CS Pradeep chandra
-
సీఎస్ ప్రదీప్ చంద్ర పదవీ విరమణ!
► పదవీకాలం పొడిగింపునకు కేంద్రం నుంచి రాని అనుమతి ► శనివారం రాత్రి వరకూ సస్పెన్సే ► పదవిలో కొనసాగింది నెల రోజులే ► కొత్త సీఎస్ రేసులో ఎంజీ గోపాల్, ఎస్పీ సింగ్, ఆర్ఆర్ ఆచార్య సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర పదవీకాలం శనివారంతో ముగిసిపోయింది. నవంబర్ 30న సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్‌చంద్ర కేవలం నెల రోజులే పదవిలో కొనసాగారు. వయసు నిబంధనల మేరకు ఆయన శనివారం (డిసెంబర్ 31)తో రిటైరవుతున్న నేపథ్యంలో.. పదవీ కాలాన్ని మూడు నెలల పాటు పొడిగించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. కానీ శనివారం రాత్రి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. దీంతో ప్రదీప్ చంద్ర రిటైర్ అయినట్లేనని భావిస్తున్నారు. నాలుగు రోజులుగా ఎదురుచూపు.. ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగించేందుకు అనుమతించాలంటూ ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖను రాష్ట్ర ఎంపీలు పార్లమెంటులో ప్రధానికి అందజేశారు. సీఎస్ పదవీకాలం పొడిగింపు ప్రతిపాదనలకు సంబంధించిన ఫైలు డిసెంబర్ 27న ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరింది. ప్రధాని సంతకం చేస్తే అనుమతి లభిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని గత నాలుగు రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తూ వచ్చాయి. శుక్రవారమే ఉత్తర్వులు రావచ్చని కూడా భావించారు. అయితే పదవీకాలం చివరి రోజైన శనివారం కూడా దీనిపై స్పందన రాలేదు. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీఓపీటీ)తో రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు రాత్రి 9 గంటలు దాటినా ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగింపు అంశం తేలకపోగా... కొత్తగా సీఎస్ నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు సైతం రాకపోవడంతో సస్పెన్స్ నెలకొంది. మనస్సు మార్చుకున్న సర్కారు? సీఎం కేసీఆర్ విజ్ఞప్తి మేరకు గత సీఎస్ రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని కేంద్రం 6 నెలలు పెంచింది. అప్పట్లో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీని కలిసి విజ్ఞప్తి చేయడంతో.. రాజీవ్‌శర్మ పదవీకాలాన్ని పొడిగించారు. తాజాగా ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగింపు కోసం కూడా విజ్ఞప్తి చేసినా... రాష్ట్ర ప్రభుత్వం చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇటీవల పదవీ విరమణ చేసిన ఓ ఉన్నతాధికారితో పాటు కొన్ని సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగింపు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం. కొత్త సీఎస్‌గా ఎంజీ గోపాల్? ప్రదీప్ చంద్ర పదవీకాలం పొడిగింపు లేనిపక్షంలో కొత్త సీఎస్ నియామకం అనివార్యం కానుంది. శనివారం రాత్రి, లేదా ఆదివారం ఉదయమే కొత్త సీఎస్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. సీనియారిటీ ప్రకారం కొత్త సీఎస్ రేసులో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎంజీ గోపాల్, ఎస్పీ సింగ్, రాజీవ్ రంజన్ ఆచార్యల పేర్లు వినిపిస్తున్నాయి. వివిధ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఎంజీ గోపాల్‌ను సీఎస్‌గా నియమించవచ్చని చర్చ జరుగుతోంది. -
శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలి
సీఎస్ ప్రదీప్ చంద్రకు టీఎన్జీవో నేతల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో కేడర్ స్ట్రెన్‌తను నిర్ణయించాలని, ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసి, శాశ్వత ప్రాతిపదికన ఉద్యోగులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు టీఎన్జీవో నేతలు విజ్ఞప్తి చేశారు. సోమవారం సచివాలయంలో టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీ ప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి కొత్తగా నియమితులైన సీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కొత్త జిల్లాల ప్రధాన కేం ద్రంలో పనిచేసే వారికి 20 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వాలని కోరారు. పీఆర్సీ అమలుకు ముందు 9 నెలల గ్యాప్ పీరియడ్‌లో రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ ఇవ్వలేదని, వెంటనే వారికి గ్రాట్యుటీ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎస్‌ను కోరారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు చర్యలు చేపట్టాలని, పీఆర్సీ బకాయిలు చెల్లించాలని, హెల్త్‌కార్డుల అమలుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. వీటిని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని సీఎస్ హామీ ఇచ్చారు. -
ప్రజలను ‘క్యాష్‌లెస్’ వైపు మళ్లించాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సలో సీఎస్ ప్రదీప్ చంద్ర ఆదేశం - ఇందుకోసం డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు చేపట్టాలి - నగదు రహిత లావాదేవీలపై ప్రజలు,వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలి - జన్‌ధన్ ఖాతాదారులందరికీ రూపే కార్డులు ఇవ్వాలి - బ్యాంకు ఖాతాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించాలి - ‘ఆసరా’ చెల్లింపులన్నీ బ్యాంకులు,పోస్టాఫీసుల ద్వారానే జరిగేలా పర్యవేక్షించాలి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలందరినీ క్యాష్‌లెస్ చెల్లింపుల వైపు మళ్లించాలని, ఇందుకు డిజిటల్ లిటరసీ క్యాంపెరుున్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర కలెక్టర్లను ఆదేశిం చారు. నోట్ల రద్దు అంశంపై శనివా రం ఆర్థిక, ఐటీ అధికారులతో కలసి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్రం నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురయ్యే పరిస్థితు లను ఎదుర్కోవడానికి వ్యూహం రూపొందిం చాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలు, వ్యాపా రస్తులను డిజిటల్ లావా దేవీల వైపు మళ్లిం చాలన్నారు. డిజిటల్ లిట రసీ ప్రజల్లోకి వెళ్లేలా పెద్ద ఎత్తున కార్యక్ర మాలు నిర్వహించాలని, జన్‌ధన్ ఖాతాలు ఉన్న వారందరికీ రూపే కార్డులు అందించ డంతోపాటు వాటిని వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్డులు ఉండి వినియోగించని వాటిని వాడుకలోకి తీసుకురా వాలన్నారు. ప్రతి బ్యాంకు ఖాతా నూ ఆధార్‌తో అనుసంధానించాలని సూచిం చారు. రాష్ట్రంలో 4.2 లక్షల మందికి ఆసరా పింఛన్లు నగదు రూపంలో పంపిణీ అవుతు న్నాయని, వాటిని బ్యాంకులు, పోస్టాఫీస్‌ల ద్వారా అందేలా చూడాలన్నా రు. ఈ నెలలో పోస్టాఫీసుల ద్వారా ఆసరా పింఛన్ల పంపి ణీని ప్రత్యక్షంగా పర్యవేక్షించా లని సీఎస్ సూచించారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు సమర్థంగా పనిచేస్తున్నందుకు సీఎస్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. 7, 8 తేదీల్లో అవగాహన కార్యక్రమాలు: జయేశ్ రంజన్ ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారస్తులు, ప్రజ ల్లో ఉన్న సందేహాలను తీర్చేందుకు ఈ నెల 7, 8 తేదీలలో జిల్లా కేంద్రాలలో అవగా హన కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు. ఐటీ శాఖ, మీ-సేవ (మం డల కేంద్రాల్లో), వలంటీర్ల ద్వారా (గ్రామ పంచాయతీల్లో) ప్రజలకు శిక్షణ ఇస్తామని, మన టీవీ ద్వారా శిక్షణ కార్యక్ర మాలను ప్రసారం చేస్తామన్నారు. రాష్ట్రంలో 81.71 లక్షల జన్‌ధన్ ఖాతాలున్నాయని, 70 లక్షల దాకా రూపే కార్డులు ఇచ్చారని, 12 లక్షల మందికి కార్డులు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సూచిం చారు. సమావేశంలో ఎంఏయూడీ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ కార్య దర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు. నగదు రహితానికి అందరూ అలవాటుపడాలి: సీఎస్ సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తీసుకున్న రూ. 500, రూ. వెరుు్య నోట్ల రద్దు నిర్ణయం శాశ్వత ప్రభావం చూపనుందని సీఎస్ కె.ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలకు అలవాటుపడక తప్పదని అభిప్రా యపడ్డారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు, బ్యాంకింగ్ యాప్‌లతో ఆర్థిక లావా దేవీలు జరపడాన్ని అందరూ నేర్చుకోవాలని సూచించారు. నగదు రహిత లావా దేవీలపై శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ సచివాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన శిబి రంలో ప్రదీప్ చంద్ర సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. నగదు రహితంతో లావాదేవీలన్నీ లెక్కల్లోకి వస్తాయని, దీంతో పన్నుల వసూళ్లు సైతం సులువవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వండి
తెలంగాణ జేఏసీ సాక్షి, హైదరాబాద్: జీవో నంబర్ 239ను రద్దుచేసి జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ సీఎస్ ప్రదీప్ చంద్రను కలసి వినతి సమర్పించారు. 14 ఏళ్ల సుదీర్ఘ తెలంగాణ ఉద్యమానికి శ్వాసగా నిలిచి ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ జీవితంలో మార్పు వస్తుందని ఆశపడ్డ జర్నలిస్టులకు ప్రభుత్వం కనీస గుర్తింపు లేకుండా చూస్తుందని విమర్శించారు. జీవో నంబర్ 239ను రద్దుచేసి వెంటనే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్న డిమాండ్‌తో ఈనెల 5న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్ : కేసీఆర్
-
నాన్నే నాకు ఆదర్శం
⇒ కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర ⇒ సబ్బులమ్ముకొని బతుకుతవా.. పది మందికి సేవ చేస్తావా అన్నారు ⇒ అప్పుడే రూట్ మార్చుకున్నా.. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యా ⇒ ప్రజా సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా సాక్షి, హైదరాబాద్: ‘‘సబ్బులమ్ముకొని బతుకుతవా.. పది మందికి సేవ చేస్తావా..! నువ్వే ఆలోచించుకో.. ప్రజలకు సాయం చేయటంలో ఉన్నంత సంతృప్తి ఎందులో లేదు. ఉన్నత చదువు చదివితే సరిపోదు. అది ప్రజలకు ఉపయోగపడాలి.. అని మా నాన్న చంద్రయ్య అన్న మాటలే ఇప్పటికీ నాకు స్ఫూర్తి. అప్పుడు నేను ముంబైలో హిందుస్తాన్ లీవర్ లిమిటెడ్ కంపెనీలో పని చేస్తున్నా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తయ్యాక ఆ ఉద్యోగంలో చేరాను. నాన్నకు అది నచ్చలేదు. అంతకంటే ప్రజలకు సేవ చేసే ఉద్యోగం చేయాలని వెన్నుతట్టాడు. అప్పుడే రూట్ మార్చుకున్నాను. సివిల్ సర్వీసెస్ వైపు వెళ్లాను. పట్టుదలతో చదివి ఐఏఎస్ అయ్యాను’’ అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన ప్రదీప్ చంద్ర చెప్పారు. ‘‘గతంలో మా నాన్న చంద్రయ్య ఒంగోలు జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. చిన్నతనంలో తన వెంట తీసుకెళ్లేవాడు. మార్కాపురం చుట్టు పక్కల ఉన్న మారుమూల గ్రామీణ ప్రాంతాలు అప్పుడే పరిచయం. గ్రామీణ ప్రజల కష్టనష్టాలు ప్రత్యక్షంగా చూశాను’’అని ఆయన తన మనోగతాన్ని గుర్తు చేసుకున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ప్రదీప్ చంద్ర మీడియాతో మాట్లాడారు. నాన్న స్ఫూర్తితోనే ఈ స్థాయికి ఎదిగానని, ప్రభుత్వ ప్రతినిధిగా ప్రజా సంక్షేమం లక్ష్యంగా చిత్తశుద్ధితో పని చేస్తానని చెప్పారు. ‘‘ముఖ్యమంత్రి ఆకాంక్ష మేరకు పని చేస్తా. ఆయన ఆశయాలు సాధించటమే బాధ్యత గల అధికారులుగా మా అందరి ముందున్న లక్ష్యం. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా తెలంగాణలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ప్రజలకు పరిపాలనా ఫలాలు అందించే లక్ష్యానికి చేరువయ్యాం. జిల్లాల పరిధి తగ్గినందున జనాభా తగ్గింది. సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత ఆస్కారం ఏర్పడింది. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ఇంటింటికీ చేరేలా కార్యాచరణ చేసుకుంటాం’’అని వివరించారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తాం రాష్ట్ర పునర్విభజన చట్టానికి సంబంధించి అపరిష్కృత సమస్యలు ఇంకా ఉన్నాయని ప్రదీప్ చంద్ర చెప్పారు. తొమ్మిది, పదో షెడ్యూలు సంస్థల విభజన, ఉద్యోగుల విభజన ఇప్పటికీ సంపూర్ణం కాలేదని, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కొరత ఇప్పటికీ ఉందని పేర్కొన్నారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటామన్నారు. ‘‘పెద్ద నోట్ల రద్దుతో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధానానికి ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. అది అనుకున్నంత ఆషామాషీ వ్యవహారం కాదు. జటిలమైన సమస్య. ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సిఫారసులకు అనుగుణంగా ప్రణాళిక చేసుకుంటాం. చిన్న నోట్లు అందుబాటులో లేకపోవటంతో పట్టణాల్లో కంటే పల్లెల్లో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉన్నఫళంగా క్యాష్‌లెస్ విధానం అక్కడ అమల్లోకి తీసుకురావటం కూడా కష్టమే. అక్కడ నగదు నోట్లు ఎక్కువగా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. ఇప్పటికే బ్యాంకర్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటా నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహిస్తాం. మార్కెట్ కమిటీలు, విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లలో ఈ వాలెట్ పద్ధతి ప్రవేశపెడతాం’’ అని సీఎస్ చెప్పారు. -
కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర
రాజీవ్‌శర్మ నుంచి బాధ్యతల స్వీకరణ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీఎస్ ఐపాస్ రూపకల్పనలో కీలక పాత్ర ఇప్పటిదాకా 22 రకాల పోస్టుల్లో విధులు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధి కారి. రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి కావటం, వివిధ శాఖల్లో పని చేసిన అనుభవమున్న అధికారి కావటంతో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు సీఎస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకు న్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ రూపకల్పనలో ప్రదీప్ చంద్ర కీలకపాత్ర పోషించారు. మరో నెలరోజులు మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీవ్ శర్మ తర్వాత సీనియర్ కావడంతో ప్రదీప్చం ద్రకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణరుుం చారు. బుధవారం సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ విరమణ చేసిన వెంటనే ప్రదీప్ చంద్ర కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. సచివా లయం సమత బ్లాక్‌లోని సీఎస్ చాంబర్లో సాయంత్రం 6.20 గంటలకు బాధ్యతలు స్వీక రించారు. రిటైరవుతున్న సీఎస్ రాజీవ్‌శర్మ తన పదవీ బాధ్యతలను కొత్త సీఎస్‌కు అప్పగించారు. ప్రదీప్‌చంద్రకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలుగువాడు.. ప్రదీప్ చంద్ర గుంటూరు జిల్లాకు చెందినవారు. 1956 డిసెంబర్ 15న జన్మించారు. మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో పీజీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ పట్టా పొందారు. గతంలో గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. సబ్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించిన ఆయన.. 22 రకాల పోస్టుల్లో విధులు నిర్వహించారు. -
రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్
రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు నిబద్ధతతో పనిచేశారు: సీఎం కేసీఆర్ అధికారులను ధైర్యంగా ముందుకు నడిపించారు ఆయన కృషి వల్లే ఒక్కరోజులోనే ‘సమగ్ర సర్వే’ చేయగలిగాం సచివాలయంలో రాజీవ్‌శర్మకు ఘనంగా వీడ్కోలు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియామకం సీఎంకు రుణపడి ఉంటా: రాజీవ్‌శర్మ సాక్షి, హైదరాబాద్: కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రాజీవ్‌శర్మ నిబద్ధతతో పనిచేశారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొనియాడారు. రాష్ట్ర విభజన సమయంలో తలెత్తిన విపత్కర పరిస్థి తుల్లోనూ రాజీవ్ శర్మ ధైర్యంగా పనిచేశారని ప్రశంసించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఓపికగా తన బాధ్యతలు నిర్వహించారని, ప్రభుత్వ కార్యక్రమాలన్నిం టా అధికారులను అదే తీరుగా ముందుకు నడిపించారని అన్నారు. గడిచిన రెండున్నరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు పది పన్నెండు అవార్డులు అందుకుందన్నారు. రాజీవ్‌శర్మ వీడ్కోలు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సచివాలయంలో ఘనంగా నిర్వహించింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో పూర్తి చేయ గలిగామంటే అది రాజీవ్‌శర్మ కృషి ఫలితమేన న్నారు. ఇటీవల హరియాణాలో అదే తరహా సర్వే చేయించేందుకు అక్కడి ముఖ్యమంత్రి తెలంగాణకు వెళ్లి అధ్యయనం చేసి రావాలంటూ అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపించారని గుర్తు చేశారు. కొత్త రాష్ట్రమై నప్పటికీ మన అనుభవాలను ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని, రాజీవ్శర్మలాంటి అధికారులు ఉండటం వల్లే ఈ ఘనత సాధ్యమైందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించటంలో ఆయన పాత్ర మరవలేనిదని గుర్తు చేశారు. కొత్త కలెక్టర్లు, ఎస్పీలు, 16,500 మంది ఉద్యోగుల నియామకాలన్నీ ఒడిదుడు కులు లేకుండా సాఫీగా పూర్తి చేయగలిగారని అభినందించారు. విభజన చట్టంలో ప్రతి పేజీ, ప్రతి అంశంపై రాజీవ్‌శర్మకు పట్టు ఉందని, అందుకే ఏపీ నుంచి, కేంద్రం నుంచి ఎదురైన సవాళ్లను సునాయాసంగా అధిగమించారని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా.. తెలంగాణ ప్రథమ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అందించిన సేవలను ప్రభుత్వం చిరకాలం గుర్తుంచుకుంటుందని సీఎం అన్నా రు. పదవీ విరమణ చేసినప్పటికీ ఆయన సేవ లను విస్తృతంగా వినియోగిం చుకుంటామని చెప్పారు. అందుకే ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు ఆయనను చీఫ్ సెక్రటరీగానే భావించి సమీక్షలకు హాజరు కావాలని సూచించారు. ఛత్తీస్‌గఢ్ ఏర్పడి నపుడు తొలి సీఎస్‌గా పని చేసిన శివరాజ్‌సింగ్ సేవలను పదవీ విరమణ తర్వాత కూడా అక్కడి ప్రభు త్వం వినియోగిం చుకుంటోందన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేబినెట్ హోదా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమించారని, పద మూడేళ్ల తర్వాత కూడా శివరాజ్‌సింగ్ అదే హోదాలో ఉన్నారని గుర్తు చేశారు. ఓపెనర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన రాజీవ్ శర్మ సెంచరీ చేశారన్న కొత్త సీఎస్ ప్రదీప్ చంద్ర మాటలతో సీఎం ఏకీభవించారు. ఓపెనింగ్ బ్యాట్స్ మెనే కాదని.. రాజీవ్‌శర్మ ఆల్‌రౌండర్ అని కితాబిచ్చారు. అధికారిగా ఉండే పరిమితులు ఇప్పుడు లేకపోవటంతో ఆయన సేవలు రాజకీయంగానూ వాడుకునే అవకాశముందని అన్నారు. మరింత ఉత్సాహంతో పని చేయాలని కోరారు. ప్రదీప్‌చంద్ర సమర్థుడు: సీఎం కొత్త సీఎస్‌గా నియమితులైన ప్రదీప్ చంద్ర నైపుణ్యమున్న అధికారి అని, ఎంతో ఓపికతో పని చేసే గుణముందని సీఎం ప్రశంసించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్) రూపకల్పన సమయంలో ఆయనతో ఇరవై ముప్పై సార్లు చర్చోపచర్చలు చేశామన్నారు. చెప్పిన మార్పుచేర్పులన్నీ సమకూర్చి ప్రపంచ దృష్టినీ ఆకర్షించే విధానాన్ని తయారు చేసిన ఘనత ఆయనకు దక్కుతుందని అన్నారు. ఈ సందర్భంగా పూలమాలలు, శాలువాతో రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్ సత్కరించి జ్ఞాపికను అందజేశారు. జీవితంలో దక్కిన గొప్ప గౌరవం: రాజీవ్‌శర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ఎంతగానో రుణపడి ఉంటానని రాజీవ్ శర్మ అన్నారు. ఈ అవకాశం జీవితంలో తనకు దక్కిన గొప్ప గౌరవ మని పేర్కొన్నారు. తెలంగాణకు తన సేవలు కొనసాగిస్తానని, కొత్తగా అప్పగిం చిన బాధ్యతలు మరింత చక్కగా నిర్వహి స్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో నూతన సీఎస్ ప్రదీప్ చంద్ర, మంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, కేటీఆర్, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, చందూలాల్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పలు వురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజీవ్‌శర్మను సీఎం, మంత్రు లు, అధికారులు ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. వివిధ ఉద్యోగ సంఘాలు, అధికారులు కూడా ఆయనను ఘనంగా సన్మానించి ఆత్మీ యంగా వీడ్కోలు పలికారు. -
సీఎస్ గా ప్రదీప్ చంద్ర: ఐఏఎస్ ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కర్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ప్రదీప్ చంద్ర బాధ్యతలు స్వీకరించిన కొద్ది సేపటికే రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. కీలకమైన భూపరిపాలన కమిషర్(సీసీఎల్ఏ) అదనపు బాధ్యతలను సీఎస్ ప్రదీప్ చంద్రే నిర్వహించనున్నారు. ఇంతకు ముందు కూడా ఆయనే సీసీఎల్ఏ(అదనపు బాధ్యత)గా కొనసాగిన సంగతి తెలిసిందే. సీఎస్ గా పదవీ విరమణ పొందిన రాజీవ్ శర్మను సీఎం కేసీఆర్, సచివాలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఆయా శాఖల వారీగా ఐఏఎస్ అధికారుల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి.. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎంజీ గోపాల్ విద్యుత్ శాఖ కార్యదర్శిగా అజయ్ మిశ్రా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా అశోక్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా రమేశ్ దత్ ఎక్కా రెవెన్యూ(ఎక్సైజ్) ముఖ్య కార్యదర్శిగా సోమేశ్ కుమార్ మత్య్స శాఖ ముఖ్య కార్యదర్శిగా బి. వెంకటేశ్వరరావు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నవీన్ మిట్టల్(అదనంగా ఐ అండ్ పీఆర్ బాధ్యతలు) హౌసింగ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా చిత్రా రామచంద్రన్ రవాణా శాఖ కమిషనర్ గా సునీల్ శర్మ (అదనపు బాధ్యతలు) యువజన వ్యవహారాల కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా నియమితులయ్యారు.