
కోరిక తీర్చలేదని భార్య పాశవిక హత్య
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని బరేలిలో అమానుషం చోటుచేసుకుంది. ఓ తాగుబోతు భర్త తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో భార్యను చంపేశాడు. అంతకుముందు మద్యం మత్తులో ఆమెను పాశవికంగా హింసించాడు. ఆ హింసను తట్టుకోలేని ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె మృతదేహం పక్కనే కూర్చొని లోపల గడియ వేసుకున్నాడు. అతగాడిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు చాలా కష్టపడాల్సి వచ్చింది. బాధితురాలి ఇంటికి సమీపంలోనే ఉండే ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. మృతురాలికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.
పోలీసుల సమాచారం ప్రకారం.. బరేలిలోని నారియావాల్ జిల్లాకు చెందిన రాజీవ్ శర్మ విపరీతంగా మద్యం తాగి భార్యతో గొడవకు దిగాడు. అతని కోరికను ఆమె తిరస్కరించింది. అంతే.. కోపోద్రిక్తుడైన రాజీవ్ శర్మ ఆమెపై దాడికి దిగాడు. ఢిల్లీ నిర్భయ ఉదంతం తరహాలో ఆమెపై లైంగికంగా దారుణమైన దాడి చేశాడు. ప్రాణాలు పోయేదాకా వదిలి పెట్టలేదు. బాధితురాలి శరీరంపై గాయాలు లేవు గానీ, విపరీతమైన రక్తస్రావంతోనే కన్నుమూసిందని పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించినట్టు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. భార్యను హత్య చేయడానికి ముందుకు ఆరుగంటల నుంచి మద్యం తాగినట్టు నిందితుడు అంగీకరించాడని పోలీస్ అధికారి రజ్బీర్ సింగ్ తెలిపారు.