కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌శర్మ నిబద్ధతతో పనిచేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాష్ట్ర విభజన సమయంలో తలెత్తిన విపత్కర పరిస్థి తుల్లోనూ రాజీవ్ శర్మ ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఓపికగా తన బాధ్యతలు నిర్వహించారని, ప్రభుత్వ కార్యక్రమాలన్నిం టా అధికారులను అదే తీరుగా ముందుకు నడిపించారని అన్నారు.