ప్రజలను ‘క్యాష్‌లెస్’ వైపు మళ్లించాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌సలో సీఎస్ ప్రదీప్ చంద్ర ఆదేశం
- ఇందుకోసం డిజిటల్ లిటరసీ కార్యక్రమాలు చేపట్టాలి
- నగదు రహిత లావాదేవీలపై ప్రజలు,వ్యాపారస్తులకు అవగాహన కల్పించాలి
- జన్‌ధన్ ఖాతాదారులందరికీ రూపే కార్డులు ఇవ్వాలి
- బ్యాంకు ఖాతాలన్నింటినీ ఆధార్‌తో అనుసంధానించాలి
- ‘ఆసరా’ చెల్లింపులన్నీ బ్యాంకులు,పోస్టాఫీసుల ద్వారానే జరిగేలా పర్యవేక్షించాలి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత ఏర్పడిన కరెన్సీ కొరతను అధిగమించేందుకు ప్రజలందరినీ క్యాష్‌లెస్ చెల్లింపుల వైపు మళ్లించాలని, ఇందుకు డిజిటల్ లిటరసీ క్యాంపెరుున్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ప్రదీప్ చంద్ర కలెక్టర్లను ఆదేశిం చారు. నోట్ల రద్దు అంశంపై శనివా రం ఆర్థిక, ఐటీ అధికారులతో కలసి కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ కేంద్రం నోట్ల రద్దు నేపథ్యంలో ఎదురయ్యే పరిస్థితు లను ఎదుర్కోవడానికి వ్యూహం రూపొందిం చాలన్నారు.
అన్ని శాఖలు సమన్వయంతో ప్రజలు, వ్యాపా రస్తులను డిజిటల్ లావా దేవీల వైపు మళ్లిం చాలన్నారు. డిజిటల్ లిట రసీ ప్రజల్లోకి వెళ్లేలా పెద్ద ఎత్తున కార్యక్ర మాలు నిర్వహించాలని, జన్‌ధన్ ఖాతాలు ఉన్న వారందరికీ రూపే కార్డులు అందించ డంతోపాటు వాటిని వినియోగించేలా అవగాహన కల్పించాలన్నారు. కార్డులు ఉండి వినియోగించని వాటిని వాడుకలోకి తీసుకురా వాలన్నారు. ప్రతి బ్యాంకు ఖాతా నూ ఆధార్‌తో అనుసంధానించాలని సూచిం చారు. రాష్ట్రంలో 4.2 లక్షల మందికి ఆసరా పింఛన్లు నగదు రూపంలో పంపిణీ అవుతు న్నాయని, వాటిని బ్యాంకులు, పోస్టాఫీస్‌ల ద్వారా అందేలా చూడాలన్నా రు. ఈ నెలలో పోస్టాఫీసుల ద్వారా ఆసరా పింఛన్ల పంపి ణీని ప్రత్యక్షంగా పర్యవేక్షించా లని సీఎస్ సూచించారు. కొత్త జిల్లాల్లో కలెక్టర్లు సమర్థంగా పనిచేస్తున్నందుకు సీఎస్ వారిని ప్రత్యేకంగా అభినందించారు.
7, 8 తేదీల్లో అవగాహన కార్యక్రమాలు: జయేశ్ రంజన్
ఎలక్ట్రానిక్ పేమెంట్లపై వ్యాపారస్తులు, ప్రజ ల్లో ఉన్న సందేహాలను తీర్చేందుకు ఈ నెల 7, 8 తేదీలలో జిల్లా కేంద్రాలలో అవగా హన కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ కోరారు. ఐటీ శాఖ, మీ-సేవ (మం డల కేంద్రాల్లో), వలంటీర్ల ద్వారా (గ్రామ పంచాయతీల్లో) ప్రజలకు శిక్షణ ఇస్తామని, మన టీవీ ద్వారా శిక్షణ కార్యక్ర మాలను ప్రసారం చేస్తామన్నారు. రాష్ట్రంలో 81.71 లక్షల జన్‌ధన్ ఖాతాలున్నాయని, 70 లక్షల దాకా రూపే కార్డులు ఇచ్చారని, 12 లక్షల మందికి కార్డులు ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సూచిం చారు. సమావేశంలో ఎంఏయూడీ కార్యదర్శి నవీన్ మిట్టల్, ఆర్థిక శాఖ కార్య దర్శి సందీప్ కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.
నగదు రహితానికి అందరూ అలవాటుపడాలి: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ తీసుకున్న రూ. 500, రూ. వెరుు్య నోట్ల రద్దు నిర్ణయం శాశ్వత ప్రభావం చూపనుందని సీఎస్ కె.ప్రదీప్ చంద్ర పేర్కొన్నారు. రద్దు చేసిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు 25 నుంచి 30 శాతం వరకు మాత్రమే వచ్చే అవకాశముందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ నగదురహిత లావాదేవీలకు అలవాటుపడక తప్పదని అభిప్రా యపడ్డారు. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డులు, బ్యాంకింగ్ యాప్‌లతో ఆర్థిక లావా దేవీలు జరపడాన్ని అందరూ నేర్చుకోవాలని సూచించారు. నగదు రహిత లావా దేవీలపై శనివారం రాష్ట్ర ఆర్థిక శాఖ సచివాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన శిబి రంలో ప్రదీప్ చంద్ర సచివాలయ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. నగదు రహితంతో లావాదేవీలన్నీ లెక్కల్లోకి వస్తాయని, దీంతో పన్నుల వసూళ్లు సైతం సులువవుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.