగా ఉద్యోగులు ఇందుకు సంబంధించిన శిక్షణ పొందుతున్నట్లుగా ఆయన వివరించారు. మోడల్ జీఎస్టీ చట్టంపై సోమవారమిక్కడ జరిగిన తొలి చర్చా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శర్మ ఈ విషయాలు చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల సమాఖ్య (ఎఫ్టీఏపీసీసీ).. కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (సీబీఈసీ) హైదరాబాద్ జోన్ దీన్ని సంయుక్తంగా నిర్వహించాయి. జీఎస్టీ బిల్లు ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఆమోదం పొందగలదని ఆశిస్తున్నట్లు సీబీఈసీ ప్రత్యేక కార్యదర్శి రామ్ తీరథ్ పేర్కొన్నారు. వచ్చే నెలన్నర కాలంలో మిగతా ప్రాంతాల్లోనూ చర్చాకార్యక్రమాలు నిర్వహించి పరిశ్రమవర్గాల అభిప్రాయాలు తీసుకోనున్నట్లు తెలి పారు. తెలంగాణ రెవెన్యూ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ మిశ్రా, సీబీఈసీ హైదరాబాద్ వైజాగ్ జోన్ చీఫ్ కమిషనర్ ఆర్ శకుంతల తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
సీఎస్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్సీల లేఖ
కాశ్మీర్ లోయలో చిక్కుకున్న తెలంగాణాకు చెందిన సుమారు 1000 మంది అమర్నాథ్ యాత్రికులను సురక్షితంగా వెనక్కి రప్పించడంపై చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ రాజీవ్‌శర్మకు టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డిలు లేఖ రాశారు. తక్షణమే కాశ్మీర్‌కు ప్రత్యేక టీంను పంపించి యాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. కాశ్మీర్ అల్లర్ల నేపథ్యంలో మూడు రోజుల నుంచి యాత్రికులు ఇబ్బందులు పడుతోన్నారు. -
చర్లపల్లి జైలును సందర్శించిన హైపవర్ కమిటీ బృందం
నగరం నడిబొడ్డున ఉన్న చంచల్‌గూడ జైలు తరలింపు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనందన్రావులతో కూడిన హైపర్ కమిటీ బృందం గురువారం చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలును సందర్శించింది. చంచల్‌గూడ జైలును చర్లపల్లి ఓపెన్ ఎయిర్ జైలుకు మార్చాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఈ క్రమంలో చర్లపల్లిలో ఉన్న వసతులను పరిశీలనలో భాగంగానే వారు జైలును సందర్శించి అధికారులతో చర్చించారు. ఓపెన్ ఎయిర్ జైలును ప్రత్యామ్నాయంగా ఎక్కడకు మార్చాలన్న పలు అంశాలపై సమీక్షించి వెళ్లారు. వారితో పాటుగా జైళ్లశాఖ డీజీ వీకే సింగ్, డీఐజీ నరసింహ, చర్లపల్లి జైళ్ల పర్యవేక్షణాధికారులు కొలను వెంకటేశ్వర్ రెడ్డి, రాజేశ్‌లు ఉన్నారు. -
త్వరలో మూడో విడత ‘మాఫీ’ నిధులు
* విడుదల చేస్తామని బ్యాంకర్లకు సీఎస్ రాజీవ్‌శర్మ హామీ * రైతుల నుంచి వడ్డీలు వసూలు చేయవద్దని సూచన సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించిన మూడో విడత నిధులను త్వరలోనే విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ బ్యాంకర్లకు తెలిపారు. రుణ మాఫీకి సంబంధించిన వడ్డీని రైతుల నుంచి వసూలు చేయరాదని స్పష్టం చేశారు. వడ్డీ, రుణ మాఫీ అంశం ప్రభుత్వానికి, బ్యాంకర్లకు సంబంధించిన అంశమని రైతులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. పంట రుణ మాిఫీలో లబ్ధి పొందిన అనర్హుల వివరాలను బ్యాంకర్లకు పంపించామని, వారి నుండి రికవరీ చేసేందుకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. పంట రుణ మాఫీకి సంబంధించి రైతుల భూ వివరాల కోసం రెవెన్యూ శాఖ వెబ్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని బ్యాంకర్లను సూచించారు. గురువారం సచివాలయంలో 6 ప్రధాన బ్యాంకుల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సత్వరం పంట రుణాలు మంజూరు చేయాలన్నారు. 2016-17లో రూ.29,101 కోట్ల పంట రుణాల పంపిణీ లక్ష్యం కాగా ఖరీఫ్‌లో రూ.17,460 కోట్ల మేర రుణాలు రైతులకు ఇవ్వాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత మేరకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ స్కేల్ ప్రకారం రైతులకు రుణాలు చెల్లించాలని సూచించారు. రైతులకు పంట రుణాల రెన్యువల్స్‌ను వేగవంతం చేయాలన్నారు. అర్హులైన రైతులకు రుణాలు అందేలా చూడాలన్నారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ కొన్ని జిల్లాల్లో బ్యాంకు సిబ్బంది వడ్డీని చెల్లించాలని రైతులను కోరుతున్న విషయాన్ని వివరాలతో సహా బ్యాంకర్లకు తెలిపారు. ఖరీఫ్ 2016 సంవత్సరానికి సంబంధించి వాతావరణ ఆధారిత పంటల బీమా, ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాల ద్వారా వివిధ పంటలకు చెల్లించాల్సిన బీమా ప్రీమియం కటాఫ్ డేట్ వివరాలను బ్యాంకర్లకు అందించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి సాయి ప్రసాద్, ఎస్బీఐ జీఎం గిరిధర్ కిని, డీజీఎం వి.సదా శివం, డీజీఎం సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఏజీఎం జేబీ సుబ్రమణ్యం, టీఎస్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఎండీ మురళీధర, ఏపీజీబీ జీఎం టీవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'గ్లోబల్ ఆస్పత్రిపై చర్యలు తీసుకోండి'
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి వ్యవహారంలో గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం, డాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యేలు తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్‌శర్మను కోరారు. గురువారం సచివాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, జి. కిషన్ రెడ్డిలతో పాటు నిఖిల్‌రెడ్డి తండ్రి రాజీవ్ శర్మను కలిశారు. నిఖిల్‌కి ఎత్తు పెంచుతామంటూ సర్జరీ పేరుతో గ్లోబల్ ఆస్పత్రి డాక్టర్లు మోకాళ్లలో ఇనుప రాడ్లు వేసిన సంగతి తెల్సిందే. సర్జరీ విఫలమై నిఖిల్‌రెడ్డి ఇప్పుడు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరారు. -
‘గుర్తింపు’ ఉంటేనే సచివాలయం ఎంట్రీ
జూన్ 2 నుంచి అమలు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి వచ్చే సందర్శకులను ఇకపై ఏదైనా ఒక గుర్తింపు కార్డు ఉంటేనే లోపలకి అనుమతించనున్నారు. ఈ కొత్త విధానం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం జూన్ 2 నుంచి అమల్లోకి రానుంది. సచివాలయ ప్రధాన ద్వారం వద్ద సందర్శకుల ‘గుర్తింపు’ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి అప్పటికప్పుడు పాస్‌లను జారీ చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం సచివాలయంలో ఈ కొత్త విధానాన్ని ప్రారంభించారు. జూన్ 2 నుంచి సచివాలయానికి వచ్చే సందర్శకులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులైన డ్రైవింగ్ లెసైన్స్, ప్రభుత్వ కార్యాలయాల గుర్తింపు కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులలో ఏదైనా ఓ కార్డును తీసుకువస్తేనే అనుమతిస్తామని సాధారణ పరిపాలన శాఖ అదనపు కార్యదర్శి ఎన్.శంకర్ ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శకులకు పాస్‌లు జారీ చేస్తామన్నారు. -
ఆవిర్భావ వేడుకలు అదరగొట్టాలి
► వీడియో కాన్ఫరెన్సలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను, అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలపై శుక్రవారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించి, అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని తెలిపారు. వివిధ రంగాలలో కృషి చేసిన 25 మంది ప్రముఖులను గుర్తించి వారికి అవార్డులను ప్రదానం చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుద్ధీకరించాలని, ఆస్పత్రులు, వసతి గృహాలు, వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలలో పండ్లు, స్వీట్లు పంపిణీ చేయాలని సూచించారు. రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. అదేవిధంగా ముఖ్యమైన హోటళ్లలో తెలంగాణ వంటకాలు సరఫరా చేసేలా చూడాలని, కవి సమ్మేళనాలు, సెమినార్లు, డిబేట్లు, పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు ఏర్పాటుచేయాలని, ఉదయం క్రీడాకారులతో తెలంగాణ రన్, సైకిల్ ర్యాలీలు నిర్వహించాలని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లను విద్యుద్దీపాలతో అలంకరించి స్వీట్లు పంపిణీ చేయాలని, ప్రభుత్వం సాధించిన ముఖ్యమైన అంశాలను తెలియజేస్తూ బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశించారు. ఆర్టీసీ బస్సులపై పోస్టర్లు, బ్యానర్లు అతికించాలని, దీపం, ఆసరా పింఛన్లతో పాటు ఉపాధిహామీ కూలీలకు కూడా స్వీట్లు పంపిణీ చేసేలా చూడాలని అన్నారు. వివిధ పథకాల కింద లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేపట్టాలని, అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురు ద్వారాలు అలంకరించాలని తెలిపారు. గ్రామ పంచాయతీ మొదలుకొని జిల్లాస్థాయి వరకు జాతీయ పతాకావిష్కరణ చేయాలని, అన్ని గ్రామాలలో శానిటేషన్ డ్రైవ్, పంచాయతీ భవనాలకు సున్నం వేయించాలని, ఐకేపీ మహిళా సంఘాలను వేడుకల్లో భాగస్వామ్యం చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ శాఖ కార్యదర్శి ఎస్పీ సింగ్ తెలిపారు. అదేవిధంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు చెల్లించాలని అదేశించారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం కలెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా ప్రముఖులకు అవార్డులు ఇచ్చేందుకు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహణకు అవార్డుల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శానిటేషన్ డ్రైవ్‌తో పాటు అవతరణ దినోత్సవం రోజున కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాన్ఫరెన్స్‌కు రాష్ట్రస్థాయి నుంచి రేమండ్ పీటర్, మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎంజీ గోపాల్ పాల్గొనగా జిల్లా నుంచి అదనపు జాయింట్ కలెక్టర్ బాలాజీ రంజిత్ ప్రసాద్, డీఆర్డీఏ, డ్వామా పీడీ మధుసూదన్ నాయక్, దామోదర్‌రెడ్డి, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
పట్టాలెక్కనున్న సీఎం కలల ప్రాజెక్టు
- సికింద్రాబాద్-కరీంనగర్ రైల్వే లైను పనులు ఈ ఏడాదే మొదలు - ద.మ.రైల్వే జీఎం- సీఎస్ భేటీలో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్-కరీంనగర్ (మనోహరాబాద్-కొత్తపల్లి) రైల్వే లైన్ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణలో కీలకమైన కరీంనగర్, సిద్దిపేటను రాజధాని నగరంతో రైల్వే లైను ద్వారా అనుసంధానించే ఈ ప్రాజెక్టు కోసం చాలాకాలంగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇది సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు. బుధవారం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్రగుప్తా ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో భేటీ అయి దీనిపై చర్చించారు. ఇందుకు అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం రైల్వే శాఖకు ఉచితంగా అందజేయనుంది. భూసేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించి ఈ ఏడాదే పూర్తి చేయనున్నట్టు రైల్వే జీఎంకు రాజీవ్‌శర్మ తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు రూ.1,160కోట్ల ప్రాథమికఅంచనాను రైల్వే శాఖ ఖరారు చేసింది. దీంతో ఈ ఏడాదే పనులకు టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు రైల్వే జీఎం తెలిపారు. కొత్త టెర్మినళ్లకు త్వరలో స్థల సేకరణ చర్లపల్లి, నాగులపల్లిలో నిర్మించబోయే ఆధునిక టెర్మినళ్లకు కూడా త్వరలో స్థల సేకరణ చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. కొత్తగా నిర్మిస్తున్న కరీంనగర్-నిజామాబాద్ ైరె ల్వే మార్గంలో 3 చోట్ల తాత్కాలిక లెవల్ క్రాసింగ్స్కు అవకాశం కల్పించాలని సమావేశంలో నిర్ణయిం చారు. అక్కన్నపేట-మెదక్ రైల్వే లైను రెండేళ్లలో అందుబాటులోకి వస్తుందని జీఎం గుప్త తెలిపారు. మటంపల్లి-జన్పహాడ్ లైనులో మిగిలిన 20 కిలోమీటర్ల పనులు ఈ సంవత్సరమే పూర్తయ్యేలా చూడాలని రాజీవ్‌శర్మ జీఎం రవీంద్రగుప్తాకు సూచించారు. ఎంఎంటీఎస్-2కు సంబంధించి చెర్లపల్లి-మౌలాలీ-ఘట్కేసర్ సెక్షన్ పనులకు గాను ఐదెకరాల స్థలం కావాలని జీఎం రవీంద్రగుప్త కోరగా దాన్ని గుర్తించి కేటాయించాల్సిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను రాజీవ్‌శర్మ ఆదేశించారు. -
లొంగిపోయిన మావోలకు రూ.35లక్షల నజరానా
సాక్షి, హైదరాబాద్: లొంగిపోయిన నలుగురు మావోయిస్టులకు రూ.35 లక్షల రివార్డును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మావోయిస్టు కేంద్ర సాంకేతిక కమిటీ సభ్యుడు, కోల్‌కతాకు చెందిన భాస్కర్ చక్రవర్తి(45)కి రూ.20 లక్షలు, మధ్య జోనల్ కమిటీ సభ్యుడు కుశాల్ యాదవ్, అరవింద్ వర్మలకు చెరో రూ.5 లక్షల చొప్పున రివార్డును మంజూరు చేశారు. లొంగిపోయిన వారికి పునరావాసంతో పాటు వారి అరెస్టుకు సహకరించిన ఇన్ఫార్మర్లకు నజరానాగా ఈ రివార్డును మంజూరు చేశారు. ఇటీవలే లొంగిపోయిన బుర్ర భాగ్య అరుణకు కూడా రూ.5 లక్షల రివార్డును ప్రకటించారు. -
తాగునీటి ఎద్దడి లేకుండా చూడండి
► ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ► కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ హన్మకొండ : వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మ, కలెక్టర్ వాకాటి కరుణను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో కలిసి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. తాగు నీటి ఎద్దడి నివారణకు గ్రామాలు, ఆవాస ప్రాంతాలవారీగా రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అమలుచేయూలన్నారు. నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. కొత్తగా బోర్లను వేయొద్దని రాజీవ్ శర్మ సూచించారు. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన ఆరోగ్య నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామగ్రామాన విసృ్తతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. రూ.8.94 కోట్లు అడిగితే రూ.3.10 కోట్లే ఇచ్చారు : కలెక్టర్ ఈ సందర్భంగా కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ 6 సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణకు రూ.2.15 కోట్లు మంజూరు చేయాలని కోరారు. తద్వారా 215 గ్రామాల దాహార్తి తీరుతుందన్నారు. దీనిపై సీఎస్ రాజీవ్ శర్మ స్పందిస్తూ జిల్లా నుంచి ప్రతిపాదనలు పంపిస్తే నిధులు విడుదల చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.8.94 కోట్లు విడుదల చేయాలని కోరగా ఇప్పటిదాకా రూ.3.10 కోట్లే మంజూరు చేశారన్నారు. మిగతా నిధులను అందించాలని కోరారు. దేవాదుల నుంచి గోదావరి జలాల పంపింగ్ పనులకు సంబంధించిన టెండర్‌ను ఖరారు చేసేందుకు పంపిన ప్రతిపాదనలకు చీఫ్ ఇంజినీర్ ఆమోదం లభించాల్సి ఉందని కలెక్టర్ ఈసందర్భంగా సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రాంచంద్, డీఆర్ఓ శోభ, డీఎంఆండ్‌హెచ్‌ఓ డాక్టర్ సాంబశివరావు, డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్ శేఖర్‌రెడ్డి, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ మధుసూదన్ పాల్గొన్నారు. -
14వ ఆర్థిక సంఘం నిధులపై పర్యవేక్షణ
సీఎస్ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీ సాక్షి, హైదరాబాద్: 14వ ఆర్థిక సంఘం నిధుల పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లలో రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం ద్వారా రూ.5375.28 కోట్లు మంజూరవుతాయి. ఈ ఏడాది ఇప్పటికే రూ.1030 కోట్లు విడుదలయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉంటారు. వీరితో పాటు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి, గిరిజిన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, విద్యా శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ఏడాదికోసారి సమావేశమవుతుంది. అవసరాన్ని బట్టి మధ్యలోనూ సమావేశమై నిధుల వినియోగంపై సమీక్షిస్తుంది. కమిటీ సభ్యులతో పాటు సంబంధిత శాఖల అధికారులు ఈ నిధులతో గ్రామస్థాయిలో జరుగుతున్న పనులను పర్యవేక్షించి ఎప్పటికప్పుడు పురోగతిపై సమీక్షిస్తారు. -
'శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలి'
హైదరాబాద్: రాష్ట్రంలో శాసనసభ స్థానాల సంఖ్య పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రీషీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ లేఖ రాశారు. శాసనసభ స్థానాలను 119 నుంచి 153కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం స్థానాలు పెంచాలని కోరారు. జనాభా లెక్కలు పూర్తైన తర్వాత నియోజక వర్గ పునర్విభజన జరపాలని రాజ్యాంగం సూచిస్తోందని లేఖలో ప్రస్తావించారు. అసెంబ్లీ సీట్ల పెంపు కోసం ఎన్నికల కమిషన్ ప్రక్రియ ప్రారంభించేలా దిశానిర్ధేశం చేయాలని విజ్ఞప్తి చేశారు. -
వచ్చే నెలలో యాదాద్రి బ్రహ్మోత్సవాలు
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి బ్రహ్మోత్సవాలు మార్చి 11 నుంచి 22 వరకు జరగనున్నాయి. యాదాద్రి అభివృద్ధి పనులను బ్రహ్మోత్సవాల తర్వాత ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభివృద్ధి పనులపై ఆలయాభివృద్ధి బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రాజీవ్‌శర్మ గురువారం సచివాలయంలో చర్చించారు. ఆలయ అభివృద్ధితో పాటు అథారిటీ పరిధిలోకి వచ్చే పట్టణాభివృద్ధి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. హైదరాబాద్- వరంగల్ రోడ్డు నుంచి యాదగిరిగుట్ట వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం ఇప్పటికే 80 శాతం వరకు పూర్తయిందని ఆర్ అండ్ బీ అధికారులు చెప్పారు. దానికి అనుసంధానంగా ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్లను రెండు వరుసలుగా అభివృద్ధి చేయాలని సీఎస్ ఆదేశించారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచాలన్నారు. అందుకు ఎక్కువ భూసేకరణ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంత భూమి అవసరమవుతుందో ప్రతిపాదనలు సిద్ధం చేసి, ఆ మేరకు భూసేకరణ చేపట్టాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల సమయంలో యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కూల్చివేతలు, కొత్త పనులు నిర్వహించడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటుందనే చర్చ జరిగింది. అందుకే బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 23 నుంచి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. తొమ్మిది నెలల్లో ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలంటూ సీఎస్ అన్ని శాఖలకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఏడాదిన్నర వ్యవధిలో పట్టణాభివృద్ధి పనులను సైతం పూర్తి చేయాలని ఆదేశించారు. -
కృష్ణా పుష్కరాలకు భారీ ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల సౌకర్యంకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. స్నానఘట్టాల నిర్మాణంతో పాటు దేవాలయాల మరమ్మతులు, రహదారుల అభివృద్ధి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల నిర్మాణం, విద్యుత్ సౌక ర్యం తదితర పనులపై సమీక్షించారు. ఆయా శాఖలన్నీ తమ ప్రతిపాదనలను సంబంధిత కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపించాలని సీఎస్ కోరారు. పుష్కరాల సందర్భంగా చేపట్టే పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమివ్వాలని సీఎస్ సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 52, నల్లగొండ జిల్లాలో 34 స్నాన ఘట్టాలు నిర్మిస్తున్నామని సీఎస్ తెలిపారు. కృష్ణా పుష్కరాలకు తగినంత ప్రచారం కల్పించాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్‌ను కోరారు. అవసరమైన చోట ఎల్ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు, హోర్డింగులు, పబ్లిక్ అడ్రస్ సిస్టంలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
సిద్ధమవుతున్న రాష్ట్ర సాగునీటి ప్రణాళిక
వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీఎంకేఎస్‌వై అమలుకు యోచన సాక్షి, హైదరాబాద్: కేంద్రం కొత్తగా చేపడుతున్న ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన (పీఎంకేఎస్‌వై) పథకంలో భాగంగా రాష్ట్ర సమగ్ర సాగునీటి ప్రణాళిక శరవేగంగా ముస్తాబవుతోంది. మార్చి చివరి నాటికి రాష్ట్ర సమగ్ర ప్రణాళికలను పూర్తి చేసే లా కార్యాచరణ జరుగుతోంది. ఈ పనుల పురోగతిని సీఎస్ రాజీవ్‌శర్మ బుధవారం సమీక్షించనున్నారు. నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల ప్రతిపాదనలందినా వాటిలో మార్పుల్ని సూచిస్తూ ఉన్నతాధికారులు తిప్పిపంపారు. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచే పథకం పనులు ప్రారంభించాలని కేంద్రం నుంచి ఆదేశాలు అందాయి. -
'తెలంగాణ విజయరహస్యం ఇదే..'
మహిళా ఉద్యోగుల జాతీయ సదస్సులో సీఎస్ రాజీవ్‌శర్మ హన్మకొండ, అర్బన్: పోరాటాలు, ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమనేత ముఖ్యమంత్రిగా ఉండటంవల్ల రాష్ట్రంలో బ్యూరోక్రాట్లు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు కలిసి పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. శనివారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన వరంగల్ నిట్‌లో జరిగిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల సమాఖ్య 5వ జాతీయ మహిళా ఉద్యోగుల సదస్సులో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరూ చేస్తున్న టీం వర్క్‌తోనే రాష్ట్రం దేశాన్ని ఆకర్షిస్తున్నదన్నారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని రాజీవ్‌శర్మ అన్నారు. షీ టీమ్స్ వంటివి ఏర్పాటు చేయడంతో మహిళా ఉద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరిగిందన్నారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా సమస్యల పరిష్కారం, రక్షణకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ ప్రభుత్వ కార్యాలయంలో సదుపాయాలు కల్పిస్తామని రాజీవ్ శర్మ అన్నారు. మిషన్ కాకతీయ చెరువుల పరిశీలన దుగ్గొండి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని మిషన్ కాకతీయ పథకంలో భాగంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టిన ఊరచెరువు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. చెరువు సమీపంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధికోరుతున్నా రు..పాలన ఎలా ఉండాలనుకుంటున్నారు.. ఏమి చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో సలహాలు ఇవ్వాలని ప్రజలను కోరారు. తయారీ మానేసిన వారికి సాయం ముద్దునూరుని మద్యరహిత గ్రామంగా తీర్చిదిద్దిన నేపథ్యంలో అక్కడి మహిళలతో సీఎస్ చాలా సేపు సంభాషించారు. గుడుంబాపై ఆధారపడి.. ప్రస్తుతం ఆ వృత్తి మానేసిన నాలుగు కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. గుప్పెడు బియ్యం పథకంలో భాగంగా మహిళలు సేకరించిన బియ్యాన్ని పేదలకు అందించి, మహిళలను అభినందించారు. అలాగే, దళిత మహిళలకు భూ పంపిణీ పథకంలో భాగంగా గ్రామంలోని 25.12 ఎకరాల భూమిని రూ.1.36 కోట్లు వెచ్చించి ప్రభుత్వం కొనుగోలు చేయగా, సీఎస్ పరిశీలించారు. -
తెలంగాణ అభివృద్ధికి రూ.30 వేల కోట్ల ప్యాకేజీ
నీతి ఆయోగ్ తో తెలంగాణ చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో భేటీ వివరాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద రూ. 30 వేల కోట్లు సాయం చేయాలని కోరామని తెలిపారు. తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రూ400 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన ఇచ్చినట్లు వివరించారు. మేడారం, కృష్ణా పుష్కరాలకు కేంద్ర నిధులు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు. -
నేడు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు
హైదరాబాద్: నూతన సంవత్సరం పురస్కరించుకొని జనవరి 1ని రాష్ట్ర ప్రభుత్వం సెలవుదినంగా ప్రకటించింది. గతంలో ఐచ్ఛిక సెలవుగా ఉన్న జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే జనవరి 1వ తేదీని సాధారణ సెలవుగా ప్రకటించినందున అందుకు ప్రతిగా వచ్చే ఫిబ్రవరి 13వ తేదీ (రెండవ శనివారం) పనిదినంగా మారుస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. -
రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందాలు
నేటి నుంచి ఏడు జిల్లాల్లో కరువు పరిశీలన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర బృందాలు ఆదివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి ఉత్పల్ కుమార్ సింగ్ నేతృత్వంలో 9 మంది ప్రతినిధులు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. వీరంతా 3 బృందాలుగా ఏర్పడి కరువు జిల్లాల్లో పర్యటించనున్నారు. రెవెన్యూశాఖ రూపొందించిన షెడ్యూల్ మేరకు నిజామాబాద్, మెదక్ జిల్లాలకు ఒక బృందం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు మరొక బృందం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు ఒక బృందం వెళ్లనుంది. కేంద్ర బృందాలకు సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో బృందానికి ఒక్కో ఐఏఎస్ అధికారిని నియమించినట్లు తెలిసింది. ఆ బృందాలకు కరువు పరిస్థితులను సమగ్రంగా వివరించేలా.. వ్యవసాయ, గ్రామీణ నీటిసరఫరా, పశుసంవర్ధక, రెవెన్యూశాఖల అధికారులను అప్రమత్తం చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఆదేశాలందినట్లు సమాచారం. కేంద్ర ప్రతినిధులు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో భేటీ కానున్నారు. జిల్లాల పర్యటన అనంతరం ఈనెల 8న హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై చర్చించనున్నారు. రాష్ట్రంలో కరువు అంచనా కోసం కేంద్ర బృందాలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో.. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించేందుకు ఆ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. -
వైద్య శాఖలో పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో భారీ ఎత్తున పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో కచ్చితంగా తెలుసుకునేందుకు ఆ శాఖలోని వివిధ విభాగాల అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఉద్యోగ ఖాళీల వివరాలు ఇస్తే సీఎం ఆమోదం తీసుకొని నియామకాలకు అనుమతి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శుక్రవారం ఆదేశించిన వెనువెంటనే వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ అదే పనిలో నిమగ్నమయ్యారు. కుటుంబ ఆరోగ్య సంక్షే మం, వైద్య విద్య, నిమ్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెం టివ్ మెడిసిన్ (ఐపీఎం), టీఎస్ఎంఎస్ఐడీసీ, డ్రగ్స్ సహా వివిధ చోట్ల ఖాళీలపై ఆయా విభాగాల అధిపతులు ఇప్పటికే తుది అంచనాకు వచ్చినట్లు తెలిసింది. తమ శాఖలో ఖాళీల వివరాలతో సోమవారం సీఎస్‌కు నివేదిక ఇస్తామని రాజేశ్వర్ తివారీ ‘సాక్షి’కి తెలిపారు. అన్నీ శాశ్వత ప్రాతిపదిక కిందే... వైద్య శాఖలో భారీగా ఖాళీలున్నాయి. గతంలో సీఎం సమీక్ష సందర్భంగా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం... నిమ్స్‌లో 172 వైద్య పోస్టులు, అక్కడే 158 నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 116 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విధాన పరిషత్‌లో 385 వైద్యులు, 429 నర్సింగ్, 765 పారామెడికల్ ఖాళీలున్నాయి. ప్రజారోగ్యంలో 298 వైద్యులు, 205 నర్సింగ్, 765 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైద్య విద్యలో 426 వైద్యులు, 324 నర్సింగ్, 784 పారామెడికల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవిగాక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, జాతీయ ఆరోగ్య మిషన్ కింద కూడా ఖాళీలున్నాయి. అయితే ఇటీవల రాష్ట్రీయ బాల స్వస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా 1,330 పోస్టుల భర్తీని కాంట్రాక్టు పద్దతిలో చేపట్టారు. 391 ఆయుష్ పోస్టుల భర్తీకి కూడా సర్కారు ఆమోదం తెలిపింది. అవి పోను మిగిలిన ఖాళీల వివరాలు అందజేశాక నియామకంపై ప్రభుత్వం వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. భర్తీ చేయబోయే వైద్యులు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది ఉద్యోగాలన్నీ శాశ్వత ప్రాతిపదిక కిందే నియమిస్తారు. ఒక అంచనా ప్రకారం దాదాపు 3 వేలకు పైనే పోస్టుల భర్తీ చేపట్టే అవకాశాలున్నాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు. ఇంటర్వ్యూలుండవు.. ప్రతిభ ఆధారంగానే భర్తీ వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది ఖాళీలను ఎలా భర్తీ చేయాలన్న దానిపై వైద్యాధికారులు మేధోమధనం చేస్తున్నారు. నియామక మండలి ఏర్పాటు చేసి భర్తీ చేయాలని గతంలో అనుకున్నా అది సుదీర్ఘ ప్రక్రియ అని భావించి ఆ ఆలోచనను పక్కనపెట్టారు. వైద్య నిపుణులు, సీనియర్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని యోచిస్తున్నారు. ఇంటర్వ్యూల జోలికి పోకుండా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ప్రతిభ ఆధారంగా భర్తీ చేయాలని యోచిస్తున్నారు. -
రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై ఐఏఎస్‌లు!
పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్ర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనం గా ఐఏఎస్‌లను కేటాయించేందుకున్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తోంది. మంగళవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ(డీవోపీటీ) కార్యదర్శి సంజయ్ కొఠారి ఈ అంశంపై చర్చించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల కేటాయింపు, ఉద్యోగుల విభజనపై సచివాలయంలో ఆయ న రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతోపాటు అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులు ఇందులో పాల్గొన్నారు. అదనంగా 30మంది ఐఏఎస్ అధికారులను కేటాయించాలని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిన నేపథ్యంలో ఈ సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రానికి చెంది న ఐఏఎస్ అధికారులు సరిపడా లేనప్పటికీ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, హరియా ణాకు చెందిన ఐఏఎస్‌లు డిప్యుటేషన్‌పై తెలంగాణలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారని సంజయ్ అభిప్రాయపడ్డారు. అంతకుముందే కమలనాథన్ కమిటీతో ఆయన సమావేశమయ్యారు. -
లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా చేయండి!
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. శనివారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు చేయాల్సిందే అని నిర్ణయం తీసుకుంటే.. మాత్రం 17 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ అంశాన్ని పరిశీలించాలని ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు గుత్తా సుఖేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. -
కోరిక తీర్చలేదని భార్య పాశవిక హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో అమానుషం చోటుచేసుకుంది. ఓ తాగుబోతు భర్త తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో భార్యను చంపేశాడు. అంతకుముందు మద్యం మత్తులో ఆమెను పాశవికంగా హింసించాడు. ఆ హింసను తట్టుకోలేని ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం పక్కనే కూర్చొని లోపల గడియ వేసుకున్నాడు. అతగాడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఉండే ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. మృతురాలికి పదేళ్ల కొడుకు ఉన్నాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. బరేలిలోని నారియావాల్ జిల్లాకు చెందిన రాజీవ్ శర్మ విపరీతంగా మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. అతని కోరికను ఆమె తిరస్కరించింది. అంతే.. కోపోద్రిక్తుడైన రాజీవ్ శర్మ ఆమెపై దాడికి దిగాడు. ఢిల్లీ నిర్భయ ఉదంతం తరహాలో ఆమెపై లైంగికంగా దారుణమైన దాడి చేశాడు. ప్రాణాలు పోయేదాకా వదిలి పెట్టలేదు. బాధితురాలి శరీరంపై గాయాలు లేవు గానీ, విపరీతమైన రక్తస్రావంతోనే కన్నుమూసిందని పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భార్యను హత్య చేయడానికి ముందుకు ఆరుగంటల నుంచి మద్యం తాగినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీస్ అధికారి రజ్బీర్ సింగ్ తెలిపారు. -
కొలిక్కిరాని విద్యుత్ ఉద్యోగుల విభజన
న్యాయస్థానం సూచన మేరకు ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ ఎవరి వాదన వారిదే-భేటీలో పరిష్కారం కాని విభజన సమస్య హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం కొలిక్కి రాలేదు. ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి వాదనకు వారు కట్టుబడి ఉన్నాయి. న్యాయస్థానం సూచన మేరకు విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. ఇందులో రెండు రాష్ట్రాల సీఎస్‌లు ఎవరి వాదనకు వారు కట్టుబడ్డారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మతో విద్యుత్ ఉద్యోగుల విభజనపై చర్చించానని, పరిష్కారం లభించలేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీ స్థానికత ఆధారంగా చేయాలని కోరుతోందని, ఇందుకు ఏపీ అంగీకరించడం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా తొలగించిన 1,253మంది విద్యుత్ ఉద్యోగులు రెండు నెలల నుంచి జీతాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. రాష్ట్రవిభజన చట్టంలో ఎక్కడా ఏకపక్షంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీకి ఆస్కారం కల్పించలేదని, చట్టంలోని సెక్షన్-82 ప్రకారం ప్రభుత్వరంగ సంస్థలు ఏ ప్రాంతం లో ఉన్నా ఏడాదిపాటు ఇరు రాష్ట్రాలు వాటి సేవలను పొందాలని ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలో విభజన చట్టంలో ఎక్కడా పొందుపరచలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల పంపిణీతోపాటు తెలంగాణ తొలగించిన విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రమే పరిష్కరించాలన్నారు. విద్యుత్ ఉద్యోగుల వివాదాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లామని, 9వ షెడ్యూల్లో పేర్కొన్న సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పంపిణీ జనాభా ప్రాతిపదికన షీలాబిడే కమిటీ చేసేందుకు ఎటువంటి అభ్యంతరం లేదని కేంద్రానికి తెలియజేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. -
కేటీఆర్‌తో మహీంద్రా ప్రతినిధుల భేటీ
ఐటీ, మోటార్స్ రంగాల్లో కంపెనీలను విస్తరిస్తామన్న ప్రతినిధులు హైదరాబాద్: మహీంద్రా గ్రూప్‌కు చెందిన 6 కంపెనీల ప్రతినిధులు గురువారం పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావుతో భేటీ అయ్యారు. గురువారం సచివాలయంలో జరిగిన ఈ భేటీలో మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ కంపెనీల విస్తరణకు సంబంధించి భేటీలో చర్చించారు. హైదరాబాద్‌లో చెత్త సేకరణకు జీహెచ్ఎంసీకి అవసరమైన వాహనాలను త్వరలో అందిస్తామన్నారు. మెట్రో రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణికుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై తమ ప్రణాళికలు వివరించారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న మహీంద్రా ప్లాంట్‌లో స్థానిక యువతకు ఉద్యోగాలను ఇస్తామన్నారు. కాగా, ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి మహీంద్రా కంపెనీ నుంచి తగు ప్రణాళికలు ఇవ్వాలని కేటీఆర్ ప్రతినిధులను కోరారు. అలాగే ఎరోస్పేస్, రక్షణ రంగాల్లో విస్తరణకు హైదరాబాద్‌ను ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
-
నేడు ‘రెండో విడత రుణమాఫీ’ విడుదల?
హైదరాబాద్: రాష్ట్ర రైతాంగానికి చెల్లించాల్సిన రెండో విడత రుణమాఫీ నిధుల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రైతులకు చెల్లించాల్సిన రూ.2,050 కోట్ల నిధులను విడుదల చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేయనున్నారని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శుక్రవారం ఆర్థిక శాఖ అధికారులతో సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగాలపై చర్చ జరిగింది. వివిధ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను ఆర్థిక శాఖ ఇప్పటికే గుర్తించి ప్రభుత్వానికి జాబితా కూడా సమర్పించింది. పోలీసు, ఆరోగ్య, ఉన్నత విద్య, ఇంజనీరింగ్ శాఖల్లో పది నుంచి పదిహేను వేల ఉద్యోగాలను ప్రభుత్వం త్వరలో భర్తీ చేయనుంది. భర్తీ చేయాల్సిన ఉద్యోగాల సంఖ్యను సీఎం కేసీఆర్ నిర్ణయించనున్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా పోస్టులను నోటిఫై చేసే అంశంపై చర్చ జరిగింది. సమీక్షలో ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, కార్యదర్శులు రామకృష్ణారావు, శివ శంకర్ పాల్గొన్నారు. -
‘రెవెన్యూ’లో పదోన్నతులకు పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: గత పది రోజులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రెవెన్యూ ఉద్యోగులు జరిపిన ఆందోళనతో ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది. రెవెన్యూ విభాగంలో వివిధ స్థాయిల్లో పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పదోన్నతుల నిమిత్తం ఈ నెల 20న శాఖాపరమైన పదోన్నతుల(డీపీసీ) క మిటీ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరి పాలన విభాగం ముఖ్య(ఇన్చార్జి) కమిషనర్ రాజీవ్‌శర్మ ప్రకటించారు. డిమాండ్ల పరి ష్కారం నిమిత్తం రెవెన్యూ జేఏసీ ప్రతినిధులు సీఎస్‌తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయి. గురువారం సీసీఎల్ఏ కార్యాలయంలో జరిగిన చర్చల అనంతరం సీఎస్ రాజీవ్‌శర్మ మీడియాతో మాట్లాడుతూ.. రెవెన్యూ ఉద్యోగ సంఘాలు ప్రతిపాదించిన పలు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యంగా అర్హులైన డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)కు తహసీల్దారు, తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టరు పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను వెంటనే విడుదల చేయాలని సీసీఎల్ ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆయన ఆదేశించారు. సీనియారిటీ జాబితాపై ఈనెల 16 వరకు ఉద్యోగుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తామని, 20న డీపీసీ సమావేశమై పదోన్నతుల ప్రక్రియను చేపడుతుందన్నారు. షరతులతో పదోన్నతులు.. కమలనాథన్ కమిటీ విభజన ప్రక్రియ కొలిక్కి రానందున తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చే విషయమై కొన్ని ఇబ్బందులు ఉన్నాయని సీఎస్ చెప్పారు. అయితే.. ఖాళీగా ఉన్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన తహసీల్దార్లకు షరతులతో కూడిన పదోన్నతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. కమలనాథ న్ కమిటీ ప్రక్రియ అనంతరం పోస్టులు ఖాళీ ఉండని పక్షంలో.. పదోన్నతులు పొందిన వారు వెనక్కి వెళ్లాల్సి ఉంటుందన్నారు. అలాగే.. కీలకమైన రెవెన్యూ విభాగంలో ఉద్యోగులకు సరైన విశ్రాంతి లభించ నందున, తప్పనిసరి పరిస్థితుల్లో మినహా సెలవు రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. వీఆర్వోలకు పెన్షనరీ బెనిఫిట్, 010 పద్దు కింద వేతనాలు అందించేందుకు అంగీకరించారు. ఆందోళన విరమిస్తున్నాం: రెవెన్యూ జేఏసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందున, తమ ఆందోళన కార్యక్రమాలను విరమిస్తున్నట్లు రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ కృష్ణారెడ్డి, సెక్రటరీ జనరల్ శివశంకర్, కన్వీనర్ లచ్చిరెడ్డి, వీఆర్వోల సంఘం అధ్యక్షుడు రామిరెడ్డి, వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు శివరామ్ ప్రకటించారు. చర్చల్లో సీసీఎల్ఏ ప్రిన్సిపల్ కమిషనర్ అధర్‌సిన్హా, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, ఆర్థికశాఖ కార్యదర్శి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. 3 కేటగిరీలుగా విభజన.. మండల రెవెన్యూ కార్యాలయాలకు పక్కా భవనాలు, తగినంత మంది సిబ్బంది, అవసరమైన మేరకు బడ్జెట్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని సీఎస్ రాజీవ్ శర్మ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మండల రెవెన్యూ కార్యాలయాలను మూడు కేటగిరీలుగా విభజిస్తామని, జిల్లా కేంద్రాల్లో, మున్సిపల్ ఏరియాల్లో, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఆర్వో ఆఫీసులను ఏ,బీ,సీ కేటగిరీలుగా విభజిస్తూ ప్రతిపాదనలను పంపాలని ప్రిన్సిపల్ కమిషనర్‌ను ఆదేశించామన్నారు. -
'ఔట్లుక్ మ్యాగజైన్ పై క్రిమినల్ కేసు'
ఔట్లుక్ మ్యాగజైన్‌పై చట్టపరంగా క్రిమినల్ కేసు నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను కించపరిచేలా తప్పుడు కథనం రాసినందుకు ఈ చర్యకు ఆదేశించారు. మరోవైపు తన పరువు మర్యాదలకు భంగం వాటిల్లేలా అనుచిత కథనం ప్రచురించినందుకు స్మితా సబర్వాల్ కూడా ఔట్లుక్ మ్యాగజైన్‌కు లీగల్ నోటీసులు పంపించారు. ఔట్లుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ కృష్ణప్రసాద్, హైదరాబాద్‌లోని అసిస్టెంట్ ఎడిటర్ మాధవి టాటాలకు స్మితా సభర్వాల్ తరఫు న్యాయవాది ఈ నోటీసులు పంపారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం స్మితా సబర్వాల్ సీఎంవో కార్యాలయంలో అడిషనల్ కార్యదర్శి హోదాలో ఉన్నారు. గతంలో కరీంనగర్, మెదక్ జిల్లాల్లో కలెక్టర్‌గా పని చేసి సమర్థురాలైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి అధికారిపై ఔట్లుక్ పత్రికలో వచ్చిన కథనాన్ని జర్నలిస్టు సంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండించాయి. అదొక నీచమైన కథనమని, ఔట్లుక్ పత్రిక ఒక మహిళా ఐఏఎస్‌ను కించపరిచిందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మండిపడ్డారు. ఈ కథనం తెలంగాణ ప్రజలను, సీఎంవో కార్యాలయాన్ని అవమానించినట్లుగా ఉందని.. వెంటనే ఔట్లుక్ యాజమాన్యం బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
నేడు ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ సీఎస్
హైదరాబాద్: ఢిల్లీలో శనివారం జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి పి ఆచార్యలు హాజరు కానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సమావేశానికి రాష్ట్ర ప్రతినిధులుగా వీరిద్దరూ హాజరవుతున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రుల ఉప కమిటీ ఆఖరి సమావేశం కావటంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఉంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్ రెండో వారంలోనే జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది. అప్పుడు ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధపడ్డ సీఎం కేసీఆర్ ఈసారి మాత్రం అందుకు విముఖత వ్యక్తం చేశారు. -
'ఇక్కడి సంస్థలన్నీ మావే'
-
కేంద్ర హోంశాఖతో ఇరు రాష్ట్రాల సీఎస్‌లు భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖతో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, రాజీవ్ శర్మ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు, ఉద్యోగుల పంపిణీ తదితర అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు అంశాలపై రాజుకుంటున్న వివాదాలను పరిష్కరించేదుకు కేంద్రహోం శాఖ జోక్యం కల్పించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సీఎస్ ఐవీఆర్ కృష్ణారావు, తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ.. కేంద్ర హోంశాఖతో సమావేశమయ్యారు. -
పండుగలా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
-
పండుగలా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు
జూన్ 2 నుంచి 7 వరకు కార్యక్రమాలు పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు సంస్కృతి, వైభవానికి ఉత్సవాల్లో పెద్దపీట ట్యాంక్‌బండ్‌పై ముగింపు ఉత్సవాలు హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పండుగ వాతావరణంలా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. అవతరణ వేడుకల నిర్వహణపై వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. జూన్ 2 నుంచి 7వ తేదీ వరకు జరిగే అవతరణ వేడుకలకు సంబంధించి జిల్లా ఇన్చార్జి మంత్రులను సంప్రదించి ప్రణాళిక సిద్దం చేసుకోవాల్సిందిగా సూచించారు. జూన్ 2న ఉదయం 9 గంటలకు అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలు ప్రారంభించాలన్నారు. అమర వీరులకు శ్రద్దాంజలి ఘటించేందుకు జిల్లాల్లో అమర వీరుల స్తూపాలను సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లోనూ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్నారు. వేడుకల సందర్భంగా వివిధ రంగాల్లో ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, కూడళ్లు, ట్రాఫిక్ ఐలాండ్లు, ప్రధాన రహదారులను విద్యుత్ దీపాలతో అలంకరించాల్సిందిగా ఆదేశించారు. పరేడ్ మైదానంలో వేడుకలు హైదరాబాద్‌లో జూన్ 2న ఉదయం 9.30 నుంచి 11.30 వరకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో అవతరణోత్సవాలు జరుగుతాయి. మార్చ్ఫాస్ట్, వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వుంటుంది. రాజ్‌భవన్, నెక్లస్‌రోడ్డు, హుస్సేన్‌సాగర్, లుంబినిపార్కు, మెట్రో రైలు స్తంభాలు, ట్రాఫిక్ ఐలాండ్లు, సచివాలయం, ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. దుకాణాలు, ప్రైవేటు సంస్థల్లోనూ రాష్ట్ర అవతరణ ఉత్సవ లోగోలు ప్రదర్శిస్తారు. ఉత్సవాలకు సంకేతంగా జూన్ రెండో తేదీ రాత్రి 8 గంటలకు పీపుల్స్‌ప్లాజాలో బాణసంచా కాల్చుతారు. వైభవం, సంస్కృతిని చాటేలా తెలంగాణ సంస్కృతి, వైభవాన్ని ప్రపంచానికి చాటేలా సాంస్కృతిక వారధి కళకారులు తెలంగాణ సాంస్కృతిక జైత్రయాత్ర’ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన ప్రణాళికను సాంస్కృతిక వారధి ఛైర్మన్ రసమయి బాలకిషన్, రాష్ట్ర ప్రభుత్వ సలహదారు కేవీ రమణాచారి వెల్లడించారు. కళాకారులు ప్రతీ రోజు రెండు జిల్లాల్లో కళారూపాలతో భారీ నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూన్ 2న నెక్లెస్‌రోడ్డులో, 3న మెదక్, నిజామాబాద్, 4న ఆదిలాబాద్, కరీంనగర్, 5న వ రంగల్, ఖమ్మం, 6న నల్గొండ, మహబూబ్‌నగర్‌లో జైత్రయాత్ర నిర్వహిస్తారు. ఏడో తేదీన హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై భారీ ప్రదర్శన నిర్విహ స్తారు. జైత్రయాత్ర కొత్త పంథాలో వుండేలా కళాప్రదర్శనలు రూపొందిస్తున్నారు. ఆవిర్భావ వేడుక లపై తెలంగాణ సాంస్కృతిక వారధి రూపొందించిన 10వేల సీడీలను, సీఎం కేసీఆర్ సందేశంతో కూడిన తెలంగాణ మాసపత్రిక కాపీలను జిల్లాలకు పంపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ నిర్వహించిన సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, ముఖ్య కార్యదర్శులు బీపీ ఆచార్య, రాజేశ్వర్ తివారీ, రేమండ్ పీటర్, కార్యదర్శులు వికాస్‌రాజ్, హరిప్రీత్‌సింగ్, దానకిషోర్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోర్టు ఆవరణలో న్యాయవాది దారుణ హత్య
న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని తీస్ హజారీ కోర్టు ఆవరణలో శుక్రవారం కనిపించిన న్యాయవాది మృతదేహం కలకలం రేపింది. గత రాత్రి అతణ్ని దారుణంగా కొట్టి చంపినట్టు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు రక్తపు మడుగులో ఉన్న న్యాయవాది మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్న పోలీసులు అతణ్ని రాజీవ్ శర్మగా పోలీసులు గుర్తించారు. దీంతో న్యాయవాదుల కోఆర్టినేషన్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారనీ ఢిల్లీ బార్ అసోసియేషన్ సభ్యుడు డీడీ శర్మ తెలిపారు. -
అప్పుల హద్దులు వద్దు
ఎఫ్ఆర్బీఎం నిబంధనలు సడలించండి నీతి ఆయోగ్ బృందాన్ని కోరిన సీఎం కేసీఆర్ 6 జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కోరిన ప్రభుత్వం మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌కు నిధులివ్వాలని విజ్ఞప్తి గోదావరి పుష్కరాల నిర్వహణకు రూ. 300 కోట్లకు వినతి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక వనరుల వృద్ధికి అప్పులు తెచ్చుకునేందుకు వీలుగా ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నిబంధనలను సడలించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నీతి ఆయోగ్ బృందాన్ని కోరారు. అలాగే రాష్ట్రంలో చేపడుతున్న కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండు రోజుల రాష్ట్ర పర్యటనకు వచ్చిన నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె.సారస్వత్, సలహాదారు అశోక్‌కుమార్ జైన్లు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డిని కలుసుకున్నారు. వివిధ ముఖ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అనంతరం నీతి ఆయోగ్ బృందంలోని సభ్యులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ వారితో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం తెలంగాణను రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ప్రకటించటంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు భారీగా గండి పడిందని ఆందోళన వెలిబుచ్చారు. ‘కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రాలకు రావాల్సిన నిధులు భారీగా తగ్గిపోయాయి. రెవెన్యూ మిగులు రాష్ట్రం కావటంతో కేంద్రం నుంచి రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా తగ్గిపోయింది. ఐసీడీఎస్‌కు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రాష్ట్రంపై అదనపు భారం పడింది’ అన్నారు. వీటన్నింటి దృష్ట్యా ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితి నిబంధనలను సడలించాల్సిన అవసరం ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 3.9 శాతం ద్రవ్యలోటుగా చూపిస్తూ రాష్ట్రాలకు 3 శాతం ద్రవ్యలోటును పరిమితం చేయటం విచిత్రంగా ఉందన్నారు. కేంద్రం తరహాలోనే తెలంగాణకు వెసులుబాటు కల్పించాలని కోరారు. రుణ సేకరణకు వెసులుబాటు కల్పిస్తే మౌలిక వసతులకు పెట్టుబడులు సమకూరుతాయని, ఇది రాష్ట్రాలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అంతకుముందు ఉన్నతాధికారులతో భేటీలో రాష్ట్రంలో అమలవుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న నీతి ఆయోగ్ బృంద సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బృహత్తర కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు సిఫారసు చేస్తామన్నారు. ప్రభుత్వ సలహాదారులు జీఆర్ రెడ్డి, పాపారావు, ఏకే గోయల్, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బి.పి.ఆచార్య, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, వాటర్‌గ్రిడ్ ఎండీ రేమండ్ పీటర్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు ఈ భేటీలో పాల్గొన్నారు. నేడు రెండు జిల్లాల్లో నీతి ఆయోగ్ బృందం పర్యటన... నీతి ఆయోగ్ బృందం శుక్రవారం మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించనుంది. సిద్దిపేట, గజ్వేల్ మండలాల్లో మిషన్ కాకతీయ కింద చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ పనులు, ఇంటింటికీ నల్లా కనెక్షన్లు, స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా చేపట్టిన పనులు, సిద్దిపేటలో తాగు నీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్‌ను బృంద సభ్యులు పరిశీలించనున్నారు. అలాగే కరీంనగర్ జిల్లా బొమ్మకల్‌లో మిషన్ కాకతీయ పనులు, నుస్తులాపూర్‌లో స్వచ్ఛభారత్, తాగునీటి సరఫరాను పరిశీలిస్తారు. బీఆర్జీఎఫ్ నిధులివ్వండి.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీఆర్జీఎఫ్ నిధులు మంజూరు చేయాలని అధికారులు నీతి ఆయోగ్ బృందాన్ని సీఎం కేసీఆర్ కోరారు. వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. విభాగాల వారీగా కార్యక్రమాలు, నిధులకు సంబంధించిన అభ్యర్థనలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు. రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని, గతంలో పంపిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆర్థికశాఖ సలహాదారు జీఆర్ రెడ్డి కోరారు. స్పందించిన నీతి ఆయోగ్ బృందం సభ్యులు.. జిల్లాలు మొత్తంగా కాకుండా అక్కడ చేపట్టే కార్యక్రమాలకు నిర్దిష్ట ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని సూచించారు. దీంతో ఆరు జిల్లాల్లో అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ కార్యక్రమాలకు కేంద్రం నుంచి నిధులు ఆశిస్తున్నామని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు బదులిచ్చారు. జూలైలో నిర్వహించనున్న గోదావరి పుష్కరాలకు రూ.300 కోట్లు కేటాయించాలని కోరారు.