రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా ఎవరిని నియమి స్తారనే ఉత్కంఠ కొనసాగుతోంది. తెలంగాణ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ బుధవారం పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఇంత కీలకమైన బాధ్యతలను సీఎం ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తి రేపుతోంది. సీనియారిటీ ప్రకారం రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర రేసులో ముందున్నారు. అరుుతే మంగళవారం రాత్రి వరకు కూడా సీఎస్ నియామకానికి సంబంధించిన ఫైలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిశీలనలోనే ఉంది. దీంతో కొత్త సీఎస్ నియామక ఉత్తర్వులు బుధవారం వెలువడే అవకాశముంది.